Monday 6 January 2020

మనదేశపు తొలి "క్రౌడ్ ఫండింగ్" సినిమా - CF4

"క్రౌడ్ ఫండింగ్" అనే పదం ఈ మధ్యనే అమెరికాలో పుట్టింది. క్రౌడ్ ఫండింగ్ వెబ్‌సైట్స్ వచ్చాయి. అక్కడ బాగా విజయవంతమయ్యాయి.

కానీ. దాదాపు 44 ఏళ్లక్రితమే శ్యాం బెనెగల్ దర్శకత్వం వహించిన చిత్రం "మంథన్" మనదేశపు తొలి క్రౌడ్ ఫండింగ్ సినిమా. ఇది 1976 లోనే వచ్చింది. 

మంథన్ సినిమా నిర్మించడానికి కావల్సిన మొత్తం 10 లక్షల బడ్జెట్‌ను అప్పట్లో "వైట్ రెవల్యూషన్" కు కారకుడు, "అమూల్" సంస్థ చైర్మన్ డాక్తర్ కురియన్ వర్గీస్ ఈ క్రౌడ్ ఫండింగ్ పధ్ధతిలోనే సమకూర్చిపెట్టాడు.

మొత్తం 5 లక్షలమంది పాల ఉత్పత్తిదారుల నుంచి, మనిషికి 2 రూపాయల చొప్పున తీసుకొని మొత్తం 10 లక్షలు మంథన్ సినిమా బడ్జెట్ శ్యాం బెనెగల్‌కు ఇచ్చి సినిమా చేయించాడాయన.

అలా తీసిన భారతదేశపు తొలి క్రౌడ్ ఫండెడ్ సినిమా మంథన్, ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులను రివార్డులను సాధించిపెట్టింది.

పేరు, అవార్డులతోపాటు... ఆ సినిమాకు లాభాలు కూడా బాగానే వచ్చాయి అప్పట్లో.

CUT TO -

కిక్‌స్టార్టర్, ఇండీగోగో వంటి  క్రౌడ్ ఫండింగ్ సైట్స్ మన దేశంలోనూ చాలా వచ్చినా, వాటిలో ఏ ఒక్కటీ కిక్‌స్టార్టర్ స్థాయిలో సక్సెస్ కాలేదు.  మన క్రౌడ్ ఫండింగ్ సైట్స్ ఎందుకని సఫలం కాలేదో కూడా కొంత చెప్పాను.

ఈ క్రౌడ్ ఫండింగ్ పధ్ధతినే, ఒక చిన్న బాధ్యతాయుతమయిన ట్విస్ట్‌తో, మన దగ్గర కూడా సక్సెస్ చేయవచ్చునేమోనని నాకనిపించింది. అదే ఈ సీరీస్‌లో చివరి పోస్టుగా, బహుశా రేపే ఈ బ్లాగ్‌లో రాసి పోస్ట్ చేస్తాను.
^^^^^^

PS: మీలో /మీకు తెలిసిన వారిలో , అతి తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తో  సినీ ఫీల్డులోకి  ఎంటర్ అవ్వాలన్న ఆసక్తి ఉన్న మైక్రో ఇన్వెస్టర్లు ఎవరైనా ఉన్నట్లయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం నేరుగా నన్ను సంప్రదించాల్సిన ఈమెయిల్ ఇది: mchimmani@gmail.com