Monday 31 March 2014

శ్రీజయ నామ సంవత్సర పంచాంగ శ్రవణమ్!

హాఫ్‌వే ఎటాక్.
అంటే, డైరెక్టుగా పాయింట్‌లోకే అన్నమాట ..

రాజకీయరంగం:

కేంద్రంలో బీజేపి అలయెన్స్ ప్రభుత్వం వస్తుంది. నరేంద్ర మోడీ ప్రధాని అవుతారు. సీమాంధ్రలో బాబు స్వీప్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. తెలంగాణలో టీఆరెస్ ప్రభుత్వం వస్తుంది. ముఖ్యమంత్రి: నో డౌట్.. కె సి ఆర్!

మొత్తం మీద గత అయిదేళ్లతో పోలిస్తే - రాజకీయ నాయకులనుంచి, ప్రభుత్వాలనుంచీ ప్రజలకు మెరుగయిన సేవలు అందుతాయి. ఏం చేస్తే పేరొస్తుందో, ఏం చేస్తే ఉన్న పేరు ఊడ్చిపెట్టుకుపోతుందో ఇప్పుడు రాజకీయనాయకులకు, పార్టీలకు బాగా తెలిసిపోయింది కాబట్టే.. ఈ మార్పు!

పోతే, ఏ మాత్రం స్పష్టత లేకుండా, "డ్రెస్ రిహార్సల్స్"లా వచ్చిన చిన్నా చితకా పార్టీలు .. ఎలా వచ్చాయో అలాగే కనుమరుగయిపోతాయి.

ఆర్థిక రంగం:

మోడీ ప్రధాని అవుతాడన్న సర్వేలతో, ఆ తర్వాత ఆయన ప్రధాని అయ్యాక కూడా .. స్టాక్ మార్కెట్లో బుల్స్, బేర్స్ రెట్టించిన ఊపుతో ముందుకు దూసుకెళ్తుంటాయి. ఇండెక్స్ ఊహించని విధంగా పైపైకే వెళ్తుంటుంది.

అంతర్జాతీయ విఫణిలో మన రూపాయి విలువ ఊహించనంతగా పెరుగుతుంది. ఇంటర్‌నేషనల్ ట్రేడింగ్‌లో మనవాళ్లకు అడ్డూ అదుపూ ఉండదు. డబ్బే డబ్బు. డాలర్లే డాలర్లు.

క్రికెట్ రంగం: 

ధోనీ సేన ఈ సంవత్సరం కనీసం రెండు కప్పులు గెల్చుకుంటుంది. మధ్యమధ్యలో చతికిలపడటం మామూలే. అప్పుడప్పుడూ, లాస్ట్ బంతివరకూ గుండె ఆగిపోయేంత టెన్షన్ పెట్టడం కూడా మామూలే. మన టీమ్‌కి అదొక హాబీ. ఆ హాబీ ఈ సంవత్సరం కూడా అలాగే కంటిన్యూ అవుతుంది.

బెట్టింగులు ఊహిచనివిధంగా పెరిగిపోతాయి. మన రెగ్యులర్ పేకాట క్లబ్బులు, రేస్ కోర్సులు దాదాపు మూతపడే పరిస్థితికి వస్తాయి.

అన్నట్టు ఈ బెట్టింగ్ మహమ్మారి ఒక్క క్రికెట్టుకే పరిమితం కాకుండా - రాజకీయాలకు, కోడిపందాలకు, బైకు/కార్ రేసులకూ, ఎవరికి మినిస్ట్రీ వస్తుంది అన్నదానికీ, చివరికి.. ఏ హీరోయిన్‌కు ఎవరితో లింకు ఉందీ, ఆ లింకు ఉంటుందా ఊడుతుందా అన్నంతవరకూ విస్తరిస్తుంది.

సినిమా రంగం: 

తన మాగ్నమ్ ఓపస్ "బాహుబలి" చిత్రాన్ని జక్కన్న ఇంకా అద్భుతంగా చెక్కుతూనే ఉంటారు. మరోవైపు - రాజకీయ కారణాలవల్ల తెలుగు చిత్ర పరిశ్రమ రెండు ముక్కలయిపోయినా, వ్యవహారంలో పెద్దగా తేడా ఏమీ ఉండదు. అవే లాబీలు, అవే నెట్‌వర్క్‌లు, అవే థియేటర్లు, అవే లీజులు, ఆ మీడియేటర్లే ఉంటారు అంతటా. ఒక్క టాక్సులు మాత్రం తెలంగాణవి తెలంగాణలో, సీమాంధ్రవి సీమాంధ్రలో ముడుతుంటాయి.

థియేటర్‌కు వెళ్లి సినిమా చూసే ప్రేక్షకుల సంఖ్య మాత్రం మరింతగా పడిపోతుంది. డైరెక్ట్ టూ హోం (డి టి హెచ్) పుంజుకుంటుంది. పైరసీలు, టారెంట్లు.. షరా మామూలే.

సోషల్ నెట్‌వర్కింగ్:

ఫేస్‌బుక్ కొద్దిగా స్లో అవుతుంది. వాట్సాప్ మాత్రం వీర లెవెల్లో పాప్యులర్ అవుతుంది. "రౌడీ" సంచలనం తర్వాత.. ఆర్‌జీవి ట్వీట్‌ల జోరు ఇంకా పెరుగుతుంది. సెలెబ్రిటీలు, రాజకీయనాయకుల ట్వీట్స్ ఎప్పటికప్పుడు టీవీ చానెల్స్‌లో "బ్రేకింగ్ న్యూస్"లవుతుంటాయి.

కనుమరుగయిపోయిన కుటుంబ సంబంధాలు, స్నేహ సంబంధాలన్నీ.. కనీసం ఈ సొషల్ నెట్‌వర్కింగ్ సైట్స్ పుణ్యమా అని.. కొద్దికొద్దిగా మెరుగవుతాయి. అసలు జీవితం అంటే ఏమిటో రియలైజ్ అయ్యే పరిస్థితుల్ని సృష్టిస్తాయి. ఇదొక శుభపరిణామం.  

మనోహర్ చిమ్మని జాతకం:

జయ నామ సంవత్సరం మనోహర్‌కు మంచి ఫలితాలనిస్తుంది. తన రెగ్యులర్ ఉద్యోగసద్యోగాలు తాను చేసుకొంటూనే - లో/నో బడ్జెట్ సినిమాల మేకింగ్ మీద ఇప్పటిదాకా ఆయన చేసిన రిసెర్చ్ ఆధారంగా - అంతా కొత్తవారితో కనీసం ఓ నాలుగు సినిమాలు తీస్తాడు. వాటిల్లో కనీసం ఒక్కటి సూపర్ డూపర్ హిట్ అవుతుంది.

తర్వాత వచ్చే అవకాశాల్నీ, ఆఫర్స్‌నీ కావల్సినంత క్యాష్ చేసుకొంటూ.. తన ఇన్వెస్టర్స్‌కు కూడా మంచి లాభాల్ని సమకూర్చిపెడతాడు.

అనంతరం ఫీల్డుకి దూరంగా, హైదరాబాద్ జనారణ్యానికి దూరంగా.. ఎక్కడో ఓ మాంచి సముద్రతీరం ఉన్నచోట తన జీవిత అంతిమ గమ్యమైన ఆధునిక ఆధ్యాత్మిక జీవితాన్ని ఆరంభిస్తాడు!

కట్ టూ "ఆల్ ఈజ్ వెల్" - 

ఇప్పటిదాకా మీరు చదివిందంతా "పాజిటివ్ ఆస్ట్రాలజీ" అనబడే "ఆల్ ఈజ్ వెల్ ఆస్ట్రాలజీ" అన్నమాట! సరదాగా ఇలా రాయాలనిపించి రాశాను. ఈ జయ నామ సంవత్సరంలో - నాతోపాటు అందరికీ, అన్ని విషయాల్లో మంచి జరగాలన్నదే నా అభిలాష.

సర్వేజనాస్సుఖినో భవంతు!  

Sunday 30 March 2014

నేను మోహన్ బాబుని హేట్ చేస్తాను!

ఇది నా మాట కాదు. "రౌడీ" సినిమా ఆడియో ఫంక్షన్లో రామ్‌గోపాల్ వర్మ మాట్లాడిన మొదటి వాక్యం ఇది..

ఆడియన్స్‌లో కూర్చున్న అందరూ షాక్!

ఎదురుగా ఆడియెన్స్‌లోనే కూర్చున్న మోహన్ బాబు తన కుర్చీలో కొంచెం ఎలెర్ట్ అయినట్టుగా కదిలారు. తర్వాతేదో "విషయం" చెప్పబోతున్నాడు వర్మ నా గురించి.. అన్న భావం ఆయన ముఖంలో.

మోహన్ బాబు ముఖంలో చిరునవ్వు సైజు కాస్త పెరిగింది.

రాత్రి దేని గురించో యూట్యూబ్‌లో నేను వెదుకుతోంటే, మధ్యలో, "రౌడీ" ఆడియోఫంక్షన్లో వర్మ స్పీచ్ కనిపించి ప్లే చేశాను. అదీ విషయం.

కట్ టూ మన పాయింట్ - 

వర్మ మోహన్ బాబుని అంతగా హేట్ చేయాల్సినంత ఘోరం ఏం చేశాడు?.. అసలు ఏం జరిగింది?.. అన్న ఆసక్తి అందర్లోనూ సహజంగానే కలుగుతుంది. అలా కలగచేయగల టెక్నిక్ వర్మకు వెన్నతో పెట్టిన విద్య అని నేను ప్రత్యేకంగా ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను.

వర్మ ట్వీట్లు కానివ్వండి.. ఇంటర్వ్యూలు కానివ్వండి.. అన్నీ ఇలాగే క్యాచీగా, ఎవ్వరూ ఊహించనివిధంగా "అప్‌సైడ్ డౌన్"గా ఉంటాయి.

రొటీన్ సొద అసలు ఉండదు.

నిజానికి ఇలా మాట్లాడ్డానికి గట్స్ అవసరం లేదు. నిజాయితీ కావాలి. దీనికి కొంత మేనిప్యులేషన్ ఫ్లేవర్ కూడా అవసరం అనుకోండి. అది వేరే విషయం.

ముఖ్యంగా, తను అనుకున్నది చెప్పగల/చేయగల సత్తా ఉండాలి. అలాంటి సత్తాని సంపాదించుకోడానికి కావల్సింది ఒక్కటే. ఫ్రీడమ్.

ఆ ఫ్రీడమ్‌ను సంపాదించుకున్నాడు కాబట్టే వర్మ వర్మ అయ్యాడు. తనకంటూ ఒక బ్రాండ్‌ని క్రియేట్ చేసుకున్నాడు.

ఇది అందరివల్లా అయ్యే పని కాదు. ఎందుకంటే - అందరికీ.. అవ్వా, బువ్వా రెండూ కావాలి!

అది అవ్వో, బువ్వో తెలీదుగాని.. ఆ రెంటిలో వర్మ ఎంచుకున్నది మాత్రం ఒక్కటే.

సినిమా!

పాయింట్ అర్థమయ్యిందనుకుంటాను. అందుకే వర్మ అంటే నాకు పిచ్చి జెలసీ..  

Saturday 29 March 2014

2015 నుంచి అందరికీ ఇంటర్‌నెట్ ఫ్రీ!

ఇప్పటిదాకా ప్రపంచాన్ని దాదాపు తల్లకిందులుగా చేసి, మనిషి జీవితాన్ని వివిధరకాలుగా, అత్యధికంగా ప్రభావితం చేస్తున్న పదం ఒక్కటే.

ఇంటర్‌నెట్ ..

అయితే, ఇంక ఒకే ఒక్క సంవత్సరంలో ఈ ఇంటర్‌నెట్ కాస్తా "అవుటర్‌నెట్" కాబోతోంది.

మీడియా డెవెలప్‌మెంట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (ఎం డి ఐ ఎఫ్) అనే సంస్థకు చెందిన ఐటి స్పెషలిస్టులు ఓ కొత్త ప్రాజెక్టుని డెవెలప్ చేశారు. దీని ద్వారా ఎవరయినా, ప్రపంచంలోని ఏ మూలనున్నవారయినా, అతి సులభంగా ఇంటర్‌నెట్‌కు కనెక్ట్ అయిపోవచ్చు.

అదీ పూర్తి ఉచితంగా!  

"అవుటర్‌నెట్"గా నామకరణం చేసిన ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి "క్యూబ్‌స్టాట్స్" అనే యంత్ర పరికరాల్ని చాలా పెద్ద సంఖ్యలో భూ కక్ష్యలోకి ప్రవేశపెడతారు. ఇప్పటి ఇంటర్‌నెట్ చేస్తున్న "సమాచారాన్ని అందుకోవడం, చేరవేయడం" అనే పని మొత్తాన్ని భూ కక్ష్యలో తిరిగే ఈ డివైజ్‌లే చూసుకొంటాయి ఇకమీదట.

ఒక విధంగా చెప్పాలంటే - అవుటర్‌నెట్ అనేది ఈ భూమ్మీదున్న అన్ని ఖండాలనూ కలిపే ఓ అతి పెద్ద "వై-ఫై రౌటర్" అన్నమాట!

కట్ టూ క్లయిమాక్స్ - 

ఎం డి ఐ ఎఫ్ చెప్తున్నదాని ప్రకారం.. అవుటర్‌నెట్‌లో ఎలాంటి సెన్సార్‌షిప్ సాధ్యం కాదు.

అంటే, ఇప్పుడు కొన్ని దేశాల్లో,కొన్ని సంస్థల్లో, కొన్ని వెబ్‌సైట్లను నిరోధిస్తున్నట్లుగా ఇకమీదట నిరోధించడం అస్సలు కుదరదు.

మరోవైపు, యూజర్స్‌కి సంబంధించిన సమాచారం విషయంలో మాత్రం కావల్సినంత ప్రైవసీని ఇస్తుంది అవుటర్‌నెట్.

ఇంకేం కావాలి?  

Thursday 27 March 2014

"పవనిజం" అడిగే మొట్టమొదటి ప్రశ్న!

ప్లేటో, అరిస్టాటిల్.. మార్క్స్, మావో.. చెగువేరా.. పావ్‌లో కోయెల్యూ, ఎక్‌హర్ట్ టోలి..

ఇంక ఇప్పుడు.. మన పవన్ కళ్యాణ్!

తప్పేంలేదు. ఇది నిజంగా స్వాగతించాల్సిన విషయం. ఇంత మంచి సాహిత్యాన్ని, తత్వాల్ని, సిధ్ధాంతాల్నీ చదివే అలవాటు.. పుస్తకాలు రాసే అలవాటు ఉండటం అనేది చాలా గొప్ప విషయం.

అదీ మాంచి పీక్ పొజిషన్లో ఉన్న ఒక కమర్షియల్ హీరో విషయంలో అంటే - ఇంకా ఇంకా ప్రశంసించదగ్గ విషయం అని నా వ్యక్తిగత ఉద్దేశ్యం.

ఇంతమంచి ఆలోచన, అలవాట్లు ఉన్న హీరో పవన్ కళ్యాణ్.. అవినీతికి తప్ప ఎందుకూ పనికిరాని "మన బ్రాండు" రాజకీయాల్లోకి రావడం అనేది చాలా చాలా తప్పు నిర్ణయం అని నేను మళ్లీ అనడానికి సందేహించలేకపోతున్నాను.

ఎట్‌లీస్ట్.. ఇప్పుడు ప్రొఫెషనల్‌గా తనున్న పీక్ స్టేజ్‌లో.. ఇది నిజంగా అంత సరైన నిర్ణయమయితే కాదు.

ఒక్క ముక్కలో చెప్పాలంటే - పవన్ చెప్తున్నంత/ఆశిస్తున్నంత సీను మన దేశ రాజకీయాల్లో లేదు. ఇప్పట్లో రాదు.

అలాగని, ఇదేదో పెస్సిమిజమ్‌తో అంటున్నది కాదు. ఒక లేయర్ లేయర్ లేచి పోవాలి. ఒక ఉప్పెనలా అంతా అలా తుడిచిపెట్టుకుపోవాలి.

దానికే ఈ జనసేన తొలి అడుగు అనుకోవచ్చుగా?.. అని మీరు అనొచ్చు.

మన ఊహల్లోని యుటోపియా వేరు. మన కళ్లముందు కనిపిస్తున్న నిజం వేరు.

నిజమే. ఎవరో ఒకరు పూనుకోవాలి. తప్పదు.

కానీ.. ప్రశ్నించడం మానేసి, ప్రశంసించడమే తప్పు. నువ్వు విమర్శించిన అదే పాత మురికితో చేతులు కలపడం తప్పు. అలా కలపడం ద్వారా ఇంకేదో కొత్త "ఇజం" తెస్తానని కలలు కనడం ఇంకా పెద్ద తప్పు. ఒక భ్రమ.

మిగిలిన స్టార్‌లకు, స్టూడియో అధిపతులకు, రియల్ దందాలో బాగా సంపాదించుకుని పెట్టుకున్నవారికి .. అవసరాలుంటాయి. వ్యక్తిగత ఎజెండాలుంటాయి. ఆ అవసరం పవన్‌కు లేదనే నా ఉద్దేశ్యం.

పోటీ చేయడం కూడా ముఖ్యం కాదు. అధికార దాహం లేదు. కుళ్లిపోయిన ఈ రాజకీయాల్ని, వాళ్లు చేస్తున్న తప్పులను ప్రశ్నించడం కోసమే జనసేన అన్నప్పుడు.. మరి ఆ కుళ్లుతోనే కలవడాలెందుకు? కరచాలనాలెందుకు? పొత్తులెందుకు? ప్రశంసలెందుకు? ..

ఏమైనప్పటికీ, పవన్ కళ్యాణ్ తన "ఇజం" పుస్తకం రాయడాన్ని, ఆవిష్కరించడాన్ని మాత్రం ఎవరయినా ఆహ్వానించాల్సిందే. అభినందించాల్సిందే.

ఎందుకంటే - ఒక పుస్తకం రాయడం, దాన్ని పబ్లిష్ చేయడం అనేది చెప్పినంత సులభం కాదు. ఆ పని పవన్ చేశాడు. అందుకు అభినందిద్దాం.

కట్ టూ మన "కొశ్చన్ మార్క్" - 

పవన్ అభిమానుల్లో నిజంగా ఎంతమందికి ఈ "ఇజం" అర్థమవుతుంది?  అదే మిలియన్ డాలర్ కొశ్చన్ .. 

Friday 21 March 2014

సెటైర్, సెక్స్, హ్యూమర్ = కుష్వంత్ సింగ్!

నాకు బాగా నచ్చిన అతికొద్దిమంది ఇండియన్ ఇంగ్లిష్ రైటర్స్‌లో కుష్వంత్ సింగ్ ఒకరు.

సెటైర్, సెక్స్, హ్యూమర్.. ఇవే ఆయన ప్రత్యేకతలు. ఆయుధాలు.

వీటిచుట్టూ ఆయన రచనలు రూపుదాల్చుకుంటాయో, లేదంటే, ఆయన రచనల్లోకి ఇవే ఇష్టపూర్తిగా చొచ్చుకువస్తాయో తెలియదు. మొత్తానికి ఆయన రచనలకు, ఆయన శైలికి అలవాటుపడిన పాఠకులకు మాత్రం పండగే!

ఆయనకు ఎంతో పేరు తెచ్చిన అతి సీరియస్ సబ్జెక్ట్ "ట్రైన్ టూ పాకిస్తాన్" నవలలో కూడా సెక్స్‌ని టచ్ చేయకుండా వదల్లేదాయన!

నవలా రచయిత, జర్నలిస్టు, సర్దారీ జోకుల సామ్రాట్టు, దౌత్యవేత్త, ఇందిరాగాంధీకి అత్యంత సన్నిహితుడు.. కుష్వంత్ సింగ్ ఇక లేరు. అయితే, చనిపోయే చివరి క్షణం వరకూ మానసికంగా, శారీరకంగా చాలా ఆరోగ్యంగా ఉన్నారాయన. చివరి క్షణం వరకూ జీవితాన్ని మస్త్‌గా జీవించారాయన.

అదీ ఆయన జీవనశైలి ప్రత్యేకత.

కుష్వంత్ సింగ్ రాసిన జోకుల స్థాయిని బట్టి, ఆయన వేసిన సెటైర్ల లెవెల్‌ను బట్టి.. "ది డర్టీ ఓల్డ్ మేన్ ఆఫ్ ఇండియన్ జర్నలిజం" అన్న టాగ్‌ని తగిలించేశారాయనకు.

ఆయన రచనల్లో ఆర్టికిల్స్/కాలమ్‌స్ ఎక్కువగా చదివాను. ట్రైన్ టూ పాకిస్తాన్, ట్రూత్ లవ్ అండ్ ఎ లిటిల్ మాలిస్ చదివాను. కుష్వంత్ సింగ్ జోక్స్ సీరీస్‌లో వచ్చిన పుస్తకాల్లో మాత్రం దాదాపు చాలావరకు చదివాను.

ఆయన చివరి రోజుల్లో రాసిన "కుష్వంత్ నామా" ఒక్కటి మాత్రం ఇంకా చదవాల్సి ఉంది.

మర్చిపోయాను.. తన జీవితంలో, తనకు అత్యంత దగ్గరగా పరిచయం ఉన్న స్త్రీలందరిమీద కూడా ఒక పుస్తకం రాసిన ఘనత ఆయనకుంది!    

మరో ఏడాదిలో నిండు నూరేళ్లు పూర్తిచేసుకోవాలని అనుకున్న కుష్వంత్ సింగ్.. 99 ఏళ్ల వయస్సులోనే అప్పుడే ఏదో గుర్తుకువచ్చినట్టు  అనవసరంగా తొందరపడ్డారనిపిస్తోంది నాకు.

అయినా నో ప్రాబ్లమ్..

ఎలాంటి హిపోక్రసీ, ఇన్‌హిబిషన్లు లేకుండా జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించిన భారతీయ రచయిత నా దృష్టిలో ఆయనొక్కరే.

ఆర్ ఐ పి, కుష్వంత్ జీ! ఇంక అక్కడ చూసుకోండి..  

Tuesday 18 March 2014

ది పవర్ ఆఫ్ పాలిటిక్స్!

నేనెప్పుడూ నా బ్లాగ్‌లో రాసే ప్రతి అంశాన్నీ సాధ్యమైనంత లైటర్‌వీన్‌లోనే రాస్తాను. ఎక్కువ హిట్స్ సినిమాలకు సంబంధించిన పోస్టులకే పడతాయి. వాటిల్లోనూ - ఏ అనుష్కమీదో, దీపికా పడుకొనే మీదో ఓ పోస్టు రాశానంటే ఆ రోజు 1000 హిట్స్ తప్పవు!

కానీ, మొదటిసారిగా, గత 48 గంటల్లో ఒక విచిత్రం జరిగింది..

నోవాటెల్‌లో జరిగిన జన సేన ఆవిర్భావ సభ, ఆ సభలో పవన్ కళ్యాణ్ 2 గంటల సినిమాటిక్ స్పీచ్.. చెప్పాలంటే ఒక యాంగిల్లో సుపర్బ్! ఒక సినిమా టెక్నీషియన్‌గా పవన్‌కు నూటికి నూరు మార్కులు వేస్తాను. ఎవరయినా సరే వేసి తీరాలి.

కానీ, అది మన దేశ రాజకీయ దశ, దిశల్ని మార్చే ధ్యేయంతో ఏర్పాటవుతున్న ఒక కొంగొత్త రాజకీయ పార్టీ పుట్టుకకు సంబంధించిన విషయం కాబట్టి.. కొంచెం సీరియస్‌గా తీసుకోవాల్సివచ్చింది.

దానిమీద నేను రాద్దామనుకున్న బ్లాగ్ పోస్ట్ గురించి అప్పటికప్పుడే ట్వీట్ చేశాను కూడా. అయినా.. ఒక 24 గంటలదాకా ఏం రాయలేదు నేను.

"వదిలేద్దాం.. మనకి ఇంట్రెస్టు లేని సబ్జెక్టుపైన ఎందుకు అనవసరంగా.." అనుకున్నాను.

కానీ, చివరికి రాయాలనే అనిపించింది. రాయకపోవడం తప్పనిపించింది. రాసేసి పోస్ట్ చేశాను. అదే - "జన సేన అధినేతకు 10 ప్రశ్నలు!" 

కట్ టూ "పవర్" పాయింట్ - 

నా బ్లాగ్ కోసం ఓ గెస్ట్ పోస్ట్ రాయమన్నప్పుడు, తను నాకు రాసి పంపిన మొట్టమొదటి పోస్టులో "ఓటు" వాల్యూ గురించి రాశాడు భరత్. ఎలక్షన్ల టైమ్‌లో పోస్ట్ చెయ్యొచ్చులే అని దాన్ని  పక్కనపెట్టాను.

కానీ..

తెల్లారి లేస్తే కాఫీ, న్యూస్‌పేపర్‌తోనో.. టాబ్లెట్టు, ఫేస్‌బుక్‌తోనో ప్రారంభమయ్యే సగటు మనిషి జీవితంలో రాజకీయాలు కూడా ఒక విడదీయరాని భాగం అన్న వాస్తవాన్ని మాత్రం పక్కనపెట్టలేకపోయాను.

మొదటిసారిగా - నేను అసలు రాయడానికే ఇష్టపడని ఈ పొలిటికల్ పోస్ట్‌కి సూపర్ డూపర్ హిట్స్ పడ్దాయి. అదీ గంటకి 100+ వేగంతో!

ఇది నేనే నమ్మలేని నిజం.  

Sunday 16 March 2014

జన సేన అధినేతకు 10 ప్రశ్నలు!

ఓ పదిరోజుల క్రితం అనుకుంటాను. "పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టడం అనేది ఓ పిచ్చ్చి పని. అదీ.. హీరోగా ఇంతటి పీక్ స్టేజ్‌లో ఉండగా!" అన్నారు తమ్మారెడ్డి భరద్వాజ.

నా అభిప్రాయమూ అదే.

పైగా, అంతకు ముందే వాళ్ల అన్న చిరంజీవి కూడా ఇదే విషయంలో ఒక చారిత్రక తప్పిదం చేశాడు.

ఒక నటుడిగా పవన్ అంటే నాకూ ఇష్టమే.

కట్ టూ పాయింట్ - 

ముందుగా, ప్రశ్నలతో సంబంధం లేని ఓ చిన్న ఇంట్రో అవసరమనిపిస్తోంది నాకు.

తెలంగాణవాదం, సీమాంధ్రవాదం వగైరాలన్నీ వ్యక్తిగతమైనవి. ఎవరి అభిప్రాయాలు, సిధ్ధాంతాలు వారివి.

ఈ రెంటిని పక్కనపెడితే.. మనమందరం భారతీయులం. ఇంకాస్త ముందుకెల్తే.. ప్రపంచం అంతా మన తెలుగువాళ్లున్నారు. ప్రపంచం ఓ చిన్న కుగ్రామమైపోయింది.

చెప్పొచ్చేదేంటంటే - నాకు వ్యక్తిగతంగా ఆత్మీయ బంధువులు, మిత్రులు కోస్తాంధ్ర, రాయలసీమల్లోనే ఎక్కువగా  ఉన్నారు. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు.

సో, ఇక్కడ నేను రాస్తోంది కేవలం "జన సేన" ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ స్పీచ్‌కు స్పందించి మాత్రమే. అంతవరకే.

ఫ్యాన్స్‌కి చాలా మందికి కోపం రావొచ్చు. సహజం, న్యాయం కూడా. అందుకే "ఫ్యాన్స్" అంటారు. ఆ మాటకొస్తే, నేనూ పవన్ ఫ్యాన్‌నే. కాబట్టే ఈ బ్లాగ్‌పోస్ట్. ఈ వ్యథ.

మిగిలిన ప్రాంతీయ భేదాలు, రాజకీయాలు.. ఇదంతా ఉట్టి ట్రాష్.

అసలు క్రియేటివ్ పాయింటాఫ్ వ్యూలో చూస్తే .. అసలు ఎవరికీ ఎలాంటి ఎల్లలు లేవు. ఉండవు. ఉండబోవు. క్రియేటివిటీ వేరు. రాజకీయాలు వేరు.

కట్ టూ నా 10 ప్రశ్నలు - 

1. "అధికారం కోసం కాదు. ఏ తప్పు జరిగినా ప్రశ్నించడానికి జన సేన" అన్నాడు పవన్. కేవలం ప్రశ్నించడానికే అయితే 10 రూపాయలతో మనకున్న సమాచార హక్కు చట్టంతో ఎవరినయినా ప్రశ్నించవచ్చు. దీనికోసం పార్టీ పెట్టడం అవసరమా?

2. ఎన్నెన్నో ఉన్నత ఆశయాలను వెలిబుచ్చిన జనసేన పార్టీ ఆవిర్భావం సామాన్య జనం అందరికీ అందుబాటులో - ఏ పరేడ్ గ్రౌండ్స్‌లోనో, లేదంటే కనీసం నిజాం కాలేజీ ఆవరణలోనో జరగాలి కానీ.. నోవాటెల్ లాంటి స్టార్ హోటల్లో.. ఒక ఆడియో రిలీజ్ కార్యక్రమంలా.. కేవలం  అతి కొద్దిమంది ఆహూతుల మధ్యలోనే జరపడం ఎంతవరకు కరెక్టు?

3. విభజన జరిగిన తీరు తనను బాగా బాధపెట్టింది. ఆ బాధే జనసేన ఆవిర్భావానికి కారణమైంది అన్నాడు పవన్. నిజానికి విభజన అలా జరగడానికి కారణమైన.. మాటమార్చిన.. మోసకారి పార్టీలు ఎన్ని? అలా జరగడానికి కారణమైన ఆయా పార్టీల్లోని నాయకులెవరో పవన్‌కు తెలియదా?

4. సుమారు 2 గంటల స్పీచ్‌లో కనీసం ఓ డజన్ సార్లు "నా తెలంగాణ.. నా తెలంగాణవాళ్లు" అంటూ ఎంతో భావావేశంతో అన్నాడు పవన్. మరి నీ తెలంగాణ కుర్రాళ్లు 1200 మంది ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు, కనీసం ఒక్కసారయినా ఇదే నోవాటెల్లోగానీ, కనీసం ఫిలిమ్‌నగర్లోగానీ వారికోసం ఎందుకని ఒక్క సంతాప సభ కూడా పెట్టలేదు?    

5. కల్వకుంట్ల కవితని లెక్కలు అడగాల్సిందే. ఎలాంటి తప్పులేదు. అయితే.. దానికంటే ముందు అడగాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి. అన్నయ్య చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ప్రపంచవ్యాప్తంగా భారీగా ఫండ్స్ వచ్చాయి. టికెట్లు అమ్ముకున్నప్పుడు కూడా భారీగా ఫండ్స్ వచ్చాయని మీడియా అంతా ఒకటే రొద, సొద. చివరికి ఆ పార్టీని తీసుకెళ్లి అన్నయ్య కాంగ్రెస్‌లో కలిపేశాడు.  మరి అప్పటి ఆ ఫండ్స్ ఏమయ్యాయో.. అటుకూడా సరదాగా ఒక బుల్లెట్ పేల్చి ఇటు పేలిస్తే ఇంకా బాగుండేది. కాదా?  

6. అప్పుడెప్పుడో "అత్తారింటికి దారేది" థాంక్యూ ఫంక్షన్లో - ఆ సినిమా పైరసీ వెనకున్నదెవరో నాకు తెలుసు.. వారి "తాట తీస్తా!" అన్నాడు పవన్. అదే ఇంకా జరగ లేదు. మళ్లీ ఇప్పుడు కూడా ఇంకెవరినో తాటతీస్తా అంటున్నాడు. ఒక పొలిటికల్ పార్టీ పెడుతూ, సీరియస్ విషయాల్ని కూడా ఇలా సినిమా డైలాగుల్లా, ఒక ఎడాలిసెంట్‌లా చెప్పడం ఏం బావుంటుంది?  

7. "కాంగ్రెస్ చేసిన తప్పుకు అన్నయ్యని నేనెందుకంటాను?" అన్నాడు పవన్. అక్కడ అన్నయ్య కూడా అదేపాట. కాంగ్రెస్ హైకమాండ్ తప్పు చేసింది అని! అంత తప్పు చేసిన ఆ కాంగ్రెస్‌లోనే అన్నయ్య ఇంకా ఎందుకున్నాడు అని తమ్ముడు అడక్కూడదా?

8. భగత్ సింగ్, చెగువేరా, తెలంగాణ సాయుధపోరాటం అంతా చదివావు. తెలంగాణ లో ఏం జరిగిందో సభాముఖంగా  ఇప్పుడు చెప్పావు. మరి అంతా తెల్సినవాడివి.. అప్పుడు.. మొదటిసారి తెలంగాణను చిదంబరం ప్రకటించిన తర్వాత ఏం జరిగిందో తెలియదా? అప్పటివరకూ "మేం తెలంగాణకు ఓకే. అంతా కాంగ్రెస్ చేతుల్లోనే ఉంది" అని చెప్పిన అన్ని పార్టీలూ ఒక్కసారిగా యూ టర్న్ తీసుకున్న మోసపూరిత  క్రమంలో, ఆ తర్వాతా.. ఏం జరిగిందో చూడ్డం లేదా? అటూ ఇటూ నాయకులంతా బాగానే ఉన్నారు. రాజకీయ పార్టీలూ బానే ఉన్నాయి. బంద్‌లు, గొడవలు, ఆత్మహత్యలు, ఇతర అల్లకల్లోలం వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతమంది జీవితాలు ఎన్ని ఇబ్బందులకు గురయ్యాయో అర్థం కాలేదా? ఆ సమయంలో ఎందుకని మన ఈ ఫ్యూచర్ జనసేన అధినేత కనీసం నోరు విప్పలేదు?  

9. "కాంగ్రెస్ హటావో, దేశ్ బచావో!" అన్నావు చివరికి. ముందు ఆ కాంగ్రెస్‌లో ఉన్న సొంత అన్నయ్యని ప్రభావితం చేసి బయటకు రప్పించలేని నువ్వు.. కోట్లాది ప్రజలను ఎలా నీ భావజాలంతో ప్రభావితం చేయగలననుకుంటున్నావు?

10. ప్రశ్నించడానికే నా పార్టీ అని చెప్పిన నువ్వు క్లైమాక్స్‌లో ఊహించని డైలాగ్ చెప్పావు. "ఎవరితోనయినా పొత్తుకు సిధ్ధమే" అని! ఇది దేనికి సంకేతం? ఎవరి ప్రయోజనం కోసం ఈ పొత్తు? ఇలా ఎవరితోనయినా పొత్తులకు ఓకే చెప్పే పార్టీని పెట్టి ఏం సాధించగలననుకుంటున్నావు? ఎవరయినా ఎలా నమ్ముతారు? అసలు దీనివెనక ఇంకేదయినా రహస్య ఎజెండా ఉందా? అంతా నీకు తెలిసే జరుగుతోందా? లేదా, ఎవరయినా నీ కాల్‌షీట్లు తీసుకొని, నిన్ను ఒక పావుగా వాడుకుంటూ డ్రామా ఆడిస్తున్నారా?  

ఈ ప్రశ్నలన్నీ నా సొంత కవిత్వం కాదు. మీడియా అంతా, ఇంటర్నెట్టంతా దున్నేస్తున్న ప్రశ్నలు. ముఖ్యంగా, లోపల్లోపలే మధనపడుతూ.. జనసేన పవన్ ఫ్యాన్స్ బయటికి అడగలేకపోతున్న ప్రశ్నలు.

Friday 14 March 2014

కొత్త టాలెంట్ కు స్వాగతం!

లేటెస్ట్ డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించి నేను చేస్తున్న
"ట్రెండీ యూత్ ఎంటర్‌టైనర్" చిత్రాల సీరీస్ కోసం .. సినీఫీల్డుపట్ల అమితమైన అసక్తి ఉన్న
కొత్త టాలెంట్ కోసం చూస్తున్నాము.
కొత్త ఇన్వెస్టర్లు / ప్రొడ్యూసర్లు / కో-ప్రొడ్యూసర్లకు
కూడా ఇదే స్వాగతం.
మాకు కావల్సిన కొత్త టాలెంట్:
1. హీరోలు
2. హీరోయిన్లు
3. సపోర్టింగ్ ఆర్టిస్టులు 
4. స్క్రిప్ట్ రైటర్లు/అసోసియేట్ స్క్రిప్ట్ రైటర్లు
5. మ్యూజిక్ డైరెక్టర్లు
6. లేటెస్ట్ డిజిటల్ కెమెరాలతో పని చేయటం తెలిసిన కెమెరామెన్‌లు
7. సింగర్లు
8. కోరియోగ్రాఫర్లు
9. పోస్ట్ ప్రొడక్షన్లో లేటెస్ట్ నాలెడ్జ్ ఉన్న టెక్నీషియన్లు 
10. అసిస్టెంట్ డైరెక్టర్స్ (ఆడ)

ఈ చిత్రాలు పూర్తిగా మైక్రో బడ్జెట్‌లో తీస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ కమర్షియల్ చిత్రాలు. టాలెంట్‌తోపాటు, సినిమా మీద ప్యాషన్ ఉండటం ముఖ్యం. ఎన్నికలో అలాంటివారికే ప్రాధాన్యం ఉంటుంది.

ఆసక్తి ఉన్నవారు మీ బయోడేటా, ఫొటోలు, మొబైల్ నంబర్‌తో ఈమెయిల్ పంపించండి. మా ఆఫీస్ నుంచి మీకు కాల్ వస్తుంది. లేదా నేనే చేస్తాను. బెస్ట్ విషెస్ ..  

Wednesday 12 March 2014

మార్చి 14న పవన్ జన సేన!

ఎంతవరకు నిజమో తెలీదుగాని.. మొత్తం టీవీ మీడియా, వెబ్‌సైట్లూ ఈ విషయాన్ని దాదాపు ఖరారు చేసేశాయి. ఈ మార్చి 14నాడు పవన్ కళ్యాణ్  తన కొత్త రాజకీయపార్టీని ప్రకటించబోతున్నాడు. దాని పేరు "జన సేన!"

వార్తలు లేదా దీనికి సంబంధించిన గాసిప్స్‌లో కొన్ని ఇలా ఉన్నాయి:

> ఈ ఎలెక్షన్స్‌లో అన్ని స్థానాల్లో "జన సేన" పోటీ చేయకపోవచ్చట!

> పార్టీ అధికారం కోసం కాదట.. ఏ తప్పు జరిగినా అడగడానికట!

> ఈ పార్టీ వెనక అవసరమైన సమాచారం, పవన్ ఉపన్యాసాలూ అవీ చూసుకొనేది డైరెక్టర్ త్రివిక్రమ్‌ట!

> అసలు ప్రోత్సాహమంతా ప్రముఖ నిర్మాత పొట్లూరి ప్రసాద్‌ట!

వీటిల్లో ఏది ఎంతవరకు నిజమో తెలీదు.

మరోవైపు రామ్‌గోపాల్ వర్మ లాంటి వాళ్లు ట్విట్టర్లో ఓ తెగ ఊదేస్తున్నారు పవన్‌ని. శివసేన కంటే జనసేన లోనే ఎక్కువ పవరుందట. పవన్ కళ్యాణ్ ను మించిన నాయకుడు ఇంక ఎవరూ దొరకరట. తెలుగువాళ్లు తెలివైనవాళ్లయితే పవన్‌నే గెలిపించుకోవాలిట..

ఇదంతా నిజమా .. సెటైరా? సెటైరిక్‌గా నిజం చెప్తున్నాడా.. నిజమనిపించేలా సెటైర్లు వేస్తున్నాడా.. అంతా ఆ వర్మకే తెలుసు!  

కట్ టూ నా వ్యక్తిగత అభిప్రాయం - 

> చాలా గ్యాప్ తర్వాత, తన కెరీలో ఒక పీక్ దశకి చేరుకున్న ఈ సమయంలో పవన్ కల్యాణ్‌కి ఈ "జనసేన"లు ఇప్పుడు అవసరమా?

> పుస్తకాలు, సినిమాలు వేరు. రొచ్చు రాజకీయాలు వేరు. రజనీకాంతే వద్దనుకున్న రాజకీయాల్లో పవన్ ఏం సాధించాలనుకుంటున్నాడు?

వీటికి జవాబు రేపు 14వ తేదీనే తెల్సిపోతుందనుకుంటున్నాను.  

Tuesday 11 March 2014

సినిమా తీయడానికి ఇప్పుడు ఆఫీస్ అవసరం లేదు!

టీమ్ అంతా ఎక్కడ కలిస్తే అదే ఆఫీస్! అది ఇరానీ హోటల్ కావొచ్చు. కాఫీడే కావొచ్చు. సంజీవయ్య పార్క్ కావొచ్చు. నెక్లెస్ రోడ్డు కావొచ్చు. ఐమాక్స్ లాబీలు కావొచ్చు..

ఇదివరకులా కాదిప్పుడు. సినిమా నిర్మాణానికి సంబంధించిన పని ఏదయినా ఇప్పుడు ఊహించని విధంగా సూపర్‌ఫాస్ట్‌గా జరిగిపోతున్న రోజులివి. మొబైల్ టాక్స్, వాట్సాప్, ఫేస్‌బుక్, ఈమెయిల్, స్కైప్ టాక్స్.. ఇలా ప్రతి ఆధునిక సాధనం సినిమా నిర్మాణానికి ఏదోరకంగా ఉపయోగపడుతోంది.

ఇవన్నీ పక్కనపెట్టి ఇదివరకులా "పాత చింతకాయ పచ్చడి" పధ్ధతిలో పని చేయడానికి ఎవరూ ఇష్టపడటంలేదు.

కొత్త నటీనటులు, టెక్నీషియన్ల ఎన్నిక దాదాపు ఆన్‌లైన్ ద్వారానే జరిగిపోతోంది. ఫోటోలు, వీడియో క్లిప్స్ ఆన్‌లైన్లో అందుబాటులో ఉన్నప్పుడు .. ఇంక ప్రత్యేకంగా ముంబై, ఢిల్లీ లకు వెళ్లాల్సిన అవసరమేలేదు. స్క్రీన్‌టెస్టులంటూ వారాలకి వారాలు టైం వేస్ట్ చేయాల్సిన అవసరం అంతకంటే లేదు.

అయితే - వీటి ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసుకున్నవాళ్లని చూడ్డానికి మాత్రం ఒక్కసారి మాత్రం డైరెక్ట్ ఆడిషన్ అవసరమౌతోంది. దానికి ఆఫీస్ అవసరం ఎంతమాత్రం లేదన్నది అందరికీ తెలిసిందే.

ఇక కథా చర్చలు, మేకింగ్ ప్లానింగ్స్, అన్నీ కాఫీడేల్లో, నెక్లెస్ రోడ్ చెట్లక్రింద, ఐమాక్స్‌లో, కేబీఆర్ పార్కులో, టాంక్‌బండ్ మీదా.. చక చకా అయిపోతున్నాయి. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా స్మూత్‌గా జరిగిపోతున్నాయి.

కేవలం ఒక్క సినిమా షూటింగ్ సమయంలో మాత్రం ఒక్క నెలపాటు.. ఏ గెస్ట్ హౌజ్ రూమ్‌లోనో, లేదంటే ఓనర్స్ అభ్యంతర పెట్టని .. ఏ బ్యాచిలర్ గదిలోనో, లేదంటే ఓ సింగిల్ బెడ్ రూమ్ పోర్షన్‌లోనో అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉపయోగించుకోగలిగితే చాలు.

పోస్ట్ ప్రొడక్షన్‌కి మళ్లీ మామూలే. ఎక్కడ పని జరుగుతోంటే అక్కడ అందరూ వాలిపోతారు అవసరమైన టీమ్ మెంబర్లు. అంతే. ఫైనల్ కాపీ రెడీ!

ఇక బిజినెస్ కోసం అసలు ఆఫీసే అక్కర్లేదు!

సో.. అంతా కాఫీడేలు, ఇరానీ హోటల్లూ, పార్కులు, బ్యాచిలర్ రూముల్లోనే మన "చిన్న సినిమా"లనబడే "ఇండీ సినిమా"ల నిర్మాణం అంతా జరిగిపోతుందన్నమాట!

ఇంతమంచి నేచురల్ లొకేషన్స్‌ని మించిన ఆఫీస్ ఏముంటుంది? ఇలాంటిచోట్ల పనిజరిగినప్పుడే ఆలోచనలు కూడా మెరుపుల్లాంటివి వస్తుంటాయి.

కట్ టూ హాలీవుడ్ "ఇండీ సినిమా" - 

ఇదంతా హాలీవుడ్లో ఎప్పుడో ఉంది. ఇప్పుడూ ఉంది. కేన్స్ వంటి ఫిలిం ఫెస్టివల్స్‌లోనూ, హాలీవుడ్‌లోనూ సంచలనాలు సృష్టించిన "బ్లెయిర్‌విచ్ ప్రాజెక్ట్", "పారానార్మల్ యాక్టివిటీ", "బిఫోర్ సన్‌రైజ్", "ఫర్ లవర్స్ ఓన్లీ", "న్యూలీ వెడ్స్" .. వంటి ఎన్నో ఇండిపెండెంట్ సినిమాలకు వాటి నిర్మాణ సమయంలో ఆఫీసుల్లేవు!

అయితే - ఇక్కడ మనదగ్గర గొప్పలకోసం తపించడమే ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఇదంతా ఎవరూ నమ్మరు. మనవాళ్లకు ఎంతమాత్రం నమ్మశక్యంగా ఉండదు. కానీ, నిజం ఇదే.   

Friday 7 March 2014

ఫేస్‌బుక్ చూడకుండా ఒక వారం!?

ఫేస్‌బుక్‌ని నేనేదో ఎడాలిసెంట్‌లా అదేపనిగా లైక్‌లు కొట్టడానికో, ప్రతి చెత్తా షేర్ చేయడానికో వాడటం లేదు.

అదేదో సినిమాలో పవన్ కల్యాణ్ డైలాగ్‌లా నాక్కొంచెం తిక్కుంది. దాని వెనక చాలా లెక్కలున్నాయి. ఇంకా ప్రిసైజ్‌గా చెప్పాలంటే కొన్ని టైమ్‌బౌండ్ గోల్స్ ఉన్నాయి. అతి తక్కువ వ్యవధిలో నేను వాటిని సాధించగలగాలి. సాధించాలి.

చాలా క్రిస్టల్ క్లియర్‌గా, ఈ గోల్స్, నా సెక్సీ శామ్‌సంగ్ నోట్‌బుక్ డెస్క్‌టాప్ మీదే ఉంటాయి ఎప్పుడూ. ఏ క్షణం నేను నా నోట్‌బుక్ తెరచినా ముందు నాక్కనిపించేది నా ఈ ఇమ్మీడియేట్ టార్గెట్సే!

మొన్నటివరకూ వీటి సంఖ్య 3. గత డిసెంబర్ 18 నాడు, వీటిల్లో ఒక లక్ష్యాన్ని అనుకున్న సమయానికంటే ముందే సాధించగలిగాను.

ఇప్పుడు నా డెస్క్‌టాప్ మీద ఇక మిగిలింది రెండే రెండు ఇమ్మెడియేట్ గోల్స్. వాటి డెడ్‌లైన్స్: ఈ మార్చ్ 31, ఆగస్ట్ 15.

ఈ రెంటిని కూడా అనుకున్న సమయానికి సాధిస్తానన్న నమ్మకం, ట్రాక్ రికార్డ్ నాకుంది. కొన్నిసార్లు చెప్పలేం. ఏదీ మనచేతుల్లో ఉండని పరిస్థితి కూడా వస్తుంది. ఇప్పుడు నేనున్న ఫీల్డులో ఈ పరిస్థితే ఎక్కువ. పైగా ఈ రెండు లక్ష్యాలూ కొంచెం కష్టతరమైనవే. ఒకదాన్ని మించి ఒకటి. అయినా నా నమ్మకం నమ్మకమే.

నా స్నేహితులు, శ్రేయోభిలాషులు నా వెనకున్నారు.. నా మంచిని కోరుతూ. అది చాలు నాకు.

ఆ వెనకే నేను నమ్మిన బాబా నాకున్నాడు. ఆయన దీవెనలూ ఉన్నాయి. ఆయనకే అంతా వదిలేశాను. నా పని మాత్రం నేను లేజర్ ఫోకస్‌తో చేసుకుంటూవెళ్తున్నాను.  

కట్ టూ ఫేస్‌బుక్ చూడకుండా ఒక వారం! -

పై నేపథ్యంలో, ఖచ్చితంగా ఒక నెలపాటు అసలు ఫేస్‌బుక్ ముఖం చూడకూడదని గట్టిగా నుకున్నాను. కానీ, హైలీ ఇంపాజిబుల్! పూర్తిగా ఒక వారం కూడా కుదర్లేదు.

"బ్రదర్, ఏమైంది ఆ విషయం?" అని ఓ ప్రొఫెషనల్ ఫ్రెండ్‌ని ఓ ముఖ్యమైన విషయం గురించి అడిగినప్పుడు .. "రాత్రికి ఫేస్‌బుక్‌లో మెసేజ్ పెడ్తున్నాలే..చూస్కో." అని జవాబు!

అదన్నమాట పరిస్థితి. నేనున్న ఫీల్డులో కమ్యూనికేషన్ అవసరాలు అలాంటివి. నేనింకా "వాట్సాప్"లో లేను. బ్రతికిపోయాను..  

సో, కొంచెం కొంచెం మళ్లీ ఎంటరవుతున్నాను. కాకపోతే - ఎఫ్‌బీ మీద నేను వెచ్చించే నా యావరేజ్ 40 నిమిషాల సమయాన్ని 15 నిమిషాలకు తగ్గించుకున్నాను. నో ప్రాబ్లమ్‌స్.

ఇక్కడ విషయం లైకులూ, షేర్లూ కాదు. ట్రాక్‌లో ఉండటం చాలా అవసరం. తద్వారా పనుల్ని మరింత తొందరగా పూర్తిచేసుకోవడం ముఖ్యం. 

Tuesday 4 March 2014

క్రౌడ్ ఫండింగ్ సినిమాలకూ వర్తిస్తుందా?

అమెరికాతోపాటు ఇతర పాశ్చాత్య దేశాల్లో ఈ మధ్య బాగా ప్రాచుర్యం పొందిన పదం - క్రౌడ్ ఫండింగ్.

ఎవరయినా ఏదయినా కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించడానికో,లేదంటే, ఆల్రెడీ ప్రారంభించిన ప్రాజెక్ట్‌ని పూర్తిచేయడానికో అవసరమయిన డబ్బు చిన్న చిన్న మొత్తాల్లో ఎక్కువమంది (క్రౌడ్) నుంచి సేకరిచడమే ఈ క్రౌడ్ ఫండింగ్.

ఉదాహరణకు మన సినిమా విషయమే తీసుకుందాం..

నడుస్తున్న ట్రెండులో, అంతా కొత్తవారితో ఒక ఇండిపెండెంట్ సినిమా తీయడానికి ఓ 50 లక్షలు కావాలనుకొందాం. ఆ మొత్తాన్ని ఓ 10 మంది దగ్గరో, 20 మంది దగ్గరో, 50 మంది దగ్గరో వివిధ డినామినేషన్లలో సేకరించడంద్వారా ఈ 50 లక్షల మొత్తాన్ని చాలా సులభంగా సేకరించవచ్చు.

10 మంది x 5 లక్షలు / 20 మంది x 2.5 లక్షలు / 50 మంది x 1 లక్ష .. ఇలా వివిధ డినామినేషన్లలో డబ్బు సేకరణ చేయవచ్చు. ప్రతి డినామినేషన్లోనూ ఇన్వెస్టర్లకు తాయిలాలుంటాయి. ప్రపోర్షనేట్‌గా లాభాల్లో వారికి షేర్ కూడా ఉంటుంది. ఎవరికీ పెద్దగా రిస్క్ ఉండదు. ఇదే క్రౌడ్ ఫండింగ్.

అంతర్జాతీయంగా ఈ మధ్య బాగా ప్రాచుర్యం పొందిన ఈ ఫండ్ రైజింగ్ ప్రాసెస్‌ని అమలు చేయడంకోసం కిక్‌స్టార్టర్, ఇండిగోగో వంటి వెబ్‌సైట్లు ఎన్నో వచ్చాయి. రైజ్ అయిన మొత్తం ఫండ్ లోంచి ఆయా సైట్లు నామినల్‌గా కొంత కమిషన్ తీసుకొంటాయి.

అయితే - ప్రతి డినామినేషన్లోనూ ఫండర్స్‌కు ఇచ్చే కొన్ని తాయిలాలు తప్ప, ఈ సైట్స్ ద్వారా రైజ్ చేసే ఫండ్స్‌ని చాలా వరకు తిరిగి చెల్లించే అవసరం లేకపోవడం అనేది గమనించాల్సిన ఒక గొప్ప విషయం!  

కట్ టూ మన క్రౌడ్ ఫండింగ్ -    

మనం అలా చేయనక్కర్లేదు. వచ్చిన ఆదాయంలో ప్రపోర్షనేట్‌గా షేర్ ఇచ్చేస్తే అందరూ హాప్పీస్!

ఈ వైపు ఆసక్తి ఉన్న కొత్త ఇన్వెస్టర్లు, ఇన్వెస్టర్స్‌ని తీసుకురాగలిగిన మీడియేటర్లు నన్ను సంప్రదించవచ్చు.

అంతేకాదు. క్రౌడ్ ఫండింగ్ పట్ల నాలెడ్జ్ ఉండి, ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ క్యాంపెయిన్ చేయగల సామర్థ్యం ఉన్న ఇంటర్నెట్ మార్కెటర్స్/మార్కెటింగ్ స్పెషలిస్ట్స్ నన్ను వెంటనే సంప్రదించవచ్చు.

అలాగే - ఫిలిం యాక్టింగ్, ఫిలిం బిజినెస్ మీద, ఫీల్డు మీద ఆసక్తిఉన్న లైక్‌మైండెడ్ మిత్రులకు ఇదో మంచి అవకాశం. పెద్ద భారం ఉండదు. రిస్క్ అసలే ఉండదు.

సినీ ఫీల్డుపట్ల నిజంగా అంత ఆసక్తి, ప్యాషన్ ఉండి.. చిన్న స్థాయిలో ఇన్వెస్ట్ చేయగలవాళ్లు మాత్రమే పూర్తి వివరాలకోసం నాకు నేరుగా మీ మొబైల్ నంబర్ ఇస్తూ ఈమెయిల్ చేయవచ్చు.

సీ యూ ఇన్ అవర్ క్రౌడ్ ఫండింగ్ మీటింగ్ .. 

హిపోక్రసీ వర్ధిల్లాలి!

హిపోక్రసీ #1

సెన్సార్ రూల్స్ ప్రకారం సినిమా ప్రారంభంలో ఒక టైటిల్ కార్డ్ తప్పనిసరిగా వేయాలి. "పొగ త్రాగటం, ఆల్కహాల్ సేవించడం ఆరోగ్యానికి హానికరం" అని.

ఆ తర్వాత ఇంక మీ ఇష్టం..

హీరో, హీరోయిన్, విలన్, వాడి గ్యాంగూ వగైరా ఎన్ని సిగరెట్లయినా త్రాగొచ్చు. ఎంచక్కా హుక్కా తాగొచ్చు. అలాగే ఎంతయినా డ్రింక్ త్రాగొచ్చు. తాగీ తాగీ కక్కుకోవచ్చు.

కట్ టూ హిపోక్రసీ #2 -  

"పొగత్రాగటం ఆరోగ్యానికి హానికరం" అని ప్రతి సిగరెట్ ప్యాకెట్‌పైనా, ప్రతి పొగాకు ఉత్పత్తిపైనా విధిగా ముద్రించాలని ప్రభుత్వం రూల్ పెడ్తుంది. వాటిని మాత్రం వాడొచ్చు! ప్రభుత్వానిక్కావల్సిందల్లా .. ఏటేటా వాటి అమ్మకాలమీద భారీగా పెరుగుతూవచ్చే టాక్సెస్..

"ఆల్కహాల్ సేవించడం ఆరోగ్యానికి హానికరం" అని కూడా గవర్నమెంటు, రాజకీయనాయకులు, వాళ్లూ వీళ్లూ చెప్తూనే ఉంటారు. వాటి అమ్మకాల గ్రాఫ్ ఏటేటా పైపైకి ఎగిసిపోతూ ప్రభుత్వాలకి బోల్డంత ఆదాయం తెచ్చిపెడుతూనే ఉంటుంది.    

పై రెంటి ద్వారా అనఫీషియల్‌గా ఆయా మంత్రిత్వశాఖల్లోని రాజకీయనాయకులకూ, సంబంధిత అధికారులకూ భారీగానే ముడుతుందని అందరికీ తెలుసు.

అయితే, ఈ రెండూ మనిషి జీవితానికి, ఆరోగ్యానికీ హానికరమైనవి అని తెలిసీ అసలు వీటిని ఉత్పత్తి చేయటం దేనికి? తర్వాత ఉత్తుత్తి వార్నింగులు ఇవ్వటం దేనికి?  

పాయిజన్ తింటే చచ్చిపోతాం. అలాగని పాయిజన్‌ని ఉత్పత్తి చేస్తూ ఓపెన్ మార్కెట్లో అమ్ముతున్నామా? నెవర్! అలా ఎన్నటికీ జరగదు.

మరోవైపు.. స్లో పాయిజన్ ఇచ్చే కిక్కే వేరు. అందుకే ఈ పొగాకు ఉత్పత్తులు, లిక్కర్ ఉత్పత్తులు ఎవర్‌గ్రీన్‌గా ఉంటున్నాయి. ఉంటాయి కూడా.

ఇప్పుడు నాకు డౌటొస్తోంది. దీన్ని హిపోక్రసీ అనాలా .. శాడిజం అనాలా?  

Monday 3 March 2014

గోలీసోడా కిక్కే వేరు!

ఏ మారుమూల గ్రామాల్లోనో, లేదంటే ఏ పక్కా మాస్ ఏరియాల్లోనో తప్ప - ఇప్పుడు చూద్దామన్నా ఎక్కడా గోలీసోడా కనిపించట్లేదు.

నా చిన్నతనం నుంచి, గుంటూరులో నేను ఉద్యోగం చేసిన దశవరకూ.. నాకు గోలీసోడా బాగా తెలుసు. ఇష్టం కూడా. దాన్లో మామూలు సాదాసోడాతోపాటు నిమ్మకాయసోడా, జింజర్ సోడా అని కొన్ని ఫ్లేవర్లు కూడా ఉండేవి.

అంతెందుకు.. చిన్నప్పుడు నేను మా వరంగల్లోని సరోజ్ టాకీస్‌లోనో, నవీన్ టాకీస్‌లోనో సినిమా చూసినప్పుడు - ఇంటర్వల్‌లో బయటికి వచ్చామంటే గోలీసోడా త్రాగాల్సిందే! ఎప్పుడు సినిమాకెళ్లినా అదో తప్పనిసరి అయిన రొటీన్ మాకు..

కట్ టూ కోలీవుడ్ గోలీసోడా - 

ఈ మధ్య తమిళంలో వచ్చిన "గోలీసోడా" చిత్రం బాక్సాఫీస్ హిట్ అయింది.

చెన్నైలోని కోయంబీడ్ మార్కెట్ నేపథ్యంలో ఊరూ పేరూ లేని నలుగురు కుర్రాళ్ల జీవన నేపథ్యం, గుర్తింపు కోసం వాళ్లు పడే ఆరాటం ఈ గోలీసోడా సినిమా కథ.  

ఈ సినిమా చివరిదశ షూటింగ్‌లో ఉండగా నిర్మాత చేతులెత్తేశాడు. అవసరానికి శాటిలైట్ రైట్స్ అమ్ముకుందామంటే, కనీసం 10 లక్షల ఆఫర్ కూడా రాలేదట! ఎలాగో నానా తిప్పలుపడి పూర్తిచేసి రిలీజ్ చేసేశారు.

ఇప్పుడు సినిమా భారీ హిట్టయి కూర్చుంది. ఒక భారీ చిత్రం రేంజ్‌లో 3 కోట్ల శాటిలైట్ రైట్స్ అందుకుంది గోలీసోడా!

సినిమా చిన్నదా, పెద్దదా అన్నది కాదు విషయం. స్టోరీలో ఎంత దమ్ముంది. ప్రేక్షకుల్ని అది ఎలా ఆకట్టుకుంది అన్నదే అసలు విషయం. అప్పుడయినా, ఇప్పుడయినా, ఎప్పుడయినా..

దటీజ్ ద పవర్ ఆఫ్ గోలీసోడా! 

Sunday 2 March 2014

మైక్రోబడ్జెట్ ఫిలిమ్‌మేకింగ్.. ఇప్పుడొక బూమ్!

2007 లో వచ్చిన "పేరానార్మల్ యాక్టివిటీ" అనే సినిమా ఫిలిమ్‌మేకింగ్‌లో అంతర్జాతీయంగా ఒక కొత్త శకానికి నాంది పలికింది. వ్యక్తిగతమైన ఆసక్తితో, ఆ తర్వాత ఈ విషయం మీద మరింత లోతుగా అధ్యయనం చేశాను. ఇదే పంథాలో ఇంకెన్నో సినిమాలు తీశారు.

ఇది ఫిలిమ్ నెగెటివ్‌ని ఉపయోగించని పంథా. ఫిలిమ్‌మేకింగ్‌లో వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీని ఆవిష్కరించిన పంథా. క్వాలిటీతో కాంప్రమైజ్ కాకుండా, అతి తక్కువ ఖర్చుతో సినిమా నిర్మాణాన్ని పూర్తిచేయవచ్చు అని నిరూపించిన పంథా.  

"బ్లెయిర్‌విచ్ ప్రాజెక్ట్", "ఫర్ లవర్స్ ఓన్లీ", "న్యూలీ వెడ్స్", "నైట్ బీట్స్" .. ఇలా ఎన్నయినా ఉదాహరణల్ని చెప్పగలను.  ఈ పధ్ధతిలో తీసిన సినిమాల్లో కొన్ని జీరో బడ్జెట్ సినిమాలు. కొన్ని కేవలం $9,000 లోపు బడ్జెట్లోనే తీసినవి అంటే ఆశ్చర్యం కలక్కమానదు. కానీ నిజం.

పాయింట్ ఏంటంటే - వీటిలో చాలా సినిమాలు బాక్సాఫీసు దగ్గర మిలియన్ల కలెక్షన్లు కొల్లగొట్టాయి. ఇవేవీ ఆర్ట్ సినిమాలు కాదని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి?  

రొటీన్ ఫిలిం నెగెటివ్‌ని కాదని, ఈ డిజిటల్ ఫార్మాట్‌లో సినిమా తీయడానికి మన దగ్గర కనీసం ఓ అయిదేళ్లు పట్టింది. ఉదాహరణలతో నేను ఎంతమందికి చూపించినా ఎవ్వరూ అసలు పట్టించుకోలేదు.

చివరికి, ఇదే టెక్నాలజీని ఉపయోగించి, రామ్‌గోపాల్ వర్మ కేవలం 5 రోజుల్లో "దొంగల ముఠా" చిత్రం తీసి చూపించాకగానీ మనవాళ్లకు ఎక్కలేదు.

తర్వాతంతా చరిత్రే..

ఆ మధ్య వచ్చి హిట్ కొట్టిన "ఈ రోజుల్లో", "ఒక రొమాంటిక్ క్రైమ్ కథ", "ప్రేమకథా చిత్రం" .. వంటి సినిమాలన్నీ ఈ ఫార్మాట్‌లో తీసినవే. కేవలం 30 నుంచి 50 లక్షలలోపు బడ్జెట్లో తీసిన ఈ సినిమాలన్నీ కోట్ల కలెక్షన్లని రికార్డ్ చేశాయి.  

కట్ టూ బూమ్ -

ఒక బిజినెస్‌గా సినీ ఫీల్డులోకి ఎంటర్ కావాలన్న ఆసక్తి మీలో ఉందా? మరోవైపు "రిస్క్" అన్న భయం కూడా మీలో ఉందా? అలాంటివాళ్లకు నా సలహా ఒక్కటే. అతి తక్కువ స్థాయిలో, కేవలం ఒక్క 10 లక్షల పెట్టుబడితోనే ముందు ఎంటర్ కండి. ఒక "కో-ప్రొడ్యూసర్‌"గా అన్నీ దగ్గరుండి స్టడీ చేస్తూ, ఫిలిం ప్రొడక్షన్ బిజినెస్ బేసిక్స్ నేర్చుకోండి. మీ పెట్టుబడికి ప్రపోర్షనేట్‌గా రిటర్న్స్ పొందండి.

సో, కనీసం 10 లక్షలతో వెంటనే ఫీల్డులోకి ఎంటర్ అయ్యే ఉద్దేశ్యం మీకుంటే చాలు. మిగిలిన బడ్జెట్ విషయం మేం చూసుకుంటాం.

పక్కనే ఉన్న నా బ్లాగ్ ప్రొఫైల్‌లో నా ఈమెయిల్ ఉంది. అక్కడే నా ఫేస్‌బుక్ పేజ్ లింక్ కూడా ఉంది. నిజంగా.. సీరియస్‌గా.. ఆసక్తి ఉన్నవాళ్లు మాత్రమే మీ ఫోన్ నంబర్ ఇస్తూ నాకో మెసేజ్ పెట్టండి. మా ఆఫీస్ నుంచి మీకు కాల్ వస్తుంది. నేను కూడా చేస్తాను. వివరాలన్నీ అప్పుడు మాట్లాడుకుందాం.

సీ యూ ఇన్ కాఫీ డే ..   

Saturday 1 March 2014

ఇప్పుడు ఎంతమంది థియేటర్‌కు వెళ్లి సినిమా చూస్తున్నారు?

సినిమాల్లో మనం ఏం సంపాదించినా, ఎంత మనీ రొటేషన్ చేసినా హార్డ్‌లీ ఇంకో ఏడాదిన్నరే! ఆ తర్వాతంతా.. అయితే జాక్‌పాట్.. లేదంటే, బ్యాంక్‌రప్ట్. మరో మధ్యేమార్గం ఉండదు.

ఈ మధ్య నేను అందరితోనూ ఇదే విషయం చెప్తున్నాను. సో, సినిమా ప్రొఫెషన్లో మనం ఏం సంపాదించుకున్నా (పోగొట్టుకున్నా) ఇంకో ఏడాది, ఏడాదిన్నరే అన్నమాట!

నిజంగా అంతే. అంతకంటే ఎక్కువ సమయం లేదంటే లేదు.

అంతా డిజిటలైజ్ అయిపోయి.. సినిమా నిర్మాణం, పధ్ధతి సమూలంగా మారిపోయాయి. ఏవో కొన్ని భారీ స్టార్‌కాస్టింగ్‌తో కూడిన భారీ చిత్రాలకోసం తప్ప.. ఇంకొన్నాళ్ల తర్వాత ఎవ్వరూ థియేటర్‌కు వెళ్లి సినిమాలు చూడరు. అలా చూడలేని పరిస్థితులు మన జీవనశైలిలో వస్తాయి.

ఇంకోవిధంగా చెప్పాలంటే - టెక్నాలజీ మన జీవనశైలిని మరింతగా ప్రభావితం చేస్తుంది. ఇప్పటికిప్పుడు మనం ఊహించనంతగా ప్రభావితం చేస్తుంది.

అయితే - కొన్ని మైక్రో బడ్జెట్ సినిమాలు కూడా భారీ చిత్రాల స్థాయిలో విజయాలు సాధించే అవకాశాలు పెరిగిపోతుంటాయి. సినిమాలో ప్రేక్షకులను కట్టిపడేయగల కంటెంట్‌కు మాత్రమే ఈ శక్తి ఉంటుంది.

సమస్యల్లా ఒక్కటే. ఇలాంటి మైక్రో బడ్జెట్ చిత్రాలకు బడ్జెట్, ఇతర వనరులు చాలా తక్కువగా ఉంటాయి. లేదా పెద్ద చిత్రాలతో పోలిస్తే అసలేమీ ఉండవు!

కట్ టూ డీటీహెచ్ ఎట్‌సెటెరా - 

కొద్దినెలలే. రోజులే. అంతా ఇక డీటీహెచ్ (డైరెక్ట్ టూ హోమ్) పధ్ధతిలోగానీ, మరోరకంగా గానీ ఆన్‌లైన్లో టికెట్లు కొనుక్కొని డౌన్‌లోడ్ చేసుకొనిగానీ సినిమాలు చూస్తారు. ఇకముందంతా జరగబోయేది ఇదే.  

ఆ మధ్య కమలహాసన్ తన "విశ్వరూపం" సినిమాను ఈ పధ్ధతిలో విడుదలచేయడానికి ప్రయత్నిస్తే ఓ నానా గొడవలు, రాజకీయాలు చేశారు. కానీ, ఆధునికంగా వస్తున్న సాంకేతిక అభివృధ్ధిని ఆపడం ఎవరివల్లా కాని పని అని ఇంకొంత కాలానికైనా మన సోకాల్డ్ అషాఢభూతులు ఒప్పుకొని తలవంచకతప్పదు!