Monday 28 March 2022

ప్యానిండియా క్రేజ్ నేపథ్యంలో చిన్న బడ్జెట్ సినిమాప్యానిండియా సినిమాలు రిలీజైన రోజే చూడకపోతే అదో పెద్ద నేరంలా క్రియేట్ అయ్యింది బయట పరిస్థితి...😊

జోక్స్ పక్కనపెడితే - 

బాలీవుడ్‌తో సహా - దేశంలోని అన్ని భాషల సినీ పరిశ్రమల దృష్టి ఇప్పుడు తెలుగు సినిమాపైనే ఉంది. తెలుగు సినిమా బిజినెస్ రేంజ్ ఇప్పుడు ఆ లెవెల్‌కు చేరుకుంది.    

2000 కోట్ల బిజినెస్ చేసిన బాహుబలి-2 ను ఏదో ఫ్లూక్ అనుకోడానికి వీళ్లేదని ఇప్పుడు RRR మరొకసారి రుజువు చేసింది.  

Without any fraction of doubt... All credit goes to Rajamouli and his vision. 

ఇక, ఆయా సినిమాల్లోని క్రియేటివిటీ గురించి, మేకింగ్ గురించి... వ్యక్తిగత అవగాహన స్థాయినిబట్టి, అభిరుచిని బట్టి... ఎవరికి తోచింది వారు ఏదేదో చెప్తుంటారు. సోషల్ మీడియా "ఫ్రీ ప్రెస్" లో పోస్టులు పుంఖానుపుంఖాలుగా పెడుతుంటారు. 

తప్పేం లేదు... ఎవరి గోల వారిది. 

సినిమాలు తీసేవాళ్ళు తీస్తుంటారు, చూసేవాళ్ళు రివ్యూలు రాస్తుంటారు. 

అయితే అవన్నీ - రెగ్యులర్‌గా ఆయా వ్యక్తుల పోస్టులకు, ట్వీట్లకు లైకులు కొట్టే అతి చిన్న సంఖ్య వరకే పరిమితం. 

అంతిమంగా ఏది కరెక్టు అనేది చెప్పేది ఆయా సినిమాల ఫలితాలు, అవి కలెక్ట్ చేసే డబ్బు మాత్రమే.    

తెలుగు పరిశ్రమలో ఉన్న ఒక అరడజన్ పెద్ద హీరోల సినిమాలన్నీ ఇక నుంచీ ప్యానిండియా సినిమాలుగానే రూపొందుతాయంటే ఆశ్చర్యం లేదు. 

సినిమా ఇప్పుడొక భారీస్థాయి కార్పొరేట్ బిజినెస్. 

ఆల్రెడీ ప్రభాస్‌వి ఇంకో నాలుగైదు ప్యానిండియా సినిమాలు లైన్లో ఉన్నాయి. అల్లు అర్జున్ పుష్ప-2 రెడీ అవుతోంది. రాజమౌళి, మహేశ్ బాబు కాంబినేషన్లో మరో భారీ ప్యానిండియా సినిమా త్వరలో ప్రారంభం కాబోతోంది. జేమ్స్‌బాండ్ తరహాలో ప్లాన్ చేస్తున్న ఈ సినిమాను డైరెక్టుగా ఇంగ్లిష్‌లో కూడా రిలీజ్ చేస్తారని విన్నాను.  

పూరి జగన్నాధ్-విజయ్ దేవరకొండ లైగర్ ఆగస్టులో రిలీజ్ ఉంది. రేపు 29 వ తేదీ నాడు, అదే డెడ్లీ కాంబినేషన్లో ఇంకో కొత్త ప్రాజెక్టు ముంబైలో లాంచ్ చేస్తున్నారు. 

కట్ చేస్తే -    

ఇప్పటివరకు మనం చెప్పుకున్నదంతా ఒక పరిమితమైన సర్కిల్‌లో, అతి పరిమితమైన హీరోలు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్స్ మధ్య జరిగే బిజినెస్. 

ఆ సర్కిల్ లోకి కొత్తగా ఎంట్రీ అనేది చాలా అరుదుగా జరుగుతుంది. దానికి కొన్ని లెక్కలుంటాయి.

అదలా  పక్కనపెడితే - 

ఈ భారీ హీరోల సినిమాలు, ప్యానిండియా సినిమాలు ఆన్నీ కలిపి సంవత్సరానికి ఒక పది రిలీజైతే చాలా ఎక్కువ! 

మిగిలిన 190 చిన్న బడ్జెట్ ఇండిపెండెంట్ సినిమాలకు ఇప్పుడు మంచి హవా ఉంది. ముఖ్యంగా కొత్తగా బిజినెస్ బజ్ క్రియేట్ చేస్తున్న ఓటీటీల నేపథ్యంలో చాలా ఉంది. 

కాని, ఈ అవకాశాన్ని ఉపయోగించుకొంటున్నవారి సంఖ్య చాలా స్వల్పం. 

ఇదివరకట్లా ప్రొడ్యూసర్స్ కోసమో, ఫండ్స్ కోసమో అని కాంప్రమైజ్ అయిపోయి, కనీస అవగాహన కూడా లేకుండా, ఏదో రొటీన్ ఫార్ములా కమర్షియల్ సినిమాలు చేయకుండా... కంటెంట్ నిజంగా బాగుండే సినిమా చేయగలిగితే చాలు. బిజినెస్ ఎక్కడికో వెళ్తుంది.   

ఇది ఎలాంటి అతిశయోక్తి లేని వాస్తవం. ఇటీవలి కొన్ని చిన్న సినిమాలు ఓటీటీలో చేసిన బిజినెస్‌ను గురించి తెలుసుకుంటే ఈ వాస్తవం ఈజీగా అర్థమవుతుంది. గూగుల్ కూడా చెప్తుంది. 

సో... కొన్ని ఈగోలు, అనుమానాలు పక్కనపెట్టి - ఒక మంచి అవగాహనతో లాజికల్‌గా ఎవరు, ఏంటి, ఎలా అన్నది చక్కగా కూర్చొని మాట్లాడుకోగలిగితే చాలు... చాలా చిన్న బడ్జెట్స్ కాబట్టి, అన్నీ ఈజీగా సెట్ అవుతాయి. 

ఇన్వెస్టర్స్, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్... అందరూ బాగుంటారు. 

ప్యానిండియా సినిమాల క్రేజ్ నడుస్తున్న ఈ సమయంలో - బిజినెస్ పరంగా చిన్న బడ్జెట్ సినిమాలకు ఇది నిజంగా చాలా మంచి గోల్డెన్ పీరియడ్.  

Stop being the chess piece.
Become the chess player.  

No comments:

Post a Comment