Tuesday 31 January 2023

"భయం!" (మనోహర్ చిమ్మని మైక్రో కథలు - 1)


"ఈ లోకంలో - ఎవరి ప్రపంచం వారిది. ఎవరి ఆలోచనలు వారివి. ఎవరి ఐడియాలజీ వారిది. ఎవరి లాబీ వారిది. ఎవరి తుత్తి వారిది." 

"ఆగాగు... ఇంక లిస్ట్ పెంచకు. కాంటెక్స్‌ట్ పూర్తిగా అర్థమైంది. ఎవడి లొల్లి వానిది, అంతేగా!... ఇంక సమస్యేముంది?" 

"ఎవడి డప్పు వాడు కొట్టుకుంటే ప్రాబ్లం లేదు. నువ్వు కూడా ఇలాగే డప్పు కొట్టాలి... అన్నప్పుడే సమస్య!" 

"ఇదేదో ఆలోచించాల్సిందే.." 

ఇరానీ చాయ్ హోటళ్ళు పూర్తిగా మాయమైపోయిన ఈ డిజిటల్ యుగంలో - ఎక్కడో బోయిన్‌పల్లి సందుల్లో అనుకోకుండా కనిపించిన ఓ చిన్న ఇరానీ హోటల్లో వాళ్లకెంతో ఇష్టమైన ఇరానీ చాయ్ తాగుతూ మాట్లాడుకుంటున్నారు ఇద్దరు మిత్రులు...

ఇంకో రెండు సిప్పుల తర్వాత -  

"నువ్వేమన్నా అను... ఈ మేధావుల్తో కష్టమన్నా."
 
"అందుకే నేనా కేటగిరీకి చాలా దూరం అన్నా."   

"వీళ్ళు మెచ్చుకున్న నవలనే మనం మెచ్చుకోవాలి, వీళ్ళు ఆహా ఓహో అన్న పోయిట్రీనే మన కూడా ఆహా ఓహో అనాలి. వీళ్ళు డబ్బా కొట్టిన కవికే మనం డబ్బా కొట్టాలి. ఆఖరికి వీళ్ళు పైకెత్తిన కవయిత్రినే మనం పైకెత్తాలి."  

"ఎత్తకపోతే?!"

"నిన్ను ఎత్తిపడేస్తారు!"

"అట్లెట్లా అన్నా... ఏదైనా ఒకటి మనకు నచ్చటం నచ్చకపోవటం అనేది సబ్జెక్టివ్ కదన్నా? ఇష్టమైనోళ్ళు కనెక్టవుతారు, ఇష్టం లేనోళ్లు కారు. ఎవ్వరినయినా ఏ విషయంలోనైనా ఎలా ఫోర్స్ చెయ్యగలం?"  

"నో... అలా కుదరదు! వాళ్లకు నచ్చింది మనకూ నచ్చితీరాలి. ఒకవేళ నచ్చకపోయినా, వాళ్ల గ్రూపులో గోవిందా అయిపోయి, వాళ్ళలా ఆహా ఓహో అనాలి."  

ఇద్దరూ మౌనంగా చెరొక సిప్పు తాగారు. 

"నువ్వు చెప్పింది కరెక్టేనే అన్నా... వాళ్ళ ఫేస్‌బుక్ పోస్టుకు లైక్ కొట్టకపోయినా ఇన్‌బాక్స్‌కొచ్చి సంపుతారు!"  

ఆ అనుభవం ఏదో ఇద్దరికీ బాగానే ఉన్నట్టుగా ఒక్కసారిగా ఇద్దరూ జెర్కీగా తలెత్తి, ఒకరి కళ్ళల్లోకి మరొకరు చూసుకున్నారు.  

సైలెంట్‌గా ఇంకో సిప్పు తాగారు.   

"అందుకే నేను పక్కా మాస్... ఆవైపు వెళ్లనసలు."

"నేను ఊర మాస్... వాళ్ళెవరైనా కనిపిస్తే స్టాప్ బ్లాక్‌లో మాయమైపోతా!" 

సడెన్‌గా ఇలా మంచి ఊపులోకొచ్చి మాట్లాడుకుంటున్న ఆ ఇద్దరు మిత్రులు... ఉన్నట్టుండి అంతకంటే సడెన్‌గా విఠలాచార్య సినిమాలో "స్టాప్-బ్లాక్" ఎఫెక్ట్‌లో లాగా టింగ్‌మని అక్కడినుంచి మాయమైపోయారు. 

కట్ చేస్తే -

రెండు సెకన్ల తర్వాత - మొన్ననే బుక్ ఫెయిర్‌లో వారికి పరిచయమైన ప్రముఖ కవి ఒకరు సీరియస్‌గా సిగరెట్ పొగవదుల్తూ అదే హోటల్లోకి ఎంటరయ్యాడు.     

Sunday 29 January 2023

"కోపరేటివ్ ఫిలిం మేకింగ్" అంటే?


సోషల్ మీడియా లేని కాలంలోనే, 2006లో, నా రెండో సినిమా "అలా" ఈ పధ్ధతిలోనే తీశాను.  

1992 లోనే, హాలీవుడ్‌లో రాబర్ట్ రోడ్రిగజ్ ఇదే పధ్ధతిలో "ఎల్ మరియాచి" తీశాడు.  2011లో ఆర్జీవీ "దొంగల ముఠా" తీశాడు.  

కోపరేటివ్ ఫిలిం మేకింగ్ పధ్ధతిలో -  పాతవాళ్లయినా, కొత్తవాళ్లయినా... ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు ఒక్క రూపాయి రెమ్యూనరేషన్ కూడా ముందు ఇవ్వటం అనేది ఉండదు. సినిమా పూర్తయ్యి, రిలీజయ్యి, లాభాలు వచ్చాకే ఆ లెక్కలు! దీనికి ఒప్పుకున్నవాళ్లే సినిమాలో పనిచేస్తారు!!

సినిమాలో పనిచేసే ప్రతి ఒక్కరి ఇన్వెస్ట్‌మెంట్ కంట్రిబ్యూషన్ ఏదో ఒక రూపంలో ఎంతో కొంత ఉంటుంది. ఎందుకంటే - దీనికి ప్రొడ్యూసర్ ఉండడు.   

సినిమా బడ్జెట్ కోటి కావచ్చు, రెండు కోట్లు కావొచ్చు.  మేం పూల్ చేసుకున్న ఆ కొద్ది బడ్జెట్‌ను మేకింగ్‌కు, ప్రమోషన్‌కు మాత్రమే వాడతామన్నమాట!

నో కాల్ షీట్స్. నో టైమింగ్స్. అంతా రెనగేడ్ ఫిల్మ్ మేకింగ్. గెరిల్లా ఫిల్మ్ మేకింగ్. 

చాలా మంచి కాన్‌సెప్ట్ ఇది. 

ముఖ్యంగా చిన్న బడ్జెట్ సినిమాలకు సంబంధించి మాత్రం ఇదే చాలా చాలా కరెక్టు. 

హాలీవుడ్ నుంచి, టాలీవుడ్ దాకా... ఈ పద్ధతిలో తీసిన ఎన్నో సినిమాలు అద్భుత విజయం సాధించాయి. 

హిట్ కాకపోయినా - ఈ సినిమాలు మంచి బజ్ క్రియేట్ చేస్తాయి, మంచి బిజినెస్ చేస్తాయి... ప్రొవైడెడ్, సరైన స్ట్రాటజీతో చేస్తే. 

సో, టెక్నికల్‌గా అది కూడా విజయమే.

ఇప్పుడు నేను చేస్తున్న రెండు ఫీచర్ ఫిలిమ్స్ ఈ పద్ధతిలో చేస్తున్నవే. ఈ రెండు సినిమాల ప్రిప్రొడక్షన్ వర్క్ కూడా  ఏక కాలంలో జరుగుతోంది. 

వీటిలో మొదటిది... 

"Yo!" 

పది ప్రేమ కథలు.   

ఫిబ్రవరిలో పాటల రికార్డింగ్‌తో "Yo!" ఓపెనింగ్ ఉంటుంది.   

కొన్ని సపోర్టింగ్ రోల్స్‌లో కొందరు సీనియర్లు, సీజన్డ్ ఆర్టిస్టులు తప్ప - దాదాపు అంతా కొత్త ఆర్టిస్టులే ఉంటారు. కాస్టింగ్ దాదాపు అయిపోవచ్చింది.   

కట్ చేస్తే - 

హీరోల కోసం చివరి స్పెల్ ఆడిషన్ ఒక్కటి జరగాల్సి ఉంది. దాని కోసమే నిన్నొక యాడ్ రిలీజ్ చేశాము. 

పైన మీరు చూస్తున్నది అదే. 

అర్హులైన కొత్త హీరోలు యాడ్‌లో చెప్పిన విధంగా అప్లై చేసుకోవచ్చు. 

అప్లికేషన్‌ను ఈమెయిల్ చెయ్యండి. లేదా, నా ఇన్‌స్టాగ్రామ్‌కు డైరెక్ట్ మెసేజ్ పంపండి. 

వాట్సాప్‌లు పంపేవాళ్ళు, కాల్స్ చేసేవాళ్ళు ఆటొమాటిక్‌గా అనర్హులవుతారు. 

ఎప్పటికప్పుడు ఆడిషన్‌కు పిలుస్తుంటాము. మీకు మా నుంచి కాల్ రాలేదంటే మా స్క్రిప్టులో మీరు సరిపోరని అర్థం. అంతే కాని, మీకు టాలెంట్ లేదని ఎట్టి పరిస్థితుల్లో మీరు అనుకోవద్దు. 

ఈ విషయంలో ఎలాంటి కమ్యూనికేషన్ ఉండదు. 

ఆడిషన్‌కు సెలక్టయినవాళ్లతో మా టీమ్ టచ్‌లో ఉంటుంది.

బెస్ట్ విషెస్... 

- మనోహర్ చిమ్మని 
Email: mchimmani@gmail.com
Insta: @manohar_chimmani 

PS:
కోపరేటివ్ ఫిలిం మేకింగ్ పట్ల ఆసక్తి ఉండి, ఈ జర్నీలో నాతో కలిసి ప్రయాణం చెయ్యాలనుకొనేవారు 'మీరెలా ఈ ప్రాజెక్టుకు సపోర్ట్ అవుతారు', 'ప్రిసైజ్‌గా మీ ఇన్వెస్ట్‌మెంట్ ప్రపోజల్ ఏంటి' తెలుపుతూ, మీ ప్రపోజల్స్‌తో నన్ను కలవ్వొచ్చు. మీ ప్రపోజల్ ఏదైనా సరే, నా ఇన్‌స్టాలో DM చెయ్యండి. కలిసి మాట్లాడుకుందాం.    

Friday 27 January 2023

"గేటెడ్ కమ్యూనిటీ ఫామ్‌లాండ్స్" అంటే ఎందుకంత క్రేజ్?


పొల్యూషన్-ఫ్రీ వాతావరణం, కళ్ళ ఎదుటే పారుతున్న నది, చుట్టూ గ్రీనరీ... ఇవన్నీ ఒక్కచోటే దొరకటం అనేది అంత సులభం కాదు. 

నిజంగా అలాంటి ప్లేస్ ఒకటి మనం సొంతం చేసుకోడానికి అందుబాటులో ఉందంటే ఎలా ఉంటుంది?

అక్కడో చిన్న డిజైనర్ ఫామ్‌హౌజ్ వేసుకొని, చుట్టూ మనకిష్టమైన ఆకుకూరలు, కూరగాయలు, మనకిష్టమైన గ్రీనరీ పెంచుకొంటే ఇంకెలా ఉంటుంది?

సిటీకి దూరంగా, ప్రశాంతంగా, అలాంటి ఒక సహజసిధ్ధమైన వాతావరణంలో... మన కుటుంబంతో, మనకిష్టమైనవారితో... వారంలో కనీసం ఒకరోజు గడపగలిగితే ఇంకెంత బాగుంటుంది? 

ఇదేమంత సాధ్యం కాని గొప్పవిషయం కాదని ఈ పోస్టు చివరిదాకా చదివితే మీరూ ఒప్పుకుంటారు. 

కట్ చేస్తే -       

GREEN LEAVES INFRATECH LIMITED.

నా ఆత్మీయ మిత్రుడు పరమేశ్వర్ రెడ్డి గారి వెంచర్. 

ఈ కంపెనీ సిస్టర్ కన్సర్న్ స్వర్ణసుధ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలోనే నేను 'ఎండీ'గా పనిచేస్తున్నాను.   

గ్రీన్ లీవ్స్ ఇన్‌ఫ్రాటెక్ లిమిటెడ్ వెంచర్ సుమారు 120 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అదొక ట్రెండీ గేటెడ్ కమ్యూనిటీ ఫామ్‌ప్లాట్స్, ఫామ్‌లాండ్స్ వెంచర్.  

మనకు నచ్చిన డిజైన్‌లో ఓ చిన్న ఫామ్‌హౌజ్ వేసుకొని, మనకిష్టమైన వెజిటబుల్స్, గ్రీనరీ పెంచుకొంటూ, వీకెండ్స్ అక్కడ గడపగలిగితే చాలు...

లైఫ్ నిజంగా ఇంకో లెవెల్లో ఉంటుంది. 

డాక్టర్స్, లాయర్స్, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ వంటి ప్రొఫెషనల్స్; వివిధ రంగాల్లోని బిజినెస్ పీపుల్‌కు కూడా వారాంతంలో స్ట్రెస్-ఫ్రీగా, హాయిగా గడపడానికి ఈ గేటెడ్ కమ్యూనిటీ ఫామ్‌లాండ్స్ ఒక మంచి "పర్సనల్ హాలిడే స్పాట్" అవుతుంది.        

రచయితలు, కవులు, ఫిలిం ఆర్టిస్టులు, టీవీ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, యాంకర్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ వంటి క్రియేటివ్ పీపుల్ కూడా ఇలాంటి ఫామ్‌లాండ్‌ను "వీకెండ్ క్రియేటివ్ డెస్టినేషన్" చేసుకోవచ్చు.   

కట్ చేస్తే - 

ఇన్వెస్ట్‌మెంట్ పరంగా కూడా ఇలాంటి ఫామ్‌ప్లాట్స్, ఫామ్‌లాండ్స్ కొనుక్కోవడం అనేది ఒక బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్ అవుతుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 

NRI లకు కూడా ఇలాంటి గేటెడ్ కమ్యూనిటీ ఫామ్‌ప్లాట్స్, ఫామ్‌లాండ్స్ కొనుక్కోవడం అనేది ఒకవైపు మంచి ఇన్వెస్ట్‌మెంట్ అవుతుంది. మరోవైపు, సెంటిమెంటల్‌గా కూడా మాతృదేశంతో అనుబంధం కొనసాగిస్తున్న ఫీలింగ్ ఉంటుంది.  


ఇంత మంచి అవకాశం మనకు అందిస్తున్న గ్రీన్ లీవ్స్ ఇన్‌ఫ్రాటెక్ లిమిటెడ్ వెంచర్‌కు ఉన్న మరో ప్రత్యేక ఆకర్షణ - రివర్ వ్యూ! 

మంజీరా నది ఈ వెంచర్‌ను ఆనుకొనే ప్రవహిస్తోంది... కనుచూపుమేరలోనే సింగూర్ డ్యామ్...  

అసలా ఫ్రేమ్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి!  

సిటీకి కేవలం 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఫామ్‌లాండ్ ప్రాజెక్టు, ముంబై హైవేకు కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. 

కేవలం 15 నిమిషాల దూరంలో సంగారెడ్డి జిల్లా హెడ్‌క్వార్టర్స్, 30-45 నిమిషాల దూరంలో RRR (Regional Ring Road) & ORR (Outer Ring Road) ఉన్నాయి.  

13,000 ఎకరాల్లో సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేసిన NIMZ (National Investment & Manufacturing Zone) ప్రాజెక్టు, MRF, పెన్నార్, పెప్సికో, BHEL, KIRBY, తోషిబా, ఎక్స్‌పోర్ట్ కారిడార్, MNR మెడికల్ కాలేజి, IIT, Gitam, Woxsen యూనివర్సిటీలు... TCS, Wipro, ISB, Microsoft, Google వంటి గొప్ప గొప్ప సంస్థలన్నీ ఈ వెంచర్‌కు 45 నుంచి 55 నిమిషాల పరిధిలో ఉన్నాయి. 

ఈ నేపథ్యంలో... ఒక ఇన్వెస్ట్‌మెంట్ దృక్పథంతో చూసినా... కేవలం ఒక 2-3 ఏళ్లల్లోనే రెట్టింపు వాల్యూ తెప్పించే అవకాశం ఉందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆ రెస్పాన్సిబిలిటీ కూడా మేం తీసుకుంటాం. 


ఇన్ని ప్లస్ పాయింట్స్‌తో ఉన్న గ్రీన్ లీవ్స్ ఇన్‌ఫ్రాటెక్ లిమిటెడ్ వారి ఫస్ట్ వెంచర్ - చైర్మన్ రావూరి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో - ఇప్పటికే "సోల్డ్ అవుట్" అయిపోయింది. సెకండ్, థర్డ్ వెంచర్స్‌లో అమ్మకాలు ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో ఉన్నాయి. 

24 గంటల సెక్యూరిటీ, 3 సంవత్సరాల మెయింటెనెన్స్, మంచి నల్లరేగడి నేల, డ్రిప్ ఇర్రిగేషన్, 33 ఫీట్స్/40 ఫీట్స్/60 ఫీట్స్ ఇంటర్నల్ రోడ్స్‌తో ఉన్న ఈ గ్రీన్ లీవ్స్ ఇన్‌ఫ్రాటెక్ లిమిటెడ్ వెంచర్‌లో:

121 స్క్వేర్ యార్డ్స్ నుంచి 4850 స్క్వేర్ యార్డ్స్ (1 నుంచి 40 గుంటలు) యూనిట్స్‌లో... స్క్వేర్ యార్డ్‌కు Rs. 5,999/- కనీస ధరతో ఎన్ని యూనిట్స్ అయినా కొనుక్కొనే ఫ్లెక్సిబిలిటీ ఉంది. 

క్లియర్ టైటిల్... 

ఫండ్స్‌తో రెడీగా ఉన్న కస్టమర్స్‌కు వెంటనే రిజిస్ట్రేషన్ ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పట్టాదార్ పాస్‌బుక్ ఇప్పించబడుతుంది. ప్రభుత్వ నిబంధనలకు లోబడి, "రైతుబంధు" వంటి స్కీములకు ఎలిజిబిలిటీ కూడా ఉంటుంది. 

ప్రముఖ ఫిలిం, టీవీ ఆర్టిస్టులు, యాంకర్స్ ఇటీవలే ఈ వెంచర్‌లో ఫామ్‌లాండ్ తీసుకోడానికి విజిట్ చేశారు. అడ్వాన్స్ కూడా చెల్లించారు. వారి రిజిస్ట్రేషన్ కూడా త్వరలోనే ఉంది.  

ఇప్పుడిక మీ వంతు...

డైరెక్ట్‌గా నాకు కాల్ చేయండి. ఫ్రీ సైట్ విజిట్ నేను ఏర్పాటు చేస్తాను. నావైపు నుంచి మీరూహించని స్పెషల్ ఆఫర్ నేనిప్పిస్తాను. 

- మనోహర్ చిమ్మని
ఎం డి, స్వర్ణసుధ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్
+91 9989578125.  

Get connected... And make the best investment decision of 2022! 

After all, the best investment on earth is nothing but land... 

"Yo!" హీరో మీరేనా?


కొంచెం గ్యాప్ తర్వాత నా లేటెస్ట్ సినిమా పనులు మొదలెట్టాను. 

ఇప్పుడిది నా మొదటి సినిమా. పక్కా ట్రెండీ యూత్ లైఫ్‌స్టయిల్ సినిమా. లవ్ స్టోరీ.  మ్యూజికల్ కూడా.  

ప్రిప్రొడక్షన్ పనులు ఆల్రెడీ ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరిలో పాటల రికార్డింగ్‌తో సినిమా ఓపెనింగ్ చేస్తున్నాము. 

కట్ చేస్తే -

ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ కోసం - హైద్రాబాద్‌లో బేస్ అయి వున్న కొత్త ఆర్టిస్టుల కోసం చూస్తున్నాము. దీనికి సంబంధించిన ఒక తాజా యాడ్ ఒకటి రెండు రోజుల్లో పోస్ట్ చేస్తున్నాము. 

Stay tuned to my social media... FB, Twitter, Insta.

మిగిలిన కాస్టింగ్ అంతా పూర్తయ్యింది.  

దేని కోసమైతే యాడ్ ఇస్తామో - యాడ్‌లో చెప్పినవిధంగా ఆ అర్హతలున్నవారు అప్లై చేసుకోవచ్చు. ఇతరత్రా కాల్స్, మెసేజెస్ చేసేవారు ఆడిషన్‌కు అనర్హులవుతారు.

బెస్ట్ విషెస్. 

- మనోహర్ చిమ్మని 

Thursday 26 January 2023

కంగనా, ది ఫైటర్!


కంగనా రనౌత్ ఏ పార్టీ అన్నది నాకు అనవసరం. సక్సెస్ సైన్స్ పాయింటాఫ్ వ్యూలో ఈ పది వాక్యాలు ఆమె గురించి రాస్తున్నాను...  

ఎక్కడో హిమాచల్ ప్రదేశ్ నుంచి ఒంటరిగా ముంబై వచ్చింది. ఇంగ్లిష్ రాదని బాలీవుడ్‌లో ఎగతాళి చేసారు. భరించింది. అది మొదలుగా... ఇండస్ట్రీలోని ప్రతి ఒక్క సమస్యను ఒంటరిగా, ధైర్యంగా ఎదుర్కొంది. 

వ్యక్తిగత జీవితంలో రిలేషన్‌షిప్స్ సమస్యలను కూడా ఒంటరిగా అధిగమించింది. 

తాను అనుకున్నది సాధించింది.

బాలీవుడ్‌లో ఒక టాప్ రేంజ్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. హీరోయిన్‌గా కలెక్షన్స్ రికార్డ్స్ అప్పట్లోనే సాధించింది. 

హీరోయిన్‌గా నటిస్తూనే - డైరెక్టర్ అయింది. రైటర్ అయింది. ప్రొడ్యూసర్ అయింది.   

పద్మశ్రీ తెచ్చుకొంది. 

3 జాతీయ అవార్డులు, 4 ఫిలిం ఫేర్ అవార్డులు కూడా సాధించింది. 

ప్రొడ్యూసర్‌గా ముంబైలోనే 60 కోట్ల విలువైన సొంత బంగళాలో ప్రొడక్షన్ ఆఫీసు ప్రారంభించింది. 

కంగనా సాధించిన ఈ మైల్‌స్టోన్స్ అన్నింటి వెనుక - తన 15 ఏళ్ల ఫిలిం ఇండస్ట్రీ జీవితపు మర్చిపోలేని అనుభవాలున్నాయి. ఘోరమైన అవమానాలున్నాయి. అంతులేని సంఘర్షణ ఉంది.    

కట్ చేస్తే - 

ఇప్పుడు హీరోయిన్‌గా, ప్రొడ్యూసర్-డైరెక్టర్‌గా... తన ఆస్తులన్నీ తాకట్టు పెట్టి... ఇందిరాగాంధీ పాత్రలో నటిస్తూ... "ఎమర్జెన్సీ" సినిమా భారీగా తీస్తూ... మొన్ననే షూటింగ్ పూర్తిచేసింది కంగనా రనౌత్. 

మరింత పాపులారిటీ, వందల కోట్ల ఆదాయం ఆన్ ది వే...  

దటీజ్ కంగనా, ది ఫైటర్.  

Wednesday 25 January 2023

ఒక కొత్త సినిమా, 2 వర్క్‌షాపులు!


ఇప్పుడు నేను చేస్తున్న సినిమా "Yo!" ప్రిప్రొడక్షన్‌లో ఉంది. 

ఫిబ్రవరిలో పాటల రికార్డింగ్ చేస్తున్నాను. నేను అనుకున్న గెస్ట్ కుదిరితే - రికార్డింగ్‌తోనే సినిమా ఓపెనింగ్ చెయ్యాలనుకుంటున్నాను. పక్కాగా "ఇదీ" అని ఇప్పుడే చెప్పలేను. గెస్ట్ ఫిక్స్ అయ్యాకే ఓపెనింగ్ విషయం నిర్ణయం అవుతుంది. 

కట్ చేస్తే -

షూటింగ్‌కి వెళ్లబోయే ముందు - కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌కు కనీసం 2 పూర్తిస్థాయి వర్క్‌షాప్స్ ప్లాన్ చేస్తున్నాను. 


సింగిల్ షెడ్యూల్. 

ఫిమేల్ లీడ్ కోసం షార్ట్ లిస్ట్ పూర్తయిపోయింది. అప్పుడప్పుడూ హీరోయిన్స్ ప్రాబబుల్స్ ఫోటోలు పోస్ట్ చేస్తున్నా కాని, నా మైండ్‌లో ఫైనల్ అనుకున్న హీరోయున్ ఫోటో ఇంకా పోస్ట్ చెయ్యలేదు ఎక్కడా. 

మేల్ లీడ్ కోసం షార్ట్ లిస్ట్ ఇంకా ఫైనల్ చేసే స్టేజీలోనే ఉంది. దీని కోసం రకరకాల ఆడిషన్/సెలక్షన్ ప్రయత్నాలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. దీని గురించి త్వరలో ఏదైనా కొత్త ప్రయత్నం భారీగా చెయ్యాలనుకుంటున్నాను. అదేంటన్నది త్వరలో చెప్తాను. 

Sunday 22 January 2023

నా క్లాస్‌మేట్, నా మిత్రుడు, నా శ్రేయోభిలాషి...


కొన్ని నిజాలు చాలా బాధకలిగిస్తాయి. అలాంటి నిజమే ఇది కూడా.

అప్పుడే 19 ఏళ్లు!

నా క్లాస్‌మేట్, నా మిత్రుడు, నా బావమరిది చీరాల పురుషోత్తం, IRS పుట్టినరోజు ఇవాళ!

కానీ .. తను మరణించి అప్పుడే 19 ఏళ్ళు అయ్యిందన్న నిజం నన్నీరోజు చాలా బాధపెడుతోంది.

దిస్ ఈజ్ లైఫ్.

అన్నీ మనం అనుకున్నట్టు జరగవు.

నువ్వు గుర్తొచ్చిన ప్రతిసారిలాగే ఈరోజు కూడా బాధపడుతున్నాను. కానీ, అది తప్పని కూడా నీ జ్ఞాపకాలే నాకు గుర్తుచేస్తున్నాయి.

జీవితంలో ఎన్నెన్నో మనకు ఇష్టంలేనివి, మనం ఊహించనివి జరుగుతుంటాయి. వాటిని అధిగమించగలిగే ఆత్మవిశ్వాసం ముఖ్యం.

ఆ ఆత్మవిశ్వాసానికి పర్యాయపదం నువ్వు.

అవధులులేని నీ ఆత్మ విశ్వాసం, నీ చిరునవ్వు, ఆ చిరునవ్వుతోకూడిన నీ ప్రతి పలకరింపు నేనెన్నటికీ మర్చిపోలేను.

హైద్రాబాద్ రోడ్లపైన అర్థరాత్రి తర్వాత తిరిగిన మనిద్దరి ఫుడీ తిరుగుళ్ళు, హుసేన్‌సాగర్ చుట్టూ మనకు నచ్చిన ప్రతిచోటా కారు ఆపుకొని చేసిన మన ఎడతెగని చర్చలు... అన్నీ గుర్తుకొస్తున్నాయ్. 

నువ్వుంటే కథ వేరేలా ఉండేది. 

అసలు నీ ప్రెజెన్సే నాకు ఒక పెద్ద కిక్. ఒక హై. ఒక కాన్‌ఫిడెన్స్.

మిస్ యూ పురుషోత్తమ్...

***** 

#ChiralaPurushotham   #IRS   #ChiralaPurushothamIRS   #PurushothamIRS

Friday 20 January 2023

బ్లాగింగ్ నాకు చాలా ఇచ్చింది!


ఇప్పుడే చూశాను... 

ఈ సంవత్సరం ఆగస్టు 21 వస్తే - ఈ బ్లాగ్‌కు 11 ఏళ్ళు నిండుతాయి. 

నాకే ఆశ్చర్యంగా ఉంది. నిజంగా 11 ఏళ్ళ నుంచి రాస్తున్నానా ఈ బ్లాగులో? 

ఆగస్టు వరకు ఎలాగూ కొంచెం ఫ్రీ అయిపోతాను కాబట్టి ఆ నెలంతా సెలబ్రేట్ చేసుకోవాలనుకొంటున్నాను. బహుశా ఏ గోవాకో, పాండిచ్చేరికో వెళ్ళి. 

కట్ చేస్తే - 

నా మిత్రుడొకరికి ఏదో టెక్నికల్ సహాయం చేసే పనిలో ఉన్నప్పుడు - మధ్యలో నాకీ ఆలోచన వచ్చింది. 

ఆ సమయంలోనే నాకు "లేఖిని" కనిపించింది.

అంతే. 

"తెలుగు టైపింగ్ ఇంత ఈజీనా?!" అనుకొంటూ వెంటనే ఈ బ్లాగ్ క్రియేట్ చేశాను. 

అప్పట్నించీ నాకు రాయాలనిపించిన ప్రతీదీ రాస్తూనే ఉన్నాను. మధ్యలో కనీసం ఒక అరడజన్ సార్లు బ్లాగింగ్ మానెయ్యాలనుకున్నాను. భారీ గ్యాప్స్ తీసుకొన్నాను. కాని, నా వల్ల కాలేదు.  

బ్యాక్ టు బ్లాగింగ్.

నా బ్లాగ్ "నగ్నచిత్రం" 11 ఏళ్ళు పూర్తిచేసుకోబోతున్న సందర్భంగా - ఆగస్టు నెలంతా నా బ్లాగ్ గురించి, నా బ్లాగింగ్ అనుభవాల గురించి, ఈ బ్లాగ్ ద్వారా నేను కనెక్ట్ అయిన అద్భుతమైన కొందరు వ్యక్తుల గురించి, ఈ బ్లాగ్ నేపథ్యంగా నేను సాధించిన కొన్ని విజయాల గురించి... క్లుప్తంగా ఒక సీరీస్ ఆఫ్ బ్లాగ్ పోస్టులు ఇదే బ్లాగులో రాస్తాను.

మరొకవైపు - నా జీవితం మొత్తంలో తీసుకొన్న రెండే రెండు అతి చెత్త నిర్ణయాలకు సాక్షి పాత్ర కూడా పోషించింది నా బ్లాగ్. ఆ రెంటిలో ఒకదాన్నించి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాను. రెండోదాన్నించి కూడా ఇంకొకటి రెండు నెలల్లో పక్కాగా బయటపడతాను.  

నామట్టుకు నాకు బ్లాగింగ్ ఒక మినీ లేబొరేటరీ. ఒక థెరపీ. ఒక స్పిరిచువల్ ప్రాక్టీస్. ఒక యోగా. ఒక ధ్యానం. ఒక అంతశ్శోధన. ఒక అంతర్మథనం. ఒక అద్దం. ఒక ఆసరా. ఒక ప్రేయసి. ఒక ప్రణయం. ఒక ప్రయాణం...  

Sometimes I think of blogging as finger exercises for a violinist; sometimes I think of it as mulching a garden. It is incredibly useful and helpful to my “real” writing. 
~ Kate Christensen      

Wednesday 18 January 2023

ఆరంభింపరు...


మనం చెయ్యము. చెయ్యనివ్వము. చేసేవాళ్ళను ద్వేషిస్తాము. ఏవేవో మనకు అరకొర తెలిసిన పనికిరాని అవుట్ డేటెడ్ శాస్త్రాల్ని, అవుట్ డేటెడ్ థియరీలను పట్టుకొని మనకే అంతా తెలుసు అన్నట్టుగా వాదించడానికి పూనుకొంటాం. ఎందుకంటే - అంతకు మించి మనం ఏం చేయలేం. మనవల్ల కాదు.    

ఇదొక వ్యాధి. దురదృష్టవశాత్తూ చదువువుకొన్నవాళ్ళకే ఎక్కువగా అంటే వ్యాధి.    

ఇలాంటివాళ్ళంతా ఒక పాండమిక్ లాంటివాళ్ళు. ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.  

ఇలాంటివాళ్లెందరో 2001లో కేసీఆర్ తెరాస ప్రారంభించినప్పుడు కూడా నానా చెత్త పలికారు. ఎన్నో మాటలన్నారు. ఎగతాళి చేశారు. ఏమైంది? 

పోనీ అప్పటికైనా ఊరుకున్నారా? లేదు...  

ఏం చేతకాదన్నారు. తెలంగాణ అంధకారమైపోతుందన్నారు. అన్నల రాజ్యం వస్తుందన్నారు. మరొక బీహార్ అవుతుందన్నారు. 60 ఏళ్ళలో ఏ ఒక్కరికీ చేతకానివి ఇప్పుడు చేసి చూపిస్తుంటే వీరి తలలు ఇప్పుడు ఎక్కడ  పెట్టుకున్నారు?  

ఇంత ద్వేషం ఎందుకు?  

కట్ చేస్తే - 

అన్నీ ఎంతో బాగా తెలిసిన మీలాంటివాళ్ళు పాలిటిక్స్ లోకి నేరుగా దిగొచ్చు. మీకు తెలిసిన శాస్త్రాలతో, మీ మేధావిత్వంతో దేశం కోసం ఎన్ని గొప్ప పనులైనా చేసి చూపించే స్వతంత్రం, హక్కు మీకుంది. ఎవ్వరూ మిమ్మల్ని అడ్డుకోరు.      

తెరాస ప్రారంభించినప్పుడు కేసీఆర్ కూడా ఒక్కడే. 

With that said -

అప్పుడప్పుడూ నేను రాసే నా పొలిటికల్ బ్లాగులు నచ్చనివాళ్ళు దయచేసి దూరంగా ఉండగలరని మనవి. 

బ్లాగ్‌లో నేను రాసిన పాయింట్స్ పక్కన పెట్టి, సిల్లీగా ఎగతాళి రాతలు రాయడమే కామెంట్ అనుకువాళ్ళ కామెంట్స్‌ను, నాకు నచ్చని కామెంట్స్‌ను సింపుల్‌గా డిలీట్ చేస్తాను. వాటిని మొత్తం చదివి నా సమయం కూడా వృధా చేసుకోను. 

ఈ విషయంలో ఇక్కడితో... ది ఎండ్.   

Thank you.  

Tuesday 17 January 2023

"నాటు నాటు" పాటకే ఎందుకు?


"రేపు జనవరి 15 రాజమౌళి టీమ్‌కు చాలా ముఖ్యమైన రోజు.

క్రిటిక్స్ చాయిస్ అవార్డులు ఇస్తారు...

ఈ అవార్డుల కోసం బెస్ట్ పిక్చర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ సాంగ్, బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్, బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిలిం... ఈ అయిదు కేటగిరీల్లో బరిలో ఉంది RRR. 

మళ్ళీ "బెస్ట్ సాంగ్"కే ఈ అవార్డు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాని... బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిలిం అవార్డుల విషయంలో కూడా చాన్స్ ఉందని నా ఇంట్యూషన్ చెప్తోంది." 

... ... ...
 


క్రిటిక్స్ చాయిస్ అవార్డుల్లో - నేను అనుకున్నట్టుగానే "నాటు నాటు" పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డు వచ్చింది. బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిలిం అవార్డు కూడా వచ్చింది. 

కంగ్రాచులేషన్స్ టు రాజమౌళి అండ్ టీమ్. 

హాలీవుడ్ పరిధిలోని 3 ప్రధాన అవార్డ్ ఈవెంట్స్‌లో - RRR సినిమాకు ఇప్పటివరకు మొత్తం 4 అవార్డులు వచ్చాయి... 

> బెస్ట్ డైరెక్టర్‌గా రాజమౌళికి న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ అవార్డు
> "నాటు నాటు" పాటకు గోల్డెన్ గ్లోబ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డు
> "నాటు నాటు" పాటకే క్రిటిక్స్ చాయిస్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డు
> బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిలిమ్‌గా RRR సినిమాకు క్రిటిక్స్ చాయిస్ అవార్డు 

ఇక మిగిలింది ఒక్కటే... 

ఆస్కార్ అవార్డు.

ఇప్పుడు ఆస్కార్ అవార్డు షార్ట్ లిస్టుల్లో "నాటు నాటు" సాంగ్ ఒక్కటే బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డు కోసం బరిలో ఉంది. 


ఏజెంట్స్ ద్వారా, పర్సనల్‌గా, ప్రొఫెషనల్‌గా హాలీవుడ్ సర్కిల్స్‌లో లాబీయింగ్ వంటి ప్రయత్నాలు ఎలా వున్నా - గోల్డెన్ గ్లోబ్ అవార్డు, క్రిటిక్స్ చాయిస్ అవార్డుల్ని ఇప్పటికే సాధించిన "నాటు నాటు" సాంగ్‌కు దాదాపు ఆస్కార్ వచ్చినట్టే అనుకోవచ్చు. 

పై 2 అవార్డులు ఆ పాటకి వచ్చాయి కాబట్టి - ఇప్పుడు ఆస్కార్‌లో కూడా ఆ పాటకే రావాలన్న రూల్ ఏం లేదు. కాని, ఆ చాన్సెస్ ఎక్కువగా ఉంటాయని పాత అంచనాలు, రికార్డులు చెప్తున్నాయి.

జనవరి 24 నాడు ఆస్కార్ నామినేషన్స్ ఫైనలైజ్ అవుతాయి. ఆరోజు నామినేషన్స్‌లో "నాటు నాటు" పాట లిస్టులో తప్పక ఉండి తీరుతుందని నా నమ్మకం. 

లేడీ గాగా, టేలర్ స్విఫ్ట్, రిహానా వంటి ఇండస్ట్రీ జెయింట్స్‌ను బీట్ చేసి గోల్డెన్ గ్లోబ్ అవార్డు సాధించిన "నాటు నాటు" సాంగ్ ఆస్కార్ నామినేషన్స్‌లో ఉందీ అంటే మాత్రం ఆస్కార్ వచ్చినట్టే. 

ఇది నా ఇంట్యూషన్.  

కట్ చేస్తే -     

RRR లోని "నాటు నాటు" పాట వివిధ కారణాల వల్ల చాలా బాగుంది...

కీరవాణి అద్భుతమైన ట్యూన్, ఆర్కెస్ట్రయిజేషన్, సౌండింగ్ ఇచ్చారు. చంద్రబోస్ మంచి లిరిక్స్ ఇచ్చారు. కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ బాగా పాడారు. ప్రేమ్ రక్షిత్ కోరియోగ్రఫీ పీక్స్ రుచి చూపించాడు. వీళ్లందరి శ్రమకు ఏమాత్రం తగ్గకుండా - రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నభూతో న భవిష్యతి రేంజ్‌లో - నమ్మలేనంత సింక్రనైజేషన్‌తో డాన్స్ చేస్తూ నటించారు.

బహుశా ఇలా వివిధ కోణాల్లో ఆలోచించి - ఈ పాటనే అవార్డు కోసం రాజమౌళి & టీమ్ ఎన్నిక చేసుకొని వుంటారు.

అది సహజం. 

వీటికి తోడు - నా హంబుల్ ఉద్దేశ్యంలో - ఇంకో రెండు అతి బలమైన రీజన్స్ వల్ల హాలీవుడ్ పరిధిలోని 2 ప్రధాన అవార్డులను ఒకదానివెంట ఇంకొకటి ఈ పాట సాధించగలిగింది. 

లేదా, ఈ రెండు కారణాలు ఈ పాటకే ఓటు వేయడానికి మరింత బలాన్నిచ్చాయి. లేదా, ఎడ్వాంటేజ్‌గా పనిచేశాయి. 

కొందరికి నవ్వు రావచ్చు, "లైట్" అనుకోవచ్చు. కాని, ఆ రెండు కారణాలకు నిజంగా అంత శక్తి ఉంది. 

ఇప్పుడు నేను అనుకుంటున్న ఆ రెండు కారణాల గురించి సాధ్యమైనంత క్లుప్తంగా చెప్పి ఈ బ్లాగ్ ముగిస్తాను...   

1. "నాటు నాటు" పాటను యూక్రేన్‌లోని ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ "మరీన్స్‌కీ ప్యాలెస్" ముందు షూట్ చేశారు. ఈ ప్యాలెస్‌లోనే యూక్రేన్ ప్రెసిడెంట్ వొలదిమీర్ జెలెన్‌స్కీ అఫీషియల్ నివాసం. ఇది ప్యాలెస్ యూక్రేన్ రాజధాని కీవ్‌లో ఉంది.   

నిజానికి భద్రతా కారణాల దృష్ట్యా ఈ ప్యాలెస్‌ను షూటింగ్స్‌కు ఇవ్వరు. కాని, ప్రెసిడెంట్ జెలెన్‌స్కీ కూడా ఒకప్పుడు పాపులర్ టీవీ నటుడు కాబట్టి బహుశా ఓకే చెప్పి ఉంటాడు. 


ఈ పాట షూట్ చేస్తున్నప్పుడు రష్యా-యూక్రేన్‌ల మధ్య యుద్ధం లేదు. షూటింగ్ తర్వాత బహుశా కొన్ని నెలలకు యుద్ధం ప్రారంభమైంది. ఇప్పుడా రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంలో వెన్ను చూపని రియల్ వ్యారియర్‌లా యూక్రేన్ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీ పోరాడుతున్నాడు.

అమెరికా సహా, మొత్తం పశ్చిమ దేశాలన్నీ జెలెన్‌స్కీ వైపున్నాయి. 

ఈ పాటను యూక్రేన్‌లో షూట్ చేస్తున్న సమయంలో - అక్కడి లోకల్ వాళ్ళు కూడా కొందరు సహాయకులుగా టీమ్‌లో పనిచేశారు. ఇప్పుడు వాళ్లంతా రష్యా-యూక్రేన్ వార్ ఫ్రంట్‌లో వున్నారు. 

రష్యా వార్-ప్లాన్‌లో మొదటి లక్ష్యం జెలెన్‌స్కీ అయితే - ఈ పాట షూటింగ్ కోసం వివిధ అనుమతులతో టీమ్‌కు సహాయపడిన యూక్రేన్ రాజధాని కీవ్ నగర మేయర్ వితాలి క్లిచ్‌కో రష్యా సెకండ్ టార్గెట్! 

యూక్రేన్‌లో ఒక టాప్ ఫిలిం ప్రొడ్యూసర్ అన్నా పాలెంచుక్ కూడా ఈ పాట షూటింగ్ కోసం (కొన్ని సీన్స్ కూడా) టీమ్‌కు సహకరించిందని చదివాను. తను కూడా ఇప్పుడు వార్ ఫ్రంట్‌లో పనిచేస్తోంది. 

RRR లోని "నాటు నాటు" పాట షూటింగ్‌కు ఉన్న ఈ నేపథ్యం హాలీవుడ్ సోర్స్‌లను బాగా ఆకట్టుకొనివుంటుంది. తామంతా జెలెన్‌స్కీకి మద్దతుగా ఉన్నామన్నదానికి సింబాలిక్‌గా - పోటీలో ఉన్న ఈపాటకే తప్పక మొగ్గుచూపటం అత్యంత సహజం. 

2. "నాటు నాటు" పాటలోని "నాటు" శబ్దం - రష్యాకు వ్యతిరేకమైన పశ్చిమదేశాల "నాటో" (NATO) శబ్దానికి పూర్తి దగ్గరగా ఉండటం కూడా ఒక సింబాలిక్ ఫీల్‌గా పనిచేసివుంటుంది. 

పైన చెప్పిన రెండో కారణం మరీ సిల్లీగా అనిపించవచ్చు. కాని, కొట్టి పారేయలేం.  

సో... హాలీవుడ్ పరిధిలో ఆల్రెడీ 2 అవార్డులు సాధించిన "నాటు నాటు" పాటకు ఆస్కార్‌లో కూడా ఇదే ఊపులో, ఇదే ఫీల్‌తో తప్పక ఆస్కార్ వస్తుందని నా గట్టి నమ్మకం. 

ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం మార్చి 12 అయినా - ఈ జనవరి 24 నాటి నామినేషన్స్ ఫైనలైజేషన్ రోజే RRRకు సిసలైన ఎగ్జయిటింగ్ డే అని నేననుకొంటున్నాను.  

Best wishes to Rajamouli & Team! 

Saturday 14 January 2023

ఆస్కార్ దిశగా... RRR!


కొన్ని గంటల క్రితం యస్ యస్ రాజమౌళి ట్వీట్ చూశాక ఈ బ్లాగ్ పోస్ట్ రాయాలనుకున్నాను... 

సుమారు 6 గంటల క్రితం రాజమౌళి పెట్టిన ఆ ట్వీట్‌లో 2 ఫోటోలున్నాయి. వాటిలో ఒక ఫోటో నిజంగా అద్భుతం.

అది ఫీలైనవారికే తెలుస్తుంది. 

"ఇది కలా, నిజమా... నా కళ్ళముందు ముందు స్టీవెన్ స్పీల్‌బర్గ్!" అన్నట్టుగా ఉంది ఆ ఫోటోలో రాజమౌళి ఫీలింగ్.

"I just met GOD!!!"

స్పీల్‌బర్గ్‌ను కలిసిన తర్వాత రాజమౌళి ఎక్‌జైటింగ్‌గా పెట్టిన ట్వీట్ అది. పక్కనే ఒక 3 "హార్ట్ ఆన్ ఫైర్" ఎమోజీలు... 

"హాలీవుడ్‌లో మాస్టర్‌పీస్ సినిమాల గాడ్" స్టీవెన్ స్పీల్‌బర్గ్‌ను కలిసిన సందర్భంగా రాజమౌళికి అభినందనలు. 

గోల్డెన్ గ్లోబ్, న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ అవార్డులు అందుకున్న సందర్భంగా కూడా రాజమౌళికి నా హార్దిక అభినందనలు. 

కట్ చేస్తే -   

మొన్నీమధ్యే - జనవరి 4 నాడు, న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ నుంచి RRR దర్శకుడిగా "బెస్ట్ డైరెక్టర్" అవార్డు అందుకున్నాడు రాజమౌళి. 


తర్వాత - జనవరి 11 వ తేదీ నాడు RRR సినిమాలోని "నాటు నాటు" పాటకు "బెస్ట్ ఒరిజినల్ సాంగ్"గా గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి అవార్డు అందుకున్నారు. 

ఈ పాట రాసింది చంద్రబోస్. పాడింది కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్. అద్భుతమైన కొరియోగ్రఫీ అందించింది ప్రేమ్‌రక్షిత్. మరింత అద్భుతమైన సింక్‌తో నటించింది రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీర్.    

ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డులను ఇచ్చేది హాలీవుడ్ ఫారిన్ ప్రెస్ అసోసియేషన్. 

తర్వాత కొద్ది వారాల్లోనే ప్రకటించే ఆస్కార్ అవార్డులకు ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డులు ఒక హింట్ ఇచ్చేవిగా ఉంటాయని అంటారు.

అంటే - ఆస్కార్ అవార్డుల్లో ఏ సినిమాలకు ఏ అవార్డులు రావొచ్చు అన్న విషయంలో ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డులు కొంతవరకు హింట్ ఇస్తాయన్నమాట.  

ఈ లెక్కన - మార్చి 12 నాడు జరగబోతున్న ఆస్కార్ అవార్డుల ఫంక్షన్‌లో RRRకు కూడా ఒక అవార్డు తప్పకుండా వస్తుందని నాకనిపిస్తోంది.   

బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిలిం కేటగిరీ కింద ఇండియన్ గవర్నమెంట్ ద్వారా నామినేషన్స్‌కు పంపించిన సినిమా "ఛెల్లో" అని ఒక గుజరాతీ సినిమా. సో, ఈ కేటగిరీలో RRRకు అవార్డు లేదు. ఇతర కేటగిరీల్లో అలా ప్రభుత్వం ద్వారా వెళ్ళాల్సిన అవసరం లేదు. కాబట్టి, వాటికి చాన్స్ ఉంది. 

కట్ చేస్తే -   

రేపు జనవరి 15 రాజమౌళి టీమ్‌కు చాలా ముఖ్యమైన రోజు.

క్రిటిక్స్ చాయిస్ అవార్డులు ఇస్తారు...


ఈ అవార్డుల కోసం బెస్ట్ పిక్చర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ సాంగ్, బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్, బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిలిం... ఈ అయిదు కేటగిరీల్లో బరిలో ఉంది RRR. 

మళ్ళీ "బెస్ట్ సాంగ్"కే ఈ అవార్డు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాని... బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిలిం అవార్డుల విషయంలో కూడా చాన్స్ ఉందని నా ఇంట్యూషన్ చెప్తోంది. 

RRRలో ఈ "నాటు నాటు" పాటనే "బెస్ట్ ఒరిజినల్ సాంగ్" కేటగిరీలో ఎన్నుకోడానికి, దీనికే అవార్డు ఇవ్వడానికి ఒకటి రెండు బలమైన కారణాల నేపథ్యం కూడా ఉపయోగపడి వుంటుందన్నది నేననుకుంటున్నాను. దాని గురించి ఇంకో చిన్న బ్లాగ్ తర్వాత రాస్తాను.    

ఈ జనవరి 19 నాడే బ్రిటిష్ ఫిల్మ్ ఎకాడమీ (BAFTA) అవార్డుల నామినేషన్స్ ఎనౌన్స్ చేస్తున్నారు. అందులో RRR కు పక్కాగా ఒక అవార్డు వచ్చే అవకాశముంది. ఎందుకంటే - UK లో ఆల్రెడీ కమర్షియల్‌గా బాగా వసూళ్ళు చేసి ప్రూవ్ చేసుకున్న సినిమా RRR. 

ఇక - జనవరి 24వ తేదీ రాజమౌళికి ఎక్‌జైటింగ్ డే. ఆరోజే ఆస్కార్ నామినేషన్స్ ఫైనల్ అవుతాయి. ఆస్కార్ బరిలో RRR ఉన్నదా లేదా తెలుస్తుంది. 

ఉంటుందనే నా నమ్మకం.      

కట్ చేస్తే -   

"ఒక్కసారిగా ఈ అంతర్జాతీయ అవార్డుల వెల్లువ ఏంటి" అన్న ప్రశ్న వస్తుంది. అంతకు ముందు ఇంతకంటే గొప్ప పాటలు రాలేదా, గొప్ప సినిమాలు రాలేదా, గొప్ప దర్శకులు లేరా... అనిపిస్తుంది కొందరికి. 

తప్పేం లేదు. 

కాని, ప్రపంచ సినిమా మార్కెట్‌కు వేదికలయిన హాలీవుడ్, ఆస్కార్ అవార్డుల బరిలోకి వెళ్ళే ప్రయత్నాలు ఎంతమంది చేశారన్నది బిగ్ కొశ్చన్.          

సినిమా అనేది బేసిగ్గా ఒక క్రియేటివ్ బిజినెస్. 

ఇప్పుడిదొక భారీ కార్పొరేట్ బిజినెస్. 

భారతీయ మెయిన్‌స్ట్రీమ్ కమర్షియల్ సినిమాను వంద రెండొందల కోట్ల క్లబ్‌లోంచి ఏకంగా 1000 కోట్లు, 1500 కోట్ల బిజినెస్ స్థాయికి తీసుకెళ్ళిన దర్శకుడు రాజమౌళి.

బిజినెస్ పరంగా, రీచ్ పరంగా రాజమౌళి విజన్ అద్భుతం. 


ట్రిపుల్ ఆర్ ఇచ్చిన సక్సెస్‌తో రాజమౌళి ఇంక నేరుగా హాలీవుడ్‌లోకి ఎంటర్ అయ్యే దిశలో ఉన్నాడు. అక్కడ హాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చేముందు ఈ అంతర్జాతీయస్థాయి అవార్డుల బజ్ అవసరం.

ఇప్పుడదే జరుగుతోంది. అది అవసరం కూడా. 

టైటానిక్‌లు, అవెంజర్స్, అవతార్‌లు మేమూ తీయగలం అని భారతీయ ఫిలిం డైరెక్టర్స్ చెప్పబోయే రోజులు ముందున్నాయి. 

ఈ దిశలో తెలుగు నుంచి రాజమౌళి పయొనీర్ కాబోతున్నాడు. 

Best wishes to Director SS Rajamouli, the Marketing Mantrik! 

Friday 13 January 2023

నిర్మాణాత్మక విమర్శలు ఓకే... కానీ...


మీరు భజన అనుకున్నా ఫరవాలేదు...  

నేను పక్కా కేసీఆర్ అభిమానిని. ఒక రాజకీయవేత్తగా, ఒక దార్శనికునిగా, ఒక ముఖ్యమంత్రిగా ఆయన చేస్తున్న పనుల గురించి, సాధిస్తున్న విజయాల గురించి, సృష్టిస్తున్న సంచలనాల గురించి నేను తరచూ బ్లాగ్‌లు, పేపర్స్‌కి ఎడిట్ పేజ్ ఆర్టికిల్స్, సోషల్ మీడియా పోస్టులు రాస్తుంటాను.  

నేను బి ఆర్ యస్ మౌత్‌పీస్‌ను. కేసీఆర్ సారథ్యంలో దేశ రాజకీయాల్లో రానున్న మలుపుల నేపథ్యంలో - ఆయన స్థాపించిన పార్టీ గురించి, ఆ పార్టీ నడిపిస్తున్న ప్రభుత్వం గురించి, ఆ ప్రభుత్వం క్రియేట్ చేస్తున్న రికార్డుల గురించి కూడా రాస్తుంటాను.  

ఒక డైనమిక్ మంత్రిగా, ఒక మల్టి టాలెంటెడ్ వ్యక్తిగా - దాదాపు వారంలో ప్రతి రోజూ - అయితే ఒక కొత్త ఇండస్ట్రీ డీల్ కాని, ఒక భారీ ఇన్వెస్ట్‌మెంట్ ప్రపోజల్ గాని లేకుండా నిద్రపోని కేటీఆర్ గురించి కూడా తరచూ రాస్తుంటాను. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాను. 

నా లాజిక్ ఒక్కటే. బాగా పనిచేస్తున్న వారిని గుర్తించాలి. వారు సాధిస్తున్న అరుదైన విజయాల గురించి రాస్తూ వారిని బాగా ప్రమోట్ చెయ్యాలి. రాజకీయాల్లో ఒక కొత్త గుణాత్మక మార్పు తీసుకురావడానికి కృషి చేస్తున్న కేసీఆర్ లాంటి దార్శనికునికి ఒక పౌరుడిగా ఉడతాభక్తిగానైనా తోడ్పడాలి. అంతే. 

నా పుస్తకం "కేసీఆర్ - ది అర్ట్ ఆఫ్ పాలిటిక్స్" పుస్తకం చదివితే ఈ విషయం మీకు ఇంకాస్త బాగా అర్థమవుతుంది. 

కట్ చేస్తే - 

నా మిత్రులు కొందరు, నాకు తెలీనివారు కొందరు "మీరు బ్లాగ్‌లో, సోషల్ మీడియాలో కేసీఆర్ భజన ఎందుకు చేస్తున్నారు?" అని బాధపడిపోతుంటారు.   

క్రియేటివిటీ వేరు. రాజకీయాలు వేరు. నా మనసుకు నచ్చింది నేను చేస్తాను. నేను చేయాలనుకున్నది చేస్తాను. నా ఫేస్‌బుక్, నా వాల్, నా బ్లాగ్, నా ట్విట్టర్, నా ఫీలింగ్స్, నా రాతలు, నా ఇష్టం. 

మీకు నచ్చకపోతే సింపుల్‌గా ఒకే ఒక్క క్లిక్‌తో నన్ను అన్‌ఫ్రెండ్ చెయ్యొచ్చు. నా బ్లాగ్ వైపు చూడకుండా ఉండొచ్చు. దట్ సింపుల్.  

నేను రాసిన పాయింట్స్ మీద నిర్మాణాత్మక విమర్శలు చేయొచ్చు. ఆహ్వానిస్తాను. అంతే తప్ప - ఏవో పనికిరాని కామెంట్స్, వాట్సాప్ యూనివర్సిటీ రాతలు మాత్రం రాయకండి. నేను అసలు పట్టించుకోను. లేదంటే డిలీట్ చేస్తాను. 

అలాంటి కామెంట్స్ వల్ల మీరేంటో మీ మానసిక స్థాయి ఏంటో అందరికీ తెలిసిపోతుంది. 

బి ఆర్ యస్ సోషల్ మీడియా వారియర్స్ చూస్తే ఒక ఆట ఆడుకుంటారు. 

కట్ బ్యాక్ టు భజన - 

మిగిలినవారెవరి విషయమో నాకు తెలియదు. కానీ, నా విషయంలో మటుకు .. భజన వేరు. అభిమానం వేరు.

భజన ఒక భ్రమ. అభిమానం ఒక రియాలిటీ.

భజన వెనుక ఆశలు, కోరికలు, అవసరాలుంటాయి. అభిమానం వెనుక కేవలం ఫీలింగ్స్ ఉంటాయి.

ఈ రెండింటి మధ్య తేడాని గుర్తించలేనివాళ్లే నానా కామెంట్స్, నానా సౌండ్స్ చేస్తుంటారు.  అదే అసలైన భజన అని నా ఉద్దేశ్యం. 

Thursday 12 January 2023

Spilling the Light


1926 లో చలం "మైదానం" రాశాడు...

నా ఫేవరేట్ ప్రపంచస్థాయి రచయితల్లో చలం ముందు వరసలో ఉంటాడు. ఆకాలంలోనే ఆయన రాయగలిగిన ఆ అందమైన తెలుగు శైలిని ఇప్పుడు 2023 లో కూడా ఎవ్వరూ రాయడం లేదన్నది నా వ్యక్తిగత అభిప్రాయం.

అలాంటి చలం... ఆరోజుల్లోనే... ఎంత అగ్రెసివ్, ఎంత అన్‌ట్రెడిషనల్ టాపిక్స్ పైన రచనలు చేశాడో అందరికీ తెలిసిందే. ఆ టాపిక్స్ అప్పుడే కాదు, ఇప్పుడు కూడా సంచలనాత్మకమైనవే!

అలాంటి రచయిత కూడా చివరికి స్పిరిచువాలిటీ అంటూ రమణ మహర్షి ఆశ్రమం చేరాడు.

ఈ స్పిరిచువల్ "ట్రాన్స్‌ఫార్మేషన్" కేవలం క్రియేటివ్ రంగాలవారిలోనే వస్తుందని కాదు. చరిత్రలో అలెక్జాండర్ వంటి రారాజు నుంచి, సాధారణ రొటీన్ మనుషుల విషయంలోనూ జరుగుతుంది.

ఈ విషయంలో ఉదాహరణలు లెక్కలేనన్ని ఉన్నాయి.

లైఫ్ అంతా ఉవ్వెత్తు కెరటాల్లా రకరకాలుగా ఎగిసిపడి, మిడిసిపడి, ఎదిరించి, తెగించి, యుధ్ధాలు చేసి, దేన్నీ లెక్కచేయకుండా ఎన్నోరకాలుగా జీవితాన్ని పీల్చి పిప్పిచేసి, విచ్చలవిడిగా ఎంజాయ్ చేసి, చివరాఖరికి వచ్చేటప్పటికి స్పిరిచువాలిటీ అంటారెందుకు అన్నది నా హంబుల్ కొశ్చన్!

ఆధ్యాత్మికతకు నిజంగా అంత పవరుందా?

తప్పకుండా ఉండే వుంటుంది.  

ఆధ్యాత్మికత అనేది మన మనసుకు సంబంధించింది.

ఆధ్యాత్మికత వ్యక్తిగతం. 

ఎవరి బోధనలు విన్నాము, ఎవరిని ఫాలో అవుతున్నాము, ఏ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము, ఎన్ని ప్రాచీన గ్రంథాలు చదివాము, ఎన్ని ఆధునిక పుస్తకాలు చదివాము అన్నది కాదిక్కడ ప్రశ్న. వాటన్నిటి ద్వారా తెలుసుకున్నదానితో నిన్ను నువ్వు ఏం తెలుసుకున్నావన్నదే సిసలైన స్పిరిచువాలిటీ.

ఈ జ్ఞానోదయానికున్న పవర్ ముందు మరింకే శక్తీ నిలవదంటే అతిశయోక్తి కాదు. 

కట్ చేస్తే - 

క్రియేటివిటీ, స్పిరిచువాలిటీ... ఈ రెండూ మొదటినుంచీ నాకత్యంత ఇష్టమైన అంశాలు. మొదటినుంచీ అంటే నాకు పుస్తకాలు చదవటం అలవాటైన నా స్కూలు రోజుల నుంచీ అని. 

ఈ రెండూ చూడ్డానికి విభిన్నధృవాల్లా అనిపిస్తాయి. కానీ, రెండింటి సోల్ ఒక్కటే.

ఆనందం.

పల్ప్ ఫిక్షన్ రాసే ఒక రచయితలో, కమర్షియల్ సినిమాలు చేసే ఒక దర్శకునిలో ఆధ్యాత్మిక చింతన ఉండకూడదా?

ఆధ్యాత్మిక చింతన ఉన్న ఒక ఆర్టిస్ట్ బొమ్మలువేసి ఎగ్జిబిషన్ పెట్టకూడదా?

భారీ వ్యాపారాల్లో మునిగితేలే ఒక బడా వ్యాపారవేత్త ఒక ఆధ్యాత్మిక చిత్రం నిర్మించకూడదా?

ఎవరి వృత్తి, వ్యాపారం ఏమైనా కావొచ్చు. వారు ఏదైనా చేయొచ్చు. ఏ స్థాయికైనా ఎదగొచ్చు. కానీ, చివరికి అందరి అంతిమ గమ్యం ఆధ్యాత్మికమే అవుతుంది. ఆధ్యాత్మికానందమే అవుతుంది. 

ఆ మార్పు తప్పదు.

ఒక అలెగ్జాండర్ కావొచ్చు. ఒక అశోకుడు కావొచ్చు. ఒక చలం కావొచ్చు. ఒక మహేష్‌భట్ కావొచ్చు. అందరూ అంతిమంగా ఆధ్యాత్మికానందం వొడికి చేరినవాళ్లే.

ఈ నిజాన్ని చరిత్ర పదేపదే రుజువుచేసింది. 

క్రియేటివిటీ, స్పిరిచువాలిటీ. లేదా... ప్యాషన్, స్పిరిచువాలిటీ. ఈ రెండూ కలిసినప్పుడే మనం కోరుకున్న స్వేఛ్చ, ఆనందం మన సొంతమవుతాయి. 

ఈ నిజాన్ని కూడా చరిత్ర పదేపదే రుజువు చేసింది. 

అన్నీ వదిలేయడమే ఆధ్యాత్మికం కాదు. 

ఆధ్యాత్మికం కోసం అలా అన్నీ వదిలేయడం తప్పనిసరి అని ఏ శాస్త్రం బహుశా చేప్పదనుకుంటాను. 

నాకు తెలిసిన కొందరు చాలా ట్రెండీగా, మాడర్న్‌గా ఉంటారు చాలా విషయాల్లో. ప్రొఫెషనల్‌గా కూడా చాలా బిజీగా వుంటారు. అయితే - సమాంతరంగా వారి జీవితంలో మనం నమ్మలేని ఒక ఆధ్యాత్మిక పార్శ్వం కూడా నడుస్తుంటుంది. వీళ్లేం అన్నీ మానేసిన వృద్ధులు కారు.  

మరోవైపు - మామూలుగా యాభై, అరవై దాటితే గాని అసలు ఈ ఆధ్యాత్మికం వైపు తొంగిచూడరు 90 శాతం మంది. అసలు ఆ ఆలోచన కూడా రాదు. దానికి కనెక్ట్ కారు.   

జీవితంలో అన్నీ అయిపోయాకనో, లేదంటే జీవిత చరమాంకంలో ఏదైనా ఓ పెద్ద కుదుపు వచ్చాకనో కాకుండా... వయసులో ఉన్నప్పటినుంచే మనిషి తన మనసుని కొంత ఆధ్యాత్మికత వైపు కూడా మళ్ళించుకోగలిగితే మాత్రం... ఆ ఆనందమే వేరు. 

... అలా అని నాకనిపిస్తుంది.  

కట్ చేస్తే - 

పైనంతా ఏం రాశానో నాకే తెలీదు. అలా ఒక ట్రాన్స్‌లో రాసేశానంతే. 

కొన్ని పనులు అమ్మాయిలు చేస్తేనే మరింత బాగుంటుంది!


NOTE: నా టీమ్‌లో అసిస్టెంట్ డైరెక్టర్స్ బాయ్స్ ఆల్రెడీ ఉన్నారు. ఈ యాడ్ బాయ్స్ కోసం కాదు.  

కట్ చేస్తే - 

కొన్ని పనుల్లో అమ్మాయిలు చూపే అంత సిన్సియారిటీ, పట్టుదల అబ్బాయిలు చూపలేరు. అలాగే కొన్ని పనులు అమ్మాయిలు చేస్తేనే మరింత బాగుంటుంది. ఒక్క డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ అనే కాదు, ఎక్కడైనా. 

ఇప్పుడు అమ్మాయిలు కూడా డైరెక్టర్స్ కావాలని ధైర్యంగా ముందుకువస్తున్నారు. హిందీ, తెలుగులో ఈ మధ్య చాలా మంది అమ్మాయిలు డైరెక్టర్స్‌గా వారి మొదటి సినిమాల్ని రిలీజ్ చేసారు, కొందరు మంచి సక్సెస్ సాధించారు. 

అసిస్టెంట్ డైరెక్టర్స్‌గా అమ్మాయిలు కూడా ఇప్పుడు చాలామంది తెలుగు డైరెక్టర్స్ టీమ్స్‌లో ఉన్నారు. ఈ సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇదొక అందమైన పరిణామం కూడా. టీమ్ కొంచెం బాధ్యతాయుతంగా ఉంటుంది, కొంచెం కలర్‌ఫుల్‌గా కూడా ఉంటుంది. 

కట్ చేస్తే -  

ఇప్పుడు నేను చేస్తున్న 2 మెయిన్‌స్ట్రీమ్ ట్రెండీ యూత్ సినిమాల కోసం  - నా టీమ్‌లో కూడా ఒక నలుగురు ఫిమేల్ అసిస్టెంట్ డైరెక్టర్స్‌ను పరిచయం చేస్తూ ఎంకరేజ్ చెయ్యాలనుకొంటున్నాను. 

> వయస్సు: 18 నుంచి 28 లోపు.
> సినీఫీల్డులోకి ఎంటర్ కావాలన్న కోరిక బలంగా ఉండాలి.
> ఫిలిం డైరెక్షన్ అంటే పిచ్చి ప్యాషన్ ఉండాలి.
> సోషల్ మీడియా గురించి తెలిసి ఉండాలి.
> తెలుగు, ఇంగ్లిష్ చదవటం, రాయటం, మాట్లాడ్డం రావాలి. హిందీ కూడా వస్తే ఇంకా మంచిది. 
> హైద్రాబాద్‌లో ఉన్నవారై ఉండాలి, లేదా వెంటనే హైద్రాబాద్ వచ్చి ఉండగలగాలి. 
> ఎన్నికైన ఫిమేల్ అసిస్టెంట్ డైరెక్టర్ ట్రెయినీలకు 3 నెలలపాటు ఉచిత శిక్షణ ఇస్తాము. ప్రతినెలా స్టైఫండ్/పాకెట్ మనీ కూడా  ఇస్తాము. శిక్షణ తర్వాత, ఇప్పుడు మేం చేస్తున్న ఫీచర్ ఫిలిమ్స్ కోసం, మా టీమ్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా తీసుకుంటాం. రెమ్యూనరేషన్ కూడా ఉంటుంది.    

ఆసక్తి ఉన్న అమ్మాయిలు వెంటనే వాట్సాప్ ద్వారా మీ లేటెస్ట్ సెల్ఫీతో పూర్తిబయోడేటా పంపండి: 9989578125

ప్రాథమికంగా ఎన్నికచేసిన అమ్మాయిలను వెంటనే ఇంటర్వ్యూకి పిలుస్తాము. మీదే ఆలస్యం! 

బెస్ట్ విషెస్... 

Tuesday 10 January 2023

BREAKING NEWS... పది లక్షలకే ఫామ్‌హౌజ్!


మీరు వింటున్నది నిజమే... 

ఫామ్ హౌజ్ అనేది ఇప్పుడు మధ్యతరగతి వాళ్లకు కూడా మొట్టమొదటిసారిగా అందుబాటులోకి తెస్తున్న క్రెడిట్ మా సిస్టర్ కన్సర్న్ సంస్థ "జీపీఆర్ రియల్టర్స్ సేల్స్ హబ్" వారిదే! 

ఉద్యోగస్తులకు, చిన్న వ్యాపారులకు కూడా ఇదొక మంచి అవకాశం!!

చుట్టూ పచ్చటి ప్రకృతి, పక్కనే పారుతున్న మంజీరా నది, కాలుష్యం లేని స్వచ్చమైన వాతావరణంలో - అతి చిన్న పెట్టుబడితో - మీరూ ఒక ఫామ్ హౌజ్‌ను సొంతం చేసుకోవచ్చు. 

మీరు ఎప్పుడనుకుంటే అప్పుడు ప్రకృతితో మమేకమై - మీ కుటుంబంతో, మిత్రులతో, మీ కొలీగ్స్‌తో హాయిగా గడపొచ్చు.     

> ముంబై హైవే దగ్గర, సదాశివపేట, ఆత్మకూరులో
> 121 చదరపు గజాల్లో 1 బి హెచ్ కె ఫామ్ హౌజ్ -విత్- వాష్ రూమ్
> 30, 33, 40, 60 ఫీట్ ఇంటర్నల్ రోడ్లు
> ఫామ్ హౌజ్ చుట్టూ ఫెన్సింగ్, గేట్
> డ్రిప్ సిస్టమ్‌తో ఫ్రూట్స్ ప్లాంటేషన్
> కరెంటు, వాటర్, సెక్యూరిటీ 
> 3 సంవత్సరాల ఉచిత మెయింటెనెన్స్ 

ఇంకేం కావాలి? 

మీ జీవితంలో ఆహ్లాదం కోసం, అవసరమైన ఫన్ కోసం... ఈరోజే ఒక అద్భుతమైన ఇన్వెస్ట్‌మెంట్ నిర్ణయం తీసుకోండి!

మీరూ ఒక ఫామ్ హౌజ్‌కు యజమాని కండి!! 

పూర్తి వివరాలకు వెంటనే నాకు కాల్ చేయండి: 9989578125

- మనోహర్ చిమ్మని
ఎం డి, స్వర్ణసుధ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ 
(గ్రీన్ లీవ్స్ ఇన్‌ఫ్రాటెక్ లిమిటెడ్ గ్రూప్) 
+91 9989578125      

PS: 242 గజాల్లో 2BHK ఫామ్‌హౌజ్ ఆఫర్ కూడా ఉంది!   

సోషల్ మీడియాలో మీ పొజిషన్ ఎక్కడ?

రానున్న ఎలక్షన్స్ నేపథ్యంలో -
సోషల్ మీడియా పవర్ గురించి సంపూర్ణ అవగాహన ఉండి,
ఒక మంచి సోషల్ మీడియా స్ట్రాటెజిస్ట్ కోసం చూస్తున్న "బిగ్ క్లయింట్స్" కోసం!  

 

సోషల్ మీడియా అనేది – ప్రింట్ మీడియా, ఎలెక్ట్రానిక్ మీడియాలను ఎప్పుడో బైపాస్ చేసేసింది.

దీని పవర్, ఎఫెక్ట్ గుర్తించినవాళ్ళు దీన్ని ఎంత బాగా వాడుకోవాలో – అంత బాగా వాడుకుంటున్నారు. అనుకున్నట్టుగా ఫలితాలు సాధించి ఎంజాయ్ చేస్తున్నారు.

మరోవైపు – 
దీని పవర్ తెలియక – 
దీన్ని లైట్‌గా తీసుకున్నవాళ్ళు
అసలు పత్తాలేకుండా
అదృశ్యమైపోతున్నారు.

మీకు తెలుసా... 
ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు - 
రాజకీయాల్లో అయినా, వ్యాపారాల్లో అయినా, 
ఇంకే ప్రొఫెషన్‌లో అయినా... 
"సోషల్‌మీడియాలో మీ పొజిషన్ ఎక్కడ?" 
అన్న ఒకే ఒక్క పాయింట్ మీద 
ఆయా వ్యక్తుల భవిష్యత్తు, 
జయాపజయాలు ఆధారపడివుంటున్నాయి.  

ఆ స్థాయిలో తన పవర్ ఇప్పటికే ప్రూవ్ చేసుకుంది సోషల్ మీడియా!

ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, బ్లాగింగ్ ఎట్సెట్రా… వీటన్నిటిని కలుపుకొని మనం ముద్దుగా పిల్చుకొనే పేరే – సోషల్ మీడియా.

సోషల్ మీడియా ప్రమోషన్ అంటే – ఫేస్‌బుక్‌లోనో ట్విట్టర్‌లోనో ఏవో నాలుగు ఫోటోలు, పోస్టులు, ట్వీట్లు పెట్టడం కాదు. అన్‌ప్రొఫెషనల్ ఎడాలిసెంట్స్‌తో అదే పనిగా కాపీ పేస్టులు  చేయించుకోవడం అస్సలు కాదు.     

ఒకే ఒక్క పోస్ట్‌తో గాని, ఒక ట్వీట్‌తో గాని, 
ఒక వీడియో బైట్‌తో గాని
ఒక పెద్ద సంచలనానికి తెరలేపొచ్చు.

ఒకే ఒక్క ప్రమోషన్ స్ట్రాటెజీతో
ఇప్పుడున్న మీ పొజిషన్‌ను
వేరొక లెవల్‌కు తీసుకెళ్ళొచ్చు.

ఒక దశాబ్దంగా మీరు కలవలేని
వ్యక్తులను, వ్యవస్థలను
ఓవర్‌నైట్‌లో అతి సులభంగా
రీచ్ అయ్యే అవకాశం
ఒక చిన్న బ్లాగ్‌పోస్ట్‌తో క్రియేట్ చేయవచ్చు. 

ఇదంతా ఇప్పుడు సోషల్‌మీడియా వల్ల నిస్సందేహంగా సాధ్యమవుతోంది.   

కట్ చేస్తే –

పాలిటిక్స్‌లో ఉన్నవాళ్లకు, పాలిటిక్స్‌లో పాపులర్ కావాలనుకొనేవాళ్లకు, ఇప్పుడున్న స్థాయి నుంచి ఇంకో లెవల్‌కు వెళ్ళాలనుకొనేవారికీ... సోషల్‌మీడియా హల్ చల్ మరీ మరీ అవసరం. 

మీరు ఏ ప్రొఫెషన్‌లో ఉన్నా సరే, ఏ బిజినెస్‌లో ఉన్నా సరే – ఇప్పుడు మీరున్న స్థానం నిలబెట్టుకోవాలన్నా, ఇంకా పైకి ఎదగాలన్నా, పడాల్సినవారి దృష్టిలో మీరు పడాలన్నా, మీ క్లయింట్స్‌కు/కస్టమర్స్‌కు/ప్రజలకు అతి తక్కువ సమయంలో చేరువకావాలన్నా, ఒక పొలిటికల్ పార్టీలో టికెట్ సంపాదించుకోవాలన్నా, మీరే ఒక పార్టీ పెట్టాలన్నా... “సోషల్ మీడియాలో మీరెక్కడ?” అన్నదే మీ మొట్టమొదటి అర్హత అవుతుందంటే అతిశయోక్తి కాదు.

డాక్టర్స్, డైటీషియన్స్, బ్యూటీషియన్స్, సెలెబ్రిటీలు, ఫ్యాషన్ డిజైనర్స్, అర్కిటెక్ట్స్, రియల్టర్స్, కన్సల్టెంట్స్, న్యూ-ఏజ్ థెరపీ ప్రాక్టీషనర్స్ వంటి కొన్ని సెలెక్టెడ్ ప్రొఫెషన్స్‌వారికి... కొత్త ఐడియాలతో సరికొత్త బిజినెస్‌లను-సేవలను ప్రారంభించేవారికి కూడా సొషల్ మీడియా యాక్టివిటీ చాలా అవసరం. మీ ప్రొఫెషన్-లేదా-బిజినెస్ కనీసం 10 రెట్ల నుంచి 100 రెట్లవరకు సులభంగా పెంచుకోవచ్చు. 

ఇందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. 

కొంతమందికి సోషల్ మీడియాలో సెల్ఫ్ ప్రమోషన్ చేసుకొనే సామర్థ్యం ఉంటుంది. ఎంత బిజీలో ఉన్నా దీనికోసం ఎంతో కొంత సమయం కూడా క్రియేట్ చేసుకోగలుగుతారు. వారి ప్రొఫెషన్‌లో వారు కోరుకొన్న ఫలితాలు అద్భుతంగా ఎంజాయ్ చేస్తుంటారు.

అయితే – కొందరికి మాత్రం ఈ సామర్థ్యం ఉండదు, సమయం కూడా ఉండదు. కొందరికి ఈ సామర్థ్యం ఉన్నా, సమయం ఉండదు. ఇలాంటివారి కోసం భారీ ఫీజులు, ప్యాకేజీలతో సోషల్ మీడియా స్ట్రాటెజిస్టులు వివిధ పేర్లతో ప్రపంచమంతా పనిచేస్తున్నారు. 

ఇప్పుడిదొక పెద్ద ప్రొఫెషన్. 

దురదృష్టవశాత్తూ దీని ప్రాధాన్యం, దీని పవర్ పట్ల సరైన అవగాహన లేనివారు... ఫేస్‌బుక్‌లో ఏవో నాలుగు పోస్టులు పెట్టుకొని, వాటికి వచ్చిన మూడు లైకులు, రెండు కామెంట్స్‌తో సంతృప్తిపడిపోతుంటారు. లేదంటే - అన్‌ప్రొఫెషనల్స్‌ను ఎంగేజ్ చేసుకొని, వారు చేసే కాపీ పేస్ట్ కంటెంట్‌నే తమ సోషల్ మీడియా అంతా నింపుకొంటూ 'ఇది చాలు' అనుకొంటుంటారు.

ఈ పోటీ యుగంలో అది సరిపోదు. నిజానికి అసలు లెక్కలోకి రాదు.  

సోషల్‌మీడియా మేనేజ్‌మెంట్‌లో దేశవిదేశీ క్లయింట్స్‌తో నాకున్న “ఈలాన్సింగ్/అప్‌వర్క్” అనుభవంతో – ఇప్పుడు లోకల్‌గా – నేనూ, నా ఆధ్వర్యంలో ఒక స్కిల్డ్ టీమ్ సొషల్‌మీడియా మేనేజ్‌మెంట్ సేవలు ప్రారంభించాము.

మనోహర్ చిమ్మని  'సోషల్ మీడియా మేనేజ్‌మెంట్'...

ప్రమోషన్ స్థాయిని బట్టి, చేరుకోవాలనుకునే సెగ్మెంట్స్ పరిధిని బట్టి, ఆశించే ప్రయోజనాలు, సాధించాలనుకొంటున్న లక్ష్యాల వాల్యూను బట్టి స్టాండర్డ్ ఫీజు ఉంటుంది.

బ్రాండింగ్ కావచ్చు, పర్సనల్ ప్రమోషన్ కావచ్చు, బిజినెస్ ప్రమోషన్ కావచ్చు, ప్రొఫెషనల్ ప్రమోషన్ కావచ్చు... మీ టార్గెట్ ఆడియన్స్‌ను క్షణాల్లో మీ వైపు తిప్పుకొనే విషయంలో సోషల్ మీడియా ప్రమోషన్‌కు ఉన్న ప్రాధాన్యం తెలిసినవారు నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. 

మీ మీ రంగాల్లో మీరనుకొనేది ఏదైనా సరే, సాధించడం అసాధ్యమేం కాదు! 

**ముఖ్యంగా - రానున్న ఎలక్షన్స్ నేపథ్యంలో - సోషల్ మీడియా పవర్ గురించి సంపూర్ణ అవగాహన ఉండి, ఒక మంచి సోషల్ మీడియా స్ట్రాటెజిస్ట్ కోసం చూస్తున్న "బిగ్ క్లయింట్స్" కోసం మేము చూస్తున్నాము.**

నిర్ణయం ఇప్పుడే తీసుకోండి. నన్ను కాంటాక్ట్ చేయండి. 

మీదే ఆలస్యం…

– మనోహర్ చిమ్మని  
Social Media Strategist
Nandi Award Winning Writer, Blogger
Author of Best Seller Book "KCR - The Art of Politics"
MD, Swarnasudha Projects Private Limited

WhatsApp/Call: +91 9989578125
Email: mchimmani10x@gmail.com

ABOUT MANOHAR CHIMMANI: 

మనోహర్ చిమ్మని గురించి (తెలుగు):

About Manohar Chimmani (English): 

Saturday 7 January 2023

సమయానికి విలువ ఇవ్వలేనివారు ఎవ్వరైనా...


"టైమ్ ఈజ్ మనీ" అన్నాడు బెంజమిన్ ఫ్రాంక్లిన్. 

అమెరికా వ్యవస్థాపక పితామహులలో ఒకరు ఫ్రాంక్లిన్. తన 84 ఏళ్ళ సంపూర్ణ జీవితంలో - పొలిటీషియన్, డిప్లొమాట్, సైంటిస్ట్, రైటర్, ప్రింటర్, పబ్లిషర్... ఇలా ఎన్నో రంగాల్లో అద్భుత విజయాలు సాధించిన బహుముఖ ప్రజ్ఞాశాలి. 

ఈయనొక్కడే కాదు. ప్రపంచంలో ఏ రంగంలోనైనా అద్భుత విజయాలు సాధించినవారెవ్వరైనా సమయానికి అత్యధిక ప్రాధాన్యమిస్తారు. 

టైమ్ వేస్ట్ చేసుకునే వాడెవ్వడూ ఏదీ సాధించలేడు. 

మన చదువులకీ... సమయానికి మనం ఇచ్చే విలువ పట్ల మనకున్న స్పృహకీ... అసలు సంబంధం లేదన్నది నా వ్యక్తిగత అనుభవం. 

కట్ చేస్తే - 

మన చుట్టూ - మన దైనందిన జీవితంలో - మనకు అతి దగ్గరగా ఉండే వ్యక్తుల్లో కూడా సమయం పట్ల పెద్దగా విలువ ఇచ్చే అలవాటు లేదంటే... నష్టం వాళ్లకంటే మనకే ఎక్కువగా ఉంటుంది. 

ప్యాసివ్ స్మోకింగ్ లాగా అన్నమాట. 

సమయానికి విలువ ఇవ్వలేనివారు ఎవ్వరైనా - జీవితంలోని ఏ దశలోనైనా దేనికీ పెద్దగా విలువ ఇవ్వలేరు. ఏం జరిగినా "జస్ట్ లైట్" అనుకుంటారు. వాళ్లెంత మంచివారైనా - క్రమంగా అలా అలవాటుపడిపోతారు.  

ఇలాంటి "జస్ట్ లైట్‌"లతో ఎంత ఎక్కువ సమయం మనం గడిపితే అంత లైట్ అయిపోతుంది మన జీవితం కూడా.

ఫలితంగా - మనకు తెలీకుండానే మన జీవితంలో కూడా దారుణంగా  టైమ్ వృధా అయిపోతుంటుంది. 

చివరాఖరికి మనం తెలుసుకోవల్సింది ఏంటంటే - 

అవతలివాళ్ళ "ప్రయారిటీలో మనం లేము" అని ఫీలైన మరుక్షణం... వెంటనే కామ్‌గా తప్పుకోవడం బెటర్. 

ఎవరి ప్రయారిటీస్ వారివి. Let's respect that. 

"సోల్డ్ అవుట్" మీడియా!


తెలంగాణలో ఒకవైపు ఉద్యోగాల నోటిఫికేషన్ల వర్షం కురుస్తోంది. ఆ పాజిటివ్ ప్రభంజనం గురించి ఎలాంటి బ్రేకింగ్ న్యూస్‌లు ఉండవు. 

దాదాపు రోజుకొక కొత్త ఇండస్ట్రీస్ డీల్, రోజుకొక కొత్త ఇన్వెస్ట్‌మెంట్ ఒప్పందం రాష్ట్రంతో జరుగుతోంది.

ఆ బ్రేకింగ్ న్యూస్‌లుండవు. 

2018లో విజయవంతంగా నిర్వహించిన "కంటి వెలుగు" కార్యక్రమాన్ని ఈ జనవరి 18 నుంచి కొత్త లక్ష్యాలతో మరింత విజయవంతంగా జరుపబోతున్నారు. దేశంలో ఎవ్వరూ ఎక్కడా ఇంతవరకు తలపెట్టని ఇలాంటి మానవీయ కార్యక్రమాన్ని గురించి బ్రేకింగ్ న్యూస్‌లు ఉండవు. 

ఆదిలాబాద్ లాంటి వెనుకబడిన జిల్లాలో సాఫ్ట్‌వేర్ రంగాన్ని విస్తరిస్తున్నారు. ఇవి కాదు బ్రేకింగ్ న్యూస్‌లు. 

మరేంటి వీరికి బ్రేకింగ్ న్యూస్‌లు? 

> "ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ ఇవ్వద్దు" అని ఒక వెర్రిబాగులమనిషి మాట్లాడే మతిలేని మాటలు.
   
> "కంటివెలుగు కార్యక్రమం అనేది ముసలోళ్ళకు బాగా కళ్ళు కనిపించి కారు మీద వోటు గుద్దటానికే" అని చెప్పే చెత్త మాటలు.

> ఒకవైపు ఖచ్చితమైన అంకెలతో విడుదలచేస్తున్న నిధుల గురించి ప్రభుత్వం చెప్తోంటే - "రైతుబంధు కోసం ప్రభుత్వం దగ్గర డబ్బుల్లేవ్" అనే చెత్త పలుకులు.

గత 60 ఏళ్లలో జరగని అభివృద్ధి రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్నది ఈ మీడియా కళ్లకు కనిపించదు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యతిరేకంగా, ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎప్పటికప్పుడు కొత్త స్క్రిప్టులు రచించి ప్రసారం చేయడమే ఈ మీడియా చేసే పని. 

ఇలా చేయడం ద్వారా తాత్కాలిక లాభం వాళ్లకుండవచ్చు. కాని, ఇలాంటి గోబెల్స్ ప్రచారం వల్ల పరోక్షంగా, ప్రత్యక్షంగా ప్రజలకు ఎంత నష్టం అన్నది ఆలోచించేంత తెలివి ఈ మీడియాకు లేదు. 

"ఇది మీడియా కాదు. మోడియా!" అని మంత్రి కేటీఆర్ అన్నారంటే ఊరికే ఎందుకంటారు?  

కట్ చేస్తే - 

దేశమంతా తిరుగుతూ - సీరీస్ ఆఫ్ ప్రెస్ మీట్లతో - జాతీయ స్థాయిలో - ఇదే మీడియాతో కేసీఆర్ కబడ్డీ ఆడుకునే రోజులు ముందున్నాయి. 

గోబెల్స్ ప్రచారాలకు కూడా ఒక ఫుల్‌స్టాప్ తప్పక ఉంటుంది.     

Friday 6 January 2023

"కంటివెలుగు" పథకం ఆలోచన వెనుక...


"కంటి వెలుగు" కార్యక్రమం పైన మొన్న ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. 

జనవరి 18 నుంచి కంటి వెలుగు కార్యక్రమం మళ్ళీ ప్రారంభమవుతుంది.

ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు, సంబంధిత శాఖల అధికారుల బృందం రూపొందించిన బ్లూప్రింట్ ప్రకారం -  ఈ కార్యక్రమం కింద నిపుణులైన వైద్యులు తెలంగాణలో అందరికీ కంటి పరీక్షలు చేస్తారు. పరీక్షల అనంతరం - అవసరమైనవారికి సర్జరీ, కళ్ళద్దాలు, మందులు అందజేస్తారు.

ఇంతకు ముందు 2018లో మొదటిసారిగా విజయవంతంగా తెలంగాణలో నిర్వహించిన ఈ కార్యక్రమం ఈ సారి గిన్నిస్ రికార్డ్ అందుకోవచ్చని ఒక అంచనా. 

తాజా వార్తల ప్రకారం - తెలంగాణలో ఈ రెండో విడత కంటివెలుగు కార్యక్రమాన్ని ఖమ్మంలో ఈ నెల 18 నాడు - కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్‌ల చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించనున్నారు.  

ఆ ముగ్గురు ముఖ్యమంత్రులకు ఈ సందర్భంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కార్యక్రమం అవసరాన్ని, వివరాలను వివరించనున్నారు. 

తొలివిడత కంటివెలుగు కార్యక్రమంలో - తెలంగాణలో - 1 కోటి 54 లక్షల మందికి కంటి పరీక్ష నిర్వహించి, దాదాపు 50 లక్షల మందికి ఉచిత కళ్ళద్దాలు పంపిణీ చేశారు. ఈసారి - కంటి పరీక్షల తర్వాత - అవసరాన్నిబట్టి కనీసం ఒక 60 లక్షలమందికి ఉచితంగా కళ్ళద్దాలు అందిచే ఏర్పాట్లు చేస్తున్నారు. 

ప్రపంచంలోనే అతిపెద్ద కంటిపరీక్షా కార్యక్రమంగా కేసీఆర్ రూపొంచిన ఈ కంటివెలుగు కార్యక్రమం గిన్నిస్ రికార్డు సాధించినా పెద్ద ఆశ్చర్యం లేదు.   

కట్ చేస్తే - 

కట్ చేస్తే -    

75 ఏళ్ళ స్వతంత్ర భారత చరిత్రలో ఇలాంటి మానవీయ కార్యక్రమాన్ని ప్లాన్ చేసి, రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా నిర్వహించిన ఆనవాళ్ళు ఇప్పటిదాకా ఏ రాష్ట్రంలో కూడా లేవు. 

అరుదుగా ఏవైనా స్వచ్చంద సంస్థలు నిర్వహించే ఉచిత వైద్య శిబిరాలు, సరోజినీ దేవి కంటి దవాఖాన లాంటి హాస్పిటళ్ళు రాష్ట్రానికొక్కటి తప్ప వేరే చరిత్ర లేదు. 

కేసీఆర్ గారికి ఈ పథకం ఆలోచన రావడానికి వెనకున్న కథ గురించి గత నెలలో ఒక కార్యక్రమంలో ఉపన్యసిస్తూ వారే చెప్పారు...

గజ్వేల్‌లో తాను దత్తత తీసుకోవాలని తలపెట్టిన ఒక చిన్న గ్రామంలో ఉచిత వైద్య శిబిరం పెట్టినప్పుడు - అంత చిన్న ఊళ్ళో మొత్తం 127 మంది కంటి జబ్బుతో బాధపడుతున్నట్టు తెలిసింది. వారిలో 27 మంది పిల్లలు! 

పిల్లలు తమ కళ్ళు బాగా పనిచేయటం లేదని తెలుసుకోలేరు. పెద్దలు తెలుసుకొనేటప్పటికి ఆలస్యం అవుతుంది. ఇదంతా తెలియక, వాళ్ళు బాగా చదవటంలేదని అటు స్కూళ్లో, ఇటు ఇంట్లో పిల్లలను బాధిస్తారు. ఎంత దారుణం? 

తమ కళ్ళకు ఇబ్బంది ఉందని వృద్ధులు ఇంట్లో తమ పిల్లలకు చెప్పుకోలేని పరిస్థితులు మన కళ్ళముందే చూస్తున్నాం. ఒకవేళ చెప్పినా - ఎంత శాతం మంది ఆ విషయాన్ని తమ ప్రయారిటీలో లిస్టులో పెట్టుకొని తమ తల్లిదండ్రులను కంటి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తున్నారు? "ఇప్పుడంత తొందరేముంది?" అని అనేవాళ్లను ఎంతమందిని మనం చూడట్లేదు?  

కేసీఆర్ "కంటి వెలుగు" పథకం ఆలోచన వెనుక ఇంత బాధాకర నేపథ్యం ఉంది.

కట్ చేస్తే - 

ఈ కార్యక్రమాన్ని కేసీఆర్ రాజకీయాల కోసం, ఎన్నికల్లో లబ్ధి కోసం చేస్తున్నారని కొందరు అనడం అవివేకం. మానవత్వం లేకపోవడం. 

ఇంకొందరైతే మరీ తెలివితక్కువగా "వృద్ధులకు బ్యాలెట్ పేపర్లో కారు మీద వోటు గుద్దటానికి కళ్ళు బాగా కనిపించాలని కేసీఆర్ రూపొందించిన కార్యక్రమం ఇది" అని అనటం ఎంత అమానవీయమైన చిల్లర మాట! 

కేసీఆర్ ఆలోచనల స్థాయికి కనీస దరిదాపుల్లోకైనా చేరుకొనే స్థాయి వీరికి ఈ జన్మలో వస్తుందా? 

Thursday 5 January 2023

ఒక యాక్సిడెంట్ జీవితాన్ని తల్లక్రిందులు చేస్తుంది!


థాంక్స్ టు ఫేస్‌బుక్... 

బంజారా హిల్స్‌లోని పిజ్జా కార్నర్ ఎదురుగా నాకు భారీ యాక్సిడెంట్ అయి సరిగ్గా ఇవ్వాటికి పదేళ్ళు!   

ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుందంటారు. కాని, ఇలాంటి ఒక్క ఊహించని సంఘటన జీవితాన్ని తల్లక్రిందులు చేస్తుంది. 

నేనే పెద్ద ఉదాహరణ.  

బయటికి అంతా మామూలుగానే కనిపిస్తాను కాని, ఎవరైనా తోడు లేకుండా రోడ్ క్రాస్ చెయ్యలేను. మెట్లు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకోవాలి. అత్యవసరమైతే తప్ప రెండు మూడు ఫ్లోర్లు ఎక్కడం మానుకోవాలి. 

"ఎట్టిపరిస్థితుల్లో నీ చేతిలో ఎల్బో స్ట్రెచ్ (స్టిక్) ఉండాలి. లేకపోతే ప్రమాదం" అని డాక్టర్స్ ఎంత చెప్పినా నేను ఆ పనిచేయలేకపోయాను. 

డాక్టర్స్ చెప్పింది నిజమే... ఆ స్టిక్ చేతిలో ఉంటే ఎదుటివాళ్ళు, పక్కవాళ్ళు, వెహికిల్స్ మీద వచ్చేవాళ్ళు కొంచెం అలర్ట్ అయ్యే అవకాశముంటుంది... ఇతనికేదో ప్రాబ్లం ఉందని. కాని, ఇప్పటికీ నేనా పని చేయలేకపోతున్నాను.  

తల, చేతులకు, ఛాతీకి అయిన గాయాలు ఓకే. రిఫ్లెక్షన్స్ పెద్దగా లేవు. కొత్త కంప్లెయింట్స్ లేవు. అయితే - నా ఎడమ మోకాలి నుంచి క్రిందివరకు మాత్రం... అన్నీ నట్లూ బోల్టులే. ఇప్పటికీ లోపలే ఉన్నాయి.

నిజంగా "పునర్జన్మ" అని ఇప్పుడే మొట్టమొదటిసారిగా అనుకుంటున్నాను. 

కట్ చేస్తే -

ఈ పదేళ్ళలో నేను చాలా సాధించాల్సింది. కాని, ఏం చేయలేకపోయాను. ఏవో కొన్ని నేను సాధించాను అని అందరూ అనుకునేవాటికి నా దృష్టిలో అసలు లెక్కేలేదు. అవి లెక్కలోకి రావు. 

అలాగని అత్యాశలు, దురాశలేం కావు. అన్నీ నేను సులభంగా చేయగలిగినవే. కాని, చేయలేకపోయాను.  

నేననుకున్న స్థాయిలో ఏదీ నేను సాధించలేకపోవడానికి కారణం... నా మైండ్‌సెట్. నా పనికిరాని ప్రిన్సిపుల్స్. నా చుట్టూ నేను గీసుకున్న గిరి. నేను నమ్మిన వ్యక్తులు, లేదా నన్ను నమ్మించిన వ్యక్తులు. నా తప్పుడు నిర్ణయాలు. 

వెరసి... మొత్తంగా ఎన్నో నిద్రలేని రాత్రులు. 

నా ఎదుటివారిని నేను ఎప్పుడూ నాకంటే ఒక పదింతలు ఉన్నతులుగా భావిస్తాను, ఆ గౌరవం ఇస్తాను. అయినా సరే - వర్క్ కల్చర్ పరంగా గాని, సామర్థ్యం పరంగా గాని మన ముందు చేతులు కట్టుకొని నిల్చోడానికి కూడా సరిపోని వ్యక్తులతో మాటలు, అవమానాలు, నీతి వాక్యాలు. 

ప్రతిరోజూ ఈ కామెడీ ఇప్పటికీ వింటున్నాను. 

పునర్జన్మ అని ఇప్పుడే అనుకున్నాను కాబట్టి... కొంతైనా నేనుగా ఉండాలి.ఉన్నన్నాళ్ళూ నేనుగానే బ్రతకాలి. ప్రేమగానే బ్రతకాలి. 

మిగిలిందంతా వుట్టిదే. ట్రాష్.  

Life is now. Press play.

ఒక లీ క్వాన్ యూ, ఒక కేసీఆర్!


గత 8 సంవత్సరాల్లో టీఎస్‌ఐపాస్‌, ఐటీ, ఐటీ అనుబంధ రంగాల్లో తెలంగాణ రాష్ట్రానికి 3.30 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. 

కొత్తగా ఏర్పడిన ఒక రాష్ట్రంలోనే ఇది సాధ్యమైనప్పుడు - అదే 8 ఏళ్ళ సమయంలో - దాదాపు ప్రపంచంలోని ముఖ్యమైన అన్ని దేశాలు చుట్టివచ్చిన ప్రధాని మోదీజీ నేతృత్వంలో కనీసం ఇంకో వంద రెట్లు ఎక్కువ పెట్టుబడులు ఈ దేశానికి వచ్చి తీరాలి. 

కాని, వాస్తవం మరోలా వుంది. 

ఉన్న విదేశీ కంపెనీలు పోతున్నాయి. లక్షల మంది భారతీయులు విదేశాలకు వలసపోతున్నారు.  

కట్ చేస్తే - 

రెండే రెండేళ్ళలో మేం దేశమంతా కరెంటు ఇస్తాం, నీళ్ళూ అందిస్తాం అని తిరుగులేని సవాల్ విసురుతున్నారు కేసీఆర్. 

తెలంగాణలో సాధ్యమైన రైతుకి 24 గంటల ఉచిత విద్యుత్తు, రైతు బంధు, రైతు భీమా వంటివి యావత్ దేశంలోనూ ఎందుకు సాధ్యం కాదు అని కేసీఆర్ అడుగుతున్న ప్రశ్నకు ఢిల్లీలో కూర్చుని ప్రభుత్వం నడిపిస్తున్నవారివద్ద జవాబు లేదు. వారి ఫాలోయర్స్, అభిమానుల దగ్గర కూడా - మతిస్థిమితం తప్పిన ఒకానొక మందమెంటాలిటీ ఉపయోగించే వాట్సాప్ ఆయుధం తప్ప వాస్తవాన్ని చెప్పే అధికారిక గణాంకాలు లేవు.  

ఎంతసేపూ రాజకీయాలే కాదు. ప్రపంచంలో ఏ దేశం కంటే తక్కువకాకుండా అన్నిరకాల వనరులుండి కూడా, సిగ్గుచేటైన విధంగా 75 ఏళ్ళుగా ఇంకా ఒక "అభివృద్ధిచెందుతున్న దేశం"గానే ఉన్న మన దేశాన్ని ఒక సింగపూర్ లాంటి ధనికదేశంగానో... అమెరికా, చైనా వంటి శక్తివంతమైన దేశాల సరసననో చేర్చగల విజన్, సత్తా ఉన్న నాయకుడు ఇప్పుడు మన దేశానికి కావాలి. 

ఇది డిజిటల్-సోషల్ యుగం. మనిషి జీవితంలోని అన్ని కోణాల్లో ఎన్నో మార్పులొచ్చాయి. ఆ మార్పు మన దేశంలోని రాజకీయాల్లో కూడా రావాల్సిన సమయం వచ్చేసింది. 

అలాంటి ఒక గుణాత్మక మార్పు కోసం - మరోసారి మరొక మహోజ్వల ఉద్యమానికి శ్రీకారం చుట్టిన నాయకుడు మన కేసీఆర్ కావడం మనం గర్వించాల్సిన విషయం.  

కేసీఆర్‌కు అవసరమైన స్థాయిలో మెదళ్లను ఉపయోగించి, ఈ మహాయుద్ధం విషయంలో ఆయనకు అవసరమైన తోడ్పాటుని అందించగల విద్యావంతులు, రచయితలు, మేధావులు ఆయన పిలుపు కోసం యుద్ధక్షేత్రంలో సైనికుల్లా సర్వదా సిధ్ధంగా ఉన్నారు.    

దేశ రైతాంగంలోనూ, ఇతర అన్ని రంగాల్లోనూ తెలంగాణ మాడల్ అభివృద్ధి...,  ఈ దూకుడు, ఈ మార్గదర్శకత్వం... జాతీయస్థాయిలో రావటం కోసమే ఇప్పుడు కేసీఆర్ తలపెట్టిన మహాయజ్ఞం... బీఆర్‌యస్ అని ఇప్పుడు దేశమంతా స్పష్టమైంది. భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడుగా ఢిల్లీలో కేసీఆర్ పెట్టబోయే ఒక్క ప్రెస్ మీట్‌తో మరింత విస్పష్టమౌతుంది.     

బీఆర్‌యస్ విస్తరణ ఏపీ నుంచే ఆరంభం కావడం విశేషం. 

బీఆర్‌యస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులైన తోట చంద్రశేఖర్ గారికి హార్దిక శుభాకాంక్షలు. 

Wednesday 4 January 2023

"టీ హబ్"కు పర్యాయపదం కేటీఆర్!

 

ఒక కొత్త రాష్ట్రం సాధించిన అంతర్జాతీయ స్థాయి విజయం... టీ-హబ్. 

"కన్వర్జ్, కనెక్ట్, క్రియేట్" టాగ్‌లైన్‌తో ప్రారంభమైన "టీ హబ్"కు పర్యాయపదం కేటీఆర్. 

ఆయనే దానికి ఆక్సిజన్, హార్ట్, ఎనర్జీ అన్నీ. ఆయనే దానికి బ్రాండ్ అంబాసిడర్, ఆయనే దానికి తిరుగులేని యు యస్ పి.

ప్రభుత్వం ఏదున్నా, ఎవరిదున్నా, ఏ పార్టీదున్నా... ఇలాంటి తిరుగులేని ప్రజోపయోగమైన అభివృద్ధి సంక్షేమ పథకాల ప్రపోజల్స్ పెట్టడానికి ప్రతి ప్రభుత్వంలోని ప్రతి శాఖలోనూ కార్యశూరులు, ఎంత్యూజియాస్ట్స్ కొందరుంటారు.

కాని, ఆ ప్రపోజల్స్‌ను అర్థం చేసుకొని, వాటిని ప్రోత్సహించే నాయకులే ఉండరు. చెబితే వినరు. చెప్పినా వారికి అర్థం కాదు. అర్థం చేసుకొనే ప్రయత్నం చెయ్యరు. 

వారి ఎజెండాలు వేరే ఉంటాయి. 

కట్ చేస్తే -

రాజకీయాల్లో ఈ రొటీన్‌ను బ్రేక్ చేసిన రికార్డు కేసీఆర్‌ది. 

తెలంగాణ రాష్ట్రం సాధించడమే ఒక రికార్డు. సాధించిన రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తూ - ఇప్పటివరకూ కనీ వినీ ఎరుగని అభివృద్ధి సంక్షేమ పథకాలతో - తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతూ ముందుకెళ్తుండటం ఇంకో రికార్డు. 

కేసీఆర్ మార్గదర్శకత్వంలో ఐటి, ఇండస్ట్రీస్, స్టార్టప్స్ ఎట్సెట్రా రంగాల్లో - దేశంలోనే కాదు, ప్రపంచస్థాయి జెయింట్స్‌ను తెలంగాణ వైపు తలతిప్పి చూసేలా చేస్తున్న కేటీఆర్ అతనే ఒక మ్యాజిక్. 

ఆకాశమే హద్దుగా అంతర్జాతీయ స్థాయి గుర్తింపులు, అవార్డు, రివార్డులు ఊరికే రావు.    

కేటీఆర్ - ఒక బ్రాండ్. 

ఆ బ్రాండ్ లేకుండా ఇన్ని వందల కోట్ల, వేల కోట్ల  ఇన్వెస్ట్‌మెంట్స్ లేవు... ఈ విజయాల్లేవు. ఇది ఎవరైనా సరే ఒప్పుకొని తీరాల్సిన నిజం. 

దాదాపు వారంలో ప్రతిరోజూ ఏదో ఒక అచీవ్‌మెంట్. ఏదో ఒక ఇన్వెస్ట్‌మెంట్ రికార్డ్ అవుతోందంటే అతిశయోక్తి కాదు. 

రాకెట్ స్థాయిలో నింగికి దూసుకెళ్ళిన ఏడేళ్ళ టీ హబ్ సక్సెస్ స్టోరీకి కర్తలైన కేటీఆర్ గారికి, వారి బృందంలోని ప్రతి ఒక్కరికీ అభినందనలు.   

Tuesday 3 January 2023

"యాక్టర్స్ ఆడిషన్" కొత్తవారికే... జనవరి 8, 9, 10 తేదీల్లో!


నేను ఇప్పటివరకు డైరెక్ట్ చేసిన సినిమాల్లో - కనీసం ఒక 20 మంది ఆర్టిస్టులను ప్రధానపాత్రల్లో పరిచయం చేశాను. కనీసం ఇంకో 40 మందిని సపోర్టింగ్ రోల్స్‌లో పరిచయం చేశాను. 

వాళ్లందరి పేర్లు ఇప్పుడు నేను చెప్పడం లేదు. కాని, బహుశా రేపటి నుంచి నేను ప్రారంభిస్తున్న ఒక సీరీస్ ఆఫ్ షార్ట్ బ్లాగ్స్ ద్వారా మీకే వారందరి పేర్లు, వారంతా ఇప్పుడు ఎక్కడెక్కడ ఏ రేంజ్‌లో ఉన్నారో తెలుస్తుంది. 

ఫీల్డులో వున్నవాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలీదు కాని - నాలాగ, అలా పైపైన ఐనా ఫీల్డులో ఉన్నవాళ్లకు, కొత్తవాళ్ళకు కొన్ని నిజాలు తెల్సుకోవడం తప్పకుండా ఆసక్తికరంగా ఉంటుందని నా నమ్మకం. 

కట్ చేస్తే -

ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత 2 కొత్త సినిమాలు చేస్తున్నాను. ఆ సినిమాల ప్రి-ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. 

ఈ నేపథ్యంలో - కొత్త హీరోహీరోయిన్ల కోసం, సపోర్టింగ్ ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ కోసం మాత్రమే ఒక చిన్న యాడ్ ఇచ్చాము. ఏజ్ లిమిట్స్ చెప్పాం. 

8, 9, 10 తేదీల్లో ఆడిషన్ ఉంటుంది. 

అందులో స్పష్టంగా - "ఒక 3 లేటెస్టు ఫోటోలు మాత్రమే వాట్సాప్ ద్వారా పంపించండి" అని చెప్పాం. రీల్స్, వీడియోలు వద్దని చెప్పాం. కాల్స్ చెయ్యొద్దు అని చెప్పాం.  

అయినా సరే - 90% మంది కాల్స్ చేస్తున్నారు. లెక్కలేనన్ని ఫోటోలు పంపిస్తున్నారు. రీల్స్, వీడియోలు పంపిస్తున్నారు. "రిప్లై ఇవ్వండి" అని దాదాపు దబాయిస్తున్నారు. 😊

యాడ్‌ను అసలు పూర్తిగా చదవకుండా, పర్‌ఫెక్ట్‌గా ఫాలో అవ్వకుండా మీరు చేసే ఇవన్నీ మిమ్మల్ని ఆడిషన్‌కు ఎన్నిక కాకుండా చేస్తాయి. ఈ విషయం కూడా యాడ్‌లో స్పష్టంగా ఉంది. 

All the best! 

Monday 2 January 2023

కొత్త సింగర్స్‌ను ఎందుకు పరిచయం చేస్తున్నాం?


ఇండస్ట్రీకి నేను పరిచయం చేసిన మా మ్యూజిక్ డైరెక్టర్ ప్రదీప్‌చంద్రకు నా లేటెస్ట్ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ 'డే వన్' నుంచి నేనొక విషయం చెబుతూ వస్తున్నాను ...

"మన సినిమాలో పాటలకోసమని నువ్వు ఇండస్ట్రీలోని టాప్ సింగర్స్‌తోనే పాడించాలని పొరపాటున కూడా అనుకోకు. అలా .. టాప్ సింగర్స్ పేర్లు నీ ఆల్బమ్‌లో ఉంటేనే నీకు పేరొస్తుందనీ, మ్యూజిక్ కంపెనీలవాళ్లు ఆడియో రైట్స్ కొనుక్కోడానికి ఎగబడతారనీ అస్సలు అనుకోకు. నిజంగా మన పాటలు సెన్సేషనల్‌గా బాగుంటే - మనం వద్దన్నా అవి పబ్లిక్‌లోకి వెళ్లిపోతాయి. లిరికల్స్‌కి మిలియన్స్‌లో వ్యూస్ వస్తాయి. మన సినిమాకు మంచి సపోర్ట్ అవుతాయి."    

కాబట్టి -

"నువ్వు కొత్త సింగర్స్‌ను పరిచయం చేసి, వాళ్లను నీ ద్వారా టాప్ సింగర్స్‌ను చెయ్యి!" అని ప్రదీప్‌చంద్రకు చెప్పాను.

అలాగని నేను పాత సింగర్స్‌కు వ్యతిరేకం ఏం కాదు.

నా గత సినిమాల్లో - నాకిష్టమైన యస్ పి బాలు నుంచి చిత్ర, కార్తీక్, యస్ పి చరణ్, టిప్పు, పాప్ శాలిని, మాలతి, శాలిని సింగ్, సౌరభ్ శ్రీవాస్తవ, ర్యాప్ విశ్వ, సౌమ్య, ప్రదీప్ సింగ్, గీతామాధురి మొదలైన ఎందరో టాప్ సింగర్స్‌తో పాడించాను.

ఆ నాస్తాల్జియా గురించి మరోసారి రాస్తాను...  

కట్ బ్యాక్ టూ మన న్యూ సింగర్స్ -  

"కొత్త సింగర్స్‌ను పరిచయం చేద్దాం" అని నేను మా మ్యూజిక్ డైరెక్టర్ ప్రదీప్‌చంద్రతో చెప్పడానికి చాలా కారణాలున్నాయి.  

ఇప్పటి ప్రేక్షకులు, శ్రోతలు ఎప్పటికప్పుడు కొత్తదనం కోరుకొంటున్నారు. కొత్త గొంతులు వినాలనుకొంటున్నారు. బాగుంటే రాత్రికి రాత్రే మిలియన్స్‌లో వింటున్నారు. రికార్డులు బ్రేక్ చేస్తున్నారు. 

సినిమాలతో, భాషతో సంబంధం లేకుండా - ఒకే ఒక్క "ఇండిపెండెంట్ మ్యూజిక్ వీడియో"తో ఓవర్‌నైట్‌లో టాప్ సింగర్స్ అయిపోతున్న రోజుల్లో మనమున్నాం. 

ఈ కోణంలో ఆలోచించినప్పుడు - టాలెంట్ బాగా ఉండి, అవకాశం కోసం ఎదురుచూస్తున్న కొత్త సింగర్స్‌ను ఎందుకు పరిచయం చెయ్యకూడదన్నది నా పాయింట్. 

అలాగే - ఇప్పటికే పరిచయమైనా - రకరకాల కారణాలవల్ల, టాలెంట్ ఉండీ పైకి రాలేకపోతున్న "అప్‌కమింగ్ సింగర్స్‌"ను కూడా వీలయినంతగా ఎంకరేజ్ చెయ్యాలన్నది నా ఇంకో ఆలోచన. 


మా కొత్త ప్రాజెక్టులకోసం... ఈ నెల 8, 9, 10 తేదీల్లో "న్యూ సింగర్స్" ఆడిషన్స్ కోసం మా మ్యూజిక్ మ్యాజిక్ ప్రదీప్‌చంద్ర మొన్ననే ఒక యాడ్ రిలీజ్ చేశాడు.

ఈ అవకాశాన్ని కొత్త సింగర్స్ తప్పక వినియోగించుకొంటారని నా నమ్మకం. 

ఆడిషన్స్‌లో ఎన్నికైన కొత్త సింగర్స్‌ను - కేవలం మా సినిమాలో పాటల ద్వారా మాత్రమే కాకుండా, మా సీరీస్ ఆఫ్ "ఇండిపెండెంట్ మ్యూజిక్ వీడియో"ల ద్వారా కూడా  పరిచయం చేస్తాము. 

యు యస్, యు కె, కెనడా, ఆస్ట్రేలియా, దుబాయి వంటి దేశాల్లో - మా కంపెనీ నుంచి జంప్‌స్టార్ట్ కాబోతున్న "గ్రాండ్ గాలా మ్యూజిక్ ఈవెంట్స్"లో కూడా మేము పరిచయం చేసే కొత్త సింగర్స్‌కు అవకాశాలు అందిస్తాము.

మీడియాలో, సోషల్ మీడియాలో ఊహించని రేంజ్‌లో వారిని పాపులర్ చేస్తాము.     

Above all - 

అతి కొద్దిరోజుల్లోనే మా కొత్త సినిమాను మ్యూజిక్ రికార్డింగ్‌తోనే ప్రారంభిస్తున్నాం! 

ఆ ఓపెనింగ్ రోజు స్టూడియోలో పాడేది మీరే కావచ్చు, చెప్పలేం... 

"ఇప్పటి టాప్ సింగర్స్ అంతా కూడా ఒకప్పుడు కొత్త సింగర్సే" అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఆడిషన్‌కు అప్లై చేయండి. కాన్‌ఫిడెంట్‌గా రండి.

Best wishes to all the Passionate New Singers out there...