Sunday 30 January 2022

పుస్తకాలు చదివితే మిరాకిల్స్ జరుగుతాయా?

26 ఏళ్లకే నివేతా థామస్ హీరోయిన్ అయి, మూడు నాలుగు భాషల్లో పనిచేస్తూ, ఒక "అడ్వెంచర్ సీకర్"గా తనకెంతో ఇష్టమైన కిలిమంజరో పర్వతం ఎక్కి జెండా ఎగరేసిందంటే, అదేదో జస్ట్ మిరాకిల్ కాదు.  

దాని వెనుక ఎంతో కృషి ఉంటుంది. దానికంటే ముందు ఒక బలమైన కోరిక ఉంటుంది. తనమీద తనకు నమ్మకముంటుంది.  

మీకు తెలుసా? నివేతా 130 కిలోమీటర్ల స్పీడ్‌తో బులెట్ నడపడంలో స్పెషలిస్ట్. బులెట్ బైక్ కాంపిటీషన్స్‌లో, ర్యాలీస్‌లో కూడా పాల్గొంటుంది. 

ఎక్కడో ఆఫ్రికాలో ఉన్న టాంజానియాలోని కిలిమంజరో అధిరోహించాలని ప్రపంచంలోని అడ్వెంచరిస్టులు చాలామంది అనుకుంటారు. కాని, కొందరివల్ల మాత్రమే అవుతుంది. అది మిరాకిల్ కాదు. బలమైన సంకల్పం. కృషి.       

నివేతా ఇది సాధించిన సుమారు మూడు నెలల తర్వాత, ఈ విషయం ఇప్పుడు నేను ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే కారణముంది...  

కట్ చేస్తే - 

పొద్దున్నే పొరపాటున ఒక ఫేస్‌బుక్ పోస్ట్ చూశాను...

సంపూర్ణమైన నెగెటివిటీతో నిండిన ఆపోస్ట్ చూశాక దాన్ని ఎవరు పోస్ట్ చేశారో చూశాను. అతను నా ఫ్రెండ్స్ లిస్టులో లేడు. షేర్ చేసిన వ్యక్తి మాత్రం నా ఫ్రెండ్స్ లిస్ట్‌లో ఉన్నాడు. వెంటనే అన్‌ఫ్రెండ్ చేసేశాను. 

మనకు చేతగాక మందిని తిట్టడం వల్ల ఫలితం ఉండదు. 

ముందు అలాంటి కొత్తని జీవితంలోకి ఆహ్వానించే పాజిటివ్ మైండ్‌సెట్ నీలో ఉండాలి.   

ఒక పుస్తకం చదవగానే ఎవరి జీవితంలోనూ మిరాకిల్స్ జరగవు. ఆ పుస్తకంలోని ఒక కొత్త విషయమో, కనీసం ఒక వాక్యమో నిన్ను ప్రభావితం చెయ్యాలి. 

అది పర్సనల్ డెవలప్‌మెంట్ పుస్తకమే కానవసరంలేదు. ఒక నవల, ఒక పోయెట్రీ, ఒక కథ, ఒక ఫిలాసఫీ కూడా కావచ్చు.

ఠాగోర్ 'గీతాంజలి' కావచ్చు, జెఫ్రీ ఆర్చర్ 'కేన్ అండ్ ఏబుల్' కావచ్చు. ఐన్ ర్యాండ్ కావచ్చు, మల్లాది వెంకటకృష్ణమూర్తి కావచ్చు. కీట్స్, నీషే, ఇ ఎల్ జేమ్స్. ఎవరైనా కావచ్చు. ఏ పుస్తకమైనా కావచ్చు. 

ఆ క్షణం వాటి నుంచి నువ్వు  పొందే ఆ ప్రభావం కాని, ఆ ఇన్‌స్పిరేషన్ కాని, ఆ 'హై' కాని నిన్ను వెంటాడాలి. వేధించాలి. ముందుకు దూకించాలి. 

అలాంటి పుస్తకాలు ఇంగ్లిష్‌లోనే కాదు, తెలుగులోనూ కోకొల్లలుగా ఉన్నాయి. 

మనం చదవాలి, పనిచెయ్యాలి... మిరాకిల్స్ అవే వెంటపడతాయి.  

చదివి పక్కన పడేసి... "నా జీవితంలో మిరాకిల్స్ జరగలేదు. అదంతా మాఫియా. వాళ్లంతా వేస్ట్ ఫెల్లోస్" అని ఏడవటం వల్ల నువ్వక్కడే ఉంటావు. నీలో నిలువెల్లా ఉన్న నెగెటివిటీతో ఇంకా ఇంకా పాతాళంలోకి పోతావు.

పాజిటివ్ మైండ్‌తో ఉత్సాహంగా పనిచేసుకుంటూ ముందుకెళ్లేవాళ్లు మాత్రం అలా ముందుకెళ్తూనేవుంటారు. 

ఎవరైనా సరే,  అప్పుడప్పుడూ కొంచెం పనికొచ్చే సాహిత్యాన్ని కూడా చదువుతూ ఉండాలి. మెచ్చుకొంటూ ఉండాలి. అప్పుడే జీవితంలోని ప్రతి పార్శ్వాన్ని ఇంచ్ ఇంచ్ అనుభవించగలుగుతాం. కిలిమంజరో పర్వతాల్ని అధిరోహించగలుగుతాం. 

No comments:

Post a Comment