Monday 27 April 2020

జల దృశ్యం నుంచి, సుజల దృశ్యం దాకా...‬

సక్సెస్‌సైన్స్ పాయింటాఫ్ వ్యూలో... మనం ఇప్పటివరకూ ఎంతోమంది ప్రపంచస్థాయి నాయకుల సక్సెస్‌స్టొరీలను గురించి విన్నాము, పుస్తకాల్లో చదివాము, సినిమాలుగా చూశాము.

మన కళ్లముందు మనం చూసిన ఆస్థాయి సక్సెస్‌స్టోరీ... కేసీఆర్. 

19 ఏళ్ల క్రితం తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భవించిన రోజు, ప్రాణాలకు తెగించి యుధ్ధభూమిలోకి దిగిన ఒక సంకల్పశక్తిగా... 

19 ఏళ్ల తర్వాత, ఈరోజు... తెలంగాణ రాష్ట్ర సాధకుడిగా, బంగారు తెలంగాణ స్వాప్నికుడిగా, ఆ దిశలో రాష్ట్రాన్ని విజయపథంలో నడిపిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రిగా...

ఇప్పుడు, ఈ క్షణం... ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్19 నుంచి తెలంగాణ ప్రజలను కాపాడటం కోసం అనుక్షణం తన టీమ్‌తో కలిసి సమీక్షలు చేస్తూ, ప్రణాళికలు రచిస్తూ, పనులు చేయిస్తూ, దేశంలోని ఇతర రాష్ట్రాలకు-కేంద్రానికి కూడా చాలా విషయాల్లో మార్గదర్శకమవుతూ, రాష్ట్రంలోని ప్రజలందరి ప్రాణాలకు భరోసా ఇస్తూ, ఒక పెద్దన్నగా...

నా కళ్ళముందు, నేను చూసిన ఒక ప్రపంచస్థాయి విజయగాథ... కేసీఆర్.

ఉద్యమసమయంలో ఒక్క రక్తపుచుక్క చిందకుండా లక్ష్యం సాధించడం అంత సామాన్యమైన విషయం కాదు.

రాష్ట్ర విభజన అనంతరం కూడా... రెండు రాష్ట్రాల ప్రజల మధ్య స్నేహం, ఆత్మీయ సౌరభాలే తప్ప, మరొక భావం కించిత్తైనా రావడానికి వీల్లేని పాలన అందించడం కూడా అసామాన్యమే.

ఈ రెండింటి విషయంలో ఆయన ముందే చెప్పాడు. చెప్పినవిధంగా ఆ మాట నిలబెట్టుకున్నాడు.

అంధకారమవుతుంది అన్నచోటే 24 గంటల కరెంటు ఇచ్చాడు.

వ్యవసాయం తెలియదు అన్నచోటే, "రైస్ బౌల్ ఆఫ్ ఇండియా" స్థాయికి పంట దిగుబడిని సాధించి చూపించాడు.

ప్రాజెక్టులు అంటే, కనీసం 10-15 ఏళ్లు అన్నది ఒక మామూలు విషయమైన ఈ దేశంలో, ఒక అత్యుత్తమస్థాయి వండర్ ప్రాజెక్టు 'కాళేశ్వరం'ను కేవలం నాలుగున్నరేళ్లలో పూర్తిచేసి చూపించాడు.

లిటరల్లీ, ఇలాంటి ఒక 100 అసాధారణ విజయాలను గురించి నేను తడుముకోకుండా చెప్పగలను.

దటీజ్ కేసీఆర్. 

కట్ చేస్తే -  

కేసీఆర్ స్థాపించిన టీఆరెస్ పార్టీ నేడు 20వ వసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా...పార్టీ శ్రేణులకు, వివిధస్థాయిల్లోని పార్టీ నాయకులందరికీ... కేసీఆర్ గారికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.

"When Politics Decide Your Future, Decide What Your Politics Should Be!"
- KTR, Hon Min & TRS Working President

Wednesday 22 April 2020

The Show Must Go On...

"మా వాడు చదువుకోవట్లేదు. ఉద్యోగం చేయడు. బిజినెస్ చేయలేడు. ఏ పనీ చేతకాదు. ఎందుకూ పనికిరాడు. కొంచెం నీ దగ్గర డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పెట్టుకో!"

ఒకరోజు పొద్దున్నే గురువుగారు దాసరిగారికి కాల్ చేసి అలా అడిగాట్ట ఆయన స్నేహితుడు!

బయటివాళ్ల దృష్టిలో డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ అంటే మరీ అంత పనికిరానిదన్నమాట ...

ఈ జోక్‌ని స్వయంగా గురువుగారు, దర్శకరత్న దాసరి నారాయణరావుగారు అప్పటి తన బంజారాహిల్స్ ఆఫీసులో నాతో చెప్పారు.

ఒక్క డైరెక్షన్ డిపార్ట్‌మెంటే కాదు. టోటల్‌గా సినీఫీల్డులో పనిచేసేవారంతా ఎందుకూ పనికిరానివాళ్లని ఇతర ఫీల్డులవాళ్ల అభిప్రాయం.

"చదువుకోవడం చేతకానివాళ్లంతా సినీఫీల్డంటారు!" అని కూడా అంటారు కొంతమంది.

వాళ్లకి తెలీదు... ఫీల్డులో హైస్కూల్ డ్రాపవుట్స్ నుంచి, ఎమ్ బి ఏ లు, యూనివర్సిటీ డబుల్ గోల్డ్ మెడలిస్టులు, న్యూక్లియర్ ఫిజిక్స్ పీజీలు, ఐ ఐ ఎమ్ నేపథ్యాన్ని అలవోగ్గా అలా వదిలేసినవాళ్ల దాకా ఎందరో ఉన్నారని! 

"అబ్బో సినిమావాళ్లా!" అంటారు కొందరు. మిగిలినవాళ్లంతా ఏదో సొక్కమైనట్టు. వీళ్లేదో చేయరాని పని చేస్తున్నట్టు.

దేన్నయినా సరే జనరలైజ్ చేసి మాట్లాడే ఇలాంటివాళ్లంతా తెలుసుకోవాల్సిన ఒక నిజం ఎన్నటికీ తెల్సుకోలేరు.

'మ్యాటర్ ఎప్పుడూ ఫీల్డు కాదు. మన మైండ్‌సెట్'... అనేది కామన్‌సెన్స్.

అన్ని ఫీల్డుల్లో మంచీ చెడు ఉంటుంది. ఇది గ్లామర్ ఫీల్డు కాబట్టి, ఇక్కడ దగ్గినా తుమ్మినా బ్రేకింగ్ న్యూసే.

సినిమా న్యూస్‌లు, సినిమావాళ్ళమీద టిడ్‌బిట్స్, సినిమా బేస్‌డ్ ప్రోగ్రామ్స్, సినిమావాళ్ల ఫోటోలు, బైట్స్ లేకుండా ఏ పత్రికా, ఏ చానెల్ బ్రతకలేదు. సగటు మనిషి జీవితంలో కూడా సినిమా ఒక అంతర్భాగం. 

కట్ చేస్తే - 

కరోనా లాకౌట్ కారణంగా... సినిమాల షూటింగ్స్, రిలీజ్‌లు, థియేటర్లు అన్నీ ఇప్పుడు ఎక్కడికక్కడ స్థంభించిపోయాయి.

ఇప్పుడున్న పరిస్థితి కొద్దిగా తగ్గుముఖం పడితే, జులై నుంచి మళ్ళీ షూటింగ్స్ ప్రారంభం కావచ్చు అంటున్నారు. సినిమా థియేటర్స్ మాత్రం డిసెంబర్ దాకా తెర్చుకోనే అవకాశాలు ఏమాత్రం కనిపించటం లేదు.

ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా వచ్చిన ఇలాంటి పరిస్థితివల్ల, జాతీయ స్థాయిలో, ఇప్పటివరకు సుమారు  3 వేల కోట్ల రూపాయలవరకూ నష్టం వచ్చినట్టు విశ్లేషకుల అంచనా.

హోమ్‌స్టే కారణంగా అన్నీ ఆగిపోయాయి నిజమే. కానీ, లోపల్లోపల కదిలే పనులు వీలయినన్ని కదుల్తూనే ఉన్నాయి.

రాజమౌళి తన తర్వాతి సినిమా మహేశ్‌తోనే అని చెప్పేశాడు. పూరి జగన్నాథ్ ముంబైలో స్క్రిప్టులు రాసుకుంటున్నాడు. కొంతమంది నిర్మాత-దర్శకులు తమ తర్వాతి సినిమాల కాంబినేషన్స్ సెట్ చేసుకుంటున్నారు.

హీరోయిన్స్ ఇళ్ళల్లో వంటలు చేస్తున్నారు. హీరోలు చీపురు పట్టి ఇళ్ళు ఊడుస్తున్నారు. చాలామంది హాయిగా పగలూరాత్రీ తెలియకుండా నిద్రపోతున్నారు. లేచినప్పుడు ఒక ట్వీటో, ఇన్స్‌టాగ్రామ్‌లో ఒక ఫోటోనో పెడుతున్నారు.   

కరోనా కారణంగా తమ సినిమాల రిలీజ్ ఆగిపోయిన నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల టెన్షన్ కంటిన్యూ అవుతోంది.

అన్నీ సెట్ చేసుకొని, ఈ నెల్లో షూటింగ్ ఓపెనింగ్ పెట్టుకొన్న ఎందరో చిన్నా చితకా ఆర్టిస్టులు-డైరెక్టర్ల సినిమాల్లో ఎన్ని ఉంటాయో, ఎన్ని ఎగిరిపోతాయో తెలియటంలేదు.

మరోవైపు, చాలామంది సినీ కార్మికులు, టెక్నీషియన్స్ వారి దినవారీ బేటాల్లేక అల్లాడిపోతున్నారు. ఇండస్ట్రీలోని వ్యక్తులు, సంస్థలు తమకు చేతనైన సహాయం చేస్తూనే ఉన్నారు.

ఇదంతా ఇప్పుడు ఇలా ఉన్నప్పటికీ... రేపు జులై నుంచి మళ్లీ షూటింగ్స్ ప్రారంభమైతే చాలు. అంతా మామూలైపోతుంది.

The Show Must Go On... 

బయటికి క్రియేటివిటీ అని, తపస్సు అనీ, ప్యాషన్ అనీ ఎందరో ఎన్నో చెప్పొచ్చు. అది మామూలే.

వీటన్నింటినీ మించిన వాస్తవం ఏంటంటే... సినిమా ఇప్పుడొక బిగ్ బిజినెస్.

గ్లామర్, ఫేమ్ అనేవి సినిమాలో  'బై డిఫాల్ట్' ఉంటాయి. కాని, సినిమా అల్టిమేట్ టార్గెట్ మాత్రం...  ఇప్పుడు డబ్బే.  

Saturday 18 April 2020

Online Film Coaching @ Stay Home

యాక్టింగ్, స్క్రిప్ట్ రైటింగ్, డైరెక్షన్ లలో ఆన్‌లైన్ శిక్షణ...

ఎప్పటినుంచో నేను అనుకుంటున్న ఈ కాన్‌సెప్ట్‌ను ఇప్పుడు నాతో అమలుచేయించిన క్రెడిట్ ఖచ్చితంగా కరోనాదే!

కట్ చేస్తే - 

మీకు తెలీంది కాదు... ఈ డిజిటల్ యుగంలో ఆన్‌లైన్‌లో ఏదైనా నేర్చుకోవడం సాధ్యమే. ఇప్పటివరకూ నాకు తెలిసి, ఇది ఇండియాలో లేదు.

ఆసక్తి ఉన్నవాళ్లకు ఈ కరోనా టైమ్‌లో ఇది మంచి అవకాశం. లాక్‌డౌన్ తర్వాత కూడా, దీని గురించి మీమీ ఇతర పనులు, కాలేజీ క్లాసులు పోగొట్టుకోనవసరంలేదు.

అభ్యర్థుల్లో ఉన్న ఆసక్తి స్థాయినిబట్టి, నాకు నచ్చిన అతి కొద్దిమందికి మాత్రమే ఈ శిక్షణ ఇవ్వాలని డిసైడ్ అయ్యాను. నా హోమ్ స్టేలో కొన్ని గంటలు దీనికి కూడా కెటాయిస్తున్నాను.

ఈ శిక్షణ ఉచితం కాదు.

ఒక్కో అభ్యర్థికి నేను చాలా సమయం కెటాయించాల్సి ఉంటుంది.

ఏ నైపుణ్యం అయితే ప్రాక్టికల్ రియాలిటీలో ఇండస్ట్రీకి అవసరమో... దాన్ని మాత్రమే నాకున్న స్వల్పమైన అనుభవంతో కలిపి నేర్పించడం ఈ శిక్షణ ప్రత్యేకత.

నిజంగా అంత ఆసక్తి, సీరియస్‌నెస్ ఉన్నవాళ్లు మాత్రమే నా ఇన్‌బాక్స్‌లోకి రావచ్చు. వివరాలు చెప్తాను.

Best Wishes... 

Saturday 11 April 2020

'CREATIVE' Work From Home

14 అర్థరాత్రి తర్వాత లాక్‌డౌన్ పరిస్థితి ఏంటి అనేది తెలవడానికి బహుశా ఇంకో 2 రోజులు పట్టొచ్చు.

దేశంలో అయినా, ఇక్కడ రాష్ట్రంలో అయినా... మొత్తం లాక్‌డౌన్ ఎత్తేయడమయితే ఉండదు.

లాక్‌డౌన్ ను పాక్షికంగా ఎత్తేసినా కూడా, ఏదో కొంపలుమునిగే స్థాయిలో పనుంటే తప్ప ఎవ్వరూ అంత ఈజీగా కదలరు ఇంటినుంచి. ప్రాణాలు ముఖ్యం కదా...

థాంక్స్ టూ కరోనా... మనిషి ఆలోచనావిధానంలో, జీవనశైలిలో ఖచ్చితంగా కొంత మార్పు ఉంటుంది.

నేను అనుకోవడం... మళ్లీ అందరూ ఎవరిపనుల్లో వారు పూర్తిస్థాయిలో బిజీకావడానికి, కనీసం జూన్ చివరివారం వరకు టైమ్ పడుతుందనుకుంటున్నాను.

ఈలోగా, ఇంటిదగ్గరనుంచే చాలా పనులు చేయాలని ప్లాన్ చేస్తున్నాను. అది కూడా మామూలు రోజులకంటే ఇంకా ఎక్కువ పనిని, మరింత ఎక్కువ వేగంగా చేయాలనుకొంటున్నాను.

కట్ చేస్తే - 

దీనికి సంబంధించిన టోటల్ వర్క్ మ్యాప్ ఆల్రెడీ రెడీ అయింది. దాన్ని ఒక క్రమంలో పెట్టి, రేపటినుంచే పని ప్రారంభించాలనుకున్నాను:

సినిమాలకు, వెబ్ సీరీస్‌లకు స్క్రిప్టులు... యూట్యూబ్ చానెల్స్‌కు, వెబ్‌సైట్స్‌కు కంటెంట్, ఫ్రీలాన్స్ రైటింగ్, సోషల్‌మీడియా ప్రమోషన్ సొల్యూషన్స్, యాక్టింగ్/స్క్రిప్ట్ రైటింగ్/డైరెక్షన్ లలో ఆన్‌లైన్ కోచింగ్, ఎట్సెట్రా ఎట్సెట్రా...

ఏదైనా సరే, పనిమొత్తం ఆన్‌లైన్లోనే జరుగుతుంది.

ఫ్రీ సర్విస్ కాదు. ప్రీమియమ్ సర్విస్.

నా టీమ్ ఆల్రెడీ దీనికి సంబంధించిన వామ్అప్ పనుల్లో ఫుల్ బిజీ అయిపోయింది. రేపు రాత్రికే పూర్తివివరాలతో పని షురూ....   

ఆయా పనుల్లో నాతో కలిసి వర్క్ చేయాలనుకొనే మిత్రులు రేపటిదాకా ఆగనవసరంలేదు. ఇన్‌బాక్స్‌లోకి రండి. వివరాలు మాట్లాడుకొందాం. పని ప్రారంభించేద్దాం...        

Friday 10 April 2020

ఏంటా రెండు తప్పులు?

సినిమాఫీల్డులో మీకు అవకాశం దొరికి, దాన్ని మీరు సద్వినియోగం చేసుకొని, నిలదొక్కుకొని, కాస్త ఊపిరిపీల్చుకొనేదాకా... మీరు ఆర్టిస్టు అయినా, టెక్నీషియన్ అయినా మీకు డబ్బులు రావు.

కొద్దిమంది ఎంతో కొంత ఇస్తారు. ఆ కొంత అసలు లెక్కలోకిరాదు.

90 శాతం పైగా కొత్తవారి విషయంలో ఇది నిజం.

ఎందుకివ్వరు నేది అదో పెద్ద కథ. దానిగురించి తర్వాత మాట్లాడుకుందాం.

కొత్తగా పరిచయంచేసే హీరోయిన్స్, ఇతర సపోర్టింగ్ ఫిమేల్ ఆర్టిస్టులకు మాత్రం పారితోషికం ఉంటుంది.

మన హీరోయిన్స్‌లో దాదాపు అందరూ ముంబై నుంచే వస్తారు. అక్కడ సెలెక్టు అవగానే, కొంత అడ్వాన్స్ ఇచ్చి, అగ్రిమెంట్ వేయకుండా ఏ హీరోయిన్ కూడా ముంబైలో ఫ్లైట్ ఎక్కి ఇక్కడికి షూటింగ్‌కి రాదు.

సో, హీరోయిన్స్‌కు పేమెంట్ ఉంటుంది... వారు కొత్తవారైనా కూడా.

ఫిమేల్ సపోర్టింగ్ ఆర్టిస్టులకు కూడా కొత్త పాతతో సంబంధం లేకుండా పారితోషికం ఉంటుంది. వాళ్లకు పేమెంట్ విషయంలో ఎలాంటి సమస్య ఉండదు. చెప్పిన రెమ్యూనరేషన్ ఇచ్చేస్తారు.

ఎటొచ్చీ... హీరో నుంచి, చిన్న సపోర్టింగ్ క్యారెక్టర్ వరకు, కొత్తవారైన అబ్బాయిలకు  మాత్రం చాలా అరుదుగా పేమెంట్ ఉంటుంది. కొన్ని ప్రొడక్షన్ కంపెనీలు మాత్రం మనీ పే చేస్తాయి. కాని, అలాంటి ప్రొడక్షన్ కంపెనీల సంఖ్య చాలా తక్కువ.

ఈ నేపథ్యంలో - కొత్తవారికి అవకాశం ఎప్పుడు రావాలి? అది ఎప్పుడు క్లిక్ అవ్వాలి?

అలా ఒక క్యారెక్టర్ క్లిక్ అయ్యాక, ఆ గుర్తింపుతో మళ్లీ ఇంకో సినిమాలో అవకాశం వచ్చినపుడు మాత్రమే కాస్త పనికొచ్చే రెమ్యూనరేషన్ వస్తుంది.

ఒక కొత్త ఆర్టిస్టు ఈ దశకు రావడానికి 6 నెలలు పట్టొచ్చు... సంవత్సరం పట్టొచ్చు. ఇంకెంతకాలమయినా పట్టొచ్చు. ఇది ఆయా కొత్త ఆర్టిస్టుల టాలెంట్ కన్నా కూడా, ఇండస్ట్రీలో వారికుండే పరిచయాలు, పరిచయాలు చేసుకొని చొరవగా ముందుకు దూసుకెళ్లడం వంటివాటిమీద ఆధారపడి ఉంటుంది.

ఇదంతా ఒక పెద్ద జర్నీ...

ఈ జర్నీ సాగినంతకాలం సిటీలో ఉండటానికి, ఫుడ్డుకు, తిరగడానికి డబ్బులు ఎక్కన్నించివస్తాయి?

ఈ వైపు ఎలాంటి ఇబ్బంది లేనప్పుడే, ఆవైపు అవకాశాలకోసం తిరగడానికి ఫ్రీడం ఉంటుంది.

సో, సినిమాల్లో మీకు డబ్బు వచ్చేదాకా, మీకు తప్పనిసరిగా ఏదున్నా లేకపోయినా, మీరేం చేసినా చేయకపోయినా వచ్చే ఒక ఆదాయం అవసరం. ఇది ఎలా ఏర్పాటు చేసుకుంటారన్నది మీ ఇష్టం.

జాబ్ కావొచ్చు, ఇంటినుంచి రావొచ్చు. ఒక ఫ్రెండ్ ఎవరైనా సహాయం చేస్తుండవచ్చు... వాటెవర్... ఇది మాత్రం ఖచ్చితంగా అవసరం.

ఈ ఏర్పాటు లేకుండా ఇండస్ట్రీకి రావడం అనేది మొదటి తప్పు.

అన్నీ ఉంటేనే అవకాశాలు దొరకడం కష్టం. ఇక తిండీతిప్పలుకు ఇబ్బందిపడుతూ అవకాశాలెలా వెతుక్కుంటారు?

దురదృష్టవశాత్తూ... ఇండస్ట్రీకి వచ్చేవారిలో 90 శాతం మంది ఈ తప్పు చేస్తారు.

కట్ చేస్తే -     

ఆర్టిస్టుగా అయినా, టెక్నీషియన్‌గా అయినా ఇండస్ట్రీలో అవకాశంకోసం వచ్చేవారిలో... 10th ఫెయిల్ నుంచి, ఉన్న ఉద్యోగాలను వదులుకొని వచ్చేవాళ్లదాకా ఉంటారు.

సరే ఏ వయస్సులో అయినా ఎంటర్ అవొచ్చు. తప్పేం లేదు...

కానీ, ఒక 'టైమ్ లిమిట్' అనేది ఖచ్చితంగా ఉండాలి. ఒక ఏడాది, రెండేళ్లు, మూడేళ్లు... చివరికి అయిదేళ్ళు కూడా కావొచ్చు.

కానీ, ఆ డెడ్‌లైన్ అనేది తప్పనిసరిగా పెట్టుకోవాలి.

ఆ డెడ్‌లైన్‌లోపు అవకాశం సంపాదించుకొని, నిలదొక్కుకొని, ఓకే అనుకుంటే ఉండాలి. లేదంటే... తర్వాత బ్యాక్ టూ పెవిలియన్ వెళ్ళాక ఏం చేయాలన్నది కూడా ముందే డిసైడ్ చేసుకొని ఉండాలి.

బ్యాడ్‌లక్ ఏంటంటే... ఇండస్ట్రీకి వచ్చేవారిలో 90 శాతం మంది ఈ తప్పుకూడా చేస్తారు.

ఇది రెండో తప్పు...

అన్నీ కలిసొచ్చి, లేదా కలిసొచ్చేలా చేసుకొని... ఇండస్ట్రీలో అవకాశం అందిపుచ్చుకొని, తర్వాత నిలదొక్కుకొని... అంతా బాగుంటే ఎలాంటి సమస్య ఉండదు. అలా జరగనప్పుడు మాత్రమే జీవితం అల్లకల్లోలం అవుతుంది.

ఇది ఎవరికయినా అనుభవం మీద మాత్రమే తెలుస్తుంది.

ఇండస్ట్రీలో ఉన్న టాప్ డైరెక్టర్లు, హీరోలు, ఇతర ఆర్టిస్టులు ఎవరైనా కొత్తగా అవకాశం కోసం వచ్చినప్పుడు చెప్పే మొదటిమాట జనరల్‌గా ఇలా ఉంటుంది: "ఎందుకు బాబూ...హాయిగా చదువుకొని... ఉద్యోగం చేసుకోక!" ... అని.

ఆ కష్టాలన్నీ వాళ్లకు తెలుసు కాబట్టి ఇలా చెప్తారు. అంతే తప్ప, అవకాశం ఇవ్వద్దనో, రావద్దనో కాదు.

ఇది ఎవ్వరూ అర్థం చేసుకోరు. అర్థమయ్యేలా తెలిసేటప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.

సో, పైన చెప్పిన రెండు అంశాల విషయంలో కరెక్ట్ ప్లానింగ్‌తో వస్తే... మీకు టెన్షన్స్ ఉండవు. మీ మొత్తం ఫోకస్ 'చాన్స్' మీదే ఉంటుంది. ప్రయత్నాలు బాగా చేస్తారు. అవకాశాలు కూడా మీకు ఈజీగా దొరుకుతాయి.

ఆ దొరికిన అవకాశాన్ని మరిన్ని చాన్స్‌లు రావడానికి బాగా ఉపయోగించుకొన్నామా లేదా? తర్వాతేంటి...

అదంతా తర్వాత... 

Tuesday 7 April 2020

సినీఫీల్డులోకి ఎందుకు వెళ్ళితీరాలి?

పాలిటిక్స్, క్రికెట్, సినిమాలు...

ఈ మూడు లేకుండా మన దేశంలో మనుషులు బ్రతకలేరు. వీటిలో మొదటి రెండు రంగాల వాళ్లకు మూడోరంగం అంటే మంచి క్రేజ్.

వాళ్లూ వీళ్లూ మంచి రిలేషన్‌షిప్స్ మెయింటేన్ చేస్తుంటారు...

ఇక 'ఫిలిం బేస్డ్' ప్రోగ్రామ్స్ లేకుండా టీవీ చానెల్స్  బ్రతకలేవు.

న్యూస్‌పేపర్స్, మ్యాగజైన్స్ వంటివి కూడా... 'సినిమాపేజీ' లేకుండా, సినిమా స్టార్స్ ఫోటోలు లేకుండా, సినిమావాళ్లమీద రాసే గాసిప్స్, టిడ్‌బిట్స్ లేకుండా అస్సలు బ్రతకలేవు.

సినిమాకున్న పవర్ అది!

ఎవరు ఎన్ని చెప్పినా ఇదే నిజం.

ఒకప్పుడు కోటి, రెండు కోట్లు అంటే ఫీల్డులో పెద్ద అంకె! ఇప్పుడు... 100, 200, 300 కోట్లు కూడా చాలా రొటీన్‌గా వినే ఫిగర్స్ అయ్యాయి.

సినిమా ప్యూర్‌లీ ఒక బిగ్ బిజినెస్... ఇప్పుడు.

కట్ చేస్తే -

'సక్సెస్ ఈజ్ సెక్సీ' అనేది ఇక్కడ అక్షరాలా నిజం.

ఒకే ఒక్క సక్సెస్ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది.

భారీ స్థాయిలో డబ్బూ, ఊహించని రేంజ్ వ్యక్తులతో సంబంధాలూ, ఓవర్‌నైట్‌లో ఫేమ్... ఇవన్నీ ఇక్కడే సాధ్యం.

చిన్నదో పెద్దదో... ఒకే ఒక్క సక్సెస్‌తో బెల్లం చుట్టూ ఈగల్లా నీ చుట్టూ ఎందరో చేరతారు... నువ్వే ఆశ్చర్యపోయేంతగా! ఆ తర్వాత నువ్వెన్ని గుడ్డి నిర్ణయాలు తీసుకొన్నా, కనీసం ఒక దశాబ్దం నీకెలాంటి కష్టం ఉండదు. ఏ లోటూ ఉండదు.

నువ్వు కలలో కూడా ఊహించని వ్యక్తులు ఓవర్‌నైట్‌లో నీ నెట్‌వర్క్‌లోకొస్తారు.

అప్పటిదాకా నిన్ను కేర్ చేయని, నిన్ను వెలివేసిన నీ సోకాల్డ్ మిత్రులూ బంధువులూ "ఆహా ఓహో" అంటూ నిన్ను వెతుక్కుంటూ నీదగ్గరకొస్తారు.

వాళ్ల నటన ముందు... నువ్వు అప్పటిదాకా డైరెక్ట్ చేసిన నీ నటీనటులు ఎందుకూ పనికిరారు.

అంతా ఒక మాండ్రెక్స్ మత్తులా ఉంటుంది... 24/7 x 365 డేస్...

ఇలాంటి సక్సెస్ ఇచ్చిన కిక్కుతో వెంటనే మరో సక్సెస్‌ని కూడా ముద్దాడావనుకో... ఇక అంతే.
భూమ్మీదనే నువ్వు స్వర్గం అనుభవిస్తావు.

స్వర్గం అంటే... 'చచ్చాక వెళతారు' అనే ఏదో సోకాల్డ్ నాన్సెన్సికల్ ఇల్యూజనరీ డెస్టినేషన్ కాదు. అక్కడి రంభ, ఊర్వశి, మేనకలు అసలే కాదు.

అదొక అనిర్వచనీయమైన అనుభూతి.

ఫాలోడ్ బై... రకరకాల అనుభవాల పరంపర.

నీ ఫాంటసీలన్నీ నిజమవుతాయి.

అనుక్షణం ఆనందో బ్రహ్మ!

ఇంకేం కావాలి?

నువ్వు బాగుంటావు. నీ కుటుంబం, నీ బంధుమిత్రులు, నీ శ్రేయోభిలాషులు అంతా బాగుంటారు.

ఫీల్డులో, లైమ్‌లైట్‌లో ఉన్నంతసేపూ నువ్వు ఏ పనులంటే ఆ పనులు అలా అలా అయిపోతూ ఉంటాయి. నువ్వు చేసుకొనే ఇతర వ్యాపారాలకు సినిమా అనే ప్లాట్‌ఫామ్ ఒక పెద్ద సపోర్ట్ అవుతుంది.

పొలిటీషియన్స్, క్రికెట్ స్టార్స్, బిజినెస్ మాగ్నెట్స్, బాబాలు, గురూజీలను కలవడం అనేది నీకు వెరీ సింపుల్ అయిపోతుంది. ఇంకెవరిని కలవాలన్నా అపాయింట్‌మెంట్ అనేది నీకసలు సమస్యేకాదు. ఎక్కడికెళ్లినా రెడ్ కార్పెటే.

మనీ, మందు, ఆపోజిట్ సెక్స్‌తో ఫ్రెండ్‌షిప్స్ అనేవి... సక్సెస్ ఉన్నచోట, ఏ ఫీల్డులో అయినా మామూలే. అయితే... ఇక్కడ కొంచెం గ్లామర్ కూడా యాడ్ అవుద్ది కాబట్టి... అసలా కిక్కే వేరుగా ఉంటుంది.     

ఎక్కడో స్టీల్‌ప్లాంట్ గెస్ట్ హౌజ్‌లో... నువ్వు కాఫీ త్రాగుతూ రిలాక్స్ అవుతున్నప్పుడు, నీచేతిలో ఉన్న జెఫ్రీ ఆర్చర్ నవల... అక్కడే ఇంకో సినిమా షూటింగ్‌లో ఉన్న ఒక టాప్ హీరోయిన్‌తో నువ్వూహించని ఫ్రెండ్‌షిప్‌కు దారితీయవచ్చు.

అంతకుముందు నువ్వు చూస్తే చాలు అనుకున్న ఒక సూపర్ స్టార్‌ను, గండిపేటలో ఆయన షూటింగ్ లొకేషన్‌లో కలిసి కబుర్లు చెప్పొచ్చు.

కలవటమే అదృష్టం అని అప్పటివరకూ నువ్వనుకొన్న ఒక సీనియర్ డైరెక్టర్ ఇంట్లో, ఆయనతో కలిసి భోజనం చేస్తూ గంటలు గడపొచ్చు.

స్టార్ హోటళ్ళు, ఫ్లైట్ జర్నీలు, కార్లు, లాంగ్ డ్రైవ్‌లు అనేవి... చూస్తుండగా నీకు మామూలయిపోతాయి. నువ్వెన్నడూ  కలలో కూడా ఊహించని ఒక ట్రెండీ బిజినెస్‌ను... సింగిల్‌గా... 24 గంటల్లో నువ్వే ప్రారంభిస్తావు.

నీలో కాన్‌ఫిడెన్సుకి, నీ క్రియేటివిటీకి ఆకాశమే హద్దవుతుంది. నీకే ఆశ్చర్యం వేసేలా, నువ్వేదనుకొంటే అది, ఎప్పుడనుకొంటే అప్పుడు... అన్నీ డెడ్ ఈజీగా చెయ్యగలుగుతుంటావు.

నువ్వూహించని ఎన్నో చిన్న చిన్న అందమైన అనుభవాలను నీ జీవితంలో ప్రతిరోజూ, ప్రతిపూటా... ఆహ్వానిస్తూనే ఉంటావు... నాన్‌స్టాప్‌గా.

స్వర్గం ఎక్కడో లేదు, నీ కళ్లముందే ఉన్నట్టుగా నువ్వు అనుక్షణం ఫీలవుతుంటావు.

సో...

ఆ స్వర్గద్వారాల్ని స్పృశించడానికైనా నువ్వు సినీఫీల్డులోకి వెళ్లితీరాలి.

ఇక్కడ ఫినిషింగ్ టచ్ ఏంటంటే -

ఈ స్టేజికి చేరుకొనే అవకాశం అందరికీ రాదు... అందరికీ సాధ్యంకాదు.

ఫీల్డులోకి ఎంటరయ్యి, అవకాశం అందిపుచ్చుకొన్న ప్రతి 100 మందిలో కేవలం ఒకరిద్దరికి  మాత్రమే సాధ్యమవుతుంది.

ఆ ఇద్దరిలో నేను కూడా ఉంటాను అన్న నమ్మకం నీకున్నట్లైతే... ఆ ఒక్కన్ని నేనే అవుతాను అన్న ఆత్మవిశ్వాసం నీకున్నట్టయితే... ఇంక ఒక్క క్షణం ఆగొద్దు.

ఫీల్డులోకి వెళ్లితీరాలి... దూకేసెయ్యాలి.

అయితే... రెండు తప్పులు మాత్రం చెయ్యొద్దు...

దురదృష్టవశాత్తూ... ఫీల్డులోకి ఎంటరయ్యే 90 శాతం మంది ఆ రెండుతప్పులే చేస్తారు. ఫలితంగా... స్వర్గం ఎప్పుడూ వారికి ఇంచు దూరంలో ఉన్నట్టే ఉంటుంది. ఎన్నేళ్లయినా ఆ ఇంచు అంచును కూడా వారు తాకలేరు!

ఆ రెండు తప్పులేంటన్నది నా తర్వాతి పోస్టులో...       
^^^^^

(Written and posted on 4 April 2020, on my new blog. Re-posted here.)

సినీఫీల్డులోకి ఎందుకు వెళ్లకూడదు?

అంతకుముందు ఎక్కడా ఓడిపోనివాడు ఇక్కడ అట్టర్ ఫ్లాప్ అవుతాడు.

అంతకుముందు జీవితంలో ఎవ్వరిముందూ తలదించుకోనివాడు ఇక్కడ ఎంటరయ్యాక, అదే తలను పాతాళంలోకి పెట్టుకోవల్సిన పరిస్థితుల్ని ఎదుర్కొంటాడు.

అంతకుముందు - తనముందు చేతులు కట్టుకొని నిలబడటానికి కూడా అర్హతలేని అనామక వ్యక్తుల సమక్షంలో ఇక్కడ గంటలు గంటలు గడపాల్సి వస్తుంది. పనికిరాని సొల్లు వినాల్సి వస్తుంది, మాట్లాడాల్సి వస్తుంది... ఇష్టం లేకపోయినా.

అప్పటివరకూ నిన్ను మెచ్చుకొంటూ ఆకాశానికెత్తిన నీ అతి దగ్గరి మిత్రులు, ఆత్మీయులు - అదే నోటితో నువ్వు కలలో కూడా ఊహించని మాటలంటోంటే విధిలేక వినాల్సివస్తుంది... ఇక్కడ ఇరుక్కుపోయిన తర్వాత.

నీ చదువు, సంస్కారం, నీ సిన్సియారిటీ, నీ సెన్సిటివ్‌నెస్, నీలోని మానవత్వం, మంచితనం, నీ నీతి, నిజాయితీలకు ఇక్కడ అస్సలు విలువుండదు. అలా ఉంటుందనుకుంటే... అది నీ మూర్ఖత్వం.

అయితే, సక్సెస్ సాధించి ఒక రేంజ్‌లో ఉన్నవాళ్లలో కూడా దాదాపు చాలామంది ఇలాంటి పరిస్థితుల్నే ఇక్కడ ఎదుర్కోవాల్సిరావడం అత్యంత విషాదకరం... జీర్ణించుకోలేని ఒక వాస్తవం...

డిమాండ్ అండ్ సప్లై తప్ప ఇంకేం లేదు.

ప్రపంచంలో ఎక్కడైనా, ఏ వృత్తివ్యాపారాల్లో అయినా ఇదే మూల సూత్రం కదా పనిచేసేది?

ఖచ్చితంగా అవును.

కాని, ఇది గ్లామర్ ఫీల్డు కాబట్టి ఇక్కడ ఎక్కువగా ఎక్స్‌పోజ్ అవుతుంది. సొషల్‌గా, వ్యక్తిగతంగా ప్రభావం కూడా ఎక్కువే చూపిస్తుంది.

దటీజ్... ది గ్రేట్ సినీ ఫీల్డు!

కట్‌చేస్తే - 

అంత నిరాశపడకండి...

ఇదంతా నాలోని నెగెటివిటీ కాదు. ఫీల్డులోని రియాలిటీ.

బట్... ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే!

నాణేనికి మరోవైపు కూడా ఉంది. అదేంటో నా తర్వాతి పోస్టు: "ఈ ఫీల్డులోకి ఎందుకు వెళ్ళితీరాలి?" లో చూడండి. 
^^^^^

(Written and posted on 3 April 2020, on my new blog. Re-posted here.)

ఇదీ లెక్క!

ఆర్టిస్టుగా కానీ, టెక్నీషియన్‌గా కానీ, ఆఫీస్‌బాయ్‌గా అయినా కానీ...  సినీ ఫీల్డులోకి ఎంటర్ కావాలనుకొనేవారు ముందుగా తెల్సుకోవాల్సిన లెక్క ఒకటుంది.

అదేంటంటే -

ఫీల్డులోకి ప్రవేశించాలనుకొని ఫిలిమ్‌నగర్‌కు వచ్చే ప్రతి 1000 మందిలో కేవలం ఒక 10 మందికి మాత్రమే అవకాశం దొరుకుతుంది.

అదీ ఎంతో కష్టంగా!

ఆ పదిమందిలో కూడా - ఏ ఒక్కరికో ఇద్దరికో మాత్రమే క్లిక్ అయ్యే అవకాశం లభిస్తుంది. వాళ్లే ఫీల్డులో కొద్దిరోజులు నిలబడగలుగుతారు. ఎందుకలా అంటే .. దాని లాజిక్కులు దానికున్నాయి. అదంతా తర్వాత...

మళ్లీ పాయింటుకొస్తే -

సంవత్సరానికి ఎన్ని సినిమాలు తీస్తారు?
వాటిలో కొత్తవాళ్లకు అవకాశం ఇచ్చే సినిమాలు ఎన్నుంటాయి?
ఆ సినిమాల్లో ఎంతమందికని అవకాశం ఇవ్వడం వీలవుతుంది?
అసలు ఒక సినిమాలో ఎంతమంది కొత్తవాళ్లకు అవకాశం ఇవ్వడానికి వీలవుతుంది?
ఎంత ఇన్‌ఫ్లుయెన్స్ చేసినా ఎలా వీలవుతుంది?

పూర్తిగా కొత్తవాళ్లతో తీసే సినిమాకు కూడా ఒక పరిమితి ఉంటుంది కదా?

ప్రతిరోజూ సినిమా ఆఫీసులకొచ్చే వందలమందిలో ఎంతమంది కొత్తవారికి అవకాశం ఇచ్చే వీలుంటుంది?

ఈ లెక్కంతా టాలెంట్‌తో సంబంధం లేకుండా చెప్తున్నది.
టాలెంట్ విషయానికి తర్వాత వద్దాం. ఆ సబ్జక్టు వేరే... డీటెయిల్‌గా డిస్కస్ చెయ్యాల్సిన సబ్జక్టు అది.

ఒక్క టాలీవుడ్‌లోనే కాదు. ఏ వుడ్డులోనయినా ఇదే లెక్క!

ఎవరిలో ఎంత టాలెంట్ ఉందని అనుకున్నా, నిజంగా ఉన్నా .. వాస్తవం మాత్రం ఇదే. ఈ వాస్తవాన్ని ఎదుర్కొనే దమ్మున్నవాళ్లకే సినీఫీల్డు స్వాగతం పలుకుతుంది.

మరి మీలో ఆ దమ్ముందా?!

ఆ దమ్ముందంటేనే ఎక్కడో ఒకచోట చాన్స్ తగుల్తుంది. తర్వాత ఏమవుద్ది అనేది వేరే విషయం... మళ్లీ మాట్లాడుకుందాం.

కట్ టూ సోక్రటీస్ - 

ఈ మహా తత్వవేత్త చెప్పిన ఒక మాట ఈ సందర్భంగా కోట్ చెయ్యాలనిపిస్తోంది:
"నిన్ను నువ్వు తెల్సుకో!"
^^^^^

(Written and posted on 2 April 2020, on my new blog. Re-posted here.)

Age is Just a Number !!

ఈమధ్యే ఒక మోస్ట్ ట్రెండీ సబ్జెక్ట్‌తో "ఓకే బంగారం" తీసి హిట్ చేసి చూపించిన మణిరత్నం వయస్సు 63.

ఇప్పుడు "వెస్ట్ సైడ్ స్టోరీ" చేస్తున్న స్టీవెన్ స్పీల్‌బర్గ్ 73 లో ఉన్నారు.

2025 దాకా "అవతార్" 2, 3, 4 లను ప్లాన్ చేసుకొని, ఆ క్రియేటివ్ బిజీలో మునిగితేలుతూ  ఎంజాయ్ చేస్తున్న జేమ్స్ కెమెరాన్ వయస్సు 65.

రంగీలా, కంపెనీ, సర్కార్ వంటి క్లాసిక్స్‌తో మెప్పించిన మేవరిక్ డైరెక్టర్ ఆర్జీవీ, ఆమధ్య పోర్న్‌స్టార్ మియా మల్కోవాతో "గాడ్, సెక్స్ అండ్ ట్రుత్" కూడా తీశాడు. ఏ కుర్ర డైరెక్టర్ కూడా పెట్టలేని కెమెరా  యాంగిల్స్‌లో షాట్స్ పెడుతూ, ఇప్పుడు "ఎంటర్ ది గాళ్ డ్రాగన్" తీస్తున్నాడు. అతనికిప్పుడు 57.

సో వాట్?!

నాగార్జునకు 60, చిరంజీవికి 64 అంటే ఎవరన్నా నమ్ముతారా? వారి ఫిజికల్ ఫిట్‌నెస్, మెంటల్ ఫిట్‌నెస్ ముందు ఇప్పటి యంగ్ హీరోలు ఎంతమంది పనికొస్తారు?

Age is just a number...

మన ఆలోచనలు, మైండ్‌సెట్ యంగ్‌గా ఉన్నప్పుడు వయస్సు అనేది... జస్ట్ బుల్ షిట్.

నలభై దాటిన డైరెక్టర్స్‌తో నేను పనిచేయను అని ఎవరో యంగ్ హీరో అన్నారంటే నవ్వుకోక ఏం చేస్తాం... "కొంతమంది కుర్రవాళ్లు పుట్టుకతో వృధ్ధులు" అని ఎప్పుడో నిర్ధారించేసిన శ్రీశ్రీని గుర్తుకు తెచ్చుకోవడం తప్ప. 

కట్ చేస్తే - 

పూర్తిగా వరంగల్/వైజాగ్ నేపథ్యంలో నేను ప్లాన్ చేస్తున్న నా కొత్త సినిమా షూటింగ్ షెడ్యూల్ సెట్ అయ్యాక, ఏ ఏప్రిల్ చివర్లోనో నేనీ బ్లాగ్ ప్రారంభిద్దామనుకొన్నాను.

మధ్యలో కరోనా వైరస్ ఎంటరైంది.

"హోమ్ స్టే" లో కావల్సినంత టైమ్, అంతకు మించిన టెన్షన్, కన్‌ఫ్యూజన్... ఇట్లా ఇంకెంత కాలం అని...

వేరే ఏం ఆలోచించకుండా, ఇంటిదగ్గరుండి నేను చేయగలిగిన అన్ని పనులూ ఒకేసారి మొదలెట్టాను. అలా నిన్న రాత్రి అప్పటికప్పుడు క్రియేట్ చేసిన బ్లాగ్ ఇది.

బ్లాగింగ్... నాకో ఎడిక్షన్ లాంటిది.

ఈ బ్లాగ్‌లో నేను రాసే ప్రతి పోస్టు ఒక ప్రాక్టికల్ రియాలిటీ రూపంలో ఉంటుంది. నా అనుభవాలుంటాయి. ఇండస్ట్రీలోని ఇంకెందరివో అనుభవాలుంటాయి.

అవన్నీ కూడా సరదాగా లైటర్‌వీన్‌లో చిన్న చిన్న టిడ్‌బిట్స్ సైజులో రాసేవే.

అయితే - కొత్తగా ఫీల్డులోకి ప్రవేశించేవారికి మాత్రం తప్పక ఉపయోగపడతాయి. అలా ఉపయోగపడాలన్నదే నా ఉద్దేశ్యం.

In times of emotional challenges, how you respond is everything. It not only impacts your personal life, it demonstrates how you show up as a person as well.
^^^^^

(Written and posted on 1 April 2020, on my new blog. Re-posted here.)

17 March 2020, at 3:42 PM | Facebook

"నలభైయేళ్లు దాటిన దర్శకుడి తో పని చేయనండి... కాబట్టి మీ కథ కూడా వినను... సారీ..."
- ఒక  హీరో

"కథ బావుంది, కానీ డైలాగ్ వెర్షన్ వినకుండా డెసిషన్ చెప్పను. ఇంకో మూడు నెలలాగి స్క్రిప్ట్ పూర్తిగా అయ్యాక చూద్దాం..."
-ఇంకో  హీరో

"హీరోయిన్ నచ్చలేదు, ఆమెని చూస్తే ప్రేమించాలనిపించట్లేదు. సో, సినిమా వదిలేసుకుంటాను..."
-మరో  హీరో

"రెమ్యునరేషన్ ముప్ఫై ఐదు లక్షలు ఇస్తే గానీ చేయను..."
-వేరే హీరో

"రెమ్యునరేషన్ పదిహేను లక్షలు, కారవాన్ కంపల్సరీ, మేనేజర్ కి కమీషన్, హీరోయిన్ గా పెద్ద పేరున్న హిందీ అమ్మాయి ఉంటే , కథ కూడా వినను..."
- ఓ హీరో

"ఫలానా హీరో అయితే నేను చేయను..."
- ఓ హీరోయిన్

"స్టార్ హీరో కాకపోతే నేను చేయను..."
- ఇంకో  హీరోయిన్

"ఇంత యంగ్ స్టోరీని ఇంత సీనియర్ డైరెక్టర్ హ్యాండిల్ చేయలేరు.సో,నేను చేయను..."
- వేరే  హీరోయిన్

"మనసంతా నువ్వే రోజులు కావండి... ఇప్పుడు ఈయన డైరెక్షన్ లో సినిమా ఎందుకు..."
- నిర్మాత కి  ఒక  సినీ  ప్రముఖుడి సలహా

"అసలు  మీతో  సినిమా తీయడానికి ఇప్పుడు నిర్మాతలు, ఆర్టిస్టులు ఎందుకొస్తారు. హ్యాపీగా కథలు వింటూ శాలరీ తీస్కోండి... డైరెక్షన్ గురించి ఆలోచించకండి..."
- నాకింకో  సినీ ప్రముఖుడి క్లాసు.

అన్నీ అయ్యాయి...

" సమాధానం " కూడా ఇప్పుడు రెడీ అయ్యింది...
--------
" వాళ్ళిద్దరి మధ్య..."
#LOMA

ధైర్యంగా నిలబడిన కొత్త నిర్మాత అర్జున్ దాస్యన్ గారికి, నమ్మి చేసిన హీరో విరాజ్ అశ్విన్ కి,
కొత్త హీరోయిన్ నేహా కృష్ణ కి,
వెన్నుదన్నుగా నిలచిన ప్రసాద్ ల్యాబ్ అధినేత రమేష్ ప్రసాద్ గారికి, రాజ్ మాదిరాజు గారికి,
స్క్రీన్ ప్లే రైటర్ సత్యానంద్ గారికి, మాటల రచయిత వెంకట్.డి.పతికి, సంగీత దర్శకురాలు మధుస్రవంతి గారికి, మొదట మొహమాటపడినా, రాను రాను అద్భుతంగా పాత్ర పోషించిన వెంకట్ సిద్ధారెడ్డి గారికి, అగ్రజులు సాయి శ్రీనివాస్ వడ్లమాని గారికి, మిత్రులు శ్రీకాంత్ అయ్యంగార్ కి, పనిచేసిన అందరు నటీనటులకి, సాంకేతిక నిపుణులకి... అందరికీ పేరుపేరునా శత సహస్ర వందనాలు... 🙏❤🙏

కట్ చేస్తే - 

పైన మీరు చదివిందంతా మొన్న మార్చి 17 నాడు, వి.ఎన్. ఆదిత్య తన ఫేస్‌బుక్ టైమ్‌లైన్ మీద పెట్టిన పోస్టు.

ఎలాంటి ఎడిట్స్ లేకుండా, జస్ట్ కాపీ పేస్ట్ చేశానిక్కడ.

వి.ఎన్. ఆదిత్య మంచి సత్తా ఉన్న దర్శకుడే కాదు, మంచి రచయిత కూడా.

సౌమ్యుడు, స్నేహశీలి. ఎప్పుడు కలిసినా ఎలాంటి 'ఈగో'లేని చిరునవ్వుతో కూడిన పలకరింపు ఆయన ట్రేడ్‌మార్కు.

దర్శకుడిగా తన మొదటి సినిమా "మనసంతా నువ్వే" ఒక సూపర్ హిట్. స్టార్ హీరో నాగార్జునతో కూడా "నేనున్నాను", "బాస్" వంటి సూపర్ హిట్స్ ఇచ్చారు.

ఇప్పటివరకు సుమారు ఓ పది సినిమాలు తీశారు.

ఈమధ్యే అమెరికా వెళ్లి, అక్కడ "Forced Orphans" అనే ఇంగ్లిష్ సినిమా కూడా ఒకటి తీశారు. ఆ సినిమాకు అంతర్జాతీయ పురస్కారాలు కూడా వచ్చాయి.

ఈమధ్య హిట్స్ లేవు. కొంత గ్యాప్ వచ్చింది.

హాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా ఏ దర్శకునికయినా ఇది మామూలు విషయమే.

కట్ చేస్తే -

ఇండస్ట్రీలో వి.ఎన్. ఆదిత్య ఎదుర్కొన్న అనుభవాలు ఎలా ఉన్నాయో పైన తన పోస్టులో చదివారుగా...

అలాగని డిజప్పాయింటయ్యారా?

నో...

రెట్టించిన ఉత్సాహంతో తాజాగా ఈతరం లవ్‌స్టోరీ "వాళ్ళిద్దరి మధ్య" ఈమధ్యే పూర్తిచేశారు.

ఈ సినిమా హిట్ అవుతుందన్న నమ్మకం వారికుంది. అవ్వాలని నేను మన్స్పూర్తిగా కోరుకొంటున్నాను. అయితే, జయాపజయాలతో సంబంధంలేకుండా... దర్శకునిగా వి.ఎన్. ఆదిత్య ఇంకెన్నో సినిమాలు చేస్తారు. చేస్తూనే ఉంటారు...
^^^^^

(Written and posted on 31 March 2020, on my new blog. Re-posted here.)