Wednesday 30 April 2014

ఒక జీవనశైలి కోసం ..

అమందా హాకింగ్ అనే ఓ యువతి.. భయపెట్టే చిన్న చిన్న "జాంబీ" నవలలు రాసి, అమెజాన్ కిండిల్ బుక్స్ ద్వారా అతి తక్కువ సమయంలో మిలియన్లు సంపాదించిన రికార్డ్ సొంతం చేసుకొంది ఆ మధ్య.

అమందాకి అంతమంది పాఠకులున్నారు!

జాన్ లాకి అనే ఓ డిటెక్టివ్/క్రైమ్ రచయిత కేవలం 5 నెలల్లో మిలియన్ కాపీలమ్మిన రికార్డ్ సొంతం చేసుకున్నాడు.. అదే అమెజాన్ కిండిల్ బుక్స్ అమ్మకాల్లో!

జాన్ ప్రతి 3-4 నెలలకి ఓ క్రైమ్ నవల రాసి పబ్లిష్ చేస్తాడు!! ఇతను "న్యూయార్క్ టైమ్‌స్ బెస్ట్ సెల్లర్" రచయితగా కూడా లిస్టుల్లోకెక్కాడు.

ఇక హారీ పాటర్ రచయిత్రి జె కె రౌలింగ్ గురించి ప్రత్యేకంగానే ఒక బ్లాగ్ పోస్టేంటి.. పుస్తకమే రాయొచ్చు.

అలాగే, నాకు ఎంతో ఇష్టమయిన ప్రపంచస్థాయి రచయితల్లో పావ్‌లో కోయిల్యూ ఒకరు. ఒక రచయితగా ఇప్పటివరకు ఆయన క్రియేట్ చేసిన తన పుస్తకాల అమ్మకాల రికార్డ్‌ను బీట్ చేయటం బహుశా ఎవరివల్లా ఇప్పట్లో సాధ్యం కాదు!

పుస్తకాల సేల్స్, మిలియన్లలో ఆదాయం పక్కన పెడితే - ఈ రచయితలు ఏం రాస్తున్నారన్నది పక్కనపెడితే - ఈ రచయితలందరికీ ఉన్న సృజనాత్మక స్వతంత్రం, వీరు అనుసరిస్తున్న జీవనశైలి ఎంత అందమైంది! ఒక్క సారి ఊహించండి..

ఆ ఫ్రీడమ్, ఆ లైఫ్ స్టయిల్ ముందు ఈ సినిమాలు, రాజకీయాలు.. వీటిల్లోని మేనిప్యులేషన్స్, మాఫియా మెంటాలిటీలు అసలెందుకు పనికొస్తాయి?     

Monday 28 April 2014

కొత్త ఇన్వెస్టర్లు / కో-ప్రొడ్యూసర్లకు స్వాగతం!

30 నుంచి 100 కోట్లు ఖర్చుపెట్టి తీసే భారీ సినిమాల గురించి నేనిక్కడ మాట్లాడ్డం లేదు. ఆ రేంజ్ సినిమాలు సూపర్ డూపర్ హిట్‌లయినా లాభాలు అంతంత మాత్రమే!

అదో పెద్ద గ్యాంబ్లింగ్.

వాటి విషయం వదిలేద్దాం. వాటి కోసం చాలామంది ఆల్రెడీ ఉన్నారు.

కట్ చేస్తే -  

ఇప్పుడు పూర్తిగా చిన్న సినిమాలదే హవా. వ్యాపారపరంగా కూడా ఓ గొప్ప అవకాశంగా  చెప్పుకోవచ్చు. కేవలం 50 లక్షలలోపు బడ్జెట్‌తో, అంతా కొత్తవారితో, ఓ మాంచి సినిమా తీసి రిలీజ్ చేయవచ్చు.

ఈ విషయంలో మరీ లేటెస్ట్ ఉదాహరణలు - మొన్నటి ప్రేమకథాచిత్రమ్, నిన్నటి హృదయ కాలేయం. 

అంతా కొత్తవారితో, ఇదే చిన్న రేంజ్ బడ్జెట్లో చేసిన చిత్రాల్లో - కేవలం నైజామ్ ఏరియాలోనే 10 కోట్లు కలెక్షన్ చేసిన చిత్రాలు కూడా ఉన్నాయి. దీన్నిబట్టి ఇప్పుడు బిజినెస్ ట్రెండ్ కూడా ఎలా ఉందో గమనించవచ్చు.

ఈ వైపు ఆసక్తి ఉండటం ముఖ్యం. లేదంటే, ఒక ప్యూర్ బిజినెస్‌గానయినా అలోచించగలగాలి. సినిమాలో కంటెంట్, దాని ప్రమోషన్ బాగుంటే చాలు. బిజినెస్, ప్రాఫిట్స్ విషయంలో ఎలాంటి టెన్షన్ ఉండదు.

ప్రాజెక్టు మొత్తం కేవలం 5 నుంచి 6 నెలల్లో పూర్తయిపోతుంది.

నిజంగా ఆసక్తి ఉండి, చిన్న స్థాయిలోనయినా (5 - 10 లక్షలు) వెంటనే ఇన్వెస్ట్ చేయగల కొత్త కో-ప్రొడ్యూసర్లు వెంటనే సంప్రదించవచ్చు. మీ ఇన్వెస్ట్‌మెంట్‌కి అంతా లీగల్‌గా పేపర్స్ పైన రాసుకోవడం ఉంటుంది. లాభాలు, ఇతర బెనిఫిట్లు చాలా ఉంటాయి.

పూర్తి వివరాలకోసం - సినిమా బిజినెస్/సినీఫీల్డు పట్ల నిజంగా ఆసక్తి ఉండి, వెంటనే పెట్టుబడి పెట్టగల సామర్థ్యం ఉన్నవాళ్లు మాత్రమే.. మీ మొబైల్ నంబర్ ఇస్తూ నాకు ఈమెయిల్ పెట్టండి. మా ఆఫీస్ నుంచి మీకు వెంటనే ఫోన్ వస్తుంది. లేదంటే నేనే మీకు కాల్ చేస్తాను.

ఈమెయిల్:
mfamax2015@gmail.com    

సురేశ్‌బాబు "ఓపెన్‌ హార్ట్"

టీవీ చూడ్డం అంటే - యాడ్స్ మధ్యలో వచ్చే ఏవో పనికిరాని "ఫిల్లర్స్"ని చూడ్డమని ఎక్కడో చదివాను. నా వ్యక్తిగత ఉద్దేశ్యం కూడా అదే.

ఏదో అతి ముఖ్యమైన ప్రోగ్రాం కానీ, న్యూస్ కానీ - అది కూడా నాకు పర్సనల్‌గా అవసరమైందీ, పనికొచ్చేదీ అయితే తప్ప.. సాధారణంగా నేను టీవీ చూడను. దీన్నొక గొప్ప విషయంగా నేను చెప్పడంలేదు. నాకలా అలవాటయింది అంతే.

అనుకోకుండా నిన్న రాత్రి ఎ బి ఎన్ ఆంధ్రజ్యోతిలో నిర్మాత డి సురేష్‌బాబు ఇంటర్వ్యూ చూశాను. అదీ, పూర్తిగా! నిజంగా, చాలావరకు, అదొక నో హిపోక్రసీ ఇంటర్వ్యూ అని చెప్పొచ్చు.

కట్ టూ టాపిక్ - 

ఒక బిజినెస్‌మేన్ గా కన్నా, ఒక వ్యక్తిగా సురేష్‌బాబు మాట్లాడిన ఎన్నో మాటలు నన్ను బాగా ఆకట్టుకున్నాయి. అంత రిచ్, కలర్‌ఫుల్ నేపథ్యం నుంచి వచ్చి.. బిజినెస్ గురించీ, జీవనశైలి గురించీ అంత సాధారణంగా ఆలోచించగలగటం, అలా ఉండగలగటం ఈరోజుల్లో నిజంగా అసాధ్యమైన పని.

ఎందుకిలా అంటున్నానంటే - ఫీల్డులో ఉండే అలవాట్లు, ఎట్రాక్షన్స్ అలాంటివి.

ఈ అలవాట్లు, ఎట్రాక్షన్లు.. చివరికి జీవితాన్ని బోల్తా కొట్టించడానికే టార్గెట్ చేస్తాయన్న విషయం బోల్తాపడ్డాకే  తెలుస్తుంది ఎవరికయినా!

ఇక ఫీల్డులో మోసాల విషయం సరే సరి. దానిగురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.

కట్ టూ "మల్లీశ్వరి" కత్రినా - 

ఇది అన్నింటికంటే హైలైట్ విషయం ఇంటర్వ్యూ మొత్తంలో!

మల్లీశ్వరి చిత్రంలో హీరోయిన్‌గా చేయడానికి, మొదట 25 లక్షలకి అగ్రిమెంట్‌పై సంతకం చేసిన కత్రినా కైఫ్ - తర్వాత తన రేటుని అమాంతంగా పెంచేసి, 65 లక్షలిస్తే తప్ప చేయనందిట! అప్పటికి కత్రినాకు హిందీలో కూడా ఇంకా పేరు రాలేదు, డిమాండ్ అసలు లేదు అన్నది ఇక్కడ గమనించాల్సిన విషయం.

ఆమె తప్ప ఇంక ఆ పాత్రకి వేరెవ్వరూ సరిపోరని సురేష్‌బాబు కూడా ఫిక్స్ అయిపోయాడు కాబట్టి - చివరికి కత్రినా అడిగిన 65 లక్షలు ఇవ్వక తప్పలేదు సురేష్‌బాబుకి.

దటీజ్ సినిమా..  

Friday 25 April 2014

ముంబైలో కలిసిన వారణాసి అమ్మాయి!

నరేంద్ర మోదీ నిన్న వారణాసిలో నామినేషన్ వేసినప్పటి వార్తలు చూస్తుంటే, నాకు మొట్టమొదట గుర్తుకొచ్చింది వేరే. అది పూర్తిగా రాజకీయాలతో సంబంధం లేని విషయం.

మోదీ వారణాసిలో ఎలాగూ గెలుస్తాడు. ఆ విషయం వదిలేద్దాం.

కట్ టూ టాపిక్ -    

ముంబై జూహూలోని "సీ సైడ్" హోటల్లో నన్ను కలిసిన ఒక అందమైన అమ్మాయి. ఆ అమ్మాయి పేరు విదిశ. నా రెండో చిత్రం "అలా" కాస్టింగ్ గురించి వెళ్లినప్పుడు ఆడిషన్ కోసం వచ్చిన ఎందరో ఔత్సాహిక హీరోయిన్లలో విదిశ చిట్టచివరగా వచ్చింది. విచిత్రంగా - హీరోయిన్‌గా చివరికి తనే సెలెక్టయ్యింది.

విదిశ వారణాసిలో పుట్టిపెరిగిన అమ్మాయి. "మిస్ వారణాసి" కూడా. వాళ్ల నాన్న వినయ్ శ్రీవాస్తవ ఒక రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్. ఆయనతో నాకు భలే ఫ్రెండ్‌షిప్ ఉండేది. అప్పుడప్పుడూ నా మీద ఏదో డౌట్ కూడా ఉండేది!

"అలా"లో నేను పరిచయం చేసిన విదిశ శ్రీవాస్తవ - తర్వాత చాలా తెలుగు, తమిళ చిత్రాల్లో హీరోయిన్‌గా చేసింది.
ఇ వి వి "అత్తిలి సత్తిబాబు ఎల్ కె జి", "మా ఇద్దరి మధ్యలో", ఇటీవలి శ్రీకాంత్ చిత్రం "దేవరాయ" మొదలైనవి విదిశ తెలుగులో చేసిన కొన్ని చిత్రాలు.

కట్ టూ లేటెస్ట్ హాట్ ఫేవరేట్ - 

రామ్‌గోపాల్ వర్మ "రౌడీ"లో విష్ణు సరసన హీరోయిన్‌గా చేసి, మరో స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కళ్లల్లో పడిన "శాన్వి" విదిశ సొంత చెల్లెలు.

విదిశ చెల్లెలుగా శాన్వి నాకు ముందునుంచే తెలుసు. అప్పుడు చాలా చిన్నది. హీరోయిన్ అవుతుందనుకోలేదు. అయ్యింది. చెప్పలేం.. నిజంగానే పూరి చిత్రంలో తనకు అవకాశం వస్తే మాత్రం - టాలీవుడ్‌లో శాన్వి ఒక హాట్ ఫేవరేట్ హీరోయిన్ అయితీరుతుంది.  

Wednesday 23 April 2014

ఈ రాజకీయాలు మనకెందుకు?

ప్రత్యక్ష రాజకీయాలకి సంబంధం లేని వాళ్ళు, మన లాంటి వాళ్ళు చాలా సులువుగా ఉపయోగించే మాటలు ఇవి. విచిత్రం ఏంటంటే, రాజకీయాల్లో ఉన్న వాళ్ళ అలోచన దీనికి పూర్తి భిన్నంగా ఉంటుంది.

రాజకీయ నాయకులు, వాళ్ళ సన్నిహితులు, సహచరులు మాత్రం అదే లోకం అన్నట్టు ఉంటారు. వాళ్ళ రాజకీయ ప్రయోజనాలకోసం ఏమైనా చెయ్యటానికి వెనకాడరు. రాష్త్ర విభజన లాంటి పెద్ద విషయం లో కూడా నాయకులు వారి రాజకీయ ప్రయోజనాలకే మొదటి ప్రాధాన్యం ఇవ్వటం మనం చుస్తూనే ఉన్నాం.    

ఈ రెండు వైరుధ్యమైన అలోచనల మధ్య కొంచెం సామాజిక స్పృహ ఉన్నవాడు మానసికంగా నలిగిపొతూ ఉంటాడు.

ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్ని చూసి మనం రాజకీయాల్ని అసహ్యించుకుంటున్నాం గాని, ప్రజాస్వామ్యం లో రాజకీయాలు చాలా పవిత్రమైనవి. ఎన్నికల ద్వారా అభ్యర్థుల్ని వడపోసి, మంచి పాలకుల్ని ఎన్నుకొనే అవకాశాన్నిస్తాయి రాజకీయాలు. దీన్ని మనం మర్చిపోతున్నాం. 

నిరాశ నిస్పృహలతో  రాజకీయాలకి దూరంగా ఉండి మనం సాధించేది ఏం లేదు, రాజకీయాల్లో.. ఇంకా విశ్రుంఖలత్వం పెంచిన వాళ్ళం అవ్వటం తప్ప.

మనం గట్టిగా కళ్ళు మూసుకుంటే మనల్ని అంటుకోకుండా మాయమైపోవు రాజకీయాలు.

ఎందుకంటే.. పొద్దున్నే తాగే పాల దగ్గర నుంచి, రాత్రి పడుకునే పరుపు దాక.. మన జీవితాల్లో అన్నీ రకరకాల రాజకీయాలకి ముడి పడే ఉంటాయి. కళ్ళు తెరిచి మార్చే ప్రయత్నం చెయ్యటం తప్ప మనకి వేరే దారి కూడ లేదు. అన్నీ ఫ్రీగా పంచేస్తాం అనే వాళ్ళని కాకుండా.. కాస్త అవగాహన, చిత్తశుద్ది ఉన్న వాళ్ళని అధికారం లోకి పంపించటం మన బాధ్యత.

మన దేశంలో రాజకీయ ప్రక్రియ ద్వార ఏర్పడిన ప్రభుత్వాలు చిత్తశుద్ధి తో చేపట్టిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకి - కుటుంబ నియంత్రణ, పోలియో నివారణ, హరిత విప్లవం, శ్వేత విప్లవం, విడీఐఎస్ - ఇలా చెప్పుకుంటూ పొతే చాలానే ఉన్నాయి. తల్చుకుంటే చెయ్యగల సత్తా ఉంది మన ప్రభుత్వాలకి.

ఈ మధ్య రాష్ట్ర ముఖ్యమంత్రులు పెర్ప్ఫార్మెన్స్ లో పోటీ పడటం, బాగా పని చేసిన వాళ్ళని జనాలు మళ్ళీ గెలిపించటం ఒక మంచి పరిణామం.  

అయితే తక్కువలో తక్కువగా మనం ఏం చెయ్యొచ్చు?

కనీస రాజకీయ అవగహన పెంపొందించుకోవచ్చు. ఉన్నంతలో మంచి నాయకుడిని ఎన్నుకోటానికి ఎన్నికలు వచ్చినప్పుడు ఓటు వెయ్యొచ్చు. ఓటు వెయ్యమని మనకి తెలిసిన వాళ్ళని ప్రోత్సహించొచ్చు. మనకి తెలిసిన విషయాల్ని పది మంది తో పంచుకోవచ్చు. పిల్లలకి రాజకీయాల్ని ఒక భూతంలా కాకుండా సమాజాన్ని మార్చే  ఒక ఆయుధంలా పరిచయం చెయ్యొచ్చు.

దేశ భవిషత్తునీ, మన భవిషత్తునీ శాసించే  సత్తా ఉన్న రాజకీయాల మీద ద్వేషం నింపుకోకుండ ఓపిక పట్టొచ్చు. మనం ప్రత్యేకంగా సమాజానికి ఏమి చెయ్యలేకపొయినా కనీసం నష్టం చెయ్యకుండా బ్రతకొచ్చు.

మన జీవితాల్ని అణువణువునా ప్రభావితం చేసే ఈ రాజకీయాలు మనకి కాక మరెవ్వరికి? మనం, మన ఊరు, మన దేశం, మన రాజకీయం. 2014 ఎన్నికల్లో ఓటుతో మొదలు పెడదాం ..

-- భరత్ బెల్లంకొండ  

Tuesday 22 April 2014

సత్యజిత్ రే ఏమన్నారు?

సినిమా పిచ్చి..

దీన్నే ఇంగ్లిష్‌లో "ప్యాషన్" అని కొంచెం స్టయిలిష్‌గా అంటారనుకోండి.

ఒకసారి ఇది కుట్టిందా.. అంతే. ఇక జీవితాంతం వదలదు. మనకై మనం వదిలించుకుందామన్నా కుదరని పరిస్థితులు పుట్టుకొస్తాయి. అదీ సినిమా పవర్!

ఒక్క సినిమాకు మాత్రమే ఆ పవర్ ఉంది. దానికి కారణాలు కనీసం ఓ  వందయినా నేను చెప్పగలను. కాని, దాని గురించి మరోసారి చర్చిద్దాం.

ఇక్కడ నేను చర్చిస్తున్న పాయింటు ఆర్ట్ సినిమానా, కమర్షియల్ సినిమానా అన్నది కాదు. పేరుకోసం వచ్చామా, డబ్బుకోసం వచ్చామా అన్నది కూడా కాదు.

ఇదొక ప్యాషనేట్ పద్మవ్యూహం!

ఎందుకు, ఎలా ఎంటరయ్యాం అన్నది అసలు ప్రశ్నే కాదు. ఎంటర్ అవటం వరకే మన చేతుల్లో ఉంటుంది. ఎక్జిట్ ఎలా ఉంటుందో ఏంటో ఎవరూ చెప్పలేరు. కష్టం.

ఇదంతా పక్కన పెడితే - సత్యజిత్ రే ఒక ఇంటర్వ్యూలో ఇలా అన్నారు. "సినిమా తీయాలి అన్న ప్యాషన్ ముఖ్యం. మిగిలినవన్నీ అవే జరిగిపోతాయి. అవే వస్తాయి. అవే సమకూరతాయి!" అని.

ఎంత సత్యం!

ఊరికే మనవాళ్లలా ఏదో సొల్లు చెప్పడం కాదు. రే ప్రాక్టికల్‌గా దీన్ని చేసి చూపించారు. ఒకటా రెండా.. ఎన్నో సినిమాలు. డబ్బులగురించి ఎప్పుడూ ఆయన అలోచించలేదు. తాను తీయాలనుకున్న సినిమా గురించే ఆలోచించారు. డబ్బులు అవే సమకూరాయి. పైగా.. ఆయన తీసినవేవీ మాస్ మసాలా కమర్షియల్ సినిమాలు కూడా కాదు!

ఇంక నేను ప్రత్యేకంగా చెప్పాల్సిందేముంది? మీరు తెలుసుకోవాల్సిందేముంది? మీరయినా, నేనయినా.. ఇక చేయాల్సిందే ఉంది.

అన్నట్టు - రే చెప్పిన ఈ గోల్డెన్ వర్డ్స్ ఒక్క ఫిలిం మేకింగ్‌కే పరిమితం కాదు. ఫిలిం మేకింగ్‌లోని ఏ క్రాఫ్ట్‌లోకి ఎంట్రీ ఇవ్వాలనుకున్నవారికయినా  వర్తిస్తాయి. ఏమంటారు?   

Monday 21 April 2014

సంపు.. సంపు.. బాగా సంపు!

రౌడీ, లెజెండ్ వంటి భారీ సినిమాల పోటీని కూడా తట్టుకొని, హౌజ్‌ఫుల్ కలెక్షన్లతో, వాంటెడ్‌లీ తీసిన ఒక "అర్థం పర్థం లేని సినిమా".. కేవలం మొదటి మూడు రోజుల్లోనే 6.75 కోట్లు కలెక్ట్ చేయగలిగిందంటే ఇదొక కొత్త రికార్డ్.

ఈ రికార్డ్ పూర్తిగా సంపూదే అని చెప్పక తప్పదు.

6.75 కోట్ల తొలి 3 రోజుల కలెక్షన్ బ్రేక్ ఇలా ఉంది: సినిమా విడుదలయినరోజు శుక్రవారం 2 కోట్లు, శనివారం 2.25 కోట్లు, ఆదివారం 2.5 కోట్లు! అ తర్వాతకూడా హౌజ్‌ఫుల్ కలెక్షన్లతో తన సినిమాని ఇటు ఇండియాలోనూ, అటు ఎబ్రాడ్‌లోనూ బాగా నడిపించుకుంటున్న "బర్నింగ్ స్టార్" సంపు!

కట్ టూ మన సంపూ ఫ్లాష్ బ్యాక్ - 

ఒక కొత్త దర్శకుడు తన అందుబాటులో ఉన్న హీరోలందరికీ, నిర్మాతలందరికీ కథలు చెప్పీ చెప్పీ విసిగిపోయాడు. ఇంక లాభం లేదనుకున్నాడు. కంప్లీట్ "అప్ సైడ్ డౌన్" థియరీలో, అర్థం పర్థం లేని ఒక కథని తయారుచేసుకున్నాడు. దానికి కావలసిన హీరో ఇప్పుడున్న రొటీన్ హీరోల్లా అస్సలు ఉండకూడదు!!

అలాంటి హీరో కోసం వెతికీ వెతికీ కూడా విసిగిపోయాడు డైరెక్టర్.

చిన్నా చితకా జూనియర్ ఆర్టిస్టు వేషాలు వేస్తూ తిరుగుతున్న మన సంపు .. ఓ రోజు ప్రసాద్ ల్యాబ్‌లో, ఉన్నట్టుండి మన డైరెక్టర్ కంటపడ్డాడు. అంతే.

"నువ్వే నా సినిమా హీరో!" అన్నాడు.

ఇంక తర్వాతదంతా చరిత్రే!

ఆ దర్శకుని దగ్గర నిర్మాత లేడు. ఉన్నా ఆ కథని ఒప్పుకోడు, సంపూని హీరోగా చచ్చినా ఒప్పుకోడు. అయినా తను అనుకున్న విజన్ మీద తనకు చాలా నమ్మకం. ఆ నమ్మకంతోనే "యూట్యూబ్"లో చిన్న టీజర్ వదిలి తొలి సంచలనం సృష్టించాడు. అది తర్వాత మరెన్నో లెక్కలేని సంచలనాలకు దారితీసింది.

డబ్బులూ వచ్చాయి. ఇండస్ట్రీ నుంచి కూడా బోల్డంత సపోర్ట్ తోడయింది. ఎవ్వరూ ఊహించని అతి తక్కువ బడ్జెట్‌లో సినిమాని పూర్తిచేశాడు. ఊహించని రేంజ్‌లో సినిమా బిజినెస్ అయింది. రిలీజయింది.

అదే హృదయ కాలేయం.

ఇప్పుడు సంపూకు ప్రపంచవ్యప్తంగా అభిమానులున్నారు. అభిమాన సంఘాలున్నాయి. ఇదే దర్శకుని రెండో చిత్రంలో, ఇదే సంపూ ఈ సారి "డబుల్ యాక్షన్"తో సంపబోతున్నాడు!

కట్ టూ ది క్రియేటర్ ఆఫ్ సంపూ - 

నిజానికి సంపూర్ణేష్ బాబు అసలు పేరు అది కాదు. ఏదో చెప్పడం ఆయనకిష్టం లేదు. మనకవసరం లేదు. సంపూ కేరెక్టర్‌ని సృష్టించి, హిట్ చేసి, ఇండస్ట్రీలో మరో కొత్త ట్రెండ్‌ని క్రియేట్ చేసిన ఈ కొత్త దర్శకుని పేరు మాత్రం సాయి రాజేష్. ఆయనపెట్టుకున్న స్క్రీన్ నేమ్ - స్టీవెన్ శంకర్.

స్టీవెన్ స్పీల్‌బర్గ్‌లోని మొదటి ముక్కని, భారతీయుడు శంకర్‌లోని శంకర్‌ని కలగలిపి "స్టీవెన్ శంకర్"గా తన పేరుని మార్చుకున్న ఈ కొత్త దర్శకున్ని అభినందించకుండా ఎలా ఉండగలం?

స్టీవెన్ శంకర్, ఇంక సంపుకో.. నీ ఇష్టం.. 

ఒక "టికెట్" ఖరీదుతో ఎంతయినా సాధించవచ్చు!

పాలిటిక్స్ ఇప్పుడొక "బిగ్ బిజినెస్" అయిపోయింది. సాక్షాత్తూ.. మొన్నటిదాకా ఆంధ్రప్రదేశ్‌కు సి ఎం గా పనిచేసిన కిరణ్‌కుమార్ రెడ్డి ఇటీవలే ఓ మాటన్నాడు. అదీ ప్రెస్‌లో.

"రాజకీయాల్లో అవినీతిని పట్టించుకోవద్దు. తిరిగి ఆ డబ్బంతా ఎలెక్షన్లలో ప్రజలదగ్గరికే వెళ్తుంది!" అని ..

ఈ మాటల్ని నేషనల్ మీడియా బాగా కవర్ చేసింది. ఎంత సిగ్గుచేటు?

అసలు మీడియాలో చాలామంది ఎగతాళిగా నవ్వారు కూడా! ఇవీ మన పాలిటిక్స్. ఇదీ మన పొలిటీషియన్ల స్థాయి.

కట్ టూ "టికెట్" ఖరీదు -

నాకు తెలిసిన అతిదగ్గరి (ఉన్నతస్థాయి స్థాయి) సోర్స్‌ల ద్వారా నేను విన్న ఒక నిజాన్ని నేను నిజంగా జీర్ణించుకోలేకపోయాను. ఇది అంతకు ముందు మనందరికీ తెలిసిందే. కానీ, విషయం ఈ స్థాయికి చేరిందనుకోలేదు.

మనకున్న ప్రముఖ పార్టీలన్నిట్లోనూ - జస్ట్ ఒక అభ్యర్థిగా టికెట్ తీసుకొని పోటీ చేయడానికి 5 నించి 30 కోట్లదాకా యావరేజ్‌న బిజినెస్ జరిగిందట!

కొన్ని ప్రత్యేక స్థానాల్లో, పరిస్థితుల్లో.. ఈ టికెట్ ధర ఇంతకు మరెన్నో రెట్లు కూడా పలికిందట!

అంటే - కేవలం టికెట్‌కే 30 కోట్లు ఖర్చు పెడుతున్న అభ్యర్థి, గెలవడానికి ఇంకెంత ఖర్చుపెడతాడు? ఆ పెట్టిన ఖర్చుకి ఎన్ని రెట్లు అడ్డగోలుగా సంపాదించాలనుకుంటాడు? ఏ స్థాయి అంచనా ఉంటుందతని మెదడులో?

కట్ టూ ఒక యుటోపియా - 

ఇన్నేసి కోట్లు ఖర్చుపెట్టి, అవినీతితో అడ్డగోలుగా సంపాదించి, జనాల పొట్టలుకొట్టే వీళ్లంతా ఎంత సుఖంగా జీవిస్తున్నారో నాకయితే తెలియదు.

కాని, ఇదే డబ్బుతో ఒక్కో అభ్యర్థి ఒక్కో ఊరినే ఒక అంతర్జాతీయస్థాయిలో తీర్చిదిద్దవచ్చు. ప్రజలకు నిజంగా పనికొచ్చేవిధంగా ఇంకెంతో సాధించవచ్చు. ఇది చేయడానికి ఏ పార్టీ టికెట్ అవసరం లేదు. పార్టీ అవసరం లేదు.

ఈ ఆనందం ముందు ఏ అధికారమయినా వెలవెలపోతుందని నా వ్యక్తిగత అభిప్రాయం. కాని, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలా ఆలోచించడం నిజంగా ఒక భ్రమే!  

Friday 18 April 2014

ఒక జాగ్రత్త.. ఒక శిలా శాసనం

సినీఫీల్డులోకి ప్రవేశించాలనుకొనే ఆర్టిస్టులయినా, టెక్నీషియన్లయినా, ఇంకెవరయినా.. ముందుగా తెల్సుకోవల్సిన విషయాలు ప్రధానంగా రెండు:

1. సినీఫీల్డులో "ఇది ఇలా జరుగుతుంది" అని ఖచ్చితంగా ఎవరూ చెప్పలేరు. ఫీల్డులో ఎంట్రీ దొరకడమే చాలా కష్టం. దొరికాక దాన్ని సరైన విధంగా వినియోగించుకొని నిలదొక్కుకోవడం మరీ కష్టం. ఒక్క ముక్కలో చెప్పాలంటే - ఇక్కడ దేనికీ గ్యారంటీ లేదు.

2.  ఇక్కడ అవకాశం దొరికి, పేరు తెచ్చుకొనేవరకూ దాదాపు ఎవ్వరూ ఒక్క రూపాయి పారితోషికం ఇవ్వరు. అలా ఇస్తారనుకోవడం, అలా అని ఎవరైనా చెప్తే వినడం.. ఉఠ్ఠి భ్రమ. మన జేబులోంచే వేలకి వేలు ఖర్చుపెట్టుకుంటూ బ్రతకాల్సి ఉంటుంది.

ఈ విషయంలో కేవలం ఒక్క కేటగిరీకి మాత్రమే మినహాయింపు ఉంటుంది. అది - హీరోయిన్లు, ఇతర ఫిమేల్ సపోర్టింగ్ ఆర్టిస్టులు. వీళ్లు దొరకడమే కష్టం కాబట్టి ఈ వెసులుబాటు! అదే హీరోలయితే ఎదురు పెట్టుబడి పెట్టాల్సికూడా రావొచ్చు. అది వేరే విషయం.

పైన చెప్పిన రెండు అంశాల్ని దృష్టిలో పెట్టుకొని, కొత్తగా ఫీల్డులోకి రావాలనుకొనేవాళ్లు తీసుకోవల్సిన జాగ్రత్త ఒకే ఒక్కటి.

ఇక్కడ ఫీల్డులో అవకాశం దొరికి, నిలదొక్కుకొనేవరకూ - ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా మరొక ఆదాయమార్గాన్ని లేదా జాబ్‌ని ముందుగానే చూసుకోవాలి. లేదంటే మీరు బాగా డబ్బున్నవాళ్లయి ఉండాలి.

శిలాశాసనం లాంటి ఈ జాగ్రత్త తీసుకోకుండా ఫీల్డులోకి ఎవరు ఎంటరయినా.. తర్వాత సినిమా కష్టాలు తప్పవు.

అన్నీ అవుతున్నట్టే ఉంటుంది. కానీ, ఏదీ జరగదు. సాంఘికంగా, ఆర్థికంగా ఎన్నో ఛాలెంజ్‌లు ఎదుర్కోవాల్సి వస్తుంది. చూస్తుండగానే జీవితం మీ చేతుల్లోంచి జారిపోతుంది.

సో, బి కేర్‌ఫుల్ .. 

Thursday 17 April 2014

ఒక పొలిటికల్ ఎంట్రీ ..

యూనివర్సిటీరోజుల్లోని నా హాస్టల్‌మేట్/మిత్రుడు ఒకతను ఆ మధ్య ఉన్నట్టుండి పాలిటిక్స్‌లో చేరిపోయాడు.

ఇన్స్‌పిరేషన్ చిరంజీవి!

హాయిగా తను చేసుకుంటున్న మంచి ఉద్యోగం వదిలేసి మరీ ఆ కొత్త పార్టీలో, కొత్త ఉత్సాహంతో దిగాడు. మనస్పూర్తిగా, బాగా రెచ్చిపోయి మరీ పనిచేశాడు.  ఏ టీవీ ఛానెల్లో చూసినా అతనే! కొద్దిగా సంతోషించాను.

కట్ చేస్తే - 

ఆ పార్టీ అధినేత అనుకున్నది జరక్క, తర్వాత ఆ పార్టీ భారాన్ని మోయలేక, దాన్ని తీసుకెళ్లి కాంగ్రెస్ గంగలో కలిపేశాడు.

ఆ రోజు ఆ పార్టీ ఆవరణలో నా మిత్రుడు పడిన బాధ, అరిచిన అరుపులు, చుట్టూ అతన్ని ఎందరో పట్టుకొని ఆపుతున్న సీను.. దాదాపు అన్ని టీవీ ఛానెళ్లలో చూశాను. కొంత కలతచెందాను.

కట్ చేస్తే - 

నా మిత్రుడు టీఆరెస్‌లో చేరిపోయాడు. ఇక్కడా అంతే. మనస్పూర్తిగా, చాలా చాలా కష్టపడి పనిచేశాడు. ఏ ఛానెళ్లో చూసినా పార్టీ తరపున గొంతెత్తి మాట్లాడింది అతనే.

కానీ, మళ్లీ పాత కథే రిపీటయ్యింది. ఈ పార్టీ అతనికి టికెట్ కూడా ఇవ్వలేదు! ఇది నా మిత్రుడు అస్సలు ఊహించని విషయం..

అయితే అంతకు ముందు రోజే పార్టీలో చేరినవాళ్లకు, అంతకు ముందు వేరే పార్టీలో ఉండి ఆ పార్టీని బాగా తిట్టిపోసినవాళ్లకు మాత్రం టిక్కెట్లొచ్చాయి. అది వేరే విషయం.

ఇంతకీ నా మిత్రునికి ఆ పార్టీ టికెట్ ఇవ్వకపోవడానికి కారణం - నా మిత్రుడి కులం వాళ్లు ఎక్కువమంది లేరట! బయటకు చెప్పిన ఈ కారణం నిజం కాదన్నది ఓ పెద్ద నిజం. చాలా సిగ్గుపడ్డాను.

తర్వాతేం జరిగే అవకాశం ఉందో నేను మీకు చెప్పక్కర్లేదు. "కట్ చేస్తే" అంటూ బోర్ కొట్టనక్కర్లేదు.

నా మిత్రుడు కూడా తిరిగి తిరిగి.. చివరికి అందర్లాగే ఆ "రామ్ తేరీ గంగా మైలీ"లో కలిసిపోయాడు. అక్కడ కూడా నా మిత్రుడు అంతే మనస్పూర్తిగా, అంతే రెట్టించిన ఉత్సాహంతో, ఇంకెంతో కసితో పని చేస్తున్నాడని నా నమ్మకం. ఎంతయినా.. బాగా చదువుకొని పిహెచ్‌డి కూడా చేసినవాడుకదా పాపం!

అయితే చివరికి మళ్లీ అక్కడ కూడా ఏం జరుగుతుందో మనం చెప్పలేం. మనవాడు కూడా బహుశా తెలుసుకోవాలనుకోవటం లేదు. ఎందుకంటే ఇప్పటికే మనవాడు ఆ వాతావరణానికీ, ఆ పవర్ ప్యాషన్‌కు, ఆ లావాదేవీలకు.. బాగా అలవాటుపడిపోయాడు.

దటీజ్ పాలిటిక్స్!  

Sunday 13 April 2014

మణిరత్నం "బ్లాక్‌బస్టర్ 2015"

డౌట్ లేదు. మణిరత్నం, నాగార్జున, మహేశ్ బాబు = బ్లాక్‌బస్టర్ 2015.

ఇది ఓవర్ కాన్‌ఫిడెన్స్ కాదు. అలా జరిగి తీరుతుందన్న నమ్మకం. అంతే.

నిజమే.. రోజా, ముంబాయి, నాయకుడు, దళపతి వంటి అద్భుత దృశ్యకావ్యాల్ని రూపొందించిన మణిరత్నంకు ఈ మధ్య కాలంలో హిట్‌లు లేవు. అలాగని దర్శకుడుగా మణి అప్పుడే 'స్టాగ్‌నేట్' అయ్యాడని చెప్పలేం.

సినిమానే జీవితంగా, తపస్సుగా తీసుకుని బ్రతికేవాళ్లు కొందరే. వాళ్లల్లో మణి కూడా ఒకరు.

బహుశా ఓ పాతికేళ్ల తర్వాత అనుకుంటాను. దర్శకుడుగా మణి తెలుగులో మళ్లీ చేస్తున్న స్ట్రెయిట్ చిత్రం ఇదే కావడం విశేషం. 1989 లో "గీతాంజలి" తర్వాత మళ్లీ  మణి చేస్తున్న ఈ స్ట్రెయిట్ తెలుగు చిత్రంలో కూడా నాగార్జున ఉన్నాడు. ఇది మరో విశేషం. ఈ రెండు విశేషాలకి తోడు, ఇదొక మల్టిస్టారర్ చిత్రం కావడం, మహేశ్ బాబు కూడా ఇందులో నటిస్తుండటం మరో పెద్ద ఎట్రాక్షన్.

ది బోర్న్ ఐడెంటిటీ, మిషన్ ఇంపాజిబుల్ రేంజ్‌లో మణిరత్నం డిజైన్ చేసి రూపొందిస్తున్న ఈ భారీ చిత్రానికి అస్కార్ విజేత రహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడని తెలిసింది. ఇంకేం కావాలి?

మణిరత్నం-నాగార్జున-మహేశ్ బాబు-రహమాన్..

ఈ నాలుగు దిగ్గజాల బ్రాండ్ నేమ్‌స్ చాలు. ఈ చిత్రం ప్రేక్షకుల్లో, మార్కెట్లో - ఏ రేంజ్‌లో క్రేజ్‌ని క్రియేట్ చేస్తుందో.. ఏ రేంజ్‌లో బిజినెస్ చేస్తుందో ఈజీగా గెస్ చేయొచ్చు.

ఆల్ ది బెస్ట్, మణి! 

Thursday 10 April 2014

కమిట్‌మెంట్ ముఖ్యం.. కారణాలు కాదు!

ఈ మధ్య ఎవరినోట విన్నా ఒకటే మాట.. " ఈ ఎలెక్షన్లు అయిపోనీ.." అని. లేదంటే, "అసలు మార్కెట్లో డబ్బేదీ?" అని.

ఇంకా కొన్ని ఇలా ఉంటాయి:

> "ఇదిగో.. ఈ పండగ వెళ్లనీ!" (నెలకి కనీసం 4 పండగలొస్తాయి మనకి, చిన్నా చితకా..)
> "ఇనాళ శుక్రవారం!"/"ఇవాళ మంగళవారం!" (శుక్ర, మంగళవారాల్లో మనవాళ్లు భోజనం చేయరు.. ఇంకేం చేయరు!)
> "సీజన్ డల్‌గా ఉంది!" ( అసలు అన్‌సీజన్లో సీజన్లు పుట్టించగల సత్తా ఉన్నవాడే నిజమైన బిజినెస్‌మాన్! )
> "అసలు లిక్విడ్ క్యాష్ లేదు ఎక్కడా!" (నాకు తెల్సినంతవరకు, మనదేశంలో ఎక్కువగా ఉన్నది లిక్విడ్ క్యాషే!)

ఇలా చెప్పుకుంటూపోతే.. పనికిరాని కారణాలు బోలెడన్ని మనం ఎప్పుడూ వింటూనే ఉంటాం.

వీటికి అంతు ఉండదు.

నిజంగా ఒక పని పూర్తిచెయ్యాలి అనుకుంటే - ఇవన్నీ కారణాలు కానే కావు. మనసులో ఉన్న అసలు కారణాల్ని చెప్పకుండా.. చాలామంది ఇలా దాటేస్తుంటారు. అనవసరంగా ఎదుటివారి సమయాన్ని దోచేస్తుంటారు. అనవసరంగా ఆశలు పెట్టించి చివరి క్షణంలో తప్పుకుంటారు. ఇదొక వ్యాధి. దీనికి తప్పక వైద్య పరిభాషలో ఏదో ఓ పేరు ఉండే ఉంటుంది.

ఈ వ్యాధిగ్రస్తులు చాలామంది .. ఇలా అబధ్ధాలు చెప్తూ, ఎదుటివాళ్లకి ఏదో డిప్లొమేటిక్‌గా "నో" చెప్తున్నాం అనుకుంటారు. నిజానికిది డిప్లొమసీ కాదు, మోసం. ముందు తమని తాము మోసం చేసుకోవడం. తర్వాత ఎదుటివాళ్లని మోసం చేయడం.

నా వ్యక్తిగత అనుభవంలో ఇలాంటి "డిప్లొమాట్స్"ని చూసీ చూసీ జుట్టు ఊడిపోయింది. ఈ వ్యాధి లక్షణాలున్న డైలాగ్ మొదటిసారి రాగానే.. రెండోసారి మళ్లీ వాళ్లు నాతో కనీసం ఫోన్లో కూడా మాట్లాడే అవకాశం నేనే ఇవ్వట్లేదు!

దేనికయినా "యస్", "నో" అని రెండే రెండు ఉంటాయి జవాబులు. ఇఫ్స్, బట్స్ ఉండవు. అలా ఉన్నచోట పని ఇంచ్ కూడా జరగదు. ఇదే మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సిన కొండ గుర్తు.

చివరాఖరికి చెప్పేదేంటంటే - ఓ పని చేయాలనుకున్నవాడు చేస్తాడు. అలా చేయాలనుకున్నవాడికి ఏదీ అడ్డు కాదు. ఎలక్షన్లదారి ఎలక్షన్లదే. మనదారి మనదే! 

Sunday 6 April 2014

(అ) శాస్త్రీయ సర్వేలా? ష్యూర్‌ఫైర్ బెట్టింగులా?

పాలిటిక్స్, పొలిటికల్ పవర్ పుణ్యమా అని శాస్త్రీయ సర్వేల్లోని ఈ "శాస్త్రీయ" అన్న పదాన్ని తొలగించాల్సి వస్తోంది.

ఒక్కో పార్టీ ఒక్కో సర్వే కంపెనీతో తనకు పాజిటివ్‌గా ఉండే విధంగా సర్వే రిజల్ట్స్ తయారుచేయించుకొని .. దాన్నే ప్రెస్‌లో, ప్రజల్లో టాంటాం చేసుకుంటోంది.

అయితే ఇప్పుడు జనాలు అందరికంటే తెలివైనవాళ్లయ్యారు. వాళ్ల అసాధారణ మేధస్సు ముందు ఈ స్టాటిస్టిక్స్ స్పెషలిస్టులు, పొలిటీషియన్స్ అంతా ఎందుకూ పనికిరారని చెప్పడానికి నేనేమాత్రం సందేహించడంలేదు.

ఈ నేపథ్యంలో.. మన రొటీన్ మైండ్‌సెట్‌లను కాసేపు పక్కనపెడితే చాలు. మనకు అత్యంత నమ్మకమైన, అవినీతిరహిత సర్వే కంపెనీ ఒకే ఒక్కటి కళ్లముందు కనిపిస్తుంది. అదే బెట్టింగ్!

పొలిటికల్ బెట్టింగ్ క్రికెట్ బెట్టింగ్ లాంటిది కాదు. ఇక్కడ బెట్టర్స్ (జనం) ఏ పార్టీ మీద-లేదా-ఏ వ్యక్తి మీద ఎక్కువ డబ్బు కాస్తున్నారో అదే పార్టీ-లేదా-ఆ అభ్యర్థే గెలిచే చాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. గెలుస్తారు. అందులో డౌట్ లేదు. ఎందుకంటే ఇవన్నీ చాలా రియలిస్టిక్‌గా జరిగే చట్టవ్యతిరేక దందాలు.

ఈ దందాల్లో నమ్మకమే బాగా పని చేస్తుంది.

పొలిటికల్ బెట్టింగులు ప్రస్తుతం ఇలా ఉన్నాయి (ట)!:

> నగ్మా గెలుస్తుందా గెలవదా?
> రోజా ఈసారయినా విజయ పతాకం ఎగరేస్తుందా?
> షర్మీలా పాదయాత్ర ఫలించి ఎంపి అవుతుందా లేదా?
> కల్వకుంట్ల కవిత విన్నా.. రన్నా?
> ఫ్యాన్ గాలి నిజంగా వీస్తుందా?
> చెయ్యి ఉంటుందా ఊడుతుందా?
> చెప్పులు తెగిపోతాయా, అసలుంటాయా?
> కారు స్పీడెంత?
> తర్వాతి పీఎం మోడీనా, రాహుల్ గాంధీనా? ..

మరో చిన్న ఉదాహరణ ..

నేను విన్నదాని ప్రకారం.. ఇంటర్‌నెట్‌లో ఫ్లోట్ అవుతున్నదాని ప్రకారం.. ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ మీద బెట్ కడ్తే 100 కి 200 ఇస్తున్నారు. అదే మోడీ పేరు మీద అయితే 100 కి 120 బెట్టింగ్ ఉంది!

అంటే మోడీనే ప్రధాని అవుతున్నడనేగా దీనర్థం?

కట్ టూ ఫినిషింగ్ టచ్ -

ఈ ఎలెక్షన్ సీజన్లోని ఒకే ఒక్క నెలలో - మన దేశంలోని బెట్టర్లతోపాటు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర భారతీయ బెట్టర్లు కూడా పాల్గొంటున్న ఈ పొలిటికల్ బెట్టింగ్‌లో జరుగుతున్న లావాదేవీల అంకె ఎంతో మీరు గెస్ చేయగలరా?

అక్షరాలా 5 లక్షల కోట్లు!

ఏం చెప్తాం? అంత డబ్బుతో ఎన్ని మంచి పనులను చేయవచ్చు? ఎన్ని పాజిటివ్ అద్భుతాల్ని సృష్టించవచ్చు?

అంత ఆలోచన మనకేదీ?

Friday 4 April 2014

నేనింతే! .. Vs .. నాకేంటి?

ఫస్ట్ ఆఫ్ ఆల్ .. నేనో విషయం క్లారిఫై చేయదల్చుకున్నాను. ఈ బ్లాగ్ పోస్టులోని "నేనింతే"కూ, పూరి జగన్నాథ్ నేనింతే సినిమాకూ ఎలాంటి సంబంధం లేదు.

కట్ చేస్తే - 

"నేనింతే" అన్న పదంలో కావల్సినంత నెగెటివిటీ ఉంది. కేర్‌లెస్‌నెస్ ఉంది. "నాకేంటి?" పదంలో .. విల్ పవర్ ఉంది. ఛాలెంజ్ ఉంది. డిమాండ్ ఉంది. అధికారం ఉంది.

అసలు బ్లాగ్ ఎందుకు రాయడం అన్నదానికి.. ఒక్కో వ్యక్తి ఆలోచనాధోరణిని బట్టి, నేపథ్యాన్ని బట్టి సమాధానం ఒక్కో రకంగా ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కో కారణం చెప్తారు. ఈ విషయంలో.. ఒకరు చెప్పిన కారణం మరొకరికి ఏమాత్రం నచ్చకపోవచ్చు. చాలా సహజమైన విషయం.

నా విషయానికొస్తే మాత్రం ఇదీ కారణం: యాక్సిడెంటల్‌గా ప్రారంభించినా - ఎప్పుడో దశాబ్దం క్రితం మర్చిపోయిన/వదిలేసిన "రాయడం" అనే నా అత్యంత ప్రియమైన హాబీని తిరిగి ట్రాక్ మీదకి తెచ్చుకోవడం కోసం ఈ బ్లాగింగ్ నాకు చాలా ఉపయోగపడింది. అది కంటిన్యూ అవుతోంది.

ఈ విషయంలో నేను 100% సక్సెస్ అయ్యాను. దాదాపు రెగ్యులర్‌గా ఏదో ఒకటి బ్లాగ్ కోసం రాస్తున్నాను.  

పనిలో పనిగా, ఫ్యూచర్‌లో నేను రాసి, పబ్లిష్ చేయాలనుకుంటున్న పుస్తకాలూ రాస్తున్నాను.

బ్లాగ్ రచయితకయినా, ఏ రచయితకయినా తను రాయాలని అనుకున్నది రాసే స్వతంత్రం ఉంటుంది. ఉండాలి. ఈ రాతలకి ఏదయినా ప్రయోజనం ఉండొచ్చు. ఉండకపోవచ్చు. "నేనింతే" అనుకొని, ఆ క్షణాన ఏది రాయాలనుకొంటే అది రాయడం. అంతే.

కట్ టూ "నాకేంటి?" - 

ఎంత "నేనింతే" అనుకొని రాసినా, బ్రతకాలంటే మాత్రం ఈ రోజుల్లో "నాకేంటి?" అన్న ఆలోచన తప్పనిసరి.
"క్విడ్ ప్రో కో" అన్నమాట!

ఈ ఆలోచనలోంచి పుట్టిందే నా కొత్త బ్లాగ్ "సినిమా తీద్దాం రండి!"

అతి త్వరలో మీ ముందుకు రాబోతున్న ఈ బ్లాగ్‌లో సుత్తి ఉండదు. సూటిగా విషయం ఉంటుంది. నాక్కావల్సిన అవసరం ఉంటుంది. కొత్త టాలెంట్‌కు కావల్సిన రియలిస్టిక్ సమాచారం ఉంటుంది.

ఏ పోస్టూ 10-15 లైన్లకు మించదు. మించాల్సిన అవసరం లేదు. ఒక రకంగా ఇదో కొత్త ప్రయోగం.

కట్ టూ నాన్-ఫిలిమ్ లవర్స్! -

నాకు తెల్సు. ఈ కొత్త బ్లాగ్ అందరికీ నచ్చదు. సినిమాలంటే పడనివాళ్లకు అసలే పడదు. సో, పడినవాళ్లు చదవండి సరదాకి. పడనివాళ్లు ఎక్కడయితే "ఇది సూటవుతుంది"అని మీకనిపిస్తుందో అక్కడ దీని లింక్ ఒకటి అలా పడేయండి.

ఇతర బ్లాగ్ కామెంట్స్‌లో కావొచ్చు. ఫేస్‌బుక్, ఫేస్‌బుక్ పేజ్‌లు, గ్రూపుల్లో కావొచ్చు. ఇంకెక్కడయినా కావొచ్చు. ఎక్కడ సూటవుతుందన్నది, ఎవరికి ఉపయోగపడుతుందన్నది మీకే బాగా తెలుస్తుంది.

ఈ కొత్త బ్లాగ్ "సినిమా తీద్దాం రండి"ని పైన చెప్పిన విధంగా లింక్ చేయడంద్వారా నాకు చాలా సహాయం చేసినవారవుతారు. అదీ ప్రారంభంలోనే అవసరం.

మీరు చేయబోయే ఈ చిన్ని సహాయానికి ముందే మీకు మిలియన్ థాంక్స్ చెబుతున్నాను.

కట్ టూ మళ్లీ మన టాపిక్ -

"అతి తక్కువ బడ్జెట్లో సినిమా తీయడం ఎలా?" అన్న టాపిక్ మీద - గెరిల్లా ఫిలిం మేకింగ్, లో బడ్జెట్ ఫిలిం మేకింగ్, నో బడ్జెట్ ఫిలిం మేకింగ్, మైక్రో బడ్జెట్ ఫిలిం మేకింగ్, వన్ మ్యాన్ క్రూ ఫిలిం మేకింగ్.. వంటి ఎన్నో పధ్ధతులను.. నా వ్యక్తిగత ఆసక్తితో, అవసరంతో పరిశోధన చేస్తున్న నాకు.. నా ఆలోచనలతో సరితూగే లైక్‌మైండెడ్ టీమ్ చాలా అవసరం.

ఈ నేపథ్యంలోనే - సినీఫీల్డులోకి ఎంటరవ్వాలనుకొనే ఔత్సాహికులకు నా బ్లాగ్ పోస్టింగ్స్ ద్వారా అవసరమైన రియలిస్టిక్ సమాచారాన్ని ఇస్తాను. అదే ఔత్సాహికుల్లోంచి నాక్కావల్సిన టీమ్‌ని నేను తయారు చేసుకుంటాను.

కొత్త టాలెంట్‌కూ, నాకూ మధ్య ఇంటరాక్షన్ అనేది చాలా ముఖ్యం.

అతి త్వరలో మీరు చదవబోతున్న నా కొత్త బ్లాగ్‌కి సంబంధించి - "నాకేంటి?" అనబడే నా "క్విడ్ ప్రో కో" ఇది.

ఒక పరిపూర్ణమయిన పాజిటివ్ ఆలోచన.

కొన్ని గంటల్లోనే, అంటే.. ఈ 4.4.2014 అర్థరాత్రి దాటకముందే ఈ కొత్త బ్లాగ్ లైవ్‌లోకి వస్తుంది.

విష్ మీ బెస్ట్ ఆఫ్ లక్!  

Wednesday 2 April 2014

100,000 హిట్స్ సాధించడం ఎలా?

సుమారు 6 నెలల క్రితం అనుకుంటాను. నా "నగ్నచిత్రం" బ్లాగ్‌కి హిట్స్ మీటర్ తగిలించాను. అప్పుడే అనుకొన్నాను - డిసెంబర్ 31 నాటికి ఓ లక్ష హిట్స్‌ని రీచ్ అవ్వాలని.

నిజానికి, వెరీ యాక్సిడెంటల్‌గా ఈ బ్లాగ్‌ని నేను ప్రారంభించింది 2012 లోనే (ఆగస్ట్ 21). అయినా, దీన్ని కొంచెం సీరియస్‌గా, కొంచెం ఈజీగా, కొంచెం కేర్‌లెస్‌గా తీసుకొంటూ, ఎప్పుడో తోచినప్పుడు మాత్రం ఒక పోస్ట్ రాస్తూపోయాను. అలాగే కొంతకాలం ముందుకు కదిలిందీ బ్లాగ్.

మధ్యలో.. అసలు బ్లాగ్‌కి ఈ "నగ్నచిత్రం" పేరేంటి అన్న చర్చకూడా నా మిత్రుల్లో/రీడర్స్‌లో వచ్చింది. చివరికి అందరూ దీనికే వోటేయటంవల్ల చివరికి ఇదే పేరు బ్లాగ్‌కి స్థిరపడింది. ఈ పేరుతోనే బ్లాగ్ ఎంతోకొంత పాప్యులర్ అయింది.

తర్వాత తర్వాత.. నా వ్యక్తిగత సృజనాత్మక నేపథ్యం, ఇతర కారణాల దృష్ట్యా - ఫేస్‌బుక్, ఈ బ్లాగ్‌లే నాకు అత్యంత దగ్గరి ఆత్మీయ మిత్రులయ్యాయి.

రెంటినీ కొంచెం సీరియస్‌గా తీసుకోవడం మొదలెట్టాను. రెంటికీ కలిపి, సగటున, రోజుకు ఓ 30-40 నిమిషాలు విధిగా కెటాయించడం మొదలెట్టాను.

థాంక్స్ టూ మై ఫేస్‌బుక్, ఫేస్‌బుక్ పేజ్, ట్విట్టర్, బ్లాగ్.. నేను కోరుకొన్న మానసిక ప్రశాంతత, ఏకాంతం, క్రియేటివ్ ఫ్రీడమ్ నాకు దొరికాయి.

నానా రకాల ఉద్యోగవ్యాపార ప్రయత్నాల్లో, పనుల్లో, వత్తిడిలో.. ఇవన్నీ అంతకు ముందు నేను పోగొట్టుకున్నాను కాబట్టి, వీటి విలువేంటో నాకు ఇప్పుడు బాగా తెలుసు.

కట్ టూ హిట్స్ మీటర్ - 

ఓ ఆరు నెలల క్రితం ఎందుకో ఉన్నట్టుండి బ్లాగ్‌కి హిట్స్ మీటర్ పెట్టాలనిపించి పెట్టాను. అది పెడుతూ, మొన్నటి డిసెంబర్ 31 లోపు లక్ష హిట్స్ సాధిస్తానని ఓ బ్లాగ్ పోస్ట్ కూడా రాసినట్టు గుర్తు. 

అయితే.. నేననుకున్నట్టుగా, మొన్నటి డిసెంబర్ 31 నాటికి 100,000 హిట్స్ సాధించలేకపోయాను. కారణం మళ్లీ నా నిర్లక్ష్యమే. ఎలాగయితేనేం.. ఓ మూడు నెలలు ఆలస్యంగానయినా, సరిగ్గా మొన్నటి మార్చ్ 31 నాటికి అది సాధ్యమైంది.

అదీ .. శ్రీ జయ ఉగాది రోజు!

ఈ సందర్భంగా నా బ్లాగ్ పాఠకమిత్రులు, శ్రేయోభిలాషులందరికీ "థాంక్స్" చెప్పడం నా విధి. థాంక్ యూ వన్ అండ్ ఆల్..

కట్ టూ నా "లెర్నింగ్ బై బ్లాగింగ్!" -

బై ది వే, బ్లాగింగ్ ద్వారా చాలా నేర్చుకున్నాను. ఎలాంటి పోస్ట్స్ రాస్తే "హిట్స్" ఎక్కువ వస్తాయి, ఎలాంటి పోస్ట్స్ రాస్తే "తిట్స్" ఎక్కువ వస్తాయన్నది నాకిప్పుడు బాగా తెలుసు. 

ఇప్పుడంతా ఎక్కువగా ఏదేదో టిట్‌బిట్స్ తరహాలో ప్రతి చెత్తా రాస్తున్నాను. కాని, కొన్ని నెలల తర్వాత మాత్రం ఇదే బ్లాగ్‌లో.. స్పిరిచువాలిటీ-ఉరఫ్-స్పిరిట్ సైన్స్ గురించే నేను ఎక్కువగా రాయాలనుకుంటున్నాను. 

స్పిరిచువాలిటీ అనగానే ఓ భయపడిపోనక్కర్లేదు. నేను ఏది రాసినా, ఇంతే సులభమైన రీడబిలిటీ ఉంటుంది. ఇదే లైటర్‌వీన్ శైలి ఉంటుంది.  మళ్లీ వచ్చే ఉగాది నాటికి ఇదే హిట్స్ మీటర్ 1,000,000 అంకెను కూడా తాకవచ్చు. అదేమంత గొప్పవిషయం కాదు.

కట్ టూ నా సృజనాత్మక ప్రపంచమ్ -

నిజానికి.. ఇప్పుడయినా, అప్పుడయినా, ఎప్పుడయినా.. నా టార్గెట్ "హిట్స్" కాదు.  నా సృజనాత్మక ప్రపంచం.

నా సృజనాత్మక ప్రపంచమే నా జీవితం. ఆ జీవితమే నాకు ముఖ్యం. ఆ జీవితం కోసమే ఈ జీవితం.

పైవన్నీ ఎలా ఉన్నా.. ఒక గొప్ప విషయం మాత్రం అనుభవపూర్వకంగా తెల్సుకున్నాను. ఒక్క బ్లాగ్ ఉంటే చాలు. ఏదయినా సాధించవచ్చు.

అది నేను కోరుకొనే సృజనాత్మక ఏకాంతం కావొచ్చు. ఆ సమయంలో నాకు వచ్చే ఆలోచనలు కావొచ్చు. డబ్బూ కావొచ్చు. మరేదయినా జీవితాకర్షణ కావొచ్చు. ఇవన్నీ కాకుండా.. నేనెన్నడూ ఊహించనివిధంగా, టోటల్ స్పిరిచువాలిటీ వైపు నన్ను నేను ట్రాన్‌సిషన్ చేసుకోవడం కావొచ్చు. 

ఇదంతా నా "బ్లాగింగ్" అనే ఒకే ఒక్క అలవాటువల్లనే సాధ్యమైంది.