Sunday 13 August 2023

ప్రపంచంలో నంబర్ వన్ దమ్మున్న పెట్టుబడిదారుడు ఎవరు?


"తెలుగు సినిమాలలో నిర్మాతలు రెండే రకాలు..
1. డబ్బులు పెట్టి పోగొట్టుకున్న వాళ్లు
2. పోగొట్టుకోడానికి డబ్బులు పెడుతున్న వాళ్లు"

పొద్దున్నే ఫేస్‌బుక్‌లో ఆత్మీయ దర్శక మిత్రులు వి యన్ ఆదిత్య గారి పోస్టు చూశాక ఇది రాస్తున్నాను. 

కట్ చేస్తే - 

లిస్ట్ లోని పై రెండింటికి తోడు, నా పాయింటాఫ్ వ్యూలో ఇంకో 3 కేటగిరీలను కూడా చేరుస్తూ ఇక్కడ రాస్తున్నాను.  

తెలుగు సినిమాల్లో అయినా, ఇంకెక్కడయినా... నిర్మాతలు 5 రకాలు:
1. డబ్బులు పెట్టి పోగొట్టుకున్నవాళ్లు
2. పోగొట్టుకోడానికి డబ్బులు పెడుతున్నవాళ్లు
3. పోగొట్టుకున్న చోటనే రాబట్టుకోవచ్చని మళ్ళీ పెట్టేవాళ్ళు 
4. హిట్టూ ఫట్టులతో సంబంధం లేకుండా లెక్కప్రకారం సంపాదించుకునేవాళ్ళు 
5. సినిమా ప్రొడ్యూసింగ్ అడ్డం పెట్టుకొని ఇతర వ్యాపారాల్లో భారీగా ఎదిగేవాళ్ళు 

ఈ లిస్టుని నేను చాలా పాజిటివ్ దృక్పథంతో రాశాను. 

అవగాహన, ఆత్మవిశ్వాసం, విజన్... ఈ మూడూ కలిస్తే ప్రొడ్యూసర్. 

ఆత్మవిశ్వాసం మితిమీరితేనే కష్టం. పై లిస్టులోని 1,2,3 ల్లో కొట్టుమిట్టాడాల్సి వస్తుంది. ఆ మొదటి మూడిట్లోనే ఎక్కడో చోట సెట్ అయిపోవాల్సి వస్తుంది.  


దీనికి చాలా గట్స్ ఉండాలి. ఉల్టాపుల్టా అయితే తట్టుకొనే దమ్ముండాలి. ఈ రెండిటినీ హాండిల్ చేయగల కిల్లర్-ఇన్‌స్టిన్‌క్ట్ మైండ్‌సెట్ ఉండాలి. 

అంతకుముందు "ప్రొడ్యూసింగ్ మనకెందుకులే" అని భయపడేవాణ్ణి. కాని - క్లింట్ ఈస్ట్‌వుడ్, మణిరత్నం, పూరి జగన్నాథ్ వంటి గట్సీ ఫిలిం మేకర్స్ కొందరి ఆలోచనా విధానం, ప్రొఫెషనల్ వర్కింగ్‌స్టయిల్ చూశాక ఈ విషయంలో నా ఆలోచన పూర్తిగా మారింది.

ఇప్పుడు నేను ప్రొడ్యూసర్‌గా కూడా సినిమాలు చేస్తున్నాను. నా ప్రొడక్షన్ హౌజ్‌ను ఒక రేంజ్‌లో డెవలప్ చేయబోతున్నాను. 

మనీ కావాలి నిజమే. కాని, దాన్ని మించిన మైండ్‌సెట్ కూడా చాలా ముఖ్యం.       

గత 14 నెలలుగా ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి ఎం డి గా కూడా పని చేస్తున్న నేపథ్యంలో - రియల్ ఎస్టేట్‌నూ దాంతో పాటు మరెన్నో వ్యాపారాలనూ చాలా దగ్గరనుంచి అధ్యయనం చేసే అవకాశం నాకు దొరికింది. ఈ అధ్యయనంలో నేను తెలుసుకున్న నిజం ఏంటంటే - రియల్ ఎస్టేట్ సహా చాలా వ్యాపారాల్లో ఉన్న గందరగోళం కంటే ఫిలిం ప్రొడ్యూసింగ్‌లో ఉన్న గందరగోళం చాలా చాలా తక్కువ. 

ఈ నేపథ్యంలో - 

"ఒక్క సినిమా నిర్మాతే "ప్రపంచంలో నంబర్ వన్ దమ్మున్న పెట్టుబడిదారుడు" అని ఇప్పుడు నేను చాలా కాన్‌ఫిడెంట్‌గా చెప్పగలను.  

2 comments:

  1. రాజకీయ నాయకులు కాదంటారా?

    ReplyDelete
    Replies
    1. ప్రొడ్యూసర్ తర్వాతే ఎవరైనా... అని నా ఉద్దేశ్యం. మీ పాయింటాఫ్ వ్యూలో పొలిటీషన్స్ కూడా కావచ్చు. నాకు అభ్యంతరం లేదు. :-)

      Delete