Wednesday 22 July 2020

చిన్నారి పొన్నారి కిట్టయ్యా...

నిప్పులేందే పొగరాదంటారు. మరి ఆ డైరెక్టర్‌ను పవర్ స్టార్ ఎందుకు కొట్టాడు? సందర్భం కరెక్టుగా ఏమై ఉంటుంది? అదెంతవరకు కరెక్టు? అయినా ఇప్పటికీ వాళ్లిద్దరూ బాగానే ఉన్నారే...

ఇవ్వాళ ఆర్జీవీ రిలీజ్ చేసిన (లీక్ చేసిన కాదు) ట్రైలర్ చూసింతర్వాత నాకొచ్చిన సందేహాలివన్నీ.

మంచి సాహితీ పరిజ్ఞానం, భాషా పటిమ, వాక్ధాటి వంటివి పుష్కలంగా ఉన్న ఆ డైరెక్టర్ విషయంలో అలా జరిగి ఉండకూడదని నేను అనుకుంటున్నాను. కాని, అలాంటిది ఏం లేకుండానే, వర్మ పనిగట్టుకొని ఆ క్యారెక్టర్ని క్రియేట్ చేసి,  అతన్ని ఎందుకు అలాంటి సీన్లో ఇరికిస్తాడు?

మిత్రులెవరికైనా నిజంగా ఏదైనా తెలిస్తే చెప్తారని ఉదయం నుంచి చూస్తున్నాను. బట్ నో.

కట్ చేస్తే -

గతంలో ఇలాంటి పొలిటికల్ సెటైర్లు కొన్ని సినిమాలుగా వచ్చాయని లీలగా గుర్తుంది. కాని, మరీ ఇంత ఓపెన్‌గా, (దాదాపు) డైరెక్టుగా ఇలా సినిమాలు తీయడం నాకు తెలిసి నేనిప్పుడే చూడటం.

మొన్నీమధ్య నేను రాసిన ఒకటిరెండు పోస్టులు చూసి అందరూ నన్ను అడుగుతున్నారు. వాళ్లందరికోసం నేనీ రెండు లైన్లు రాస్తున్నాను:

ఆర్జీవీ నా ఫ్రెండ్ కాదు, నాకు చుట్టం కాదు. అతనిలో నాకు నచ్చిన కొన్ని అంశాలు నేనిప్పటికీ ఇష్టపడతాను. అంతవరకే.

ఒక క్రియేటివ్ పర్సన్‌గా ఎవ్వరైనా ఏదైనా చేసుకునే ఫ్రీడమ్ మనదేశంలో ఉంది. అలాగని, ఒక వ్యక్తి వ్యక్తిగత జీవితంలోకి చొచ్చుకుపోయి మరీ ఇలా సినిమాల ద్వారా ఏదో చేయటం/చేయాలనుకోవటం ఖచ్చితంగా కరెక్టు కాదనే నా వ్యక్తిగత అభిప్రాయం.

ఇప్పుడు అటువైపువాళ్లు "పరాన్న జీవి" తీస్తున్నారు! వర్మ మీద ఇంకో 3 సినిమాలు కూడా తీస్తున్నారట అని ఏబీఎన్‌లో వెంకటకృష్ణ చెప్తుంటే ఇందాకే విన్నాను. 

ఇదిలాగే కొనసాగి, చివరికి ఈ టైపు సినిమాల ట్రాక్ ఒకటి ప్యారలల్‌గా నడిచేరోజు కూడా రావచ్చు. ఇప్పుడు చేతిలో కొన్ని లక్షలుంటే చాలు, ఎవరైనా ఎలాంటి సినిమా అయినా తీయవచ్చు. సో, ఇది పెద్ద కష్టం కాదు. ప్రతి గల్లీ లీడర్ పైన, అతనంటే పడని ఇంకో వ్యక్తి సినిమా తీయొచ్చు. ఆన్‌లైన్లో రిలీజ్ చేయొచ్చు.

ఈ మొత్తం ఎపిసోడ్‌లో ఎవరైనా అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఒక్కటే. పరోక్షంగా ఒక ఫండర్ ఎవరైనా అలాంటి ఆఫర్ ఇవ్వటం వల్లనే ఆర్జీవీ ఇలాంటి సినిమాలు తీస్తున్నాడా, లేదంటే ఈ రేంజ్‌లో ఆర్జీవీ రియాక్ట్ అయ్యేంత క్లాష్ వాళ్లిద్దరిమధ్య ఏదన్నా జరిగిందా?

ఏదో ఉంది మొత్తానికి...