Friday 28 July 2023

Tuesday 25 July 2023

What Next... Nolan?!

 


#Oppenheimer #ChristopherEdwardNolan #ChristopherNolan #WhatNext
#Manoharam #PhotoBlog #ManoharamPhotoBlog #ManoharChimmani

డిజిటల్ యుగంలో ట్రెడిషనల్ ఆఫీసులు అవసరమా?


కేఫే మిలాంజ్. బియాండ్ కాఫీ.  
ఇరానీ హోటల్. కాఫీ డే. 
కేబీఆర్ పార్క్. నెక్లెస్ రోడ్డు. 
ఐమాక్స్ లాబీలు. ట్యాంక్ బండ్. 
యాత్రి నివాస్. సినీ ప్లానెట్
స్టూడియోలు, ల్యాబ్స్
ప్రివ్యూ థియేటర్లు, పబ్స్... 

ఈ డిజిటల్ సోషల్ మీడియా యుగంలో... చాలా వ్యాపారాలకు, వృత్తులకు అసలు ఆఫీస్ అవసరం లేదు. 

సినిమాలకు కూడా. 

కట్ చేస్తే - 

ట్రెడిషనల్ పధ్ధతిలో, ఎప్పుడూ ఒకే నాలుగు గోడల మధ్య కూర్చుని పని చేయడానికి ఇప్పుడు ఎవరూ ఇష్టపడటంలేదు. 

ముఖ్యంగా... లో అండ్ మిడ్ రేంజ్ సినిమాల విషయంలో ఇప్పుడు ఈ ట్రెండ్ పాక్షికంగానయినా అమలవుతుండటం ఒక మంచి పరిణామం. 

సినిమా నిర్మాణానికి సంబంధించిన పని ఏదయినా ఇప్పుడు ఊహించని విధంగా సూపర్‌ ఫాస్ట్‌గా జరిగిపోతున్న రోజులివి. మొబైల్, వాట్సాప్, ఫేస్‌బుక్, ఈమెయిల్, స్కైప్, జూమ్... ఇలా ప్రతి ఆధునిక మీడియా సాధనం సినిమా నిర్మాణానికి ఏదోరకంగా బాగా ఉపయోగపడుతోంది.

కొత్త నటీనటులు, టెక్నీషియన్ల ఎన్నిక దాదాపు ఆన్‌లైన్ ద్వారానే జరిగిపోతోంది. ఫోటోలు, వీడియో క్లిప్స్ ఆన్‌లైన్లో అందుబాటులో ఉన్నప్పుడు .. ఇంక ప్రత్యేకంగా ముంబై, ఢిల్లీ లకు వెళ్లాల్సిన అవసరమేలేదు. స్క్రీన్‌టెస్టులంటూ వారాలకి వారాలు అవుటాఫ్ ద సిటీ టైం వేస్ట్ చేయాల్సిన అవసరం అంతకంటే లేదు.

షార్ట్ లిస్ట్ చేసుకున్నవాళ్లని చూడ్డానికి మాత్రం ఒక్కసారి మాత్రం డైరెక్ట్ ఆడిషన్ అవసరమౌతోంది. దాని కోసం ప్రత్యేకంగా ఆఫీస్ అవసరం లేదు. 

ఇక కథా చర్చలు, మేకింగ్ ప్లానింగ్స్, అన్నీ కాఫీడేల్లో, నెక్లెస్ రోడ్ చెట్లక్రింద, ఐమాక్స్‌లో, కేబీఆర్ పార్కులో, టాంక్‌బండ్ మీదా, బ్యాచిలర్ రూముల్లో, డాబాల మీది పెంట్ హౌజుల్లో... ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా స్మూత్‌గా జరిగిపోతున్నాయి.

కేవలం సినిమా షూటింగ్ సమయంలో మాత్రం ఒక్క నెలపాటు... ఏ గెస్ట్‌హౌజ్‌ లోనో, లేదంటే... ఓనర్స్ అభ్యంతర పెట్టని ఏ బ్యాచిలర్ పెంట్ హౌస్ లోనో, లేదంటే... ఓ నెల పాటు ఒక ఎయిర్ బి ఎన్ బి ఫ్లాట్ తీసుకొని గాని... పనులు పూర్తిచేసుకోగలిగితే చాలు.

పోస్ట్ ప్రొడక్షన్‌కి మళ్లీ మామూలే. ఎక్కడ పని జరుగుతోంటే అక్కడే అవసరమైన టీమ్ మెంబర్లు వాలిపోతారు. అంతే. ఫైనల్ కాపీ రెడీ!

ఇక - బిజినెస్ కోసం అయితే ఇప్పుడు అసలు ఆఫీసే అక్కర్లేదు! పని, వాళ్ళ ఆఫీసుల్లోనే కాబట్టి మనకు ప్రత్యేకంగా ఆఫీసు అవసరం లేదు. 

So... 

మనల్ని నిరంతరం డైనమిక్‌గా ఉంచి, ఎనర్జీ లెవెల్స్ పెంచే ఇంతమంచి నేచురల్ లొకేషన్స్‌ని మించిన ఆఫీస్ ఏముంటుంది? ఇలాంటిచోట్ల పనిజరిగినప్పుడే ఆలోచనలు కూడా ఎప్పటికప్పుడు మెరుపుల్లాంటివి వస్తాయి. 

పైగా, నెలకో లక్ష రూపాయలు ఆఫీసు మెయింటేన్ చేసే ఖర్చులు మిగుల్తాయి. ఆ లక్షతో హాయిగా ఒక పూట షూటింగ్ చేసుకోవచ్చు.

ఇదంతా హాలీవుడ్‌లో ఎప్పటినుంచో ఉంది, ఇప్పుడూ ఉంది. 

కేన్స్ వంటి ఫిలిం ఫెస్టివల్స్‌లోనూ, హాలీవుడ్‌లోనూ సంచలనాలు సృష్టించిన "ఎల్ మరియాచి", "బ్లెయిర్‌విచ్ ప్రాజెక్ట్", "పారానార్మల్ యాక్టివిటీ", "బిఫోర్ సన్‌రైజ్", "ఫర్ లవర్స్ ఓన్లీ", "న్యూలీ వెడ్స్"... వంటి ఎన్నో ఇండిపెండెంట్ సినిమాలకు వాటి నిర్మాణ సమయంలో ఆఫీసుల్లేవు. 

మన ఇండియాలో కూడా చరిత్ర సృష్టించిన ఎన్నో సత్యజిత్ రే, గోవింద్ నిహలానీ, మహేశ్ భట్ లాంటి దర్శకుల సినిమాలకు అసలు ఆఫీసులు లేవు. వాళ్ళు ఎక్కడ కలిస్తే అదే ఆఫీసు!

సక్సెస్‌కు, ఆఫీసు లేకపోడానికి అసలు సంబంధం లేదు. ఎన్నో (ఇండిపెండెంట్, క్రౌడ్‌ఫండెడ్, లో, మిడ్ రేంజ్ బడ్జెట్) బ్లాక్ బస్టర్ కమర్షియల్ సినిమాలు ఈ నిజాన్ని ప్రూవ్ చేశాయి. 

అంతా జస్ట్ మన మైండ్‌సెట్. 

అయితే - ఇక్కడ మనం గొప్పల కోసం షో చేసుకోవటమే ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఇదంతా ఎవరూ పాటించరు. 

కట్ చేస్తే - 

నేను "లైక్‌మైండెడ్ టీమ్" అని ఎప్పుడూ నా ఆలోచనలకు సూటయ్యే టీమ్‌ను వెతుక్కుంటూ ఉండటం వెనకున్న కొన్ని అతిముఖ్యమైన కారణాల్లో ఇది ఒకటి. 

నాలుగు గోడల మధ్య కూర్చొని - వాడి గురించి వీడి గురించి సొల్లు మాట్లాడుకొంటూ టైమ్ వేస్ట్ చేసుకోవటం కంటే అసలు ఆఫీసు లేకపోవడం బెటర్. 

బడ్జెట్ చాలా మిగుల్తుంది. దాన్ని చివర్లో ఫిలిం ప్రమోషన్‌కు వాడుకోవచ్చు.   

నేను కూడా త్వరలోనే నా కొత్త "డిజిటల్ ఆఫీసు"కి షిఫ్ట్ అయిపోతున్నాను. 

డిజిటల్ ఆఫీసంటే ఇంకేదో కాదు... 

ఫోకస్డ్‌గా పనిచేయడానికి పనికిరాని ట్రెడిషనల్ ఆఫీసు లేకపోవడమే డిజిటల్ ఆఫీస్! 

ఆఫీసు లేకుండానే మిలియనేర్లు, బిలియనేర్లు అయినవాళ్ళు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఉన్నారు. అంతర్జాతీయంగా చాలా ప్రొఫెషన్స్‌లో ఇప్పుడిదే ట్రెండ్ నడుస్తోంది.     

My dream is to dissolve my office altogether, go paperless, and basically only have my laptop as an office.

I almost on the verge of achieving this by the end of this year. 2023.   

Monday 24 July 2023

"భారత రాజకీయాల్లో రాక్ స్టార్!"


మొన్నీ మధ్యే యూయస్, యూకె దేశాల్లో రెండు వారాలు పర్యటించి తెలగాణకు 36,000 కోట్ల రూపాయల పెట్టుబడులను సాధించుకొచ్చారాయన. తద్వారా ప్రత్యక్షంగా 42,000 కొత్త ఉద్యోగాలు, అంతకు రెట్టింపు సంఖ్యలో పరోక్ష ఉపాధి కల్పనను కూడా సాధించారాయన.

ఇది జస్ట్ ఒక ఉదాహరణ... 

దావోస్‌లో ఆయన నాయకత్వంలో మన తెలంగాణ స్టాల్ అంటే ప్రపంచస్థాయి దిగ్గజ కంపెనీలకు, వాటి సీ ఈ వో లకు, అక్కడ కవర్ చేసే జర్నలిస్టులకు పిచ్చి క్రేజ్. కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల మంత్రులెవ్వరూ సాధించలేని వాణిజ్య ఒప్పందాల్ని రికార్డు స్థాయిలో సాధించి అక్కడనుంచి వెనక్కి రావడం ఆయనకు ఒక హాబీ.

ఒక్కోసారి - వరుసగా ప్రతి రోజూ ఏదో ఒక భారీ జాతీయ అంతర్జాతీయ కంపెనీతో ఒప్పందం చేసుకోవడం అనేది తెలంగాణలో ఒక సర్వసాధారణ విషయం అనిపించేలా చేశారాయన. 

టీ-హబ్, వీ-హబ్, టీ-వర్క్స్, టీ-శాట్, టాస్క్, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైద్రాబాద్, తెలంగాణ స్టేట్ ఇన్నొవేషన్ సెల్... దేశంలో ఎవ్వరూ ఇంతవరకు తలపెట్టని, ఊహించని ఇలాంటి ఇంకో డజన్ కాన్‌సెప్టులు, ఆలోచనలు, ఆవిష్కరణలు... ఆయన విధాన నిర్ణయాలే, ఆయన ముందుచూపే.    


ప్రపంచ స్థాయి దిగ్గజ కంపెనీల నుంచి ఈ స్థాయిలో పెట్టుబడులు తెలంగాణ కోసం సాధించాలంటే ఎంతో పోటీ ఉంటుంది. ఆ పోటీ మన దేశంలోని రాష్ట్రాలతోనే అనుకుంటే పొరపాటే. ప్రపంచంలోని అనేక దేశాలు కూడా ఈ పోటీలో ఉంటాయి. 

"హైద్రాబాద్‌ను ఒక అత్యుత్తమ స్థాయి నగరంగా తీర్చిదిద్దే విషయంలో కూడా మా ఆలోచన, మా పోటీ ప్రపంచంలోని అత్యుత్తమ స్థాయి నగరాలతోనే తప్ప దేశంలోని నగరాలతో కాదు" అంటారాయన. 

అదీ ఆయన ఆలోచనల స్థాయి.         

విదేశాల్లో ఆయన పర్యటనలప్పుడు - వివిధ సమావేశాల్లో ఆయనతో మాట్లాడిన అక్కడి దిగ్గజ కంపెనీల అధినేతలు, సీ ఈ వోలు ఒక సందేహం వ్యక్తం చేస్తారు... "భారత దేశంలోని కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల్లోని మంత్రులు ఈయనలా ఎందుకుండరు" అని.  

మామూలుగా కేంద్రమంత్రుల స్థాయిలోనే ఆహ్వానించే అనేక ప్రపంచస్థాయి చర్చాగోష్టులకు భారతదేశం నుంచి ఎవరినైనా పిలవాలనుకున్నప్పుడు అందరికీ మొట్టమొదట స్పురించే పేరు ఇప్పుడు ఆయనదే అయింది.  

అమెరికాకు చెందిన వెంచర్ క్యాపిటలిస్టు, వ్యాపారవేత్త ఆశా జడేజా మోత్వాని "ఇంత భావ వ్యక్తీకరణ, ఇంత స్పష్టత ఉన్న యువరాజకీయనాయకున్ని నేను ఎప్పుడూ చూళ్ళేదు. 20 ఏళ్ళ తర్వాత కేటీఆర్ భారతదేశానికి ప్రధానమంత్రి అయినా ఆశ్చర్యపోకండి" అని ట్వీట్ చేశారు. ఎలాంటి అతిశయోక్తి లేని ఆ ట్వీట్ సృష్టించిన సంచలనం ఇంకా తాజాగానే ఉంది. 

ఆయన కనుసన్నల్లో పనిచేసే వివిధ రంగాల్లో నిష్ణాతులైన అత్యంత సమర్థవంతమైన అధికారుల బృందం బహుశా దేశంలోని ఏ మంత్రి దగ్గరా లేకపోవచ్చునంటే అతిశయోక్తి కాదు. అధికారుల సామర్థ్యాన్ని గుర్తించి, తదనుగుణంగా వారి సేవలను అత్యుత్తమస్థాయి ఫలితాల రూపంలో, అమిత వేగంతో రాబట్టుకోగలగటం ఆయనొక్కడికే సాధ్యం. Thanks to his dynamic Team and his unparalleled vision... ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకత్వంలో - గత తొమ్మిదేళ్ళలో మంత్రిగా ఆయనొక్కడి చొరవ, కృషి వల్లనే ఇప్పటివరకు మన రాష్ట్రానికి ఒక 3.50 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. కనీసం ఒక 22.50 లక్షల ఉద్యోగావకాశాలు కల్పించబడ్డాయి.       

దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో పాజిటివ్ పాలిటిక్స్‌ను ఇష్టపడే పౌరులంతా "మాకూ ఆయనలాంటి ఒక మినిస్టర్ ఉంటే బాగుండు" అనుకుంటారు. అదే కోరికను ఆర్టికిల్స్‌లో రాశారు, ఉపన్యాసాల్లో మాట్లాడారు, ట్వీట్లు చేశారు, ఇతర సోషల్ మీడియా వేదికల్లో పంచుకున్నారు. "ఈయన్ని క్లోనింగ్ చేసి, రాష్ట్రానికొకర్ని ఈయనలాంటి మంత్రిని  తెచ్చుకుంటే బాగుండు" అని కూడా సరదాగా ఆశపడ్డారు.

కట్ చేస్తే - 

ముఖ్యమైన జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో ఆయన ఎప్పుడూ టచ్‌లో ఉంటారు. స్పోర్ట్స్, గేమ్స్ ఫాలో అవుతుంటారు. నిత్యం వివిధ సాంఘిక-సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. ఓటీటీల్లో వెబ్ సీరీస్‌లు చూస్తుంటారు. సినిమాలు చూస్తుంటారు. సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో అప్పుడప్పుడు స్పెషల్ అప్పియరెన్స్ ఇస్తుంటారు. తాను చూసిన లేటెస్ట్ నాన్-తెలుగు సినిమా గురించి చెప్పి ఎదురుగా ఉన్న యాంకర్‌ను షాక్ అయ్యేలా చేస్తారు. సమావేశం ఏదైనా, సబ్జెక్టు ఏదైనా సరే - అక్కడున్నది మైక్రోసాఫ్ట్ సీఈవో అయినా సరే - తన మార్క్ చెణుకులు ఒకటో-రెండో అలా అలవోగ్గా పడాల్సిందే! 


మొన్నీ మధ్యే ఒక పాపులర్ టీవీ చానెల్లో గంట-నలభై నిమిషాలపాటు ఎలాంటి తడబాటు లేకుండా, ఏకధాటిగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ప్రతి అంశానికి గణాంకాలనిస్తూ ఆ ప్రోగ్రాం ప్రజెంటర్‌ను ఒక ఆట ఆడుకున్నారాయన.

ట్విట్టర్‌ను కేవలం రాజకీయాలకే కాకుండా, వేగవంతమైన ప్రజాసేవకు కూడా అత్యంత సమర్థవంతంగా ఉపయోగించవచ్చని దేశంలోనే మొట్టమొదటిసారిగా నిరూపించిన వ్యక్తి ఆయన. ఈలన్ మస్క్ కూడా ఆశ్చర్యపోయేలా, ఆయనలోని మానవీయ కోణాన్ని తెలిపే ఒక నిరంతర మహాయజ్ఞానికి వేదిక అయింది ట్విట్టర్. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, మంత్రిగా, నిత్యం తన దైనందిన రాజకీయ, ప్రభుత్వ, సాంఘిక కార్యక్రమాల్లో ఎంతో బిజీగా ఉంటూనే - ట్విట్టర్ ద్వారా ఎప్పటికప్పుడు సమస్యలకు స్పందిస్తూ ఎంతోమంది ప్రాణాలను కాపాడారాయన. ఎందరి చదువులకో, జీవితాలకో ఎన్నో రకాలుగా క్షణాల్లో ఆపన్న హస్తం అందించారాయన. 

పాలిటిక్స్‌లో ఉన్నవాళ్లకు తప్పకుండా రాజకీయ లక్ష్యాలుంటాయి. కాని, కేవలం తన రాజకీయ లక్ష్యాల కోసమే ఆయన ఇదంతా చేస్తున్నారని ఎవరైనా అనుకుంటున్నారంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. తెలంగాణమీద మమకారం లేకుండా ఈ స్థాయి ఆసక్తి, ఈ స్థాయి కృషి అసలు ఎవ్వరికీ సాధ్యం కాదు. ఆ మమకారం ఆయనలోని అణువణువులో అనంతంగా ఉంది కాబట్టే ఇదంతా చేయగలుగుతున్నారాయన. 

ఎప్పటికప్పుడు ఎవ్వరు ఊహించని స్థాయిలో తన సామర్థ్యాన్ని నిరూపించుకుంటూ, నిరంతరం "ఇంకేదో చెయ్యాలి మనం" అని తపించే ఒక డైనమిక్ మంత్రిగా, తన సామర్థ్యమే కొలమానంగా, ఈ రాష్ట్రానికి సమీప భవిష్యత్తులో ఆయన ముఖ్యమంత్రి కావడం అనేది చాలా చిన్న విషయం. ఈ దేశంలోని యువతరం, పాజిటివ్ పాలిటిక్స్‌ను ప్రేమించే ఇంటలెక్చువల్స్, ఎంట్రప్రెన్యూర్స్, విద్యావంతులు ఆయన్నుంచి అంతకు మించింది ఇంకేదో ఈ దేశం కోసం ఆశిస్తున్నారు.   

ఆయన... మాస్, క్లాస్ కలిసిన మ్యాజిక్. పాలిటిక్స్‌లో ఒక మంత్రి పనితీరు ఇంత స్టయిలిస్టిక్‌గా కూడా ఉండొచ్చు అని నిరూపించిన పయొనీర్.  బీఆరెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి... కేటీఆర్. ఈరోజు వారి పుట్టినరోజు సందర్భంగా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. 

- మనోహర్ చిమ్మని
(వ్యాసకర్త రచయిత, ఫిల్మ్ డైరెక్టర్) 
^^^
ఈరోజు "నమస్తే తెలంగాణ" దినపత్రిక ఎడిట్ పేజీలో ప్రచురితమైన నా వ్యాసం. 

Saturday 22 July 2023

The P R A B H A S Factor...

 #Prabhas #RanaDaggubati #AswaniDutt #SwapnaDutt #PriyankaDutt #ProjectK #Kalki2898AD #ComicCon #Manoharam #PhotoBlog #ManoharamPhotoBlog #ManoharChimmani 

Wednesday 19 July 2023

Focus On One Thing...


ఎన్నెన్నో చేయాలనుంటుంది. అనుకుంటే చేయగలం కూడా. కాని, ప్రయారిటీస్ పట్ల కూడా ఒక ఆలోచన, ఒక అవగాహన అవసరం. 

ఏది అవసరం, ఏది అత్యవసరం తెలిసుండాలి. బాధ్యతల పట్ల కూడా స్పృహ ఉండాలి. 

అన్నిటినీ మించి మనకున్న సమయం తక్కువ అన్న నిజం అనుక్షణం మదిలో మెదుల్తుండాలి. ఎంతో తెలీదు, కాని... మనకున్న సమయాన్ని గౌరవిస్తూ సవినయంగా సద్వినియోగం చేసుకోవాలి. 

వ్యక్తిత్వం చంపుకొని బాధపడే ఇలాంటి సిచువేషనల్ పోస్టులు అప్పుడప్పుడూ బై మిస్టేక్ రాస్తుంటాను. ఇలాంటి పోస్టుల్లో బహుశా ఇదే చివరిది. 

కట్ చేస్తే - 

మనం తీసుకొన్న తప్పు నిర్ణయాలకు ఎవరినో నిందించడం కూడా వృధానే. 

అవతలివారిది తప్పయినా కూడా ఎంతసేపని ఆ తప్పునే వల్లిస్తూ టైమ్ వృధా చేసుకుంటాం? 

Just ignore such people and their flaws.  

చెయ్యాల్సిన ఆ ఒక్క పని చేసి, ఫ్రీ అయిపోవడం ముఖ్యం. ఇంకొకరి గురించి ఆలోచించే సమయం లేనంతగా నాకిష్టమైన పనుల్లో పిచ్చపిచ్చగా బిజీ అయిపోవడం ముఖ్యం. 

ఫ్రీడమ్ ముఖ్యం!


ఏదో "షో పుటప్" కోసం, "ముందు ఆఫీసుంటేనే పనులవుతాయి" అన్న పాతకాలం మైండ్‌సెట్‌కు నేను పూర్తిగా వ్యతిరేకం.  

ఇప్పటివరకు నేను చేసిన మూడు నాలుగు సినిమాల విషయంలో కూడా - ముందు వాటి టైటిల్ ఎనౌన్స్ చేసిన తర్వాతనే ఫండింగ్ వంటి ఇతర ఏర్పాట్లు చేసుకున్నాను. 

ఆ తర్వాతే, నాకిష్టమైన చోట, ఒక మంచి ఇండిపెండెంట్ హౌజ్‌లో ఆఫీసు తీసుకొని సినిమాలు చేశాను. 

దీనికి భిన్నంగా ఈసారి ఒక వెల్ ఫర్నిష్డ్ ఆఫీసు నుంచి నా తాజా సినిమా ప్రిప్రొడక్షన్ పనులు ప్రారంభించాను. 

"నీకు అది పొడుస్తాం, ఇది పొడుస్తాం" అని నానా హామీలిచ్చినవాళ్లెవ్వరూ అర ఇంచ్ పని కూడా చెయ్యలేకపోయారు.

మీద నుంచి నానా కామెంట్స్, నెగెటివిటీ, మైండ్‌గేమ్స్.  

అంత అవసరమా? 

ఇవన్నీ నా స్కూల్ కాదు. 

ఏం పట్టించుకోకుండా నా పనులు నేను సీరియస్‌గా చేసేసుకుంటూ వెళ్తున్నాను. 

ఎవరో ఒకరి మీద డిపెండ్ అయ్యి నేను అంతకు ముందు సినిమాలు చెయ్యలేదు. నా ఏర్పాట్లు నేనే చేసుకున్నాను.

స్వయంగా నాకు అంత స్థోమత, అంత శక్తి ఉన్నాయి.  

కట్ చేస్తే - 

థాంక్స్ టు బ్లాక్ బస్టర్ సినిమా "బేబి" ఇచ్చిన ఇన్‌స్పిరేషన్... థాంక్స్ టు ఈరోజు నన్ను తీవ్రంగా బాధపెట్టిన మరొక అర్థం లేని చర్చ... 

వార్‌ఫుట్‌లో నా పనులను ఈ క్షణం నుంచే మరింత వేగవంతం చేస్తున్నాను. ఏకకాలంలో నా రెండో తాజా సినిమా ప్రిప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభించాను. 

థాంక్స్ టు నా మిత్రుడు, చైర్మన్ బి పి ఆర్ గారికి కూడా... For all his encouragement...

ఎప్పుడెప్పుడు షూటింగ్ ప్రారంభించి ఈ నాలుగు గోడల మధ్యనుంచి బయటపడిపోతానా అని ఎదురుచూస్తున్నాను.

For me, life is freedom.

Monday 17 July 2023

కొత్త ప్రయోగం. కొత్త హాబీ.


ఏదైనా ఒక క్రియేటివ్ ఐడియా మనసులో మెరవగానే వెంటనే దాన్ని ఎగ్జిక్యూట్ చేసేస్తుంటాను. అలాంటిదే ఈ ఐడియా.   

మనోహరమ్ ఫోటో బ్లాగ్. 

డెయిలీ.  

కొన్ని గంటల క్రితం, ఒక చాలా బోరింగ్ అండ్ ఇబ్బందికరమైన ప్లేస్‌లో కూర్చుని ఉన్నప్పుడు నా మనసులో మెరిసిన ఆలోచన ఇది. వెంటనే ఎగ్జిక్యూట్ చేసేశాను.   

ఇవ్వాళ-రేపు అసలు ఎవ్వరికీ టైమ్ ఉండటం లేదు. నాకు కూడా.🙂 సో, ఉన్న టైమ్‌లోనే చెప్పాలనుకున్నది షార్ట్‌గా చెప్పేసెయ్యాలి.  

స్పాంటేనియస్ కూడా. 

రేపు ఎవ్వరి ఫోటో బ్లాగ్ పోస్ట్ చేస్తానో నాకే తెలీదు. 

ఈ ఫోటో బ్లాగ్ సినీఫీల్డుకు మాత్రమే పరిమితం కాదు. కాని, ఖచ్చితంగా ఎక్కువ స్పేస్ సినిమాఫీల్డుకే ఇస్తాను. 

దీని కోసం పబ్లిక్ డొమెయిన్‌లో ఉన్న ఫోటోలనే ఎక్కువగా వాడతాను.      

ఇది నాకొక కొత్త స్ట్రెస్ బస్టర్. 

కొత్త హాబీ.  

విష్ మి బెస్ట్!   
^^^

#PuriJagan #PuriJagannath #DirectorPuriJagannath #PhotoBlog #Manoharam #ManoharChimmani

Sunday 16 July 2023

కల్ట్ సినిమాలు అంత ఈజీగా రావు!


కథ ఎలా చెబుతున్నావన్నదే పాయింట్...

కంటెంట్ ఈజ్ ద కింగ్ అని మరోసారి రుజువయింది.     

#Baby... రాత్రి చూశాను.

సాయి రాజేశ్ కల్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. అందులో ఎలాంటి డౌట్ లేదు. 

ఇప్పటి యూత్ జీవనశైలిలో చాలా సింపుల్‌గా కొట్టిపారేయాల్సిన ఒక సున్నితమైన అంశం పట్టుకొని ఇంత ఎమోషనల్ డ్రామా క్రియేట్ చేసి సక్సెస్ చేయడం అంత ఈజీ కాదు. ఏమాత్రం తేడా వచ్చినా కథ వేరేలా ఉండేది. 

కట్ చేస్తే - 

వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా తన మొదటి సినిమాలోనే ఇంత బోల్డ్ క్యారెక్టర్‌ను ఒప్పుకొని చేయడం, మెప్పించడం అప్రిషియేట్ చెయ్యాల్సిన విషయం. బిగ్ కంగ్రాట్స్ టు వైష్ణవి.  

ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ బ్లాక్ బస్టర్ టేస్ట్ చూశారు. చాలా సిన్సియర్‌గా కష్టపడ్డారు. కిర్రాక్ సీత ఇప్పుడు సినిమాల్లో ఇంక బాగా బిజీ అవుతుంది. ఈ సినిమా విజయానికి మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానిన్ ఆర్ ఆర్ కూడా బాగా సపోర్ట్ చేసింది.

దర్శకుడు సాయి రాజేశ్ మూడేళ్ళు ఈ సినిమా కోసం కష్టపడ్డాడు అంటేనే విషయం అర్థమవుతోంది... కల్ట్ సినిమాలు అంత ఈజీగా రావని!

Congratulations to Director, Producer and Team. 

Wednesday 12 July 2023

ముంబై హీరోయిన్సే ఎందుకు?


తెలుగులో 100 సినిమాలు రిలీజైతే, వాటిలో 90 సినిమాల్లో నాన్-తెలుగు హీరోయిన్స్, ముంబై హీరోయిన్సే ఉంటారన్నది కాదనలేని నిజం.

ఎందుకలా అన్న ప్రశ్నకు సుత్తిలేకుండా సూటిగా పది బులెట్ పాయింట్స్ రూపంలో చెప్పడానికి ప్రయత్నిస్తాను:

> నిజానికి ముంబై హీరోయిన్స్ అందరూ ముంబై వాళ్లు కానే కారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి అక్కడికి వచ్చి మోడలింగ్‌ చేసుకుంటున్నవాళ్లు వాళ్లంతా. ఫ్యాషన్‌కూ, మోడలింగ్‌కూ, యాడ్ మేకింగ్‌కూ ముంబై ప్రధాన కేంద్రం కాబట్టి, అవకాశాలు అక్కడే ఎక్కువ కాబట్టి వీళ్లంతా ముందు అక్కడ ల్యాండ్ అయిపోతారు. వాళ్లల్లో కొందరు సినిమాలకూ ట్రై చేస్తుంటారు హీరోయిన్ అయిపోవాలని. సో, మనం ముంబై నుంచి దిగుమతి చేసుకున్న, చేసుకుంటున్న ముంబై హీరోయిన్లలో దాదాపు అన్ని రాష్ట్రాలవాళ్లూ ఉన్నారు. మన తెలుగువాళ్లతో సహా!

> ఇక్కడ ముంబైని ఒక ప్రాంతంగా నేను చూడటం లేదు. ఒక అడ్వాన్స్‌డ్ మీడియా కేంద్రంగా చూస్తున్నాను. మోడలింగ్, ఫిలిం యాక్టింగ్‌లకు సంబంధించినతవరకూ అక్కడ ఒక డిసిప్లిన్ ఉంటుంది. ఒక ప్రొఫెషనలిజం ఉంటుంది. సినీ ఫీల్డు అంటే ఒక రెస్పెక్ట్ ఉంటుంది. అమ్మాయిలకే కాదు, వారి కుటుంబాల్లో కూడా. 

> మగ అయినా, ఆడ అయినా... సినీ ఆర్టిస్టులు కావాలనుకొనేవారికి నటనతోపాటు మంచి శరీర సౌష్టవం, ఎప్పుడూ అందంగా ఆరోగ్యంగా కనిపించడమే వారి ప్రధాన ఆస్తి అని చాలామంది గుర్తించరు. ఈ నిజం యాక్టింగ్‌ను సీరియస్‌గా తీసుకొన్నవారికి మాత్రమే తెలుస్తుంది. ముంబైలో ఆడిషన్స్‌కు వచ్చే కొత్త హీరోయిన్లు ఈ విషయంలో సంపూర్ణమైన స్పృహ కలిగి ఉంటారు.


> ఆడిషన్స్‌కు వచ్చే ముంబై అమ్మాయిల్లో నూటికి నూరు శాతం మంది అన్ని విధాలుగా ప్రొఫెషనల్స్ అంటే అతిశయోక్తికాదు. నటన, డాన్సు, సినీ ఫీల్డు పట్ల ఒక ప్యాషన్, అవగాహన అన్నీ ఉంటాయి. హీరోయిన్‌గా తాను సెలక్టు కావాలనీ, అయితే చాలనీ.. ముందు ఆ విషయం మీదే వాళ్ల ఫోకస్ ఉంటుంది. అంత అద్భుతంగా ఆడిషన్స్‌లో తమ ఉనికిని ఫీలయ్యేలా పర్‌ఫామ్ చేస్తారు.

> బాడీ సెన్స్, యాక్టింగ్, గ్రూమింగ్ విషయంలో ముంబై హీరోయిన్లు వేలు, లక్షలు ఖర్చుపెట్టి ఎంతో శిక్షణ తీసుకొంటారు. ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతుంటారు. వారితో పోలిస్తే, ఈ విషయంలో ఇక్కడ దాదాపు జీరో.

> ఇక్కడ పాయింటు అమ్మాయిలు ఎక్కడి వాళ్లు అన్నది కానే కాదు. వాళ్లు ఎంత ప్రొఫెషనల్స్ అన్నదే పాయింటు. ముంబై అన్న మాట రావటానికి కారణం... అక్కడ కేంద్రీకృతమై ఉన్న అమ్మాయిలంతా పక్కా ప్రొఫెషనల్స్ కావటమే. నిజానికి, అలాంటి ప్రొఫెషనలిజం ఉన్నవాళ్లే సినిమాకు పనికి వస్తారు... సినీ ఫీల్డులో నిలదొక్కుగోగలుగుతారు. 

> "ముంబై వాళ్లకే ఎక్కువ డబ్బు ఇస్తారు, ఇక్కడి అమ్మాయిలకు అంత రేంజ్‌లో ఇవ్వరు" అనేది కూడా కేవలం ఒక అపోహే. సక్సెస్, టాలెంట్ ఎక్కడుంటే అక్కడ డబ్బు అదే వెంటపడుతుంది. వాళ్లు ముంబై నుంచి వచ్చారా, హైద్రాబాద్ వాళ్లా అనేది ఎవ్వరూ చూడరు. మన జయప్రద, శ్రీదేవిలు ముంబై వెళ్లి జెండా ఎగురవేశారు. అప్పట్లో కొంతమంది టాప్ హీరోల కంటే ఎక్కువ పారితోషికం తీసుకున్నారు. అక్కడి హీరోయిన్లకు కనీసం ఒక దశాబ్దం పాటు నిద్రలేకుండా చేశారు. కళాకారులకు ప్రాంత భేదాలు ఉండవు. ప్రొఫెషనలిజం ముఖ్యం.

> సినీఫీల్డులో ఆయా హీరోహీరోయిన్స్‌కు ఉన్న మార్కెట్, డిమాండును బట్టి వారి రెమ్యూనరేషన్స్ ఉంటాయి తప్ప "వాళ్లు ముంబైవాళ్ళు" అని రెమ్యూనరేషన్స్ ఎక్కువగా ఇవ్వరు.

> సినిమాలో ఒక లిప్ లాక్ సీన్ ఉందనుకోండి. ఇక్కడి హీరోయిన్స్‌ను ఒప్పించడం కష్టం. అలాగే, ఇప్పటి ట్రెండ్‌కు అనుగుణంగా చిన్న చిన్న టాప్స్, టైట్స్, లెగ్గీస్, షార్ట్స్, మిడ్డీస్, మినీస్... వేయడానికి మనవాళ్లల్లో 90 శాతం మంది ఒప్పుకోరు. ఇక స్విమ్ సూట్, వెట్ డ్రెస్ అన్నామా...  అంతే. నేనిక్కడ థర్డ్ గ్రేడ్ సినిమాల గురించి మాట్లడ్డం లేదు. ఇవన్నీ ఉన్నాయని.. రాజ్ కపూర్, విశ్వనాథ్, మణిరత్నం, గౌతం మీనన్ లాంటి వాళ్లు తీసిన చిత్రాల్ని చెత్త సినిమాలనలేం.


> ఇదంతా ఒక ఎత్తయితే, మన హీరోయిన్ల పేరెంట్స్ కొందరు చాలా డిమాండింగ్ గా అడిగేదొకటుంది. " మీ సినిమాలో మా అమ్మాయి వేసే డ్రెస్సులన్నీ మాకు ముందే చూపించండి. అవి చూశాకే మేం ఓకే చెప్తాం" అని! సినీ ఫీల్డు పట్ల, నటన పట్ల అవగాహనా రాహిత్యం, ప్రొఫెషనలిజం లేకపోవటం ఇలాంటి ఇబ్బందులకు కారణాలు. అనవసరంగా ఎందుకొచ్చిన కష్టాలు.. 'అంత అవసరమా' అని ఏ డైరెక్టరయినా అనుకోవటంలో తప్పులేదు. కోట్లరూపాయల ఇన్వెస్ట్‌మెంట్స్‌తో ఆటలాడలేరుగా!

కట్ చేస్తే -

హీరో అయినా, హీరోయిన్ అయినా అవ్వాలంటే చాలా కృషి చేయాల్సి ఉంటుంది. ఆ కృషి లేకుండానే భారీ పారితోషికాలు, సెలబ్రిటీ స్టేటస్, ఆ లైఫ్‌స్టయిల్ కావాలనుకోవడంలో అర్థంలేదు. 

ముంబై స్థాయిలో ఇక్కడి అమ్మాయిలు హీరోయిన్స్‌గా తయారవ్వాలి అంటే చాలా పరిస్థితులు వారికి అనుకూలించాలి. కుటుంబం నుంచి ప్రోత్సాహం కూడా ఉండాలి. ఇదంతా ఇక్కడి సంస్కృతిలో ఇప్పట్లో అంత ఈజీ కాదు. ఇంకా టైమ్ పడుతుంది.  

ఇవన్నీ ఎలా ఉన్నా, ఇలాంటి వ్యతిరేక పరిస్థితుల్లోంచి కూడా - ఇప్పటి ట్రెండీ లుక్ అండ్ బోల్డ్ పెర్ఫార్మెన్స్ అవసరాలకు అనుగుణంగా - కొత్తగా ఇంకో శ్రీదేవి, జయప్రద లాంటి తెలుగు హీరోయిన్స్ మళ్లీ త్వరలోనే వస్తారనీ... వాళ్ళలా బాలీవుడ్‌ను కూడా దున్నేస్తారనీ నా నమ్మకం.   

Tuesday 11 July 2023

అవగాహన శూన్యత వేరు, అసలు నిజం వేరు!


మొన్నటి నా బ్లాగ్ పోస్టు ఒకదాని కింద వచ్చిన 2 కామెంట్స్‌ను ఇక్కడ ఉన్నదున్నట్టుగా కాపీ పేస్ట్ చేస్తున్నాను: 

"మీరు ఒక్కరే సినిమా రిస్క్ లేని పెట్టుబడి అని చెప్పేది.
అటువైపు ఆ గ్రేట్ ఆంధ్ర , తుపాకీ లాంటి వెబ్సైట్ చిన్న సినిమా ఎత్తిపోయింది అని , ఆహా తప్ప ఎవరు దేకడం లేదని .
పెట్టిన పైసలు అన్ని మూసి నది పాలైనట్టే అని చెప్తున్నాయి .
వారానికి చిన్న సినిమాలు 10 వస్తున్నాయి , ఒక్కటంటే ఒక్కటి కూడా కనపడ్డం లేదు సోమవారానికి .
మీరు చెప్పేదానికి, వాస్తవంగా బయట కనిపించేది చాలా తేడా కనిపిస్తుంది."
***

"సినిమా... ఇప్పుడు భారీ లాభాల్ని తెచ్చే ఆదాయమార్గం కూడా! అలాగే అది భారీనష్టాల్ని తెచ్చే ప్రమాదమార్గం కూడాను.
(Just an opinion, you need not publish this comment)"
***

కట్ చేస్తే - 

వారానికి 10 వ్యాపారాలు కూడా ప్రారంభమవుతాయి. ఎన్ని సక్సెస్ అవుతున్నాయి? 

వెబ్‌సైట్స్, యూట్యూబ్ చానెల్స్ వంద చెప్తాయి. రివ్యూయర్స్ వంద రాస్తారు. వాళ్ళందరికీ సొంత ఎజెండాలుంటాయి. 

ఇప్పుడు లేటెస్టుగా హిట్ అయిన "సామజవరగమన" చిన్న సినిమానే కదా?! ఇప్పటికే 40 కోట్లు దాటి కలెక్ట్ చేసింది.  

కట్ చేస్తే - 

సినిమాను కూడా ఒక వ్యాపారంలా భావించి, తగిన అవగాహనతో, మార్కెట్ అధ్యయనంతో జాగ్రత్తగా చేస్తే... సినిమా ఫ్లాప్ అయినా డబ్బులు ఎక్కడికీ పోవు. నాలుగు రకాల ఇన్‌కమ్ అవెన్యూస్ ఉన్నాయి. 

హిట్ అయితే, హిట్ అయిన రేంజ్‌ను బట్టి భారీ లాభాలొస్తాయి. 

దీనికి పెద్ద సినిమానా, చిన్న సినిమానా అన్న తేడాలేం లేవు. 

ఇదంతా ఎక్కడో నాలుగు గోడలమధ్య కూర్చొని రాస్తున్న థియరీనో, ఊహలో కాదు. 

బ్లాగ్ పోస్టుకో, కామెంట్‌కో కౌంటర్ కాదు. 

వాస్తవం. 

చిన్న నిర్మాతలయినా, పెద్ద నిర్మాతలయినా - ఈ అవగాహనతో తీసినవాళ్ళే నిలదొక్కుకుంటారు, నిలబడతారు. 

టెంప్ట్ అయి డబ్బు తగలేసుకునేవాళ్ళు పోతారు. 

దట్ సింపుల్. 

దీనికి ఒక్కటే ఒక్క మినహాయింపు ఏంటంటే... ఎంత అవగాహనతో ఎన్నెన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకున్నా, ఎంత కాలిక్యులేటెడ్ రిస్కుతో చేసినా, బిజినెస్ అన్న తర్వాత అప్పుడప్పుడూ దెబ్బలు తగులుతుంటాయి. సినిమా బిజినెస్ కూడా అలాంటిదే.    

కట్ చేస్తే - 

ప్రపంచంలో ఎక్కడైనా సరే... నెలకు వంద వ్యాపారాలు ప్రారంభమవుతే - వాటిలో సక్సెస్ అయ్యేవి 2 నుంచి 5 శాతం మించవు. 

తప్పు ఆ వ్యాపారానిది కాదు. 

వ్యాపారి అవగాహన, మైండ్‌సెట్. 

సినిమా కూడా ఒక వ్యాపారమే.     

Wednesday 5 July 2023

వన్ సైడ్ ఆఫ్ సోషల్ మీడియా... (Guest Post)


- Guest post by Lahari Jithender Reddy, Hyderabad. 


ప్రస్తుత జెనరేషన్‌లో స్మార్ట్ ఫోన్ అనేది 
మనిషి కనీస అవసరాల్లోకి చేరిపోయింది .... 

చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు 
స్మార్ట్ ఫోన్ వాడుతున్నవారే ....
స్మార్ట్ ఫోన్‌కి మరొక పేరు సోషల్ ...
ఇప్పుడు ... 
సోషల్ మీడియా అనేది ప్రతి ఒక్కరికి 
ఒక ప్రెస్టేజ్ అయిపోయింది .... 

సోషల్ మీడియా ...
మంచికి ఎంత మంచిదో, చెడుకి అంత చెడ్డది ...

ఏ పని పాట లేకుండా ఉండే వారు 
ఏదో ఒక విషయాన్ని ..
అది నిజామా, కాదా 
తప్పా, ఒప్పా 
జరిగిందా, లేదా.... 
ఈ విషయాలన్నీ ఏ మాత్రం పట్టింపు లేకుండా 
ఇష్టారీతిన పోస్ట్లు పెట్టేయడం ...

నిజానికంటే అబద్ధానికి ఆత్రం ఎక్కువ అందుకే ...
నెక్స్‌స్ట్ ఆ పోస్ట్ ట్రేండింగ్ లో ఉంటుంది ...
దాని మీద అందరు అభిప్రాయాలూ చెప్పడం ..
జడ్జ్ చేయడం ..
చర్చలు, డిబేట్లు ....

ఇవి చాలవన్నట్లు మధ్యలోకి పాలిటిక్స్,
మతాలు, కులాలు ....
ఇవన్నీ వచ్చి మధ్యలో దూరి, 
నానా  రచ్చ చేసి సమయాన్ని వృధా చేసుకోవడం ....

ఆయా విషయాలపై, వార్తలపై 
అవగాహన ఉన్నవారు ...
విశ్లేషకులు ...
విషయ పరిశీలకులు ...
ఏ ఒక్కరు కూడా 
దీనిని వివరించే ప్రయత్నం చేయక పోగా ..
మనకెందుకులే అని 
వాళ్ళ మెదడులో ఉన్న విషయపరిజ్ఞానాన్ని 
సుప్తావస్థలో ఉంచేసి ....
దానికి పరిధి అనే దుప్పటి కప్పేసి ...
జరిగే దానిని అలా చూస్తూ ...
ఎంత విడ్డూరం!

ఇంత ...
ఇంత రచ్చ క్రియేట్ చేస్తున్న 
ఈ సోషల్ కంటెంట్ అంతా 
ఏమైనా పనికివచ్చేదా అంటే -
కాదు కాదు పనికి మాలిన విషయాలలో 
మొదటి ప్లేస్‌లో ఉండేది!

ఈ సోషల్ మీడియా ప్రభావం ఎంతలా ఉంది అంటే 
అబద్దాన్ని, నిజం అని అరిచి అరిచి నిజం చేసేంత ...

నిజం కళ్ళముందు కనిపిస్తున్నా  
సోషల్ మీడియా అనే కంటి పొర చేరిపోయి 
అంధులుగా మారేంత...  

నువ్వు చాలా ఆరోగ్యాంగా ఉంటావు ...
ఆనందంగా ఉంటావు ...
కానీ ఒక్కసారిగా నీ చావు న్యూస్ 
సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది ..
అందరు కామెంట్స్ పెడుతున్నారు .
రిప్ అని 
ఓం శాంతి అని 
స్వర్గలోక ప్రాప్తిరస్తు అని ...

అంటే... 
నువ్వు బతికుండగానే చంపేసి ...
నీ న్యూస్ వైరల్ చేసేసి, 
ఇంకా లేట్ చేస్తే ..
పిండం కూడా పెట్టేస్తారు ...

ఎవడో పనికిమాలిన వాడు 
వాని ఎంజాయిమెంట్ కోసం నిన్ను చంపేసి 
దాన్ని న్యూస్ చేసేసి, స్ప్రెడ్ కూడా చేసేస్తే ...
నువ్వు మీడియా ముందుకు వచ్చి 
నేను బతికే ఉన్నాను అని నిరూపించుకునే దౌర్భాగ్యం!

భార్యాభర్తలను, ప్రేమికులను 
కుటుంబాల్ని, స్నేహితుల్నీ... 
ఒక్క దెబ్బతో విచ్చిన్నం చేస్తున్న ఘనత
ఈ సోషల్ మీడియాది,
ఈ స్మార్ట్ ఫోన్లది కాదా?  

ఇది సోషల్ మీడియా - 
ఇక్కడ ఏమైనా జరగొచ్చు ..
చెడు మంచిది అయితది ..
రౌడీ హీరో అవుతాడు ..
మిడి మిడి జ్ఞానం అసలు విజ్ఞానాన్ని కప్పేస్తుంది ...

కులాల కొట్లాటలు 
మతాల మారణ హోమాలు ..
నాస్తికుల ఘీంకారాలు,
టన్నులకొద్దీ నానా చెత్త కంటెంట్ 
ఇది అది అని లేదు ..
విశ్వంలో ఉన్న ప్రతి విషయం ఇక్కడ ప్రస్తావనకు వస్తుంది ...

మొత్తం మీద తిమ్మిని బమ్మిని చేసి,  
బమ్మిని తిమ్మి చేసి 
సెలబ్రిటీ స్థాయి నుండి కామన్ మాన్ వరకు ..
పీఎం నుండి గల్లీ లీడర్ వరకు ..
ప్రతి ఒక్కరిని ఒక ఆట ఆడేసుకుంటూ ..
రోజు రోజుకు తన స్థానాన్ని పటిష్టం చేసుకుంటూ ...
ఇప్పుడే పుట్టిన పిల్లలను కూడా తనకి బానిసను చేసుకుంటూ ...
ఏకఛత్రాధిపత్యం చేస్తున్న ఈ సోషల్ మీడియాని - 
ఎంతయినా మెచ్చుకోవచ్చు,
ఎలాగైనా పొగడొచ్చు...  

- లహరి జితెందర్ రెడ్డి, హైద్రాబాద్. 

Saturday 1 July 2023

సినిమా... ఇప్పుడు భారీ లాభాల్ని తెచ్చే ఆదాయమార్గం కూడా! (Guest Post)


- Guest Post by Y. Padmaja Reddy, from Canada.

ప్రపంచంలో ఏ ఇద్దరు భారతీయులు కలిసినా కామన్‌గా చర్చించే విషయం ఏంటో తెలుసా?

ఇండియాలో ఆటోలో అయినా, కెనడాలో క్యాబ్‌లో అయినా... జెనరల్‌గా  మాట్లాడుకునే టాపిక్ కూడా అదే.

అదేనండి... సినిమా. 

సినిమా అనేది అందరి జీవితాలలో ఒక విడదీయలేని అంశంగా మారిపోయి చాలా దశాబ్దాలు దాటింది. కాని, సినిమాల్లో పనిచేసే వాళ్లని, సినిమా ఇండస్ట్రీని ఇదే మనుషులు ఒక ప్రత్యేక తెగగా చూస్తారు. "మీ సినిమా వాళ్ళు" అంటారు. చీటర్స్‌గా భావిస్తారు. 

కాని, సొసైటీలో ఉన్న ఎన్నో ప్రొఫెషన్స్ లాగే సినిమా ఫీల్డు కూడా ఒక మంచి ప్రొఫెషనే అన్న వాస్తవాన్ని ఇంకా  చాలా మంది గుర్తించరు.

కరోనాకి ముందు వరకు అంటే - చిన్న బడ్జెట్ సినిమాల విషయంలో కొంత భయం ఉండేది. రిలీజ్ కష్టం అని, జనం రారని. కాని, ఓటీటీ ల్లాంటి అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చాక సీన్ మొత్తం మారిపోయింది.  

సినిమా అంటే ఇప్పుడు వుట్టి ఎంటర్‌టేన్మెంట్ మాత్రమే కాదు. బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అని నా అభిప్రాయం.   

ప్రపంచ సినిమా ఇప్పుడు అందరికి అందుబాటులో ఉంది. మనం కోటి పెట్టి సినిమా తీసినా, వంద కోట్ల విలువైన కంటెంట్ ఉంటేనే ఇప్పుడు జనాలు చూస్తున్నారు.  

ఈ నేపథ్యంలో - మంచి కంటెంట్ ఉన్న తక్కువ బడ్జెట్ సినిమాలో ఇన్వెస్ట్ చేయడం అనేది స్టాక్ మార్కెట్లో మంచి స్వింగ్‌లో ఉన్న కంపెనీ స్టాక్స్ మీద పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్ లాంటిదని నా ఉద్దేశ్యం. 

ప్రతి దానిలో ఎంతో కొంత రిస్క్ ఉంటుంది. అసలు రిస్క్ లేకుండా ఏదీ లేదు.  

జనాలు ఇంకా సినిమాలు అంటే 1950 ల్లో లాగా ఆలోచించడం చూస్తుంటే నాకు నిజంగా ఆశ్చర్యం వేస్తోంది. 

మంచి కంటెంట్ ఉన్న చిన్న సినిమాలు రావాలి అంటే సినిమాని, సినిమావాళ్లని పాజిటివ్ దృక్పథంతో చూడడం అవసరం. 

సినిమా ఇండస్ట్రీలో అందరూ పిచ్చివాళ్ళే అంటారు కొందరు. కాని, సినిమా రంగంలో రాణించాలి, సినిమా హిట్ కొట్టాలి అంటే...  సినిమా అంటే ఒక రేంజిలో పిచ్చి ఉండటమే మొట్టమొదటి క్వాలిఫికేషన్.  

ఒకప్పుడు సినిమా అనేది అందరికీ అందని ద్రాక్ష పండు. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన క్రౌడ్ ఫండిగ్ విధానం వల్ల, ఇప్పుడు ఈ రంగంలోకి ప్రవేశించడానికి ప్రతి ఒక్కరికి మార్గం సుగమమైంది. 

ఫైనల్‌గా నేను చెప్పాలి అనుకున్నది ఏంటంటే - ఇప్పుడు సినిమా అనేది జస్ట్ ఎంటర్‌టైన్మెంట్ మాత్రమే కాదు, ఒక ఇన్వెస్ట్‌మెంట్‌గా ఊహించని లాభాల్ని తెచ్చే ఆదాయమార్గం కూడా.  

- వై పద్మజా రెడ్డి , కెనెడా.