Wednesday, 4 October 2023

జై గురువుగారు!


సినిమాల్లో బాయ్‌గా, సెట్ బాయ్‌గా పనిచేసిన ఎందరో తర్వాత ప్రొడ్యూసర్లు, డైరెక్టర్స్ అయ్యారని చరిత్ర చెప్తోంది. 

"నాకు అనుభవముంది, నేను హిట్స్ ఇచ్చాను" అని కొందరు డైరెక్టర్స్ తమ తర్వాతి సినిమా కోసం ఏళ్ళ తరబడి ప్రొడ్యూసర్‌ను వెతుక్కొంటూనే ఉంటారు... మరోవైపు, ఎలాంటి అనుభవం లేని ఒక కొత్త కుర్రాడు నెల రోజుల్లో ఒక 5 కోట్ల ప్రొడ్యూసర్‌ను ఓకే చేసుకొని, గోవాలో స్టోరీ సిట్టింగ్స్ పెడతాడు. 

మైండ్‌సెట్. లేజర్ ఫోకస్. ఈ రెండే పనిచేస్తాయి. 

"నాకు అంతా తెలుసు" అన్న ఆలోచనలు, ఎనాలిసిస్‌లు ఉన్నచోటే ఉంచుతాయి. ఇంకా ఇంకా వెనక్కి తీసుకెళ్తాయి. 

కట్ చేస్తే - 

"నేను చెయ్యగలను" అన్న మైండ్‌సెట్ లేకుండా గురువుగారు ఒక్కటే సంవత్సరంలో 15 సినిమాలు చేసి రిలీజ్ చేసేవారు కాదు. వాటిలో 70% పైగా హిట్స్, సూపర్ హిట్స్, సిల్వర్ జుబ్లీలు ఇవ్వగలిగేవారు కాదు.    

Tuesday, 3 October 2023

4058 రోజుల ఆత్మీయ స్నేహం!


జీవితంలో ఒక దశ తర్వాత చెయ్యాలనుకున్నది చేసేసుకుంటూ పోవడమే. 

మిగిలిందంతా జస్ట్ బుల్‌షిట్! 

కట్ చేస్తే -   

సినిమా ప్యాషనేట్స్ అయిన కొంతమంది లైక్‌మైండెడ్ మిత్రుల నెట్‌వర్క్‌ను సృష్టించుకొనే ప్రయత్నంలో భాగంగానే ముందు నేనీ బ్లాగ్‌ను సృష్టించాను. 

ఊరికే సినిమా టిడ్‌బిట్స్, రొటీన్ వార్తల్లాంటివి రాయకుండా... నా అనుభవంలో నాకు తెలిసిన ఫిలిం ఇండస్ట్రీ లోపలి విషయాలను లైటర్‌వీన్‌లో, హిపోక్రసీ లేకుండా రాస్తూ పంచుకోవాలన్నది నా ఆలోచన. 

అందుకే, ఈ బ్లాగ్‌కు "నగ్నచిత్రం" అని పేరు పెట్టాను.  

దీన్ని కొంచెం సీరియస్‌గా, కొంచెం ఈజీగా, కొంచెం కేర్‌లెస్‌గా తీసుకొంటూ... ఎప్పుడో తోచినప్పుడు మాత్రం... "ఏదో రాయాలి కాబట్టి రాస్తాను" అన్నట్టుగా అలా రాస్తూపోయాను. 

నెమ్మదిగా బ్లాగింగ్ ఎంత శక్తివంతమైందో నాకర్థమైంది. నా దినచర్యలో ఒక విడదీయరాని భాగమైంది. 

తర్వాత్తర్వాత, నా ఫ్రీలాన్సింగ్ క్రియేటివ్ యాక్టివిటీ మొత్తానికి దీన్నే ఒక "హబ్‌"లా ఉపయోగించుకొంటూ, ఏ ఒక్కదానికీ పరిమితం చేయకుండా అన్నీ దీన్లోనే రాయడం ప్రారంభించాను. 

అందరూ, అన్నీ... ఇక్కడే... నా ఈ బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ మీదే నాకు కనెక్ట్ కావడం ప్రారంభమైంది.   

21 ఆగస్టు 2012 నాడు, నేను అనుకోకుండా సృష్టించిన ఈ "నగ్నచిత్రం" వయస్సు చూస్తుండగానే 11 ఏళ్ళు దాటింది.

ఇవాళ్టికి సరిగ్గా 4058 రోజుల ఆత్మీయ స్నేహం మా ఇద్దరిదీ! 

ఎందరో అద్భుతమైన మిత్రులు నాకు ఇక్కడే పరిచయమయ్యారు. నా జీవితంలో ఎన్నో ముఖ్యమైన మలుపులకు, ఆలోచనలకు ఈ బ్లాగే కారణమయ్యింది. 

నా లేటెస్ట్ బెస్ట్ సెల్లర్ పుస్తకం "కేసీఆర్ - ది ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్" ఆలోచన నాలో రావడానికి కూడా నాకత్యంత ఇష్టమైన నా ఈ బ్లాగింగ్ అలవాటే కారణం.     

కట్ చేస్తే - 

చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ నేను వరుసగా ఓ రెండు మూడు సినిమాలు చెయ్యాలనుకొని సీరియస్‌గా పూనుకోడానికి కూడా ఈ బ్లాగే కారణం.  

గురువుగారు దాసరి నారాయణరావు గారిని గుర్తుకు తెచ్చుకొంటూ అప్పట్లో నేను రాసిన ఒక బ్లాగ్ పోస్టును అనుకోకుండా ఆమధ్య చదివిన తర్వాతే నాకీ ఆలోచన వచ్చింది.  

నవంబర్ దాకా నా కొత్త సినిమా ప్రి-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంటాను కాబట్టి, బ్లాగ్‌ను కొద్దిరోజులు మర్చిపోదామనుకొన్నాను. ఆల్రెడీ నెల దాటింది నేనీ వైపు చూడక! 

కాని, ఏదో కోల్పోయినట్టుగా ఉంది. 

నాకెంతో ఇష్టమైన బ్లాగింగ్ కోసం ఒక 15, 20 నిమిషాలు వెచ్చించలేనంత బిజీగా మాత్రం ఏం లేను అన్న విషయం నాకు బాగా తెలుసు. 

మరింకేంటి?  

సో, హియర్ అయామ్. 

బ్యాక్ టు బ్లాగింగ్. 

"Sometimes I think of blogging as finger exercises for a violinist; sometimes I think of it as mulching a garden. It is incredibly useful and helpful to my “real” writing." 
~Kate Christensen 

Friday, 1 September 2023

కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి!


సినిమా పనుల్లో, సొంత పనుల్లో - ఒక కాన్సెప్ట్‌తో - ముందుకెళ్తున్నాను. సుమారు ఒక 90 రోజుల తర్వాత, నవంబర్ చివరలో మళ్ళీ ఇక్కడ కలుస్తాను. అప్పటిదాకా పెద్దగా ఇటువైపు రాకపోవచ్చు. 

బ్లాగింగ్ వదిలెయ్యలేను. చిన్న గ్యాప్ అంతే.   

కట్ చేస్తే -

నిన్న మా ఆఫీసులో ప్రదీప్, నేను కలిసి చాలా విషయాలు చర్చించుకున్నాం. వాటిలో నాకు బాగా నచ్చిన టాపిక్ - వాట్సాప్‌ను వదిలెయ్యడం! అవసరమైతే ఈమెయిల్ ఉండనే ఉంది. ఈమెయిల్లో ప్రతి కంటెంట్ భద్రంగా ఉంటుంది. సెర్చ్ చెయ్యడం కూడా ఈజీ.   

ఇంకొకటి - నా ఫేవరేట్ నోకియా 3360 కొనుక్కొని తిరిగి ఆ డిస్ట్రాక్షన్ లేని రోజుల్లోకి వెళ్ళిపోవడం! 

ఈ స్మార్ట్ ఫోన్స్ చేసే పనులన్నిటి కోసం మనకు ల్యాప్‌టాప్స్ ఎలాగూ ఉన్నాయి.

ఇలాంటివి ఇంక చాలా ఉన్నాయి... మన జీవితాల్ని మనం ఎంజాయ్ చెయ్యకుండా, మంచి జ్ఞాపకాలను మిగుల్చుకోకుండా మింగేస్తున్నవి... 

Catch you later. 

జ్ఞాపకాలే బాగుంటాయ్!


మా అమ్మానాన్నలకు మేం అందరం అబ్బాయిలమే. నాకు కూడా ఇద్దరూ అబ్బాయిలే.  

ఇది ఒక లోటు అని మా పేరెంట్స్ ఇద్దరూ బాగా ఫీలవుతుంటే నేను లైట్ తీసుకునేవాణ్ణి. కాని, ఇంట్లో ఒక అమ్మాయైనా లేకపోవడం నిజంగా లోటేనని కొన్ని కొన్ని సందర్భాల్లో లోపల్లోపలే బాగా ఫీలయ్యేవాణ్ణి.

కొన్ని షేర్ చేసుకోడానికో, కొన్ని దాచుకోడానికో, కొన్ని సహాయాలు అడగడానికో... ఒక అక్కో చెల్లో నిజంగా అవసరం. 

నా జీవితంలోని ఒకటి రెండు అతి ముఖ్యమైన సందర్భాల్లో నేను ఇది బాగా ఫీలయ్యాను. కాని, ఎప్పుడూ ఎవ్వరిదగ్గరా బయటపడలేదు.
 
కట్ చేస్తే - 

మా చిన్నప్పుడు (వరంగల్లో) మా చిన్నమ్మల కూతుళ్ళు - ఇందిర, మంజుల - ఇద్దరూ ప్రతి రాఖీ పండుగకు టంచన్‌గా టైమ్‌కు మా ఇంటికి వచ్చేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడొస్తారా అని ఎదురుచూసేవాళ్ళం. ఈసారి ఏ మాడల్ రాఖీలు తెస్తారా అని గెస్ చేస్తుండేవాళ్లం. చాలా ఆనందంగా గడిచేది. 

ఇలాంటిదే - ప్రతి మూడేళ్ళకో, నాలుగేళ్ళకో ఒకసారి "కుడుకలు ఇవ్వటం" అనే పండుగ లేదా సీజన్ ఒకటి వచ్చేది. ఇందిర, మంజుల వచ్చి మాకు కుడుకలు ఇచ్చి, నోటి నిండా చక్కెర పోసేవారు. ఈ పండుగ సమయంలో కూడా ఇందిర, మంజుల ఎప్పుడొస్తారా అని ఎదురుచూసేవాళ్లం మేము. 

కట్ చేస్తే - 

1983లో నేను వరంగల్ వదిలేసి హైద్రాబాద్‌కు వచ్చాను...

హైద్రాబాద్‌లో నేను హెచ్ ఎం టి లో పనిచేస్తున్నప్పుడు నా రూమ్‌కు పోస్ట్ ద్వారా వచ్చేవి రాఖీలు. తర్వాత యూనివర్సిటీలో చదువుకొంటున్నప్పుడు ఓయూలో నా హాస్టల్‌కు కూడా పోస్ట్‌లో వచ్చేవి రాఖీలు. తర్వాత నేను నవోదయ విద్యాలయ, గుంటూరులో పనిచేస్తున్నప్పుడు, ఆలిండియా రేడియో ఎఫ్ ఎం కర్నూల్లో పనిచేస్తున్నప్పుడు కూడా మా ఇందిర, మంజుల రాఖీలను పోస్టులో కనీసం ఒకరోజు ముందుగానే చేరేలా పంపేవాళ్ళు. నా పెళ్లయిన కొత్తలో కూడా ఒకటి రెండేళ్ళు రాఖీలు హైద్రాబాద్‌కు పోస్టులో వచ్చాయి. 
 
అంతే గుర్తుంది.

క్రమంగా రాఖీలు పోస్టులో రావడం ఆగిపోయింది. కుడుకలు ఇచ్చే పండుగ గురించి పూర్తిగా మర్చిపోయాను. 

తర్వాత్తర్వాత మేము కలుసుకున్నది కూడా చాలా తక్కువసార్లే. 

వరంగల్‌లోని మా బంధువులందరితో దాదాపు నా కనెక్షన్ కట్ అయిపోయింది. ఏ స్థాయిలో కట్ అయిపోయిందంటే - అక్కడ వరంగల్లో ఏదైనా ఫంక్షన్ అయితే పిలవడానికి కూడా నేను గుర్తుకురానంతగా! 

ఒకవేళ గుర్తుకొచ్చినా - ఏ వాట్సాప్‌లోనో ఒక మెసేజ్ (కాల్ కూడా కాదు!) పెట్టేసి వదిలేసేటంతగా!!
 
ఎవరో థర్డ్ పర్సన్ ఒక ఆరు నెలల తర్వాత చెప్తే గాని నాకు తెలవటం లేదు... కొన్ని ఫంక్షన్స్ జరిగాయని, వాటికి కనీసం నన్ను పిలవలేదని! 

అసలు అలాంటి బంధుత్వాలు అవసరమా అన్నది నా హంబుల్ కొశ్చన్... 

అయితే - ఇది ఎవ్వరి మీదా నా కంప్లైంట్ కాదు.
 
జస్ట్... మన ఆలోచనల్లో, మన జీవనశైలిలో వచ్చిన మార్పు గురించి ఒక అవలోకనం చేసుకోవడం. 

అంతే. 

మానవసంబంధాలను అమితంగా ప్రభావితం చేసిన ఈ మార్పు గురించి నేనిప్పుడసలు ఏమాత్రం బాధపడటం లేదు. 

ఎందుకంటే - ఎవరు ఎలా మారినా, ఏవి ఎలా మారినా - అవన్నీ చిన్నప్పటి నా జ్ఞాపకాలను ఏ మాత్రం మార్చలేవు.

ఆ జ్ఞాపకాలు చాలు నాకు.    

Tuesday, 29 August 2023

Monday, 28 August 2023

"కొత్త" ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, చీఫ్ టెక్నీషియన్స్ కోసం ఆడిషన్స్, ఇంటర్వ్యూలు!


"కొత్త" ఆర్టిస్టులు, అసిస్టెంట్ డైరెక్టర్స్, స్క్రిప్ట్ రైటర్స్, లిరిక్ రైటర్స్, సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ ఎట్సెట్రా కోసం వచ్చే శుక్రవారం 1 సెప్టెంబర్ నుంచి మా ఆఫీసులో ఆడిషన్స్, ఇంటర్వ్యూలు జరుగబోతున్నాయి. 

ఆయా విభాగాల్లో తగిన అర్హతలు ఉండి - అవకాశం కోసం ఎదురుచూస్తున్న "న్యూ టాలెంట్" టచ్‌లో ఉండండి. ఇక్కడే వాటికి సంబంధించిన యాడ్స్ దేనికదే ఇస్తుంటాము. వాటిలో చెప్పిన విధంగా అప్లై చేసుకోండి. కాల్స్ చేయవద్దు. మేం ప్రాథమికంగా ఎన్నిక చేసినవారికి మా ఆఫీసు నుంచి కాల్ వస్తుంది. వాళ్ళు మాత్రమే ఆడిషన్/ఇంటర్వ్యూకి రావచ్చు.  

కట్ చేస్తే -

మా #ManutimeMovieMission ప్రొడక్షన్ హౌజ్ నుంచి ప్రతిష్టాత్మకంగా మల్టిపుల్ ఫిలిం ప్రాజెక్టులను ఒకేసారి సెప్టెంబర్‌లో ప్రారంభించబోతున్నాము. ఈ నేపథ్యంలో - వివిధ విభాగాల్లో మాకు "కొత్త" ఆర్టిస్టులు-టెక్నీషియన్స్, చీఫ్ టెక్నీషియన్స్ అవసరం చాలా ఉంటుంది. 

నా గత చిత్రాల ద్వారా ఇప్పటికే 55+ కొత్త ఆర్టిస్టులను, టెక్నీషియన్స్‌ను పరిచయం చేశాను. వీరిలో హీరోలు, హీరోయిన్స్, విలన్స్, సపోర్టింగ్ ఆర్టిస్టులు, డాన్స్ మాస్టర్స్, కెమెరామెన్, మ్యూజిక్ డైరెక్టర్స్, ఎడిటర్స్... ఇలా ఎందరో ఉన్నారు. నిజంగా మీలో టాలెంట్ ఉండి, సినిమాల్లో ఏదైనా సాధించాలన్న తపన, మంచి డిసిప్లిన్, మంచి కమ్యూనికేషన్, చెదరని ఏకాగ్రత ఉన్నట్టయితే మీరూ రేపు నా కొత్త సినిమా ద్వారా ఫిలిం ఇండస్ట్రీకి పరిచయం కావచ్చు! 

ఆల్ ద బెస్ట్!!  

Sunday, 27 August 2023

సొంత పైత్యం వేరు, సినిమా వేరు! - 2


అంతా కలిపి వీళ్ళొక 50 మంది ఉంటారు. సినిమాల గురించి వీళ్ళు రాసే రాతలు చదివి ఆహా ఓహో అనేవాళ్ళు ఇంకో 100 మంది ఉంటారు. ఈ 150-200 మంది కొనే టికెట్స్‌తో సినిమాలు హిట్లు కావు. వీరి అభిరుచి, వీరి ఆలోచనా విధానం ఒక సినిమా విజయానికి కొలమానాలు కాలేవు.

కట్ చేస్తే - 

పింక్ సినిమాను తెలుగులో పింక్‌లా తీయలేదు అంటాడొక రివ్యూయర్. హిందీ పింక్ కాన్సెప్టును తెలుగులో పవన్ కళ్యాణ్‌తో ఎలా తీస్తే విజయం సాధిస్తుందో ఆ రైట్స్ కొనుక్కున్న ప్రొడ్యూసర్, డైరెక్టర్స్‌కు ఒక స్పష్టమైన ఐడియా ఉంటుంది. అది వాళ్ళ విజన్, వాళ్ళ ఇష్టం. అంతే కాని - పింక్‌ను పింక్‌లా తీయడానికి కోట్లు పెట్టి తెలుగు రైట్స్ కొనుక్కొవడం ఎందుకు... 2 లక్షలు పెట్టి డబ్బింగ్ చేస్తే సరిపోతుంది. 

బేబీ సినిమాకు వంద కోట్లు ఎలా వచ్చాయి అంటాడొకాయన. ఇంకొకాయన నేను మొదటి ఇరవై నిమిషాలకే నిద్రపోయాను అంటూ రాసుకొస్తాడు. మీ రాతల్లోనే ఉంది కదా... మీ ఆలోచనలకు, రివ్యూలనబడే మీ సోకాల్డ్ రాతలకు - సినిమా విజయాలకు అసలు సంబంధమే లేదని!

సినిమా బేసిగ్గా ఒక ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా. పాఠాలు చెప్పే టీచర్ కాదు. నీతి బోధనలు చేసే గురువు కాదు. ఈ స్పృహతో రివ్యూలు రాసేవాళ్ళు కొందరే ఉంటారు. అలాంటి రివ్యూల వల్ల ఏదైనా ఉపయోగం ఉంటుంది. మిగిలినవాళ్ళు రాసే రివ్యూలు అసలు రివ్యూలు కాదు. జస్ట్ బుల్‌షిట్. 

ఫిలిం మేకర్స్ అయినా, రైటర్స్ అయినా, రివ్యూయర్స్ అయినా... ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతుండాలి. యాండ్రాయిడ్ ఫోన్స్, ఐఫోన్స్ మాత్రం వాడతాం కాని, అంతే అడ్వాన్స్‌డ్‌గా మేం ఆలోచించం అంటే అంతకంటే చెత్త హిపోక్రసీ ఇంకోటి ఉండదు.   

Saturday, 26 August 2023

సొంత పైత్యం వేరు, సినిమా వేరు! - 1


సినిమా అనేది నాలుగు గోడల మధ్య కూర్చొని రాసుకొనే కవిత్వం కాదు, కథ కాదు. 

మనిష్టం, అవి ఎలాగైనా రాసుకోవచ్చు. 

వీటిల్లో మన ఇజాలు, మన ఇష్టాలు, మన ఇంక్లినేషన్స్, మన బయాస్‌లు, మన హిపోక్రసీలు, మన ఫాల్స్ ప్రిస్టేజ్‌లు, మన కులాలు-మతాలు-ప్రాంతాల గ్రూపులు... అన్నీ మనకు తెలిసో తెలీకుండానో దింపుతాం. తప్పేం లేదు. అది మనిష్టం.  

మన గ్రూపువాడు ఆహా ఓహో అంటాడు. ఇంకో గ్రూపువాడు విమర్శిస్తాడు. అక్కడితో అయిపోతుంది. ది ఎండ్. ఎవ్వరికీ నయా పైసా నష్టం లేదు. 

కట్ చేస్తే -  

సినిమా అలా కాదు. 

దీని వెనుక కోట్ల పెట్టుబడి ఉంటుంది. కనీసం ఒక వందమంది జీవితాలుంటాయి. 

సినిమా ప్రధానోద్దేశ్యం జనబాహుళ్యానికి నచ్చడం, హిట్ కొట్టడం. పెట్టిన కోట్లు నష్టపోకుండా వెనక్కి తెచ్చుకోడం, లాభాలు సంపాదించడం. డబ్బుతోపాటు పేరు దానికదే ఫాలో అవుతుంది. అది వేరే విషయం. 

ఒక పక్కా కమర్షియల్ యాక్టివిటీ.
ఆర్ట్.
బిగ్ బిజినెస్. 

ఈ ప్రాథమిక వాస్తవం అర్థం చేసుకోకుండా- ఈ మాత్రం అవగాహన లేకుండా - సినిమాలపై రాసే సోకాల్డ్ రివ్యూలైనా, రాతలైనా జస్ట్ బుల్‌షిట్. 

అంతే. 

(ఈ టాపిక్ కనీసం ఇంకో 2 పోస్టులవచ్చు! సో, ఇంకా వుంది...)     

Sunday, 20 August 2023

ఫిలిం ఇండస్ట్రీలో మీ ప్రవేశానికి నిజంగా పనికొచ్చే కోచింగ్


హైద్రాబాద్‌లోని ప్రముఖమైన కొన్ని ఫిలిం ఇన్‌స్టిట్యూట్స్‌లో ఫీజు 10 లక్షల నుంచి 27 లక్షల వరకు ఉంది.  

ఇవి కాకుండా - ఇంకో డజన్ పేరున్న ఫిలిం ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయి. వాటిలో ఫీజు 10 వేల నుంచి, లక్ష, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షల వరకు ఉంది. 

ఈ ఇన్‌స్టిట్యూట్స్ అన్నిట్లోను ఎవరికి సాధ్యమైనంత లెవెల్లో వారు బాగానే కోచింగ్ ఇస్తారు. క్లాస్‌రూం టీచింగ్ ఉంటుంది. కెమెరాతో ప్రాక్టికల్స్ ఉంటాయి. (ఒకటి రెండు ఇన్‌స్టిట్యూట్స్‌లో అడ్మిషన్ అవగానే - నా "సినిమాస్క్రిప్టు రచనాశిల్పం" పుస్తకం జిరాక్స్ కాపీ కూడా ఒకటి ఫ్రీగా ఇస్తున్నారు.)

అదంతా ఓకే. 

కోర్స్ అయిపోతుంది. సర్టిఫికేట్ చేతికొస్తుంది. 

వాట్ నెక్స్‌ట్?  

"ఒక్క చాన్స్" కోసం మళ్ళీ అదే ఫిలిం ప్రొడక్షన్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిందే. 

ఫిలిం నగర్, శ్రీనగర్ కాలనీ, యూసుఫ్‌గూడ, గణపతి కాంప్లెక్స్, మణికొండ...

సంవత్సరాలు గడిచిపోతుంటాయి. తెలియకుండా డబ్బు లక్షల్లో ఖర్చయిపోతుంటుంది. 

ఆ ఒక్క చాన్స్ మాత్రం రాదు. 


ఇప్పుడు నేను చేస్తున్న నా ఫీచర్ ఫిలిం టీమ్‌లో మెంబర్‌గా చేరి - యాక్టింగ్, స్క్రిప్ట్ రైటింగ్, డైరెక్షన్ విభాగాల్లో నేరుగా పని చేస్తూ నేర్చుకొనే అవకాశం ఇప్పుడు మీ ముందుంది.

ఫిలిం ఇండస్ట్రీకి నిజంగా పనికొచ్చే కోచింగ్, ఒక్క చాన్స్, స్క్రీన్ మీద మీ టైటిల్ కార్డు... ఈ మూడూ ఒకే ఒక్క మీ నిర్ణయంతో 6 నెలల్లో మీ సొంతమవుతాయి.   

కట్ చేస్తే -  

ఈ కోచింగ్ ఫ్రీ కాదు.    

కనీసం ఒక 5 నుంచి 10 ఏళ్ళ మీ సమయాన్ని, మీ డబ్బును సేవ్ చేసే ఈ కోచింగ్‌కు ఫీజు ఉంటుంది. దాన్ని మీరు అడ్మిషన్ అప్పుడు మొత్తం ఒకేసారి కట్టాల్సి ఉంటుంది.     

అలాగని, అప్లై చేసి ఫీజు కట్టే ప్రతి ఒక్కరికీ ఈ అవకాశం ఇవ్వలేం. 

ఎన్నిక చేసిన అతి కొద్దిమందికి మాత్రమే ఈ అవకాశం. 

ఆసక్తి ఉందా? ఈరోజే నిర్ణయం తీసుకోండి...  

Friday, 18 August 2023

ముంబైలో 60 కోట్ల విలువైన సొంత బంగళాలో ఫిలిం ప్రొడక్షన్ ఆఫీస్ ఎవరికుందో మీకు తెలుసా?


ఎక్కడో హిమాచల్ ప్రదేశ్ నుంచి ఒంటరిగా ముంబై వచ్చింది. అప్పుడు ఇంగ్లిష్ కూడా సరిగ్గా రాదు. అందరూ హేళన చేసేవాళ్ళు "నువ్వేం హీరోయిన్ అవుతావ్" అని. భరించింది. 

ఆ స్టేజి నుంచి - ఇండస్ట్రీలో ప్రతి ఒక్క సమస్యను ఒంటరిగా, ధైర్యంగా ఎదుర్కొంది.  

వ్యక్తిగత జీవితంలో రిలేషన్‌షిప్స్ సమస్యలను కూడా ఒంటరిగా అధిగమించింది. 

తాను అనుకున్నది సాధించింది.

బాలీవుడ్‌లో ఒక టాప్ రేంజ్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. హీరోయిన్‌గా కలెక్షన్స్ రికార్డ్స్ అప్పట్లోనే సాధించింది. 

హీరోయిన్‌గా నటిస్తూనే - డైరెక్టర్ అయింది. రైటర్ అయింది. ప్రొడ్యూసర్ అయింది.   

పద్మశ్రీ తెచ్చుకొంది. 

3 జాతీయ అవార్డులు, 4 ఫిలిం ఫేర్ అవార్డులు కూడా సాధించింది. 

ప్రొడ్యూసర్‌గా ముంబైలోనే 60 కోట్ల విలువైన సొంత బంగళాలో తన సొంత ప్రొడక్షన్ ఆఫీసు ప్రారంభించింది. 

తను సాధించిన ఈ మైల్‌స్టోన్స్ అన్నింటి వెనుక - తన 15 ఏళ్ల ఫిలిం ఇండస్ట్రీ జీవితపు మర్చిపోలేని అనుభవాలున్నాయి. ఘోరమైన అవమానాలున్నాయి. అంతులేని సంఘర్షణ ఉంది.     

కట్ చేస్తే - 

తను ఇప్పుడు ఏ పార్టీకి సపోర్ట్ ఇస్తోంది అన్నది నాకు అనవసరం. అది పూర్తిగా ఆమె వ్యక్తిగతం. అసలు తను ఆ పార్టీకి కనెక్ట్ కాకముందే ఇవన్నీ సాధించింది. అది వేరే విషయం. 

కాని - సక్సెస్ సైన్స్ పాయింటాఫ్ వ్యూలో మాత్రం తనది ఒక రాగ్స్ టు రిచెస్ స్టోరీ.     

గట్స్. 
విల్ పవర్. 
అన్-డివైడెడ్ ఫోకస్.  

కంగనా రనౌత్.