Monday 31 August 2020

మన దర్శకులు ముంబై హీరోయిన్స్‌నే ఎందుకు ఇష్టపడతారు?

తెలుగులో 100 సినిమాలు రిలీజైతే, వాటిలో 90 సినిమాల్లో నాన్-తెలుగు హీరోయిన్స్, ముంబై హీరోయిన్సే ఉంటారన్నది కాదనలేని నిజం. ఎందుకలా అన్న ప్రశ్నకు సుత్తిలేకుండా సూటిగా పది బులెట్ పాయింట్స్ రూపంలో చెప్పడానికి ప్రయత్నిస్తాను:

> నిజానికి ముంబై హీరోయిన్స్ అందరూ ముంబై వాళ్లు కానే కారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి అక్కడికి వచ్చి మోడలింగ్‌ చేసుకుంటున్నవాళ్లు వాళ్లంతా. ఫ్యాషన్‌కూ, మోడలింగ్‌కూ, యాడ్ మేకింగ్‌కూ ముంబై ప్రధాన కేంద్రం కాబట్టి, అవకాశాలు అక్కడే ఎక్కువ కాబట్టి వీళ్లంతా ముందు అక్కడ ల్యాండ్ అయిపోతారు. వాళ్లల్లో కొందరు సినిమాలకూ ట్రై చేస్తుంటారు హీరోయిన్ అయిపోవాలని. సో, మనం ముంబై నుంచి దిగుమతి చేసుకున్న, చేసుకుంటున్న ముంబై హీరోయిన్లలో దాదాపు అన్ని రాష్ట్రాలవాళ్లూ ఉన్నారు. మన తెలుగువాళ్లతో సహా!

> ఇక్కడ ముంబైని ఒక ప్రాంతంగా నేను చూడటం లేదు. ఒక అడ్వాన్స్‌డ్ మీడియా కేంద్రంగా చూస్తున్నాను. మోడలింగ్, ఫిలిం యాక్టింగ్‌లకు సంబంధించినతవరకూ అక్కడ ఒక డిసిప్లిన్ ఉంటుంది. ఒక ప్రొఫెషనలిజం ఉంటుంది.

> మగ అయినా, ఆడ అయినా... సినీ ఆర్టిస్టులు కావాలనుకొనేవారికి నటనతోపాటు మంచి శరీర సౌష్టవం, ఎప్పుడూ అందంగా ఆరోగ్యంగా కనిపించడమే వారి ప్రధాన ఆస్తి అని చాలామంది గుర్తించరు. ఈ నిజం యాక్టింగ్‌ను సీరియస్‌గా తీసుకొన్నవారికి మాత్రమే తెలుస్తుంది. ముంబైలో ఆడిషన్స్‌కు వచ్చే కొత్త హీరోయిన్లు ఈ విషయంలో సంపూర్ణమైన స్పృహ కలిగి ఉంటారు.

> ఆడిషన్స్‌కు వచ్చే ముంబై అమ్మాయిల్లో నూటికి నూరు శాతం మంది అన్ని విధాలుగా ప్రొఫెషనల్స్ అంటే అతిశయోక్తికాదు. నటన, డాన్సు, సినీ ఫీల్డు పట్ల ఒక ప్యాషన్, అవగాహన అన్నీ ఉంటాయి. హీరోయిన్‌గా తాను సెలక్టు కావాలనీ, అయితే చాలనీ.. ముందు ఆ విషయం మీదే వాళ్ల ఫోకస్ ఉంటుంది. అంత అద్భుతంగా ఆడిషన్స్‌లో తమ ఉనికిని ఫీలయ్యేలా పర్‌ఫామ్ చేస్తారు.

> బాడీ సెన్స్, యాక్టింగ్, గ్రూమింగ్ విషయంలో ముంబై హీరోయిన్లు వేలు, లక్షలు ఖర్చుపెట్టి ఎంతో శిక్షణ తీసుకొంటారు. ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతుంటారు. వారితో పోలిస్తే, ఈ విషయంలో ఇక్కడ దాదాపు జీరో.

> ఇక్కడ పాయింటు అమ్మాయిలు ఎక్కడి వాళ్లు అన్నది కానే కాదు. వాళ్లు ఎంత ప్రొఫెషనల్స్ అన్నదే పాయింటు. ముంబై అన్న మాట రావటానికి కారణం... అక్కడ కేంద్రీకృతమై ఉన్న అమ్మాయిలంతా పక్కా ప్రొఫెషనల్స్ కావటమే. నిజానికి, అలాంటి ప్రొఫెషనలిజం ఉన్నవాళ్లే సినిమాకు పనికి వస్తారు... సినీ ఫీల్డులో నిలదొక్కుగోగలుగుతారు.

> "ముంబై వాళ్లకే ఎక్కువ డబ్బు ఇస్తారు, ఇక్కడి అమ్మాయిలకు అంత రేంజ్‌లో ఇవ్వరు" అనేది కూడా కేవలం ఒక అపోహే. సక్సెస్, టాలెంట్ ఎక్కడుంటే అక్కడ డబ్బు అదే వెంటపడుతుంది. వాళ్లు ముంబై నుంచి వచ్చారా, హైద్రాబాద్ వాళ్లా అనేది ఎవ్వరూ చూడరు. మన జయప్రద, శ్రీదేవిలు ముంబై వెళ్లి జెండా ఎగురవేశారు. అక్కడి హీరోయిన్లకు కనీసం ఒక దశాబ్దం పాటు నిద్రలేకుండా చేశారు. కళాకారులకు ప్రాంత భేదాలు ఉండవు. ప్రొఫెషనలిజం ముఖ్యం.

> సినీఫీల్డులో ఆయా హీరోహీరోయిన్స్‌కు ఉన్న మార్కెట్, డిమాండును బట్టి వారి రెమ్యూనరేషన్స్ ఉంటాయి తప్ప "వాళ్లు ముంబైవాళ్ళు" అని రెమ్యూనరేషన్స్ ఎక్కువగా ఇవ్వరు.

> సినిమాలో ఒక లిప్ లాక్ సీన్ ఉందనుకోండి. ఇక్కడి హీరోయిన్స్‌ను ఒప్పించడం కష్టం. అలాగే, ఇప్పటి ట్రెండ్‌కు అనుగుణంగా చిన్న చిన్న టాప్స్, టైట్స్, లెగ్గీస్, షార్ట్స్, మిడ్డీస్, మినీస్... వేయడానికి మనవాళ్లల్లో 90 శాతం మంది ఒప్పుకోరు. ఇక స్విమ్ సూట్, వెట్ డ్రెస్ అన్నామా...  అంతే. నేనిక్కడ థర్డ్ గ్రేడ్ సినిమాల గురించి మాట్లడ్డం లేదు. ఇవన్నీ ఉన్నాయని.. రాజ్ కపూర్, విశ్వనాథ్, మణిరత్నం, గౌతం మీనన్ లాంటి వాళ్లు తీసిన చిత్రాల్ని చెత్త సినిమాలనలేం.

> ఇదంతా ఒక ఎత్తయితే, మన హీరోయిన్ల పేరెంట్స్ కొందరు చాలా డిమాండింగ్ గా అడిగేదొకటుంది. " మీ సినిమాలో మా అమ్మాయి వేసే డ్రెస్సులన్నీ మాకు ముందే చూపించండి. అవి చూశాకే మేం ఓకే చెప్తాం" అని! సినీ ఫీల్డు పట్ల, నటన పట్ల అవగాహనా రాహిత్యం, ప్రొఫెషనలిజం లేకపోవటం ఇలాంటి ఇబ్బందులకు కారణాలు. అనవసరంగా ఎందుకొచ్చిన కష్టాలు.. 'అంత అవసరమా' అని ఏ డైరెక్టరయినా అనుకోవటంలో తప్పులేదు. కోట్లరూపాయల ఇన్వెస్ట్‌మెంట్స్‌తో ఆటలాడలేరుగా!

కట్ చేస్తే -

హీరో అయినా, హీరోయిన్ అయినా అవ్వాలంటే చాలా కృషి చేయాల్సి ఉంటుంది. ఆ కృషి లేకుండానే భారీ పారితోషికాలు, సెలబ్రిటీ స్టేటస్, ఆ లైఫ్‌స్టయిల్ కావాలనుకోవడంలో అర్థంలేదు. 

ముంబై స్థాయిలో ఇక్కడి అమ్మాయిలు హీరోయిన్స్‌గా తయారవ్వాలి అంటే చాలా పరిస్థితులు వారికి అనుకూలించాలి. కుటుంబం నుంచి ప్రోత్సాహం కూడా ఉండాలి. ఇదంతా ఇక్కడి సంస్కృతిలో ఇప్పట్లో అంత ఈజీ కాదు. 

ఇవన్నీ ఎలా ఉన్నా, ఇలాంటి వ్యతిరేక పరిస్థితుల్లోంచి కూడా కొత్తగా ఇంకో శ్రీదేవి, జయప్రద లాంటి తెలుగు హీరోయిన్స్ మళ్లీ త్వరలోనే వస్తారనీ... వాళ్ళలా బాలీవుడ్‌ను కూడా దున్నేస్తారనీ నా నమ్మకం.    

Sunday 30 August 2020

నవంబర్ 1 కోసం నేనెలా ఎదురుచూస్తున్నాను?

సినిమాల్లోకి నేనెప్పుడూ పూర్తి స్థాయిలో దిగలేదు.

కారణాలు పూర్తిగా వ్యక్తిగతం.

అంతకు ముందు నేను చేసిన ఉద్యోగాల్లాగే ఈ వృత్తి కూడా. అంతకంటే ప్రత్యేకంగా భావించలేదు కాబట్టే నేను సినిమాల మీద పెద్దగా ఆసక్తి చూపించలేదు.

ఏ ప్రొఫెషన్ అయినా ముందు ప్రధానంగా బ్రతకడానికే. ఒక మల్టి ప్యాషనేట్‌గా నాకున్న ఎన్నో ఆసక్తుల్లో సినిమా ఒకటి.

కాకపోతే, ఈ ఫీల్డులో కొన్ని అట్రాక్షన్స్ అదనం. అంతకు మించి ఏంలేదు.

ఈ ఎట్రాక్షన్స్ అన్నీ నేను పనిచేసే ప్రతిచోటా ఉండేవే.

బహుశా అందుకే... ఎప్పుడో ఒకసారి స్పెషల్ అప్పియరెన్సులా ఇప్పటివరకు ఒక మూడు సినిమాలు మాత్రమే చేశాను.

కేవలం శాటిలైట్ రైట్స్ కోసమే ఒక సినిమాకు డైరెక్టర్‌గా నా పేరు అరువిచ్చాను. దాదాపు 80 లక్షలొచ్చాయి ఆ ప్రొడ్యూసర్‌కు. నాకు మొండి చేయే అనుకోండి, అది వేరే విషయం. 😊

కట్ చేస్తే -

ఇప్పుడు వరుసగా సినిమాలు చేసే ప్లానులో చాలా బిజీగా ఉన్నాను.

జస్ట్ ఏటీటీ రిలీజ్ కోసం మాత్రమే.

ఇప్పుడైతే రిజిస్టేషన్స్, సెన్సార్ వంటి ఎలాంటి బుల్‌షిట్ లేదు. డ్యూరేషన్ రిస్ట్రిక్షన్స్ లేవు. చిన్న సినిమాలకు థియేటర్లు దొరకవన్న నాన్సెన్స్ లేదు.

అంతా మనిష్టం.

కంప్లీట్ క్రియేటివ్ ఫ్రీడమ్. కంప్లీట్‌లీ రిస్క్‌ఫ్రీ.

కనీసం ఒక లక్ష టికెట్స్ ఆన్‌లైన్‌లో కట్ చేయించగలగాలి.

అంతే.

తర్వాతంతా రిన్స్ అండ్ రిపీట్...

గవర్నమెంటు మళ్లీ ఈ ఓటీటీ, ఏటీటీల మీద కూడా ఆ రూల్సూ, ఈ రూల్సూ, సెన్సార్ వంటివి రుద్ది, నానా కంగాళీ చెయ్యకముందే జెట్‌స్పీడ్‌లో కనీసం ఒక 4 సినిమాలు చేయాలనుకొంటున్నాను. చేస్తాను.

ఈ కరోనా లాక్‌డౌన్ ఒక్కటి ఇంకొంచెం రిలాక్సేషన్ ఇవ్వాలి. ఇంకాస్త భయం తగ్గించాలి. అప్పుడుకాని, కదలాల్సిన "అసలు" పనులు కదలవు.

ప్రస్తుతం ఆ కదలిక కోసమే అందరి వెయిటింగ్... నా వెయింటింగ్ కూడా.

తెలంగాణ భాషలో చెప్పాలంటే, "బండకింద చెయ్యిరికింది". ఇప్పుడా చెయ్యి బయటికి లాక్కోవడం కోసమైనా సినిమాలు చెయ్యక తప్పదు. చేస్తున్నాను.

ఈ నవంబర్ 1 నుంచి, నా టీమ్‌తో కలిసి షూటింగ్ ఖచ్చితంగా చేస్తున్నాను... 

Saturday 29 August 2020

ఒక్క ఇన్‌స్టాగ్రామ్ పోస్టుకు 1.2 మిలియన్ డాలర్లు!

ఒక్క ఇన్‌స్టాగ్రామ్ పోస్టుకు 1.2 మిలియన్ డాలర్లు ఆమె ఫీజు! మన ఇండియన్ రూపీస్‌లో చెప్పాలంటే దాదాపు తొమ్మిది కోట్లు (8,77,54,200)!

ఆమె పేరు కైలీ జెన్నర్. 

23 ఏళ్లకే జెన్నర్‌కు ఒక అమెరికన్ మీడియా పర్సనాలిటీగా మంచి పాపులారిటీ ఉంది. అంతే కాదు, తను ఒక  సోషలైట్, మోడల్, బిజినెస్ వుమన్ కూడా.

వీటన్నిటి ద్వారా టన్నిటి ద్వారా ఆమె సాధించుకొన్న పాపులారిటీతో ఇన్‌స్టాగ్రామ్‌లో జెన్నర్‌కు 192 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు.

అంటే, ఇన్స్‌స్టాగ్రామ్‌లో జెన్నర్ ఒక పోస్టు పెడితే దాదాపు 19 కోట్లమంది ఆ పోస్టుని చూస్తారన్నమాట! 

అందుకే జెన్నర్ పెట్టే ఒక్క పోస్టు ఒక పెద్ద యాడ్ క్యాంపెయిన్‌తో సమానం. అందుకే ఆమె పెట్టే ఒక్క ఇన్స్‌టాగ్రామ్ పోస్టుకు అంత ఖరీదు. 

Instagram Influencer లుగా ఇలాంటివాళ్లకు చాలా సందర్భాల్లో చాలా వాల్యూ ఉంటుంది. 

కట్ చేస్తే -

ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్‌కు 2.6 బిలియన్ల యాక్టివ్ యూజర్స్ ఉన్నారు. సోషల్ మీడియాలో ఫేస్‌బుక్ తర్వాతి స్థానం ఇన్‌స్టాగ్రామ్‌దే. ఇన్స్‌స్టాగ్రామ్‌కు దాదాపు 1 బిలియన్‌కు పైగా యాక్టివ్ యూజర్స్ ఉన్నారు. 

వీళ్లల్లో 99.9% మంది సోషల్ మీడియాను ఏదో టైమ్‌పాస్‌కు వాడతారు. టైమ్ కిల్లింగ్‌కు వాడతారు. కేవలం ఇలాంటి అతికొద్దిమంది మాత్రం అదే సోషల్ మీడియా ద్వారా మిలియన్స్ సంపాదిస్తుంటారు. 

సో... ఇప్పుడు ఫేస్‌బుక్‌లో మీ తర్వాతి పోస్ట్ ఏంటి? 😊

Friday 28 August 2020

Be Water, My Friend!

టీనేజ్‌లో నేను కూడా నాన్‌చాక్ తిప్పాను. కరాటే నేర్చుకున్నాను...

అప్పట్లో మా ఇంటిచుట్టూ అందరూ కరాటే మాస్టర్‌లే. కొత్తగా అప్పట్లో అదొక వేవ్ అనుకోవచ్చు.

ఫోటోలు తీసుకోవాలన్న ఆలోచన అప్పుడు లేదు. ఏమాత్రం ఐడియా ఉన్నా ఒక ఫోటో లాగించేవాణ్ణి.

ఈ బచ్చాలాట జోక్స్ పక్కనపెడితే... ఇక్కడ పాయింట్ కరాటే, నాన్‌చాక్ కాదు.

బ్రూస్‌లీ.

జస్ట్ 32 ఏళ్లకే తను అనుకొన్న ప్రతి ఒక్కటీ సాధించిన ఒక పెద్ద 'సక్సెస్ స్టోరీ' అతను.

32 ఏళ్లకే తన లక్ష్యాలన్నీ సాధించేసి, చెప్పాల్సినవన్నీ చెప్పేసి, ఏదో కొంపలు మునిగిపోతున్నట్టు ఆదరా బాదరా వెళ్లిపోయాడు.

కట్ చేస్తే -

ప్రపంచం అంతా 'పర్సనల్ డెవలప్‌మెంట్' అనే ఒక ఫీల్ గుడ్ మాయలో పడికొట్టుకొంటోంది. బిలియన్లకొద్దీ డాలర్ల బిజినెస్‌గా రోజురోజుకీ కొత్తపుంతలుతొక్కుతోంది.

మనదేశంలో కూడా.

వేళ్లూనుకుపోయిన కొన్ని సోకాల్డ్ శాస్త్రాల్లాగే, సైన్స్‌కు నిలబడని 'సీక్రెట్' ఇది. క్విక్ ఫిక్స్ కోసం నిరంతరం తపించే మనిషి బలహీనతమీద డబ్బు సంపాదించుకొనే పెద్ద మాయ ఇది. 

పాయింట్ ఏ నుంచి పాయింట్ బి కి వెళ్ళడానికి ఒక దారి ఉంటుంది. లేకపోతే చేసుకొంటూవెళ్లాలి, నీటి ప్రవాహంలా.

ఎదురయ్యే పరిస్థితులను బట్టి, ఏ పాత్రలోకి చేరితే ఆ పాత్ర ఆకారంలోకి మారిపోయే నీటిగా మారాలి.

మన కోరికలు, మన కృషి సింక్ అయినప్పుడు మాత్రమే ఇది సాధ్యం. సింక్ కాకుండా చెడగొట్టడానికి 101 విధాల రాక్షసులో, పరిస్థితులో నిరంతరం అడ్డుపడుతుంటాయి. అది అత్యంత సహజం.

అయితే, ఫోకస్ చెడకుండా వాటిని ఎదుర్కొంటూ ముందుకెళ్లేవాడే చివరికి విజేత అవుతాడు.

తన అసామాన్యమైన విజయాలతో, 32 ఏళ్లకే, బ్రూస్‌లీ సాధించి చూపించింది అదే.               

Monday 24 August 2020

సిసలైన టర్నింగ్ పాయిట్ అదే!

"కొన్నిటికి ఏ లాజిక్కులుండవ్... అన్ని కష్టాలు ఒక్కసారిగా కట్టగట్టుకొనే వస్తాయి."

జీవితంలో అన్ని ఆటుపోట్లను అనుభవించి, ఎదుర్కొని, ప్రస్తుతం ప్రశాంతంగా రిటైర్డ్ లైఫ్ అనుభవిస్తున్న ఒక డాక్టర్ అన్నారా మాట.

ఆయన మా ఆఫీస్ ప్రెమిసెస్ యజమాని.

"జీవితం ఎవ్వర్నీ వదలదు భయ్యా. ప్రతి ఒక్కర్నీ, ఏదో ఒక టైమ్ లో ఒక చూపు చూస్తుంది. మిస్సయ్యే ప్రసక్తే లేదు."

మంచి రైజింగ్ టైంలో ఉండగానే, పడకూడని కష్టాలు పడ్డ ఫిల్మ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ మాటలివి.

ఇదంతా ఈ రాత్రి  ఒంటరిగా కూర్చొని ఎందుకు రాస్తున్నానంటే, దానికో కారణం ఉంది. ప్రస్తుతానికి ఆ కారణాన్ని అలా పక్కన పెడదాం.

మనిషన్న తర్వాత, వాడి జీవితంలో ఎప్పుడూ ఏదో ఒక కష్టం చిన్నదో పెద్దదో వస్తూనే ఉంటుంది. కానీ, జీవితంలోని ఒక అతి ముఖ్యమైన మజిలీలో, అన్ని రకాల కష్టాలూ, లేదా అగ్ని పరీక్షలు ఒకేసారి రావడం అనేది ఎంత స్థితప్రజ్ఞుడినైనా కొంతైనా జర్క్ తినేలా చేస్తుంది.

ఏ లాజిక్కులు పనిచేయని కొన్ని ఊహించని పరిస్థితుల్ని ప్రతి మనిషీ తన జీవితకాలంలో ఏదో ఒకసారి ఎదుర్కోవల్సి రావచ్చు.

తప్పదు. తప్పించుకోలేం.

అలాంటి పరిస్థితుల్లో  ఉన్నపుడే నిజమైన హితులు, సన్నిహితులు ఎవరన్నది పాలు, నీళ్ళలా తెలిసిపోతుంది.

జీవితంలో ఏది ముఖ్యమో తెలిసిపోతుంది. జీవితంలో మనం ఏం కోల్పోతున్నామో తెలిసిపోతుంది.

అప్పుడు గాని మన కళ్ళు పూర్తిగా తెర్చుకోవు. అప్పుడుగాని మన మెదడును పూర్తిగా ఉపయోగించుకోము.

అప్పుడే మనకు నిజంగా ఏం కావాలో తెల్సుకుంటాము. అప్పుడే మనం నిజంగా ఏం చేయాలో అది చేయటం ప్రారంభిస్తాము. అప్పుడే మన నిజజీవితంలో ఏ పరిస్థితి ఎదురైనా నిశ్చలంగా ఎదుర్కొంటాము.

రెట్టించిన కసితో, వందరెట్ల శక్తితో.

ఎవరి జీవితంలోనైనా సిసలైన టర్నింగ్ పాయిట్ అదే.

అసలు జీవితం అప్పుడే ప్రారంభమవుతుంది ...

కట్ చేస్తే -

ఇలాంటి పరిస్థితుల్లోనే నా సినిమా పనులవేగం పెంచాను. పని ముఖ్యం. పనిలో ఉండటం ముఖ్యం. పని క్రియేట్ చేసుకోవడం ముఖ్యం.

ప్రాణమున్నన్నాళ్లు బ్రతకటం ముఖ్యం.

కోవిడ్ దారి కోవిడ్‌దే. మనదారి మనదే.

నేను ఎంత అనుకున్నా, అతి ముఖ్యమైన డెసిషన్స్‌ కొన్ని బయటి వ్యక్తుల నిర్ణయాలమీద ఆధారపడి ఉంటాయి.

ఇష్టం లేదు.

అయినా సరే... కష్టపడాలి.

సెప్టెంబర్ 15 నాటికి అంతా సెట్ చేసేసుకొని, నవంబర్ 1 నుంచి షూటింగ్‌కి వెళ్లాలని ప్లాన్.

మరోవైపు కోవిడ్ కరాళనృత్యం మాత్రం ఇంకా ఆగలేదు... 

Saturday 22 August 2020

హోమియో విత్ హోలిస్టిక్ టచ్

సుమారు ఇరవై ఏళ్లక్రితం, చిక్కడపల్లిలో అనుకుంటాను. ఒక హోమియో వైద్యుని దగ్గరికెళ్లాను. అది క్లినిక్‌లా అనిపించలేదు నాకు. 100 మందికిపైగా పేషంట్స్‌తో కిక్కిరిసిపోయి, ఒక రేషన్‌షాపులా ఉంది.

ఒక్కో పేషంట్‌ను సగటున 3 నిమిషాల్లో చూడ్డం, డబ్బులు తీసుకోవడం, ఆ చక్కెర గోళీలేవో ఇవ్వడం... అంతా ఆ 3 నిమిషాల్లోనే!

ఇంకోసారి... ఆ మధ్య ఒక అయిదారేళ్లక్రితం, తార్నాకలో లోపలెక్కడో ఉన్న ఇంకో హోమియో వైద్యుని క్లినిక్‌కు వెళ్లాను. అక్కడ ఇంకో అనుభవం... ఏంటంటే - పొద్దున 5 గంటలకు వెళ్ళి అక్కడ అరుగులమీద వరుసలో కూర్చునే పేషెంట్ 'టర్న్' మధ్యాహ్నం దాదాపు ఏ 3 గంటలకో వస్తుంది! అదీ లెక్క. ఆ లెక్కప్రకారం, ఎవరికివారే అంచనాలు వేసుకొంటూ, మధ్యలో లేచి ఆ వీధుల్లో తిరిగి రావడాలు, బండి మీద ఇడ్లీలు తిని రావడాలూ... అదొక తీర్థం. లోపలికెళ్లాక ఆ డాక్టర్ చూసింది ఒక 5 నిమిషాలు. డబ్బులు, చిట్టి చక్కెర గోళీల మాత్రలు మామూలే.

పై రెండు సందర్భాల్లో కూడా పేషెంట్ నేను కాదు. నాకు తెలిసినవాళ్లతో తోడుగా వెళ్లాను. నాకు నచ్చలేదు.

ఆ రెండుచోట్లా కూడా... నిజంగా వైద్యం తెలిసి చేస్తున్న ఒక డిగ్నిఫైడ్ ప్రాక్టీసులా నాకేమాత్రం అనిపించలేదు. వెనక ఒక సర్టిఫికేట్ పెట్టుకొని చేస్తున్న ఒక మంచి లాభదాయకమైన బిజినెస్ మోడల్‌లా అనిపించింది.

కట్ చేస్తే -

మొన్నీమధ్య నా మిత్రుడు, డిప్యూటీ తహసిల్దార్, యాంటీ టొబాకో నిర్విరామ ప్రచారకర్త మాచన రఘునందన్‌తో ఏదో పనిమీద వెళ్తున్నప్పుడు, దారిలో తనొక డాక్టర్ దగ్గర ఆగాడు.

అక్కడ 5 నిమిషాలు అనుకున్న అతని పనేదో కాస్త ఆలస్యమైంది.

అదొక హోమియో క్లినిక్.

కాని, అంతకు ముందు నా 2 అనుభవాలకు పూర్తి భిన్నంగా ఉంది. ఆశ్చర్యంగా ఒకసారి చుట్టూ చూశాను.

రిసెప్షన్‌లో ఒక బాయ్, అపాయింట్‌ తీసుకొని వచ్చిన ఒక పేషెంట్ బయట... ఇంకో పేషంట్ లోపల డాక్టర్ దగ్గర తప్ప... ఇంకెవ్వరూ లేరు!

క్లినిక్ హైవేలో రోడ్డు పక్కనే ఒక కమర్షియల్ కాంప్లెక్స్‌లో ఉన్నా,  ప్రశాంతమైన నిశ్శబ్దం...

కట్ చేస్తే -

సుమారు 70 ఏళ్ల డాక్టర్ సుభాష్‌చందర్ గారిని నాకు పరిచయం చేశాడు రఘునందన్.

అంతకు పూర్వం నేను చూసిన అనుభవాల నేపథ్యంలో, డాక్టర్ గారితో మాట్లాడ్డం ప్రారంభించాను.

ఒకే ఒక్క నిమిషంలో ఆయనేంటో అర్థమైంది నాకు. తను చేస్తున్న వైద్యం మీద ఒక స్పష్టమైన,  తిరుగులేని అథారిటీ కనిపించింది.

అప్పటివరకూ నేనసలు పట్టించుకోని హోమియో వైద్యం పట్ల నాకు నిమిషాల్లో ఆసక్తిని రేకెత్తించారు డాక్టర్ సుభాష్‌చందర్.

ఆ ఆసక్తితోనే డాక్టర్‌గారిని మళ్లీ ఒకసారి కలిశాను...

డాక్టర్‌కు గొప్ప వాక్ధాటి అవసరం లేదు. కాని, తాను చేస్తున్న వైద్యం పట్ల ఖచ్చితమైన స్పష్టత అవసరం. అది వారిలో ఉంది. వైద్యునిగా 40 ఏళ్ల అపారమైన అనుభవంతో కూడిన హస్తవాసి, ఏదైనా ఇట్టే కనుక్కొని తగిన చికిత్స అందించగల నైపుణ్యం కూడా ఆయనలో ఉంది.

వైరల్ డిసీజెస్, టాక్సిక్ స్టేట్స్, డిఫికల్ట్ డిసీజెస్ అని ప్రధానంగా 3 రకాల కంప్లయింట్స్‌తో  వస్తుంటారు పేషెంట్స్.

వాటిల్లో కీళ్లవాతం, స్పాండిలాసిస్, సర్జరీ చేసినా తగ్గని ఇంకెన్నో దీర్ఘకాలిక సమస్యలను డిఫికల్ట్ డిసీజెస్ అనొచ్చు. ఇలా వచ్చిన ప్రతి ఒక్క పేషెంట్‌కు తగిన చికిత్స అందించి నయం చేసిన రికార్డు డాక్టర్ సుభాష్‌చందర్ గారికి ఉంది.

టాక్సిక్ కేసుల్లో - లోపల ఉన్న షుగర్ వల్ల కిడ్నీ ఫెయిలయ్యి, బయట అన్నివిధాలా  ప్రయత్నించి, పూర్తిగా చేతులెత్తేసిన చివరిదశలో వచ్చిన పేషంట్స్‌కు కూడా నయం చేశారు.

వైరల్ కేసుల్లో - వేలు, లక్షలు ఖర్చు పెట్టుకొని సీరియస్ అయిన డెంగూ కేసుల్ని కేవలం గంటల్లో తగ్గించారు.

గిలాన్ బారే సిండ్రోమ్‌తో దాదాపు కాళ్లు చేతులు పనిచేయకుండా పోయిన సురేష్‌చంద్ర అనే ఒక పేషెంట్, బెంగుళూరులో అతి పెద్ద డాక్టర్స్‌ను, హాస్పిటల్స్‌ను సంప్రదించాడు. కానీ నయం కాలేదు. డాక్టర్ సుభాష్‌చందర్ ఆయన్ని కేవలం కొద్దిరోజుల్లోనే పూర్తిగా ఆరోగ్యవంతున్ని చేశారు.

పక్షవాతం ఎటాక్ అయిన పేషెంట్‌కు సాయంత్రానికి మార్పు చూపించి, క్లినిక్ నుంచి నడుచుకుంటూవెళ్లేలా చేశారు.

ఇర్రిటబుల్ బోవెల్ సిండ్రోమ్‌తో ఏళ్లుగా బాధపడిన ఒక మహిళా పేషెంట్, డాక్టర్ సుభాష్‌చందర్ గారి గురించి తెలుసుకొని, ముంబై నుంచి వచ్చి మరీ నయం చేయించుకొంది. 

ఇలాంటి ఇంకెన్నో ఉదాహరణలు, వివరాలను డాక్టర్ గారి "న్యూ లైఫ్ హెల్త్‌కేర్" వెబ్‌సైట్‌లో చూడొచ్చు.   

లోకల్ గానే కాకుండా - ఎంతోమంది పేషెంట్లు ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, కాకినాడ వంటి సుదూరప్రాంతాల నుంచి కూడా వచ్చి విజయవంతంగా చికిత్స పొందారు.

వైరస్‌కు మందు లేదు. అయినా సరే, ఆయా వైరస్ వ్యాధుల లక్షణాలనుబట్టి సక్సెస్‌ఫుల్‌గా చికిత్స అందించిన రికార్డు డాక్టర్ సుభాష్‌చందర్ గారికి ఉంది.

ఏ వైరస్ అయినా ఎటాక్ చేయకుండా, ఒకవేళ చేసినా బ్రతక్కుండా మనలో ఇమ్యూనిటీ సమృధ్ధిగా ఉండేట్టు చూసుకోవడం ముఖ్యం అంటారు డాక్టర్ సుభాష్‌చందర్. ఇమ్యూనిటీ పెరుగుదలకు అవసరమైన మందులు కూడా డాక్టర్‌గారు ఇస్తున్నారు.

ప్రారంభంలో ఎం బి బి ఎస్ డాక్టరే అయినా, తర్వాత హోమియోకు యాక్సిడెంటల్‌గా మారిపోయిన డాక్టర్ సుభాష్‌చందర్ ఫాకల్టీ ఆఫ్ హోమియోపతి, లండన్ నుంచి ఎం ఎఫ్ హోమ్ చేశారు.


గత 40 ఏళ్లుగా వృత్తిలో ఉన్నా వారిలో ఎలాంటి అలసట, విసుగు, తడబాటు కనిపించదు. పరిశుభ్రమైన, ప్రశాంతమైన వాతావరణంలో వారి క్లినిక్ నిర్వహణ ఒక పధ్ధతిగా ఉండటం నాకు బాగా నచ్చింది.

క్రోన్స్ డిసీజ్, గిలాన్ బారే సిండ్రోమ్, రుమటాయిడ్ అర్త్‌రైటిస్, ఇంకా... ఆస్తమా, హే ఫీవర్ అలెర్జిక్ రినైటిస్ వంటి ఎన్నో వ్యాధులకు ఖచ్చితంగా ఇదీ అని తెలిసిన చికిత్స లేదు. ఎన్నో హాస్పిటల్స్, ఎంతోమంది డాక్టర్స్ చుట్టూతిరిగి, నయంకాక, చేతులెత్తేసిన పరిస్థితులలో వచ్చిన ఎందరో పేషెంట్స్‌కు చికిత్సచేసి, మళ్ళీ ఆయా వ్యాధుల లక్షణాలు తిరిగి కనిపించకుండా రిలీఫ్ ఇచ్చిన రికార్డ్ డాక్టర్ షుభాష్‌చందర్ సాధించారు.  

హోమియోపతి అంటే జస్ట్ సైన్స్ మాత్రమే కాదు. ఆర్ట్ కూడా అంటరాయన. హోమియో వైద్యానికి హోలిస్టిక్ టచ్ కూడా ఇచ్చి వైద్యం చేయడం ఆయన శైలి.   

ఇంకా ఏదేదో చెయ్యాలన్న తపన ఆయన మాటల్లో ఎప్పుడూ కనిపిస్తుంది. 70 ఏళ్ల వయస్సులో అంత అవసరమా అనుకోరాయన. "Silence of intelligentsia is more dangerous than terrorism" అన్న మాటను ఆయన బాగా నమ్ముతారు.   

వేరే ఎక్కడా నయంకాని జబ్బులు, క్రిటికల్ దశకు చేరుకొన్న జబ్బులను టేకప్ చేయడం డాక్టర్ సుభాష్‌చందర్ గారికి ఇష్టం. ఇవే కాకుండా, వైద్యసంబంధమైన ఏ ఇతర సమస్యకైనా, ఎవరైనా డాక్టర్ గారిని సంప్రదించవచ్చు.

ఒకసారి కలిస్తే పోయేదేముంది? మీ ఆరోగ్యం మళ్లీ మీ చేతుల్లోకి వస్తుంది. అంతే కదా...
^^^^^

New Life Homeo Care, 3rd Floor, Commercial Complex, Beside Bharat Petroleum, Jeedimetla Village Junction, After Suchitra Cross, NH44, Hyderabad - 500067.
Email: drsubhaash@gmail.com | Phones: +91 98661 96309, +91 90300 38090
Website: www.newlifehomeocare.com

Friday 21 August 2020

సీన్ మారిందా?

సినీఫీల్డులోకి ప్రవేశించాలనుకొనే ఆర్టిస్టులయినా, టెక్నీషియన్లయినా, ఇంకెవరయినా.. ముందుగా తెల్సుకోవల్సిన విషయాలు ప్రధానంగా రెండు:

1. సినీఫీల్డులో "ఇది ఇలా జరుగుతుంది" అని ఖచ్చితంగా ఎవరూ చెప్పలేరు. ఫీల్డులో ఎంట్రీ దొరకడమే చాలా కష్టం. దొరికాక దాన్ని సరైన విధంగా వినియోగించుకొని నిలదొక్కుకోవడం మరీ కష్టం. ఒక్క ముక్కలో చెప్పాలంటే - ఇక్కడ దేనికీ గ్యారంటీ లేదు.

2.  ఇక్కడ అవకాశం దొరికి, పేరు తెచ్చుకొనేవరకూ దాదాపు ఎవ్వరూ ఒక్క రూపాయి పారితోషికం ఇవ్వరు. అలా ఇస్తారనుకోవడం, అలా అని ఎవరైనా చెప్తే వినడం.. ఉఠ్ఠి భ్రమ. మన జేబులోంచే వేలకి వేలు ఖర్చుపెట్టుకుంటూ బ్రతకాల్సి ఉంటుంది.

ఈ విషయంలో కేవలం ఒక్క కేటగిరీకి మాత్రమే మినహాయింపు ఉంటుంది. అది - హీరోయిన్లు, ఇతర ఫిమేల్ సపోర్టింగ్ ఆర్టిస్టులు. వీళ్లు దొరకడమే కష్టం కాబట్టి ఈ వెసులుబాటు!

అదే హీరోలయితే ఎదురు పెట్టుబడి పెట్టాల్సికూడా రావొచ్చు. అది వేరే విషయం.

పైన చెప్పిన రెండు అంశాల్ని దృష్టిలో పెట్టుకొని, కొత్తగా ఫీల్డులోకి రావాలనుకొనేవాళ్లు తీసుకోవల్సిన జాగ్రత్త ఒకే ఒక్కటి.

ఇక్కడ ఫీల్డులో అవకాశం దొరికి, నిలదొక్కుకొనేవరకూ - ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా మరొక ఆదాయమార్గాన్ని లేదా జాబ్‌ని ముందుగానే చూసుకోవాలి. లేదంటే మీరు బాగా డబ్బున్నవాళ్లయి ఉండాలి.

శిలాశాసనం లాంటి ఈ జాగ్రత్త తీసుకోకుండా ఫీల్డులోకి ఎవరు ఎంటరయినా.. తర్వాత సినిమా కష్టాలు తప్పవు.

అన్నీ అవుతున్నట్టే ఉంటుంది. కానీ, ఏదీ జరగదు. సాంఘికంగా, ఆర్థికంగా ఎన్నో ఛాలెంజ్‌లు ఎదుర్కోవాల్సి వస్తుంది. చూస్తుండగానే జీవితం మీ చేతుల్లోంచి జారిపోతుంది.

గత 5 నెలలుగా ఈ కరోనా లాక్‌డౌన్ కారణంగా వేలాదిమంది సినీ ఆర్టిస్టులు, టెక్నీషియన్లు పడుతున్న కష్టాలు కూడా దీనికి మరో ప్రత్యక్ష ఉదాహరణ.

కట్ చేస్తే -

ఇప్పటిదాకా మీరు చదివిందంతా పాత కథ.

ఇప్పుడు సీన్ మారింది. ఇంకా చాలా మారబోతోంది.

రెండు కారణాలు:

1. డిజిటల్ ఫిల్మ్ మేకింగ్ టెక్నాలజీ వల్ల తగ్గిన ఫిల్మ్ మేకింగ్ బడ్జెట్లు.

2. కరోనా లాక్‌డౌన్ వల్ల గత 5 నెలలుగా మూసుకున్న థియేటర్లు - తెరచుకొన్న OTT/ATT స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ - చిన్న బడ్జెట్ సినిమాలకు, కొత్త ఆర్టిస్టులకు, టెక్నీషియన్లకు పెరిగిన అవకాశాలు.

ఈ నేపథ్యంలో ఫిల్మ్ ఇండస్ట్రీ రూపురేఖలు సమూలంగా మారిపోనున్నాయి. 

సుమారు ఒక దశాబ్దం క్రితమే, పాశ్చాత్య దేశాల్లో ఆధునికంగా సినీరంగంలో వచ్చిన అభివృధ్ధి, అనేక మార్పులు... చాలా ఆలస్యంగా...  ఇప్పుడు ఈ లాక్‌డౌన్ పుణ్యమా అని, మనదగ్గర చూడబోతున్నాము. 

"ఒక్క ఛాన్స్" అనేది ఇకనుంచీ... జస్ట్ ఒక మిత్ !

ఇంకొకరెవరో మీకు ఛాన్స్ ఇవ్వాల్సిన అవసరంలేదు.

సినిమారంగం పట్ల బాగా ఆసక్తి ఉన్నవాళ్లకు ఈ విషయం ఇప్పటికే అర్థమైపోయుంటుంది.

అలాంటి అవేర్‌నెస్ తెచ్చుకొనే అవకాశం లేనివాళ్లకోసం నేనో చిన్న పుస్తకం రాశాను.

పుస్తకం పేరు...

"గ్లామర్ -
సినీఫీల్డులోకి ఎందుకు వెళ్లకూడదు?
ఎందుకు వెళ్ళితీరాలి? "

ఈ చిరుపుస్తకాన్ని ఒక e-book రూపంలో ఫ్రీగా ఇస్తున్నాను, వారం రోజుల్లో...

e-book కావాలనుకొనే ఔత్సాహికులు -

మీ పేరు:
వయస్సు:
చదువు:
సోషల్ మీడియా లింక్స్:
పూర్తి అడ్రస్:
మొబైల్ నంబర్:

తెలుపుతూ నాకు ఈమెయిల్ / వాట్సాప్  చెయ్యండి.

27 వ తేదీలోపు నేనే స్వయంగా మీకు e-book మెయిల్ / లేదా వాట్సాప్ చేస్తాను.

ఆల్ ద బెస్ట్.

My email: mchimmani10x@gmail.com
WhatsApp: +91 9989578125 

Thursday 20 August 2020

"ఒక్క ఛాన్స్" అంత ఈజీ కాదు... ఎంతో ఈజీ కూడా!

ఇకనుంచీ ఈ బ్లాగులో 99% సినిమా పోస్టులే ఉంటాయి.

ఇప్పుడు పూర్తిగా కొన్నాళ్లు ATT (Any Time Theatre) ప్లాట్‌ఫామ్ కోసం వరుసగా సినిమాలు చేసే పనిలో బిజీగా ఉన్నాను కాబట్టి, ఇది సహజం.

All roads lead to one single focus. Films. And my films.

ఈ బ్లాగులన్నీ నాకోసం, నా టైప్ వాళ్లకోసం. నా ట్రైబ్ కోసం.

ఇక్కడ మీ సమయం వృధా చేసుకోవద్దని మిగిలినవాళ్లకు నా సవినయ మనవి. 🙏

పొద్దున్నే ఏంట్రాబాబు ఈ లొల్లి అనుకుంటున్నారా?

కట్ చేస్తే -

సినిమాల్లో ఛాన్స్ కోసం ఎంతోమంది ఎన్నోరకాలుగా ప్రయత్నిస్తుంటారు.

ఇది ఇప్పటి విషయం కాదు. సినిమా పుట్టినప్పటినుంచి హాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా ఇంతే. ఆశ్చర్యమేం లేదు.

అతికొద్దిమందికి పెద్దగా కష్టం లేకుండానే ఇండస్ట్రీలో ఎంట్రీ దొరుకుతుంది. కాని, అత్యధికశాతం మందికి మాత్రం అదొక అందని ద్రాక్షపండులానే మిగిలిపోతుంది. 

కావాలంటే చెక్ చేసుకోండి. ఇండస్ట్రీ గురించి తెలిసినవాళ్లను, సీనియర్స్‌నూ అడగండి, చెప్తారు.

సంవత్సరం... రెండేళ్లు... దశాబ్దం గడిచినా అవకాశం దొరకనివాళ్లెందరో.

ఇది చాలా సహజమైన విషయం.

దీనికి 101 కారణాలున్నాయి. ఉంటాయి. ఉంటూనే ఉంటాయి.

అయితే ఫిలిం మేకింగ్ ప్రక్రియలో వచ్చిన డిజిటల్ టెక్నాలజీ ఈ రొటీన్‌ను బ్రేక్ చేసింది. ఈమధ్యే వచ్చిన కరోనావైరస్, లాక్‌డౌన్‌లు దీనికి మరింత బలాన్నిచ్చాయి.

"ఒక్క ఛాన్స్" అనేది ఇకనుంచీ జస్ట్ ఒక మిత్ అని తేల్చేశాయి.

సినిమాల్లో నిజంగా, అంత బాగా, ఆసక్తి ఉన్నవాళ్లకు ఈ విషయం ఇప్పటికే అర్థమైపోయుంటుంది.

అర్థం కానివాళ్లకోసం, అలాంటి అవేర్‌నెస్ తెచ్చుకొనే అవకాశం లేనివాళ్లకోసం నేనో చిన్న పుస్తకం రాశాను.

పుస్తకం పేరు...

గ్లామర్ 
సినీఫీల్డులోకి ఎందుకు వెళ్లకూడదు?
ఎందుకు వెళ్ళితీరాలి? 


ఈ చిరుపుస్తకాన్ని ఒక e-book రూపంలో ఫ్రీగా ఇస్తున్నాను, వారం రోజుల్లో...

e-book కావాలనుకొనే ఔత్సాహికులు -

మీ పేరు:
వయస్సు:
చదువు:
సోషల్ మీడియా లింక్స్:
పూర్తి అడ్రస్:
మొబైల్ నంబర్:

తెలుపుతూ నాకు ఈమెయిల్ / వాట్సాప్  చెయ్యండి.

27 వ తేదీలోపు నేనే స్వయంగా మీకు e-book మెయిల్ / లేదా వాట్సాప్ చేస్తాను.

ఆల్ ద బెస్ట్.

My email: mchimmani10x@gmail.com
WhatsApp: +91 9989578125 

Monday 17 August 2020

హిట్ కొట్టిన కొత్త బిజినెస్ మాడల్!

పాలిటిక్స్, క్రికెట్, సినిమాలు ..

ఈ మూడు లేకుండా మన దేశంలో మనుషులు బ్రతకలేరు. టీవీ చానెల్స్, సోషల్ మీడియా అస్సలు బ్రతకలేవు.

సినిమాకున్న పవర్ అది!

ఎవరు ఎన్ని చెప్పినా ఇదే నిజం.

సినిమా ప్యూర్‌లీ ఒక పెద్ద బిజినెస్.

దాని బేస్ క్రియేటివిటీ కావచ్చు. కాని, టార్గెట్ మాత్రం ఖచ్చితంగా వ్యాపారమే.

సో అల్టిమేట్‌గా డబ్బు, బిజినెస్ లేకుండా ఇక్కడ ఏం లేదు. 'కళామతల్లి', 'క్రియేటివిటీ' లాంటి మాటలన్నీ జస్ట్ మైకు ముందు మాట్లాడే టైమ్‌పాస్ బుల్‌షిట్ తప్ప మరొకటికాదు.

కట్ చేస్తే -

కరోనావైరస్ దెబ్బకు సినిమా బిజినెస్ చిన్నబోయింది. చిన్నబోవడం కూడా కాదు, పూర్తిగా చిన్నదైపోయింది!

దాదాపు 5 నెలలనుంచి థియేటర్స్ లేవు, సినిమా షూటింగ్స్ లేవు.

షూటింగ్స్ కోసం ప్రభుత్వాల వెంటపడి పర్మిషన్ తీసుకున్నారు. కాని, షూటింగ్ చెయ్యాలంటే వణికిపోతున్నారు స్టార్స్.

కొన్ని నిబంధనలకు లోబడి, థియేటర్స్ కూడా తెరవడానికి ఓకే అనిపించుకొన్నారు. కాని, ఓపెన్ చెయ్యాలంటే 101 టెన్షన్స్.

అంత ఈజీ కాదు. ఇప్పట్లో ప్రేక్షకులు ఎవ్వరూ రారు.

ఈ నేపథ్యంలో - అంతకు ముందటి ఓటీటీలే ఇప్పుడొక చిన్న ట్విస్ట్‌తో ATT (Any Time Theater) లయిపోయాయి. "Pay Per View" పధ్ధతిలో పాపులర్ అయిపోయిన ఈ ATT ల్లో  ఇప్పుడు వారానికి 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.

ఒక్క సినిమా 10 భాషల్లో కూడా రిలీజవుతోంది! గంటల్లో లక్షలు, కోట్లు కొల్లగొడుతున్నారు!!

ఇవన్నీ మైక్రో బడ్జెట్ సినిమాలు.

వందల కోట్లు, స్టార్స్ అక్కర్లేదు. చిన్న బడ్జెట్, కొత్త టాలెంట్ చాలు. తక్కువ సమయంలో ఎక్కువ లాభం గ్యారంటీ.

"శ్రేయాస్ ఈటీ" అని గూగుల్లో కొట్టండి. మొత్తం బిజినెస్ అర్థమైపోతుంది.

అందరూ హాట్ సినిమాలనే తీయాలన్న రూలేంలేదు. క్లాసిక్ కథలకు కూడా కొద్దిగా రొమాంటిక్ టచ్ ఇచ్చి తీయొచ్చు.  ప్రేక్షకులను కట్టిపడేసే విధంగా ఇంకెన్నో జోనర్స్‌లో కూడా సినిమాలు తీయొచ్చు.

ఆకాశమే హద్దు.

సినిమా నిర్మాణంలో ఆధునికంగా వచ్చిన డిజిటల్ టెక్నాలజీ వల్ల ఇప్పుడు బడ్జెట్‌లు చాలా తగ్గాయి. చిన్న స్థాయిలో, కొత్తవాళ్లతో సినిమాలు చేయాలనుకొనేవాళ్లకు బిజినెస్ పాయింటాఫ్ వ్యూలో ఇదొక మంచి ప్రాఫిటబుల్ అండ్ పాజిటివ్ మలుపు.

మంచి బిజినెస్ మాడల్ కూడా.

ఈ బిజినెస్ మాడల్‌లో ఒక్క డబ్బే కాదు, ఊహించని రేంజ్ వ్యక్తులతో సంబంధాలూ, ఓవర్‌నైట్‌లో ఫేమ్ .. ఇవన్నీ ఇక్కడే సాధ్యం.

దటీజ్ సినిమా.

దటీజ్ న్యూ బిగ్ బిజినెస్. 

ఇంకో 3 నెలల తర్వాత థియేటర్స్ తెరచినా ఈ ATT ల హవా ఏమాత్రం తగ్గిపోదు.

ప్రేక్షకుల జీవనశైలి, ఆలోచనా విధానం లాక్‌డౌన్ తర్వాత పూర్తిగా మారిపోతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు.   

అన్ని వ్యాపారాలు మూలబడిపోయిన ఈ సమయంలో, ఒక అద్భుతమైన బిజినెస్ మాడల్ ఇది.

కేవలం ATT లో రిలీజ్ కోసమే, ఒక సీరీస్ ఆఫ్ మైక్రో బడ్జెట్ సినిమాలను నేను ప్లాన్ చేసి, పని ప్రారంభించాను. ఈవైపు ఆసక్తి ఉన్న లైక్‌మైండెడ్ ఇన్వెస్టర్స్ నన్ను సంప్రదించొచ్చు.

Seriously interested investors only can ping me on my WhatsApp: +91 9989578125 | email: mchimmani@gmail.com

కలిసి పనిచేద్దాం, కలిసి ఎదుగుదాం. 

Thursday 13 August 2020

"క్రౌడ్‌ఫండింగ్" సినిమా!

అమెరికాతో పాటు, కొన్ని ఇతర అభివృధ్ధిచెందిన దేశాల్లో  ఈమధ్య బాగా ప్రాచుర్యం పొందిన పదం - క్రౌడ్ ఫండింగ్.

ఒక ప్రాజెక్టుని ప్రారంభించి, పూర్తిచేయడంకోసం చిన్నచిన్న మొత్తాల్లో ఎక్కువమంది నుంచి డబ్బు సేకరించడమే క్రౌడ్ ఫండింగ్.

సింపుల్‌గా చెప్పాలంటే - ఒక కోటి రూపాయల పెట్టుబడి కోసం ముగ్గురో, నలుగురో కలిస్తే అది "పార్ట్‌నర్‌షిప్" అవుతుంది. అదే కోటి రూపాయల కోసం ఒక 10 మందో, అంతకంటే ఎక్కువ మందో కలిసిస్తే అది "క్రౌడ్ ఫండింగ్" అవుతుంది. 

అంతర్జాతీయంగా ఈ మధ్య బాగా ప్రాచుర్యం పొందిన ఈ ఫండ్ రైజింగ్ ప్రాసెస్ ని అమలు చేయటం కోసం కిక్ స్టార్టర్, ఇండీగోగో వంటి ఎన్నోవెబ్ సైట్లున్నాయి. వాటి కమిషన్, ఇతర సర్విస్ చార్జీలు, టాక్స్ వగైరా  అవి తీసుకుంటాయి. ఒకసారి ఆ సైట్స్‌కు వెళితే ఎవరికయినా  విషయం పూర్తిగా అర్థమైపోతుంది.

2013 లో వచ్చిన "లూసియా" అనే కన్నడ సినిమా, ఈ క్రౌడ్ ఫండింగ్ పధ్ధతిలో తయారైన తొలి కన్నడ సినిమా.  50 లక్షల మొత్తం బడ్జెట్‌ను క్రౌడ్ ఫండింగ్ పధ్ధతిలోనే సేకరించి నిర్మించిన ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ఒక్కటే 95 లక్షలు సంపాదించిపెట్టింది. లూసియా మొత్తం కలెక్షన్లు 3 కోట్లు. 

ఆ తర్వాత నాకు తెలిసి, కనీసం ఇంకో అరడజన్ కన్నడ సినిమాలు ఇదే పధ్ధతిలో నిర్మించారు. హిందీలో , తెలుగులో  కూడా ఈ పధ్ధతిలో చాలా సినిమాల నిర్మాణం జరిగింది.

కట్ చేస్తే - 

ఇప్పుడున్న లాక్‌డౌన్ నేపథ్యంలో, మీరు ఊహించనంత అతి తక్కువ బడ్జెట్లో కొత్తవారితో సినిమాలు నిర్మించి, ATT ల్లో రిలీజ్ చేయవచ్చు. మంచి లాభం కూడా గ్యారంటీ. 

సినిమా నిర్మాణం పట్ల, సినిమా బిజినెస్ పట్ల అత్యంత ఆసక్తి ఉండీ, ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టడాన్ని రిస్కుగా భావించేవారికి క్రౌడ్ ఫండింగ్ పధ్ధతి ఒక మంచి అవకాశం.  ఎంత చిన్న పెట్టుబడితోనయినా మీరు ఫీల్డులోకి ప్రవేశించవచ్చు!

ఈ బిజినెస్ మోడెల్‌కు ఇదే సరైన సమయం అని ఆర్జీవీ సినిమాలమీద సినిమాలు నిర్మిస్తూ, ATT ల్లో రిలీజ్ చేస్తున్నది మీరు గమనించేవుంటారు. 

ఈ గోల్డెన్ అపార్చునిటీని వినియోగించుకొనే క్రమంలో, కేవలం ఏటీటీలో రిలీజ్ కోసమే నేను చేస్తున్న సీరీస్ ఆఫ్ మైక్రోబడ్జెట్ సినిమాల్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకొంటే నన్ను వెంటనే సంప్రదించవచ్చు. WhatsApp: +91 9989578125, Email: mchimmani@gmail.com 

"న్యూ నార్మల్" ఇంకో 45 రోజుల్లో !!

కిందో మీదో పడి మొత్తానికి ఒక వాక్సీన్ బయటకొచ్చింది.

థాంక్స్ టూ రష్యా, పుతిన్ అండ్ హిజ్ టీమ్...

పుతిన్ ఒక శక్తి.

సోవియట్ యూనియన్ ముక్కలయిపోయిన తర్వాత, రష్యా తిరిగి కోలుకొని నిలబడేలా చేయగలిగిన నాయకుడు పుతిన్.

రష్యాలో వాక్సిన్ ముందు వచ్చింది అంటే అదేదో అల్లాటప్పాగా గప్పాలు కొట్టుకోడం కాదు. KGB/IPA స్థాయిలో దాని వెనుక ఒక పక్కా ప్లాన్, కృషి ఉంటుంది. 

అంతర్జాతీయ రాజకీయాలు, అంతర్గత రాజకీయాలు ఏవైనా ఉండొచ్చుగాక, నిజంగానే పుతిన్ ఒక శక్తి. అతను పూనుకున్నాడు కాబట్టే ఈ విజయం. 

ఇప్పుడు వద్దన్నా మిగిలిన దేశాలు ఒక్కోటీ వాక్సీన్స్‌ను వదులుతుంటాయి. 

ఇదొక పెద్ద మాఫియా. 2001లో వచ్చిన బ్రిటిష్ నవల, 2005లో వచ్చిన సినిమా... "ది కాన్స్‌టంట్ గార్డెనర్"  చూసినవాళ్లకు ఈజీగా అర్థమవుతుంది.      

ఇప్పుడు పుతిన్‌ను విమర్శిస్తున్నవారు, అతను ప్రకటించిన "స్పుత్నిక్-వి" వాక్సీన్‌ను విమర్శిస్తున్న శాస్త్రవేత్తలు, సంస్థలు, దేశాధినేతలు, పొలిటీషియన్స్, సోషల్‌మీడియా మేధావులు అందరూ మిగిలిన దేశాల వాక్సీన్స్‌ను ఒప్పుకోక తప్పదు. ఆహ్వానించక తప్పదు.  

ఆరోజు కూడా కొద్దిరోజుల్లోనే మనం చూడబోతున్నాము. 

కట్ చేస్తే -

ఇన్నాళ్లుగా బయటికి చెప్పుకోలేక, బయటపడలేక ప్రపంచంలో అత్యధికశాతం మంది అనుభవిస్తున్న మానసిక వ్యధకు ఒక శుభం కార్డు పడింది. 

వాక్సినేషన్ ప్రారంభమైంది. రష్యాలో ముందు మెడికల్ స్టాఫ్‌కు, స్కూల్ టీచర్స్‌కు, ఇతర రిస్క్ వర్కర్స్‌కు వేస్తున్నారు. తర్వాతే మాస్ వాక్సినేషన్! 

అక్టోబర్ నుంచి ప్రపంచం అంతా మాస్ వాక్సినేషన్ ప్రారంభం అవుతుందంటున్నారు.    

సందిగ్ధంలో ఉన్న వ్యక్తులు ఇక కదులుతారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. సినిమా షూటింగ్స్ కూడా దసరా నుంచి పూర్తిస్థాయిలో ఊపందుకుంటాయి. 

నెమ్మదిగా థియేటర్స్ కూడా తెరుస్తారు. అయినాసరే, ఇకనుంచి ఓటీటీ/ఏటీటీలదే హవా.    

రోజుకూలీ కార్మికుల నుంచి, బయటకు చెప్పుకోలేక లోపల్లోపలే చచ్చిపోతున్న ఎంతోమందికి కూడా ఇక మంచిరోజులు వచ్చినట్టే.

5 నెలలుగా అనుభవించిన నరకానికి మహా అయితే ఇంకో 3 నెలల్లో పూర్తిస్థాయిలో గుడ్‌బై చెప్పబోతున్నాం. 

ఈసారి ఇదేదో ఇమాజినేషన్ కాదు. స్పెక్యులేషన్ కాదు. కళ్లముందు మనం చూడబోతున్న నిజం. 

ఈ కరోనా లాక్‌డౌన్ నేర్పించిన పాఠాలు, చేసిన జ్ఞానోదయం ఎవరూ అంత ఈజీగా మర్చిపోరు. రానున్న న్యూ నార్మల్‌లో మనిషి జీవనశైలి కొంతయినా కొత్తగా ఉంటుందని నేననుకొంటున్నాను. 

అప్పటిదాకా మరింత జాగ్రత్త అవసరం... 

Sunday 9 August 2020

Make Films That Make Money !!

ప్రపంచమంతా కరోనావైరస్ వచ్చి మూసేసుకుంటే తప్ప ఇండియాలో OTT లు పాపులర్ కాలేదు! 

సినిమా థియేటర్లు నిరవధికంగా మూతపడితే తప్ప, ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని చిన్న సినిమాల రిలీజ్‌కు ఒక మార్గం కొత్తగా మెరవలేదు!

ఇప్పుడా OTT లు కాస్తా, "Pay Per View" పధ్ధతిలో ATT (Any Time Theater) లుగా మారిపోయి, ఫుల్ స్వింగ్‌లో ఉన్నాయి.

ఇంకో అరడజన్ కొత్త ATT లు లైన్లో ఉన్నాయి.

లాక్‌డౌన్ చాలామందికి చాలా నేర్పింది. నా ప్రస్థుత నేపథ్యం ఇంకొంచెం ఎక్కువే నేర్చుకొనేలా చేసింది.

ప్రపంచం ఊహించని ఒక మహావిపత్తు నిజంగానే నాలాంటివారిలో ఒక మహాజ్ఞానోదయానికి తెరలేపింది. 

ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఏది ఏమైనా... ఈ లాక్‌డౌన్ సమయాన్ని సరిగ్గా వినియోగించుకొని, సరైన ప్లానింగ్‌తో "న్యూ నార్మల్" ప్రారంభించలేనివాడు జీవితంలో ఇంకెప్పుడూ ఏం సాధించలేడు. ఎందుకూ పనికిరాడు. 

క్షమించాలి. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. 

కట్ చేస్తే -

నిర్మాతలచుట్టూ, హీరోల చుట్టూ తిరగలేక, చివరి నిమిషంలో హాండిచ్చేవారికి బలి కాలేక... లైక్‌మైండెడ్‌లతో కలిసి, కోపరేటివ్ పధ్ధతిలో ఎప్పుడో ఒకసారి "స్పెషల్ అప్పియరెన్సు"లా సినిమాలు తీసే నాలాంటివాళ్లకు ఇది చాలా మంచి సమయం. 

కరోనావైరస్ కొంచెం తగ్గుముఖం పట్టి, ఈ లాక్‌డౌన్ ఇంకాస్త రిలీఫ్ ఇస్తే చాలు. పనులన్నీ పక్కనపెట్టి, జస్ట్ OTT/ATT ల కోసమే వరసపెట్టి సినిమాలు తీయడానికి చాలామంది డైరెక్టర్లు ఎదురుచూస్తున్నారు. 

వారిలో నేనూ ఒకన్ని. 

 జై ఏటీటీ !!