Thursday 30 January 2020

సినిమా తీయడానికి కావల్సింది డబ్బు ఒక్కటే కాదు!

చాలా ఏళ్ల క్రితం నేనో ఇంటర్వ్యూ చదివాను.

అది తమ్మారెడ్డి భరద్వాజ గారిది.

ఆ ఇంటర్వ్యూలో నేను చదివిన ఒక ఆసక్తికరమైన విషయం నాకిప్పటికీ గుర్తుంది.

"తెల్లవారితే సినిమా ఓపెనింగ్. జేబులో వంద కాగితం మాత్రమే ఉంది!"

నమ్ముతారా?

నమ్మితీరాలి.

అంతకుముందు నేనూ పెద్దగా నమ్మలేదు. అంతా ఉట్టి డ్రామా అనుకున్నాను. కానీ, అది డ్రామా కాదు, 100% నిజం అని ఇప్పుడు నేను నమ్ముతున్నాను.

ఏదిగానీ తనదాకా వస్తేగానీ తెలీదు కదా!

కట్ టూ మన పాయింట్ -   

ప్రొడ్యూసర్, డైరెక్టర్‌గా భరద్వాజ గారు సుమారు 30 సినిమాలు తీశారు. తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో సార్లు ఎన్నో పదవుల్ని చేపట్టారు. ఇప్పటికీ ఇండస్ట్రీలో చాలా యాక్టివ్‌గా ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. ఎవరో ఒకరికి ఏదో సహాయం చేస్తూనే ఉంటారు.

ఇంతకూ ఏమయింది? తెల్లవారిందా మరి??

తెల్లవారింది. అన్నీ వాటంతటవే సమకూరాయి. ఆ సినిమా ఓపెనింగ్ కూడా బ్రహ్మాండంగా జరిగింది.

సినిమా పేరు నాకు గుర్తులేదు. బహుశా అది హిట్ కూడా అయ్యే ఉంటుంది.

మరో ఇంటర్వ్యూలో సత్యజిత్ రే ఒక మాటన్నారు. దీన్ని నేను ఇప్పటికే ఫేస్‌బుక్‌లో ఓ మూడునాలుగు సార్లు కోట్ చేశాను.

మొన్నీమధ్యే లేటెస్టుగా దీన్ని కోట్ చేసినప్పుడు .. నా మిత్రురాలు, కె రాఘవేంద్రరావు గారి శిష్యురాలు, కాబోయే డైరెక్టర్ ప్రియదర్శిని ఓ పంచ్ లాంటి కామెంట్ పెట్టారు: "ఆ కొటేషన్ చదివేనండీ ఇక్కడకొచ్చి ఇలా ఇరుక్కుపోయాం!" అని.

ఇంతకూ సత్యజిత్ రే చెప్పింది ఏంటంటే - "సినిమా తీయాలన్న సంకల్పం ముఖ్యం. అదుంటే చాలు. అన్నీ అవే సమకూరతాయి!" అని.

భరద్వాజ గారి సంకల్పమే ఆరోజు వారి సినిమా ఓపెనింగ్ సాఫీగా జరిగేట్టు చేసిందన్నది నా వ్యక్తిగత నమ్మకం.

సినిమాకయినా, జీవితంలో ఇంక దేనికయినా .. అది చిన్న పనైనా, పెద్ద పనైనా .. సంకల్పం అనేది చాలా ముఖ్యం.

కట్ టూ ఫినిషింగ్ టచ్ - 

"భరద్వాజ గారి ఆ సినిమా పేరు... 'ఊర్మిళ'. మాలాశ్రీ తో చేశారు" అని తర్వాత చందు తులసి గారు గుర్తుచేశారు.

సినిమా తీయడానికి కావల్సింది డబ్బు ఒక్కటే కాదు. గట్స్ కూడా!

అది అందరివల్లా అయ్యే పని కాదు.

అయితే, ఈ గట్స్‌ను మించిన శక్తులు కూడా కొన్నుంటాయి. వీటిని తప్పించుకోవడం అన్నది ఇండస్ట్రీలో ఎవరివల్లా కాదు. ఈ శక్తుల్లో ఏ శక్తి ఎప్పుడు ఏ రూపంలో దాడిచేస్తుందో కూడా ఎవరూ ఊహించలేరు.

ఈ శక్తులు టీమ్‌లో ఉంటాయి. టీమ్ బయటా ఉంటాయి. అసలు టీమ్‌తో, సినిమాతో సంబంధంలేని రూపంలో అనూహ్యంగా ఇంటా బయటా కూడా ఉంటాయి. కొన్నిసార్లు అసలు సినిమా పూర్తయ్యేదాకా కనిపించని ఈ శక్తులు, సినిమా పూర్తయ్యాక సడెన్‌గా ఆఫీసులో దర్శనమిస్తాయి.

ఇండస్ట్రీలో, ఇండస్ట్రీలోని వ్యక్తుల్లో ఎన్ని స్లంప్‌లైనా రావొచ్చు, ఎన్ని మార్పులైనా రావొచ్చు. ఈ శక్తులు మాత్రం ఎప్పుడూ ఎవర్ గ్రీనే.   

ఈ శక్తుల ప్రభావం వల్ల అనుకున్న సినిమాలు ప్రారంభం కావు... ప్రారంభమైన సినిమాలు ఆగిపోతాయి... పూర్తయిన సినిమాలు రిలీజ్ కావు... రిలీజై  చాలా బాగున్న సినిమాల్ని ఆడనివ్వరు... ఇట్లా ఎన్నో, ఎన్నెన్నో...

ఇప్పుడైనా, ఎప్పుడైనా - ఇండస్ట్రీలో పేరు తెచ్చుకొని నిలదొక్కుకున్న ప్రతి ప్రొడ్యూసరూ, డైరెక్టరూ, ప్రతి ఆర్టిస్టూ, టెక్నీషియనూ... ఇలాంటి ఎన్నో శక్తులను, ఎన్నెన్నోసార్లు, ఎన్నో రూపాల్లో ఎదుర్కొని బయటపడ్దవాళ్లే. 

సూపర్ గట్స్!!  

Sunday 26 January 2020

మట్టితో గద్దెకట్టిన నాటి పంద్రాగస్టు, చబ్బీస్ జనవరి రోజులేవీ?

నా చిన్నతనంలో పంద్రాగస్టు, చబ్బీస్ జనవరి అంటే నిజంగా ఒక పండగే.

కనీసం ఒక మూడు రోజులు వరంగల్‌లోని మా ఇంటిచుట్టూ పెద్ద సందడి.

చెప్పలేనంత హడావిడి ..

జెండాగద్దె సరిగ్గా మా ఇంటిముందే!

పంద్రాగస్టుకు, చబ్బీస్ జనవరికి ప్రతి సంవత్సరం రెండుసార్లు ఫ్రెష్‌గా రాగడిమట్టి తెచ్చి తడితడిగా గద్దె కట్టాల్సిందే.

తర్వాత ఎర్రమట్టితో అలకాల్సిందే ..

సలేందర్, ప్రతాప్, స్వామి, శంకర్, భిక్షపతి .. ఇంకో పదిమంది ఆనాటి యువతరం ఒక గ్రూప్. వయసులో వీళ్లకంటే కొంచెం చిన్నవాడయినా.. మా అన్న దయానంద్ కూడా ఇదే గ్రూపు.

ఈ గ్రూపంతా కలిసి వారం ముందునుంచే అర్థరూపాయి, రూపాయి, రెండు రూపాయల చొప్పున చందాలు వసూలుచేసేవాళ్లు.

రాత్రి పొద్దుపోయేవరకూ మా ఇంటిముందున్న అరుగులపైన కూర్చుని - కనీసం వారం పదిరోజుల ముందునుంచే "ఈసారి జెండావందనం కొత్తగా ఎలా చేయాలి" అన్నదానిమీద ఈ గ్రూపంతా చర్చలు జరిపేవాళ్లు.

వాళ్లకంటే ఓ పదేళ్లు తక్కువ వయసువాళ్లమయిన  నేనూ, నా చిన్న గ్రూపు కూడా అక్కడే వాళ్ల చుట్టూ నిల్చుని అవన్నీ ఆసక్తిగా వింటూవుండేవాళ్లం.

మా వీధి మొత్తంలో అప్పుడు మా ఇల్లే చాలా పెద్దది.

జెండాను ఎగురవేసే గద్దె కూడా సరిగ్గా మా ఇంటిముందే ఉండటంతో దానికి సంబంధించిన ప్రతి పనీ, ప్రతి సడీ మాకూ తెలిసేది.

జెండావందనం కోసం కొనుక్కొనివచ్చిన రంగురంగుల జెండా కాగితాలు, ఇతర వస్తువులన్నీ తెచ్చి మా ఇంట్లోనే పెట్టేవాళ్లు. కొబ్బరికాయలు, పండ్లు, చాక్లెట్లతోసహా!

వీధి ఈ చివరినుంచి ఆ చివరిదాకా - ఎన్నో వరుసలు సుతిలితాడు కట్టి, మైదాపిండితో చేసిన "లై"తో, చిన్నపిల్లలం మేము అందిస్తుంటే, ఈ పెద్దవాళ్లు జెండాలు అతికించేవాళ్లు. తర్వాత ఈ జెండాల్నే వీధంతా తోరణాలుగా కట్టేవాళ్లు.

జెండావందనం రోజు నిజంగా పెద్ద పండగే.

ముందురోజు రాత్రే ఫ్రెష్‌గా తెచ్చిన మట్టితో అప్పటికప్పుడు మూడు అంచెల్లో గద్దె తయారయ్యేది. ఎర్రమట్టితో దానికి కోటింగ్ కూడా!

తెల్లవారకముందునుంచే మైకులో గ్రామఫోన్ రికార్డ్ పాటలు. దేశభక్తి పాటలు, భగవద్గీత.

గ్రూపులో ఒక్కో సంవత్సరం ఒక్కోరు జెండా ఎగురవేసేవారు.

తర్వాత స్వీట్లు, కొబ్బరి, చాక్లెట్లు అక్కడున్న మా అందరికేకాదు..ఇంటింటికి వెళ్లి మరీ పంచేవాళ్లు.

కట్ టూ ప్రెజెంట్ -

అప్పటి ఆ యువతరం గ్రూపులో కొందరు ఇప్పుడు లేరు. నా చిన్ననాటి మిత్రుల్లో కూడా  ఓంప్రకాశ్, జయదేవ్ ఇప్పుడు లేరు. ఉన్నవాళ్లు ఎవరెవరు ఎక్కడున్నారో కూడా పూర్తిగా తెలియదు.

ఆనాటి ఆ మట్టి జెండాగద్దె ప్లేస్‌లో ఇప్పుడు ఒక పర్మనెంట్ సిమెంట్ గద్దె ఉంది.

ఎలా చేస్తున్నారో, ఎవరు చేస్తున్నారో తెలియదు. ఇవాళ ఎవరు జెండా ఎగరేశారో తెలియదు.  ఆనాటి సీరియస్‌నెస్ ఇప్పుడు కూడా ఉందా అని నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడూ.

అప్పటి దేశభక్తి వేరు. అప్పటి స్వఛ్ఛత వేరు. అప్పటి ఆసక్తులు, ఇష్టాలు, ప్రాధాన్యతలు.. అన్నీనిజంగా వేరే.

ఎన్నో ఏళ్లతర్వాత, ఈరోజు, ఇలా .. వరంగల్లోని నా చిన్ననాటి పంద్రాగస్టు, చబ్బీస్ జనవరిల  గురించి ఇట్లా నెమరేసుకుంటున్నానంటే .. నిశ్చయంగా క్రెడిట్ గోస్ టూ నా తల్లిదండ్రులు, నేను పుట్టిపెరిగిన నా వరంగల్, నా చిన్ననాటి స్నేహితులు, అప్పటి స్వచ్ఛత, అప్పటి వాతావరణం.     

మన పిల్లలకు మనం ఇవ్వాల్సింది ఆస్తులు, అంతస్తులు మాత్రమే కాదు. మంచి వాతావరణం, మంచి జ్ఞాపకాలు కూడా! 

Tuesday 7 January 2020

PROUD FUNDING for Film Production - CF5

అమెరికాలో, ఇతర పాశ్చాత్య దేశాల్లో - ఇండీగోగో, కిక్‌స్టార్టర్ వంటి క్రౌడ్‌ఫండింగ్ సైట్స్ ద్వారా కంట్రిబ్యూట్ చేసినవాళ్లకు... డివిడిలు, టీషర్ట్స్, క్యాప్స్, ఆటోగ్రాఫ్ చేసిన వస్తువులు, ప్రీమియర్‌కు ఉచిత ఆహ్వానం, టీమ్‌తో ఒకపూట డిన్నర్...

ఎంత ఇన్వెస్ట్ చేసినవాళ్లకయినా అక్కడ తిరిగి వచ్చేవి ఇవే.

టాప్ రేంజ్‌లో కంట్రిబ్యూట్ చేసినవాళ్లకు మాత్రం టైటిల్ కార్డ్స్‌లో పేరు వేస్తారు. అంతకు మించి ఏదీ ఉండదు.

ఇదంతా అమెరికాలో, ఇతర పాశ్చాత్యదేశాల్లో అలవాటు. అత్యంత విజయవంతంగా నడుస్తున్న అక్కడి పధ్ధతి.

Cut to The Irresistible Offer -

ఫారిన్‌లో ఇచ్చే ఈ క్యాప్‌లు, టీషర్ట్స్, డివిడిలు, డిన్నర్లు పక్కనపెడితే... కేవలం ఒకే ఒక చిన్న బాధ్యతాయుతమయిన ట్విస్ట్ ఇవ్వటం ద్వారా... అక్కడి ఈ క్రౌడ్ ఫండింగ్ సిస్టమ్‌ను, మన దేశంలో కూడా సక్సెస్ చేయొచ్చని నా ఉద్దేశ్యం.

ఆ పాజిటివ్ ట్విస్ట్ మరేదో కాదు...

మీరు ఇచ్చే ఎంత చిన్న ఫండ్ అయినా సరే, సినిమా బిజినెస్ అయిన తర్వాత వచ్చే లాభాల్లో దానికి ప్రపోర్షనేట్ షేర్ ఉంటుంది.

Associate Producers గా మీ పేరు వెండితెరపైన టైటిల్ కార్డ్స్‌లో వస్తుంది.

మీరు ఫండింగ్ చేసేది కూడా ఒక అతి చిన్న మొత్తం.

ఎవ్వరయినా సరే ఇన్‌వెస్ట్ చెయ్యాల్సింది ఆ చిన్న మొత్తాన్నే.

ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ కానేకాదు.

అయితే ఇండస్ట్రీమీద ప్యాషన్, మా ప్రొడక్షన్ మీద నమ్మకం, తగిన ఆర్థిక స్వేచ్చ ఉన్నవాళ్లు మాత్రం ఒకటికంటే ఎక్కువ యూనిట్స్ ఫండింగ్ చేయొచ్చు.

ఇదంతా పేపర్ పైన వ్రాతపూర్వకంగా, లీగల్‌గా జరిగే ఒక క్రియేటివ్ బిజినెస్ ట్రాన్సాక్షన్.

చిన్న స్థాయిలోనయినా సరే,
సినిమాల్లో ఇన్వెస్ట్ చేయాలన్న ఆలోచన ఉన్నవారికి
ఇదొక మంచి అవకాశం.

చిన్న బడ్జెట్‌లోనే ఎక్కువ సినిమాలు నిర్మించడానికి,
ఎక్కువమంది కొత్త ఆర్టిస్టులు-టెక్నీషియన్లను
ఇండస్ట్రీకి పరిచయం చెయ్యడానికి,
ఎక్కువమంది యువతకు ఉపాధి కల్పించడానికి
నేను చేస్తున్న ఈ ప్రయత్నంలో,
మీవంతుగా మీరూ ఒక చేయివేసి ప్రోత్సహించడానికి
మీకిదో మంచి అవకాశం.

ఆసక్తి ఉన్నవారు వెంటనే కాంటాక్ట్ చేయవచ్చు.

Welcome to Film Industry…
^^^

Manohar Chimmani,
MA, MLISc, Adv Dip in Russian, PG Dip in Journalism
PG Dip in Advertising and Management
Double Gold Medalist

Nandi Award Winning Writer and Film Director
Life Member: Telugu Film Chamber of Commerce
Life Member: Telugu Film Directors’ Association


Profile in brief: https://youtu.be/KLIhr__NTjM 
Twitter: https://twitter.com/MChimmani 
Facebook Page: https://facebook.com/onemano

Contact: 
email: mchimmani@gmail.com
WhatsApp: +91 9989578125  

Monday 6 January 2020

మనదేశపు తొలి "క్రౌడ్ ఫండింగ్" సినిమా - CF4

"క్రౌడ్ ఫండింగ్" అనే పదం ఈ మధ్యనే అమెరికాలో పుట్టింది. క్రౌడ్ ఫండింగ్ వెబ్‌సైట్స్ వచ్చాయి. అక్కడ బాగా విజయవంతమయ్యాయి.

కానీ. దాదాపు 44 ఏళ్లక్రితమే శ్యాం బెనెగల్ దర్శకత్వం వహించిన చిత్రం "మంథన్" మనదేశపు తొలి క్రౌడ్ ఫండింగ్ సినిమా. ఇది 1976 లోనే వచ్చింది. 

మంథన్ సినిమా నిర్మించడానికి కావల్సిన మొత్తం 10 లక్షల బడ్జెట్‌ను అప్పట్లో "వైట్ రెవల్యూషన్" కు కారకుడు, "అమూల్" సంస్థ చైర్మన్ డాక్తర్ కురియన్ వర్గీస్ ఈ క్రౌడ్ ఫండింగ్ పధ్ధతిలోనే సమకూర్చిపెట్టాడు.

మొత్తం 5 లక్షలమంది పాల ఉత్పత్తిదారుల నుంచి, మనిషికి 2 రూపాయల చొప్పున తీసుకొని మొత్తం 10 లక్షలు మంథన్ సినిమా బడ్జెట్ శ్యాం బెనెగల్‌కు ఇచ్చి సినిమా చేయించాడాయన.

అలా తీసిన భారతదేశపు తొలి క్రౌడ్ ఫండెడ్ సినిమా మంథన్, ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులను రివార్డులను సాధించిపెట్టింది.

పేరు, అవార్డులతోపాటు... ఆ సినిమాకు లాభాలు కూడా బాగానే వచ్చాయి అప్పట్లో.

CUT TO -

కిక్‌స్టార్టర్, ఇండీగోగో వంటి  క్రౌడ్ ఫండింగ్ సైట్స్ మన దేశంలోనూ చాలా వచ్చినా, వాటిలో ఏ ఒక్కటీ కిక్‌స్టార్టర్ స్థాయిలో సక్సెస్ కాలేదు.  మన క్రౌడ్ ఫండింగ్ సైట్స్ ఎందుకని సఫలం కాలేదో కూడా కొంత చెప్పాను.

ఈ క్రౌడ్ ఫండింగ్ పధ్ధతినే, ఒక చిన్న బాధ్యతాయుతమయిన ట్విస్ట్‌తో, మన దగ్గర కూడా సక్సెస్ చేయవచ్చునేమోనని నాకనిపించింది. అదే ఈ సీరీస్‌లో చివరి పోస్టుగా, బహుశా రేపే ఈ బ్లాగ్‌లో రాసి పోస్ట్ చేస్తాను.
^^^^^^

PS: మీలో /మీకు తెలిసిన వారిలో , అతి తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తో  సినీ ఫీల్డులోకి  ఎంటర్ అవ్వాలన్న ఆసక్తి ఉన్న మైక్రో ఇన్వెస్టర్లు ఎవరైనా ఉన్నట్లయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం నేరుగా నన్ను సంప్రదించాల్సిన ఈమెయిల్ ఇది: mchimmani@gmail.com   

Sunday 5 January 2020

"క్రౌడ్ ఫండింగ్" మనదగ్గర ఎందుకు సక్సెస్ కాదు? - CF3

కిక్‌స్టార్టర్, ఇండీగోగో వంటి ఎన్నో సైట్స్ - అమెరికాలోనూ, ఇతర పాశ్చాత్య దేశాల్లోనూ సక్సెస్‌ఫుల్‌గా ఎంతో సెన్షేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఎందరి ప్రాజెక్టులకో ఊహించని స్థాయిలో సపోర్ట్ ఇస్తున్నాయి.

మనదగ్గర ఇలాంటి ప్రయత్నాలు చాలానే జరుగుతున్నాయి. కానీ, ఇప్పటివరకు  కనీసం ఒక్కటంటే ఒక్క సైట్ కూడా పైన నేను చెప్పిన రెండి సైట్స్ దరిదాపుల్లోకి కూడా రాలేకపోయింది. 

చాలా సైట్స్  తుస్సుమన్నాయి. దీనికి కారణాలు అనేకం.

అక్కడ అమెరికాలో, ఇతర పాశ్చాత్య దేశాల్లో - క్రౌడ్‌ఫండింగ్ సైట్స్ లో ఒక ప్రాజెక్ట్ కోసం ఇచ్చిన డబ్బు వెనక్కిరాదు. ఉదాహరణకు నేను చెప్పిన ఇండీగోగో, కిక్‌స్టార్టర్ సైట్స్ చూడండి. మీకే అర్థమయిపోతుంది. (ఇక్కడ ప్రాజెక్ట్ అంటే సినిమా అనే కాదు. ఏ ప్రాజెక్టయినా కావొచ్చు.)

సినిమా ప్రాజెక్ట్ అయితే - కంట్రిబ్యూట్ చేసినవాళ్లకు డివిడిలు, టీషర్ట్స్, క్యాప్స్, ఆటోగ్రాఫ్ చేసిన వస్తువులు, ప్రీమియర్‌కు ఉచిత ఆహ్వానం, టీమ్‌తో ఒకపూట డిన్నర్!

అక్కడ ఇవే .. ఎంత ఇన్వెస్ట్ చేసినవాళ్లకయినా తిరిగి వచ్చేవి.

టాప్ రేంజ్‌లో కంట్రిబ్యూట్ చేసినవాళ్లకు మాత్రం టైటిల్ కార్డ్స్‌లో పేరు వేస్తారు. అంతే. అంతకు మించి ఏదీ ఉండదు.

ఇదంతా అక్కడ అమెరికాలో, ఇతర పాశ్చాత్యదేశాల్లో అలవాటు. ఇదే అక్కడి పధ్ధతి.

అదిక్కడ మన దేశంలో ఎంతమాత్రం కుదరని పని. ముఖ్యంగా మన సెటప్‌లో.

వాటిల్లో కొన్ని కారణాలు :

> మనవాళ్లు రూపాయి పెట్టుబడి పెడితే తెల్లవారే 100 రూపాయలు రావాలనుకుంటారు.

> ఎదుటివారిలోని క్రియేటివ్ ప్యాషన్‌ని అర్థం చేసుకోవాల్సిన అవసరం వీరికి కనిపించదు, లేదు. మన మైండ్‌సెట్స్ అలాంటివి. తప్పేం లేదు.

> ఇంకెవరయినా ఇంట్రెస్ట్ ఉన్నవాడు పెడుతున్నా వద్దని వారిస్తారు. అవసరమయితే, అదే డబ్బుతో ఏ లిటిగేషన్ ఉన్న ల్యాండుకో అడ్వాన్స్ ఇప్పిస్తారు.

> ఎవరయినా మహానుభావుడు మంచి ఉద్దేశ్యంతో కొంత పెట్టుబడి పెట్టినా, ఆ మొత్తం ప్రాజెక్టును ఎట్లా చెడగొడతామా అని అలోచిస్తారు. అంత పని చేస్తారు కూడా.

> అన్నింటికంటే ముందు.. "అసలు నువ్వు మా డబ్బులు పట్టుకుని ఉడాయిస్తే!?".. అన్న డౌట్ వీళ్లని వెంటాడి వేధిస్తుంది.

> మన దగ్గర డబ్బులు పెట్టే ప్రతి ఒక్కరికీ కథ చెప్పాలి. అది ప్రతి ఒక్కరికీ నచ్చాలి. క్రౌడ్ ఫండింగ్ కి కనీసం ఒక 100 మంది అయినా అవసరం. అలాంటప్పుడు.. ఏ ఒక్క కథయినా ఆ 100 మందిలో అందరికీ నచ్చుతుందా?

ఇలా చెప్పుకుంటూపోతే బోలెడు..

జస్ట్ ఈ సైట్స్‌ని విజిట్ చేయండి సరదాకి. బయట ఏం జరుగుతోందీ.. మనం ఎక్కడున్నామో.. ఒక ఐడియా వస్తుంది. ఆ అయిడియా మనలో కొందరికయినా అవసరమని నా ఉద్దేశ్యం.

సినిమాలు తీయడం ఒక్కటే కాదు.. ఈ క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఇంకెన్నో కూడా సాధించొచ్చు. అదికూడా మనలో చాలామందికి తెలియాలి. ఎవరు ఏదయినా సాధించొచ్చు..

చెప్పలేం.. మనవాళ్లలోనూ ఉన్నారు మార్క్ జకెర్‌బర్గ్‌లు! 
^^^^^^

మీలో /మీకు తెలిసిన వారిలో , అతి తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తో  సినీ ఫీల్డులోకి  ఎంటర్ అవ్వాలన్న ఆసక్తి ఉన్న మైక్రో ఇన్వెస్టర్లు ఎవరైనా ఉన్నట్లయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం నేరుగా నన్ను సంప్రదించాల్సిన ఈమెయిల్ ఇది: mchimmani@gmail.com   

Saturday 4 January 2020

క్రౌడ్ ఫండింగ్ - CF2

సినిమాలమీద, సినిమా బిజినెస్ మీద, సినిమాల్లో ఇన్వెస్ట్ చేయడం మీద ఆసక్తి ఉన్నవారికి ఒక మంచి మార్గం, ఒక మంచి అవకాశం "క్రౌడ్ ఫండింగ్" సిస్టమ్.

కిక్‌స్టార్టర్, ఇండీగోగో వంటి భారీ సైట్స్‌తో అంతర్జాతీయంగా ఈమధ్యే బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన ఈ సిస్టమ్ ఇంకా మన దగ్గర చాలా మందికి తెలియదు.

ఇండియాలో ఇలాంటి క్రౌడ్ ఫండింగ్ సైట్స్ కొన్ని వచ్చినా, వాటిలో ఒకటి రెండు మాత్రమే కొంతవరకు ప్రాచుర్యం పొందాయి. ఇంకా అవి పాపులర్ కావల్సివుంది.

నాకు తెలిసినంతవరకు, మన దేశంలో ఈ పధ్ధతిని అనుసరించి ఇప్పటికి మొత్తం కలిపి ఒక పది సినిమాలు తయారై వుంటే గొప్పే.

లూసియా, తిథి, రామ రామ రే, ఆపరేషన్ అలమేలమ్మ, స్టూడెంట్స్... నాకు తెలిసి కన్నడలో వచ్చిన క్రౌడ్ ఫండెడ్ సినిమాలు.

హిందీలో కూడా కొన్ని వచ్చాయి. కానీ, కన్నడలో ఈ అవకాశాన్ని వినియోగించుకొన్నంతగా మరే ఇతర భారతీయ భాషల ఇండస్ట్రీల్లో వినియోగించుకోలేకపోయారు.

తెలుగులో చాలా ప్రయత్నాలు జరిగాయి కాని, అవేవీ ముగింపుదాకా వెళ్లలేకపోయాయి. ఇదే పధ్ధతిలో తీసామని కొందరు చెప్పే కొన్ని తెలుగు సినిమాలను వివిధ కారణాలవల్ల పూర్తిగా క్రౌడ్ ఫండెడ్ సినిమాలు అనలేం.

2020లో, తెలుగులో, నేను మాత్రం కనీసం ఒక్కటైనా క్రౌడ్ ఫండెడ్ సినిమా తప్పక తీస్తాను. ఇప్పుడు పూర్తిగా నా ప్రధాన వ్యాపకంగా సినిమాలనే పెట్టుకొన్నాను కాబట్టి, దీని మీద చాలా అధ్యయనం కూడా చాలా చేసి ఉన్నాను కూడా కాబట్టి, దీని గురించి ఇంత కాన్‌ఫిడెంట్‌గా చెప్పగలుగుతున్నాను. 

కట్ టూ మన టాపిక్ -

ఒక ప్రాజెక్ట్ కోసం ఒక్కరే మొత్తం పెట్టుబడి పెట్టకుండా - తక్కువ మొత్తంలో పెట్టుబడి పెడుతూ ఎక్కువమంది షేర్‌హోల్డర్స్ కావొచ్చు.

ఉదాహరణకి -

అంతా కొత్తవారితో ఒక పూర్తి స్థాయి ఫీచర్ ఫిలిం తీసి, రిలీజ్ చేయడానికి ఒక కోటి బడ్జెట్ కావాలనుకొంటే .. ఆ మొత్తం ఒక్కరే పెట్టాల్సిన పనిలేదు.

40 మంది ఒక లక్ష చొప్పునగాని; 25 మంది 2 లక్షల చొప్పునగాని; లేదా ఓ 10 మంది 10 లక్షల చొప్పునగాని పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పధ్ధతిలో ఎవ్వరికీ పెద్ద రిస్క్ ఉండదు.

త్వరలో నేను ప్రారంభించబోతున్న నా కొత్త సినిమాలకు, ఈ సిస్టమ్‌లో ఇన్వెస్ట్ చేయడానికి సిధ్ధంగా ఉన్నవారికి ఇదే నా ఆహ్వానం.

నిజంగా మీలో అంత ఆసక్తి ఉండా?
చిన్నస్థాయిలో వెంటనే పెట్టుబడి పెట్టగలరా?

అయితే .. పూర్తి వివరాలకోసం వెంటనే మీ మొబైల్ నంబర్‌తో నా ఫేస్‌బుక్‌కు గానీ, ట్విట్టర్‌కు గానీ మెసేజ్ పెట్టండి. నేనే మీకు కాల్ చేస్తాను.
^^^

పి ఎస్: మీకు తెలిసి ఈ వైపు ఆసక్తి ఉన్నవాళ్లు ఎవరయినా ఉంటే, వారికి ఈ ఇన్‌ఫర్మేషన్ లింక్ పంపించండి. థాంక్స్ ఇన్ అడ్వాన్స్! దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం నేరుగా నన్ను సంప్రదించాల్సిన ఈమెయిల్ ఇది: mchimmani@gmail.com

"క్రౌడ్ ఫండింగ్" అంటే మీకు తెలుసా? - CF1

అమెరికాతో పాటు, కొన్ని ఇతర అభివృధ్ధిచెందిన దేశాల్లో  ఈమధ్య బాగా ప్రాచుర్యం పొందిన పదం - క్రౌడ్ ఫండింగ్.

ఎవరైనా ఏదయినా ప్రాజెక్ట్ ప్రారంభించడానికో, లేదంటే - ఆల్రెడీ ప్రారంభించిన ఒక ప్రాజెక్ట్ ని పూర్తి చేయడానికో అవసరమయిన డబ్బు లేనప్పుడు, చిన్నచిన్న మొత్తాల్లో ఎక్కువమంది నుంచి ఆ డబ్బు సేకరించడమే క్రౌడ్ ఫండింగ్.

ఉదాహరణకు,  సినిమా విషయమేతీసుకుందాం.

ఒక ఇండిపెండెంట్ సినిమా తీయడానికి ఓ కోటిరూపాయలు కావాలనుకుంటే - ఆ మొత్తాన్ని ఒక 100 మంది దగ్గర తలా ఒక లక్షరూపాయల చొప్పున సేకరించడం సులభం.

అలా కాకుండా - ఒక 10 మంది ఒక లక్ష చొప్పున, మరొక నలుగురు 2 లక్షల చొప్పున. ఇంకో నలుగురు 5 లక్షల చొప్పున, ఒక ఇద్దరు 10 లక్షల చొప్పున... ఇలా వివిధ డినామినేషన్లలో కూడా మొత్తం కోటి రూపాయలు సమకూరేవరకు సేకరించవచ్చు. 

సింపుల్‌గా చెప్పాలంటే - ఒక కోటి రూపాయల పెట్టుబడి కోసం ముగ్గురో, నలుగురో కలిస్తే అది "పార్ట్‌నర్‌షిప్" అవుతుంది. అదే కోటి రూపాయల కోసం ఒక 50 మందో, 100 మందో, అంతకంటే ఎక్కువ మందో కలిసిస్తే అది "క్రౌడ్ ఫండింగ్" అవుతుంది.   

అంతర్జాతీయంగా ఈ మధ్య బాగా ప్రాచుర్యం పొందిన ఈ ఫండ్ రైజింగ్ ప్రాసెస్ ని అమలు చేయటం కోసం కిక్ స్టార్టర్, ఇండీగోగో వంటి ఎన్నోవెబ్ సైట్లున్నాయి. వాటి కమిషన్, ఇతర సర్విస్ చార్జీలు, టాక్స్ వగైరా  అవి తీసుకుంటాయి.

ఒకసారి ఆ సైట్స్‌కు వెళితే ఎవరికయినా  విషయం పూర్తిగా అర్థమైపోతుంది.

CUT TO -

ఒకప్పుడు 'ఇండీ సినిమా' (ఇండిపెండెంట్ సినిమా) అంటే ఒక యజ్ఞంలా జరిగేది. డబ్బే ప్రధాన సమస్య కాబట్టి, సినిమా పూర్తిచేయడానికి సంవత్సరాలు కూడా పట్టేది. 

గెరిల్లా ఫిలిం మేకింగ్, రెనగేడ్ ఫిలిం మేకింగ్, నో బడ్జెట్ ఫిలిం మేకింగ్ లాంటి ధోరణులన్నింటికీ నేపథ్యం ఇదే. సరిపోయేంత డబ్బు లేకుండానే సినిమా పూర్తిచేయడం!

అయితే ఇప్పుడా సమస్య లేదు. రెండు కారణాలవల్ల:

ఒకటి - ఫిలిం మేకింగ్‌లో ఆధునికంగా వచ్చిన సాంకేతిక అభివృధ్ధి. రెండవది - క్రౌడ్ ఫండింగ్. 

ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు చాలా ఇండీ సినిమాలు ఈ క్రౌడ్ ఫండింగ్ వెబ్‌సైట్స్ ద్వారా, లేదా ఆ వెబ్‌సైట్స్‌కి బయట, ప్రత్యేకంగా ఇలాంటి పధ్ధతినే పాటించటం ద్వారా కూడా అనుకున్నంత బడ్జెట్‌ను సులభంగా సేకరించుకోగలుగుతున్నాయి.

ఇదే పధ్ధతిని రెగ్యులర్ కమర్షియల్ సినిమాల నిర్మాణం కోసం కూడా ఈజీగా అనుసరించవచ్చు అని మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదనుకుంటాను.

2013 లో వచ్చిన "లూసియా" అనే కన్నడ సినిమా, ఈ క్రౌడ్ ఫండింగ్ పధ్ధతిలో తయారైన తొలి కన్నడ సినిమా.  50 లక్షల మొత్తం బడ్జెట్‌ను క్రౌడ్ ఫండింగ్ పధ్ధతిలోనే సేకరించి నిర్మించిన ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ఒక్కటే 95 లక్షలు సంపాదించిపెట్టింది. లూసియా మొత్తం కలెక్షన్లు 3 కోట్లు.     

ఆ తర్వాత నాకు తెలిసి, కనీసం ఇంకో అరడజన్ కన్నడ సినిమాలు ఇదే పధ్ధతిలో నిర్మించారు. 

హిందీలో కూడా ఈ పధ్ధతిలో చాలా సినిమాల నిర్మాణం జరిగింది.

తెలుగులో ఏం జరిగిందన్నది తర్వాతి బ్లాగ్‌పోస్టులో చెప్తాను.   
 
సినిమా నిర్మాణం పట్ల, సినిమా బిజినెస్ పట్ల అత్యంత ఆసక్తి ఉండీ, ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టడాన్ని రిస్కుగా భావించి, తమ కోరికని అలా తొక్కిపెట్టి ఉంచేవారికి క్రౌడ్ ఫండింగ్ పధ్ధతి ఒక మంచి అవకాశం.

ఎందుకంటే - వారి ఊహకి అందని విధంగా, ఎంత చిన్న పెట్టుబడితోనయినా వారు ఫీల్డులోకి ప్రవేశించవచ్చు!
^^^

మీలో /మీకు తెలిసిన వారిలో , అతి తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తో  సినీ ఫీల్డులోకి  ఎంటర్ అవ్వాలన్న ఆసక్తి ఉన్న మైక్రో ఇన్వెస్టర్లు ఎవరైనా ఉన్నట్లయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం నేరుగా నన్ను సంప్రదించాల్సిన ఈమెయిల్ ఇది: mchimmani@gmail.com