Thursday 13 August 2020

"న్యూ నార్మల్" ఇంకో 45 రోజుల్లో !!

కిందో మీదో పడి మొత్తానికి ఒక వాక్సీన్ బయటకొచ్చింది.

థాంక్స్ టూ రష్యా, పుతిన్ అండ్ హిజ్ టీమ్...

పుతిన్ ఒక శక్తి.

సోవియట్ యూనియన్ ముక్కలయిపోయిన తర్వాత, రష్యా తిరిగి కోలుకొని నిలబడేలా చేయగలిగిన నాయకుడు పుతిన్.

రష్యాలో వాక్సిన్ ముందు వచ్చింది అంటే అదేదో అల్లాటప్పాగా గప్పాలు కొట్టుకోడం కాదు. KGB/IPA స్థాయిలో దాని వెనుక ఒక పక్కా ప్లాన్, కృషి ఉంటుంది. 

అంతర్జాతీయ రాజకీయాలు, అంతర్గత రాజకీయాలు ఏవైనా ఉండొచ్చుగాక, నిజంగానే పుతిన్ ఒక శక్తి. అతను పూనుకున్నాడు కాబట్టే ఈ విజయం. 

ఇప్పుడు వద్దన్నా మిగిలిన దేశాలు ఒక్కోటీ వాక్సీన్స్‌ను వదులుతుంటాయి. 

ఇదొక పెద్ద మాఫియా. 2001లో వచ్చిన బ్రిటిష్ నవల, 2005లో వచ్చిన సినిమా... "ది కాన్స్‌టంట్ గార్డెనర్"  చూసినవాళ్లకు ఈజీగా అర్థమవుతుంది.      

ఇప్పుడు పుతిన్‌ను విమర్శిస్తున్నవారు, అతను ప్రకటించిన "స్పుత్నిక్-వి" వాక్సీన్‌ను విమర్శిస్తున్న శాస్త్రవేత్తలు, సంస్థలు, దేశాధినేతలు, పొలిటీషియన్స్, సోషల్‌మీడియా మేధావులు అందరూ మిగిలిన దేశాల వాక్సీన్స్‌ను ఒప్పుకోక తప్పదు. ఆహ్వానించక తప్పదు.  

ఆరోజు కూడా కొద్దిరోజుల్లోనే మనం చూడబోతున్నాము. 

కట్ చేస్తే -

ఇన్నాళ్లుగా బయటికి చెప్పుకోలేక, బయటపడలేక ప్రపంచంలో అత్యధికశాతం మంది అనుభవిస్తున్న మానసిక వ్యధకు ఒక శుభం కార్డు పడింది. 

వాక్సినేషన్ ప్రారంభమైంది. రష్యాలో ముందు మెడికల్ స్టాఫ్‌కు, స్కూల్ టీచర్స్‌కు, ఇతర రిస్క్ వర్కర్స్‌కు వేస్తున్నారు. తర్వాతే మాస్ వాక్సినేషన్! 

అక్టోబర్ నుంచి ప్రపంచం అంతా మాస్ వాక్సినేషన్ ప్రారంభం అవుతుందంటున్నారు.    

సందిగ్ధంలో ఉన్న వ్యక్తులు ఇక కదులుతారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. సినిమా షూటింగ్స్ కూడా దసరా నుంచి పూర్తిస్థాయిలో ఊపందుకుంటాయి. 

నెమ్మదిగా థియేటర్స్ కూడా తెరుస్తారు. అయినాసరే, ఇకనుంచి ఓటీటీ/ఏటీటీలదే హవా.    

రోజుకూలీ కార్మికుల నుంచి, బయటకు చెప్పుకోలేక లోపల్లోపలే చచ్చిపోతున్న ఎంతోమందికి కూడా ఇక మంచిరోజులు వచ్చినట్టే.

5 నెలలుగా అనుభవించిన నరకానికి మహా అయితే ఇంకో 3 నెలల్లో పూర్తిస్థాయిలో గుడ్‌బై చెప్పబోతున్నాం. 

ఈసారి ఇదేదో ఇమాజినేషన్ కాదు. స్పెక్యులేషన్ కాదు. కళ్లముందు మనం చూడబోతున్న నిజం. 

ఈ కరోనా లాక్‌డౌన్ నేర్పించిన పాఠాలు, చేసిన జ్ఞానోదయం ఎవరూ అంత ఈజీగా మర్చిపోరు. రానున్న న్యూ నార్మల్‌లో మనిషి జీవనశైలి కొంతయినా కొత్తగా ఉంటుందని నేననుకొంటున్నాను. 

అప్పటిదాకా మరింత జాగ్రత్త అవసరం... 

1 comment:

  1. sir,
    please release your old movies also into att/ott, we want to enjoy them, please provide the links here

    ReplyDelete