Friday 24 June 2016

ఆడిషన్ కాల్ @ వైజాగ్!

వైజాగ్ అనగానే నాకు ముందుగా గుర్తొచ్చేది సముద్రం. తర్వాత చలం, భీమ్‌లీ. ఆ తర్వాత అరకు.

పిసి క్రియేషన్స్ బ్యానర్‌లో నా కొత్త సినిమాకోసం కొత్త ఆర్టిస్టులు, సింగర్స్ టాలెంట్ హంట్ జరుగుతోంది. దీనికి సంబంధించిన మొట్టమొదటి ఆడిషన్ మొన్న 18, 19 తేదీల్లో గుంటూరులో జరిగింది. ఆ ఆడిషన్స్‌కు మేం ఊహించిన స్థాయిని మించి కొత్తవాళ్లనుంచి మంచి స్పందన ఉండటం మాకే ఆశ్చర్యం కలిగించింది.

ఇంకా చెప్పాలంటే, ఈ విషయంలో ప్రదీప్, నేనూ నిజంగా ఆశ్చర్యపోయాం. పూర్తిగా సంతృప్తిచెందాం.

అలాంటిది .. సినిమా అవేర్‌నెస్, సినిమా నేపథ్యం వివిధ కోణాల్లో సంపూర్ణంగా ఉన్న వైజాగ్‌లో మా ఆడిషన్‌కు స్పందన ఎలా ఉంటుందో ఎవరైనా ఈజీగా ఊహించొచ్చు.  

రేపు జులై 2, 3 తేదీల్లో వైజాగ్‌లోజరిగే ఈ ఆడిషన్‌లో పాల్గొనే కొత్త సింగర్స్, ఆర్టిస్టుల్లో కనీసం ఒక సింగర్, ఇద్దరు ఆర్టిస్టులయినా నా తర్వాతి చిత్రంలో మా టీమ్‌తో కలిసి పనిచేస్తారని నేననుకుంటున్నాను. అలా జరగాలని ఆశిస్తున్నాను.

వైజాగ్ తర్వాత .. ఫైనల్‌గా, ఫైనల్ ఆడిషన్ హైద్రాబాద్‌లో ఉంటుంది. ఆ వివరాలు కూడా మీకు తొందర్లోనే తెలుస్తాయి.

బెస్ట్ విషెస్ ..   

Friday 17 June 2016

ఆడిషన్ కాల్ Vs ఆ ఒక్క ఛాన్స్!

కొత్త ఆర్టిస్టులు, సింగర్స్, ఇతర టెక్నీషియన్స్ కోసం "ఆడిషన్" పెట్టినపుడు సహంజంగానే చాలమంది ఔత్సాహికులు పాల్గొంటారు.

ఈ సందర్భంగా గమనించాల్సిన ముఖ్య విషయాలు రెండున్నాయి:

1. ఆడిషన్ నిర్వహించేది ప్రస్తుతం చేస్తున్న ఒక్క సినిమాకోసమే కాబట్టి, కేవలం టాలెంటున్న అతి కొద్దిమంది మాత్రమే సెలక్ట్ అవుతారు. ఈ సెలెక్షన్‌లో కూడా, ప్రస్తుతం మేము చేస్తున్న సినిమా స్క్రిప్టు ప్రకారం, ఆయా పాత్రలకు మాకు సూటయ్యే ఆర్టిస్టులను మాత్రమే ఎన్నుకోవడం జరుగుతుంది.

2. ఇలా ఎన్నికైన ఆ కొద్దిమంది ఆర్టిస్టులకు మాత్రమే టాలెంట్ ఉంది, మిగిలినవాళ్లకు లేదని అనుకోడానికి లేదు. జస్ట్ ఈ సినిమాలోని ఆయా కారెక్టర్‌లకు మీరు సరిపోలేదని అనుకోవాలి. నిరుత్సాహపడకుండా ఆ "ఒక్క ఛాన్స్" కోసం మీ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉండాలి.

బట్, వన్ సెకండ్ .. రేపు ఆడిషన్‌లో సెలెక్టయ్యే ఆ కొద్దిమందిలో మీరూ ఉండొచ్చని ఎందుకనుకోకూడదు?!  

సింగర్స్ విషయంలోనూ అంతే.

బెస్ట్ విషెస్ ..      

Monday 6 June 2016

ఒక్క హిట్ .. జీవితాన్నే మార్చేస్తుంది!

"సినిమా తీయాలన్న కమిట్‌మెంట్ ఉంటే చాలు. డబ్బులు ఎప్పుడూ సమస్య కాదు."

ఈ మాటలన్నది ఎవరో కాదు. ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు సత్యజిత్ రే!

ఎలా కాదనగలం?

సత్యజిత్ రే "పథేర్ పాంచాలి" అలాగే తీశాడు. ఉద్యోగం చేస్తూ, జీతం వచ్చినపుడల్లా ఆ డబ్బుతో షూటింగ్ ప్లాన్ చేస్తూ, మరికొంతమంది మిత్రుల ద్వారా కూడా అవసరమయిన డబ్బు ఎప్పటికప్పుడు సమకూర్చుకుంటూ, అంచెలంచెలుగా తీశారు. అలాంటి అనుభవంతో చెప్పిన మాట అది. ఆ సినిమానే ఆయనకు అంత పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత సత్యజిత్ రే ఇంకెన్నో పిక్చర్లు తీశారు. ఆయన అనుకున్న సినిమాలే తీశారు.

విషయం ఇక్కడ ఆర్ట్ సినిమాలా, కమర్షియల్ సినిమాలా అన్నది కాదు. అనుకున్న సినిమాని ఒక కమిట్‌మెంట్ తో చేయగలగటం!

అసలు సినిమాలా ఇంకొకటా అన్నది కూడా సమస్య కాదు. చేయాలనుకున్నపని మీద ఒక క్లారిటీ, ఒక కమిట్‌మెంట్ ఉండి, ఏది ఎలా ఉన్నా ఆ ఒక్క పనిమీదే దృష్టి పెట్టగలిగినప్పుడు, ఆ పనిని పూర్తిచెయ్యడం అంత కష్టమేంకాదు.

బట్ .. అలాంటి ఏకాగ్రత పెట్టగల ఫినాన్షియల్ అండ్ పర్సనల్ ఫ్రీడమ్‌ను ముందు మనం సంపాదించుకోగలగాలి. ఆ తర్వాత అవకాశాలూ, విజయాలూ అన్నీ వాటికవే మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. రప్పించుకోగలుగుతాం.

కట్ టూ మా కంపెనీ - 

నిజంగా సినిమా తీయాలనుకుంటే ఇప్పుడు డబ్బు సమస్య కాదు. అంత తక్కువ బడ్జెట్ లో ఈ రోజుల్లో సినిమా తీయొచ్చు. అంతా కొత్తవాళ్లతో, నేచురల్ లొకేషన్లలో సినిమా తీస్తే - దాదాపు అది "నో బడ్జెట్" సినిమానే! ఇటీవలి కాలంలో వచ్చిన ఎన్నో యూత్ ఫుల్ కమర్షియల్ సినిమాలు ఈ విషయాన్ని నిరూపించాయి. పుష్కలంగా డబ్బుల వర్షం కురిపించాయి.

మొన్నటి నా స్విమ్మింగ్‌పూల్ చిత్రం ద్వారా నేను ఈమధ్యే పరిచయం చేసిన నా కో-చీఫ్ టెక్నీషియన్‌ ఒకరితో కలిసి, దాదాపు అంతా కొత్త వాళ్లతో, ఇప్పుడు నేను మా సొంత బ్యానర్‌లో ప్లాన్ చేస్తున్న మైక్రో బడ్జెట్ సినిమాలూ ఇలాంటివే. యూత్ ఫుల్ కమర్షియల్ ఎంటర్ టైనర్స్. కేవలం బడ్జెట్ దృష్టితో చూస్తే, వీటిని కమర్షియల్ ఆర్ట్ సినిమాలనవచ్చేమో!

ఏ కొంచెం హిట్ టాక్ వచ్చినా, ఈ చిన్న బడ్జెట్ సినిమాల కలెక్షన్ ఇంచుమించు పెద్ద సినిమాలకు పోటీగా ఉంటుంది. సినిమా ఆడకపోయినా, ఈ రేంజ్ బడ్జెట్ లో అసలు రిస్క్ అనేదే ఉండదు. ఇంకేం కావాలి?

ఒక్క హిట్!

అది జీవితాన్నే మార్చేస్తుంది ..  

Saturday 4 June 2016

కోపరేటివ్ ఫిలిమ్ మేకింగ్!

ఆమధ్య "Iceక్రీమ్" సినిమాతో ఓ కొత్త ట్రెండ్‌కి తెరతీశాడు వర్మ. దాని పేరు "కోపరేటివ్ ఫిలిమ్ మేకింగ్".

పాతవాళ్లయినా, కొత్తవాళ్లయినా - ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు ఒక్క రూపాయి రెమ్యూనరేషన్ కూడా ముందు ఇవ్వటం అనేది ఉండదు. సినిమా పూర్తయ్యి, రిలీజయ్యి, లాభాలు వచ్చాకే ఆ ఆ లెక్కలు! దీనికి ఒప్పుకున్నవాళ్లే సినిమాలో పనిచేస్తారు.

ఈ మైక్రో బడ్జెట్ పాతిక లక్షలు కావొచ్చు. 50 లక్షలు కావచ్చు, కోటి కావచ్చు, రెండు కోట్లు కావొచ్చు.  సో .. ఉన్న ఆ కొద్ది బడ్జెట్‌ను మేకింగ్‌కు, ప్రమోషన్‌కు మాత్రమే వాడతామన్నమాట!

చాలా మంచి కాన్‌సెప్ట్ ఇది.  ముఖ్యంగా చిన్న బడ్జెట్ సినిమాలకు సంబంధించి మాత్రం ఇదే చాలా చాలా కరెక్టు.

కొత్తవాళ్లతో చేసే సినిమాలకు "టాక్" వచ్చేదాకా మంచి ఓపెనింగ్స్ ఉండవు కాబట్టి, ప్రమోషన్ పరంగా ఎన్నో జిమ్మిక్కులు చేయాల్సి ఉంటుంది. అయినా హిట్టో, ఫట్టో ముందే ఎవరూ చెప్పలేరు. ఇలాంటి పరిస్థితుల్లో ముందు ప్రొడ్యూసర్‌ను కొంతయినా బ్రతికించుకోవాలంటే ఇదే మంచి పధ్ధతి.

టీమ్ వర్క్.
కంటెంట్.
ప్రమోషన్.

ఈ తరహా సినిమాలు తీయాలంటే ఈ మూడే చాలా ముఖ్యమైనవి.

కట్ టూ మనోహర్ -

ఫిలిం ప్రొడక్షన్‌కు సంబంధించి దాదాపు ఇదే కాన్సెప్ట్‌తో అతి త్వరలో నేను, ఈ మధ్యే నేను పరిచయం చేసిన నా కో-చీఫ్ టెక్నీషియన్‌తో కలిసి, మా సొంత బ్యానర్‌లో, కొన్ని నాన్-రొటీన్ కమర్షియల్ సినిమాలు ప్లాన్ చేస్తున్నాను.

ఆసక్తి ఉన్న పాత/అప్‌కమింగ్ హీరోలు, హీరోయిన్లు, సపోర్టింగ్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఈమెయిల్/ఫేస్‌బుక్/ట్విట్టర్ మెసేజ్ ద్వారా నన్ను నేరుగా కాంటాక్ట్ చేయవచ్చు. మా కోపరేటివ్ ఫిలిం మేకింగ్ టీమ్‌తో కలిసి ఓ పిక్‌నిక్‌లా ఎంజాయ్ చేస్తూ పనిచేయవచ్చు.

కొత్తవారికోసమైతే ఎలాగూ ఆడిషన్స్ ఉన్నాయి. మనం అక్కడే నేరుగా కలుద్దాం.

హైద్రాబాద్/వైజాగ్/గుంటూరుల్లో జరిగే నా తర్వాతి చిత్రం ఆడిషన్స్‌కోసం .. జస్ట్ కౌంటింగ్ డౌన్ డేస్ .. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0 ..