Saturday 27 February 2021

ఫిలిం ఇన్వెస్ట్‌మెంట్ మీడియేటర్స్ కోసం...

కరోనా వైరస్ నేపథ్యంలో, సుదీర్ఘ లాక్‌డౌన్ తర్వాత ఫిలిం ఇండస్ట్రీలో చాలా మార్పులొచ్చాయి. కొత్తగా మరికొన్ని ఆదాయమార్గాలు ఏర్పడ్డాయి. 

సినిమా ఇప్పుడొక కార్పొరేట్ బిజినెస్.


డైరెక్టుగా థియేటర్స్‌లో రిలీజ్ అయ్యే సినిమాలతో పాటు - OTTలు, ATTలు కూడా సరికొత్త ఆదాయమార్గాలయ్యాయి. అనేక భాషల్లో వెబ్ సీరీస్‌లు కూడా వ్యూయర్‌షిప్‌లో, బిజినెస్‌లో సంచలనాలు క్రియేట్ చేస్తున్నాయి.  

ఈ గోల్డెన్ అపార్చునిటీని వినియోగించుకొనే ప్రయత్నంలో భాగంగా – ఒక నంది అవార్డు రైటర్-డైరెక్టర్‌గా, నేనొక సీరీస్ ఆఫ్ ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ సినిమాలను న్యూ టాలెంట్‌తో, మైక్రో బడ్జెట్‌లో  ప్లాన్ చేస్తున్నాను. తర్వాత ఇదే ఒక భారీ ప్రొడక్షన్ హౌజ్ అయినా ఆశ్చర్యం లేదు. ప్రస్తుతం ఆ స్థాయిలోనే నా పనులు కదులుతున్నాయి.     

ఈ నేపథ్యంలో - 

ఇంతకుముందే సినిమాయేతర బిజినెస్‌లలో స్థిరపడి ఉండి… ఫిలిం ప్రొడక్షన్ మీద, ఇండస్ట్రీ మీద, సెలెబ్ స్టేటస్ మీద ఆసక్తి, ప్యాషన్ ఉన్న డైనమిక్ ఇన్వెస్టర్స్, ఫండింగ్ పార్ట్‌నర్స్‌తో కనెక్ట్ చేసి, సమర్థవంతంగా డీల్ వెంటనే క్లోజ్ చేయగల "మీడియేటర్స్" కోసం నేను చూస్తున్నాను. 

మీడియేటర్స్‌కు మార్కెట్ రాయాల్టీ ఉంటుంది. ఆసక్తి ఉన్న మీడియేటర్స్‌ వెంటనే నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. 

Film Director, Nandi Awardee Writer
WhatsApp: +91 9989578125
^^^

(థాంక్స్ ఇన్ అడ్వాన్స్!: మీకు తెలిసినవాళ్ళలో – ఆసక్తి ఉన్నవారికి దీన్ని షేర్ చేయండి.) 

Friday 26 February 2021

కొన్నిటిని ఎప్పుడూ గుర్తుచేసుకోవద్దు!

ఎందుకంటే - ఏదైతే వద్దనుకొంటామో అదే మళ్ళీ మళ్లీ కళ్లముందుకొచ్చి మరింత బాధపడతాం. మానసికంగా బలహీనపడతాం. మళ్ళీ కొన్నిరోజులు అదే నెగెటివిటీ. 

మన నిర్ణయం తప్పో, అవతలివాళ్ల బాధ్యతారాహిత్యం తప్పో, నిర్లక్ష్యమో, నోటికొచ్చిన అబద్ధాలు వినీ వినీ చివరికి నాకంటే చిన్నవాళ్లచేత "ఒకడు" అనిపించుకోడమో, ఆ స్థాయికి మనం పడిపోవడమో... మొత్తానికి అంతా అయిపోయింది. 

నా జీవితం మొత్తంలో అత్యంత చెత్త ప్రొఫెషనల్ నిర్ణయం అదే. ఆ నిర్ణయం వల్ల అనవసరంగా చాలామందికి దూరమయ్యాను. ఒకరిద్దరికి శత్రువయ్యాను. ఒక అరడజన్ మంది కలిసి చేసిన నష్టం కంటే కనీసం 10 రెట్ల నష్టం జరిగింది. ఎంతో డబ్బు నష్టం. సోషల్‌గా అవమానాలు. పరోక్షంగా ఈ కారణంగా నాకెంతో దగ్గరి మనుషులను కూడా కోల్పోయాను.

అన్నిటినీ మించి, నా జీవితంలోని ఎంతో విలువైన ఈ దశలో ఆరేళ్ళ కాలం... అది తిరిగి రాదు.      

ఈరోజుకి ఆరేళ్లు. సంతోషంగా ఆ జ్ఞాపకానికి సమాధి కట్టేస్తున్నాను. 

ఎవ్వరిమీదా ఎలాంటి కోపం లేదు. ఎలాంటి నెగెటివిటీ లేదు. ఉండదు. ఉండబోదు.  

నా నిర్ణయానికి, దాని పరిణామాలకి నేనే బాధ్యత వహించడం కరెక్టు. అదే చేస్తున్నాను. నేను కోల్పోయిన ఫ్రీడమ్‌ను మళ్ళీ వెనక్కి తెచ్చుకోడానికి కొంత కాలం నాకీ సంఘర్షణ తప్పదు.

ఇలాంటి పర్సనల్ ఇంట్రాస్పెక్షన్‌కు కూడా ఇదే చివరి రోజు.

ది ఎండ్. 

షిఫ్ట్ డిలీట్. 

అంతా మన మంచికే. అందరూ మనవాళ్లే. 

ఎవ్వరూ ఎవ్వరికి మిత్రులు కారు, శత్రువులు కారు. పరిస్థితులే మనుషుల్ని మిత్రుల్నీ శత్రువుల్నీ చేస్తాయి. కాని, ఆ పరిస్థితుల్ని సృష్టించేది కూడా ఆ మనిషే అన్న విషయం మర్చిపోవద్దు.   
- మహాభారతం   

Saturday 20 February 2021

ఫ్రీలాన్స్ రైటింగా, ఘోస్ట్ రైటింగా?

ఒక ధోరణికి, ఒక శైలికి, ఒక రూపానికి, ఒక సాహిత్య విభాగానికి పరిమితం చేసుకోకుండా - వృత్తిపరంగా ఏది అవసరమైతే అది రాయగలిగే రచయితలను "ఫ్రీలాన్స్ రైటర్" అనవచ్చు. 

మొట్టమొదటగా "ఫ్రీలాన్స్ రైటర్" అన్న పదాన్ని నేను కుష్వంత్ సింగ్ బైలైన్ దగ్గర చూశాను. తర్వాత శోభా డే రాసుకోగా చూశాను. 

వీళ్ళిద్దరూ కూడా యమ అగ్రెసివ్ రైటర్స్ కావటం విశేషం. నాకు తెలిసి వీళ్ళు రాయని ప్రక్రియ లేదు. 

ఫిక్షన్ రాశారు, పోయెట్రీ రాశారు. సాహితీ విమర్శ రాశారు. సినిమా కథలు, స్క్రిప్టులు రాశారు. సినిమా సమీక్షలు రాశారు. న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్‌కు ఆర్టికిల్స్, ఇంటర్వ్యూలు వగైరా పుంఖానుపుంఖాలుగా రాశారు. 

ఈ ఇద్దరి రచనల మీద ఆక్స్‌ఫర్డ్ సహా, ఎన్నో విదేశీ యూనివర్సిటీల్లో పరిశోధనలు జరిగాయి. అది వేరే విషయం. 

వీరి రచనలకు మంచి రీడబిలిటీ ఉంటుంది. వీరి భావాలను, రచనలను తిట్టేవాళ్ళు ఎక్కువే, చదివే పాఠకులూ ఎక్కువే. 

ఎక్కువమంది తిడుతున్నారూ అంటే - గన్‌షాట్‌గా ఎక్కువమంది చదువుతున్నారని అర్థం చేసుకోవచ్చు! 

లేదంటే - అంతంత పారితోషికాలిచ్చి రాయించుకోరెవ్వరూ!

అసలు ఇంత కంటెంట్ ప్రతిరోజూ ఎలా రాస్తారు? డెడ్‌లైన్స్‌కు ఎలా అందిస్తారు? .. అనుకొనేవాన్ని అప్పట్లో. మరికొంతమంది ప్రొఫెషనల్ రైటర్స్‌ను చూశాక నా డౌట్ క్లియర్ అయింది. ఇప్పుడు అసలు ఈ విషయంలో నాకు ఎలాంటి డౌట్ లేదు.  

ఇలాంటి ఫ్రీలాన్స్ రైటర్స్‌కు ఆదాయం బాగుంటుంది. 

ఇతర రైటర్స్‌కు అంతగా ఉండదు. లేదా - అసలు వారికి వారి రచనల ద్వారా ఆదాయమే ఉండదు. 

ఫ్రీలాన్స్ రైటింగ్‌తోపాటు ఇప్పుడు లేటెస్టుగా "కంటెంట్ రైటింగ్" పాపులర్ అయింది. వెబ్‌సైట్స్‌కు, వెబ్‌సీరీస్‌లకు, సీరియల్స్‌కు, సినిమాలకు, ఇతర టీవీ-వెబ్ ప్రోగాములకు ఎప్పటికప్పుడు రాసిచ్చేదే - ఈ కంటెంట్ రైటింగ్. 

అభివృద్ధిచెందిన దేశాల్లో కంటెంట్ రైటర్స్‌కు మంచి ఆదాయం. ఇప్పుడు ఇక్కడ కూడా నెమ్మదిగా పాపులర్ అవుతోంది.      

థాంక్స్ టు ఇంటర్‌నెట్... ఇప్పుడు ఫ్రీలాన్స్ రైటింగ్, కంటెంట్ రైటింగ్ కొంత ఈజీ అయింది. డెడ్‌లైన్‌కు ఒక గంట ముందు చెప్పినా సరే, రాసి మెయిల్ చెయ్యొచ్చు, వాట్సాప్ చెయ్యొచ్చు. 

కట్ చేస్తే -  

ఒక రచయిత తన రచనలకు తన పేరు కాకుండా - ఇంకొకరి పేరు పెట్టుకొనే పద్ధతిలో ఒక నాన్-డిస్‌క్లోజర్ అగ్రిమెంట్‌తో రాసే పద్ధతే "ఘోస్ట్ రైటింగ్". 

ఇది ఎప్పటినుంచో ఉంది. దీనికున్న పరిమితులవల్ల ఏ ఘోస్టు ఎవరికి రాశారు అన్నది తెలియదు. స్పెక్యులేషన్ మాత్రం చాలా ఉంటుంది. 

ఘోస్ట్ రైటింగ్ అనేది ఒక్క ఫిలిం ఇండస్ట్రీలోనే ఉంది అని చాలామంది అనుకుంటారు. కాని, అంతటా ఉంది. అనాది నుంచే ఉంది. 

అమెరికా వంటి దేశాల్లో ఘోస్ట్ రైటింగ్ సర్విసెస్ బాహాటంగా ఉంటాయి. అదొక భారీ ప్రొఫెషన్ అక్కడ. "I'm a Ghost Writer" అని బాహాటంగా చెప్పుకుంటారక్కడ. ఇక్కడంతా తెరవెనుకే. 

నిజాని ఆ అవసరం లేదు. ఇదీ ఒక ప్రొఫెషనే. రెమ్యూనరేషన్ తీసుకొని రాసివ్వడమే. 

తేడా ఒక్కటే - 

మన పేరుతో రాసిచ్చే క్రియేటివ్ కంటెంట్‌కు ఒక రెమ్యూనరేషన్ ఉంటుంది. "మీరు ఎవరి పేరయినాపెట్టుకోవచ్చు" అని రాసిచ్చే కంటెంట్‌కు మామూలుగా డబుల్ రెమ్యూనరేషన్ ఉంటుంది. 

ఇది రెండువైపులా అంగీకారంతో జరిగే ఒక అతి మామూలు ప్రక్రియ. 

విన్ - విన్!     

నేనూ, నా పర్యవేక్షణలో నా క్రియేటివ్ టీమ్ - ఫ్రీలాన్స్ రైటింగ్, ఘోస్ట్ రైటింగ్  కూడా ప్రారంభించాము. 

సినిమా స్క్రిప్టులు, వెబ్ సీరీస్ స్క్రిప్టులు, సీరియల్స్, ఫిక్షన్, నాన్-ఫిక్షన్, బయోగ్రఫీలు, ఆటో బయోగ్రఫీలూ, ఆర్టికిల్స్, స్పీచ్‌లు, వెబ్ కంటెంట్, బులెటిన్స్, ఇన్-హౌజ్ న్యూస్ లెటర్స్... ఏదైనా - ఎలాంటి కంటెంట్ అయినా - మానవ సాధ్యమయిన ఎలాంటి డెడ్‌లైన్‌కయినా అందించగలం. 

కంటెంట్, దాని రెమ్యూనరేషన్ స్టాండర్డ్ విషయంలో ఎలాంటి రాజీ ఉండదు. 

మీదే ఆలస్యం! 

Whatsapp: +91 9989578125 
Email: mchimmani10x@gmail.com 
^^^
(థాంక్స్: మీకు తెలిసినవాళ్ళలో - దీని అవసరం ఉన్నవారికి షేర్ చేయండి.)  

Thursday 18 February 2021

వాడుకున్నోళ్లకు వాడుకున్నంత!

సోషల్ మీడియా అనేది - ప్రింట్ మీడియా, ఎలెక్ట్రానిక్ మీడియాలను ఎప్పుడో బైపాస్ చేసేసింది.  

దీని పవర్, ఎఫెక్ట్ గుర్తించినవాళ్ళు దీన్ని ఎంత బాగా వాడుకోవాలో - అంత బాగా వాడుకుంటున్నారు. అనుకున్నట్టుగా ఫలితాలు సాధించి ఎంజాయ్ చేస్తున్నారు. 

మరోవైపు - దీని పవర్ తెలియక - దీన్ని లైట్‌గా తీసుకున్నవాళ్ళు అసలు పత్తాలేకుండా అదృశ్యమైపోతున్నారు. 

దీని పవర్ తెలిసి కూడా - దీన్ని నిర్లక్ష్యం చేస్తున్న రాజకీయ పార్టీలు, వ్యక్తులు ఎలాంటి దెబ్బ తింటున్నారంటే - "అవును, మేం చాలా తక్కువ అంచనా వేశాం, తప్పు చేశాం" అని ఒప్పుకోడానికి కూడా ఫీలైపోయేంతగా!   

ఇంకా చెప్పాలంటే - సోషల్ మీడియాలోకి ఇంకా ఎవరైనా ఎంటర్ కాలేదంటే - అసలు వారి ఉనికి ఈ భూమ్మీద లేనట్టే లెక్క!    

ఆ స్థాయిలో తన పవర్ ఇప్పటికే ప్రూవ్ చేసుకుంది సోషల్ మీడియా!   

ఎంతో "పవర్" ఉన్న పెద్ద పెద్ద స్పిరిచువల్ గురువులు కూడా ఇప్పుడు వారి ప్రమోషన్‌కు సోషల్ మీడియా మీదనే ఆధారపడుతున్నారంటే విషయం అర్థం చేసుకోవచ్చు.  

ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, పింటరెస్ట్, యూట్యూబ్, బ్లాగింగ్ ఎట్సెట్రా... అన్నిటినీ కలుపుకొని ముద్దుగా పిల్చుకొనే పేరే - సోషల్ మీడియా. 

సోషల్ మీడియా ప్రమోషన్ అంటే - ఫేస్‌బుక్‌లో ఏదో నాలుగు పోస్టులు పెట్టడం మాత్రం కాదు.    

కట్ చేస్తే - 

పాలిటిక్స్‌లో ఉన్నవాళ్లకు, పాలిటిక్స్‌లో పాపులర్ కావాలనుకొనేవాళ్లకు సొషల్ మీడియా హల్ చల్ మరీ మరీ అవసరం. 

ఇప్పుడున్న స్థానం నిలబెట్టుకోవాలన్నా, కొత్తగా ఏదైనా పార్టీ టికెట్ సంపాదించుకోవాలన్నా - "సోషల్ మీడియాలో నువ్వెక్కడ?" అన్నదే అక్కడ మొట్టమొదటి అర్హత అవుతుందంటే అతిశయోక్తి కాదు.     

ఇక - డాక్టర్స్, డైటీషియన్స్, బ్యూటీషియన్స్, పొలిటీషియన్స్, సెలెబ్రిటీలు, ఫ్యాషన్ డిజైనర్స్, అర్కిటెక్ట్స్, రియల్టర్స్, కన్సల్టెంట్స్, న్యూ-ఏజ్ థెరపీ ప్రాక్టీషనర్స్ వంటి కొన్ని సెలెక్టెడ్ ప్రొఫెషన్స్‌వారికి కూడా సొషల్ మీడియా యాక్టివిటీ చాలా అవసరం. మీ ప్రొఫెషన్-లేదా-బిజినెస్ కనీసం 10 రెట్లు పెంచుకోవచ్చు. 


కొంతమందికి సోషల్ మీడియాలో సెల్ఫ్ ప్రమోషన్ చేసుకొనే సామర్థ్యం ఉంటుంది, సమయం కూడా క్రియేట్ చేసుకోగలుగుతారు. వారి ప్రొఫెషన్‌లో వారు కోరుకొన్న ఫలితాలు ఎంజాయ్ చేస్తుంటారు. 

అయితే - కొందరికి మాత్రం ఈ సామర్థ్యం ఉండదు, సమయం కూడా ఉండదు. కొందరికి ఈ సామర్థ్యం ఉన్నా, సమయం ఉండదు. ఇలాంటివారి కోసం భారీ ఫీజులు, ప్యాకేజీలతో సోషల్ మీడియా స్ట్రాటెజిస్టులు వివిధ పేర్లతో ప్రపంచమంతా పనిచేస్తున్నారు.    

సోషల్‌మీడియా మేనేజింగ్‌లో దేశవిదేశీ క్లయింట్స్‌తో నాకున్న "ఈలాన్సింగ్/అప్‌వర్క్" అనుభవంతో - ఇప్పుడు లోకల్‌గా - నేనూ, నా ఆధ్వర్యంలో ఒక స్కిల్డ్ టీమ్ సొషల్‌మీడియా మేనేజింగ్ సేవలు ప్రారంభించాము. 

దీని ప్రాముఖ్యం తెలిసినవారు నన్ను నేరుగా కాంటాక్ట్ చేయవచ్చు. మీమీ రంగాల్లో మీరనుకొనేది ఏదైనా సరే, సాధించడం అసాధ్యమేం కాదు! 

నా వాట్సాప్: +91 9989578125
ఈమెయిల్: mchimani10x@gmail.com 
^^^
(థాంక్స్: మీకు తెలిసినవాళ్ళలో - దీని అవసరం ఉన్నవారికి షేర్ చేయండి.)  

Wednesday 17 February 2021

హాపీ బర్త్‌డే, కేసీఆర్!

రాష్ట్ర అసెంబ్లీలో ఒకప్పుడు తెలంగాణ పదాన్నే నిషేధించారు అని విన్నప్పుడు రక్తం మరుగుతుంది. 

అదే అసెంబ్లీలో - తమ పార్టీ అధినేతలకు చెంచాగిరీ చేస్తూ, నోరెత్తక కూర్చున్న అనేకమంది ‘సన్నాసి’ తెలంగాణ ప్రాంత మంత్రులను, ఎమ్మెల్లేలను గుర్తు చేసుకున్నప్పుడు సిగ్గనిపిస్తుంది. 

ఇలాంటి నేపథ్యంలో - దశాబ్దాలుగా లేస్తూ, పడిపోతూ .. నివురుగప్పిన నిప్పులా ఉన్న తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసి, నింగిని అంటుకునేలా రగల్చడానికి ఒక ఉద్యమ నాయకుడు అవసరమయ్యాడు. 

ఆ అవసరాన్ని గుర్తించి - తెలంగాణ సాధనే తన జీవితాశయంగా, జీవితంగా మార్చుకొని - తిరుగులేని ఉద్యమనాయకుని అవతారమెత్తిన ఒకే ఒక్కడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు .. ఉరఫ్ .. కేసీఆర్.  

తన తిండి, తిప్పలు, గాలి, నీరు, నిద్ర .. అన్నీ తెలంగాణగా పద్నాలుగేళ్లపాటు ఉద్యమంలో నానా విన్యాసాలు చేశాడు కేసీఆర్. 

ఎన్నో అడ్డంకులు. అవమానాలు. ఎదురుదెబ్బలు. ఎగతాళి. తిట్లు. శాపనార్థాలు. 

అయినా చెక్కు చెదరని ఏకాగ్రతతో - ఎదుటివారికి ఎప్పటికప్పుడు ఊహించని ట్విస్టులు ఇస్తూ, తికమకపెడుతూ, అవేశం రగిలినప్పుడు తిడుతూ, అవసరమైనచోట అణకువ పాటిస్తూ, అందరిని కలుపుకుపోతూ - ఉద్యమాన్ని ముందుకే నడిపాడు తప్ప .. ఎట్టిపరిస్థితుల్లోనూ ఆ జ్వాల ఆరిపోనివ్వలేదు. 

ఏం మేధస్సు .. ఎంతటి వాగ్ధాటి .. అసలు ఏమిటా జ్ఞాపక శక్తి .. 

ఎంత పట్టుదల .. ఎంత ఓర్పు .. ఎంత శక్తి .. ఎంత మానవత్వం .. ఎంత చాకచక్యం .. ఎన్ని ఎత్తులు .. ఎన్ని జిత్తులు .. 

అన్నీ ఒకే ఒక్క లక్ష్యం కోసం. 

అది .. తెలంగాణ సాధన. 

ఈ ఒక్క లక్ష్యమే కేసీఆర్ నోటివెంట విసరడానికి సిధ్ధంగా ఉన్న గ్రెనేడ్ లాంటి ఒక మాటగా వేలాదిసార్లు వినిపించింది. తెలంగాణ ప్రజల గుండెల్లో ప్రతిధ్వనించింది: 

"తెలంగాణ తెచ్చుడో .. సచ్చుడో!" 

ఎంత ఆత్మ విశ్వాసం .. ఎంత తెగింపు .. ఎంత లేజర్ ఫోకస్ .. 


చివరికి ఒక రోజు - "ఆంధ్రప్రదేశ్ నుంచి డిల్లీ వెళ్తున్నాను. మళ్ళీ నేను అడుగుపెట్టేది తెలంగాణ గడ్డమీదనే!" అని చెప్పి మరీ వెళ్లాడు కె సి ఆర్. 

చెప్పినట్టుగానే, నాలుగురోజుల తర్వాత .. డిల్లీ నుంచి తెలంగాణ గడ్డమీదనే మళ్ళీ కాలుపెట్టాడు కేసీఆర్. 

దటీజ్ కేసీఆర్! 

విజయమే లక్ష్యంగా - వందలాది నాయకుల్ని, వేలాది గ్రూపుల్నీ సంఘాల్నీ, కోట్లాది ప్రజలను సమన్వయం చేసుకొంటూ - పడుతూ, లేస్తూ, పరుగెత్తుతూ, పరుగెత్తిస్తూ - ఉద్యమాన్ని ఉరకలెత్తించి గమ్యం చేర్చిన కేసీఆర్ గత పద్నాలుగేళ్ల జీవితం, నా జీవితకాలంలో నేను స్వయంగా నా కళ్లముందు చూసిన ఒక విజయ గాథ. 

ఒక లైవ్ సక్సెస్ స్టోరీ. 

కాగా - ఈ గమ్యం చేరుకోవడం కోసం ఆయన వేసుకున్న బ్లూప్రింటు, అనుసరించిన వ్యూహం, నడిపించిన డిప్లొమసీ, కూడగట్టిన లాబీయింగ్, వేసిన ఎత్తులు, చేసిన జిత్తులు, ఆవేశంలో అరచిన అరుపులు, పడిన తిట్లు, పాటించిన మౌనం, పెట్టిన చెక్‌లు .. అదంతా ఒక యుద్ధతంత్రం. 

అప్పుడు ఉద్యమ సమయంలో తెలంగాణ సాధనకోసం - ఇప్పుడు ముఖ్యమంత్రిగా తెలంగాణ అద్భుత భవిష్యత్తు కోసం - ఇంటా బయటా ఇంచుమించు అదే యుద్ధతంత్రం! 

ఆరు దశాబ్దాలుగా రగిలిన తెలంగాణ ప్రజల మనోవాంఛను నిజం చేసిన అంతటి ఒక వ్యక్తికి, ఉద్యమశక్తికి .. తన కలల తెలంగాణ రూపశిల్పికి, దాని సాధనకోసం మొక్కవోని దీక్షతో ముందుకు సాగిపోతున్న సిసలైన రెనెగేడ్ కార్యసాధకునికీ .. ఒక రచయితగా, ఒక చలనచిత్ర దర్శకుడిగా,  ఒక అభిమానిగా, ఒక తెలంగాణ బిడ్డగా ఇవే నా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు... 

Tuesday 16 February 2021

ఇది పోస్ట్ చెయ్యొచ్చా?!

"ఇది పోస్ట్ చేస్తే ఎట్లా?... అందరూ ఏమనుకుంటారు?! ఎలాంటి రియాక్షన్ ఉంటుందో?!!" 

ఈ ఘర్షణ లేకుండా, ఇప్పటివరకు ఒక్క బ్లాగ్ కూడా పోస్ట్ చేయలేదట - నా ఫేవరేట్ బ్లాగర్స్‌లో ఒకరు, James Altucher!  

జేమ్స్ ఒక బెస్ట్ సెల్లర్ రైటర్. దాదాపు డజన్ బుక్స్ రాశాడు. భారీ ఫినాన్షియల్ ఎక్స్‌పర్ట్ కూడా. పొద్దున లేస్తే మిలియన్లు, బిలియన్లు ఇన్వెస్ట్ చేసేవాళ్లతోనే అతని పని. స్వయంగా జేమ్స్ కూడా ఒక పెద్ద సీరియల్ ఎంట్రప్రెన్యూర్. 

కట్ చేస్తే -  

మిషన్ అంటే దానికొక ఖచ్చితమైన టార్గెట్ ఉంటుంది. దాన్ని పూర్తిచెయ్యడానికో డెడ్‌లైన్ ఉంటుంది. ప్రస్తుతం నేనూ అలాంటి ఒక వెరీ సీరియస్ షార్ట్ టర్మ్ గోల్ పెట్టుకొని పనిచేస్తున్నాను. 

అందులో భాగంగా - ఇకనుంచీ నా బ్లాగ్‌లో, సోషల్ మీడియాలో నేను పోస్ట్ చేసే 'స్టఫ్' అంతా సినిమాలు, ఫ్రీలాన్స్ రైటింగ్, కోచింగ్, కన్సల్టింగ్, క్రియేటివిటీకి సంబంధించిన అంశాలపైనే ఉంటుంది. 

కొన్ని పోస్టుల్లో సొంత డబ్బా, కొన్నిట్లో అగ్రెసివ్ మార్కెటింగ్ ఉండొచ్చు. ఉంటాయి. 

నా ఫ్రెండ్స్ లిస్ట్‌లో ఉన్న కొంతమందికి ఇవి నచ్చకపోవచ్చు. చికాకు తెప్పించవచ్చు. బోర్ కొట్టొచ్చు. సహజం.

అన్నీ అందరికీ నచ్చాలని రూలేం లేదు. అది అసాధ్యం కూడా. 

ఈ స్టఫ్ నచ్చని మిత్రులు, పెద్దలు నిర్మొహమాటంగా నన్ను బ్లాక్ చెయ్యొచ్చు, అన్‌ఫ్రెండ్ చెయ్యొచ్చు, అన్‌ఫాలో కావచ్చు... అని నా సవినయ మనవి. 

ఎంజాయ్ చేసే మిత్రులకు, పెద్దలకు ఛీర్స్!     

రోజూ ఎన్నో బిలియన్ల ఫండ్స్ డీల్ చేసే జేమ్స్ ఆల్టుచరే - తాను పోస్ట్ చేసే ప్రతి పోస్ట్‌కూ "పోస్ట్ చెయ్యాలా వద్దా?" అని తన్నుకుచస్తాడట. ఆఫ్టర్ ఆల్... నేనెంత?

సో, నో వర్రీస్. నేను జేమ్స్ అంత కూడా ఆలోచించను. ఆ టెన్షన్‌లో పడిపోకముందే పోస్ట్ చేసేస్తాను. 


చివరగా ఇంకో మాట - 

"అవతల ఎవరో ఏమనుకుంటారో అని ఆలోచించటం వృధా. వాళ్లంతా వచ్చి మన బిల్స్ కట్టరు" అన్నాడొక పెద్దాయన.

సో - మన పనులు, మన బాధ్యతలు, మన టార్గెట్స్, మన ఫ్రీడమ్ మనకు చాలా ముఖ్యం. 

థాంక్యూ సో మచ్...     

Monday 15 February 2021

Make Movies That Make Money!

"జీవితం అన్నాక ఛాలెంజెస్ తప్పవు. ఆ మాత్రం అప్స్ అండ్ డౌన్స్ లేని జీవితాన్ని జీవించడంలో అసలు మజా ఏముంటుంది?"
- రతన్ టాటా

లాక్‌డౌన్ సమయంలో – ఫిలిం ఇండస్ట్రీలో ఓటీటీలు, ఏటీటీల నేపథ్యంలో చాలా గమ్మత్తులు జరిగాయి. కేవలం సినిమా బిజినెస్ పాయింటాఫ్ వ్యూలో మాత్రమే చూసినట్టైతే మాత్రం, ATT (Any Time Theater) అనేది ఒక గొప్ప టర్నింగ్ పాయింట్!

ఈ విషయంలో శ్రేయాస్ మీడియాను, ఆర్జీవీని మెచ్చుకోకతప్పదు.

ఇండస్ట్రీ అంతా ఆందోళనతోనో, కన్‌ఫ్యూజన్‌తోనో అన్నీ మూసేసుకొని ఒకవైపు టెన్షన్‌పడిపోతోంటే – ఒక్క ఆర్జీవీ మాత్రం దాదాపు ప్రతి రెండు వారాలకు ఒక సినిమా ఎనౌన్స్ చేస్తూ, తీస్తూ, చూపిస్తూపోయాడు!

100 రూపాయల టికెట్ పెట్టి, CLIMAX సినిమాకు కేవలం 24 గంటల్లో ఒక రెండున్నర కోట్లు సంపాదించుకున్నాడు. క్లైమాక్స్ ఇచ్చిన కిక్‌తో వెంటనే ఒక 22 నిమిషాల NAKED సినిమా తీసి దానికి 200 రూపాయల టికెట్ పెట్టి, ఇంకో అరకోటి సంపాదించుకున్నాడు.

చాలా పెద్ద గ్యాప్ తర్వాత ప్రొడ్యూసర్ ఎం ఎస్ రాజు DIRTY HARI అనే టైటిల్‌తో ఒక హాట్ రొమాంటిక్ డ్రామా, తనే డైరెక్ట్ చేసి, ఏటీటీలో రిలీజ్ చేశారు. టికెట్ రేట్ 120 రూపాయలు. జస్ట్ 24 గంటల్లో 91 వేలమంది చూశారు. సుమారు కోటి పది లక్షల కలెక్షన్!

“ఆర్జీవీ కాబట్టి అంత పబ్లిసిటీ వచ్చింది. వేరేవాళ్లకు అట్లా కలెక్షన్స్ రావు” అని ఒక లాజిక్. కాని, ఇప్పుడున్న సోషల్‌మీడియా పవర్ నేపథ్యంలో ఈ లాజిక్ నిలబడదు. 

మనం ఎలా ప్రమోట్ చేస్తాం… ఎంత ఎఫెక్టివ్‌గా ప్రమోట్ చేస్తాం అన్నదే ముఖ్యం. 

ఏటీటీలు కూడా మొత్తం అడల్ట్ కంటెంట్‌తో రన్‌చేస్తేనే డబ్బులొస్తాయి అనుకోవడం కూడా కరెక్టు కాదు. 

బూతే చూడాలనుకొంటే ఇంటర్నెట్ నిండా ఒక మనిషి చూడ్డానికి జీవితకాలం కూడా సరిపోనంతటి పోర్న్ ఉంది. అదంతా వదులుకొని, ఇక్కడ 100 రూపాయల టికెట్ కొనుక్కొని ఈ సినిమాల్లో ఏదో రెండు హాట్ సీన్లు చూడ్డానికి ఎవరో వస్తారనుకోవడం ఉట్టి భ్రమ.

కట్ చేస్తే - 

సినిమా ఇప్పుడొక కార్పొరేట్ బిజినెస్. బిగ్ బిజినెస్. 

కంటెంట్ బాగున్నప్పుడు థియేటర్ రిలీజ్ కూడా కష్టం కాదు.  

చిన్న సినిమా అయినా -  'పర్లేదు' అంటే పది నుంచి పాతిక కోట్లు, 'హిట్' అన్నారంటే 100 కోట్లు! 


ఈ గోల్డెన్ అపార్చునిటీని వినియోగించుకొనే ప్రయత్నంలో భాగంగా – ఒక నంది అవార్డు రైటర్-డైరెక్టర్‌గా, కేవలం ఏటీటీలో రిలీజ్ కోసమే, న్యూ టాలెంట్‌తో, సీరీస్ ఆఫ్ మూవీస్ ప్లాన్ చేస్తున్నాను.  

తర్వాత, ఇదే ఒక భారీ ప్రొడక్షన్ హౌజ్ అయినా ఆశ్చర్యం లేదు. నో జోక్స్... ప్రస్తుతం ఆ స్థాయిలోనే నా పనులు కదులుతున్నాయి. 

ఫిలిం ప్రొడక్షన్ మీద, ఇండస్ట్రీ మీద, సెలెబ్ స్టేటస్ మీద ఆసక్తి, ప్యాషన్ ఉన్న డైనమిక్ ఫండింగ్ పార్ట్‌నర్స్ కోసం చూస్తున్నాను. ఈ దిశలో మీటింగ్స్ కూడా జరుగుతున్నాయి. 

అనుకున్నట్టు అన్నీ జరిగేట్టు చూసుకొని - అతిత్వరలో నా కొత్త సినిమా ప్రారంభించే పనిలో వున్నాను. 

కట్ చేస్తే -  

కరోనా తర్వాత... కొత్త ఉత్సాహంతో ఇప్పుడు నేను చేయబోయేది నా మొదటి సినిమా అవుతుంది! 

Make Movies That Make Money!      

Sunday 14 February 2021

బీచ్ రోడ్దు నుంచి భీమిలీ దాకా...


It's not a question of being in love with some one. It's a question of being love.

వాలెంటైన్స్ డే అనగానే నాకు ముందు గుర్తొచ్చేది వైజాగ్. 

నా వాలెంటైన్ అక్కడే ఉంది, వైజాగ్‌లో.  

కట్ చేస్తే - 

వైజాగ్ అనగానే నాకు ముందుగా గుర్తొచ్చేది సముద్రం. 

తర్వాత చలం .. భీమ్‌లీ .. ఆ తర్వాత అరకు .. స్టీల్ ప్లాంట్ .. గంగవరం బీచ్‌లో నేను షూట్ చేసినప్పుడు, అదే స్టీల్ ప్లాంట్ గెస్ట్ హౌజ్‌లో మేమున్న నాలుగు రోజులూ... ఇంకా బోల్డన్నున్నాయి నాకు గుర్తొచ్చేవి. 

1987లో అనుకుంటాను, నేను వైజాగ్ మొట్టమొదటిసారిగా వెళ్లాను... 

తర్వాత మరికొన్నిసార్లు వైజాగ్ వెళ్లానుగానీ, ఎప్పుడు కూడా వైజాగ్‌ను అంత పెద్ద స్పెషల్‌గా నేనేం ఫీలవ్వలేదు.

ఈ మధ్య నా ప్రొఫెషనల్ పనులమీద వైజాగ్ ఎక్కువసార్లు వెళ్తున్నాను. లేటెస్ట్‌గా మొన్న డిసెంబర్‌లో వెళ్ళాను. ఈ 2021 జనవరిలో కూడా వెళ్ళాను.  

వైజాగ్ నాకు చాలా బాగా, ప్రశాంతంగా, అందంగా కనిపిస్తుంది. ఏవిటా అందం అంటే తడుముకోకుండా కనీసం ఒక డజన్ అంశాల్ని చెప్పగలను. వాటిల్లో నేను బాగా ఇష్టపడే అందం - సముద్రం. 

సముద్రం మీద వ్యామోహంతో ఇంతకుముందు నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు .. ఎక్కువగా గోవా, పాండిచ్చేరిలకు వెళ్లేవాణ్ణి. ఈ రెండూ నాకు ఇప్పటికీ చాలా ఇష్టమైన ప్రదేశాలు. దేని ప్రత్యేకత దానిదే. అయితే .. గోవా, పాండిచ్చేరిల కంటే ఇప్పుడు వైజాగే నాకు మరింత బాగా అనిపిస్తోంది. 


బీచ్ రోడ్దు నుంచి భీమిలీ దాకా .. అలా సముద్రాన్ని చూసుకొంటూ కార్లో వెళ్తూ, నచ్చినచోట దిగి కాసేపు ఆగుతూ, రోజులకి రోజులే గడిపేయొచ్చు. నాకెప్పుడు అవకాశం దొరికినా నేనిదే పని చేస్తాను. 

ఈపని చేయడం కోసం, నా పనుల్లో ఎంతవరకు వీలైతే అంతవరకు ఇక్కడే వైజాగ్‌లో చేసుకోగలిగే అవకాశాల్ని సృష్టించుకొంటాను.  

సముద్రాన్ని నేనంతగా ప్రేమిస్తాను. సముద్రం ఉన్నందుకు వైజాగ్‌ని మరింతగా ప్రేమిస్తాను. అంతా ఒక స్పిరిచువల్ కనెక్షన్. 

వైజాగ్‌లో ఉన్న నా ప్రేయసి, నా వాలెంటైన్ మరెవరో కాదు... సముద్రం.  

Saturday 6 February 2021

సాదిక్... నేనూ... మా జామై ఉస్మానియా చాయ్ అడ్డా!

ఓయూలో మా సీనియర్, నా హాస్టల్‌మేట్ సాదిక్ భాయ్ అంటే నాకు చాలా ఇష్టం. 

కట్ చేస్తే -

సాదిక్ చెప్పింది చేస్తాడు. ఏదైనా తను చెప్పింది చెయ్యలేకపోతే, అవ్వకపోతే ఆ విషయం వెంటనే  నేరుగా, నిర్మొహమాటంగా చెప్పేస్తాడు... "మనూ, ఆ పని ఇంక కాదు" అని. 

అతనిలో ఇది నాకు చాలా ఇష్టం. 

సుమారు ఓ ఆరేళ్లక్రితం అనుకుంటాను. నాకో మాటిచ్చాడు సాదిక్ భాయ్. అప్పుడు నా సినిమా పనుల హడావుడి, బిజీల్లో ఆ విషయం గురించి పెద్దగా పట్టించుకోలేదు. దాదాపు మర్చిపోయాను. 

వన్ ఫైన్ ఈవెనింగ్ తన మాట నిలబెట్టుకున్నాడు పెద్దన్న! అది కూడా - చాలా డీసెంట్‌గా, డిగ్నిఫైడ్‌గా, ఎంతో హుందాగా... నేను షాక్‌తో ఉబ్బి తబ్బిబ్బయిపోయి సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోటంతగా!

పైన రాసినదాంట్లో ఎలాంటి అతిశయోక్తిలేదని మిత్రులందరికి సవినయ మనవి. నేను సాదిక్ భాయ్‌ని ఇంచ్ కూడా పొగడ్డం లేదు. 

కట్ చేస్తే - 

ఒకసారి రామ్‌నగర్‌లో ఒక "తోపుడు బండి" చూపించాడు సాదిక్. 

"ఏందన్నా ఇది?" అనడిగా. 

ఆ తోపుడు బండితో తాను మర్నాటి నుంచి ఏమేం చేయాలనుకుంటున్నది చెప్పాడు. తన ఆలోచన నాకు నచ్చింది. చరిత్రలో నిల్చిపోయే ఒక బ్రాండ్ క్రియేట్ చెయ్యగల సత్తా ఆ ఆలోచనకుంది. అదే చెప్పాను. కంగ్రాట్స్ చెప్పి బయటపడ్డాను. 

సాదిక్‌ను నేనెప్పుడూ లైట్ తీసుకోలేదు. కాని, ఈ తోపుడు బండి విషయంలో మాత్రం - దాని వెనకున్న ఎంతో శ్రమ దృష్ట్యా - కొంచెం లైట్ తీసుకున్నాను. 

సాదిక్ చేసి చూపించాడు. 

లోకల్ స్క్రైబ్స్ నుంచి, బీబీసీ దాకా సాదిక్ తోపుడు బండి ఒక పెద్ద సెన్సేషనల్ న్యూస్ ఐటమ్ అయింది.  

ఈమధ్య - లాక్‌డౌన్ టైమ్‌లో ఊళ్ళల్లో పిల్లలకు పుస్తకాలు, యాండ్రాయిడ్ ఫోన్లు, చలికి వణుకుతున్న పిల్లలకు, పెద్దలకు బ్లాంకెట్లు, ఆకలితో ఉన్నవారికి నిత్యావసర వస్తువులు... చాలానే చేశాడు. 

అదీ - వ్యక్తిగతంగా తనకు రిస్క్ ఉంటుందని తెలిసీ!


ఇదిగో - ఇప్పుడు మళ్ళీ అక్కడెక్కడో అడవిలో ఒక పర్ణశాల వేశాడు మా సాదిక్ భాయ్. 

తెల్లారితే అక్కడ అదో సంచలనం. పండగ. 400 మందికి భోజనాలూ, ఊహించని ఇంకేవో సంభ్రమాశ్చర్యాలూ... 

అయితే - తోపుడు బండి నుంచి, పర్ణశాల దాకా - సాదిక్ ఇదంతా చేస్తున్నది ఏదో సెన్సేషన్ కోసమో, పేరు కోసమో కాదు. తన సంతృప్తి కోసం. 

కట్ చేస్తే -  

అనుకోకుండా ఒక సింగిల్ సిట్టింగ్‌లో, ఒక ఫ్లోలో రాస్తున్నా కాబట్టి - ఇదంతా ఒక నాన్ లినియర్ స్క్రీన్‌ప్లేలా ఉంటుంది. క్షమించాలి. 

కాని, ఇది ఇలా రాయటం అవసరం అనిపించి రాస్తున్నాను. రెండు కారణాలున్నాయి: ఒకటి - నా బ్లాగింగ్ ప్యాషన్. రెండు - సాదిక్‌లోని ఇంకో గొప్ప గుణం గురించి మిత్రులకు చెప్తూ, నాకు నేను ఒక పాఠం నేర్చుకోవాలన్న "సెల్ఫ్ మోటివేషన్" కోసం! 

సాదిక్ తను ఏం చెయ్యాలనుకుంటే అది చేసేస్తాడు. తను ఎలా బ్రతకాలనుకుంటే అలా బ్రతుకుతాడు. ఇంక దీంట్లో ఎలాంటి రెండో మాటకు తావు లేదు. 

ఒక అయిదేళ్ళక్రితం - మా జామై ఉస్మానియా చాయ్ అడ్డా దగ్గర - వన్ ఫైన్ మార్నింగ్, మేమిద్దరం కూర్చొని మాట్లాడుకొంటున్నప్పుడు - మా ఇద్దరికి మాత్రమే తెలిసిన ఒకరి గురించి, సమయం విలువ గురించీ - నాతో చెప్పిన ఒక మాట చెప్పి ఇది ముగిస్తాను... 

"మనూ! నేను ఆ వ్యక్తి మీద నా పూర్తి నమ్మకం పెట్టి, నా పూర్తి సపోర్ట్ ఇచ్చాను. అంతా వృధా అని అర్థమయింది. నా జీవితంలో ఒక్క సంవత్సరం అంటే దానికి ఎంతో వాల్యూ ఉంది. చాలా నష్టపోయాను. అదే ఒక్క సంవత్సరం నా మీద నేను ఫోకస్ చేసుకుంటే - ఏం చేయగలనో చూపిస్తాను" అన్నాడు. 

సంవత్సరం తిరక్కముందే ఎన్నో చేసి చూపించాడు! 

దటీజ్ సాదిక్...

తను అనుకున్నది చేస్తాడు. అనుకున్నట్టుగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తాడు. 

అందుకే మా సాదిక్ భాయ్ అంటే నాకిష్టం. అడవిలో ఈ పర్ణశాల సెటప్‌తో ఇప్పుడతనికి ఫ్యాన్‌ని కూడా అయ్యాను.