Thursday 18 July 2024

Get That One Call...


ఒక అయిడియా జీవితాన్ని మార్చేస్తుందంటారు.

ఒక్కోసారి, ఒక ఫోన్ కాల్ కూడా అలా జీవితాన్ని మార్చెయ్యవచ్చు.  

"బటర్‌ఫ్లై ఎఫెక్ట్"లా... పర్సనల్‌గా, ప్రొఫెషనల్‌గా... ఓవర్‌నైట్‌లో నా మీద ఊహించనంత ప్రభావం చూపించగలిగే అలాంటి శక్తి వున్న ఆ ఒకే ఒక్క కాల్ కోసం ఇప్పుడు నేను ఎదురుచూస్తున్నాను. 

కట్ చేస్తే - 

ఎవరికైనా ఎప్పుడైనా ఎక్కడైనా... అవ్వా బువ్వా రెండూ కావాలంటే కుదరదు.

ఏదైనా ఒక్కటే ఎన్నిక చేసుకోవాలి. దాని మీదే పూర్తి ఫోకస్ పెట్టాలి. ఆ తర్వాత మనం సాకులు వెతుక్కోలేం. మనం చేసినదానికి, వచ్చిన ఫలితానికీ బాధ్యత తీసుకొని తీరాలి. 

అలాంటి చాలెంజ్‌కు సిద్ధపడగలిగినవారే ఏదైనా సాధిస్తారు. 

ఇప్పుడు నేను అలాంటి  ఒక గట్సీ చాలెంజ్‌ను నామీద నేనే విసురుకున్నాను. 

సో, ఏ పావులు కదిలించాలో కదిలించు. ఏం చెయ్యాలో చెయ్యి. కాని, ఫోకస్ మాత్రం పూర్తిగా ఏదైనా ఒక్కదానిమీదే పెట్టు. 

కాల్ తెప్పించుకుంటావో, కాళ్లే పట్టుకుంటావో నీ ఇష్టం. 

ఒక తపస్సులా పనిచెయ్యి.

నువ్వు అనుకున్నది ఏదైనా అతి సులభంగా నువ్వే సాధిస్తావు. 

Now, go and wait for that one call that will change your life overnight...

- మనోహర్ చిమ్మని 

Tuesday 16 July 2024

అంతం కాదిది... ఆరంభం!


నా ఫేవరేట్ ప్రపంచస్థాయి రచయితల్లో చలం ముందు వరసలో ఉంటారు. ఆకాలంలోనే ఆయన రాయగలిగిన ఆ అందమైన తెలుగు శైలిని ఇప్పుడు 2024 లో కూడా ఎవ్వరూ రాయడం లేదన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. 

అలాంటి చలం, ఆరోజుల్లోనే, ఎంత అగ్రెసివ్, ఎంత అన్‌ట్రెడిషనల్ టాపిక్స్ పైన రచనలు చేశారంటే... ఆ టాపిక్స్ అప్పుడే కాదు, ఇప్పుడు కూడా సంచలనాత్మకమైనవే!

అలాంటి రచయిత కూడా చివరికి స్పిరిచువాలిటీ అంటూ రమణ మహర్షి ఆశ్రమం చేరారు. 

చేరటం తప్పుకాదు. చేరక తప్పలేదన్నది నా పాయింట్.

కట్ చేస్తే -

అన్నీ వదిలేయడమే ఆధ్యాత్మికం కాదు. 

ఆధ్యాత్మికం వైపు ఆకర్షించబడటానికి వయసుతో కూడా పన్లేదు. 

దైనందిన జీవితంలోని పనులు చేసుకొంటూనే, జీవితాన్ని ఆస్వాదిస్తూనే, ఆధ్యాత్మికానందాన్నీ అనుభవించవచ్చు.  

- మనోహర్ చిమ్మని 

Thursday 11 July 2024

"Skip Ad" అన్నిసార్లూ సాధ్యం కాకపోవచ్చు!


ప్రొఫెషనల్‌గా కావచ్చు, పర్సనల్‌గా కావచ్చు... మన జీవితంలోకి వచ్చే చాలామంది యూట్యూబ్ వీడియోలో యాడ్స్ లాంటివాళ్ళు. 

ఏం ఆలోచించకుండా అలా "స్కిప్ యాడ్" కొట్టేసెయ్యాలి... కొట్టేస్తాం కూడా. 

ప్రతి యాడ్ చూసుకుంటూ కూర్చుంటే మనం చూడాలనుకున్న వీడియో చూడలేం. అప్పటికే మన టైమ్ అయిపోతుంది... అసలు వీడియోకే స్కిప్ కొట్టాల్సి వస్తుంది. 

కట్ చేస్తే - 

చాలా చాలా అరుదుగా - అనుకోకుండా - మనకు అసలు సంబంధం లేని, మనమెప్పుడూ ఊహించని ఏదో ఒక యాడ్ చూస్తాం. ఆశ్చర్యంగా కనెక్టయిపోతాం. మనకు తెలీకుండానే కంటిన్యూ అయిపోతాం. 

అదే మ్యాజిక్. 

అలాంటి మ్యాజిక్ క్రియేటివ్ రంగాల్లో ఉన్న ప్రతిమనిషి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు తప్పదు. కాని, అప్పుడే మొదలవుతుంది అసలు కథ...  

- మనోహర్ చిమ్మని 

Monday 8 July 2024

జీవితం చాలా పెద్దది!


జీవితం చాలా చిన్నది... జీవితం ఒక్కటే... ఉన్న కొద్ది రోజులు ఇలా బ్రతకాలి, అలా బ్రతకాలి... అనుకొంటూ ఆ ఆలోచనలతోనే మూడొంతుల జీవితం అయిపోతుంది. 

ఇంకా అప్పటికి కూడా మనకు బుధ్ధి రాదు. అనుకున్నట్టు బ్రతకలేం. 

ఒకరి కోసం ఒకటి మానేస్తాం. ఇంకొకరి కోసం ఇంకొకటి మానేస్తాం. ఇంకెవరి కోసమో మనకు అసలు ఇష్టం లేని పని చేస్తుంటాం. ఇంకెవరో ఏదో అనుకుంటారని అసలు చెయ్యాల్సిన పని చెయ్యం. 

జస్ట్ మనకున్న ఒకే ఒక్క జీవితంలో జరగరానిది ఇంత జరుగుతోంది.

జీవితం చిన్నదెలా అవుతుంది? 

జీవితం చాలా పెద్దది. సంఘర్షణలు, వైరుధ్యాలు అనేకం. 

జీవితం చిన్నది చిన్నది అనుకొంటూ, చిన్నదో పెద్దదో మన చేతిలో వున్న జీవితాన్ని చాలా వృధా చేసుకొంటున్నాం.    

కట్ చేస్తే - 

నీ గురించి ఆలోచించకు. నీ కోసం ఆలోచించు. 

ఇతరుల కోసం ఆలోచించకు. ఇతరుల గురించి ఆలోచించు.

Love yourself like your life depends on it.  

- మనోహర్ చిమ్మని 

Friday 5 July 2024

పిచ్చాసుపత్రి మేధావులెలా ఉంటారంటే - 4


సినిమాలు, సినిమా వార్తలు, సినిమా గాసిప్స్, సినిమా హీరోహీరోయిన్ల ఫోటోలు, సినిమావాళ్ళ వీడియో క్లిప్స్, సినిమావాళ్ళ ఇంటర్వ్యూలు... మొత్తంగా అసలు సినిమా కంటెంట్ లేకుండా బ్రతకలేనివి కొన్నున్నాయి:

టీవీచానెల్స్, ఓటీటీలు, న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్, వెబ్‌సైట్స్, యూట్యూబ్ చానెల్స్, ఎట్సెట్రా. 

ఇలాంటి చాలావాటికి సినిమా కంటెంటే ఆక్సిజన్. 

సినిమా కంటెంట్ ఉంటేనే రీడర్‌షిప్/వ్యూయర్‌షిప్ పెరుగుతుంది, వ్యూస్ వస్తాయి, రేటింగ్ వస్తుంది. 

అవి బాగా వస్తేనే వాళ్ళకు డబ్బులొస్తాయి. 

ఇప్పుడీ సూడో-మేధావులు కూడా ఈ కోవలోకే వస్తున్నారు... 

వాళ్ళ రచనా వైదుష్యం, వాళ్ళ పాండిత్య ప్రతిభ, వాళ్లకుందీ అనుకుంటున్న అంతర్జాతీయ సినిమా పరిజ్ఞానం... ఇదంతా గుప్పించుకొని మురిసిపోడానికి ఇదొక దారి. 

సినిమా ప్లాట్‌ఫామ్ లేకుండా వీళ్ళూ బ్రతకలేరు. 

ఎడాపెడా కైమా కొట్టినట్టు రివ్యూలు రాయడం! సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం!!

కాకపోతే, ఈ సూడో-మేధావులకి డబ్బులు రావు. ఉట్టి తుత్తి మిగుల్తుంది. 

తర్వాత ఇవే ఆర్టికిల్స్‌ను పుస్తకాలుగా వేసుకోవచ్చు. ఆవిష్కరణలు చేసుకోవచ్చు. పొగడ్తలు పొందొచ్చు. 

సినిమాల మీద కొన్ని అంతర్లోక విశ్లేషణలు వీరివి ఏ స్థాయిలో ఉంటాయంటే - ఆ సినిమా తీసిన డైరెక్టర్‌కే "వార్నీ... నేనింత ఆలోచించానా?!" అని పిచ్చెక్కిపోయేంతగా.   

అంతా కలిపి ఈ జనాభా ఒక 200-300 మంది ఉంటారనుకుందాం. వీరి వల్ల సినిమాల టికెట్స్ తెగవు. కోట్లు రావు. 

అసలు సినిమా బిజినెస్‌కు వీళ్ళు టార్గెట్ ఆడియన్స్ కానే కారు. 

వీళ్లనిలా బ్రతకనిస్తే పోలా... అని ఫిలిం మేకర్స్ అసలు పట్టించుకోడం మానేశారు. 

కట్ చేస్తే -

వీళ్ళు "చాలా బాగుంది" అని మెచ్చుకున్న సినిమాలకు కలెక్షన్స్ ఉండవు. 

వీళ్ళు "చెత్త సినిమా" అని తేల్చేసిన సినిమాలకు కోట్లు కురుస్తాయి. 

ఇలాంటి ఒక మంచి క్లూ ఇస్తూ, ఫిలిం మేకర్స్‌కు వీళ్ళు మేలే చేస్తున్నారనుకుంటే పోలా?        

కట్ చేస్తే -

ఈ సూడో-మేధావుల రివ్యూల్ని, పోస్టుల్ని, కామెంట్లను అసలు పట్టించుకోకూడదు. అసలు అలాంటి నెగెటివ్ వాసన వచ్చిన పోస్టులోకి వెళ్ళకపోవటం బెటర్.

ఇలాంటి శాడిస్టు పోస్టులో, కామెంట్లో మరీ మనకు ఇబ్బందికరంగా అడ్డొస్తున్నాయనిపిస్తే "అన్-ఫాలో", "బ్లాక్" ఉండనే ఉన్నాయి. 

మన సొంత పోస్టుల కింద వచ్చే చెత్త కామెంట్స్ విషయంలో కూడా అంతే. అసలు చూడకూడదు, పట్టించుకోకూడదు. ఏదైనా నాన్సెన్స్ కంటికి కనిపించిందా... జస్ట్ అన్-ఫాలో, బ్లాక్!  

సూపర్ స్టార్ రజినీ కాంత్ చెప్పినట్టు - దారిలో మొరుగుతున్న కుక్కల్ని పట్టించుకోకుండా - మన పనిలో మనం ముందుకు వెళ్తూనే ఉండాలి. 

ఓం తత్సత్.  

- మనోహర్ చిమ్మని 

Thursday 4 July 2024

పిచ్చాసుపత్రి మేధావులెలా ఉంటారంటే - 3


ఏ సినిమాలోనైనా కాస్టింగ్ అనేది డైరెక్టర్ ఇష్టం. 

కల్కి2898ఏడీ సినిమాలో కూడా అంతే...  

ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పడుకోన్, మృణాల్ ఠాకూర్, మాళవికా నాయర్, రాజమౌళి, అనుదీప్ వంటివారిని ఎలా ఎంచుకున్నాడో, విజయ్ దేవరకొండను కూడా అలాగే ఎంచుకున్నాడు నాగ్ అశ్విన్. 

ఒకవేళ అర్జునుడి పాత్రలో విజయ్ నటన బాగా లేదనుకుంటే, అతనొక్కడి కోసం డైరెక్టర్ తన 600 కోట్ల ప్రాజెక్టుని పాడుచేసుకోడు. కాంప్రమైజ్ అవడు. ఒకవేళ అతను కాంప్రమైజ్ అయినా, అశ్వినీదత్ లాంటి అగ్రశ్రేణి నిర్మాత కాంప్రమైజ్ అవ్వరు. 

ఇది సింపుల్ లాజిక్. 

ఇదంతా పక్కన పెట్టి, కొంతమంది విజయ్ దేవరకొండను ట్రోల్ చెయ్యడమనేది సోషల్ మీడియాలో నానా రచ్చకు దారి తీసింది. అదింకా కొనసాగుతోంది.

ఇందులో విజయ్ దేవరకొండ తప్పేమైనా ఉందా? ఇందుకిలాంటి సంస్కార రహితమైన దాడి?

ఇక, ఈ ట్రోలింగ్‌లో వాడిన భాష గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.   

సహజంగానే విజయ్ అభిమానుల ఎదురుదాడి కూడా అదే స్థాయిలో తీవ్రమైంది. ఇంకా కొనసాగుతోంది. 

ఫ్యాన్స్ వేరు, ఆ కేటగిరీ వేరు. వాళ్ళూ వాళ్ళూ తిట్టుకుంటారు, తిట్టించుకుంటారు. అది మామూలే.  

ఈ సూడో-మేధావులకేమైంది? 

మీకు ఆ హీరో నటన నచ్చకపోవచ్చు. తప్పులేదు. కాని, దానికి ఇంత దారుణమైన కామెంట్స్, ఎగతాళి అవసరమా? 

ఒక హీరోపైన ఎందుకింత వ్యక్తిగత కక్ష?    

కట్ చేస్తే -  

సినీ ఫీల్డులో అయినా, రాజకీయాల్లో అయినా, ఇంకే ఫీల్డులో అయినా, ఎవరి ఎజెండాలు వారికుంటాయి. లోపలి విషయాలు వేరు, బయటికి కనిపించే విషయాలు వేరు.

అసలైనవాళ్లంతా బాగానే ఉంటారు. ఎటొచ్చీ మధ్యలో ఇలా కొట్లాటలు పెట్టుకొని ఫూల్ అయ్యేవాళ్ళు, కరివేపాకులా తీసివేయబడేవాళ్ళు ఎవరంటే - ఇదిగో, ఇలా వారి కోసం గొడవలు పెట్టుకొని అనవసరంగా శత్రువులుగా మారే ఈ మధ్యలోనివాళ్ళే.  

సినిమారంగంలో ఉన్నవాళ్లకంటే ఇవన్నీ తప్పవు. కోట్లు పెడుతుంటారు, సంపాదిస్తుంటారు, పోగొట్టుకుంటుంటారు. కెరీర్ పరంగా, బిజినెస్ పరంగా నానా సిచువేషన్స్ ఫేస్ చేస్తుంటారు. అది వారి ప్రొఫెషన్. అది వారి జీవితం.  

మిగిలినవాళ్లేవరికైనా సినిమా అనేది జస్ట్ ఒక ఎంటర్‌టైన్మెంట్ మీడియా. చూడాలి, వదిలెయ్యాలి. అంతే. మిగిలిందంతా జస్ట్ బుల్ షిట్.     

- మనోహర్ చిమ్మని   

Wednesday 3 July 2024

పిచ్చాసుపత్రి మేధావులెలా ఉంటారంటే - 2


KALKI2898AD... 

ఈ సినిమా చూసిన ఒక మేధావి "సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్" ఎలా ఉందంటే -

అతనికి సరిగ్గా ముందు సీట్లో కూర్చున్న ప్రేక్షకుడు సినిమాలో లీనమైపోయి, ఎక్జయిట్‌మెంట్‌తో సీట్ ముందుకు జరిగి నిటారుగా కూర్చున్నాడట. అందువల్ల ఈయనకు స్క్రీన్ పూర్తిగా కనిపించట్లేదట. 

ఇక అతనికి సరిగ్గా వెనక సీట్లో కూర్చున్న ప్రేక్షకుడు ఆల్రెడీ ఒకసారి KALKI2898AD సినిమా చూసినందువల్ల, స్క్రీన్ మీద వచ్చే ప్రతి డైలాగ్‌ను ముందే చెప్తున్నాడట. 

ఇదంతా ఆ సోకాల్డ్ సూడో-మేధావి తన పోస్టులో రాసిందే! నా సొంత కవిత్వం కాదు. 

సినిమా నచ్చకపోతే - ముందు కూర్చున్నవాడు అంత ఎక్జయిట్‌మెంట్‌తో సీటు ముందుకి జరిగి కూర్చొని చూడడు. వెనక కూర్చున్నవాడు రెండోసారి సినిమాకి రాడు. 

దట్ సింపుల్. 

హౌజ్ ఫుల్ అయినా ఆ సినిమా హాల్లో ఈయనొక్కడికి సినిమా నచ్చలేదు. ఈయన లాంటి ఇంకో ఇరవై-ముప్పై మందికి కూడా నచ్చకపోవచ్చు. తప్పేం లేదు.

ఏ సినిమా అయినా అందరికి నచ్చాలని రూలేం లేదు.  

కానీ, నీ ఒక్కడికి నచ్చనంత మాత్రాన నీ మేధావిత్వమంతా గుప్పిస్తూ - నీకు సినిమా నాలెడ్జి చాలా వుందని చెప్పుకొంటూ - ఇది రివ్యూ కాదంటూనే - అంత పెద్ద శాడిస్టిక్ రివ్యూ రాయాలా? 

నీ టేస్టు, ప్రపంచం టేస్టు ఒక్కటే అవ్వాలని రూలేమన్నా ఉందా?

ప్రపంచమంతా లక్షలాదిమంది ప్రేక్షకులు సినిమా ఎంజాయ్ చేస్తూ, వందల కోట్ల వర్షం కురిపిస్తుంటే - వాళ్లంతా అభిరుచిహీనులైన తప్పుడు ప్రేక్షకులైనట్టు, నువ్వొక్కడివే స్టాండర్డ్ ప్రేక్షకుడివైనట్టు ఇలాంటి శాడిస్టిక్ రాతలు రాసి నువ్వేం సాధించాలనుకున్నట్టు?  

కట్ చేస్తే - 

సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ గురించి, ఆర్ట్ ఫామ్ గురించి రివ్యూల రూపంలో ఇంతింతేసి థీసిస్‌లు రాస్తున్న ఇలాంటివాళ్ళల్లో ఏ ఒక్కరయినా, పూనుకొని, ఒక అద్భుత కలాఖండం ఎందుకు తీయలేకపోతున్నారు అన్నది నా హంబుల్ డౌట్!    

After all, cinema is a business. A big business. We make movies that make money. Everything else is just bullshit.

- మనోహర్ చిమ్మని 

మా సాదిక్ అంటే నాకెందుకంత ఇష్టం?


ఉస్మానియా యూనివర్సిటీలో నా సీనియర్, హాస్టల్ మేట్, మిత్రుడు, దాదాపు మూడున్నర దశాబ్దాల మా స్నేహంలో ఇంకా నన్ను ప్రేమగా "మనూ" అని పిలిచే అతి కొద్దిమంది ఆత్మీయ మిత్రుల్లో ఒకరు... మా సాదిక్ భాయ్.  

ఓయూలోని "ఏ" హాస్టల్లో ఆయన రూం నంబర్ 35 అయితే, నాది 55. 

ఓయూలో ఉన్నప్పుడే మా జూనియర్స్, సీనియర్స్ కలిసి ఒకసారి ఒరిస్సా టూర్‌కు వెళ్ళాం. అదిగో, అక్కడ మొదటిసారి మేమిద్దరం కలిసి ఓ పక్కగా వెళ్ళి, సిగరెట్ వెలిగించి, అదీ ఇదీ మాట్లాడ్డం మొదలెట్టాం. భువనేశ్వర్‌లోని పాంథ నివాస్ హోటల్ ఆవరణలో ఆ సాయంత్రం, అలా తిరుగుతూ, అప్పుడు మేం ప్రారంభించిన ఆ కబుర్లు, ఆ ముచ్చట్లు... ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

నిన్న రాత్రి కూడా ఫోన్లో మాట్లాడుకున్నాం.    

కట్ చేస్తే -   

సాదిక్ చెప్పింది చేస్తాడు. ఏదైనా తను చెప్పింది చెయ్యలేకపోతే, అది అవ్వకపోతే ఆ విషయం వెంటనే  నేరుగా, నిర్మొహమాటంగా చెప్పేస్తాడు... "మనూ, ఆ పని ఇంక కాదు" అని. 

అతనిలో ఇది నాకు చాలా ఇష్టం. 

ఆమధ్య ఓ తొమ్మిదేళ్ళక్రితం అనుకుంటాను... నాకో విషయంలో (డబ్బు కాదు) మాటిచ్చాడు సాదిక్ భాయ్. అప్పుడు నా సినిమా పనుల హడావుడి, నా ఇంకో పది క్రియేటివ్ వ్యాపకాల బిజీలో ఆ విషయం గురించి పెద్దగా పట్టించుకోలేదు. లైట్ తీసుకున్నాను. దాదాపు మర్చిపోయాను.     

వన్ ఫైన్ ఈవెనింగ్ తన మాట నిలబెట్టుకున్నాడు సాదిక్! అది కూడా - చాలా డీసెంట్‌గా, డిగ్నిఫైడ్‌గా, ఎంతో హుందాగా... నేను షాక్‌తో ఉబ్బి తబ్బిబ్బయిపోయి సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోయేటంతగా!!

పైన రాసినదాంట్లో ఎలాంటి అతిశయోక్తిలేదు.

నేను సాదిక్ భాయ్‌ని ఇంచ్ కూడా పొగడ్డం లేదు.  

కట్ చేస్తే -   

మా సాదిక్ గురించి ఇప్పుడు రాస్తున్నదంతా ఒక ఫ్లోలో, ఒక నాన్ లినియర్ స్క్రీన్‌ప్లేలా ఉంటుంది. క్షమించాలి. భరించాలి. 

భరించాలి అని ఎందుకంటున్నానంటే - సాదిక్ జీవితం, సాదిక్ జీవనశైలి చాలా కోణాల్లో చాలామందికి ఇన్‌స్పిరేషన్. 

"బతికితే సాదిక్‌లా బతకాలి" అనిపించేంత ఇన్‌స్పిరేషన్!

సాదిక్ ఎలా బ్రతకాలనుకుంటాడో అలా బ్రతుకుతాడు. ఎక్కడా ఎలాంటి కాంప్రమైజ్ ఉండదు. అది నాకిష్టం. 

అందరికీ సాధ్యం కాదు, సాధ్యం చేసుకోలేరు.

కొన్నేళ్ళ క్రితం - మా జామై ఉస్మానియా చాయ్ అడ్డా దగ్గర - వన్ ఫైన్ మార్నింగ్, మేమిద్దరం కూర్చొని మాట్లాడుకొంటున్నప్పుడు - మా ఇద్దరికి మాత్రమే తెలిసిన ఒక వ్యక్తి గురించి, సమయం విలువ గురించీ - సాదిక్ నాతో ఒక మాట చెప్పాడు.  

"మనూ! నేను ఆ వ్యక్తి మీద నా పూర్తి నమ్మకం పెట్టి, నా పూర్తి సమయం, నా పూర్తి సపోర్ట్ ఇచ్చాను. అంతా వృధా అని అర్థమయింది. నా జీవితంలో ఒక్క సంవత్సరం అంటే దానికి ఎంతో వాల్యూ ఉంది. అదే ఒక్క సంవత్సరం నా మీద నేను ఫోకస్ చేసుకుంటే - ఏం చేయగలనో చూపిస్తాను" అన్నాడు. 

సంవత్సరం తిరక్కముందే ఎన్నో చేసి, ఎన్నెన్నో సాధించి చూపించాడు! 

దటీజ్ సాదిక్.   


కట్ చేస్తే -   

అసలు "తోపుడు బండి" ఏంటి? అందులో పుస్తకాలు పెట్టుకొని, దాన్ని ఆయనే తోస్తూ పుస్తకాలు అమ్మడమేంటి? అదే తోపుడు బండిని తోస్తూ, సాదిక్ 100 రోజుల్లో 1000 కిలోమీటర్ల పాదయాత్ర చెయ్యడమేంటి?  

అప్పట్లో హైద్రాబాద్ బుక్ ఫెయిర్‌లో సాదిక్ "తోపుడు బండి స్టాల్" అంటే సెన్సేషన్. ఏ వీఐపీ అయినా సరే, బుక్ ఫెయిర్‌కొస్తే తోపుడు బండి స్టాల్ విజిట్ చెయ్యాల్సిందే! ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఆఖరికి అప్పటి గవర్నర్ నరసింహన్ కూడా సాదిక్ స్టాల్ సందర్శించారు. 

లోకల్ స్క్రైబ్స్ నుంచి, బీబీసీ దాకా సాదిక్ తోపుడు బండి అప్పట్లో ఒక పెద్ద సెన్సేషనల్ న్యూస్ ఐటమ్ అయింది.   

హైద్రాబాద్ బుక్ ఫెయిర్‌లో ఫోటోలు, సెల్ఫీల కల్చర్‌ను పరిచయం చేసిన పయొనీర్ సాదిక్. బుక్ ఫెయిర్‌లో "తోపుడుబండి" స్టాల్ ఇప్పుడు లేకపోయినా - ఆయన పరిచయం చేసిన "ఫోటోల పండుగ" మాత్రం హైద్రాబాద్ బుక్ ఫెయిర్‌లో ఇంకా కొనసాగుతోంది. 

"తోపుడు బండి సాదిక్" గా పాపులర్ అయిన మా సాదిక్ సోషల్ సర్విస్ ప్రయోగాలు అక్కడితో ఆగలేదు... 

ఎక్కడో అడవిలో ఒక సినిమా సెట్‌లా పెద్ద కుటీరం వేసాడు. అక్కడి ఆదివాసి పిల్లలు, ప్రజలకు కావల్సిన ఆహారం, బట్టలు, పుస్తకాలు, చలికాలం స్వెట్టర్లు వంటివి ఇవ్వటం కొన్నాళ్లపాటు ఒక ఉద్యమంలా చేసాడు.   

కోవిడ్ లాక్‌డౌన్ టైమ్‌లో కూడా - ఊళ్ళల్లో పిల్లలకు పుస్తకాలు, యాండ్రాయిడ్ ఫోన్లు, చలికి వణుకుతున్న పిల్లలకు, పెద్దలకు బ్లాంకెట్లు, ఆకలితో ఉన్నవారికి నిత్యావసర వస్తువులు... ఇలా చాలానే చేశాడు సాదిక్. 

ఇప్పుడు తన పుట్టిన ఊరు కల్లూరులో (ఖమ్మం జిల్లా) - తన సోషల్ సర్విస్ యాక్టివిటీ కోసమే ప్రత్యేకంగా ఒక ఇల్లు కట్టుకొని, ఆ చుట్టుపక్కల ఊళ్ళలోని స్కూల్స్‌కు, స్టుడెంట్స్‌కు ఎన్నో విషయాల్లో సహాయం అందిస్తున్నాడు. 

ఒకసారి నేను కల్లూరు వెళ్ళినప్పుడు - సాదిక్ సోషల్ యాక్టివిటీ గోడవున్‌లో - పిల్లలకిచ్చే వందలాది కొత్త సైకిళ్ళు, గుట్టలకొద్దీ కొత్త పుస్తకాల కట్టలు, పుస్తకాల బ్యాగులు, స్వెట్టర్లు, చెద్దర్లు వంటివి చూసినప్పుడు కలిగిన అనుభూతి... నిజంగా అదొక గూస్‌బంప్స్ మూమెంట్.     

సాదిక్ అందిస్తున్న సహాయంతో చాలా స్కూళ్ళల్లో పిల్లలు రికార్డ్ స్థాయిలో మంచి రిజల్ట్స్ సాధించి, వారు చదువుతున్న ఆయా స్కూల్స్‌కు మంచి గుర్తింపుని తెచ్చిపెడుతున్నారు.

ఎంతో మంది బాగా చదివే పిల్లలు ఉన్నత చదువుల కోసం డబ్బులేక చదువు ఆపే పరిస్థితుల్లో, వారందరికి ఫీజులు, ఇతర ఏర్పాట్లు చేస్తూ పై చదువులకు పంపిస్తున్నాడు.

స్పోర్ట్స్, గేమ్స్‌లో ఆసక్తి ఉన్న ఎంతో మంది గ్రామీణ స్కూల్స్‌లోని పిల్లలకు అవసరమైన సహాయం చేసి, ఎన్నోసార్లు వాళ్లచేత టోర్నమెంట్స్ గెలిపించాడు, కప్పులు తెప్పించాడు.  

సాదిక్ తలపెట్టిన ఎన్నో సాంఘిక సేవా యజ్ఞాల్లో ఇదంతా ఒక నాన్-స్టాప్ యజ్ఞం.    


అయితే - నిజానికి ప్రభుత్వాలు చెయ్యవల్సిన ఇలాంటి సాంఘిక సేవా కార్యక్రమాలన్నీ సాదిక్ ఏదో పేరు కోసమో అవార్డుల కోసమో చెయ్యటం లేదు. 

ఇదంతా - తన వ్యక్తిగత ఆసక్తి. తన ఇష్టం. తన తపన.

అంతే.  

కట్ చేస్తే -   

ఇక్కడొక మాట ప్రత్యేకంగా చెప్పాల్సి ఉంటుంది... సాదిక్‌ను ఇష్టపడి, ప్రేమించి పెళ్ళిచేసుకొన్న ఉష లేకపోతే సాదిక్ జీవితంలో బహుశా ఇవన్నీ అంత సులభంగా సాధ్యమయ్యేవి కావని నాకనిపిస్తుంటుంది. బహుశా అందుకేనేమో, సందర్భం వచ్చినపుడల్లా ఎలాంటి భేషజాల్లేకుండా తన జీవన సహచరి ఉష గురించి, తన జీవితంలో, తన విజయాల్లో ఆమె పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్తుంటాడు సాదిక్.    

పూర్వాశ్రమంలో జర్నలిస్టుగా ఆయనకున్న హేమాహేమీల పరిచయాలు, జ్ఞాపకాలు అనేకం. తర్వాత ఒక బిజినెస్ మ్యాన్‌గా ఆయన ఎదుగుదల, ఆయన సంపాదన కూడా అసలెవ్వరూ ఊహించని స్థాయిది. 

సాదిక్‌కు జ్యోతిష్యం తెలుసు. హిమాలయాలకు వెళ్తాడు. చాలామంది బిజినెస్ పీపుల్, వివిధ రంగాల్లోని మిత్రులు, ప్రముఖులు ఆయన సలహాల కోసం వ్యక్తిగతంగా సంప్రదిస్తుంటారు. ఇది చాలామందికి తెలియని ఆయనలోని ఇంకో రహస్య కోణం.   

అదంతా రాయాలంటే బ్లాగ్ సరిపోదు. ఒక బయోగ్రఫీ అవుతుంది.     

అప్పుడు ఎంత సంపాదించాడో ఇప్పుడంత సాంఘిక సేవచేస్తూ ఖర్చుపెడుతున్నాడు సాదిక్. తన స్థోమతను మించి అవసరమయినప్పుడు, సింపుల్‌గా ఫేస్‌బుక్‌లో ఒక సింగిల్ లైన్ పోస్టు పెట్టడం ద్వారా, సోషల్ సర్విస్ పట్ల ఆసక్తి ఉన్నవారి నుంచి అప్పటి అవసరానికి తగినంత సపోర్ట్ కూడా అందుకుంటున్నాడు.    

అసలు సోషల్ మీడియాను - పాజిటివ్ కోణంలో - సోషల్ సర్విస్ కోసం కూడా ఎంత బాగా వాడొచ్చో సాదిక్ నుంచి నేర్చుకోవచ్చు. 


బై ది వే - మా సాదిక్ భాయ్‌కి అప్పట్లో ఫేస్‌బుక్‌లో ఓనమాలు నేర్పించింది నేనే అని అప్పుడప్పుడూ నాకు సరదాగా గుర్తు చేస్తుంటాడు సాదిక్.  

సాదిక్ తను అనుకున్నది చేస్తాడు. అనుకున్నట్టుగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తాడు. తను చేస్తున్న పనిలోనే జీవితాన్ని అనుక్షణం అనుభవిస్తాడు.  

అందుకే మా సాదిక్ భాయ్ అంటే నాకిష్టం.  

ఈరోజు పుట్టినరోజు జరుపుకొంటున్న సందర్భంగా, నా ఆత్మీయ మిత్రుడు సాదిక్‌కు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. 

లవ్ యూ అన్నా, త్వరలోనే కలుద్దాం.        

- మనూ 

Tuesday 2 July 2024

పిచ్చాసుపత్రి మేధావులెలా ఉంటారంటే - 1


ఇందాకే మా అసిస్టెంట్ డైరెక్టర్ పంపించిన ఒక ఫేస్‌బుక్ లింకుని ఓపెన్ చేసి చదివాను... అది డైరెక్టర్ నాగ్ అశ్విన్ KALKI2898AD సినిమా మీద ఆయన కక్కిన విషం. 

ఇలాంటివాళ్ళు ఇంకా ఉన్నారని అప్పుడప్పుడు ఈ తరహా మేథో-రివ్యూలు చదివినప్పుడు తెలుస్తుంటుంది.

ఆమధ్య సందీప్ రెడ్డి వంగా ANIMAL సినిమా మీద కూడా కొందరు సూడో-మేధావులు ఇలాంటి విషమే చిమ్మారు. అది పాత కథ. 

కట్ చేస్తే -      

వందల కోట్లు పెట్టి తీసి, వేల కోట్లు కొట్టేసే "స్కీమ్" అట కల్కి! 

ఎంత నాన్సెన్స్? అసలే కాలంలో ఉన్నారు వీళ్ళు? 

సినిమా అనేది పూర్తిగా ఒక ఎంటర్‌టైన్మెంట్ మీడియా, ఒక బిగ్ బిజినెస్ అన్న కామన్ సెన్స్ వీళ్ళకు ఎప్పుడొస్తుంది? 

స్టార్ వార్స్, స్పయిడర్ మ్యాన్, టర్మినేటర్, గ్లేడియేటర్, లార్డ్ ఆఫ్ ద రింగ్స్ లాంటి సినిమాలన్నీ ఏ లాజిక్‌కు నిలబడతాయి? 

ఇలాంటి సూడో-మేధావుల లెక్కల్లో సినిమా తీయాలంటే ఇంక హాలీవుడ్ దుకాణం మూసుకోవాల్సిందేగా?

ఈయన చాలా బాగున్నవి అని పొగిడిన పాతాళభైరవి, మాయాబజార్, కేజీయఫ్, బాహుబలి సినిమాలు కూడా, ఈయనే ఈకలు-తోకలు పీకి చెప్తున్న చెత్త లాజిక్స్‌కి నిజంగా నిలబడతాయా?   

పాయింట్ బై పాయింట్, కల్కి2898ఏడీ సినిమాను తనివితీరా చీల్చి చెండాడుతూ, తన అంతరాంతరాల్లో ఉన్న ఏదో తీరని కోరికను ఒక భారీ శాడిస్టిక్ పోస్టుపెట్టడం ద్వారా తీర్చుకొన్న ఈయన, ఆ పోస్టు చివర్లో, "చివరి మాట" అని ఇంకో పనికిమాలిన కొత్త పాయింట్ తీశాడు.

దాని సారాంశం ఏంటంటే... ఈయన ఆనందం కోసం, తెలంగాణ డైరెక్టర్స్ కేవలం మల్లేశం, బలగం, పెల్లిచూపులు, విరాటపర్వం లాంటి చిన్న చిన్న సినిమాలే తీయాలి!

అంటే, "మీరు చిన్న సినిమాలే తీయాలి, బీద సినిమాలే తీయాలి, మాకు నచ్చే లెఫ్టిజమ్ ఓరియెంటెడ్ సినిమాలే తీయాలి" అని ఇన్‌డైరెక్టుగా "ఇదీ మీ పరిధి" అని తెలంగాణ డైరెక్టర్స్‌కు చెప్పడమేగా?    

ఎంత కుళ్ళు? ఎంత పైశాచిక శాడిజానందం?   

అసలు క్రియేటివిటీకి ఇలాంటి ప్రాంతీయ హద్దులుంటాయా?

ఈయన చెత్త లాజిక్స్‌కు అందని మన భారతీయ సినిమాలెన్నో అమెరికా, ఇంగ్లండ్, జపాన్, చైనా వంటి దేశాల్లో సైతం ఇప్పుడు కోట్లు కొల్లగొట్టడం లేదా?    

ఇంకెప్పుడు మారతారు వీళ్ళు?   

- మనోహర్ చిమ్మని

Thursday 27 June 2024

నాగ్ అశ్విన్, అమితాబ్, ప్రభాస్‌ల విశ్వరూపం


ఇప్పుడే చూసొచ్చా... కల్కి2898ఏడీ మొదటి భాగం. 

మామూలుగా మన సినిమాల్లో తప్పనిసరిగా ఉండే  ఒక రొటీన్ హీరో లేడు, ఒక రొటీన్ హీరోయిన్ లేదు, రొటీన్ ఫార్ములా లేదు. డ్యూయెట్ సాంగ్స్ లేవు.

అన్నీ శక్తివంతమైన పాత్రలే. 

అసలు ఏమాత్రం గ్లామర్ లేని ఒక ప్రధానపాత్రలో దీపికా పదుకోన్ సహజ నటన కూడా సూపర్బ్. కమలహాసన్ పాత్ర జస్ట్ శాంపిల్ చూపించాడు. రెండో భాగం మొత్తం ఆయనే ఉండే అవకాశముంది.    

స్టార్‌వార్స్‌లు, మ్యాడ్ మ్యాక్స్‌లు, లార్డ్ ఆఫ్ ద రింగ్స్‌లు... ఒక్క హాలీవుడ్డే కాదు, మనమూ తీయగలం అని నిరూపించిన నాగ్ అశ్విన్‌ & టీమ్‌కు అభినందనలు.  

వెటరన్ నిర్మాత అశ్వినీదత్, సహ నిర్మాతలు స్వప్న దత్, ప్రియాంక దత్‌ల గట్స్‌కు హాట్సాఫ్. 

రాజమౌళి, రామ్‌గోపాల్ వర్మ అతి చిన్న ఫ్లాషీ కేమియో రోల్స్‌లో కనిపించటం హైలైట్! 

ఇంకా - మాళవిక నాయర్, మృణాల్ ఠాకూర్, డైరెక్టర్ అనుదీప్ కూడా ఈ సినిమాలో గెస్ట్ అపియరెన్స్ ఇచ్చారు.  

కట్ చేస్తే -  

ఈకలు తోకలు పీకకుండా... హాలీవుడ్ రేంజ్‌కు ఏమాత్రం తక్కువకాని మన తెలుగు సినిమాను కూడా ఎంజాయ్ చేయండి. మన మహాభారతాన్ని ఒక అద్భుతమైన క్లాసిక్ ఎంటర్‌టైనర్ సై-ఫై సినిమాకు ముడివేస్తూ మళ్ళీ ముందుకుతెచ్చిన మన డైరెక్టర్ నాగ్ అశ్విన్‌ను అప్రిషియేట్ చెయ్యండి. 

ఎంజాయ్ సినిమా. ఎంజాయ్ ఎంటర్‌టైన్మెంట్. 

- మనోహర్ చిమ్మని 

Sunday 23 June 2024

నిజంగా అది లేకపోతే ఈ పదేళ్ళు నాకు ఎలా గడిచేవో!


పదేళ్ళ క్రితం ఒకరోజు పొద్దున్నే మా పెద్దబాబు బయటికెళ్ళాడు. మామూలుగా రోజూలాగే ఫ్రెండ్స్ దగ్గరికో, రన్నింగ్‌కో, స్విమ్మింగ్‌కో అనుకున్నాను. 

కాని కాదు. 

కట్ చేస్తే - 

ఒక రెండున్నర గంటల తర్వాత, చేతిలో చిన్న బ్లూ కలర్ ప్లాస్టిక్ బుట్టతో ఇంట్లోకొచ్చాడు మా పెద్దబాబు. నేను పెద్దగా పట్టించుకోకుండా నా పనిమీద నేనున్నాను. నా గదిలోకెళ్ళాను.  

మెల్లగా హాల్లోంచి గుసగుసలు వినిపించసాగాయి. మా చిన్నబాబు, పెద్దబాబు, మా సుజ్జి ఏదో సీక్రెట్‌గా మాట్లాడుకుంటున్నారు.  

ఇంకో నిమిషం తర్వాత చిన్న కుక్క పిల్ల కుయ్ మంటూ శబ్దం చేసింది. 

అర్థమైపోయింది నాకు. పెంచుకోడానికి కుక్క పిల్లను తెచ్చాడన్నమాట! 

కట్ చేస్తే -  

ఆ తర్వాత కనీసం ఒక మూడు నాలుగు రోజుల పాటు నాకు, మా ఇంట్లోని మిగతా ముగ్గురికీ మధ్య యుద్ధం జరిగింది. 

మూడువేల రూపాయలు పెట్టి కొనుక్కొని తెచ్చిన ఆ కుక్కపిల్లను తిరిగి అక్కడే ఇచ్చిరమ్మని నేను, లేదు పెంచుకుంటాం అని నా ఆపోజిషన్ పార్టీ! 

చివరికి వాళ్ళే గెలిచారు.  

నా మనసు మార్చుకున్నాను. ఆ కుక్కపిల్లకు పేరు కూడా నేనే పెట్టాను.  


ఇప్పుడు అదంటే నాకు చాలా ప్రేమ. వాళ్లందరికంటే ఎక్కువ ప్రేమ. అది లేకుండా నేనుండలేను. నాకోసం కూడా అది ఎదురుచూస్తుంటుంది. నేను డల్‌గా ఉన్న సమయాల్లో నన్ను ఆడిస్తుంది, ఇన్‌స్పయిర్ చేస్తుంది, నేను మళ్ళీ యాక్టివ్ అయ్యేవరకు నా పక్కనే నన్ను ఆనుకొని పడుకొంటుంది. 

నిజంగా అది లేకపోతే ఈ పదేళ్ళు నాకు ఎలా గడిచేవో అని అనుకుంటాను అప్పుడప్పుడూ. ఇది అతిశయోక్తి కాదు. నిజం.

అలా పదేళ్ళ క్రితం పొద్దున్నే ఓల్డ్ సిటీ దాకా వెళ్ళి, ఆ రోజు మా పెద్దబాబు తెచ్చిన ఆ చిన్న కుక్క పిల్లే మా లక్కీ.

దాని 10వ బర్త్ డే ఈ రోజు. 

హాపీ బర్త్ డే మై డియర్ లక్కీ!    

- మనోహర్ చిమ్మని 

Saturday 22 June 2024

మనం చేసే తప్పుల్లో అన్నిటికంటే పెద్ద తప్పు...


కొన్ని రంగాలు ఎలాంటివి అంటే - మనం చదివిన చదువులు, మనం చేసిన ఉద్యోగాలు, పనిచేసిన ప్రొఫెషన్లు, జీవితంలో మనం సాధించిన ఒకటీ అరా విజయాల ముందు... ఎందుకూ పనికిరానివాళ్ళతో మనం మాట్లాడాల్సి ఉంటుంది. డీల్ చెయ్యాల్సి ఉంటుంది. బలవంతంగా అసోసియేట్ అవ్వాల్సి ఉంటుంది. నానా హెడేక్స్ భరించాల్సి ఉంటుంది. అంతిమంగా ఎంతో డబ్బూ సమయం నష్టపోవాల్సి ఉంటుంది. 

కాని, ఇది ఆయా ఫీల్డుల తప్పు కాదు. కనిపించేదే నిజమని నమ్మి మనం తీసుకున్న మన నిర్ణయాల తప్పు. మనం నమ్మిన వ్యక్తుల్లో మనకు తెలియకుండా అపరిచితులుంటారని తెలియని అమాయకత్వంలో వాళ్ళతో అసోసియేట్ అవ్వటం ద్వారా జరిగిన తప్పు. 

సినిమా రంగంలో కూడా ఇలాంటి తప్పులు అనేకం జరుగుతాయి. మనుషులను మనుషులుగా నమ్మి నేనూ చాలా నష్టపోయాను. చాలా బాధపడ్డాను.   

కట్ చేస్తే - 

ఇలాంటి తప్పులు చేయడం తప్పు కాదు. కాని, వెంటనే అలర్ట్ అయి - ఆ తప్పులు, ఆ వ్యక్తులు, ఆ పరిస్థితులు ఎట్టి పరిస్థితుల్లోనూ మన జీవితంలోకి మళ్ళీ రాకుండా చేసుకోవడంలో అశ్రద్ధ చూపడం అనేది మాత్రం మనం చేసే తప్పుల్లో అన్నిటికంటే పెద్ద తప్పు. 

No more such mistakes. No more keeping quiet.  

- మనోహర్ చిమ్మని 

Tuesday 18 June 2024

నా తొలి ప్రేయసి


"అసలు మీ స్ట్రెంత్ రైటింగే!" అని నేను అతి దగ్గరగా తెలిసినవాళ్ళు చాలామంది చాలా సార్లు అన్నారు నాతో. 

"దాన్ని మరీ ఇంత కేర్‌లెస్ చెయ్యకుండా ఏదైనా రాయొచ్చుగా" అని కూడా ఈమధ్యే ఒక శ్రేయోభిలాషి అన్నారు. 

వినను కదా... 

కట్ చేస్తే - 

ఫండింగ్ ఏర్పాట్ల పనులు, ఇంక నానా తలనొప్పులు ఊపిరాడనీయకుండా చుట్టూ కమ్ముకొని ఉన్నా కూడా... అనుకోకుండా నిన్న రాత్రి నుంచి నా దృష్టి ఎందుకో స్క్రిప్ట్ రైటింగ్ మీద పడింది. 

ఇప్పుడు చేస్తున్న నా సినిమా #Yo ఫైనల్ డ్రాఫ్ట్‌కు తుది మెరుగులు దిద్దటం, వెంటనే షూటింగ్ స్క్రిప్ట్ మొదలెట్టి పూర్తిచెయ్యటం ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉన్నాయి. ఏ వైజాగ్‌కో, గోవాకో వెళ్ళి, ఒక అయిదు రోజుల్లో ఫోకస్డ్‌గా రాసి, పని పూర్తిచేద్దామనుకొంటూ చాలా సమయం గడిచిపోయింది. ఫైనల్ స్క్రిప్ట్ పని మాత్రం ఎక్కడిదక్కడే అలా ఆగిపోయింది.

ఉన్నట్టుండి రాత్రి ఎందుకో నా ఫోకస్ మొత్తం నా రైటింగ్ మీద పడింది. ఇదిగో, ఇవ్వాళ రాత్రి కూడా రాస్తూనే ఉన్నాను.

నాకే కొంత ఆశ్చర్యంగా ఉంది. కాని, నేను చాలా ఆనందంగా ఉన్నాను. 

ఎందుకంటే -

నా తొలి ప్రేమ, తొలి ప్రేయసీ... నా రైటింగే.   

- మనోహర్ చిమ్మని 

Sunday 16 June 2024

ఒక్క ఛాన్స్, ప్లీజ్!


తెలుగు సినిమాలో ఒక్క ఛాన్స్ వస్తే చాలు అని ముంబై నుంచి కూడా మన టాలీవుడ్ వైపు చూస్తున్న రోజులివి. 

హీరోలు, హీరోయిన్స్, ఆర్టిస్టులే కాదు... అసిస్టెంట్ డైరెక్టర్ చాన్స్ కోసం కూడా ఢిల్లీ, ముంబై, రాజస్థాన్, గుజరాత్, యూపీ లాంటి రాష్ట్రాల నుంచి కూడా హైద్రాబాద్‌కు రావడానికి ఎంతోమంది కొత్తవాళ్ళు రెడీగా ఉన్నారు. 

అవకాశం ఇచ్చి, వెండితెరకు పరిచయం చేస్తే చాలు. పారితోషికం కూడా అక్కర్లేదు. అలా ఉంది డిమాండ్. 

ఒక్క ఆర్టిస్టులు, టెక్నీషియన్సే కాదు... ముంబై నుంచి మ్యూజిక్ డైరెక్టర్స్, సింగర్స్ కూడా మన దగ్గర ఈ "ఒక్క ఛాన్స్" కోసం ప్రయత్నిస్తున్నారు.

కట్ చేస్తే -  

నేనిప్పటివరకు చేసిన 3 సినిమాల్లో కనీసం ఒక 55 మంది వరకు కొత్త ఆర్టిస్టుల్ని, టెక్నీషియన్స్‌ను పరిచయం చేశాను. వారిలో కొందరు ఇప్పుడు ఆర్టిస్టులుగా, టెక్నీషియన్స్‌గా మంచి పొజిషన్స్‌లో ఉన్నారు. 

అయితే - వాళ్ళల్లో ఇప్పుడు ఎంతమంది నాతో టచ్‌లో ఉన్నారన్నది డిఫరెంట్ కొశ్చన్. 

నా గత అనుభవాల నేపథ్యంలో... కొందరు సీనియర్ డైరెక్టర్ మిత్రులు చెప్పిన మాట కూడా వినకుండా, ఇప్పుడు చేస్తున్న సినిమాలో కూడా నేను కొందరు కొత్తవాళ్ళని పరిచయం చేస్తున్నాను. 

"ఒక్క ఛాన్స్, ప్లీజ్" అని అవకాశం కోసం వెంటపడుతున్నవాళ్లను పట్టించుకోకుండా, నాకు నేనుగా కొందర్ని పిలిచి అవకాశం ఇవ్వడం కూడా తప్పేమో అని ఈమధ్య అప్పుడప్పుడూ అనిపిస్తుంటుంది. 

ఈ అవకాశం విలువ వీళ్లకి అర్థంకావడం లేదా? ఆ విలువని వీళ్ళు గుర్తించడం లేదా? 

- మనోహర్ చిమ్మని 

Thursday 13 June 2024

అది వారి మానసిక వైకల్యం... అదే వారి జీవన విధానం


మానసిక వ్యాధిగ్రస్తులు కొందరు నా బ్లాగులోకో, నా సోషల్ మీడియాలోకో వచ్చి అప్పుడప్పుడు కొన్ని చెత్త కామెంట్స్ పెడుతుంటారు...

వారి భవిష్యత్తు గురించి, వారిని భరిస్తున్న వారి కుటుంబం గురించి నాకు చాలా జాలి అనిపిస్తుంది. 

కట్ చేస్తే -

ఈ ప్రపంచంలో ఏ ఒక్క విషయంపైనైనా అందరి అభిప్రాయాలు, ఆలోచనలు ఒక్కలా ఉండవు. ఉండాల్సిన అవసరం లేదు. 

అసలు నేనే కరెక్ట్ అనుకోవడం కంటే పెద్ద బుద్ధి తక్కువ పని ఇంకోటి ఉండదు. అలా నేననుకోను. 

అంతే కాదు, ఒకప్పుడు నేను కరెక్టు అనుకున్నవి అన్నీ ఇప్పుడు కరెక్ట్ కాకపోవచ్చు. 

మార్పు సహజం.  

There is nothing permanent except change.

నా బ్లాగులోనో, నా సోషల్ మీడియాలోనో నా ఇష్టాలు, నా ఆలోచనలు, నా పాయింటాఫ్ వ్యూలు నేను రాసుకొంటుంటాను. అది నా స్వేచ్ఛకు సంబంధించిన విషయం. 

అందరికీ నా రాతలు నచ్చాల్సిన అవసరం లేదు. నచ్చనివాళ్ళు నిర్మాణాత్మకంగా విమర్శ చేయవచ్చు. వారి పాయింటాఫ్ వ్యూ చెప్పవచ్చు. 

కాని, బీపీ తెచ్చుకొని ఒక సైకోలా ఏదేదో చెత్త రాయడం, బూతులు రాయడం... ఇవన్నీ వారి మానసిక పరిస్థితిని తెలుపుతాయి. లాజిక్ ఎదుర్కోలేనివారే ఇలాంటి ఆవేశం తెచ్చుకొంటారు. సహనం కోల్పోతారు. లోపల్లోపల వారిలో పెరుగుతున్న మానసిక వ్యాధి పైకొస్తుంది. ఏదో చెత్త కామెంట్ చేస్తారు. సంతృప్తిపడతారు. 

అది వారి మానసిక వైకల్యం. అదే వారి జీవన విధానం.  

అలాంటి జీవరాశులు కూడా సోషల్ మీడియాలో ఉంటాయి అనుకొని, సూపర్ స్టార్ రజినీకాంత్ చెప్పినట్టు "మనపనిలో మనం ముందుకెళ్తుండటమే" మనం చేయగలిగింది.  

- మనోహర్ చిమ్మని 

Tuesday 11 June 2024

CBN Proves Age is Just a Number !!


ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు. నా మిత్రులు, శ్రేయోభిలాషులు, బంధువులు కూడా ఎందరో ఏపీలో ఉన్నారు... వారందరికి కూడా నా ప్రత్యేక శుభాకాంక్షలు. 

పాలిటిక్స్ ఒక డిఫరెంట్ గేమ్. బయటికి కనిపించే పాలిటిక్స్ వేరు. ఇంటర్నల్ పాలిటిక్స్ వేరు. ఈ గేమ్‌లో అతిరథమహారథులతో ఒక ఆట ఆడుకున్న అనుభవం సి బి యన్ కు ఉంది. అలాగే, ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న అనుభవం కూడా.  

కాని, 74 ఏళ్ళ వయస్సులో కూడా సంపూర్ణమైన ఫిట్‌నెస్ మెయింటేన్ చేస్తూ, ఒక అత్యంత కఠినతరమైన లక్ష్యం పెట్టుకొని, ఆ లక్ష్యాన్ని బాహాటంగా బయటికి చెప్పి మరీ సాధించటం గొప్ప విషయం. 'Age is just number' అని సి బి యన్ తాజాగా ప్రూవ్ చేశారు. పార్టీలకతీతంగా ఇలాంటి సక్సెస్ సైన్స్‌కు సంబంధించిన అంశాలు నన్ను బాగా ఆకట్టుకుంటాయి. 

కట్ చేస్తే -   
 
5 సంవత్సరాల తర్వాత, సి ఎం గా మళ్ళీ అధికారం చేపట్టబోతున్న సందర్భంగా సి బి యన్ గారికి హార్దిక శుభాకాంక్షలు.  

ఎన్నో సవాళ్లున్నాయ్. సి బి యన్ ఈ సారి రెచ్చిపోతారనటంలో సందేహం లేదు. ఆ అవసరం ఉంది కూడా. ఫోకస్ అటువైపే పెడితే మంచిది. బిల్ గేట్స్ ఏం ఖర్మ, ఆయన బాబుని కూడా రప్పిస్తారాయన. ఆ విజన్, ఆ మెకానిజం ఆయనకుంది. 

రాష్ట్రంలోనే కాదు, ఖండాంతరాల్లో కూడా ఆయనకోసం ఏదైనా సరే చెయ్యడానికి, ఎప్పుడూ సిద్ధంగా ఉండే వేలాదిమంది అత్యున్నతస్థాయి డైహార్డ్ అభిమానగణాన్ని కలిగి ఉన్నారాయన. అదంత మామూలు విషయం కాదు. ప్రత్యక్షంగా, పరోక్షంగా వారంతా కూడా సి బి యన్ విజయంలో ప్రధాన పాత్ర వహించినవారే. వారి కంట్రిబ్యూషన్ కూడా చాలా విలువైంది.  

ఆంధ్రప్రదేశ్ ప్రజలు సి బి యన్ నుంచి ఏం ఆశించి ఇంత ఘనమైన విజయం ఆయనకి అందించారో అది పూర్తిచేయగల సత్తా ఆయనకుంది. చేస్తారని ఆశిస్తూ... రేపు ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణస్వీకారం చేయబోతున్న చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి హార్దిక శుభాకాంక్షలతో -            

- మనోహర్ చిమ్మని         

Saturday 8 June 2024

మీడియా మొఘుల్‌కు నివాళి


కోట్లాదిమందిని ఒక పత్రికకు ఎడిక్ట్ చెయ్యటం అంత చిన్న విషయం కాదు. అన్నదాత, చతుర, విపుల లాంటి పత్రికల ఆలోచన ఇంకెవ్వరైనా చేశారా? భాష గురించి, జర్నలిజం స్కూల్ గురించి ఆయన చేసిన కృషి మరే పత్రికాధిపతులు చెయ్యలేకపోయారు. ఒక టీవీ చానెల్‌తో ప్రారంభించి, ఈటీవీ చానెల్స్‌ను ఎన్నెనో భాషల్లో దేశమంతా విస్తరింపజేసిన ఘనత కూడా ఆయనదే. ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్‌లో ఎన్నెన్నో అద్భుతమైన సినిమాలు నిర్మించారు. ప్రపంచస్థాయి ఫిలిం సిటీ గురించి ఊహించడానికే ఎన్నో గట్స్ కావాలి. ఆర్ ఎఫ్ సి రూపంలో అలాంటిది నిర్మించి చూపించారాయన.
ఒకటిరెండు విషయాల్లో ఆయన దృక్కోణం పక్కనపెడితే, సక్సెస్ సైన్స్ పాయింటాఫ్ వ్యూలో రామోజీరావుది ఒక గొప్ప రాగ్స్-టు-రిచెస్ స్టోరీ. మనిషి తల్చుకొంటే ఏదైనా సాధ్యమే అని నిరూపించిన ఈనాడు గ్రూపు సంస్థల సామ్రాజ్యాధినేత రామోజీరావుకు నివాళి. - మనోహర్ చిమ్మని

Thursday 6 June 2024

అన్ని గంటలు ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళడం అవసరమా?


మొన్న మొన్నటివరకూ యు యస్ అంటే నాకు పెద్ద ఆసక్తి ఉండేది కాదు. వరల్డ్ వార్స్, ఇతర హిస్టరీ గురించి విద్యార్థి దశలో నేను చదివిన పుస్తకాలు, వ్యాసాల ద్వారా తెలుసుకున్న కొన్ని అంశాల నేపథ్యంలో - ఆ దేశం పట్ల అంత మంచి అభిప్రాయం కూడా నాకు ఉండేది కాదు.

ఇదంతా పక్కనపెడితే, అసలు అన్ని గంటల జర్నీ చేసి అక్కడికి వెళ్ళడం అవసరమా అనుకునేవాన్ని.

ఆ జర్నీ టైమ్‌లో సగం కంటే తక్కువ సమయంలోనే యూరోప్‌లో అద్భుతమైన స్విట్జర్లాండ్ లాంటి దేశాలకు వెళ్ళొచ్చు కదా అనుకునేవాన్ని. 

కట్ చేస్తే -  

మొన్నటి నా 20 రోజుల అమెరికా ట్రిప్, ఆ దేశం పట్ల, ఆ సుధీర్ఘమైన ఫ్లయిట్ జర్నీ పట్ల నా ఆలోచనావిధానాన్ని పూర్తిగా మార్చేసింది.  

ఒక దేశం ఎందుకు అన్ని దశాబ్దాలుగా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా కొనసాగగలుగుతోందో అర్థమైంది. 

అంతర్జాతీయ రాజకీయాలు, ఆయుధపాటవాలు కాదు. దేశభక్తి, పెంటాగన్లు, సి ఐ ఏ లు కూడా కాదు. వీటన్నిటినీ మించిన ఆయుధం కూడా ఒకటి అమెరికా దగ్గరుంది...

వ్యక్తిగత క్రమశిక్షణతో కూడిన ఫ్రీడమ్!

అది లేకుండా ఇవేవీ సాధ్యం కాదు. బహుశా అదే దాని అడ్వాంటేజ్.  అది అక్కడి ప్రతి పౌరునిలో కనిపిస్తుంది...

అక్కడున్నంత సేపూ దాన్ని మనమూ ఫీలవుతాం. 

- మనోహర్ చిమ్మని 

Wednesday 5 June 2024

మిగతాదంతా సేమ్ టు సేమ్!


ఇది సాధారణ విజయం కాదు. అంత సింపుల్ కాదు. 

ఇందులో ఎలాంటి మాయ లేదు. మర్మం లేదు. 

రైట్ టైమ్‌లో రైట్ డెసిషన్స్ తీసుకోవడం. "ఎవడేమనుకున్నా సరే, ఏదేమైనా సరే... నేను సాధిస్తున్నాను, సాధించి తీరతాను" అనే కిల్లర్ ఇన్‌స్టింక్ట్. 

అతనిలోని సహజసిద్ధమైన ఇంకొన్ని క్వాలిటీస్ కూడా వీటికి బాగా తోడయ్యాయి.   

మా సినిమా ప్రపంచం నుంచి రాజకీయాల్లో ఇటీవల ఇదే అతిపెద్ద రికార్డు. రేపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోను తన రేంజ్ సత్తా చూపించడానికి ఇది చాలు. 

ఇంతకు ముందు ఎన్నికల్లో తాను పోటీచేసిన రెండుచోట్లా ఓడిపోవడం ఆయన్ను డిజప్పాయింట్ చెయ్యలేదు. ఇంచ్ కూడా వెనక్కి తగ్గనీయలేదు.  

మొన్న అక్టోబర్‌లో చంద్రబాబు నాయుడును జైల్లో పెట్టినప్పుడు, వెళ్ళి కలిశాడు. ఒక నిర్ణయం తీసుకున్నాడు. "బాబుతో నేనున్నాను, మేం కలిసి పోటీచేస్తాం" అని బయటికొచ్చి రెండు మాటలు చెప్పాడు. 

నా ఉద్దేశ్యంలో - అతని ఈ ఒక్క నిర్ణయం ఒక సెన్సేషనల్ బటర్‌ఫ్లై ఎఫెక్ట్‌లా పనిచేసింది. 

కట్ చేస్తే - 

"పార్టీ పెట్టింది పోటీ చెయ్యడానికి కాదు, ప్యాకేజీల కోసం" అని ఎన్నోరకాల మాటలతో ఎగతాళి చేసినవాళ్లందరికీ మొహం మీద గుద్దినట్టుగా స్ట్రెయిట్ సింగిల్ పంచ్ ఆన్సర్.   

21/21, 2/2... 100% మాండేట్! 

దటీజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.  

Heartfelt congratulations to Power Star Pawan Kalyan on this special occasion! Wishing you a powerful tenure ahead as an even more powerful politician!!

- Manohar Chimmani 

Friday 31 May 2024

నో హిపోక్రసీకి బ్రాండ్ అంబాసిడర్ ఆయన!


ఆయన సినిమానే ఒక స్పెషల్ జోనర్. ఆ జోనర్‌లో ఆయన్ని బీట్ చేసేవాడు లేడు. ఇంకా ఏలుతున్నాడు. 

ఆయన ఒక సరదా మనిషి. చాలా మంచి వాడు.

నో హిపోక్రసీకి బ్రాండ్ అంబాసిడర్ ఆయన. చేసేదొకటి చెప్పేదొకటి ఉండదు. అంతా ఒక్కటే.

ఆయన లైఫ్‌స్టయిల్ నాణేనికి కూడా "జీవించే జీవితం, జీవించాలనుకునే జీవితం" అని అందరిలా రెండు పార్శ్వాలుండవు. అంతా ఒక్కటే. సింపుల్‌గా చెప్పాలంటే 'ఆర్జీవీ' కంటే అరవై రెట్లు ఎక్కువ. 

ఒక్కటే లైఫ్ అన్నది ఆయనకి బాగా తెలుసనుకుంటాను. ఒక రేంజ్‌లో లైఫ్ ఎంజాయ్ చేస్తాడు. 

స్టేజీ మీద ఈ మాటంటే... లేదా, ఇలా ప్రవర్తిస్తే ఎవరు ఏమనుకుంటారో, ఎలాంటి అర్థాలు తీస్తారో, సోషల్ మీడియాలో ఏం ఆడుకుంటారో, దాన్ని పొలిటీషియన్స్ ఎలా వాడుకుంటారో... ఇవన్నీ ఆయనకు పట్టదు. పట్టాల్సిన పన్లేదు. డోంట్ కేర్... జస్ట్ ఫక్కాఫ్. 

కాని, హీరోయిన్స్ హైహీల్స్ వేసుకొని ఉంటారు. సడెన్‌గా అలా తోసేసినప్పుడు, కిందపడితే చాలా డేంజర్. అదొక్కటే... 

కాని, ఇది కూడా ఆయన ఆలోచించడు. అంత టైమ్ వృధా చెయ్యడు. తన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా 'జోన్ అవుట్' అవ్వకుండా, తన ఆరాలో ఉండితీరాలనుకుంటాడు. అదే ఆయన స్టైల్. 

ఆయనదొక ఫ్లో.

ఆయన దగ్గర్లో ఉన్నప్పుడు ఆ ఫ్లో ఎటుతిరిగి ఎటు వస్తుందో తట్టుకొనే శక్తి కూడా చుట్టు ఉన్నవాళ్ళకి ఉండాలి. ఉండితీరాలి.

మిగిలిందంతా జస్ట్ బుల్‌షిట్.  

కట్ చేస్తే -

అక్కడ యు యస్ లో అయినా, ఇక్కడ హైద్రాబాద్‌లో అయినా... పబ్బుల్లో ఆయన పాటలు మోగుతుంటాయి. ఆ ఫాన్స్ ఈ ఫాన్స్ అన్న తేడా లేకుండా అందరూ ఆయన పేరుని జైకొడుతుంటారు. డాన్స్ చేస్తుంటారు. 

అదొక మేనియా. అదొక మ్యాజిక్.  

దటీజ్ బాలయ్య.   

Thursday 23 May 2024

ఫిలిం డైరెక్టర్స్ లైఫ్‌లో రియాలిటీస్ ఎలా ఉంటాయంటే...


మొన్న రాత్రి "ఆర్య-20 ఇయర్స్" ప్రోగ్రాం వీడియోలు యూట్యూబ్‌లో చూశాను. 

అప్పుడే ఒక భారీ హిట్ ఇచ్చిన ప్రొడ్యూసర్, కావల్సినంత బడ్జెట్, ఇండస్ట్రీలో ఇంకో టాప్ ప్రొడ్యూసర్ సపోర్ట్ ఉన్నా, ఆర్య సినిమా తీయడానికి డైరెక్టర్ సుకుమార్ పడ్డ కష్టాలకు లెక్క లేదు.    
ప్రతి హిట్ సినిమా వెనుక ఇంకో కథ ఉంటుంది. ఆ కథ, ఆ సినిమా కథకన్నా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఇదంతా తెలియాలంటే ఆర్య-20 ఇయర్స్ ప్రోగ్రాం వీడియోలు తప్పక చూడాలి. ముఖ్యంగా ఇప్పుడిప్పుదే కొత్తగా సినిమాల్లోకి వస్తున్న ఆర్టిస్టులు, టెక్నీషియన్లు. 

దేవిశ్రీప్రసాద్, అల్లు అర్జున్, సుకుమార్, దిల్ రాజు స్పీచ్ వీడియోలను తప్పక చూడాలి. 

రియల్లీ, ఈ నలుగురికీ నా హాట్సాఫ్.  

కట్ చేస్తే -  

ప్రోగ్రాంలో మాట్లాడినవాళ్ళంతా, థాంక్స్ చెప్తూ, పదే పదే ఒక కోరియోగ్రాఫర్ పేరు చెప్పారు. కాని, అదే సినిమాకు పనిచేసిన ఇంకో కోరియోగ్రాఫర్, నా మిత్రుడు నిక్సన్ పేరు మాత్రం అలాంటి సందర్భాల్లో చెప్పకుండా ఎవాయిడ్ చేశారు. ఎందుకో నాకు అర్థం కాలేదు. ఆ ప్రోగ్రాంలో నిక్సన్ కూర్చొని ఉన్నాడు కూడా. 

హీరోయిన్ అనూ మెహతా బహుశా అవుట్ ఆఫ్ ద ఫీల్డు అయ్యుంటుంది. లేదా, ఏ అమెరికాలోనో ఆస్ట్రేలియాలోనో సెటిలైపోయి వీరికి దొరికుండదు. కాని, సినిమా మేకింగ్‌లో ప్రతి ఒక్కరి గురించి ఎన్నెన్నో మెమొరీస్‌ను చెప్పుకుంటున్నప్పుడు, అనూ మెహతా లేకపోయినా సరే, ఆమెకు సంబంధించిన ఒకటిరెండు జ్ఞాపకాలను కూడా ఏ ఒక్కరూ చెప్పలేదు. చెప్తే బాగుండేది. 

కట్ చేస్తే - 

అల్లు అర్జున్ లేకుండా తన సినీ జీవితం లేదు అని ఎలాంటి హిపోక్రసీ లేకుండా చెప్పటం సుకుమార్ వ్యక్తిత్వాన్ని చెప్తుంది. సుకుమార్ తనకు చెప్పిన కథను ఎలాగైనా సరే చేసి తీరాలని అల్లు అర్జున్ పడిన శ్రమ రియల్లీ గ్రేట్. (అల్లు అర్జున్ గురించి ఇంకోసారి, ఇంకో బ్లాగ్‌లో రాస్తాను.)   

సినిమా రిలీజ్‌కు ముందు తనకిష్టమైన ఒక చిన్న మాంటేజ్ షాట్ తీయడానికి, ప్రొడ్యూసర్‌ను ఒప్పించటం కోసం, చివరికి అతని కాళ్ళు కూడా పట్టుకున్నాడంటే సినిమా పట్ల సుకుమార్ ప్యాషన్ ఏ స్థాయిదో తెలుస్తుంది. అలా ఒక్క సారి కాదు, రెండుమూడు సార్లు జరిగిందట! 

అది ఫ్రెండ్లీగా అయినా సరే, డైరెక్టర్స్ లైఫ్‌లో రియాలిటీస్ అలా ఉంటాయి. 

మరోవైపు, ఈ సినిమా కోసం ప్రొడ్యూసర్‌గా దిల్ రాజు పడ్డ కష్టాలకు కూడా లెక్కలేదు. ఒకసారి ప్రోగ్రాం వీడియోస్ చూడండి, తెలుస్తుంది.  టాప్ ప్రొడ్యూసర్స్ ఊరికే కారు. 

సుకుమార్ తన స్పీచ్‌లో చెప్పిన ఇంకెన్నో విషయాల ద్వారా తెలుసుకోవాల్సింది, రియలైజ్ కావల్సింది చాలా ఉంది...

ముఖ్యంగా సినీఫీల్డుకి బయట ఉండి సినిమా డైరెక్టర్స్ గురించి నానా చెత్త మాట్లాడేవాళ్ళు, కొత్తగా ఫిలిం డైరెక్టర్స్ కావాలనుకుంటున్నవాళ్ళు.   

- మనోహర్ చిమ్మని 

Thursday 16 May 2024

ఇండిపెండెంట్ ఫిలిం మేకింగ్ అనేది ఒక టీమ్ వర్క్


ఇండస్ట్రీలో యాక్టివ్‌గా ఉన్న ప్రొడ్యూసర్స్ దగ్గర ఎప్పుడూ కనీసం ఒక డజన్ మంది రైటర్స్-డైరెక్టర్స్ క్యూలో ఉంటారు. మన టర్న్ రావడానికి చాలా టైమ్ పడుతుంది.

అసలు రాకపోవచ్చు కూడా. 

కట్ చేస్తే - 

ఫిలిం కెరీర్‌లో "గ్యాప్" అనేది అలాంటి ఒక పెద్ద గ్యాప్‌ని క్రియేట్ చేస్తుంది... ఫెయిల్యూర్ కాదు. 

అందుకని, చిన్నదో పెద్దదో, ఏదో ఒక ప్రాజెక్టు చేసుకుంటూ ట్రాక్‌లో ఉండటం ముఖ్యం. గ్యాప్ అనేది ఉండదు, ఉండకూడదు. 

తాజాగా ఒక చిన్న హిట్ ఇచ్చినా, కొంచెం 'బజ్‌'లో ఉన్నా.... మళ్ళీ పరిస్థితి వెంటనే మారిపోతుంది. అది వేరే విషయం. 

సో... ఇలాంటి పరిస్థితి ఇండస్ట్రీలో ఎప్పుడూ ఉండేదే కాబట్టి, గ్యాప్ ఉండి, పైన చెప్పిన క్లోజ్డ్ సర్కిల్‌కు బయట ఎవరైనా సినిమా చేయాలనుకుంటే, కొత్తగా ఎవరి ప్రొడ్యూసర్స్‌ను వాళ్లే  క్రియేట్ చేసుకోవాలి.

దీన్నే 'ఇండిపెండెంట్ ఫిలిం మేకింగ్' అనొచ్చు మనం. 

ఇండిపెండెంట్ ఫిలిం మేకింగ్ అనేది ఒక టీమ్ వర్క్.

టీమ్‌లో అందరి లక్ష్యం, అందరి ఫోకస్ ఒక్కదానిమీదే ఉండాలి. అలా ఉండలేనప్పుడు అది టీమ్ కాదు. జస్ట్ కిచిడీ. అలాంటి కిచిడీతో గొప్ప ఫలితాలు రాబట్టడం అంటే కుక్క తోక పట్టుకొని గోదారి ఈదినట్టే. 

ఇది రియలైజ్ అయినవాళ్ళకు మాత్రమే ఏదైనా సాధించే అవకాశం ఉంటుంది. సినిమాలో అయినా, ఇంకే ఫీల్డులో అయినా. 

- మనోహర్ చిమ్మని 

Tuesday 14 May 2024

Make Movies That Make Money


ఈ టైటిల్‌తో ఇంగ్లిష్‌లో ఒక మంచి బుక్ కూడా ఉంది.ఫిలిప్ కేబుల్ రాశాడు. ఆసక్తి ఉన్నవాళ్ళు చదవ్వొచ్చు...

కట్ చేస్తే -   

ఇండస్ట్రీలో యాక్టివ్‌గా ఉన్న ప్రొడ్యూసర్స్ దగ్గర ఎప్పుడూ కనీసం ఒక డజన్ మంది రైటర్స్-డైరెక్టర్స్ క్యూలో ఉంటారు. మన టర్న్ రావడానికి చాలా టైమ్ పడుతుంది. అసలు రాకపోవచ్చు కూడా. 

ఫిలిం కెరీర్‌లో గ్యాప్ అనేది అలాంటి గ్యాప్‌ని క్రియేట్ చేస్తుంది. ఫెయిల్యూర్ కాదు. 

తాజాగా ఒక చిన్న హిట్ ఇచ్చినా, కొంచెం 'బజ్‌'లో ఉన్నా మళ్ళీ పరిస్థితి వెంటనే మారిపోతుంది. 

అది వేరే విషయం. 

సో, ఇలాంటి పరిస్థితి ఇండస్ట్రీలో ఎప్పుడూ ఉండేదే కాబట్టి, పైన చెప్పిన సర్కిల్‌కు బయట ఎవరైనా సినిమా చేయాలనుకుంటే - కొత్తగా ఎవరి ప్రొడ్యూసర్స్‌ను వాళ్లే  క్రియేట్ చేసుకోవాలి.  

దీన్నే 'ఇండిపెండెంట్ ఫిలిం మేకింగ్' అనొచ్చు మనం. 

కట్ చేస్తే -

మారిన కార్పొరేట్ ఫిలిం బిజినెస్ కండిషన్స్‌లో, బడ్జెట్ అనేది అసలు సమస్య కానే కాదు. చిన్న బడ్జెట్‌లో అయినా - మంచి కంటెంట్‌తో, బిజినెస్ అవగాహనతో సినిమా తీస్తే అసలు నష్టం ఉండదు. 

థియేటర్ బిజినెస్, ఓటీటీ రైట్స్, డిజిటల్ రైట్స్, డబ్బింగ్ రైట్స్, రీమేక్ రైట్స్ వంటి ఎన్నో ఆదాయ మార్గాల నుంచి భారీ ప్రాఫిట్స్ ఉంటాయి. 

ఓవర్‌నైట్‌లో కావల్సినంత ప్రమోషన్. సెలబ్రిటీలతో మీటింగ్స్, పార్టీలు... నిజంగా అది వేరే లోకం. 

మారిన బిజినెస్ కండిషన్స్‌లో, సినిమాల్లో ఇన్వెస్ట్ చెయ్యడం కూడా మంచి ఇన్వెస్ట్‌మెంటే. సినీ ఫీల్డు మీద, సినిమాల్లో ఇన్వెస్ట్‌మెంట్ మీద నెగెటివ్ మైండ్‌సెట్ ఉన్నవారు తప్ప ఎవరైనా సినిమాల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. భారీగా బిగ్ మనీ సంపాదించొచ్చు. 

ఒక ఫిలిం ఇన్వెస్టర్‌గా, ఇంకెన్నో ఇతర బిగ్ బిజినెస్ మాగ్నెట్స్ కాంటాక్ట్స్ సంపాదించుకోవచ్చు. 

సోషలైజింగ్, పార్టీలు, గ్లిట్టరాటి... ఇవన్నీ మామూలే. ఇంకా, మీ జీవితంలో ఊహించని వ్యక్తులను కలుస్తుంటారు. మీరెన్నడూ కలగనని వ్యక్తులతో పార్టీల్లో పాల్గొంటారు. 

ప్రపంచంలో ఏ బిజినెస్‌ను తీసుకున్నా సక్సెస్ రేట్ 10 శాతం మించదు. సినిమా కూడా అంతే. సినిమా ఫీల్డు పట్ల నెగెటివ్ మైండ్‌సెట్ ఉన్నవాళ్ళు ఇలాంటి స్టాటిస్టిక్స్ ఒప్పుకోడానికి ఈగో అడ్డొస్తుంది. అలాంటివారి గురించి మనకు సమస్య లేదు. ఎందుకంటే వాళ్లని అసలు మనం పట్టించుకోం. 

కొంతమంది సినిమాల్లో ఒకవైపు కోట్లు సంపాదిస్తూనే, కొత్తగా సినిమా తీయాలని వచ్చేవాళ్లను డిస్కరేజ్ చేస్తుంటారు. అదొక సైకలాజికల్ టెక్నిక్ అని వాళ్ళకి వాళ్లే ఫీలవుతుంటారు. అలాంటివాళ్ళను కూడా మనం పట్టించుకోం. 

హిట్, ఫట్‌లతో సంబంధం లేకుండా, ఒక మంచి అవగాహనతో సినిమా తీయగలిగితే చాలు. ఎలాంటి నష్టం ఉండదు.

జీరో రిస్క్!

ఇప్పుడు ఫిలిం బిజినెస్ అలాంటి కార్పొరేట్ స్థాయికి ఎదిగింది. ఇది చాలామందికి తెలియదు. తెలుసుకోవాలనుకోరు. అలాంటి మోరన్స్ గురించి కూడా మనకు అవసరం లేదు. 

కట్ చేస్తే - 

ఇంతకుముందులా నేను మరీ చిన్న బడ్జెట్ సినిమాలను చేయాలనుకోవటం లేదు. ఆ స్టేజీని ఎప్పుడో అధిగమించాను. ఒక్క సినిమా చేసినా, దాని మినిమం హిట్ రేంజ్ ఒక 200 కోట్లుండాలి. 

Interested? 

See you in my office... 

- మనోహర్ చిమ్మని 

Sunday 12 May 2024

చిన్ను, నేను, అమెరికా!


నేనొకసారి ఏదో షూటింగ్ పనిమీద అనుకుంటాను, ఓ నాలుగైదు రోజులు అవుట్‌స్టేషన్‌కు వెళొచ్చాను. అప్పుడు మేము న్యూ బోయిన్‌పల్లిలోని పద్మావతి కాటేజెస్‌లో ఉన్నాము. 

బయటనుంచి బెల్ కొట్టి ఇలా ఇంట్లోకి ఎంటర్ అయ్యానో లేదో... చిన్ను (మా చిన్నబ్బాయి) పరుగెత్తుకుంటూ వచ్చి నన్ను చుట్టేసుకున్నాడు. వెంటనే ఎత్తుకున్నాను. అంతే... నేను ఇంట్లో ఇంకెవ్వరితో మాట్లాడకుండా, వాళ్లవైపు చూడకుండా, నా ముఖాన్ని తన రెండుచేతులతో గట్టిగా పట్టుకొని, గ్యాప్ ఇవ్వకుండా నా ముఖమంతా ముద్దులతో ముంచెత్తాడు చిన్ను.  

"ఒరే ఇంక చాల్లేరా... మీ డాడీ అంటే నీకు చాలా ఇష్టం అని మాకర్థమైందిలే... ఇంక చాలు" అని గట్టిగా అంటూ, వాన్ని నా నుంచి లాక్కునేదాకా నా ముఖం నిండా ముద్దులు పెట్టడం ఆపలేదు చిన్ను. 

అప్పుడు మా చిన్ను వయస్సు బహుశా ఓ రెండు సంవత్సరాలుంటుంది. 

కట్ చేస్తే - 

ఇవ్వాళ ఉదయం మా చిన్ను కొత్త సొనాటా కారులో, వాడు డ్రైవ్ చేస్తుంటే పక్కన కూర్చొని, ప్రపంచపు అత్యంత శక్తివంతమైన దేశం అమెరికాలోని రోడ్ల మీద క్రూజింగ్ చేస్తూ, వాడు చెప్తున్న మాటలు వింటుంటే నాకే అంతా ఒక కలలా ఉంది. 

జస్ట్ కొన్ని గంటల క్రితం నేను మొట్టమొదటిసారిగా యు యస్ వచ్చాను... ఇప్పుడు అమెరికాలో సాయంత్రం నాలుగవుతోంది.

ఇంకొన్ని గంటల్లో మా చిన్ను పుట్టినరోజు... 12 మే. 

Wishing the happiest of birthdays to my dear younger son, Chinnu! 🎉 May this year be filled with boundless joy, good health, and the fulfillment of all your dreams. Keep shining bright! ✨ 

- మనోహర్ చిమ్మని 

నిజంగా నీలో సత్తా ఉంటే నువ్వేదైనా అవుతావ్!


"ఇక్కడ ఎవ్వడు ఎవ్వనికి నేర్పడు. ఒళ్ళు దగ్గరపెట్టుకొని పని చెయ్యి. చేస్తూ నేర్చుకో. నీలో సత్తా ఉంటే నువ్వేదైనా అవుతావ్, నిన్నెవ్వడు ఆపలేడు."

ఈ డైలాగ్ ఏ సినిమాలో?
ఎవరన్నారు?
కొంచెమైనా గుర్తుకొస్తోందా? 

సినిమాల్లోకి రావాలనుకొనే ఔత్సాహికులు, న్యూ టాలెంట్ కింద కామెంట్స్‌లో రాయండి.  

గుర్తుకు రావట్లేదంటే నువ్వు సినీఫీల్డుకు పనికిరావ్. ఇంకా చాలా స్టడీ చెయ్యాలి.
   
కట్ చేస్తే -

జీవితంలో మంచి అవకాశం అనేది ఒక్కసారే వస్తుంది. నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. అప్పుడుగాని నువ్వు ఆ అవకాశాన్ని ఉపయోగించుకోలేదంటే అంతే. 

మినిమమ్ ఒక పదేండ్లు బొక్క! అన్నేండ్లు నీకయ్యే లక్షల ఖర్చు ఇంకా పెద్ద బొక్క!!... లేదంటే, ఇంక ఇంతటితో నీ "సినిమా కెరీర్ ప్రయత్నాలకు ఇక్కడితో ఫుల్ స్టాప్" అని నీకు నువ్వే పెట్టుకుంటావ్. 

So, take right decision. 

- మనోహర్ చిమ్మని 

Wednesday 8 May 2024

కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అనవసరం!


ఎదుటివారు షేర్ చేసుకొంటున్న పెయిన్‌ను కూడా లైట్ తీసుకొని, సులువుగా ఇంకో వెరీ పెయిన్‌ఫుల్ మాట అనగలిగే సత్తా అందరికీ ఉండదు.

అయితే అది నోటి దూల అవుతుంది. లేదంటే "నేను మాత్రమే కరెక్టు" అనే అహంకారం అవుతుంది. 

రెండూ ప్రమాదకరమే. 

కట్ చేస్తే -

ఇప్పుడు చేస్తున్న నా తాజా సినిమా బడ్జెట్‌ను ఇప్పుటిదాకా అనుకున్న బడ్జెట్‌కు 66.6% ఎక్కువకి పెంచాను. ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ ఇవ్వటం కోసం తప్పటం లేదు. ఈ విజువల్ ట్రీట్‌లో ప్రధాన భాగం... హీరోయిన్స్. 

ఇన్వెస్టర్స్, టీమ్ అంతా కూడా హాపీ.   

ఇంక కాంప్రమైజ్ ఏం లేదు. అనుకున్న పనులు అనుకున్నట్టు చేసుకుంటూ ముందుకువెళ్ళడమే.

త్వరగా ఫ్రీ అయిపోవడం ఒక ట్రాక్. ఎక్కడా ఆగకుండా పనిచేసుకొంటూ ముందుకెళ్తుండటం ఇంకో ట్రాక్. రెండూ నాకు చాలా ముఖ్యం. 

19 రోజుల ఈ ఎబ్రాడ్ ట్రిప్ తర్వాత ఉంటుంది అసలు కథ. అప్పటికి ఎలక్షన్ కోడ్ చాలావరకు రిలాక్స్ అయిపోవచ్చు.  

Make films that make BIG MONEY. 

Tuesday 7 May 2024

ఫిలిం కెరీర్ అంటే డబ్బొక్కటే కాదు!


తను అనుకున్న జీవనశైలిని సృష్టించుకోడాన్ని మించిన ఆనందం ఇంకొకటి ఉండదు. అది బిచ్చగాడయినా ఒకటే. బిలియనేర్ అయినా ఒకటే.

ఎవడి పిచ్చి వాడికానందం.

రాజకీయాలు, సినిమాలు, క్రికెట్... ఈ మూడింటికీ మన దేశంలో ఉన్నంత ఇంట్రెస్టు బహుశా వేరే దేశంలో ఉండకపోవచ్చు. ఈ మూడూ మన దేశంలో కోట్లాదిమంది జీవితాల్ని డైరెక్టుగానో, ఇన్‌డైరెక్టుగానో చాలా ప్రభావితం చేస్తున్నాయి.

కోట్లాదిమందికి ఉపాధి కల్పిస్తున్నాయి. 

కట్ టూ సినిమా -  

మూడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేసి వదిలేశాక, నా జీవితంలో అనేక ఎత్తుపల్లాలు చూశాను. సుఖాల శిఖరాగ్రాలు, కష్టాల అగాధపు అంచులు. అన్నీ చూశాను.

చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు, నా జీవితంలో ఎంతో విలువైన సమయం పరమ రొటీన్‌గా వృధా చేశాక, ఇప్పుడిప్పుడే నేను కోరుకుంటున్న స్వతంత్ర జీవనశైలివైపు అడుగులేస్తున్నాను.  

నిజానికి - అలా వృధా కాకపోతే, బహుశా ఇలాంటి ఆలోచన కూడా నాకు వచ్చేది కాదేమో!

కమర్షియల్ సినిమానా, కేన్స్ కు వెళ్లే సినిమానా... ఇది కాదు ప్రశ్న. నీకెంత ఫ్రీడమ్ ఉంది, నువ్వేం చేయగలుగుతున్నావు అన్నది మొదటి ప్రశ్న. ఈ ప్రొఫెషన్ ద్వారా నువ్వెంత సంపాదిస్తున్నావు అన్నది రెండో ప్రశ్న.   

అది సినిమానా, పుస్తకాలా, పెయింటింగా, ఇంకొకటా అన్నది కూడా కాదు ప్రశ్న. నువ్వు చేస్తున్నపనిలో నీకెంత ఆనందం ఉంది అన్నదే అసలు ప్రశ్న.

ఆ ఆనందమే స్వేఛ్చ. ఆ స్వేఛ్చకోసమే అన్వేషణ.

కట్ చేస్తే -  

వివిధ రూపాల్లో క్రిటిక్స్ ఎప్పుడూ ఉంటారు... 

సినిమా బాగోలేదని రివ్యూయర్స్ రాస్తుంటారు. చెత్తగా ఉందని మనమంటే పడనివాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. "డైరెక్టర్‌కు చేతకాలేదు, అసలు ఇలా తీయాల్సింది సినిమా" అని ఫిలిం మేకింగ్‌కు సంబంధించి అ ఆ లు కూడా తెలియనివాళ్ళు చెప్తారు. "అసలు ఆఫీల్డే వెధవ ఫీల్డు, అందులోకెందుకెళ్ళావ్" అని ఇంకొందరు నిలదీస్తారు. "ఇన్నేళ్ళయింది కదా, ఏం సాధించావ్" అని ఇంకొందరు ఉపన్యాసాలిస్తారు. 

ఈ క్రిటిసిజమ్‌కు లెక్క లేదు. అంతు లేదు. 

అయితే - అరుదుగా, వీళ్లలో కొందరు మాత్రం మన మంచి కోరి చెప్తారు, మనం ఇబ్బందుల్లో పడిపోకూడదని చెప్తారు. మిగిలినవాళ్లంతా జస్ట్ ఉచితసలహాదారులే. గట్టు మీద కూర్చొని రాళ్లేసేవాళ్లే. 

దూకినవాడికే కదా తెలుస్తుంది లోతెంతో! 

సో, నీ ఇంట్యూషన్ చెప్పినట్టు నువ్వు చెయ్యి. తప్పకుండా అనుకున్నది సాధిస్తావు. 

మిగిలిందంతా జస్ట్ నాన్సెన్స్. 

పని చూసుకో! Just Do Your Work...


మన నేపథ్యం, మనం పెరిగిన వాతావరణం, మన అనుభవాలు... మనకో మైండ్-సెట్‌ను ఫిక్స్ చేస్తాయి. మనలాంటి మైండ్-సెట్టే అవతలివాళ్లకు కూడా ఉండాలనుకోంటే ఎలా?

కట్ చేస్తే -

జీవితంలో ఒక దశ దాటాక కొందరికి "నేను అనుకున్నదే కరెక్టు" అన్న మానసిక స్థితి స్థిరపడిపోతుంది. అది వారి వ్యక్తిగత విషయాలవరకు అయితే ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేదు. కాని, అలాంటి మానసిక స్థితిలో ఎదుటివారిని జడ్జ్ చెయ్యడం అనేది పెద్ద తప్పు. ఈ విషయంలో కొందరిపట్ల ప్రేమతో, వారు సాధించిన విజయాల పట్ల ఆరాధనాభావంతో, వీరికి మనం ఇచ్చే గౌరవం అలుసు కాకూకడు. కాని, అవుతుంది. చివరికి అదొక అలవాటుగా కూడా మారిపోతుంది. అది చాలా ప్రమాదం.         

కట్ చేస్తే -  

సినిమా మీద పూర్తి దృష్టి పెట్టి, దాన్ని ఒక తపస్సులా పనిచేస్తున్నవారికే విజయావకాశాలు 5% లోపు ఉంటున్నాయి. అంతకంటే ఇంకా తక్కువ ఫలితాలుంటున్నాయి. 

ఇలాంటి నేపథ్యంలో - "అసలు సినిమా ఒక్కటే ఇప్పుడు నా ప్రొఫెషన్" అని ఫిక్స్ అయిపోయాక, ఎవరైనా ఎంత జాగ్రత్తగా ఉండాలి? కొత్త తలనొప్పుల్లోకి వెళ్ళటం ఎంతవరకు కరెక్టు? అలా వెళ్ళి నానా విధాల మాటలు వినటం, పడటం అవసరమా? 

నువ్వు ఏ పనిచేసినా, ఎవరిని కలిసినా, ఎవరితో సమయం గడిపినా... అది నీ ప్రధాన లక్ష్యం సాధించడానికి తోడ్పడేది అయ్యుండాలి. నిన్ను బాధపెట్టేది, నీ ప్రధాన లక్ష్యం నుంచి నిన్ను వేరు చేసేది, పక్కదారి పట్టించేది కాకూడదు. నీ మనసుని వ్యధపెట్టి, నీ బాధ్యతల్ని విస్మరించేలా చేసేది కాకూడదు.  

గైడెడ్ మిసైల్ ఎప్పుడూ దారి తప్పదు. ఎన్ని అడ్డంకులు వచ్చినా సరిగ్గా వెళ్ళి లక్ష్యాన్నే ఛేదిస్తుంది. సరిగ్గా సెట్ చేసిన సమయానికే ఛేదిస్తుంది.

ఒక్కసారి ఆలోచించు... నువ్వు ఎన్నిరోజులు, ఎంతకాలం బ్రతుకుతావో తెలీదు. 

Just do your work. Live life to the fullest. Everything else is just bullshit.   

Saturday 4 May 2024

Happy Birthday Sir!


ఒకే ఒక్క సంవత్సరంలో 15 సినిమాలు డైరెక్ట్ చేసి రిలీజ్ చేయగలరా?

"అవును, చేయొచ్చు" అని 1980 లోనే నిరూపించారు దర్శకరత్న దాసరి నారాయణరావు గారు. అంటే నెలకి ఒక సినిమా కంటే ఎక్కువే! అలాగని ఏదో చుట్టచుట్టి అవతల పడేసిన సినిమాలు కావవి. వాటిల్లో కనీసం 70% సినిమాలు హిట్లు, సూపర్ హిట్లు, సిల్వర్ జుబ్లీలు! స్వప్న, శ్రీవారి ముచ్చట్లు, సర్కస్ రాముడు, సర్దార్ పాపారాయుడు, సీతారాములు మొదలైనవి ఆ లిస్ట్ లోనివే.

ఒకే రోజు 4 చోట్ల 4 సినిమాల షూటింగ్ జరుగుతుంటుంది. దర్శకుడు మాత్రం ఒక్కరే. దాసరి గారు! ఎక్కడికక్కడ షాట్స్ ఎలా తీయాలో తన అసిస్టెంట్స్‌కి చెబుతూ, 4 లొకేషన్లకు తిరుగుతూ, తీసిన షాట్స్ చూసుకొంటూ, అన్నీ మళ్లీ రివ్యూ చేసుకోవడం, అవసరమైతే కరెక్షన్స్ చేసుకోవడం. అద్భుతం ఏంటంటే, అలా తీసిన 4 సినిమాలూ హిట్ సినిమాలే కావడం!

ఇలా తన పనిలో ఎక్కువభాగం చూసుకొన్న అప్పటి తన అసోసియేట్ డైరెక్టర్స్‌కు గురువుగారు "కో-డైరెక్టర్" అన్న టైటిల్ కార్డ్ కొత్తగా క్రియేట్ చేసి మరీ ఇచ్చారు. అదీ తన అసిస్టెంట్స్‌కు దాసరిగారిచ్చిన గౌరవం.

ఈ 'కో-డైరెక్టర్' కార్డ్ నేపథ్యం ఇప్పటి కోడైరెక్టర్లలో ఎంతమందికి తెలుసు?

ఇండస్ట్రీ చరిత్రలో మొట్టమొదటిసారిగా "డైరెక్టర్" పొజిషన్‌కు ఒక స్థాయి, ఒక విలువ, ఒక గౌరవం, ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ తీసుకొచ్చిన ఘనత గురువుగారిదే. అప్పట్లో ఆయన చెన్నై నుంచి ఫ్లైట్‌లో హైద్రాబాద్ వచ్చారంటే చాలు. ఇక్కడ బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌లో కనీసం ఒక 30 కార్లలో డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్, టెక్నీషియన్స్, ఆర్టిస్టులు, అభిమానుల కాన్వాయ్ ఎప్పుడూ రెడీగా ఉండేదంటే విషయం అర్థం చేసుకోవచ్చు. దటీజ్ డైరెక్టర్ దాసరి! 

కట్ చేస్తే -

'లెజెండ్' దాసరి గారి దగ్గర ఒకే ఒక్క సినిమాకు నేను అబ్జర్వర్/అసిస్టెంట్ డైరెక్టర్‌గా  పనిచేయగలగడం నా అదృష్టం. ఆ 4 నెలల సమయంలో ఆయన నాపట్ల చూపిన ప్రేమ, అభిమానం నేను ఎన్నటికీ మర్చిపోలేను.

> ఆయన చెప్పిన జోకులు, తెలుగులో ఒక్క అక్షరం స్పెల్లింగ్ తప్పుగా రాసినా ఆయన పట్టుకొనే విధానం, తాజ్ బంజారాలో మరో కొత్త సినిమా కథా చర్చలు, మధ్యలో ఒక కథకు అమితాబ్ బచ్చన్ గారిని ఒక క్యారెక్టర్‌ కోసం అనుకొని, అప్పటికప్పుడు ఆయనకు కాల్ చేయడం, టైమ్ కాని టైముల్లో, ఆయన సొనాటా కారులో వెనక ఇద్దరు గన్‌మెన్స్ మధ్య టెన్షన్‌తో కూర్చుని ఆయనతోపాటు నేను తిరిగిన ట్రిప్పులు, ఆర్టిస్టులకు, టెక్నీషియన్స్‌కు ఆయనిచ్చే గౌరవం, అవసరమయినప్పుడు చూపించే ఆ క్షణపు కోపం .. ఇంకా ఎన్నో, ఎన్నెన్నో .. గురువుగారికి సంబంధించి నేను మర్చిపోలేని అద్భుత  జ్ఞాపకాలు.

> జూబ్లీహిల్స్‌లోని మణిశర్మ 'మహతి' రికార్డింగ్ థియేటర్లో, రికార్డింగ్‌తో ప్రారంభించిన నా తొలి చిత్రం "కల" కోసం నేను ఆహ్వానించగానే గురువుగారు ఎంతో సంతోషంగా వచ్చి, పూజదగ్గరే గంటసేపుకి పైగా నిల్చుని, తనే స్వయంగా అన్ని పూజా కార్యక్రమాలు దగ్గరుండి నా చేత చేయించటం, తర్వాత థియేటర్ లోపల రికార్డింగ్ ప్రారంభించడం, ట్యూన్‌లు, ట్రాక్‌లు అన్నీ చాలా ఓపిగ్గా వినడం .. నాకు బెస్ట్ విషెస్ చెప్పడం .. నేనెన్నటికీ మర్చిపోలేని మరో మధురసృతి.

థాంక్యూ ఫర్ ఎవ్రీథింగ్ సర్! ... మీరు లేరని నేననుకోవడంలేదు. అనుకోలేను. 

So, wherever you are... Happy Birthday Sir!
And... Happy Directors' Day to All the Lovely Directors Out There!! 

***

(గురువుగారి మీద నా పాత బ్లాగ్ పోస్టును కాస్త నిడివి తగ్గించి రీ-పోస్ట్ చేశాను.) 

Wednesday 24 April 2024

కొత్త ఫిమేల్ సింగర్స్ (4 గురు) వెంటనే కావాలి!

> మిలియన్స్‌లో మీ పాట ప్రపంచమంతా వినాలనుకుంటూన్నారా? 
> సెలబ్రిటీ ఫిలిం సింగర్ కావాలనుకుంటున్నారా? 

ఇది మంచి అవకాశం. 


ఈ యాడ్ చదవండి, అప్లై చేయండి. 
అప్లై చేసుకోడానికి చివరి తేది: 28-04-2024

email: mchimmani10x@gmail.com 

ఒక సినిమా, రెండు దారులు!


ప్రపంచంలో ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరికైనా… వారి జీవనశైలికి సంబంధించి రెండే రెండు దారులుంటాయి. ఎవరైనా సరే – ఆ రెండు దారుల్లోనే ఏదో ఒక దారిని ఎంచుకుంటారు. ఎంచుకొని తీరాలి. 

మొదటి దారి – మనల్ని మనం చాలా తక్కువగా అంచనా వేసుకొని, దేవుడు ఎలా రాసిపెడితే అలా జరుగుతుంది అన్నట్టుగా బతుకు వెళ్లదీయటం. 

రెండో దారి – మనలోని సంపూర్ణ సామర్థ్యాన్ని వినియోగించుకొంటూ, ఎప్పుడూ అనుకున్న పనినే చేస్తూ, అనుకున్న పధ్ధతిలోనే జీవిస్తూ, జయాపజయాల్ని స్థితప్రజ్ఞతతో స్వీకరిస్తూ, కష్టాల్లోనూ, సుఖాల్లోనూ జీవితాన్ని అనుక్షణం ఎంజాయ్ చేయడం.

మొదటి దారిలో – మనలో ఉన్న సామర్థ్యాన్ని మనం ఎప్పుడూ గుర్తించము. కనీసం మనలో కూడా ఎంతో కొంత ‘విషయం’ ఉందన్న నిజాన్ని గుర్తించడానికి కూడా మనం ఇష్టపడము. “నాకు రాదు”, “నాకు లేదు”, “ఇలా వుంటే చేసేవాణ్ణి”, “అలాగయితే సాధించేదాణ్ణి”… వంటి నెగెటివ్ థింకింగ్ సాకులన్నీ ఈ దారిలో పుష్కలంగా దొరుకుతాయి. 

ఆశ్చర్యంగా ప్రతివందమందిలో 95 మంది ఈ బాటనే ఇష్టపడతారు. 

రెండో దారిలో… ప్రతి విషయంలోనూ ఉత్సాహం, ఎప్పుడూ ఏదో ఒకటి చేయాలన్న తపన. “ఇలాగే ఎందుకు చేయాలి.. ఇలాగే ఎందుకుండాలి?” అన్న ప్రశ్న. నిరంతర ఆలోచన. అవతలి వారికి “తలతిక్క”గా కనిపించే తమకు తామే ఏర్పరచుకున్న క్రమశిక్షణ. ఎప్పటికప్పుడు ఏదో ఒక లక్ష్యం ఏర్పర్చుకోవడం, దాన్ని సాధించాలన్న నిరంతర ఆసక్తిలో సజీవంగా ఉండటం. నచ్చిన ప్రతి పుస్తకాన్నీ చదవటం, ప్రతిదాన్నీ నిర్మాణాత్మకంగా ఆలోచించడం… ఇవన్నీ ఈ రెండో దారిని ఎన్నుకున్నవారి సాధారణ లక్షణాలు.

ప్రతి వందమందిలో 5 గురు మాత్రమే ఈ బాటలో ఉంటారు.

మనసులో మెరిసిన ప్రతి ప్రయోగం చేసుకుంటూపోతుంటారు ఈ 5 గురు. అది సఫలమైందా, విఫలమైందా అన్నది పట్టించుకోరు. ఆ ప్రాసెస్‌ను, ఆ జర్నీని ఇష్టపడతారు.

కొన్నిసార్లు ఎదురుదెబ్బలు తగలొచ్చు, కాని ఫలితాలు మాత్రం అవే ఫాలో అవుతుంటాయి... విజయవంతంగా. 

కట్ చేస్తే - 

సినిమా ఫీల్డులో కూడా అంతే...

ఒక్క 5 శాతం మందే ఎప్పుడూ పనిలో బిజీగా ఉంటారు.

95 శాతం మంది పనిలేకుండా బిజీగా ఉంటారు. 

ఇప్పుడు చెప్పండి... ఏ బిజీ మీకిష్టం? 

Tuesday 23 April 2024

కొత్త లిరిక్ రైటర్స్‌కు అవకాశం!

> టాలెంట్ ఉండి, "ఒక్క ఛాన్స్" కోసం చూస్తున్న కొత్త లిరిక్ రైటర్స్‌కు మాత్రమే ఈ అవకాశం 
> తెలంగాణ మాండలికంలో మేమిచ్చే ట్యూన్స్‌కు పాటలు రాయగలగాలి.


ఇంక మీదే ఆలస్యం!  

అప్లై చేసుకోడానికి చివరి తేది: 28 ఏప్రిల్ 2024. 
email: mchimmani10x@gmail.com 

Saturday 20 April 2024

రాంగోపాల్‌వర్మ లాంటివాళ్లే ఇలాంటి వారికి బెస్ట్ ఆన్సర్స్!


"మొరగని కుక్కలేదు. విమర్శించని నోరు లేదు. ఇవి రెండూ జరగని ఊరు లేదు. మన పని మనం చేసుకుంటూ పోతూనే ఉండాలి!” 

రజినీకాంత్ ఈ మాట ఊరికే అనలేదు. ఆయన అనుభవంలో ఇలాంటి సందర్భాలు ఎన్నో వందలు చూసుంటారు. 

కట్ చేస్తే - 

ఒక టెక్నీషియన్‌గా తన పని, పరిమితుల పట్ల కనీస అవగాహన లేని అనుభవానికి అర్థం లేదు.  

డైరెక్టర్ విజువల్‌గా తనకు ఏం కావాలో, ఎలా కావాలో చెప్పి చేయించుకోడానికే కెమెరామన్. 

ఈ కనీస అవగాహన లేనిచోట ఈగో ఉంటుంది. "డైరెక్టర్‌కు నాకంటే బాగా తెలుసా" అన్న చిన్నచూపు ఉంటుంది. ఇంక, నానా ఫీలింగ్స్ ఉంటాయి. 

"అరుపులు కేకలు లేకుండా కూల్‌గా షూటింగ్ చేసుకుందాం" అని నవ్వుకుంటూ ఫ్రెండ్లీగా అన్నందుకు, "యూనియన్‌కు వెళ్తా" అని ఒక సీనియర్ కెమెరామన్ నా సినిమా షూటింగ్ ఒకరోజు దాదాపు ఆపేసినంత పనిచేయడం నాకింకా గుర్తుంది. తర్వాత మేమిద్దరం మంచి మిత్రులమయ్యాం. అది వేరే విషయం. 

అద్భుతమైన స్కిల్ ఉండి కూడా, కేవలం ముక్కుమీద కోపం, ఇలాంటి చిన్న చిన్న ఈగోల వల్ల ఇండస్ట్రీ నుంచి కనుమరుగైపోయిన ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఎందరో ఉంటారు. ఎన్ని అవలక్షణాలున్నా కొందరు మాత్రం అంత త్వరగా ఎగ్జిట్ కారు. ఆ కొందరికి కొన్ని ఎక్‌స్ట్రా టెక్నికల్ స్కిల్స్ ఉంటాయి. ఆ డీటెయిల్స్ అలా వదిలేద్దాం. 

కట్ చేస్తే - 

ఇప్పటికే నాలుగైదు బ్లాక్‌బస్టర్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ హరీష్ శంకర్ స్పీచ్‌లంటే నాకు చాలా ఇష్టం. 

ఎక్కడా తడబడకుండా, స్పష్టమైన తెలుగులో ధారాళంగా మాట్లాడతారు. తను చెప్పాలనుకున్న పాయింట్ నుంచి అంత సులభంగా డీవియేట్ అవరు. స్వల్పంగా అలా కాస్త పక్కకెళ్ళినా, చివరకు ఒక మాంచి మేకు దిగ్గొట్టినట్టుగా తను చెప్పాలనుకున్నది చెప్పి స్పీచ్ ముగిస్తారు. 


ఇవ్వాళ "ఎక్స్"లో ఆయన లెటర్ హెడ్ మీద రాసి పెట్టిన పోస్టు చూశాక ఈ బ్లాగ్ రాయాలనిపించింది...

ఎంతయినా తనతో కలిసి పనిచేసిన టెక్నీషియన్, తనకంటే సీనియర్ అయిన కెమెరామన్ మీద ఈ పోస్టు పెట్టడానికి ముందు ఆయన ఎంత మథనపడివుంటారు? ఎంత బాధపడివుంటారు? 

టీవీచానెల్స్‌లోనో, యూట్యూబ్ చానెల్స్‌లోనో ఎన్నయినా ఇంటర్యూలిచ్చుకోవచ్చు. ఆయా చానెల్స్ కోరుకొనే ఏ బుల్‌షిట్ అయినా మాట్లాడుకోవచ్చు. కాని, ఇంకొకరిని బాధపెట్టేలా కాదు. 

నీకు మరీ అంత కోరిక ఉంటే డైరెక్టర్ కావచ్చుగా?

కాలేకపోతే అక్కడితో మర్చిపో.

అంతే కాని, ఇంకో శాఖలో పనిచేస్తూ, తనే డైరెక్టర్ అయినట్టుగా ఫీలవ్వటం, అలాంటి భ్రమలో ఉంటూ డైరెక్టర్స్‌ను ఇలా కెలకటం, బాధపెట్టడం నిజానికి అందరూ చేయరు. 

చేసే కొందరితోనే సమస్య. 

అప్పటికప్పుడు ఒక స్టిల్ ఫోటోగ్రాఫర్‌ను కెమెరామన్‌ను చేసి, సక్సెస్‌ఫుల్‌గా సినిమా పూర్తిచేసి, హిట్ చెయ్యగలిగిన రాంగోపాల్‌వర్మ లాంటివాళ్లే ఇలాంటి వారికి బెస్ట్ ఆన్సర్స్.   

పి సి శ్రీరాం, రవి కె చంద్రన్, అనిల్ మెహతా, రాజీవ్ మీనన్, సంతోష్ శివన్ లాంటి గొప్ప కెమెరామెన్ల యూట్యూబ్ చానెల్ ఇంటర్వ్యూలు నేను చూసినట్టు గుర్తులేదు. ఒకవేళ వారి ఇంటర్వ్యూలు ఉన్నా, "అంతా నేనే" అన్న పనికిరాని ఈగోతో మాట్లాడివుండరు. వారు కలిసి పనిచేసిన డైరెక్టర్స్ గురించి తప్పుగా అసలు మాట్లాడివుండరు.  

Because they know very well that the cinematographer is essentially translating the director's vision into imagery, not engaging in any politics.  

- Manohar Chimmani 

Friday 19 April 2024

టాలెంట్ ఎవరి సొత్తూ కాదు!


6 గురు మ్యూజిక్ డైరెక్టర్స్... 

ఒకరు 21 సినిమాలు చేశారు. ఇంకొకరు 11 సినిమాలు చేశారు. ఇంకొకరు 3 సినిమాలు ఒకేసారి ఇప్పుడు, రైట్ నౌ, చేస్తున్నారు. ఇంకో ఇద్దరు మ్యూజిక్ లోనే బాగా సంపాదిస్తూ పిచ్చి బిజీగా ఉన్నారు. 

ఈ 6 గురు మ్యూజిక్ డైరెక్టర్స్‌లో దాదాపు అందరికీ సొంత రికార్డింగ్ సెటప్స్/స్టూడియోలు ఉన్నాయి. ఒకరికి 3 నగరాల్లో 3 స్టూడియోలున్నాయి. 

టాలెంట్ ఎవరి సొత్తూ కాదు. ప్రతి ఒక్కరిలో కావల్సినంత ఉంది. ఒక్కొక్కరు ఒక్కో యాంగిల్లో యునిక్. 

పైగా, అందరికీ ఫీల్డులో ఎన్నెన్నో అనుభవాలున్నాయి.   

వీరందరితో ఇంటర్వ్యూలు #Yo ఆఫీసులో జరిగాయి. ఈ ఆరుగురూ #Yo లో అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు... ఏ క్షణం ఓకే చెప్తానా అని! 

సినీఫీల్డులో ఒక అవకాశానికున్న విలువ అది.  

ఇందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. మా కోర్ టీమ్ మొత్తం నేను చేస్తున్న ప్రతి ఇంటర్వ్యూ చూశారు. 

సో వాట్? 

మా ప్రదీప్‌చంద్ర మాత్రం మాకు దొరకటం లేదు... అతనికంత టెన్షన్ లేదు. ఇంకా చెప్పాలంటే - ఈ అవకాశం కోసం, పై 6 గురికి ఉన్న టెన్షన్లో కనీసం 0.001% కూడా లేదు. 

ప్రదీప్ ఎక్కడ మిస్ అవుతాడా అని నేను పర్సనల్‌గా పడుతున్న టెన్షన్లో కనీసం 0.0001% కూడా అతనికి లేదు. 

ఇది కూడా ఎలాంటి అతిశయోక్తి లేని నిజం.   

Monday 15 April 2024

నీ సుఖమే నే కోరుతున్నా...


మనం చూసే దృష్టిని బట్టే మనకు అన్నీ కనిపిస్తాయి...

మనుషుల్లో నేను మంచిని, గొప్పతనాన్ని, సంకల్పబలాన్ని, మానవత్వాన్ని చూస్తాను. కొందరు లేని చెడు కోసం ఎప్పుడూ తవ్వకాలు చేస్తుంటారు. 

అదొక అనారోగ్యం అనుకొని జాలిపడటం తప్ప మరేం చెయ్యలేం.

పడుతున్నాడు కదా అని ఎదుటి మనిషిని ఏ మాటపడితే అది అనడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అలా ఏ మాటపడితే అది ఎలా అనగలుగుతున్నావో ఒకసారి ప్రశాంతంగా ఆలోచించుకోవాలి. 

అందరూ ఒకలాగే ఉండరు. నువ్వు అనుకుంటున్నట్టు అసలు ఉండరు.

ఒక మనిషి గురించి ఒకసారి నువ్వు తప్పుగా ఆలోచించడం మొదలుపెడితే - అతను పుట్టినప్పటినుంచీ మనకు అతనిలో తప్పులే కనిపిస్తాయి. అతను దగ్గినా తుమ్మినా కూడా తప్పుగానే కనిపిస్తుంది. 

ఒకరివైపు మనం ఒక వేలు చూపిస్తున్నప్పుడు, మనవైపు ఎన్ని వేళ్ళు ఉన్నాయో మనం తప్పక చూసుకోవాలి.

విత్ దట్ సెడ్...  

బహుశా కొన్ని అనారోగ్యాలు కూడా ఇలా చేయిస్తాయేమో అని కూడా ఆ వ్యక్తి గురించి నేను పాజిటివ్‌గానే ఆలోచిస్తున్నాను. 

ఆ వ్యక్తి ఆరోగ్యం గురించి బాధపడుతున్నాను. 

ఆ వ్యక్తి పైన జాలిపడుతున్నాను. 

ఆ అవ్యక్తిని ఇంకా ప్రేమిస్తున్నాను. 

అన్-కండిషనల్ సారీ చెప్పేదాకా, ఆ వ్యక్తిని ఇంకా ప్రేమిస్తూనే ఉంటాను. 

కట్ చేస్తే - 

ముందూ వెనకా ఆలోచించకుండా - ఒక వ్యక్తికి - అత్యున్నత గౌరవమిచ్చి, ప్రేమనిచ్చి మాట్లాడటం కూడా తప్పే అని తెలుసుకోవడం ఈమధ్యకాలంలో నాకు మరొక కొత్త జ్ఞానోదయం. 

అయినా సరే, నీ సుఖమే నే కోరుతున్నా...             

***

(నాకు తెలిసిన ఒక గొప్ప వ్యక్తి, మరేదీ పట్టించుకోకుండా, అనారోగ్యం నుంచి అతిత్వరగా కోలుకోవాలని ఆశిస్తూ రాసిన బ్లాగ్ ఇది.)