Wednesday 10 April 2024

2 ఆదాయం, 14 ఖర్చు


పంచాంగ శ్రవణాలు, రాశిఫలాలు, ఆదాయవ్యయాల పట్టికలు, రాజపూజ్యాలు... ఇవన్నీ నా చిన్నప్పటినుంచీ చూస్తున్నాను. 

అప్పట్లో వరంగల్లో, మా ఇంటికి కనీసం ఒక అరడజన్ వేర్వేరు పంచాంగాల కాంప్లిమెంటరీ కాపీలు ఉగాదికి ముందు రోజే వచ్చేవి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఈ రాశిఫలాలు, టేబుల్స్ చదివేవాన్ని. వాటిలో ఏ ఒక్క పంచాంగంలోని రాశిఫలాలు, ఇంకో పంచాంగంలోని రాశిఫలాలతో సమానంగానో దగ్గరగానో ఉండేవి కాదు. ఈ ఒక్క "ఇన్‌కమ్ & రెస్పెక్ట్" టేబుల్ తప్ప. 

అంత చిన్నతనంలోనే, ఈ పంచాంగాల్లోని దాదాపు ప్రతి పేజీ చదివి, బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం.       

నా పద్దెనిమిదో యేట వరంగల్ వదిలి, హైద్రాబాద్ వచ్చాక ఇవి నాకెప్పుడూ కంటపడలేదు... తాజాగా గత 4, 5 ఏళ్ళుగా సోషల్ మీడియాలో రకరకాల రూపాల్లో చూడ్డం తప్ప.   

కట్ చేస్తే - 

మొన్న మా అసిస్టెంట్ డైరెక్టర్ లహరి ఈ లేటెస్టు క్రోధి నామ సంవత్సరం టేబుల్ చూపించి, "ఇది మనం బీట్ చెయ్యాలి సార్" అంది. 

"ఆల్రెడీ చేశాను, ఇప్పుడు కూడా చేస్తాను" అని చెప్పాను. 

పంచాంగం ప్రకారం, గత సంవత్సరం నా ఆదాయం 14, వ్యయం 2. డబ్బు నిజంగానే చాలా వచ్చింది. కాని, ఒక్క పైసా మిగల్లేదు. టేబుల్ ప్రకారం చాలా చాలా మిగలాలి మరి! 

లేటెస్టుగా నేను చూసిన క్రోధి టేబుల్ ప్రకారం అయితే - నాకు ఈ సంవత్సరం ఆదాయం 2, ఖర్చు 14 అని ఉంది.

పోయిన సంవత్సరం టేబుల్‌కు పూర్తి రివర్స్ అన్నమాట! 

ఇదే నిజం అవుతుంది అనుకుంటే మాత్రం, ఇంత డిజాస్టరస్ ఇన్‌కమ్ ప్రెడిక్షన్ మైండ్‌లో పెట్టుకొని ఇంక నేనేం పనిచేస్తాను? చేసినా... నాకు వచ్చేది జస్ట్ 2, ఖర్చయ్యేది 14 అన్నప్పుడు, అసలు చెయ్యకుండా కూర్చోడం బెటర్ కదా?  

బట్, నో. 

నేను పనిచేస్తాను. నా టార్గెట్స్ రీచ్ అవుతాను. 

ఈ 2/14 ఈక్వేషన్ మాత్రం నా దరిదాపుల్లో ఎప్పుడూ లేదు, ఉండదు. 

విత్ దట్ సెడ్ - 

నేనేం నాస్తికున్ని కాదు. 

కాని, ఇలాంటి కొన్ని విషయాలు మాత్రం నాకు చిన్నప్పట్నుంచీ మంచి ఎంటర్‌టైన్మెంటునిస్తున్నాయి...  

No comments:

Post a Comment