Saturday 11 February 2017

ఏం చదివావన్నది కాదు ..

"క్రియేటివిటీ వేరు, రాజకీయాలు వేరు" అని నేను అప్పుడప్పుడూ ఏదో ఒకచోట ప్రస్తావిస్తుంటాను.

నాదొక రాష్ట్రం. నా మ్యూజిక్ డైరెక్టర్ ప్రదీప్‌ది మరొక రాష్ట్రం. నాదొక రాజకీయ పార్టీ. నా మ్యూజిక్ డైరెక్టర్‌ది ఇంకో రాజకీయ పార్టీ.

అయితే ఈ రాజకీయకోణం ఎప్పుడూ 1% కూడా మా పనికి అడ్డం కాలేదు.

ఇక్కడ లైక్‌మైండెడ్‌నెస్ ముఖ్యం.

ఇక్కడే ఇంకో విషయం చెప్పాలి. నా మిత్రుడు, కెమెరామన్ వీరేంద్రలలిత్ ముంబైవాడు. పుట్టింది అలీఘర్. చదివింది ఢిల్లీ యూనివర్సిటీలో ఎం ఫిల్ ఫిలాసఫీ. అతను అభిమానించే రాజకీయపార్టీ పూర్తిగా ఇంకొకటి. అయినా మేం కలిసి పనిచేయడానికి ఇవేమీ అడ్డం కాలేదు.

పైగా, మా స్నేహం మరింత బలపడింది.


కట్ టూ మనీ - 

అసలు పాయింట్ నేను రాయాలనుకొన్నది ఇదీ.

మనీ.

సంపాదన.

చదువు వేరు, సంపాదన వేరు. చదువుకూ, సంపాదనకు ఎలాంటి సంబంధం లేదు. ఈ నిజం గురించి ఎవ్వరికీ ఎలాంటి ఉదాహరణలివ్వాల్సిన పనిలేదు.

ఒక్కసారి మీ చుట్టూ చూడండి. మీ చుట్టుపక్కలవాళ్ళు. మీ స్నేహితులు. మీ బంధువులు. ఇంకెవరైనా కావొచ్చు.

వాళ్లల్లో బాగా సంపాదించినవాళ్ళలో కనీసం 70% మంది డిగ్రీకూడా పూర్తిచేసి ఉండరు. ఒకవేళ చేసి ఉన్నా .. ఏ B.Com లో ఫిజిక్స్ చదివినవాళ్లో అయ్యుంటారు!

నిజానికి, సంపాదించడానికి అవసరమైన ఆలోచనావిధానం వేరు.

అదొక మైండ్‌సెట్.

సో, బాగా సంపాదించాలనుకునేవాళ్లు నిజంగా చదవాల్సిందీ, చూసి నేర్చుకోవాల్సిందీ అలవాటుచేసుకోవాల్సిందీ .. ఆ మైండ్‌సెట్‌ను మాత్రమే!    

దురదృష్టవశాత్తూ ఈ నిజాన్ని చాలామంది చాలా ఆలస్యంగా తెలుసుకుంటారు. వాళ్లలో నేనొకన్ని! 

2 comments:

  1. "వాళ్లల్లో బాగా సంపాదించినవాళ్ళలో కనీసం 70% మంది డిగ్రీకూడా పూర్తిచేసి ఉండరు. సంపాదించడానికి అవసరమైన ఆలోచనావిధానం వేరు. అదొక మైండ్‌సెట్. సో, బాగా సంపాదించాలనుకునేవాళ్లు నిజంగా చదవాల్సిందీ, అలవాటుచేసుకోవాల్సిందీ ఆ మైండ్‌సెట్‌ను మాత్రమే!"

    మంచి విశ్లేషణ. మనకు తెలిసినదే. కానీ ఆచరణలో చాలా కొద్దీ మందికి మాత్రమే వీలవుతోంది. మనకర్థం కానీ బ్రహ్మవిషయాలలో ఇది ఒకటి.

    ReplyDelete