Thursday 30 July 2020

హాపీ ఫ్రెండ్‌షిప్ డే !!

సినిమాఫీల్డులో నిజంగానే కొంచెం 'మెటీరియలిస్టిక్'  ఫ్రెండ్‌షిప్స్ ఎక్కువ. 

నాకున్న అతి స్వల్పమైన అనుభవంలోనే ఇలాంటి ఫ్రెండ్‌షిప్స్ ఎన్నో చూశాను. 

మనతో సినిమా జరుగుతున్నంత సేపు ఫ్రెండ్‌షిప్ వేరేగా ఉంటుంది. ఒకసారి పని అయిపోయిందా... ఇంక అంతే! 

> అప్పటిదాకా పొద్దునలేస్తే వాట్సాప్‌లో, ఫేస్‌బుక్‌లో విష్ చేసినవాళ్లు ఉన్నట్టుండి నన్ను మర్చిపోతారు. ఇప్పుడు నా మెసేజ్‌కు రిప్లై ఇవ్వటమే వారికి చాలా కష్టంగా ఉంటుంది... 

> అప్పటిదాకా దగ్గినా తుమ్మినా కాల్ చేసినవాళ్ళకు, పని అయిపోయాక వాళ్ల కాంటాక్ట్స్‌లో నా నంబర్ కనిపించదు... నాకు ఒక్క కాల్ రాదు. నేను కాల్ చేస్తే ఏదో సో సో... ఎప్పుడెప్పుడు పెట్టేసేద్దామా అనే... 

> "నాకు అరవింద్ తెలుసు, రాజు తెలుసు, సో అండ్ సో నేనూ కలిసి మందు కొడతాం తెలుసా" అని నేను చాన్స్ ఇచ్చిన తర్వాత నాతో చెప్పుకున్నవాళ్లు, ఇండస్ట్రీలో పదేళ్లయినా రెండో చాన్స్ తెచ్చుకోలేదు. అదేంటో మరి! 

> ప్యారడైజ్ రోడ్లమీద సరదాగా నడుస్తూ తిరిగి, కలిసి బీర్లు త్రాగి, బిర్యానీలు తిన్న హీరోలు ఉన్నట్టుండి ఏదీ గుర్తుకురాని గజినీలయిపోతారు. కలా, నిజమా?! 

> "వద్దురా బై, నాకది నచ్చదు" అని ఎంత మొత్తుకున్నా వినని నేను పరిచయం చేసిన ఒక విలన్... అప్పట్లో కనిపించిందే ఆలస్యం... కాళ్లకి మొక్కేవాడు. రోజుకి డజన్ మెసేజెస్, అరడజన్ కాల్స్ చేసేవాడు. ఇప్పుడు కనిపించినా నేనెవరో తెలియనట్టు మరోవైపు తలతిప్పుకొని వెళ్ళిపోతాడు. అసలితను నేను పరిచయం చేసినతనేనా... అని నాకే డౌటొస్తుంది. 

> నేను సిల్వర్‌స్క్రీన్‌కు పరిచయం చేసిన ఒకరిద్దరమ్మాయిలు ఇప్పుడు యాంకర్స్‌గా మంచి స్థాయిలో ఉన్నారు. అప్రిషియేట్ చేస్తూ ఎప్పుడైనా విష్ చేద్దామన్నా అసలు సందివ్వరు. ఏంటంత ప్రాబ్లమ్?!     

పైన నేను చెప్పిందంతా జస్ట్ ఒక చిన్న శాంపుల్ మాత్రమే. గౌరవ సీనియర్లు ఈ సబ్జక్టు గురించి మరింత బాగా చెప్తారు. 

అయితే ఇదంతా నేనసలు పట్టించుకోను. ఇప్పుడు కూడా ఇదెందుకు రాస్తున్నానంటే దానికో కారణం ఉంది. 

కట్ చేస్తే - 

సుమారు 15 ఏళ్లక్రితం, ఒక కార్పొరేట్ అసైన్‌మెంట్ మీద నేను వైజాగ్ వెళ్లినప్పుడు, స్టీల్‌ప్లాంట్ గెస్ట్ హౌజ్‌లో అనుకోకుండా నాకొక ఆర్టిస్టుతో పరిచయం అయింది.

అప్పుడు వాళ్ల సినిమా షూటింగ్ ఆ చుట్టుపక్కల జరుగుతోంది. 

రోజూ తెల్లవారుజామున, సాయంత్రం మేమిద్దరం కనీసం ఒక రెండు గంటలపాటు బుక్స్ గురించి, క్రియేటివిటీ గురించి, సముద్రం గురించి... ఎంతో నాన్సెన్స్ మాట్లాడుకొనేవాళ్లం. 

నాన్సెన్స్ అని ఎందుకంటున్నా అంటే, మామధ్య టాపిక్స్ ఒకచోటినుంచి ఇంకోచోటకి క్షణంలో అలా జంప్ అయ్యేవి! 

బాగా నవ్వుకొనేవాళ్లం. కనీసం ఒక నాలుగు కాఫీలు పక్కాగా త్రాగేవాళ్లం.

గెస్ట్ హౌజ్ చుట్టూరా ఉన్న లాన్స్, లేదా లాంజ్, లేదా ఏదో ఒక రూం... మా సిట్టింగ్స్‌కు వేదికలయ్యేవి. 

ఒకవైపు వాళ్ల టీమ్, మరోవైపు నా కొలీగ్స్ మా ఇద్దరి చర్చలను చాలా విచిత్రంగా చూసేవాళ్లు. కాని, అవన్నీ పట్టించుకొనే లోకంలో మేం అసలు ఉండేవాళ్లం కాదు.

కాని, తనని పిలవడానికి కూడా బాగా ఇబ్బందిగా ఫీలవుతూ, ఆ ఆర్టిస్టు పట్ల వారు చూపే అభిమానం, గౌరవం నాకు బాగా అర్థమయ్యేవి. 

అక్కడినుంచి ఫాస్ట్ ఫార్వార్డ్ చేస్తే... 15 ఏళ్ల తర్వాత కూడా మా ఇద్దరి మధ్య స్నేహం ఇంకా కొనసాగుతూనే ఉంది. 

"ఏం చేస్తున్నావ్... ఎలా ఉన్నావ్... కాలు నొప్పి పూర్తిగా తగ్గిందా... సర్జరీ చేయించావా... ఇప్పుడేం చదువుతున్నావ్... ఏం రాస్తున్నావ్... బ్లా బ్లా... బ్లా బ్లా..." 

పొద్దుటే ఒకరికొకరం విషెస్ చెప్పుకొన్నాం. అయినా... 

ఎక్కడో 650 కిలోమీటర్ల దూరం నుంచి ఆ ఆర్టిస్టు కాల్... ఫ్రెండ్‌షిప్‌డే విషెస్... ఓ గంటసేపు మా ట్రేడ్‌మార్క్ క్రియేటివ్ కబుర్లు... కోవిడ్ తర్వాత వెంటనే ఈసారి అయితే గోవాలో, లేదంటే పాండిచ్చేరిలో కల్సుకోవాలన్న ప్లాన్... 

ఫిలిం ఇండస్ట్రీలో ఇలాంటి స్నేహసౌరభాలు కూడా ఉంటాయి... 

Wednesday 29 July 2020

మరియా షరపోవాకు బాగా నచ్చిన కొటేషన్!

వుమెన్ టెన్నిస్ క్రీడాకారిణులలో నాకు మరియా షరపోవా అంటే చాలా ఇష్టం. 

అందం ఒక్కటే కాదు, షరపోవా మీద నా ఇష్టానికి కారణాలు ఇంకా చాలా ఉన్నాయి... 

రష్యన్ భాష అన్నా, రష్యన్ చరిత్ర-సంస్కృతి అన్నా, రష్యన్ అమ్మాయిలన్నా నాకు చాలా ఇష్టం.

మరియా షరపోవా రష్యన్ అమ్మాయి.  

ఆమె క్రీడాకారిణి మాత్రమే కాదు... ఇంటర్నేషనల్ మోడల్, నైక్ వంటి ఎన్నో అంతర్జాతీయ కంపెనీలకు బ్రాండ్ అంబాస్సాడర్ కూడా. షరపోవా పేరు మీద ఎన్నో బ్యూటీ, ఫిట్‌నెస్, ఫుడ్ ప్రొడక్ట్స్ కూడా ప్రపంచ మార్కెట్లో ఉన్నాయి.

వింబుల్డన్, ఫ్రెంచ్, యూఎస్, ఆస్ట్రేలియా గ్రాండ్ స్లామ్స్ నాలుగూ గెలుచుకొన్న అతితక్కువమంది ప్రపంచ క్రీడాకారిణుల్లో షరపోవా ఉంది. తను మొత్తం 5 సార్లు గ్రాండ్ స్లామ్ గెలుచుకొంది. 

ఈమధ్యే ఫిబ్రవరి 26 నాడు టెన్నిస్ నుంచి రిటైరయిన షరపోవా పుట్టింది రష్యాలోని న్యాగన్‌లో, కాని 1994 నుంచి అమెరికాలోనే పర్మనెంట్ రెసిడెంట్‌గా స్థిరపడిపోయింది. 

కట్ టూ మరియా షరపోవా, ది అన్‌స్టాపబుల్ -

యూఎస్ లోని ఫ్లోరిడాలో ఒకరోజు అర్థరాత్రి... ఒక తండ్రి, తన కూతురిని తీసుకొని గ్రేహూండ్ బస్ దిగి, నేరుగా నిక్ బొలెట్టేరి టెన్నిస్ అకాడెమీ బెల్ కొట్టాడు.

అంత అర్థరాత్రి సమయంలో ఆ అకాడెమీకి ఎవరో ఇద్దరు వచ్చి అలా బెల్ కొడతారని అకాడెమీలో ఎవరూ అనుకోలేదు. 

ఆ ఇద్దరూ వచ్చింది రష్యా నుంచి... 

7 ఏళ్ల ఆ అమ్మాయికి, ఆ అమ్మాయి తండ్రికి ఆ క్షణం మనసులో ఉన్న సంకల్పం ఒక్కటే... ఆ అమ్మాయి భవిష్యత్ టెన్నిస్ స్టార్ కావడం! 

అంత పెద్ద లక్ష్యంతో రష్యా నుంచి తన కూతురిని తీసుకొని అమెరికా వచ్చిన ఆ తండ్రిదగ్గర అప్పుడున్న డబ్బు కేవలం 700 డాలర్లు. 

ఆతర్వాత వాళ్లు ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్నెన్ని త్యాగాలు చేశారో వారికి మాత్రమే తెలుసు. కాని, వారి కల నిజమైంది. అనుకున్నది సాధించారు.

తన 17 ఏళ్ల వయసులో, అదే అమ్మాయి, వింబుల్డన్ ఫైనల్స్‌లో సెరెనా విలియమ్స్‌ను ఓడించి టెన్నిస్ స్టార్ అయింది. 

అప్పటి ఆ 7 ఏళ్ల అమ్మాయే... ఈ 17 ఏళ్ల టెన్నిస్ స్టార్ మరియా షరపోవా! 

తర్వాతంతా చరిత్రే. 

తన 18వ ఏట WTA ప్రపంచపు నంబర్ 1 ర్యాంక్ సాధించింది షరపోవా. ఒక్కొక్కటిగా వరుసగా ప్రపంచపు 4 గ్రాండ్‌స్లామ్స్ సాధించింది. ప్రపంచం మర్చిపోలేని అతికొద్దిమంది టెన్నిస్ స్టార్స్‌లో ఒకరిగా చరిత్రలో తనకంటూ ఒక అందమైన పేజీని సృష్టించుకొంది.     

చాలా హుందాగా, అందంగా... సరైన సమయంలో టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పింది.

షరపోవా ఈ విజయయాత్ర వెనుక లెక్కలేనన్ని ఆమె చేసిన త్యాగాలు, ఆమె పడ్ద కష్టాలు, తను అనుభవించిన ఎన్నెన్నో మానసిక, భౌతిక గాయాలు... మొత్తంగా ఆమె ఆట లాగే, ఒక థ్రిల్లింగ్ అనుభూతినిచ్చే సంగతులెన్నో షరపోవా రాసుకున్న తన పుస్తకం "UNSTOPPABLE - MY LIFE SO FAR" లో మనం చదవొచ్చు.

షరపోవా మాటల్లోనే చెప్పాలంటే, ఆమె రాసిన ఈ పుస్తకం - "This is a story about sacrifice, what you have to give up. But it’s also just the story of a girl and her father and their crazy adventure."
స్వీట్లు తినడం చాలా ఇష్టపడే మరియా షరపోవాకు "ప్లీజ్", "థాంక్యూ" అనే రెండు ఇంగ్లిష్ పదాలంటే చాలా ఇష్టం. అయితే, ఈ రెండు అద్భుతపదాలను ఖచ్చితంగా అవి అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించాలంటుంది షరపోవా. 

ఇక, షరపోవాకు బాగా నచ్చిన కొటేషన్ ఇది: "What makes a river so restful to people is that it doesn't have any doubt - it is sure to get where it is going, and it doesn't want to go anywhere else."

లక్ష్యసాధన విషయంలో షరపోవా నమ్మిన ఈ కొటేషన్ ఎంత సింపుల్‌గా ఉందో అంత సహజంగా ఉంది. అంత అద్భుతంగా కూడా ఉంది. 

"నదికి తెల్సు 
తను ఎక్కడికెళ్లాలో.
ఎన్ని అడ్దంకులొచ్చినా సరే,
అది ఎన్ని వంకలైనా తిరుగుతుంది,
ఎన్ని కొండలైనా దూకుతూ పారుతుంది.
కించిత్ సందేహం లేకుండా   
అది ఎక్కడికెళ్లాలో అక్కడికే వెళ్తుంది,
ఇంకెక్కడికీ వెళ్లదు."          

Monday 27 July 2020

వర్కింగ్ ఫ్రమ్ హోమ్!

లాక్‌డౌన్ అందర్నీ ఒక చూపు చూసింది. నన్ను మరింత స్పెషల్ ప్రేమతో చూసిందనుకోండి... అది వేరే విషయం.

ఏదో రెండు వారాల్లో పోతుందిలే అనుకున్నాం. తర్వాత రెండు నెలలు అనుకున్నాం. ఇప్పుడది నాలుగు నెలలు కూడా దాటింది.

కరోనా వైరస్ ఇంత పని చేస్తుందనుకోలేదు.

అందరం అదే అన్‌సర్టేనిటీతో, అదే భయంతో బ్రతుకుతున్నాం ఇంకా.

"ఇంకో రెండు నెలలు" అని ఫ్రెష్‌గా ఈరోజు కూడా ఇంకోసారి వింటున్నాను. కొంచెం తెలివైనవాళ్ళు "డిసెంబర్ దాకా ఏ ఆశలు పెట్టుకోకు... 2020 మర్చిపో" అంటున్నారు!

ఈ నేపథ్యంలో -

లాక్‌డౌన్ తర్వాత ఓటీటీ/ఏటీటీలకు మాత్రమే కొన్ని సినిమాలు చేస్తున్నాను. అది వేరే విషయం. దానికింకా టైముంది. 

అయితే, దాంతో సంబంధం లేకుండా, 365/24/7 ఎలాంటి బ్రేక్ లేకుండా, నన్ను నేను బిజీగా ఉంచుకోవడం కోసం ఒక మహా కార్యక్రమం ఈ మధ్యే ప్రారంభించాను.

అదే  నా  Work from Home!

అప్పటికప్పుడు, 48 గంటల్లో, నేను క్రియేట్ చేసుకొన్న నా  వెబ్‌సైట్  చూస్తే మీకు మొత్తం అర్థమైపోతుంది.

> రైటింగ్
> ఫిలిం మేకింగ్
> కోచింగ్
> ప్రమోషన్

ఈ నాలుగు రంగాల్లో  Piece Work, Ghost Work, Freelance Work రూపంలో... నాకు చేతనైన ప్రతి పనీ చేసేస్తున్నాను.

24/7 పనిలో బిజీగా ఉండటం ముఖ్యం. ఆరోగ్యంగా ఉండటం మరింత ముఖ్యం.   

సో, నా వెబ్‌సైట్ విజిట్ చేయండి...

It's a 'One Stop Shop' for content and services related to Writing, Filmmaking, Promotion, Coaching solutions, etc.

వాటిల్లో ఒక్కోదాని గురించి ఈరోజునుంచే ఇక్కడ బ్లాగ్‌లో పరిచయం చేస్తుంటాను... రాస్తుంటాను.

ఈ లాక్‌డౌన్లో మీలో ఎంతోమందితో కలిసి పనిచేసే అంశం ఏదో ఒకటి నాకు తప్పక ఉంటుంది.

దాదాపు... వెబ్‌సైట్‌లో లిస్ట్ చేసిన క్రియేటివ్ సర్విసెస్ అన్ని విభాగాల్లోనూ నాకు అసిస్టెంట్స్, టీమ్ ఉన్నప్పటికీ... ప్రతి ఒక్క ఆర్డర్‌ను స్వయంగా నేనే డీల్ చేస్తాను. క్లయింట్స్ టైమ్ ఏమాత్రం వృధా కాకుండా నా వాట్సాప్ నంబర్, ఈమెయిల్ అడ్రస్ కాంటాక్ట్‌లో ఇచ్చాను.

Welcome to My Website!

ManoharChimmani.In

And... Please feel free to reach out to me. I look forward to a beautiful journey together. 

Friday 24 July 2020

ఎవరిష్టం వారిది. ఎవరి రూట్ వారిది.

లాక్‌డౌన్ సమయంలో మొత్తం మూసేసుకొని కూర్చొన్న సినీఫీల్డులో, వేలాదిమంది డెయిలీ వేజెస్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లు చాలా కష్టాలు పడుతున్నారు.

వీళ్ళే కాకుండా, సినిమా ఫీల్డుతో అనుబంధం ఉండి, ఇంకేవేవో చిన్న చిన్న యాడ్స్, పీస్ వర్క్‌లు, ఘోస్ట్ రైటింగ్ లాంటి పనులు చేసుకొంటూ బ్రతికే ఇంకెందరో చెప్పుకోలేనివాళ్లు పడుతున్న కష్టాలకు కూడా అంతులేదు.

ఇలాంటి సమయంలో... ఇంట్లో కూర్చొని వంటపనులు ఇంటి పనులు చేసుకొంటూ ఆ క్లిప్స్ సోషల్ మీడియాలో పెట్టడం లాంటివి చేయకుండా, ఆర్జీవీ ఒక కొత్త బిజినెస్‌కు శ్రీకారం చుట్టాడు.

అప్పటిదాకా రంగంలో ఉన్న OTT ప్లాట్‌ఫామ్‌లకు, Pay Per View అనే చిన్న ట్విస్ట్ ఇవ్వడం ద్వారా సినీ ఫీల్డులో ఒక కొత్త వ్యాపారమార్గాన్ని క్రియేట్ చేశాడు ఆర్జీవీ.

అదే ఇప్పుడు ATT గా ఓ చిన్న స్థాయి సంచలనం సృష్టిస్తోంది.

తను క్రియేట్ చేసిన ఈ కొత్త మార్గంలో ఇప్పటికే 2 సినిమాలు రిలీజ్ చేసి కొన్ని గంటల్లో కోట్లు, లక్షలు సంపాదించాడు ఆర్జీవీ. ఇంకో 3 సినిమాలు వరుసగా రిలీజ్ చేస్తున్నాడు.

ఒక అద్భుతమైన బిజినెస్ మాడల్‌గా ఇక్కడివరకు ఇది ఓకే...

నిజంగా చెప్పుకోదగ్గ విజయం కూడా.

ఈ బిజినెస్ మాడల్‌ను అనుసరించి, ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక 20 పైనే సినిమాలు తయరవుతున్నాయి. నాకు తెలిసి ఇంకో అరడజన్ ATT లు కొత్తగా రెడీ అవుతున్నాయి.

సినిమా మీదనే ఆధారపడ్డ వందలాదిమందికి ఇప్పుడు పని దొరికింది. థియేటర్స్ ఇప్పట్లో ఓపెన్ అయ్యే పరిస్థితి లేదు కాబట్టి, ఇది ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఇంకెందరికో చేతినిండా పని దొరుకుతుంది.

థియేటర్స్ ఓపెన్ అయిన తర్వాత కూడా, ఇంకా పెరుగుతుందే తప్ప, ఏ మాత్రం తగ్గిపోని బిజినెస్ మాడల్ ఇది.

ఇక్కడివరకు కూడా డబల్ ఓకే...

ఈ బిజినెస్ మాడల్‌ను ఎవరికి అనుకూలంగా వారు వాడుకొంటూ సూపర్‌గా ముందుకెళ్లవచ్చు.

కాని... ఒక ఎఫెక్ట్ కోసమో, వ్యక్తిగత ఇంట్రెస్టుతోనో, ఆర్జీవీ తీస్తున్నటువంటి సినిమాలనే  అందరూ తీయాలని రూలేం లేదు... ఆఫీసులపై దాడులు చేయించుకోనవసరంలేదు.

ఎవరిష్టం వారిది. ఎవరి రూట్ వారిది.

అంతే. 

Wednesday 22 July 2020

చిన్నారి పొన్నారి కిట్టయ్యా...

నిప్పులేందే పొగరాదంటారు. మరి ఆ డైరెక్టర్‌ను పవర్ స్టార్ ఎందుకు కొట్టాడు? సందర్భం కరెక్టుగా ఏమై ఉంటుంది? అదెంతవరకు కరెక్టు? అయినా ఇప్పటికీ వాళ్లిద్దరూ బాగానే ఉన్నారే...

ఇవ్వాళ ఆర్జీవీ రిలీజ్ చేసిన (లీక్ చేసిన కాదు) ట్రైలర్ చూసింతర్వాత నాకొచ్చిన సందేహాలివన్నీ.

మంచి సాహితీ పరిజ్ఞానం, భాషా పటిమ, వాక్ధాటి వంటివి పుష్కలంగా ఉన్న ఆ డైరెక్టర్ విషయంలో అలా జరిగి ఉండకూడదని నేను అనుకుంటున్నాను. కాని, అలాంటిది ఏం లేకుండానే, వర్మ పనిగట్టుకొని ఆ క్యారెక్టర్ని క్రియేట్ చేసి,  అతన్ని ఎందుకు అలాంటి సీన్లో ఇరికిస్తాడు?

మిత్రులెవరికైనా నిజంగా ఏదైనా తెలిస్తే చెప్తారని ఉదయం నుంచి చూస్తున్నాను. బట్ నో.

కట్ చేస్తే -

గతంలో ఇలాంటి పొలిటికల్ సెటైర్లు కొన్ని సినిమాలుగా వచ్చాయని లీలగా గుర్తుంది. కాని, మరీ ఇంత ఓపెన్‌గా, (దాదాపు) డైరెక్టుగా ఇలా సినిమాలు తీయడం నాకు తెలిసి నేనిప్పుడే చూడటం.

మొన్నీమధ్య నేను రాసిన ఒకటిరెండు పోస్టులు చూసి అందరూ నన్ను అడుగుతున్నారు. వాళ్లందరికోసం నేనీ రెండు లైన్లు రాస్తున్నాను:

ఆర్జీవీ నా ఫ్రెండ్ కాదు, నాకు చుట్టం కాదు. అతనిలో నాకు నచ్చిన కొన్ని అంశాలు నేనిప్పటికీ ఇష్టపడతాను. అంతవరకే.

ఒక క్రియేటివ్ పర్సన్‌గా ఎవ్వరైనా ఏదైనా చేసుకునే ఫ్రీడమ్ మనదేశంలో ఉంది. అలాగని, ఒక వ్యక్తి వ్యక్తిగత జీవితంలోకి చొచ్చుకుపోయి మరీ ఇలా సినిమాల ద్వారా ఏదో చేయటం/చేయాలనుకోవటం ఖచ్చితంగా కరెక్టు కాదనే నా వ్యక్తిగత అభిప్రాయం.

ఇప్పుడు అటువైపువాళ్లు "పరాన్న జీవి" తీస్తున్నారు! వర్మ మీద ఇంకో 3 సినిమాలు కూడా తీస్తున్నారట అని ఏబీఎన్‌లో వెంకటకృష్ణ చెప్తుంటే ఇందాకే విన్నాను. 

ఇదిలాగే కొనసాగి, చివరికి ఈ టైపు సినిమాల ట్రాక్ ఒకటి ప్యారలల్‌గా నడిచేరోజు కూడా రావచ్చు. ఇప్పుడు చేతిలో కొన్ని లక్షలుంటే చాలు, ఎవరైనా ఎలాంటి సినిమా అయినా తీయవచ్చు. సో, ఇది పెద్ద కష్టం కాదు. ప్రతి గల్లీ లీడర్ పైన, అతనంటే పడని ఇంకో వ్యక్తి సినిమా తీయొచ్చు. ఆన్‌లైన్లో రిలీజ్ చేయొచ్చు.

ఈ మొత్తం ఎపిసోడ్‌లో ఎవరైనా అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఒక్కటే. పరోక్షంగా ఒక ఫండర్ ఎవరైనా అలాంటి ఆఫర్ ఇవ్వటం వల్లనే ఆర్జీవీ ఇలాంటి సినిమాలు తీస్తున్నాడా, లేదంటే ఈ రేంజ్‌లో ఆర్జీవీ రియాక్ట్ అయ్యేంత క్లాష్ వాళ్లిద్దరిమధ్య ఏదన్నా జరిగిందా?

ఏదో ఉంది మొత్తానికి... 

Tuesday 21 July 2020

"యూట్యూబ్ థంబ్‌నెయిల్" స్థాయికి దిగజారిన జర్నలిజం!

"ఏటీటీలో అంత భవిష్యత్తు ఉందా ?"
"ఏటీటీ అంటే బూతేనా?"
"వర్మ గుల తీరుతుందా, నిజం తెలుసా?"...

పై మూడు హెడ్డింగుల్లో ఒకటి ఓ వెబ్‌సైట్‌లో వచ్చింది కాగా, రెండోది ఓ దినపత్రికలోని సినిమా సెక్షన్లో వచ్చింది. మూడోది పక్కా యూట్యూబ్ హెడ్డింగే!

సినిసిజమ్. అల్టిమేట్ నెగెటివిటీ. హాబిచువల్ శాడిజమ్...

మొదటిదాన్ని అసలు ఆర్టికల్ అనలేము. ఏదో నింపాలి అన్నట్టు రాసిన ఫిల్లర్. అసలు ఏం రాయాలనుకున్నాడో, ఏం రాశాడో కూడా బహుశా ఆ రాసినతనికే తెలిసుండదు.

ఇది పబ్లిష్ చేసిన సైట్‌కు సంబంధించిన మాతృసంస్థ మాత్రం ఆన్‌లైన్లో మంచి మంచి ఇంటర్వ్యూ ప్రోగ్రాములు, టాక్ షోలు చేస్తూ, అతి తక్కువకాలంలో టాప్ స్థాయికి ఎదిగింది. వారి సైట్లో రాతలు మాత్రం ఇంత అర్థంలేని స్థాయిలో ఉండటం అనేది, బహుశా రావల్సినవారి దృష్టికి ఇలాంటివి రాకపోవడంవల్లనే అనుకుంటాను.

ఇక రెండోది సీనియర్ ఫిలిం జర్నలిస్టు వినాయకరావు రాసింది. ఆయన రాసినదాంట్లో ఈ హెడ్డింగ్‌లో ఉన్నంత నెగెటివిటీగాని, బూతుగాని లేదు. ఏటీటీ వల్ల భవిష్యత్తులో చిన్న బడ్జెట్ సినిమాలకు ఉండే ప్రయోజనాలను చెబుతూ మంచి నిర్మాణాత్మక శైలిలో బాగా రాశారు. నాకు తెలిసి, ఇలాంటి హెడింగ్ వినాయకరావు పెట్టి ఉండరు.

ఏటీటీలో ఆర్జీవీ వదిలిన 2 సినిమాల్లో కొంత అడల్ట్ కంటెంట్ ఉందనుకుందాం. అలాంటి సోకాల్డ్ బూతు లేని అదే ఆర్జీవీ సినిమాలు కరోనావైరస్, 12'ఓ క్లాక్, పవర్‌స్టార్ వంటివి కూడా అదే "ఆర్జీవీ వరల్డ్ థియేటర్" ఏటీటీలో రేపు రిలీజ్ కాబోతున్నాయికదా?... మరి ఏటీటీ అంటే బూతు ఎలా అవుతుంది?!

అదే "శ్రేయాస్ ఈటీ" ఏటీటీలో ఎస్వీ కృష్ణారెడ్డి, వీవీ వినాయక్, చంద్ర సిధ్ధార్థ వంటి డైరెక్టర్ల సినిమాలు కూడా త్వరలో రిలీజ్ కానున్నాయి. మరి వీళ్లంతా కూడా బూతు సినిమాలు తీసే డైరెక్టర్లనేనా ఈ పత్రిక ఉద్దేశ్యం?   

"ఏటీటీ అంటే బూతేనా?" అని ఏటీటీ గురించి అంత చీప్‌గా ప్రొజెక్ట్ చేసే టైటిల్ పెట్టిన ఆ పత్రిక, ఆ వ్యాసానికి ఇంకేదైనా ఫోటో వేయాల్సింది. కాని అప్సరా రాణి సెక్సీ ఫోటోనే వేసుకుంది!

"రామ రామ" అని లెంపలేసుకొంటున్న ఓ బుధ్ధిమంతుడి ఫోటో వెయ్యొచ్చుకదా?... వెయ్యరు, వెయ్యలేరు.

ఎందుకంటే...

ఆ పత్రికే కాదు... ప్రపంచంలోని ఏ పత్రికైనా, ఏ మీడియా అయినా సినీ ఆర్టిస్టుల ఫోటోలు, సినీ కంటెంట్ లేకుండా బ్రతకలేవు.

ఇక మూడోది పూర్తిగా యూట్యూబ్ థంబ్‌నెయిల్ కంటెంటే కాబట్టి, దాని గురించి నేను పెద్దగా రాయాల్సిన అవసరం లేదు. ఈ 'యూట్యూబ్ జర్నలిస్టు' తను రెగ్యులర్‌గా రాజకీయాల గురించి చెప్పినంత డిగ్నిటీతోనే ఈ కంటెంట్‌ను కూడా ప్రజెంట్ చేయాల్సింది. కాని, మరీ "గుల" స్థాయికి దిగజారిపోవటం శోచనీయం.

డిజిటల్ ఫిలిం మేకింగ్ వచ్చిన కొత్తలో కూడా ఇలాగే రాశారు. ఇలాగే మాట్లాడారు. తర్వాత ఏమైంది? ఫిల్మ్ తయారుచేసే ఫాక్టరీలే మూతపడ్డాయి! ఇప్పుడూ అంతే. OTT, ATT ల మీద కనీస అవగాహన లేకుండా తోచిన ఏ చెత్తో రాయడం ఈజీ. తర్వాత ఫూల్స్ అయ్యేది వీళ్లే!

Naysayers always talk BS...

కట్ చేస్తే -

బూతు బూతు అని మొత్తుకొనే వీళ్లలో అత్యధికశాతం మంది నిజజీవితంలో బూతు లేకుండా బ్రతకగలరా?

బూతు బూతు అని బయటికి మొత్తుకొంటూ, లోపల వాట్సాపుల్లో బూతునే షేర్ చేసుకొనే ఈ ద్విముఖులంతా, తాపీ ధర్మారావు రాసిన "దేవాలయాలమీద బూతు బొమ్మలెందుకు?" పుస్తకం ఒకసారి చదవాల్సిన అవసరం చాలా ఉంది.  

Wednesday 15 July 2020

గుడ్‌బై ఫేస్‌బుక్... ?!

ఎప్పుడైనా (కొద్దిమందితో) కమ్యూనికేషన్‌కు ఉపయోగపడుతుందని తప్ప, ఫేస్‌బుక్‌ను ఎప్పుడో వదిలేసేవాన్ని.

ఫేస్‌బుక్ టైమ్‌లైన్‌ను వదిలేసి చాలారోజులైంది. మెల్లగా పేజ్‌కు కూడా గుడ్‌బై చెప్పాలనుకొంటున్నాను.

పైనచెప్పినట్టుగా కొందరితో కమ్యూనికేషన్‌కు, కొన్ని ఫోటోలు బ్యాకప్ తీసుకోడానికి మాత్రం కొన్నాళ్లపాటు అలాగే ఉంచుతాను.

21 మే 2021 తర్వాత ఫేస్‌బుక్‌ను పూర్తిగా డిలీట్ చేస్తాను.

ట్విట్టర్, ఇన్స్‌టాగ్రామ్ కంటిన్యూ చేస్తున్నాను. ఈ రెండు ప్లాట్‌ఫామ్స్‌ను ఇప్పుడు బాగా అలవాటు చేసుకోవాలనుకొంటున్నాను.

ఇన్స్‌టాగ్రామ్‌కు నేను పూర్తిగా కొత్త. ఎలా ఉంటుందో  చూడాలి...

కట్ చేస్తే -

ఇప్పుడు, ఈ లాక్‌డౌన్ తర్వాత, ఒకటి రెండు సినిమాలు చేయాలనుకుంటున్నాను. సోషల్ మీడియాలో కొంత బజ్ అవసరం.

ఫేస్‌బుక్‌ను బీట్ చేసి ఫుల్ స్వింగ్‌లో ఉన్న ఇన్స్‌టాగ్రామ్‌లోకి  నేనీ మధ్యే ఎంటరయ్యాను. స్ట్రెస్ రిలీఫ్ కోసం గడిపే ఆ 20 నిమిషాలేదో ఇక్కడ గడపడం బెటర్. వీలైతే కాసేపు ట్విట్టర్.

ఈ రెండింటితో ఎలాంటి సమస్యే లేదు.

ఫేస్‌బుక్ మాత్రం ఈ మధ్య మరీ 'నా చిన్నప్పట్లో చూసిన మునిసిపాలిటీ చెత్తకుండి' లా తయారైంది.

బట్ ఈ చెత్తకుండే రేపు నా సినిమాల ప్రమోషన్‌కు సోషల్ మీడియాలో బాగా ఉపయోగపడుతుందన్నది నేను కాదనలేని వాస్తవం.

To be or not to be... that's the question!   

Monday 13 July 2020

కోపరేటివ్ ఫిలిమ్ మేకింగ్ అంటే ...

ఈ సెటప్‌లో .. పాతవాళ్లయినా, కొత్తవాళ్లయినా - ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు ఒక్క రూపాయి రెమ్యూనరేషన్ కూడా ముందు ఇవ్వటం అనేది ఉండదు.

సినిమా పూర్తయ్యి, రిలీజయ్యి, లాభాలు వచ్చాకే ఆ లెక్కలు!

దీనికి ఒప్పుకున్నవాళ్లే  ఇప్పుడు మా సినిమాల్లో  పనిచేస్తున్నారు.

మా సినిమా బడ్జెట్ 50 లక్షలు కావచ్చు, కోటి కావచ్చు, ఎంతయినా కావొచ్చు.  సో... ఈ బడ్జెట్‌ను మేకింగ్‌కు, ప్రమోషన్‌కు మాత్రమే వాడతామన్నమాట!

ఇదేం కొత్త కాన్సెప్ట్ కాదు. ఆర్జీవీ వంటివాళ్లు ఆల్రెడీ ఈ కాన్సెప్ట్‌తో సినిమాలు చేశారు.

చాలా మంచి కాన్‌సెప్ట్ ఇది.  ముఖ్యంగా చిన్న బడ్జెట్ సినిమాలకు సంబంధించి మాత్రం ఇదే చాలా చాలా కరెక్టు.

థియేటర్లలో  మైక్రో బడ్జెట్ సినిమాలకు సినిమాలకు "టాక్" వచ్చేదాకా మంచి ఓపెనింగ్స్ ఉండవు కాబట్టి, ప్రమోషన్ పరంగా ఎన్నో జిమ్మిక్కులు చేయాల్సి ఉంటుంది. హిట్టో, ఫట్టో ముందే ఎవరూ చెప్పలేరు. ఇలాంటి పరిస్థితుల్లో ముందు ప్రొడ్యూసర్‌ను కొంతయినా బ్రతికించుకోవాలంటే ఇదే మంచి పధ్ధతి.

ఇప్పుడు థియేటర్స్ లేవు. ఎప్పుడు తెరుస్తారో ఇప్పట్లో తెలీదు.

ఇలాంటి పరిస్థితుల్లో, OTT / ATT ల్లో రిలీజ్ కోసం మాత్రమే సినిమాలు ఇప్పుడు తీయాలి. Pay Per View పధ్ధతిలో కలెక్షన్స్ రాబట్టుకోవాలి.

ఇప్పుడు నేను ప్లాన్ చేస్తున్న సినిమాలు ఇదే పధ్ధతిలో చేస్తున్నాను.

కోపరేటివ్ ఫిల్మ్ మేకింగ్! 

కట్ చేస్తే -

చిన్నమొత్తంలోనయినా సరే పెట్టుబడి పెడుతూ, ఫీల్డులోకి రావాలనుకొనే ప్యాషనేట్ ఇన్వెస్టర్‌లకు, "ఇన్వెస్ట్ చేయాలనుకొనే ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు" కూడా ఇదే నా ఆహ్వానం. ఆసక్తి ఉన్నవాళ్ళు వాట్సాప్ ద్వారా నన్ను నేరుగా కాంటాక్టు చేయవచ్చు.

ట్రెండీ సినిమాలు, ఇన్‌స్టంట్ ఆదాయం. 

నో కాల్ షీట్స్. నో టైమింగ్స్. అంతా రెనగేడ్ ఫిల్మ్ మేకింగ్. గెరిల్లా ఫిల్మ్ మేకింగ్.

తక్కువ షూటింగ్ డేస్‌లో ఎక్కువగా పనిచేయడం. డైరెక్ట్‌గా ATT ప్లాట్‌ఫామ్‌లకు సినిమా రిలీజ్ చేయడం.

"కలిసి పనిచేద్దాం. కలిసి ఎదుగుదాం."

ఇదే మా కాన్సెప్ట్.

వాట్సాప్ నంబర్: +91 9989578125   

Sunday 12 July 2020

సినిమా ఇప్పుడు 'ఇండస్ట్రీ' కాదు!

యస్. ఇప్పుడు సినిమా ఫీల్డు పూర్తిగా మారిపోయింది. ఒక వ్యవస్థగా ఫిల్మ్ ఇండస్ట్రీ పరిధి తగ్గింది. క్రమంగా ఇంకా తగ్గుతుంది.
.
సినిమా అంటే 2 గంటలు, 3 గంటలు అనే రోజులు కూడా పోయాయి. అభివృధ్ధి చెందుతున్న దేశాల్లో ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ కూడా బాగా డబ్బు సంపాదిస్తాడు.

షార్ట్ ఫిల్మ్స్ తీయడం కూడా అంత చిన్న విషయమేం కాదక్కడ.

ఫీచర్ ఫిల్మ్స్ తో పాటు ప్రతి సినిమా ఫార్మాట్‌కు విలువ ఉంటుంది. సినిమా రిలీజ్ చేసుకోవడానికి, ఇక్కడిలా "మాకు థియేటర్స్ దొరకటం లేదు, ఇవ్వటం లేదు" అని ఎవ్వరూ మొత్తుకోరు.
.
ఎందుకంటే, అక్కడ దేన్నయినా "నెట్‌ఫ్లిక్స్" ,"వీమియో" వంటి OTTల్లో కూడా రిలీజ్ చేసుకోవచ్చు. డబ్బు సంపాదించుకోవచ్చు. ఈ డెవలప్‌మెంట్ అమెరికా, ఇంక అనేక అభివృధ్ధిచెందిన దేశాల్లో దాదాపు ఒక 20 ఏళ్ల ముందునుంచే ఉంది.

నెట్‌ఫ్లిక్స్ ఎప్పుడో 1997 లో వచ్చింది. వీమియో 2004 లోనే ఉంది. అమెజాన్ ప్రైమ్ 2005 నుంచి ఉంది. మనదగ్గర మాత్రం వీటి గురించి ఇప్పుడిప్పుడే అందరికీ తెలుస్తోంది.
.
ముఖ్యంగా ఎలాంటి ఖర్చులేకుండా సినిమాలు ఈ OTTల్లో రిలీజ్ చేసుకోవచ్చు అన్న విషయం మనం రియలైజ్ కావడానికి కరోనా లాక్‌డౌన్ రావాల్సి వచ్చింది!
.
స్టార్స్ భారీ సినిమాలు, ఏవైనా ఆడియో విజువల్ వండర్స్ తప్పిస్తే, ఇకనుంచి ఎక్కువ శాతం ప్రేక్షకులు OTT/ATT లకే ప్రాధాన్యం ఇస్తారు. లాక్‌డౌన్ నేపథ్యంలో... సగటు మనిషి జీవనశైలి, ఆలోచనా విధానం, జీవితం పట్ల అవగాహన ఇప్పుడు పూర్తిగా మారిపోతాయి. చాలా విషయాల్లో సమయానికి ప్రాధాన్యం ఇస్తారు.

సగటు మనిషే సగటు ప్రేక్షకుడు!
.
ఈ నేపథ్యంలో, ఆల్రెడీ సినీఫీల్డులో పనిచేస్తున్నవారికి కూడా అందరిలాగే, ఈ లాక్‌డౌన్ వరకు కష్టనష్టాలు తప్పవు. లాక్‌డౌన్ తర్వాత మాత్రం, ఇంతకుముందుకంటే అవకాశాలు చాలా రెట్లు పెరుగుతాయి. కొత్తగా లక్షలాదిమందికి ఉపాధి లభిస్తుంది.

క్రియేటర్స్‌కు ఆకాశమే హద్దు!

గ్లామర్, పేరు, డబ్బు... ఏదయినా.
.
సో, సినిమాఫీల్డు ఇప్పుడు ఇండస్ట్రీ కాదు. ఒక క్రియేటివ్ కార్పొరేట్ బిజినెస్. ఎవరైనా ఈ రంగాన్ని ఎన్నుకోవచ్చు. పనిచేయవచ్చు. తమలో ఉన్న ప్రతిభను బట్టి ఏ స్థాయికైనా ఎదగొచ్చు. 

Friday 10 July 2020

Welcome to My Website!

మొత్తానికి రెండురోజుల క్రితం అర్థరాత్రి అప్పటికప్పుడు ఒక నిర్ణయం తీసుకొని 'అనుకున్నది' ఇప్పటికి పూర్తి చేయగలిగాను.

ఎప్పటినుంచో అనుకుంటున్న నా వెబ్‌సైట్ ఇప్పుడు రెడీ అయింది. సైట్‌లో చిన్న చిన్న ట్వీకింగ్స్ ఏవైనా ఉంటే ఇవ్వాళ అడ్జస్ట్ చేస్తాను.

సంవత్సరాలు, నెలలు వేరేవాళ్లమీద నమ్మకం పెట్టుకొని చేయించలేనిది, జస్ట్ ఒక 48 గంటల్లో పూర్తిచేశాను. అది కూడా... రాసుకొంటూ, చదువుకొంటూ, మధ్యలో ఇతర పనులు చేసుకొంటూ... నాకున్న 101 టెన్షన్స్ మధ్య... లాక్‌డౌన్ డిప్రెషన్ నన్ను పూర్తిగా ఆవహించకముందే నేనీ పని పూర్తిచేయగలిగాను.

మన పని మనం చేసుకోవడంలో ఉన్న ఆనందమే వేరు.

కట్ చేస్తే -

నా వెబ్‌సైట్ ఒక Jack Ma 'అలీబాబా డాట్ కామ్' లాంటిది. అది ఎలక్ట్రానిక్, ఇతర ఎన్నో వస్తువుల తయారీకి సంబంధించిన భారీ క్యాటలాగయితే, ఇది పూర్తిగా క్రియేటివ్ సర్విసెస్‌కు సంబంధించిన క్యాటలాగ్.

రైటింగ్, ఫిల్మ్ మేకింగ్, కోచింగ్, ప్రమోషన్ వంటి విభాగాల్లో నేను అందించగలిగిన ప్రతి సర్విస్‌ను లిస్ట్ చేశాను. చూస్తే మీకే అర్థమవుతుంది. వాటిల్లో ఏ రైటింగ్ అసైన్‌మెంట్ అయినా సరే, దాని పరిమాణాన్ని బట్టి, 48 గంటల నుంచి 4 వారాల్లోగా ఖచ్చితంగా పూర్తిచేయటం జరుగుతుంది. అదే ఫిల్మ్ మేకింగ్‌కు సంబంధించింది అయితే, 27 రోజులనుంచి 90 రోజుల్లోగా పూర్తిచేయటం జరుగుతుంది.

క్వాలిటీ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ ఉండదు. నా ఫీజు విషయంలో కూడా. :)

సైట్‌లో లిస్ట్ చేసిన సర్విసెస్‌లో ఎక్కువభాగం నేను ముందు నుంచి చేస్తున్నవే అయినప్పటికీ, నా సర్విసెస్ పరిధిని విస్తరించడంలో భాగంగా ఇప్పుడీ వెబ్‌సైట్ నాకు తప్పనిసరి. 

వెబ్‌సైట్‌లో ఇచ్చిన ఒక్కో సర్విస్ గురించి తర్వాత వివరంగా రెండు బ్లాగ్ పోస్ట్‌లు రాస్తాను.

దాదాపు... వెబ్‌సైట్‌లో లిస్ట్ చేసిన క్రియేటివ్ సర్విసెస్ అన్ని విభాగాల్లోనూ నాకు అసిస్టెంట్స్, టీమ్ ఉన్నప్పటికీ... ప్రతి ఒక్క ఆర్డర్‌ను స్వయంగా నేనే డీల్ చేస్తాను. క్లయింట్స్ టైమ్ ఏమాత్రం వృధా కాకుండా నా వాట్సాప్ నంబర్, ఈమెయిల్ అడ్రస్ కాంటాక్ట్‌లో ఇచ్చాను. 

Please feel free to reach out to me. I look forward to a beautiful journey together.

ఇదీ నా వెబ్‌సైట్:

Thursday 9 July 2020

సీన్ మారిన సినిమా

థాంక్స్ టూ కరోనా... సినీ ఇండస్ట్రీలో దశాబ్దాలుగా పరిష్కారం లేకుండా, పరిష్కారం కాకుండా తొక్కిపెట్టిన ఒక సమస్య సంపూర్ణంగా పరిష్కరించబడింది.

అదే చిన్న బడ్జెట్ సినిమాల మీద చిన్న చూపు, ప్లస్ వాటి రిలీజ్ సమస్య.

కరోనా లాక్‌డౌన్ అనంతరం ప్రజల మానసికస్థితిని బట్టి, ఈ లాక్‌డౌన్ అనుభవం వారి ఆలోచనల్లో తెచ్చిన మార్పును బట్టి వారి జీవనశైలిలో ఊహించలేనంత మార్పు ఉండబోతోంది. సినిమాలు రెగ్యులర్‌గా చూసే ప్రేక్షకుల్లో ఈ మార్పు ఏ స్థాయిలో ఉంటుందన్నదాన్ని బట్టి రేపు థియేటర్స్ నిండుతాయి. కరోనాకు ముందులా హౌస్ ఫుల్స్ ఎలా ఉండబోతాయన్నది తెలియడానికి ఇంకా చాలా టైమ్ ఉంది.

అసలు థియేటర్స్ ఎప్పుడు తెరుస్తారు అన్నది ఇంకా తేలాల్సి ఉంది. అది వేరే విషయం.

అయితే, ఇకమీదట ఇదంతా భారీ బడ్జెట్ సినిమాల సమస్య మాత్రమే కాబోతోంది.

కట్ చేస్తే -

అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ వంటి OTT లకు తర్వాతి అడ్వాన్స్‌మెంట్‌గా ఇప్పుడు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఇప్పుడు ATT ఒకటి వచ్చింది.

ATT అంటే Any Time Theater.

ఇదొక స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్.

ఒక మల్టిప్లెక్స్‌లో లాగా దీన్లో చాలా ఆన్‌లైన్ థియేటర్స్ ఉంటాయి. వాటిల్లో ప్రతివారం, ప్రతిరోజూ, ఎప్పుడంటే అప్పుడు సినిమాలు రిలీజ్ చేసుకోవచ్చు. Pay Per View పధ్ధతిలో టికెట్‌కు రేట్ ఫిక్స్ చేసుకొని ప్రమోషన్ చేసుకోవచ్చు.

ప్రేక్షకులు ఆన్‌లైన్లో ఒకే ఒక్క టికెట్ కొనుక్కొని, 2 రోజులపాటు దాన్ని హోమ్ థియేటర్‌లో ఇంటిల్లిపాదీ కలిసి చూడొచ్చు. విడివిడిగా చూడొచ్చు. పక్కింటివాళ్లను, ఫ్రెండ్స్‌ను తెచ్చుకొని కూడా చూడొచ్చు.

ఎప్పుడంటే అప్పుడు చూడొచ్చు.

హోమ్ థియేటర్ లేనివాళ్లు డెస్క్‌టాపుల్లో, లాప్‌టాపుల్లో, టాబ్లెట్స్‌లో, చివరికి... స్మార్ట్ మొబైల్ ఫోన్స్‌లో కూడా చూడొచ్చు.

థియేటర్లో ఫ్యాన్స్ చేసే అల్లరి, పేపర్స్ విసిరేయటం తప్ప మిగిలిందంతా ఓకే.

హోం థియేటర్ ఉన్నవాళ్లకు దాదాపు సినిమా థియేటర్ ఎఫెక్టే ఉంటుంది. థియేటర్‌కు వెళ్లే ట్రాన్స్‌పోర్ట్ చార్జీలు, పార్కింగ్ సమస్య, ఇంటర్‌వెల్లో వందలకి వందలు పెట్టి కూల్‌డ్రింక్స్, పాప్‌కార్న్ వగైరా కొనే పనుండదు. జస్ట్ ఒక్క 100 రూపాయల్లో ఇంట్లోనే  కూర్చునో, పడుకొనో హాయిగా సినిమా చూడొచ్చు.

సినిమాను బట్టి ఈ టికెట్ రేట్‌లో హెచ్చుతగ్గులుండొచ్చు. అయితే, ఒక్క టికెట్ కొంటే దాన్ని మించిన క్యాష్‌బ్యాక్ కూపన్స్, ఇతర ఆఫర్స్ కూడా త్వరలో బోలెడన్ని ఉండబోతున్నాయి.   

ShreyasET పేరుతో శ్రేయాస్ మీడియా పరిచయం చేసిన ఈ ఏటీటీలో రిలీజైన మొదటి సినిమా ఆర్జీవీ CLIMAX.

ఈ సినిమా కొన్ని గంటల్లోనే కోటి డెభ్భై లక్షలు కలెక్ట్ చేసింది.

ఇప్పుడు ఇలాంటి ఏటీటీలు ఇంకో అరడజన్ రాబోతున్నాయి. చిన్న బడ్జెట్ నిర్మాతలకు, దర్శకులకు ఇందులో ఉన్నన్ని లాభాలకు లెక్కే లేదు.

అన్నిటికంటే ముఖ్యమైన లాభం ఏంటంటే - ఏటీటీలో తన సినిమా రిలీజ్ కోసం నిర్మాత దీన్లో రెంట్ కట్టే పనిలేదు. కంటెంట్‌లో ఏమాత్రం సత్తా ఉన్నా... పెట్టుబడి, దానికి కనీసం రెట్టింపయిన లాభం 100% పక్కా!

ఇంకేం కావాలి? 

Monday 6 July 2020

ఏది సెన్సేషన్ చెయ్యాలో ఏది చెయ్యకూడదో ఒక్క నిమిషం ఆలోచించాలి!

ఇందాకే ఒక కొత్త యూట్యూబ్ చానెల్లో ఓ చిన్న వీడియో చూశాను. ఆ 2.55 నిమిషాల వీడియోలో కనీసం ఒక డజన్ సార్లు "హైద్రాబాద్ భయానకం", "అత్యంత దారుణం", "కరోనా విళయతాండవం" వంటి పదాలతో లేని "భయానక-దారుణ-విళయతాండవం"ను క్రియేట్ చేసి, సెన్సేషన్ చేసే ప్రయత్నం జరిగింది.

అది కూడా ఎక్కడో హైద్రాబాద్‌కు కనీసం ఓ 600 కిలోమీట్ర్ల దూరంలో ఉండి!

మనదేశంలో కోటికిపైగా జనాభా ఉన్న అన్ని మెట్రోసిటీల్లో పరిస్థితి ఎలా ఉందో, హైద్రాబాద్‌లో కూడా అలాగే ఉంది. చెప్పాలంటే ఇంకా మెరుగ్గా ఉంది.

అలాగని ఈ వీడియో ఏ రాజకీయ ప్రయోజనాలకోసమో చేశారని నేను అనుకోను. ఏదో ఒకటి సెన్సేషనల్‌గా చెప్పాలన్న అత్యుత్సాహంతో చేసిన వీడియో ఇది. యూట్యూబ్‌లో చేసే అనేక చిల్లర వీడియోల్లాగా, ఇలాంటి న్యూస్ ఐటెమ్స్ గురించి చెప్పే వీడియోలను రూపొందించవద్దు. ఇలాంటి వీడియోలు ప్రజల మానసిక స్థైర్యం మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయన్నది ఒక్క నిమిషం ఆలోచించాలి.

ఇప్పుడున్న ఈ కరోనా విపత్తులో ఇలాంటి వీడియో తాండవాలు అసలు చెయ్యకూడదు. 

కట్ చేస్తే -

ఆర్జీవీ ఈ 3 నెలల్లో, ఇదే హైద్రాబాద్‌లో ఒక అరడజన్ సినిమాలను నిర్మించి, OTT ద్వారా వాటిలో కొన్ని రిలీజ్ చేసి, కోట్లు కొల్లగొట్టాడు. ఇంకో అరడజన్ సినిమాలను లైన్లో పెట్టాడు. ఇదే పధ్ధతిలో ఇంకొందరు డైరెక్టర్లు సినిమాలు రూపొందిస్తున్నారు. నా సినిమాలు కూడా త్వరలో ప్రారంభం కానున్నాయి.

కొత్తగా ఇంకో నాలుగు OTT లు కూడా రంగప్రవేశం చేయబోతున్నాయి. వాటిల్లో నా మిత్రుడు ఒకరిది కూడా ఉంది. ఇలాంటి ఫిల్మ్ ఇండస్ట్రీ న్యూస్‌నో, ఇంకేదో న్యూస్‌నో సెన్సేషన్ చేసి చెప్పడంలో కొంత అర్థం ఉంటుంది.

తగిన జాగ్రత్తలు చెబుతూ, ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన న్యూస్ విషయంలో, హైద్రాబాద్‌లో లేని విళయతాండవాన్ని సృష్టించి, ఏదో సెన్సేషన్ చెయ్యాలనే ప్రయత్నం చెయ్యడం మాత్రం మూర్ఖత్వం, అవివేకం, బాధ్యతారాహిత్యం కూడా.  

Friday 3 July 2020

2020, ఆ తర్వాత కూడా... ఇక అంతా ఓటీటీనే!

పీవీఆర్ లాంటి కొన్ని మల్టీప్లెక్స్‌లను ఆగస్ట్, సెప్టెంబర్‌లలో తెరిచే అవకాశం ఉందన్నట్టు వినిపిస్తోంది. అది నిజమే అయి, థియేటర్స్‌ను తెరిచే ఈ ప్రయోగం సక్సెస్ అయినప్పుడే అన్ని థియేటర్స్‌ను తెరిచే ధైర్యం చేస్తారు. అప్పటిదాకా థియేటర్స్ తెరిచే ప్రసక్తే లేదు.

2020 మొత్తంగా పోయినట్టే అని సినిమా ఇండస్ట్రీ ఫిక్స్ అయిపోయింది.

ప్రభుత్వం అనుమతి ఇచ్చినా, ఏ ఒక్క నిర్మాత కూడా ఇంతవరకు షూటింగ్ ప్రారంభించలేదు. కారణం... కరోనా.

టీమ్‌లో ఉండే ఏ ఒక్కరికి కరోనా పాజిటివ్ వచ్చినా మొత్తం కొంప కొల్లేరైపోతుంది. జరక్కూడని ప్రమాదం ఏ ఒక్క ఆర్టిస్టు, లేదా టెక్నీషియన్‌కు జరిగినా, ఆ నష్టం నిర్మాత భరించాల్సి వస్తుంది. ఇన్ని టెన్షన్ల మధ్య షూటింగ్ ఎందుకు అని ఎవ్వరూ షూటింగ్ జోలికి పోవటంలేదు.

2020 ని చాలామంది చాలారకాలుగా విజువలైజ్ చేశారు. కాని, ప్రపంచం అంతా ఇలా మూసుకొని కూర్చునేలా చేసిన ఈ కరోనావైరస్‌ను మాత్రం ఎవ్వరూ విజువలైజ్ చెయ్యలేకపోయారు!

కట్ చేస్తే -

కరోనావైరస్‌ను, లాక్‌డౌన్‌ను బాగా వాడుకొంటూ, సీరీస్ ఆఫ్ సినిమాలు తీస్తూ, కోట్లు కొల్లగొడుతున్న ఆర్జీవీ ఒక్కని విషయంలో మాత్రమే పైన చెప్పుకొన్న పరిస్థితులేవీ ఎలాంటి అడ్డంకులను సృష్టించలేకపోతున్నాయన్న విషయం మనం గమనించాలి.

"వందల కోట్లు పెట్టి తీసే పెద్ద సినిమాల విషయంలో OTT (Over The Top) లు అసలు వర్క్ఔట్ కావు... వాళ్లు థియేటర్స్ తెరిచేవరకు ఆగక తప్పదు" అంటున్నారు. కాని, మొన్ననే బిగ్‌బి అమితాబ్ సినిమా ఒకటి ఓటీటీలోనే రిలీజయ్యింది. రేపు అక్షయ్ కుమార్ సినిమా ఒకటి ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. ఇంకేం వర్క్ ఔట్ కావాలి?! ఆ విషయం అలా వదిలేద్దాం...

చిన్న బడ్జెట్ సినిమాల విషయంలో మాత్రం ఈ ఓటీటీలు బాగా పనిచేస్తాయి. బాగా వర్క్ ఔట్ అవుతాయి.

OTT లు కాస్తా ఇప్పుడు ATT (Any Time Theater) లయ్యాయి. Pay per View (PPV) పధ్ధతిలో చిన్న బడ్జెట్ సినిమాలన్నీ హాయిగా రిలీజ్ చేసుకోవచ్చు. శుక్ర, శని, ఆదివారాలు... అంటే కేవలం 3 రోజుల్లో సినిమా రిలీజ్ కావడం, మొత్తం లెక్కలు సెటిల్ చేసుకోవడం అయిపోతుంది. మార్కెట్ బాగా స్టడీ చేస్తూ, కరెక్ట్ కంటెంట్ తయారుచేయగలిగే ప్రతి ఒక్కరు ఈ ఓటీటీల్లో సినిమాలు రిలీజ్ చేసుకోవడం ద్వారా కోట్లు సంపాదించుకోవచ్చు.

అసలు బడ్జెట్ లేకుండా తీసిన "నేకెడ్" 80 లక్షలు కలెక్ట్ చేసింది. అంతకు ముందు "క్లైమాక్స్" కేవలం కొన్ని గంటల్లో కోటీ డెభ్భై లక్షలు కలెక్ట్ చేసింది.

That's RGV Vision! 

కట్ చేస్తే -

ఇప్పుడు ఫీల్డులో ఉన్న ఓటీటీలతోపాటు ఇంకో అరడజన్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కొత్తగా మార్కెట్‌లోకి వస్తున్నాయి. ఎన్ని సినిమాలు తయారయినా, రిలీజ్‌కు ఎలాంటి సమస్య ఉండదు. ఎవ్వరూ ఆపలేరు. ఎలాంటి పబ్లిసిటీ ఖర్చులు, రిలీజ్ ఖర్చులు ఉండవు.

ఈ నేపథ్యంలో, ప్యూర్‌లీ ఒక బిజినెస్‌గా, సీరీస్ ఆఫ్ మైక్రో బడ్జెట్ సినిమాలను ఇప్పుడు నేను రూపొందించేపనిలో నా టీమ్‌తో బిజీగా ఉన్నాను. ఈ ఓటీటీ టైమ్స్‌లో ఎంతయినా సంపాదించుకొనే అవకాశం బాగా ఉంది.

Content is the king! 

ఆసక్తి ఉన్న లైక్‌మైండెడ్ ఇన్వెస్టర్స్ నన్ను కాంటాక్ట్ చేయవచ్చు.

కలిసి పనిచేద్దాం. కలిసి ఎదుగుదాం.

Ping me on my WhatsApp: +91 9989578125