Monday 1 May 2023

ఒక సాఫ్ట్‌వేర్ సోషల్ యాక్టివిస్ట్ జీవనశైలి!


మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద నేను రాసిన "కేసీఆర్ - ది ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్" పుస్తకం సృష్టించిన సంచలనాలు చాలా ఉన్నాయి. 

నాకు ముందే ఇచ్చిన మాట ప్రకారం, గౌరవ మంత్రి కేటీఆర్ గారు నన్ను ప్రగతి భవన్ పిలిపించుకొని నా పుస్తకాన్ని ఆవిష్కరించడం... అక్కడున్న మంత్రిగారిని, ఎం పి గారిని, ఇతర వీఐపీలను పరిచయం చేయడం... సుమారు 40 నిమిషాలకు పైగా కేటీఆర్ గారు నాకోసం వెచ్చించడం మొట్టమొదటి సంచలనం.  

ఒక్క అంటార్కిటికా తప్ప - గ్లోబ్ మీదున్న మిగిలిన 6 ఖండాలకూ నా పుస్తకం రీచ్ కావడం రెండో సంచలనం. 

"ఈమధ్య కాలంలో ఇంత సేల్స్ ఏ పుస్తకానికి లేదు. ఏం మ్యాజిక్ చేశారండీ?" అని నవోదయ సాంబశివరావు గారు నాకు కాల్ చేసి చెప్పడం... ఇలా చాలానే ఉన్నాయి. 

కట్ చేస్తే - 

ఒకరోజు పొద్దున్నే నన్ను కలవడానికి ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ వచ్చాడు. పర్సనల్‌గా నేను కొని దగ్గరపెట్టుకొన్న కాంప్లిమెంటరీ కాపీల్లో ఒకటి ఇచ్చాను. ఫోటో తీసుకున్నాము. 

"మీ పర్మిషన్‌తో, నేనీ పుస్తకాన్ని నా డబ్బులతో కొని, కొందరికి నా తరపున పర్సనల్‌గా ఇవ్వాలనుకొంటున్నాను..." అని జేబులోంచి ఒక రిసీట్ తీసి చూపించాడా యువకుడు.  

నవోదయ బుక్ హౌజ్ నుంచి బల్క్ ఆర్డర్ రిసీట్ అది! 

ఇది నేను ఊహించని కొత్త అనుభవం... 


అంతకు ముందు లండన్‌లో ఉన్న మిత్రుడు, ఎన్నారై బీఆరెస్ లండన్ ఇన్‌చార్జి భువనగిరి నవీన్ సుమారు 200 పుస్తకాలు స్వయంగా తనే యూకే నుంచి ఆర్డర్ పెట్టి కొని... పొస్ట్ ద్వారా, కొరియర్ ద్వారా ఇక్కడ లోకల్‌గా అందరికి అందేలా ఏర్పాటు చేశాడు. అదొక సంచలనం.

ఆ సంచలనం తర్వాత - లేటెస్టుగా మళ్ళీ ఇదొక ఊహించని విషయం. 

ఇతనేం డైరెక్ట్ పాలిటిక్స్‌లో లేడు. పార్టీ నాయకుడు కాదు. 

ఎం సి ఏ, ఎం టెక్ రెండు పీజీల్లో టాపర్. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. 

"తెలంగాణ అన్నా, కేసీఆర్ అన్నా నాకు అంతులేని అభిమానం. కేసీఆర్ గారి గురించి ఈ పుస్తకంలో మీరు ఎంతో బాగా రాసిన వాస్తవాలు, మీ భావనలు అన్నీ చాలామందికి చేర్చాలన్నదే నా కోరిక!" 

"అందుకే నావంతు బాధ్యతగా - ఉడతా భక్తిగా ఈ మాత్రం చేయాలనుకుంటున్నాను" అని తను చెప్పాలనుకున్న రెండు విషయాల్ని చాలా స్పష్టంగా చెప్పిన ఆ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పేరు... 


హుజూర్‌నగర్ ముద్దుబిడ్డ. 

పృథ్వీకి పెళ్ళయ్యింది. భార్య అమూల్య గృహిణి. ఇద్దరు పిల్లలు... నిత్య మేథస్వి, నిహాల్ మణిరామ్.    


కట్ చేస్తే -

ఇప్పటికే హుజూర్‌నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి గారికి, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారికి, ఇంకొందరు వివిధ స్థాయిల్లోని పార్టీ నాయకులకు నా పుస్తకం "కేసీఆర్ - ది ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్"ను అందించాడు పృథ్వి. 

మొన్ననే మా స్వర్ణసుధ పబ్లికేషన్స్ నుంచి నేరుగా 100 కాపీలు కొనుక్కెళ్ళాడు. 

ఇప్పుడు - మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, వివిధ స్థాయిల్లోని బీఆరెస్ నాయకులకు, కార్యకర్తలకు కూడా ఈ పుస్తకాన్ని అందించే పనిలో బిజీగా ఉన్నాడు పృథ్వి కుమార్. 

కట్ చేస్తే -

పృథ్వి ఒక సోషల్ యాక్టివిస్ట్ కూడా. 

బీటెక్ చదివి ఉద్యోగం సంపాదించుకొనే అవేర్‌నెస్ లేని గ్రామీణ ప్రాంతాల్లోని యువకులకు ఇప్పటికే 530 మందికి వ్యక్తిగతంగా తనొక్కడే శిక్షణ ఇచ్చాడు. 


హుజూర్‌నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి గారి ఆధ్వర్యంలో, అంకిరెడ్డి ఫౌండేషన్ ద్వారా పృథ్వి ఈ యాక్టివిటీ నిర్వహిస్తున్నాడు. 

పృథ్వి శిక్షణ ఇచ్చినవారిలో 150 మందికి పైగా యువకులు టీసీయస్, క్యాప్ జెమిని, టెక్ మహీంద్ర, స్పైస్ మనీ వంటి ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించి విజయవంతంగా పనిచేస్తున్నారు. 

తన కృషితో ఇలా ఒక్కొక్కరికి ఉద్యోగం ఇప్పించడం ద్వారా ఒక్కో కుటుంబం సంతోషంగా ఉంటుందన్న పృథ్వి ఆలోచనకు నిజంగా హాట్సాఫ్ చెప్పకుండా ఎలా ఉండగలం?    

పృథ్వి కుమార్ దగ్గర శిక్షణ పొందినవారిలో 10 - 11 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం సాధించినవారు కూడా ఉండటం నిజంగా గొప్ప విషయం. 

ఇదొక్కటే కాకుండా - పేద విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వడం, చలివేంద్రాలు పెట్టడం, పరీక్షలకు వెళ్తున్న విద్యార్థులకు చిన్న చిన్న సౌకర్యాలు కల్పించడం వంటి సాంఘిక సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నాడు పృథ్వి.  

ఎక్కువశాతం సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ల జీవనశైలికి భిన్నంగా - పృథ్వీ కుమార్‌లోని ఈ సోషల్ యాక్టివిటీకి నేపథ్యం అతను ఒక రైతుబిడ్డ కావడం, కష్టాలంటే ఏంటో బాగా తెలిసినవాడు కావడం అని నేను గట్టిగా నమ్ముతున్నాను. 

I wish him success in all his future endeavors... 

No comments:

Post a Comment