Friday 24 February 2017

హరహరమహాదేవ్!

మా ఇంటి దేవుడు వేములవాడ రాజన్న.

శివుడు.

ఇక, శివరాత్రి అంటే నాకు వెంటనే వరంగల్‌లో నా చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి.

పొద్దున్నే స్నానం, శివునికి దండం పెట్టుకోడం, అమ్మ చేసిన ప్రత్యేక ప్రసాదం, ఉడికించిన కందగడ్డలు .. ఇలా ఎన్నో.

ఇవన్నీ ఎలా ఉన్నా, శివరాత్రికి మా వీధిలో అందరూ ఉపవాసంతో జాగరణ చేసేవాళ్లు. గ్రూపులు గ్రూపులుగా.

భక్తి భక్తే .. కానీ తెల్లారేవరకు ఎలా జాగరణ చేయాలి అన్నది అసలు కొశ్చన్.

ఆడాళ్లు కబుర్లు చెప్పుకుంటూ, మగాళ్లు పేకాట ఆడుకుంటూ, చిన్న పిల్లలు ఏవేవో ఆటలాడుకుంటూ జాగరణ చేసేవాళ్లు. కొంచెం ఎదిగిన కుర్రాళ్లు మాత్రం, ఆరోజు సినిమాహాళ్లలో సెకండ్ షో తర్వాత ప్రత్యేకంగా వేసే రెండు మిడ్‌నైట్ షో లకు వెళ్లేవాళ్లు.


కట్ టూ అసలు పాయింట్ - 

శివరాత్రి అనగానే ఇప్పటికీ నాకు బాగా గుర్తొచ్చేవి రెండు: ఒకటి, నేను చిన్నప్పుడు నాన్ డిటెయిల్డ్ లో చదువుకున్న శివభక్తుడు గుణనిధి కథ. రెండు, బాపు గారు తీసిన భక్తకన్నప్ప.

గుణనిధి, కన్నప్ప .. ఇద్దరూ హార్డ్‌కోర్ శివభక్తులే.

వాళ్ల రేంజ్‌లో నేను కష్టాలు పడకపోవచ్చు కానీ, శివుడిపట్ల భక్తి విషయంలో మాత్రం ఇప్పుడు నా సిన్సియారిటీ సేమ్ టూ సేమ్.

ఇది మా ఇంటి దేవుడైన శివుడికి తెలుసు. నాకు తెలుసు.

కాకపోతే, మొన్నటిదాకా మా ఇంటిదేవుడైన శివుడ్ని కాస్త విస్మరించాను. ఆయన్నొక్కన్ననే కాదు. అసలు భక్తిమీదనే భక్తిలేదు నాకు ఇటీవలివరకూ.

నాలో ఈ భక్తి అనేది ఎంటరయ్యాక, ముందు కొంచెం సిన్సియర్‌గా నేను కనెక్ట్ అయ్యింది షిర్డీ సాయిబాబాకు. ఎందుకో నాకే తెలీదు. షిర్డీ సాయిబాబాకు, నాకూ మధ్య చాలా నడిచింది. అదంతా ఒక అద్భుతమైన పుస్తకంగా కూడా రాశాను. అయితే, ఆ పుస్తకాన్ని ఎప్పుడు బయటికి తెస్తానో నాకే తెలియదు.    

ఈమధ్యకాలంలో నాలో బాగా గాఢతను పెంచుకొంటున్న ఈ భక్తి ఒక మూఢత్వం కాదు. ఇటీవలివరకూ నేను విస్మరించిన ఒక క్రమశిక్షణ.

"రెలిజియన్ ఈజ్ ఏ మ్యాన్ మేడ్ థింగ్" అన్న నిజం నాకు తెలుసు. 'దేవుడు' అన్న కాన్సెప్ట్ అందులో ఒక భాగం అని కూడా నాకు తెలుసు.

అయినా ఈ పోస్ట్ రాస్తున్నాను.

చాలామంది నవ్వుకుంటారని కూడా నాకు తెలుసు.

అయినా నేనీ పోస్ట్ రాస్తున్నాను.

ఎందుకలా అంటే నేనిప్పుడేం చెప్పను.   

అది ఎవరికివాళ్లకు అనుభవం మీద మాత్రమే తెలుస్తుంది.

జీవితంలో ఎవ్వరు ఎంత ఎదిగినా, ఎగిరెగిరిపడ్దా, ఎన్ని లాజిక్కులు మాట్లాడినా, ఎంత ఈగోతో చెలరేగినా .. అందరూ చివరికి ఏదో ఒక శక్తికి సరెండర్ అవ్వాల్సిందే.

ఆ శక్తికి మనం పెట్టుకొనే పేరు ఏదైనా కావొచ్చు. కానీ, సరెండర్ అవ్వక మాత్రం తప్పదు.

అదే జీవితం. అదే ఆధ్యాత్మికమ్.

ఆధ్యాత్మికంలో ఉండే ఆ కిక్కే వేరు. అందుకే, మహా రచయిత చలం లాంటివాడు కూడా చివరికి రమణమహర్షి ఆశ్రమం చేరక తప్పలేదు. 

Wednesday 22 February 2017

కొన్ని మనమే నమ్మలేం!

ఎంత వద్దనుకున్నా కొన్ని నిర్ణయాలు, అనుభవాలు మన జీవితంలో మళ్ళీ మళ్ళీ రిపీటవుతుంటాయి. మనచేతుల్లో ఏదీ ఉండని పరిస్థితిని క్రియేట్ చేస్తూ.

ఇలాంటివాటిని నేను అస్సలు నమ్మను. ఇప్పటికి కూడా.

మనలోనో, మన ప్రయత్నంలోనో, మన నిర్ణయంలోనో ఉంటుంది తప్పు. మన పనివిధానంలోనో, మన చుట్టూ మనం క్రియేట్ చేసుకొన్న వాతావరణంలోనో ఉంటుంది తప్పు.

ఈ తప్పుని గుర్తించడం అంత ఈజీ కాదు.

గుర్తించినా, చాల్లాసార్లు మన ఈగో ఒప్పుకోదు. మనకిలాంటి ఈగో ఉందన్న నిజాన్ని మన మనసొప్పుకోదు.

అయితే, ఈ లాజిక్కులెలా ఉన్నా, ఈ నిజాల్ని ఒప్పుకొనే సమయం కూడా మనకొస్తుంది. కానీ అప్పటికే మన జీవితంలో చాలా విలువైన సమయాన్ని మనం కోల్పోయుంటాము.

ఇష్టం లేకపోయినా సరే, అప్పుడు చెప్తాము. ఒక్కటే మాట.

సరెండర్.

దేవుడు గుర్తుకొస్తాడు.

ఇలా మనల్ని సరెండర్ చేయించగలిగే శక్తి ఈ ప్రపంచంలో ఒకటిరెండు విషయాలకే ఉంది. వాటిలో ప్రధానమైనది ..

డబ్బు.

జీవితంలో ఏం జరిగినా జాంతానై. డబ్బు డబ్బే! ఈ ఒక్కవిషయంలో ఎలాంటి ఫీలింగ్స్‌కు తావులేదు. బంధువులైనా, మిత్రులైనా, శత్రువులైనా, శ్రేయోభిలాషులైనా.

అనుభవిస్తేనేకానీ తెలీని నిజం మన జీవితంలో ఇదొక్కటే.

డబ్బుదగ్గర ఏ లాజిక్కులూ, ఏ నమ్మకాలూ, ఏ రిలేషన్లు పనిచేయవు. నిలవవు.

అస్సలు నమ్మలేం.

దటీజ్ ద పవరాఫ్ డబ్బు! 

ఓ నలుగురు లైక్‌మైండెడ్ కలిస్తే చాలు!

లైక్‌మైండెడ్ చిన్న ఇన్వెస్టర్లు
ఓ నలుగురు కలిస్తే చాలు.
ఇప్పుడు .. ఒక సినిమా చేయొచ్చు.
ఒక వెబ్ సీరీస్ కూడా చేయొచ్చు!

కట్ చేస్తే - 

ఒక టీనేజ్ కుర్రాడిలా ఇప్పుడు నేనేదో కొత్తగా ఓ గాళ్ ఫ్రెండ్‌ను వెదుక్కోడానికో, వెంటపడటానికో ఫేస్‌బుక్‌లో లేను.

నా సినిమా ప్రొఫెషన్‌కు సంబంధించిన నెట్‌వర్కింగ్ కోసమే నేనిక్కడున్నాను. నాదంటూ ఒక లైక్‌మైండెడ్ టీమ్‌ను ఎప్పటికప్పుడు తయారుచేసుకోవడం కోసమే నేనీ సోషల్ మీడియాలో ఉన్నాను.

నా ఇతర ప్రొఫెషన్లు, ఆసక్తులన్నీ ప్రస్తుతానికి సెకండరీ.

ఇది వివరణ కాదు. వాస్తవం.

కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ కోసం నేను ఎప్పటికప్పుడు విడిగా ఆడిషన్స్ ఎనౌన్స్ చేస్తుంటాను. అప్పుడు మాత్రమే ఆడిషన్స్‌కు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

నేను ప్రొడ్యూసర్స్ చుట్టూ తిరగను. నాక్కావల్సిన ప్రొడ్యూసర్స్‌ను, కోప్రొడ్యూసర్స్‌ను, ఇన్వెస్టర్స్‌ను నేనే క్రియేట్ చేసుకొంటుంటాను.

ఓ నలుగురు లైక్‌మైండెడ్ ఇన్వెస్టర్స్ కలిస్తే చాలు. వాళ్లే నా ప్రొడ్యూసర్స్. అదే నా ప్రొడక్షన్ కంపెనీ. అదే నా దేవాలయం.

ఇప్పుడు నాక్కావల్సింది కేవలం ఒకరిద్దరే. ఇన్వెస్ట్‌మెంట్ కూడా చాలా తక్కువ.

మిగిలిందంతా నేను చూసుకుంటాను.

తక్కువ స్థాయిలోనైనా సరే, మీరొకవేళ "సినిమా ఇన్వెస్ట్‌మెంట్" మీద గానీ, "వెబ్ సీరీస్" మీద గానీ ఆసక్తి ఉన్న కొత్త "ఇన్వెస్టర్‌లు", "ఇన్వెస్టర్ ఆర్టిస్టులు" గానీ అయితే .. వెంటనే ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నట్లైతే .. మీ ఆసక్తి వివరాలు తెలుపుతూ, మీ మొబైల్ నంబర్ ఇస్తూ, నా ఫేస్‌బుక్‌లోగానీ, ట్విట్టర్‌లోగానీ నాకు మెసేజ్ పెట్టండి.

లైక్‌మైండెడ్ అయితే చాలు. నేనే మీకు కాల్ చేస్తాను.

లెట్స్ వర్క్ టుగెదర్!

కలిసి పని చేద్దాం. కలిసి ఎదుగుదాం.

Tuesday 21 February 2017

వన్ షాట్ .. టూ ఫిలింస్!

కోపరేటివ్ ఫిల్మ్ మేకింగ్.
రెనగేడ్ ఫిల్మ్ మేకింగ్.
గొరిల్లా ఫిల్మ్ మేకింగ్.
వెరసి, మొత్తం 20 రోజుల షూటింగ్.

మైక్రో బడ్జెట్.
కోట్లు కాదు, కొన్ని లక్షలే.

కొత్త/అప్‌కమింగ్ ఆర్టిస్టులు.
కొత్త/అప్‌కమింగ్/సీనియర్ టెక్నీషియన్లు.

డిమానెటైజేషన్.
పాత నోట్లు, కొత్త నోట్లు.
బ్లాక్, వైట్, అదీ, ఇదీ, ఇంకేదేదో.
మ్యాటర్ ఓవర్.

మార్చిలో ప్రారంభం.
జూన్‌లో రిలీజ్.

మల్టిప్లెక్సెస్‌లో.
యూకే, యూఎస్‌లో కూడా.

వన్ ప్లాన్, వన్ బడ్జెట్.
బట్ .. రెండు సినిమాలు.
బైలింగువల్.
ఒక తెలుగు సినిమా. ఒక టింగ్లిష్ సినిమా.

ప్రిప్రొడక్షన్ వర్క్ ఇన్ ఫుల్ స్వింగ్!

నిజంగా ఆసక్తి ఉండి,
చిన్నస్థాయిలోనైనా సరే,
వెంటనే కమిట్ అవ్వగల
ప్యాషనేట్ ఇన్వెస్టర్లు,
ఇన్వెస్ట్ చేయగల ఆర్టిస్టులు/టెక్నీషియన్లు మాత్రమే
నా ఫేస్‌బుక్/ట్విట్టర్ ఇన్‌బాక్స్‌కు
మీ వివరాలు, మొబైల్ నంబర్  మెసేజ్ చేయండి.

మాక్కావల్సిన ఇన్వెస్టర్లు ఒకరిద్దరే.
ఆ ఒకరిద్దరికే అవకాశం.
లైక్‌మైండెడ్ అయితే చాలు.
నేనే మీకు కాల్ చేస్తాను.

బెస్ట్ విషెస్ ...   

Saturday 11 February 2017

ఏం చదివావన్నది కాదు ..

"క్రియేటివిటీ వేరు, రాజకీయాలు వేరు" అని నేను అప్పుడప్పుడూ ఏదో ఒకచోట ప్రస్తావిస్తుంటాను.

నాదొక రాష్ట్రం. నా మ్యూజిక్ డైరెక్టర్ ప్రదీప్‌ది మరొక రాష్ట్రం. నాదొక రాజకీయ పార్టీ. నా మ్యూజిక్ డైరెక్టర్‌ది ఇంకో రాజకీయ పార్టీ.

అయితే ఈ రాజకీయకోణం ఎప్పుడూ 1% కూడా మా పనికి అడ్డం కాలేదు.

ఇక్కడ లైక్‌మైండెడ్‌నెస్ ముఖ్యం.

ఇక్కడే ఇంకో విషయం చెప్పాలి. నా మిత్రుడు, కెమెరామన్ వీరేంద్రలలిత్ ముంబైవాడు. పుట్టింది అలీఘర్. చదివింది ఢిల్లీ యూనివర్సిటీలో ఎం ఫిల్ ఫిలాసఫీ. అతను అభిమానించే రాజకీయపార్టీ పూర్తిగా ఇంకొకటి. అయినా మేం కలిసి పనిచేయడానికి ఇవేమీ అడ్డం కాలేదు.

పైగా, మా స్నేహం మరింత బలపడింది.


కట్ టూ మనీ - 

అసలు పాయింట్ నేను రాయాలనుకొన్నది ఇదీ.

మనీ.

సంపాదన.

చదువు వేరు, సంపాదన వేరు. చదువుకూ, సంపాదనకు ఎలాంటి సంబంధం లేదు. ఈ నిజం గురించి ఎవ్వరికీ ఎలాంటి ఉదాహరణలివ్వాల్సిన పనిలేదు.

ఒక్కసారి మీ చుట్టూ చూడండి. మీ చుట్టుపక్కలవాళ్ళు. మీ స్నేహితులు. మీ బంధువులు. ఇంకెవరైనా కావొచ్చు.

వాళ్లల్లో బాగా సంపాదించినవాళ్ళలో కనీసం 70% మంది డిగ్రీకూడా పూర్తిచేసి ఉండరు. ఒకవేళ చేసి ఉన్నా .. ఏ B.Com లో ఫిజిక్స్ చదివినవాళ్లో అయ్యుంటారు!

నిజానికి, సంపాదించడానికి అవసరమైన ఆలోచనావిధానం వేరు.

అదొక మైండ్‌సెట్.

సో, బాగా సంపాదించాలనుకునేవాళ్లు నిజంగా చదవాల్సిందీ, చూసి నేర్చుకోవాల్సిందీ అలవాటుచేసుకోవాల్సిందీ .. ఆ మైండ్‌సెట్‌ను మాత్రమే!    

దురదృష్టవశాత్తూ ఈ నిజాన్ని చాలామంది చాలా ఆలస్యంగా తెలుసుకుంటారు. వాళ్లలో నేనొకన్ని! 

Sunday 5 February 2017

సినిమా తీసి చూడు!

"ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు" అన్నారు. కానీ, "సినిమా తీసి చూడు" అని మాత్రం ఎవరూ అనలేదు.

ఎందుకంటే, ఇది ఆ రెండింటి కంటే చాలా కష్టం.

అంత ఈజీ కాదు.

ఈజీ కాదు అంటే ఇక్కడ విషయం డబ్బు ఒక్కటే కాదు. చాలా ఉంది.

సరే డబ్బు విషయం ఎలాగూ వచ్చింది కాబట్టి ఆ ఒక్క ముక్క ముందే చెప్పుకుంటే ఓ పనైపోతుంది.

అదేంటంటే - అన్ని వ్యాపారాల్లానే సినిమా కూడా ఒక వ్యాపారమే ఇప్పుడు.

కాకపోతే ఇదొక కళాత్మక వ్యాపారం. అంతిమంగా దీని గోల్ కూడా సేమ్ టూ సేమ్ .. రూపాయి పెడితే పది రూపాయలు లాభం రావాలన్నదే.

ఇందులో ఎలాంటి డౌట్ లేదు.

మొన్నటివరకూ సొసైటీలో ఒక గుడ్డి వాదన ఉండేది. ఏ వ్యాపారంలో అయినా పెట్టుబడి పెట్టొచ్చు కానీ, సినిమాల్లో పెట్టొద్దు అని.

ఇదొక "హెవీ గ్యాంబ్లింగ్" అని వాళ్ల ఉద్దేశ్యం.

అసలు వ్యాపారమే ఒక గ్యాంబ్లింగ్. ఆ మాటకొస్తే మన జీవితమే ఓ పెద్ద గ్యాంబ్లింగ్.

ఈ నిజాన్ని ఇప్పటి తరం బిజినెస్‌మెన్ గుర్తించారు. కాబట్టి "అబ్బో సినిమాల్లోనా!" అని ఇంతకుముందులా భయపడ్డంలేదెవ్వరూ.


కట్ టూ సినిమా తీసిచూడు - 

సినిమా తీయడానికి డబ్బొక్కటేకాదు, గట్స్ కావాలి.

గట్స్ అంటూ ఉన్న ఎవరైనా, నిజంగా సినిమా తీసిచూడాలి.

అన్నివ్యాపారాల్లాగే ఇదీ కొంతవరకు గ్యాంబ్లింగే. దీన్లోనూ లాభనష్టాలుంటాయి. ఫీల్డుమీద కొంచెం అవగాహన ఉంటే మాత్రం ఎలాంటి భయాలు అక్కర్లేదు.

అయితే దీన్లో ఉండే కొన్ని అద్భుతలాభాలు మాత్రం మరే ఇతర వ్యాపారంలోనూ లేవు. ఉండవు.

ఇతర అన్ని వ్యాపారాల్లో బాగా డబ్బు సంపాదించొచ్చు. కానీ, రాత్రికిరాత్రే ఫేమ్‌నూ, ఒక సెలబ్రిటీ హోదానూ, ప్రపంచవ్యాప్త గుర్తింపునూ తెచ్చుకోవడం మాత్రం ఒక్క సినిమాల్లోనే సాధ్యం.

కనీసం ఒక 40 టీవీ చానెళ్ళూ, అన్నీ కలిపి కనీసం మరో 100 వెబ్‌సైట్స్, ఫిల్మ్ మేగజైన్స్, న్యూస్ పేపర్లు, వెబ్ చానెళ్ళు, సోషల్ మీడియాల్లో మీ పరిచయం-కమ్-ప్రమోషన్ గ్రాఫ్ ఓవర్‌నైట్‌లో మిమ్మల్ని ఒక రేంజ్‌కు తీసుకెళ్తుంది.

ఈ అడ్వాంటేజ్ ప్రపంచంలోని మరే ఇతర బిజినెస్‌లో లేదు. ఉండదు.

దటీజ్ సినిమా.