Sunday 31 March 2024

అర్థవంతమైన జీవితం అంటే అది...


జస్ట్ ఒక అమ్మాయి. 
చాలెంజ్ చేసింది. 
టాప్ హీరోయిన్ అయ్యింది. 
బాలీవుడ్ రాజకీయాలతో విసుగొచ్చి, 
ఒంటరిగా హాలీవుడ్ వెళ్ళింది. 
అక్కడా అడ్డా సాధించింది. 
డబ్బూ, పేరూ సంపాదించుకొంది.

రైటర్ అయింది.
మోటివేషనల్ స్పీకర్ అయింది. 
ఇంటర్నేషనల్ లెవెల్లో! 

తనకంటే పదేళ్ళు చిన్నవాడైన 
ఒక అమెరికన్ పాప్ సింగర్‌ను 
ప్రేమించి పెళ్ళిచేసుకుంది.
అతను మన 
హిందూ సాంప్రదాయాలంటే 
పడిచచ్చేవాడిగా మారిపోడానికి 
కారణమైంది. 

మన పండుగలూ పబ్బాలూ 
తన రూట్సూ - 
ఏ ఒక్కటీ మర్చిపోకుండా... 
ఇప్పటికీ, 
సొంత ఊరికి వచ్చి
తనవారందరి మధ్య 
ఆనందంగా జరుపుకుంటుంది.

ఇప్పుడు మళ్ళీ హిందీలో, 
చాలా గ్యాప్ తర్వాత 
భన్సాలీ సినిమాలో 
హీరోయిన్‌గా చేయబోతోంది. 

గట్స్ అంటే అలా ఉండాలి.

సినిక్ విమర్శలు చేయడం, 
శాడిస్టిక్ రివ్యూలు రాయడం, 
చెత్త థంబ్‌నెయిల్స్ పెట్టడం లాంటి 
పాకీ పని కాదు. 
ఒక లక్ష్యం పెట్టుకొని
దాన్ని సాధించడం గొప్ప. 
అదే స్థాయిలో
ముందుకు దూసుకెళ్తుండటం గొప్ప. 


అర్థవంతమైన జీవితం అంటే అది... 
అర్థవంతమైన జీవితం అంటే నిజంగా అది...   
ఊరికే గాసిప్స్ రాయడం, 
అలాంటి చెత్త వీడియోలు చెయ్యటం కాదు.  
ఏరోజుకారోజు వృధాగా గడపటం 
అంతకన్నా కాదు. 

Thursday 28 March 2024

ఆ హీరోయిన్ పేరు అనుపమ పరమేశ్వరన్


ఒక హీరోయిన్ ఫ్యాన్స్, ఆమె నటించిన లేటెస్ట్ సినిమా పోస్టర్స్, టీజర్స్ చూసి, ఆమె ఆ సినిమాలో టూమచ్ గ్లామర్-షో చేసిందని, లిప్-లాక్స్ ఇచ్చిందనీ... ట్రోల్స్‌తో బాగా రెచ్చిపోయారు. ట్రోల్స్ ఎంత టూమచ్‌గా చేశారంటే, ఆ హీరోయిన్ తన సొంత సినిమా ప్రి-రిలీజ్ ఈవెంట్‌కు కూడా వెళ్ళకుండా హర్ట్ అయి అసలు బయటికి కదలలేనంతగా! 

ఆ హీరోయిన్ పేరు అనుపమ పరమేశ్వరన్. 

ఆ సినిమా పేరు టిల్లూ స్క్వేర్. 

ఒక హీరోయిన్‌గా, తనకిష్టమైన పాత్రలో, తనకిష్టమైనట్టు నటించే ఫ్రీడమ్‌ను కాదనడానికి అసలు ఎవరు వీళ్ళంతా? 

కట్ చేస్తే - 

సోషల్ మీడియాలో ట్రోల్స్‌నే కాదు. మనం పెట్టిన పోస్టు కింద కామెంట్స్ కూడా పట్టించుకొంటే కష్టం. 

ఇలా ట్రోల్స్ చేసేవాళ్లందరినీ పట్టించుకుంటే అసలు మనం సోషల్ మీడియాలో ఉండలేం. సినిమాల్లో కూడా ఉండలేం. 

ఒక లిమిట్‌ను మించి ట్రోల్స్ చేసేవాళ్ళంతా ఒక మంద మెంటాలిటీకి చెందినవారు. ఎప్పుడూఒ ఒక రకమైన మాస్ హిస్టీరియాలో బ్రతుకుతుంటారు. 

ట్రోలింగ్ పేరుతో, ఇలాంటి సిక్ పేషంట్స్ చేసిన సొల్లును అంత సీరియస్‌గా పట్టించుకోవడం అనుపమ తప్పు. అసలు ట్రోల్స్ చదవడం కోసం తన ఒక్క సెకండ్ కూడా వృధా చేసుకోవడం అనేది ఆమె చేసిన మరింత పెద్ద తప్పు.

అనుపమలా మరీ అంత సెన్సిటివ్‌గా ఉంటే, సినిమాల్లో హీరోయిన్‌గా ఏమో గాని, అసలు బ్రతకడమే కష్టం. 

Take it light #Anupama! 

అనుపమ నటించిన "టిల్లు స్క్వేర్" రేపు విడుదలవుతున్న సందర్భంగా సిద్ధు, అనుపమ & టీమ్‌కు ఆల్ ది బెస్ట్.   

Tuesday 26 March 2024

రీజన్స్ కాదు, రిజల్ట్స్ ముఖ్యం!


"ఇవ్వాళ సాయంత్రానికి ఇచ్చి వెళ్తా"... అన్న స్క్రిప్టు వెర్షన్, వారం అయ్యింది! ఇంకా నాకు అందలేదు. దాని మీద నా ఇంట్రెస్టు కూడా మెల్లిగా ఫేడ్ ఔట్ అవుతోంది. 

కొత్తవాళ్ళలో ఇలాంటి వర్కింగ్ స్టయిల్ వెంటనే మారాలి. 

ఇది ఏ ఒక్కరి గురించో చెప్తున్నది కాదు. టాలెంట్ బాగా ఉన్న కొత్తవాళ్లలో నేను చూస్తున్న స్తబ్దత, నత్తనడక గురించి.

కట్ చేస్తే - 

సినిమా ప్రొఫెషన్‌లో పనులన్నీ ఎప్పుడంటే అప్పుడు, అనుకున్నప్పుడే జరగాలి. అలా జరుగుతాయి. అలా జరగలేదంటే, తర్వాత మూడ్స్ మారిపోతుంటాయి. నిర్ణయాలు మారిపోతుంటాయి. మనుషులు, టీమ్ కూడా మారిపోతుంటుంది. 

ఇక్కడ ఏదీ మనం అనుకున్నంత సింపుల్‌గా ఉండదు. మనకిష్టమైనట్టు ఉండదు.  

ఏదైనా సరే, సరిగ్గా ప్లాన్ చేసుకోవాలి. చాలా ఫాస్ట్‌గా ఉండాలి. చాలా ఫాస్ట్‌గా రియాక్ట్ కావాలి. 

ఈ విషయంలో కొత్తవారా, పాతవారా అని ఏం ఉండదు. ఓవర్‌నైట్‌లో రైటర్స్, డైరెక్టర్స్, హీరోలు, హీరోయిన్స్ మారిపోవడం మనం చదువుతుంటాం, వింటుంటాం. కారణాలు అంత పెద్దవేం కావు. ఇలాంటి స్తబ్దత, నాన్-కమ్యూనికేషనే. కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న ఈగోలు కూడా.     

ఇవి చాలు ఒక టీమ్ డల్ కావడానికి. లక్ష్యం నుంచి డీవియేట్ కావడానికి.  

Wednesday 20 March 2024

"నేను వేరు" అనుకున్నావా... యు ఆర్ అవుట్!


పూర్వకాలంలో "బానిసలు" అని ఉండేవాళ్ళు. ఇప్పుడు వారినే "అప్పుతీసుకున్నవారు" అనవచ్చు.

కట్ చేస్తే - 

ప్రొడక్టివ్ అప్పు వేరు, పర్సనల్ అప్పు వేరు. ఏదైనా అప్పు అప్పే.

సినీఫీల్డులో ఉన్నవాళ్ళకు నిజానికి అప్పు చేయాల్సిన అవసరం రాకూడదు.

"When in Rome, Do as the Romans Do" అని సామెత చెప్పినట్టు, నువ్వు సినీఫీల్డులో పనిచెయ్యాలంటే, ఆ ఇండస్ట్రీకి సంబంధించిన మినిమం బేసిక్స్ పాటించాలి. 

సినిమాల్లో నీ క్రాఫ్ట్ వాళ్ళంతా ఎలా ఉంటారో నువ్వూ అలాగే ఉండాలి. వందకి వంద శాతం ఒక సినిమావాడిలాగే ఉండాలి.  

"నేను వేరు" అనుకున్నావా... యు ఆర్ అవుట్!

బుర్ర ఉపయోగించాలి. పనిచేయాలి. చేస్తూనే ఉండాలి. 

బానిస మాత్రం కావద్దు. 

Saturday 9 March 2024

గాంబ్లింగ్ కాదు, మెకన్నాస్ గోల్డ్!


ఇంతకు ముందు సినిమాలు వేరు, ఇప్పుడు సినిమాలు వేరు.

Content is king. Money is the ultimate goal. 

సినిమా ఫీల్డంటే... ఇప్పుడు, ఒక భారీ కార్పొరేట్ బిజినెస్. ఓవర్‌నైట్‌లో సెలబ్రిటీ స్టేటస్ తెచ్చిపెట్టగల ఒక పోష్ ప్రొఫెషన్. సరిగ్గా ఉపయోగించుకోగలిగిన అతి కొద్దిమందికి... ఒక ఎలైట్ వరల్డ్.  

థాంక్స్ టు సోషల్ మీడియా... ఫిలిం ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, ఇతర సెలెబ్స్ అంతా మరింత దగ్గరైపోయారు. 

సినిమాల పట్ల, సినీఫీల్డు పట్ల చాలామందిలో ఒకప్పటి దృక్పథాలు చాలా చాలా మారిపోయాయి. సినిమాల్లోకి ప్రవేశించడానికి గాని, పంపించడానికి గాని ఇంతకుముందులా ఇప్పుడెవ్వరూ పెద్దగా సంకోచించట్లేదు. 

డబ్బు, క్రేజ్, పాపులారిటీ ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు?

చాలామంది అంటుంటారు... "వాడు సినిమాల్లోకి వెళ్ళి చెడిపోయాడ్రా", "వాడు సినిమాలు తీసి మొత్తం పోగొట్టుకున్నాడ్రా" ఎట్సెట్రా, ఎట్సెట్రా. 

నిజానికి సినిమా ఫీల్డు ఎప్పుడూ మంచిదే. సాధించగలిగేవాడికి అదొక మెకన్నాస్ గోల్డ్. 

వాడుకున్నోనికి వాడుకున్నంత! 

ప్రతి ఫీల్డులో ఉండే రకరకాల నెగెటివిటీ ఇక్కడ కూడా ఉంటుంది. అయినా సరే, ఈ ఫీల్డుని మన లక్ష్యం కోసం మనం ఎంత బాగా, ఎంత పాజిటివ్‌గా ఉపయోగించుకోగలుగుతాం అన్నదే అసలు పాయింట్. 
          
Be bold.
Either you will find a way,
or you will create a way.
But you will not create an excuse! 

ఒక బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మళ్ళీ కలుద్దాం. ఇక్కడ.

అప్పటిదాకా, #TotalCinema. 

Thursday 7 March 2024

విన్నర్స్ ఎప్పుడూ ఆ 1% క్లబ్‌లోనే ఉంటారు


సినిమా పుట్టినప్పటినుంచి ఇప్పటివరకు... ఎన్నడూ లేనన్ని అవకాశాలు ఇప్పుడు కొత్తవారికి ఉన్నాయి. 

తను ఎన్నుకున్న విభాగంలో ఏ కొంచెం స్పార్క్ ఉన్నా, సిన్సియర్‌గా... 'కొంచెం స్మార్ట్‌'గా... ప్రయత్నిస్తే - ప్రతి ఒక్కరికీ తప్పకుండా ఆ 'ఒక్క చాన్స్' దొరుకుతుంది. 

ఆ తర్వాత దాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటారు... ఆ మొదటి చాన్స్‌తో మరిన్ని అవకాశాలు ఎలా సంపాదించుకొంటారు, ఆ తర్వాత కూడా ఫీల్డులో ఎలా కొనసాగుతారు... ఇలాంటివంటివన్నీ ఒక్కొక్కరి పర్సనల్ టాలెంట్స్ మీద ఆధారపడి ఉంటుంది. 

కమ్యూనికేషన్ స్కిల్స్, పాజిటివ్ యాటిట్యూడ్, ఏది ఏమైనా సరే అనుకున్న లక్ష్యం నుంచి ఫోకస్ మరల్చకపోవడం... వంటి కొన్ని బేసిక్ లక్షణాలు అందరికీ ఒకలా ఉండవు. నిజానికి, 99 శాతం మందికి ఈ లక్షణాలు అసలుండవు. 

కాని, ఇవే ఏ ఫీల్డులో అయినా పైకిరావడానికి చాలా ముఖ్యం. సినీ ఫీల్డులో మరీ ముఖ్యం. 

ఈ లక్షణాలన్నీ ఎంతో కొంత ఉండే ఆ ఒక్క శాతం మంది మాత్రమే విన్నర్స్ అవుతారు. వీరిలో కొంతమంది... కనీసం ఆ ట్రాక్‌లోనైనా ఉంటారు. 

ఇందాకే చెప్పినట్టు, ఒక్క సినిమా ఫీల్డు అనే కాదు... ఏ ఫీల్డులో అయినా సరే, విన్నర్స్ ఎప్పుడూ ఆ 1% క్లబ్‌లోనే ఉంటారు. 

Wednesday 6 March 2024

మరీ అంత అత్యుత్సాహం ఉంటే


అప్పుడప్పుడూ ఒక మంచి ఊపు వస్తుంటుంది... పాడ్‌కాస్ట్ చెయ్యాలని, యూట్యూబ్‌కి ఇప్పటిదాకా ఎవరూ చెయ్యని పద్ధతిలో వీడియోలు చెయ్యాలనీ. 

అంత కష్టమైన పని కాదు. కాని, "అంత అవసరమా" అన్న కొశ్చన్‌తో ఆగిపోవడం.

ఇదే రొటీన్ గత రెండు మూడేళ్ళుగా కంటిన్యూ అవుతూ అవుతూ, చివరికి నేనొక నిర్ణయం తీసుకునేలా చేసింది. 

వీడియోలు, పాడ్‌కాస్ట్‌లు వద్దు అనుకున్నాను. 

మరీ అంత అత్యుత్సాహం ఉంటే, టైమ్ ఉంటే, ఒక పని చెయ్యొచ్చు. 

వీడియోలకు ఎడిక్ట్ అయినవాళ్ళలో కొందరినయినా, తిరిగి చదివే అలవాటు వైపు మళ్ళించడానికి ఉడతాభక్తిగా ఏదైనా ఒక సెన్సేషనల్ టాస్క్ మొదలెట్టాలనుకుంటున్నాను. 

అదేంటన్నది మరొకసారి, మరొక పోస్టులో.  

Tuesday 5 March 2024

ఇంత దానికి... చచ్చేదాకా అన్నన్ని కష్టాలు పడాలా?!


మా అతి దగ్గరి బంధువు ఒకరు, మొన్న రాత్రే ఆకస్మికంగా చనిపోయారు.

ఇది నేనసలు ఊహించని సంఘటన. 

నిన్న సాయంత్రం దహనసంస్కారాలు జరిగాయి. 

ఆయనకు సంబంధించిన నా జ్ఞాపకాలు నన్ను విపరీతంగా ఇంకా బాధిస్తున్నాయి. గత ముప్పై ఏళ్ళుగా, ఆయన నన్నెప్పుడూ గౌరవంగా ప్రేమగా పలకరించేవారు. రెండు వారాల క్రితమే - ఆయన, వాళ్ళ కుటుంబమంతా మా ఇంటికొచ్చారు. రాత్రి అందరం కలిసి భోజనం చేశాం.

ఆరోజు కూడా నాతో ఎంతో బాగా మాట్లాడారాయన. 

జస్ట్ న్యూమోనియా కంప్లైంట్‌తో హాస్పిటల్‌కు తీసుకెళ్ళిన పదిహేను నిమిషాల్లోనే చనిపోయారాయన. 

లైఫ్ అలా ఉంటుంది...

కట్ చేస్తే -   

మొన్నటిదాకా మన మధ్యే ఉన్న ఒక మనిషి చనిపోయి కొన్ని గంటలే అయింది. 

24 గంటలూ అతన్ని తల్చుకొంటూ అందరూ ఏడుస్తూనే కూర్చోవాలని కాదు. కాని, అతి దగ్గరివారిలోనైనా, అంత పెద్ద విషాదం క్షణాల్లో ఎలా ఆవిరైపోగలిగింది? 

దాదాపు అందరూ నార్మల్‌గా ఉన్నారు. స్మశానంలో కూడా, ఒకవైపు ఆ కార్యక్రమం జరుగుతూనే ఉంది... మరోవైపు, గుంపులు గుంపులుగా ఉన్న కొందరు నవ్వుకొంటూ ఏదేదో మాట్లాడుకొంటున్నారు! 

స్మశాన వైరాగ్యాన్ని కూడా అనుభవించనీయరా వీళ్ళు?

చచ్చిపోయిన తర్వాత ఎవరి పరిస్థితైనా ఇంతే కదా? 

ఇంత దానికి చచ్చేదాకా, అన్నన్ని కష్టాలు పడాలా?! 

ఎంత నాన్సెన్స్...  

'వడా పావ్... భేల్ పూరీ' అతి వాగుడు!


"ఇడ్లి వడ వెనుక దాక్కున్న ఓ రామ్‌చరణ్, ఎక్కడున్నావ్ నువ్వు?" అని స్టేజ్ మీద నుంచి షారుఖ్‌ఖాన్ రామ్‌చరణ్‌ను పిలవడం, ఉపాసన పర్సనల్ మేకప్ వుమన్ జేబా హసన్‌కు నచ్చలేదు. 

వెంటనే ఈవెంట్ నుంచి బయటకొచ్చేసింది. అదే విషయం ట్వీట్ చేసిందామె.

పౌరుషాలు, ఫీలింగ్స్ అలా ఉంటాయి...

కట్ చేస్తే -  

స్టేజ్ పైన పిచ్చి పిచ్చి జోక్స్ వెయ్యటం షారుఖ్‌కు మామూలే. షారుఖ్‌కు, రామ్‌చరణ్‌కు మధ్య ఎంతో క్లోజ్‌నెస్ కూడా ఉండొచ్చు. కాని, అంత పెద్ద అంబానీల ఈవెంట్‌లో వాళ్ళిద్దరూ రెండు భారీ ఫిలిం ఇండస్ట్రీలను రిప్రజెంట్ చేస్తున్నారన్న విషయం మర్చిపోవద్దు.   

ఏ జూనియర్ ఎన్‌టీఆరో పైకెక్కి, ఇదే పద్ధతిలో, "ఏయ్ వడా పావ్... భేల్ పూరీ... షారుఖ్ సల్మాన్ ఎక్కడ దాక్కున్నారు, కమ్ ఆన్ టు ది డయాస్" అనగలడు. 

వాళ్ళు పెద్ద హర్ట్ కాకపోవచ్చు. కాని, వాళ్ళ ఫ్యాన్స్ మాత్రం ఖచ్చితంగా ఫీలవుతారు.     

Friday 1 March 2024

ఉచిత సలహాదారులకు వందనమ్!


నా శ్రేయోభిలాషి ఒకరితో ఇవాళ ఒక సుదీర్ఘ సంభాషణ జరిగింది. సుమారు 45 నిమిషాల ఆ సంభాషణ తర్వాత నేను చాలా డిస్టర్బ్ అయ్యాను. 

అయితే - ఇదే సంభాషణ పుణ్యమా అని, తన ద్వారా ఒక ఆణిముత్యం లాంటి పాఠం కూడా నేర్చుకున్నాను... "లాభం లేని పని చెయ్యొద్దు" అని! 

కట్ చేస్తే - 

నా యూనివర్సిటీ స్నేహితులు కొందరంటారు... "ఈసారి నువ్వు సినిమా చేస్తే, నీ స్క్రిప్టు నాకివ్వు. నేను ఫైన్ ట్యూన్ చేసి, పంచెస్ గించెస్ యాడ్ చేసి ఇస్తాను. నీ సినిమా బంపర్ హిట్ అవుతుంది" అని. 

యూ యస్ నుంచి ఒక మిత్రుడు కాల్ చేసి అంటాడు: "నన్ను అడిగితే నేను మంచి కాన్‌సెప్ట్స్ ఇచ్చేవాన్ని కదా" అని. 

"నీకు 3 కోట్ల బడ్జెట్ నేను ఇస్తా, రా" అని ప్రామిస్ చేసి, ప్రామిస్‌ను తుంగలో తొక్కిన ఇంకో మిత్రుడు, ఒక సంవత్సరన్నర టైమ్ వేస్ట్ చేసిన తర్వాత, ఇలా అంటాడు: "నీకంటే రాజమౌళే సినిమా ఫాస్ట్‌గా చేసేటట్టున్నాడు... నువ్వు ఇట్లుంటే లాభం లేదు" అని, నేనెలా ఉండాలో చెప్తాడు.  

ఇన్ని విషయాలు బాగా తెలిసిన వీళ్ళంతా ఎందుకని సినిమాలు తీయరో నాకర్థం కాదు! తీస్తే వీళ్లకు ఈజీగా వందల కోట్లు వచ్చేవిగా?! 

నేను ఈ మాటంటే వీళ్లకి కోపం. 

కట్ చేస్తే - 

ఇవాళ్టి నా శ్రేయోభిలాషి చెప్పింది వేరే. అదంతా ఇక్కడ రాయాలంటే ఒక చిన్న నవల అవుతుంది. 

ప్రతి సినిమా వెనుక ఒక కథ ఉంటుంది. ప్రతి మనిషికీ ఒక నేపథ్యం ఉంటుంది. అవి అందరికీ తెలియవు. తెలిసే అవకాశం ఉండదు.  

సినిమా అయినా, వ్యక్తిగతమైనా... నేపథ్యం తెలీకుండా ఉచిత సలహాలివ్వడం అంత లాభం లేని పని ఇంకోటి ఉండదు. 

నా మిత్రులు, శ్రేయోభిలాషులు ఈ నిజం తెలుసుకొంటే బాగుండు...

వారి సమయం వృధా కాదు, నా మైండ్ డిస్టర్బ్ కాదు.  

- మనోహర్ చిమ్మని