Monday 23 May 2022

పుష్పవిలాపం!


ముఖ్యమైన అతికొద్దిమంది మిత్రులకు, శ్రేయోభిలాషులకు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అప్పుడప్పుడు నేను మంచి పూలు, కేక్స్, చాకొలెట్స్, ప్లాంట్స్ వంటివి పంపిస్తుంటాను. 

కొన్ని సందర్భాల్లో ప్రొఫెషనల్ ఆబ్లిగేషన్ వల్ల కూడా పంపిస్తుంటాను. అది వేరే విషయం అనుకోండి. 

ఇలా పంపించడం అనేది ఒక్క హైద్రాబాద్‌కే పరిమితం కాదు. పాండిచ్చేరి, చెన్నై, ముంబై, ఢిల్లీ వంటి నగరాలకు కూడా.  

కట్ చేస్తే - 

నిన్న నాకు బాగా తెలిసిన ఆత్మీయులైన ఒక జంట వివాహ వార్షికోత్సవం సందర్భంగా, ఇలా ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్తూ పూలు, కేక్, చాకొలెట్స్, ఒక ప్లాంట్ ఎట్సెట్రా ప్లాన్ చేశాను.  

ఎప్పట్లాగే నేనుపయోగించే రెండు ఆన్‌లైన్ పోర్టల్స్‌కు వెళ్ళాను. జస్ట్ ఒక 3 నిమిషాల పని అది. కాని, నాకే నమ్మశక్యం కాని విధంగా... మొట్టమొదటిసారిగా నేనీ విషయంలో ఫెయిలయ్యాను. 

ఒక పాపులర్ పోర్టల్ అసలు ఎంతకూ చెకవుట్ కానివ్వలేదు. ఇంకో పాపులర్ పోర్టల్‌కు ఆర్డర్ పెట్టాను. అంతా ఓకే అయ్యింది. 2 గంటల్లో వైజాగ్‌లో మీరు చెప్పినవారికి ఇవన్నీ చేరతాయి అని కూడా ఆ పోర్టల్ చెప్పింది. 

నా బిజీ వర్కింగ్ అవర్స్ తర్వాత ఎప్పుడో రాత్రి 10 సమయంలో - ఎందుకో - బై మిస్టేక్ - నా ఈమెయిల్ చూసుకున్నాను.

"సర్విస్ షార్టేజి వల్ల పంపించలేకపోయాము. 7 రోజుల్లో మీ డబ్బులు మీకు రివర్ట్ అవుతాయి" అని మెసేజ్! 

ఏం చేసేదిలేక, అప్పుడు, రాత్రి 10 తర్వాత, ఒక గ్రీటింగ్ రాసి (డిజిటల్లీ చేసి) వారి టైమ్‌లైన్ మీద పోస్ట్ చేసి మళ్ళీ నా పనిలో పడ్డాను... 

నీతి: 
ఇలాంటి "ఆన్‌లైన్ థింగ్స్", "వర్చువల్ థింగ్స్" మీద పెద్ద నమ్మకం పెట్టుకోవద్దు.

ఫోన్ చేసి చక్కగా ఒక 2 నిమిషాలు మాట్లాడి శుభాకాంక్షలు చెప్తే సరిపోతుంది. లేదంటే... లెక్క చూసుకొని, ఒక 2 రోజుల ముందు అందేటట్టుగా, మన సొంత హాండ్ రైటింగ్‌తో గ్రీటింగ్స్ చెప్తూ ఒక ఉత్తరం రాసి "పోస్ట్" చెయ్యాలి. 

ఈ రెండూ ఇచ్చే ఆనందం ముందు ఇంకేదీ పనికిరాదు. 

ఈ డిజిటల్ ఏజ్‌లో నువ్వు చెప్పేది ఎవ్వరిష్టపడతారు అన్నది ఒక బిగ్ క్వశ్చన్.

అయితే - అలా ఇష్టపడేవారు మాత్రమే ఇలా పంపించడానికి అర్హులు అన్నది నా జవాబు. 

Tuesday 17 May 2022

Guy On The Sidewalk


ఇవ్వాళ పొద్దున్నే సుమారు ఒక 45 నిమిషాల పాటు నా విద్యార్థి ఒకరితో మాట్లాడాను. 

సంవత్సరానికి ఒకసారో, రెండుసార్లో... అప్పుడప్పుడూ మా ఇద్దరి మధ్య ఇలాంటి సంభాషణ జరుగుతుంటుంది. 

కట్ చేస్తే - 

ప్రేమలో కాని, ప్రొఫెషన్‌లో కాని... మన వెంటపడుతున్న అవకాశాల్ని, వ్యక్తులను వద్దనుకుంటాం. మనల్ని వద్దనుకున్న వ్యక్తుల కోసం, అవకాశాల కోసం అదేపనిగా ప్రయత్నిస్తుంటాం. 

ఇది పెద్ద గ్యాంబ్లింగ్... అని తెలివైనవారు కొందరికి అర్థమవుతుంటుంది. కాని, ఇలాంటి జూదంలో ఎక్కువశాతం ఇరుక్కుపోయేది కూడా ఈ తెలివైనవారే. 

అయితే ఆ తెలివి పనికొచ్చే తెలివా, పనికిరాని తెలివా అన్నది పూర్తిగా వేరే విషయం. దీనికి సమాజం కొలమానం వేరేగా ఉంటుంది. వ్యక్తిగత కొలమానం వేరేగా ఉంటుంది.   

ఒక గంట సేపు. ఎవ్వరూ డిస్టర్బ్ చేయని ఏకాంత స్థలం. కొంత ప్రశాంతత. కొంత నిస్పాక్షిక అంతర్విశ్లేషణ, అంతశ్శోధన చాలు. 

ఎప్పుడైనా సరే, ప్రపంచంలో ఎక్కడైనా సరే... హృదయం చెప్పింది ఫాలో అయినవారే అనుకున్నది సాధిస్తారు. అనుకున్న స్థాయికి ఎదుగుతారు.  

లాజిక్స్, మనసు... ఈ రెండూ ఒక్క ఒరలో ఇమడవు. 

అవ్వా బువ్వా రెండూ కావాలనుకొంటే కుదరదు. 

ఏదైనా... ఒక్కటే. 

One Thing. 

ప్రేమలో అయినా, ప్రొఫెషన్‌లో అయినా ప్లాన్ బి ఉండదు. 

ప్లాన్ బి ఉన్నచోట సర్దుబాటు ఉంటుంది. ఒక రొటీన్ ప్రవాహంలో జీవితంలో అలా వెళ్ళిపోతూవుంటాం.

అది తప్పు కాదు. 

అయితే అక్కడితో తృప్తిపడాలి. లేదంటే మనలని వెంటాడుతున్నదాన్ని వెంటాడాలి. సాధించాలి. 

ఇది చేస్తూ అది... అనే డిఫెన్సివ్ మెంటాలిటీవల్ల అన్నీ కోల్పోతాం.  

ఇంకేదో కావాలని ఆరాటపడుతూ, అలాంటి సంఘర్షణలోనే జీవితంలోని విలువైన సమయాన్ని వృధా చేసుకోవడం అనేది మాత్రం మనకి మనమే వేసుకొనే పెద్ద శిక్ష అవుతుంది. 

అర్నాల్డ్ ష్వార్జ్‌నిగ్గర్ ఇదే చెప్పాడు. విల్ స్మిత్ ఇదే చెప్పాడు. సిల్వెస్టర్ స్టాలోన్ ఇదే చెప్పాడు. ధీరూభాయి అంబాని ఇదే చెప్పాడు. వాళ్లకు ప్లాన్ బి లేదు. ఏదనుకున్నారో అదే చేశారు. సాధించారు. ఒకవేళ ఫెయిలయితే నాకు ఇంకో ఆధారం ఉంది అనుకోలేదు. అలా ఉంది అనుకున్న ఆధారాలను, ఇతర మానసిక, భౌతిక జంజాటాల్ని కూడా ముందే తగులబెట్టేశారు.        

కట్ చేస్తే - 

నా విద్యార్థి, వయస్సులో నాకంటే ఒక 12 ఏళ్ళు చిన్న...

నా ఆలోచనలు, యాక్షన్స్ అన్నిటికీ దాదాపు ఒక 90% వరకు నా ప్రతిబింబం.

ఒక రిప్లికా.

తన వెంటపడుతున్న ప్రేమను అక్కున చేర్చుకోవడమా... తను కావాలనుకొంటున్న ప్రేమను చేజ్ చేసి సాధించుకోవడమా అన్నది పూర్తిగా నా విద్యార్థి చేతుల్లోనే ఉన్నది. 

ఇక్కడ నేను చెప్తున్న ప్రేమ... నిజంగా ప్రేమే కావచ్చు. ఒక లక్ష్యం... ఒక ప్యాషన్... మన ముందున్న మన జీవితం... ఏదైనా కావచ్చు. 

గోడ మీద కూర్చోవటం కాదు. అటో ఇటో దూకేసెయ్యాలి. ఎటు దూకినా లక్ష్యం శిఖరాగ్రమే కావాలి. 

అవుటాఫ్ ద బాక్స్ కాదు... అసలు బాక్స్ అనేదే అక్కడ లేకుండా ఒక్క తన్ను తన్నాలి. 

అదే మైండ్‌సెట్. 

దీనికి వయస్సుకి సంబంధం లేదు అని ఇప్పటికే వేల మంది ప్రూవ్ చేశారు.   

అయితే ఇది చెప్పినంత ఈజీ కాదు. ఈ బ్లాగ్ రాసినంత ఈజీ అస్సలు కాదు. 

కాని, సాధ్యమే అని మన కళ్ళముందు వేల ఉదాహరణలున్నాయి. వాళ్లంతా కూడా మనలా మామూలు మనుషులే. మనకంటే వందరెట్ల కష్టాలు అనుభవిస్తూ కూడా ఎన్నెన్నో సాధించారు. 

ఎవరెస్ట్ ఎక్కాలనుకుంటే ఎక్కారు... అందరికీ అసాధ్యమైన ఆ శిఖరాన్ని మళ్ళీ మళ్ళీ ఎక్కారు. 

బెస్ట్ సెల్లర్ రైటర్ కావాలనుకుంటే అయ్యారు... ప్రపంచ స్థాయిలో బిలియనేర్ రైటర్స్ అయ్యారు.

గూగుల్ లాంటి కంపెనీకి సీఈవో కావాలనుకుంటే అయ్యారు... ఆ స్థాయి కంపెనీల్నీ పెట్టారు.

బిజినెస్ చెయ్యాలనుకుంటే చేశారు... సీరియల్ ఎంట్రప్రెన్యూర్స్‌గా వేల కోట్లు సంపాదించారు. 

వీళ్లంతా మనలాంటి మనుషులే. ఎక్కడినుంచో ఊడిపడలేదు. ఎలాంటి అతీతశక్తులు లేవు. వీళ్లల్లో 95% మంది మనకంటే ఎక్కువస్థాయి కష్టాలను ఎదుర్కొన్నవారే. 

వాళ్లకి మనకు ఒక్కటే తేడా...  

వాళ్లకు ప్లాన్ బి లేదు.

Monday 16 May 2022

ఒక్క ఛాన్స్... Opportunities for New Talent!


నిజంగా అవకాశాల కోసం ఎదురుచూస్తున్న కొత్త టాలెంట్ కోసం క్రింది అవకాశాలున్నాయి. ఓపిగ్గా, పూర్తిగా చదవండి. అర్హులనుకుంటేనే, ఇందులో చెప్పినట్టు అప్లై చేయండి: 

1. ASSISTANT DIRECTORS 
సినిమాలు అంటే ఇష్టం, సినీఫీల్డు గురించిన ప్రాథమిక అవగాహన, డైరెక్టర్ కావాలన్న లక్ష్యం విధిగా ఉండాలి. తెలుగు, ఇంగ్లిష్... చదవటం, రాయటం, మాట్లాడ్డం తప్పనిసరి. హిందీ కూడా  వస్తే ఇంకా మంచిది. స్క్రిప్ట్ రైటింగ్ గురించిన ప్రాథమిక అవగాహన, రాసే అలవాటు ఉండాలి. 
వయస్సు: 18 నుంచి 28. 
అమ్మాయిలకు, అబ్బాయిలకు అవకాశం ఉంది.  

2. DIRECTOR'S ASSISTANT
అసిస్టెంట్ డైరెక్టర్‌కు ఉండాల్సిన అన్ని అర్హతలు ఉండాలి. అదనంగా, ఒక పర్సనల్ అసిస్టెంట్‌గా డైరెక్టర్‌కు సహాయపడుతుండాలి. 
వయస్సు: 18 నుంచి 28. 
ఈ అవకాశం అమ్మాయిలకు మాత్రమే.  

3. ASSISTANT SCRIPT WRITERS
సినిమా స్క్రిప్ట్ రైటింగ్ గురించి పూర్తిగా తెలిసి ఉండాలి. ఫైనల్ డ్రాఫ్ట్ వంటి స్క్రిప్ట్ రైటింగ్ సాఫ్ట్‌వేర్స్ ఉపయోగించి స్క్రిప్ట్ రాయడం కూడా వచ్చివుంటే మంచిది.  ఫిలిం రైటర్ కావాలన్న లక్ష్యం, సీరియస్‌నెస్ విధిగా ఉండాలి. ఇప్పటివరకు కనీసం ఒక్కటైనా పూర్తిస్క్రిప్ట్ రాసి ఉంటే మంచిది. కనీసం మీ రైటింగ్ స్థాయిని, స్టయిల్‌ను తెలిపే ఏదైనా ఒక షార్ట్ ఫిలిం స్క్రిప్ట్ గాని, ఆఖరికి కొన్ని ఎఫెక్టివ్ సీన్‌లయినా రాసి ఉండాలి.  
వయస్సు: 18 నుంచి 35. 
ఈ అవకాశం అమ్మాయిలకు, అబ్బాయిలకు కూడా.

> పైన విడివిడిగా చెప్పిన అర్హతలతోపాటు, ఈ 3 అవకాశాల విషయంలో... అభ్యర్థుల ఎన్నికకు కామన్‌గా మేము ఇష్టపడేది, చూసేది... మీ లక్ష్యం పట్ల ఫోకస్, మీరు చేస్తున్న పని పట్ల సిన్సియారిటీ, ఇంకొకరిని ఇబ్బంది పెట్టని మీ క్రమశిక్షణ. 

> ఇంటర్‌నెట్, సోషల్ మీడియా పట్ల తగిన అవగాహన, సొంత ల్యాప్‌టాప్, స్మార్ట్ ఫోన్ (యాండ్రాయిడ్/ఐఫోన్) కూడా తప్పనిసరి.   

> ఎన్నికైన వారికి మొదటి 3 నెలలపాటు ఫ్రీ ట్రెయినింగ్ ఉంటుంది. 3 నెలల తర్వాత నుంచి, ఒక ఫిలిం ప్రాజెక్టు పూర్తయ్యేవరకు అగ్రిమెంట్ ఉంటుంది. ఆ అగ్రిమెంట్ పీరియడ్‌కు తగిన పారితోషికం ఇవ్వబడుతుంది. స్క్రీన్ మీద టైటిల్ కార్డు కూడా ఇస్తాము.   

Apply before 22-5-2022, with your full bio-data, latest photo, mobile number & your social media links: 

By email: mchimmani10x@gmail.com
By whatsapp: +91 9989578125 

IMP: మీ అప్లికేషన్స్ చూసిన తర్వాత, అర్హులైనవారికి మేమే వెంటవెంటనే కాల్ చేసి ఇంటర్వ్యూకు పిలుస్తాము. దయచేసి ఎవ్వరూ మాకు కాల్స్ చేయవద్దు. 

All the Best! 

- MANOHAR CHIMMANI
Film Director, Producer, Writer, Blogger
http://bit.ly/manutime 

Wednesday 11 May 2022

'రైటర్ మల్లాది' పాడ్‌కాస్ట్


నా హైస్కూలు రోజుల నుంచి నేను ఎక్కువగా చదివిన రచయితల్లో మల్లాది వెంకటకృష్ణమూర్తి కూడా ఉన్నారు. 

చతురలో వచ్చిన "కొత్త శత్రువు", ఒకసారి బస్‌లో చెన్నై వెళ్తూ చదివిన "అందమైన జీవితం" నవలలు నాకు బాగా గుర్తున్నాయి ఈరోజుకి కూడా. 

మా చిన్నబ్బాయికి మేము పెట్టుకున్న పేరు ప్రియతమ్. (రేపు వాడి పుట్టినరోజు).   

తర్వాత, "ఎక్కడో చాలా దగ్గరగా విన్నట్టుంది ఈ పేరు" అని నాకు చాలాసార్లు అనిపించేది. ఆలోచించగా ఆలోచించగా ఒక చోట గుర్తుకొచ్చిందీ పేరు. 

మల్లాది నవల "అందమైన జీవితం"లో కథానాయకుని పేరు ప్రియతమ్. 

మల్లాది ఆ పాత్రను అంత బాగా చిత్రించగలిగారు కాబట్టే నాకూ, నాలాంటి ఇంకెంతోమంది పాఠకులకు ఆ పేరు బాగా గుర్తుండిపోయిందనుకుంటాను. 

బహుశా ఈ నవల్లోనే అనుకుంటాను... మల్లాది ఒకచోట ఒక పాత్రతో పలికించిన వాక్యం నాకింకా గుర్తుంది, "నువ్వు అభిమానించే రచయితను కలుసుకోకు" అని.  

ఇది అనుభవపూర్వకంగా నిజమని తర్వాత బాగా అర్థమైంది నాకు.

తెలుగులో ఒక బెస్ట్ సెల్లర్ రచయితను (మల్లాది సమకాలికుడే) ఆకాశవాణి కర్నూలు ఎఫ్ ఎం లో నేనూ, మా ఎనౌన్సర్ మిత్రుడు శాస్త్రి ఇంటర్వ్యూ చేశాము. రికార్డింగ్ రూమ్‌లో ఇంటర్వూకి ముందు ఆయన మాట్లాడిన మాటలు, భాష నాకస్సలు నచ్చలేదు. ఇంటర్వూ పూర్తయ్యేటప్పటికి, అప్పటివరకూ ఒక రచయితగా అతనిమీదున్న ఇష్టం మొత్తానికి తుడిచిపెట్టుకుపోయింది. 

కాని... 

ఇలాంటి అనుభవం అందరు రచయితల దగ్గర ఉండదని కూడా నేనే మళ్ళీ నాకిష్టమైన ఇంకో రచయితను కలుసుకున్నప్పుడు అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. ఆ రచయిత, ప్రముఖ సినీ రచయిత.

దీని గురించి ఇంకోసారి, ఇంకో బ్లాగ్‌పోస్ట్‌లో తప్పక రాస్తాను. 

కట్ చేస్తే - 

మొన్నొకరోజు అనుకోకుండా శ్రీ అట్లూరి ఫేస్‌బుక్ టైమ్‌లైన్ మీద ఒక లింక్ చూశాను. 

అది - ఒక పాడ్‌కాస్ట్ లింక్. "జీవితంలో ప్రతివ్యక్తికీ ఒక వివాహేతర సంబంధం అవసరం" అన్నది ఆ పాడ్‌కాస్ట్ టాపిక్.

పాడ్‌కాస్టర్ ఎవరో కాదు, మల్లాది వెంకటకృష్ణమూర్తి! 

ఆ పాడ్‌కాస్ట్ విన్న తర్వాత, యూట్యూబ్ సజెషన్స్‌తో ఇంకొన్ని చోట్ల కూడా మల్లాది వాయిస్‌తో ఉన్న ప్రోగ్రామ్స్ కనిపించాయి. కొన్ని విన్నాను. చాలా బాగున్నాయి, వారి రచనల్లాగే. 

చలం గారి లాగే, ఇంకా చాలామంది వివిధ ఇతరరంగాల్లోని వారిలాగే... జీవితమంతా "అన్‌లిమిటెడ్‌"గా జీవించి, చివరి మజిలీలో మాత్రం స్పిరిచువాలిటీని ఆశ్రయించారు మల్లాది గారు.

ఇది నాకు ఇప్పటికీ అర్థం అయ్యీ కాని పజిల్. ఎందుకలా అని... 

ఆ విషయం అలా పక్కనపెడితే -  

నా మిత్రుడు గుడిపాటితో అంతకు ముందు రెండు మూడు సార్లు అన్నాను... "ఒకసారి మల్లాది గారిని కలుద్దాం, నీకు తెలుసు కదా" అని. ఆయన వెళ్దాం వెళ్దాం అంటూ ఒక దశాబ్దం దాటించేశాడు. 

మల్లాది గారిని నేను ఎప్పుడు కలుస్తానో తెలియదు కాని, తప్పక కలుస్తాను. "నీకిష్టమైన రచయితను కలుసుకోకు" అని వారు తన నవల్లో చెప్పిన ఆ మాట వారికి అస్సలు వర్తించదు అని నా గట్టి నమ్మకం. 

రైటర్ మల్లాది పాడ్‌కాస్ట్ ద్వారా అది నాకు చాలా స్పష్టంగా అర్థమైంది.  

Sunday 8 May 2022

కేటీఆర్ - డైనమిజమ్ అన్‌లిమిటెడ్ !!


అనుకోకుండా ఇవ్వాళ ట్విట్టర్ ఓపెన్ చేసి స్క్రోల్ చేస్తుంటే - ఫీడ్‌లో ముందుగా నాకు కనిపించింది... మినిస్టర్ కేటీఆర్ గారి ట్వీట్. 

మధ్యాహ్నం 12 కి #AskKTR ట్యాగ్‌తో Q&A ఉంది.   

టైమ్ చూశాను... అప్పటికే 12.01 అయింది.  

ఏం ఆలోచించకుండా వెంటనే ఒక ట్వీట్ పెట్టాను. 

30 సెకన్లలోపే నోటిఫికేషన్స్ మీద రెడ్ డాట్ కనిపించింది. క్లిక్ చేశాను.

అది... నా ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ కేటీఆర్ ఇచ్చిన రిప్లై!    

కట్ చేస్తే -

నేను ఎప్పటినుంచో అనుకుంటున్న ఈ పుస్తకాన్ని త్వరలో పబ్లిష్ చేయబోతున్నాను. 

ఇది కేసీఆర్ బయోగ్రఫీ కాదు. ఆయనమీద చేసిన రిసెర్చి కూడా కాదు. కేవలం ఆయన మీద నేను రాసిన ఎడిట్ పేజ్ ఆర్టికిల్స్, నా బ్లాగులో రాసిన పోస్టుల్లో ఎన్నిక చేసిన కొన్నింటి సంకలనం. 

సక్సెస్ సైన్స్ పాయింటాఫ్ వ్యూలో కేసీఆర్‌ది ఒక పెద్ద సక్సెస్ స్టోరీ. నా కళ్ళముందు జరిగిన కథ. మనందరి కళ్ళముందు జరిగిన కథ. 

2001 ఏప్రిల్ 27 నాడు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం  కేసీఆర్ టీఆరెస్ పార్టీ స్థాపించినప్పుడు ఆయనవెనుక పట్టుమని ఒక 100 మంది కూడా లేరనుకుంటాను. ఆయనేం ఆకాశం లోంచి ఊడిపడలేదు. మామూలుగా మనలాంటి మనిషే. కాని, ఒక గట్టి సంకల్పంతో ముందుకు దూకాడు. రాష్ట్రాన్ని సాధించాడు. 

ఇప్పటివరకు తెలంగాణలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయని ఎన్నెన్నో పనులు రికార్డ్ టైమ్‌లో చేసి చూపించాడు.

ఎర్రటి ఎండాకాలంలో ఇప్పుడు తెలంగాణ పల్లెపల్లెల్లో చెరువులు బావుల్లో నిండా నీళ్ళున్నాయి. పిల్లలు, పెద్దలు ఈతకొడుతున్నారు. ఇలాంటి దృశ్యం గతంలో ఎప్పుడూ లేదు. 

నిన్న నేను కరీంనగర్ వెళ్తుంటే ఒక మల్టినేషనల్ కార్పొరేట్ ఆఫీస్ లాంటిది ఒకచోట కనిపించింది. చూస్తే - అది ప్రభుత్వ గురుకుల సంక్షేమ పాఠశాల! 

ఇలాంటి అభివృద్ధి వందలాది విషయాల్లో విస్తృతంగా ఉంది. 

తెలంగాణ పట్ల ఎంతో ప్రేమ ఉండాలి. కొంచెం తెలివి కూడా ఉండాలి. తెలంగాణ కోసం ఏదైనా చెయ్యాలన్న తపన ఉండాలి. ఇవన్నీ  కేసీర్‌లో పుష్కలంగా ఉన్నాయి. ఎంత పుష్కలంగా ఉన్నాయంటే... మరే వ్యక్తిలో మనం ఇప్పటివరకూ చూడనంత స్థాయిలో!   

విజన్ అంటే ఏదో పేపర్ల మీద చూపే విజన్ కాదు. ఇలా చేతల్లో కనిపించాలి. 

మేము కేసీఆర్‌ను దించుతాం... మేము కేసీఆర్‌ను జైలుకు పంపుతాం అని ఎప్పుడూ వదిరే నాయకుల్లో ఎంతమందికి అసలు తెలంగాణలో ఎక్కడ ఏముందన్న విషయం తెలుసు? 

అసలు కేసీఆర్ స్థాయి నాయకుడు ఆయా పార్టీల్లో కనీసం ఒక్కరైనా ఉన్నారా? 

ఉన్నారని నేననుకోను. 

ఉంటే ఎవరాపుతున్నారు? ప్రజస్వామ్యంలో ఏదైనా సాధ్యమే. 

ఉద్యమం ప్రారంభించినప్పుడు కేసీఆర్ కూడా ఒక్కడే కదా!    

తెలంగాణకు మీరేం చేయగలరో చెప్పండి. ప్రజల్ని నమ్మించండి. చేసి చూపించండి. 

"దేశానికి ఒక లక్ష్యం ఉండాలి" అన్న వాక్యం ఎప్పుడైనా మీ నాయకుల నోటి నుంచి విన్నారా? 

అసలా వాక్యం ఎంతమందికి అర్థమవుతుంది?... ముఖ్యంగా, ఈ అరుపులు కేకల బ్యాచ్‌లకు, ఈ థంబ్‌నెయిల్ బ్యాచ్‌లకు?!    

కేసీఆర్ నా బంధువు కాదు. ఆయనను ఇంప్రెస్ చేయాల్సిన అవసరం నాకేం లేదు. కాని, ఆయన పనితీరు పట్ల నేను ఇంప్రెస్ అయ్యాను. ఒక అభిమానినయ్యాను.

అలా ఇంప్రెస్ అయిన ఒక అభిమానిగా - అప్పుడప్పుడూ నేను పెట్టిన బ్లాగ్ పోస్టులూ, రాసిన ఎడిట్ పేజి ఆర్టికిల్స్ సంకలనంతో నేను పబ్లిష్ చేస్తున్న పుస్తకమే "KCR - The Art of Politics".  

టైటిల్ ఒక్కటే ఇంగ్లిష్‌లో ఉంటుంది. పుస్తకమంతా తెలుగులోనే. 

త్వరలో ఈ బుక్ రిలీజ్ ఉంటుంది. 

నా బుక్ మీరు రిలీజ్ చెయ్యాలని, ఈ రోజు నేను అనుకోకుండా #AskKTR ద్వారా మినిస్టర్ కేటీఆర్‌ను కోరాను. దానికి ఆయన ట్విట్టర్ ద్వారానే సెకన్లలో ఓకే చెప్పడం ఆయన గొప్పతనం, ఆయన స్టైల్ కూడా.  

D y n a m i s m  U n l i m i t e d !! 

Thursday 5 May 2022

Picture Abhi Baaki Hai Mere Dost!


సరిగ్గా సంవత్సరం క్రితం ఈరోజు... సుమారు 2 వారాల మానసిక, శారీరక సంఘర్షణ తర్వాత కోవిడ్ నుంచి తేరుకున్నాను. 

నా ఫేస్‌బుక్ మెమొరీస్ ఇవ్వాళ ఉదయం ఈ విషయం గుర్తుచేసినప్పుడు, చెప్పలేని ఒకరకమైన ఫీలింగ్‌తో కాసేపు బ్లాంక్ అయిపోయాను. 

ఓ రెండు నిమిషాల తర్వాత నన్ను నేను రెండు ప్రశ్నలు వేసుకున్నాను:

1. ఒకవేళ నేను కోవిడ్ నుంచి కోలుకోకపోయుంటే ఏమయ్యేది?
2. సరే, బార్డర్ దాకా వెళ్ళొచ్చావనుకుందాం. వొళ్ళుదగ్గర పెట్టుకొని గత 365 రోజుల్లో ఏదైనా సాధించావా? 

మొదటి ప్రశ్నకు నాదగ్గర సమాధానం లేదు. ఉన్నా చెప్పలేను.   

రెండో ప్రశ్నకు సమాధానం ఉంది. చాలా సాధించాను. నేను చేయాలనుకొన్న ప్రతి ఒక్క పనినీ చేశాను. కొన్ని ఫెయిలయ్యాయి. కొన్ని వేస్ట్ అనుకొని నేనే మానేశాను. కొన్ని ఊహించని రేంజ్‌లో సక్సెస్‌ను అందించాయి. 

ఇకనుంచీ రెగ్యులర్‌గా సినిమాలు చేసేపనిలో ఒక మిడ్‌లెవల్ భారీ ప్రొడక్షన్ హౌజ్ రూపకల్పనలో ప్రధాన భాగస్వామినయ్యాను. సినిమాలు, వెబ్ సీరీస్, మ్యూజిక్ వీడియోల ప్రి-ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఎప్పటినుంచో పెండింగ్‌లో పెట్టిన నా పుస్తకాల ప్రచురణ కూడా త్వరలో మొదలవబోతోంది.    

ముఖ్యంగా కొన్ని తలనొప్పుల నుంచి ఒక నెలరోజుల్లో నేను పూర్తిగా ఫ్రీ కాబోతున్నాను. నేను కోల్పోయిన ఫ్రీడమ్ తిరిగి సంపాదించుకోబోతున్నాను.   

ఈ సిల్‌సిలా ఇక ఇలాగే కొనసాగుతుంది. 

Picture abhi baaki hai mere dost...

Monday 2 May 2022

Igniting New Beginnings


చాలా ఏళ్లక్రితం ఒక ఇంటర్వ్యూలో, సత్యజిత్ రే ఒక మాటన్నారు. దీన్ని నేను ఇప్పటికే నా ఫేస్‌బుక్‌లో, బ్లాగ్‌లో ఓ మూడునాలుగు సార్లు కోట్ చేశాను.

అలా ఒకసారి నా బ్లాగ్‌లో కోట్ చేసినప్పుడు... నా మిత్రురాలు, కె రాఘవేంద్రరావు గారి శిష్యురాలు, డైరెక్టర్ ప్రియదర్శిని ఓ పంచ్ లాంటి కామెంట్ పెట్టారు: "ఆ కొటేషన్ చదివేనండీ, ఇక్కడకొచ్చి ఇలా ఇరుక్కుపోయాం!" అంటూ.

ఇంతకూ సత్యజిత్ రే చెప్పింది ఏంటంటే - 

"సినిమా తీయాలన్న సంకల్పం ముఖ్యం. అదుంటే చాలు. అన్నీ అవే సమకూరతాయి!" అని.

సినిమాకయినా, జీవితంలో ఇంక దేనికయినా... అది చిన్న పనైనా, పెద్ద పనైనా... సంకల్పం అనేది చాలా ముఖ్యం. 

అయితే ఇది ఈ బ్లాగ్ రాసినంత సింపుల్ కాదు. ఆల్రెడీ ఉన్న కమిట్‌మెంట్స్, అడ్డంకులకు తోడు కొత్తగా మరెన్నో అవాంతరాలొస్తాయి. ఊహించని దెబ్బలు తగుల్తాయి. తప్పదు. అది వేరే విషయం. దాని గురించి మరోసారి చర్చిద్దాం.  

కట్ టూ మై న్యూ ప్రాజెక్ట్స్ -  

అప్పుడప్పుడూ ఏదో స్పెషల్ అపియరెన్స్ ఇచ్చినట్టుగా - నేనిప్పటివరకూ ఏవో రెండు మూడు సినిమాలు చేశాను. 

ఇంతకుముందులా 'సినిమాలొద్దు' అని నన్ను వెనక్కిలాగే ఉద్యోగం సద్యోగం, ఇతర బాదరబందీలు కూడా ఇప్పుడేం లేవు నాకు.  

ఏక్ నిరంజన్!  

లాక్ డౌన్ తర్వాత, ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్నాను. ఇప్పుడు సినిమాలే నా ప్రధాన వ్యాపకం, వ్యాపారం కూడా. 

రైటింగ్, యాడ్ ఫిలిమ్స్, సోషల్ మీడియా మేనేజ్‌మెంట్ వంటి నా ఇతర వ్యాపకాలన్నీ సెకండరీ. 

నా ఈ నిర్ణయం వెనుక ప్రధాన కారణం ఒక్కటే. లేటెస్ట్ డిజిటల్ ఫిల్మ్ మేకింగ్ టెక్నాలజీ.

అతి తక్కువ బడ్జెట్‌లో సినిమాలు చేయొచ్చు. ఊహించనంత వేగంగా కూడా సినిమాలు పూర్తిచేసి రిలీజ్ చేయొచ్చు. మరోవైపు ఓటీటీల్లో రిలీజ్ చేసే సినిమాలకు దొరుకుతున్న క్రియేటివ్ ఫ్రీడమ్, వాటికి అవుతున్న బిజినెస్ కూడా నన్ను బాగా టెంప్ట్ చేస్తున్నాయి. 

సో, వీటన్నిటి నేపథ్యంలో -  

మైక్రో బడ్జెట్‌లో సినిమాలు, వెబ్ సీరీస్, మ్యూజిక్ వీడియోస్... గట్టి సంకల్పంతో అన్నీ ఒకేసారి ప్రారంభిస్తున్నాను. వీటన్నిటి ప్రి-ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.  

Thanks to Satyajit Ray on the occasion of his 101th Birth Anniversary... May is gonna be a very happening month, igniting new beginnings in my film career. 

Sunday 1 May 2022

సినిమాలు, వెబ్ సీరీస్, మ్యూజిక్ వీడియోస్...


ఈ నెలలో చాలా మార్పులు రాబోతున్నాయి... ముఖ్యంగా ప్రొఫెషనల్‌గా. 

ఎప్పటినుంచో అనుకుంటున్నాను కాని, నిజానికి అంత శ్రద్ధపెట్టలేదు. పెట్టేలా లేవు పరిస్థితులు, బాధ్యతలు. 

ఇప్పుడు - మొట్టమొదటిసారిగా ఫిలిం మేకింగ్ ప్రొఫెషన్‌ను టాప్ ప్రయారిటీగా తీసుకొని ముందుకువెళ్తున్నాను. ఇంతకుముందులాగా కుదిరిన ఏదో ఒక సినిమా చేసేసి, మళ్ళీ ఇంకో నాలుగైదేళ్ళవరకూ ఆగకుండా... ఇప్పుడు వరుసనే సినిమాలు ప్లాన్ చేస్తున్నాను. 

ఈ దిశలో నన్ను బాగా ప్రొవోక్ చేస్తున్న అంశం... ఇప్పుడు సినీఫీల్డు ప్రయాణిస్తున్న వేగం. దాంతోపాటు - ఫీల్డులో వస్తున్న కొత్త కొత్త ఆవిష్కరణలు. ఇంకా ముఖ్యంగా పెరిగిన బిజినెస్ అవెన్యూస్. 

నా అవసరం కూడా... 

కట్ చేస్తే -

రెగ్యులర్‌గా చేసే కమర్షియల్ ఫీచర్ ఫిలిమ్స్‌తో పాటు... ఒక వెబ్ సీరీస్, ఒక మ్యూజిక్ ఆల్బమ్ కూడా ప్లాన్ చేస్తున్నాను. వీటన్నిటి ప్రి-ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. 

ఈ నెల నుంచే ఒక్కొక్కదానికి సంబంధించిన వివరాలు బయటికొస్తుంటాయి. నేనూ చెప్తుంటాను. 

పనిచేస్తుంటేనే అంతా బాగుంటుంది. ఏవైనా చిన్న చిన్న తలనొప్పులు ఉన్నా అవే సెట్ అయిపోతాయి. 

చిన్నదో, పెద్దదో... ఏదైనా సరే, ముందు పనిలో ఉండటం ముఖ్యం.

ఇప్పుడు నేను పూర్తిగా పనిలోకి దిగాను. నా టీమ్‌తో కలిసి పనిచేస్తున్నాను.    

Action may not always bring happiness, but there is no happiness without action.