Sunday 31 July 2016

దటీజ్ సినిమా!

సినిమా నిర్మాణంలో ఆధునికంగా వచ్చిన డిజిటల్ టెక్నాలజీ వల్ల బడ్జెట్‌లు చాలా తగ్గాయి. చిన్న స్థాయిలో, కొత్తవాళ్లతో సినిమాలు చేయాలనుకొనేవాళ్లకు బిజినెస్ పాయింటాఫ్ వ్యూలో ఇదొక మంచి ప్రాఫిటబుల్ అండ్ పాజిటివ్ మలుపు.

అయితే - దీన్ని ఎంతవరకు పాజిటివ్‌గా ఉపయోగించుకొని, ఏ రేంజ్‌లో సక్సెస్ సాధించగలమనేదే మిలియన్ డాలర్ కొశ్చన్.

ఎన్ని ఆడ్డంకులు వచ్చినా, అన్నీ మనకు అనుకూలం చేసుకొని ముందుకు సాగిపోగల సత్తా కూడా మనలో ఉండాలి.

ఎందుకంటే .. సినిమా ఒక స్పెక్యులేషన్. ఒక జూదం.

అయినా - భారీ స్థాయిలో డబ్బు రొటేషన్, ఊహించని రేంజ్ వ్యక్తులతో పరిచయాలూ, సంబంధాలూ, ఓవర్‌నైట్‌లో ఫేమ్ .. ఇవన్నీ ఇక్కడే సాధ్యం.

దటీజ్ సినిమా.

కట్ టూ నాణేనికి మరోవైపు - 

చాలా మందికి కొత్తవాళ్లతో తీసే చిన్న సినిమాలు మధ్యలోనే ఆగిపోతాయి .. అసలు రిలీజ్ కావు .. ఒకవేళ రిలీజ్ ఐనా హిట్టు కావు .. హిట్ అయినా డబ్బులు రావు .. అని ఇలా రకరకాల అభిప్రాయాలుంటాయి.

సినిమా నిర్మాణం మీద, బిజినెస్ పైన ఖచ్చితమైన అవగాహన ఉండి, సినిమా తీయడం వేరు. ఏదో సినిమా తీయాలని తీయడం వేరు.

ఒకవేళ తెలియనప్పుడు, తెలిసినవాళ్లు చెప్పేది వినడం చాలా అవసరం. అలా జరగనప్పుడే
పై అపోహలు నిజమవుతాయి. నిర్మాతతోపాటు - ఆ సినిమాకు పనిచేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ కూడా ఎంతో నష్టపోతారు.

ఇవన్నీ ఒకెత్తు కాగా, సినిమా ప్రమోషన్ మొత్తం ఒకెత్తు.

ప్రమోషన్ ప్రాముఖ్యం తెలియనివాళ్లు అసలు సినిమా తీయకుండా ఉండటం బెటర్. ఈ వాస్తవం గుర్తించినవారెవ్వరికీ ఏ సమస్యా ఉండదు. చిన్న బడ్జెట్‌లోనే మంచి హిట్ ఇస్తారు. మరిన్ని మంచి సినిమాలు తీస్తారు. కోట్లల్లో డబ్బు సంపాదించుకుంటారు.

అలాంటి లైక్‌మైండెడ్ ఇన్వెస్టర్స్, కో ప్రొడ్యూసర్స్, ప్రొడ్యూసర్స్ పాతవాళ్లలో చాలా తక్కువగా ఉంటారు. కొత్తవారు దొరకడం అంత ఈజీ కాదు.

ఒక సినిమా ప్రారంభించే ముందు ఇలాంటివి ఎన్నో, ఎన్నెన్నో బాగా చూసుకోవాలి. సరైన అంచనాలు వేసుకోవాలి.

అందుకే చిన్న సినిమాల ప్రారంభంలో పదే పదే ఆలోచనలూ, ఆలస్యాలూ.

దటీజ్ సినిమా.

Monday 25 July 2016

సినిమా ఫీల్డంటే ఎందుకంత భయం?

ఎవరెన్నిచెప్పినా .. సినిమా అనేది ఓ పెద్ద క్రియేటివ్ బిజినెస్. మాగ్నెట్‌లా జివ్వున లాగే గ్లామర్ ఫీల్డ్.

ఇక్కడన్నీ ఉన్నాయి.

డబ్బు, సెలబ్రిటీ హోదా, నానా ఆకర్షణలు, వివిధరంగాల్లోని వి ఐ పి స్థాయి వ్యక్తులతో నెట్‌వర్క్ .. ఇంకేం కావాలి?

అదృష్టం!  

అవును. అసలు సినీఫీల్డులోకి ఎంట్రీ దొరకడమే ఒక గొప్ప విషయం. అలా ఎంట్రీ సాధించిన ప్రతి ఆర్టిస్టు, లేదా టెక్నీషియన్ జయాపజాయాలమీద ప్రభావం చూపే శక్తి కేవలం ఈ ఒక్కదానికే ఉంది: అదృష్టం.  

ఈ అదృష్టానికి ఎలాంటి సైంటిఫిక్ లాజిక్కులు లేవు. అంత సింపుల్‌గా నమ్మబుధ్ధి కూడా కాదు.

కానీ, నిజం.

ఈ నిజం అనుభవించినవారికే తెలుస్తుంది. ఇంకా చెప్పాలంటే, ఈ ఫీల్డులోకి దూకినవారికే తెలుస్తుంది.

ఫినిషింగ్ టచ్ ఏంటంటే - 

ఏది ఏమైనా సరే, సినీఫీల్డులో విజయం సాధించాలన్న ఏకైక లక్ష్యంతో, తను అనుకున్నది అనుకున్నట్టుగా చేసుకుంటూ, ముందుకు సాగిపోగలిగే అతికొద్దిమంది మాత్రం .. ఈ అదృష్టాన్ని కూడా తమవైపు తిప్పుకోగలుగుతారు!

సో, ఎవరైనా ముందుగా సాధించాల్సింది అదన్నమాట.

స్వేఛ్చ. 

Friday 22 July 2016

సినిమా తీద్దాం రండి!

డిసెంబర్ నుంచి  వరుసగా నా సీరీస్ ఆఫ్ సినిమాలు ప్రారంభం.

నాన్ స్టాప్‌గా ..

మీకు తెలుసా? ఇప్పుడింక సినిమా ఎవరయినా తీయవచ్చు!

ఇదివరకులాగా కోట్ల రూపాయలు అవసరం లేదు. కొన్ని లక్షలు చాలు. కొంతమంది లైక్ మైండెడ్ ఫ్రెండ్స్ తో కూడిన ఒక చిన్న క్రియేటివ్ టీం చాలు.

అర్టిస్టులు, టెక్నీషియన్లు అందరూ అదే టీం!

మంచి సినిమా - అనుకున్న కథతో - అనుకున్న విధంగా తీయవచ్చు. రిలీజ్ చేయవచ్చు.

నేను చెబుతున్నది వందలకోట్ల హైప్‌లు క్రియేట్‌చేసే భారీ సినిమాల గురించి కాదు. అదంతా పెద్ద గ్యాంబ్లింగ్. అది మన సబ్జెక్ట్ కాదు.

నేను చెబుతున్నది కేవలం చిన్న బడ్జెట్ కమర్షియల్ సినిమాల గురించి. ఆ భారీ సినిమాలతో పోలిస్తే, దాదాపు పూర్తిగా రిస్క్-ఫ్రీ సినిమాల గురించి.

అవును. నమ్మటం కష్టం. కానీ నిజం.

ఇప్పుడంతా డిజిటల్ యుగం.  ల్యాబ్ లూ, స్టూడియోలూ, ఫిల్మ్ నెగెటివ్ లూ,  ప్రాసెసింగ్ లూ, పడిగాపులూ ... ఆ రోజులు పోయాయి.

కొన్ని లక్షలు చాలు. కేవలం 45 రొజుల్లో ఒక మంచి కమర్షియల్ సినిమా తీయవచ్చు. మరొక 45 రోజుల్లో - ఆ సినిమాని యే టెన్షన్ లేకుండా రిలీజ్ చేయవచ్చు.

మంచి కథతో, కథనంతో ప్రేక్షకులను ఒప్పిస్తే చాలు. సినిమాలు ఆడతాయి.  లాభం వూహించనంతగా వుంటుంది.

2007 లో ఇంగ్లిష్‌లో వచ్చిన 'పేరానార్మల్ యాక్టివిటీ' సినిమా ఈ సంచలనానికి నాంది పలికింది. అతి తక్కువ బడ్జెట్ లో తీసిన ఆ సినిమా 655,000% రిటర్న్స్ పొందింది!

ఇక ఇప్పుడు ప్రపంచమంతా  అదే దారి.

డిజిటల్ ఫిలిం మేకింగ్ .. డిఎస్సెల్లార్  ఫిలిం మేకింగ్.

నిజంగా ఆసక్తి వున్న కొత్త ప్రొడ్యూసర్లు / కో-ప్రొడ్యూసర్లు / మైక్రో ఇన్వెస్టర్లు  మీ ఫోన్ నంబర్ తో నా ఫేస్ బుక్ ఇన్‌బాక్స్ కు మెసేజ్ పెట్టండి. మా ఆఫీస్ నుంచి మీకు ఫోన్ వస్తుంది. లేదా నేనే ఫోన్ చేస్తాను.

ఇన్వెస్టర్-హీరోలు కూడా మెసేజ్ చేయవచ్చు. హీరో కావాలన్న మీ కల నిజం అవుతుంది. మీ ఇన్వెస్ట్ మెంట్ కి బిజినెస్ లో షేర్ కూడా ఉంటుంది. 

Wednesday 20 July 2016

గుడ్ బై, నగ్నచిత్రం!

నా సినిమా ప్రొఫెషన్ కి సంబంధించి నేను క్రియేట్ చేసుకోదల్చిన నెట్ వర్క్ కోసమనే ప్రత్యేకంగా నగ్నచిత్రం బ్లాగ్ ని ముందు ప్రారంభించాను.

ఈ బ్లాగ్ టైటిల్ ని కావాలనే అలా పెట్టాను. నా టార్గెట్ సినిమావాళ్లే కాబట్టి ఈ టైటిల్ ఓకే అనుకున్నాను.

ఒక రకంగా ఇదో మార్కెటింగ్ జిమ్మిక్.

తర్వాత, ఇదే బ్లాగ్ ని నా మెయిన్ బ్లాగ్ గా చేసుకుని అన్నీ దీంట్లోనే రాయటం ప్రారంభించాను.

"చాలా మంది విజిట్ చేస్తున్నారు .. అంతా బానే ఉంది" అని సైట్ విజిట్ మీటర్ చూస్తూ అనుకుంటుండగా ఓ కాల్ వచ్చింది. ఆది నాకు అత్యంత ప్రియమైన నా విద్యార్థి నుంచి. మా మాటల్లో బ్లాగ్ టాపిక్ కూడా వచ్చింది.

సారాంశం ఏంటంటే - అమ్మాయిలు, స్త్రీలు, మగవాళ్లలో కూడా కొందరు అసలు ఈ బ్లాగ్ లింక్ మీద క్లిక్ చేయటానికి కూడా ఇష్టపడటం లేదని!

కారణం - బ్లాగ్ టైటిల్ "నగ్నచిత్రం" కావటం.

నిజానికి ఈ బ్లాగ్ లో అసభ్యకరమైనది ఏదీ లేదు. ఇందులో నేను రాస్తున్న నగ్నత్వం శరీరానికి సంబంధించింది కాదు. హిపోక్రసీ లేని నిజాలు! అయినా సరే, కొందరు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. అలాగని వాళ్లని తప్పు పట్టాల్సిన పని లేదు. మన కండిషనింగ్ అలాంటిది.

కట్ టూ 2016 - 

మళ్ళీ జస్ట్ నిన్న రాత్రే ఒక పాఠకురాలు సింపుల్‌గా ఒకమాటన్నారు: "బ్లాగ్ టైటిల్ మార్చరాదా.." అని! ఇదేమాటను, మొన్ననే మరొక పెద్దాయన తన కామెంట్స్‌లో కాస్త మొహమాటంగా వెలిబుచ్చారు.

ఆలోచించాను.

ఇప్పుడెలాగూ నేనీ బ్లాగ్‌లో ఒక్క సినిమాల గురించే రాయడంలేదు. నాకిష్టమైన ప్రతీదీ రాస్తున్నాను. ఇంకా చాలా రాయబోతున్నాను. నాకున్న ఎన్నో వ్యాపకాల్లో సినిమాలు కేవలం ఒక చిన్న భాగం.

సినిమాలే జీవితం కాదు.

అలాంటప్పుడు ఒక్క సినిమాలకోసం, సినిమాలకు సంబంధించిన ఈ టైటిల్ కోసం, ఎందుకు నేను అనవసరంగా ఓ 25% పాఠకుల్ని పోగొట్టుకోవాలి?

కోటిరూపాయల కొశ్చన్!

టెక్నికల్‌గా కొంత శ్రమే నాకు. ఒక బ్లాగ్‌ను పూర్తిగా ఇంకో బ్లాగ్‌లోకి "ఇంపోర్ట్" చేసుకొని, అంతా మళ్ళీ యథాతథంగా ఉంచడం అనేది.

ఆ పని నెమ్మదిగా చేస్తాను.

ప్రస్తుతానికి యు ఆర్ ఎల్ అదే ఉంటుంది కాని, టైటిల్ ఒక్కటే మార్చేస్తున్నాను, ఇప్పుడే! మిగిలిన టెక్నికల్ పనంతా కొంచెం నెమ్మదిగా చేస్తాను.

ఒక జ్ఞాపకంగా, ఈ బ్లాగ్‌లోని కొన్ని సెలెక్టెడ్ సినిమా బ్లాగ్ పొస్టులతో కొద్దిరోజుల తర్వాత, "నగ్నచిత్రం" పేరుతో ఒక పుస్తకం తప్పక పబ్లిష్ చేస్తాను. ముఖ్యంగా ఈ టైటిల్ మార్చడం ఇష్టంలేని పాఠకులకోసం.

ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటివి దుమ్మురేపుతున్న ఈ జమానాలో బ్లాగింగ్ అనేది కొంత అవుట్‌డేట్ అయినమాట నిజమే. కానీ, రైటర్స్‌కు ఈ బ్లాగింగ్ ఇచ్చే కిక్కే వేరు. కిక్ విషయం ఎలా ఉన్నా, రాయడం అన్న ఒక మంచి అలవాటును రైటర్స్‌ మర్చిపోలేరు.

సో, నేను నా బ్లాగింగ్ కంటిన్యూ చేస్తాను.  

మరి ఈ బ్లాగ్‌కు ఇప్పుడు కొత్త టైటిల్ ఏంటంటారా?

ఒక రచయిత బ్లాగ్ కి తన పేరుని మించిన మంచి  టైటిల్ ఇంకేముంటుంది .. ?! :)

Tuesday 19 July 2016

క్రియేటివిటీ వేరు, రాజకీయాలు వేరు!

"సబ్ కా సున్‌నా అప్నా కర్‌నా" అని ఒక సామెత.

తెలిసీ, అనుభవం ఉండీ, ఈ సామెతను ఆమధ్య అసలు పట్టించుకోలేదు. అప్పుడు అందరు చెప్పిందే విన్నాను కానీ, నా మనసు చెప్పింది మాత్రం పక్కన పెట్టాను.

ఇప్పుడు జ్ఞానోదయమైంది, పూర్తిగా.

కట్ టూ క్రియేటివిటీ - 

క్రియేటివిటీకి హద్దులు లేవు. ఉండకూడదు. ఇది నేను వంద శాతం నమ్ముతాను. పాటిస్తాను.

నా టీమ్‌ను ఒక మూడు భాగాలుగా చేస్తే - అందులో ఒక భాగం తెలంగాణవాళ్లుంటారు. మరొక భాగం ఆంధ్రప్రదేశ్‌వాళ్లుంటారు. ఇంకో భాగం మొత్తం మన దేశంలో ఒక్కో ప్రాంతానికి చెందినవాళ్లుంటారు.

కొన్నిసార్లు ఈ రేషియో మారొచ్చు కూడా.

రఫ్‌గా దీన్నే ఇంకో కామన్ రేషియోలో కూడా చెప్పగలను. టీమ్‌లో సగం మంది తెలంగాణవాళ్లుంటే, మిగిలిన సగం మంది మన దేశంలో ఒక్కో ప్రాంతం నుంచి ఉంటారు.

అయితే - ఇదంతా నేనేదో ప్లాన్ ప్రకారం చేస్తున్నది కాదు. అలా ఎవ్వరూ చెయ్యలేరు. కాని, ఇప్పటికే మన ఫిల్మ్ ఇండస్ట్రీలో పాతుకుపోయిన చాలామందిలో మాత్రం అలాంటి ఫీలింగ్ ఉంది. వాళ్ళు చేయొచ్చు. బట్, ఆ "చాలా మంది" గురించి నాకు అవసరం లేదు. అది వేరే విషయం.

'లైక్‌మైండెడ్ స్వభావం' ఒక్కటే నా టీమ్‌లో నేను చూసేదీ, నాకు కావల్సిందీ.

కట్ టూ రాజకీయాలు -

మా తెలంగాణ రాష్ట్ర ఐ టీ మిస్టర్ కె టి రామారావు (KTR) ఫేస్‌బుక్ పేజ్ మీద ఒక సూపర్ కొటేషన్ ఉంది:  "When Politics Decide Your Future, Decide What Your Politics Should Be!" అని.

సవాలక్ష పనికిరాని కొటేషన్లలో ఇదొకటి కాదు. తప్పనిసరిగా అందరూ పట్టించుకోవల్సిన కొటేషన్. బాగా ఆలోచించాల్సిన కొటేషన్.

ముఖ్యంగా, బాగా చదువుకున్నవాళ్లు మరింతగా అలోచించాల్సిన కొటేషన్ ఇది. ఎందుకంటే, స్టాటిస్టిక్స్ ప్రకారం, రాజకీయాలపట్ల పూర్తి నిరాసక్తంగా ఉండే ఒకే ఒక్క పనికిమాలిన సెగ్మెంట్ ఈ బాగా చదువుకున్నవాళ్లే!

ఈ ఒక్క సెగ్మెంట్ నిరాసక్తతే ఈ రోజు మన దేశాన్ని ఎందుకూ పనికిరానివాళ్లు దశాబ్దాలుగా పాలించడానికి కారణమైంది. దేశం ఎన్నోరకాలుగా వెనకబడటానికి కారణమైంది.

సో, కె టి ఆర్ గారికి థాంక్స్!

తెలిసిన కొటేషనే అయినా .. నాలాంటి ఎందరో నిజంగా తెలుసుకొనేట్టు చేసినందుకు. ఇప్పుడు నేనీ బ్లాగ్ రాయడానికి స్ఫూర్తినిచ్చినందుకు. :)

కట్ బ్యాక్ టూ ఓపెనింగ్ - 

ఆరు దశాబ్దాలుగా రగిలిన తెలంగాణ ప్రజల మనోవాంఛను నిజం చేసిన వ్యక్తి కె సి ఆర్. గత 60 ఏళ్ళుగా ఎవ్వరూ సాధించలేనిదాన్ని సాధించి చూపిన ఒక ఉద్యమ శక్తి కె సి ఆర్.

ఈ నేపథ్యంలో, ఆయనమీద అభిమానంతో, ఆయనే కేంద్రబిందువుగా నేను రాసిన ఒక పుస్తకం రెండేళ్ల క్రితమే ప్రచురిద్దామనుకొన్నాను. "సినీఫీల్డులో వున్నావు. ఎందుకు అనవసరంగా.. వద్దు!" అని చెప్పిన కొందరి 'ఉచిత సలహా' విని, ఆ పని అప్పుడు వాయిదా వేసుకున్నాను.

క్రియేటివిటీ వేరు, రాజకీయాలు వేరు.

ఇంకా చెప్పాలంటే - మొన్నటిదాకా శత్రువులుగా పిచ్చి పిచ్చిగా తిట్టుకున్నవాళ్లే ఇప్పుడు మళ్ళీ మిత్రులుగా కలిసిపోయారు. పార్టీలు మారుతున్నారు. పార్టీలకెళ్తున్నారు. పార్టీలు చేసుకుంటున్నారు.

ఇందులో తప్పేం లేదు. తప్పదు.

రాజకీయ చదరంగం.

జీవనవైరుధ్యం.

త్వరలో నేను ప్రారంభించబోయే నా కొత్త సినిమా ఆడియో రిలీజ్ కార్యక్రమం సందర్భంగానో, లేదంటే, ఆ సినిమా రిలీజ్ సమయంలోనో ఇప్పుడు నేనా పుస్తకం ప్రచురించడానికి నిర్ణయించుకున్నాను.

కె టి ఆర్ కొటేషన్ కాకుండా - ఈ నా నిర్ణయానికి పరోక్షంగా కేటలిస్టులుగా పనిచేసినవాళ్లు మరో ఇద్దరున్నారు.  ఒకరు నా ఫేవరేట్ స్టూడెంట్. మరొకరు నా టీమ్‌లో చీఫ్ టెక్నీషియన్.

విచిత్రమేంటంటే - వీళ్లిద్దరిదీ గుంటూరు! :)

Sunday 17 July 2016

"ఒక్క ఛాన్స్" అంత ఈజీ కాదు!

నా ఫేస్‌బుక్ ప్రొఫైల్‌లో ఒక 5000 మంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్లల్లో నాకు పర్సనల్‌గా తెలిసినవాళ్లు ఒక 300 మంది ఉంటే ఎక్కువ. అది వేరే విషయం.

అలాగే, నా ఫేస్‌బుక్ పేజ్‌లో ఒక 20,000 మంది ఫ్యాన్స్ ఉన్నారు.

నా ట్విట్టర్‌లో నాకు సుమారు ఒక 4,500 మంది ఫాలోయర్స్ ఉన్నారు.

నా బ్లాగ్‌లో నేను రాసే ప్రతి పోస్ట్‌ను కనీసం కొన్ని వేలమంది చదువుతారు.

ఇంక ఈ ఆన్‌లైన్/సోషల్ మీడియాతో సంబంధం లేకుండా, నాకు బయట కనీసం ఓ 200 మంది బంధువులు, మిత్రులు, బాగా తెలిసినవాళ్ళు ఉన్నారు.

అసలీ లెక్కంతా ఎందుకు అని మీకు అనిపించొచ్చు. ఉన్నదంతా అక్కడే ఉంది. కాబట్టే ఈ లెక్కలు.

కట్ చేస్తే - 

సోషల్ మీడియాలో ప్లస్ బయటా, నాకు కనెక్ట్ అయి ఉన్న అంత మందిలో .. నన్ను రోజూ కనీసం ఒక 30 మంది అయినా "మీ సినిమాలో నాకొక రోల్ ఇవ్వండి" అని అడుగుతుంటారు. అడగడంలో తప్పేం లేదు. కానీ .. నన్నూ, ఎప్పుడూ ఓ 101 టెన్షన్స్ వెంటాడే నా పరిస్థితిని కూడా అర్థం చేసుకోవడం చాలా అవసరం:

> ఏ ఒకరిద్దరికో తప్ప, రోజూ ఈ 30 మందికి నేను ఆన్సర్ చెప్పలేను.
> అందరికీ కలిపి తరచూ ఒక మాట ఏదైనా పోస్ట్ రూపంలో చెప్తుంటాను. "ఈసారి ఆడిషన్స్ అయినప్పుడు రండీ" అని.
> ఒక వేళ వీళ్లంతా ఆడిషన్స్‌కు వచ్చినా .. అందులో బాగా టాలెంట్ ఉండి, మా స్క్రిప్టులోని ఏదైనా ఓ రోల్‌కు పనికొస్తారు అనుకొనే ఏ ఒకరిద్దరికోతప్ప అందరికీ ఛాన్స్ ఇవ్వలేం కదా?!

ఈ నిజాన్ని నా మిత్రులు, శ్రేయోభిలాషులు, ఫ్యాన్స్, ఫాలోయర్స్ అందరూ అర్థం చేసుకోవాలి.

మరో విషయం ఏంటంటే, ఛాన్స్ దొరికినవాళ్లే పుడింగులు అని కూడా ఎప్పుడూ అనుకోవద్దు. ప్రతి ఒక్కరిలోనూ టాలెంట్ ఉంటుంది. ప్రయత్నిస్తూ ఉండాలి. మీకు మాత్రమే సూటయ్యే రోల్ ఎక్కడో, ఏ సినిమా ఆఫీసులోనో మీకోసం ఎదురుచూస్తూ ఉండొచ్చు. ఎవరికి తెలుసు?

సో, ఆ ఒక్క ఛాన్స్ కావాలి అనుకొనేవాళ్లు మాత్రం ఎప్పుడూ రేసులో ఉండాలి. గెలుస్తామన్న నమ్మకంతో ఉండాలి.

బెస్ట్ విషెస్ .. 

Saturday 16 July 2016

క్రియేటివ్ ఫ్రీడమ్!

ఏ పని గురించైనా సరే .. ఎప్పుడూ ఒకే ఒక్క సోర్స్ మీదనో, ఒకే ఒక్క వ్యక్తిమీదనో అస్సలు ఆధారపడవద్దు. అలా ఆధారపడి, ఆ పని కానప్పుడు అస్సలు బాధపడవద్దు.

ఈ విషయంలో మనం తీసుకున్న నిర్ణయాన్ని మాత్రమే సరైన నిర్ణయం కాదని భావించి మనమే బాధ్యత వహించాలి.

ఇప్పుడు నా సిచువేషన్ అదే.

అయినా సరే, ఇప్పటికీ నా నమ్మకమేంటంటే .. నేనూ, నా టీమ్ సత్ఫలితాల రేసులోనే ఉన్నాం. ఇక ఎప్పుడూ ఉంటాం.

ఒకటి రెండు రోజులు అటూ ఇటూ. అంతే.

కట్ టూ ఒక క్రియేటివ్ రియాలిటీ - 

క్రియేటివిటీ రంగాల్లో ఉన్నవారికి వ్యక్తిగతంగా, ఆర్థికంగా ఫ్రీడం అనేది చాలా ముఖ్యం. ఈ ఫ్రీడం సాధించినవాళ్లకు మాత్రమే ఏదైనా సాధించే అవకాశం ఉంటుంది.

సాధించగలరు.

సాధిస్తారు.

ఈ వాస్తవాన్ని మనం ఎంత త్వరగా అర్థం చేసుకొంటే అంత మంచిది.    

Wednesday 13 July 2016

@ మై గుంటూరు క్యాంప్ ఆఫీస్!

స్విమ్మింగ్‌పూల్ తర్వాత, నా కొత్త సినిమా ప్రి-ప్రొడక్షన్ పనులకోసం, ఫండ్స్ కోసం హైద్రాబాద్ వదిలి నిన్నటికి సరిగ్గా 14 రోజులు!

ఒకసారి మారిషస్, కొన్నిసార్లు పాండిచ్చేరి ట్రిప్‌ల తర్వాత, నా మొత్తం జీవితంలో ఇంటి నుంచి నేను ఇంత పెద్ద గ్యాప్ తీసుకోవడం ఈమధ్య ఇదే.

దాదాపు సగం నెల!

మొన్నే, జూన్ 18/19 తేదీల్లో కొత్త సింగర్స్, ఆర్టిస్టులకోసం నేను, ప్రదీప్‌చంద్ర గుంటూరులో నిర్వహించిన ఆడిషన్ కోసం ఒక 5 రోజులు ఉండివచ్చాను.

అంటే, కేవలం గత నెల రోజుల్లోనే, సుమారు 19 రోజులు నేను పూర్తిగా గుంటూరులోనే గడిపానన్నమాట! చూస్తుంటే, కనీసం ఇంకో నాలుగయిదు రోజులయినా మళ్ళీ నేను గుంటూరు వెంటనే వెళ్లిరావల్సిన అవసరం కనిపిస్తోంది. పనులు అంత ముఖ్యమైనవి.

సో, మొత్తంగా ఒక నెలలో, సుమారు 24 రోజులు నేను పూర్తిగా గుంటూరులోనే ఉన్నట్టు లెక్క!

గుంటూరులో ఉన్నన్ని రోజులూ హోటల్ సిందూరి,  వజ్రం రెసిడెన్సీ, హోటల్ వైస్రాయ్ ల్లో ఎక్కువగా గడిపాను. ఈమధ్యే కొన్నిరోజులు మాత్రం మా ప్రొడ్యూసర్ వాళ్ల ఆఫీసులో కూడా ఉన్నాను.

ఆఫీసులో గడిపిన ఆ కొద్దిరోజుల అనుభవాలతో, సరదాగా ఒక "వాచ్‌మన్ ఎపిసోడ్" అన్న టైటిల్‌తో మరో బ్లాగ్ కూడా రాయగలను. అయితే, ఆ పని తర్వాత చేస్తాను .. నా బ్లాగ్‌లోనో, లేదంటే తర్వాత నేను రాయబోయే "ది మేకింగ్ ఆఫ్ .." పుస్తకంలోనో.

కట్ టూ డైరెక్ట్ పాయింట్ -

అసలు ఇన్ని రోజుల నా గుంటూరు ట్రిప్ ప్రధానోద్దేశ్యం నెరవేరిందా అంటే .. నేను తాజాగా తెలుసుకున్న ఒక్క నిజం గురించి మాత్రం చెప్పగలను.

ఏంటంటే .. ఏ పని గురించైనా సరే .. ఎప్పుడూ ఒకే ఒక్క సోర్స్ మీదనో, ఒకే ఒక్క వ్యక్తిమీదనో అస్సలు ఆధారపడవద్దు. పని కానప్పుడు బాధపడవద్దు. మన నిర్ణయాన్ని మాత్రమే సరైన నిర్ణయం కాదని భావించి మనమే బాధ్యత వహించాలి.

అయినా సరే, ఇప్పుడు మేము సత్ఫలితాల రేసులో ఉన్నాం.

ఇక ఎప్పుడూ ఉంటాం.