Tuesday 29 November 2022

సిటీకి దూరంగా... 'క్రియేటివ్ స్పేస్' డెస్టినేషన్స్‌!


ఫిలిం డైరెక్టర్స్, రైటర్స్ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా స్క్రిప్టులు రాసుకోడానికి పట్టాయా, గోవా, స్పెయిన్, సింగపూర్, మారిషస్, మాల్దీవ్స్, అన్నవరం, అరకు, ఊటీ లాంటి ప్లేస్‌లకు వెళ్తుంటారు. 

బడ్జెట్ ఉన్నా - కొన్ని కొన్నిసార్లు అందరికీ అంతంత దూరాలు వెళ్లటం కుదరకపోవచ్చు.

మ్యూజిక్ డైరెక్టర్స్, సీరియల్స్, వెబ్ సీరీస్ మేకర్స్, ఇతర క్రియేటివ్ రంగాలవారికి కూడా ప్రి-ప్రొడక్షన్ వర్క్ కోసం ఎలాంటి డిస్టర్బెన్స్‌లేని మంచి క్రియేటివ్ స్పేస్‌ల అవసరం ఎప్పుడూ ఉంటుంది. 

గేటెడ్ కమ్యూనిటీ ఫామ్‌లాండ్స్, ఫామ్‌ప్లాట్స్, ఫామ్‌హౌజ్‌లు అనేవి ఈ విషయంలో ఒక కొత్త సొల్యూషన్ అనుకోవచ్చు.    

కేవలం స్క్రిప్టులు రాసుకోవడం, స్టోరీ సిట్టింగ్స్, మ్యూజిక్ సిట్టింగ్స్, ప్రొడక్షన్ ప్లానింగ్స్ వంటి పనులకోసమే కాకుండా... "వీకెండ్ క్రియేటివ్ డెస్టినేషన్స్‌"గా కూడా ఈ గేటెడ్ కమ్యూనిటీ ఫామ్‌లాండ్స్, ఫామ్‌హౌజెస్ బాగా ఉపయోగపడతాయి. మంచి రిలీఫ్‌ను ఇస్తాయి. 

GREEN LEAVES INFRATECH LIMITED వారి గేటెడ్ కమ్యూనిటీ ఫామ్‌లాండ్స్, ఫామ్‌ప్లాట్స్, ఫామ్‌హౌజ్ వెంచర్స్ అలాంటివే.  


సిటీకి 70 కిలోమీటర్ల దూరంలో, సదాశివపేటకు దగ్గరలో, ముంబై హైవేకి కేవలం 8 కిలోమీటర్ల దూరంలో - ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, మంజీరా నది వ్యూతో అద్భుతంగా ప్లాన్ చేసిన ఈ వెంచర్‌ను - సినీఫీల్డు, టీవీ ఫీల్డు, ఇతర క్రియేటివ్ రంగాల్లోని ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, రైటర్స్, ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ఒకసారి విజిట్ చేసి నిర్ణయం తీసుకోవచ్చు. 

మనకు నచ్చిన డిజైన్‌లో ఓ చిన్న ఫామ్‌హౌజ్ వేసుకొని, మనకిష్టమైన వెజిటబుల్స్, ఫ్లవర్ ప్లాంట్స్, గ్రీనరీ పెంచుకొంటూ, మనకు అవసరమైనప్పుడు గాని, వీకెండ్స్ గాని అక్కడ గడపగలిగితే చాలు... లైఫ్ నిజంగా ఇంకో లెవెల్లో ఉంటుంది. 

ఇన్వెస్ట్‌మెంట్ పరంగా కూడా ఇలాంటి ఫామ్‌ప్లాట్స్, ఫామ్‌లాండ్స్ కొనుక్కోవడం అనేది ఒక బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్ అవుతుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 

ఇన్వెస్ట్‌మెంట్ పరంగా కూడా ఇలాంటి ఫామ్‌ప్లాట్స్, ఫామ్‌లాండ్స్ కొనుక్కోవడం అనేది ఒక బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్ అవుతుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 


సిటీకి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఫామ్‌లాండ్ ప్రాజెక్టు, ముంబై హైవేకు కేవలం 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. 

కేవలం 15 నిమిషాల దూరంలో సంగారెడ్డి జిల్లా హెడ్‌క్వార్టర్స్, 30-45 నిమిషాల దూరంలో RRR (Regional Ring Road) & ORR (Outer Ring Road) ఉన్నాయి.  

13,000 ఎకరాల్లో సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేసిన NIMZ (National Investment & Manufacturing Zone) ప్రాజెక్టు, MRF, పెన్నార్, పెప్సికో, BHEL, KIRBY, తోషిబా, ఎక్స్‌పోర్ట్ కారిడార్, MNR మెడికల్ కాలేజి, IIT, Gitam, Woxsen యూనివర్సిటీలు... TCS, Wipro, ISB, Microsoft, Google వంటి గొప్ప గొప్ప సంస్థలన్నీ ఈ వెంచర్‌కు 45 నుంచి 55 నిమిషాల పరిధిలో ఉన్నాయి. 

ఒక ఇన్వెస్ట్‌మెంట్ దృక్పథంతో చూసినా... కేవలం ఒక 2-3 ఏళ్లల్లోనే రెట్టింపు వాల్యూ తెప్పించే అవకాశం ఉంది. 

బై బ్యాక్ ఆప్షన్ కూడా ఉంది. 

ఇన్ని ప్లస్ పాయింట్స్‌తో ఉన్న గ్రీన్ లీవ్స్ ఇన్‌ఫ్రాటెక్ లిమిటెడ్ వారి ఫస్ట్ వెంచర్ - చైర్మన్ రావూరి శ్రీనివాసరావు, మేనేజింగ్ డైరెక్టర్ బైరి పరమేశ్వర్ రెడ్డి అధ్వర్యంలో - ఇప్పటికే "సోల్డ్ అవుట్" అయిపోయింది. సెకండ్, థర్డ్ వెంచర్స్‌లో అమ్మకాలు ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో ఉన్నాయి.     


24 గంటల సెక్యూరిటీ, 3 సంవత్సరాల మెయింటెనెన్స్, మంచి నల్లరేగడి నేల, డ్రిప్ ఇర్రిగేషన్, 33 ఫీట్స్/40 ఫీట్స్/60 ఫీట్స్ ఇంటర్నల్ రోడ్స్‌తో ఉన్న ఈ గ్రీన్ లీవ్స్ ఇన్‌ఫ్రాటెక్ లిమిటెడ్ వెంచర్‌లో:

121 స్క్వేర్ యార్డ్స్ నుంచి 4850 స్క్వేర్ యార్డ్స్ (1 నుంచి 40 గుంటలు) యూనిట్స్‌లో - ఎన్ని యూనిట్స్ అయినా కొనుక్కొనే ఫ్లెక్సిబిలిటీ ఉంది. 

క్లియర్ టైటిల్. 

ఫండ్స్‌తో రెడీగా ఉన్న కస్టమర్స్‌కు వెంటనే రిజిస్ట్రేషన్ ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పట్టాదార్ పాస్‌బుక్ ఇప్పించబడుతుంది. ప్రభుత్వ నిబంధనలకు లోబడి, "రైతుబంధు" వంటి స్కీములకు ఎలిజిబిలిటీ కూడా ఉంటుంది. 


ఆసక్తి వున్న సినీ-టీవీ ఫీల్డు, ఇతర క్రియేటివ్ రంగాలవాళ్ళు, ఎలక్ట్రానిక్ మీడియావాళ్ళు డైరెక్ట్‌గా నాకు కాల్ చేయొచ్చు. మీ సైట్ విజిట్ నేను ఏర్పాటు చేస్తాను. నావైపు నుంచి పర్సనల్‌గా మీరూహించని స్పెషల్ ఆఫర్ ఇప్పిస్తాను. 

ఇంకేం ఆలోచిస్తున్నారు?

2022 చివర్లో ఒక మంచి ఇన్వెస్ట్‌మెంట్ డెసిషన్ తీసుకోండి. 

After all, the best investment on earth is nothing but land!


- మనోహర్ చిమ్మని
ఎం డి, స్వర్ణసుధ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ 
(గ్రీన్ లీవ్స్ ఇన్‌ఫ్రాటెక్ లిమిటెడ్ గ్రూప్) 
+91 9989578125 

Thursday 24 November 2022

సారీ... ఇప్పుడు నేను రైటర్ని!


"ఏం చేస్తున్నారిప్పుడు?" నా క్యాజువల్ కొశ్చన్. 

"డైరెక్టర్‌గా అవకాశాలు తగ్గాయి. రైటర్‌గా ప్రయత్నిస్తున్నాను" చాలా సింపుల్ సమాధానం అతనిది.

సినిమా ఇండస్ట్రీలో పనిచేసేవాళ్ళలో అత్యధికశాతం మంది చెప్పే సమాధానం సాధారణంగా మరోవిధంగా ఉంటుంది. ఎలాగంటే - "శర్వాకు మొన్నే కథ చెప్పా. యూరోప్ వెళ్ళాడు. రాగానే సంక్రాంతి తర్వాత కూర్చొని ఓకే చేసేద్దాం అన్నాడు. నా కథ ఆయనకి అంత బాగా నచ్చింది భయ్యా...హీరోయిన్ ఎవరనుకొంటున్నావ్..."

ఇంక దీనికి అంతుండదు. 

ఇంకో రెండు సంక్రాంతుల తర్వాత కూడా శర్వా యూరోప్ నుంచి రాడు. ఇక్కడ కథ ఓకే కాదు... అది వేరే విషయం. 


అలాక్కాకుండా - పైన అంత సింపుల్‌గా నాకు సమాధానం చెప్పిన ఆ డైరెక్టర్ కొన్నేళ్ళ క్రితం ఒక మంచి హిట్ ఇచ్చాడు. తర్వాత ఇంకో నాలుగు సినిమాలు డైరెక్ట్ చేశాడు. డైరెక్టర్‌గా అవకాశాలు తగ్గటంతో, ఇప్పుడు రైటర్‌గా యమ సీరియస్‌గా ప్రయత్నిస్తున్నాడు. 

ఎలాంటి షుగర్ కోటింగ్ లేకుండా, అబద్ధాలు చెప్పకుండా, ఉన్న నిజాన్నే అంత హానెస్ట్‌గా చెప్పగలిగిన ఆ డైరెక్టర్... గాంధీ మనోహర్.

కొన్నేళ్ళ క్రితం ఆయన తీసిన హిట్ పిక్చర్ - "సారీ... నాకు పెళ్లైంది!" 


కట్ చేస్తే -       

లైమ్‌లైట్‌లో ఉన్న హీరోలు, హీరోయిన్స్, ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, డైరెక్టర్స్ గురించి ఎవరైనా రాస్తారు. సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, టీవీ చానల్స్ ఎట్సెట్రా అన్నీ బాగా కవర్ చేస్తాయి. యూట్యూబ్‌లో కూడా ఉన్నవీ లేనివీ థంబ్‌నెయిల్స్ పెడుతూ వీళ్లందరి గురించిన టిడ్‌బిట్స్ బాగానే అప్‌లోడ్ చేస్తుంటారు.    

అయితే - తెరపైకి రావాలనుకొంటున్న, లేదా, ఆల్రెడీ వచ్చి దాదాపుగా తెరమరుగైన కొందరు "అన్-సంగ్ హీరోస్" గురించి  మాత్రం ఎవ్వరూ రాయరు, రాయాలనుకోరు... ఉపయోగం ఉండదు కాబట్టి. 

కాని, నేను వీరందరి గురించి కూడా అప్పుడప్పుడూ నాకు తెలిసింది రాయాలనుకొంటున్నాను.   


ఈ క్రమంలో - నేను ముందుగా రాస్తున్నది డైరెక్టర్ గాంధీ మనోహర్ గురించి కావడం అనుకోకుండా జరిగింది. డైరెక్టర్‌గా నాకు సీనియర్... బాపు-రమణ, రాఘవేంద్రరావు, జంధ్యాల, వంశీ వంటి స్టాల్‌వార్ట్స్ దగ్గర పనిచేసిన గాంధీ నాకు ఆత్మీయ మిత్రుడు. మంచి రైటర్, ఆర్టిస్టు, కార్టూనిస్టు కూడా. 

కదిరిలో డిగ్రీవరకు చదువుకున్న గాంధీ బేసిగ్గా కార్టూనిస్టు. మయూరి, చిత్రభూమి పత్రికల్లో లే-ఔట్ ఆర్టిస్టుగా పనిచేస్తున్నప్పుడు - అందులో పనిచేసే రాంబాబు అనే జర్నలిస్టు గాంధీని తీసుకెళ్ళి, అప్పుడే "సరసాల సోగ్గాడు" అనే సినిమా డైరెక్ట్ చేయబోతున్న సత్యప్రసాద్ అనే ఒక  డైరెక్టర్‌కి పరిచయంచేశాడు. అలా మొదలైంది కథ. 

తర్వాత ప్రముఖ కార్టూనిస్టు బ్నిం ఆయన్ని బాపు గారికి పరిచయం చేశారు. బాపు గారి దగ్గర మిస్టర్ పెళ్ళాం, పెళ్ళికొడుకు, రాంబంటు చిత్రాలకు అసిస్టెంటుగా చేశాడు గాంధీ. తర్వాత బాపు గారి ఈటీవీ భాగవతంకు కూడా పనిచేశాడు.


డైరెక్టర్‌గా గాంధీ మనోహర్‌కు మొదటి సినిమా "సారీ... నాకు పెళ్లైంది!" కావడం ఒక రకంగా అదృష్టం, మరోరకంగా దురదృష్టం అనుకోవచ్చు. ఆ సినిమా హిట్ కావడానికి టైటిల్ బాగా ఉపయోగపడింది. కాని, నిజానికి సినిమా టైటిల్లో అందరికీ ధ్వనించే బూతేం అందులో లేదు. కాని, శ్రీరంగనీతులు చెప్పే కొందరు ఆ సినిమాను ఒక అంటరాని సినిమాగా తేల్చేశారు. దీంతో చోటామోటా హీరోలు కూడా డేట్స్ ఇవ్వని పరిస్థితి ఏర్పడింది. 

దాంతో నేనూ మేధావినే అని నిరూపించుకొనే ప్రయత్నంలో "ప్లీజ్... నాకు పెళ్లైంది" టైటిల్‌తో ఒక ఎక్స్‌పరిమెంటల్ సినిమా తీశాడు గాంధీ. సినిమాలో మూడు క్లైమాక్స్‌లుంటాయి. జనం తిప్పికొట్టారు. ఆటొమెటిగ్గా కొంత గ్యాప్ వచ్చేసింది. తర్వాత శివాజీతో రెండు సినిమాలు తీశాడు. పెద్దగా వర్కవుట్ అవ్వలేదు. డైరెక్టర్‌గా అవకాశాలు తగ్గిపోయాయి.

"సారీ... నాకు పెళ్లైంది" సినిమా రిలీజ్ అయిన ప్రతి థియేటర్ హౌస్ ఫుల్ అయ్యింది. కానీ, తన రెండో సినిమా "ప్లీజ్... నాకు పెళ్లైంది" సినిమాకు రిలీజ్ అయిన ఫస్ట్‌డే ఫస్ట్‌షోకు పది మంది కూడా రాలేదు. అదిచూసి దాదాపు ఏడ్చేశాడు గాంధీ. ఇదీ గాంధీ సినీజీవితంలో అత్యంత బాధాకరమైన జ్ఞాపకం. సినిమా అంటే ఏంటో చెప్పిన రియాలిటీ.  

"నేను రాఘవేంద్రరావు గారి దగ్గర పని చేస్తున్నప్పుడు "శ్రీమతీ వెళ్ళొస్తా"  సినిమా షూటింగ్ జరుగుతోంది. ఒకరోజు నన్ను పిలిచి "నేను సీన్ చెప్తా... దానికి స్టొరీ బోర్డ్ వేసి తీసుకురా" అని నాకు ప్రతి షాట్ చెప్పారు. నేను దానికి 23 షాట్స్ వేసుకుని వెళ్ళాను. అందులో ఒకే ఒక్క షాట్‌కు మాత్రం కరెక్షన్ చెప్పారు రాఘవేంద్రరావు గారు. ఆయన చెప్పినట్టుగా, ముఖ్యంగా ఆయనకు నచ్చేట్టు స్టోరీబోర్డ్ వేయగలిగానని చాలా హాపీగా ఫీలయ్యాను" అని తన సినీజీవితంలోని ఒక మంచి జ్ఞాపకం గురించి చెప్పాడు గాంధీ. 


కట్ చేస్తే - 

ఇప్పుడు ఇండస్ట్రీలో రైటర్స్‌కు చాలా డిమాండ్ ఉంది. దేశంలోనే అత్యధిక పారితోషికం సుమారు 3 నుంచి 5 కోట్లవరకు తీసుకునే సినీకథారచయిత విజయేంద్రప్రసాద్ ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు.

స్వయంగా తను మంచి రచయిత కూడా కాబట్టి - రచయితగా మంచి కథలు అందించి, స్టోరీ రైటర్‌గా కొనసాగాలన్న ప్రయత్నంలో ప్రస్తుతం సీరియస్‌గా పనిచేస్తున్నాడు గాంధీ. 

ఫీల్డులోకి వస్తున్న కొత్తవారికి ఏంటి మీ సలహా అని అడిగినప్పుడు - "ఈ ఫీల్డులో సక్సెస్ రేటు చాలా తక్కువ, దయచేసి ఈ ఫీల్డుకి రాకండి అనే చచ్చు సలహా మాత్రం ఇవ్వను" అని తను చెప్పాలనుకున్నది చెప్పాడు గాంధీ.


డైరెక్టర్ గాంధీ మనోహర్ భార్య ప్రశాంతి అడ్వొకేట్‌గా పనిచేస్తున్నారు. కూతురు ప్రణతి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా క్యాప్‌జెమినిలో పనిచేస్తోంది. 

తను కోరుకుంటున్నట్టు డైరెక్టర్ గాంధీ మనోహర్ స్టోరీ రైటర్‌గా మంచి సక్సెస్ సాధించాలనీ, తర్వాత అవసరమైతే మళ్ళీ మెగాఫోన్ పట్టాలనీ ఒక మిత్రుడిగా నేను మనస్పూర్తిగా ఆశిస్తున్నాను. 

"The only safe thing is to take a chance." 
- Mike Nichols 

ఇప్పుడు వీళ్లంతా ఏం చేస్తున్నారు?


లైమ్‌లైట్‌లో ఉన్న హీరోలు, హీరోయిన్స్, ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, డైరెక్టర్స్ గురించి ఎవరైనా రాస్తారు. సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, టీవీ చానల్స్ ఎట్సెట్రా అన్నీ బాగా కవర్ చేస్తాయి. యూట్యూబ్‌లో కూడా ఉన్నవీ లేనివీ థంబ్‌నెయిల్స్ పెడుతూ వీళ్లందరి గురించిన టిడ్‌బిట్స్ బాగానే అప్‌లోడ్ చేస్తుంటారు.    

అయితే - తెరపైకి రావాలనుకొంటున్న, ఆల్రెడీ వచ్చి దాదాపుగా తెరమరుగైన కొందరు "అన్-సంగ్ హీరోస్" గురించి  మాత్రం ఎవ్వరూ రాయరు, రాయాలనుకోరు... ఉపయోగం ఉండదు కాబట్టి. 

కాని, నేను వీరందరి గురించి కూడా అప్పుడప్పుడూ నాకు తెలిసింది రాయాలనుకొంటున్నాను.

ఈ క్రమంలో - నేను ముందుగా రాస్తున్నది ఒక డైరెక్టర్ గురించి. 

"సారీ నాకు పెళ్ళైంది!" వంటి హిట్ సినిమా అందించి, డైరెక్టర్‌గా ఇంకో నాలుగైదు సినిమాలు చేసిన తర్వాత - ప్రస్తుతం రైటర్‌గా మళ్ళీ ఫీల్డులో నిలదొక్కుకోడానికి ప్రయత్నిస్తున్న - ఆత్మీయ మిత్రులు గాంధీ మనోహర్ గురించి ఈ రాత్రికి నా బ్లాగ్‌లో... 

వన్-టు-వన్ పర్సనల్ కోచింగ్!


నా ఫీజు భారీగా ఉంటుంది. ఎందుకంటే - ఇవి రొటీన్ కోచింగ్స్ కావు. నా సమయం నేను అంత ఎక్కువగా కెటాయించాల్సి ఉంటుంది. 

అయితే - ఫలితాలు అద్భుతంగా, మీరు ఊహించని రేంజ్‌లో ఉంటాయి. పాజిటివ్‌గా ఉంటాయి. 

అంచనాలు, ఊహలు కావు. అన్నీ నేను చేసినవే. ఇప్పుడు చేస్తున్నవే, చేయిస్తున్నవే. 

వందకి వంద శాతం ఫెయిల్ అన్న ప్రశ్నే లేదు. 

కట్ చేస్తే - 

ఇవీ నా పర్సనల్ కోచింగ్ అంశాలు:

1. 30 రోజుల్లో పుస్తకం రాయడం ఎలా?

2. 30 రోజుల్లో పాపులర్ బ్లాగర్ కావడం ఎలా? 

3. యాక్టింగ్, స్క్రిప్ట్ రైటింగ్, డైరెక్షన్ లలో "ఇన్-ఫిలిం కోచింగ్" 

నిజంగా ఆసక్తి ఉందా?
ఇంకెందుకు ఆలస్యం...  

కింది లింక్స్‌ను క్లిక్ చేసి వివరాలు చదవండి. తర్వాత ఫీజు, మరిన్ని వివరాల కోసం వాట్సాప్ చేయండి: 9989578125       

Link: https://www.manoharchimmani.blog/p/meetups.html

Link 2:  https://www.manoharchimmani.blog/2022/11/manohar-chimmani-in-film-coaching.html 


Best Wishes,

-- Manohar Chimmani
Film Director, Nandi Award Winning Writer, Blogger
Email: mchimmani10x@gmail.com
Whatsapp: 9989578125

Monday 21 November 2022

మనోహర్‌చిమ్మని.బ్లాగ్


2023 నవంబర్ వరకు సినిమాలు తప్ప మరొకదాని గురించి నేనసలు ఆలోచించకూడదని నిర్ణయించుకున్నాను. ఆలోచించడం లేదు. 

ఇప్పుడు నేను చేస్తున్న ట్రెండీ యూత్ ఫిలిం "Yo!"తో పాటు, ప్యారలల్‌గా ఇంకో సినిమా కూడా చేస్తాను. అంతవరకు ష్యూర్. 

ఈలోపు, ఇంటాబయటా - ముఖ్యంగా నా ఆఫీస్ ప్రెమిసెస్‌లో - నానారకాల మనుషులు నానా విధాలుగా నాగురించి ఏదేదో అనుకుంటుంటారు. ఆల్రెడీ అనుకుంటున్నారు. కాని, ఆ పనికిరాని చెత్తంతా పట్టించుకునేంత సమయం నాకు లేదు. 

అదే సమయంలో ఒక సీన్ రాసుకోవచ్చు. ఒక ఇంటిమేట్ ఫ్రెండ్‌తో కాసేపు మాట్లాడుకోవచ్చు. అలాంటి ఇంకో మంచి ఫ్రెండ్‌తో  కాసేపు చాట్ చేయొచ్చు. మా అబ్బాయికో మెసేజ్ పెట్టొచ్చు. ఒక చిన్న కమిట్‌మెంట్‌ను ఎలా పూర్తిచేయాలో ఆలోచించుకోవచ్చు. ఒక చిన్న ఇన్‌కమ్ అవెన్యూను క్రియేట్ చేసుకోవచ్చు.  

నిన్న ఆదివారం - ఇన్వెస్టర్స్ మీటింగ్స్, టీం మీటింగ్స్ మధ్య ఖాళీ దొరికినప్పుడల్లా ఎప్పట్నుంచో నేను అనుకొంటున్న ఒక పెద్ద పని పూర్తిచేశాను. 

అది - 

నా బ్లాగర్ బ్లాగ్ "నగ్నచిత్రం"కు ఒక కస్టమ్ డొమైన్ నేమ్ కొత్తగా కొని, లింకప్ చేసేశాను. 

కట్ చేస్తే - 

ఇప్పుడు నా బ్లాగ్ అడ్రస్ ఇదీ: https://www.manoharchimmani.blog     

Tuesday 15 November 2022

"సూపర్‌స్టార్ కృష్ణ"కు వినమ్ర నివాళి


జూబ్లీ హిల్స్‌లో ఒక రిచ్ హౌజ్ లొకేషన్‌లో షూటింగ్. సరిగ్గా ఉదయం 8.50 నిమిషాలకు కారు గేట్ లోపలికి వచ్చింది.

అందులోంచి హీరో కృష్ణ దిగారు. 

అదే మొదటిసారి సూపర్ స్టార్‌ని నేను చూడ్డం. 

ఇంటిదగ్గరే మేకప్ పూర్తిచేసుకొని, ఆరోజు షూటింగ్‌లో ఫస్ట్ సీన్‌కు ఏ కాస్ట్యూమ్స్ అయితే అవసరమో వాటిని ముందురోజే ఇంటికి తెప్పించుకొని, వేసుకుని వచ్చారాయన. 

సెట్‌లోకి ఎంటరవుతూనే "డైరెక్టర్ గారెక్కడ?" అని కనుక్కొని గురువుగారున్నవైపుకి నడిచి, ముందు వారిని విష్ చేశారు. రెండు నిమిషాలు జనరల్ టాక్. అంతే. 

తర్వాత తన చెయిర్లో కూర్చుని సీన్ పేపర్స్ ఒకసారి చూశారు. సీన్ పేపర్స్ అసిస్టెంట్‌కు ఇచ్చి "ఏదీ నువ్వొకసారి డైలాగ్స్ చదువ్" అన్నాడు. 

అసిస్టెంట్ చదివి వినిపించాడు. 

"ఇంకోసారి చదువ్" అన్నారు కృష్ణ. అసిస్టెంట్ చదివాడు. 

"ఇప్పుడు నేను చెప్తా చూడు" అని చకచకా డైలాగ్స్ చెప్పేసి, "ఓకేనా?" అన్నారు. అసిస్టెంట్ సమాధానం చెప్పేలోపే, "ఇది విను" అని కొంచెం ఇంప్రొవైజేషన్‌తో మళ్ళీ చెప్పారు. "ఇది బావుంది కదా?" అని అడిగారు. "బావుంది సర్" అన్నాడు అసిస్టెంట్. 

"మనిద్దరికి బాగుంటే సరిపోదు. అక్కడ డైరెక్టర్ గారికి బావుండాలి. నేను రెడీ. షాట్ రెడీనా కనుక్కో" అన్నారాయన. 

గురువుగారు రెండు టేకుల్లో షాట్ ఓకే చేశారు. అయినా సరే - "డైరెక్టర్ గారూ, ఓకేనా... ఇంకోటి చేద్దామా?" అని అడిగారు. 

"టేక్ ఓకే. మీరు ఇంకోటి చేద్దామంటే చేద్దాం" అన్నారు గురువుగారు. 

ఇంకో టేక్ చేశారు. అదికూడా ఓకే అయ్యింది. "రెండూ బాగున్నాయి. నేను ఎడిటింగ్‌లో చూసుకుంటాను" అన్నారు డైరెక్టర్ గారు.

ఇలా చకచకా ఒక సీన్ అయిపోయింది. 

సరిగ్గా ఒంటి గంటకు లంచ్‌కు ఇంటికి బయల్దేరారు సూపర్ స్టార్. 

మళ్ళీ ఫ్రెష్‌గా మేకప్‌తో గంటన్నర తర్వాత ఇంటినుంచి వచ్చారు. ఇంకో రెండు సీన్స్ పూర్తిచేసి సరిగ్గా అరు గంటలకు డైరెక్టర్ గారికి బాయ్ చెప్పి ఇంటికెళ్ళిపోయారు సూపర్ స్టార్. 

ఇలా హీరో కృష్ణ స్పెషల్ అప్పియరెన్స్‌కు సంబంధించిన షూటింగ్ అదే ఇంట్లో రెండు రోజుల్లో అయిపోయింది. 

ఏ ఒక్కరోజు ఎవ్వరిమీద కోపం తెచ్చుకోలేదు ఎవ్వరిని బాధపెట్టలేదు.     

ఎలాంటి అరుపులు, కేకలు, పెడబొబ్బల్లేవు. నేను సూపర్ స్టార్‌ను అన్న అహంకారం లేదు. కోస్టార్స్‌తో చాలా కూల్‌గా మాట్లాడ్దం, డైరెక్టర్‌కు గౌరవం ఇవ్వటం ఇవన్నీ చాలా సహజంగా, మళ్ళీ మళ్ళీ అలా చూడాలి అన్నంతగా బాగుండేవి.

నిల్చుని సీన్, డైలాగ్స్ చదువుతున్న అసిస్టెంట్‌ను తనపక్కనే కూర్చోమనేవారు. "కూర్చో" అని ఆయన అన్న మాటలో "నా పక్కన కూర్చుంటే ఏమవుతుంది" అని చాలా క్యాజువల్‌గా అడిగినట్టు ధ్వనించేది. 

సెట్లో ఆయన కూర్చున్న ఆ స్పేస్ చుట్టూ ఒక "ఆరా"లా కూల్‌నెస్ ఫీలయ్యేవాళ్లం. 

కట్ చేస్తే - 

ఇప్పుడు తన మొదటి సినిమాలో నటించే ఒక కొత్త హీరో కూడా ఎలాంటి యాటిట్యూడ్ చూపిస్తాడో, ఎలాంటి లెవల్ కొడతాడో అందరికీ తెలుసు. 

హీరోలేం ఖర్మ, కొందరు చిన్న చిన్న ఆర్టిస్టులు కూడా ఎంత లెవల్ కొడతారో చెప్పడం అనవసరం. 

టైమ్ సెన్స్ గురించి, ప్రవర్తన గురించి, సెట్లో ప్రొడ్యూసర్-డైరెక్టర్-సీనియర్ ఆర్టిస్టులు-టెక్నీషియన్స్‌కు ఇప్పటివారిచ్చే గౌరవం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.

ఒక హీరో ఇండస్ట్రీలో బాగా నిలదొక్కుకొని దశాబ్దాలపాటు సక్సెస్‌ఫుల్‌గా నిలబడ్డాడంటే దానికి కారణం వారి కులమో మతమో నేపథ్యమో కాదు. ప్రారంభంలో అవి కొంత ఉపయోగపడొచ్చు. కాని, వారి సక్సెస్‌కు కారణం - ఒక తపస్సులా, ప్రొఫెషనల్‌గా వారు పాటించిన డిసిప్లినే అని నేను గట్టిగా నమ్ముతాను.  

ఆ రెండురోజులూ హీరో కృష్ణకు సీన్ పేపర్స్ అందించి, చదివి వినిపించి, షాట్ రెడీ చెప్పిన ఆ అసిస్టెంట్ డైరెక్టర్ నేనే. 

ప్రొఫెషనల్‌గానే కాదు... వ్యక్తిగతంగా కూడా తన జీవితాన్ని తన ఇష్టం వచ్చినట్టు, తనకు నచ్చినట్టుగానే జీవించిన సాహసి "సూపర్‌స్టార్ కృష్ణ"కు వినమ్ర నివాళి. 

Sunday 13 November 2022

MANOHAR CHIMMANI 'IN-FILM COACHING'


* సినీఫీల్డులో కెరీర్ ప్రారంభించాలని మీరు సీరియస్‌గా ఉన్నారా?  
* స్క్రీన్ మీద టైటిల్ కార్డ్స్‌లో మీ పేరు ఎప్పుడెప్పుడు చూసుకుందామా అని తహతహగా ఉందా?
* నిజంగా అంత ప్యాషన్, పట్టుదల మీలో ఉందా? 

మీ సమాధానం "అవును" అయితే... 

కేవలం 9 నెలల్లో 
మీ కలను నిజం చేసుకొనే ఆ అవకాశం 
ఇప్పుడు మీ కళ్ళముందే ఉంది.  

| యాక్టింగ్ | డైరెక్షన్ | స్క్రిప్ట్ రైటింగ్ | 
ఈ 3 విభాగాల్లో - మొట్టమొదటిసారిగా 
మనోహర్ చిమ్మని పరిచయం చేస్తున్న - 
"ఇన్-ఫిలిం కోచింగ్" 

కట్ చేస్తే - 

ఇది ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో ఇచ్చే రొటీన్ కోచింగ్ కాదు. నిజంగా నిర్మాణంలో ఉన్న ఒక కమర్షియల్ ఫీచర్‌ఫిలిం టీమ్‌తో పాటు కలిసి పనిచేస్తూ నేర్చుకొనే ప్రాక్టికల్ ఆన్-సైట్ కోచింగ్. 

ఇన్-ఫిలిం కోచింగ్...  

ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమా ప్రారంభం నుంచి... షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అయిపోయి, కాపీ వచ్చి, ఆ సినిమా రిలీజ్ అయ్యేవరకు... వందకి వంద శాతం, ప్రతి ఒక్కటి మీరు ప్రాక్టికల్‌గా దగ్గరుండి చూస్తూ, పనిచేస్తూ... నేర్చుకొనే అద్భుత అవకాశం.


త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్న నా రెండు కమర్షియల్ యూత్ సినిమాల ద్వారా, కేవలం ఒక 10 మందికి మాత్రం ఈ "ఇన్-ఫిలిం కోచింగ్" పద్ధతిలో నేను కోచింగ్ ఇస్తున్నాను. చిన్న ఇంటర్వ్యూ తర్వాత, ఎన్నిక చేసిన అభ్యర్థులను మాత్రమే ఈ కోచింగ్‌లోకి తీసుకుంటాము. 

ఇది షార్ట్ ఫిలిం కాదు... థియేటర్స్‌లో, ఓటీటీలో రిలీజయ్యే మెయిన్‌స్ట్రీమ్ ఫీచర్ ఫిలిం! 

ఫస్ట్ కమ్... ఫస్ట్ సెర్వ్‌డ్ పధ్ధతిలో అభ్యర్థులను తీసుకోవటం జరుగుతుంది. ఫీజు చెల్లించిన రోజు నుంచే మీరు మా టీమ్‌లో చేరిపోతారు. ఆరోజు నుంచే మీ కోచింగ్ ప్రారంభమవుతుంది.      

"ఇన్-ఫిలిం కోచింగ్" అంటే వినడానికి కొంచెం కొత్తగా అనిపిస్తుంది. కాని, మీకు తెలుసా... ఈ డిజిటల్ యుగంలో, ఫిలిం మేకింగ్‌కు సంబంధించిన ప్రతి అంశంలో ఎన్నెన్నో కొత్త డెవలప్‌మెంట్స్ వచ్చాయి. తాజాగా రూపొందుతున్న నా సినిమాలో ఒక టీమ్ మెంబర్‌గా ఉంటూ, వాటన్నిటితో అప్‌డేట్ అవుతూ, ప్రాక్టికల్‌గా అన్నీ నేర్చుకోవడం అనేది అరుదుగా దొరికే అవకాశం.

ఇప్పుడా అవకాశం మీ ముందుంది. 


* నంది అవార్డ్ రచయిత-డైరెక్టర్‌, యువర్స్ ట్రూలీ, మనోహర్‌ చిమ్మని రూపొందించి పరిచయం చేస్తున్న ఈ కోచింగ్ ఇండస్ట్రీలో ఇదే మొదటిసారి. 

* కోర్సు కాల వ్యవధి 9 నెలలు. మీ ఫిలిం ఇండస్ట్రీ ఎంట్రీకి ఈమాత్రం శిక్షణాకాలం చాలు. మీరు వెంటనే ఫీల్డులోకి ఎంటరయి బిజీ అవడానికి -  ఏ ఏ ముఖ్యమైన విషయాల్లో మీకు ఎలాంటి అవగాహన, శిక్షణ అవసరమో – మా టీమ్‌లో పనిచేస్తూనే, వచ్చే 9 నెలల్లో అవన్నీ మీరు నేర్చుకుంటారు.  

* "యాక్టింగ్" మీ ఆసక్తి అయితే, యాక్టర్‌గా మీరీ చిత్రంలో పనిచేస్తారు. "స్క్రిప్ట్ రైటింగ్" మీ ఆసక్తి అయితే, మా సినిమా స్క్రిప్ట్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ రైటర్‌గా మీరు పనిచేస్తారు. "డైరెక్షన్" మీ ఆసక్తి అయితే, మా డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా మీరు పనిచేస్తారు. పనిచేస్తూ నేర్చుకుంటారు.  

*ఈ సినిమాకు మీరు పనిచేసినట్టు సిల్వర్ స్క్రీన్ మీద మీ పేరు కూడా చూసుకుంటారు.

అంటే... ఆ "ఒక్క ఛాన్స్" కూడా మీరు సాధించినట్టే!

ఇదంతా మీరు కోచింగ్ తీసుకొంటున్న 9 నెలల కాలంలో - ఏకకాలంలో - జరుగుతుంది. 

ఎగ్జయిటింగ్‌గా లేదూ?   


ఇంకెందుకు ఆలస్యం... మీ పూర్తి పేరు-చదువు-అడ్రసు తెలుపుతూ, ఫీజు వివరాల కోసం మాకు వాట్సాప్ చేయండి: 99895 78125

Welcome to Film Industry! 

-- Manohar Chimmani,
Film Director, Nandi Award Winning Writer 

మనోహర్ చిమ్మని గురించి:

ABOUT MANOHAR CHIMMANI:  

Saturday 12 November 2022

టాలెంట్ ఒక్కటే కాదు .. ఇంక చాలా ఉంది!


హాలీవుడ్‌ను "Land of Dreams" అంటారు.

అక్కడికి ఏటా కనీసం 100,000 మందికి తక్కువకాకుండా వస్తారు... ఆర్టిస్టులూ టెక్నీషియన్లూ.

వాళ్లల్లో కేవలం 1 నుంచి 2 శాతం మందికి మాత్రమే ఏదో ఒక అవకాశం దొరుకుతుంది. మిగిలినవాళ్లంతా కొన్ని దశాబ్దాలపాటు నానా కష్టాలు పడి వెనక్కివెళ్ళిపోతారు.

ఇలా వెళ్ళిపోయినవాళ్లంతా అదే హాలీవుడ్‌ను "Land of Broken Dreams" అని తిట్టుకోవడంలో ఆశ్చర్యంలేదు. 

కట్ టూ మన టాలీవుడ్ - 

పైనచెప్పిన లెక్కంతా ప్రపంచంలోని అన్ని సినిమా ఇండస్ట్రీలకు వర్తిస్తుంది.

మన బాలీవుడ్, టాలీవుడ్‌లు కూడా అందుకు మినహాయింపు కాదు.

సినిమా పుట్టినప్పటినుంచి ఇప్పటిదాకా అంతే. ఇకముందు కూడా అంతే.

ఇక్కడ సక్సెస్ అనేది ఎప్పుడూ కేవలం 2 శాతం లోపే. 

ప్రపంచంలోని ఏ సినీ ఇండస్ట్రీలోనయినా, ఏ పీరియడ్‌లోనయినా, ఆర్టిస్టులూ, టెక్నీషియన్లూ... కేవలం వేళ్లమీద లెక్కించగలిగిన ఒక 20 మంది మాత్రమే సక్సెస్‌లో ఉంటారు. 

మిగిలినవాళ్లంతా స్ట్రగుల్ అవుతూ ఉండాల్సిందే... ఏదోవిధంగా వెనుదిరగాల్సిందే.

ఇండస్ట్రీ మంచిదే. కానీ, దాని సిస్టమ్ దానిది. ఆ సిస్టమ్‌లో ఇమడగలిగినవాడే ఇక్కడ పనికొస్తాడు.

ఇక్కడ టాలెంట్ ఒక్కటే కాదు పనిచేసేది. దాన్ని మించి పనిచేసేవి చాలా ఉంటాయి. వాటిల్లో ఎక్స్‌పర్ట్ అయినవాడు మాత్రమే ఇక్కడ బతికి బట్టకడతాడు. సక్సెస్ సాధిస్తాడు. 

Tuesday 8 November 2022

కోపరేటివ్ ఫిలిమ్ మేకింగ్ - 1


ఆమధ్య "Iceక్రీమ్" సినిమాతో ఓ కొత్త ట్రెండ్‌కి తెరతీశాడు వర్మ. 

దాని పేరు "కోపరేటివ్ ఫిలిమ్ మేకింగ్".

పాతవాళ్లయినా, కొత్తవాళ్లయినా - ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు ఒక్క రూపాయి రెమ్యూనరేషన్ కూడా ముందు ఇవ్వటం అనేది ఉండదు. సినిమా పూర్తయ్యి, రిలీజయ్యి, లాభాలు వచ్చాకే ఆ లెక్కలు! 

దీనికి ఒప్పుకున్నవాళ్లే సినిమాలో పనిచేస్తారు.

ఈ విషయంలో తప్పనిసరైన కొందరికి మాత్రమే మినహాయింపు ఉంటుంది. కొందరికి మినిమమ్ పేమెంట్ ఉంటుంది. 

ఈ మైక్రో బడ్జెట్ కోటి కావచ్చు, రెండు కోట్లు కావొచ్చు.  సో .. ఉన్న ఆ కొద్ది బడ్జెట్‌ను మేకింగ్‌కు, ప్రమోషన్‌కు మాత్రమే వాడతామన్నమాట!

చాలా మంచి కాన్‌సెప్ట్ ఇది.  ముఖ్యంగా చిన్న బడ్జెట్ సినిమాలకు సంబంధించి మాత్రం ఇదే చాలా చాలా కరెక్టు.

కొత్తవాళ్లతో చేసే సినిమాలకు "టాక్" వచ్చేదాకా మంచి ఓపెనింగ్స్ ఉండవు కాబట్టి, ప్రమోషన్ పరంగా ఎన్నో జిమ్మిక్కులు చేయాల్సి ఉంటుంది. అయినా హిట్టో, ఫట్టో ముందే ఎవరూ చెప్పలేరు. ఇలాంటి పరిస్థితుల్లో ముందు ప్రొడ్యూసర్‌ను కొంతయినా బ్రతికించుకోవాలంటే ఇదే మంచి పధ్ధతి.

టీమ్ వర్క్.
కంటెంట్.
ప్రమోషన్.

ఈ తరహా సినిమాలు తీయాలంటే ఈ మూడే చాలా ముఖ్యమైనవి.

కట్ చేస్తే - 

దాదాపు ఇదే కాన్సెప్ట్‌తో నేను రెండు సినిమాలు ప్రారంభించాను. అందులో మొదటిది: Yo! 

ఇది నా "కమ్ బ్యాక్" అన్నమాట!  

Yo! బడ్జెట్ రెండు కోట్లు. 

ఈ సిస్టమ్‌లో నాతో కలిసి పనిచేయాలనుకొనే కొత్త ఇన్వెస్టర్లు మీ పూర్తి వివరాలు తెలుపుతూ నాకు వాట్సాప్ చెయ్యొచ్చు: 9989578125. 

Monday 7 November 2022

మునుగోడు-టు-ఢిల్లీ... కేసీఆర్ ఎక్స్‌ప్రెస్!


మెజారిటీ ఎంతన్నది కాదు భయ్యా... గెలిచామా లేదా అన్నది పాయింటు! 

కట్ చేస్తే - 

మునుగోడు గెలిచాం, కాని ఈ మొత్తం ఉప ఎన్నిక ఎపిసోడ్ వెనుక ఏం జరిగిందన్నది, ఎంత కుట్ర దాగివుందన్నది ఎంతమంది సాధారణ ప్రజానీకానికి తెలుసు? 

మునుగోడు బైపోల్స్ హాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో దేశవ్యాప్తంగా ఎందుకని అంతగా ట్రెండింగ్ అయింది? 

ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణ, గుంటూరు, భీమవరం, ఏలూరు, రావులపాలెం, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, విశాఖపట్నం వంటి నగరాలు ప్రధాన కేంద్రాలుగా మునుగోడు ఉప ఎన్నిక గెలుపు-ఓటములపై సుమారు 3000 కోట్ల బెట్టింగ్ నడిచిందంటే ఎంత దిమ్మతిరిగిపోవాలి? అక్టోబర్ 31 కి ముందే ఆయా ప్రాంతాలనుంచి వచ్చి, గంటగంటకి మునుగోడు తాజా ట్రెండింగ్ "ఫీల్డ్ రిపోర్ట్స్"ను ఆయా ప్రాంతాలకు అందించారంటే నమ్మగలమా? టీ-20 మ్యాచ్‌ను మించిన ఫోకస్ ఈ ఒక్క ఉప ఎన్నిక మీదనే చట్ట వ్యతిరేక ఫంటర్స్‌కు రావడానికి కారణమేంటి?    

దేశంలోని ప్రధాన మీడియా మొత్తం చూపు, దేశంలోని అన్ని రాజకీయపార్టీల చూపంతా ఈ ఒక్క మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక వైపే గత కొద్దిరోజులుగా ఏ స్థాయిలో ఉందో కూడా మనమంతా చూస్తున్నాం. మునుగోడు ఉప ఎన్నికకు ఇంత ప్రాధాన్యం ఎందుకొచ్చింది? 

అసలక్కడ ఉప ఎన్నిక ఎలా వచ్చింది? 

సిట్టింగ్ ఎమ్మెల్యే మరణించాడా? తెలంగాణ రాష్ట్ర సాధన వంటి ఒక శక్తివంతమైన కారణం కోసం ఏమైనా రాజీనామా చేశాడా? అలాంటి కారణాలతో ఉప ఎన్నిక వచ్చిందంటే ఒక అర్థం పర్థం ఉంటుంది. కాని, మునుగోడు ఉప ఎన్నిక అలా వచ్చింది కాదు. 

ఇదొక కృత్రిమ ఉప ఎన్నిక.  

దేశప్రయోజనాలు, ప్రజాసంక్షేమం, అభివృద్ధి వంటి అంశాల్లో అఆలు తెలియనివారి పచ్చి రాజకీయ క్రీడకు ప్రతిరూపం ఈ ఉప ఎన్నిక. ప్రజల కోసం తాను అనుకున్నది సాధించడమే తప్ప మరొకటి తెలియని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టిని ఢిల్లీ నుంచి మళ్ళించడం కోసం వేసిన ఎత్తుగడ. 

కేసీఆర్ సృష్టించిన బీఆరెస్ అన్న పదం పుట్టించిన వణుకు వల్ల వచ్చిన పనికిమాలిన ప్రతిస్పందన ఈ ఉప ఎన్నిక. అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఆరెస్‌ను నైతికంగా దెబ్బతీయాలన్న కుటిల ప్రయత్నం. 

మునుగోడులో గెలవడం ద్వారా తెలంగాణలో ఒక హల్‌చల్ సృష్టించి - ఇక తెలంగాణలో రాబోయేది మా ప్రభుత్వమే అని భారీ బిల్డప్పులు ఇచ్చుకోవాలన్న దురాశ. వాస్తవానికి తెలంగాణలో బీజపీ శక్తి ఒక పాలపొంగువంటిది. క్షేత్రస్థాయిలో టీఆరెస్‌తో పోలిస్తే ఆ పార్టీకున్న కేడర్ దాదాపు శూన్యం. 

అయితే - ఒక్కసారి కేసేఅర్ ఫోకస్ పెడితే పరిస్థితి ఎలా ఉంటుందన్నదానికి ఈ మునుగోడు ఉప ఎన్నిక ఒక తాజా ఉదాహరణ. 

కౌంటింగ్ ప్రారంభంలో ఒక రెండు మూడు రౌండ్స్ వరకు కొంత టెన్షన్ క్రియేట్ అయ్యే పరిస్థితిలా అనిపించింది. ఆ తర్వాత కూడా ఏదో ఇండియా-పాకిస్తాన్ టీ ట్వెంటీ మ్యాచ్‌లా ఉంటుందా చివరివరకూ పరిస్థితి అని కూడా అనిపించింది. 

అయినా సరే, టీఆరెసే గెలుస్తుందని అందరికీ తెలుసు. 

మునుగోడులో కూసుకుంట్ల ప్రభాకరరెడ్డి విజయం వెనుక టీఆరెస్ కార్యకర్తల స్థాయి నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రుల దాకా ప్రతి ఒక్కరి కృషి ఉంది. కేసీఆర్ టాస్క్ అంటూ ఒకటి ఇస్తే ఉద్యమంలా మళ్ళీ ఒక్కటై ఉరుకుతాం అన్నది కార్యరూపంలో సాధించి చూపించారు. 

ఈ విజయం వెనుక టీఆరెస్ సోషల్ మీడియా వారియర్స్ అందరి కృషి కూడా చాలా విలువైనది.    

టీఆరెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్... ఒక వార్ ఫ్రంట్‌లో చీఫ్ వారియర్‌గా... తానుగా ముందుండి, ఎప్పటికప్పుడు అందరిలో ఉత్సాహం నింపుతూ, నడిపిస్తూ, ఉరికిస్తూ ఈ యుద్ధం గెలిచిన తీరు నిజంగా ఒక అద్భుతం.     

ఎప్పుడో మధ్యాహ్నం ఒంటి గంటవరకే మొత్తం డిక్లేర్ అవుతుందనుకున్నది దాదాపు సాయంత్రం వరకు కొనసాగింది. చివరికి అనుకున్నట్టే టీఆరెస్ గెలిచింది. బీజేపీ కుట్రలన్నీ అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. అలా అట్టర్ ఫ్లాప్ అవుతాయని వాళ్లకు కూడా ముందే తెలుసు కాబట్టే ముందురోజునుంచే ఆ శిబిరం నుంచి ఎలాంటి హడావుడి లేదు. నిజానికి ఇదంతా వోటింగ్‌కు ముందే బాగా తెలుసు కాబట్టే నడ్డా, అమిత్ షాల మీటింగ్స్ రద్దయ్యాయి. 

ఎమ్మెల్యేల కొనుగోలు స్కామ్‌లో బయటపడిన ఆడియోలు, వీడియోలు, డేటా రికార్డు అన్నీ అబద్దాలని మొత్తుకొన్న బీజేపీ, అదే మాటకు కట్టుబడి, ఫామ్‌హౌజ్‌లో పట్టుబడ్డ ఆ ముగ్గురి మీద కేసులు పెట్టి లోపల వేయించాలి. కాని, అసలు విచారణే వద్దంటూ పరోక్ష ప్రయత్నాలు చేస్తుండటం సిగ్గుచేటు. 

ఎక్కడో ఎనిమిది రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను బీజేపీ కూలగొట్టడం ఒక ఎత్తు. కేసీఆర్‌తో పెట్టుకోవడం ఒక ఎత్తు.    

బీజేపీకి, కేసీఆర్ ఇతర రాజకీయ ప్రత్యర్థులకు రాజకీయాలంటే ఒక గేమ్. కేసీఆర్‌కు రాజకీయాలంటే ఒక టాస్క్. 

రాజకీయాలే చేయాలనుకుంటే కేసీఆర్‌ను మించినోడు దేశంలో ఉన్నాడా? 

కట్ చేస్తే - 

గుజరాత్‌లో ఎన్నికల ప్రచారానికి కేసీఆర్ బయల్దేరుతున్నారు. ఢిల్లీలో బీఆరెస్ కార్యాలయం సిద్ధమయింది. డియర్ మోదీజీ, ముందుంది ముసళ్ళ పండగ...    

Wednesday 2 November 2022

ఓవర్‌నైట్‌లో హీరో కావడం ఎలా?


సినీఫీల్డులో హీరోగా మీ ప్రవేశానికి టాలెంట్ ఒక్కటే సరిపోదు... 

బై డిఫాల్ట్ ఎవరికైనా టాలెంట్ ఉండాల్సిందే. అయితే - ఆ టాలెంట్ మిమ్మల్ని ఇండస్ట్రీకి పరిచయం చేయగలిగినవారి దృష్టికి తీసుకెళ్ళగలగాలి. అదెలా సాధ్యమవుతుందో మీకు తెలిసుండాలి. 

చాలా సందర్భాల్లో ఒక కొత్త హీరో బయటినుంచి పరిచయమవడం అన్నది చాలా అరుదుగా జరిగే అంశం. డబ్బు, ఇండస్ట్రీ లింక్స్, కాంటాక్ట్స్ లేకుండా దాదాపు ఇది అసాధ్యం. 

కేవలం అతి కొద్ది మంది విషయంలో మాత్రమే టాలెంట్ సపోర్ట్ చేస్తుంది. అది షార్ట్ ఫిలిమ్స్‌లో మీ యాక్షన్ గుర్తించి కావచ్చు. అంతకు ముందు చిన్న చిన్న కారెక్టర్స్‌లో మీరు ప్రూవ్ చేసుకున్న మీ నటన చూసి కావచ్చు. ఇలా కొద్దిమందికి మాత్రమే సాధ్యమవుతుంది. దీనికి ఎంతో సమయం పడుతుంది. 

సినిమా అంటేనే - ప్రతిరోజూ లక్షలు, కోట్లలో ఖర్చు. అంతా కొత్తవాళ్లతోనే ఒక మాడరేట్ స్థాయిలో సినిమా తీయాలంటే కనీసం ఓ 2 కోట్లు అవుతుంది. 

కొత్త హీరోలకు చాన్స్ ఇచ్చే సినిమాలు 99% చిన్న బడ్జెట్ సినిమాలే. ఈ చిన్న బడ్జెట్ సినిమాలకు ఎప్పుడూ ఒక పెద్ద సమస్య ఉంటుంది. డబ్బు! 

ఒక కొత్త హీరోను ఇంట్రొడ్యూస్ చెయ్యాలనుకున్నప్పుడు, ఎవరైనా టాలెంట్‌కే ఫస్ట్ ప్రెఫరెన్స్ ఇస్తారు. అందులో డౌట్ లేదు. అయితే - అలా టాలెంట్ ఉన్నవాళ్ళు వందల్లో ఉంటారు. సో, వారిలో ఎవరి ద్వారా ప్రాజెక్టుకు సపోర్ట్ ఉంటుందో వారికే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. 

ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది... కొత్త హీరోలను ఎక్కువగా వారి బంధువులో, ఫ్రెండ్సో ప్రొడ్యూసర్స్‌గా ఉండి ఇంట్రొడ్యూస్ చేస్తారు. కొంతమంది కొత్త హీరోలు వారే స్వయంగా బడ్జెట్లో కొంత భాగం ఇన్వెస్ట్ చేస్తారు. వారికి ఆ స్థోమత లేనప్పుడు, వారి సర్కిల్లో తెలిసినవారి ద్వారా ఎంతో కొంత ఇన్వెస్ట్ చేయిస్తారు. 

ఓవర్‌నైట్‌లో  హీరోలయిపోతారు!  

ఈమధ్య కూడా - ఈ పధ్ధతిలో హీరోలుగా పరిచయమై నిలదొక్కుకున్న హీరోలెవరైనా గుర్తొస్తున్నారా మీకు? తప్పకుండా వస్తారు. మామూలుగా జరిగేదే అది.  

కొత్త హీరోల ఇంట్రడక్షన్ వెనకున్న ఈ ఆర్థిక కోణాన్ని అర్థం చేసుకోలేక - చాలా మంది తప్పుగా అనుకుంటారు... డబ్బులు పెడితేనే  చాన్స్ ఇస్తారనీ, ప్రొడ్యూసర్లు - డైరెక్టర్లు వాళ్లకు తెలిసిన వాళ్లకే చాన్స్ ఇస్తున్నారనీ... రకరకాలుగా అనుకుంటారు. 

ఏదీ ఊరికే రాదు, ఊరికే అందరూ హీరోలవ్వలేరు. హీరోలయ్యాక వారికి కూడా ఊరికే కోట్లల్లో రెమ్యూనరేషన్ ఇవ్వరు. 

ప్రతిదానికీ ఓ లెక్కుంటుంది.  ఈ  రియాలిటీని అర్థం చేసుకుంటే చాలు. జీవితంలో మీ టైం వేస్ట్ కాదు. 

"I'm gonna make him an offer he can't refuse." 
- The Godfather