Friday 23 December 2022

2022లో నువ్వేం సాధించావు?


1. దాదాపు 22 ఏళ్ళ క్రితం - హెచ్ ఎం టి, జవహర్ నవోదయ విద్యాలయ, ఆలిండియా రేడియో - 3 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు - మొత్తం సుమారు 14 ఏళ్ళపాటు చేసి - వదిలివేసినవాణ్ణి. అలాంటిది... ఇరవైరెండేళ్ళ తర్వాత - అనుకోకుండా ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగావకాశం వచ్చినప్పుడు ఏం అలోచించకుండా చేరిపోయాను. తర్వాత ఆ ఉద్యోగం ఉద్యోగంలా కాకుండా ఊహించని ఇంకో మార్పుకి దారి తీసింది. స్వర్ణసుధ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఎం డి అయ్యాను. అదంతా వేరే విషయం. కాని, నాలో ఇంత పెద్ద మార్పుకి కారణమైన మైండ్‌సెట్‌ను తెచ్చిన 2022కు నా బిగ్ థాంక్స్. 

2. అంతకు ముందు రెండుసార్లు కేసీఆర్ పుస్తకం కోసం పూనుకున్నాను. పూర్తిచేశాను. రెండుసార్లూ డీటీపీ దాటి, కవర్ పేజీ వరకు వెళ్ళింది వ్యవహారం. ముందు వ్యక్తిగత సమస్యలు, రెండోసారి కోవిడ్‌లు ఆ పని కానివ్వలేదు. మూడోసారి మాత్రం అనుకున్న టైమ్‌కు పుస్తకం పబ్లిష్ చేసేశాను. గౌరవ మంత్రి కేటీఆర్ గారు ప్రామిస్ చేశారు, ప్రగతిభవన్లో పుస్తకాన్ని ఆవిష్కరించారు. అదే.. నా లేటెస్ట్ బెస్ట్ సెల్లర్ పుస్తకం "కేసీఆర్ - ది ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్". థాంక్స్ టు 2022, ఇది నా రెండో బిగ్ సక్సెస్. 

3. దాదాపు 15 సంవత్సరాల క్రితం ఒక చిన్న కారణంతో "ఎందుకు పిహెచ్ డి?" అని మధ్యలోనే వదిలేసినవాణ్ణి, అనుకోకుండా ఒక రాత్రి పిహెచ్ డి పూర్తిచెయ్యాలని నిర్ణయించుకున్నాను. మళ్ళీ ఆ ఫైల్స్, ఆ బుక్స్ బయటికి తీశాను. వచ్చే మే-జూన్‌లో నా పిహెచ్ డి థీసిస్ సబ్మిట్ చేస్తున్నాను. ఆ తర్వాత నా పేరుకు ముందు డాక్టర్ వస్తుంది. బిగ్ థాంక్స్ టు 2022, ఇది నాలో నేను ఊహించని ఇంకో పెద్ద మార్పు. 

4. 2022 ద్వితీయార్థం నుంచి మళ్ళీ నేను రెగ్యులర్‌గా వర్కవుట్ చేస్తున్నాను. పొద్దున లేస్తే బ్రష్ చెయ్యటం లాగే ఇది కూడా అలవాటయిపోయింది నాకు. ఇప్పుడు నేను ప్రయాణాల్లో వున్నా, ఎక్కడున్నా, ఎలావున్నా... ప్రతిరోజూ కనీసం ఒక అరగంట ఎక్సర్‌సైజ్ చెయ్యటం అనేది తప్పనిసరి. ఇది కూడా 2022 లో నా మీద నేను సాధించిన విజయమే.   

5. నా వ్యక్తిగత మైండ్‌సెట్, ఇంకా కొన్ని చేదు అనుభవాల వల్ల "సినిమాలు వద్దు" అని గట్టిగా స్థిరంగా అనుకున్నవాణ్ణి... 2022 విజయదశమి నాడు కొత్తగా రెండు సినిమాలు ప్రారంభించాను. ప్రస్తుతం వీటి ప్రి-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అనుకున్న సమయానికి వీటిని పూర్తిచేస్తాను. 2022లో నేను తీసుకొన్న అతి పెద్ద అగ్రెసివ్ నిర్ణయం ఇది. సినిమాల్లో ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తివున్న లైక్‌మైండెడ్ మిత్రులు ఈ విషయంలో నన్ను కాంటాక్ట్ చేయొచ్చు.    

కట్ చేస్తే -

చిన్నవీ పెద్దవీ ఇంకో పది పన్నెండు వరకు విజయాలున్నాయి. కాని, వాటిని నేను పెద్దగా లెక్కలోకి తీసుకోవడం లేదు. 

ఇంకొక చిన్న విషయం చెప్పి ఈ బ్లాగ్ ముగిస్తాను...

ఇంతకుముందులా కాకుండా... నా జీవితంలో ఏం జరిగినా - మంచైనా, చెడైనా - ఎవరివల్ల జరిగినా, ఏ పరిస్థితులవల్ల జరిగినా... దానికి వందకి వంద శాతం పూర్తి బాధ్యతను ఇప్పుడు నేనే తీసుకొంటున్నాను. అలా తీసుకోవడం అలవాటు చేసుకున్న తర్వాత ఇప్పుడంతా బాగుంది. ముఖ్యంగా నా సమయం వృధా కావడం లేదు. 

ఇన్ని ముఖ్యమైన మార్పులకి కారణమైన 2022కి బిగ్ థాంక్స్. 

ప్రతి సంవత్సరం లాగే ఈ 2022లో కూడా ఒకరిద్దరు మహానుభావులు నాకు మంచి గుణపాఠాలు చెప్పారు. నా మిత్రులు, శ్రేయోభిలాషులతో పాటు వారికి కూడా నా కృతజ్ఞతాభివందనాలు. మీరంతా లేకుండా 2022లో ఈ మార్పులు, ఈ విజయాలు లేవు.     

'This is Me' in 2022. What about You? 

2 comments:

  1. "
    ఇంతకుముందులా కాకుండా... నా జీవితంలో ఏం జరిగినా - మంచైనా, చెడైనా - ఎవరివల్ల జరిగినా, ఏ పరిస్థితులవల్ల జరిగినా... దానికి వందకి వంద శాతం పూర్తి బాధ్యతను ఇప్పుడు నేనే తీసుకొంటున్నాను."

    Perfect

    ReplyDelete