Friday 23 December 2022

అబ్ కీ బార్ - కిసాన్ సర్కార్!



దేశంలోని రైతులందరికీ జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు!

కట్ చేస్తే - 

తెలంగాణ సాధించాక ముఖ్యమంత్రి కేసీఆర్ సాధించిన ఎన్నో విజయాల్లో అగ్రభాగాన ఉండే అంతర్జాతీయస్థాయి విజయం - కాళేశ్వరం ప్రాజెక్టు. 

అంతకుముందున్న ప్లాన్లను మార్చి, ఏమైనా సరే దీన్ని వెంటనే పూర్తిచేయాలి అని సంకల్పించి ముందుకు సాగే క్రమంలో అపర భగీరథుడయ్యారాయన. అత్యాధునిక కాలపు ఇంజినీరయ్యారాయన. 

రాష్ట్రం లోపలా బయటా - ప్రతిపక్షాలు, పనికిరానివాళ్ళ ఎగతాళులు, అడ్డుపుల్లలు, విమర్శల మధ్య - చూస్తుండగానే సుమారు మూడున్నరేళ్ళ రికార్డు సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేసి చూపించారు. 

అది కూడా - కేంద్రం నుంచి ఒక్క పైసా సహాయం లేకుండా!

ఉద్యమసమయంలో చెప్పినట్టుగానే - తెలంగాణలో ఇంచుమించు కోటి ఎకరాల సాగుకు నీళ్లందిస్తూ - అంతకుముందు నీళ్ళు లేక నెర్రెలువారిన మహబూబ్‌నగర్ లాంటి జిల్లాల పొలాలకు సైతం ఇప్పుడు కోనసీమ పచ్చదనం తెచ్చారు. 

వ్యవసాయం చేసే రైతు కోసం 24 గంటల ఉచిత కరెంటునిచ్చారు. 

రైతు బంధు రూపంలో పంట వేయడం కోసం పెట్టుబడి ఆసరానిచ్చారు. 

రైతుల జీవితాల్లో ఊహించని ప్రమాదాల్ని దృష్టిలో పెట్టుకొని  రైతు భీమా ఇచ్చారు.

రైతు పండించిన పంటని కొంటున్నారు.  

ఇప్పటివరకూ దేశంలోని ఏ ఇతర రాష్ట్రంలోనూ లేని ఈ సంక్షేమ పథకాలన్నింటితో - తెలంగాణలో రైతునే రాజుని చేసిన కేసీఆర్ కోసం -  ఇప్పుడు యావత్ దేశంలోని రైతులు ఎదురుచూస్తున్నారు. 

5 comments:

  1. మీకు కేసీఆర్ గారి పైన గల అఖండమైన అభిమానాన్ని అర్ధంచేసుకొన గలం. దానిని మీరు మీవ్రాతలలో చూపటం కూడా బాగుంది. కాని మీబ్లాగులో కేసీఆర్ జపం చేస్తున్న ధోరణిలో వ్రాయటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మీకు మంచి అనిపించింది దేనినైనా ప్రశంసించటం అభినందనీయమని తప్పకుండా ఆనవలసి ఉంది. కాని కేసీఆర్ గారు & వారి రాజకీయ పార్టీ మాత్ర మే జగదేకహితకరం అని మిగిలిన వారు వట్టి పనికిమాలినవారు అని అంటున్నారు. అది కొంచెం అతి అనిపిస్తుంది.

    ఈవ్యాఖ్య కేవలం మీకు నా అభిప్రాయం తెలియజేయాలని వ్రాయటం. అంతే. మీరు దీనిని ప్రచురించ నవసరం లేదు.

    ReplyDelete
    Replies
    1. శ్యామళీయం గారు... ఇల్లు కట్టుకునే కుటుంబ పెద్ద తన ఇల్లు ఏ విధంగా కట్టుకుంటే కుటుంబానికి suit అయితుందో ఆలోచించి కట్టుకుంటాడు.. బయటివాడు ఎంత పెద్ద మేధావి అయినా, వాడిలో ఈర్ష్య, కుళ్లు, కుత్సిత బుద్ధితో.. వీడికి ఇల్లు అవసరమా???వీడికి అంత పేరు అవసరమా???అంటూ.. రగిలిపోతే వాడు మేధావి అనిపించుకొడు.. అదే కాళేశ్వరం ప్రాజెక్టు... 60 ఏండ్లు ప్రజలు నీళ్లు లేక, పంటలు సరిగా పండక, వలసలు పోతూ ఆకలితో అలమటిస్తుంటే.. మీరంటున్న మేధావి వర్గం ఎక్కడ ఉన్నారు???

      Delete
    2. శ్యామలీయం గారూ,

      నాకు నచ్చిన విషయాలు, నాకు ఇష్టమైన అంశాలు రాసుకోడానికే నా బ్లాగ్. ఎవరి అభిప్రాయాలు వారివి. నా అభిప్రాయాలకు లాజిక్ ఉంటుంది, ప్రత్యక్ష వాస్తవాలుంటాయి. అది తప్పు అని నిరూపిస్తూ వీలైతే నిర్మాణాత్మక విమర్శ చేయండి. ఏది అబద్ధమో చెప్పండి. స్వాగతిస్తాను. లేదంటే ఈ బ్లాగుని హాయిగా వదిలేయండి.

      థాంక్యూ.

      పి యస్: కాళేశ్వరం ప్రాజెక్టు వృధా, పనికిరాదు, అసాధ్యం, మాకు తెలివిలేదా-మేం కట్టేవాళ్లం కాదా అని చాలామంది అన్నారు. వీళ్ళల్లో చాలా మంది ఆ ప్రాజెక్టు కొనసాగకుండా నానా అడ్డుపుల్లలు వేశారు. కేసులు వేశారు. ఇప్పుడేమయింది? ఒక మంచి పని చేస్తుంటే అడ్డుపడేవాళ్లని పనికిరానివాళ్ళు అనకుండా ఏమంటారు? ... పైన కామెంట్‌లో మీరేం రాశారు? మీరు రాసిన వాక్యానికీ, ఇక్కడి కాన్‌టెక్స్‌టుకి అసలు ఏమైనా సంబంధముదా? :-)

      Delete
  2. మనోహర్ గారు, మిమ్ము నొప్పించటం నాఅభిమతం కాదు. కేసీఆర్ గారిని తప్పుపట్టి మాట్లాడటమూ నాఅభిమతం కాదు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కాని మరొక అంశం గురించి కాని నావ్యాఖ్యలో ప్రస్తావించను కూడా లేదు. ఇకపోతే కేసీఆర్ గారినైతే నేమి మరొకరి నైతేనేమి విమర్శించినంత మాత్రాన పనికిమాలినవారు ఐపోతారని అనేయటం అంత సమంజసం కాదని నాఉద్దేశం. మీకు నామాట నచ్చకపోతే మన్నించండి.

    ReplyDelete
  3. ఇప్పుడు దేశంలోని చాలా రాష్ట్ర ప్రభుత్వాల కంటే దిల్లీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు బాగా పని చేస్తున్నాయని నా అభిప్రాయం.
    ఇకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు మంచిదా కాదా అన్న విషయం భవిష్యత్తులో తెలుస్తుంది.

    ReplyDelete