ABOUT MANOHAR


మనోహర్ చిమ్మని వరంగల్‌లో జన్మించారు. సుమారు గత 35 ఏళ్ళుగా హైద్రాబాద్‌లో ఉంటున్నారు. 

ఉస్మానియా యూనివర్సిటీ నుంచి తెలుగు సాహిత్యంలోనూ, లైబ్రరీ అండ్ ఇన్‌ఫర్మేషన్ సైన్సెస్ లోనూ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. పీజీ స్థాయిలో రెండు గోల్డ్ మెడల్స్ సాధించారు. జర్నలిజం, అడ్వర్టైజింగ్ & మేనేజ్‌మెంట్ సబ్జక్టుల్లో పీజీ డిప్లొమా చేశారు. రష్యన్ భాషలో మూడేళ్ళ అడ్వాన్స్‌డ్ డిప్లొమా చేశారు. త్వరలోనే పిహెచ్‌డి కోసం సిద్ధాంత వ్యాసం సమర్పించబోతున్నారు. 
 
మనోహర్ చిమ్మని పేరుతోనూ, వివిధ కలంపేర్లతోనూ వీరు రాసిన వ్యాసాలు, ఫీచర్లు, కథలు, సీరియల్స్ మొదలైనవి అన్ని ప్రధాన పత్రికల్లో అచ్చయ్యాయి. రేడియోలో కూడా ప్రసారం అయ్యాయి. రష్యన్ నుంచి నేరుగా తెలుగులోకి అనువదించిన వీరి అనువాద కథలు కూడా విపుల, ఆంధ్రజ్యోతి వీక్లీ, ఉజ్వల వంటి పలు పత్రికల్లో ప్రచురితమయ్యాయి. 


మనోహర్ చిమ్మని రాసిన "ఆధునిక జర్నలిజం" పుస్తకం కాకతీయ యూనివర్సిటీలో పీజీ స్థాయిలో రికమండెడ్ బుక్స్ లిస్ట్‌లో ఉంది. వీరు రాసిన "సినిమాస్క్రిప్టు రచనాశిల్పం" పుస్తకం 'సినిమారంగంలో ఉత్తమ పుస్తకం'గా నంది అవార్డు గెల్చుకొంది.  

గతంలో - హెచ్ఎమ్‌టి, నవోదయ విద్యాలయ, ఆలిండియా రేడియో వంటి మూడు కేంద్రప్రభుత్వ సంస్థల్లో వివిధ హోదాల్లో సుమారు పదిహేనేళ్ళ పాటు పనిచేశారు మనోహర్ చిమ్మని.

ప్రస్తుతం స్వర్ణసుధ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తూ - ఫ్రీలాన్స్ రైటర్‌గా, ఫిలిం డైరెక్టర్‌గా, కోచ్‌గా కొనసాగుతున్నారు.     


మనోహర్ చిమ్మని రాసిన "కేసీఆర్ - ది ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్" పుస్తకాన్ని మంత్రి, టీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈమధ్యే ఆవిష్కరించారు.    

దర్శకరచయితగా మనోహర్ చిమ్మని ఇప్పటివరకు నాలుగు సినిమాలు చేశారు. 

బ్లాగింగ్, స్పిరిచువాలిటీ... వీరి ఇతర ఆసక్తులు. 

థాంక్స్ టు కరోనా... ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలోని చాలా విషయాల్లో భారీ మార్పులొచ్చాయి. వెబ్ సీరీస్‌లు, ఓటీటీలు వంటి కొత్త ఆదాయ మార్గాలు పెరిగాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పుడొక భారీ కార్పొరేట్ ఇండస్ట్రీగా రూపొందింది. 

ఇంతకు ముందు సినిమాలు వేరు. ఇప్పుడు సినిమాలు వేరు. కంటెంట్ ఈజ్ ద కింగ్. మనీ ఈజ్ ద అల్టిమేట్ గోల్.    


ఈ నేపథ్యంలో... రచయిత-దర్శకుడిగా, నిర్మాతగా పూర్తిస్థాయిలో కొత్తగా సినిమాలు, వెబ్ సీరీస్‌లూ, మ్యూజిక్ వీడియోల నిర్మాణం చేపట్టారు మనోహర్ చిమ్మని.   

మైక్రో బడ్జెట్‌లోనే, ట్రెండీ యూత్ కమర్షియల్ ఫీచర్ ఫిల్మ్స్ నిర్మించి - అటు థియేటర్స్‌లోనూ, ఇటు ఓటీటీల్లోనూ సినిమాలు రిలీజ్ చేసే లక్ష్యంతో ప్రస్తుతం ప్రి-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు మనోహర్ చిమ్మని.   

ఈవైపు ఆసక్తి ఉన్న లైక్ మైండెడ్ ఇన్వెస్టర్స్ మనోహర్‌ను కాంటాక్ట్ చేయొచ్చు. 


కలిసి పనిచేద్దాం. కలిసి ఎదుగుదాం. 


-- Manohar Chimmani
Film Director, Nandi Award Winning Writer, Blogger
The Diversified Creativepreneur 

Whatsapp: +91 9989578125

No comments:

Post a Comment