Tuesday 30 June 2015

క్రిమినల్స్, స్విమ్మింగ్‌పూల్ రిలీజ్ ఒక్కసారేనా?!

నిన్న ఫేస్‌బుక్ లో చూశాను. క్రిమినల్స్ రిలీజ్ ఎప్పుడు అని ఓ ఫ్యాన్ అడిగిన ప్రశ్నకు "జూలై నెలాఖరుకు ఉంటుంది .. బిఫోర్ మై బర్త్‌డే" అని చెప్పాడు అఖిల్ కార్తీక్.

అఖిల్ కార్తీక్ బర్త్‌డే జూలై 30. అంటే, ఆలోపే క్రిమినల్స్ రిలీజ్ ఉంటుందన్నమాట!

కొంచెం అటూఇటూగా స్విమ్మింగ్‌పూల్ రిలీజ్ కూడా అప్పుడే ఉండే అవకాశం ఉంది.

స్విమ్మింగ్‌పూల్ సినిమాను తెలుగుతోపాటు తమిళంలో కూడా ఒకేసారి రిలీజ్ చేసే దిశలో చర్చలు ప్రస్తుతం చివరి స్టేజ్ లో ఉన్నాయి. అది కూడా ఉన్నట్టయితే - తమిళంలో డబ్బింగ్, సెన్సార్ పనులు కొంచెం వేగంగానే చేయాల్సి ఉంటుంది.

ఎబ్రాడ్ రిలీజ్ గురించి ఏర్పాట్లు ఆల్రెడీ చేసి ఉన్నాం కాబట్టి, ఆ వైపు పెద్ద ఇబ్బంది లేదు. అసలు ఇబ్బందంతా ఇక్కడే.

ఇక్కడ ఏదీ ష్యూర్ కాదు!

రాజకీయంగా రెండు రాష్ట్రాలుగా విడిపోయినా - మొత్తం సినిమా ఇండస్ట్రీ లావాదేవీల్లో, సిస్టమ్‌లో మాత్రం సెంటీమీటర్ మార్పులేదు.

కొన్ని పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్ విషయంలో బోలెడంత కన్‌ఫ్యూజన్, అస్పష్టతల కారణంగా - చిన్న సినిమాల రిలీజ్ అనేది ఒక పెద్ద తలనొప్పి వ్యవహారమై కూర్చుంది. వారానికి ఏకంగా అయిదారు చిన్న సినిమాలు తెలుగులో రిలీజ్ అవుతున్నాయి. పోతున్నాయి.

స్విమ్మింగ్‌పూల్ విషయంలో అలా జరగకూడదన్నదే నా ప్రయత్నం.

కట్ టూ కార్తీక్ బర్త్‌డే - 

నిషా కొఠారి జంటగా ఓషో తులసీరాం డైరెక్షన్‌లో రూపొందిన క్రిమినల్స్ అఖిల్ కార్తీక్ కు మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను.

ఇక స్విమ్మింగ్‌పూల్ విషయానికొస్తే - ఈ జూలై 30 కి తన బర్త్‌డే జరుపుకోబోతున్న అఖిల్ కార్తీక్ కెరీర్‌లో ఇప్పటివరకూ ఏ సినిమాకూ రానంతటి ఫోకస్ స్విమ్మింగ్‌పూల్ ద్వారా లభించింది. అంతే కాదు .. ఇండస్ట్రీలోని చాలామంది ఈ సినిమా కదలికలను గమనిస్తున్నారు. ఇది ఖచ్చితంగా మైక్రో బడ్జెట్ ఫిలిమ్ మేకింగ్‌లో మేము సాధించిన తొలి విజయం.

నిజంగా ఈ రెండు సినిమాలూ అఖిల్ కార్తీక్ బర్ట్‌డే సందర్భంగా రిలీజ్ అయినట్లయితే .. అంతకంటే పెద్ద బర్త్‌డే గిఫ్ట్ అఖిల్ కార్తీక్ కు ఇంకేముంటుంది?   

Saturday 27 June 2015

స్విమ్మింగ్‌పూల్ లో బ్రాహ్మిణి, ది బ్యూటిఫుల్!

ఎస్ఆర్‌నగర్ కాఫీడే లో అనుకుంటాను .. నాకు బ్రాహ్మిణి ఫస్ట్ టైమ్ కలిసింది.

తన ఫస్ట్ అపియరెన్స్ నాకెందుకో అప్పుడు 'ది బెస్ట్' అనిపించింది. జీన్స్, టీషర్ట్‌లో ఉన్న బ్రాహ్మిణి 'చూపు'లోనే ఉండాల్సింది అంతా ఉందనిపించింది నాకా క్షణం.

బ్రాహ్మిణిని నాకు పరిచయం చేసింది షాని. నా మొదటి సినిమా "కల"కు కోరియోగ్రాఫర్‌గా పనిచేసిన నిక్సన్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తున్నప్పట్నుంచీ షాని నాకు పరిచయం. ఇప్పుడు షాని హీరో కూడా అయ్యాడు.

షానితోనూ, బ్రాహ్మిణితోనూ నేను అక్కడే, అప్పుడే, అదే కాఫీడేలో చెప్పాను.

స్విమ్మింగ్‌పూల్ లో బ్రాహ్మిణిని తీసుకుంటున్నానని!

అప్పుడే ఇంకో విషయం కూడా చెప్పాను బ్రాహ్మిణికి - కొంచెం కష్టపడితే తను హీరోయిన్ కావడం కూడా ఏ మాత్రం కష్టం కాదని.

నేను చెప్పినట్టు, స్విమ్మింగ్‌పూల్ తర్వాత ఇప్పుడు రెండు సినిమాల్లో హీరోయిన్‌గా కూడా చేస్తోంది బ్రాహ్మిణి. ఎంత బిజీ అయిపోయిందంటే .. ఇప్పుడు నాకు కాల్ చేయడానికి కూడా బ్రాహ్మిణికి టైమ్ దొరకట్లేదు! ;)

కట్ టూ స్విమ్మింగ్‌పూల్ - 

నేను ఆరోజు కాఫీడేలో ప్రామిస్ చేసినట్టుగానే బ్రాహ్మిణికి స్విమ్మింగ్‌పూల్ లో ఓ మాంచి ఎట్రాక్టివ్ అండ్ పవర్‌ఫుల్ రోల్ ఇచ్చాను. తను కూడా చాలా బాగా యాక్ట్ చేసింది.

ఎంత బాగా యాక్ట్ చేసిందంటే, మా మురుంకర్ సార్ కూడా "హర్ ఐస్ స్పీక్ ఎ లాట్!" అని బ్రాహ్మిణిని తెగ మెచ్చుకుంటారు. అన్నీ దాదాపు సింగిల్ టేక్సే!

కాకపోతే, మా టీమ్ మొత్తంలో అప్పుడు "లేట్ గాల్" గా బాగా పాపులర్ అయ్యింది కూడా తనొక్కతే! ;)

ఇప్పుడు బహుశా ఆ అలవాటుకు గుడ్ బై చెప్పేవుంటుంది బ్రాహ్మిణి. ఈ ఒక్క అలవాటు మర్చిపోతే, బ్రాహ్మిణి ఇంకా ఇంకా బిజీ అవుతుంది. అవ్వాలని ఆశిస్తున్నాను.  

Thursday 25 June 2015

స్విమ్మింగ్‌పూల్ .. తర్వాత!?

అయితే పాండిచ్చేరి, లేదంటే గోవా. ఈ రెండు లొకేషన్లలో ఏదో ఒక చోట నా తర్వాతి సినిమా షూటింగ్ ప్లాన్ చేస్తున్నాను.

ఇంతకూ కథేంటి?

థ్రిల్లర్ కావొచ్చు. హారర్ మాత్రం కాదు. ప్రేక్షకులకు ఒక విజువల్ ట్రీట్‌లా ఉండేలా లొకేషన్స్‌ను మనసులో ఆల్రెడీ ఫిక్స్ చేసేసుకున్నాను.

ఈసారి మూడు కెమెరాలుంటాయి.

ఒకటి రెండు చిన్న ఫిలిం రిలేటెడ్ కమిట్‌మెంట్‌లున్నాయి. అవి తొందరగా క్లియర్ చేసుకున్నాను అంటే - ఇంక నాకు సినిమా తీయడానికి అంత బడ్జెట్స్ కూడా అవసరం లేదు.

అంతా వన్ మాన్ ఫిలిం మేకింగ్! ఇప్పుడు ప్రపంచమంతా, ఇండిపెండెంట్ ఫిలిం మేకింగ్‌లో ఇదే చాలా వోగ్‌లో ఉంది.

కట్ టూ షూటింగ్ - 

స్విమ్మింగ్‌పూల్‌తో పోలిస్తే మరింత తక్కువ బడ్జెట్‌లో చేసే ఈ సినిమా షూటింగ్ కూడా సింగిల్ షెడ్యూల్ లోనే పూర్తవుతుంది. మరిన్ని తక్కువ డేస్‌లో షూటింగ్ పూర్తి చేయాలనుకుంటున్నాను.

తప్పదు. లేటెస్ట్ ఫిలిం మేకింగ్ టెక్నాలజీని, మనకున్న తక్కువ బడ్జెట్‌లోనే, మనం మరింత బాగా ఉపయోగించుకోగలగాలి. ఈ దిశలో మనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలి.

దానికోసమే ఇంత శ్రమ. ఇంత ఓపిక. ఇంత కూల్‌గా!    

Tuesday 23 June 2015

స్విమ్మింగ్‌పూల్ రిలీజ్ ఇంకా .. ఎప్పుడు?

బడ్జెట్, ఎన్నుకున్న సబ్జెక్ట్, క్రియేటివ్ ఫ్రీడమ్ .. ఒక భాగం. ప్రమోషన్, రిలీజ్ టైమింగ్, దొరికే థియేటర్‌ల స్థాయి .. మరో భాగం.

ఒక సినిమా జయాపజయాల్ని శాసించేవి, నిర్ణయించేవి ఇవేనని నా ఉద్దేశ్యం.

వీటిలో - మొదటి భాగంలో మేము పూర్తిగా సక్సెస్ సాధించాము. ఇప్పుడిక అదే ఊపుతో రెండో భాగం కూడా పూర్తిచేసే పనిలో ఉన్నాము.

కట్ టూ స్విమ్మింగ్‌పూల్ రిలీజ్ డేట్ -  

మా గెరిల్లా టీమ్ ఎంతో బాగా కష్టపడి రూపొందించిన స్విమ్మింగ్‌పూల్ సినిమాను 'ఏదో అలా' రిలీజ్ చేయడం నాకిష్టం లేదు. మా హీరోకి, ప్రొడ్యూసర్‌కి, మొత్తంగా .. మా టీమ్ అందరికీ కూడా ఇది ఏ మాత్రం ఇష్టం లేదు.

ఇప్పటి మా అంచనా ప్రకారం స్విమ్మింగ్‌పూల్ రిలీజ్ జూలై చివర్లో ఉండొచ్చు. ఎందుకింత లేటు అంటే .. కారణాలు చాలా ఉన్నాయి.

యు కె లో స్విమ్మింగ్‌పూల్ సెన్సార్ ఈవారంలో పూర్తవుతోంది.

యు ఎస్, యు కె, యూరప్‌ల్లో ఎబ్రాడ్ రిలీజ్‌తోపాటు - ఈలోగా, ఏకకాలంలో స్విమ్మింగ్‌పూల్‌ను తెలుగుతోపాటు తమిళంలో కూడా రిలీజ్ చేసే బిజినెస్ వ్యవహారాలు ఫుల్‌స్వింగ్‌లో ఉన్నాయి.

ఇవన్నీ ఇలా నడుస్తుండగానే, స్విమ్మింగ్‌పూల్ రిలీజ్‌కు ముందే నా కొత్త సినిమా కూడా ప్రారంభం కావాలి.
ఆ పనిలోకూడా చాలా చాలా బిజీగా ఉన్నాన్నేను.

Sunday 21 June 2015

ఒక జ్ఞాపకం!

కొన్ని నేరాలు క్షమించరానివి. అలాంటి నేరం నేను చేశాను.

మా నాన్న విషయంలో.

అలాంటి నేరం చెయ్యాల్సిన చక్రవ్యూహంలో చిక్కుకుపోయాను. నిస్సహాయంగా. అలాగని ఏ చట్టమో, ఇంకెవరో కాదు నన్ను క్షమించాల్సింది.

నన్ను నేనే క్షమించుకోవాలి. కానీ, ఇప్పటికీ, ఎప్పటికీ .. నన్ను నేను క్షమించుకోలేను. క్షమించమని ఆయనను అడగలేను.

ఆయనకు అందరికంటే ఇష్టమైన కొడుకును నేనే. వృధ్ధాప్యంలో ఆయనకు అవసరానికి ఏ లోటూ జరక్కుండా అన్నివిధాలా చూసుకున్నదీ నేనే.

కానీ, ఆయన చివరి రోజుల్లో మాత్రం ఆయనకు దగ్గరగా ఉండలేకపోయాను. ఇదే నేను చేసిన నేరం.

కారణం ఏదయినా కావొచ్చు. ఎంత బలమైందయినా కావచ్చు. జరిగిన వాస్తవం మాత్రం ఇదే.

ఆయన కొనుక్కున్న శంకర్‌నారాయణ్ ఇంగ్లిష్ డిక్షనరీని, గ్రామర్ పుస్తకాల్నీ, ఇంకెన్నో పుస్తకాల్నీ నా చిన్నతనంలో ఎన్ని వందలసార్లు తిరగేశానో నాకింకా గుర్తు. ఆయన నాకు, నేను ఆయనకు .. మేమిద్దరం రాసుకున్న వందలాది ఉత్తరాలు ఒక రికార్డు. ఒక అద్భుత అనుభూతి.

స్కూలుకెళ్ళి ఏం చదువుకోకపోయినా ఆయన అలవోకగా వందలాది ఉత్తరాలు రాశాడు. ఎలాంటి సంకోచం లేకుండా ఇంగ్లిష్, హిందీ, మరాఠీ మాట్లాడాడు. రాశాడు. అది ఆయన స్వయంకృషి.

ఆయన ఎందరికో సహాయం చేశాడు కానీ, ఎవ్వరి సహాయం తీసుకోలేదు.

ఆయన జ్ఞాపకాల్ని కూడా క్రమంగా మర్చిపోతానేమో .. ఈ పనికిరాని నగర జీవనశైలిలో ఇంకా ఇంకా మునిగిపోయి. మరింతగా కూరుకుపోయి.

అది జరక్కూడదు. ఆయన జ్ఞాపకాల్ని నేను మర్చిపోకూడదు.

ఆయన మా నాయిన.

నాయినా!

నాకిప్పుడు ఏ హిపోక్రసీలూ లేవు, ఎవరో ఏదో అనుకుంటారన్న ఇన్‌హిబిషన్స్ కూడా లేవు. నేను కోల్పోయిన స్వతంత్రాన్ని తిరిగి వెంటనే పొందేలా నన్ను ఆశీర్వదించు నాయినా...

Friday 19 June 2015

స్విమ్మింగ్‌పూల్ "ఐటమ్ కింగ్!"

లెజెండరీ సింగర్ ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర్నుంచి ఫోన్!

"ఇప్పుడే నువ్వు రాసిన పాటను నేను పాడాను. చాలా బాగా రాశావు. వేటూరి గారికి చాలా దగ్గరగా, దాదాపు ఆ స్థాయిలో ఉంది నీ శైలి. కష్టపడు నాయనా .. పైకొస్తావు!"

ఎస్ పి బాలు గారి నుంచి ఈ అభినందన అందుకున్న ఆ పాట రచయితకు ఇంకా పాతికేళ్లు నిండలేదు.

పేరు తిరుపతి.

శ్రీకాకుళం జిల్లాలోని ఓ కుగ్రామంలో పుట్టి పెరిగిన తిరుపతికి చిన్నప్పట్నుంచీ పాడటం బాగా అలవాటు. రామ మందిరంలో భజనలు బాగా వినేవాడు. బాగా పాటలు పాడేవాడు. అలా అలా రాయడం కూడా అలవాటయిపోయింది.

కట్ చేస్తే -

డిగ్రీ వరకూ ఎలాగో ఆపుకున్నాడు తిరుపతి. ఆ తర్వాత ఇంక ఆగలేదు. కుట్టకూడని బగ్ కుట్టేసింది. అదే సినిమా!

ఎలాగయినా సరే సినిమాల్లోకి వెళ్లాలనీ, లిరిక్ రైటర్ కావాలనీ నిర్ణయించుకున్నాడు తిరుపతి.

కట్ చేస్తే -

శ్రీకాకుళం నుంచి హైద్రాబాద్‌కు జంప్!

హైద్రాబాద్ వచ్చి కృష్ణానగర్, యూసుఫ్‌గూడాల్లో దిగగానే సినిమా ఛాన్స్ దొరకదు కదా .. సో, ఏదో ఒకటి ప్రారంభం అంటూ చేసి, అక్కడా ఇక్కడా తిరుగుతూ వుంటే, ఎక్కడో ఒకచోట ఏదో ఒకటి కనెక్ట్ అవుతుంది.

ఈ సినిమా సూత్రం ఈజీగానే కనుక్కున్నాడు తిరుపతి.

నెలకు 300 ఫీజుతో ఒక డాన్స్ స్కూల్లో చేరిపోయాడు తిరుపతి. అప్పుడు తిరుపతి చేరిన ఆ చిన్న డాన్స్ స్కూల్లో డాన్స్ మాస్టర్ మరెవరో కాదు. ఇప్పటి పాపులర్ కోరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్!

శేఖర్ మాస్టర్ ద్వారా వేణు-పాల్ అనే కోరియోగ్రాఫర్స్ ద్వయం పరిచయమయ్యారు తిరుపతికి.

"బాబూ, నువ్విలా మాతో ఉంటే లాభం లేదు. నిన్నొక చోట పెట్టిస్తాం. అక్కడ నీకు పరిచయాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఎవరో ఒకరు నీకు లిరిక్ రైటర్‌గా ఛాన్స్ ఇస్తారు" అన్నారు వేణు-పాల్.

కట్ చేస్తే -    
మన హీరో అఖిల్ కార్తీక్ దగ్గర పర్సనల్ అసిస్టెంట్‌గా చేరిపోయాడు తిరుపతి.

అఖిల్ కార్తీక్ దగ్గర సుమారు నాలుగేళ్లు అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సమయంలో - ఆ అప్‌కమింగ్ హీరో ఇచ్చిన ప్రోత్సాహం, అక్కడ పెంచుకున్న పరిచయాలు .. అన్నీ చివరకు మన తిరుపతి కలను నిజం చేశాయి.

ఒక లిరిక్ రైటర్‌గా మొదటిసారిగా "పాండవులు" సినిమాకు రాసే ఛాన్స్ కొట్టేశాడు తిరుపతి. రెండో సినిమా "యుగ్మలి". వందేమాతరం శ్రీనివాస్ దానికి మ్యూజిక్ డైరెక్టర్.

ఈ సినిమాలో తిరుపతి రాసిన పాట పాడిన తర్వాతనే, బాలు గారు తిరుపతి నంబర్ తీసుకొని, స్వయంగా తిరుపతికి ఫోన్ చేసి సుమారు 15 నిమిషాలపాటు మాట్లాడారు. అభినందించారు. ఆశీర్వదించారు.

ఇది తిరుపతి తన జీవితంలో మర్చిపోలేని ఒక తీపి జ్ఞాపకం.

కట్ చేస్తే -   
శివాజీ "చూసినోడికి చూసినంత", మా "స్విమ్మింగ్‌పూల్" వగైరా ఎన్నో సినిమాలకు లిరిక్ రైటర్‌గా పాటలు రాస్తూ బిజీ అయిపోయాడు తిరుపతి.

ప్రస్తుతం రామ్‌గోపాల్‌వర్మ సినిమాకు పాటలు రాస్తున్నాడు తిరుపతి. సింగిల్ టైటిల్ కార్డ్!

అసలు తిరుపతిని నాకు పరిచయం చేసింది అఖిల్ కార్తీక్. "బాగా రాస్తాడు సర్. ఒకసారి చూడండి!" అన్నాడు కార్తీక్.

రాయటం ఎలాఉన్నా, తిరుపతి తను రాసిన పాటను, తను అనుకున్న ట్యూన్‌లో బీట్ వేస్తూ పాడి మరీ వినిపిస్తాడు. అదీ అతని ప్రత్యేకత!

అలా తిరుపతి దగ్గర అప్పటికే ఉన్న కొన్ని ఐటమ్‌సాంగ్‌లను విన్న తర్వాత, "పంపుటపం" పాట విని ఆ క్షణం పడిపోయాన్నేను. అప్పట్నుంచీ, నేను తిరుపతిని "ఐటమ్ కింగ్" అనే పిలుస్తున్నాను. స్విమ్మింగ్‌పూల్ లో మిగిలిన రెండు పాటలు కూడా తననే రాయమని సింగిల్ టైటిల్ కార్డ్ ఇచ్చేశాను తిరుపతికి.

సినిమాలో లేని ఇంగ్లిష్ ప్రమోషనల్ సాంగ్ "డార్లింగ్ ఫీల్ మై లవ్" ఒక్కటి మాత్రం, అవసరం దృష్ట్యా, అప్పటికప్పుడు నేనే రాశాను. అది వేరే విషయం.

కట్ బ్యాక్ టూ ఒక జీవిత వాస్తవం -  

అప్పటికే రెండు సినిమాలకు పాటలు రాసిన తన కొడుకు గురించి శ్రీకాకుళంలో దినపత్రికల్లోని సినిమా పేజీల్లో, టీవీ చానెల్స్ ఫిలిం న్యూసుల్లో చూసి ఎంతో ఆనందపడిపోయిన తిరుపతి తండ్రి - తిరుపతి రెండో సినిమా యుగ్మలి ఆడియో రిలీజ్ వేడుకకు ఒక రోజు ముందు అకస్మాతుగా చనిపోయారు.

మొదటిసారిగా హైద్రాబాద్‌లో ఒక ఆడియో రిలీజ్ వేడుకలో పాల్గొనబోతున్న తిరుపతికి ఈ వార్త తెలియనీయకూడదని నిర్ణయం తీసుకొంది తిరుపతి కుటుంబం.

ఇంటికి పెద్దకొడుకయిన తిరుపతి లేకుండానే, శ్రీకాకుళంలో అతని తండ్రి అంతిమ సంస్కారాలు పూర్తిచేశారు.

ఆడియో కార్యక్రమం అయిపోయిన తర్వాతే - హైద్రాబాద్‌లో ఉన్న తిరుపతికి తన తండ్రి మరణవార్తను తెలియజేశారు.

తన సినిమా ఎంట్ర్రీని ఎంతగానో సంతోషించిన తన తండ్రిని కడసారిగా చూడలేకపోయిన బాధ తిరుపతిలో ఉన్నా - అప్పుడు తన కుటుంబం తీసుకున్న నిర్ణయమే తన తండ్రికి నిజమైన ఆత్మశాంతిగా భావిస్తాడు తిరుపతి.

అదే జీవితం. 

Wednesday 17 June 2015

'యువత' రుద్రాక్ష్ @ స్విమ్మింగ్‌పూల్!

"నేను చనిపోయిన తర్వాత కూడా బ్రతకాలంటే ఎలా?"

ఈ రొటీన్ చదువులు, ఉద్యోగాలు కాదు. ఇంకేదో చెయ్యాలి, ఇంకేదో కావాలి అన్న ఆలోచనలోంచి పుట్టిందా ప్రశ్న.

ఆలోచిస్తే కళ్లముందు మూడే మూడు ఫీల్డులు కనిపించాయి - క్రికెట్, సినిమా, రాజకీయాలు. ఈ మూడిట్లో మొదటిది, చివరిది మనకు కష్టం అనుకొని సినిమాను ఎన్నుకున్నాడో యువకుడు.

అతనే రుద్రాక్ష్.

పుట్టింది వరంగల్ జిల్లా, జనగాం దగ్గరలోని ఒక ఊళ్లో అయినా - పెరిగిందీ, డిగ్రీదాకా చదివిందీ మాత్రం మహారాష్ట్రలోని భీవండీలో.

కట్ చేస్తే -

భీవండీ-టూ-ముంబై చాలా దగ్గర. ఫస్ట్ స్టెప్ అంటూ ఒకటి వెయ్యాలి కాబట్టి - వెంటనే ముంబైలోని ఓ ఫోటోగ్రాఫర్ దగ్గర అసిస్టెంట్‌గా చేరిపోయాడు రుద్రాక్ష్.

అదీ ప్రారంభం.

సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందే సినిమా కష్టాలు మొదలయ్యాయి రుద్రాక్ష్‌కు. ఓ రోజు టికెట్ లేకుండానే ముంబై నుంచి ట్రెయిన్‌లో ఇంటికి బయలుదేరాల్సి వచ్చింది. రుద్రాక్ష్ జీవితంలో అదే ఒక పెద్ద ట్విస్ట్‌కి కారణమయింది.

ఆ రోజు టికెట్ లేని ప్రయాణం సందర్భంగా కలిసిన ఓ మిత్రుడు, హైద్రాబాద్‌లో ఉన్న అనిల్ అనే ఓ పబ్లిసిటీ డిజైనర్‌కు రుద్రాక్ష్‌ను కనెక్ట్ చేశాడు.

అంతే. చేతిలో అల్ఫా సూట్‌కేస్‌తో హైద్రాబాద్‌లో దిగిపోయాడు రుద్రాక్ష్.

కట్ చేస్తే -

ఫ్రెండ్ రూంలో షెల్టర్. పబ్లిసిటీ డిజైనర్ ఆఫీస్‌లో పరిచయాలు. రామానంద్ గారి దగ్గర నటనలో శిక్షణ ..

తనతోపాటు నటనలో శిక్షణ పొందుతున్న ఓ కుర్రాడి ఫోటో షూట్ కోసం బంజారాహిల్స్‌లో ఉన్న ఓ ఫోటోస్టూడియోకు వెళినప్పుడు, అక్కడ  రుద్రాక్ష్‌కు ఓ ఫోటోగ్రాఫర్ పరిచయమయ్యాడు. అప్పటి ఆ ఫోటోగ్రాఫర్ మరెవరోకాదు. ఇప్పటి హీరో కృష్ణుడు!

ఇద్దరూ మంచి మిత్రులయ్యారు. తనకు సంబంధించిన మంచిచెడులన్నింటినీ నిస్సంకోచంగా "గురూజీ" అంటూ కృష్ణుడి దగ్గర షేర్ చేసుకుంటాడు రుద్రాక్ష్. అదీ వారిద్దరి స్నేహం.

కట్ చేస్తే -

నెట్ వర్క్ .. పరిచయాలు .. వేట ..

అన్నీ ఒక్క ఛాన్స్ కోసం. ఒకే ఒక్క ఛాన్స్ కోసం.

చివరికెలాగో ఆర్టిస్ట్‌గా ఫస్ట్ ఛాన్స్ కొట్టేశాడు రుద్రాక్ష్. ఆ సినిమా పేరు "రిలాక్స్". తర్వాత హైద్రాబాద్ నవాబ్స్, ఎఫ్ ఎమ్, బొమ్మరిల్లు, పరుగు వంటి సినిమాల్లో యాక్ట్ చేశాడు. పరిచయాలు పెరిగాయి.

తను పరుగు చిత్రంలో యాక్ట్ చేస్తున్నపుడు, ఆ చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన బుజ్జి (పరశురామ్) తన డెబ్యూ సినిమా "యువత" లో రుద్రాక్ష్‌కు అద్భుతమైన రోల్ ఇచ్చాడు. తర్వాత మధుర శ్రీధర్ బ్యాక్ బెంచ్ స్టుడెంట్, ఆర్ జి వి రక్తచరిత్ర సినిమాల్లో కూడా మంచి రోల్స్‌లో నటించాడు రుద్రాక్ష్.

"నీలో ఓ 30 శాతం రఘువరన్ ఉన్నాడు" అని మధుర శ్రీధర్ మెచ్చుకోవడం; రక్తచరిత్రలోని ఒక సీన్లో తన నటనను చూసి, షాట్ అయిపోగానే ఆర్ జి వి తనని హగ్ చేసుకోవడం ఒక ఆర్టిస్టుగా రుద్రాక్ష్ మర్చిపోలేని అనుభూతులు.

"మళ్లీ మళ్లీ ఇది రాని రోజు" దర్శకుడు క్రాంతిమాధవ్ కూడా రుద్రాక్ష్‌కు మంచి మిత్రుడు. "నీ అసలు లక్ష్యం మర్చిపోతున్నావేమో చూడు!" అని ఒకసారి క్రాంతిమాధవ్ రిమైండ్ చేయడంతో మళ్లీ ఆలోచనలో పడిపోయాడు రుద్రాక్ష్.

కట్ చేస్తే - 

వెంకట్ గోపు డైరెక్షన్‌లో ఇప్పుడు హీరోగా తన తొలి చిత్రం "మనీప్లాంట్" లో నటిస్తున్నాడు రుద్రాక్ష్. ఒక షెడ్యూల్ పూర్తయింది కూడా.

హీరోగా తన షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం కావడానికి కేవలం కొద్దిరోజుల ముందు - ది సేమ్ రుద్రాక్ష్, "స్విమ్మింగ్‌పూల్"లో ఓ ప్రత్యేకమైన రోల్‌లో నటించడం విశేషం!  

Saturday 13 June 2015

అతి తక్కువ పెట్టుబడితో "మైక్రో బడ్జెట్ ఫిలిం మేకింగ్!"

ప్రస్తుతం ఇండస్ట్రీలో లోబడ్జెట్ సినిమాల బిజినెస్ వ్యవహారాలన్నీ చూస్తున్నప్పుడు నా మనసులో మెదులుతున్న ఆలోచన ఒక్కటే.

"కేవలం కొత్త/అప్‌కమింగ్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లతోనే .. ఎంత తక్కువలో .. ఎంత మంచి క్వాలిటీ సినిమా తీయవచ్చు?" అని.

"ఇది సాధ్యం" అని ఇంతకుముందే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సినిమాలు నిరూపించాయి. మన తెలుగు సినిమాలతో సహా!

కట్ టూ ది ట్రెండ్ సెట్టర్స్ - 

2007 లో వచ్చిన "పేరానార్మల్ యాక్టివిటీ" అనే సినిమా అంతర్జాతీయంగా ఒక కొత్త శకానికి నాంది పలికింది. ఆ తర్వాత ఈ విషయం మీద మరింత లోతుగా స్టడీ చేశాను. ఎన్నో సినిమాలు ఈ పంథాలో తీయటం జరిగింది. ఇది ఫిలిం నెగెటివ్ ని అసలు ఉపయోగించని పంథా. ఫిలిం టెక్నాలజీలో వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీని ఆవిష్కరించిన పంథా.

బ్లెయిర్విచ్ ప్రాజెక్ట్, ఫర్ లవర్స్ ఓన్లీ, న్యూలీ వెడ్స్ ... ఇలా ఎన్నయినా ఉదాహరణల్ని చెప్పగలను.

కేవలం $9,000 లోపు బడ్జెట్ లో కూడా తీసిన ఇలాంటి కొన్ని కమర్షియల్ సినిమాలు మిలియన్లు సంపాదించిపెట్టాయి.

ఇవేం ఆర్ట్ సినిమాలు కాదని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి?

రొటీన్ ఫిలిం నెగెటివ్ ని కాదని, ఈ ఫార్మాట్ లో సినిమా తీయడానికి మన దగ్గర దాదాపు ఓ దశాబ్దం పట్టింది! డిజిటల్ కెమెరాల్లో కూడా ఏ రెడ్ కెమెరానో, అలెక్సా ఎక్స్‌టీనో కాకుండా - కేవలం కెనాన్ 5 డి తోనే షూట్ చేసి సూపర్ డూపర్  హిట్ కొట్టిన సినిమాలు కూడా తెలుగులో ఉన్నాయి.

ఆమధ్య వచ్చిన  "ఈ రోజుల్లో", "ఒక రొమాంటిక్ క్రైం కథ" చిత్రాలు కూడా ఈ ఫార్మాట్ లో తీసినవే.

మనవాళ్లు మాత్రం "శాటిలైట్ రైట్స్ కొనరు .. క్వాలిటీ అసలు ఉండదు .. అందరూ చీప్‌గా అనుకుంటారు" అని నానా కథలు చెప్తారు. అది వారి విజ్ఞానం .. లేదా అజ్ఞానం.

ఆ విషయం అలా వదిలేద్దాం.

స్విమ్మింగ్‌పూల్ తర్వాత నేను తీయబోతున్న కొత్త సినిమా - ఇంకా లేటెస్ట్ కెమెరాలతో, మరింత తక్కువ బడ్జెట్‌లో,
మరింత మంచి క్వాలిటీతో, మరింత తక్కువ సమయంలో తీయబోతున్నాను.

ప్రస్తుతం ఆ ప్రయత్నంలోనే  బిజీగా ఉన్నాను.

ఈవైపు నిజంగా ఆసక్తి, సినీఫీల్డుపట్ల నిజంగా ప్యాషన్ ఉన్న లైక్‌మైండెడ్ ఇన్వెస్టర్‌లు/కొత్త నిర్మాతలు/సహనిర్మాతలు నన్ను నేరుగా ఈమెయిల్ ద్వారా మీ ఫోన్ నంబర్ ఇచ్చి కాంటాక్ట్ చేయొచ్చు. లేదా అలాంటి ఆసక్తి ఉన్న ఇన్వెస్టర్‌లను నాకు కనెక్ట్ చేయొచ్చు. నేనే మీకు కాల్ చేస్తాను.

(email: manutimemedia@gmail.com)

Wednesday 10 June 2015

స్విమ్మింగ్‌పూల్ రిలీజ్ ఎప్పుడు?

ఒక ప్యాషనేట్ టీమ్‌గా - ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరో నుంచి ఆఫీస్ బాయ్ వరకు - ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడి రూపొందించిన స్విమ్మింగ్‌పూల్ సినిమా రిలీజ్ కోసం అంతా ఎదురుచూస్తున్నారు. నో డౌట్.

వచ్చే ఒకటి రెండు వారాల్లో, ప్రతివారం, వరసపెట్టి ఒక అరడజన్ చొప్పున సినిమాలు రిలీజ్ అవబోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏ ఒక్క సినిమాకు కూడా తగినన్ని థియేటర్లు దొరకవు. మంచి థియేటర్లు దొరికే అవకాశం అసలు లేదు.

మరో విషయం ఏంటంటే - థియేటర్ల విషయంలో కొంత కాంప్రమైజ్ అయి రిలీజ్ చేద్దామనుకున్నా, ఇలా ఒకే వారం అయిదారు చిత్రాల మందలో రిలీజ్ చేయడం వల్ల, అసలు సినిమా వచ్చిందీ పోయిందీ తెలియకుండాపోయే ప్రమాదం చాలా ఉంది.

అంత హడావిడి, అంత రిస్క్ మాకు అవసరం లేదనిపించింది.

మరోవైపు .. యు ఎస్, యు కె, యూరోప్‌ల్లో కూడా వర్‌ల్డ్‌వైడ్ ఏకకాలంలో రిలీజ్ అయ్యేలా ఈ సినిమాను ప్లాన్ చేశాం. ఎబ్రాడ్‌లో ఒక డేట్‌కి రిలీజ్ కోసం అగ్రిమెంట్స్ అయిపోయాయంటే అంతే. ఇక్కడిలా మన ఇష్టం వచ్చినట్టు డేట్లు మార్చుకొనే అవకాశం అక్కడ ఏ మాత్రం ఉండదు.

సో, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని స్విమ్మింగ్‌పూల్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నాము.

ఇప్పటివరకూ సినిమాను ఎంత ప్లాన్‌డ్‌గా మేం అనుకున్నట్టు రూపొందించి సక్సెస్‌ఫుల్‌గా పూర్తిచేశామో .. అదే   విధంగా, స్విమ్మింగ్‌పూల్ రిలీజ్ కూడా మేం అనుకున్న పధ్ధతిలోనే, అనుకున్న రేంజ్‌లోనే జరుగుతుంది.

అదీ త్వరలోనే!

ఇప్పుడు ఒకసారి రిలీజ్ డేట్ నిర్ణయం అయిందీ అంటే ఇంక అది మారదు.

రిలీజ్ డేట్ విషయాన్ని నేను ముందుగా షేర్ చేసుకునేది ఫేస్‌బుక్ లోనే. ఫేస్‌బుక్ మిత్రులయిన మీతోనే. థాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ మై డియర్ ఫ్రెండ్స్! 

Wednesday 3 June 2015

స్విమ్మింగ్‌పూల్ ఆడియో లాంచ్ .. ఆహా!

సుత్తిలేకుండా సూటిగా కొన్ని పాయింట్స్:

> స్వీమింగ్‌పూల్ ఆడియో "లైవ్" చేయాలన్నది అసలు మా ప్లాన్‌లో ఎన్నడూ లేదు. కానీ, చేశాం. హీరో అఖిల్ కార్తీక్ కోసం, మ్యూజిక్ డైరెక్టర్ ప్రదీప్‌చంద్ర కోసం. టోటల్‌గా మా సినిమా కోసం.

 > ఎవరికోసం చేశామన్నది కాదు కొశ్చన్. ఎలా చేశామన్నదే ముఖ్యం! ఘనంగా/గ్రాండ్‌గా చేశామని వచ్చిన ఆహూతులంతా అన్నారు. టీవీలో లైవ్ చూసిన ఎందరో ఫోన్ చేసి/మెసేజ్‌లు పెట్టి/మెయిల్స్ రాసి కూడా ఇదే మాట అన్నారు.  

> శిల్ప చక్రవర్తి యాంకరింగ్ సింప్లీ వెరీ నైస్! వేరే ఎవ్వరయినా ఈ ప్రోగ్రాం ఇంత బాగా వచ్చేది కాదు.

> ఈమధ్యే, అదే ఆడిటోరియంలో జరిగిన ఒక పేరున్న హీరో ఆడియో లైవ్‌కు సగం కుర్చీలు కూడా నిండలేదు. బట్ .. స్విమ్మింగ్‌పూల్ ఆడియోకు మాత్రం ఫుల్ ప్యాక్!

> ఎల్ ఇ డి మీద ప్లే చేసిన ఫోటోలు, టీజర్లు అన్నీ అదరహో! అన్నీ అందరూ ఎంజాయ్ చేశారు.

> పెద్ద పెద్ద సినీ కుటుంబాల ఆడియోలు ఎన్నింటికో అటెండయిన నా బిజినెస్ మాగ్నెట్ మిత్రులొకరు " రెండు గంటలకు పైగా కుర్చీలో కూర్చొని నేను చూసిన మొట్టమొదటి ఆడియో ఫంక్షన్ ఇదే" అని నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టడం నాకు చాలా సంతోషం.

> షూటింగ్ కోసం నాకు లొకేషన్ ఇచ్చిన వెంకట్రావు గారికి, ఇప్పించిన నా మిత్రులకు, ప్రొడక్షన్/పోస్ట్ ప్రొడక్షన్ విషయంలో నాకు సహకరించిన  మిత్రులు రాజు గారికి, నాకు ఎంతో సహకరించిన నా ప్రియాతిప్రియమైన ఆర్టిస్టులు, టెక్నీషియన్ల టీమ్ మొత్తానికి, మా ప్రొడ్యూసర్ అరుణ్ గారికి, ఈ సినిమా అమెరికా షూటింగ్ విషయంలో నాకోసం ఎంతో శ్రమ తీసుకున్న నా ఆత్మీయ మిత్రుడు సదానందం భరతకూ, నాతో క్వాలిటీ టైమ్ మిస్ అవుతున్న నా కుటుంబానికీ, ప్రోగ్రాంకు వచ్చిన ఆహూతులకు, గెస్ట్‌లకు, ప్రెస్‌వారికందరికీ ఈ సందర్భంగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు.

> ఇదంతా నేను స్టేజ్ మీదే చెప్పాల్సింది. కానీ .. అప్పటికే, టాలీవుడ్ చానెల్ 'లైవ్ టైమ్' క్రాస్ అయిపోతున్నందువల్ల, తర్వాత అఖిల్ కార్తీక్, ముప్పలనేని శివగారు మాట్లాడాల్సింది ఉండడం వల్ల .. అసలు ఏం మాట్లాడుతున్నానో నాకే తెలియకుండా, నేను మాట్లాడ్డం చాలా షార్ట్ కట్ గా ముగించేశాను.

కట్ టూ ఫినిషింగ్ టచ్ - 

> ఎంత పెద్ద గెస్ట్‌లు వచ్చారన్నది కాదు పాయింట్. మనకోసం వచ్చిన గెస్ట్‌లే నిజమైన పెద్ద గెస్ట్‌లు అన్నది నేను గుర్తించాల్సిన అసలు పాయింట్ అన్నది నాకు బాగా అర్థమయింది. మా అఖిల్ కార్తీక్‌కు కూడా!