Monday 29 May 2023

'డిటాచ్‌డ్ అటాచ్‌మెంట్'తో ఏదీ అసాధ్యం కాదు!


దేశంలోనే ఒక టాప్ రేంజ్ హీరోగా తన సినిమాలతో దేశాన్ని ఉర్రూతలూగించిన ది గ్రేట్ అమితాబ్ బచ్చన్ నివసించే ఇంటిని బ్యాంక్ వాళ్లు వేలానికి పెట్టే పరిస్థితి వచ్చింది ఒక దశలో.

అప్పటికే సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చి, బాగా సంపాదించి, ఇంకా అదే రేంజ్‌లో సినిమాలు చేస్తున్న సమయంలోనే దర్శకుడు పూరి జగన్నాథ్ సుమారు వంద కోట్లు పోగొట్టుకొని ఆర్థికంగా ఒక్కసారిగా మైనస్‌లోకి వెళ్లిపోయాడు. మొన్నీమధ్యకూడా "ఇస్మార్ట్ శంకర్" కు ముందు, పూరీ దగ్గర యాభై వేలుకూడా లేని పరిస్థితి గురించి ఆమధ్య ఆయన పుట్టినరోజునాడు ఒక కార్యక్రమంలో ఛార్మి ఎంతో ఎమోషనల్‌గా చెప్పింది. ఇప్పుడు "లైగర్" ఎఫెక్టు కూడా చిన్నదేం కాదు. బట్, హి విల్ కమ్ బ్యాక్.    

భాయ్‌జాన్ బజ్‌రంగ్, బాహుబలి వంటి భారీ హిట్స్‌తో చరిత్ర సృష్టించిన రచయిత విజయేంద్రప్రసాద్, అప్పట్లో చదివించే స్థోమతలేక తన కొడుకు రాజమౌళి చదువుని ఇంటర్‌మీడియట్‌తోనే ఆపేశారని ఎక్కడో ఇంటర్వ్యూలో చూశాను.

టాలీవుడ్‌కి ఒక ట్రెండ్ సెట్టర్ సినిమా ఇచ్చి చరిత్ర సృష్టించిన తర్వాత కూడా, ఒక మూడక్షరాల మేవరిక్ డైరెక్టర్, ఆయన టీమ్... తమ సొంత బేనర్లో మరో సినిమా చేస్తున్న సమయంలో... ఒకరోజు లంచ్‌కి డబ్బుల్లేక బండిమీద రేగుపళ్లు కొనుక్కుని తిన్నారని ఆయన దగ్గర కొన్ని సినిమాలకు ఎడిటర్‌గా పనిచేసిన మిత్రుడు ఒకసారి నాతో చెప్పాడు.    

ఇలాంటి ఉదాహరణలు ఎవరిని కదిలించినా వందల్లో ఉంటాయి.

సినిమా కష్టాలకు సక్సెస్, ఫెయిల్యూర్స్ అనేవాటితో అస్సలు సంబంధం ఉండదు అని చెప్పడమే ఇక్కడ నా పాయింట్. 

మనం తీసుకొనే నిర్ణయాలు మాత్రమే మనల్ని ఎక్కడో ఇరికిస్తాయి. బాధపెడతాయి.  

కట్ చేస్తే - 

సినిమాల్లోకి ఎంట్రీనే ఉంటుంది. ఎక్జిట్ మన చేతుల్లో ఉండదు!

సినిమా ఎవ్వర్నీ వదలదు, దీన్లోకి ఎంటరయినవాడు సినిమానీ వదల్లేడు.

దటీజ్ సినిమా. 

ఇక్కడ ఎంట్రీకైనా, ఎగ్జిట్‌కైనా ఒక సరైన గైడ్ లేదా మెంటర్ తప్పనిసరి...  

పైనరాసిన మొత్తానికి ఒక పాజిటివ్ ఎపిలోగ్ ఏంటంటే...

సినిమాను ఒక పక్కా క్రియేటివ్ బిజినెస్‌గా, ఒక ప్రొఫెషన్‌గా మాత్రమే తీసుకొని, ఆ పరిధిలోనే కొన్ని ప్రాథమిక జాగ్రత్తలు, ఖచ్చితమైన నియమాలు పాటిస్తే మాత్రం ఏ కష్టాలూ ఉండవు. ఫేమ్, ఆనందాలకు అంతుండదు. 

బాగా సంపాదించొచ్చు కూడా! 

స్పిరిచువల్‌గా చెప్పాలంటే... ఒక రకమైన 'డిటాచ్‌డ్ అటాచ్‌మెంట్' అన్నమాట!

Are you ready?

ది మైండ్‌సెట్!


రెండు మూడు నెలల క్రితం పెట్టిన పోస్టు ఇది. కొంచెం ఎడిట్స్‌తో రీపోస్ట్ చేస్తున్నా. మైండ్‌సెట్ కోణంలో తప్ప ఈ పోస్టును మరోవిధంగా నెగెటివ్‌గా భావించవద్దని మిత్రులకు మనవి.

కట్ చేస్తే -

తెలుగు సినిమా ఇండస్ట్రీలో - మొదటి నుంచీ - ఒక ప్రాంతం వాళ్లే ఎక్కువగా ఉండటానికి, ఎక్కువగా సక్సెస్ అవడానికి, బాగా నిలదొక్కుకోడానికి కారణం... వాళ్లకు ఆ ప్రాంతం వాళ్ళిచ్చే సపోర్ట్!  

ఒక్క డబ్బు పరంగా అనే కాదు. సోషల్‌గా కూడా సినిమా ఫీల్డుకు వాళ్ళిచ్చే రెస్పెక్ట్ వేరే. 

"మావాడు రామానాయుడు స్టూడియోలో బాయ్‌గా పనిచేస్తున్నాడు" అని కాలర్ ఎగరేసి చెప్పుకుంటారు అక్కడ. 

డిగ్నిటీ ఆఫ్ లేబర్! అసలు తప్పు లేదు. 

"మావాడు డైరెక్టర్" అని చెప్పుకోడానిక్కూడా ఫీలవుతారు ఇక్కడ. 

స్వయంగా ఒక డైరెక్టరే "నేను ఫిలిం డైరెక్టర్‌ను" అని చెప్పుకోడానికి ఇబ్బంది పడుతుండటం నేనిక్కడ చూశాను. దానికి బదులు, "ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను" అని అబద్ధం చెప్పటం కూడా చూశాను.   

ఇక ఫినాన్షియల్ మ్యాటర్స్‌లో హెల్ప్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. కనీసం మాట సాయానికి కూడా మైలు దూరంలో ఉంటారు... వణికిపోతారు. 

అక్కడ - ఒక కాల్ చేస్తే చాలు. "మన వాడు" అని ముందు డబ్బు అందుతుంది. డీల్‌లో కొందరు అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. కాని, పని మాత్రం సమయానికి అవుతుంది. ఖచ్చితంగా చేస్తారు.  

బిజినెస్ ఈజ్ బిజినెస్.  

ఇక్కడ కథ వేరు. చాలా చాలా అరుదుగా ఎవరో ఒకరిద్దరు మహానుభావులు తప్ప... అసలలాంటి చాన్స్ ఇవ్వరు. చెయ్యాల్సిన హెల్ప్ చెయ్యరు. మీద నుంచి క్లాసులు, ఉచిత సలహాలు. 

పని కాదు. ప్రచారం మాత్రం ఫుల్! 

ఒక్క దెబ్బకి చులకనైపోతాం. అప్పటిదాకా "మీరు", "సార్" అన్నవాడు సింపుల్‌గా ఏకవచనంలోకి దిగుతాడు. 

కనీస స్థాయి కమ్యూనికేషన్ ఉండదు. కర్టెసీ ఉండదు.  

దీనికి ఆయా ప్రాంతాల సాంఘిక, ఆర్థిక నేపథ్యం ఎట్సెట్రా కారణాలు అని చెప్తారు కొందరు మేధావులు. 

కరెక్టే కావచ్చు. కాని, శతాబ్దాలైనా అంతేనా? 

మైండ్‌సెట్స్ మారవా?  

ఇలాంటి నేపథ్యం నుంచి - సినిమా కష్టాలన్నీ ఎదుర్కొని - ఇక్కడ ఎవరైనా ఫీల్డులో నెగ్గుకొచ్చి పైకొచ్చారంటే కారణం స్పష్టం. 

అన్‌కండిషనల్‌గా అక్కడి లాబీలకు పూర్తిగా కనెక్ట్ అయిపోవడం! 

వివిధ యాంగిల్స్‌లో మనచుట్టూ జరుగుతున్న ఎన్నో విషయాల్ని గమనిస్తే అదే కరెక్టు. నా వ్యక్తిగత అనుభవాల నేపథ్యంలో ఆలోచించినప్పుడు కూడా అనిపిస్తుంది... అది మాత్రమే కరెక్టు అని.  

Saturday 27 May 2023

లండన్‌లో బీఆరెస్ సోషల్ మీడియా సోల్జర్!


భువనగిరి నవీన్ కుమార్... 

ఈ మిత్రుని గురించి నేను కొత్తగా మళ్ళీ పరిచయం చేయనక్కర్లేదు. 

మన ఖమ్మం నుంచి లండన్ వెళ్ళి అక్కడ ఉద్యోగం చేస్తున్నాడు. బీవీఆర్ టెక్ పేరుతో సొంతంగా కంపెనీ స్థాపించి, ఇండిపెండెంట్ కన్‌సల్టెన్సీ కూడా చేస్తున్నాడు.

ఇవన్నీ చేస్తూ - ప్రస్తుతం NRI BRS, లండన్ ఇంచార్జ్‌గా కూడా యాక్టివ్‌గా పనిచేస్తున్నాడు. 

బి ఆర్ యస్ పార్టీకున్న వేల మంది వాలంటరీ సోషల్ మీడియా వారియర్స్‌లో ఒకరు. 

నిగర్వి... ఎలాంటి ఈగోల్లేవు. 

లండన్‌లో మంచి పొజిషన్‌లో ఎక్కడో గ్లోబ్‌లో పైనున్నా, పూర్తిగా నేలమీదుండే మనిషి.   

కట్ చేస్తే -

మన తెలంగాణ మొత్తం జనాభా సుమారుగా ఒక 4 కోట్లు అనుకుంటే - అందులో కనీసం ఒక 20 శాతం మందికి ఆన్‌లైన్‌లో నిరంతరం టచ్‌లో ఉంటాడు మన నవీన్. 

అంత సీనుందా అనకండి... చాలా ఉంది. 

ఇవి నేను చెప్తున్న లెక్కలు కావు. మార్క్ జుకెర్‌బర్గ్ "ఫేస్‌బుక్" చెప్తున్న లెక్కలు!   

నవీన్ సగటున రోజుకు సుమారు 300+ పోస్టులు ఒక్క ఫేస్‌బుక్‌లోనే పెడుతాడంటే నమ్మగలరా? కాని నిజం. 


ఈ పోస్టులన్నీ వందకి వంద శాతం -
కేవలం తెలంగాణ గురించే... కేసీఅర్ గురించే... కేసీఆర్ సాధిస్తున్న అద్భుత విజయాల గురించే. కేసీఆర్ ప్రభుత్వంలోని మంత్రుల నుంచి, కింది స్థాయి వరకు వివిధ స్థాయిల్లోని అధికారులు, ఉద్యోగులు చేస్తున్న పనుల గురించే. 

కేటీఆర్ గురించే... పట్టణాభివృద్ధి, ఇండస్ట్రీస్, ఐటి శాఖల మంత్రిగా కేటీఆర్ సాధించి చూపిస్తున్న విజయాల గురించే. 

బీఆరెస్ గురించే... ఆ పార్టీ సృష్టిస్తున్న సంచలనాల గురించే. సృష్టించబోయే ప్రకంపనాల గురించే.

ఇవన్నీ పాజిటివ్ పోస్టులే కావడం ఇంకో ప్రత్యేకత. 

తెలుగు, ఇంగ్లిష్ న్యూస్‌పేపర్స్ లోంచి, అధికారిక సైట్స్ లోంచి, వివిధ మంత్రిత్వ శాఖల, విభాగాల, కార్పొరేషన్ల అధికారిక సోషల్ మీడియా ఎకౌంట్స్ నుంచి ఉపయుక్తమైన సమాచారం, క్లిప్పింగ్స్ ఎప్పటికప్పుడు తీసుకొంటూ ఈ పని చేస్తాడు నవీన్. 


హాన్స్‌లో, లండన్‌లో ఉంటున్న నవీన్... ఉదయం 7 గంటలకు లేచాడంటే, అర్థరాత్రి దాటి 1 గంట కొట్టేవరకు మేల్కొని పనిచేస్తాడు. అంటే - సుమారు 18 గంటలు. 

ఈ 18 గంటల్లో ఒక 8 గంటలు తన ఉద్యోగానికి, కన్సల్టెన్సీకి కెటాయించినా... మిగిలేది ఇంకో 10 గంటలే. ఈ 10 గంటల్లో ఒక్క ఫేస్‌బుక్‌లోనే 300 పోస్టులు అంటే, ఒక్కో పోస్టు పోస్ట్ చెయాటానికి సగటున 2 నిమిషాలన్నమాట! 

సంవత్సరం క్రిందటే ట్విట్టర్‌లో లక్ష ట్వీట్స్ పైగా చేసి రికార్డ్ క్రియే చేశాడు నవీన్. ఇప్పటికి అవి కూడా లక్షన్నరకు చేరుకునుంటాయి. 

ఇన్‌స్టాగ్రామ్‌ను కూడా వదల్లేదు నవీన్. 

సోషల్ మీడియాలో నేను ఎప్పుడు ఏ ప్లాట్‌ఫామ్ ఓపెన్ చేసినా... నాకు ఫస్ట్ కనిపించే పోస్టు నవీన్‌దే ఉంటుంది. ఇది నేనొక్కన్ని చెప్పే మాట కాదు. నాతో చాలామంది చెప్పారు.

మా ఆఫీసులో స్టాఫ్ ఒకరు తనకు ఏదైనా "తెలగాణ రియల్ ఎస్టేట్"కు సంబంధించిన కంటెంట్ కావాలంటే వెంటనే భువనగిరి నవీన్ ఫేస్‌బుక్ టైమ్‌లైన్‌కు వెళ్తాడు! 


తాజాగా ఒక 24 గంటల క్రితం ఫేస్‌బుక్ ప్రొఫెషనల్ డాష్‌బోర్డ్ నుంచి తీసుకొన్న లెక్కల ప్రకారం:

> గత 28 రోజుల్లో నవీన్ పోస్టుల రీచ్: 10.9 మిలియన్స్! 
అంటే - కోటి తొమ్మిది లక్షల మందికి నవీన్ పోస్టులు రీచ్ అయ్యాయి.

> నవీన్ పోస్టులతో ఎంగేజ్ అయినవారి సంఖ్య: 1 మిలియన్!
అంటే - 10 లక్షల మంది నవీన్ పోస్టులను చదవటం, లైకులు కొట్టడం, కామెంట్ చెయ్యటం, షేర్ చెయ్యటం చేశారు!   

దీపికా పడుకొనే, ఆలియాభట్, మహేశ్, అల్లు అర్జున్ లాంటి సెలబ్రిటీలకు మిలియన్స్‌లో ఫాలోవర్స్ ఉంటారు కాబట్టి ఇలాంటి అంకెను కొందరు సెలబ్రిటీలు ఈజీగా రీచ్ కావచ్చు. 

కాని, కేవలం ఒక 11,200 మంది ఫాలోవర్స్‌తో ఇన్ని మిలియన్స్‌లో తన పాజిటివ్ పొలిటికల్ & డెవలప్‌మెంటల్ పోస్టుల ద్వారా ప్రజలకు రీచ్ కావడం అనేది అంత చిన్న విషయం కాదు.    

ఇదంతా ఒక్క ఫేస్‌బుక్ లోనే. 

అది కూడా - గత అక్టోబర్‌లో ప్రొఫెషనల్ మోడ్‌కు మారినప్పటి నుంచి... ఎలాంటి బూస్ట్ లేకుండా!  

వందకి వంద శాతం పూర్తిగా ఆర్గానిక్ రీచ్!!   

ఇంకా ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ కూడా ఉన్నాయన్నది గమనించాలి.  


నిస్వార్థంగా, ఒక రోబోలా నవీన్ ఇంత కృషి చేయడం అన్నది అంత సులభమైన విషయం కాదు. అందరూ చేయగలిగేది కూడా కాదు.   

కొన్నేళ్ళ క్రితం మేమిద్దరం ఆన్‌లైన్‌లో కనెక్ట్ అయ్యింది కూడా ఈ విషయం నేపథ్యంగానే. 

కట్ చేస్తే -

"ఎందుకిదంతా?" అని భువనగిరి నవీన్ కుమార్‌ను ప్రత్యేకంగా అడగాల్సిన అవసరం లేదు.  

తను నమ్మిన ఆశయం కోసం.
తన రాష్ట్రం తెలంగాణ కోసం.
ఇప్పుడు తన దేశం కోసం. 
తనకిష్టమైన నాయకులు -
కేసీఆర్ కోసం, 
కేటీఆర్ కోసం... 

కొన్ని నెలల్లోనే జరగనున్న ఎలక్షన్స్‌లో - మరొకసారి అద్భుత విజయం సాధించి - ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు హాట్రిక్ సాధించడం కోసం కూడా. 


ఈ లక్ష్యంతోనే రెట్టించిన ఉత్సాహంతో ముందుకు దూసుకెళ్తున్న మన భువనగిరి నవీన్‌కు ఈ సందర్భంగా నా హార్దిక అభినందనలు. 

నవీన్ నా మిత్రుడు కావడం వ్యక్తిగతంగా నాకు గర్వకారణం. 

Best wishes, Naveen bhai! You simply rock...   

***

నవీన్ గురించి నా బ్లాగ్‌లో ఇంతకు ముందు నేను రాసిన పోస్టులు) 👇🏻 
నిరంతరం తెలంగాణం! | ఏ దేశమేగినా, ఎందు కాలిడినా  | ఒక కమిట్‌మెంట్... 100,900 ట్వీట్స్! 

Thursday 25 May 2023

కొంచెం బిజినెస్ మాట్లాడుకుందాం...


కశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ సినిమాలు సృష్టించిన సంచలనాలు, సాధించిన కమర్షియల్ విజయాలు, కలెక్షన్స్ మనకు తెలుసు. 

కట్ చేస్తే -

ఈ వరుసలో - నాదగ్గర ఇంకో సంచలనాత్మక XYZ Files -లేదా- ABC Story కోసం మంచి కాన్సెప్ట్ ఉంది. (అసలు టైటిల్ వేరే, అది రిజిస్ట్రేషన్‌లో ఉంది.) 


కనీసం ఒక 100 కోట్ల కలెక్షన్ పక్కా. బడ్జెట్ తక్కువ. కాకపోతే, పై రెండు సినిమాల దిశ వేరు, నా కాన్సెప్ట్ దిశ వేరు. 

ఆసక్తి ఉన్న గట్సీ ప్రొడ్యూసర్ లేదా ఫండర్ కోసం చూస్తున్నాను. 

ప్రొడ్యూసర్‌కు కావల్సినంత పొలిటికల్ గుర్తింపు, మైలేజీ బాగా ఉంటుంది. జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో టీమ్ మొత్తానికి ఫేమ్, మీడియా ప్రమోషన్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఫిలిం ఫెస్టివల్స్, అవార్డులు సరే సరి.  

ఎలెక్షన్స్‌కు ముందు రిలీజ్‌కు కాపీ రెడీగా ఉంటుండి...  

Wednesday 24 May 2023

ఒక ఐడియా...


"ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది" అన్నది కొంచెం స్టయిలిష్‌గా చెప్పేమాట. "ఒక ఐడియా ఏకంగా కొంపలు ముంచుతుంది" అన్నది ముఖం మీద గుద్దినట్టు చెప్పేమాట.

మొదటిది పాజిటివ్ భావన. రెండోది పక్కా నెగెటివ్ ఎఫెక్టు. 

రెండూ అనుభవపూర్వకంగా తెలిసేవే.

ఈ రెండు రకాల ఐడియాల ప్రభావాన్ని వివిధ దశల్లో వ్యక్తిగతంగా చవిచూసినవాణ్ణి కాబట్టి నాలో ఒకరకమైన స్థితప్రజ్ఞత క్రమంగా అలవడింది.

థాంక్స్ టూ మై ఐడియాస్. గుడ్ ఆర్ బ్యాడ్. బెటర్ ఆర్ వరస్ట్...

కట్ చేస్తే - 

ఇప్పుడొక లేటెస్ట్ ఐడియా.

ప్రస్తుతం నేను చేస్తున్న ట్రెండీ యూత్ ఫిలిం Yo! గురించి కాదు. Yo! ప్రిప్రొడక్షన్లో ఉంది. దీని గురించి నేను ఇప్పుడే ఏం చెప్పలేను, చెప్పకూడదు. 

సోషల్ మీడియా విమర్శకులతో సహా, రివ్యూయర్స్ అందరికీ పెద్ద పండగ అని మాత్రం చెప్పగలను. ఉతికి ఆరేస్తారు నన్ను. ఆ ఎఫెక్టు కోసమే ఈ Yo! సినిమా.  

అయితే - ఈ బ్లాగ్ పోస్టులో నేను రాస్తున్న ఐడియా Yo! గురించి కాదు.

ఇంకో సినిమా ప్రాజెక్టు.

అది ప్రారంభిస్తేనే చాలు... సెన్సేషన్.

వివరాలు తొందర్లోనే. 

Tuesday 23 May 2023

రీల్ మేకర్స్‌కు ఫిలిం చాన్స్!


సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సింగ్, రీల్ మేకింగ్‌లో ఇప్పుడు చాలామంది అమ్మాయిలు, అబ్బాయిలకు మంచి గ్రిప్ ఉంది. వేలల్లో లైకులు, షేర్లు, కామెంట్స్ వస్తుంటాయి. ఫాలోయర్స్ కూడా లక్షల్లో ఉంటున్నారు. 

ఎవరేమనుకుంటారో అన్న రొటీన్ ఆలోచన లేకుండా ... అనుకున్నది చేసెయ్యడం వల్లనే వీరికి ఇంత రెస్పాన్స్ ఉంటుంది. 

అనవసరపు భయం లేకపోవడం!   

ఏ టాపిక్ మీద పోస్ట్ చేస్తున్నారు, వాళ్ళ నిష్ ఏంటి... ఇదంతా సెకండరీ. 

కట్ చేస్తే - 

రీల్ మేకింగ్‌లో, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సింగ్‌లో ఈ నైపుణ్యం, ఈ మైండ్‌సెట్ ఉండి - సినిమాల్లో ప్రవేశం కోసం చూస్తున్న 18-29 లోపు వయసున్న యూత్‌కు (ఎన్నిక చేసిన కొందరికి) నేనిప్పుడు చేస్తున్న ఫీచర్ ఫిలిమ్ టీమ్‌లో అవకాశమిస్తున్నాను.   

అసిస్టెంట్ డైరెక్టర్స్‌గా, ఆర్టిస్టులుగా. 

వీడియో ఎడిటింగ్, డిజైనింగ్ లాంటివి కూడా తెలిసుంటే ఇంకా బెటర్. 

నిజంగా ఆసక్తి ఉన్నవాళ్ళు ఈరోజే మీ వివరాలు వాట్సాప్ చేయండి. వాకిన్ ఇంటర్వ్యూకి/ఆడిషన్‌కి మా ఆఫీస్ నుంచి ఈరోజే మీకు కాల్ వస్తుంది.  

బెస్ట్ విషెస్...     

Sunday 14 May 2023

Make Films That Make Money!


ఇండస్ట్రీలో యాక్టివ్‌గా ఉన్న ప్రొడ్యూసర్స్ దగ్గర ఎప్పుడూ కనీసం ఒక డజన్ మంది రైటర్స్-డైరెక్టర్స్ క్యూలో ఉంటారు. మన టర్న్ రావడానికి టైమ్ పడుతుంది. రాకపోవచ్చు కూడా.

కెరీర్‌లో గ్యాప్ అనేది అలాంటి గ్యాప్‌ని క్రియేట్ చేస్తుంది. ఫెయిల్యూర్ కాదు. 

తాజాగా ఒక చిన్న హిట్ ఇచ్చినా, కాస్త 'బజ్‌'లో ఉన్నా మళ్ళీ పరిస్థితి వెంటనే మారిపోతుంది. 

అది వేరే విషయం. 

సో, ఇలాంటి నేపథ్యం ఇండస్ట్రీలో ఎప్పుడూ ఉండేదే కాబట్టి, పైన చెప్పిన సర్కిల్‌కు బయట ఎవరైనా సినిమా చేయాలనుకుంటే - కొత్తగా ఎవరి ఇన్వెస్టర్స్‌ను వాళ్లే వెతుక్కోవాలి. కొత్తగా ఎవరి ప్రొడ్యూసర్స్‌ను వాళ్లే  క్రియేట్ చేసుకోవాలి.  


కట్ చేస్తే -

మారిన కార్పొరేట్ ఫిలిం బిజినెస్ కండిషన్స్‌లో, బడ్జెట్ అనేది సమస్య కాదు... 

చిన్న బడ్జెట్‌లో అయినా - మంచి కంటెంట్‌తో, బిజినెస్ అవగాహనతో సినిమా తీస్తే అసలు నష్టం ఉండదు. థియేటర్ బిజినెస్, ఓటీటె రైట్స్, డబ్బింగ్ రైట్స్, రీమేక్ రైట్స్ వంటి ఎన్నో ఆదాయ మార్గాల నుంచి భారీ ప్రాఫిట్స్ ఉంటాయి. ఓవర్‌నైట్‌లో కావల్సినంత ప్రమోషన్. సెలబ్రిటీలతో మీటింగ్స్, పార్టీలు... నిజంగా అది వేరే లోకం. 

ఈవైపు ఇన్వెస్ట్ చెయ్యాలన్న ప్యాషన్ మీకున్నట్టయితే మాత్రం -  ఇప్పుడు నేను చేస్తున్న 2 మైక్రో బడ్జెట్ సినిమాల్లో అసోసియేట్ ప్రొడ్యూసర్స్‌గా ఎంత చిన్న మొత్తంలో అయినా సరే మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. 

కలిసి పనిచేద్దాం, కలిసి ఎదుగుదాం. 

Whatsapp/Call: 9989578125 

Friday 12 May 2023

ఎంత చిన్న ఇన్వెస్ట్‌మెంట్‌తో అయినా సరే...


రియల్ ఎస్టేట్ మార్కెట్ డల్‌గా ఉంది. ఎలక్షన్స్ అయిపోయి, అంతా సర్దుకొని, అన్ని అడ్జస్ట్‌మెంట్స్ అయ్యేదాకా ఇదిలాగే ఉంటుంది. సో, ఇదే కరెక్ట్ టైమ్... మంచి బార్గెయిన్‌కు అవకాశం ఉంటుంది. కొనుక్కోవచ్చు. 

కట్ చేస్తే -

మీకు ఆవైపు ఇంట్రెస్ట్ లేదనుకోండి... ఇంకో మంచి ఆప్షన్ ఉంది. 

ఎంత చిన్న ఇన్వెస్ట్‌మెంట్‌తో అయినా సరే - ఇప్పుడు నేను చేస్తున్న మైక్రో బడ్జెట్ కమర్షియల్ ఫీచర్ ఫిలిం ప్రొడక్షన్‌లో మీరు ఇన్వెస్ట్ చెయ్యొచ్చు. మంచి లాభాలుంటాయి. ఓవర్‌నైట్‌లో పిచ్చి ప్రమోషన్. సెలబ్స్‌తో మీటింగ్స్, పార్టీలు. అది వేరే లోకం. 

నిజంగా ఆసక్తి ఉన్నవాళ్ళు నాకు వాట్సాప్ చేయండి.  

ఈ విషయంలో ఇన్వెస్టర్స్‌ను, ఫండర్స్‌ను కనెక్ట్ చేసి డీల్ క్లోజ్ చేయగల ఫ్రెండ్స్/మీడియేటర్స్ కూడా నాకు వాట్సాప్ చేయొచ్చు.

Come, let's talk business!  

నీలో సత్తా ఉంటే నువ్వేదైనా అవుతావ్!


"ఇక్కడ ఎవ్వడు ఎవ్వనికి నేర్పడు. ఒళ్ళు దగ్గరపెట్టుకొని పని చెయ్యి. చేస్తూ నేర్చుకో. నీలో సత్తా ఉంటే నువ్వేదైనా అవుతావ్, నిన్నెవ్వడు ఆపలేడు."

ఈ డైలాగ్ ఏ సినిమాలో?
ఎవరన్నారు?
కొంచెమైనా గుర్తుకొస్తోందా? 

కట్ చేస్తే -

జీవితంలో మంచి అవకాశం అనేది ఒక్కసారే వస్తుంది. నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. అప్పుడుగాని నువ్వు ఆ అవకాశాన్ని ఉపయోగించుకోలేదంటే అంతే. 

మినిమమ్ ఒక పదేండ్లు బొక్క! అన్నేండ్లు నీకయ్యే లక్షల ఖర్చు ఇంకా పెద్ద బొక్క!!

Take right decision.  

Thursday 11 May 2023

నా జీవితంలో అతి ముఖ్యమైన ఆ 365 రోజులు!


సినిమా ఇండస్ట్రీలో జయాపజయాల్ని శాసించేది - అందరూ మామూలుగా అనుకున్నట్టు - కథ, దర్శకత్వం, నిర్మాత, బడ్జెట్లు, ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, మేకింగ్, ప్రమోషన్... ఇలాంటివేవీ కావు. 

కలిసి పనిచెయ్యడానికి - మనం ఎన్నుకొనే వ్యక్తులు, మనం అసోసియేట్ అయ్యే వ్యక్తులే - మన జయాపజయాలకు మొట్టమొదటి కారణం అవుతారు. 

ఇది నా రిపీటెడ్ అనుభవం. 

కట్ చేస్తే - 

హీరోహీరోయిన్స్ గాని, డైరెక్టర్స్ గాని వాళ్ళదగ్గరికి ఎవరు సినిమా తీస్తామని వస్తే వాళ్ళతో చెయ్యరు. ఎవరినిపడితే వాళ్ళను కోర్ టీమ్‌లోకి తీసుకోరు.    

ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఇలాంటివాళ్ళే సక్సెస్ సాధిస్తారు.  

తొందరపాటు నిర్ణయాలెప్పుడూ ఫెయిల్యూర్ దిశగా తీసుకెళ్తాయి. కొత్త సమస్యల్ని క్రియేట్ చేస్తాయి. ఆ సమస్యలు ఎలా ఉంటాయంటే... కొన్నికొన్నిసార్లు ఒక దశాబ్దకాలం జీవితాన్ని తినేస్తాయి. 

ఇలాంటివన్నీ అనుభవం మీదే తెలుస్తాయి. 

సీనియర్లు ఈ విషయం చెప్తే మనం వినం. పట్టించుకోం అసలు. 

యస్ యస్ రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో ఇలాంటి ఒక విషయం చెప్పినప్పుడు నేను నవ్వుకున్నాను... ఈయనేదో చెప్తాడ్లే అని. 

"నా దగ్గరికి వెయ్యికోట్లు పెడతాను అని ఒక నిర్మాత వచ్చాడని నేను అతన్ని తీసుకోలేను. అతనిలో నేను డబ్బుకన్నా ముందు ఇంక చాలా విషయాలు చూస్తాను. సినిమా మీద నాకున్నంత ప్యాషన్ ఉండాలి. అతని మైండ్‌సెట్ నాకు కనెక్ట్ కావాలి. యాటిట్యూడ్ నచ్చాలి. సరిపోదు అనిపిస్తే వెంటనే సారీ చెప్పేస్తాను". 

ఇంక చాలా చెప్పాడు రాజమౌళి.

కట్ చేస్తే - 

అప్పుడప్పుడూ ఫీల్డులోకి తొంగిచూసిన నా అతి చిన్న సినీ జర్నీలో - కనీసం ఒక నాలుగుసార్లు తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నాను. ఇబ్బందుల్లో ఇరుక్కొన్నాను.

సరిగ్గా 365 రోజుల క్రితం - నేను బాగా  ఆలోచించి, పూర్తి క్లారిటీతో - ఒకటికి పదిసార్లు అన్నీ కన్‌ఫర్మ్ చేసుకున్న తర్వాతే ప్రారంభించిన నా తాజా ప్రొఫెషనల్ జర్నీ కూడా నా జీవితంలో ఎప్పుడూ ఊహించని తీవ్రమైన ఇబ్బందుల్లో పడేసింది.  

ఇక్కడ నేను ఎవ్వర్నీ తప్పుపట్టలేను. బిజినెస్‌లో ప్లాన్స్ ఫెయిల్ కావడం సహజం. కాని, కమ్యూనికేషన్ ఫెయిల్ కాకూడదు. 

అయినా సరే, నిర్ణయం నాది కాబట్టి బాధ్యత నేనే తీసుకున్నాను. 

కట్ చేస్తే -  

నా జీవితం మొత్తంలోనే నన్ను తీవ్రమైన ఇబ్బందులకు గురిచేసిన ఈ తాజా అనుభవానికి నేను నిజంగా థాంక్స్ చెప్పక తప్పదు. 

పీకల్లోతు నెగెటివ్ వాతావరణంలో కూడా పూర్తి పాజిటివ్‌గా ఉన్నాను, కూల్‌గా ఉన్నాను.    

అలా ఉంటూనే - 

బయటివారి నిర్ణయాలతో ఎలాంటి సంబంధం లేని ఒక మంచి నిర్ణయం తీసుకున్నాను ఈసారి. 

ఈ నిర్ణయానికున్న బ్యూటీ ఏంటంటే... మార్చుకోలేని ఒక డెడ్ లైన్ కూడా పెట్టుకున్నాను దీనికి.

ఇది వందకి వంద శాతం నా నిర్ణయం. 

ఎవరి హామీలు లేవు. ఎలాంటి భ్రమలు లేవు. ఇందులో ఎలాంటి నెగెటివిటీకి అవకాశం లేదు. మొత్తం నేనే కాబట్టి ఎవరికీ ఎలాంటి అనుమానాల్లేవ్... ఎవరిమీదో వేసి తప్పించుకోవడాల్లేవ్...   

So... No Regrets. No Negativity. Celebrate Life, Everyday! 

Any Guess...


నాకు టెన్షన్ ఎక్కువైనప్పుడు ఏదో ఒక కొత్త ఐడియా వస్తుంది. 

తర్వాత అది పరమ చెత్త ఐడియా అయినా ఆశ్చర్యం లేదు. 

అది వేరే విషయం. 

కాని, ఇలాంటి అత్యంత స్ట్రెస్‌ఫుల్ కండిషన్స్‌లో వచ్చిన ఐడియా ఏదైనా వెంటనే ఆచరణలో పెట్టేస్తాను. ఇలా చేయడం వల్ల నాకు ఎంతో కొంత స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది. 

సో, ఇప్పటి నా మల్టి టాస్కుల అష్టావధానం నేపథ్యంలో ఇప్పుడే మళ్ళీ ఓ కొత్త ఆలోచన వచ్చింది. 

వెంటనే ఈ ఆలోచనను అమల్లో పెట్టబోతున్నాను. 

బహుశా రేపటినుంచే.

కట్ చేస్తే -

ఈ ప్రపంచంలో
అత్యంత అసాధ్యమైన పని ఒక్కటే.
మనం ఎన్నటికీ ప్రారంభించని పని! 

Monday 1 May 2023

ఒక సాఫ్ట్‌వేర్ సోషల్ యాక్టివిస్ట్ జీవనశైలి!


మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద నేను రాసిన "కేసీఆర్ - ది ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్" పుస్తకం సృష్టించిన సంచలనాలు చాలా ఉన్నాయి. 

నాకు ముందే ఇచ్చిన మాట ప్రకారం, గౌరవ మంత్రి కేటీఆర్ గారు నన్ను ప్రగతి భవన్ పిలిపించుకొని నా పుస్తకాన్ని ఆవిష్కరించడం... అక్కడున్న మంత్రిగారిని, ఎం పి గారిని, ఇతర వీఐపీలను పరిచయం చేయడం... సుమారు 40 నిమిషాలకు పైగా కేటీఆర్ గారు నాకోసం వెచ్చించడం మొట్టమొదటి సంచలనం.  

ఒక్క అంటార్కిటికా తప్ప - గ్లోబ్ మీదున్న మిగిలిన 6 ఖండాలకూ నా పుస్తకం రీచ్ కావడం రెండో సంచలనం. 

"ఈమధ్య కాలంలో ఇంత సేల్స్ ఏ పుస్తకానికి లేదు. ఏం మ్యాజిక్ చేశారండీ?" అని నవోదయ సాంబశివరావు గారు నాకు కాల్ చేసి చెప్పడం... ఇలా చాలానే ఉన్నాయి. 

కట్ చేస్తే - 

ఒకరోజు పొద్దున్నే నన్ను కలవడానికి ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ వచ్చాడు. పర్సనల్‌గా నేను కొని దగ్గరపెట్టుకొన్న కాంప్లిమెంటరీ కాపీల్లో ఒకటి ఇచ్చాను. ఫోటో తీసుకున్నాము. 

"మీ పర్మిషన్‌తో, నేనీ పుస్తకాన్ని నా డబ్బులతో కొని, కొందరికి నా తరపున పర్సనల్‌గా ఇవ్వాలనుకొంటున్నాను..." అని జేబులోంచి ఒక రిసీట్ తీసి చూపించాడా యువకుడు.  

నవోదయ బుక్ హౌజ్ నుంచి బల్క్ ఆర్డర్ రిసీట్ అది! 

ఇది నేను ఊహించని కొత్త అనుభవం... 


అంతకు ముందు లండన్‌లో ఉన్న మిత్రుడు, ఎన్నారై బీఆరెస్ లండన్ ఇన్‌చార్జి భువనగిరి నవీన్ సుమారు 200 పుస్తకాలు స్వయంగా తనే యూకే నుంచి ఆర్డర్ పెట్టి కొని... పొస్ట్ ద్వారా, కొరియర్ ద్వారా ఇక్కడ లోకల్‌గా అందరికి అందేలా ఏర్పాటు చేశాడు. అదొక సంచలనం.

ఆ సంచలనం తర్వాత - లేటెస్టుగా మళ్ళీ ఇదొక ఊహించని విషయం. 

ఇతనేం డైరెక్ట్ పాలిటిక్స్‌లో లేడు. పార్టీ నాయకుడు కాదు. 

ఎం సి ఏ, ఎం టెక్ రెండు పీజీల్లో టాపర్. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. 

"తెలంగాణ అన్నా, కేసీఆర్ అన్నా నాకు అంతులేని అభిమానం. కేసీఆర్ గారి గురించి ఈ పుస్తకంలో మీరు ఎంతో బాగా రాసిన వాస్తవాలు, మీ భావనలు అన్నీ చాలామందికి చేర్చాలన్నదే నా కోరిక!" 

"అందుకే నావంతు బాధ్యతగా - ఉడతా భక్తిగా ఈ మాత్రం చేయాలనుకుంటున్నాను" అని తను చెప్పాలనుకున్న రెండు విషయాల్ని చాలా స్పష్టంగా చెప్పిన ఆ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పేరు... 


హుజూర్‌నగర్ ముద్దుబిడ్డ. 

పృథ్వీకి పెళ్ళయ్యింది. భార్య అమూల్య గృహిణి. ఇద్దరు పిల్లలు... నిత్య మేథస్వి, నిహాల్ మణిరామ్.    


కట్ చేస్తే -

ఇప్పటికే హుజూర్‌నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి గారికి, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారికి, ఇంకొందరు వివిధ స్థాయిల్లోని పార్టీ నాయకులకు నా పుస్తకం "కేసీఆర్ - ది ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్"ను అందించాడు పృథ్వి. 

మొన్ననే మా స్వర్ణసుధ పబ్లికేషన్స్ నుంచి నేరుగా 100 కాపీలు కొనుక్కెళ్ళాడు. 

ఇప్పుడు - మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, వివిధ స్థాయిల్లోని బీఆరెస్ నాయకులకు, కార్యకర్తలకు కూడా ఈ పుస్తకాన్ని అందించే పనిలో బిజీగా ఉన్నాడు పృథ్వి కుమార్. 

కట్ చేస్తే -

పృథ్వి ఒక సోషల్ యాక్టివిస్ట్ కూడా. 

బీటెక్ చదివి ఉద్యోగం సంపాదించుకొనే అవేర్‌నెస్ లేని గ్రామీణ ప్రాంతాల్లోని యువకులకు ఇప్పటికే 530 మందికి వ్యక్తిగతంగా తనొక్కడే శిక్షణ ఇచ్చాడు. 


హుజూర్‌నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి గారి ఆధ్వర్యంలో, అంకిరెడ్డి ఫౌండేషన్ ద్వారా పృథ్వి ఈ యాక్టివిటీ నిర్వహిస్తున్నాడు. 

పృథ్వి శిక్షణ ఇచ్చినవారిలో 150 మందికి పైగా యువకులు టీసీయస్, క్యాప్ జెమిని, టెక్ మహీంద్ర, స్పైస్ మనీ వంటి ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించి విజయవంతంగా పనిచేస్తున్నారు. 

తన కృషితో ఇలా ఒక్కొక్కరికి ఉద్యోగం ఇప్పించడం ద్వారా ఒక్కో కుటుంబం సంతోషంగా ఉంటుందన్న పృథ్వి ఆలోచనకు నిజంగా హాట్సాఫ్ చెప్పకుండా ఎలా ఉండగలం?    

పృథ్వి కుమార్ దగ్గర శిక్షణ పొందినవారిలో 10 - 11 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం సాధించినవారు కూడా ఉండటం నిజంగా గొప్ప విషయం. 

ఇదొక్కటే కాకుండా - పేద విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వడం, చలివేంద్రాలు పెట్టడం, పరీక్షలకు వెళ్తున్న విద్యార్థులకు చిన్న చిన్న సౌకర్యాలు కల్పించడం వంటి సాంఘిక సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నాడు పృథ్వి.  

ఎక్కువశాతం సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ల జీవనశైలికి భిన్నంగా - పృథ్వీ కుమార్‌లోని ఈ సోషల్ యాక్టివిటీకి నేపథ్యం అతను ఒక రైతుబిడ్డ కావడం, కష్టాలంటే ఏంటో బాగా తెలిసినవాడు కావడం అని నేను గట్టిగా నమ్ముతున్నాను. 

I wish him success in all his future endeavors...