Wednesday 29 September 2021

మార్కెటింగ్ డేస్!

నా సోషల్ మీడియా ఇప్పుడు పూర్తిగా సినిమామయం అయిపోయింది. ఇంకా ఇంకా అయిపోతుంది. 

అన్నీ పక్కనపెట్టి ఇప్పుడు పూర్తిగా ఈ క్రియేటివ్ బిజినెస్ మీద పడ్డాను.

ఖచ్చితమైన టైమ్‌బౌండ్ టార్గెట్స్ ఉన్నాయి కాబట్టి అసలు బయటి ప్రపంచాన్ని పట్టించుకోవడం లేదు.  

నా ఫేస్‌బుక్, ట్విట్టర్, బ్లాగ్, నా 'ఫిలింనగర్ డైరీస్' పాడ్‌కాస్ట్... అన్నీ ఇప్పుడు సినిమా... సినిమా. 

టోటల్ సినిమా.  

నా ఫ్రెండ్స్ లిస్ట్‌లో ఉన్న కవులు, రచయితలు, ఇతర మేధావి మిత్రులు, "ఏంట్రా బై ఇదంతా?!"  అని కొంచెం ఇబ్బంది పడే అవకాశం చాలావుంది. ఇదంతా ఎంజాయ్ చేయలేనివాళ్ళు, పడనివాళ్ళు కొంత కాలం నన్ను "అన్‌ఫాలో" చేసి కొంచెం దూరంగా ఉండటం బెటరేమో!😊

కొన్ని గంటల క్రితం నుంచీ నా ప్రొఫెషనల్ మార్కెటింగ్ యాక్టివిటీని అగ్రెసివ్‌గా ముందుకు తీసుకెళ్తున్నాను. మొట్టమొదటిసారిగా, ఒక మల్టి ప్యాషనేట్ క్రియేటివ్‌ప్రెన్యూర్‌గా... నా సర్విసెస్, నా రిక్వయిర్‌మెంట్స్...  ఒకదాని వెనుక ఇంకోటి అన్నీ పోస్ట్ చేశాను, చేస్తున్నాను.

కనీసం ఒక 8 అరగంటల పాటు సోషల్ మీడియా అంతా సంపూర్ణంగా వాడుకున్నాను. ఇది కంటిన్యూ అవుతుంది. 

కట్ చేస్తే - 

ఏదో ఒక సినిమా ప్రాజెక్టు అని కాకుండా, నా అన్ని క్రియేటివ్ వింగ్స్‌లోనూ చేతినిండా పనితో చాలా చాలా బిజీ అయిపోవాలన్నది సంకల్పం. ఆ బిజీ ఈ దసరా నుంచే పుంజుకోవాలనీ, ఊపిరి సలపనివ్వని వర్క్‌లోడ్‌తో పనిచేస్తూ, ఈ సంవత్సరం ఆఖరుకల్లా కొన్ని విషయాల్లో నేను పూర్తిగా 'ఫ్రీ అయిపోవాలని' కూడా గట్టిగా అనుకున్నాను. 

పని చేస్తూవుంటేనే అన్నీ మనకు అనుకూలంగా జరుగుతాయి. 'అనుకోకుండా జరుగుతాయని మనం అనుకొనే  మిరాకిల్స్' కూడా మనం పని చేస్తూవుంటేనే జరుగుతాయని నా నమ్మకం, నా అనుభవం. 

అదృష్టం ఎక్కడో ఆకాశం నుంచో, మన తారల నుంచో జారిపడదు. మనం ఎంత కష్టపడితే అంతగా మనల్ని ఇష్టపడుతుంది, మన వెంటపడి వస్తుంది. ఈ అదృష్టాన్ని నేను బాగా నమ్ముతాను. 

ఎందరో మిత్రులు, శ్రేయోభిలాషులు. అందరికీ నా వినమ్ర వందనం. 🙏

Believe in your heart that you're meant to live a life full of passion, purpose, magic and miracles.”
― Roy T. Bennett

Sunday 26 September 2021

ఈ వీకెండ్ రత్నాకర్ నుంచి నాకు కాల్ రాలేదు!

జీవితం నీటిబుడగ లాంటిది...

నా వెబ్ మ్యాగజైన్ గురించి టెక్నికల్‌గా నాకు అప్పుడప్పుడూ సహాయపడుతూ, మొన్న 15 వ తేదీవరకు నాతో టచ్‌లోనే ఉన్న రత్నాకర్ 21 వ తేదీ చనిపోయాడు. 

ఇప్పుడు రత్నాకర్ నుంచి మళ్ళీ నాకు కాల్ రాదు అంటే నమ్మలేకపోతున్నాను.

గుంటూరు నవోదయ విద్యాలయలో నా విద్యార్ఠి రత్నాకర్ నా కంటే చాలా చాలా చిన్నవాడు. హైద్రాబాద్‌లో జాబ్ చేస్తున్నాడు. 

గర్వం లేదు. నెగెటివ్ థింకింగ్ లేదు. మిత భాషి. దైవం పట్ల నమ్మకం, ఆధ్యాత్మిక ఆలోచనలు ఎక్కువ. టెన్షన్స్ పెట్టుకొనే పనులు చెయ్యడు. 

అతనికే కార్డియాక్ అరెస్ట్ అట! 

అంతే, మళ్ళీ కోలుకోలేదు.

అతను చేస్తున్న ఉద్యోగంలోనో, పర్సనల్‌గా జీవితంలోనో ఎంత స్ట్రెస్ లేకపోతే ఇలా అవుద్ది?

అసలెప్పుడిలా జరిగింది... ఎప్పుడు  హాస్పిటల్లో ఉన్నాడు... ఎప్పుడు శాశ్వతంగా పోయాడు... ఇదంతా నాకు తెలియదు. 

మొన్నొకరోజు ఉదయం మొబైల్ ఓపెన్ చెయ్యగానే ఫేస్‌బుక్ ఫీడ్‌లో ముందు కనిపించింది ఈ వార్త.  

ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. 

ఈ మధ్య నా వెబ్ మ్యాగజైన్ ప్రయోగాలప్పుడు మళ్ళీ కనెక్ట్ అయ్యాడు రత్నాకర్. అంతకు ముందు నాకు మా బేగంపేట్ ఆఫీస్ దగ్గర అప్పుడప్పుడు కనిపించేవాడు. 

దాదాపు ప్రతి వీకెండ్‌కి ఒక 2 నిమిషాలైనా కాల్ చేసి పలుకరిస్తాడు రత్నాకర్.

ఏదన్నా టెక్నికల్ డౌట్ ఉందా... ఇంకేదైనా అవసరముందా సర్ అని కనుక్కుంటాడు.

ఇంక ఎలాంటి చిన్న చిన్న డౌట్స్ కూడా కనుక్కునే పనిలేకుండా, 100% నేనే చేసుకొనే క్రియేటివ్ ప్లాట్‌ఫామ్ ఒకటి కొత్తగా కల్పించుకున్నాను అనీ, "ఆల్ ఓకే" అనీ... ఈ వీకెండ్ రత్నాకర్‌తో హాపీగా చెప్పాలనుకున్నాను.   

కాని, చూడండి... ఈ వీకెండ్ రత్నాకర్ నుంచి నాకు కాల్ రాలేదు. ఇక రాదు. 

Rest in peace Ratnakar! 

Saturday 25 September 2021

బ్రిటిష్ హృదయాలను గెల్చుకొన్న మన ‘డాక్టర్ రామ్!’

పుట్టింది ఎక్కడో కరీంనగర్‌లోని ఒక మారుమూల గ్రామం – సంకెనపల్లిలో.

నాలుగో తరగతి వరకు అతను చదువుకున్న ప్రభుత్వ స్కూలు – ఒక చిన్న గుడిశె.

డాక్టర్ కావాలనుకొన్నాడు, అయ్యాడు.

హార్ట్ సర్జన్‌గా చిన్న పిల్లలకు సేవ చేయాలనుకున్నాడు. చేశాడు, చేస్తున్నాడు.

హార్ట్ క్యాంపుల ద్వారా దేశ విదేశాల్లో వందలాది చిన్నపిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషన్ చేసి బ్రతికించాడు.

బ్రిటిష్ హార్ట్స్ ఫౌండేషన్ ప్రతిష్టాత్మక “హార్ట్ హీరో” అవార్డు అందుకున్నాడు.

ఎక్కడి సంకెనపల్లి… ఎక్కడి లివర్‌పూల్?

“మనిషి తల్చుకొంటే ఏదైనా సాధించవచ్చు” అని మరోసారి నిరూపించిన ఈ కార్డియోథొరాయిక్ సర్జన్ పేరు – డాక్టర్ రమణ ధన్నపునేని. ప్రొఫెషనల్ సర్కిల్‌లో అందరూ అతన్ని “రామ్” అని పిలుస్తారు.


కట్ చేస్తే –

డాక్టర్ రమణ పుట్టిన ఊరు – కరీంనగర్ జిల్లా, వెలగటూరు మండలంలోని సంకెనపల్లి అనే చిన్న గ్రామం. నాలుగో తరగతి వరకు అదే ఊళ్ళోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడు. పాఠశాల అంటే అదేదో ఇటుక, సిమెంటులతో కట్టిన బిల్డింగేమీ కాదు. ఒకే ఒక్క చిన్న గుడిశె!

రమణ తల్లిదండ్రులు వెంకట్రావు, అరుణ.

పాలిటెక్నిక్ వరకు చదివిన రమణ తండ్రి – జగిత్యాలలో చిన్న మెడికల్ షాప్ ప్రారంభించడంతో, రమణ చదువు 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు జగిత్యాలలో జరిగింది.

అప్పుడు జగిత్యాలలో “నాయుడు” అని ఒకే ఒక్క “పెద్ద డాక్టర్” ఉండేవాడు. అతన్ని చూసి, అలా డాక్టర్ అవ్వాలని అనుకొనేవాడు రమణ.

అప్పుడున్న ట్రెండ్ ప్రకారం – 10వ తరగతి తర్వాత, ఇంటర్మీడియట్ బైపీసీ గుంటూరులో చదివాడు రమణ. ఎమ్‌సెట్ రెండో ప్రయత్నంలో, కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో మెడిసిన్‌లో సీటు సాధించాడు.

సాధారణంగా రమణ నేపథ్యాన్ని బట్టి – ఇక్కడివరకే ఓ పెద్ద అచీవ్‌మెంట్ అనుకోవచ్చు. కాని, రమణ విషయంలో నిజమైన లక్ష్యాలు, లక్ష్యసాధనలూ ఇక్కడినుంచే ప్రారంభమయ్యాయి.

మెడిసిన్ చదివుతున్నప్పుడు – అతను చదివే ఎన్నో సబ్జక్టు పుస్తకాలు, మెడికల్ జర్నల్స్‌లో ఆయా కంటెంట్ రైటర్స్ అయిన డాక్టర్స్, ప్రొఫెసర్స్, సైంటిస్ట్స్‌ను కూడా బాగా అధ్యయనం చేసేవాడు రమణ. వారిలో అత్యధికశాతం మంది బ్రిటిష్ డాక్టర్లు. వారందరి ప్రభావం రమణ మీద అధికంగా పడింది.

“అలాంటి గొప్ప ప్లేస్‌కు కదా నేను వెళ్ళాల్సింది… వాళ్లంతా చదువుకున్న ఆ మెడికల్ కాలేజీల్లో కదా నేను చదవాల్సింది” అని అనుకొనేవాడు.

అదే అతని ప్రాథమిక లక్ష్యమయ్యింది.


కట్ చేస్తే –

ఎంబీబీయస్ అయిపోగానే – మద్రాస్ మెడికల్ కాలేజీలో ఒక సంవత్సరంపాటు ఉద్యోగం చేశాడు. ఉద్యోగం చేస్తూనే – ఒకవైపు ఇంగ్లిష్ గ్రామర్ క్లాసులకు వెళ్లేవాడు, మరోవైపు ఇంగ్లండ్ వెళ్ళి పీజీ చదువుకునే ప్రయత్నాలు చేసుకుంటూ ఉండేవాడు.

పీజీలో తను కార్డియాక్ సర్జనే కావాలనుకున్నాడు. అది కూడా, హృద్రోగంతో బాధపడే చిన్నపిల్లలకు శస్త్ర చికిత్స చేసి, వారిని బ్రతికించగలిగే కార్డియాక్ సర్జనే కావాలనుకున్నాడు.

ఒకవేళ – ఈ స్పెషలైజేషన్‌లో సీటు రానట్టయితే మాత్రం – “ప్లాస్టిక్ రీకన్‌స్ట్రక్టివ్ సర్జరీ” చేయాలనుకున్నాడు.

కాని, డాక్టర్ రమణ సంకల్పం గొప్పది. కార్డియాక్ సర్జనే అయ్యాడు. ప్రస్తుతం లివర్‌పూల్‌లోని ఆల్డర్ హే చిల్డ్రెన్స్ హాస్పిటల్‌లో కన్‌సల్టెంట్‌గా పనిచేస్తున్నాడు.

ఇక్కడొక విషయం తప్పక చెప్పుకోవాలి…

మనవాళ్లలో ఒక విచిత్రమైన మైండ్‌సెట్ ఉంటుంది… మాతృభాష అయిన తెలుగు మీడియంలో చదివినవాళ్లు అంతర్జాతీయస్థాయి పోటీలో నిలబడలేరనీ, తట్టుకోలేరనీ, రాణించలేరనీ!

ఈ మైండ్‌సెట్ ఉట్టి ట్రాష్ అని డాక్టర్ రమణ లాంటివాళ్ళు పదే పదే ప్రూవ్ చేశారు.

ఇటీవలి జనరేషన్ వరకూ – దేశంలోని అత్యధికశాతం మంది ఐఏయస్‌లు, ఐపియస్‌లు, డాక్టర్లూ, ఇంజినేర్లూ… విదేశాల్లో కూడా అత్యున్నతస్థాయి ప్రొఫెషన్స్‌లో పనిచేస్తున్న ఎందరో కూడా, వారి కాలేజీ స్థాయివరకు, ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియంలో చదువుకున్నవారే!

కట్ బ్యాక్ టూ మన డాక్టర్ రామ్ –

ప్రారంభంలో రమణ ఆలోచనలు వేరే. బ్రిటన్‌లో చదువుకుని, తిరిగి ఇండియా వచ్చి, ఇక్కడే డాక్టర్‌గా సేవలందించాలని.

కాని – అక్కడున్నప్పుడే పెళ్లి కావడం, పిల్లలు, వారి చదువు కొనసాగడం… ఇవన్నీ ఒకదానివెంట ఒకటి అలా అలా అతన్ని అక్కడే స్థిరపడేలా చేశాయి.

అయితే – మధ్యలో ఒకసారి ఇండియా వచ్చాడు. యూకే నించి తిరిగి ఇండియా వచ్చి, ఇక్కడే స్థిరపడి, ఇక్కడే డాక్టర్‌గా సేవలందించాలనుకున్నాడు.

కొంత అధ్యయనం చేశాడు. కొన్ని హాస్పిటల్స్‌లో ఇంటర్వ్యూలకెళ్ళాడు.

కాని, డాక్టర్ రమణకు ఇక్కడి హాస్పిటల్స్‌లోని కార్పొరేట్ సిస్టమ్ నచ్చలేదు. హాస్పిటల్స్ ప్రయారిటీస్‌లో ఆరోగ్యం కంటే ముందు బిజినెస్ ఉండటం అనేది అసలు నచ్చలేదు.


యూకేలో 98% హెల్త్ సర్విస్ ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. ఏ స్థాయిలోనైనా ఇక్కడిలాంటి కరప్టివ్ సిస్టమ్ అక్కడి హాస్పిటల్స్‌లో ఉండదు.

“ఇక్కడ చేయలేను” అనుకున్నాడు. ఇక, ఆ ఆలోచన మానుకున్నాడు.

ఆల్డర్ హే హాస్పిటల్‌లో కార్డియాక్ సర్జన్‌గా ఎన్నో వందల సర్జరీలు చేసి ఎంతో మంది పిల్లల ప్రాణాలు కాపాడాడు డాక్టర్ రమణ.

బ్రతికిన ఆ పిల్లలకూ, వారి తల్లిదండ్రులకూ ఒక హీరో అయ్యాడు. వారందరి నుంచీ ప్రతి యేటా, పండుగలప్పుడూ, ప్రత్యేక సందర్భాల్లోనూ ఉత్తరాలూ, గ్రీటింగ్సూ అందుకుంటుంటాడు డాక్టర్ రమణ.

తన ప్రొఫెషనల్ సర్కిల్‌లో, హాస్పిటల్లో బ్రిటిషర్స్ చాలామందికి “రమణ” పేరును కరెక్టుగా ఉచ్ఛరించడం కష్టమై – సింపుల్‌గా అందరూ “రామ్” అని పిలవడం అక్కడ అలవాటైపోయింది.

తమ బిడ్డ ప్రాణాలు కాపాడినందుకు కృతజ్ఞతగా, కొంతమంది పేరెంట్స్ “రామ్” పేరునే తమ పిల్లలకు పెట్టుకున్నారంటే – డాక్టర్ రమణలోని సేవాదృక్పథం, తన వృత్తిపట్ల ఒక పవిత్రమైన సంకల్పం ఏ స్థాయివో మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

ఆల్డర్ హే హాస్పిటల్లోనే కాకుండా – దేశవిదేశాల్లోని అనేక హెల్త్ క్యాంపులు కూడా అటెండవుతూ కూడా, వందలాది చిన్నపిల్లలకు ఉచితంగా హార్ట్ సర్జరీలు చేస్తూ వారి ప్రాణాల్లు కాపాడుతున్న రికార్డు డాక్టర్ రమణకుంది.


“హీలింగ్ లిటిల్ హార్ట్స్” అనే చారిటీ సంస్థలో ట్రస్టీ పదవితోపాటు, ప్రధాన కార్డియాక్ సర్జన్‌గా కూడా ఉన్నాడు డాక్టర్ రమణ.

ఇప్పటివరకు ఇండియా, టాంజానియా, పాలస్తీనా వంటి దేశాల్లో హార్ట్ క్యాంపులకు వెళ్లాడు రమణ. ఇండియాలో – శ్రీనగర్, పాండిచ్చేరి, సూరత్, దుర్గాపూర్, పూనే, ముంబై, విజయవాడ, కరీంనగర్‌లలో క్యాంపులు నిర్వహించాడు. నమీబియా, జోర్డాన్, నికరాగ్వా దేశాలకు కూడా వెళ్ళాల్సింది. ఇటీవలి కోవిడ్ లాక్‌డౌన్ ప్రభావం వల్ల ఆ హార్ట్ క్యాంప్ పర్యటనలు వాయిదా పడ్డాయి.

మొత్తంగా ఇప్పటివరకు సుమారు 250 ఉచిత హార్ట్ ఆపరేషన్స్ చేసి, పిల్లల ప్రాణాలు కాపాడాడు డాక్టర్ రమణ.

ప్రఖ్యాత బీబీసి చానల్ రూపొందించిన హెల్త్‌కేర్ వెబ్ సీరీస్ “హాస్పిటల్”లో డాక్టర్ రమణకు కూడా సముచితమైన స్థానమివ్వడం మరొక గొప్ప విషయం.

డాక్టర్ రమణలోని ఈ సేవా దృక్పథాన్ని, ఈ దిశలో అతని రికార్డుని గుర్తించి, 2019 లో బ్రిటిష్ హార్ట్స్ ఫౌండేషన్ వారు జాతీయస్థాయిలో ప్రతిష్టాత్మక హార్ట్ హీరో అవార్డుల్లో – “హెల్త్‌కేర్ హీరో” అవార్డును ఇచ్చి సత్కరించారు.

దేశం కాని దేశంలో – ఒకప్పుడు వర్ణ వివక్ష రాజ్యం ఏలిన రాజ్యంలో – మన డాక్టర్, అక్కడి నేటివ్ బ్రిటిషర్స్‌కు ఒక ఆరాధ్య హీరో కావడం, దాన్ని ఆ దేశపు జాతీయస్థాయి సంస్థ బ్రిటిష్ హార్ట్స్ ఫౌండేషన్ గుర్తించడం… నిజంగా ఎంత గొప్ప విషయం! ఎంత గర్వించదగ్గ విషయం!!


ఇక డాక్టర్ రమణ వ్యక్తిగత జీవితానికొస్తే –

డాక్టర్ రమణ 1997 లో వివాహం చేసుకొన్నాడు. భార్య పేరు శిరీష. తను కూడా డాక్టరే. తను మెడిసిన్ చదివింది కూడా కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలోనే.

అలాగని, వారిద్దరిదీ ప్రేమ వివాహం కాదు. పెద్దలు కుదిర్చిన వివాహం కూడా కాదు.

“నీకు ఆ అమ్మాయి అయితే బావుంటుంది” అని ఫ్రెండ్స్ కుదిర్చిన “ఫ్రెండ్స్ అరేంజ్‌డ్ మ్యారేజ్!”

డాక్టర్ రమణ-డాక్టర్ శిరీషలకు హృదిత, మన్హిత అని ఇద్దరమ్మాయిలు.

పిల్లలిద్దరి పేర్లలో కూడా “హార్ట్” ఉన్న విషయం మనం గుర్తించవచ్చు!

డాక్టర్ రమణకు క్రికెట్, కబడ్డీ అంటే ఇష్టం. ముఖ్యమైన టోర్నమెంట్స్ టీవీలో చూస్తాడు. ఇండియన్ టీమ్ గాని ఇంగ్లండ్‌లో ఆడుతున్నట్తైతే మాత్రం – టికెట్ తీసుకొని స్టేడియం వెళ్ళి చూస్తాడు.

చిన్నప్పుడు రమణకు ఆర్ట్, పోయెట్రీ వంటివి చాలా ఇష్టంగా ఉండేవి. ఇప్పుడు తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో మ్యూజిక్ ఇష్టపడతాడు. ప్రతిరోజూ తెలుగు దినపత్రికలు ఆన్‌లైన్‌లో చదువుతాడు. తన ప్రొఫెషనల్ కొలీగ్స్‌తో, పేషెంట్స్ పేరెంట్స్‌తో, సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటాడు డాక్టర్ రమణ.


లండన్ లోని “ఆల్ ఆంధ్ర గ్రాడ్యుయేట్స్ మీట్” అనే సాంస్కృతిక సంస్థ ద్వారా జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో ముందుండి పాలుపంచుకొంటాడు. 2015 లో ఈ సంస్థ నిర్వహించిన ఒక కార్యక్రమానికి తనికెళ్ల భరణిని ఆహ్వానించాడు రమణ.

ఇంకా, తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ కార్యక్రమాల్లో కూడా యాక్టివ్‌గా పాల్గొంటూవుంటాడు డాక్టర్ రమణ.

సుమారు గత 28 ఏళ్ళుగా యూకేలో ఉంటున్న డాక్టర్ రమణ… ఇండియా నుంచి యూకే వచ్చి చదువుకోవాలనీ, కెరీర్‌లో ఎదగాలనీ అనుకొనే యువతరానికి ఆన్‌లైన్‌లో నిరంతరం అవసరమైన సలహాలనిస్తూ ప్రోత్సహిస్తుంటాడు.

“నాకు ఇది లేదూ… అది లేదూ అనుకోవడం అంతా ఉట్టిది. సాధించాలనుకుంటే ఇవన్నీ ఏవీ ఎవరికీ అడ్డం కావు” అంటాడు డాక్టర్ రమణ.


ఆయన మాటల్లోనే చెప్పాలంటే –

“Have an ambition or goal, never loose focus on your goal. With determination, courage and hard work you will achieve your dreams. Failures are common but never loose hope, learn from them and use them as stepping stones for success.”

దటీజ్ డాక్టర్ రామ్ – ఉరఫ్ – డాక్టర్ రమణ ధన్నపునేని!

Friday 24 September 2021

Guy on the Sidewalk

"ఒక ట్వీట్ పెట్టినా సరే ఏదైనా ప్రయోజనం ఉండాలి సర్!"

చాలా రోజుల క్రితం నేనూ, మా భరత్ కారులో ప్యారడైజ్ మీదుగా నెక్లెస్ రోడ్ వెళ్తుండగా తను ఈ మాట అనటం నాకింకా గుర్తుంది.

ప్రాక్టికల్ పాయింటాఫ్ వ్యూలో అది ఎంతవరకు సాధ్యం అన్నది పక్కనపెడితే, భరత్ చెప్పినదాంట్లో నేను చాలా అర్థాలు తీసుకున్నాను. అతనన్న ఈ మాట నాకు తరచూ గుర్తుకొస్తూంటుంది. 

ఒక ఫేస్‌బుక్ పోస్టు పెట్టినా, ఒక ట్వీట్ పెట్టినా, ఒక బ్లాగ్ పోస్టు రాసినా... ప్రత్యక్షంగానో, పరోక్షంగానో దానికో పరమార్థం ఖచ్చితంగా ఉండాలి. అది ఉట్టి ఐదు నిమిషాలు కావచ్చు, అరగంట కావచ్చు. మన జీవితంలో కొంత సమయాన్ని అక్కడ వెచ్చిస్తున్నాం. ఆ సమయానికి చాలా విలువుంది. 

మనం రాసేది ఒక వాక్యం కావచ్చు, ఒక పేరాగ్రాఫ్ కావచ్చు, ఒక పేజీ కంటెంట్ కావచ్చు. మన రైటింగ్‌కు కూడా ఒక విలువ ఉంటుందన్నది మనం గుర్తుంచుకోవాలి.   

ఇవన్నీ నిజంగా పాటించలేనప్పుడు అసలు సోషల్‌మీడియా వైపు వెళ్లకపోవడమే మంచిది. హాయిగా ఒక పుస్తకం ఏదైనా చదువుకోవచ్చు. ఇంకేదైనా ఇంటి పని చేసుకోవచ్చు. చాలాకాలంగా పలకరించని ఒక ఫ్రెండ్ ఎవరికైనా కాల్ చెయ్యొచ్చు. వీటన్నిటికంటే ముందు ఇంట్లో పిల్లలతో, జీవిత భాగస్వామితో మంచి క్వాలిటీ టైమ్ గడపొచ్చు.

ఇవన్నీ నువ్వు పాటిస్తున్నావా అంటే "యస్" అనే చెప్తాను.

ఫేస్‌బుక్, ట్విట్టర్లో ఓ రెండు ఫొటోలు, రెండు కొటేషన్స్, ఏదో ఒక సినిమా స్టఫ్ పోస్ట్ చేయటం ద్వారా నేను పొందుతున్న మొట్టమొదటి ప్రయోజనం... దైనందిక స్ట్రెస్ నుంచి కొంత రిలీఫ్. రెండో ప్రయోజనం ప్రొఫెషనల్‌గా నాకు అవసరమైన కొంత బజ్, సెల్ఫ్ మార్కెటింగ్.  ఈ రెండు ప్రయోజనాల కోసం రోజుకో 30-40 నిమిషాలు పెద్ద నష్టం కాదనుకుంటాను.   

ఈ బ్లాగింగ్ కూడా అంతే... ఒక స్వీయ విశ్లేషణ. ఒక థెరపీ. ఒక మెడిటేషన్. ఒక పాజిటివ్ ఎడిక్షన్.    

కొన్ని సంకెళ్లు తెంచుకోవాలంటే కొన్ని చేయక తప్పదు. అలా చేయాల్సింది రైటింగ్, సినిమాలు, ఇతర క్రియేటివ్ పనులే అయినప్పుడు ఆ మజానే వేరు. 

So much to do. So little time. 

కట్ చేస్తే -

ఈ పోస్టు ప్రారంభంలో నేను ప్రస్తావించిన భరత్ ఎవరోకాదు. నేను గుంటూరు నవోదయ విద్యాలయలో పనిచేసినప్పుడు నా విద్యార్థి భరత్‌కృష్ణ. ఇండియాలో, అమెరికాలో నానా జాబ్స్ చేసి "ఓస్ ఇంతేనా" అని ఇండియాకు తిరిగొచ్చాడు. ఇప్పుడేదో స్టార్టప్ సన్నాహాల్లో ఉన్నాడు. 

అతని తొలి బెస్ట్‌సెల్లర్ ఇంగ్లిష్ నవల టైటిల్ నాకు చాలా ఇష్టం... 

Thursday 23 September 2021

మనోహర్ చిమ్మని కంటెంట్ రైటింగ్స్

"We make money to make more movies." - Walt Disney


ఒక ధోరణికి, ఒక శైలికి, ఒక రూపానికి, ఒక సాహిత్య విభాగానికి పరిమితం చేసుకోకుండా – వృత్తిపరంగా ఏది అవసరమైతే అది రాయగలిగే రచయితలను “ఫ్రీలాన్స్ రైటర్” అనవచ్చు.

మొట్టమొదటగా “ఫ్రీలాన్స్ రైటర్” అన్న పదాన్ని నేను కుష్వంత్ సింగ్ బైలైన్ దగ్గర చూశాను. తర్వాత శోభా డే రాసుకోగా చూశాను.

వీళ్ళిద్దరూ కూడా యమ అగ్రెసివ్ రైటర్స్ కావటం విశేషం. నాకు తెలిసి వీళ్ళు రాయని ప్రక్రియ లేదు.

ఫిక్షన్ రాశారు, పోయెట్రీ రాశారు. సాహితీ విమర్శ రాశారు. సినిమా కథలు, స్క్రిప్టులు రాశారు. సినిమా సమీక్షలు రాశారు. న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్‌కు ఆర్టికిల్స్, ఇంటర్వ్యూలు వగైరా పుంఖానుపుంఖాలుగా రాశారు.

ఈ ఇద్దరి రచనల మీద ఆక్స్‌ఫర్డ్ సహా, ఎన్నో విదేశీ యూనివర్సిటీల్లో పరిశోధనలు జరిగాయి. అది వేరే విషయం.

వీరి రచనలకు మంచి రీడబిలిటీ ఉంటుంది. వీరి భావాలను, రచనలను తిట్టేవాళ్ళు ఎక్కువే, చదివే పాఠకులూ ఎక్కువే.

ఎక్కువమంది తిడుతున్నారూ అంటే – గన్‌షాట్‌గా ఎక్కువమంది వారి రచనలు చదువుతున్నారని అర్థం చేసుకోవచ్చు!

లేదంటే – వారికి అంతంత పారితోషికాలిచ్చి రాయించుకోరెవ్వరూ!

అసలు ఇంత కంటెంట్ ప్రతిరోజూ ఎలా రాస్తారు? డెడ్‌లైన్స్‌కు ఎలా అందిస్తారు? .. అనుకొనేవాన్ని అప్పట్లో. మరికొంతమంది ప్రొఫెషనల్ రైటర్స్‌ను చూశాక నా డౌట్ క్లియర్ అయింది. ఇప్పుడు అసలు ఈ విషయంలో నాకు ఎలాంటి డౌట్ లేదు.

ఇలాంటి ఫ్రీలాన్స్ రైటర్స్‌కు ఆదాయం బాగుంటుంది.

ఇతర రైటర్స్‌కు అంతగా ఉండదు. లేదా – వారికి వారి రచనల ద్వారా అసలు ఆదాయమే ఉండదు.

ఫ్రీలాన్స్ రైటింగ్‌తోపాటు ఇప్పుడు లేటెస్టుగా “కంటెంట్ రైటింగ్” పాపులర్ అయింది. వెబ్‌సైట్స్‌కు, వెబ్‌సీరీస్‌లకు, సీరియల్స్‌కు, సినిమాలకు, ఇతర టీవీ-వెబ్ ప్రోగాములకు ఎప్పటికప్పుడు రాసిచ్చేదే – ఈ కంటెంట్ రైటింగ్.

అభివృద్ధిచెందిన దేశాల్లో కంటెంట్ రైటర్స్‌కు మంచి ఆదాయం. ఇప్పుడు ఇక్కడ కూడా నెమ్మదిగా పాపులర్ అవుతోంది.

థాంక్స్ టు ఇంటర్‌నెట్… ఇప్పుడు ఫ్రీలాన్స్ రైటింగ్, కంటెంట్ రైటింగ్ కొంత ఈజీ అయింది. డెడ్‌లైన్‌కు ఒక గంట ముందు చెప్పినా సరే, రాసి మెయిల్ చెయ్యొచ్చు, వాట్సాప్ చెయ్యొచ్చు.

కట్ చేస్తే –

ఒక రచయిత తన రచనలకు తన పేరు కాకుండా – ఇంకొకరి పేరు పెట్టుకొనే పద్ధతిలో ఒక నాన్-డిస్‌క్లోజర్ అగ్రిమెంట్‌తో రాసే పద్ధతే “ఘోస్ట్ రైటింగ్”.

ఇది ఎప్పటినుంచో ఉంది. దీనికున్న పరిమితులవల్ల ఏ ఘోస్టు ఎవరికి రాశారు అన్నది తెలియదు. స్పెక్యులేషన్ మాత్రం చాలా ఉంటుంది.

ఘోస్ట్ రైటింగ్ అనేది ఒక్క ఫిలిం ఇండస్ట్రీలోనే ఉంది అని చాలామంది అనుకుంటారు. కాని, అంతటా ఉంది. అనాది నుంచే ఉంది.

అమెరికా వంటి దేశాల్లో ఘోస్ట్ రైటింగ్ సర్విసెస్ బాహాటంగా ఉంటాయి. అదొక భారీ ప్రొఫెషన్ అక్కడ. “I’m a Ghost Writer” అని బాహాటంగా చెప్పుకుంటారక్కడ. ఇక్కడంతా తెరవెనుకే.

నిజాని ఆ అవసరం లేదు. ఇదీ ఒక ప్రొఫెషనే. రెమ్యూనరేషన్ తీసుకొని రాసివ్వడమే.

తేడా ఒక్కటే –

మన పేరుతో రాసిచ్చే క్రియేటివ్ కంటెంట్‌కు ఒక రెమ్యూనరేషన్ ఉంటుంది. “మీరు ఎవరి పేరయినాపెట్టుకోవచ్చు” అని రాసిచ్చే కంటెంట్‌కు మామూలుగా డబుల్ రెమ్యూనరేషన్ ఉంటుంది.

ఇది రెండువైపులా అంగీకారంతో జరిగే ఒక అతి మామూలు ప్రక్రియ.

విన్ – విన్!

మనోహర్ చిమ్మని  కంటెంట్ రైటింగ్స్ -
నేనూ, నా పర్యవేక్షణలో నా క్రియేటివ్ టీమ్ – ఫ్రీలాన్స్ రైటింగ్, ఘోస్ట్ రైటింగ్ కూడా ప్రారంభించాము. 

తెలుగులో - 
సినిమా స్క్రిప్టులు, వెబ్ సీరీస్ స్క్రిప్టులు, సీరియల్స్, ఫిక్షన్, నాన్-ఫిక్షన్, బయోగ్రఫీలు, ఆటో బయోగ్రఫీలూ, ఆర్టికిల్స్, స్పీచ్‌లు, వెబ్ కంటెంట్, బులెటిన్స్, ఇన్-హౌజ్ న్యూస్ లెటర్స్… ఏదైనా – ఎలాంటి కంటెంట్ అయినా – మానవ సాధ్యమయిన ఎలాంటి డెడ్‌లైన్‌కయినా అందించగలం.

కంటెంట్, రెమ్యూనరేషన్ స్టాండర్డ్ విషయంలో ఎలాంటి రాజీ ఉండదు. 

పైన చెప్పినవాటిల్లో – మీ కంటెంట్ అవసరాలకు సంబంధించిన ఆర్డర్ ఏదైనా సరే, మేం స్వీకరిస్తాం. మంచి స్టాండర్డ్‌లో అనుకున్న టైమ్‌కు అందిస్తాం.

కంటెంట్ వర్క్ ఆర్డర్ మాకివ్వండి.
మీ ఇతర పనులపైన ఫోకస్ పెట్టండి. 
టైమ్‌కు మీకు కంటెంట్ అందించే బాధ్యత మాది.  

ఇంకెందుకు ఆలస్యం? 

వాట్సాప్/ఈమెయిల్ ద్వారా నన్ను కాంటాక్ట్ చేయండి.

Whatsapp: +91 9989578125
Email: mchimmani10x@gmail.com

ABOUT MANOHAR CHIMMANI: 
^^^
(మీ కాంటాక్ట్స్‌లో దీని అవసరం ఉన్నవారికి షేర్ చేయండి. Thanks!

ఏ దేశమేగినా, ఎందు కాలిడినా

సూర్యాపేటకు దగ్గర్లో ఉన్న అడివెంల గ్రామంలో, వాళ్ల అమ్మమ్మ గారింట్లో పుట్టాడు. ఖమ్మం జిల్లా పాల్వంచలో డీఏవీ, నవభారత్ స్కూళ్లలో చదువుకున్నాడు. పాల్వంచలోనే యాడమ్స్ ఇంజినీరింగ్ కాలేజిలో బీటెక్ చేశాడు.

తండ్రి తిరుపతయ్య ‘స్పాంజ్ ఐరన్ ఇండియా లిమిటెడ్ ఎన్ ఎమ్ డి సి’ పాల్వంచలో రిటైరయ్యారు. తల్లి లింగమ్మ గృహిణి. క్రమశిక్షణ, పొదుపు, అందరితో బాగుండటం అనేది తల్లిదండ్రుల నుంచే వచ్చింది.

ఒక మనిషి ఉన్నంతలో సుఖంగా బ్రతకాలంటే ఈ మూడే ముఖ్యం. వీటిల్లో ఏ ఒక్కటి బాగాలేకపోయినా మిగిలిన రెండు సరిగ్గా ఉండవు అని బాగా నమ్మినవాడు, ఆచరిస్తున్నవాడు.

ఎంత దూరం వెళ్ళినా, ఎంత ఎత్తుకెదిగినా మన మూలాలు మర్చిపోకూడదు. అలా ఉన్నప్పుడే సాటిమనిషిపట్ల ప్రేమ, మానవత్వం అనేవి కూడా అతి సహజంగా మనలో ఎప్పుడూ బ్రతికే ఉంటాయి అన్నది కూడా మనసా-వాచా-కర్మేణా నమ్మి ఆచరిస్తున్నవాడు.

అలాంటి నేలమీదుండే మనిషితను.

భార్య ప్రవల్లిక లండన్‌లోనే డెంటల్ కేర్ ప్రొఫెషనల్‌గా పనిచేస్తోంది. వాళ్ళిద్దరికీ ఒక పాప – వైష్ణవి, ఒక బాబు – జైశ్రీరామ్.

ఆల్ హాపీస్…


అతనొక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. 2020 ఫిబ్రవరి వరకు, లండన్ టెక్ మహేంద్రలో ప్రాజెక్ట్ మేనేజర్. ఇప్పుడు అదే లండన్‌లో సొంతంగా బీవీఆర్ టెక్ పేరుతో కంపెనీ స్థాపించి, ఇండిపెండెంట్ కన్‌సల్టెన్సీ చేస్తున్నాడు.


కట్ చేస్తే –

యూకే వెళ్ళి చదువుకొని, అక్కడే కెరీర్ ప్రారంభించాలనుకొనే ఔత్సాహిక విద్యార్థులకోసం సలహా ఇస్తూ ఇలా చెప్పాడు నవీన్:

“బోధనకూ, పరిశోధనకూ యునైటెడ్‌ కింగ్‌డమ్‌ విద్యాసంస్థలు బాగా పేరుపొందాయి. తక్కువ కాలవ్యవధి కోర్సులు, ఫాస్ట్‌ ట్రాక్‌ డిగ్రీలు , కోర్సుతో పాటు ఇంటర్న్‌షిప్‌ ఇక్కడి ఆకర్షణలు. గ్లోబల్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో యు.కె. విశ్వవిద్యాలయాలెన్నో ముందువరసలో స్థిరంగా కొనసాగుతున్నాయి. బ్రెగ్జిట్‌ ప్రభావం తగ్గించుకోవటానికి విదేశీ విద్యార్థుల ప్రవేశాలను ఇప్పుడు యూకే బాగా ప్రోత్సహిస్తోంది.

అమెరికా కంటే ముందే విదేశీవిద్యకు ప్రాచుర్యం పొందింది యు.కె.నే! ఇక్కడి ఆక్స్‌ఫర్డ్‌, కేంబ్రిడ్జి, లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ అండ్‌ పొలిటికల్‌ సైన్స్‌ లాంటి విశ్వవిఖ్యాత విశ్వవిద్యాలయాలు ఎంతోకాలం నుంచి అత్యుత్తమ విద్యకు పేరుపొందాయి. యు.ఎస్‌.తో పోలిస్తే యు.కె.లో కోర్సులు పూర్తిచేయటానికి ఏడాది తక్కువ పడుతుంది. యు.ఎస్‌.లో బ్యాచిలర్‌ డిగ్రీ 4 ఏళ్లు అయితే, యు.కె.లో 3 ఏళ్లు మాత్రమే. పీజీకి యు.ఎస్‌.లో 2 ఏళ్లు పడుతుంది, కాని యు.కె.లో ఏడాది మాత్రమే!

ఇక, చదువుకోవటానికి అయ్యే ఖర్చు అమెరికాతో పోలిస్తే యు.కె.లో కొంత తక్కువ.

యూకేలో 3 విడతల్లో ప్రవేశాలు లభిస్తాయి:
మొదటిది (టర్మ్‌ 1) సెప్టెంబరు – డిసెంబరు.
రెండోది (టర్మ్‌ 2) జనవరి – ఏప్రిల్‌.
మూడోది (సమ్మర్‌) ఏప్రిల్‌ – జూన్‌.

ప్రస్తుతం డిగ్రీ ఆఖరు సంవత్సరం చదువుతున్న వారు, పూర్తయిన వాళ్లు టర్మ్‌ 2, 3 పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ప్రక్రియను ప్రారంభించవచ్చు. సుమారు 6 నుంచి 12 విద్యాసంస్థలను ఎంచుకుని దరఖాస్తు చేసుకుంటే మంచిది.


విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకి యూకే చక్కని అవకాశాలని కల్పిస్తున్నది.రాబోవు రోజుల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI), మషీన్ లర్నింగ్ వంటి టెక్నాలజీల్లో ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి కాబట్టి విద్యార్థులు చక్కగా ఆ అవకాశాలని సద్వినియోగం చేసుకోవచ్చు. డిసెంబర్ 1, 2020 నుండి యూకే ప్రభుత్వం కొత్త ‘పాయింట్ బేస్డ్ ఇమ్మిగ్రషన్ సిస్టం’ ను ప్రవేశ పెట్టింది. విద్యార్థులు డిగ్రీ పూర్తయ్యాక ఈ స్కిల్డ్ వర్కర్ వీసాలతో యూకే లో సెటిల్మెంట్ పొందటానికి మంచి అవకాశం ఉంది”

నగ్నచిత్రం బ్లాగ్ పాఠకుల్లో ఉన్న తల్లిదండ్రులూ, స్టుడెంట్స్ కోసం అడిగినప్పుడు, నవీన్ ఇంత సమాచారాన్ని అందించడం అభినందనీయం.

కట్ బ్యాక్ టు నవీన్ –

కోవిడ్19 ఎఫెక్ట్ మొదటినుంచీ యూకేలో ఒక రేంజ్‌లో ఉంది. సాక్షాత్తూ ఆ దేశపు ప్రైమ్ మినిస్టర్ కూడా కరోనాబారినపడ్డాడు! ఇప్పుడు మరిన్ని వేరియేషన్‌తో యూకేలో కరోనా పరిస్థితి ఇంకా కొంచెం అలజడిగానే ఉంది.

ఇలాంటి పరిస్థితుల్లో – అక్కడి ప్రభుత్వం, వైద్యశాఖ సూచనలు, సలహాలమేరకు అన్నీ సక్రమంగా పాటిస్తూనే, అక్కడి పౌరులంతా జనజీవన స్రవంతిలో ఎవరిపనుల్లో వారున్నారు. ప్రపంచంలోని అన్ని దేశాల్లోలాగే యూకేలో కూడా ఎక్కువశాతం వృత్తి ఉద్యోగాల్లో సాధ్యమైనంతవరకు “వర్క్ ఫ్రమ్ హోమ్” పధ్ధతిలోనే అన్ని వ్యవహారాలు నడుస్తున్నాయి.


ఈ నేపథ్యంలో – పాండెమిక్ టైమ్‌లో ఎలా వుంది లైఫ్ అని అడిగినప్పుడు ఇలా చెప్పుకొచ్చాడు నవీన్:

“పాండెమిక్ రోజుల్లో లైఫ్ కొంచెం ఇంటికే పరిమితమైనా కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపటానికి కుదిరింది. ఐటి జాబ్ చేయటం వలన ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ అలవాటు ఉన్నా కాని, మొత్తం నెలల తరబడి ఆఫీస్ కి వెళ్ళకుండా ఇంటినుంచే పనిచేయటం కొంచెం కొత్తాగానే అనిపించింది. ప్రపంచం నలుమూలలకి ప్రయాణం చేసి, అక్కడి ప్రతినిధులతో కలిసి ప్రాజెక్టులని చేసేవాడిని… కానీ, ఇప్పుడు మొత్తం ఇంట్లో నుండే ఆన్‌లైన్ మీటింగ్స్‌తో “న్యూ నార్మల్ వర్క్ కల్చర్” కి ఇప్పుడు దాదాపు అలవాటు పడ్డాం. అఫీస్ కొలీగ్స్ ని, మిత్రులని కలవటం, సోషల్ లైఫ్ ని మిస్ అవటం ఈ పాండెమిక్ రోజుల్లో ఒక వెలితి. కాకపోతే జూమ్ కాల్స్ ద్వారా సోషల్ మీటింగ్స్ తో అందరు మిత్రులతో తరచు మాట్లడటం వలన కొంతవరకు ఓకే. అంతగా ఎవరిని మిస్ అయిన ఫీలింగ్ కలగలేదు”

ఇంటికి దూరంగా, సుమారు 7700 కిలోమీటర్ల దూరంలో యూకేలో ఎంత బిజీగా ఉంటున్నా కూడా – ఇక్కడి నేలమీద మమకారం ఎక్కువ నవీన్‌కు. తనకిష్టమైన ముఖ్యమంత్రి కేసీఆర్ కోసం, టీఆరెస్ పార్టీకోసం నిరంతరం సోషల్‌మీడియాలో పనిచేస్తుంటాడు నవీన్. ఇప్పుడు లండన్‌లో తను చేస్తున్న ఐటి రిలేటెడ్ కన్సల్టెన్సీతో పాటు, NRI-TRS-UK లండన్ ఇంచార్జిగా కూడా పనిచేస్తున్నాడు నవీన్. దీంతోపాటు, తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యూకే (TAUK) ఈవెంట్స్ సెక్రెటరీగా కూడా, అసోసియేషన్ కార్యకలాపాల్లో యాక్టివ్‌గా పాల్గొంటాడు నవీన్. ఒక స్థాయిలో స్థిరపడ్డ తర్వాత నవీన్‌కు రాజకీయాల్లోకి రావాలని ఉంది కానీ, ప్రత్యక్ష రాజకీయాలు మాత్రం కాదు.

వరంగల్, నల్గొండ జిల్లాల్లోని కొన్ని గ్రామాలకెళ్లినపుడు… అక్కడ ఎప్పుడూ కనిపించే కూలిపోయిన గోడలు, ఎండిపోయిన చెరువులు, అక్కడి పేదరికం, వెనుకబాటుతనం కూడా తనని బాగా కదిలిస్తాయంటాడు నవీన్. ఈ కదలికే… అనుక్షణం… తను పుట్టిన గడ్డకోసం తనకు చేతనయింది ఏదయినా చేయాలనిపించేలా చేస్తోంది.

నవీన్‌కు వ్యవసాయం అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే హైదరాబాద్‌కు దగ్గరలో ఇప్పటికీ వ్యవసాయం కూడా కంటిన్యూ చేస్తుండటం అనేది నవీన్ విషయంలో నిజంగా అభినందించాల్సిన విషయం.

Saturday 18 September 2021

న్యూ టాలెంట్ కోసం!

కొత్త టాలెంట్ కోసం నిన్ననే ఒక 3 యాడ్స్ విడుదల చేశాను. కొత్త ఆర్టిస్టులు, కొత్త స్క్రిప్ట్ రైటర్స్, కొత్త అసిసిటెంట్ డైరెక్టర్స్ (సోషల్ మీడియా విభాగం) కోసం.  

ఈ యాడ్స్ - నిన్నటి నా ఫేస్‌బుక్, ట్విట్టర్ టైమ్‌లైన్స్ మీద కనిపిస్తాయి. ఇప్పుడీ బ్లాగ్ పోస్ట్‌తో కూడా వాటిల్లో ఒక యాడ్‌ను పోస్ట్ చేస్తాను. 

యాడ్స్‌కు స్పందన బాగుంది. కాని, ఎప్పట్లాగే 99% మంది యాడ్‌ను సరిగా చదవరు. చదివింది పాటించరు.  

నేను ఆర్టిస్టుల కోసం అడిగింది: మూడే మూడు ఫోటోలు, ఒక 1 నిమిషం ఇంట్రొడక్షన్ వీడియో. ఇప్పటివరకు కనీసం ఒక వందకు పైగా అప్లికేషన్స్ వచ్చాయి. కాని, ఒక్కరు కూడా దీన్ని పాటించలేదు. ప్రతి అభ్యర్థీ కనీసం 10 ఫోటోలు పంపారు. వీడియ్ ఇంట్రో అనేది అసలు పంపించలేదు. 

ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. వీడియో ఆన్ చేసి, ఒకే ఒక్క నిమిషం తన గురించి తాకు క్లుప్తంగా చెప్పుకుంటే సరిపోతుంది. ఈ మాత్రం చేయలేరా? ఇవేవేఎ ఒక్క పైసా జేబులోంచి ఖర్చుపెట్టి చేసేవి కాదు. 

తను ఎంచుకున్న కెరీర్ మీద సీరియస్‌నెస్ ఉన్నప్పుడు ఇలా జరగదు. ప్రతి చిన్న అంశాన్నీ జాగ్రత్తగా పాటిస్తారు. పట్టించుకొంటారు. ఏమైనా సరే నన్ను ఆడిషన్‌కు పిలిచితీరాలి అన్న తపన, పట్టుదల కొందరి అప్లికేషన్స్‌లో కనిపిస్తుంది. 

కట్ చేస్తే - 

కొత్త స్క్రిప్ట్ రచయితలు కనీసం ఒక ముగ్గురిని తీసుకొనే ఆలోచన ఉంది. యూనికోడ్‌లో తెలుగులో టైప్ చెయ్యగలగాలి. ప్రొఫెషనల్ స్క్రిప్ట్ రైటింగ్ మీద అవగాహన ఉండాలి. మీరు రాసిన ఏవైనా ఒక రెండు సీన్లు డైలాగ్ వెర్షన్లో నాకు పంపించాలి. 

అప్లికేషన్స్ వచ్చాయి. ఎవరు ఏం పంపించారో చూడాల్సి ఉంది. 

దాదాపు అయిదారేళ్ళ నుంచి రైటర్‌గా ఎంట్రీ కోసం ప్రయత్నాలు చేస్తున్న ఒక కొత్త రైటర్‌కు నిన్న చెప్పాను - తాను రాసిన స్క్రిప్టులో ఏవైనా ఒక రెండు సీన్లు పంపించమని. ఇంతవరకు సీన్ల జాడ లేదు. 😊

అయితే - ఇదంతా విమర్శించటం కాదు. 100% అన్ని అర్హతలు ఉండి, 24 గంటలు అందుబాటులో ఉన్నవాళ్లే ఇక్కడ ఇండస్ట్రీలో కిందా మీదా పడుతున్నారు. ఒక అవకాశం ఉంది అని కళ్ళముందు కనిపిస్తున్నప్పుడు, దాని వినియోగించుకోవడంలో ఇంత అలసత్వం ఉంటే ఎలా?

కట్ చేస్తే - 

సోషల్ మీడియా విభాగంలో కొత్తగా ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్స్‌ను తీసుకొంటున్నాను. దీనికోసం కూడా ఒక యాడ్ ఇచ్చాను. 

సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక బజ్ క్రియేట్ చేస్తూ డైనమిక్‌గా ఉండే ఇద్దరు అసిస్టెంట్స్ కావాలి. వీరికి సోషల్ మీడియా మీద, దాని ఎఫెక్టివ్‌నెస్ మీద తగినంత అవగాహన ఉండాలి. 

ఇప్పుడంతా సోషల్ మీడియా ఎక్స్‌పర్ట్‌లే కాబట్టి - దీనికోసం చాలామంది వస్తారు అనుకుంటున్నాను. 

నా ఫేస్‌బుక్, ట్విట్టర్ నిన్నటి టైమ్‌లైన్స్ మీద ఈ యాడ్స్‌ను ఔత్సాహికులు చూడొచ్చు. అప్లై చేసుకోవచ్చు. మాకు కావల్సినన్ని అప్లికేషన్స్ రాగానే ముగిస్తాము. 

“I can’t afford to hate anyone. I don’t have that kind of time.” 
― Akira Kurosawa.  

Friday 17 September 2021

బ్యాక్ టు స్కూల్!

ఎవరైనా, ఎప్పుడైనా, ఏదైనా ప్రారంభించవచ్చు, సాధించవచ్చు. మానసికంగా, శారీరకంగా ఫిట్‌గా ఉన్నంతవరకు ఎలాంటి వయోపరిమితి కూడా లేదు. ఇప్పటికే ఎందరో దీన్ని నిరూపించి చూపారు. 

ఉచిత సలహాదారులు, "నే సేయర్స్" మాటలు అస్సలు పట్టించుకోవాల్సిన పనిలేదు. ప్రయత్నం ఫెయిలయినా, అనుకున్నట్టు జరక్కపోయినా చింతించాల్సింది ఏమీ లేదు. ఇంకొకటి. ఆగే పనిలేదు.  

అంతే తప్ప - చేతులు ముడుచుకొని నాలుగు గోడల మధ్య కూర్చొని, ఎవరెవరికో ఉచిత సలహాలిచ్చే బదులు... ఏదో ఒక పని చేస్తూవుండటం చాలా మంచిది. అనవసరంగా వయసులోనే ముసలితనం రాదు. ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటాం.  

ఈ సందర్భంగా... పలు సమయాల్లో, పలు విధాలుగా... సాంఘికంగా, ఆర్థికంగా నాకు సహకరించిన కొందరు ప్రియాతిప్రియమైన నా మిత్రులు, శ్రేయోభిలాషులందరికీ నా ధన్యవాదాలు తెలుపుకొంటున్నాను. 

“Gratitude is the fairest blossom which springs from the soul.”
– Henry Ward Beecher.  

కట్ చేస్తే - 

చాలా మంది ఉచిత సలహాలను వినీ, వినకా, విన్నట్టు చేసీ... మొత్తానికి కొంచెం గ్యాప్ తర్వాత మళ్లీ సినిమాల్లోకి వచ్చాను. ఇక గ్యాపులుండవు. రెగ్యులర్‌గా సినిమాలు చేస్తాను.

ఇలా ఎప్పుడూ అనుకోలేదు. ఇప్పుడు అనుకుని మరీ దిగుతున్నాను కాబట్టి తప్పకుండా చేస్తాను. 

పూర్తి స్థాయిలో ఒక పనిలోకి దిగినప్పుడు ఏది అడ్డమొచ్చినా కొట్టేసుకుంటూ ముందుకే వెళ్తుంటాం. అలా కాకుండా - సగం సగం అనుకున్నప్పుడు, రెండు మూడు పడవల మీద కాళ్ళు పెట్టినప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోలేము. ఫలితాలు కూడా సగం సగమే ఉంటాయి. 

ఇప్పుడు నాకా సమస్య లేదు. 

పైగా, ఇప్పుడు నేను ఏదో అలా చేయాలని సినిమాలు చేయటం లేదు. ఖచ్చితమైన లక్ష్యాలున్నాయి. మెజరేబుల్ టార్గెట్స్ ఉన్నాయి. సాధిస్తాను.  

నవంబర్‌లో నా కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోంది.

I WISH MYSELF A THUMPING START & TREMEDOUS SUCCESS!   

Thursday 16 September 2021

సృజనాత్మక జీవితంలో ప్రయోగాలు నిరంతరం!

ఒక మల్టిఫేరియస్ ఫ్రీలాన్సర్‌గా నా ప్రొఫెషనల్ ప్రయాణంలో చాలా పనులు చేశాను. చాలా ప్రయోగాలు చేశాను. ఎక్కడా ఫెయిల్ కాలేదు, ఎక్కడా వెనుతిరిగి చూళ్లేదు... ఒక్క సినిమాల్లో తప్ప! :-) 

దీనికి కారణాలేమీ పెద్దగా వెతుక్కోనవసరం లేదు. సినిమా అంటే - నా ఒక్కడి నిర్ణయాల మీద జరిగే పనులు కావు. ఈ ఒక్కటి చాలు, నేను అనుకున్నది అనుకున్నట్టు కాకపోవడానికి. 

ఒక్క హిట్ ఇక్కడ ఎంతో పేరు, ఎంతో మంచి సెలెబ్ స్టేటస్‌నిస్తుంది. డబ్బు విషయం చెప్పే అవసరం లేదు. 

అసలు నేను సినీఫీల్డులోకి ఎంటర్ కావాలనుకున్నది కేవలం 'బిగ్ మనీ' కోసమే. ఇలా చెప్పడానికి ఇబ్బందిగా ఏం ఫీల్ కావడం లేదు నేను. కాని, అనుకున్నట్టు పూర్తిస్థాయిలో ఫీల్డులోకి దిగలేకపోయాను.  

చాలా చిన్న లక్ష్యంతో, ఇప్పుడు మాత్రం, పూర్తిస్థాయిలో సినిమాలు చేయబోతున్నాను. చేస్తాను. నేను అనుకున్న లక్ష్యం సాధించడానికి పెద్ద సమయం కూడా పట్టదు. 

జస్ట్ పేరు, సెలబ్ స్టేటస్ వంటి వాటి కోసమే అయితే... సినిమాలే కానక్కర్లేదు. రాయడం, సోషల్ మీడియా వంటి హాబీల ద్వారా కూడా ఇప్పుడిది సాధ్యం.   

కట్ చేస్తే -

ఈ డిజిటల్ యుగంలో ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా, కేవలం ఒకే ఒక్క ఆదాయమార్గం మీద బ్రతికే పరిస్థితి లేదు. సాధ్యం కాదు.  

ఈ నేపథ్యంలో నేను కూడా కొన్ని ప్రయోగాలు చేశాను. వీటిలో కొన్ని పరోక్షంగా ఉపయోగపడేవి. కొన్ని ప్రత్యక్షంగా ఫుడ్డు పెట్టేవి. 

అయితే - ప్రయోగం అన్నప్పుడు సహజంగానే కొన్ని ఫెయిలవుతుంటాయి. కొన్ని మనం అనుకున్నట్టు అద్భుతంగా ఉపయోగపడతాయి. నా అనుభవంలో ఫెయిల్యూర్ ప్రయోగాలేం  లేవు. నాకు కుదరదు అని, నేను వద్దనుకొని మధ్యలో వదిలేసినవి మాత్రం కొన్నున్నాయి. ఇంకొకరి సమయం మీద, నిర్ణయాల మీద ఆధారపడి నేను అనుకున్నది చేయాల్సిన ప్రయోగాలను కూడా వదులుకున్నాను.   

ఇలాంటి ఈ నిరంతర ప్రయోగాల నేపథ్యంలో - ఈమధ్య నేను మొదలెట్టిన మరో కొత్త ప్రయోగం నా తెలుగు పాడ్‌కాస్ట్... ఫిలిం నగర్ డైరీస్. 

సంతోషం ఏంటంటే  - ఇప్పటివరకు ఒక 11 ఎపిసోడ్లు చేశాను. ఇంకో 10 ఎపిసోడ్లు చేసేవరకు నేను అనుకున్న స్థాయిలో పర్ఫెక్షన్ రాకపోవచ్చు. కానీ, దీనికోసం నేను ఎవ్వరిమీదా ఆధారపడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం అదే నాకు ముఖ్యం.  

Wednesday 15 September 2021

మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికి?

ఆ మధ్య నా బర్త్ డే నాడు, నాకు అత్యంత ప్రియమైన ఫ్రెండ్ ఒకరు ఒక ప్రశ్న అడగటం జరిగింది. "ఈ బర్త్ డే కి స్పెషల్ గా నువ్వు ఏదయినా కొత్త నిర్ణయం తీసుకుంటున్నావా?" అని. 

నిజానికి నాకు అలాంటి నమ్మకాలు లేవు.

ఒక మనిషి నిజంగా ఏదయినా మానేయాలనుకొన్నా, లేదంటే, కొత్తగా ఏదయినా ప్రారంభించాలనుకొన్నా - దానికి ప్రత్యేకంగా న్యూ యియర్లు, బర్త్ డేలు, మరేవో స్పెషల్ డేలూ, ముహూర్తాలూ అవసరం లేదు అన్నది నా వ్యక్తిగత అభిప్రాయం.   అదే విషయం నా ఫ్రెండ్ తో చెప్పాను. 

నిర్ణయాలు ఏ క్షణంలో అయినా తీసుకోవచ్చు. ఒక చిన్న సంఘటన చాలు. మన ఆలోచనా విధానాన్నీ, మన జీవన పథాన్నీ సంపూర్ణంగా మార్చివేయగల ఒక నిర్ణయం తీసుకోడానికి.

కట్ చేస్తే - 

మొన్నీ మధ్యే, జూలైలో, కేవలం రెండు రోజుల వ్యవధిలో - మా పెద్దబ్బాయి ప్రణయ్, చిన్నబ్బాయి ప్రియతమ్ నాతో ఏకాంతంగా ఉన్నప్పుడు చెరొక ప్రశ్న చాలా క్యాజువల్ గా అడిగారు. 

మా అబ్బాయిలిద్దరి రెండు ప్రశ్నలూ నన్ను కనీసం ఒక వారం పాటు ఒక సంపూర్ణ అంతర్ముఖుడ్ని చేశాయి. చివరకు, ఒకే ఒక్క గంట స్వీయ విశ్లేషణ తర్వాత అప్పటికప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాను.

ఇప్పటివరకూ నా జీవితంలో నేను తీసుకున్న నిర్ణయాలన్నిటిలోకెల్లా అత్యుత్తమమయిన నిర్ణయం అది.  

27 జూలై...

ఆరోజు ఎలాంటి ప్రత్యేకమయిన రోజు కాదు. కానీ, ఆరోజు నేను తీసుకున్న నిర్ణయం ఫలితాలను, ఇంకో 71 రోజుల్లో, 26 నవంబర్ నాడు రాబోతున్న నా పుట్టినరోజు నాటికి పూర్తిగా అందుకోవాలి, పూర్తిగా ఫ్రీ అయిపోవాలి అని గట్టిగా అనుకున్నాను.  

సో, రివర్స్ ఇంజినీరింగ్ లో, నా పుట్టినరోజు నాకు అలా పనికొచ్చిందన్నమాట! 😊

అయితే - నిర్ణయం తీసుకోవడం ఒక్కటే సరిపోదు. దాని అమలు కోసం కనీసం పదింతల వేగంతో పనిచేయాలి. 

ఇప్పుడు నేనదే చేస్తున్నాను...   

Tuesday 14 September 2021

ఓవర్ నైట్ లో హీరో కావడం ఎలా?

టైటిల్ చూస్తే - ఇదేదో  పక్కా కమర్షియల్ యాడ్ లా అనిపిస్తుంది.   

కానీ... There is a catch.   


హీరోగా ఇంట్రొడ్యూస్ కావాలనుకొనే కొత్త ఆర్టిస్టులు... ఈ పోస్ట్ చదివాక, ఈజీగా ఒక డెసిషన్ తీసుకోవచ్చు.  

కట్ చేస్తే -

సినీఫీల్డులో హీరోగా మీ ప్రవేశానికి టాలెంట్ ఒక్కటే సరిపోదు. బై డిఫాల్ట్ ఎవరికైనా టాలెంట్ ఉండాల్సిందే. అయితే - ఆ టాలెంట్ మిమ్మల్ని ఇండస్ట్రీకి పరిచయం చేయగలిగినవారి దృష్టికి తీసుకెళ్ళగలగాలి. అదెలా సాధ్యమవుతుందో మీకు తెలిసుండాలి. 

చాలా సందర్భాల్లో ఒక కొత్త హీరో బయటినుంచి పరిచయమవడం అన్నది చాలా అరుదుగా జరిగే అంశం. డబ్బు, ఇండస్ట్రీ లింక్స్, కాంటాక్ట్స్ లేకుండా దాదాపు ఇది అసాధ్యం. 

కేవలం అతి కొద్ది మంది విషయంలో మాత్రమే టాలెంట్ సపోర్ట్ చేస్తుంది. అది షార్ట్ ఫిలిమ్స్‌లో మీ యాక్షన్ గుర్తించి కావచ్చు. అంతకు ముందు చిన్న చిన్న కారెక్టర్స్‌లో మీరు ప్రూవ్ చేసుకున్న మీ నటన చూసి కావచ్చు. ఇలా కొద్దిమందికి మాత్రమే సాధ్యమవుతుంది. 

సినిమా అంటేనే - ప్రతిరోజూ లక్షల్లో ఖర్చు. 

అంతా కొత్తవాళ్లతోనే ఒక మాడరేట్ స్థాయిలో సినిమా తీయాలంటే కనీసం ఓ 2 కోట్లు అవుతుంది. మరీ తక్కువలో తక్కువ అనుకుంటే కనీసం ఓ 60 లక్షలవుతుంది. 

కొత్త హీరోలకు చాన్స్ ఇచ్చే సినిమాలు 99% చిన్న బడ్జెట్ సినిమాలే. ఈ చిన్న బడ్జెట్ సినిమాలకు ఎప్పుడూ ఒక పెద్ద సమస్య ఉంటుంది. డబ్బు! 

ఒక కొత్త హీరోను ఇంట్రొడ్యూస్ చెయ్యాలనుకున్నప్పుడు, ఎవరైనా టాలెంట్‌కే ఫస్ట్ ప్రెఫరెన్స్ ఇస్తారు. అందులో డౌట్ లేదు. అయితే - అలా టాలెంట్ ఉన్నవాళ్ళు వందల్లో ఉంటారు. సో, వారిలో ఎవరి ద్వారా ప్రాజెక్టుకు సపోర్ట్ ఉంటుందో వారికే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. 

ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. 

కొత్త హీరోలను ఎక్కువగా వారి బంధువులో, ఫ్రెండ్సో ప్రొడ్యూసర్స్‌గా ఉండి ఇంట్రొడ్యూస్ చేస్తారు. కొంతమంది కొత్త హీరోలు వారే స్వయంగా బడ్జెట్లో కొంత భాగం ఇన్వెస్ట్ చేస్తారు. వారికి ఆ స్థోమత లేనప్పుడు, వారి సర్కిల్లో తెలిసినవారి ద్వారా ఎంతో కొంత ఇన్వెస్ట్ చేయిస్తారు. 

ఓవర్‌నైట్‌లో  హీరోలయిపోతారు!  

ఈమధ్య కూడా - ఈ పధ్ధతిలో హీరోలుగా పరిచయమై నిలదొక్కుకున్న హీరోలెవరైనా గుర్తొస్తున్నారా మీకు? తప్పకుండా వస్తారు. అది చాలా మామూలు విషయం. మామూలుగా జరిగేదే అది.  

కొత్త హీరోల ఇంట్రడక్షన్ వెనకున్న ఈ ఆర్థిక కోణాన్ని అర్థం చేసుకోలేక - చాలా మంది తప్పుగా అనుకుంటారు... డబ్బులు పెడితేనే  చాన్స్ ఇస్తారనీ, ప్రొడ్యూసర్లు - డైరెక్టర్లు వాళ్లకు తెలిసిన వాళ్లకే చాన్స్ ఇస్తున్నారనీ... రకరకాలుగా అనుకుంటారు. 

ఏదీ ఊరికే రాదు, ఊరికే అందరూ హీరోలవ్వలేరు. హీరోలయ్యాక వారికి కూడా ఊరికే కోట్లల్లో రెమ్యూనరేషన్ ఇవ్వరు. 

ప్రతిదానికీ ఓ లెక్కుంటుంది.  ఈ  రియాలిటీని అర్థం చేసుకుంటే చాలు. జీవితంలో మీ టైం వేస్ట్ కాదు. 

Monday 13 September 2021

కోపరేటివ్ ఫిలిమ్ మేకింగ్ అంటే?

అసలు కోపరేషన్ అంటే ఏంటి? ఒకరికొకరు సహకరించుకోడం. 

కోపరేటివ్ ఫిలిం మేకింగ్ కూడా అంతే. ఆర్టిస్టులు, టెక్నీషియన్లు సినిమా పూర్తయ్యి, రిలీజై, డబ్బులు వచ్చేదాకా వాళ్ళ రెమ్యూనరేషన్స్ అడగకుండా పనిచేసి సహకరించడం. 

ఓటీటీ కోసం ఇప్పుడు నేను చేస్తున్న సినిమాల్లో - ఈ కోపరేటివ్ పద్ధతిలో కూడా ఒక సినిమా చేస్తున్నాను. 

ఈ సెటప్‌లో ఆర్టిస్టులు, టెక్నీషియన్లు పాతవాళ్ళు కావచ్చు, కొత్తవాళ్ళు కావచ్చు. వాళ్లకు ఒక్క రూపాయి రెమ్యూనరేషన్ కూడా ముందు ఇవ్వటం అనేది ఉండదు.

సినిమా పూర్తయ్యి, రిలీజయ్యి, డబ్బులు వచ్చాకే... పేమెంట్స్ !

దీనికి ఒప్పుకున్నవాళ్లే మా సినిమాలో పనిచేస్తారు. ఇదే వాళ్లందించే సహకారం. ఇదే వాళ్ళ కోపరేషన్. 

Win - Win. 

మా సినిమా బడ్జెట్ 50 లక్షలు కావచ్చు, కోటి కావచ్చు, రెండు కోట్లు కావొచ్చు.  ఉన్న ఆ కొద్ది బడ్జెట్‌ను మేకింగ్‌కు, ప్రమోషన్‌కు మాత్రమే వాడతాం. 

ఇదేం కొత్త కాన్సెప్ట్ కాదు. ఆర్ జి వి ఆల్రెడీ ఈ కాన్సెప్ట్‌తో సినిమాలు చేశాడు. 'దొంగల ముఠా' సినిమా అలా చేసిందే. 

చాలా మంచి కాన్సెప్ట్ ఇది.  ముఖ్యంగా చిన్న బడ్జెట్ సినిమాలకు సంబంధించి మాత్రం ఇదే చాలా చాలా కరెక్టు.

చిన్న సినిమాలకు "టాక్" వచ్చేదాకా మంచి ఓపెనింగ్స్ ఉండవు కాబట్టి, ప్రమోషన్ పరంగా ఎన్నో జిమ్మిక్కులు చేయాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ముందు ప్రొడ్యూసర్‌ను కొంతయినా బ్రతికించుకోవాలంటే ఇదే మంచి పధ్ధతి. 

ఇప్పుడున్న ఒటీటీ ట్రెండులో కూడా ఇదే కరెక్టు పద్ధతి. 

చిన్న బడ్జెట్ సినిమాలకు ఎప్పుడూ బడ్జెటే సమస్య. అలాంటప్పుడు ఉన్న డబ్బంతా రెమ్యూనరేషన్స్ కు ఇచ్చేసి - మధ్యలో  డబ్బులు సరిపోక సినిమా ఆపేసుకోడం ఎందుకు?


టీమ్ వర్క్.
కంటెంట్.
ప్రమోషన్.

ఈ తరహా సినిమాలకు ఈ మూడే చాలా ముఖ్యం. 

కట్ చేస్తే - 

ఈ కాన్సెప్ట్‌తో నేను, నా చీఫ్ టెక్నీషియన్స్ వీరేంద్ర లలిత, ప్రదీప్‌చంద్రతో కలిసి... నా సొంత బ్యానర్‌లో... ట్రెండీ కమర్షియల్ సినిమాలు ప్లాన్ చేస్తున్నాను. ప్రి-ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. 

అంతా న్యూ టాలెంట్, అప్-కమింగ్ టాలెంటే ఉంటుంది. 

ఇంతకు ముందు సినిమాలు వేరు. ఇప్పుడు సినిమాలు వేరు. 
Content is king. Money is the ultimate goal.

నో కాల్ షీట్స్. నో టైమింగ్స్. అంతా రెనగేడ్ ఫిల్మ్ మేకింగ్. గెరిల్లా ఫిల్మ్ మేకింగ్. 

అనుకున్న సమయానికి సినిమా పూర్తిచేయడం, రిలీజ్ చేయడం పక్కా. పైసా వసూల్ కూడా బానే ఉంటుంది. 

చిన్నమొత్తంలో అయినా సరే... ఇన్వెస్ట్ చేసి, ఫీల్డులోకి రావాలనుకొనే ప్యాషనేట్ ఇన్వెస్టర్‌లకు వెల్కమ్! 

ఇన్వెస్ట్ చేస్తూ, హీరోలుగా ఇంట్రడ్యూస్ కావాలనుకోనే కొత్త హీరోలకు కూడా సూపర్ వెల్కమ్!! 

కింద నా కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి. కనెక్ట్ అవండి. చర్చిద్దాం.  

"కలిసి పనిచేద్దాం. కలిసి ఎదుగుదాం."

ఇదే మా కాన్సెప్ట్. 👇👇

Whatsapp: +91 9989578125
Email: mchimmani10x@gmail.com 

అన్ని యాదికొస్తయ్!

అప్పుడప్పుడు బరస్ట్ అవుతుంటం. కావాలె. 

ఏదన్న మనసుల బాధ వుంటె బయటపడెయ్యాలె. 

షిఫ్ట్ డిలీట్!

అట్ల చెయ్యకుండ, అన్ని లోపల్లోపల్నె పెట్టుకొంటెనె... గీ గుండెపోటు, షుగర్, బీపీలు వచ్చేది.  ఎక్కడిదక్కడె ఆగిపోయేది. 

అంత రిస్కు ఎందుకని అప్పుడప్పుడు గీ బ్లాగుల బయటపడుతుంటాను. ఏది పడితె అది రాస్తుంటాను. ఏది లోపల్నుంచి తన్నుకొస్తుంటె అది బయటపడేస్తుంటాను.  

అందుకే ఇప్పటికీ నా జోలికి ఏ రోగం రాలేదు. 

అందుకే... నా బ్లాగంటే నాకిష్టం.

బ్లాగింగ్ బంద్ చేద్దమని ఎన్నిసార్లో అనుకున్న. "ఇగ బ్లాగ్ బంద్" అని పోస్టులు కుడ పెట్టిన. కని, మళ్ల తిరిగి తిరిగి ఈడికే వచ్చిన. 

నా బ్లాగ్ నా ఊపిరి. నా యోగా. నా మెడిటేషన్. నా ప్రయోగశాల. నా తప్పొప్పుల బోను. నా స్ట్రెస్ బస్టర్. 

కట్ చేస్తె - 

జీవితంల పైకొచ్చిన ప్రతి మనిషి వెనుక ఎన్నో బాధలుంటై. ఎంతో మంది మిత్రులు, శత్రువులతోటి అనుభవాలుంటై. వాళ్ళూ వీల్ళ్లూ అని లేకుంట - అందరూ నేర్పిన పాఠాలుంటై. 

బాగుపడ్డా, పైకొచ్చినా... ఒక్కటే ఒక్క ట్రిగ్గరింగ్ వ్యక్తి ప్రభావం తప్పక ఉంటది. 

నా లైఫ్‌ల అట్లాంటి మనుషుల సంఖ్య కొంచెం ఎక్కువే అనిపిస్తది. అన్నీ యాదికొస్తయి. ఏం చెయ్యగలం? ఆ యాదికొచ్చేవాట్నే పట్టుకొని బాగుపడలేం కదా! మర్చిపోవాలె. ఇప్పుడదే చేస్తున్న. కని, అవి నాకు నేర్పిన పాటాలను అస్సలు మర్చిపోలేం. మర్చిపోవద్దు. మర్చిపోతె మల్లదే తప్పు చేస్తం. 

పాజిటివ్ సైడు... ఒక్కటే ఒక్క మెసేజ్‌తోటి నన్నూ, నా జీవితాన్ని ఇంద్రధనుస్సు ఎక్కించి జారుడు బల్ల ఆడించిన వ్యక్తులున్నరు. ఒక్కటే ఒక్క ఫోన్ కాల్‌తోటి నన్ను నేను మర్చిపోయిన నన్నులాగ మార్చినవాళ్లున్నరు. 

వాళ్ళు నాతోటి జీవితాంతం ఉండకపోవచ్చు. కని, వాళ్ళిచ్చిన మంచి జ్ఞాపకాలు మాత్రం కొసాకరి దాక నాతోనే ఉంటై. 

ఇసొంటి మంచిని యాది చేసుకొనుడే నాకు చానా ఇష్టం. చానా మంచిది. 

అప్పుడప్పుడు, నేను పుట్టి పెరిగిన, చిన్నప్పుడు తిరిగిన... నా వరంగల్ భాషల... గిట్ల  పోస్టులు పెట్టుకుంటె గుడ మస్తుంటది! 

Saturday 11 September 2021

మై డియర్ న్యూ టాలెంట్, ఇదీ లెక్క !!

"నిన్ను నువ్వు తెల్సుకో"... అన్నాడు ఓ ఫిలాసఫర్.

ఆర్టిస్టుగానో , టెక్నీషియన్‌గానో, చివరికి సినిమా ఆఫీస్ లో ఒక ఆఫీస్‌బాయ్‌గానో... సినీ ఫీల్డులోకి ఎంటర్ కావాలనుకొనే న్యూ టాలెంట్... ముందుగా తెల్సుకోవాల్సిన లెక్క ఒకటుంది. 

అదేంటంటే -

ఫీల్డులోకి ప్రవేశించాలనుకొని... ఫిలిమ్‌నగర్‌కు వచ్చే ప్రతి 1000 మందిలో ఒక 10 మందికి మాత్రమే సినిమాల్లో చాన్స్  దొరుకుతుంది. 

అదీ... ఎంతో కష్టంగా! 

అవకాశం దొరికిన ఆ పదిమందిలో కూడా - ఏ ఒక్కరో ఇద్దరో మాత్రమే క్లిక్ అవుతారు. 

వాళ్లే ఫీల్డులో కొన్నాళ్ళు నిలబడగలుగుతారు. 

అలా నిలబడ్డవాళ్ళ టాప్ ప్రయారిటీస్ లో సినిమానే ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. 

ఆర్టిస్టులయినా, టెక్నిషియన్స్ అయినా... సినిమా తప్ప వేరే పనిలేకుండా, సినిమానే జీవితంగా తీసుకోగలిగే వాళ్ళు మాత్రమే ఇండస్ట్రీలో దశాబ్దాలపాటు ఉంటారు. వాళ్ళల్లోనే కొందరు లెజెండ్స్ అవుతారు.  

కట్ చేస్తే -

ఒక సంవత్సరంలో ఎన్ని సినిమాలు తీస్తారు? వాటిలో కొత్తవాళ్లకు అవకాశం ఇచ్చే సినిమాలు ఎన్నుంటాయి? అసలు ఒక సినిమాలో ఎంతమంది కొత్తవాళ్లకు అవకాశం ఇవ్వడానికి వీలవుతుంది? 

రెండే రెండు నిమిషాలు ఆలోచిస్తే, సింపుల్ గా మ్యాటర్ అర్థమైపోతుంది.  

ఒక్క టాలీవుడ్‌లోనే కాదు. ఏ వుడ్డులోనయినా ఇదే లెక్క! 

వెయ్యి మందిలో ఒక్క పది మందికే చాన్స్. 

అది కూడా అతి కష్టం మీద దొరుకుతుంది. ఆ పది మందిలో ఒక్కరో ఇద్దరో సక్సెస్ అవుతారు. మిగిలినవాళ్ళంతా అలా అలా లాగిస్తుంటారు. 

ఇలా లాగిస్తున్నవాళ్ళ గురించి చెప్పాలంటే... అదొక ఎవర గ్రీన్ సీరియల్ అవుతుంది. ఆ ఎపిసోడ్లకు అంతుండదు... 


ఇప్పుడు ఓటీటీ లొచ్చాయి... వెబ్ సీరీస్ లొచ్చాయి. కొత్తవాళ్ళకే కాదు, అప్ కమింగ్ వాళ్లకు కూడా  అవకాశాలు పెరిగాయి. 

ఈమధ్య షార్ట్ ఫిలింస్ కూడా బాగా పాపులర్ అయ్యాయి. దాదాపు ఇంటికో డైరెక్టర్ ఉన్నాడు. వీళ్ళల్లో అద్భుతంగా షార్ట్ ఫిలిమ్స్ తీసి... ఇండస్ట్రీ దృష్టికి రీచ్ అయ్యేవారికి సినిమా అవకాశాలు కూడా పెరిగాయి. 

అయితే - ఎన్ని అవకాశాలు పెరిగినా, లెక్క లెక్కే. 

ఈ లెక్క మారదు.  

హాలీవుడ్ అయినా, బాలీవుడ్ అయినా సుమారుగా రేషియో మాత్రం ఇదే. 

వెయ్యి మందిలో ఒక్క పది మందికే చాన్స్. ఆ 10 మందిలో - ఒక్కరో, ఇద్దరో సక్సెస్ అవుతారు. ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటారు. 

వినడానికి కొంచెం కష్టంగా ఉన్నా - ఇదే రియాలిటీ. 

ఈ రియాలిటీని ఎదుర్కొనే  గట్స్ ఉన్నవాళ్లకే సినీఫీల్డు వెల్కం చెప్తుంది. 

మరి మీలో ఆ గట్స్ ఉన్నాయా?! ...  ఒకసారి చెక్ చేసుకోండి. 

ఏవో లెక్కలు చెప్పి డిస్కరేజ్ చేస్తున్నా అనుకోవద్దు... ఈ లెక్కలన్నిటినీ ఓవర్ నైట్లో  బైపాస్ చేసే మార్గాలు కూడా కొన్నుంటాయి. వాటిగురించి... తర్వాత మాట్లాడుకుందాం.  

ఇంక చాలా ఉంది... కథ!  
^^^^

#FilmNagarDiaries #TeluguPodcast #Episode2 #Transcript 

Friday 10 September 2021

ప్రమోషన్ టైమ్స్!

నా బ్లాగ్ పాఠక మిత్రులకు చిన్న నోట్:

ఆన్‌లైన్‌లో కొన్ని రెడీ రిఫరెన్స్ అవసరాల కోసం - కొంత ప్రమోషన్ స్టఫ్‌ను, సమాచారాన్ని నా బ్లాగ్‌లో పోస్ట్ చేస్తున్నాను. అలాగే, బ్యాకప్ కోసం కూడా మరొకచోట పోస్ట్ చేసినవాటిని మళ్ళీ ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను.

బ్లాగ్ లింక్స్ పర్మనెంట్‌గా ఉంటాయని నా ఉద్దేశ్యం. 

ఉదాహరణకు: నా గురుంచి (ABOUT). ఒకసారి దీన్ని బ్లాగ్‌లో పోస్ట్ చేశానంటే, అవసరమైన ప్రతిచోటా మళ్ళీ మళ్ళీ రాసేకంటే, ఈ లింక్‌ను నేను ఎక్కడైనా ఈజీగా పోస్ట్ చెయ్యొచ్చు. :-) 

ఇలాగే - నా ఇతర ఫ్రీలాన్సింగ్ సర్విసెస్ స్టఫ్. మొత్తం ఓ అరడజన్ ఉంటాయనుకుంటున్నాను. ఆన్‌లైన్‌లో రెడీ రెఫెరెన్స్ కోసం, ప్లస్ బ్యాకప్ కోసం కూడా. 

కట్ చేస్తే - 

నా ఫిలిం కెరీర్‌కు సంబంధించిన ప్రమోషన్ స్టఫ్ కూడా, ఇకనుంచీ కొంత కాలం, ఏదో ఒకటి పదే పదే కనిపించొచ్చు. మీకు ఆసక్తిగా అనిపిస్తేనే చదవండి. లేదంటే, ఇంకో పోస్టుకు వెళ్ళొచ్చు. 

కొన్ని ఫ్రీ రిసోర్సెస్‌ను బాగా ఉపయోగించుకోకతప్పదు. ఇప్పుడు పూర్తిస్థాయిలో సినిమా పనుల మీదున్నాను కాబట్టి, ఇలాంటి ప్రమోషనల్ స్టఫ్ కొంచెం ఎక్కువగా కనిపిస్తుండవచ్చు. 

మీకు బోర్ కొట్టించాలని కాదు. కేవలం నా టెక్నికల్ అవసరాల కోసం మాత్రమే ఇవి పోస్ట్ చేస్తున్నాను.

అయితే... చెప్పలేం... నా బ్లాగ్ మీద ఈ పోస్టుల్ని అనుకోకుండా చూసిన ఎవరో ఈవైపు ఇంట్రెస్టు ఉన్నవారు వన్ ఫైన్ ఈవెనింగ్ నన్ను కనెక్టు కావచ్చు కూడా! :-) :-) 

థాంక్స్ & గుడ్ నైట్! 

MAKE MOVIES THAT MAKE MONEY!

ప్రొడ్యూసర్ అవుతారా, కోప్రొడ్యూసర్ అవుతారా, హీరో అవుతారా... మీ ఇష్టం. ఇదంతా సాధ్యమే. చదవండి, మీకే తెలుస్తుంది.  

థాంక్స్ టు కరోనా లాక్‌డౌన్... ఇప్పుడంతా ఇండిపెండెంట్ సినిమాల హవా నడుస్తోంది.  

మార్కెట్‌నూ బిజినెస్‌నూ బాగా స్టడీ చేసి, ఒక అవగాహనతో సినిమా నిర్మించినప్పుడు ఎలాంటి రిస్క్ ఉండదు. డబ్బులూ వస్తాయి. పేరూ వస్తుంది. ఓవర్‌నైట్‌లో సెలబ్రిటీ హోదా వస్తుంది. 

అతి తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తో, ఇదంతా ఇప్పుడు అతి సులభంగా సాధించవచ్చు. 

కట్ చేస్తే –

లాక్‌డౌన్ సమయంలో – ఫిలిం ఇండస్ట్రీలో OTTలు, ATTల నేపథ్యంలో చాలా గమ్మత్తులు జరిగాయి.

OTT (Over-The-Top): Netflix, Amazon Prime, Aha, Zee5, Sony Liv, ShreyasET, Urvasi, SparkOTT, etc. Subscription based.

ATT (Any-Time-Theater): Advanced version of OTTs. Pay per view based.


ఇండస్ట్రీ అంతా ఆందోళనతో, కన్‌ఫ్యూజన్‌తో అన్నీ మూసేసుకొని ఒకవైపు టెన్షన్‌పడిపోతోంటే – ఒక్క ఆర్జీవీ మాత్రం దాదాపు ప్రతి రెండు వారాలకు ఒక సినిమా ఎనౌన్స్ చేస్తూ, తీస్తూ, చూపిస్తూపోయాడు!

100 రూపాయల టికెట్ పెట్టి, CLIMAX సినిమాకు కేవలం 24 గంటల్లో రెండున్నర కోట్లు సంపాదించుకున్నాడు. క్లైమాక్స్ ఇచ్చిన కిక్‌తో, వెంటనే ఒక 22 నిమిషాల NAKED సినిమా తీసి, దానికి 200 రూపాయల టికెట్ పెట్టి, ఇంకో అరకోటి సంపాదించుకున్నాడు.

చాలా పెద్ద గ్యాప్ తర్వాత ప్రొడ్యూసర్ ఎం ఎస్ రాజు DIRTY HARI అనే టైటిల్‌తో ఒక హాట్ రొమాంటిక్ డ్రామా, తనే డైరెక్ట్ చేసి, ఏటీటీలో రిలీజ్ చేశారు. టికెట్ 120 రూపాయలు. 24 గంటల్లో 91 వేలమంది చూశారు. సుమారు కోటి పది లక్షల కలెక్షన్! ఇదే ట్రాక్‌లో ఎం ఎస్ రాజు తాజాగా “6 Days, 7 Nights” అని ఇంకో సినిమా గోవాలో ఇటీవలే పూర్తిచేశారు.


“ఆర్జీవీ కాబట్టి అంత పబ్లిసిటీ వచ్చింది. వేరేవాళ్లకు అట్లా కలెక్షన్స్ రావు” అని ఒక లాజిక్. కాని, ఇప్పుడున్న సోషల్‌మీడియా పవర్ నేపథ్యంలో ఈ లాజిక్ నిలబడదు.

కలర్ ఫోటో, మెయిల్, సినిమా బండి వంటి సినిమాల్ని ఓటీటీలో ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకున్నారు. ఈ సినిమాల్లో బ్రాండెడ్ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ఎవరూ లేరు! హాట్ కంటెంట్ అసల్లేదు!!

సో, ఏటీటీల్లో కూడా మొత్తం అడల్ట్ కంటెంట్‌తో రన్‌చేస్తేనే డబ్బులొస్తాయి అనుకోవడం కూడా కరెక్టు కాదు.

బూతే చూడాలనుకొంటే ఇంటర్నెట్ నిండా ఒక మనిషి చూడ్డానికి జీవితకాలం కూడా సరిపోనంతటి పోర్న్ ఉంది. అదంతా వదులుకొని, ఇక్కడ 100 రూపాయల టికెట్ కొనుక్కొని ఈ సినిమాల్లో ఏదో రెండు హాట్ సీన్లు చూడ్డానికి ప్రేక్షకులు వస్తారనుకోవడం ఉట్టి భ్రమ.

మనం ఎంత ఎఫెక్టివ్‌గా సినిమా తీస్తాం… ఎంత ఎఫెక్టివ్‌గా ప్రమోట్ చేస్తాం అన్నదే ముఖ్యం.

ఇంతకుముందు సినిమాలు వేరు. ఇప్పుడు వేరు.

Content is the King. Money is the ultimate Goal.


ఇప్పుడు ఊహించనంత అతి తక్కువ బడ్జెట్లో కొత్తవారితో సినిమాలు నిర్మించి, OTT/ATT ల్లో రిలీజ్ చేయవచ్చు.

ATTలు ఇన్‌స్టెంట్ మనీ సంపాదించిపెడతాయి.

OTTలు అవుట్‌రైట్ సేల్ పద్ధతిలో మంచి ఆదాయాన్ని అందిస్తాయి. 

అప్పటి బిజినెస్ ట్రెండ్‌ను బట్టి థియేటర్స్‌లో కూడా రిలీజ్ చేసుకోవచ్చు. 


లేటెస్టుగా, 4 చిన్న సినిమాలను కలిపి హోల్‌సేల్‌గా ఒక ఓటీటీ ప్లాట్‌ఫామ్ 17 కోట్లకు కొనుక్కొంది. ఈ చిన్న సినిమాలు అన్నీ కూడా దాదాపు కోటి రూపాయల లోపు బడ్జెట్‌లో చేసేవే. అయితే – ఏ లెక్కన చూసినా, సుమారు కోటి రూపాయల బడ్జెట్లో తీసిన ఒక్కో సినిమాకు ఒక 6 నెల్లల్లో కనీసం 4 కోట్లు వచ్చినట్టు!

సినిమాల రిలీజ్‌కు లాక్‌డౌన్‌లు ఎలాంటి అడ్డంకి కావు అని ఇప్పటికే ఓటీటీలు నిరూపించాయి. నిజానికి ఇతర బిజినెస్‌లన్నీ ఆగిపోయినా… ఓటీటీ/ఏటీటీల్లో సినిమాల రిలీజ్‌లు, వాటి బిజినెస్ మాత్రం ఆగలేదు. మరింతగా పెరిగాయి. కొత్తగా ఇంకో అరడజన్ ఓటీటీలు మార్కెట్లోకి రాబోతున్నాయి.


సో… ఓటీటీలు, ఏటీటీలు ఇప్పుడు గోల్డ్ మైన్స్. లాక్‌డౌన్ ఉన్నా, లేకపోయినా, ఇకమీదట ఈ OTT/ATT బిజినెస్ మోడల్ అనేది ఒక ఎవర్‌గ్రీన్ సక్సెస్‌ఫుల్ బిజినెస్ మోడల్‌గా ఖచ్చితంగా కొనసాగుతుంది.

మనం చూస్తుండగానే… ఫ్యూచర్లో ప్రతి OTT కూడా కొత్తగా రిలీజయ్యే సినిమాలకు ATT అవుతుంది.

చిన్న బడ్జెట్ సినిమాల రిలీజ్ సమస్యకు కూడా ఈ ఓటీటీ, ఏటీటీలే ఇప్పుడు శాశ్వత పరిష్కారం చూపాయి. ఇకనుంచీ, 90% చిన్న బడ్జెట్ సినిమాలు ఓటీటీల్లోనే రిలీజవుతాయి.

సినిమా నిర్మాణం పట్ల, సినిమా బిజినెస్ పట్ల అత్యంత ప్యాషన్ ఉండి, ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టడాన్ని రిస్కుగా భావించే కొత్త ఇన్వెస్టర్స్, ఎంత చిన్న పెట్టుబడితోనయినా సరే ఫీల్డులోకి ప్రవేశించవచ్చు!

బిజినెస్ పాయింటాఫ్ వ్యూలోనే ఆలోచిస్తూ, సినిమా పట్ల ప్యాషన్ ఉన్న చిన్న ఇన్వెస్టర్స్ అందరికీ ఇదొక మంచి అవకాశం. OTTల ప్రారంభంలో ఉండే అత్యధిక స్థాయి బిజినెస్‌ను సులభంగా క్యాష్ చేసుకోవచ్చు.


ఈ గోల్డెన్ అపార్చునిటీని వినియోగించుకొనే ప్రయత్నంలో భాగంగా – ఒక ‘నంది అవార్డు’ రైటర్-డైరెక్టర్‌గా, కేవలం OTT/ATT లో రిలీజ్ కోసమే నేనొక సీరీస్ ఆఫ్ మైక్రో బడ్జెట్ సినిమాలను న్యూ టాలెంట్‌తో ప్లాన్ చేస్తున్నాను. తర్వాత ఇదే ఒక భారీ ప్రొడక్షన్ హౌజ్ అయినా ఆశ్చర్యం లేదు.

అంతకు ముందు థియేటర్స్‌లోనే సినిమాలు రిలీజ్ చేసిన అనుభవం ఉన్న మాకు… ఈ సినిమాల రిలీజ్, బిజినెస్ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. ఇండస్ట్రీ బిజినెస్ సర్కిల్స్ నుంచి ఈ విషయంలో, ఇప్పుడు అదనంగా మాకు మరింత సపోర్ట్ కూడా ఉంది.

ఈ నేపథ్యంలో… సినిమాలపైన ప్యాషన్, ఫిలిం ప్రొడక్షన్‌పైన ఆసక్తి ఉండి, వివిధ ఆప్షన్స్‌లో ఫండింగ్ చేయగల సోర్సెస్ కోసం నేను చూస్తున్నాను:

1. సినీఫీల్డు వైపు బాగా ఆసక్తి ఉండి, నాకు వెంటనే ఫినాన్షియల్‌గా సపోర్ట్ ఇవ్వగల ఒకే ఒక్క లైక్-మైండెడ్ ఫండింగ్ పార్ట్‌నర్: మీ బెనిఫిట్స్ మీకు చాలా ఉంటాయి. 

2. పార్ట్‌నర్‌గా ఇన్వెస్ట్ చేస్తూ, హీరోగా ఇంట్రొడ్యూస్ అవ్వాలనుకొనే కొత్త ఆర్టిస్టులు: దాదాపు 90% కొత్త హీరోలు ఇలాగే ఇంట్రొడ్యూస్ అవుతారు.

3. అతి తక్కువ పెట్టుబడితో, కొత్తగా ఫిలిం ప్రొడక్షన్‌లోకి రావాలనుకొనే ఇన్వెస్టర్లు: కో-ప్రొడ్యూసర్స్, అసోసియేట్ ప్రొడ్యూసర్స్. 

4. అత్యంత సమర్థవంతంగా, వేగంగా ఫండింగ్ ఎక్జిక్యూట్ చేయగల మీడియేటర్స్: ఇన్ని ఆప్షన్స్‌లో ఏ ఒక్క ఆప్షన్‌లో మాకు పార్టీని కనెక్ట్ చేసి, డీల్ సక్సెస్ చేసినా మీకు వెంటనే అఫీషియల్‌గా కమిషన్ వస్తుంది.

మీ ఇన్వెస్ట్‌మెంట్స్, అగ్రిమెంట్స్ అన్నీ లీగల్ అడ్వైజర్స్ సలహాతో స్పష్టంగా పేపర్ మీద రాసుకొని, సంతకాలతో నోటరైజ్ చేయటం జరుగుతుంది.

ఫిలిం ఇన్వెస్ట్‌మెంట్, ఫిలిమ్స్ పట్ల నిజంగా సీరియస్‌నెస్, ప్యాషన్ ఉన్న లైక్‌మైండెడ్ ఇన్వెస్టర్ మిత్రులు, సమర్థులైన మీడియేటర్లు… ఎవరైనా సరే, నన్ను కాంటాక్ట్ చేయొచ్చు.

కలిసి పనిచేద్దాం, కలిసి ఎదుగుదాం!

Welcome to Glamour World!
Film Director, Nandi Award Winning Writer
WhatsApp: +91 9989578125
Email: mchimmani10x@gmail.com

ABOUT MANOHAR CHIMMANI
(మీ కాంటాక్ట్స్‌లో సినీఫీల్డు వైపు ఆసక్తి ఉన్నవారికి, ఫిలిం ప్రొడక్షన్‌లో ఇన్వెస్ట్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఉన్నవారికి, ఇన్వెస్ట్ చేస్తూ హీరోగా పరిచయం కావాలని ప్రయత్నిస్తున్నవారికి ఈ లింక్ షేర్ చేయండి. థాంక్ యూ!)
***

#MakeMoviesThatMakeMoney #CoProducer #FilmProduction #FeatureFilms #InvestInFilms #BecomeProducer #BecomeCoProducer 

Monday 6 September 2021

ఒక మాయలా, ఒక మహాద్భుతంలా...

సముద్రం మీద వ్యామోహంతో ఇంతకుముందు నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు... ఎక్కువగా గోవా, పాండిచ్చేరిలకు వెళ్లేవాణ్ణి. 

గత కొన్నేళ్లుగా... ఊపిరాడనివ్వని కొన్ని ప్రొఫెషనల్ సమస్యల్లో ఇరుక్కొని, ఎంతకూ బయటపడలేక, నేను ఎక్కువగా ట్రావెల్ చెయ్యటం లేదు.

అయితే - నిజానికి సమస్య అది కాదు. 

వివిధ దశల్లో నేను ఎన్నుకున్న మనుషులు, నేను తీసుకున్న నిర్ణయాల ఫలితం ఇదీ అని... ఎవరికీ చెప్పుకోలేని ఒక రేంజ్‌లో బాగా నష్టపోయి, చివరికి నన్ను నేనే పరామర్శించుకున్నాను. "జరిగిందేదో జరిగింది... ఇప్పుడిక ఈ పాయింట్ నుంచే జీవితం"... అని నా మైండ్ సెట్ చేసుకున్నాను. ఒకప్పటి నా వీక్ మెంటాలిటీ నుంచి దాదాపు పూర్తిగా బయటపడ్డాను.  

రాగ్స్ నుంచి మళ్ళీ పనులు ప్రారంభించాను. 

కట్ చేస్తే - 

సముద్రం మీద వ్యామోహంతో, ఇంతకుముందు నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు... ఎక్కువగా గోవా, పాండిచ్చేరిలకు వెళ్లేవాణ్ణి. 

ఈ రెండూ... నాకు ఇప్పటికీ చాలా ఇష్టమైన ప్రదేశాలు. 

దేని ప్రత్యేకత దానిదే.

అయితే... గోవా, పాండిచ్చేరిల కంటే ఇప్పుడు వైజాగే నాకు మరింత బాగా అనిపిస్తోంది. 

బీచ్ రోడ్దు నుంచి భీమిలీ దాకా... కార్లో వెళ్తూ, కుడి వైపు అలా సముద్రాన్ని చూసుకొంటూ, నచ్చినచోట దిగుతూ, ఆగుతూ, రోజంతా గడిపేయొచ్చు. 

నాకెప్పుడు అవకాశం దొరికినా నేనీ పనే చేస్తాను. 

ఈ పని చేయడం కోసం, నా పనుల్లో ఎంతవరకు వీలైతే అంతవరకు వైజాగ్‌లోనే  చేసుకునేటట్టుగా ప్లాన్ చేసుకుంటున్నాను. ఈ మధ్య నా ప్రొఫెషనల్ పనులమీద కూడా, అనుకోకుండా వైజాగ్‌కే నేను ఎక్కువసార్లు వెళ్లాల్సిరావడం కూడా నాకే ఆశ్చర్యంగా ఉంది.  

లేటెస్ట్‌గా, మొన్న ఏప్రిల్‌లో, కరోనా సెకండ్ వేవ్ టైంలో కూడా వైజాగ్‌ వెళ్ళాను.   

వైజాగ్ అనగానే నాకు ముందుగా గుర్తొచ్చేది సముద్రం.  

తర్వాత - చలం, భీమ్‌లీ... ఆ తర్వాత - అరకు, స్టీల్ ప్లాంట్, పోర్ట్, గంగవరం బీచ్‌లో నేను షూట్ చేసినప్పుడు, స్టీల్ ప్లాంట్ గెస్ట్ హౌజ్‌లో, మా టీమ్‌తో నేనున్న ఆ నాలుగు రోజులూ... 

ఇంకోసారి, అదే గెస్ట్ హౌస్  లో నాకు పరిచయమై దగ్గరైన ఒక  స్టార్, ఇప్పటికీ కొనసాగుతున్న మా స్నేహం...  

ఆర్కే బీచ్, అక్కడి కాఫీడే... రిషికొండ బీచ్, అక్కడి రిసార్ట్స్... రియోబీచ్, నొవాటెల్ హోటళ్ళు... ఎయిర్‌పోర్టూ, బస్‌స్టాండూ... లలితా జ్యువెల్లరీస్ దగ్గర్లో ఫుట్‌పాత్ మీద బొకేలమ్మే చిన్న షాపూ... వైజాగ్ కి కొంచెం దూరంలో - గాజువాకలోని సినిమా హాళ్ళూ, అక్కడి గ్రీన్ యాపిల్ హోటల్... 

వైజాగ్ సిటీలోనూ, స్టీల్‌ప్లాంట్ చుట్టుపక్కలా వున్న నా ఆత్మీయ మిత్రులు, శ్రేయోభిలాషులూ... ఇంకా బోల్డన్నున్నాయి నాకు గుర్తొచ్చేవి. 

1987లో అనుకుంటాను, మా ఎమ్మే క్లాస్‌మేట్స్‌తో నేను మొట్టమొదటిసారిగా వైజాగ్ వెళ్ళాను. ఒరిస్సాలోని కోణార్క్, భువనేశ్వర్‌ల నుంచి మా తిరుగు ప్రయాణంలో వైజాగ్ వెళ్లాం. అప్పుడే మొదటిసారి... నేను అరకులోయ చూడ్డం! 

కొన్నేళ్ళ  క్రితం... నా మొదటి సినిమా షూటింగ్ కోసం కూడా, నా టీమ్‌తో ఓ నాలుగయిదు రోజులున్నాను వైజాగ్‌లో. ఒక మంచి లొకేషన్‌గా తప్ప, అప్పుడు కూడా వైజాగ్ అంటే నాకు మరీ అంత ప్రత్యేకమైన ఫీలింగేమీ  కలగలేదు. తర్వాత ఎన్నోసార్లు వైజాగ్ వెళ్లాను గానీ, ఏ ఒక్క సారి కూడా -  వైజాగ్‌ను మరీ అంత స్పెషల్‌గా నేనేం ఫీలవ్వలేదు. 

నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత, బహుశా ఓ పదేళ్ల క్రితం అనుకుంటాను... ఉన్నట్టుండి - అసలు మొత్తంగా వైజాగ్‌కే మారిపోవాలని అనుకున్నాం. అక్కడున్న తెలిసినవారితో కనెక్ట్ అయి - ఫ్లాట్ కొనుక్కుంటే ఎక్కడ బాగుంటుంది... రెంట్స్ ఎలా ఉన్నాయి... ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కి దగ్గర్లో ఉన్న మంచి రెసిడెన్షియల్ ఏరియా ఏది... ఇవన్నీ కనుక్కున్నాం. ఇదే పని మీద రెండుసార్లు నేను వైజాగ్ వెళ్ళాను కూడా. కాని, ఎందుకో ఆ ఆలోచన అప్పుడు సఫలం కాలేదు. 

మళ్ళీ - గత మూడు నాలుగేళ్ళుగానే... ఉన్నట్టుండి ఒక్కసారిగా... వైజాగ్ నాకు అత్యంత ఇష్టమైన విజిటింగ్ ప్లేస్ అయింది! 

ఈ పాండిచ్చేరి, గోవా... ఇవన్నీ వైజాగ్ తర్వాతే కదా అని ఇప్పుడనిపిస్తోంది. 

అసలు 'వైజాగ్ అందమే వేరు'... అని నేను పూర్తిగా ఫిక్స్ అయిపోయాను. 

గొప్ప గొప్ప రచయితలు, కవులకు... వారి రచనలకూ పుట్టిల్లుగా... వైజాగ్ సాహితీ సాంస్కృతిక నేపథ్యం నాకు ముందే తెలుసు. అయితే - వైజాగ్ నన్ను ఇంత బాగా ఆకర్షించడానికి ఇదొక్కటే కారణం కాదు. 

కొన్నిటికి కారణాలుండవు. లాజిక్కులుండవు. అలా జరిగిపోతాయ్. 

అంతా ఒక మాయలా, ఒక మహాద్భుతంలా అనిపిస్తుంది. 

అసలేంటీ... ఒక ప్రదేశంపైన అంత ఈజీగా చెప్పలేని ఈ ప్రేమ... కాదల్... ఇష్క్... ప్యార్... మొహబ్బత్... ల్యుబోఫ్... లవ్... ?!  

లవ్... అనగానే నాకు ముందుగా గుర్తొచ్చేది కూడా... వైజాగే. 

బాలచందర్ అపూర్వ సృష్టి 'మరోచరిత్ర'... బాలు-స్వప్న క్యారెక్టర్స్... అందమైన భీమిలి లొకేషన్ బ్యాక్ డ్రాప్... కమలహాసన్, సరిత... 'పదహారేళ్ళకూ'  అని యస్ జానకి గారు పాడిన పాట... 

ఐ థింక్... నా లవ్ కూడా అక్కడే ఉంది, వైజాగ్‌లో. 

వైజాగ్‌లో ఉన్న నా లవ్, నా ప్రేయసి, నా వాలెంటైన్ మరెవరో కాదు... సముద్రం.  

"సముద్రం ఇంకా చాలా చోట్ల ఉంది కదా?"... అంటే, ఉండొచ్చు. బట్, ఇది వేరే.  

"ఎందుకలా?"... అంటే చెప్పడానికి నాదగ్గర కారణాల్లేవు. 

ఏదో 'స్పిరిచువల్ కనెక్షన్' అనుకుంటాను... అంతే. 

“Our souls speak a language that is beyond human understanding. A connection so rare the universe won't let us part.” 
― Nikki Rowe

Sunday 5 September 2021

పాడ్‌కాస్ట్ అంత ఈజీ ఏం కాదు!

నా వీలునిబట్టి - అయితే నా మొబైల్‌లో రికార్డ్ చేస్తున్నాను. లేదంటే, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని, నా లాపీలో రికార్డ్ చేస్తున్నాను. ఇంకో 20 ఎపిసోడ్స్ అయ్యాక గాని, మైక్రోఫోన్ ఎట్సెట్రా స్టాండర్డ్ ఇక్విప్‌మెంట్ గురించి ఆలోచించొద్దని ముందే అనుకున్నాను. 

ఇంట్లో మూడు బెడ్రూములున్నా... నేను పాడ్‌కాస్ట్ రికార్డ్ చెయ్యాలనుకున్నప్పుడే నాకు ఒక్క రూం దొరకడం లేదు! హాల్లో సోఫాలో కూర్చొని రికార్డ్ చేస్తున్నప్పుడు ఎప్పుడు ఎవరొస్తారో, ఏ సౌండ్ డిస్టర్బ్ చేస్తుందో అని అదొక టెన్షన్!!  

బహుశా ఇలాంటి పరిస్థితి ఉన్నందుకేనేమో - ఎపిసోడ్ మొత్తం రియల్ టైమ్‌లో... సింగిల్ టేక్‌లో రికార్డ్ చేస్తున్నాను. ఇప్పటివరకు చేసిన 5 ఎపిసోడ్లూ ఇలాగే హడావిడిగానే ముగించేశాను. 

కట్ చేస్తే - 

నేను నా పాడ్‌కాస్ట్‌లో ఇప్పటివరకు గమనించిన చిన్న చిన్న అంశాలు (నేను సరి చేసుకోవల్సినవి, ప్లాన్ చేసుకోవల్సినవి) ఇవి:

> కంటెంట్ ఎట్టిపరిస్థితుల్లో 5 నిమిషాలు దాటకూడదు. 
> ఫ్రీగా ఓ గంటపాటు నా వాయిస్ లెవల్, మాడ్యులేషన్ బాగా స్టడీ చేసి, ఒక స్టయిల్‌కు ఫిక్స్ అయిపోవాలి.
> ఎవరేమనుకుంటారో అని ఆలోచించటం పూర్తిగా మానేసి - అనుకున్న టాపిక్ చేసేసుకొంటూ వెళ్లాలి. 
> ఈ డిసెంబర్ నాటికి కనీసం ఒక 100 ఎపిసోడ్స్ చెయ్యాలి. పాడ్‌కాస్ట్ పాపులర్ కావడం అనేది 100% ఆర్గానిక్‌గానే జరగాలి. 

పాడ్‌కాస్ట్ చేయటం అంత ఈజీ ఏం కాదు. అలాగని, మరీ అంత కష్టం కూడా కాదు. 

ManuTime.
A Podcast by Manohar Chimmani. 
Link: https://anchor.fm/manohar-chimmani3 

సినిమా ఒక యుధ్ధభూమి!

సినిమా ఫీల్డు అంటే చాలామందికి చిన్న చూపు ఉంటుంది. 

ఎగతాళి చేస్తారు, సెటైర్లు వేస్తారు, తిడతారు, నానా చెత్త మాట్లాడతారు. 

అయితే - వీళ్ళంతా అర్థం చేసుకోలేని విషయం ఒకటుంది... ప్రపంచంలోని ఏ ఫీల్డు అయినా సినిమా ఫీల్డు లాంటిదే.

ఇక్కడుండే అన్‌సర్టేనిటీ అన్ని ఫీల్డుల్లో ఉంటుంది. బయటి ఫీల్డుల్లో జరగని తప్పులు, రాజకీయాలేవీ ఇక్కడ స్పెషల్ గా జరగవు, స్పెషల్ గా ఉండవు. 

ఒప్పుకోడానికి ఇష్టం ఉండదు అంతే. 

అందరూ ఈ ఫీల్డు మీద పడి ఏడవటానికి ఒకే ఒక్క కారణం ఏంటంటే – ఇక్కడ గ్లామర్ ఉంది. సెలబ్రిటీ స్టేటస్ ఉంది. ఇక్కడ చీమ చిటుక్కుమన్నా బ్రేకింగ్ న్యూస్ అవుద్ది. 

అదొక్కటే. అంతకంటే ఏం లేదు.

కట్ చేస్తే –


ప్రతిరోజూ వందలాదిమంది ఈ ఫీల్డులో ప్రవేశించాలని, తెరమీద కనిపించాలని, తెరవెనుక తమ టాలెంట్ చూపించాలని, సెలబ్రిటీలు కావాలని... కలలు కంటూ ఎక్కడెక్కడినుంచో ఇక్కడికి వస్తుంటారు.

అన్ని ఫీల్డుల్లాగే – ఈ ఫీల్డులో కూడా అతి తక్కువమందిని మాత్రమే ఆ అదృష్టం వరిస్తుంది. దాని వెనుక ఎన్నో నిద్రలేని రాత్రులుంటాయి. ఆకలి కేకలుంటాయి. అవమానాల గాయాలుంటాయి. 

అయినా సరే – అన్నీ దిగమింగుకుంటూ రేపటి మీద ఆశతో నవ్వుతూ, తుళ్ళుతూ బ్రతుకుతుంటారు. తమ మీద తామే జోకులు వేసుకొంటూ ఎప్పటికప్పుడు ఎనర్జైజ్ అవుతుంటారు.

వీళ్లల్లో కొందరు మాత్రం రేపటి స్టార్లు, స్టార్ డైరెక్టర్లు, టెక్నీషియన్లూ అవుతారు. 

మిగిలినవాళ్ళు... ఎప్పటికయినా ఏదో ఒకటి అవుతాంలే  అన్న ఆశతో – యూసుఫ్ గూడా బస్తీలో, కృష్ణానగర్ గల్లీల్లో, గణపతి కాంప్లెక్స్ దగ్గరా, శ్రీనగర్ కాలనీ- ఫిలింనగర్-జుబ్లీ హిల్స్ రోడ్లల్లో... ఎవర్నీ పట్టించుకోకుండా... కుంభమేళాలో నాగసాధువుల్లా... వాళ్ల లోకంలో వాళ్ళు తిరుగుతూ ఉంటారు.


ఈ పాడ్ కాస్ట్ సినీఫీల్డుకు సంపూర్ణంగా అనుకూలం.  Always for the field...

దీన్లోని ఎపిసోడ్లు ఎవర్నీ ఉద్దేశించి చేస్తున్నవి కాదు. అలాగని పూర్తిగా ఫిక్షన్ కూడా కాదు. మన గురించి మనం చెప్పుకోగల ధైర్యం, మనమీద మనమే జోకులేసుకోగల దమ్ము మనకుందని... లైటర్ వీన్ లో  సరదాగా గుర్తుకుతెచ్చుకోవడం. షేర్ చేసుకోవడం.  

ముఖ్యంగా... కొత్తగా ఫీల్డులోకి వచ్చేవాళ్ళకు తెలియాల్సిన బేసిక్ విషయాలు చెప్పడం. పరోక్షంగా వారి కెరీర్ ప్లానింగ్ కు ఉపయోగపడటం. 

ఇంకా... వార్తలు, విశేషాలు, పాజిటివ్ టిడ్‌బిట్స్... ఇదీ అదీ అని ఏం లేదు. సినిమాకు సంబంధించిన ప్రతిఒక్కటీ ఈ పాడ్ కాస్ట్ ఫ్రేం లోకి వస్తుంది.  

After all, Cinema is a battle ground... 
^^^^

#FilmNagarDiaries #TeluguPodcast #Episode1 #Transcript