Sunday 30 January 2022

పుస్తకాలు చదివితే మిరాకిల్స్ జరుగుతాయా?

26 ఏళ్లకే నివేతా థామస్ హీరోయిన్ అయి, మూడు నాలుగు భాషల్లో పనిచేస్తూ, ఒక "అడ్వెంచర్ సీకర్"గా తనకెంతో ఇష్టమైన కిలిమంజరో పర్వతం ఎక్కి జెండా ఎగరేసిందంటే, అదేదో జస్ట్ మిరాకిల్ కాదు.  

దాని వెనుక ఎంతో కృషి ఉంటుంది. దానికంటే ముందు ఒక బలమైన కోరిక ఉంటుంది. తనమీద తనకు నమ్మకముంటుంది.  

మీకు తెలుసా? నివేతా 130 కిలోమీటర్ల స్పీడ్‌తో బులెట్ నడపడంలో స్పెషలిస్ట్. బులెట్ బైక్ కాంపిటీషన్స్‌లో, ర్యాలీస్‌లో కూడా పాల్గొంటుంది. 

ఎక్కడో ఆఫ్రికాలో ఉన్న టాంజానియాలోని కిలిమంజరో అధిరోహించాలని ప్రపంచంలోని అడ్వెంచరిస్టులు చాలామంది అనుకుంటారు. కాని, కొందరివల్ల మాత్రమే అవుతుంది. అది మిరాకిల్ కాదు. బలమైన సంకల్పం. కృషి.       

నివేతా ఇది సాధించిన సుమారు మూడు నెలల తర్వాత, ఈ విషయం ఇప్పుడు నేను ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే కారణముంది...  

కట్ చేస్తే - 

పొద్దున్నే పొరపాటున ఒక ఫేస్‌బుక్ పోస్ట్ చూశాను...

సంపూర్ణమైన నెగెటివిటీతో నిండిన ఆపోస్ట్ చూశాక దాన్ని ఎవరు పోస్ట్ చేశారో చూశాను. అతను నా ఫ్రెండ్స్ లిస్టులో లేడు. షేర్ చేసిన వ్యక్తి మాత్రం నా ఫ్రెండ్స్ లిస్ట్‌లో ఉన్నాడు. వెంటనే అన్‌ఫ్రెండ్ చేసేశాను. 

మనకు చేతగాక మందిని తిట్టడం వల్ల ఫలితం ఉండదు. 

ముందు అలాంటి కొత్తని జీవితంలోకి ఆహ్వానించే పాజిటివ్ మైండ్‌సెట్ నీలో ఉండాలి.   

ఒక పుస్తకం చదవగానే ఎవరి జీవితంలోనూ మిరాకిల్స్ జరగవు. ఆ పుస్తకంలోని ఒక కొత్త విషయమో, కనీసం ఒక వాక్యమో నిన్ను ప్రభావితం చెయ్యాలి. 

అది పర్సనల్ డెవలప్‌మెంట్ పుస్తకమే కానవసరంలేదు. ఒక నవల, ఒక పోయెట్రీ, ఒక కథ, ఒక ఫిలాసఫీ కూడా కావచ్చు.

ఠాగోర్ 'గీతాంజలి' కావచ్చు, జెఫ్రీ ఆర్చర్ 'కేన్ అండ్ ఏబుల్' కావచ్చు. ఐన్ ర్యాండ్ కావచ్చు, మల్లాది వెంకటకృష్ణమూర్తి కావచ్చు. కీట్స్, నీషే, ఇ ఎల్ జేమ్స్. ఎవరైనా కావచ్చు. ఏ పుస్తకమైనా కావచ్చు. 

ఆ క్షణం వాటి నుంచి నువ్వు  పొందే ఆ ప్రభావం కాని, ఆ ఇన్‌స్పిరేషన్ కాని, ఆ 'హై' కాని నిన్ను వెంటాడాలి. వేధించాలి. ముందుకు దూకించాలి. 

అలాంటి పుస్తకాలు ఇంగ్లిష్‌లోనే కాదు, తెలుగులోనూ కోకొల్లలుగా ఉన్నాయి. 

మనం చదవాలి, పనిచెయ్యాలి... మిరాకిల్స్ అవే వెంటపడతాయి.  

చదివి పక్కన పడేసి... "నా జీవితంలో మిరాకిల్స్ జరగలేదు. అదంతా మాఫియా. వాళ్లంతా వేస్ట్ ఫెల్లోస్" అని ఏడవటం వల్ల నువ్వక్కడే ఉంటావు. నీలో నిలువెల్లా ఉన్న నెగెటివిటీతో ఇంకా ఇంకా పాతాళంలోకి పోతావు.

పాజిటివ్ మైండ్‌తో ఉత్సాహంగా పనిచేసుకుంటూ ముందుకెళ్లేవాళ్లు మాత్రం అలా ముందుకెళ్తూనేవుంటారు. 

ఎవరైనా సరే,  అప్పుడప్పుడూ కొంచెం పనికొచ్చే సాహిత్యాన్ని కూడా చదువుతూ ఉండాలి. మెచ్చుకొంటూ ఉండాలి. అప్పుడే జీవితంలోని ప్రతి పార్శ్వాన్ని ఇంచ్ ఇంచ్ అనుభవించగలుగుతాం. కిలిమంజరో పర్వతాల్ని అధిరోహించగలుగుతాం. 

Wednesday 26 January 2022

మట్టితో గద్దెకట్టిన నాటి పంద్రాగస్టు, చబ్బీస్ జనవరి రోజులేవీ?

నా చిన్నతనంలో పంద్రాగస్టు, చబ్బీస్ జనవరి అంటే నిజంగా ఒక పండగే.  

కనీసం ఒక మూడు రోజులు వరంగల్‌లోని మా ఇంటిచుట్టూ పెద్ద సందడి. చెప్పలేనంత హడావిడి...

జెండాగద్దె సరిగ్గా మా ఇంటిముందే! 

పంద్రాగస్టుకు, చబ్బీస్ జనవరికి ప్రతి సంవత్సరం రెండుసార్లు ఫ్రెష్‌గా రాగడిమట్టి తెచ్చి తడితడిగా గద్దె కట్టాల్సిందే. తర్వాత ఎర్రమట్టితో అలకాల్సిందే... 

సలేందర్, ప్రతాప్, స్వామి, శంకర్, భిక్షపతి... ఇంకో పదిమంది ఆనాటి యువతరం ఒక గ్రూప్. వయసులో వీళ్లకంటే కొంచెం చిన్నవాడయినా, మా అన్న దయానంద్ కూడా ఇదే గ్రూపు. 

ఈ గ్రూపంతా కలిసి వారం ముందునుంచే అర్థరూపాయి, రూపాయి, రెండు రూపాయల చొప్పున ఇంటింటికి తిరిగి చందాలు వసూలుచేసేవాళ్లు. సెంటిమెంట్ కోసం, ముందు మా ఇంటికే వచ్చి రెండు రూపాయల చందా తీసుకున్న తర్వాతే మిగిలినవాళ్ళ ఇళ్ళకు వెళ్ళేవారు.  

రాత్రి పొద్దుపోయేవరకూ మా ఇంటిముందున్న పొడవాటి అరుగులపైన కూర్చుని - కనీసం వారం పదిరోజుల ముందునుంచే "ఈసారి జెండావందనం కొత్తగా ఎలా చేయాలి" అన్నదానిమీద ఈ గ్రూపంతా చర్చలు జరిపేవాళ్లు. 

వాళ్లకంటే ఓ పదేళ్లు తక్కువ వయసువాళ్లమయిన  నేనూ, నా చిన్న గ్రూపు కూడా అక్కడే వాళ్ల చుట్టూ నిల్చుని అవన్నీ ఆసక్తిగా వింటూవుండేవాళ్లం. 

మా వీధి మొత్తంలో అప్పుడు మా ఇల్లే చాలా పెద్దది. 

జెండాను ఎగురవేసే గద్దె కూడా సరిగ్గా మా ఇంటిముందే ఉండటంతో దానికి సంబంధించిన ప్రతి పనీ, ప్రతి సడీ మాకూ తెలిసేది. 

జెండావందనం కోసం కొనుక్కొనివచ్చిన రంగురంగుల జెండా కాగితాలు, ఇతర వస్తువులన్నీ తెచ్చి మా ఇంట్లోనే పెట్టేవాళ్లు. కొబ్బరికాయలు, పండ్లు, చాక్లెట్లతోసహా! 

వీధి ఈ చివరినుంచి ఆ చివరిదాకా - ఎన్నో వరుసలు సుతిలితాడు కట్టి, మైదాపిండితో చేసిన "లై"తో, చిన్నపిల్లలం మేము అందిస్తుంటే, ఈ పెద్దవాళ్లు జెండాలు అతికించేవాళ్లు. తర్వాత ఈ జెండాల్నే వీధంతా తోరణాలుగా కట్టేవాళ్లు. 

జెండావందనం రోజు నిజంగా పెద్ద పండగే. 

ముందురోజు రాత్రే ఫ్రెష్‌గా తెచ్చిన మట్టితో అప్పటికప్పుడు మూడు అంచెల్లో గద్దె తయారయ్యేది. ఎర్రమట్టితో దానికి కోటింగ్ కూడా! 

తెల్లవారకముందునుంచే మైకులో గ్రామఫోన్ రికార్డ్ పాటలు. దేశభక్తి పాటలు, భగవద్గీత. 

గ్రూపులో ఒక్కో సంవత్సరం ఒక్కొక్కరు జెండా ఎగురవేసేవారు. జెండా ఎగరేయడానికి స్పెషల్ గెస్ట్ అని ఇప్పట్లా ఎవరినో పిలవటం అప్పుడు లేదు.  

తర్వాత స్వీట్లు, చక్కెర కలిపిన కొబ్బరి ముక్కలు, చాక్లెట్లు అక్కడున్న మా అందరికేకాదు... ఇంటింటికి వెళ్లి మరీ పంచేవాళ్లు. 

కట్ టూ ప్రెజెంట్ - 

అప్పటి ఆ యువతరం గ్రూపులో చాలామంది ఇప్పుడు లేరు. నా చిన్ననాటి మిత్రుల్లో కూడా  ఓంప్రకాశ్, జయదేవ్ ఇప్పుడు లేరు. ఉన్నవాళ్లు ఎవరెవరు ఎక్కడున్నారో కూడా పూర్తిగా తెలియదు. 

ఆనాటి ఆ మట్టి జెండాగద్దె ప్లేస్‌లో ఇప్పుడు ఒక పర్మనెంట్ సిమెంట్ గద్దె ఉంది.  

జెండా గద్దె ముందున్న అప్పటి మా 16 దర్వాజాల పెద్ద ఇల్లు ఇప్పుడు లేదు.  

జెండావందనం ఇప్పుడు అక్కడ ఎలా చేస్తున్నారో, ఎవరు చేస్తున్నారో తెలియదు. ఇవాళ ఎవరు జెండా ఎగరేశారో తెలియదు. అప్పట్లా జెండాల తోరణాలు ఇప్పుడు కూడా వీధివీధంతా కడుతున్నారా అసలు? ఆనాటి సీరియస్‌నెస్ ఇప్పుడు కూడా ఉందా?  

అప్పటి దేశభక్తి వేరు. అప్పటి స్వఛ్ఛత వేరు. అప్పటి ఆసక్తులు, ఇష్టాలు, ప్రాధాన్యతలు.. అన్నీనిజంగా వేరే. 

ఎన్నో ఏళ్లతర్వాత, ఈరోజు, ఇలా... వరంగల్లోని 17 వ వార్డులో... నా చిన్ననాటి పంద్రాగస్టు, చబ్బీస్ జనవరిల  గురించి ఇట్లా నెమరేసుకుంటున్నానంటే, నిశ్చయంగా క్రెడిట్ గోస్ టూ నా తల్లిదండ్రులు, నేను పుట్టిపెరిగిన నా వరంగల్, నా చిన్ననాటి స్నేహితులు, అప్పటి స్వచ్ఛత, అప్పటి వాతావరణం.      

మన పిల్లలకు మనం ఇవ్వాల్సింది ఆస్తులు, అంతస్తులు మాత్రమే కాదు. మంచి వాతావరణం, మంచి జ్ఞాపకాలు కూడా.  

ఈ విషయంలో నా తల్లిదండ్రులు నాకిచ్చినంత జ్ఞాపకాల సంపద... నేను నా పిల్లలకు ఇచ్చానా అని నాకే అప్పుడప్పుడు కొంచెం సందేహంగా ఉంటుంది.  

Monday 24 January 2022

The Book in My Hand

ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకొంటున్నప్పుడు నాకో అలవాటుండేది. 

నేను ఉన్న 'ఏ' హాస్టల్ నుంచి బయటికి ఎక్కడికి వెళ్ళినా చేతిలో ఏదో ఒక బుక్ పట్టుకొనివెళ్లేవాణ్ణి. 

మా ఐకానిక్ ఓయూ ఆర్ట్స్ కాలేజీకి వెళ్ళినా, యూనివర్సిటీ క్యాంటీన్‌కు వెళ్ళినా, మెస్‌కు వెళ్ళినా, గ్రౌండ్‌లో క్రికెట్ చూడ్డానికి వెళ్ళినా, మా ఫేవరేట్ 'చెట్ల కింది క్యాంటీన్' దగ్గర మా 'బిగ్ ఫైవ్', ఇతర ఫ్రెండ్స్‌తో గంటలకొద్దీ చాయ్‌లు, సిగరెట్స్ త్రాగుతూ కథలూ, కవిత్వం, భావుకత్వం వంటి టాపిక్స్ మీద గప్పాలు కొట్టుకొంటూ కూర్చునే స్పాట్‌కు వెళ్ళినా, నా రష్యన్ డిప్లొమా గాళ్‌ఫ్రెండ్స్‌తో కలిసి మెయిన్ లైబ్రరీ చుట్టుపక్కల తిరగడానికెళ్ళినా, ల్యాండ్‌స్కేప్ గార్డెన్‌కెళ్ళినా, టాగోర్ ఆడిటోరియంకెళ్ళినా, ఆఖరికి... ప్రతి శుక్రవారం సంగీత్ థియేటర్లో ఇంగ్లిష్ పిక్చర్‌కెళ్ళినా సరే... నా చేతిలో ఏదో ఒక బుక్ ఉండేది. 

ఇలాంటి అలవాటు నా ఫ్రెండ్స్‌లో ఎక్కువగా మా గుడిపాటికి, రాందాస్‌కు ఉండేది. నేనైనా కొన్నిసార్లు బుక్ మిస్ అయ్యేవాణ్ణి కాని, వీళ్ళిద్దరి చేతిలో బుక్ లేకుండా క్యాంపస్‌లో ఎప్పుడూ చూళ్లేదు నేను. 

ఎక్కువగా నా చేతిలో ఉండే ఆ బుక్  ఫిక్షనే అయ్యుండేది. 

బుక్స్ చేతిలోపట్టుకొని తిరగడమే తప్ప, వాటిని ఎక్కడా ఓపెన్ చేసి చదివే అంత సమయం ఉండేది కాదు! 😊

అంతమాత్రానికి ఎందుకలా బుక్ చేతిలో పట్టుకొని తిరిగావు అని అడక్కండి... నా దగ్గర సమాధానం లేదు. ఇలాంటి అలవాటున్న ఎవరిదగ్గరా సమాధానం బహుశా ఉండకపోవచ్చు.   

అప్పట్లో క్యాంపస్ హాస్టళ్లలో ఉన్న స్టుడెంట్స్‌కు ఓయూ డైరీ చేతిలో పట్టుకొని తిరగటం కూడా ఒక పిచ్చి ప్యాషన్.

డబ్బులు ఉన్నా లేకపోయినా... ఓయూ ప్రెస్‌లో ఆ డైరీలు అమ్మే సమయానికి ఎలాగో డబ్బు రెడీ చేసుకునేవాళ్ళం. రెండు మూడు డైరీలు ఎక్స్‌ట్రా కొని ఎవరికైనా గిఫ్ట్ కూడా ఇచ్చేవాళ్లం.    

నా దృష్టిలో ఓయూ డైరీని మాక్జిమమ్ లెవెల్లో ఉపయోగించింది మా రాందాస్, గుడిపాటిలే అంటే ఎలాంటి అతిశయోక్తిలేదు. బుక్స్‌తోపాటు, ఓయూ డైరీ చేతిలో లేకుండా వాళ్ళిద్దరినీ నేనెప్పుడూ చూళ్లేదు. మేము ఎప్పుడు కలిసినా, మళ్ళీ మేం డిస్పర్స్ అయ్యేలోపు కనీసం ఒక్కసారైనా వీళ్ళిద్దరూ ఏదో ఒకటి డైరీలో రాస్తూ కనిపించేవాళ్ళు. 

క్యాంపస్‌లో నా రెండో పీజీలో ఉండగానే నేను ఉద్యోగంలో చేరిపోయాను. అక్కడితో నా ఈ అలవాటుకి శుభం కార్డు పడింది... ది ఎండ్. 

కట్ చేస్తే -  

నిన్న సాయంత్రం సినీ ప్లానెట్ కెఫెటేరియాలో 'వి యస్' అని ఒక రైటర్ మిత్రున్ని కలిశాను. అతని తాజా పుస్తకం నాకు కాంప్లిమెంటరీ కాపీ ఇచ్చాడు. 

మా మీటింగ్ అయిపోయింది. 

నాకిచ్చిన ఆ కాంప్లిమెంటరీ బుక్ చేతిలో పట్టుకొని సినీప్లానెట్ నుంచి బయటపడి, అక్కడి నుంచి సుమారు ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న మా ఇంటికి నడవసాగాను. 

అలా నేను చేతిలో ఒక బుక్ పట్టుకొని నడిచి ఎన్నేళ్లయిందో నాకసలు గుర్తులేదు.   

నాకు తెలీకుండానే ఒక ట్రాన్స్‌లోకెళ్ళిపోయాను... 

పక్కనే ఉన్న హైవేమీద దూసుకెళ్తున్న వెహికిల్స్, సర్విస్ రోడ్‌లో నా పక్కనే నడుస్తున్న మనుషులు, ట్రాఫిక్, అప్పటిదాకా నా బుర్రలో తిరుగుతున్న ఏవేవో టెన్షన్స్... ఇదంతా నాకేమీ తెలియడం లేదు. 

సుమారు మూడు దశాబ్దాల క్రితం నాటి నా ఓయూ జ్ఞాపకాలు, స్లైడ్ ప్రొజెక్టర్‌లోంచి ఎదురుగా తెల్లటి స్క్రీన్ మీద పడుతున్న విజువల్స్‌లా... ఒక్కో జ్ఞాపకం... చకచకా నా మనస్సులో మూవ్ అవుతూపోయాయి.  

మా బిగ్ ఫైవ్ మిత్రబృందం, మా ఎమ్మే తెలుగు మిత్రులు, మా లైబ్రరీ అండ్ ఇన్‌ఫర్మేషన్ సైన్స్ క్లాస్‌మేట్స్, మా రష్యన్ డిప్లొమా ఫ్రెండ్స్, మా ప్రొఫెసర్స్, మా ఆర్ట్స్ కాలేజీ, మా క్లాస్ రూమ్స్, మా మెయిన్ లైబ్రరీ, మా సెమినార్ లైబ్రరీ, మా సినిమాలు, మా షికార్లు, మా విహారయాత్రలు, మా ఆకలి రాత్రులు, మేం చదివిన పుస్తకాలు, మేం రాసిన రాతలు, మేం కన్న కలలు, మేం మర్చిపోలేని మా మధుర స్మృతులు... అన్నీ... నా మనో యవనిక పైన ఒక్కొక్కటిగా షాట్ బై షాట్ కనిపిస్తూపోయాయి. 

సుమారు మూడు దశాబ్దాల తర్వాత, మళ్ళీ, నిన్న సాయంత్రం నేను నా చేతిలో పట్టుకొని నడిచిన ఆ బుక్‌కి థాంక్స్ ఎలా చెప్పగలను?  

Tuesday 18 January 2022

కొత్త స్క్రిప్ట్ రైటర్స్‌కు అవకాశం!

> మీరు ఫిలిం ఇండస్ట్రీలో కథారచయితగా పరిచయం కావడానికి అవకాశం కోసం ఎదురుచూస్తున్న కొత్త రచయితలై ఉండాలి. 
> యువ రచయితలకు ప్రాధాన్యం ఉంటుంది. 
> ఫిలిం స్క్రిప్ట్ రైటింగ్‌కు సంబంధించిన అన్ని స్కిల్స్ విధిగా మీకు తెలిసి ఉండాలి. 
> స్క్రిప్టుని తెలుగులో స్క్రిప్ట్ ఫార్మాట్‌లో రాయటం తెలిసి ఉండాలి. 
> ఫైనల్‌డ్రాఫ్ట్, మువీమ్యాజిక్, సెల్టెక్స్ వంటి సాఫ్ట్‌వేర్స్‌లో టైప్ చెయ్యటం తెలిసి ఉంటే ఇంకా మంచిది. 
> మీరు చెప్పే కథ పూర్తిగా మీ స్వంతం అయ్యుండాలి. 
> ట్రెండీ కమర్షియల్ కథలకు ప్రాథాన్యం. 
> మీ కథ ఓకే కాని పక్షంలో, అసిస్టెంట్ రైటర్‌గా మా దగ్గర పనిచేయడానికి కూడా సిధ్ధంగా ఉంటే మంచిది. 
> మీ కథ ఓకే చేసినట్టయితే, టైటిల్ కార్డ్‌తో మిమ్మల్ని రచయితగా పరిచయం చేస్తాము. పారితోషికం ఇస్తాము.

పైవన్నీ మీకు సరిపోతాయనుకుంటే, మీ వివరాలు వెంటనే మాకు పంపించండి: 

Whatsapp: +91 9989578125
email: mchimmani10x@gmail.com  

- MANUTIME MOVIE MISSION
- P C CREATIONS 

Friday 14 January 2022

పాలిటిక్స్‌ను ఎందుకు పట్టించుకోవాలి?

టీవీ చానెల్స్‌లో రాజకీయాలు గాని, ఇతర బ్రేకింగ్ న్యూస్‌ను కాని ఎప్పుడైనా బోర్ కొడితే ఎంటర్‌టైన్‌మెంట్ కోసం చూడాలి తప్ప, వాటిని సీరియస్‌గా తీసుకొని సమయం వృధా చేసుకోవద్దు. 

చానెల్స్ గోల్స్ వేరే. వాళ్ళ టీఆర్పీ లెక్కలు వేరే. 

90% బ్రేకింగ్ న్యూస్‌లు జస్ట్ యాడ్స్ మధ్య ఫిల్లర్స్ లాంటివి. అంతకంటే ఏం లేదు. 

"సమంతకు దగ్గు", "అనుష్కకు ఎలర్జీ" స్థాయికి బ్రేకింగ్ న్యూస్‌ను తీసుకెళ్ళిన చానెల్స్‌కు జయహో! 

ఇదంతా ఎలా వున్నా, "మన నిత్యజీవితంలోని ప్రతి అంశాన్నీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పాలిటిక్స్ ప్రభావితం చేస్తున్నప్పుడు, ఆ పాలిటిక్స్‌ను పట్టించుకోవడం తప్పనిసరి" అని వందల ఏళ్ల క్రితం నుంచి ఎంతోమంది అనుభవజ్ఞులు చెప్తున్నారు. చదువుకున్న విద్యావంతుల్లో 90% మంది అసలు రాజకీయాల్ని పట్టించుకోరు. వీరి నిరాసక్తతే ఈ దేశంలో పాలిటిక్స్ ఇంకా ఇలా సాగుతుండటానికి ప్రధాన కారణం అంటే, అందులో ఎలాంటి ఆశ్చర్యం లేదు. 

నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం - ఇంక 100 ఏళ్లయినా ఈ దేశంలో రాజకీయాలు ఇలాగే ఉంటాయి. కులం, మతం ఎట్సెట్రా ఇలాగే శాసిస్తుంటాయి.

గతంలో వున్న రాచరికానికి ప్రజాస్వామ్యం అనే ఒక ముసుగే ఇప్పటి రాజకీయాలు తప్ప పెద్దగా మార్పులేం లేవు. ఉండవు.  

మన దేశ రాజకీయాల్లో ఒక లేయర్ లేయరే కొట్టుకుపోవాలి. అదెప్పటికైనా, ఏదో ఒక మిరాకిల్ లాగా సాధ్యమే అని ఒక చిన్న ఆశ. అంతే. 

అలా జరగనంత కాలం ఈ దేశంలో రాజకీయాలు ఇలాగే ఉంటాయి. అలాగని నిరాశపడిపోయి వీటిని మరీ పట్టించుకోకుండా ఉండటం కూడా తప్పే అవుతుంది. 

ప్రత్యక్ష రాజకీయాల్లోనే పాల్గొనాల్సిన అవసరం లేదు. కాని...  కళ్లముందు కనిపిస్తున్న అంకెలు, అభివృధ్ధి, పెర్ఫార్మెన్స్‌ను బట్టి... ఉన్నవాటిలోనే ది బెస్ట్‌ను సపోర్ట్ చేయడం మన బాధ్యత. ఇది కూడా చెయ్యలేకపోతే అంతిమంగా ఎఫెక్టయ్యేది కూడా మనమే. 

Thursday 13 January 2022

అంతా బాగున్నప్పుడు...

ఒక చిన్న కష్టం ఉంటుంది. లేదా, ఏదో పర్సనల్ సమస్యలో అనుకోకుండా ఇరుక్కుపోతాం. లేదంటే, ఏదో ఒక ప్రొఫెషనల్ కమిట్‌మెంట్ మిస్ ఫైర్ అయి, ఊహించనివిధంగా మనల్ని ఎంతగానో ఇష్టపడిన మిత్రుల దృష్టిలో ఒక్కసారిగా చెడ్దవారిమైపోతాం. 

వీటిలో ఏదో ఒకటో, లేదా అన్నీ ఒక్కసారిగానో... మనల్ని హాంట్ చేసే పరిస్థితి వస్తుంది. 

కొందరు డీలా పడిపోయి సూసైడ్‌లు చేసుకుంటారు. కొందరు డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయి త్రాగుడుకి ఎడిక్టయి మొత్తంగానే కోలుకోకుండా అయిపోతారు.

వీళ్ళిద్దరికి అసలు సమస్యే లేదు. ఒకడు చచ్చిపోతాడు. ఇంకొకడు బ్రతికున్నా చచ్చినట్టే లెక్క. 

కట్ చేస్తే -   

కొందరు మాత్రం చాలా కష్టపడుతూ, ఒక్కో సమస్య నుంచి బయటపడే పని చేస్తుంటారు.  

అసలు సమస్య ఇక్కడే. 

బ్రతికున్న వీడి జీవితం నిజంగా నరకం. 

ముందు ఈ సమస్య క్లియర్ చేస్తే అంతా బాగుంటుంది. అప్పుడు మిగిలిన పనులు టెన్షన్-ఫ్రీగా, ఫుల్ ఫ్రీడంతో చేసుకోవచ్చు అని ఇలాంటి పరిస్థితిలో ఉన్నవారిలో 95% మంది అనుకుంటారు.

అదే పెద్ద తప్పు. 

కొన్ని సందర్భాల్లో ప్రతి చిన్న సమస్య కూడా ఇంకో రెండు వారాల్లోనో, రెండు నెలల్లోనో పరిష్కారమవుతుంది. ఫ్రీ అయిపోతాం అనుకుంటాం. వాస్తవం కూడా అదే.

కాని, అలా కావు.

చూస్తుంటే, వారాలు నెలలు నుంచి ఒక్కోసారి సంవత్సరాలు గడుస్తుంటాయి. పరిస్థితి అలాగే ఉంటుంది. మారదు. 

ఫోకస్ సమస్యల మీద కాదు, వాటి పరిష్కారాలమీద పెట్టాల్సి ఉంటుంది. అవి పరిష్కారం కావాలంటే మెయిన్ ట్రాక్‌లో అన్ని పనులు జరుగుతూ ఉండాలి. అప్పుడు మాత్రమే సమస్యల పరిష్కారం చాలా సులభమవుతుంది. 

అయితే - ఇది చెప్పినంత సులభం కాదు. చాలా కష్టం. 

కాని, ఇదే సులభం.  

"అంతా బాగున్నప్పుడు" అనేది ఎప్పుడూ ఉండదు. 

ఈ నిజం తెలుసుకోవడానికి ఒక్కోసారి రెండుమూడేళ్ళు కూడా పట్టవచ్చు. గడిచిన ఆ రెండుమూడేళ్ళు తిరిగిరావు. అదే పెద్ద విషాదం. 

BECOME HERO, BECOME CO-PRODUCER!

సినీఫీల్డు వైపు బాగా ఆసక్తి ఉండి, నాతో వెంటనే కొలాబొరేట్ అవ్వగల లైక్-మైండెడ్ ఫండింగ్ పార్ట్‌నర్స్ కోసం నేను చూస్తున్నాను.    

మీరు ఇన్వెస్టర్-హీరోగా ఫండింగ్ చేయొచ్చు. కో-ప్రొడ్యూసర్‌గా కూడా  అసోసియేట్ అవొచ్చు. మీకు సినీఫీల్డు పట్ల అమితమైన ప్యాషన్ ఉండటం ముఖ్యం.   

పార్ట్‌నర్‌గా మీ బెనిఫిట్స్ మీకు చాలా ఉంటాయి. అవన్నీ పర్సనల్‌గా చర్చిద్దాం.   

మనం కాల్‌లో మాట్లాడుకోడానికి ముందు, మీకు తెలియాల్సిన మరిన్ని వివరాల కోసం వీలైతే ఈ లింక్స్ క్లిక్ చేసి, చదవండి. తర్వాత కాల్ చేయండి: 

1. Investor-Hero option: https://bit.ly/hero10x 
2. Co-Producer option: http://bit.ly/totalcinema 

మీరు వెంటనే ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నట్టయితే, నాకు కాల్‌ చేయండి. మాట్లాడుకుందాం... కలుద్దాం... కొత్త సినిమా ప్రారంభిద్దాం.      

Welcome to Glamour World! 

Film Director, Nandi Award Winning Writer
Call: +91 9989578125
Email: mchimmani10x@gmail.com

ABOUT MANOHAR CHIMMANI: 

PS: 
మీ కాంటాక్ట్స్‌లో సినీఫీల్డు వైపు ఆసక్తి ఉన్నవారికి, ఫిలిం ప్రొడక్షన్‌లో ఇన్వెస్ట్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఉన్నవారికి, ఇన్వెస్ట్ చేస్తూ హీరోగా పరిచయం కావాలని ప్రయత్నిస్తున్నవారికి... దయచేసి ఈ లింక్ షేర్ చేయండి. థాంక్ యూ! 😊

Saturday 8 January 2022

'చిన్న బడ్జెట్ సినిమా' అంత చిన్నదేం కాదు!

ఈ ప్రపంచం మొత్తం "డ్యూయాలిటీ" మీద నడుస్తుంది. ధనిక-పేద, ఆడ-మగ, కింద-మీద, నలుపు-తెలుపు, దొడ్డు-సన్నం, పొడుగు-పొట్టి, దూరం-దగ్గర, నవ్వు-ఏడుపు, సుఖం-దుఖం, లాభం-నష్టం, హిట్-ఫ్లాప్, చిన్న-పెద్ద ఎట్సెట్రా. 

డ్యూయాలిటీలో రెండిటికీ విలువ ఉంటుంది. మధ్యలోదంతా ఉట్టి ట్రాష్. దానికసలు విలువుండదు.  

ఉదాహరణకు, సినిమాల్లో హిట్, ఫ్లాప్ అని రెండే ఉంటాయి. నో మిడిల్ గ్రౌండ్. యావరేజ్ అనేది ఉట్టి భ్రమ. దానికి అర్థం లేదు. డబ్బులొచ్చాయా హిట్ సినిమా. రాలేదంటే ఫ్లాప్. అంతే.   

అలాగే పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు. అంతవరకే. మిడ్ రేంజ్ హీరోలు, మిడిల్ క్లాస్ సినిమాలు అనేం ఉండవు. ఉన్నాయి అనుకొని ఎవరైనా భ్రమపడ్డా అదంతా లెక్కలోకి రాదు. 

కట్ చేస్తే - 

తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్ద బడ్జెట్ సినిమాలు సంవత్సరానికి ఒక 10 కంటే ఎక్కువ ఉండవు. ఈ పెద్ద సినిమాల మొత్తం బడ్జెట్ సుమారుగా ఒక 1000 కోట్లు ఉంటుందనుకుందాం. ఈ 10 సినిమాల నిర్మాతలు, వీటిల్లో పనిచేసే హీరోలు, హీరోయిన్స్, ఆర్టిస్టు, టెక్నీషియన్స్ అంతా కలిపి ఒక 200 మందికి మించి ఉండరు. 

పెద్ద సినిమాలు ఎంత భారీ రేంజ్‌లో హిట్ అయినా సరే... ఆ లాభాలు, ఆ స్థాయి రెమ్యూనరేషన్స్, ఖర్చులు అన్నీ ఈ 200 మంది మాత్రమే పొందుతారు, అనుభవిస్తారు. నష్టమొస్తే - ఆ 10 సినిమాల నిర్మాతలు, బయ్యర్లవరకే. 

చిన్న బడ్జెట్ సినిమాలు అలా కాదు. ఇవి సంవత్సరానికి కనీసం ఒక 150 దాకా తయారవుతాయి. అంతా కలిపి, ఈ 150 సినిమాల బడ్జెట్ ఒక 300 కోట్లే ఉండొచ్చు. కాని, ఈ 150 సినిమాల మీద ఆధారపడి ఒక 5 వేల కుటుంబాలు బ్రతుకుతాయి. 

వివిధరూపాల్లో ఇండస్ట్రీకి ఎక్కువ ఆదాయాన్ని తెచ్చిపెట్టేవి కూడా ఈ 150 చిన్న సినిమాలే. 

వారసత్వంగా వచ్చే హీరోలు, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ కాకుండా - సొంత కెపాసిటీతో అవకాశాలు సంపాదించుకొని, పైకొచ్చే ఫ్యూచర్ స్టార్స్, మెగా స్టార్స్ అంతా కూడా ఈ చిన్న సినిమాల ద్వారా మాత్రమే ముందు పరిచయమవుతారు. 

అయితే - చిన్న సినిమాల ద్వారా పైకొచ్చిన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ కూడా పైకొచ్చాక ఇదే చిన్న సినిమాలను చాలా చిన్న చూపు చూస్తారు.

కాని - హాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా, ఈ చిన్న బడ్జెట్ సినిమాలు మొదటినుంచీ తమ ప్రత్యేక ఉనికిని నిలబెట్టుకుంటూనే ఉన్నాయి. 

ఇప్పుడు, కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ఫిలిం ప్రొడక్షన్ బిజినెస్‌లో వచ్చిన ఎన్నో కొత్త పరిణామాలు, ఈ చిన్న బడ్జెట్ సినిమాల్లో మరిన్ని ఉపాధి అవకాశాలు పెంచాయి. కొత్తగా ఓటీటీ వంటి మరెన్నో లాభాలకు ద్వారాలు తెరిచాయి.  
***

#Cinema #BigBusiness #TeluguCinema #Tollywood #SmallBudgetCinema #LowBudgetFilms #MicroBudgetMovies #ManoharChimmani #NagnaChitram #MyBlog #TeluguBlog

Friday 7 January 2022

ఎంటర్ ది డ్రాగన్, ఆర్జీవీ!

"Sometimes people don’t want to hear the truth because they don’t want their illusions destroyed." - Nietzsche

సినిమా బేస్ క్రియేటివిటీనే. కాని, దాని టార్గెట్ మాత్రం ఖచ్చితంగా వ్యాపారమే!  

ఇక్కడ నేను మాట్లాడుతున్నది కమర్షియల్ సినిమా గురించి... 

తెలుగు సినిమా మార్కెట్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. చూస్తుండగానే 30 కోట్ల నుంచి 100 కోట్లు, 300 కోట్ల నుంచి 1000 కోట్లను అందుకొనే దాకా వెళ్ళింది బిజెనెస్. తర్వాతి బెంచ్ మార్క్ 2000 కోట్లు. అది కూడా త్వరలోనే చూస్తాం.  

2021 లో, బాలీవుడ్‌ను కూడా బీట్ చేసి, దేశంలోనే అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ సాధించిన సినిమా... తెలుగు సినిమా!  ఇప్పుడు బాలీవుడ్‌లోని టాప్ ప్రొడ్యూసర్స్ తెలుగులో తీస్తున్న ప్రతి ప్యానిండియా సినిమాతో అసోసియేట్ అవుతున్నారు. కొత్తవి ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతాయా అని ఎదురుచూస్తున్నారు.  

రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్‌కు వచ్చే కొందరు బాలీవుడ్ హీరోలు, నిర్మాతలు తెలుగులో హిట్ అయిన చిన్న సినిమాలను కూడా తెప్పించుకొని మరీ చూస్తున్నారు. ఏ కొంచెం బాగుంది అనిపించినా, వెంటనే ఆ సినిమా రైట్స్ కొనేసుకుంటున్నారు.

ఇప్పుడు తెలుగు సినిమా మార్కెట్ అదీ.    

ఈ నేపథ్యంలో - ఏపీలో టికెట్ రేట్స్ వ్యవహారం ఒక రేంజ్‌లో దుమ్ము రేపుతోంది అంటే తప్పదు. వందల కోట్ల వ్యవహారం అక్కడ! కాని, వినిపించాల్సినవారి గొంతులే అసలు వినిపించలేదు. 

సడెన్‌గా "ఎంటర్ ది డ్రాగన్"లా ఆర్జీవీ ఎంట్రీ బహుశా ఎవరూ ఊహించలేదు. ఒక్క దెబ్బకి ఇష్యూ మొత్తం అరటిపండు వొలిచి చేతిలోపెట్టినట్టు, కామన్ మ్యాన్‌కి కూడా అర్థమైపోయింది.

కరోనాకు ముందు, కరోనాకు తర్వాత లాగా... ఈ టికెట్ రేట్స్ వ్యవహారంలో కూడా "ఆర్జీవీ ఎంట్రీకి ముందు, ఆర్జీవీ ఎంట్రీకి తర్వాత" అని చెప్పాల్సి ఉంటుంది. 

కట్ చేస్తే - మినిస్టర్ ఆహ్వానం అందుకొని, రేపు పదో తేదీ ఏపీ మినిస్టర్‌ను కలవడానికి వెళ్తున్నాడు ఆర్జీవీ! 

వాస్తవానికి ఇది - టికెట్ కొనేవాడు, అమ్మేవాడు, చూపించేవాడు, గవర్నమెంట్... ఈ నలుగురికి సంబంధించిన వ్యవహారం. కాని, ఈ రెండు రాష్ట్రాల్లో దీనికి మించిన సమస్య ఏదీ లేదు అన్నట్టుగా, టీవీ చానెల్స్ ప్రస్తుతం ఈ బ్రేకింగ్ న్యూస్‌ల మీదనే బ్రతుకుతున్నాయి. విధిలేక ప్రేక్షకులు ఆ న్యూస్‌నే చూస్తూ విసిగిపోతున్నారు. యూట్యూబ్ చానెల్స్, సోషల్ మీడియా నిండా కూడా ఇదే గొడవ. 

ఈ టికెట్ రేట్స్ ఇష్యూ కారణంగా, గత కొద్దిరోజులుగా ఎంతో విలువైన సమయం, మ్యాన్ పవర్, ఇంటర్నెట్ డేటా ఊహించని స్థాయిలో వృధా కావడం అనేది అత్యంత విషాదం. వాస్తవం ఏంటన్నది ఏపీ ప్రభుత్వానికి, ఇండస్ట్రీవారికీ స్పష్టంగా తెలుసు. మధ్యలో పిచ్చి పుల్లయ్యలు ఎవరో చిన్న పిల్లాడినడిగినా చెబుతాడు. 😊
***

#Cinema #BigBusiness #TeluguCinema #Tollywood #TicketsIssue #RGV #RamGopalVarma #ManoharChimmani #NagnaChitram #MyBlog #TeluguBlog

Thursday 6 January 2022

అతి తక్కువ సమయంలో సినిమాల్లో అవకాశాలు సంపాదించడం ఎలా?

ఒకప్పుడు కష్టం. ఇప్పుడు అంత కష్టం కాదు. చెప్పాలంటే, ఈ డిజిటల్-సోషల్ మీడియా యుగంలో ఏదీ కష్టం కాదు. 

అదంతా ఈ సర్టిఫికేట్ కోర్స్‌లో మీరు తెలుసుకుంటారు, నేర్చుకుంటారు.

అలాగని - ఈ కోచింగ్ అందరికీ కామన్ కాదు. అభ్యర్థుల లక్ష్యాల్ని బట్టి, వారికున్న స్కిల్స్ స్థాయిని బట్టి ఒక్కొక్కరికి ఈ కోచింగ్ విభిన్నంగా ఉంటుంది.  

> కోచింగ్ అంతా ఆన్‌లైన్‌లోనే ఉంటుంది. 
> ఆన్‌లైన్‌లోనే మీకు అవసరమైన కంటెంట్ షేర్ చెయ్యడం ఉంటుంది. 
> కోర్స్ పూర్తయ్యాక, సర్టిఫికేట్ కొరియర్‌లో పంపిస్తాము. 
> తర్వాత, మా సినిమాల షూటింగ్ సమయంలో 'ఆన్‌-లొకేషన్ అధ్యయనం' చెయ్యడానికి అవకాశం కల్పిస్తాము.  

కట్ చేస్తే - 

యాక్టింగ్, డైరెక్షన్, స్క్రిప్ట్ రైటింగ్స్‌లో ఇప్పుడు కొత్తగా ఒక సర్టిఫికేట్ కోర్స్ అవసరమా అన్నది మీ కొశ్చన్. 

ఖచ్చితంగా అవసరమే! 

ఇతర కోచింగ్స్‌కు లక్షల్లో ఫీజు చెల్లించలేనివారి కోసం తక్కువ ఫీజులో ఈ సర్టిఫికేట్ కోర్స్ బాగా ఉపయోగపడుతుంది. 

ఈ కోర్స్‌లో చేరటం ద్వారా అభ్యర్థులు తెలుసుకోవాల్సిన సిసలైన ఇండస్ట్రీ బేసిక్స్ తెలుసుకొంటారు, నేర్చుకొంటారు. అభ్యర్థుల విలువైన సమయం వృధా కాదు. సీరియస్‌నెస్, ప్యాషన్, పట్టుదల ఉన్న అభ్యర్థులు ఈ కోచింగ్‌లో నేర్చుకొన్న విషయాలతో వారి లక్ష్యాన్ని అతి సులభంగా సాధిస్తారు. 

మీకు అవసరమైనప్పుడు గైడెన్స్ ఇవ్వడానికి నేనెప్పుడూ మీకోసం రెడీగా ఉంటాను.  

ఇంకేం కావాలి?

ఫీజు వివరాల కోసం వెంటనే కాల్ చేయండి: 9989578125

ఆల్ ద బెస్ట్! 

Nandi Award Winning Writer, Film Director

About Manohar Chimmani:

(దయచేసి ఇది అవసరం ఉన్నవారు ఎవరైనా మీకు తెలిసుంటే వారికి ఫార్వార్డ్ చేయండి. థాంక్స్!) 
***

#FilmCoaching #OnlineCoaching #FilmCoachingOnline #Acting #Direction #SCriptWriting #ManoharChimmani #Nagnachitram #MyBlog #TeluguBlog 

Wednesday 5 January 2022

జనవరి 13, వైజాగ్ జ్ఞాపకం

ఒకటి రెండు రోజుల్లో వైజాగ్ ప్రయాణం. ముఖ్యమైన మీటింగ్స్, పనులు చాలా ఉన్నాయి. రాజమండ్రి, కాకినాడ ట్రిప్స్ కూడా ఉంటాయి కాబట్టి, బహుశా సంక్రాంతి వరకూ అక్కడే. అటువైపే. 

వైజాగ్‌లో నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు, నా స్టుడెంట్స్ కూడా ఉన్నారు. 

కాని, ఎవ్వరినీ కలిసే అవకాశం లేదు ఈసారి. షెడ్యూల్ అంత టైట్‌గా ఉంది. 

పైగా, ఆడిషన్స్ కూడా ఉన్నాయి. ఎక్కడికీ కదిలే పరిస్థితి లేదు. 

ఒకరిద్దరు ఆత్మీయ మిత్రుల్ని మాత్రం నేనే హోటల్‌కి లంచ్‌కు ఆహ్వానిద్దామనుకొంటున్నాను. 

కట్ చేస్తే -  

గత సంవత్సరం, ఏప్రిల్ మూడోవారంలో అనుకుంటాను... సెకండ్ వేవ్‌లో పడిన దెబ్బ నుంచి నేనింకా కోలుకోలేదు. అడ్వాన్స్ ఇచ్చిన ప్రొడ్యూసర్ వెనక్కిపోయాడు. ఇంకో ష్యూర్ ఫైర్ ప్రొడ్యూసర్ అనుకొన్న మిత్రుడు సాగదీసీ తీసీ చివరికి చెయ్యిచ్చాడు.   

ఏది ఎలా ఉన్నా, మూడో వేవ్ వచ్చినా, ఈ నెల్లో మాత్రం ఒక్కొక్కటిగా అన్నీ కదిలిస్తున్నాను. 

దాదాపు మూడేళ్ళుగా 'బండ కింద ఇరికిన' నా చేతిని బయటికి లాక్కొంటున్నాను.    

బై ద వే, సినిమాలొక్కటే కాదు... యాడ్స్ ఎట్సెట్రా ఇంకా చాలా పనులున్నాయి  వైజాగ్‌లో. 

కట్ చేస్తే - 

ముందు ఒకటి-రెండు మైక్రో బడ్జెట్ సినిమాలతో ప్రారంభించి, తర్వాత ఒక బిజీ & భారీ ప్రొడక్షన్ హౌజ్ నడిపించే దిశలో ఒక్కో స్టెప్ వేసుకుంటూ ముందుకెళ్తున్నాను. 

ఒక చిన్న కిక్‌స్టార్టర్ కోసం వెయిటింగ్. అది ఈ ట్రిప్‌తో అయిపోతుంది. 

ఇదంతా ప్యాషన్ కాదు, అవసరం. 

కట్ చేస్తే -

జనవరి 13... సుమారు నాలుగేళ్ల క్రితం అనుకుంటాను. వైజాగ్‌లో ఒక మిరాక్యులస్ డీల్ సెట్ అయింది. మైత్రి రిసార్ట్స్, యూనివర్సిటీ గెస్ట్ హౌజ్‌ల్లో ఆ డీల్‌కు సంబంధించి జరిగిన బిజినెస్ మీటింగ్స్ ఇప్పటికీ నా మైండ్‌లో ఫ్రెష్‌గా ఉన్నాయి. 

అదే డీల్ ఈ జనవరి 13 కు కూడా మళ్లీ ప్లాన్‌లో ఉంది. అవసరమైతే కొంచెం తగ్గి అయినా, అదే యాడ్ డీల్‌ను ఇప్పుడు మళ్ళీ సక్సెస్ చేయాలనుకొంటున్నాను.

Q: సక్సెస్ అవుతుందా మరి?
A: అంత ఈజీ కాదు. కాని, అవుతుంది. 
Q: ఏంటంత నమ్మకం?
A: అవతల 'పార్టీ' పైకి బండలా కనిపించినా, మనసు వెన్న.  

కొన్నిటికి కారణాలుండవు. లాజిక్కులుండవు. అలా జరిగిపోతాయ్. 

అంతా ఒక మాయలా, ఒక మహాద్భుతంలా అనిపిస్తుంది. 

"ఎందుకలా?"... అంటే చెప్పడానికి నాదగ్గర కారణాల్లేవు. 

ఏదో 'స్పిరిచువల్ కనెక్షన్' అనుకుంటాను... అంతే. 

Monday 3 January 2022

కొత్త దర్శకులు, చిన్న బడ్జెట్ సినిమా దర్శకుల కోసం స్క్రిప్ట్ రైటింగ్!

Script Writing Services Made Easy! 

హిట్ సినిమా కోసం మీ దగ్గర మంచి మంచి కాన్‌సెప్ట్స్ ఉంటాయి. ఎంతో మంచి ఐడియాలుంటాయి.  

సమస్యల్లా ఒక్కటే. 

మీలో చాలా మందికి పర్‌ఫెక్ట్‌గా స్క్రిప్ట్ రాసుకొనే అవకాశం ఉండదు. అంత సమయం ఉండదు. 

90 శాతం చిన్న బడ్జెట్ సినిమాలకు ఉండే ఏకైక సమస్య డబ్బే. పేరుకే నిర్మాత ఉంటాడు. కాని, డబ్బు ఎక్కడెక్కడి నుంచి వస్తుందా, ఎప్పుడొస్తుందా అని 24/7 ఎప్పుడూ టెన్షన్ పడేది డైరెక్టరే. 

కాన్‌సెప్ట్ స్టేజి నుంచి, సినిమా రిలీజయ్యే దాకా... ఈ ఫండ్స్ టెన్షన్‌తోనే  డైరెక్టర్‌కు తెల్లారిపోతుంది. 

మరోవైపు,  24 క్రాఫ్ట్స్‌తో కోఆర్డినేట్ అవుతూ, ఎప్పటికప్పుడు పని ప్లాన్ చేసుకోవటం ఎప్పుడూ ఉండనే ఉంటుంది.   

ఇక స్క్రిప్ట్ రాసుకొనే సమయమెక్కడ?  

అంతకుముందే ఏళ్లతరబడి ఆలోచించి మీరు రాసుకున్న "ష్యూర్ హిట్ బౌండెడ్ స్క్రిప్ట్‌లు" ఉంటాయి కదా అనుకోడానికి లేదు. సమయం గడుస్తున్నకొద్దీ అవేవీ పనికిరావన్న విషయం మీకు తెలుసు. 

అడ్వాన్స్ ఇచ్చాక, సింపుల్‌గా "ఇంకో స్టోరీలైన్ చూడండి" అంటారు.  

లేదా, ఇంకెన్నో రీజన్స్‌తో, ఎప్పటికప్పుడు మీరే కొత్తగా కాన్‌సెప్ట్స్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది.

ప్రపంచంలో ఏ కొత్త దర్శకుడికైనా, ఏ చిన్న బడ్జెట్ సినిమా దర్శకుడికయినా పరిస్థితి ఇలాగే ఉంటుంది.      

ఒక దర్శకరచయితగా ఇలాంటి అనుభవం నాకూ ఉంది. 

ఇలాంటి టెన్షన్ మీకొద్దు. 

స్టోరీలైన్ మీదైనా ఓకే. లేదంటే - మీరు చెప్పిన జోనర్‌లో మీకు నచ్చే 2, 3 స్టోరీలైన్లను నేనే మీకిస్తాను.  

స్క్రిప్ట్ విషయంలో ఆ బాధ్యత మీరు నిశ్చింతగా నాకు వదిలేసి, మీ ఇతర పనుల్లో హాయిగా ముందుకెళ్ళిపొండి. 

మీ ప్రొడ్యూసర్‌తో కలిసి సమయానికి ఫండ్స్ ఎలా అందాలో ఆ విషయం చూడండి. మీ సినిమాను హిట్ చెయ్యడానికి మీరెన్ని దిశల్లో ఆలోచించాలో ఆ పని చేయండి.  

మీరు అనుకున్న సమయానికి, అనుకున్న స్థాయిలో మీకు స్క్రిప్ట్ అందించే బాధ్యత నాది. 

ఓకే అనుకుంటే, పూర్తి వివరాలు క్రింది లింక్‌లో చదవండి. ఆ తర్వాతే, నాకు వాట్సాప్ చేయండి. 

Read it & get connected: 

ఆల్ ద బెస్ట్. 

- మనోహర్ చిమ్మని  
Nandi Award Winning Writer, Film Director
Whatsapp: +91 9989578125

ABOUT MANOHAR CHIMMANI: 

Request:
మీ కాంటాక్ట్స్‌లో "స్క్రిప్ట్ రైటింగ్" అవసరం ఉన్నవారికి ఇది షేర్ చేయండి. థాంక్ యూ.
***

#ScriptWritingServices #FilmScriptWriting #TollywoodScripts #TeluguFilmScripts #ScriptWritingMadeEasy #ManoharChimmaniContentWritings #ManoharChimmani #Nagnachitram #TeluguBlog #TeluguFilmBlog #TeluguBlogOnFilms 

Sunday 2 January 2022

దక్షిణాది నుంచి బాలీవుడ్ వెళ్ళి జెండా ఎగరేసిన మొదటి వ్యక్తి ఎవరు?

కరీంనగర్‌లో పుట్టాడు, హైద్రాబాద్ నిజాం కాలేజీలో చదివాడు. 1929 లో ముంబై వెళ్ళాడు. 


11 మూకీ సినిమాలు, 156 టాకీ సినిమాల్లో నటించాడు. హిందీతో పాటు ఉర్దూ, మరాఠీ, గుజరాతీ సినిమాల్లో కూడా నటించాడు. 

శాంతారాం, పృధ్వీరాజ్ కపూర్ లాంటి పెద్ద హీరోల సరసన మరో పెద్ద హీరోగా పేరు తెచ్చుకున్నాడు.

దేవికారాణి, మీనాకుమారి లాంటి టాప్ హీరోయిన్స్‌తో జంటగా నటించాడు. అప్పటి పాపులర్ హీరోయిన్ నర్గీస్‌ను హీరోయిన్‌గా పెట్టి సినిమా తీశాడు. 

1980 లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు తీసుకున్నాడు. ఇంక చాలా ఉంది... 

కట్ చేస్తే - 


అందులో - దక్షిణాదినుంచి వెళ్ళిన కొంతమంది ప్రస్తావన తెచ్చారు. పేర్లు ఉదాహరించారు. గురుదత్, రజినీకాంత్, కమలహాసన్, వైజయంతిమాల, హేమమాలిని, శ్రీదేవి వగైరా. 

ఏ రకంగా చూసినా, ముందు ఉదాహరించాల్సిన రెండు మూడు పేర్లలో అతని పేరు తప్పక ఉండితీరాలి.

మరి ఎందుకనో ఉండదు. 

ఇదొక్కటే కాదు. ఎన్నో ఆర్టికిల్స్‌లో, ఎన్నో పుస్తకాల్లో ఇతని ప్రస్తావన అసలు రాదు. ఇతను సాధించిన విజయాల గురించి రాయరు. 

తెలియక కొందరు. తెలిసీ రాయని కొందరు. 

మొత్తానికి అతని పేరు మాత్రం మిస్ అవుతుంది.

ఇప్పటివారికే తెలీదు. ఇంక తర్వాతి తరాలవారికేం తెలుస్తుంది? 

ఆ కాలంలోనే అతను సాధించిన ఎన్నో విజయాలను ప్రాంతం అనే ఒక చిన్న విషయం నిజంగా అలా కమ్మేస్తుందా? 

అలా కమ్మేసిన ఆ ప్రఖ్యాత నటుడు, దర్శకుడు, నిర్మాత పేరు... పైడి జైరాజ్.  
***

#PaidiJairaj #DadasahebPhalkeAwardWinner #HindiHero #HeroFromKareemNagar #KareemNagarHero #TelanganaHero #BollywoodHeroFromTelangana #BollywoodHero #BollywoodDirector #BollywoodProducer