Tuesday 29 August 2023

Monday 28 August 2023

"కొత్త" ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, చీఫ్ టెక్నీషియన్స్ కోసం ఆడిషన్స్, ఇంటర్వ్యూలు!


"కొత్త" ఆర్టిస్టులు, అసిస్టెంట్ డైరెక్టర్స్, స్క్రిప్ట్ రైటర్స్, లిరిక్ రైటర్స్, సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ ఎట్సెట్రా కోసం వచ్చే శుక్రవారం 1 సెప్టెంబర్ నుంచి మా ఆఫీసులో ఆడిషన్స్, ఇంటర్వ్యూలు జరుగబోతున్నాయి. 

ఆయా విభాగాల్లో తగిన అర్హతలు ఉండి - అవకాశం కోసం ఎదురుచూస్తున్న "న్యూ టాలెంట్" టచ్‌లో ఉండండి. ఇక్కడే వాటికి సంబంధించిన యాడ్స్ దేనికదే ఇస్తుంటాము. వాటిలో చెప్పిన విధంగా అప్లై చేసుకోండి. కాల్స్ చేయవద్దు. మేం ప్రాథమికంగా ఎన్నిక చేసినవారికి మా ఆఫీసు నుంచి కాల్ వస్తుంది. వాళ్ళు మాత్రమే ఆడిషన్/ఇంటర్వ్యూకి రావచ్చు.  

కట్ చేస్తే -

మా #ManutimeMovieMission ప్రొడక్షన్ హౌజ్ నుంచి ప్రతిష్టాత్మకంగా మల్టిపుల్ ఫిలిం ప్రాజెక్టులను ఒకేసారి సెప్టెంబర్‌లో ప్రారంభించబోతున్నాము. ఈ నేపథ్యంలో - వివిధ విభాగాల్లో మాకు "కొత్త" ఆర్టిస్టులు-టెక్నీషియన్స్, చీఫ్ టెక్నీషియన్స్ అవసరం చాలా ఉంటుంది. 

నా గత చిత్రాల ద్వారా ఇప్పటికే 55+ కొత్త ఆర్టిస్టులను, టెక్నీషియన్స్‌ను పరిచయం చేశాను. వీరిలో హీరోలు, హీరోయిన్స్, విలన్స్, సపోర్టింగ్ ఆర్టిస్టులు, డాన్స్ మాస్టర్స్, కెమెరామెన్, మ్యూజిక్ డైరెక్టర్స్, ఎడిటర్స్... ఇలా ఎందరో ఉన్నారు. నిజంగా మీలో టాలెంట్ ఉండి, సినిమాల్లో ఏదైనా సాధించాలన్న తపన, మంచి డిసిప్లిన్, మంచి కమ్యూనికేషన్, చెదరని ఏకాగ్రత ఉన్నట్టయితే మీరూ రేపు నా కొత్త సినిమా ద్వారా ఫిలిం ఇండస్ట్రీకి పరిచయం కావచ్చు! 

ఆల్ ద బెస్ట్!!  

Sunday 27 August 2023

సొంత పైత్యం వేరు, సినిమా వేరు! - 2


అంతా కలిపి వీళ్ళొక 50 మంది ఉంటారు. సినిమాల గురించి వీళ్ళు రాసే రాతలు చదివి ఆహా ఓహో అనేవాళ్ళు ఇంకో 100 మంది ఉంటారు. ఈ 150-200 మంది కొనే టికెట్స్‌తో సినిమాలు హిట్లు కావు. వీరి అభిరుచి, వీరి ఆలోచనా విధానం ఒక సినిమా విజయానికి కొలమానాలు కాలేవు.

కట్ చేస్తే - 

పింక్ సినిమాను తెలుగులో పింక్‌లా తీయలేదు అంటాడొక రివ్యూయర్. హిందీ పింక్ కాన్సెప్టును తెలుగులో పవన్ కళ్యాణ్‌తో ఎలా తీస్తే విజయం సాధిస్తుందో ఆ రైట్స్ కొనుక్కున్న ప్రొడ్యూసర్, డైరెక్టర్స్‌కు ఒక స్పష్టమైన ఐడియా ఉంటుంది. అది వాళ్ళ విజన్, వాళ్ళ ఇష్టం. అంతే కాని - పింక్‌ను పింక్‌లా తీయడానికి కోట్లు పెట్టి తెలుగు రైట్స్ కొనుక్కొవడం ఎందుకు... 2 లక్షలు పెట్టి డబ్బింగ్ చేస్తే సరిపోతుంది. 

బేబీ సినిమాకు వంద కోట్లు ఎలా వచ్చాయి అంటాడొకాయన. ఇంకొకాయన నేను మొదటి ఇరవై నిమిషాలకే నిద్రపోయాను అంటూ రాసుకొస్తాడు. మీ రాతల్లోనే ఉంది కదా... మీ ఆలోచనలకు, రివ్యూలనబడే మీ సోకాల్డ్ రాతలకు - సినిమా విజయాలకు అసలు సంబంధమే లేదని!

సినిమా బేసిగ్గా ఒక ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా. పాఠాలు చెప్పే టీచర్ కాదు. నీతి బోధనలు చేసే గురువు కాదు. ఈ స్పృహతో రివ్యూలు రాసేవాళ్ళు కొందరే ఉంటారు. అలాంటి రివ్యూల వల్ల ఏదైనా ఉపయోగం ఉంటుంది. మిగిలినవాళ్ళు రాసే రివ్యూలు అసలు రివ్యూలు కాదు. జస్ట్ బుల్‌షిట్. 

ఫిలిం మేకర్స్ అయినా, రైటర్స్ అయినా, రివ్యూయర్స్ అయినా... ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతుండాలి. యాండ్రాయిడ్ ఫోన్స్, ఐఫోన్స్ మాత్రం వాడతాం కాని, అంతే అడ్వాన్స్‌డ్‌గా మేం ఆలోచించం అంటే అంతకంటే చెత్త హిపోక్రసీ ఇంకోటి ఉండదు.   

Saturday 26 August 2023

సొంత పైత్యం వేరు, సినిమా వేరు! - 1


సినిమా అనేది నాలుగు గోడల మధ్య కూర్చొని రాసుకొనే కవిత్వం కాదు, కథ కాదు. 

కవిత్వాలు, కథలు, కథానికలు మనిష్టం. ఎలాగైనా రాసుకోవచ్చు. 

వీటిల్లో మన ఇజాలు, మన ఇష్టాలు, మన ఇంక్లినేషన్స్, మన బయాస్‌లు, మన హిపోక్రసీలు, మన ఫాల్స్ ప్రిస్టేజ్‌లు, మన కులాలు-మతాలు-ప్రాంతాల గ్రూపులు... అన్నీ మనకు తెలిసో తెలీకుండానో దింపుతాం. తప్పేం లేదు. అది మనిష్టం.  

మన గ్రూపువాడు ఆహా ఓహో అంటాడు. ఇంకో గ్రూపువాడు విమర్శిస్తాడు. అక్కడితో అయిపోతుంది. ది ఎండ్. ఎవ్వరికీ నయా పైసా నష్టం లేదు. 

కట్ చేస్తే -  

సినిమా అలా కాదు. 

దీని వెనుక కోట్ల పెట్టుబడి ఉంటుంది. కనీసం ఒక వందమంది జీవితాలుంటాయి. 

సినిమా ప్రధానోద్దేశ్యం జనబాహుళ్యానికి నచ్చడం, హిట్ కొట్టడం. పెట్టిన కోట్లు నష్టపోకుండా వెనక్కి తెచ్చుకోడం, లాభాలు సంపాదించడం. డబ్బుతోపాటు పేరు దానికదే ఫాలో అవుతుంది. అది వేరే విషయం. 

ఒక పక్కా కమర్షియల్ యాక్టివిటీ.
ఆర్ట్.
బిగ్ బిజినెస్. 

ఈ ప్రాథమిక వాస్తవం అర్థం చేసుకోకుండా- ఈ మాత్రం అవగాహన లేకుండా - సినిమాలపై రాసే సోకాల్డ్ రివ్యూలైనా, రాతలైనా జస్ట్ బుల్‌షిట్. 

అంతే. 

(ఈ టాపిక్ కనీసం ఇంకో 2 పోస్టులవచ్చు! సో, ఇంకా వుంది...)     

Sunday 20 August 2023

ఫిలిం ఇండస్ట్రీలో మీ ప్రవేశానికి నిజంగా పనికొచ్చే కోచింగ్


హైద్రాబాద్‌లోని ప్రముఖమైన కొన్ని ఫిలిం ఇన్‌స్టిట్యూట్స్‌లో ఫీజు 10 లక్షల నుంచి 27 లక్షల వరకు ఉంది.  

ఇవి కాకుండా - ఇంకో డజన్ పేరున్న ఫిలిం ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయి. వాటిలో ఫీజు 10 వేల నుంచి, లక్ష, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షల వరకు ఉంది. 

ఈ ఇన్‌స్టిట్యూట్స్ అన్నిట్లోను ఎవరికి సాధ్యమైనంత లెవెల్లో వారు బాగానే కోచింగ్ ఇస్తారు. క్లాస్‌రూం టీచింగ్ ఉంటుంది. కెమెరాతో ప్రాక్టికల్స్ ఉంటాయి. (ఒకటి రెండు ఇన్‌స్టిట్యూట్స్‌లో అడ్మిషన్ అవగానే - నా "సినిమాస్క్రిప్టు రచనాశిల్పం" పుస్తకం జిరాక్స్ కాపీ కూడా ఒకటి ఫ్రీగా ఇస్తున్నారు.)

అదంతా ఓకే. 

కోర్స్ అయిపోతుంది. సర్టిఫికేట్ చేతికొస్తుంది. 

వాట్ నెక్స్‌ట్?  

"ఒక్క చాన్స్" కోసం మళ్ళీ అదే ఫిలిం ప్రొడక్షన్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిందే. 

ఫిలిం నగర్, శ్రీనగర్ కాలనీ, యూసుఫ్‌గూడ, గణపతి కాంప్లెక్స్, మణికొండ...

సంవత్సరాలు గడిచిపోతుంటాయి. తెలియకుండా డబ్బు లక్షల్లో ఖర్చయిపోతుంటుంది. 

ఆ ఒక్క చాన్స్ మాత్రం రాదు. 


ఇప్పుడు నేను చేస్తున్న నా ఫీచర్ ఫిలిం టీమ్‌లో మెంబర్‌గా చేరి - యాక్టింగ్, స్క్రిప్ట్ రైటింగ్, డైరెక్షన్ విభాగాల్లో నేరుగా పని చేస్తూ నేర్చుకొనే అవకాశం ఇప్పుడు మీ ముందుంది.

ఫిలిం ఇండస్ట్రీకి నిజంగా పనికొచ్చే కోచింగ్, ఒక్క చాన్స్, స్క్రీన్ మీద మీ టైటిల్ కార్డు... ఈ మూడూ ఒకే ఒక్క మీ నిర్ణయంతో 6 నెలల్లో మీ సొంతమవుతాయి.   

కట్ చేస్తే -  

ఈ కోచింగ్ ఫ్రీ కాదు.    

కనీసం ఒక 5 నుంచి 10 ఏళ్ళ మీ సమయాన్ని, మీ డబ్బును సేవ్ చేసే ఈ కోచింగ్‌కు ఫీజు ఉంటుంది. దాన్ని మీరు అడ్మిషన్ అప్పుడు మొత్తం ఒకేసారి కట్టాల్సి ఉంటుంది.     

అలాగని, అప్లై చేసి ఫీజు కట్టే ప్రతి ఒక్కరికీ ఈ అవకాశం ఇవ్వలేం. 

ఎన్నిక చేసిన అతి కొద్దిమందికి మాత్రమే ఈ అవకాశం. 

ఆసక్తి ఉందా? ఈరోజే నిర్ణయం తీసుకోండి...  

Friday 18 August 2023

ముంబైలో 60 కోట్ల విలువైన సొంత బంగళాలో ఫిలిం ప్రొడక్షన్ ఆఫీస్ ఎవరికుందో మీకు తెలుసా?


ఎక్కడో హిమాచల్ ప్రదేశ్ నుంచి ఒంటరిగా ముంబై వచ్చింది. అప్పుడు ఇంగ్లిష్ కూడా సరిగ్గా రాదు. అందరూ హేళన చేసేవాళ్ళు "నువ్వేం హీరోయిన్ అవుతావ్" అని. భరించింది. 

ఆ స్టేజి నుంచి - ఇండస్ట్రీలో ప్రతి ఒక్క సమస్యను ఒంటరిగా, ధైర్యంగా ఎదుర్కొంది.  

వ్యక్తిగత జీవితంలో రిలేషన్‌షిప్స్ సమస్యలను కూడా ఒంటరిగా అధిగమించింది. 

తాను అనుకున్నది సాధించింది.

బాలీవుడ్‌లో ఒక టాప్ రేంజ్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. హీరోయిన్‌గా కలెక్షన్స్ రికార్డ్స్ అప్పట్లోనే సాధించింది. 

హీరోయిన్‌గా నటిస్తూనే - డైరెక్టర్ అయింది. రైటర్ అయింది. ప్రొడ్యూసర్ అయింది.   

పద్మశ్రీ తెచ్చుకొంది. 

3 జాతీయ అవార్డులు, 4 ఫిలిం ఫేర్ అవార్డులు కూడా సాధించింది. 

ప్రొడ్యూసర్‌గా ముంబైలోనే 60 కోట్ల విలువైన సొంత బంగళాలో తన సొంత ప్రొడక్షన్ ఆఫీసు ప్రారంభించింది. 

తను సాధించిన ఈ మైల్‌స్టోన్స్ అన్నింటి వెనుక - తన 15 ఏళ్ల ఫిలిం ఇండస్ట్రీ జీవితపు మర్చిపోలేని అనుభవాలున్నాయి. ఘోరమైన అవమానాలున్నాయి. అంతులేని సంఘర్షణ ఉంది.     

కట్ చేస్తే - 

తను ఇప్పుడు ఏ పార్టీకి సపోర్ట్ ఇస్తోంది అన్నది నాకు అనవసరం. అది పూర్తిగా ఆమె వ్యక్తిగతం. అసలు తను ఆ పార్టీకి కనెక్ట్ కాకముందే ఇవన్నీ సాధించింది. అది వేరే విషయం. 

కాని - సక్సెస్ సైన్స్ పాయింటాఫ్ వ్యూలో మాత్రం తనది ఒక రాగ్స్ టు రిచెస్ స్టోరీ.     

గట్స్. 
విల్ పవర్. 
అన్-డివైడెడ్ ఫోకస్.  

కంగనా రనౌత్.  

Wednesday 16 August 2023

ఫిలిం ఇండస్ట్రీలో ఇలాంటి స్నేహసౌరభాలు కూడా ఉంటాయి!


సినిమాఫీల్డులో నిజంగానే కొంచెం 'మెటీరియలిస్టిక్'  ఫ్రెండ్‌షిప్స్ ఎక్కువ. నాకున్న అతి స్వల్పమైన అనుభవంలోనే ఇలాంటి ఫ్రెండ్‌షిప్స్ ఎన్నో చూశాను. 

మనతో సినిమా జరుగుతున్నంత సేపు ఫ్రెండ్‌షిప్ వేరేగా ఉంటుంది. ఒకసారి పని అయిపోయిందా... ఇంక అంతే! 

> అప్పటిదాకా పొద్దునలేస్తే వాట్సాప్‌లో, ఫేస్‌బుక్‌లో విష్ చేసినవాళ్లు ఉన్నట్టుండి నన్ను మర్చిపోతారు. ఇప్పుడు నా మెసేజ్‌కు రిప్లై ఇవ్వటమే వారికి చాలా కష్టంగా ఉంటుంది.
 
> అప్పటిదాకా దగ్గినా తుమ్మినా కాల్ చేసినవాళ్ళకు, పని అయిపోయాక వాళ్ల కాంటాక్ట్స్‌లో నా నంబర్ కనిపించదు. నాకు ఒక్క కాల్ రాదు. నేను కాల్ చేస్తే ఏదో సో సో... ఎప్పుడెప్పుడు పెట్టేసేద్దామా అనే!

> "నాకు అరవింద్ తెలుసు, రాజు తెలుసు, శిరీష్ తెలుసు, సురేష్‌బాబుతో మొన్నే ఒక మీటింగ్ అయింది, సో అండ్ సో నేనూ కలిసి మందు కొడతాం తెలుసా" అని నేను మొదటి చాన్స్ ఇచ్చిన తర్వాత నాతో కోతలు కోసినవాళ్లు, ఇండస్ట్రీలో పదేళ్లయినా రెండో చాన్స్ తెచ్చుకోలేదు. అదేంటో మరి!
 
> ప్యారడైజ్ రోడ్లమీద నాతో సరదాగా నడుస్తూ తిరిగి, కలిసి బీర్లు త్రాగి, బిర్యానీలు తిన్న హీరోలు ఉన్నట్టుండి ఏదీ గుర్తుకురాని గజినీలయిపోతారు. కలా, నిజమా?! 

> "వద్దురా బై, నాకది నచ్చదు" అని ఎంత మొత్తుకున్నా వినని నేను పరిచయం చేసిన ఒక విలన్... అప్పట్లో నేను కనిపించిందే ఆలస్యం... కాళ్లకి మొక్కేవాడు! రోజుకి డజన్ మెసేజెస్, అరడజన్ కాల్స్ చేసేవాడు. ఇప్పుడు కనిపించినా నేనెవరో తెలియనట్టు మరోవైపు తలతిప్పుకొని వెళ్ళిపోతాడు. అసలితను నేను పరిచయం చేసినతనేనా... అని నాకే డౌటొస్తుంది. 

> నేను సిల్వర్‌స్క్రీన్‌కు పరిచయం చేసిన ఒకరిద్దరమ్మాయిలు ఇప్పుడు యాంకర్స్‌గా మంచి స్థాయిలో ఉన్నారు. అప్రిషియేట్ చేస్తూ ఎప్పుడైనా విష్ చేద్దామన్నా అసలు సందివ్వరు. ఏంటంత ప్రాబ్లమ్?! 

> నేను పరిచయం చేసిన ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరు అప్పట్లో నా మెసేజ్ రీచ్ అవ్వకముందే ఫాస్ట్‌గా రిప్లై ఇచ్చేవాడు. ఇప్పుడు 3,4 రోజులయినా నా మెసేజ్ చూసుకోడు! అప్పుడు నేను కాల్ చేస్తే వెంటనే రెస్పాండ్ అయ్యేవాడు. ఇప్పుడసలు రెస్పాన్స్ ఉండదు. కట్ చేస్తాడు కూడా! కలిసి పనిచేద్దామనుకుంటే అతని బేసిక్ కమ్యూనికేషన్ కోసమే నేను బెగ్గింగ్ చెయ్యాల్సి వస్తోంది!     
    
పైన నేను చెప్పిందంతా జస్ట్ ఒక చిన్న శాంపుల్ మాత్రమే. గౌరవ సీనియర్లు ఈ టాపిక్ గురించి కథలుకథలుగా మరింత బాగా చెప్తారు. 

అయితే ఇదంతా నేనసలు పట్టించుకోను. ఇప్పుడు కూడా ఇదెందుకు రాస్తున్నానంటే దానికో కారణం ఉంది.
 
కట్ చేస్తే -  

సుమారు 18 ఏళ్లక్రితం, ఒక కార్పొరేట్ అసైన్‌మెంట్ మీద నేను వైజాగ్ వెళ్లినప్పుడు, స్టీల్‌ప్లాంట్ గెస్ట్ హౌజ్‌లో అనుకోకుండా నాకొక ఆర్టిస్టుతో పరిచయం అయింది.

అప్పుడు వాళ్ల సినిమా షూటింగ్ ఆ చుట్టుపక్కల జరుగుతోంది... 

రోజూ తెల్లవారుజామున, సాయంత్రం మేమిద్దరం కనీసం ఒక రెండు గంటలపాటు బుక్స్ గురించి, క్రియేటివిటీ గురించి, సముద్రం గురించి... బోలెడంత నాన్సెన్స్ మాట్లాడుకొనేవాళ్లం.
 
నాన్సెన్స్ అని ఎందుకంటున్నా అంటే, మామధ్య టాపిక్స్ ఒకచోటినుంచి ఇంకోచోటకి క్షణంలో అలా జంప్ అయ్యేవి!
 
బాగా నవ్వుకొనేవాళ్లం. కనీసం ఒక నాలుగు కాఫీలు పక్కాగా త్రాగేవాళ్లం.

గెస్ట్ హౌజ్ చుట్టూరా ఉన్న లాన్స్, లేదా లాంజ్, లేదా ఏదో ఒక రూం... మా మీటింగ్స్‌కు వేదికలయ్యేవి.
 
ఒకవైపు వాళ్ల టీమ్, మరోవైపు నా కొలీగ్స్ మా ఇద్దరి చర్చలను చాలా విచిత్రంగా చూసేవాళ్లు. కాని, అవన్నీ పట్టించుకొనే లోకంలో మేం అసలు ఉండేవాళ్లం కాదు.

కాని - తనని పిలవడానికి కూడా బాగా ఇబ్బందిగా ఫీలవుతూ, ఆ ఆర్టిస్టు పట్ల వారు చూపే అభిమానం, గౌరవం నాకు బాగా అర్థమయ్యేవి. 

అక్కడినుంచి ఫాస్ట్ ఫార్వార్డ్ చేస్తే... 18 ఏళ్ల తర్వాత కూడా మా ఇద్దరి మధ్య స్నేహం ఇంకా కొనసాగుతూనే ఉంది.
 
"ఏం చేస్తున్నావ్... ఎలా ఉన్నావ్... యాక్సిడెంట్ తర్వాత సర్జరీ అయిన కాలు నొప్పి పూర్తిగా తగ్గిందా లేదా... పెండింగ్ సర్జరీ ఏమయింది... ఇప్పుడేం బుక్ చదువుతున్నావ్... ఏదైనా రాస్తున్నావా... ఎందుకని నువ్వు రైటింగ్‌ను సీరియస్‌గా తీసుకోవు... బ్లా బ్లా బ్లా..." 

దాదాపు 18 ఏళ్ళు దాటినా - ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా - మొన్న పొద్దుటే ఒకరికొకరం వాట్సాప్‌లో విషెస్ చెప్పుకొన్నాం. 

ఆ ఆర్టిస్టు అప్పుడూ బిజీనే, ఇప్పుడూ బిజీనే. అయినా - అంత బిజీలో కూడా - ఎక్కడో 650 కిలోమీటర్ల దూరం నుంచి ఒక స్నేహపూర్వక కాల్... ఫ్రెండ్‌షిప్‌డే విషెస్... ఓ గంటసేపు మా ట్రేడ్‌మార్క్ క్రియేటివ్ కబుర్లు... నవంబర్‌కి ఈసారి - అయితే గోవా "IFFI" లో, లేదంటే పాండిచ్చేరిలో కల్సుకోవాలన్న ప్లాన్... 

ఫిలిం ఇండస్ట్రీలో ఇలాంటి స్నేహసౌరభాలు కూడా ఉంటాయి. 

ఇలాంటి జ్ఞాపకాలే మనతో ఉండేవి. 

మిగిలిందంతా జస్ట్ బుల్‌షిట్.  

Tuesday 15 August 2023

మనమీద మనమే జోకులేసుకోగల సత్తా కూడా మనకుండాలి!


సినిమా ఫీల్డు అంటే అందరికీ చిన్న చూపు ఉంటుంది. అందరూ తిడతారు, సెటైర్లు వేస్తారు, నానా చెత్త మాట్లాడతారు. కాని, ప్రపంచంలో ఏ ఫీల్డు అయినా సినిమా ఫీల్డు లాంటిదే.

ఇక్కడుండే అన్‌సర్టేనిటీ ప్రతి ఫీల్డులోనూ ఉంటుంది. ఇక్కడుండే లాభనష్టాలు కూడా అన్ని ఫీల్డుల్లో ఉండేవే. బయటి ఫీల్డుల్లో జరగని తప్పులు, రాజకీయాలేవీ ఇక్కడ జరగవు.

ఒప్పుకోడానికి ఇష్టం ఉండదు అంతే.

అందరూ ఈ ఫీల్డు మీద పడి ఏడవడానికి ఒకే ఒక్క కారణం ఏంటంటే – ఇక్కడ గ్లామర్ ఉంది. సెలబ్రిటీ స్టేటస్ ఉంది. ఇక్కడ చీమ చిటుక్కుమన్నా బ్రేకింగ్ న్యూస్ అవుద్ది. అంతకంటే పెద్ద చీమలు బయట వంద గుటుక్కుమన్నా అసలు పట్టించుకోరు. ఇదొక్కటే తేడా. ఇంతకంటే ఏం లేదు.

కట్ చేస్తే –

ఫిలింనగర్ అంటేనే సినిమా. అదో మరో ప్రపంచం. ప్రతిరోజూ వందలాదిమంది ఈ ఫీల్డులో ప్రవేశించాలని, తెరమీద కనిపించాలని, తెరవెనుక నగిషీలు చెక్కాలని, సెలబ్రిటీలు కావాలని కలలు కంటూ ఎక్కడెక్కడినుంచో ఇక్కడికి వస్తుంటారు.

అన్ని ఫీల్డుల్లాగే – ఈ ఫీల్డులో కూడా అతి తక్కువమందిని మాత్రమే ఆ అదృష్టం వరిస్తుంది. దాని వెనుక ఎన్నో నిద్రలేని రాత్రులుంటాయి. ఆకలి కేకలుంటాయి. అవమానాల గాయాలుంటాయి. అప్పుల బాధలుంటాయి. ఆత్మహత్యల గాథలుంటాయి.

అయినా సరే – అవన్నీ దిగమింగుకుంటూ రేపటి మీద ఆశతో నవ్వుతూ, తుళ్ళుతూ బ్రతుకుతుంటారు. తమ మీద తామే జోకులు వేసుకొంటూ ఎప్పటికప్పుడు ఎనర్జైజ్ అవుతుంటారు.

వీళ్లల్లో కొందరు మాత్రం రేపటి ఆర్టిస్టులు, స్టార్లు, డైరెక్టర్లు, టెక్నీషియన్లూ, అసిస్టెంట్లూ అవుతారు. మిగిలినవాళ్ళు ఎప్పటికయినా ఏదో ఒకటి అవుతామన్న అశతో – యూసుఫ్ గూడా బస్తీలో, గణపతి కాంప్లెక్స్ చుట్టూరా, శ్రీనగర్ కాలనీ- ఫిలింనగర్-జుబ్లీ హిల్స్ రోడ్లల్లో... ఎవర్నీ పట్టించుకోకుండా... కుంభమేళాలో నాగసాధువుల్లా వాళ్ల లోకంలో వాళ్ళు తిరుగుతూ ఉంటారు.

ఈ నేపథ్యంలో నేనొక లైటర్‌వీన్ మైక్రో కథల సీరీస్ రాయాలని ఆ మధ్య ప్లాన్ చేసుకున్నాను...
 
ఫిలింనగర్ డైరీస్!

ఇంతకుముందు ఒకట్రెండు రాశాను. ఇప్పుడు పూర్తిగా రెగ్యులర్‌గా సినిమాలు చేసే పనిలో కూడా బిజీగా ఉన్నాను కాబట్టి - మైక్రో కథలే కాబట్టి, అప్పుడప్పుడూ ఫాస్ట్‌గా రాయగలను.   

నాకు వీలున్నప్పుడల్లా రాసే ఈ మైక్రో కథలను నా బ్లాగ్‌తో పాటు, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ లో కూడా షేర్ చేస్తాను.    
 
ఈ మైక్రో కథలు జస్ట్ ఫర్ ఫన్. ఎవర్నీ ఉద్దేశించి రాస్తున్నవి కాదు. అలాగని ఊహించి రాస్తున్నవి కూడా కాదు.

పచ్చి నిజాలు. 

మనమీద మనమే జోకులేసుకోగల సత్తా కూడా మనకుందని గుర్తుకుతెచ్చుకోవడం. గౌరవ సీనియర్లూ, ప్రియమైన జూనియర్లూ, కొత్తవాళ్ళూ ఎంజాయ్ చేస్తారని నమ్మకం. 
 
అలాగే, మీరు కూడా... 😊 

Sunday 13 August 2023

ప్రపంచంలో నంబర్ వన్ దమ్మున్న పెట్టుబడిదారుడు ఎవరు?


"తెలుగు సినిమాలలో నిర్మాతలు రెండే రకాలు..
1. డబ్బులు పెట్టి పోగొట్టుకున్న వాళ్లు
2. పోగొట్టుకోడానికి డబ్బులు పెడుతున్న వాళ్లు"

పొద్దున్నే ఫేస్‌బుక్‌లో ఆత్మీయ దర్శక మిత్రులు వి యన్ ఆదిత్య గారి పోస్టు చూశాక ఇది రాస్తున్నాను. 

కట్ చేస్తే - 

లిస్ట్ లోని పై రెండింటికి తోడు, నా పాయింటాఫ్ వ్యూలో ఇంకో 3 కేటగిరీలను కూడా చేరుస్తూ ఇక్కడ రాస్తున్నాను.  

తెలుగు సినిమాల్లో అయినా, ఇంకెక్కడయినా... నిర్మాతలు 5 రకాలు:
1. డబ్బులు పెట్టి పోగొట్టుకున్నవాళ్లు
2. పోగొట్టుకోడానికి డబ్బులు పెడుతున్నవాళ్లు
3. పోగొట్టుకున్న చోటనే రాబట్టుకోవచ్చని మళ్ళీ పెట్టేవాళ్ళు 
4. హిట్టూ ఫట్టులతో సంబంధం లేకుండా లెక్కప్రకారం సంపాదించుకునేవాళ్ళు 
5. సినిమా ప్రొడ్యూసింగ్ అడ్డం పెట్టుకొని ఇతర వ్యాపారాల్లో భారీగా ఎదిగేవాళ్ళు 

ఈ లిస్టుని నేను చాలా పాజిటివ్ దృక్పథంతో రాశాను. 

అవగాహన, ఆత్మవిశ్వాసం, విజన్... ఈ మూడూ కలిస్తే ప్రొడ్యూసర్. 

ఆత్మవిశ్వాసం మితిమీరితేనే కష్టం. పై లిస్టులోని 1,2,3 ల్లో కొట్టుమిట్టాడాల్సి వస్తుంది. ఆ మొదటి మూడిట్లోనే ఎక్కడో చోట సెట్ అయిపోవాల్సి వస్తుంది.  


దీనికి చాలా గట్స్ ఉండాలి. ఉల్టాపుల్టా అయితే తట్టుకొనే దమ్ముండాలి. ఈ రెండిటినీ హాండిల్ చేయగల కిల్లర్-ఇన్‌స్టిన్‌క్ట్ మైండ్‌సెట్ ఉండాలి. 

అంతకుముందు "ప్రొడ్యూసింగ్ మనకెందుకులే" అని భయపడేవాణ్ణి. కాని - క్లింట్ ఈస్ట్‌వుడ్, మణిరత్నం, పూరి జగన్నాథ్ వంటి గట్సీ ఫిలిం మేకర్స్ కొందరి ఆలోచనా విధానం, ప్రొఫెషనల్ వర్కింగ్‌స్టయిల్ చూశాక ఈ విషయంలో నా ఆలోచన పూర్తిగా మారింది.

ఇప్పుడు నేను ప్రొడ్యూసర్‌గా కూడా సినిమాలు చేస్తున్నాను. నా ప్రొడక్షన్ హౌజ్‌ను ఒక రేంజ్‌లో డెవలప్ చేయబోతున్నాను. 

మనీ కావాలి నిజమే. కాని, దాన్ని మించిన మైండ్‌సెట్ కూడా చాలా ముఖ్యం.       

గత 14 నెలలుగా ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి ఎం డి గా కూడా పని చేస్తున్న నేపథ్యంలో - రియల్ ఎస్టేట్‌నూ దాంతో పాటు మరెన్నో వ్యాపారాలనూ చాలా దగ్గరనుంచి అధ్యయనం చేసే అవకాశం నాకు దొరికింది. ఈ అధ్యయనంలో నేను తెలుసుకున్న నిజం ఏంటంటే - రియల్ ఎస్టేట్ సహా చాలా వ్యాపారాల్లో ఉన్న గందరగోళం కంటే ఫిలిం ప్రొడ్యూసింగ్‌లో ఉన్న గందరగోళం చాలా చాలా తక్కువ. 

ఈ నేపథ్యంలో - 

"ఒక్క సినిమా నిర్మాతే "ప్రపంచంలో నంబర్ వన్ దమ్మున్న పెట్టుబడిదారుడు" అని ఇప్పుడు నేను చాలా కాన్‌ఫిడెంట్‌గా చెప్పగలను.  

Tuesday 8 August 2023

ఫోటో బ్లాగ్ - 22


#Kajal #AditiRao #Tamanna #BeautyInOneFrame
#Manoharam #PhotoBlog #ManoharChimmani

ఒకే ఒక్కసారి ఫిలిం డైరెక్టర్ అయి చూడు!


సుమారు ఏడేళ్ళ క్రితం నా సినిమాలో పనిచేసినప్పుడు జరిగిన ఒక చిన్న అసౌకర్యం గురించి, అప్పుడు నా టీమ్‌లో పనిచేసిన మా అసిస్టెంట్ డైరెక్టర్ ఒకతను ఇవాళ నాకు ఉన్నట్టుండి ఒక వాట్సాప్ మెసేజ్ ద్వారా గుర్తుచేశాడు! 

దేశంలో ఇప్పుడు టాప్ పొజిషన్‌లో ఉన్న డైరెక్టర్స్ అందరూ అంతకు కనీసం వందరెట్ల అసౌకర్యాలు, కష్టాలు అనుభవించి గాని వారు ఇప్పుడున్న ఉన్నత స్థాయికి రాలేదన్నది నా పాయింట్. 

కాని, నేనలా చెప్పలేదు అతనికి. 

అతను నన్ను హర్ట్ చేసినా, నేనతన్ని ఏదో ఒక మాట అని హర్ట్ చెయ్యలేకపోయాను. నా యాటిట్యూడ్ అది కాదు. 

అతనొక మంచి టెక్నీషియన్ కూడా. ఏదైనా ఒక పని నేను అతనికి చెప్తే, మళ్ళీ ఇంక దాని గురించి నేను ఆలోచించే అవసరాన్ని ఇచ్చేవాడు కాదు. అలాంటి వాడు... సడెన్‌గా నేను ఎక్కడున్నాను, ఏం చేస్తున్నాను, ఏ పనిలో ఉన్నాను, ఏదైనా డిస్టర్బ్ అవుతుందా అన్న ఆలోచన లేకుండా... ఠకీమని ఇలాంటి మెసేజెస్ పెట్టడం నాకు ఆశ్చర్యం కలిగించింది. 

పైగా ఇప్పుడతను మంచి జాబ్‌లో కూడా ఉన్నాడు. అప్పటికన్నా ఇప్పుడు అతనిలో ఇంకా మెచ్యూరిటీ, బాధ్యత పెరగాలి.  

"నువ్వు తీరిక చేసుకొని ఒకసారి నా ఆఫీసుకి రా. మాట్లాడదాం" అని జవాబిచ్చాను.

కట్ చేస్తే -

ఒకప్పుడు ఇండస్ట్రీని షేక్ చేసిన ట్రెండ్ సెట్టర్ సినిమాను అందించిన ఒక దర్శకుడు, ఆయన టీమ్... అతని రెండో సినిమాకో మూడో సినిమాకో పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో ఒకరోజు లంచ్‌కు డబ్బుల్లేక, బండి మీద రేగ్గాయలు కొనుక్కొని తిన్న విషయం నాకు తెలుసు. 

జీవితంలో మర్చిపోలేని సిసలైన అసౌకర్యాలు, కష్టాల గురించి తెలియాలంటే - ఎవరైనా సరే - ఒకే ఒక్కసారి ఫిలిం డైరెక్టర్ అయితే చాలు... 😊

సినిమా మొత్తం కనిపిస్తుంది... సీన్ బై సీన్. షాట్ బై షాట్.  🙌 

Film is a battleground!  

Sunday 6 August 2023

Photo Blog 21#Gaddar #VBGaddar #RevolutionarySinger
#Manoharam #PhotoBlog #ManoharChimmani


ఒక హాయ్, ఒక హగ్, రెండు షేక్ హాండ్స్, నాలుగు థాంక్యూలు...


"శివ" ప్రాజెక్టు ఓకే అవ్వడం కోసం ఆర్జీవీ ఎందరినో మేనిప్యులేట్ చేశాట్ట. తనకు అనుకూలంగా రిజల్ట్ రావడం కోసం ఒకరిదగ్గర ఒకలాగా, ఇంకొకరి దగ్గర ఇంకోలాగా మాట్లాడి, చివరికి శివ ప్రాజెక్ట్ ఓకే చేసుకున్నాట్ట. ఈ విషయం ఆర్జీవీనే స్వయంగా ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పాడు. 

ఆమధ్య ఒక కాలేజి ఫంక్షన్లో స్పీచ్ ఇస్తూ, యస్ యస్ రాజమౌళి కూడా దాదాపు ఇలాంటిదే ఒక విషయం చెప్పాడు: "ఫిలిం ఇండస్ట్రీలో ఎదగాలంటే ఎన్నో అబద్ధాలాడాల్సి ఉంటుంది. ఎన్నో మేనిప్యులేషన్స్ చెయ్యాల్సి ఉంటుంది. నీ ప్రొఫెషన్ కోసం అవన్నీ చెయ్యి. కాని, నీకు నువ్వు అబద్ధాలు చెప్పుకోకు... నిన్ను నువ్వు మభ్యపెట్టుకోకు" అని.

ఇంకొక ఇంటర్వ్యూలో - ఇప్పుడు దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న కథారచయిత విజయేంద్రప్రసాద్ గారు ఒక ప్రశ్నకు సమాధానంగా, "ఫిలిం ఇండస్ట్రీలో సక్సెస్ సాధించాలంటే మీరు అబద్ధాలు బాగా చెప్పగలగాలి" అన్నారు.  

కట్ చేస్తే - 

ప్రతి ఇండస్ట్రీకి, ప్రతి బిజినెస్‌కు, ప్రతి ప్రొఫెషన్‌కు ఆయా చోట్ల సక్సెస్ సాధించడానికి, నిలదొక్కుకోడానికి కొన్ని ప్రాథమిక సూత్రాలుంటాయి. ఒక వ్యవహారశైలి ఉంటుంది. వ్యక్తిగతంగా ఎవరికి ఎలాంటి ప్రిన్సిపుల్స్ ఉన్నా, ఇక్కడ మాత్రం ఈ బేసిక్ సూత్రాలకు ఎవరి శైలిలో వారు ఎడాప్ట్ అవక తప్పదు. అలా కాగలిగినవారే ఎక్కడైనా సక్సెస్ సాధిస్తారు.  

సింపుల్‌గా చెప్పాలంటే - తాడిచెట్టుకిందకి వెళ్ళినప్పుడు మనం అక్కడ కల్లే త్రాగాలి. కల్లు మండువాలో కూర్చొని నేను కాఫీ త్రాగుతాను అంటే కుదరదు. 

ఈ సంఘర్షణలోనే కొంతమందికి జీవితం అయిపోతుంది. కొంతమంది మాత్రం నిమిషాల్లో మౌల్డ్ అయిపోతారు. 

కట్ చేస్తే - 

పైన చెప్పిన ఉదాహరణల్లో ఆర్జీవీ, రాజమౌళి, విజయేంద్రప్రసాద్ గారు చెప్పింది కూడా ఇదే. వారు చెప్పిన అబద్ధాలు, మేనిప్యులేషన్స్ అంటే ఇంకేదో కాదు. ఇండస్ట్రీలో పనులు ముందుకు కదిలేలా ఎదుటివారిని కన్విన్స్ చెయ్యగలగటం. మనలో ఏ మూలో ఉన్న కాస్తంత ఈగోని కాసేపు పక్కనపెట్టగలగటం.

ఒక హాయ్, ఒక హగ్, రెండు షేక్ హాండ్స్, నాలుగు థాంక్యూలు. 

దట్సిట్. 

యు ఆర్ ఆన్ ద ట్రాక్. తర్వాతంతా నీ సత్తా. 

Saturday 5 August 2023

655,000 రెట్లు లాభాల్ని తెచ్చిన ఇండిపెండెంట్ సినిమా ఏదో మీకు తెలుసా?


స్టీవెన్ స్పీల్‌బర్గ్ మొదటిసారి ఒక సినిమా చూసి భయపడ్దాడు. మధ్యలోనే చూడ్డం ఆపేసి డివీడిని ప్యాక్ చేశాడు. తర్వాత ఆయన చేసిన మొట్టమొదటి పని - ఇంటికెళ్లి తన బెడ్‌రూమ్ తలుపుకు ఉన్న లాక్‌ని పర్‌ఫెక్ట్‌గా సెట్ చేయించడం!

ఆ సినిమా పేరు -

అప్పటివరకూ ఉన్న హారర్ చిత్రాల మూసను ఛేదించిన ఓ కొత్త తరహా హారర్ చిత్రం. 

రిలీజ్ కోసం కష్టాలుపడుతున్న సమయంలో అనుకోకుండా స్టీవెన్ స్పీల్‌బర్గ్ ఈ చిత్రాన్ని చూడ్డం జరిగింది. ఆ తర్వాత స్పీల్‌బర్గ్ చొరవతో పారానార్మల్ యాక్టివిటీ ప్రపంచవ్యాప్తంగా విడుదలై సంచలనం సృష్టించింది. ఒక్క అమెరికాలోనే విడుదలకాని 100 సెంటర్ల నుంచి "మా ఏరియాలో కూడా వెంటనే రిలీజ్ చేయండి" అని ప్రేక్షకులనుంచి డిమాండ్ తెప్పించుకుంది ఈ సినిమా. ప్రపంచవ్యాప్తంగా చాలా యూనివర్సిటీల్లోని ఫిలిం స్టడీస్‌లోని వివిధ శాఖల్లో చాలామంది విద్యార్థులు ఈ చిత్రం పైన రిసెర్చ్ కూడా చేశారు.    

మికా, కేటి లు లీడ్ పెయిర్ గా నటించిన ఈ హారర్ చిత్రానికి  రచయిత, దర్శకుడు, నిర్మాత, కెమెరామాన్ అన్నీ ఒక్కడే - ఒరెన్ పేలి. విచిత్రమేంటంటే - తనలో ఉన్న భయాన్ని పోగొట్టుకోడానికి కొన్నాళ్ళపాటు "డెమనాలజీ" చదివాడు పేలి. ఆ తర్వాత అతనికి వచ్చిన ఆలోచనే ప్రపంచాన్ని భయపెట్టిన ఈ వెరైటీ హారర్ చిత్రం!

కేవలం రెండే రెండు ప్రధానపాత్రలతో .. దాదాపు "నో-బడ్జెట్"లో తీసిన ఈ చిత్రం క్రియేట్ చేసిన థ్రిల్ లేదా ఛిల్ .. ఈ చిత్రానికి 655,000 రెట్లు లాభాల్ని అందించింది. ఇది ఇప్పటికీ రికార్డే! తర్వాత ఈ సీరీస్‌లో ఎన్నో సినిమాలొచ్చాయి. పారానార్మల్ యాక్టివిటీ చిత్రం ఇన్స్‌పిరేషన్‌తో ప్రపంచవ్యాప్తంగా కూడా దాదాపు అన్ని భాషల్లో ఒకటి/రెండు/మూడు మాత్రమే ప్రధాన పాత్రలుగా లెక్కలేనన్ని హారర్ సినిమాలు వచ్చాయి. ఆమధ్య వచ్చిన రామ్‌గోపాల్‌వర్మ "ఐస్‌క్రీమ్" కూడా అలాంటిదే.  

కట్ చేస్తే -  

ఒక కమిట్‌మెంట్‌తో సినిమాలు చేస్తే నష్టాలుండవు. కావల్సినంత బజ్ క్రియేట్ చెయ్యొచ్చు, బాక్సాఫీస్ హిట్ చెయ్యొచ్చు. సరైన మార్కెట్ స్టడీ, అవగాహన, మైండ్‌సెట్, లైక్‌మైండెడ్ టీమ్ చాలా ముఖ్యం.   

Photo Blog 20

 


#KaranJohar #RanbirKapoor #AliaaBhatt #RanveerSingh #DeepikaPadukone #SharukhKhan #AamirKhan #Manoharam #PhotoBlog

Tuesday 1 August 2023

Creativity is Courage

 #Manoharam #PhotoBlog #Creativity #Films #ManoharChimmani

ది సీక్రెట్ !!


ఎక్కడో చదివాను...
"80% మ్యానిప్యులేషన్స్ + 20% క్రియేటివిటీ = సినిమా" అని.

"శివ" ప్రాజెక్టు ఓకే అవ్వడం కోసం ఆర్జీవీ ఎందరినో మేనిప్యులేట్ చేశాట్ట. తనకు అనుకూలంగా రిజల్ట్ రావడం కోసం ఒకరిదగ్గర ఒకలాగా, ఇంకొకరి దగ్గర ఇంకోలాగా మాట్లాడాట్ట. ఈ విషయం తనే స్వయంగా ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పాడు. 

ఆమధ్య ఒక కాలేజి ఫంక్షన్లో స్పీచ్ ఇస్తూ, యస్ యస్ రాజమౌళి కూడా దాదాపు ఇలాంటిదే ఒక విషయం చెప్పాడు: "మీరు ఫిలిం ఇండస్ట్రీలో ఎదగాలంటే ఎన్నో అబద్ధాలాడాల్సి ఉంటుంది. ఎన్నో మేనిప్యులేషన్స్ చెయ్యాల్సి ఉంటుంది. మీ ప్రొఫెషన్ కోసం అవన్నీ చెయ్యండి. కాని, నీకు నువ్వు అబద్ధాలు చెప్పుకోకు... నిన్ను నువ్వు మభ్యపెట్టుకోకు" అని.   

కట్ చేస్తే - 

ఈమధ్య నేను వైజాగ్ వెళ్ళాను. అక్కడికి దగ్గరలో ఒక యూత్ ఐకాన్ లాంటి ఎంట్రప్రెన్యూర్‌తో ఒక మీటింగ్ అయింది. 

స్టోరీలైన్, ప్రాజెక్ట్ సెటప్, డిజైన్, బిజినెస్ స్ట్రాటెజి గట్రా... అన్నీ ఒక 3 గంటలపాటు ఓపెన్‌గా మాట్లాడుకున్నాం.

"మనం కల్సి చేద్దాం" అన్నారాయన. 

ఇదంతా ఇప్పుడు నేను చేస్తున్న ఒక ఫిలిం ప్రాజెక్టులో జస్ట్ ఒక 10 లేదా 20 పర్‌సెంట్ ఇన్వెస్ట్‌మెంట్ కోసం! 

తర్వాత ఒక రెండు-మూడు రోజుల్లో మన యూత్ ఐకాన్, ఆయన్ని కనెక్ట్ చేసిన నా ఇంకో  ప్రియ మిత్రుడు హైద్రాబాద్ వచ్చి అగ్రిమెంట్ చేసుకోవాల్సింది...

ఈ లోగా మన కృష్ణానగర్, గణపతి కాంప్లెక్స్, ఫిలిం నగర్ గల్లీల్లో అవకాశాల కోసం వెతుక్కొంటూ తిరిగే ఫస్ట్రేటెడ్ బ్యాచ్‌లేవో కనెక్ట్ అయి, మనవాడి మైండ్ తినేశాయి. 

కట్ చేస్తే - 

ఇపుడు మన యూత్ ఐకాన్‌కు రోజుకు నాలుగు కొత్త డౌట్స్ పుట్టుకొస్తున్నాయి కాని, అసలు పని ఇంచ్ కూడా కదల్లేదు! 

నేను నోటికొచ్చిన అబద్ధాలాడితే మాత్రం ఎప్పుడో అగ్రిమెంట్ అయిపోయేది. రెండువైపులా కూల్‌గా, హాయిగా ఉండేవాళ్లం.  

కాని, పని జరక్కుండా దాదాపు నెల గడిచింది. పని ఇంక అవ్వకపోవచ్చు.

అదంతే. 

నాకు తెలుసు. 

థాంక్స్ టు ఆర్జీవీ అండ్ రాజమౌళి... ఇక జన్మలో నేను ఏ విషయాన్ని కూడా జెన్యూన్‌గా, రియాలిటీ ఫ్రేమ్‌లో మాట్లాడబోనని గట్టిగా అనుకున్నాను. 

ఇప్పుడు అంతా బాగుంటుంది. 

అన్ని పనులూ వాటికవే కదుల్తాయి.😊