Wednesday 30 March 2022

స్త్రీలు తప్పకుండా రాయాలి... వారు అనుకున్నది రాయాలి!


మొన్న మార్చి 28వ తేదీ సాక్షి దినపత్రిక ఎడిటోరియల్‌ "రైటింగ్ టేబుల్" ను ఇందాకే ఫేస్‌బుక్‌లో చూశాను. 

అది... స్త్రీలు, వారి రచనా వ్యాసంగం గురించి, వారికుండే ఇబ్బందుల గురించీ... ఎవరు రాశారో గాని, చాలా బాగా రాశారు . అందులో అన్నీ కాదనలేని నిజాలే. 

అయినా సరే - 

నిజంగా రాయాలనుకునే స్త్రీలను ఏ పరిస్థితులూ ఆపలేవు, ఎవరూ ఆపలేరని నేను గట్టిగా నమ్ముతాను. 

దీనికి నేను రెండే రెండు ఉదాహరణలివ్వగలను: 

ఒకరు జె కె రౌలింగ్, ఇంకొకరు శోభా డే. 

సింగిల్ మదర్‌గా పిల్లలను పోషించుకొంటూ, ఎన్నెన్నో పనులు చేసుకొంటూ రౌలింగ్ ఒక రచయిత్రిగా ఎదిగింది. ఎంతలా ఎదిగిందంటే, ప్రపంచంలోనే మొట్టమొదటి బిలియనేర్ వుమన్ రైటర్ స్థాయికి ఎదిగింది. తర్వాత తనదగ్గరున్న డబ్బులో చాలా భాగం చారిటీలకు ఇచ్చి, ప్రపంచపు రిచెస్ట్ రైటర్‌గా, జె కె రౌలింగ్ ఇప్పుడు రెండో స్థానంలో ఉంది.  

శోభా డే, దిలీప్ డేను రెండో వివాహం చేసుకొంది. అప్పటికే ఆమెకు ఇద్దరు పిల్లలున్నారు. డివోర్సీ అయిన దిలీప్‌కు కూడా ఇద్దరు పిల్లలున్నారు. పెళ్ళి తర్వాత వాళ్ళిద్దరికీ ఇంకో ఇద్దరు పిల్లలు పుట్టారు. ఈ ఆరుగురికి సంబంధించిన చదువులు, ఇతర విషయాలు చూసుకొంటూ, సాంప్రదాయిక ఇళ్ళల్లోని హిందూ సంప్రదాయాలు, పండగలు వంటివి ఒక్కటీ మిస్ అవ్వకుండా పాటిస్తూ (ఆమెకు ఇష్టం!), దిలీప్‌తో హాలిడేలు తిరుగుతూ... ఎన్నో నవలలు రాసింది. నాన్ ఫిక్షన్ రాసింది. టీవీకి సీరియల్స్ రాసింది. ఫ్రీలాన్స్ రైటర్‌గా, కాలమిస్ట్‌గా వేలకొద్దీ ఆర్టికిల్స్ రాసింది. ఇప్పుటికీ తన 70+ వయస్సులో ఇంకా రాస్తోంది. 

మామూలుగా స్త్రీలు 'ఇవి' రాయకూడదు, 'అవి' రాయకూడదు అనే సమాజంలోని ఇన్‌డైరెక్ట్ రూల్స్‌ని పట్టించుకోకుండా... సెక్స్, హోమోసెక్స్కువాలిటీ, సెలెబ్రిటీలు, వీఐపీల 'ఎవరినీ పట్టించుకోని' జీవనవిధానాలు వంటి అంశాల్ని కూడా "స్ట్రేంజ్ అబ్‌సెషన్", "స్టారీ నైట్స్" వంటి తన నవలల్లో అలవోకగా రాసుకుంటూ వెళ్ళింది. 

ఇది నచ్చని చాలామంది ఆమెను "బూతు రచయిత్రి" అంటూ, "ఇండియన్ డానియల్ స్టీల్" అంటూ ఆనందిస్తుంటారు. కాని, ఆమె రచనల మీద ఆక్స్‌ఫర్డ్ స్థాయి విదేశీ విశ్వవిద్యాలయాల్లో ఎందరో అధ్యయనాలు చేశారు, చేస్తున్నారు. 

తనకు 70 ఏళ్ళు వచ్చాక "సెవెంటీ... అండ్ టు హెల్ వితిట్!" అనే పుస్తకాన్ని కూడా రాసింది శోభా డే. పెంగ్విన్ రాండమ్‌హౌజ్ పబ్లిష్ చేసిందా పుస్తకాన్ని.   

రచయితలుగా ఎదగాలనుకునే స్త్రీలు, అనుకున్నది రాయాలనుకునే స్త్రీలు... జె కె రౌలింగ్, శోభా డే ల జీవితాల్ని చదవాలి. 

శోభా డే "సెలక్టివ్ మెమొరీ" రైటర్స్‌కు సంబంధించి నేను చదివిన మంచి ఆటోబయోగ్రఫీల్లో ది బెస్ట్...  అది కూడా చదవాలి. 

ముంబైలోని ఒక సాంప్రదాయిక మిడిల్ క్లాస్ అమ్మాయి... ఎలా మోడల్ అయింది, తర్వాత రిపోర్టింగ్, ప్రెస్, మ్యాగజైన్ ఎడిటర్, రైటర్, సెలెబ్ పార్టీలు, అక్కడి జీవితాలు... ఇన్ని దశల్ని శోభా డే ఎలా చకచకా దాటుకుంటూ వెళ్ళింది...  అవన్నీ శోభా డే మీద చూపిన ప్రభావం...  ఇవన్నీ రచయిత్రులకు  కావల్సినంత ఇన్‌స్పిరేషన్‌ను ఇస్తాయి. రైటర్‌గా తమ పూర్తి పొటెన్షియాలిటీని కాగితం పైనో, కంప్యూటర్ పైనో పెట్టేలా చేస్తాయి. ప్రపంచానికి పరిచయం చేస్తాయి. 

నిజానికి ఈ ఇద్దరి జీవితం గురించి ఆడ, మగ అనేం లేదు... అందరూ చదవాలి. రైటర్స్ అందరికీ మంచి ఇన్‌స్పిరేషన్.        

ఈ ఇద్దరు రచయిత్రులు ఎదుర్కొన్న పరిస్థితులు, ఇబ్బందులు, కట్టుబాట్ల ముందు బహుశా వేరే ఏ ఇతర పరిస్థితులు, ఇబ్బందులు, కష్టాలు నిలబడవు.  ఏవైనా చెప్పుకోవాలనుకున్నా అవన్నీ కేవలం సాకులే అనిపిస్తాయి. 

నాకు తెలిసిన ఈ రెండు ముక్కలు షేర్ చేసుకొంటూ - 

నేను ఎక్కువగా చదవలేదు. కాని, నేను చదివిన రచయిత్రుల్లో, నా టీనేజ్‌లో యద్ధనపూడి సులోచనారాణి, మాదిరెడ్డి సులోచన నవలలు బాగా చదివాను. లత సాహిత్యం నన్ను అప్పట్లో బాగా ఇంప్రెస్ చేసింది. తర్వాత - నా యూనివర్సిటీ రోజుల్లో నేను చదివిన ఓల్గా, కుప్పిలి పద్మ రచనలు ప్రత్యేకం. ఇంకా ఎందరెందరో రచయిత్రులున్నారు. ఎలాంటి పరిధులు, పరిమితులు వీరి రచనా వ్యాసంగాన్ని అడ్డుకోలేకపోయాయి. రచన పట్ల వీరికున్న ప్యాషన్ ముందు ఇంకేవీ నిలబడలేదు. 

ఈ డిజిటల్-సోషల్ మీడియా యుగంలో అయితే, అసలేదీ అడ్డురావడానికి వీల్లేదు.            

స్త్రీలు తప్పకుండా రాయాలి. వారు అనుకున్నది రాయాలి. 

వారు అనుకుంటే ఏదీ అసాధ్యం కాదు.                        

Monday 28 March 2022

ప్యానిండియా క్రేజ్ నేపథ్యంలో చిన్న బడ్జెట్ సినిమాప్యానిండియా సినిమాలు రిలీజైన రోజే చూడకపోతే అదో పెద్ద నేరంలా క్రియేట్ అయ్యింది బయట పరిస్థితి...😊

జోక్స్ పక్కనపెడితే - 

బాలీవుడ్‌తో సహా - దేశంలోని అన్ని భాషల సినీ పరిశ్రమల దృష్టి ఇప్పుడు తెలుగు సినిమాపైనే ఉంది. తెలుగు సినిమా బిజినెస్ రేంజ్ ఇప్పుడు ఆ లెవెల్‌కు చేరుకుంది.    

2000 కోట్ల బిజినెస్ చేసిన బాహుబలి-2 ను ఏదో ఫ్లూక్ అనుకోడానికి వీళ్లేదని ఇప్పుడు RRR మరొకసారి రుజువు చేసింది.  

Without any fraction of doubt... All credit goes to Rajamouli and his vision. 

ఇక, ఆయా సినిమాల్లోని క్రియేటివిటీ గురించి, మేకింగ్ గురించి... వ్యక్తిగత అవగాహన స్థాయినిబట్టి, అభిరుచిని బట్టి... ఎవరికి తోచింది వారు ఏదేదో చెప్తుంటారు. సోషల్ మీడియా "ఫ్రీ ప్రెస్" లో పోస్టులు పుంఖానుపుంఖాలుగా పెడుతుంటారు. 

తప్పేం లేదు... ఎవరి గోల వారిది. 

సినిమాలు తీసేవాళ్ళు తీస్తుంటారు, చూసేవాళ్ళు రివ్యూలు రాస్తుంటారు. 

అయితే అవన్నీ - రెగ్యులర్‌గా ఆయా వ్యక్తుల పోస్టులకు, ట్వీట్లకు లైకులు కొట్టే అతి చిన్న సంఖ్య వరకే పరిమితం. 

అంతిమంగా ఏది కరెక్టు అనేది చెప్పేది ఆయా సినిమాల ఫలితాలు, అవి కలెక్ట్ చేసే డబ్బు మాత్రమే.    

తెలుగు పరిశ్రమలో ఉన్న ఒక అరడజన్ పెద్ద హీరోల సినిమాలన్నీ ఇక నుంచీ ప్యానిండియా సినిమాలుగానే రూపొందుతాయంటే ఆశ్చర్యం లేదు. 

సినిమా ఇప్పుడొక భారీస్థాయి కార్పొరేట్ బిజినెస్. 

ఆల్రెడీ ప్రభాస్‌వి ఇంకో నాలుగైదు ప్యానిండియా సినిమాలు లైన్లో ఉన్నాయి. అల్లు అర్జున్ పుష్ప-2 రెడీ అవుతోంది. రాజమౌళి, మహేశ్ బాబు కాంబినేషన్లో మరో భారీ ప్యానిండియా సినిమా త్వరలో ప్రారంభం కాబోతోంది. జేమ్స్‌బాండ్ తరహాలో ప్లాన్ చేస్తున్న ఈ సినిమాను డైరెక్టుగా ఇంగ్లిష్‌లో కూడా రిలీజ్ చేస్తారని విన్నాను.  

పూరి జగన్నాధ్-విజయ్ దేవరకొండ లైగర్ ఆగస్టులో రిలీజ్ ఉంది. రేపు 29 వ తేదీ నాడు, అదే డెడ్లీ కాంబినేషన్లో ఇంకో కొత్త ప్రాజెక్టు ముంబైలో లాంచ్ చేస్తున్నారు. 

కట్ చేస్తే -    

ఇప్పటివరకు మనం చెప్పుకున్నదంతా ఒక పరిమితమైన సర్కిల్‌లో, అతి పరిమితమైన హీరోలు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్స్ మధ్య జరిగే బిజినెస్. 

ఆ సర్కిల్ లోకి కొత్తగా ఎంట్రీ అనేది చాలా అరుదుగా జరుగుతుంది. దానికి కొన్ని లెక్కలుంటాయి.

అదలా  పక్కనపెడితే - 

ఈ భారీ హీరోల సినిమాలు, ప్యానిండియా సినిమాలు ఆన్నీ కలిపి సంవత్సరానికి ఒక పది రిలీజైతే చాలా ఎక్కువ! 

మిగిలిన 190 చిన్న బడ్జెట్ ఇండిపెండెంట్ సినిమాలకు ఇప్పుడు మంచి హవా ఉంది. ముఖ్యంగా కొత్తగా బిజినెస్ బజ్ క్రియేట్ చేస్తున్న ఓటీటీల నేపథ్యంలో చాలా ఉంది. 

కాని, ఈ అవకాశాన్ని ఉపయోగించుకొంటున్నవారి సంఖ్య చాలా స్వల్పం. 

ఇదివరకట్లా ప్రొడ్యూసర్స్ కోసమో, ఫండ్స్ కోసమో అని కాంప్రమైజ్ అయిపోయి, కనీస అవగాహన కూడా లేకుండా, ఏదో రొటీన్ ఫార్ములా కమర్షియల్ సినిమాలు చేయకుండా... కంటెంట్ నిజంగా బాగుండే సినిమా చేయగలిగితే చాలు. బిజినెస్ ఎక్కడికో వెళ్తుంది.   

ఇది ఎలాంటి అతిశయోక్తి లేని వాస్తవం. ఇటీవలి కొన్ని చిన్న సినిమాలు ఓటీటీలో చేసిన బిజినెస్‌ను గురించి తెలుసుకుంటే ఈ వాస్తవం ఈజీగా అర్థమవుతుంది. గూగుల్ కూడా చెప్తుంది. 

సో... కొన్ని ఈగోలు, అనుమానాలు పక్కనపెట్టి - ఒక మంచి అవగాహనతో లాజికల్‌గా ఎవరు, ఏంటి, ఎలా అన్నది చక్కగా కూర్చొని మాట్లాడుకోగలిగితే చాలు... చాలా చిన్న బడ్జెట్స్ కాబట్టి, అన్నీ ఈజీగా సెట్ అవుతాయి. 

ఇన్వెస్టర్స్, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్... అందరూ బాగుంటారు. 

ప్యానిండియా సినిమాల క్రేజ్ నడుస్తున్న ఈ సమయంలో - బిజినెస్ పరంగా చిన్న బడ్జెట్ సినిమాలకు ఇది నిజంగా చాలా మంచి గోల్డెన్ పీరియడ్.  

Stop being the chess piece.
Become the chess player.  

Friday 25 March 2022

మంజీరా రివర్ వ్యూలో... గేటెడ్ కమ్యూనిటీ ఫామ్‌లాండ్స్!


డాక్టర్స్, లాయర్స్, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ వంటి ప్రొఫెషనల్స్‌తో పాటు... వివిధ రంగాల్లోని బిజినెస్ పీపుల్‌కు కూడా వారాంతంలో ప్రకృతికి దగ్గరగా, ప్రశాంతంగా, స్ట్రెస్-ఫ్రీగా, హాయిగా గడపడానికి గేటెడ్ కమ్యూనిటీ ఫామ్‌లాండ్స్ ఒక మంచి "పర్సనల్ హాలిడే స్పాట్" అవుతుంది.     

GREEN LEAVES INFRATECH LIMITED వారి గేటెడ్ కమ్యూనిటీ ఫామ్‌ప్లాట్స్, ఫామ్‌హౌజ్ వెంచర్స్ అలాంటివే.  

సిటీకి 70 కిలోమీటర్ల దూరంలో, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, మంజీరా నది వ్యూతో అద్భుతంగా ప్లాన్ చేసిన ఈ వెంచర్‌ను ఒకసారి విజిట్ చేసి నిర్ణయం తీసుకోవచ్చు. 

మనకు నచ్చిన డిజైన్‌లో ఓ చిన్న ఫామ్‌హౌజ్ వేసుకొని, మనకిష్టమైన వెజిటబుల్స్, గ్రీనరీ పెంచుకొంటూ, మనకు అవసరమైనప్పుడు గాని, వీకెండ్స్ గాని అక్కడ గడపగలిగితే చాలు... లైఫ్ నిజంగా ఇంకో లెవెల్లో ఉంటుంది. 


ఇన్వెస్ట్‌మెంట్ పరంగా కూడా ఇలాంటి "గేటెడ్ కమ్యూనిటీ ఫామ్‌ప్లాట్స్, ఫామ్‌లాండ్స్" కొనుక్కోవడం అనేది ఈ రోజుల్లో ఒక బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్ అవుతుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 

ముంబై హైవేకు కేవలం 10 కిలోమీటర్ల దూరంలో... సదాశివపేటకు దగ్గరలో, ఆత్మకూరు గ్రామంలో ఉన్న ఈ ఫామ్‌లాండ్ ప్రాజెక్టుకు కేవలం 15 నిమిషాల దూరంలో సంగారెడ్డి జిల్లా హెడ్‌క్వార్టర్స్, 30-45 నిమిషాల దూరంలో RRR (Regional Ring Road) & ORR (Outer Ring Road) ఉన్నాయి.  

13,000 ఎకరాల్లో సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేసిన NIMZ (National Investment & Manufacturing Zone) ప్రాజెక్టు, MRF, పెన్నార్, పెప్సికో, BHEL, KIRBY, తోషిబా, ఎక్స్‌పోర్ట్ కారిడార్, MNR మెడికల్ కాలేజి, IIT, Gitam, Woxsen యూనివర్సిటీలు... TCS, Wipro, ISB, Microsoft, Google వంటి గొప్ప గొప్ప సంస్థలన్నీ ఈ వెంచర్‌కు 45 నుంచి 55 నిమిషాల పరిధిలో ఉన్నాయి. 

ఒక ఇన్వెస్ట్‌మెంట్ దృక్పథంతో చూసినా... కేవలం ఒక 2-3 ఏళ్లల్లోనే రెట్టింపు వాల్యూ తెప్పించే అవకాశం ఉందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 


24 గంటల సెక్యూరిటీ, 3 సంవత్సరాల మెయింటెనెన్స్, మంచి నల్లరేగడి నేల, డ్రిప్ ఇర్రిగేషన్, 33 ఫీట్స్/40 ఫీట్స్/60 ఫీట్స్ ఇంటర్నల్ రోడ్స్‌తో ఉన్న ఈ గ్రీన్ లీవ్స్ ఇన్‌ఫ్రాటెక్ లిమిటెడ్ వెంచర్‌లో:

121 స్క్వేర్ యార్డ్స్ నుంచి 4850 స్క్వేర్ యార్డ్స్ (1 నుంచి 40 గుంటలు) యూనిట్స్‌లో... స్క్వేర్ యార్డ్‌కు Rs. 4,999/- కనీస ధరతో ఎన్ని యూనిట్స్ అయినా కొనుక్కొనే ఫ్లెక్సిబిలిటీ ఉంది. 

క్లియర్ టైటిల్. 

ఫండ్స్‌తో రెడీగా ఉన్న కస్టమర్స్‌కు వెంటనే రిజిస్ట్రేషన్ ఉంటుంది. 

You're just a call away from making the best investment decision of 2022... 

+91 9989578125

Thursday 24 March 2022

BECOME HERO!


థాంక్స్ టు కరోనా లాక్‌డౌన్... ఇండిపెండెంట్ సినిమాల హవా ఇప్పుడు బాగా నడుస్తోంది.   

కావాలనుకొంటే ఎవ్వరైనా ఓవర్‌నైట్‌లో హీరో కావచ్చు.  

నిజంగా సినీఫీల్డు మీద చచ్చేంత ప్యాషన్, ఏమైనా సరే సాధించాలన్న తపన ఉన్న యాస్పయిరింగ్ హీరోలకు, కొత్త ఆర్టిస్టులకు ఇదొక పనికొచ్చే పోస్ట్.  

హీరోగా ఇంట్రొడ్యూస్ కావాలనుకొనే కొత్త ఆర్టిస్టులు... ఈ పోస్ట్ చదివాక, ఈజీగా ఒక డెసిషన్ తీసుకోవచ్చు.  

కట్ చేస్తే -

సినీఫీల్డులో హీరోగా మీ ప్రవేశానికి టాలెంట్ ఒక్కటే సరిపోదు. 

బై డిఫాల్ట్ ఎవరికైనా టాలెంట్ ఉండాల్సిందే. అయితే - ఆ టాలెంట్ మిమ్మల్ని ఇండస్ట్రీకి పరిచయం చేయగలిగినవారి దృష్టికి తీసుకెళ్ళగలగాలి. అదెలా సాధ్యమవుతుందో మీకు తెలిసుండాలి. 

చాలా సందర్భాల్లో ఒక కొత్త హీరో బయటినుంచి పరిచయమవడం అన్నది చాలా అరుదుగా జరిగే అంశం. డబ్బు, ఇండస్ట్రీ లింక్స్, కాంటాక్ట్స్ లేకుండా దాదాపు ఇది అసాధ్యం. 

కేవలం అతి కొద్ది మంది విషయంలో మాత్రమే టాలెంట్ సపోర్ట్ చేస్తుంది. అది షార్ట్ ఫిలిమ్స్‌లో మీ యాక్షన్ గుర్తించి కావచ్చు. అంతకు ముందు చిన్న చిన్న కారెక్టర్స్‌లో మీరు ప్రూవ్ చేసుకున్న మీ నటన చూసి కావచ్చు. ఇలా కొద్దిమందికి మాత్రమే సాధ్యమవుతుంది. 


ఎవరో ఒకరిద్దరిని ఉదాహరణగా తీసుకొని, "నేనూ అలాగే హీరో అవుతా" అని అనుకోవడం ఇప్పుడున్న భారీ కాంపిటీషన్‌లో దాదాపు అసాధ్యం. విలువైన మీ సమయం వృధాకావడం తప్ప వేరేదేం జరగదు.  

సినిమా అంటేనే - ప్రతిరోజూ లక్షల్లో, కోట్లల్లో ఖర్చు. 

అంతా కొత్తవాళ్లతోనే, ఒక మాడరేట్ స్థాయిలో సినిమా తీయాలంటేనే... కనీసం ఓ 2 కోట్లు అవుతుంది. మరీ తక్కువలో తక్కువ అనుకుంటే కనీసం ఓ 80 లక్షలవుతుంది. 

కొత్త హీరోలకు చాన్స్ ఇచ్చే సినిమాలు 99% చిన్న బడ్జెట్ సినిమాలే. ఈ చిన్న బడ్జెట్ సినిమాలకు ఎప్పుడూ ఒక పెద్ద సమస్య ఉంటుంది. 

డబ్బు! 

ఒక కొత్త హీరోను ఇంట్రొడ్యూస్ చెయ్యాలనుకున్నప్పుడు, ఎవరైనా టాలెంట్‌కే ఫస్ట్ ప్రెఫరెన్స్ ఇస్తారు. అందులో డౌట్ లేదు. అయితే - అలా టాలెంట్ ఉన్నవాళ్ళు వందల్లో ఉంటారు.

సో, వారిలో ఎవరి ద్వారా ప్రాజెక్టుకు సపోర్ట్ ఉంటుందో వారికే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. 


ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. 

కొత్త హీరోలను ఎక్కువగా వారి బంధువులో, ఫ్రెండ్సో ప్రొడ్యూసర్స్‌గా ఉండి ఇంట్రొడ్యూస్ చేస్తారు. కొంతమంది కొత్త హీరోలు వారే స్వయంగా బడ్జెట్లో కొంత భాగం ఇన్వెస్ట్ చేస్తారు. వారికి ఆ స్థోమత లేనప్పుడు, వారి సర్కిల్లో తెలిసినవారి ద్వారా ఎంతో కొంత ఇన్వెస్ట్ చేయిస్తారు. 

ఓవర్‌నైట్‌లో  హీరోలయిపోతారు!  

ఇది ఎప్పుడూ జరిగేదే.  

ఈమధ్య కూడా - ఈ పధ్ధతిలో హీరోలుగా పరిచయమై నిలదొక్కుకున్న హీరోలెవరైనా గుర్తొస్తున్నారా మీకు? తప్పకుండా వస్తారు. ఇది చాలా మామూలు విషయం. 

కొత్త హీరోల ఇంట్రడక్షన్ వెనకున్న ఈ ఆర్థిక కోణాన్ని అర్థం చేసుకోలేక - చాలా మంది తప్పుగా అనుకుంటారు... డబ్బులు పెడితేనే  చాన్స్ ఇస్తారనీ, ప్రొడ్యూసర్లు - డైరెక్టర్లు వాళ్లకు తెలిసిన వాళ్లకే చాన్స్ ఇస్తున్నారనీ... రకరకాలుగా అనుకుంటారు. 

ఏదీ ఊరికే రాదు, ఊరికే అందరూ హీరోలవ్వలేరు. హీరోలయ్యాక వారికి కూడా ఊరికే కోట్లల్లో రెమ్యూనరేషన్ ఇవ్వరు. 

ప్రతిదానికీ ఓ లెక్కుంటుంది.  ఈ  రియాలిటీని అర్థం చేసుకుంటే చాలు. జీవితంలో మీ టైం వేస్ట్ కాదు.

ఆసక్తి ఉందా? 

సినీఫీల్డులో హీరోగా మీ కెరీర్ పట్ల చచ్చేంత ప్యాషన్ ఉందా? 

అయితే - ఆసక్తి, ప్యాషన్ మాత్రమే సరిపోవు. స్థోమత ఉండాలి. మీ కుటుంబ నేపథ్యం మీకు సహకరించాలి. అలా లేనప్పుడు, మీకోసం బడ్జెట్‌లో కొంత భాగమయినా ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వచ్చే కాంటాక్ట్స్ మీకుండాలి.  


ఇదంతా కొత్త హీరోయిన్స్‌కు కూడా వర్తిస్తుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటాను. ఇన్వెస్ట్ చేస్తూ హీరోయిన్స్‌గా పరిచయం అవ్వటం ద్వారా హీరోయిన్స్ విషయంలో ఉన్న ఎంతో కాంపిటీషన్‌ను సింగిల్ స్టెప్‌లో దాటుకుని వెళ్ళొచ్చు. 

ఓకే అనుకుంటే... నిజంగా ఆ సీరియస్‌నెస్, ఆ స్థోమత, ఆ కాంటాక్ట్స్ మీకు ఉన్నట్టయితే... మీ పూర్తి వివరాలతో నాకు వాట్సాప్ పెట్టండి. 

బెస్ట్ పాజిబిలిటీస్ ఆలోచిద్దాం. వెంటనే కొత్త ప్రాజెక్టు ప్రారంభిద్దాం. 

Welcome to Glamour World!

Film Director, Nandi Award Winning Writer
WhatsApp: +91 9989578125
Email: mchimmani10x@gmail.com

ABOUT Manohar Chimmani: 

(మీ కాంటాక్ట్స్‌లో సినీఫీల్డు వైపు ఆసక్తి ఉన్నవారికి, ఫిలిం ప్రొడక్షన్‌లో ఇన్వెస్ట్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఉన్నవారికి, ఇన్వెస్ట్ చేస్తూ హీరోగా పరిచయం కావాలని ప్రయత్నిస్తున్నవారికి... ఈ లింక్ షేర్ చేయండి. థాంక్ యూ!)

'INVESTMENT MEDIATORS' WANTED IMMEDIATELY !!


ఇంతకుముందు సినిమాలు వేరు. ఇప్పుడు వేరు.

Content is king. Money is the ultimate goal.

కరోనా వైరస్ నేపథ్యంలో, సుదీర్ఘ లాక్‌డౌన్ తర్వాత ఫిలిం ఇండస్ట్రీలో చాలా మార్పులొచ్చాయి. కొత్తగా మరికొన్ని ఆదాయమార్గాలు ఏర్పడ్డాయి.  

ఒకప్పుడు 10 కోట్ల బడ్జెట్ అంటే భారీ సినిమా. ఇప్పుడు ఒక్క పెద్ద హీరో రెమ్యూనరేషనే 100 కోట్లను క్రాస్ చేసింది.

ఒకప్పుడు ఒక హిట్ సినిమా తీస్తే, తర్వాతి సినిమాకు ఆ డైరెక్టర్‌కు వచ్చే రెమ్యూనరేషన్  20 లక్షలు ఉండేది. ఇప్పుడు అదే మినిమమ్ 5 నుంచి 10 కోట్లు అయింది.

సినిమా ఇప్పుడొక కార్పొరేట్ బిజినెస్. బిగ్ బిజినెస్.

డైరెక్టుగా థియేటర్స్‌లో రిలీజ్ అయ్యే సినిమాలతో పాటు - OTTలు కూడా సరికొత్త ఆదాయమార్గాలయ్యాయి. ఒక్కో సినిమా 4 నుంచి 10 భాషలవరకు ఏకకాలంలో రిలీజవుతూ వ్యూయర్‌షిప్‌లో, బిజినెస్‌లో అనేక సంచలనాలు క్రియేట్ చేస్తోంది. ఫ్రాంచైజీలు, ఇన్-ఫిలిం బ్రాండింగ్స్, స్పాన్సర్‌షిప్స్ కోట్లల్లో వస్తున్నాయి. 

ఈ బిగ్ బిజినెస్ అంతా నాణేనికి ఒక వైపు. 

మరోవైపు...

చిన్న బడ్జెట్లో తీసే ఇండిపెండెంట్ సినిమాల హవా ఊపందుకొంది. థియేటర్లో రిలీజ్ అయినా కాకపోయినా -- Amazon Prime, Netflix, Zee5, Sony Liv, Aha వంటి  OTTల ద్వారా వీటికి మంచి బిజినెస్ అవుతోంది. 

లక్షల్లో తీసే చిన్న బడ్జెట్ సినిమాలు ఇప్పుడు కోట్లల్లో బిజినెస్ కొల్లగొడుతున్నాయి.  

ఈ గోల్డెన్ అపార్చునిటీని వినియోగించుకొనే ప్రయత్నంలో భాగంగా – ఒక నంది అవార్డు రైటర్-డైరెక్టర్‌గా, నేనొక సీరీస్ ఆఫ్ ట్రెండీ, ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ సినిమాలను, మైక్రో బడ్జెట్‌లో  ప్లాన్ చేస్తున్నాను. తర్వాత ఇదే ఒక భారీ ప్రొడక్షన్ హౌజ్ అయినా ఆశ్చర్యం లేదు. ప్రస్తుతం ఆ దిశలోనే, ఆ స్థాయిలోనే, నా పనులు కదులుతున్నాయి.     

ఈ నేపథ్యంలో - 

నేనిప్పుడు చేస్తున్న రెండు మైక్రో బడ్జెట్ చిత్రాల కోసం... మినిమమ్ 20 లక్షలకు ఒక యూనిట్ చొప్పున, చిన్న స్థాయిలో, వెంటనే ఇన్వెస్ట్ చేయించగలగాలి.  

ఇక్కడ ఒక అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే - ఇలా ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వచ్చేవాళ్లకు ప్రధానంగా సినిమాల మీద ఇంట్రెస్టూ, ఫిలిం ప్రొడక్షన్ బిజినెస్ మీద ప్యాషన్ కాస్తో కూస్తో ఉండటం చాలా అవసరం. 

ఎందుకంటే, వాళ్లు మాత్రమే కొన్ని కొన్ని విషయాల్ని వెంటనే అర్థం చేసుకోగలుగుతారు. ఇతర బిజినెస్‌లకూ దీనికీ ఉన్న తేడాను గ్రహించగలుగుతారు. 

సో, ఇంతకుముందే సినిమాయేతర బిజినెస్‌లలో / ప్రొఫెషన్స్‌లో స్థిరపడి ఉండి… ఫిలిం ప్రొడక్షన్ మీద, ఫిలిం ఇండస్ట్రీ మీద ఇంట్రెస్టుతో పాటు... పర్సనల్ ప్రమోషన్ మీద,సెలెబ్ స్టేటస్ మీద కూడా ప్యాషన్ ఉన్న డైనమిక్ ఇన్వెస్టర్స్ / ఫండింగ్ పార్ట్‌నర్స్‌తో కనెక్ట్ చేసి, సమర్థవంతంగా డీల్ వెంటనే క్లోజ్ చేయగల "ఐకానిక్ ఇన్వెస్ట్‌మెంట్ మీడియేటర్స్‌" కోసం నేను చూస్తున్నాను... అలాంటి మిత్రుల కోసం, శ్రేయోభిలాషుల కోసం నేను చూస్తున్నాను. 

మీడియేటర్స్‌కు మంచి కమిషన్ ఉంటుంది. ఆకర్షణీయమైన ఇతర ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. 

ఈవైపు ఆసక్తి, అనుభవం, టైమ్‌బౌండ్‌గా పని పూర్తిచేయగల సామర్థ్యం ఉన్న డైనమిక్ మీడియేటర్స్‌ వెంటనే నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. 

'ఎన్ ఆర్ ఐ' మీడియేటర్లకు కూడా ఇదే మా స్వాగతం.   

ముఖ్యమైన విషయం ఏంటంటే - మాకు కావలసింది "కో-ప్రొడ్యూసర్లు"గా ఇన్వెస్ట్ చేయగలవాళ్లు మాత్రమే తప్ప ఫైనాన్సియర్స్ కాదు.

కొన్ని షరతులతో "ఫండింగ్ పార్ట్‌నర్స్‌" తో కూడా డీల్ చేయవచ్చు.  

డీల్ పూర్తి అయినరోజే మీడియేటర్స్‌కి కమిషన్ ఇవ్వటం జరుగుతుంది. స్క్రీన్ మీద మొట్టమొదటగా వచ్చే "అక్నాలెడ్జ్‌మెంట్స్" టైటిల్ కార్డ్స్‌లో మీడియేటర్స్‌ పేరు వేస్తాము.

నిజంగా మీదగ్గర ఇప్పటికిప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఎవరైనా ఉన్నట్లయితే - వెంటనే వాట్సాప్ చేయండి. మా ఆఫీస్ నుంచి మీకు వెంటనే కాల్ వస్తుంది. మిగిలిన వివరాలు ఫోన్లో మాట్లాడుకుందాం.

నన్ను కాంటాక్ట్ చేసిన తర్వాత, 72 గంటల్లో డీల్ పూర్తి చేయించగలిగిన మీడియేటర్స్‌కు రెట్టింపు కమిషన్ ఉంటుంది! 

మా కాంటాక్ట్ నంబర్: +91 9989578125 

కలిసి పనిచేద్దాం. కలిసి ఎదుగుదాం.

Film Director, Nandi Award Winning Writer
Life Member, Telugu Film Chamber of Commerce
Life Member, Telugu Film Directors' Association

ABOUT MANOHAR CHIMMANI: 

SHORT AV ON MANOHAR CHIMMANI:

***

PS:
ఈవైపు ఆసక్తి ఉన్న మీడియేటర్స్ మీకు తెలిసినవారు ఎవరైనా ఉంటే దయచేసి దీన్ని వారికి ఫార్వార్డ్ చేయండి. థాంక్యూ!😊

Wednesday 23 March 2022

MANOHAR CHIMMANI 'FILM COACHING ONLINE'> నిజంగా సినీఫీల్డులో మీ కెరీర్ ప్రారంభించాలని సీరియస్‌గా ఉన్నారా? 

> అంత ఆసక్తి, ప్యాషన్, పట్టుదల మీలో ఉందా? 

> టైటిల్ కార్డ్స్‌లో మీ పేరు ఎప్పుడెప్పుడు చూసుకుందామా అని తహతహగా ఉందా?

మీ సమాధానం "అవును" అయితే... ఆ అవకాశం ఇప్పుడు మీ కళ్ళముందే ఉంది. 

యాక్టింగ్ | డైరెక్షన్ | స్క్రిప్ట్ రైటింగ్ | లలో 
“వన్-టూ-వన్” పర్సనల్ కోచింగ్ – 
ఇప్పుడు ఆన్‌లైన్‌లో! 

కట్ టూ ఆరు నెలల కంప్లీట్ కోచింగ్ -  

లక్షలు కుమ్మరించి ఏదో ఒక ఇన్స్‌టిట్యూట్‌లో చేరామా, ఏదో ఒకటి రొటీన్‌గా నేర్చుకొన్నామా, చివరికి ఏదో ఓ సర్టిఫికేట్ తీసుకొని బయటకొచ్చామా అని కాదు.

హైద్రాబాద్‌ లోని ఒక స్థాయి ఉన్న ఫిలిం ఇన్‌స్టిట్యూట్స్‌ల్లో, ఒక్కో కోర్సుకి ఫీజు సుమారు 5 నుంచి 27 లక్షల వరకు ఉంది. 

ఉపయోగం ఏంటి?

ఆ సర్టిఫికేట్ చూసి... సర్టిఫికేట్ తీసుకొంటున్న ఆ ఫోటో చూసి... ఎవరైనా సినిమాలో చాన్స్ ఇస్తారా? 

నిజానికి, మీరు అంత ఫీజు వృధాచేసుకోవాల్సిన అవసరంలేదు.

న్యూ టాలెంట్‌ను తీసుకునే విషయంలో... ఫిలిం ఇండస్ట్రీ వారిలో ఏం చూస్తుందో, ఇండస్ట్రీకి ఎలా అయితే అవసరమో... పూర్తిగా ఆ పాయింటాఫ్ వ్యూ లోనే నా ‘ఆన్‌లైన్‌ కోచింగ్’ ఉంటుంది!

ఈ వన్-టూ-వన్ ఆన్‌లైన్‌ కోచింగ్ కోసం, నేనెంతో సమయం కెటాయించాల్సి ఉంటుంది.

అందుకే – ఇది ఫ్రీ కోచింగ్ కాదు. ఫీజు ఉంటుంది. కాని, పైన చెప్పిన భారీ ఫీజులతో పోలిస్తే… ఇది చాలా స్వల్పం.

"ఫిల్మ్ స్కూల్ ఆన్‌లైన్" అంటే వినడానికి కొంచెం కొత్తగా అనిపిస్తుంది. కాని, మీకు తెలుసా... ఈ డిజిటల్ యుగంలో, ఫిలిం మేకింగ్‌కు సంబంధించిన చాలా పనులు ఆన్‌లైన్‌లోనే ఎక్కువగా జరుగుతున్నాయని?!

ఆధునిక పధ్ధతిలో నేను రూపొందించిన ఈ ‘ఆన్‌లైన్‌ కోచింగ్’ రొటీన్ ఫిలిం ఇన్స్‌టిట్యూట్స్ ట్రైనింగ్‌కు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఉదాహరణకు:

> రొటీన్ క్లాస్ రూం టీచింగ్ ఉండదు.

> నంది అవార్డ్ రచయిత-డైరెక్టర్‌, యువర్స్ ట్రూలీ, చిమ్మని మనోహర్‌తో… ఈమెయిల్స్, జూమ్/స్కైప్/మెసెంజర్/వాట్సాప్ కాల్స్/ఫోన్ కాల్స్/ఆన్‌లైన్ కంటెంట్ షేరింగ్ మొదలైనవాటితో ఈ “వన్ టూ వన్” శిక్షణ పూర్తిగా ఆన్‌లైన్‌లో, పూర్తిగా అన్‌ట్రెడిషనల్‌గా ఉంటుంది. 

> కోర్సు కాల వ్యవధి: 6 నెలలు. మీ టాలీవుడ్ ఎంట్రీకి ఈమాత్రం శిక్షణాకాలం చాలు. మీరు వెంటనే ఫీల్డులోకి ఎంటర్ అవడానికి – ఏ ఏ ముఖ్యమైన విషయాల్లో, మీకు ఎలాంటి అవగాహన, శిక్షణ అవసరమో – ఈ 6 నెలల్లో అవన్నీ మీరు నేర్చుకుంటారు.

ఇది జస్ట్ ఏదో మరొక రొటీన్ కోచింగ్ కాదు... Customized Personal Coaching. Mentoring. 

అంటే - ఈ కోచింగ్ అందరికీ కామన్ కాదు. అభ్యర్థుల లక్ష్యాల్ని బట్టి, వారికున్న స్కిల్స్ స్థాయిని బట్టి ఒక్కొక్కరికి ఈ కోచింగ్ విభిన్నంగా ఉంటుంది. 

మీ చదువుల్నీ, ఉద్యోగాలనూ ఈ కోచింగ్ అస్సలు డిస్టర్బ్ చేయదు. మీ మీ పనులు చేసుకొంటూనే ఈ కోచింగ్ మీరు తీసుకోవచ్చు. 

కోర్స్ పూర్తయ్యాక, సర్టిఫికేట్ కొరియర్‌లో పంపిస్తాము. తర్వాత, మా సినిమాల షూటింగ్ సమయంలో 'ఆన్‌-లొకేషన్ అధ్యయనం' చెయ్యడానికి అవకాశం కల్పిస్తాము.  

ఇంకెందుకు ఆలస్యం?

ఇప్పుడు ముందుగా మీరు చేయాల్సింది... క్రింద నా ప్రొఫైల్ లింక్ ఉంది. క్లిక్ చేసి చదవండి. ఆ తర్వాతే, నిర్ణయం తీసుకోండి. 

వెంటనే ఫీజు చెల్లించి కోచింగ్‌లో చేరిపోడానికి రెడీగా ఉన్న అభ్యర్థులు మాత్రమే... మీ పూర్తి పేరు, చదువు, అడ్రసు తెలుపుతూ .. అప్లికేషన్, ఫీజు వివరాల కోసం నాకు వాట్సాప్ చేయండి. మరిన్ని వివరాలు పూర్తిగా నా నుంచి తెలుసుకోండి. 

"We make money to make more movies.” 
- Walt Disney

వాల్ట్ డిస్నీ చెప్పినట్టు, ఈ కోచింగ్ ద్వారా నాకు వచ్చే డబ్బు మళ్ళీ నా సినిమాలకోసమే వెచ్చించడం జరుగుతుంది.  

ఒంటరిపోరాటం చేస్తూ మీరు వెదుకుతున్న ఆ "ఒక్క ఛాన్స్" కోసం ఇంకో 2, 3 ఏళ్లో... ఇంకో పదేళ్ళో మీ సమయం వృధా కాకుండా మిమ్మల్ని తగినవిధంగా ట్రెయిన్-అప్ చేసి, గైడ్ చేయటం అనేది కూడా నా ప్యాషన్. 

అలాగే - కోచింగ్ సమయంలో అత్యుత్తమ స్థాయి టాలెంట్ నిరూపించుకొనే కొందరు కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్స్... ఇప్పుడు నేను చేస్తున్న సినిమాల కోసం నా టీమ్‌కు కూడా అవసరం.

విన్, విన్ అన్నమాట!    

సో, ఇప్పుడు చెప్పండి... 
> నిజంగా సినీఫీల్డులో మీ కెరీర్ ప్రారంభించాలని సీరియస్‌గా ఉన్నారా? 
> అంత ఆసక్తి, ప్యాషన్, పట్టుదల మీలో ఉందా? 
> టైటిల్ కార్డ్స్‌లో మీ పేరు ఎప్పుడెప్పుడు చూసుకుందామా అని తహతహగా ఉందా? 

మీ సమాధానం "అవును" అయితే - అప్లికేషన్, ఫీజు వివరాల కోసం ఈ  నంబర్‌కు వెంటనే వాట్సాప్ చేయండి: 9989578125

Welcome to Glamour World!

Film Director, Nandi Award Winning Writer 

ABOUT MANOHAR CHIMMANI: 
---
SHORT AV ON MANOHAR CHIMMANI:
^^^^^

(మీ కాంటాక్ట్స్‌లో సినీఫీల్డు వైపు, కోచింగ్‌వైపు ఆసక్తి ఉన్నవారికి ఈ 
లింక్ షేర్ చేయండి. Thank you.)

ఎవరీ హంస?

నేను ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్‌లో లైబ్రరీ అండ్ ఇన్‌ఫర్మేషన్ సైన్స్ చదివినప్పటి జ్ఞాపకం ఈ హంస.

మా క్లాస్‌లో సుమారు ఓ డజన్ మంది అమ్మాయిలుండేవాళ్లు. ఆ డజన్ మంది గాళ్ స్టుడెంట్స్‌లో కనీసం ఓ నలుగురో, అయిదుగురో ఆంటీలు కూడా ఉండేవాళ్లు. వారిలో కొందరు పెళ్లయి పిల్లలున్నవాళ్లు. కొందరు అప్పటికే మంచి ఉద్యోగాల్లో ఉన్నవాళ్లు.

ఆ నలుగురయిదుగురు ఆంటీలను నేనెప్పుడూ పెద్దగా పట్టించుకోలేదు... గమనించలేదు. నా క్లాస్‌మేట్స్ కొందరు మాత్రం ప్రత్యేకంగా వాళ్లకే లైనేసేవాళ్లు.. అది వేరే విషయం.

ఒకరోజు - "అబ్స్‌ట్రాక్టింగ్ అండ్ ఇండెక్సింగ్" సబ్జెక్టును అద్భుతంగా చెప్పే మా వేణుగోపాల్ సర్ క్లాస్‌కి ఒక ఆంటీ చాలా లేట్‌గా వచ్చింది. వచ్చి అలా గమ్మున కూర్చోకుండా, పక్కనున్న స్టుడెంట్‌తో ఏ టాపిక్ చెప్తున్నారు... వగైరా ఎంక్వయిరీ చేయసాగింది గుసగుసగా.

అసలే డిస్టర్బ్ అయిన వేణుగోపాల్ సర్ ఆమెను చడమడా తిట్టేశారు. బోరున ఏడ్చేసింది మా క్లాస్‌మేట్.

అలా నా దృష్టిలో మొదటిసారిపడిన అప్పటి నా క్లాస్‌మేట్ పేరు హంస. 

మనం మామూలుగా "హంస" అనే ఉచ్ఛరిస్తాము. తను మాత్రం "హన్స" అనేది. ఇంగ్లిష్‌లో స్పెల్లింగ్ కూడా తనది 'Hansa' అనే ఉందేది వెరైటీగా. 

ఆ తర్వాత మా మధ్య జరిగిన కొన్ని సంభాషణల్లో బయటపడ్డ విషయమేంటంటే, అప్పటికి సుమారు పదేళ్లక్రితం హంస "మాభూమి" సినిమాలో నటించింది. 

సాయిచంద్‌తో లంబాడి చంద్రి పాత్రలో... 

ఒక్కసారిగా షాక్!

ముందు నమ్మలేకపోయాను. కానీ తర్వాత జాగ్రత్తగా గమనించాను. నిజమే, పోలికలు అవే. కానీ, ఈ పదేళ్లలో కొంచెం లావెక్కింది హంస. 

పాలరాతి బొమ్మలా గుండ్రంగా ఉండే ఆ హంసకు తెలుగు రాదు. మరాఠీ అమ్మాయి అని తర్వాత తెలిసింది. నోట్స్ కోసమో, ఇంకేదయినా మాట్లాడ్డం కోసమో హంస నా వైపు వస్తున్నపుడల్లా తప్పించుకొనే ప్రయత్నం చాలా చేసేవాణ్ణి.  

కట్ టూ నా ఇంగ్లిష్  - 

హంస నోరు తెరిస్తే ఇంగ్లిష్. ఆమె రేంజ్‌లో ఇంగ్లిష్‌లో మాట్లాడ్డానికి నాకు అప్పట్లో చాలా భయం. కొద్దిరోజుల తర్వాత నాలో ఉన్న ఆ భయాన్ని తనే ఎగరగొట్టేసిందనుకోండి... తెగ మాట్లాడీ, మాట్లాడించీ.

లైబ్రరీకి ప్రాక్టికల్స్ కోసం వస్తున్నానని చెప్పి నేను వెళ్లకపోవడమో, తనకు ఏదయినా నోట్స్ ఇస్తానని చెప్పి టైమ్‌కు నేను ఇవ్వకపోవడమో మా మధ్య చాలా కామన్‌గా జరిగేది. అలా మిస్ కావడానికి కారణం అప్పటి నా హాస్టల్ లైఫ్. లేదా, నా రష్యన్ డిప్లొమాలోని అమ్మాయిలతో క్యాంపస్‌లోని చెట్లక్రింది క్యాంటీన్ దగ్గర ఎడతెగని కబుర్లు.

ఇలాంటి ఒక సందర్భంలోనే... అప్పటికి నాకు తెలియని, నేను అప్పటివరకూ వాడని ఒక ఇంగ్లిష్ వర్డ్‌ను హంస నోటివెంట విన్నాను. ఆ మాట ఇప్పుడెప్పుడయినా నేనే వాడినా, ఇంకెవరి నోటనయినా విన్నా... నాకు అప్పటి నా క్లాస్‌మేట్ హంసనే గుర్తుకొస్తుంది.

"Hey, don't ditch me!"

తనొక్కతే ఉన్నప్పుడు... ఎప్పుడూ ఏదో కోల్పోయినట్టుగా ఉండే అప్పటి నా క్లాస్‌మేట్ హంస ఇప్పుడు ఎక్కడుందో నాకు తెలియదు. సోషల్ మీడియాలో కూడా ఎక్కడా కనిపించలేదు. 

ఎవరికయినా తెలిస్తే చెప్పండి. దాదాపు పాతికేళ్ళు దాటి ఉంటుంది మేం కలిసి... 

కనీసం ఒక "హాయ్" చెప్తాను. 

Friday 18 March 2022

సిటీకి దూరంగా... 'క్రియేటివ్ స్పేస్' డెస్టినేషన్స్‌!


డైరెక్టర్స్, రైటర్స్ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా స్క్రిప్టులు రాసుకోడానికి పట్టాయా, గోవా, సింగపూర్, అన్నవరం, అరకు, ఊటీ లాంటి ప్లేస్‌లకు వెళ్తుంటారు. 

ఇప్పుడు ఫీల్డులో యాక్టివ్‌గా ఉన్న డైరెక్టర్స్‌లో, కొత్తగా వస్తున్న డైరెక్టర్స్‌లో కూడా ఎక్కువమంది రైటర్-డైరెక్టర్స్‌గా వారి స్క్రిప్టులను వారే రాసుకొంటున్నారు. ఇలాంటి డైరెక్టర్స్, స్క్రిప్ట్ రాసుకుంటున్న సమయంలోనే చాలావరకు ప్రి-ప్రొడక్షన్ వర్క్ ప్లాన్ కూడా చేసుకుంటారు. 

ఇంట్లో కూర్చుని రాసుకోవడం అసలు కుదరని పని. ఇక, ఫిలిం ప్రొడక్షన్ ఆఫీసులో కూర్చుని ఈ పనులు చేసుకోవడం కూడా అంత ఈజీ కాదు. గంటకి కనీసం ఓ నాలుగుసార్లు రాసుకునే పని పక్కనపెట్టి, ఎవరెవరినో కలవాల్సిరావచ్చు. లేదంటే కాల్స్ రావచ్చు. 

అన్నీ ముఖ్యమే కాబట్టి దేన్నీ పక్కనపెట్టలేం. 

కథాచర్చలవరకు ఓకే గాని, పూర్తి స్క్రిప్టు రాసుకోడానికి మాత్రం ఆఫీసులు పనికిరావు. 

కట్ చేస్తే -

సినిమావాళ్లకు, టీవీ సీరియల్స్ వారికి, ఇతర క్రియేటివ్ రంగాలవారికి... గేటెడ్ కమ్యూనిటీ ఫామ్‌లాండ్స్, ఫామ్‌లాండ్స్, ఫామ్‌హౌజ్‌లు అనేవి చాలా విషయాల్లో ఈ ఒక కొత్త సొల్యూషన్ అనుకోవచ్చు. 

కేవలం స్క్రిప్టులు రాసుకోవడం, స్టోరీ సిట్టింగ్స్, మ్యూజిక్ సిట్టింగ్స్, ప్రొడక్షన్ ప్లానింగ్స్ వంటి పనులకోసమే కాకుండా... "వీకెండ్ క్రియేటివ్ డెస్టినేషన్స్‌"గా కూడా ఈ గేటెడ్ కమ్యూనిటీ ఫామ్‌లాండ్స్, ఫామ్‌హౌజెస్ బాగా ఉపయోగపడతాయి. మంచి రిలీఫ్‌ను ఇస్తాయి. 

GREEN LEAVES INFRATECH LIMITED వారి గేటెడ్ కమ్యూనిటీ ఫామ్‌ప్లాట్స్, ఫామ్‌హౌజ్ వెంచర్స్ అలాంటివే.  


సిటీకి 70 కిలోమీటర్ల దూరంలో, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, మంజీరా నది వ్యూతో అద్భుతంగా ప్లాన్ చేసిన ఈ వెంచర్‌ను ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, రైటర్స్, ఇతర క్రియేటివ్ రంగాల్లోని ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ఒకసారి విజిట్ చేసి నిర్ణయం తీసుకోవచ్చు. 

మనకు నచ్చిన డిజైన్‌లో ఓ చిన్న ఫామ్‌హౌజ్ వేసుకొని, మనకిష్టమైన వెజిటబుల్స్, గ్రీనరీ పెంచుకొంటూ, మనకు అవసరమైనప్పుడు గాని, వీకెండ్స్ గాని అక్కడ గడపగలిగితే చాలు... లైఫ్ నిజంగా ఇంకో లెవెల్లో ఉంటుంది. 

ఇన్వెస్ట్‌మెంట్ పరంగా కూడా ఇలాంటి ఫామ్‌ప్లాట్స్, ఫామ్‌లాండ్స్ కొనుక్కోవడం అనేది ఒక బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్ అవుతుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 

సిటీకి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఫామ్‌లాండ్ ప్రాజెక్టు, ముంబై హైవేకు కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. 

కేవలం 15 నిమిషాల దూరంలో సంగారెడ్డి జిల్లా హెడ్‌క్వార్టర్స్, 30-45 నిమిషాల దూరంలో RRR (Regional Ring Road) & ORR (Outer Ring Road) ఉన్నాయి.  

13,000 ఎకరాల్లో సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేసిన NIMZ (National Investment & Manufacturing Zone) ప్రాజెక్టు, MRF, పెన్నార్, పెప్సికో, BHEL, KIRBY, తోషిబా, ఎక్స్‌పోర్ట్ కారిడార్, MNR మెడికల్ కాలేజి, IIT, Gitam, Woxsen యూనివర్సిటీలు... TCS, Wipro, ISB, Microsoft, Google వంటి గొప్ప గొప్ప సంస్థలన్నీ ఈ వెంచర్‌కు 45 నుంచి 55 నిమిషాల పరిధిలో ఉన్నాయి. 

ఈ నేపథ్యంలో... ఒక ఇన్వెస్ట్‌మెంట్ దృక్పథంతో చూసినా... కేవలం ఒక 2-3 ఏళ్లల్లోనే రెట్టింపు వాల్యూ తెప్పించే అవకాశం ఉందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 


ఇన్ని ప్లస్ పాయింట్స్‌తో ఉన్న గ్రీన్ లీవ్స్ ఇన్‌ఫ్రాటెక్ లిమిటెడ్ వారి ఫస్ట్ వెంచర్ ఇప్పటికే "సోల్డ్ అవుట్" అయిపోయింది. సెకండ్, థర్డ్ వెంచర్స్‌లో అమ్మకాలు ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో ఉన్నాయి.  

24 గంటల సెక్యూరిటీ, 3 సంవత్సరాల మెయింటెనెన్స్, మంచి నల్లరేగడి నేల, డ్రిప్ ఇర్రిగేషన్, 33 ఫీట్స్/40 ఫీట్స్/60 ఫీట్స్ ఇంటర్నల్ రోడ్స్‌తో ఉన్న ఈ గ్రీన్ లీవ్స్ ఇన్‌ఫ్రాటెక్ లిమిటెడ్ వెంచర్‌లో:

121 స్క్వేర్ యార్డ్స్ నుంచి 4850 స్క్వేర్ యార్డ్స్ (1 నుంచి 40 గుంటలు) యూనిట్స్‌లో... స్క్వేర్ యార్డ్‌కు Rs. 4,999/- కనీస ధరతో ఎన్ని యూనిట్స్ అయినా కొనుక్కొనే ఫ్లెక్సిబిలిటీ ఉంది. 

క్లియర్ టైటిల్. 

ఫండ్స్‌తో రెడీగా ఉన్న కస్టమర్స్‌కు వెంటనే రిజిస్ట్రేషన్ ఉంటుంది. 

ప్రముఖ ఫిలిం, టీవీ ఆర్టిస్టులు, యాంకర్స్ ఇటీవలే ఈ వెంచర్‌లో ఫామ్‌లాండ్ తీసుకోడానికి విజిట్ చేశారు. అడ్వాన్స్ కూడా చెల్లించారు. 

ఇప్పుడిక మీ వంతు...

Get connected on +91 9989578125. And... Make the best investment decision of 2022! 

బెస్ట్ విషెస్... 

Thursday 17 March 2022

మ్యాటర్ ఎప్పుడూ ఫీల్డు కాదు, మన మైండ్‌సెట్!

"మా వాడు చదువుకోవట్లేదు. ఉద్యోగం చేయడు. బిజినెస్ చేయలేడు. ఏ పనీ చేతకాదు. ఎందుకూ పనికిరాడు... కొంచెం నీ దగ్గర డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పెట్టుకో!"

ఒకరోజు పొద్దున్నే గురువుగారు దాసరిగారికి కాల్ చేసి అలా అడిగాట్ట ఆయన స్నేహితుడు! 

బయటివాళ్ల దృష్టిలో డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ అంటే మరీ అంత పనికిరానిదన్నమాట...

ఈ జోక్‌ని స్వయంగా గురువుగారు, దర్శకరత్న దాసరి నారాయణరావుగారు అప్పటి తన బంజారాహిల్స్ ఆఫీసులో నాతో చెప్పారు.

ఒక్క డైరెక్షన్ డిపార్ట్‌మెంటే కాదు. టోటల్‌గా సినీఫీల్డులో పనిచేసేవారంతా ఎందుకూ పనికిరానివాళ్లని ఇతర ఫీల్డులవాళ్ల అభిప్రాయం. 

"చదువుకోవడం చేతకానివాళ్లంతా సినీఫీల్డంటారు!" అని కూడా అంటారు కొంతమంది. 

"అబ్బో సినిమావాళ్లా!" అంటారు కొందరు. మిగిలినవాళ్లంతా ఏదో సొక్కమైనట్టు. వీళ్లేదో చేయరాని పని చేస్తున్నట్టు.

సరే, ఎవరు ఎలా అనుకున్నా ఏం ఫరవాలేదు. "మ్యాటర్ ఎప్పుడూ ఫీల్డు కాదు. మన మైండ్‌సెట్" అనేది కామన్‌సెన్స్.

అయితే మన ప్యాషన్‌తో, మన ప్రొఫెషన్‌తో అవతలి వాళ్లను ఎంత చిన్నస్థాయిలోనయినా సరే ఇబ్బంది పెట్టకూడదు అనేది సినీఫీల్డులో ఉన్న ఎవరైనా విధిగా గుర్తుపెట్టుకోవాల్సిన మరొక కామన్ సెన్స్, మొట్టమొదటి రూల్ కూడా.

కానీ, అప్పుడప్పుడూ ఇది మిస్ అవుతుంటుంది.

ముఖ్యంగా డబ్బు విషయంలో. ఇంకా కొన్ని వ్యక్తిగత ప్రామిస్‌ల విషయంలో. 

తాడిచెట్టు కిందకి వెళ్లినప్పుడు అక్కడ తాగాల్సింది కల్లు. పాలు తాగుతానంటే కుదరదు. చూస్తుంటే జీవితం జస్ట్ అలా చేజారిపోతుంది.

ఫీల్డుది కాదు తప్పు. 

మన కామన్ సెన్స్, మన నిర్ణయాల తప్పే ఎక్కువగా ఉంటుంది.  

బయటికి క్రియేటివిటీ అని, తపస్సు అనీ, ప్యాషన్ అనీ ఎందరో ఎన్నో మాస్కులు వేసుకోవచ్చు. ఒక జాబ్‌లా, ఒక మంచి ఆదాయమార్గంగా, ఒక బిజినెస్‌లా తీసుకున్నప్పుడు మాత్రమే ఏ గొడవా ఉండదు.

బై డిఫాల్ట్... ఫీల్డుకున్న గ్లామర్, సెలెబ్ స్టేటస్ ఎలాగూ ఒక డ్రైవ్‌లా ఎప్పుడూ పనిచేస్తాయి. 

కట్ చేస్తే - 

సినిమా ఇప్పుడొక బిగ్ బిజినెస్. 

స్పెషల్ అప్పియరెన్స్‌లాగా ఎప్పుడో పుష్కరానికో సినిమా కాదు. చిన్నదో, పెద్దదో... ఎప్పుడూ ఏదో ఒక సినిమా చేస్తూ ట్రాక్‌లో ఉండటం చాలా ముఖ్యం.  

మిగిలినవన్నీ అవే ఫాలో అవుతాయి...

And don't forget...
Cinema can fill in the
empty spaces of your life
and your loneliness!

"కల" విలన్, "నల్లమల" హీరో అమిత్‌కు అభినందనలు!

నా తొలిచిత్రం "కల" లో పూర్తిస్థాయి విలన్‌గా సిల్వర్ స్క్రీన్‌కు నేను పరిచయం చేసిన మంచి నటుడు అమిత్‌ కుమార్.  

ఈ సినిమా కోసం కొత్త నటీనటులు కావాలంటూ అప్పుడు "సూపర్ హిట్", "సంతోషం", "టైమ్స్ ఆఫ్ ఇండియా"ల్లో ఇచ్చిన మా ప్రకటనలకు బ్రహ్మాండమైన స్పందన వచ్చింది.

జూబ్లీ హిల్స్ లోని ప్రశాసన్ నగర్లో ఉన్న మా ఆఫీసుకి సగటున రోజుకి ఓ వందమందికి పైనే ఆర్టిస్టులు వచ్చేవారు, ఆడిషన్‌కి. 

చాలామంది ఫోటోలు ఇచ్చి వెళ్లేవాళ్ళు. 

అలా ఎంటరయిన వాడే అమిత్ కుమార్. ఇప్పుడు అమిత్ తివారి.    

ముంబైలో పుట్టి పెరిగిన అమిత్ తెలుగువాడే.

ఒకరోజు ఉదయం అఫీస్‌లో నా టేబుల్ మీద అమిత్ ఫోటోల్ని చూశాను. వాటిల్లో ఒక ఫోటో చూడగానే ఇంక అతనే "కల విలన్" అని డిసైడయిపోయాను. వెంటనే పిలిపించాను. ఆడిషన్, సెలక్షన్, అగ్రిమెంట్లు చకచకా జరిగిపోయాయి.  

ఇండస్ట్రీలో అప్పట్లో అందరూ అమిత్‌ను "కల విలన్" అని పిల్చేవారు. "కల" తర్వాత  వందలాది సినిమాల్లో నటించి, మంచి పాపులర్ నటుడిగా ఎదిగాడు అమిత్. 

దాదాపు అన్ని భాషల్లో నటించాడు. రెండు మూడు సినిమాల్లో హీరోగా కూడా చేశాడు. ఎక్కువగా మాత్రం, విలన్ లేదా నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రల్నే చేశాడు. ఈమధ్య పాజిటివ్ సపోర్టింగ్ రోల్స్‌లో కూడా బాగా పాపులర్ అయ్యాడు. 

అమిత్‌లో అద్భుతమైన నటుడున్నాడు. అంతకు మించి "ఇంకా... ఇంకా... ఇంకా నేను బాగా చెయ్యాలి" అన్న తపన ఉంది. ఆ తపనే అతన్ని నటుడిగా నిలబెట్టింది. షూటింగ్ జరుగుతున్నప్పుడు - అమిత్ యాక్టింగ్‌ను నేను, మా కెమెరామన్ శంకర్, కో-డైరెక్టర్ వేణు, మా టీమ్... బాగా ఎంజాయ్ చేసేవాళ్లం.

ఇప్పుడు మళ్ళీ అమిత్ హీరోగా నటించిన సినిమా "నల్లమల" రేపు మార్చి 18 నాడు థియేటర్స్‌లో రిలీజ్ అవుతున్న సందర్భంగా అమిత్‌కు నా హార్దిక అభినందనలు, శుభాకాంక్షలు. 

Wishing My Dear Amit All Success!     

Tuesday 15 March 2022

పుతిన్ విధ్వంసం వెనుక - 6

సుమారు 8 గంటల క్రితం... రష్యా ప్రెసిడెంట్ పుతిన్‌ను ఉద్దేశిస్తూ, 'టెస్లా', 'స్పేస్ ఎక్స్' కంపెనీల అధినేత ఈలన్ మస్క్ ఒక ట్వీట్ పెట్టాడు.   

"నాతో సింగిల్‌గా ఫైట్ చెయ్యమని నేను నీకు చాలెంజ్ విసురుతున్నాను. నీకు సమ్మతమేనా?" అని. 

స్టేక్ ఏంటంటే... యూక్రేన్ అట! 

ఈ ట్వీట్‌ను డైరెక్టుగా రష్యా ప్రెసిడెంట్ ట్విట్టర్ హాండిల్‌కు ట్యాగ్ చేశాడు మస్క్.   

అంటే... ఒకవేళ ఫైట్‌లో పుతిన్ గెలిస్తే, ఈలన్ మస్క్ అతనికి యూక్రేన్‌ను ఇస్తాడన్నమాట. 

ఈలన్ మస్క్ ఒక పెద్ద బిజినెస్ సామ్రాజ్యాధినేత నిజమే. పుతిన్‌తో అసలీ సింగిల్ ఫైట్ చాలెంజ్ ఏంటి? పుతిన్ గెలిస్తే అతనికి మస్క్ యూక్రేన్‌ను స్టేక్‌గా ఇవ్వటమేంటి? 

పరోక్షంగా దీనర్థం ఏంటంటే - వారిద్దరి సింగిల్ ఫైట్‌లో ఈలన్ మస్క్ గెలుస్తాడు. అప్పుడు పుతిన్ యూక్రేన్‌ను వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. 

ఎవరు గెలిచినా, ఎవరు ఓడినా... అసలు యూక్రేన్‌ను స్టేక్‌గా పెట్టడానికి ఈలన్ మస్క్ ఎవరు? 

యూక్రేన్ ఏమైనా ఈలన్ మస్క్ కంపెనీలోని ఒక టెస్లా కారా? ఇంకేదైనా ప్రొడక్టా? 

ఈలన్ మస్క్ పుతిన్‌తో సింగిల్ ఫైట్ చెయ్యడానికి... పుతిన్ ఏమైనా మస్క్ కంపెనీల్లో తయారైన ఒక వీడియో గేమ్ క్యారెక్టరా?

ఇంత అర్థం లేని ట్వీట్ పెట్టడానికి ఈలన్ మస్క్ ఏమీ అమెరికా పాత ప్రెసిడెంట్ ట్రంప్ కాదు. మెచ్యూరిటీ లేని ఒక ఎడాలిసెంట్ కుర్రాడు కాదు. 

తన "స్పేస్ ఎక్స్" సామ్రాజ్యం ద్వారా కేవలం కలల్లో మాత్రమే సాధ్యమయ్యే ప్రయోగాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు మస్క్. 

"మార్స్ ట్రిప్ డబ్బున్న ధనికుల కోసం కాదు. జిజ్ఞాస, ధైర్యం ఉన్న ఎక్స్‌ప్లోరర్స్ కోసం. వాళ్ళు తిరిగి రాకపోవచ్చు. అక్కడే అంగారక గ్రహం పైనే చనిపోవచ్చు..." స్పేస్ ఎక్స్ అధినేతగా, ఈలన్ మస్క్ స్థాయి విజన్ ఇది.

అతని డ్రీమ్ ప్రాజెక్టు... అంగారక గ్రహంలో కాలనీలు కట్టడం!

ప్రపంచంలోని ప్రతి భారీ బిజినెస్ మాగ్నెట్ నుంచి, ఒక స్థాయి ఎంట్రప్రెన్యూర్స్ వరకు... అంతా, ఈలన్ మస్క్ బిజినెస్ అప్‌డేట్స్ చూస్తుంటారు. అతని సోషల్ మీడియాను ఫాలో అవుతుంటారు. అతని పుస్తకాలు చదువుతుంటారు. అతని గురించి రాసిన ఆర్టికిల్స్ చదువుతుంటారు. మస్క్ దగ్గినా తుమ్మినా ఒక బ్రేకింగ్ న్యూసే. 

అంత స్థాయి ఉన్న ఈలన్ మస్క్... ఇంత అర్థంలేకుండా ఒక ట్వీట్ పెట్టాడంటే ఏమనుకోవాలి?

50 ఏళ్ళ ఈలన్ మస్క్ పెద్ద ఫైటరేం కాదు. ఒక ప్రపంచస్థాయి బిజినెస్ మాగ్నెట్‌గా స్వీయరక్షణ కోసం ఏవైనా మార్షల్ ఆర్ట్స్‌లో ట్రెయినింగ్ తీసుకొని ఉంటే ఉండొచ్చు.

అంతకన్నా ఇంకేం ఉంటుంది అతని దగ్గర... సింగిల్‌గా పుతిన్‌ను గెలడానికి?

మరి పుతిన్...?  

వయస్సు 69 దాటినా... రోజూ తనకు తెలిసిన అన్ని యుధ్ధ విద్యలు ప్రాక్టీస్ చేస్తాడు. రెజ్లర్. లోడెడ్ గన్‌తో ఎదురెదురుగా నిల్చొని పాల్గొనే "డ్యూయెల్" ఫైట్‌లో ఎన్నోసార్లు పాల్గొని గెల్చి బ్రతికినవాడు. (డ్యూయెల్‌లో ఓడిపోవటం అంటే ఆన్ ది స్పాట్ చావటమే). గతంలో సోవియట్ యూనియన్ ఇన్వాల్వ్ అయిన కొన్ని ప్రపంచదేశాల అంతర్గత రక్షణ, యుధ్ధ వ్యవహారాల్లో ప్రత్యక్షంగా పనిచేసిన వార్ స్ట్రాటజిస్ట్, వార్ ఫైటర్.  సోవియట్ కె జి బి లో ఏజెంట్‌గా పనిచేసినప్పుడు... ఎక్కడో శతృదేశాల్లో, ఒంటరిగా ఎందరినో ఎదుర్కొని హతమార్చిన వందలకొద్దీ సక్సెస్‌ఫుల్ అసైన్‌మెంట్స్ రికార్డ్ ఉన్నవాడు... అలాంటి పుతిన్‌తో ఈలన్ మస్క్ ఎలా సింగిల్‌గా ఫైట్ చేయగలననుకొన్నాడు? 

చేసి, ఎలా గెలుస్తాననుకొన్నాడు? 

ఆమధ్య 2021లో, ఈలన్ మస్క్ 'క్లబ్ హౌజ్‌'లో బాగా యాక్టివ్‌గా ఉంటున్న సమయంలో, ఒకసారి పుతిన్‌ను తనతో చాట్‌కు కూడా ఆహ్వానించిన ఈలన్ మస్క్ మరీ అంత అవివేకా? 

కాదు. 

మరి...?!

ఈలన్ మస్క్ పెట్టిన ఆ ట్వీట్ పుతిన్ పట్ల అతనిలోని అసహనాన్ని తెలుపుతోంది.   

అతనిలోని ఆ అసహనం... రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్‌ను ఎప్పుడు, ఎలా చంపాలా అని ఎదురుచూస్తున్న మొత్తం పశ్చిమదేశాల అసహనానికి ప్రతిబింబం. ఆయా దేశాల కంట్రోల్‌లో నడుస్తున్న 90 శాతం ప్రపంచ మీడియా అసహనానికి ప్రతిబింబం. 

ప్రపంచ మీడియా అసహనం గురించి... ఇంకో పోస్టులో... 

Saturday 12 March 2022

"గేటెడ్ కమ్యూనిటీ ఫామ్‌లాండ్స్" అంటే ఎందుకంత క్రేజ్?


పొల్యూషన్-ఫ్రీ వాతావరణం, కళ్ళ ఎదుటే పారుతున్న నది, చుట్టూ గ్రీనరీ... ఇవన్నీ ఒక్కచోటే దొరకటం అనేది అంత సులభం కాదు. 

నిజంగా అలాంటి ప్లేస్ ఒకటి మనం సొంతం చేసుకోడానికి అందుబాటులో ఉందంటే ఎలా ఉంటుంది?

అక్కడో చిన్న డిజైనర్ ఫామ్‌హౌజ్ వేసుకొని, చుట్టూ మనకిష్టమైన ఆకుకూరలు, కూరగాయలు, మనకిష్టమైన ఇతర గ్రీనరీ పెంచుకొంటే ఇంకెలా ఉంటుంది?

సిటీకి దూరంగా, ప్రశాంతంగా, అలాంటి ఒక సహజసిధ్ధమైన వాతావరణంలో... మన కుటుంబంతో, మనకిష్టమైనవారితో... వారంలో కనీసం ఒకరోజు గడపగలిగితే ఇంకెంత బాగుంటుంది? 

ఇదేమంత సాధ్యం కాని గొప్పవిషయం కాదని మొన్నీమధ్యే నేను తెలుసుకున్నాను. ఈ పోస్టు చివరిదాకా చదివితే మీరూ ఒప్పుకుంటారు. 

కట్ చేస్తే -       

మొన్నొకరోజు నా ఆత్మీయ మిత్రుడు పరమేశ్వర్ రెడ్డి గారి ఆహ్వానం మీద వారి రియల్ ఎస్టేట్ వెంచర్‌కు వెళ్ళాను. 

GREEN LEAVES INFRATECH LIMITED.

నిజంగా అద్భుతం!

సుమారు 120 ఎకరాల విస్తీర్ణంలో - అదొక గేటెడ్ కమ్యూనిటీ ఫామ్‌ప్లాట్స్, ఫామ్‌లాండ్స్ వెంచర్.  

మనకు నచ్చిన డిజైన్‌లో ఓ చిన్న ఫామ్‌హౌజ్ వేసుకొని, మనకిష్టమైన వెజిటబుల్స్, గ్రీనరీ పెంచుకొంటూ, వీకెండ్స్ అక్కడ గడపగలిగితే చాలు...

లైఫ్ నిజంగా ఇంకో లెవెల్లో ఉంటుంది. 

డాక్టర్స్, లాయర్స్, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ వంటి ప్రొఫెషనల్స్; వివిధ రంగాల్లోని బిజినెస్ పీపుల్‌కు కూడా వారాంతంలో స్ట్రెస్-ఫ్రీగా, హాయిగా గడపడానికి ఈ గేటెడ్ కమ్యూనిటీ ఫామ్‌లాండ్స్ ఒక మంచి "పర్సనల్ హాలిడే స్పాట్" అవుతుంది.        

రచయితలు, కవులు, ఫిలిం ఆర్టిస్టులు, టీవీ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, యాంకర్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ వంటి క్రియేటివ్ పీపుల్ కూడా ఇలాంటి ఫామ్‌లాండ్‌ను "వీకెండ్ క్రియేటివ్ డెస్టినేషన్" చేసుకోవచ్చు.   

కట్ చేస్తే - 

ఇన్వెస్ట్‌మెంట్ పరంగా కూడా ఇలాంటి ఫామ్‌ప్లాట్స్, ఫామ్‌లాండ్స్ కొనుక్కోవడం అనేది ఒక బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్ అవుతుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 

NRI లకు కూడా ఇలాంటి గేటెడ్ కమ్యూనిటీ ఫామ్‌ప్లాట్స్, ఫామ్‌లాండ్స్ కొనుక్కోవడం అనేది ఒకవైపు మంచి ఇన్వెస్ట్‌మెంట్ అవుతుంది. మరోవైపు, సెంటిమెంటల్‌గా కూడా మాతృదేశంతో అనుబంధం కొనసాగిస్తున్న ఫీలింగ్ ఉంటుంది.  


ఇంత మంచి అవకాశం మనకు అందిస్తున్న గ్రీన్ లీవ్స్ ఇన్‌ఫ్రాటెక్ లిమిటెడ్ వెంచర్‌కు ఉన్న మరో ప్రత్యేక ఆకర్షణ - రివర్ వ్యూ! 

మంజీరా నది ఈ వెంచర్‌ను ఆనుకొనే ప్రవహిస్తోంది... కనుచూపుమేరలోనే సింగూర్ డ్యామ్...  

అసలా ఫ్రేమ్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి!  

సిటీకి కేవలం 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఫామ్‌లాండ్ ప్రాజెక్టు, ముంబై హైవేకు కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. 

కేవలం 15 నిమిషాల దూరంలో సంగారెడ్డి జిల్లా హెడ్‌క్వార్టర్స్, 30-45 నిమిషాల దూరంలో RRR (Regional Ring Road) & ORR (Outer Ring Road) ఉన్నాయి.  

13,000 ఎకరాల్లో సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేసిన NIMZ (National Investment & Manufacturing Zone) ప్రాజెక్టు, MRF, పెన్నార్, పెప్సికో, BHEL, KIRBY, తోషిబా, ఎక్స్‌పోర్ట్ కారిడార్, MNR మెడికల్ కాలేజి, IIT, Gitam, Woxsen యూనివర్సిటీలు... TCS, Wipro, ISB, Microsoft, Google వంటి గొప్ప గొప్ప సంస్థలన్నీ ఈ వెంచర్‌కు 45 నుంచి 55 నిమిషాల పరిధిలో ఉన్నాయి. 

ఈ నేపథ్యంలో... ఒక ఇన్వెస్ట్‌మెంట్ దృక్పథంతో చూసినా... కేవలం ఒక 2-3 ఏళ్లల్లోనే రెట్టింపు వాల్యూ తెప్పించే అవకాశం ఉందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 


ఇన్ని ప్లస్ పాయింట్స్‌తో ఉన్న గ్రీన్ లీవ్స్ ఇన్‌ఫ్రాటెక్ లిమిటెడ్ వారి ఫస్ట్ వెంచర్ ఇప్పటికే "సోల్డ్ అవుట్" అయిపోయింది. సెకండ్, థర్డ్ వెంచర్స్‌లో అమ్మకాలు ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో ఉన్నాయి. 

24 గంటల సెక్యూరిటీ, 3 సంవత్సరాల మెయింటెనెన్స్, మంచి నల్లరేగడి నేల, డ్రిప్ ఇర్రిగేషన్, 33 ఫీట్స్/40 ఫీట్స్/60 ఫీట్స్ ఇంటర్నల్ రోడ్స్‌తో ఉన్న ఈ గ్రీన్ లీవ్స్ ఇన్‌ఫ్రాటెక్ లిమిటెడ్ వెంచర్‌లో:

121 స్క్వేర్ యార్డ్స్ నుంచి 4850 స్క్వేర్ యార్డ్స్ (1 నుంచి 40 గుంటలు) యూనిట్స్‌లో... స్క్వేర్ యార్డ్‌కు Rs. 4,999/- కనీస ధరతో ఎన్ని యూనిట్స్ అయినా కొనుక్కొనే ఫ్లెక్సిబిలిటీ ఉంది. 

క్లియర్ టైటిల్... 

ఫండ్స్‌తో రెడీగా ఉన్న కస్టమర్స్‌కు వెంటనే రిజిస్ట్రేషన్ ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పట్టాదార్ పాస్‌బుక్ ఇప్పించబడుతుంది. ప్రభుత్వ నిబంధనలకు లోబడి, "రైతుబంధు" వంటి స్కీములకు ఎలిజిబిలిటీ కూడా ఉంటుంది. 

ప్రముఖ ఫిలిం, టీవీ ఆర్టిస్టులు, యాంకర్స్ ఇటీవలే ఈ వెంచర్‌లో ఫామ్‌లాండ్ తీసుకోడానికి విజిట్ చేశారు. అడ్వాన్స్ కూడా చెల్లించారు. వారి రిజిస్ట్రేషన్ కూడా త్వరలోనే ఉంది.  

ఇప్పుడిక మీ వంతు...

Get connected on +91 9989578125. And... Make the best investment decision of 2022! 

బెస్ట్ విషెస్... 

Thursday 10 March 2022

ఎవరు ఎక్కడి నుంచైనా సినిమాల్లో పనిచేయొచ్చు!


"ఊరంతా ఓ దిక్కు అయితే, ఉలిపిరికట్టెది ఓ దిక్కు అన్నట్టు... మనమందరం ఇటు సరూర్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్, వనస్థలిపురం సైడుంటే, వీడొక్కడు మాత్రం అటెటో ఆ మూలకు పోయిండు!" 

ఓ పదేళ్ళ క్రితం అనుకుంటాను... మా "బిగ్ ఫైవ్" మిత్రుల సిట్టింగ్‌లో ఒక మిత్రుడు నన్ను ఉద్దేశించి ఈ మాటన్నాడు. 

అప్పటి అవసరం, సౌకర్యం ఆ సమయంలో నన్నక్కడ దిగిపోయేట్టు చేసింది. ఒకసారి ఒక చోటు అలవాటైపోయాక, సౌకర్యంగా ఉన్నాక, ఇంక అక్కడ్నుంచి కదలాలనిపించదు. 

ఎక్కడెక్కడినుంచో హైద్రాబాద్ వచ్చి స్థిరపడే వాళ్లందరి విషయంలో జరిగేది ఇదే. 

కట్ చేస్తే -   

సినిమా టీమ్ అంతా ఎక్కడ కలిస్తే అదే ఆఫీస్ అని చెప్తూ ఆ మధ్య నేనొక బ్లాగ్ పోస్టు రాశాను. 

కేఫే మిలాంజ్. బియాండ్ కాఫీ.  
ఇరానీ హోటల్. కాఫీడే. 
కేబీఆర్ పార్క్. నెక్లెస్ రోడ్డు. 
ఐమాక్స్ లాబీలు. ట్యాంక్ బండ్. 
యాత్రి నివాస్. సినీ ప్లానెట్... 

ఈ డిజిటల్ & సోషల్ మీడియా యుగంలో... ఇండిపెండెంట్ సినిమాలకు, మైక్రో బడ్జెట్ సినిమాలకు ఇప్పుడు ఇవే నిజమైన ఆఫీసులు అంటే అతిశయోక్తి కాదు. 

ఒకప్పట్లా నాలుగ్గోడల మధ్యనే కూర్చొని పనిచేసే రోజులు పోయాయి. క్రియేటివిటీకి రొటీన్ అంటే అస్సలు నచ్చదు. 

అదలా పక్కనపెడితే - సినిమా ప్రొడక్షన్‌కు సంబంధించిన పనంతా ఒక్క ఫిలిమ్‌నగర్‌లోనే జరగాలన్న రూల్ కూడా ఇప్పుడు బ్రేక్ అయిపోయింది. అలాగే, సినిమావాళ్లంతా కూడా జూబ్లీ హిల్స్, శ్రీనగర్ కాలనీ చుట్టుపక్కలే ఉండాల్సిన అవసరం కూడా నిజానికి లేదు. 

ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌లో ఎక్కువభాగం మంది ఇప్పుడు మణికొండ వైపు ఉండటానికి ప్రిఫర్ చేస్తున్నట్టు నా మిత్రుడు, డైరెక్టర్ బాబ్జీ ఒకసారి నాతో చెప్పారు. 

ఎవరు ఎటువెళ్ళినా, ఎక్కడ ఉంటున్నా... ముందు అవసరం, తర్వాత సౌకర్యం అనే ఈ రెండు అంశాలు మాత్రమే ఈ విషయంలో ఎవరి నిర్ణయానికైనా కారణమవుతాయి. 

హాలీవుడ్ సినిమాల్లో పనిచేసేవాళ్ళంతా హాలీవుడ్‌లోనే ఉండరు. బాలీవుడ్‌లో పనిచేసేవారంతా ఒక్క ముంబైలోనే ఉండరు. అలాగే, మన తెలుగు సినిమాల్లో పనిచేసేవాళ్ళంతా కూడా ఒక్క హైద్రాబాద్‌లోనే ఉండరు. ఒక్క ఫిలిమ్‌నగర్‌లోనో, మణికొండలోనో ఉండరు.   

ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ సరిగ్గా చేసుకోగలిగితే చాలు, ఎవరు ఎక్కడి నుంచైనా సినిమాలు తీయొచ్చు. సినిమాల్లో పనిచేయొచ్చు. 

ఈ విషయంలో... తన తొలి సినిమానుంచి మొన్నటి లవ్‌స్టోరీ వరకు, తాను మొదటినుంచీ నివాసముంటున్న సికింద్రాబాద్‌లోని పద్మారావునగర్‌నే అడ్డాగా చేసుకొని విజయవంతంగా సినిమాలు చేస్తున్న శేఖర్ కమ్ములను మించిన ఉదాహరణ అవసరమని నేననుకోను. 

ఫిలిం నెగెటివ్ నుంచి డిజిటల్‌కు మారిపోయాక, ఫిలిమేకింగ్‌లో పోస్ట్ ప్రొడక్షన్ కోసం ఇప్పుడు ల్యాబ్స్ కూడా అవసరం లేదు. మంచి ల్యాప్‌టాప్స్ రెండు చాలు. 

ఇక... ఫిలిం చాంబర్లో, ఎఫ్‌డిసిలో, యూనియన్ ఆఫీసుల్లో ఉండే కొద్దిపాటి పేపర్ వర్క్ కోసం - ఒక సినిమా మొత్తానికి పట్టే సమయం కేవలం కొన్ని నిమిషాలే! ఆ కొన్ని నిమిషాల కోసం, ఆ చుట్టుపక్కలే ఉండాల్సిన అవసరమైతే అస్సలు లేదు. 

ఆ మధ్య నేను కూడా శ్రీనగర్ కాలనీకి మారిపోవాలనుకున్నాను. కాని, ఇప్పుడా ఆలోచన పూర్తిగా మానుకున్నాను. 

జూబ్లీ హిల్స్‌కి సుమారు 24 కిలోమీటర్ల దూరంలో నేనెక్కడైతే ఉన్నానో, నాకిక్కడ చాలా సౌకర్యంగానే ఉంది. నా ఇతర క్రియేటివ్ యాక్టివిటీస్‌కి కూడా ఇదే నాకు బెస్ట్ ప్లేస్. 

కలవాలనుకున్నప్పుడు - ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఎవరినైనా, ఎలాగైనా కలుసుకోవచ్చు. వాస్తవానికి అదసలు సమస్యే కాదు అని నా వ్యక్తిగత అభిప్రాయం. అనుభవం కూడా. 

కట్ చేస్తే - 

మొన్నొక రోజు నా ఆత్మీయ మిత్రుడు పరమేశ్వర్‌రెడ్డి గారి ఆహ్వానం మీద వారి రియల్ ఎస్టేట్ వెంచర్‌కు వెళ్ళాను. 

Green Leaves Infratech Limited.   

అద్భుతం!

అదొక గేటెడ్ కమ్యూనిటీ ఫార్మ్‌లాండ్ వెంచర్. 

చిన్న ఫార్మ్ హౌజ్ వేసుకొని, మనకిష్టమైన గ్రీనరీ పెంచుకొంటూ వీకెండ్స్ అక్కడ గడపగలిగితే చాలు. లైఫ్ ఇంకో లెవెల్లో ఉంటుంది. 

ముఖ్యంగా క్రియేటివ్ పీపుల్ అయితే దీన్నొక వీకెండ్ డెస్టినేషన్ చేసుకోవచ్చు. 

ఎన్నారైలకు, బిజినెస్ పీపుల్‌కు; డాక్టర్స్, లాయర్స్ వంటి ప్రొఫెషనల్స్‌కు కూడా వారాంతంలో స్ట్రెస-ఫ్రీగా హాయిగా గడపడానికి ఈ గేటెడ్ కమ్యూనిటీ ఫార్మ్ హౌజెస్ ఒక మంచి పర్సనల్ హాలిడే స్పాట్ అవుతుంది. 

ఇన్వెస్ట్‌మెంట్ పరంగా కూడా ది బెస్ట్ ఆప్షన్ అవుతుందని ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. Connect me on 9989578125 and make the best decision of 2022. 

ఈ ఫార్మ్‌లాండ్ వెంచర్‌కు ఉన్న మరొక ప్రత్యేక ఆకర్షణ ఏంటంటే - రివర్ వ్యూ! మంజీరా నది ఈ వెంచరా్‌ను ఆనుకునే ప్రవహిస్తోంది!! 

ఫ్రేమ్ ఎలా ఉంటుందో ఒకసారి మీరే ఊహించుకోండి...  

సిటీకి కేవలం 70 కిలోమీటర్ల దూరంలో, ముంబై హైవేకు దగ్గరలో ఉన్న ఈ ఫార్మ్‌లాండ్ వెంచర్ గురించి రేపు ప్రత్యేకంగా ఒక పోస్ట్ రాస్తున్నాను. 

A deep look into nature
unlocks imagination and
inspires creativity!         
   

Saturday 5 March 2022

పుతిన్ విధ్వంసం వెనుక - 5

రష్యన్ వార్తా సంస్థ 'స్పుత్నిక్' నుంచి ఈ ఉదయం బ్రేకింగ్ న్యూస్ ప్రకారం:

"రష్యా-యూక్రేన్ డెలిగేట్స్ మధ్య బెలరూస్‌లో జరుగుతున్న రెండవ రౌండ్ చర్చల తర్వాత రష్యా ఒక నిర్ణయం తీసుకొంది. యూక్రేన్ లోకల్ కాలమానం ప్రకారం ఈ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు, యూక్రేన్‌లోని 2 ప్రాంతాల్లో తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించింది." 

యూక్రేన్‌లోని మర్యుపోల్, వోల్నవాఖా ప్రాంతాల్లోని సుమారు 4,40,00 మందిని ఖాలీ చేయించడం కోసం మాత్రమే ఈ కాల్పుల విరమణ కావడం ఇక్కడ గమనించాల్సిన విషయం. 

ఇప్పుడీ పోస్టు రాస్తున్న సమయానికి ఈ రెండు ప్రాంతాల్లో పౌరుల తరలింపు యుధ్ధప్రాతిపదికన జరుగుతోంది. 

యూక్రేన్ పైన రష్యా దాడి ప్రారంభమైన 9 రోజుల తర్వాత, కొంతవరకు, ఇదొక శుభవార్త అనుకోవచ్చు. 

కాని, పౌరులు ఖాళీ చేసిన తర్వాత, ఈ రెండు ప్రాంతాలు కూడా ధ్వంసమవుతాయి. యూక్రేన్ సైన్యం ఈ రెండు ప్రాంతాల్ని కూడా కోల్పోవచ్చు. 

దీంతో, యూక్రేన్‌లోని సగానికి పైగా భూభాగాన్ని రష్యా ఆక్రమించుకొన్నట్టవుతుంది.  

కట్ చేస్తే -

రష్యా చెప్తున్నదాని ప్రకారం యూక్రేన్ ప్రెసిడెంట్ వొలదొమిర్ జెలెన్స్‌స్కీ ప్రస్తుతం యూక్రేన్‌లో లేడు. పొరుగున ఉన్న పోలండ్‌లో తలదాచుకొని, అక్కడినుంచే అన్నీ చూసుకొంటూ, యూక్రేన్ యుధ్ధశ్రేణులకు ఆదేశాలిస్తున్నాడు. 

అయితే దీన్ని అబధ్ధం అని ఖండిస్తూ, తాను ఇంకా యూక్రేన్‌లోనే ఉన్నట్టు జెలెన్‌స్కీ ఇంకో సెల్ఫీ వీడియో పెట్టాడు. 

కాని, ఇప్పుడున్న అత్యంతాధునిక టెక్నాలజీతో ఈమాత్రం బ్యాక్‌గ్రౌండ్ మార్చటం అనేది చాలా చిన్న పని. అది ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుస్తోంది.     

సాధించగలిగేవాడికి అదొక మెకన్నాస్ గోల్డ్!

సినిమా పుట్టినప్పటినుంచి ఇప్పటివరకు... ఎన్నడూ లేనన్ని అవకాశాలు ఇప్పుడు కొత్తవారికి ఉన్నాయి. 

తను ఎన్నుకున్న విభాగంలో ఏ కొంచెం స్పార్క్ ఉన్నా, సిన్సియర్‌గా... 'కొంచెం స్మార్ట్‌'గా... ప్రయత్నిస్తే - ప్రతి ఒక్కరికీ తప్పకుండా ఆ 'ఒక్క చాన్స్' దొరుకుతుంది. 

ఆ తర్వాత దాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటారు... ఆ మొదటి చాన్స్‌తో మరిన్ని అవకాశాలు ఎలా సంపాదించుకొంటారు, ఆ తర్వాత కూడా ఫీల్డులో ఎలా కొనసాగుతారు... వంటివన్నీ ఒక్కొక్కరి పర్సనల్ టాలెంట్స్ మీద ఆధారపడి ఉంటుంది. 

నెట్‌వర్కింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, పాజిటివ్ యాటిట్యూడ్, ఏది ఏమైనా సరే అనుకున్న లక్ష్యం నుంచి ఫోకస్ మరల్చకపోవడం... వంటి కొన్ని బేసిక్ లక్షణాలు అందరికీ ఒకలా ఉండవు. 

నిజానికి, 99 శాతం మందికి ఈ లక్షణాలు అసలుండవు. 

కాని, ఇవే ఏ ఫీల్డులో అయినా పైకిరావడానికి చాలా ముఖ్యం. 

సినీ ఫీల్డులో మరీ ముఖ్యం.   

ఈ లక్షణాలన్నీ ఎంతో కొంత ఉండే ఆ ఒక్క శాతం మంది మాత్రమే విన్నర్స్ అవుతారు. వీరిలో కొంతమంది... కనీసం ఆ ట్రాక్‌లోనైనా ఉంటారు. 

ఆ 1% క్లబ్‌లో చేరగల సత్తా ఉన్నవారే అనుకున్నది సాధించగలుగుతారు. ఆ ప్రయత్నంలో పడిపోయినా మళ్ళీ లేస్తారు. లక్ష్యం సాధిస్తారు. గమ్యం చేరుకుంటారు. 

ఒక్క సినిమా ఫీల్డు అనే కాదు... ఏ ఫీల్డులో అయినా సరే, విన్నర్స్ ఎప్పుడూ ఆ 1% క్లబ్‌లోనే ఉంటారు. 

కట్ చేస్తే - 

థాంక్స్ టు కరోనా... ఇప్పుడు సినిమాల్లో అవకాశాలు చాలా పెరిగాయి. ఒక్క కొత్తవారికనే కాదు. ప్రతి ఒక్కరికీ అవకాశాలు పెరిగాయి. 

ఉదా: ఓటీటీలు, వెబ్ సీరీస్‌లు. 

రెమ్యూనరేషన్స్ పరంగా కూడా... ఒకప్పుడు వేలల్లో ఉన్నవి ఇప్పుడు లక్షల్లోకి చేరుకున్నాయి.. లక్షల్లో ఉండేవి ఇప్పుడు కోట్లల్లోకి ఎగిశాయి. 

పూర్తిగా రెండేళ్ళపాటు అన్నిరకాలుగా అందరినీ బాధపెట్టిన కరోనా కూడా దాదాపు చల్లబడింది కాబట్టి ఇంక ఎవ్వరికీ ఎలాంటి సంకోచాలు, ఆటంకాలు ఉండే అవకాశం లేదు. ఇప్పుడు కూడా దీన్ని ఒక కారణంగా, సాకుగా చెప్పుకొనే సౌకర్యం లేదు. 

సో, ఈ విషయంలో దాదాపు ఆల్ క్లియర్ అన్నట్టే. 

ఇంతకు ముందు సినిమాలు వేరు, ఇప్పుడు సినిమాలు వేరు.

Content is king. Money is the ultimate goal. 

ఈ మార్చి 11 నాడు రిలీజవుతున్న ప్రభాస్ "రాధే శ్యామ్" సినిమా, ఒక్క అమెరికాలోనే 1000 కి పైగా లొకేషన్స్‌లో, 3000 లకు పైగా స్క్రీన్స్‌లో రిలీజవుతోంది! మొత్తం ఒక 11,500 లకు పైగా షోలు వేస్తున్నారు!

ఇండియాలో, హిందీతో కలిపి మొత్తం 5 భాషల్లో దేశవ్యాప్తంగా రిలీజవుతోంది.

సినిమా ఫీల్డంటే... ఇప్పుడు, ఒక భారీ కార్పొరేట్ బిజినెస్. 

ఓవర్‌నైట్‌లో సెలబ్రిటీ స్టేటస్ తెచ్చిపెట్టగల ఒక పోష్ ప్రొఫెషన్. 

సరిగ్గా ఉపయోగించుకోగలిగిన అతి కొద్దిమందికి... ఒక ఎలైట్ వరల్డ్.  

ఓటీటీల్లో రెగ్యులర్‌గా సినిమాలు, వెబ్ సీరీస్‌లు చూడ్డం అనేది కూడా ఇప్పుడు దాదాపు ప్రతి ఇంటా ఒక మామూలు రొటీన్ అయిపోయిన నేపథ్యంలో చాలా విషయాలు అందరికీ తెలుస్తున్నాయి.

థాంక్స్ టు సోషల్ మీడియా... ఫిలిం ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, ఇతర సెలెబ్స్ అంతా మరింత దగ్గరైపోయారు. 

చాలా విషయాల్లో అందరూ రియలైజ్ అవుతున్నారు. చాలా విషయాలు అందరికీ  అవగాహనకొస్తున్నాయి. 

'థంబ్‌నెయిల్ బ్యాచ్' ల ఫేక్ కంటెంట్ ఏంటి, రియాలిటీస్ ఏంటి అన్నది చాలామంది తెలుసుకోగలుగుతున్నారు. 

ఈ నేపథ్యంలో... సినిమాల పట్ల, సినీఫీల్డు పట్ల చాలామందిలో ఒకప్పటి దృక్పథాలు చాలా చాలా మారిపోయాయి.    

సినిమాల్లోకి ప్రవేశించడానికి గాని, పంపించడానికి గాని ఇంతకుముందులా ఇప్పుడెవ్వరూ పెద్దగా సంకోచించట్లేదు. 

డబ్బు, క్రేజ్, పాపులారిటీ ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు?

ఇంత లీడ్ ఇస్తూ, చివరగా నేను చెప్పదల్చుకున్న ఫినిషింగ్ టచ్ ఏంటంటే - 

చాలామంది అంటుంటారు... "వాడు సినిమాల్లోకి వెళ్ళి చెడిపోయాడ్రా", "వాడు సినిమాలు తీసి మొత్తం పోగొట్టుకున్నాడ్రా" ఎట్సెట్రా, ఎట్సెట్రా. 

నిజానికి సినిమా ఫీల్డు ఎప్పుడూ మంచిదే. సాధించగలిగేవాడికి అదొక మెకన్నాస్ గోల్డ్. 

వాడుకున్నోనికి వాడుకున్నంత! 

ప్రతి ఫీల్డులో ఉండే రకరకాల నెగెటివిటీ ఇక్కడ కూడా ఉంటుంది. అయినా సరే, ఫోకస్ చెడకుండా జాగ్రత్తపడుతూ, ఈ ఫీల్డుని మన లక్ష్యం కోసం మనం ఎంత బాగా, ఎంత పాజిటివ్‌గా ఉపయోగించుకోగలుగుతాం అన్నదే అసలు పాయింట్.           

Be bold.
Either you will find a way,
or you will create a way.
But you will not create an excuse! 

Thursday 3 March 2022

పుతిన్ విధ్వంసం వెనుక - 4

ఈ పోస్టు రాస్తున్న సమయానికి రెండు గంటల ముందు... రష్యా రక్షణ మంత్రిత్వశాఖ స్పోక్స్ పర్సన్ ఐగర్ కొనషెంకోవ్ చెప్పినదాని  ప్రకారం...  ఇప్పటివరకు 17,000 మంది భారతీయ విద్యార్థులను ఖార్కీవ్ నుంచి సురక్షితంగా బయటికి పంపించారు.

వారిలో ముందుగా అమ్మాయిలను ఇండియాకు పంపించే ప్రక్రియ ఆల్రెడీ ప్రారంభమైంది. దాదాపు అమ్మాయిలందరూ భారత్ చేరినట్టే. అబ్బాయిల రవాణా ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. 

ఇదంతా, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సుమారు 46 యుధ్ధవిమానాల ట్రిప్స్ ద్వారా నిజంగా వార్‌ఫుట్‌లో జరుగుతోంది. 

ఆపరేషన్ గంగ! 

థాంక్స్ టు పుతిన్ అండ్ జెలెన్‌స్కీ. ఇద్దరూ అర్థం చేసుకున్నారు కాబట్టి ఈ విషయం ఇంత సులభంగా పరిష్కారం వైపు కదిలింది. లేదంటే - యుధ్ధవాతావరణంలో ఏదీ ఎవరూ పట్టించుకోరు. అసలు ఇలాంటి అభ్యర్థనలను వినే అవకాశం ఇవ్వరు. అలాంటి అవకాశం ఉండదు. 

మన ప్రధానమంత్రి మోదీ ఈ విషయంలో తీసుకున్న చొరవ, చేసిన కాల్స్, ఇరువైపులా చేయించిన కమ్యూనికేషన్ ఏ స్థాయిలో ఉంటుందో ఊహించవచ్చు. మన విదేశాంగ శాఖ, రక్షణ శాఖ, రెండు దేశాల్లో ఉన్న మన అంబాసిడర్లు, ఢిల్లీలో ఉన్న ఆ రెండు దేశాల రాయబారులూ... నిజంగా 24/7 ఎంతో కృషి చేస్తే గాని ఇదంతా సాధ్యం కాదు. 

అయితే... ఇదంతా వార్ స్టార్ట్ అవకముందే చెయ్యాలి అనేది ఒక వాదన.

చాలావరకు అది నిజం కూడా. 

పుతిన్ యూక్రేన్ మీద చేసింది మెరుపుదాడి ఏం కాదు... 

24 గంటల ముందే రష్యన్ పౌరులనుద్దేశించి ఒక భారీ స్పీచ్ ఇచ్చాడు పుతిన్. అదంతా రష్యన్ వార్తా సంస్థ 'టాస్' నుంచి, యూక్రేన్ వార్తా సంస్థ 'యూక్రిన్‌ఫామ్' మీదుగా, అమెరికాలోని వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్‌టైమ్స్ మొదలైనవాటిల్లోనే కాదు, బి బి సి నుంచి... అసలేమాత్రం స్టాండర్డ్స్ తెలియని కొన్ని లోకల్ తెలుగు చానెల్స్ దాకా... అన్నిట్లో కవర్ చేశారు.

ప్రపంచవ్యప్తంగా దాదాపు అన్ని దినపత్రికల్లో కూడా వచ్చింది.  సోషల్ మీడియాలో కూడా ప్రపంచమంతా షేర్ చేసుకుంది. 

రష్యా నుంచి నా ఫ్రెండ్ పంపిన లింక్ ద్వారా నేను కూడా ఒరిజినల్ స్టోరీ చదివాను. 

ఇలాంటి సందర్భాల్లో ఎన్నెన్నో జాగ్రత్తలు ముందుగా తీసుకోవాల్సినంత అధ్యయనం నిరంతరం జరపడానికే ఆయా మంత్రిత్వ శాఖలు, వాటిల్లో పనిచేసే వందలాది స్పెషలైజ్డ్ సిబ్బంది ఉన్నారు. 

మన ఐ ఎఫ్ ఎస్ (ఇండియన్ ఫారిన్ సర్విస్) సిబ్బంది కూడా ఏ విషయంలో తక్కువ కాదు.    

మరి లోపం ఎక్కడ జరిగిందో అర్థం కాదు.  

లేదంటే - ఎప్పటికప్పుడు నివేదికలు అందినా, దీన్ని మించిన ఇంకేవైనా ముఖ్యమైన విషయాల వల్ల దీని మీద నిర్ణయాలు-చర్యలు వెంటనే తీసుకోలేకపోయారేమో తెలియదు.   

కొంతవరకైనా మన కంట్రోల్‌లో ఉండే కోవిడ్ విషయంలోనే, ప్రారంభంలో మనం తప్పటడుగులు వేశాం. అలాంటిది, ఇది యుధ్ధం... ఒకసారి ప్రారంభమైందంటే ఏదీ మన కంట్రోల్‌లో ఉండదు, మనిషి కంట్రోల్‌లో ఉండదు. అది కూడా బయటెక్కడో వేల కిలోమీటర్ల దూరంలో జరుగుతున్న యుధ్ధం. మన పిల్లలు వేలల్లో ఉన్నారక్కడ.

ఎంత దూరం ఆలోచించాలి? ఎన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలి?  ఎంత వేగంగా చర్యలు చేపట్టాలి? 

అందులోనూ... గల్ఫ్ వార్ జరిగినప్పుడు సుమారు లక్షన్నర మందిని అత్యంత సమర్థవంతంగా ఎయిర్‌లిఫ్ట్ చేసిన రికార్డ్ మనకుంది! 

కనీసం వార్ స్టార్ట్ అయిన మొదటి రెండు రోజుల్లోనే ఇదంతా జరిగిపోవాలి. యుధ్ధ సమయంలో ఏ కాస్త అటూఇటూ అయినా, ఎంత దారుణమైన నష్టం జరిగుండేదో ఊహించడం కూడా కష్టం.  

డ్యూ రెస్పెక్ట్స్ టు మన ప్రధాన మంత్రి, ఆయా మంత్రిత్వ శాఖల మంత్రులు, సిబ్బంది... మన విద్యార్థులు అక్కడ ఎదుర్కొన్న ఎన్నెన్నో కష్టాల్లో కేవలం ఒకే ఒక్క  దారుణమైన విషయం ఇక్కడ ఉదాహరిస్తున్నాను: 

యూక్రేన్‌లో సుమారు 20,000 మంది దాకా ఉన్న మన విద్యార్థుల్లో కొంతమంది అండర్‌గ్రౌండ్ మెట్రో స్టేషన్స్‌నే బంకర్స్‌గా తలదాచుకొన్నారు. రష్యాకు వ్యతిరేకంగా ఇండియా 'యు ఎన్' లో వోటెయ్యలేదన్న కోపంతో, సహజంగా ఎంతో మంచివారైన యూక్రేన్ స్త్రీలు మన ఆడపిల్లలను టాయ్‌లెట్స్ వాడుకోనివ్వలేదు. ఎన్ని గంటలు అలా మన పిల్లలు బాధపడ్డారో మనకు తెలియదు. ఆ సమయంలో పీరియడ్స్ వచ్చి ఉన్న అమ్మాయిల పరిస్థితి ఎలా ఉంటుంది? 

అలా అత్యంత దారుణంగా బాధపడ్ద మన విద్యార్థినుల పరిస్థితి చూసి, మళ్లీ వారికి సహాయం చేయడానికి ముందుకు వచ్చిందీ చేసిందీ కూడా యూక్రేన్ మహిళలే కావడం గొప్ప విషయం.  

ఈ యుధ్ధం విషయంలో ఇండియా న్యూట్రల్‌గా ఉన్నా, యూక్రేన్ దృష్టిలో మనం పుతిన్ వైపు ఉన్నట్టే లెక్క. 

ఇదే కోపంతో... కిలోమీటర్ల కొద్ది నడిచి వెళ్తున్న మన విద్యార్థులను చాలా చోట్ల, చాలా బార్డర్స్ దగ్గర యూక్రేన్ పౌరులు, సైనికులు చాలా రకాలుగా అవమానించారు. కొన్ని చోట్ల కొంతమందిని ఆపి కొట్టారు కూడా. 

ఇలాంటి ఎన్నెన్నో విషయాల్ని ఇండియాటుడేకు చెందిన నబీల జమాల్ లాంటి జర్నలిస్టులకు... యూక్రేన్ నుంచి పూజ ప్రహరాజ్, శ్రీకాంత్ మొదలైన స్టుడెంట్-కోఆర్డినేటర్స్, స్వయంగా విద్యార్థులు కూడా రకరకాల చోట్ల ఉన్న బంకర్స్ నుంచి చెప్తున్నది వింటుంటే దుఖం ఆగదు.   

ఇలాంటి సున్నితమైన నేపథ్యంలో, అమ్మాయిల విషయంలో ఏదైనా జరగరానిది జరిగే అవకాశం వందకి వంద శాతం ఉంటుంది. కాని, అలా జరుగలేదు, జరగదు. కారణం... పూర్వపు సోవియట్ యూనియన్ కాలం నుంచి భారత్ యూక్రేన్‌కు కూడా మిత్ర దేశం కాబట్టి. ఆ స్నేహ భావం యూక్రేన్‌ పౌరుల్లో ఇంకా పోలేదు కాబట్టి. 

కట్ చేస్తే - 

ఈ నేపథ్యంలో... అత్యంత బాధాకరమైన పరిస్థితుల్లో, బెంగుళూరుకు చెందిన భారతీయ విద్యార్థి నవీన్ శేఖరప్ప ఖార్కీవ్‌లో జరిగిన బాంబింగ్‌లో మరణించడం చాలా బాధాకరం. ఈ సమయంలోనే, ఇంకో విద్యార్థి ఆరోగ్య కారణాల రీత్యా హాస్పిటల్లో మరణించడం కూడా మరింత బాధాకరం. వారి మృతదేహాలు ఇంకా భారత్ చేరాల్సి ఉంది. వారి తల్లిదండ్రుల దుఖాన్ని ఎవరాపగలరు?  

ఒక్క యూక్రేన్‌లోనే సుమారు 20 వేల మంది భారతీయ విద్యార్థులు మెడిసిన్ చదువుతున్నారంటే... ఇంక రష్యాలో, ఇతర తూర్పు యూరోప్ దేశాల్లో ఇంకెన్ని వేలమంది చదువుతున్నారో సులభంగా అంచనా వేయొచ్చు.

ఎందుకలా అన్నది పూర్తిగా మరొక అతి పెద్ద అంశం కాబట్టి దాని గురించి నేనిక్కడ చర్చించడం లేదు. 

మన విద్యార్థులు చెప్పిన మరొక విషయం నన్ను పూర్తిగా షాక్‌కు గురి చేసిన నిజం.

అది విని, వెంటనే ఒక్క నిమిషంలో మ్యాప్ ఓపెన్ చేసి చూశాను. 

ఏంటంటే - యూక్రేన్‌కు పశ్చిమాన ఉన్న పోలండ్, హంగరీ వంటి దేశాల నుంచి మాత్రమే ఇప్పుడు ఎవరైనా యుధ్ధవాతావరణం నుంచి బయటపడాల్సింది. కాలినడకన కొంత దూరం, ట్రెయిన్స్, బస్సుల్లో కొంత దూరం ప్రయాణించి ఎలాగో చేరుకోవల్సిన బార్డర్స్ ఇవే.  

మన విద్యార్థులు ఎక్కువగా ఉన్నఖార్కీవ్ నగరానికి ఈ దేశాల బార్డర్ సుమారు 2000 కిలోమీటర్లు. ఎన్ని గంటలు, ఎన్ని రోజులు పడుతుందో అంచనా వేయొచ్చు. 

కాగా, ఖార్కీవ్ నుంచి రష్యా బార్డర్ కేవలం 40 నుంచి 100 కిల్లోమీటర్లే!

జస్ట్... గంట, గంటన్నరలో యూక్రేన్ బార్డర్ దాటొచ్చు!!... 

కాని, ఎలా సాధ్యం?    

ఇప్పుడు మన యుధ్ధవిమానాలు వీరిని ఏవైపు నుంచి లిఫ్ట్ చేసి తీసుకొస్తున్నాయన్నది మనకు తెలియదు.        

యుధ్ధం ప్రారంభమైన 8వ రోజున, యూక్రేన్‌లో చిక్కుకుపోయిన మన విద్యార్థులను తిరిగి ఇంటికి చేర్చే ప్రక్రియ మన ఎయిర్‌ఫోర్స్ యుధ్ధ విమానాల ద్వారా ఇంకా కొనసాగుతోంది. విద్యార్థులందరూ క్షేమంగా చేరుకుంటారనే ఆశిద్దాం. 

భారతీయ విద్యార్థుల్లో కొంతమందిని తమ దగ్గరే ఉంచుకొని... రష్యన్  సైన్యం దాడుల నుంచి అతికీలకమైన నష్టం ఎదుర్కోబోయే సమయంలో... మన విద్యార్థులను షీల్డుగా అడ్దం పెట్టుకొనే వ్యూహంతో యూక్రేన్ సేనలు మనవాళ్ళను ఉపయోగించుకోబోతున్నారని ఒక వార్త వినిపిస్తోంది. 

కేవలం ఇది మన చానెల్స్ బ్రేకింగ్ న్యూస్‌ల్లోనే వస్తున్నట్టయితే నేనిది అసలు నమ్మను. కాని కొన్ని విదేశీ చానెల్స్ న్యూస్‌లోను, స్వయంగా రష్యన్ డిఫెన్స్ మినిస్ట్రీ స్పోక్స్‌పర్సన్ ద్వారా కూడా ఈ అనుమానం వ్యక్తమయింది.

అయినా సరే, ఇది కేవలం అనుమానమే అని నేను వ్యక్తిగతంగా నమ్ముతున్నాను. అలాంటి దారుణమైన ప్రమాదం జరగకూడదని ఆశిస్తున్నాను.

ఇక, చూస్తుంటే ఈ యుధ్ధం అంత త్వరగా ఆగిపోకపోవచ్చని అనిపిస్తోంది. 

ఎందుకంటే...  యుధ్ధం కొందరికి ఒక మంచి వ్యాపారం! 

దాని గురించి మరొక బ్లాగ్ పోస్టులో...