Wednesday 26 September 2012

మద్దిరాల స్మృతులు


అనుకోకుండా కొన్ని జరుగుతాయంటారు. నిజమేననిపిస్తుంది నాకిప్పుడు...

ఫేస్ బుక్ ను నేను పెద్దగా పట్టించుకోలేదు ఎప్పుడూ. కాని,  మధ్యే దానికి రెగ్యులర్ యూజర్ అయిపోవాల్సి వచ్చింది. వృత్తిపరంగా నాకు అవసరమైన నెట్ వర్క్ ను క్రియేట్ చేసుకోచేసువటానికి పని తప్పనిసరి  అయిపోయింది నాకు

 ట్రాక్ అలా నడుస్తుండగానే -

అనుకోకుండా - భరత్, ఉష, విద్య, రాజా, చైతన్య, మస్తాన్, దిలీప్, కవిత .. ఇలా ఒక్కొక్కరే కనెక్ట్ అవటం ప్రారంభమయింది. సుమారు రెండు దశాబ్దాల క్రితం - గుంటూరు లోని మద్దిరాలలో నేను పనిచేసిన జవహర్ నవోదయ విద్యాలయ విద్యార్థులు వీరంతా!

ఇదిలా
కంటిన్యూ అవుతుండగానే ఒక రోజు - అనుకోకుండా - అప్పటి నా నవోదయ కలీగ్, ఫ్రెండ్ PLN కూడా FB లో కనెక్ట్ అయ్యాడుఇది నేను అస్సలు ఊహించనిది. అప్పటి మా విద్యార్థుల గురించి, వారు యెవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు .. అన్నీ చెప్పాడు నా మిత్రుడు PLN.  ఇంకెన్నో విశేషాలు  ఫేస్ బుక్ నెట్ వర్క్ ద్వారా నేనే స్వయంగా తెలుసుకున్నాను. చాలా సంభ్రమానికి గురయ్యాను. దాదాపుగా అందరూ మంచి పొజిషన్ కి వెళ్లారు

డాక్టర్లు, సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు, లెక్చరర్ లు, యస్ లు, బిజినెస్ మాగ్నెట్ లు, ఎం ఆర్ ఓ లు, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ  .. ఇలా ప్రభుత్వ ప్రయివేట్ రంగాలకు చెందిన దాదాపు ప్రతి చోటా మంచి పొజిషన్స్ కి వెళ్లారు. అప్పటి రాజా ఇప్పుడు 'డాక్టర్ రాజా' (డెంటిస్త్రీ పీజీ) అయ్యాడు. ఇంకా - సురేష్, ఉష, విద్య మొదలయిన వాళ్లెందరో మంచి డాక్టర్లయ్యారు.  భరత్, కవిత, విద్య, కస్తూరి .. ఇంకా ఎందరో అమెరికాలో ఉన్నారు.

ఎప్పుడూ చెరగని చిరునవ్వుతో, అప్పుడు పొట్టి నిక్కర్లు వేసుకుని నవోదయ కారిడార్లలో తిరిగిన సజ్జా సాంబశివరావు ( శాం సజ్జా) ఇప్పుడు UK లో పని చేస్తూనే స్వంత కంపెనీ కూడా పెట్టాడు. త్వరలోనే ఇక్కడ భారీ వెంచర్లు ప్రారంభించే అలోచనలో ఉన్నాడు.  అప్పటి నవోదయ 'ఆల్ రౌండర్' భరత్ ప్రస్తుతం అమెరికాలోని 'నార్త్ కెరోలినా' లో పనిచేస్తున్నాడు. భరత్ మనసులో చాలా మంచి అలోచనలున్నాయి. అతను త్వరలోనే ఇండియా వచ్చి ఆ పనులకు స్వీకారం చుట్టబోతున్నాడు. ఇవన్నీ, ప్లస్ ఇంకా యెన్నో  తెలిసి, నిజంగా 
చాలా హాప్పీగా ఫీలయ్యాను.

అప్పటి  ఆ పాత విద్యార్థులంతా - వారు చదివిన జవహర్ నవోదయ విద్యాలయలో 'సిల్వర్ జుబ్లీ' పేరుతో ఒక భారీ గెట్ టుగెదర్’ ఇప్పుడు యేర్పాటు చేస్తున్నారు.  ఆ ఫంక్షన్ నెల 29, 30 తేదీల్లో.

విద్యార్థులే అన్ని ఖర్చులూ పెట్టుకుని, ప్రారంభం నుంచి ఇప్పటివరకు మద్దిరాల నవోదయలో పని చేసిన ప్రతి టేచర్ నూ, ప్రతి ఉద్యోగినీ ఫంక్షన్ కు ఆహ్వానిస్తున్నారు. యెవరు యెక్కడెక్కడ ఉన్నది ఆరా తీసి మరీ పని చేస్తున్నారు. అందరికీ కుటుంబ సమేతంగా టికెట్స్ కూడా వాళ్లే బుక్ చేస్తున్నారు! ఇతర అన్ని  ఏర్పాట్లూ విద్యార్థులవే!!

ఇంతటిటో అయిపోలేదు. ఈ నవోదయ 'అలుమ్ని’ ప్లాన్ చేస్తున్న ఇంకొక భారీ ఆలోచన గురించి విన్న తర్వాత ఎవరైనా  'హాట్స్ ఆఫ్' అనాల్సిందే. ఆ విషయం గురించి మరో సారి రాస్తాను.

సో, ఇటీవలి కాలంలో నన్ను అమితంగా ప్రభావితం చేసిన ఈ న్యూస్ ఇలా వుంటే – అనుకోకుండా, వ్యక్తిగతంగా నాకింకో విషయం గుర్తుకొచ్చింది.

ఈ 'గెట్ టుగెదర్'కి అటెండ్ కావటం కోసం, 28 న బయలుదేరాల్సిన నేను - ఇప్పుడు ఒక రోజు ముందే .. అంటే, 27 కే బయల్దేరుతున్నాను. ఎందుకు? సరిగ్గా 23 ఏళ్ల క్రితం - ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ నుంచి ఇదే సెప్టెంబర్ 27 వ తేదీ నాడు నేను గుంటూరు బయల్దేరి వెళ్లి, 28  సెప్టెంబర్ ఉదయం 11 గంటలకి మద్దిరాలలోని నవోదయ విద్యాలయలో ఉద్యోగంలో చేరాను! అది నా రెండో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.

అనుకోని సంఘటనలు జరగటం అంటే ఇదేనేమో ..

సరిగ్గా 23 యేళ్ల తర్వాత - వృత్తిపరంగా ఒక మధురమైన 'ఫ్లాష్ బ్యాక్'కి తెర లేచింది. ఇప్పుడు మళ్లీ ఆ క్యాంపస్ ను చూస్తాను. ఆ పరిసరాల్ని చూస్తాను. అప్పుడప్పుడూ సాయంత్రం పూట  నేనూ ఇంకొక మిత్రుడు (ఐజాక్) కలిసి  ఫిషింగ్ చేసిన ఆ మద్దిరాల కాలువనీ చూస్తాను. అప్పటి నా విద్యార్థుల్నీ, నా కలీగ్స్ నీ కలుస్తాను.

ఈ ఫీలింగే యెంతో బాగుంది. ఒక విధంగా నన్ను నేను మళ్లీ స్వీయ విమర్శ  చేసుకొనే అవకాశమిచ్చింది.  ఇదంతా అనుకోకుండానే జరిగింది.  

ఎపిసోడ్ అంతటికీ మూల కారణమయిన  నవోదయ మద్దిరాల విద్యార్థులకూ - అక్కడే వుండి, ఈ సిల్వర్ జుబిలీ కి సంబంధించిన అన్ని ఏర్పాట్లనూ తన భుజం మీద వేసుకొని పనిచేస్తున్న నాకత్యంత ప్రియమైన విద్యార్థి డాక్టర్ రాజశేఖర్ బాబు, నాగరాజు, రమాదేవి మొదలైన అందరికీ  'హ్యాట్స్ ఆఫ్' చెప్పకుండా ఎలా ఉండగలను?


Monday 24 September 2012

యూనివర్సిటీ గోల్డ్


లైబ్రరీ అండ్ ఇన్ ఫర్మేషన్ సైన్స్ లో నేను చదివిన BLISc, MLISc  రెండు కోర్సుల్లోనూ టాప్ ర్యాంకర్ గా ఉస్మానియా యూనివర్సిటీ నాకు రెండు గోల్డ్ మెడల్స్ ఇచ్చింది.

అయితే
- అదే యూనివర్సిటీలో ఉద్యోగం కోసం నేను అటెండ్ అయిన రెండు ఇంటర్వ్యూల్లోనూ యూనివర్సిటీ నన్ను సెలక్టు చేయలేదు!

అలాగని, నేనేం ఇంటర్వ్యూ బాగా చేయలేదని కాదు. అప్పటి యూనివర్సిటీ వైస్ చాన్స్ లర్ తో సహాఇంటర్వ్యూ చేసిన బోర్డు మెంబర్లు కనీసం ఒక్కటంటే ఒక్క ప్రశ్న కూడా నన్ను అడగ లేదు! నా సర్టిఫికేట్స్ చూసి "వెరీ గుడ్అని పంపించేశారు. ఉద్యోగం మాత్రం ఇవ్వలేదు.

నేను చదివిన యూనివర్సిటీ - నాకు ఇచ్చిన గోల్డ్ మెడల్స్ కు ఇచ్చిన విలువ అది!!

ఇక్కడే ఇంకో విషయం చెప్పాలి ..

యూనివర్సిటీ లైబ్రరీలో ఉద్యోగాలకోసం సమయంలో జరిగిన రెండు ఇంటర్వ్యూల్లోనూ - ఎవరికి ఉద్యోగం వస్తుందన్నది - నాకూ, ఇంటర్వ్యూకి అటెండ్ అయిన మరికొందరికీ ముందే తెలిసింది. ఇంకా చెప్పాలంటే - స్వయంగా అభ్యర్థులే చెప్పారు .. " జాబ్ నాకే వస్తుంది" అని!

అలాగే - నాకు "రాదు" అని కూడా వాళ్లే చెప్పారు. తర్వాత అలాగే జరిగింది ..

అయితే - అలా చెప్పింది కూడా మరెవరో కాదు .. స్వయంగా నా క్లాస్ మేట్స్. వాళ్లళ్లో - ఒకరుపాస్’ కావటానికీ, మరొకరికి మంచి మార్కులు రావటానికీ నేనే కారణం కావటం కొసమెరుపు!

తర్వాత, జీవితంలో నేనెప్పుడూ యూనివర్సిటీ ఉద్యోగానికీ కనీసం అప్ప్లై కూడా చేయలేదు ..

అయినా ..

నేను చదివిన నా ఉస్మానియా యూనివర్సిటీ అంటే నాకు ఎప్పుడూ ప్రేమే.  

Friday 21 September 2012

అంత సీన్లేదు!

ఇవాళ సుమారు ఒక అర డజను సినిమాలు మన దగ్గర రిలీజ్  అయ్యాయి. వాటిలో నాకు తెలిసిన ఒక చిన్న హీరో సినిమా కూడా రిలీజ్ అయ్యింది. నా దృష్టిలో - ఇప్పటికే ఒక రేంజ్ లో ఉండాల్సిన హీరో అతను. కానీ, యెందుకో అక్కడికి రీచ్  అవలేకపోయాడు.

రోజు  విడుదలైన  తన చిత్రం మీద హీరో కి అంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో లేదో నాకు తెలీదు కానీ - చిత్ర దర్శకునికి  మాత్రం చాలా ఆశలున్నాయి. సారీ, 'ఆశలుండేవి’ అనాలేమో ఇప్పుడు

తన సినిమా ఆడియో ఫంక్షన్ లో చాలా ఉద్వేగభరితంగా మాట్లాడాడు దర్శక మిత్రుడు. " చిత్రం సక్సెస్ అవక పోతే, నేనింక భవిష్యత్తులో హీరో దగ్గరికీ కథ చెప్పడానికి వెళ్లను" అన్నాడు.

ఒక వెరీ ట్రిక్కీ టైటిల్ తో - తెలుగులో ఆల్రెడీ ఒక హిట్ చిత్రం ఇచ్చిన రికార్డ్ ఆయనకుంది. ఇది మంచి కామెడీ సినిమా. సినిమాలో ఏమాత్రం స్టఫ్ ఉన్నా సినిమా ఎక్కడికో పోతుంది. కానీ, పరిస్థితి చూస్తోంటే, దర్శక మిత్రుడి ఆశలు ఫలించే సూచనలు మాత్రం కనిపించడం లేదు.

కారణం - సినిమా నేను ఊహించని స్థాయిలో  - అతి తక్కువ థియేటర్లలో రిలీజ్ అయింది!  

"మా చిన్న సినిమా వాళ్లకి థియేటర్లు అసలు దొరకటం లేదు!" అని చిత్రం రిలీజ్ సందర్భంగా నిన్న రాత్రి ఒక టీవీ చానెల్ లో హీరో చెప్పాడు.

నా అమాయకపు ప్రశ్న  ఏంటంటే - మరో అరడజను సినిమాల రిలీజ్ ఉన్న రోజునే సినిమాను కూడా రిలీజ్ చేయాల్సినంత అవసరం ఏంటి? లాభం ఏంటికొంచెం గ్యాప్ చూసుకొని రిలీజ్ చెయ్యొచ్చుగా! ఎంతో కాలం ఆగి, ఇంత హడావిడిగా రిలీజ్ చెయటానికి ఉసిగొల్పిన కారణం ఏంటి

కోరి ఫెయిల్యూర్ కొని తెచ్చుకోవటం తప్ప - నాకయితే మరొక కారణం కనిపించటం లేదు. బట్,   స్టిల్ విష్ డైరెక్టర్,  అండ్ హీరో   థంపింగ్ సక్సెస్!

Thursday 20 September 2012

యూజ్ అండ్ త్రో


అంటే - అవసరం ఉన్నంత వరకు వాడుకొని, వదిలేయటం అన్న మాట!  
'యూజ్ అండ్ త్రో' కల్చర్ అనేది సినీ ఫీల్డు లో ఉన్నంతగా మరెక్కడా ఉండక పోవచ్చుననేది నా వ్యక్తిగత అభిప్రాయం.

'ఇలా కూడా జరుగుతుందా?!!' అని మనకి మనం షాక్ అయిపోయి ప్రశ్నించుకునేంత స్థాయిలో ఉంటుంది కల్చర్. నిజంగా నమ్మలేం ..

మనతో అవసరం ఉన్నంత వరకు  'సార్ సార్’ అంటూ మనకు వంగి వంగి దండాలు పెడతారు. మనమే ఆశ్చర్యపోతాం - 'ఏంటి మరీ ఇంత అభిమానమా' అని!  దశాబ్దాలుగా పరిచయం ఉన్నంత రేంజ్ లో వారి అభిమానాన్ని ప్రదర్శిస్తారు.

'మీరు లేకుండ ఏదీ లేదు!' అని అనుక్షణం వారి ఫీలింగ్స్ ని తెలుపుకుంటుంటారు.

ఇక్కడ 'కట్' చేద్దాం ..

మనతోపని అయిపోయింది .. ఇంక అవసరం లేదు’ అని తెలుసుకున్న మరుక్షణం - మనం ఎవరమో మనకే సందేహం కలిగేట్టు చేస్తారు! ఎదురుగా కనిపించినా 'ఎవరో' అన్నట్టుగా - ఒక గోడను చూసినట్టు చూస్తారు తప్ప - కనీసం విష్ చేయరు. పోనీ, చూళ్లేదేమో అని - మనం విష్ చేసినా అసలు పట్టించుకోరు. 'ఎవర్నువ్వు' అన్నట్టుగా చూస్తారు!!

నేను
మరీ అతిశయోక్తిగా రాశాను అనుకుంటున్నారేమో .. కానీ, ఇదంతా నూటికి నూరు పాళ్లూ నిజం.

ఆరు నెలల తర్వాత మళ్లీ మనతో ఏదయినా అవసరం వచ్చిందనుకోండి .. క్షణంలో మళ్లీ మన కళ్లముందు అదే డ్రామా 'రీప్లే' అవుతుంది! పాత్రలూ అవే.. స్టేజీ అదే .. జస్ట్ రీప్లే!!

ఇలాంటివి ఎన్నో చూసి - అనుభవించిన నా మిత్రుడొకాయన సినీ ఫీల్డులోని సంస్కృతి కి కాస్త మొరటుగా రెండే రెండు ముక్కల్లో ఒక పేరు పెట్టాడు.

కండోం కల్చర్!

ఇంక దీని గురించి వివరించాల్సిన అవసరం లేదనుకుంటాను..

Tuesday 18 September 2012

సోషల్ నెట్ వర్క్ 2020



"2020లో సోషల్ నెట్ వర్క్ బాగా పాప్యులర్ అయి ఉంటుంది?"

రోజు ఉదయం - ఒక వెబ్ సైట్ లో ఆసక్తికరమైన ప్రశ్న కనిపించింది నాకు. జవాబు కోసం గూగుల్ లో సెర్చ్ చేశాను వెంటనే. చాలా మంది చాలా చాలా చెప్పారు. వాటన్నిటి సారాంశం ఏంటంటే - ఫేస్ బుక్  (FB) ని బీట్ చేసే వెబ్ సైట్ లు చాలా చాలా వస్తాయని. అట్ లీస్ట్ - ఒక కొత్త వెబ్ సైట్ ఏదో వస్తుందని.

కాని, నా ఉద్దేశ్యంలో -

"2020 నాటికి కూడా FB నే అతి పెద్ద పాప్యులర్ సోషల్ నెట్ వర్క్ గా, ప్రపంచంలో తన టాప్ పొజిషన్ను కంటిన్యూ చేస్తూ ఉంటుంది!" 

ఇలా చెప్పగలగటానికి నా దగ్గర 100 కారణాలున్నాయి. ఉదాహరణకు కొన్ని:

> ఫేస్ బుక్ కు ఇప్పుడు  బిలియన్ యూజర్స్ ఉన్నారు. అంటే - 1 తర్వాత 9 సున్నాలు .. లేదా 100 కోట్లు!
(‘మై స్పేస్’ కనుమరుగు కావటానికి ముందు దాని యూజర్లు 100 మిలియన్లు మత్రమే.)

> చిన్న-పెద్దా, బీద-ధనిక అనే భేదం లేకుండా - భూమి మీదున్న ప్రతి దేశం లోనూ FB ఉంది.

> ఇతర వెబ్ సైట్ తో పోల్చిచూసినా - కనీసం 100 రెట్లు అధికంగా FB ని ఉపయోగిస్తున్నారు జనం.

> 'యువర్ హోం పేజ్' అనే కాన్సెప్ట్ ఇప్పుడు 'యువర్ ఫేస్ బుక్ పేజ్' అయిపోయింది!

> ప్రపంచపు అతి పెద్ద డేటింగ్ సైట్ కూడా ఇదే.

> ప్రపంచంలో అత్యధిక ఫోటో షేరింగ్ కూడా సైట్ మీదే జరుగుతుంది.

> ప్రపంచపు అతి పెద్ద గేమింగ్ సైట్ కూడా ఫేస్ బుక్కే.

> నేను దాదాపు ప్రతి రోజూ FB ని ఉపయోగిస్తున్నాను.

> నా 15, 13 ఏళ్ల ఇద్దరు అబ్బాయిలు కూడా FB ని రెగ్యులర్ గా ఉపయోగిస్తున్నారు.

> నేనూ, మా అబ్బాయిలిద్దరూ FB ని 'ఎలా' ఉపయోగిస్తున్నామా అని .. కంట కనిపెట్టడం కోసమయినా, FB ని రెగ్యులర్ గా విజిట్ చేస్తుంది నా శ్రీమతి.

> నాకు తెలిసిన ప్రతి ఒక్కరూ FB ని ఉపయోగిస్తున్నారు, లేదా - కనీసం -  FB లోకి ఏదో విధంగా 'ఎంటర్' అవుతున్నారు! (తాతమ్మలు, అమ్మమ్మలతో సహా!)

సో .. ఇప్పటికీ, 2020 నాటికి మధ్య .. FB లో ఇంకా ఊహించని డెవలప్మెంట్స్ చాలా చాలా వస్తాయి. వాటి గురించి మరొకసారి కలుద్దాం. 2020 నాటికి, ఆక్సిజన్ లేకుండానయినా జనం బ్రతగ్గలరేమో గానీ, FB లేకుండా మాత్రం బ్రతకలేరనిపిస్తుంది. కొంచెం అతిశయోక్తిగానే చెప్పాన్నేను. కానీ, 2020 నాటికి FB రేంజ్ లో ఉంటుందని నా గట్టి నమ్మకం!

***

PS: ఫేస్ బుక్ ని రూపొందించిన మార్క్ జుకేర్బర్గ్ సామర్ఢ్యం  గురించి మరోసారి మాట్లాడుకుందాం.
అన్నట్టు
-  మొన్నటి .. మే 14 కి .. అతని వయస్సు 28 ఏళ్లు.