Saturday 31 December 2022

మన పూర్వీకులు మనకంటే ఆధునికులు!


"హాపీ న్యూ ఇయర్" లాంటి సెంటిమెంట్లు నాకు నిజంగా లేవు. 

కాని - నన్నూ, నా జీవనయానాన్ని విశ్లేషించుకోడానికి దీన్నొక మంచి అవకాశంగా మాత్రం తప్పకుండా ఉపయోగించుకొంటుంటాను. 

ఇంకొన్ని గంటల్లో 2022 కు గుడ్‌బై చెప్పబోతున్నాం. 

ఈ 2022 నాకేమిచ్చింది గురించి ఆల్రెడీ నేనొక బ్లాగ్ రాసుకున్నాను. 2023 లో నేనేం సాధించాలో కూడా ఇప్పటికే నా పర్సనల్ ఆన్‌లైన్ జర్నల్‌లో నోట్ చేసుకున్నాను. 

కట్ చేస్తే - 

మన పూర్వీకులు గాని, మన పెద్దలు గాని - కొన్ని పండుగలో పబ్బాలో, ఇలాంటి సందర్భాలో పెట్టారంటే వాటిని అంత ఈజీగా తీసేయలేం. 

నిజానికి - వేల యేళ్ళక్రితమే, వాళ్ళు మనకంటే ఆధునికులు. 

కాబట్టే - ఆ రోజూ ఈ రోజూ అనీ, ఆ దినం ఈ దినం అనీ కొన్ని సందర్భాలను ఇలా క్రియేట్ చేశారు. 

అవి కూడా లేకపోతే - మన రొటీన్ లైఫ్‌లో ఎప్పట్లాగే కొట్టుకుపోతూ... గుర్తు చేసుకోవల్సినవాళ్లని కనీసం ఆ ఒక్కరోజైనా బాగా గుర్తుచేసుకోలేం అనీ - మన గురించి మనం ఆలోచించుకోవాల్సిన ఎన్నో విషయాల గురించి అసలు ఆలోచించమనీ  - వాళ్ళు బహుశా ముందే ఊహించారు.    

అద్భుత దార్శనికులైన ఆ పూర్వీకులకు, పెద్దలకు శిరసాభివందనాలతో... ఇంకొన్ని గంటల్లో రాబోతున్న 2023 కి హార్దిక స్వాగతం చెప్తున్నాను. 

Happy New Year to All My Friends and Well-Wishers.  

Tuesday 27 December 2022

బుక్ ఫెయిర్... పుస్తకాలు, మిత్రులు, కవి మిత్రులు, సినీ మిత్రులు!


నిన్న సాయంత్రం 5.30 నుంచి బుక్ ఫెయిర్లో గడిపాను. ఇవ్వాళ, మిగిలిన 5 రోజులూ సాయంత్రాలు ఇక అక్కడే. 

నిత్యజీవితంలోని నానా టెన్షన్లు, వత్తిళ్ళ మధ్య మంచి రిలీఫ్. పాత మిత్రుల కలయిక, కొత్త మిత్రుల పరిచయాలు... అదొక లోకం. 

చెప్పాలంటే అదే అసలైన లోకం. 

చాలా మిస్ అవుతున్నాం అనిపించింది. 

వీలైతే - మా ఓయూ ఎమ్మే మిత్రబృందంతో కూడా ఇక్కడే ఒక చిన్న గెట్-టుగెదర్ లాంటిది ప్లాన్ చేసుకుంటే బాగుండుననిపించింది. 

నా ఓయూ బ్యాచ్‌మేట్, మిత్రుడు, పాలపిట్ట ఎడిటర్ గుడిపాటిని "పాలపిట్ట స్టాల్" (270) దగ్గర కలిశాను. నా పుస్తకం "కేసీఆర్ - ది ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్" ఈ స్టాల్లో వుంది. కాపీలు అయిపోవచ్చాయి, రేపు మరిన్ని కాపీలు పంపించమని చెప్పాడు. 

"మన ముఖ్యమంత్రి స్టాల్" (339, 340) లో అన్ని కాపీలు సోల్డ్ అవుట్! వాళ్ళూ కాపీలు అడిగారు. స్వర్ణసుధ పబ్లికేషన్స్ నుంచి మరిన్ని కాపీలు ఈరోజు వెళ్తున్నాయి. 

ఎమ్మేలో నా క్లాస్‌మేట్, మిత్రుడు, "కవి సంగమం" కవి యాకూబ్‌ను, కవయిత్రి శిలాలోలిత గారిని వారి స్టాల్ దగ్గర కలిశాను.  


ఓయూలో మా సీనియర్, మిత్రుడు, "తోపుడుబండి" సాదిక్ నాతో ఫోన్లో రెండు మాటలు చెప్పకపోతే నేనీ బుక్ ఫెయిర్ సంతోషాన్ని, సందడినంతా నిజంగా మిస్ అయ్యేవాణ్ణి. సాదిక్‌తో వచ్చిన పిల్లలు హిమాన్శి, రాజవంశీలతో ఇంకో లెవల్‌లో అసలు తెలియకుండానే టైమ్ అలా గడిచిపోయింది.   

థాంక్స్ టు సాదిక్ భాయ్. 

బుక్ ఫెయిర్‌లో ఫోటోలు, సెల్ఫీల కల్చర్‌ను పరిచయం చేసిన పయొనీర్ సాదిక్ భాయ్ "తోపుడుబండి" స్టాల్ ఇప్పుడు లేకపోయినా - అక్కడున్నంతసేపూ రెండు మూడు స్టాల్స్ పెట్టినంత సందడి చేశాడు. 

కట్ చేస్తే - 

ఇవాళ, మిగిలిన 5 రోజులూ సాయంత్రాలు బుక్ ఫెయిర్‌లో ఉంటాను. 

మిత్రులు, రైటర్-కవి మిత్రులు, సినీ మిత్రులు, నా కొత్త ప్రాజెక్టులో నాతో టీమప్ అవ్వాలనుకొనే యాస్పయిరింగ్ సినీ మిత్రులు... అందరం అక్కడే కలిసి ఒకసారి "హాయ్" చెప్పుకుందాం.  

మనీ కావాలా? మంచి లైఫ్ కావాలా?


Build Business Around Passion. Live Life to the Fullest.

అందరికీ జీవితం ఒక్కటే. అందరూ భూమ్మీదే పుట్టారు. 

ప్రపంచంలో అద్భుత విజయాలు సాధించినవారెవ్వరూ ఆకాశంలోంచి ఊడిపడలేదు. వారికేం అతీత శక్తులు లేవు.

వారూ మనలా మనుషులే.

అయితే – కొందరు అనుకున్నది అనుకున్నట్టుగా చేసుకుంటూ, విజయాలు సాధించుకొంటూ ముందుకెళ్తుంటారు. జీవితాన్ని అద్భుతంగా ఎంజాయ్ చేస్తుంటారు.

వీరికి పూర్తి వ్యతిరేకంగా, చాలామంది ఉన్నచోటే ఆగిపోతారు.

అన్నీ మనకు తెలిసినవే కదా అనిపిస్తుంది. కాని, ఏదీ సాధించకుండానే అలా సంవత్సరాలు గడిచిపోతుంటాయి.

ఎందుకలా?!

ఎందుకంటే – 
మనీ, 
రిలేషన్‌షిప్స్…

ఈ రెండూ బాగున్నప్పుడే జీవితంలో అన్నీ బాగుంటాయి.

రెండిట్లో ఏది ముందు అంటే తప్పకుండా “మనీ”నే ముందు.

ఎవరికైనా సరే, ముందు చేతినిండా పని ఉండాలి. ఆ పని సరిపొయినంత ఆదాయాన్ని ఇస్తూ ఉండాలి. అలా సరిపోయినంత ఆదాయం ఉన్నప్పుడు రిలేషన్‌షిప్స్ బాగుంటాయి. రిలేషన్‌షిప్స్ బాగున్నప్పుడు మరింత బాగా మనీ సంపాదిస్తారు.

కొందరి విషయంలో ఇది రివర్స్‌లో ఉండవచ్చు. “రిలేషన్‌షిప్స్” బాగున్నప్పుడే వీరు ఏదైనా చేయగలుగుతారు. ఎంతయినా సంపాదించగలుగుతారు.

అనుభవాల నేపథ్యాన్ని బట్టి, రెండూ కరెక్టే. 

నిజానికి ఇదంతా మన మైండ్‌సెట్ మీదే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది.

ఒక ప్యాషన్ కోచ్‌గా –
మనీ, రిలేషన్‌షిప్స్…
ఈ రెండు విషయాల్లోనూ
నేను మీకు సహాయపడగలను.

మనీ:
మీ ప్యాషన్ చుట్టూరా ఒక మంచి బిజినెస్ ప్రారంభించి, మీరు డబ్బు ఎలా సంపాదించుకోవచ్చు అన్న విషయంలో మీకు ప్రాక్టికల్‌గా, అప్పటికప్పుడు అమల్లో పెట్టి ముందుకెళ్లగలిగే సలహా ఇచ్చి గైడ్ చేయగలను. 

మీ దగ్గర కూడా ఎన్నో మంచి ఆలోచనలుండీ, మీ కెరీర్ విషయంలో కన్‌ఫ్యూజన్‌తో మీరు ఏదీ నిర్ధారించుకోలేకపోతున్నా సరే… నేను మీకు సహాయపడగలను.

రిలేషన్‌షిప్స్:
మీ వ్యక్తిగతం కావచ్చు, మీ వివాహబంధంలో కావచ్చు, మీ స్నేహ సంబంధాల విషయంలో కావచ్చు, బయట ఉద్యోగపరమైన-వృత్తిపరమైన సంబంధాల విషయంలో కూడా కావచ్చు… మీరు ఎదుర్కొంటున్న చాలెంజెస్‌ను పరిష్కరించుకోవడంలో నేను మీకు సహాయపడగలను.

మీ వయస్సు ఎంతైనా కావచ్చు. “ఇంక ఇంతే… ఎలా రాసిపెట్టివుంటే అలా జరుగుతుంది” అని మీరు అనుకోవడానికి వీల్లేదు.

జీవితంలోని ఏ దశలోనైనా, దేనికైనా పరిష్కారం తప్పక ఉంటుంది.

మీరు అనుకున్నట్టు మీ జీవితాన్ని మీరు తీర్చిదిద్దుకోవచ్చు. మీరు ఊహించనంత వేగంగా, అన్నీ మీరు అనుకున్నట్టే చేసుకోవచ్చు. మీకు కావల్సినంత డబ్బు మీరు సంపాదించుకోవచ్చు.

మంచి ఆరోగ్యం కోసం మనం డాక్టర్‌ను ఎలాగయితే సంప్రదిస్తామో… మంచి సంపాదన, మంచి జీవితం కోసం మీకు పర్సనల్‌గా ఒక కోచ్ కూడా అంతే అవసరం.
 
ఒక అతిచిన్న దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి బయటపడి హైదరాబాద్ వచ్చాను. మెషినిస్ట్‌గా వర్క్‌షాపుల్లో పనిచేసుకొంటూ – మళ్ళీ చదువుకొన్నాను. యూనివర్సిటీలో రెండు పోస్ట్‌గ్రాడ్యుయేషన్ కోర్సులు చదివి, యూనివర్సిటీ టాపర్‌గా రెండు గోల్డ్ మెడల్స్ సాధించాను. మూడు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు చేశాను. రచయితనయ్యాను. రచయితగా నంది అవార్డు సాధించాను. తర్వాత ఫిలిం డైరెక్టర్ అయ్యాను, ప్రొడ్యూసర్ అయ్యాను. నాలుగు సినిమాలు డైరెక్ట్ చేశాను. చిన్న గ్యాప్ తర్వాత, మళ్ళీ ఇప్పుడు కొత్తగా 2 సినిమాలు ప్రారంభించాను, డైరెక్ట్ చేస్తున్నాను.

.. ఇంకెన్నో చేశాను, చేస్తున్నాను, చేయబోతున్నాను…

ఎక్కడో దూరం నుంచి ఒంటరిగా సిటీకి వచ్చి, ఎవ్వరి సహాయం లేకుండా, నేనే ఈ స్థాయికి రాగలిగినప్పుడు… ఈ డిజిటల్ యుగంలో మీరు మరింత ఈజీగా ఏదైనా సాధించగలుగుతారు.

నేను జీవితంలో ఎన్నో సాధించినవాన్ని, ఎన్నో కష్టనష్టాలు చూసినవాన్ని, అనుభవించిన వాన్ని. మీరు మళ్ళీ కొత్తగా అవన్నీ అనుభవించి కనుక్కోవల్సిన అవసరం లేకుండా, మళ్ళీ మీ జీవితంలో ఎలాంటి డబ్బుపరమైన, వ్యక్తిగతమైన ఇబ్బందులు రాకుండా ఒక ప్యాషన్ కోచ్‌గా నేను మీకు సహాయపడగలను.

మనీ కావాలా? 
మంచి లైఫ్ కావాలా?

రెండూ సాధ్యమే. 

10X స్పీడ్‌లో - ఊహించనంత వేగంగా - ఈ రెండిటినీ మీరు సాధిస్తారు.

జీవితం ఒక్కటే. ఒంటరి పోరాటం చేస్తూ, మీలో మీరే బాధపడుతూ మరింత సమయం వృధా చేసుకోకండి.

నా ప్యాషన్ కోచింగ్ అంతా ఆన్‌లైన్‌లోనే ఉంటుంది. మీరు నాతో చర్చించే ప్రతి విషయం గోప్యంగా నా మనస్సులోనే ఉంటుంది. మీ సమస్యలు నా సమస్యలవుతాయి. మీరూ నేనూ కలిసి, పరిష్కారం కనుక్కొంటాము. 

మీ కెరీర్ బాగుంటుంది. మీరు డబ్బు సంపాదిస్తారు. మీ రిలేషన్‌షిప్స్ బాగుంటాయి. మొత్తంగా, ఇకనుంచీ మీ జీవితాన్ని మీరు అనుకున్నట్టు ఆనందంగా, అద్భుతంగా జీవిస్తారు.

ఇదంతా, మీరూహించనంత వేగంగా సాధ్యం అవుతుంది!

In working with you, I bring in my multi-passionate and diverse background and real world experience. And… In your success, I find my own.

మీకు సహాయపడుతూ నేను కూడా కొత్త విషయాలు నేర్చుకొంటాను. కొత్త లక్ష్యాలు సాధిస్తాను. ఇది నా ప్యాషన్.

ముందే చెప్పినట్టు, అంతా మన మైండ్‌సెట్ మీద ఆధారపడి ఉంటుంది.

ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురుచూస్తూ, మీ జీవితంలో మీరు వృధా చేసుకొంటున్న ప్రతి ఒక్క రోజుకీ ఎంత విలువ ఉందో ఇప్పటికయినా తెలుసుకున్నారా?  

మీ పర్సనల్ లైఫ్, మీ కెరీర్, మీ డబ్బు సంపాదన విషయంలో ఇప్పుడు మీరు నిజంగా సీరియస్‌గా ఉన్నారా?

"నాలో ఉన్న స్కిల్స్‌తో గాని, మార్కెట్‌కు అవసరమైన కొత్త స్కిల్స్ నేర్చుకుని గాని – నేను ఏదైనా సాధించగలను, ఎంతైనా డబ్బు సంపాదించగలను" అన్న నమ్మకం, ఆత్మవిశ్వాసం మీమీద మీకు ఉండాలి. 

అలాంటి పాజిటివ్ మైండ్‌సెట్, అంత ఫైర్ మీలో ఉన్నా కూడా - పరిస్థితుల ప్రభావం వల్ల మీలో ఆత్మవిశ్వాసం రోజురోజుకూ సన్నగిల్లుతూ ఉంటుంది. ఏం చేయాలో తెలిసి ఉండీ, అన్నీ చేయగలిగిన సత్తా ఉండీ ఏదీ చేయలేకపోతుంటారు.  

ఇదిగో - ఇలాంటి సమయంలోనే అనుభవంతో కూడిన ఒక హెల్పింగ్ హాండ్, ఒక ఆసరా అవసరం అవుతుంది. అలాంటి ఆసరా మీకు ఒక పర్సనల్ కోచ్ నుంచి, లేదా ఒక మెంటార్ నుంచి మాత్రమే దొరుకుతుంది.

అమెరికా, బ్రిటన్ వంటి అభివృధ్ధి చెందిన దేశాల్లో ఇదంతా ఒక అతి మామూలు విషయం. 

మీ లైఫ్, మీ కెరీర్, మీ డబ్బు సంపాదన విషయంలో ఇప్పుడు మీరు నిజంగా సీరియస్‌గా ఉన్నట్టయితే మాత్రం ఇక ఆలస్యం చేయకండి. ఈరోజే మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభించండి.

మీరూ డబ్బు సంపాదిస్తారు. వ్యక్తిగతంగా మీరు కోరుకున్న మంచి జీవితాన్నీ ఎంజాయ్ చేస్తారు. 

ఇంకొక్క క్షణం కూడా వృధా చేయకుండా  - నా కోచింగ్ ఫీజు, ఇతర వివరాలు పూర్తిగా తెలుసుకోడానికి - నాకు వాట్సాప్ చేయండి. సెషన్ బుక్ చేసుకోండి.

కోచింగ్ వెంటనే ప్రారంభిద్దాం. ఫలితాలు మీరే చూస్తారు. 

మీ సక్సెస్, మీ సంపాదన, మీ వ్యక్తిగత జీవితం, మీ ఆనందం... అన్నీ ఇప్పుడు మీ చేతుల్లోనే ఉన్నాయి... Now the ball is in your court! 

The 10X Passion Coach

Film Director, Producer 
Nandi Award Winning Writer, Blogger
Social Media Strategist
Author of Best Seller Book "KCR - The Art of Politics"

Whatsapp to book a Session Online: 9989578125 

Saturday 24 December 2022

Anil 'Fitness' Kapoor !!

 

మిస్టర్ ఇండియా సినిమాలో అనిల్ కపూర్ వేసుకున్న షర్టు, ప్యాంటు, కోటు, టోపీలను న్యాచురల్‌గా ఉండాలని ముంబై చోర్ బజార్లో కొనుక్కొచ్చారట. 

అదొక్కటే డ్రెస్. అలాంటివే రెండు మూడు డ్రెస్‌లు చోర్ బజార్లో దొరకలేదు.  

ఆ ఒక్క డ్రెస్‌నే అనిల్ కపూర్ షూటింగ్ అయిపోయేదాకా వేసుకున్నాడట. సుమారు 5 ఏళ్లయినా - ఆ డ్రెస్ ఇంకా అనిల్ కపూర్ అల్మరాలో ఉంది. 35 ఏళ్ళ తర్వాత ఇప్పుడు కూడా ఆ డ్రెస్ అనిల్ కపూర్‌కు సరిపోతుంది. అప్పుడప్పుడూ వేసుకొని చూసుకుంటాట్ట. 

అనిల్ కపూర్ ఫిట్‌నెస్ అలాంటిది! 

తాత అయినా - 35 ఏళ్ళ క్రితం ఎలా వున్నాడో ఇప్పుడూ అలాగే ఉన్నాడు. 

కట్ చేస్తే - 

ఇవ్వాళ అనిల్ కపూర్ పుట్టినరోజు. 

గొప్ప విషయం ఏంటంటే - అనిల్ కపూర్ హీరోగా పరిచయమైన తొలిచిత్రం ఒక తెలుగు సినిమా. 

వంశవృక్షం. 

పరిచయం చేసింది మన దర్శకుడు బాపు. 

ఫిట్‌నెస్ విషయంలో నన్ను ఇన్‌స్పైర్ చేసే అతికొద్దిమందిలో అనిల్ కపూర్ ఒకరు. ఇప్పుడతని వయస్సు 66.  

I wish Anil Kapoor a very happy birthday. 

Friday 23 December 2022

2022లో నువ్వేం సాధించావు?


1. దాదాపు 22 ఏళ్ళ క్రితం - హెచ్ ఎం టి, జవహర్ నవోదయ విద్యాలయ, ఆలిండియా రేడియో - 3 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు - మొత్తం సుమారు 14 ఏళ్ళపాటు చేసి - వదిలివేసినవాణ్ణి. అలాంటిది... ఇరవైరెండేళ్ళ తర్వాత - అనుకోకుండా ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగావకాశం వచ్చినప్పుడు ఏం అలోచించకుండా చేరిపోయాను. తర్వాత ఆ ఉద్యోగం ఉద్యోగంలా కాకుండా ఊహించని ఇంకో మార్పుకి దారి తీసింది. స్వర్ణసుధ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఎం డి అయ్యాను. అదంతా వేరే విషయం. కాని, నాలో ఇంత పెద్ద మార్పుకి కారణమైన మైండ్‌సెట్‌ను తెచ్చిన 2022కు నా బిగ్ థాంక్స్. 

2. అంతకు ముందు రెండుసార్లు కేసీఆర్ పుస్తకం కోసం పూనుకున్నాను. పూర్తిచేశాను. రెండుసార్లూ డీటీపీ దాటి, కవర్ పేజీ వరకు వెళ్ళింది వ్యవహారం. ముందు వ్యక్తిగత సమస్యలు, రెండోసారి కోవిడ్‌లు ఆ పని కానివ్వలేదు. మూడోసారి మాత్రం అనుకున్న టైమ్‌కు పుస్తకం పబ్లిష్ చేసేశాను. గౌరవ మంత్రి కేటీఆర్ గారు ప్రామిస్ చేశారు, ప్రగతిభవన్లో పుస్తకాన్ని ఆవిష్కరించారు. అదే.. నా లేటెస్ట్ బెస్ట్ సెల్లర్ పుస్తకం "కేసీఆర్ - ది ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్". థాంక్స్ టు 2022, ఇది నా రెండో బిగ్ సక్సెస్. 

3. దాదాపు 15 సంవత్సరాల క్రితం ఒక చిన్న కారణంతో "ఎందుకు పిహెచ్ డి?" అని మధ్యలోనే వదిలేసినవాణ్ణి, అనుకోకుండా ఒక రాత్రి పిహెచ్ డి పూర్తిచెయ్యాలని నిర్ణయించుకున్నాను. మళ్ళీ ఆ ఫైల్స్, ఆ బుక్స్ బయటికి తీశాను. వచ్చే మే-జూన్‌లో నా పిహెచ్ డి థీసిస్ సబ్మిట్ చేస్తున్నాను. ఆ తర్వాత నా పేరుకు ముందు డాక్టర్ వస్తుంది. బిగ్ థాంక్స్ టు 2022, ఇది నాలో నేను ఊహించని ఇంకో పెద్ద మార్పు. 

4. 2022 ద్వితీయార్థం నుంచి మళ్ళీ నేను రెగ్యులర్‌గా వర్కవుట్ చేస్తున్నాను. పొద్దున లేస్తే బ్రష్ చెయ్యటం లాగే ఇది కూడా అలవాటయిపోయింది నాకు. ఇప్పుడు నేను ప్రయాణాల్లో వున్నా, ఎక్కడున్నా, ఎలావున్నా... ప్రతిరోజూ కనీసం ఒక అరగంట ఎక్సర్‌సైజ్ చెయ్యటం అనేది తప్పనిసరి. ఇది కూడా 2022 లో నా మీద నేను సాధించిన విజయమే.   

5. నా వ్యక్తిగత మైండ్‌సెట్, ఇంకా కొన్ని చేదు అనుభవాల వల్ల "సినిమాలు వద్దు" అని గట్టిగా స్థిరంగా అనుకున్నవాణ్ణి... 2022 విజయదశమి నాడు కొత్తగా రెండు సినిమాలు ప్రారంభించాను. ప్రస్తుతం వీటి ప్రి-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అనుకున్న సమయానికి వీటిని పూర్తిచేస్తాను. 2022లో నేను తీసుకొన్న అతి పెద్ద అగ్రెసివ్ నిర్ణయం ఇది. సినిమాల్లో ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తివున్న లైక్‌మైండెడ్ మిత్రులు ఈ విషయంలో నన్ను కాంటాక్ట్ చేయొచ్చు.    

కట్ చేస్తే -

చిన్నవీ పెద్దవీ ఇంకో పది పన్నెండు వరకు విజయాలున్నాయి. కాని, వాటిని నేను పెద్దగా లెక్కలోకి తీసుకోవడం లేదు. 

ఇంకొక చిన్న విషయం చెప్పి ఈ బ్లాగ్ ముగిస్తాను...

ఇంతకుముందులా కాకుండా... నా జీవితంలో ఏం జరిగినా - మంచైనా, చెడైనా - ఎవరివల్ల జరిగినా, ఏ పరిస్థితులవల్ల జరిగినా... దానికి వందకి వంద శాతం పూర్తి బాధ్యతను ఇప్పుడు నేనే తీసుకొంటున్నాను. అలా తీసుకోవడం అలవాటు చేసుకున్న తర్వాత ఇప్పుడంతా బాగుంది. ముఖ్యంగా నా సమయం వృధా కావడం లేదు. 

ఇన్ని ముఖ్యమైన మార్పులకి కారణమైన 2022కి బిగ్ థాంక్స్. 

ప్రతి సంవత్సరం లాగే ఈ 2022లో కూడా ఒకరిద్దరు మహానుభావులు నాకు మంచి గుణపాఠాలు చెప్పారు. నా మిత్రులు, శ్రేయోభిలాషులతో పాటు వారికి కూడా నా కృతజ్ఞతాభివందనాలు. మీరంతా లేకుండా 2022లో ఈ మార్పులు, ఈ విజయాలు లేవు.     

'This is Me' in 2022. What about You? 

అబ్ కీ బార్ - కిసాన్ సర్కార్!దేశంలోని రైతులందరికీ జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు!

కట్ చేస్తే - 

తెలంగాణ సాధించాక ముఖ్యమంత్రి కేసీఆర్ సాధించిన ఎన్నో విజయాల్లో అగ్రభాగాన ఉండే అంతర్జాతీయస్థాయి విజయం - కాళేశ్వరం ప్రాజెక్టు. 

అంతకుముందున్న ప్లాన్లను మార్చి, ఏమైనా సరే దీన్ని వెంటనే పూర్తిచేయాలి అని సంకల్పించి ముందుకు సాగే క్రమంలో అపర భగీరథుడయ్యారాయన. అత్యాధునిక కాలపు ఇంజినీరయ్యారాయన. 

రాష్ట్రం లోపలా బయటా - ప్రతిపక్షాలు, పనికిరానివాళ్ళ ఎగతాళులు, అడ్డుపుల్లలు, విమర్శల మధ్య - చూస్తుండగానే సుమారు మూడున్నరేళ్ళ రికార్డు సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేసి చూపించారు. 

అది కూడా - కేంద్రం నుంచి ఒక్క పైసా సహాయం లేకుండా!

ఉద్యమసమయంలో చెప్పినట్టుగానే - తెలంగాణలో ఇంచుమించు కోటి ఎకరాల సాగుకు నీళ్లందిస్తూ - అంతకుముందు నీళ్ళు లేక నెర్రెలువారిన మహబూబ్‌నగర్ లాంటి జిల్లాల పొలాలకు సైతం ఇప్పుడు కోనసీమ పచ్చదనం తెచ్చారు. 

వ్యవసాయం చేసే రైతు కోసం 24 గంటల ఉచిత కరెంటునిచ్చారు. 

రైతు బంధు రూపంలో పంట వేయడం కోసం పెట్టుబడి ఆసరానిచ్చారు. 

రైతుల జీవితాల్లో ఊహించని ప్రమాదాల్ని దృష్టిలో పెట్టుకొని  రైతు భీమా ఇచ్చారు.

రైతు పండించిన పంటని కొంటున్నారు.  

ఇప్పటివరకూ దేశంలోని ఏ ఇతర రాష్ట్రంలోనూ లేని ఈ సంక్షేమ పథకాలన్నింటితో - తెలంగాణలో రైతునే రాజుని చేసిన కేసీఆర్ కోసం -  ఇప్పుడు యావత్ దేశంలోని రైతులు ఎదురుచూస్తున్నారు. 

Tuesday 20 December 2022

మన ముఖ్యమంత్రి స్టాల్!


ఎల్లుండి - 22 డిసెంబర్ నుంచి కళాభారతి (ఎన్టీఆర్ స్టేడియం) లో ప్రారంభం కానున్న 35 వ హైద్రాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్ ఈసారి మరింత ఆసక్తికరంగా ఉండబోతోంది. 

మొత్తం 340 స్టాల్స్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా - తమిళనాడు, కర్ణాటక వంటి ఇతర రాష్ట్రాల నుంచి కూడా పబ్లిషర్స్, పుస్తక విక్రేతలు పాల్గొంటున్నారు. 

11 రోజులపాటు ఒక పండుగలా జరిగే ఈ బుక్ ఫెస్టివల్‌లో ఇప్పటివరకు ఉన్న సందర్శకుల రికార్డు 10 లక్షలు. ఈ రికార్డు ఈసారి బ్రేక్ అయ్యే అవకాశాలున్నాయి. 

బై ది వే - ఈ గ్రాండ్ గాలా బుక్ ఫెయిర్‌ను మన ఐటి శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తున్నారు!  

కట్ చేస్తే - 

రచయితలకు కూడా ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్టు బుక్ ఫెయిర్ అధ్యక్షులు, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ చెప్పారు. 

ఇక, కేసీఆర్ గారి మీద వచ్చిన పుస్తకాల కోసం ప్రత్యేకంగా "మన ముఖ్యమంత్రి స్టాల్" పేరుతో ఒక ప్రత్యేక స్టాల్‌ను ఏర్పాటుచేస్తున్నారు. 

ఇటీవలే గౌరవ మంత్రి కేటీఆర్ లాంచ్ చేసిన నా పుస్తకం "కేసీఆర్ - ది ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్" కూడా ఈ స్టాల్‌లో లభిస్తుంది. 

నా మిత్రుడు, సీనియర్ జర్నలిస్టు, పాలపిట్ట లిటరరీ మ్యాగజైన్ ఎడిటర్, గుడిపాటి "పాలపిట్ట బుక్స్" స్టాల్‌లో కూడా కూడా ఈ పుస్తకం లభిస్తుంది. 

కిండిల్ లాంటి ఇతర ఎన్నో రకాల డిజిటల్ బుక్స్ వచ్చినప్పటికీ... పుస్తకం పుస్తకమే. ఆ టచ్ లేకుండా చదివిన ఆనందం వుండదు. అందుకేనేమో - అమెజాన్ వంటి భారీ ఆన్‌లైన్ స్టోర్స్‌లో ఇప్పటికీ డిజిటల్ బుక్స్ కన్నా ఫిజికల్ బుక్స్ అమ్మకాలే ఎక్కువ! 

వచ్చే 11 రోజుల్లో కనీసం ఒక రెండు సాయంత్రాలు బుక్ ఎగ్జిబిషన్లో గడపడానికి నాలాంటి పుస్తకప్రియులంతా రెడీ అవుతున్నారు. 

మరి మీరో?   

Thursday 15 December 2022

వాట్సాప్ స్క్రిప్టుల ఎఫెక్టు గురించి నిజంగా సీరియస్‌గా ఆలోచిస్తున్నారా?


ఓ పదిరోజుల కిందటి యూట్యూబ్ వీడియో ఇప్పుడే చూశాను. అందులో ఏబియన్ చానెల్‌ న్యూస్‌కాస్టర్ చెప్పిందే చెప్తూ చాలా బాధపడిపోతున్నాడు... అతని పేరు వెంకటకృష్ణ అనుకుంటాను.  

ఈడీ రిమాండ్ రిపోర్ట్ అట... మొత్తం 36 మంది అట... 170 మొబైల్ ఫోన్లను ధ్వంసం చేశారట. ఆ ఫోన్లన్నిటి విలువ కోటి ముప్పై ఎనిమిది లక్షలట. 

వాటిల్లో ఎమ్మెల్సీ కవిత 2 నంబర్స్ ఉన్నాయట... ఆ 2 నంబర్లను 10 ఫోన్లలో వాడారట. ఆ పది ఫోన్లను కవిత ధ్వంసం చేశారట. 

నంబర్లూ వున్నాయి, ఆ 170 మొబైల్ ఫోన్ల IMEI నంబర్స్ కూడా ఉన్నాయి. 

ఇంక సమస్యేముంది? మొత్తం ఈ వ్యవస్థలన్నీ వాళ్ళ జేబుల్లోనే కదా వున్నాయి? చట్టం తన పని తాను చేసుకుపోతుంది కదా?

ఈ స్క్రిప్ట్ అంతా నిజంగా నిజమైతే - ఉన్న ఆధారాల నుంచి డేటా తీయటం అంత కష్టం కాదని నిపుణులు చెప్తూనే వున్నారు. అయినా, వీళ్ళు పాడిందే పాడుతున్నారు. 

కట్ చేస్తే - 

ఈ టెక్నికల్ అంశాలన్నీ సామాన్య జనానికి తెలియదు. పట్టించుకోరు. 

సామన్య జనం బుర్రల్లో విషం ఎక్కించాలి. వాళ్ళ దృష్టిలో కొందరిని అన్‌పాపులర్ చెయ్యాలి. మైండ్ గేమ్ ఆడాలి. 

అదే చేస్తున్నారు. 

ఈ విషయంలో వాళ్ళు చాలా ఈజీగా సక్సెస్ సాధిస్తున్నారు.  

గత 8 ఏళ్ళుగా బీజేపీ సక్సెస్ టెంప్లేట్ ఇదే... 

పచ్చి అబద్ధాలను క్రియేట్ చేయటం! వాటిని ప్రచారం చేయటం!!  

దీనికి వెంటనే అత్యంత జాగ్రత్తగా చెక్ పెట్టాల్సిన అవసరం చాలా వుంది. అది, కేవలం ఏ ఒక్కరి పేరో కాపాడటం కోసం మాత్రమే కాదు... మొత్తం దేశాన్ని కాపాడుకోవడం కోసం. 

మూడోసారి కూడా దేశం ఇలాంటి ప్రమాదంలో పడకుండా ఉండటం కోసం. 

ఈ పనిచేయగల సమర్థుడు ఇప్పుడు దేశంలో ఒక్కరే ఉన్నారు. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో ఉన్నారు.  

ఆ ఒక్కరు ఎవరో మీకు తెలుసు.  

కల్వకుంట్ల చంద్రశేఖరరావు...

కేసీఆర్.  

Saturday 10 December 2022

కేసీఆర్ మరొక బృహత్తర యజ్ఞం!టీఆరెస్ ప్రారంభంలో కూడా ఇలాగే కేసీఆర్‌ను, తెరాసను చాలా కామెంట్ చేశారు. తెలంగాణ రాష్ట్రం సాధించే ముందువరకు కూడా చాలా దారుణంగా ఎగతాళి చేశారు.

తర్వాతేమైంది? 

బీఆరెస్ విషయంలో అంతకు 29 రెట్లు ఉంటుంది ఎగతాళి, కామెంట్స్ ధాటి.  

అందులో పెద్ద వింతేం లేదు. ఎవరు చేసేపని వాళ్ళు చేస్తారు. వాళ్లకు చేతనైంది అది... అంతే.  

కట్ చేస్తే - 

ఎవరో ఒకరు, ఎక్కడో ఒక ప్రారంభం అయితే జరగాలి కదా... 

అందుకే మరొక బృహత్తర యజ్ఞం తలపెట్టారు కేసీఆర్. 

ఈసారి దేశం కోసం.   

ఇలాంటి ప్రారంభమే 2001లో ఆనాడు జలదృశ్యంలో కేసీఆర్ చేయకుండివుంటే ఈరోజు తెలంగాణ ఉండేదా? 

అలాంటి సంకల్పంతోనే - దేశరాజకీయాల్లో గుణాత్మక మార్పు, సమాఖ్య స్పూర్తి లక్ష్యంగా - ఇప్పుడు కేసీఆర్ సిద్ధమయ్యారు.

ఈ నేపథ్యంలోనే నిన్న తెలంగాణ భవన్‌లో బీఆరెస్ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. రేపు 14 డిసెంబర్ నాడు భారత రాష్ట్ర సమితి (బీఆరెస్) ఆఫీసు భారత రాజధాని ఢిల్లీలో ప్రారంభం కాబోతోంది. 

గూస్‌బంప్స్ కదా... 

అబ్ కీ బార్... కిసాన్ సర్కార్! 

Wednesday 7 December 2022

వాతావరణంలా మనసు కూడా మారుతుంటుంది...


ఇదొక ఫ్రెండ్లీ "స్టాచుటరీ వార్నింగ్" లాంటి మనవి!

రకరకాల విశ్లేషణలు, లాజిక్కులతో ఏదేదో భారీగా ప్లాన్ చేస్తాం. కాని, ప్రాక్టికల్‌గా ఒక రెండు రోజులు చూసిన తర్వాత గాని విషయం క్రిస్టల్ క్లియర్‌గా అర్థంకాదు.

కట్ చేస్తే -

అన్ని ప్లాన్లూ మూటకట్టి డస్ట్‌బిన్‌లో వేసేశాను. 

సోషల్ మీడియా మినిమలిజం... ఇదొక్కటే కరెక్టు:

> ఒక్కటే బ్లాగ్. ఇందులోనే  రాజకీయాలు, సినిమాలు, సక్సెస్ సైన్స్, స్పిరిచువాలిటీ, అనుభవాలు-జ్ఞాపకాలతో నిండిన నా పర్సనల్ నాస్తాల్జిక్ స్టఫ్.
> బ్లాగ్‌లోవన్నీ తెచ్చి, నాకున్న ఒకే ఒక్క ఫేస్‌బుక్ ఎకవుంట్‌లో పోస్ట్ చేసి బ్లాగ్ లింక్ ఇవ్వడం. 
> ఇదే ఫేస్‌బుక్‌లో - నా ఫ్రీలాన్సింగ్ కెరీర్‌కు చెందిన కోచింగులు, ఎట్సెట్రాల పోస్టులు, ప్రకటనలు.  

అన్నీ ఒకటే బ్లాగ్, ఒకటే ఫేస్‌బుక్ ఎకవుంట్‌లో! 

వచ్చే ఎన్నికల దాకా పాలిటిక్స్ కంటెంట్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఇది కేసీఆర్, తెలంగాణకు పూర్తిగా అనుకూలం.  

కట్ చేస్తే - 

ఈ సందర్భంగా నాదొక మనవి  👇🏻:

నా పొలిటికల్ వ్యూస్, ఇతర స్టఫ్ పడని మిత్రులు, ఇబ్బందిగా ఫీలయ్యే మిత్రులు నిర్మొహమాటంగా అన్‌ఫ్రెండ్ & అన్‌ఫాలో కొట్టొచ్చు. 

నిర్మాణాత్మకమైన డీసెంట్ కామెంట్స్ ఫరవాలేదు. ఓకే.

తెలుసుకుంటాను, అవసరమైతే నేర్చుకుంటాను. 

కానీ, కామెంట్స్‌లో సినిస్టిక్ నెగెటివిటీకి, వ్యక్తిగత కామెంట్స్‌కు తావు లేదు.  నిమిషాల్లో డిలీట్ చేయడమో, బ్లాక్ చేయడమో జరుగుతుంది. సో... మీ మీ అభిప్రాయాలు, వ్యూస్... మీ మీ టైమ్‌లైన్స్ మీద బాజాప్త పోస్ట్ చేసుకోవచ్చు. 

నిర్మాణాత్మకం కాని చర్చలతో, వ్యక్తిగత దూషణలతో కూడిన కామెంట్స్‌తో ఎవ్వరి టైమూ వృధా కాకూడదన్నదే నా ఉద్దేశ్యం. 

థాంక్ యూ. 😊

సోషల్‌ మీడియా మినిమలిజమ్!

 

ఫేస్‌బుక్ & బ్లాగ్ విషయంలో మినిమలిజమే బెట్టర్ అనుకుంటా. 

పాలిటిక్స్‌కు ఒక పేజీ అని, సినిమాలకు ఒక పేజీ అని... సక్సెస్ సైన్స్‌కు ఒక పేజీ అని, స్పిరిచువాలిటీకి ఇంకో పేజీ అని... అనవసరంగా పని పెంచుకోవటమే అవుతుంది.

5 వేలు అంకె దాటినప్పుడు, ఫాలోయర్స్ పెరుగుతారు. అంతకంటే పెద్ద ఇష్యూ ఏం లేదు. పని తగ్గించుకోవడం ముఖ్యం.  

సో... ఒక్క ఫేస్‌బుక్ ఎకవుంట్ చాలు, ఒక్క బ్లాగ్ చాలు. ఇన్‌స్టా, ట్విట్టర్ అలా పక్కన పడుంటాయి. చాలు. 

పైన చెప్పినట్టు కాకుండా - దేనికదే ప్రత్యేకంగా చేసినప్పుడు నాకు జరిగే నష్టాలు ముఖ్యంగా రెండు:

> పని పెరుగుతుంది, సమయం వృధా అవుతుంది. సోషల్ మీడియా కోసం నాకున్న కొద్దిసమయంలో ఓపిక తగ్గి అనుకున్నది చేయకపోవచ్చు. అనుకున్నట్టుగా రాయకపోవచ్చు. 
> నేను కనెక్ట్ అవ్వాలనుకున్నవారితో నాకు, వైస్ వెర్సా... రెండువైపులా ఫోకస్ తగ్గుతుంది. ఎఫ్ఫెక్ట్ ఉండదు. 

సో... కొత్తగా క్రియేట్ చేసిన పేజీల వైపు, కొత్త బ్లాగ్ వైపు ఇంక చూడను.,, కనీసం, 2023 చివరి దాకా! అప్పటివరకు నాకు చాలా ముఖ్యమైన పర్సనల్ టాస్క్‌లున్నాయి పూర్తిచేయాల్సినవి. 

సో... 

జై మినిమలిజమ్! 😊

కట్ చేస్తే - 

ఇదంతా నా గొడవ. 

కాని, దాదాపుగా - ఎవరి విషయంలోనైనా అంతే అనుకుంటా. ఫోకస్ చెల్లాచెదురైనప్పుడు బ్రాండింగ్ - లేదా - ఎఫెక్ట్ కష్టం. మనం అనుకున్నది అనుకున్నట్టుగా చేయటం కష్టం, సాధించడం కష్టం. 

ఇది వ్యక్తులకు, వ్యాపారాలకు, వృత్తులకు కూడా వర్తిస్తుంది. 

సోషల్ మీడియా మనకు ఉపయోగపడాలి. అదే సోషల్ మీడియా ద్వారా మన వల్ల కూడా పిపీలికామాత్రంగానైనా ఎంతో కొంత ఉపయోగం ఉండాలి, మేలు జరగాలి. అది వ్యక్తులకు కావచ్చు, సమాజానికి కావచ్చు.  

With that said -  

మన విలువైన సమయం వృధా చేసుకోవద్దనేదే ఈ పోస్టు మొత్తం సారాంశం.

మీరేమంటారు?    

Monday 5 December 2022

2022 మీకు ఏమిచ్చింది?


ఇలా కూడా అనుకోవచ్చు... 2022 కు మీరేమిచ్చారు? 

కట్ చేస్తే -

ఇంకో 26 రోజుల్లో 2022 ముగుస్తోంది. మళ్ళీ న్యూ ఇయర్, న్యూ రిజొల్యూషన్స్  వగైరా మామూలే. 

అయితే - ఆ రొటీన్ హడావిడి కంటే ముందు ఒక్క 20 నిమిషాల సమయం తీసుకొని - ఎలాంటి డిస్టర్బెన్స్ లేని ఒక చోట కూర్చొని - మొబైల్ స్విచ్చాఫ్ చేసి - ఒక చిన్న రివ్యూ చేసుకోవచ్చు. 

నిజంగా పెన్నూ, పేపర్ పట్టుకొని కూర్చుంటే 10 నిమిషాలైనా సరిపోతుంది.  

2022 లో, ఈ రోజువరకు, (1) పర్సనల్‌గా - (2) ప్రొఫెషనల్‌గా - (3) సోషల్‌గా... మనం ఏం సాధించాం? 

అవి భారీ విజయాలే కానక్కర లేదు. మనకు సంతోషాన్నిచ్చే ఏ చిన్న అంశమైనా కూడా కావచ్చు. 

మన జీవితంలోని ఈ మూడు ముఖ్యమైన విభాగాల్లో - మనం గుర్తుపెట్టుకొనే స్థాయి వున్న, మనకు ఆనందాన్నిచ్చిన, మన పర్సనల్ గ్రోత్‌కి ఉపయోగపడిన విజయం... కనీసం ఒక్కొక్కటి వున్నా ఫరవాలేదు. 

ఖచ్చితంగా వుంటాయి. 

అలాగే ఒక్కో బాధాకరమైన అంశం కూడా ఉండొచ్చు. వాటి గురించి కూడా రివ్యూ చేసుకోవడం అవసరం.

ఈ రివ్యూ ఉంటే రేపు 2023 ఆటొమాటిగ్గా బ్రహ్మాండంగా వుంటుంది. 

చలో, టైమర్ సెట్ చేసుకొని, మొబైల్ స్విచ్చాఫ్ చెయ్యండి... జస్ట్ 20 నిమిషాలు... 

ఆల్ ది బెస్ట్!  

Friday 2 December 2022

25 లక్షలకే 2 ప్లాట్స్! ఇయర్ ఎండ్ సేల్!!


2022 కు గుడ్ బై చెప్పడానికి జస్ట్ ఒక 28 రోజులే మిగిలుంది. ఈ సందర్భంగా - ఆలోచనాపరులైన ఇన్వెస్టర్స్ కోసం - ఒక అద్భుతమైన "ఇయర్ ఎండ్ సేల్" బొనాంజా ప్రకటిస్తున్నాం. 

25 లక్షల మీ ఇన్వెస్ట్‌మెంట్‌కు ఒకే రోజు 2 ప్లాట్స్ రిజిస్ట్రేషన్! 

ఒకటి ఫామ్ ప్లాట్.
రెండోది రెసిడెన్షియల్ ప్లాట్. 

ఈ రెండూ - తెలంగాణలోని "ది బెస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్"గా, "ది బెస్ట్ ఎంప్లాయ్‌మెంట్ గ్రోత్ ఏరియా"గా ముందుకు దూసుకెళ్తున్న - సంగారెడ్డి జిల్లా హెడ్‌కార్టర్స్‌కు 23 కిలోమీటర్స్ దూరంలో, జహీరాబాద్‌కు 25 కిలోమీటర్ల దూరంలో - ముంబై హైవేకి దగ్గరలో, సదాశివపేటకు కేవలం 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న మా బెస్ట్ వెంచర్స్. 

ప్రముఖ టూరిస్ట్ స్పాట్, మంజీరా నది ప్రవహిస్తున్న సింగూర్ ప్రాజెక్ట్ మా వెంచర్స్‌కు జస్ట్ 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. జహీరాబాద్‌లో కొత్తగా డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్ వస్తోంది. 

మీరే ఊహించుకోవచ్చు... ఈ ప్లేస్‌లో ల్యాండ్ వాల్యూ ఇంక ముందు ముందు ఎలా ఉండబోతోందో. 


కట్ చేస్తే -  

రెసిడెన్షియల్ ప్లాట్‌లో మీరు మీ అభిరుచికి అనుగుణంగా ఒక మంచి ఇల్లు కట్టుకోవచ్చు. ఇంటికి కొద్ది దూరంలోనే - పారుతున్న మంజీరా ఒడ్డున - మీ ఫామ్‌ప్లాట్‌లో ఒక చిన్న ఫామ్‌హౌజ్ వేసుకొని మీరు ఆహ్లాదంగా గడపొచ్చు.  

ఒక ఇన్వెస్ట్‌మెంట్ పరంగా చూసినా - కేవలం 2-3 ఏళ్ళలో డబుల్ గ్రోత్ ఉంటుంది. మేమే స్వయంగా "బై బ్యాక్ ఆఫర్" కూడా ఇస్తున్నాము. 

ఈ డబుల్ ధమాకా ఆఫర్‌ను వినియోగించుకొనే ఒక అద్భుత నిర్ణయం తీసుకొంటూ 2022 కు గుడ్‌బై చెప్పండి. ఒకే రోజు 2 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకొని 2023 కు గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పండి. 


ఇంకెందుకు ఆలస్యం? 

పూర్తి వివరాల కోసం కాల్ చేయండి. మీ సైట్ విజిట్‌కు "ఫ్రీ పికప్ & డ్రాప్" మేమే ఏర్పాటు చేస్తాం. 

నావైపు నుంచి పర్సనల్‌గా మీరూహించని స్పెషల్ ఆఫర్ ఇప్పిస్తాను. 

ఇంకేం ఆలోచిస్తున్నారు?

2022 చివర్లో ఒక మంచి ఇన్వెస్ట్‌మెంట్ డెసిషన్ తీసుకోండి.  

After all, the best investment on earth is nothing but land!

- మనోహర్ చిమ్మని
ఎం డి, స్వర్ణసుధ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ 
(గ్రీన్ లీవ్స్ ఇన్‌ఫ్రాటెక్ లిమిటెడ్ గ్రూప్) 
+91 9989578125