Friday 24 July 2020

ఎవరిష్టం వారిది. ఎవరి రూట్ వారిది.

లాక్‌డౌన్ సమయంలో మొత్తం మూసేసుకొని కూర్చొన్న సినీఫీల్డులో, వేలాదిమంది డెయిలీ వేజెస్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లు చాలా కష్టాలు పడుతున్నారు.

వీళ్ళే కాకుండా, సినిమా ఫీల్డుతో అనుబంధం ఉండి, ఇంకేవేవో చిన్న చిన్న యాడ్స్, పీస్ వర్క్‌లు, ఘోస్ట్ రైటింగ్ లాంటి పనులు చేసుకొంటూ బ్రతికే ఇంకెందరో చెప్పుకోలేనివాళ్లు పడుతున్న కష్టాలకు కూడా అంతులేదు.

ఇలాంటి సమయంలో... ఇంట్లో కూర్చొని వంటపనులు ఇంటి పనులు చేసుకొంటూ ఆ క్లిప్స్ సోషల్ మీడియాలో పెట్టడం లాంటివి చేయకుండా, ఆర్జీవీ ఒక కొత్త బిజినెస్‌కు శ్రీకారం చుట్టాడు.

అప్పటిదాకా రంగంలో ఉన్న OTT ప్లాట్‌ఫామ్‌లకు, Pay Per View అనే చిన్న ట్విస్ట్ ఇవ్వడం ద్వారా సినీ ఫీల్డులో ఒక కొత్త వ్యాపారమార్గాన్ని క్రియేట్ చేశాడు ఆర్జీవీ.

అదే ఇప్పుడు ATT గా ఓ చిన్న స్థాయి సంచలనం సృష్టిస్తోంది.

తను క్రియేట్ చేసిన ఈ కొత్త మార్గంలో ఇప్పటికే 2 సినిమాలు రిలీజ్ చేసి కొన్ని గంటల్లో కోట్లు, లక్షలు సంపాదించాడు ఆర్జీవీ. ఇంకో 3 సినిమాలు వరుసగా రిలీజ్ చేస్తున్నాడు.

ఒక అద్భుతమైన బిజినెస్ మాడల్‌గా ఇక్కడివరకు ఇది ఓకే...

నిజంగా చెప్పుకోదగ్గ విజయం కూడా.

ఈ బిజినెస్ మాడల్‌ను అనుసరించి, ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక 20 పైనే సినిమాలు తయరవుతున్నాయి. నాకు తెలిసి ఇంకో అరడజన్ ATT లు కొత్తగా రెడీ అవుతున్నాయి.

సినిమా మీదనే ఆధారపడ్డ వందలాదిమందికి ఇప్పుడు పని దొరికింది. థియేటర్స్ ఇప్పట్లో ఓపెన్ అయ్యే పరిస్థితి లేదు కాబట్టి, ఇది ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఇంకెందరికో చేతినిండా పని దొరుకుతుంది.

థియేటర్స్ ఓపెన్ అయిన తర్వాత కూడా, ఇంకా పెరుగుతుందే తప్ప, ఏ మాత్రం తగ్గిపోని బిజినెస్ మాడల్ ఇది.

ఇక్కడివరకు కూడా డబల్ ఓకే...

ఈ బిజినెస్ మాడల్‌ను ఎవరికి అనుకూలంగా వారు వాడుకొంటూ సూపర్‌గా ముందుకెళ్లవచ్చు.

కాని... ఒక ఎఫెక్ట్ కోసమో, వ్యక్తిగత ఇంట్రెస్టుతోనో, ఆర్జీవీ తీస్తున్నటువంటి సినిమాలనే  అందరూ తీయాలని రూలేం లేదు... ఆఫీసులపై దాడులు చేయించుకోనవసరంలేదు.

ఎవరిష్టం వారిది. ఎవరి రూట్ వారిది.

అంతే.