Monday 21 November 2022

మనోహర్‌చిమ్మని.బ్లాగ్


2023 నవంబర్ వరకు సినిమాలు తప్ప మరొకదాని గురించి నేనసలు ఆలోచించకూడదని నిర్ణయించుకున్నాను. ఆలోచించడం లేదు. 

ఇప్పుడు నేను చేస్తున్న ట్రెండీ యూత్ ఫిలిం "Yo!"తో పాటు, ప్యారలల్‌గా ఇంకో సినిమా కూడా చేస్తాను. అంతవరకు ష్యూర్. 

ఈలోపు, ఇంటాబయటా - ముఖ్యంగా నా ఆఫీస్ ప్రెమిసెస్‌లో - నానారకాల మనుషులు నానా విధాలుగా నాగురించి ఏదేదో అనుకుంటుంటారు. ఆల్రెడీ అనుకుంటున్నారు. కాని, ఆ పనికిరాని చెత్తంతా పట్టించుకునేంత సమయం నాకు లేదు. 

అదే సమయంలో ఒక సీన్ రాసుకోవచ్చు. ఒక ఇంటిమేట్ ఫ్రెండ్‌తో కాసేపు మాట్లాడుకోవచ్చు. అలాంటి ఇంకో మంచి ఫ్రెండ్‌తో  కాసేపు చాట్ చేయొచ్చు. మా అబ్బాయికో మెసేజ్ పెట్టొచ్చు. ఒక చిన్న కమిట్‌మెంట్‌ను ఎలా పూర్తిచేయాలో ఆలోచించుకోవచ్చు. ఒక చిన్న ఇన్‌కమ్ అవెన్యూను క్రియేట్ చేసుకోవచ్చు.  

నిన్న ఆదివారం - ఇన్వెస్టర్స్ మీటింగ్స్, టీం మీటింగ్స్ మధ్య ఖాళీ దొరికినప్పుడల్లా ఎప్పట్నుంచో నేను అనుకొంటున్న ఒక పెద్ద పని పూర్తిచేశాను. 

అది - 

నా బ్లాగర్ బ్లాగ్ "నగ్నచిత్రం"కు ఒక కస్టమ్ డొమైన్ నేమ్ కొత్తగా కొని, లింకప్ చేసేశాను. 

కట్ చేస్తే - 

ఇప్పుడు నా బ్లాగ్ అడ్రస్ ఇదీ: https://www.manoharchimmani.blog     

No comments:

Post a Comment