Sunday 30 April 2023

సత్తా ఉన్నవాడికి ఇదొక మెకన్నాస్ గోల్డ్!


సినిమా పుట్టినప్పటినుంచి ఇప్పటివరకు... ఎన్నడూ లేనన్ని అవకాశాలు ఇప్పుడు కొత్తవారికి ఉన్నాయి. 

తను ఎన్నుకున్న విభాగంలో ఏ కొంచెం స్పార్క్ ఉన్నా, సిన్సియర్‌గా... 'కొంచెం స్మార్ట్‌'గా... ప్రయత్నిస్తే - ప్రతి ఒక్కరికీ తప్పకుండా ఆ 'ఒక్క చాన్స్' దొరుకుతుంది. 

ఆ తర్వాత దాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటారు... ఆ మొదటి చాన్స్‌తో మరిన్ని అవకాశాలు ఎలా సంపాదించుకొంటారు, ఆ తర్వాత కూడా ఫీల్డులో ఎలా కొనసాగుతారు... ఇవన్నీ ఒక్కొక్కరి పర్సనల్ టాలెంట్స్ మీద ఆధారపడి ఉంటుంది. 

నెట్‌వర్కింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, పాజిటివ్ యాటిట్యూడ్, ఏది ఏమైనా సరే అనుకున్న లక్ష్యం నుంచి ఫోకస్ మరల్చకపోవడం... వంటి కొన్ని బేసిక్ లక్షణాలు అందరికీ ఒకలా ఉండవు. 

నిజానికి, 99 శాతం మందికి ఈ లక్షణాలు అసలుండవు. 

కాని, ఏ ఫీల్డులో అయినా పైకిరావడానికి ఇవే చాలా ముఖ్యం. 

సినీ ఫీల్డులో మరీ ముఖ్యం.   

ఈ లక్షణాలన్నీ ఎంతో కొంత ఉండే ఆ ఒక్క శాతం మంది మాత్రమే విన్నర్స్ అవుతారు. వీరిలో కొంతమంది... కనీసం ఆ ట్రాక్‌లోనైనా ఉంటారు. 

ఆ ట్రాక్ పేరు... 1% క్లబ్. 

ఈ 1% క్లబ్‌లో చేరగల సత్తా ఉన్నవారే అనుకున్నది సాధించగలుగుతారు. ఆ ప్రయత్నంలో పడిపోయినా మళ్ళీ లేస్తారు. లక్ష్యం సాధిస్తారు. గమ్యం చేరుకుంటారు. 

ఒక్క సినిమా ఫీల్డు అనే కాదు... ఏ ఫీల్డులో అయినా సరే, విన్నర్స్ ఎప్పుడూ ఆ 1% క్లబ్ లోంచే వస్తారు... 

కట్ చేస్తే - 

థాంక్స్ టు కరోనా... ఇప్పుడు సినిమాల్లో అవకాశాలు చాలా పెరిగాయి. ఒక్క కొత్తవారికనే కాదు. ప్రతి ఒక్కరికీ అవకాశాలు పెరిగాయి. 

ఉదా: ఓటీటీలు, వెబ్ సీరీస్‌లు. 

రెమ్యూనరేషన్స్ పరంగా కూడా... ఒకప్పుడు వేలల్లో ఉన్నవి ఇప్పుడు లక్షల్లోకి చేరుకున్నాయి.. లక్షల్లో ఉండేవి ఇప్పుడు కోట్లల్లోకి ఎగిశాయి. 

ఇంతకు ముందు సినిమాలు వేరు, ఇప్పుడు సినిమాలు వేరు.

Content is king. Money is the ultimate goal. 


ఓవర్‌నైట్‌లో సెలబ్రిటీ స్టేటస్ తెచ్చిపెట్టగల ఒక పాష్ ప్రొఫెషన్. 

సరిగ్గా ఉపయోగించుకోగలిగిన అతి కొద్దిమందికి... ఒక ఎలైట్ వరల్డ్.  

ఓటీటీల్లో రెగ్యులర్‌గా సినిమాలు, వెబ్ సీరీస్‌లు చూడ్డం అనేది కూడా ఇప్పుడు దాదాపు ప్రతి ఇంటా ఒక మామూలు రొటీన్ అయిపోయిన నేపథ్యంలో చాలా విషయాలు అందరికీ తెలుస్తున్నాయి.  

థాంక్స్ టు సోషల్ మీడియా... ఫిలిం ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, ఇతర సెలెబ్స్ అంతా మరింత దగ్గరైపోయారు. 

చాలా విషయాల్లో అందరూ రియలైజ్ అవుతున్నారు. చాలా విషయాలు అందరికీ  అవగాహనకొస్తున్నాయి. 

'థంబ్‌నెయిల్ బ్యాచ్' ల ఫేక్ కంటెంట్ ఏంటి, రియాలిటీస్ ఏంటి అన్నది చాలామంది తెలుసుకోగలుగుతున్నారు. 

ఈ నేపథ్యంలో... సినిమాల పట్ల, సినీఫీల్డు పట్ల చాలామందిలో ఒకప్పటి దృక్పథాలు చాలా చాలా మారిపోయాయి.    

సినిమాల్లోకి ప్రవేశించడానికి గాని, పంపించడానికి గాని ఇంతకుముందులా ఇప్పుడెవ్వరూ పెద్దగా సంకోచించట్లేదు. 

డబ్బు, క్రేజ్, పాపులారిటీ ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు?

నిజానికి సినిమా ఫీల్డు ఎప్పుడూ మంచిదే. సాధించగలిగేవాడికి ఇదొక మెకన్నాస్ గోల్డ్. 

వాడుకున్నోనికి వాడుకున్నంత! 

దాని స్ట్రక్చర్ తెలుసుకొని, దానిలో ఇమడగలగటం ముఖ్యం. 

ఫీల్డులోకి సరైన ఎంట్రీ ముఖ్యం. నా "ఇన్-ఫిలిం కోచింగ్" కాన్‌సెప్ట్ ద్వారా ఆ ఎంట్రీ నేనిస్తున్నాను.    

"Be bold.
Either you will find a way,
or you will create a way.
But you will not create an excuse!"

Saturday 29 April 2023

కొన్ని యుటోపియాలు నిజమవుతాయ్!


"అన్నా! మన కేసీఆర్ సార్ ప్రధానమంత్రి అవుతారు. ప్రధానమంత్రి హోదాలో ఢిల్లీ నుంచి ఆయన ప్రెస్‌మీట్‌లు, స్పీచ్‌లు మనం చూస్తాం!"

గత 65 ఏళ్ళుగా మన తెలంగాణ నోచుకోని అభివృద్ధిని ఎలాగైతే ఇప్పుడు మన పెద్ద సార్ చేసి చూపించారో, అదే విధంగా గత 75 ఏళ్ళుగా మన దేశంలో జరగని అభివృద్ధిని కూడా ఆయన సాధించి చూపిస్తారు." 

"భారత ప్రధాని హోదాలో ఐక్యరాజ్యసమితి జెనరల్ అసెంబ్లీలో మన కేసీఆర్ గారు స్పీచ్ ఇచ్చే రోజుని మనం చూస్తాం. మన సార్ స్పీచ్ తర్వాత ప్రపంచ దేశాధినేతల స్టాండింగ్ ఒవేషన్ కూడా చూసి, మనిద్దరం పార్టీ చేసుకుందాం!"  

నిన్న సాయంత్రం నేనూ... నా ఆత్మీయ మిత్రుడు, ముఖ్యమంత్రి గారి పి ఆర్ వో మిట్టా సైదిరెడ్డి అన్న కూర్చొని మాట్లాడుకొంటున్నప్పుడు - అన్న నోటి నుంచి వచ్చిన మాటలివి. 

న్యూయార్క్‌లో ఉన్న ఐక్యరాజ్యసమితి హెడ్‌క్వార్టర్స్ బిల్డింగును చూసి, "ఇన్నేండ్లయినా గిదే బిల్డింగా... నేను కట్టిస్తా చూడండి" అని ఐక్యరాజ్యసమితికి ఓ కొత్త బిల్డింగ్ కట్టిచ్చినా కట్టిస్తారు సార్!" అని చెప్పుకుంటూ ఆసక్తికరంగా ఇంకెన్నెన్నో చర్చించుకున్నాం. 


వినడానికి ఇదంతా ఒక యుటోపియాలా అనిపించొచ్చు. 

కాని... కొన్ని యుటోపియాలు నిజమవుతాయి. 

కట్ చేస్తే - 

ప్రత్యర్థులకు అస్సలు మింగుడుపడని మొట్టమొదటి యుటోపియా... తెలంగాణ రాష్ట్ర సాధన. 

ఏమయింది? 

ఒక తిరుగులేని ఉద్యమనాయకునిగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి చూపెట్టారు కేసీఆర్. 

అదే విధంగా -
24 గంటల కరెంటు.
కాళేశ్వరం. 
మిషన్ భగీరథ.
మిషన్ కాకతీయ.
ఒక్కరోజు ఇంటింటి సర్వే.
రైతు బంధు.
రైతు భీమా.
కళ్యాణలక్ష్మి.
కంటి వెలుగు.
టియస్ ఐ-పాస్.
షి టీమ్స్.
కమాండ్ & కంట్రోల్ సెంటర్ 
125 అడుగుల ఎత్తైన అంబేడ్కర్ విగ్రహం.

ఇప్పుడు -
ది వైట్ హౌజ్ ఆఫ్ తెలంగాణ... 

ఇట్లా కనీసం ఇంకో వందకు పైగా అతిముఖ్యమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను తెలంగాణలో పరిచయం చేసి, సాధించి చూపెట్టారు కేసీఆర్. 

అంతకుముందు ఇవన్నీ కూడా మనకు యుటోపియాలే!  

కాని, చేసి చూపించారు కదా?


సో, చెప్పొచ్చేదేమిటంటే... కొన్ని యుటోపియాలు నిజమవుతాయి. 

అసాధ్యం అనుకున్న ఎన్నిటినో సుసాధ్యం చేయగల ఆ శక్తి, యుక్తి, ఏకాగ్రత కేసీఆర్ లాంటి అరుదైన నాయకులకే సాధ్యం. 

"తెలంగాణ శ్వేత సౌధం"... డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ సమీకృత సచివాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు ప్రారంభిస్తున్న సందర్భంగా... కేసీఆర్ గారికి, వారి మంత్రివర్గానికి, ప్రభుత్వంలోని వివిధ స్థాయిల అధికారులకు, సిబ్బందికి, యావత్ తెలంగాణ ప్రజలకు హార్దిక శుభాభినందనలు...  

Monday 24 April 2023

సినిమా అనేది ఒక కౌన్సెలరో, లైఫ్ కోచో, ప్రవచనకారో కాదు!


ఎంతసేపూ పక్క భాషల సినిమాలను పొగుడుతూ, తెలుగు సినిమాలను తిడుతూ కొంతమంది మేధావులు, రచయితలు, సోషల్ మీడియా రచయితలు అతి చెత్త పెస్సిమిస్టిక్ రాతలు రాస్తుంటారు. 

రీమేక్స్ కూడా - పింక్ ను పింక్‌లా తీయలేదని, లూసిఫర్‌ను లూసిఫర్‌లా తీయలేదని, నటసామ్రాట్‌లా రంగమార్తాండ తీయలేదనీ... చాలా ఆవేశం, బాధ కక్కేస్తుంటారు.  

తెలుగు సినిమాల్లో అది ఉండదనీ, ఇది ఉండదనీ నానా రకాల ఆక్రోశం వెళ్లగక్కుతుంటారు. 

సినిమా ప్రధానంగా ఒక ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా. వినోదాన్నందించే సాధనం. 

ఫిలిం మేకర్స్ ఎలా తీయాలనుకుంటారో అలా తీస్తారు సినిమాని. అది ప్రొడ్యూసర్-డైరెక్టర్స్ ఇష్టం. ఎలా తీస్తే డబ్బులొస్తాయని వాళ్ళు భావిస్తారో అలా తీస్తారు. వాళ్ల అంచనాలు ఫెయిలైతే పోయేది కూడా వాళ్ళ డబ్బే, వాళ్ళ పేరే. 

వాళ్ళ డబ్బు, వాళ్ళ పేరుని రిస్క్ చేస్తూ వాళ్లకిష్టమైనట్టు సినిమాలు తీసుకుంటారు. చూసేవాళ్ళు చూస్తారు, చూడని వాళ్ళు చూడరు. 

ప్రేక్షకులకు, సోకాల్డ్ మేధావులకు, సెల్ఫ్ డిక్లేర్డ్ రివ్యూయర్స్‌కు, సోషల్ మీడియా రైటర్స్‌కు ఆప్షన్ ఉంది... చూడొద్దు అనుకుంటే చూడకుండా ఉండటానికి.  

కట్ చేస్తే - 

సినిమా తీయడం అంటే ఫేస్‌బుక్‌లో పోస్టుపెట్టినంత ఈజీ కాదు.

ఇలా సోషల్ మీడియాలో "తెలుగు సినిమాలు బాగుండవు" అని వాపోయే మేధావులు, రచయితలు, రివ్యూయర్స్ సంఖ్య చాలా చాలా తక్కువ. చెప్పాలంటే ఒక వంద రెండొందలకు మించదు. 

ఇలాంటి వారి ద్వారా తెగే టికెట్స్ సంఖ్య కూడా తక్కువే. అసలా సంఖ్య లెక్కలోకే రాదు.    

ఏ తెలుగు సినిమానయితే వీరంతా తక్కువచేసి లాజిక్ లేని రాతలు రాస్తున్నారో... ఇప్పుడు బాలీవుడ్‌తో పాటు  దేశంలోని అన్ని భాషల ఫిలిం ఇండస్ట్రీలు, హాలీవుడ్‌లోని ప్రముఖ ప్రొడక్షన్ కంపెనీలు, ఫిలిం మేకర్స్ కూడా ఆ తెలుగు సినిమా వైపే చూస్తున్నాయన్న నిజం వీరికి తెలుసా? 

వేగంగా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం నేపథ్యంలో - ప్రపంచంలోని ఏ మూలలో ఉన్నవారైనా ఎక్కడి సినిమానైనా చూడొచ్చు. భాష ఇప్పుడసలు సమస్యే కాదు. ఎవరికి నచ్చిన సినిమా వారు చూడొచ్చు. 

సినిమా ఇలా తీయాలి, ఇలా ఉండాలి అని చెప్పేవాళ్లు రంగంలోకి దూకవచ్చు. సినిమాలు తీయొచ్చు. టెక్నాలజీ ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉంది. పెద్ద కష్టం కాదు. 

కట్ చేస్తే - 

సినిమా అనేది ఒక కౌన్సెలరో, లైఫ్ కోచో, ప్రవచనకారో కాదు... చక్కబెట్టడానికి, సందేశాలివ్వడానికి. 

అరుదుగా కొన్ని అలా ఫ్లాష్‌లా వస్తుంటాయి. ఎంజాయ్ చెయ్యాలి. అన్ని సినిమాలూ అలాగే, ఆ ధోరణిలోనే ఉండాలనుకోవడంలో అర్థం లేదు.  

At the end of the day, filmmaking is a business. Big business. 

Sunday 23 April 2023

Action Time!


దేశంలోని చాలా రాష్ట్రాల్లో - ఎవ్వరైనా సరే - నయాపైసంత పనిచేస్తే 1000 రూపాయల పని చేసినట్టు ప్రచారం చేసుకుంటున్నారు. ఎక్కడెక్కడి దొంగ ఫోటోలో తెచ్చిపెట్టి "మేం చేశాం!" అని నిస్సిగ్గుగా చెప్పుకొంటున్నారు. 

ఇక్కడ తెలంగాణలో ఎన్నో రంగాల్లో ఎన్నెన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, జాతీయ-అంతర్జాతీయ స్థాయిల్లో మెచ్చుకోబడి గుర్తింపు పొందుతున్న అనేక ప్రాజెక్టులు, పనులు పూర్తిచేసి కూడా - వాటన్నిటి గురించి 10% కూడా పబ్లిసిటీ లేదు. 

పబ్లిసిటీ అంటే కేవలం మన సోషల్ మీడియా సర్కిల్స్‌లో మనకి మనం పోస్టులు పెట్టుకోవడం ఒక్కటే కాదు. రాష్ట్రమంతా రీచ్ కావాలి. దేశంలోని ప్రతి ప్రాంతంలోకి చొచ్చుకుపోవాలి.

ఇది చాలా సీరియస్‌గా తీసుకొని ఆలోచించాల్సిన అంశం. వెంటనే ఈ దిశలో 10X స్పీడ్‌లో చర్యలు తీసుకోవడం చాలా అవసరం. 

ఇంకో ఆరు నెలల్లోనే ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో - ఈ 2 విషయాల గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సూచనలతో, వ్యూహాలతో... మంత్రి, బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఎంత త్వరగా స్పందించి తగిన చర్యలు తీసుకుంటే అంత మంచిది.  

"The best politics is right action." 
- Mahatma Gandhi        

Friday 21 April 2023

రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే!


యూక్రేన్‌లో ఉన్న నా స్నేహితురాలు, ఆర్టిస్టు, ఇంటర్నేషనల్ మోడల్ కాత్యా ఐవజోవాను రష్యా-యూక్రేనియన్ దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైన కొత్తలో క్యాజువల్‌గా ఒక ప్రశ్న అడిగాను...

"మీ రెండు దేశాల మధ్య ఈ గొడవ ఎన్ని రోజులుండొచ్చు?" అని.  

"ఇది యుద్ధం... యుద్ధం ముగియడానికి సంవత్సరాలు కూడా పడుతుంది. చెప్పలేం!" అందామె. 

కాత్యా మాటల్ని నేను అంత సీరియస్‌గా తీసుకోలేదప్పుడు. కాని, చూస్తుంటే ఈ రెండు దేశాల మధ్య యుద్ధం మొదలై అప్పుడే సంవత్సరం దాటింది!

ఇప్పుడు నా స్నేహితురాలు కాత్యా నేరుగా యుద్ధ క్షేత్రంలో పాల్గొంటోంది. యుద్ధ సమయంలో పైనుంచి రష్యన్ బాంబింగ్స్ జరుగుతుండగానే - వందల కిలోమీటర్లు తానే కారు డ్రైవ్ చేస్తూ - తన కుటుంబాన్ని యూక్రేన్ సరిహద్దులు దాటించి, యూరోప్‌లో దించి, వెనక్కి వచ్చింది. 

యుద్ధంలో ఇప్పుడెక్కడుందో తను... 

ఏమాత్రం వీలున్నా ఈరోజు నాకు కనెక్ట్ అవుతుంది కాత్యా. 

ఏప్రిల్ 22... ఈరోజు కాత్యా పుట్టినరోజు. 

కట్ చేస్తే - 

యూక్రేనియన్ ప్రెసిడెంట్ వొలదిమిర్ జెలెన్స్‌కీ ప్రెసిడెంట్ కాకముందు... నటుడు, డాన్సర్, కమెడియన్, స్క్రీన్ రైటర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ కూడా!  

ఆ తర్వాతే పొలిటీషియన్. 


కనీసం ఒక డజన్ రొమాంటిక్ సినిమాల్లో, సీరియల్స్‌లో నటించాడు జెలెన్స్‌కీ.  

"లవ్ ఇన్ ద బిగ్ సిటీ", "లవ్ ఇన్ వేగాస్", "8 ఫస్ట్ డేట్స్" మొదలైనవి జెలెన్స్‌కీ హీరోగా నటించిన యూక్రేన్ సినిమాలు. 

"డాన్సింగ్ విత్ ద స్టార్స్" అనే టీవీ డాన్స్ షోలో డాన్సర్‌గా పోటీలో పాల్గొన్నాడు. "సర్వెంట్ ఆఫ్ ద పీపుల్" అనే టీవీ కామెడీ షోలో కమెడియన్‌గా కూడా నటించాడు జెలెన్స్‌కీ. 

తనకున్న ఈ నేపథ్యంతోనే యూక్రేన్‌లో ఒక పాపులర్ ఫిల్మ్ ఆర్టిస్ట్‌గా పాలిటిక్స్‌లోకి ప్రవేశించాడు జెలెన్స్‌కీ. 

అన్నట్టు... జెలెన్స్‌కీ భార్య ఒలెనా కియాష్కో ఆర్కిటెక్ట్, స్క్రీన్ రైటర్ కూడా!   


ఇంకో గొప్ప విషయమేంటంటే - తను నటించిన కామెడీ సీరియల్ "సర్వెంట్ ఆఫ్ ద పీపుల్" పేరుతోనే 2018 లో పార్టీ స్థాపించి, కేవలం 3 నుంచి 4 నెలల్లోనే... యస్... కేవలం 3 నుంచి 4 నెలల్లోనే - అప్పటివరకు ఉన్న సీనియర్ పొలిటీషియన్ ప్రెసిడెంట్ పిత్రో పరషెంకోను చిత్తుగా ఓడించి యూక్రేన్‌కు 6 వ ప్రెసిడెంట్ అయ్యాడు జెలెన్స్‌కీ! 

తర్వాతంతా చరిత్రే. 


కట్ చేస్తే - 

పాలిటిక్స్‌లో, "తక్కువ సమయం ఉంది .. ఇది సాధ్యం కాదు" అనుకోడానికి వీళ్లేదని చెప్పే ఒక  గొప్ప ఉదాహరణ ఇది.  

ఇలాంటి ఉదాహరణలు మన దేశంలో కూడా ఉన్నాయి. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రాల్లో కూడా... 

సో - అసెంబ్లీ ఎన్నికలుగాని, పార్లమెంట్ ఎన్నికలు గాని - వీటిలో ఏదైనా సరే, సాధించాలనుకునేవారికి సమయం లేదనుకోవద్దు.

ఇప్పుడు చాలా సమయం ఉంది. 

Tuesday 18 April 2023

జ్ఞానోదయమ్ - The Conclusion


మన జీవితంలో జరిగే కొన్ని హార్డ్‌కోర్ వాస్తవాల గురించి ఎంత తక్కువ అనుకుంటే అంత మంచిది. 

కట్ చేస్తే -

ఆకాలంలో బుధ్ధుడికి బోధివృక్షం కింద కూర్చున్నప్పుడు 49 రోజుల్లో జ్ఞానోదయం అయిందని చదివాను.

మహానుభావుడు... 49 రోజుల్లోనే సర్వం ఒక అవగాహనకొచ్చింది ఆయనకు. 

ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత సింపుల్‌గా అసలు కాని పని. 

"ఇంక ఇంతకు మించి మనం నేర్చుకొనేది ఏముంటుంది" అనుకుంటాం. కాని, దాని జేజమ్మలాంటి సిచువేషన్ కూడా వెంటనే వస్తుంది.

"ఈ వ్యక్తిని మించి మనల్ని బాధపెట్టేవారు ఇంక లైఫ్‌లో రారు... వచ్చే పరిస్థితికి మనం ఇంక చోటిచ్చే  ప్రసక్తే లేదు" అనుకొంటాం. కాని, తప్పక వస్తారు. మనం ఎదుర్కొంటాం.  

ఇవన్నీ అనుభవం మీదే తెలుస్తాయి.

విచిత్రంగా - కొంతమందికి మాత్రం ఈ జ్ఞానోదయం బై డిఫాల్ట్ అయి ఉంటుందనుకొంటాను. అదృష్టవంతులు. వీరి దరిదాపుల్లోకి ఏ నాన్సెన్స్ వ్యక్తులూ, పరిస్థితులూ రాలేవు. అన్నిటికంటే ముఖ్యంగా వీళ్ళు అంత గుడ్డిగా దేన్నీ నమ్మరు. క్షణాల్లో విషయాన్ని తేల్చేస్తారు. 

ఇలాంటివాళ్లంటే నాకు చాలా గౌరవం. 

సమయం విలువ వీళ్ళకు తెలిసినంత బాగా 99 శాతం మందికి తెలియదు. 

కొంచెం లిబరల్‌గా, మాస్‌గా చెప్పాలంటే - ఇదే లోకజ్ఞానం. లేదా లౌక్యం. ఇదొక్కటి ఉంటే చాలు. ఏ కష్టం మన జోలికి రాదు. 

కాని, అంత ఈజీగా ఇది అందరికీ అబ్బదు. 

కట్ చేస్తే -  

ఎప్పటికప్పుడు ఏదో ఒక వ్యక్తినో, ఒక పరిస్థితినో ఎదుర్కొన్నాక "అబ్బ... ఈ దెబ్బతో జ్ఞానోదయం అయ్యింది" అనుకొంటాము. 

కాని అది నిజం కాదు. 

మనకు తెలీకుండానే మళ్ళీ మళ్ళీ ఇంకో జ్ఞానోదయం కోసం ఎదురుచూస్తుంటాము. 

అందుకే - ఇవ్వాటితో అసలు జ్ఞానానికే గుడ్‌బై చెప్పేశా! 

ఇంక గొడవే లేదు... 🙂

Monday 17 April 2023

సో... కలిసి పనిచేద్దాం, కలిసి ఎదుగుదాం!


ఇండస్ట్రీలో యాక్టివ్‌గా ఉన్న ప్రొడ్యూసర్స్ దగ్గర ఎప్పుడూ కనీసం ఒక డజన్ మంది రైటర్స్-డైరెక్టర్స్ క్యూలో ఉంటారు. మన టర్న్ రావడానికి టైమ్ పడుతుంది. రాకపోవచ్చు కూడా.

గ్యాప్ అనేది అలాంటి గ్యాప్‌ని క్రియేట్ చేస్తుంది. ఫెయిల్యూర్ కాదు. 

మళ్ళీ తాజాగా ఒక హిట్ ఇచ్చినా, 'బజ్‌'లో ఉన్నా పరిస్థితి వేరు అనుకోండి. 

అది వేరే విషయం. 

సో, ఇలాంటి నేపథ్యం ఇండస్ట్రీలో ఎప్పుడూ ఉండేదే కాబట్టి - నాలాంటి చాలామందికి సినిమా చేయాలనుకుంటే 'ఇండిపెండెంట్ ఫిలిం మేకింగ్' ఒక్కటే దారి.

అంటే కొత్తగా మన ఇన్వెస్టర్స్‌ను మనమే వెతుక్కోవాలి. మన ప్రొడ్యూసర్స్‌ను మనమే కొత్తగా తయారుచేసుకోవాలి. 

సినిమా చేయటం అనేది అంత కష్టం కాదు. ఇంతకు ముందు కూడా చేశాను. నంది అవార్డు తీసుకున్నాను. 

కష్టం అది కాదు...  

సినిమా కోసం మన కోర్ టీమ్‌లో - మనతో అసోసియేట్ అయ్యే ముఖ్యమైన ఒకరిద్దరిని ఎన్నుకోడం అనేది చాలా చాలా కష్టం.

ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేస్తాం. ఒకటికి పదిసార్లు టర్మ్స్ అన్నీ పాయింట్ బై పాయింట్ పర్‌ఫెక్ట్‌గా అనుకుంటాం. 

అంతా ఓకే, అందరూ ఓకే అనుకుంటాం. 

కాని, అనుకున్నట్టు జరగదు. 

అయితే - సమస్య ఇదొక్కటే కాదు. 

కట్ చేస్తే -

మన చుట్టూ ఉన్న వాతావరణంలో కొందరుంటారు. మాట్లాడితే నెగెటివిటీ తప్ప ఇంకోటి ఉండదు. 

వాళ్ళు చేస్తున్న పనులే చక్కగా చెయ్యలేరు. ఫిలిం ఇండస్ట్రీ గురించి, కలెక్షన్స్ గురించి, బిజినెస్ గురించి, హీరోహీరోయిన్స్ గురించి మాత్రం...  మొత్తం వాళ్ళకు తెలిసినట్టే మాట్లాడుతుంటారు. 

ఇండస్ట్రీవాళ్ల ఆఫీసుల్లోకి, బెడ్రూముల్లోకి యాక్సెస్ ఉన్నవాళ్లకు కూడా వీళ్ళు చెప్పేటన్ని విషయాలు తెలియవు! 

మీదనుంచి - వాళ్లేదో మన టేబుల్ పైన కోట్లు కుమ్మరించినా మనం పనిచేయకుండా జల్సాగా తిరుగుతున్నట్టు కామెంట్స్! 

ఉచిత సలహాలైతే లెక్కలేనన్ని! వాటికి ఇన్వెస్ట్‌మెంట్స్ అవసరం లేదుకదా... 

ఏదైనా తట్టుకోవచ్చు. 

నెగెటివిటీ తట్టుకోలేం. 

నిజంగా పట్టించుకునేవాడికి ఇవన్నీ బీపీ తెప్పిస్తాయి. 

"ఇతన్నుంచి నెక్‌స్ట్ డైలాగ్ ఇలా వస్తుంది చూడు" అని కూల్‌గా పెయిన్ భరిస్తూనే ఎంజాయ్ చేస్తుంటాను కాబట్టి నాలాంటి వాడికి ఎంతో కొంత ఫరవాలేదు. 

అలాగని ఇది నా ఒక్కడి విషయం కాదు. ఒక్క సినిమాల విషయమే కాదు. 

ఏ బిజినెస్ అయినా ఏ ప్రొఫెషన్ అయినా ఒక్కటే. 

నెగెటివిటీ అనేది ఉత్సాహాన్ని చంపేస్తుంది. మనకు తెలియకుండానే ఆ స్పేస్ అంతా నిరాశ, నిస్పృహలతో నిండిపోతుంది. ఏదో చెయ్యాలనుకున్నవాళ్లను ఏదీ చెయ్యలేకుండా చేస్తుంది. సమయం అత్యంత దారుణంగా వృధా అయిపోతుంటుంది. 

ఈ ప్రపంచంలో అందరికీ సమానంగా ఉండేది... సమయం ఒక్కటే. 

డబ్బూ, దస్కం ఏదైనా వెనక్కి తెచ్చుకోవచ్చు. సమయం అలా కాదు. ఒక్క నిమిషం వృధా అయినా తిరిగి వెనక్కి తెచ్చుకోలేం. 

ఒక్క రోజు పోయిందంటే పోయినట్టే. 

మళ్ళీ రాదు. 

నిజంగా - అంత వృధాగా పోగొట్టుకునేంత సమయం మనకుందా అన్నదే మిలియన్ డాలర్ కొశ్చన్. 

Thursday 6 April 2023

రాజకీయాలకు కూడా కొన్ని హద్దులుంటాయ్!


కొన్ని దేశాల్లో - చూసీ చూసీ ఏదో ఒక పీక్ స్టేజ్ వచ్చాక - అక్కడి ప్రజలు - ఒక్కసారిగా లక్షల్లో రోడ్లమీదకి వస్తారు. కదం తొక్కుతూ ముందుకు ఉరికి, ఆ దేశాధినేత భవనం మీదకు దండెత్తుతారు. గంటల్లో అతన్ని పదవీచ్యుతున్ని చేస్తారు. 

ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి పరిణామాలెన్నో మనం కళ్ళారా వార్తల్లో చూశాము, అంతకు ముందు చదివాము. 

ఇప్పుడు మన దేశంలో ఉన్న పరిస్థితులు ఏ కోణంలో చూసినా అలాంటి పరిస్థితులకు తక్కువేం కాదు. 

ఇంత జరుగుతున్నా - మరి ఎందుకని ప్రతిపక్షాల్లో గాని, ప్రజల్లో గాని ఈ స్తబ్దత? ఈ నిశ్శబ్దం?  

గత తొమ్మిదేళ్ళలో మన దేశానికి జరిగినంత నష్టం ఇంతకు ముందెప్పుడూ జరగలేదు. పార్టీలు ఏవైనా కాని, ఎలాంటి చారిత్రక తప్పిదాలైనా చేసి ఉండనీ... దేశానికి ఇంత భారీగా నష్టం జరగాలని మాత్రం ఇంతకుముందు ఎవ్వరూ కోరుకోలేదు. నిస్సిగ్గుగా అలాంటి పనులు కూడా ఎవ్వరూ చెయ్యలేదు.      

దేశం మొత్తంలో ఒక్క కేసీఆర్‌కు మాత్రమే దేశం గురించి పట్టిందా? "దేశానికి ఒక లక్ష్యం ఉండాలి" అన్నది ఆయనొక్కనికే అవసరమా? కేసీఆర్ ఒక్కడు పూనుకొని బీఆరెస్ స్థాపించకపోతే, ఇంక దేశంలో జాతీయ పార్టీలు లేవా? వాళ్లేం చేయలేరా?  

కట్ చేస్తే - 

వందేళ్ల చరిత్ర ఉన్న ఒక జాతీయ పార్టీకి చెందిన ఎంపి, ఎవరినో ఏదో అన్నాడని అతని పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దుచేస్తే - "అది తప్పు, మేం తీవ్రంగా ఖండిస్తున్నాం" అని ఒక్క కేసీఆరేనా గొంతెత్తి అరవాలి?

దేశంలోని మిగిలిన పార్టీలకు, నాయకులకు ఎందుకంత భయం? 

ఈ లెక్కన - గత తొమ్మిదేళ్ళుగా కేంద్రంలో రాజ్యమేలుతున్న పార్టీకి చెందిన నాయకులెందరు ఎంతమందిని ఎన్నెన్ని మాటలనలేదు? ఆ పార్టీకి చెందిన ఎంతమంది నాయకులు ఎన్నెన్ని మాటలతో హింసను ప్రేరేపించలేదు? కనీసం పండగలను కూడా వదిలిపెట్టకుండా, పండుగలనే అస్త్రాలుగా చేసుకొని, ఆ పార్టీకి చెందిన ఎంతమంది నాయకులు దేశవ్యాప్తంగా మత విద్వేషాలను రెచ్చగొట్టలేదు? 

మరి తమ పార్టీకి చెందిన అలాంటి ఎందరో నాయకుల్లో కనీసం ఒక్కరిదయినా పార్లమెంట్, శాసనసభల సభ్యత్వాల్ని రద్దుచేశారా? 

పక్క రాష్ట్రంలోని విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి మన కేటీఆర్ గొంతెత్తి చెప్పినట్టుగా ఇంకే రాజకీయ పార్టీల నాయకులు చెప్పడానికి ముందుకు రాలేదెందుకని? 

ఎందుకంత భయం? సొంత లెక్కలా? ఈడీలు, సీబీఐలంటే వణుకా? మనకెందుకులే అన్న స్వార్థమా? సూడో మేధావుల మార్కు నిర్లిప్త నిరాసక్తతా?

ఏదైనా కాని... పనిచేస్తున్న నాయకులను, ప్రభుత్వాలను కాపాడుకోవడం పౌరుల బాధ్యత. ఆ బాధ్యతను విస్మరిస్తే మాత్రం చూస్తుండగా ఇంకో వందేళ్ళు వెనక్కిపోతాం. 

ఇదంతా చూడలేకే, ఏమాత్రం భయం లేకుండా, ఢిల్లీ వైపు కదం తొక్కుతున్న కేసీఆర్ అంటే ప్రత్యర్థికి వెన్నులో వణుకు పుడుతోంది.

కేసీఆర్ ఆలోచనలను చెడగొట్టడానికి, తెలంగాణను అస్థిరపరచడానికి... ఎన్నో కుట్రలు పన్నుతున్నారు. తెలంగాణ-ఏపీలకు చెందిన తెలంగాణ విద్రోహులను, జోకర్లను వాడుకొంటున్నారు. ఉసిగొల్పుతున్నారు. 

 ఏదీ ఫలించడం లేదు. పైగా ఎదురుకొడుతున్నాయి.      

తన ఉద్యమ నాయకత్వ నేపథ్యంతో, ముఖ్యమంత్రిగా ఇప్పటివరకు దేశంలో ఎవ్వరూ సాధించని ఎన్నెన్నో అద్భుత విజయాలను సాధించిన అనుభవంతో, తనదైన మొండి పట్టుదలతో, చెదరని ఏకాగ్రత, సంకల్ప శక్తితో... "కేసీఆర్ ఏదైనా చేయగలడు" అన్న భయం... ఇప్పుడు ప్రత్యర్థి శిబిరాల ద్వారా, వారి నాయకుల ద్వారా చేయరాని ఎన్నో పనులను చేయిస్తోంది.  

లక్షలాది మంది పదో తరగతి చిన్నారుల భవిష్యత్తు గురించి ఒక్క క్షణమైనా ఆలోచించగలిగే మానసిక పరిపక్వత లేని చిల్లర స్థాయికి కూడా దిగి, పరీక్షపేపర్లను లీక్ చేసి, ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నామనుకోవడం కూడా అలాంటి పనే.

అయితే - వీరి ఆటలు దేశంలోని ఎక్కడైనా సాగవచ్చు. తెలంగాణలో సాగవు. కేసీఆర్ దగ్గర అస్సలు సాగవు. 

Saturday 1 April 2023

Choose Yourself


బ్లాగ్, ఫేస్‌బుక్, ఎట్సెట్రాలకు కొన్నాళ్ళు బ్రేక్. 

బ్లాగ్‌ అయితే .. కనీసం నవంబర్ దాకా ఈవైపు రావద్దు అనుకుంటున్నాను. కాని, బ్లాగింగ్ విషయంలో మాటమీద నిలబడతానా అన్నది కొంచెం డౌటే. 

ఫేస్‌బుక్ వైపు అసలు మళ్ళీ చూడకపోవచ్చు. మెమొరీస్ ఒక్కటి తప్ప - ఎఫ్ బి అంత రొటీన్ అండ్ బోర్ అయిపోయింది నాకు. ఇన్‌స్టా అయితే ఎప్పుడో బంద్ చేసేశాను. 

కొందరితో కమ్యూనికేషన్ తప్పనిసరి కాబట్టి ఏదో ఒకదాన్లో లైవ్‌లో ఉండటం అవసరం. ఆ ఏదో ఒకటి కోసం నాకు ట్విట్టర్ బెటర్ అనిపించింది. ఫిక్స్ అయిపోయాను. 

కట్ చేస్తే -  

జీవితం చాలా చిన్నది. మన ఖాతాలో మనకున్న సమయం ఎంతో కూడా మనకు తెలీదు.

ఉన్నన్నాళ్ళూ ఇంకా ఏం చేయగలం, ఎంత ఇష్టంగా చేయగలం, ఎంత ఆనందంగా గడపగలమన్నదే మన ఆలోచన కావాలి. అలాంటి జీవితం గడపడానికి అవసరమైన ఫ్రీడం మనం ఎంత తొందరగా తెచ్చుకోగలం అన్నదొక్కటే మన ప్రధాన లక్ష్యం కావాలి.   

"Remember that all is a gift,
but the most precious of all gifts is -
life and love."
- Debbie Teeuwen