Tuesday 30 June 2020

ఒకే ఒక్కడు 2.0

కరోనాను, లాక్‌డౌన్ టైమ్‌ను ఆర్జీవీ వాడుకున్నంతగా ఎవరూ వాడుకొని ఉండరు అనుకున్నాను మొన్నటివరకూ.

కాని ఆయన తర్వాత ఇంకొకరు కూడా లైన్లో ఉన్నారని మొన్ననే అర్థమైంది.

ప్రొడ్యూసర్‌గా ఇప్పటికే 98 సినిమాలు పూర్తిచేసి, 99 వ సినిమా మీద పనిచేస్తూ, 100 వ సినిమా అనౌన్స్‌మెంట్ గురించి సన్నాహాల్లో ఉన్నాడీయన.

100 వ సినిమా అయితే ది గ్రేట్ రాఘవేంద్రరావుగారితో కావచ్చు. లేదంటే, ఆర్జీవీతో కావచ్చు. ఏదైనా జులైలో అనౌన్స్‌మెంట్ ఉంటుంది.

ప్రపంచపు మొట్టమొదటి ATT (Any Time Theater) ShreyasET పుట్టడానికి కారణమైన ఆర్జీవీ... అదే ప్లాట్‌ఫామ్ మీద RGVWorld.in అని తన సినిమాల సూపర్ మార్కెట్ ఓపెన్ చేసి, ఒక్కో సినిమా రిలీజ్ చేసి, కోట్లు కొల్లగొడుతున్న విషయం మనమందరం చూస్తున్నాం.

ఈయన ఇంకో అడుగు ముందుకేసి, అదే ATT మీద తన షాప్ కూడా ఓపెన్ చేసి, ప్రతి శుక్రవారం ఒక సినిమా రిలీజ్ చేసే పనిలో ఉన్నాడు!

ఇది కామెడీ కాదు. చెప్పింది చేసి చూపించగలడీయన. ఆ సత్తా ఉంది కాబట్టే "మా బాస్" అని ఆయన చెప్పుకొనే ఆర్జీవీతో సినిమాలు తీయగలుగుతున్నాడు. ఇప్పుడు తన 100 సినిమాల మైలురాయిని తాకబోతున్నాడు.

ఈ ఉత్సాహ శిఖరం పేరు తుమ్మలపల్లి రామసత్యనారాయణ. భీమవరం టాకీస్ ఈయన బ్యానర్.

కట్ చేస్తే - 

కొంతమందితో కలిసినా, మాట్లాడినా ఉత్సాహం వస్తుంది. కొంతమందితో ఏం రాకపోయినా ఫరవాలేదు కాని, ఎక్కడో అడుక్కివెళ్లిపోతాం.

మొన్న రాత్రి రామసత్యనారాయణ గారితో సుమారు ఒక 50 నిమిషాలు మాట్లాడాను. మాట్లాడినంతసేపూ అంతులేని ఉత్సాహం.

ఒకవైపు ఇండస్ట్రీలో అతిరథమహారథులనుకొనేవాళ్లంతా ఏం చెయ్యాలా అని తర్జనభర్జనలు పడుతుంటే, తన బాస్ ఆర్జీవీతో పోటీపడుతూ, సినిమాలమీద సినిమాలు ప్లాన్ చేస్తూ, మంచి బిజీలో ఉన్నాడు రామసత్యనారాయణ.


"OTT/ATT మంచి మోకా... బాగా ఉపయోగించుకొందాం" అని నేను కూడా ఓ పక్క 'సీరీస్ ఆఫ్ సినిమాలు' ప్లాన్ చేస్తూ ఎంత ముందుకెళ్తున్నా, నా టీమ్‌లోని ముఖ్యులు కొందరు చేతకాని ముసలివాళ్లకన్నా అధ్వాన్నంగా ఇంచ్ కదలనివ్వట్లేదు, నన్ను ఇంకా వెనక్కిలాగుతున్నారు! అది వేరే విషయం...

కట్ బ్యాక్ టూ రామసత్యనారాయణ -  

ఆర్ట్ ఈజ్ ఆర్ట్. అందులో ఎవరి స్టయిల్ వారిది. ఎవరి శైలి వారిది. ఎవరి టాలెంట్ వారిది.  అంతవరకు ఓకే. కాని, కోట్లు పెట్టి సినిమా తీసేది కోట్లు సంపాదించడానికే తప్ప అదేదో "కళామతల్లి" సేవకోసం అనడం కంటే పెద్ద జోక్ ఇంకోటి ఉండదు. రామసత్యనారాయణ ఈ విషయంలో కుండలు కొట్టేసినట్తు చెప్తాడు.

సినిమా అయినా, యాడ్స్ అయినా, ఫ్రీలాన్స్ రైటింగ్ అయినా, ఇంకేదయినా... ముందు బ్రతకడానికే. సంపాదనకే. కళామతల్లి వంటి మాటలన్నీ జస్ట్ మైక్ ముందు మాట్లాడే మాటలు. 

2020 అయిపోయేవరకు థియేటర్స్ తెరిచే విషయం మర్చిపోవాల్సిందే. ఈలోపు పీవీఆర్ వంటి మల్టీప్లెక్స్‌లు తెరచినా అంత ప్రయోజనం ఉండదు. లాక్‌డౌన్ తర్వాత మళ్ళీ అంతా నార్మల్‌కు వచ్చ్చేవరకూ బడ్జెట్లు తగ్గించుకొని సినిమాలు చేసుకోవడం, ఇప్పుడు అందుబాటులో ఉన్న ఏటీటీ ప్లాట్‌ఫామ్స్ ఉపయోగించుకోంటూ "Pay Per View" పధ్ధతిలో బిజినెస్ చేసుకోవడం తప్ప ఇప్పటికయితే వేరే దారి లేదు అంటాడు సత్యనారాయణ.

అలాగని ఎవ్వరూ నిరాశపడాల్సిన అవసరం లేదు. థియేటర్స్ మాత్రమే ఉండి శాటిలైట్ రైట్స్ లేనప్పుడు సినిమాలున్నాయి. శాటిలైట్ రైట్స్ వచ్చాక సినిమాలున్నాయి. శాటిలైట్ రైట్స్ పోయాక కూడా సినిమాలున్నాయి. ఇప్పుడు ఓటీటీ, ఏటీటీ ప్లాట్‌ఫామ్స్ మాత్రమే ఉన్న సమయంలో కూడా సినిమాలున్నాయి. రేపు కరోనా సమస్యను అధిగమించిన తర్వాత కుడా ఫీల్డులో ఇంకేవేవో కొత్త అడ్వాన్స్‌మెంట్స్ వస్తాయి. అప్పుడు కూడా సినిమాలుంటాయి, సినిమా బిజినెస్ ఉంటుంది. జాగ్రత్తగా మార్కెట్‌కు స్టడీచేసి, బిజినెస్ చేసుకోవడమే మన బాధ్యత అంటాడు సత్యనారాయణ.

సినిమా ఒక బిజినెస్‌గా క్రిస్టల్ క్లియర్ క్లారిటీ ఉన్న రామసత్యనారాయణ తనదైన స్పీడ్‌లో ఇంకో 100 సినిమాలు కూడా ఈజీగా నిర్మించగలడని నా నమ్మకం.

ఆర్జీవీతో ఐస్‌క్రీమ్, ఐస్‌క్రీమ్ 2 సినిమాల్ని ప్రొడ్యూస్ చేసిన రామసత్యనారాయణ, ప్రస్తుతం ఐస్‌క్రీమ్ 3, 4, 5, 6 ... సినిమాల సీరీస్ చేసే సన్నాహాల్లో కూడా ఉన్నాడు!

రామసత్యనారాయణ Really Rocks... 

Monday 29 June 2020

మిస్టర్ ఎక్స్


నేను కథలు రాయడం మర్చిపోయి చాలా ఏళ్లయింది. ఎన్నేళ్లయిందో కూడా నాకు సరిగ్గా గుర్తుకు రావడం లేదు.

'కోణార్కలో కదిలిన శిల్పం'... నేను రాసిన చివరి కథ అని మాత్రం నాకు గుర్తుంది. 'వార్త ' ఆదివారం అనుబంధంలో అచ్చయిన ఈ కథ తర్వాత, నేనీ మధ్య అసలు కథలే రాయలేదు. కారణం ప్రత్యేకంగా ఏమీలేదు.

నగరజీవితపు అంతులేని అగమ్యాల వెంట అడుగులేసుకొంటూ వెదికితే వెయ్యి కారణాలు దొరుకుతాయి. కాని, వాటి గురించి ఇప్పుడు నేనాలోచించటం లేదు. 

ఇప్పుడు నేను ఆలోచిస్తున్నది... ఈ ప్రపంచంలోనే నాకత్యంత ప్రీతిపాత్రుడయిన నా మిత్రుడు, నా ఆత్మ గురించి.

పేరు 'మిస్టర్ ఎక్స్' అనుకుందాం.

ఈ క్షణం నేను వాడిగురించే ఆలోచిస్తున్నాను...

నలభై వేల సంవత్సరాల ఘన చరిత్ర రాసుకొన్న మనిషి నాగరికతను, శాస్త్రసాంకేతిక రంగాల్లో అతడు సాధించాననుకొన్న ఎన్నో విజయాలను పరిహసిస్తూ, కనీసం కంటికి కనిపించే రూపం కూడా లేని ఒకానొక  వైరస్ విసిరిన ఛాలెంజ్‌కు ప్రపంచం మొత్తం లిటరల్లీ అన్నీ మూసేసుకొని అల్లల్లాడుతున్న వేళ...

గత కొన్నిరోజులుగా నేనసలు రాత్రిళ్ళు పూర్తిగా నిద్రపోవటంలేదు. నాకిష్టమైన పుస్తకాలు చదువుతున్నాను. లాక్‌డౌన్ తర్వాత ఒక్క నిమిషం కూడా వృధా కాకుండా ఏం చేయాలో, ఎంత తొందరగా నేను కోరుకొన్న ఫ్రీడమ్ సాధించుకోవాలో జాగ్రత్తగా ప్లాన్ చేసుకొంటున్నాను. ఎప్పుడైనా మరీ టెన్షన్‌గా అనిపించినప్పుడు, సోషల్ మీడియాలో ఏదో ఒక నాన్సెన్స్ పోస్ట్ చేస్తూ రిలాక్స్ అవుతున్నాను.

పగలు కూడా ఎప్పుడు నిద్రపోతున్నానో, ఎప్పుడు తింటున్నానో కూడా నాకసలు గుర్తుండటం లేదు. కొన్ని కొన్నిసార్లు అది రాత్రో పగలో కూడా నాకు వెంటనే తెలియటం లేదు.

బాగా ఆలోచిస్తే, నిజంగానే  గుండె ఆగిపోయే ఇలాంటి పరిస్థితుల్లో... ఉన్నట్టుండి నిన్న అర్థరాత్రి తర్వాత మిస్టర్ ఎక్స్ నాకు కాల్ చేశాడు.

"ఏంటి విషయం!?" కంగారుగా అడిగాను.

"నువ్వు అర్జంట్‌గా ఒక కథ రాయాలి" అన్నాడు మిస్టర్ ఎక్స్.

"ప్రొడ్యూసర్ దొరికాడా?" ఆశ్చర్యంగా అడిగాను.

"సినిమా కథలు కావాలంటే నేనే నీకు వారానికో స్క్రిప్టిస్తా! ఏముంది... ఓ రెండు కొరియన్ సినిమాలు, రెండు స్పానిష్ సినిమాలు చూస్తే చాలు. అంత ఓపిక లేకపోతే, ఫ్లాపయిన రెండు హిందీ సినిమాలు చూడు"

తను ఏం చెబుతున్నాడో నేను వినటంలేదు. 

"నీకు చదవటం బాగా అలవాటు కదా... లత సాహిత్యం చదువు, సులోచనారాణి నవళ్లు చదువు...కావల్సినన్ని ట్రెండీ స్క్రిప్టులు రాసుకోవచ్చు"

నేను వినటంలేదు. మిస్టర్ ఎక్స్ గురించే ఆలోచిస్తున్నాను... 

ఇంత రాత్రప్పుడు కాల్ చేసి, ఇలాంటి సెటైర్లు వేసే అంత టైమ్ లేదు వాడికి. పైగా వాడిప్పుడున్న మానసిక పరిస్థితి నాకు బాగా తెలుసు.  మరెందుకు కాల్ చేసాడు?  

"విషయం చెప్పు" అన్నాన్నేను.

"చెప్పాగా... నువ్వు వెంటనే ఒక కథ రాయాలి"

"ఏం కథ?"

"మా కథే"

నేను ఏం మాట్లాడకుండా అలా వింటుండిపోయాను. 

"తను ఇప్పుడెలా ఉందో  నాకు తెలియదు. తెలుసుకొనే అవకాశం కూడా లేకుండా చేసింది. నానా రిస్ట్రిక్షన్స్‌తో నన్ను కట్టిపడేసింది. ఫోన్ కూడా చేయొద్దంది"  

ఇంకా అలాగే ఏం మాట్లాడకుండా వింటున్నాను. 

"తనకు అవసరం లేకపోవచ్చు... కాని, తన గురించి ఇప్పుడు... ఈ క్షణం... నేనెలా ఫీలవుతున్నానో, ఎంత బాధపడుతున్నానో తనకు తెలిస్తే బాగుండు అనుకొంటున్నాను"

నేనేం మాట్లాళ్లేదు. 

"వద్దు అని... తను అంతలా ఫిక్స్ అయిపోయింతర్వాత నేనిలా మళ్ళీ తనని ఇబ్బంది పెట్టడం కరెక్టు కాదు. నాకు తెలుసు. కాని... మా ప్రేమకు బ్రేకప్ ఏంట్రా?!... నేనా ఆలోచననే తట్టుకోలేకపోతున్నాను"

ఫోన్ పెట్టేశాడు మిస్టర్ ఎక్స్.

'మా ప్రేమ’ అన్న మాటను వాడు ఎంత స్ట్రెస్ చేస్తూ అన్నాడో నాకు బాగా అర్థమయింది. ఈ రొటీన్ కోపతాపాలు, ఈగోలు, మిస్అండర్‌స్టాండింగ్స్ వంటి అర్థంలేని కారణాలన్నిటికీ అతీతమైంది వారి ప్రేమ అని వాడి ఉద్దేశ్యం.

ప్రపంచంతో సంబంధం లేని రిలేషన్‌షిప్ అది. ప్రపంచాన్ని పట్టించుకోని రిలేషన్‌షిప్ అది. 

అవును మరి... సమాజంలోని సోకాల్డ్ కట్టుబాట్లను బ్రేక్ చేస్తూ వాళ్లు సృష్టించుకొన్న బంధానికి కొత్తగా మళ్ళీ బ్రేకప్ అనేది నిజంగా అర్థంలేనిది. 

నెమ్మదిగా లేచి నా గదిలోంచి బయటకొచ్చాను. హాల్లో నడుస్తూ, వాల్‌క్లాక్ వైపు చూశాను. అర్థరాత్రిదాటి యాభై నిమిషాలవుతోంది.

మెయిన్ డోర్ తీసుకొని, బయట కారిడార్ చివరిదాకా నడిచాను.

ఎదురుగా చెట్లు, నిర్మానుష్యమైన రోడ్లు, లైట్‌పోల్స్‌తో ... సుమారు ఒక నాలుగు వందల ఫ్లాట్లు, ఇండిపెండెంట్  విల్లాలున్న మా గేటెడ్ కమ్యూనిటీ ఆ క్షణం నాకు కొత్తగా కనిపించసాగింది.

నేను నిల్చుని ఉన్న రెండో ఫ్లోర్ నుంచి, నియాన్ లైట్ల వెలుగులో మెరుస్తూ,  నా ఎదురుగా కనిపిస్తున్న మా కమ్యూనిటీ క్లబ్ రోడ్దుమీద, ఉన్నట్టుండి ఒక జంట నడుస్తూ కనిపించింది. 

చేతులు గట్టిగా పట్టుకొని, ఒకరిమీదకు ఒకరు మైకంగా వాలిపోయి, 'చుట్టూ ఉన్న మీ ప్రపంచంతో మాకేం పని... మేమే మా ప్రపంచం' అన్నట్టుగా నడుస్తున్న ఆ జంట మరెవరో కాదు - మిస్టర్ ఎక్స్, అతని ప్రేయసి లాలస. 

ఒక్కసారిగా తలవిదిలించి చూశాను. 

నేననుకున్నది భ్రమ. వాళ్లు మిస్టర్ ఎక్స్, లాలస  కాదు. ఎవరో పక్క బ్లాక్‌లో జంట.

వెంటనే లోపలికి వెళ్ళి, నా గది తలుపు వేసేసుకున్నాను. నా లాపీ తెరిచి, టైప్ చేయడం ప్రారంభించాను.

మిస్టర్ ఎక్స్...

***

మిస్టర్ ఎక్స్ ఒక విచిత్రమైన వ్యక్తి.

వరంగల్ ఏవీవీ హైస్కూల్లో నా తొమ్మిదో తరగతి అయిపోయాక వచ్చిన వేసవి సెలవుల్లో, ఉర్సు బొడ్రాయిలో ఉన్న విజ్ఞానమందిర్ గ్రంథాలయంలో నాకు మెంబర్‌షిప్ ఇప్పించి, నా చేత విశ్వనాథ వేయిపడగలు చదివించాడు. ఆర్కే నారాయణ్ గైడ్ చదివించాడు. వట్టికోట ఆళ్వారుస్వామి ప్రజలమనిషి చదివించాడు. దాశరథి రంగాచార్య చిల్లరదేవుళ్ళు చదివించాడు.

అలా హైస్కూలురోజులనుంచే  ప్రారంభమయిన మా సాహితీ ప్రయాణం... బుచ్చిబాబు చివరకు మిగిలేది, చలం సాహిత్యం, తిలక్ కవిత్వం, సృజన, అరుణతార పత్రికల్లో ఎరుపు సాహిత్యం మీదుగా... రమణి, రసికప్రియ, కాగడా, విజయచిత్ర, ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ, స్క్రీన్ పత్రికల్లో మునిగితేల్తూ... లత, రంగనాయకమ్మ, యధ్ధనపూడి సులోచనారాణి, మాదిరెడ్డి సులోచన, కొమ్మూరి వేణుగోపాలరావు, మధుబాబు, విశ్వప్రసాద్‌, తాపీ ధర్మారావుల దగ్గర మలుపు తీసుకొని... పావ్‌లో కోయిల్యూ, జెఫ్రీ ఆర్చర్, గోర్కీ, పవుస్తోవ్‌స్కీ, మార్క్ ట్వేన్, బెర్నార్డ్ షా, ఆల్బర్ట్ కామస్, నీషే, ఐన్ రాండ్, సాల్మన్ రష్దీ, రాబిన్ శర్మ, శోభా డే, అరుంధతీ రాయ్, డాన్ బ్రౌన్, టిమ్ ఫెర్రిస్, జేమ్స్ ఆల్టుచర్ దాకా ఇంకా కొనసాగుతూనే ఉంది... 

ఒక్కోసారి ఆలోచిస్తే నాకే విచిత్రంగా అనిపిస్తుంది, పుస్తక పఠనంలో ఇంత క్రమం తప్పిన... ఇంత వైరుధ్యమయమైన ఇష్టాలేంటా అని!

అసలు జీవితమే వైరుధ్యాలమయం అంటాడు మిస్టర్ ఎక్స్.

"చుట్టూ ఒక గీత గీసుకొని, ఆ గీత లోపలే బ్రతికితే అది జీవితమెట్లా అవుతుంది... జైలు అవుతుంది. మనం జైల్లో బ్రతకడానికా పుట్టింది?... జీవితం ఒక్కటే. దాన్నొక రొటీన్‌లా  జీవించకూడదు. నిత్యం ఒక పండగలా సెలబ్రేట్ చేసుకోవాలి" అంటాడు మిస్టర్ ఎక్స్.

అలాంటి మిస్టర్ ఎక్స్ జీవితంలో ఒక పక్క సెలబ్రేషన్, మరో పక్క అంతులేని వైరుధ్యాల వ్యధాగాథ... ఈ రెండూ ఎన్నటికీ కలవని రైలు పట్టాల్లా నడుస్తున్న సమయంలో... ఓ నాలుగేళ్లక్రితం... అతను కలలో కూడా ఎన్నడూ చూడనంత అందంగా, అసలతని ఊహకే అందని ఒక ఇంద్రధనుస్సు వంపులా, లాలస రూపంలో ఒక మెరుపు మెరిసింది.

దాదాపు పాతికేళ్లక్రితం మిస్టర్ ఎక్స్, లాలస హైద్రాబాద్‌లో ఒకే క్యాంపస్‌లో చదువుకొన్నారు. అప్పుడు ఒకరికొకరు పెద్దగా తెలియదు.

అనుకోకుండా నాలుగేళ్లక్రితం  ఇద్దరూ వైజాగ్‌లోని ఆర్కే బీచ్ కాఫీడేలో కలిశారు. "ఎ లాట్ కెన్ హాపెన్ ఓవర్ కాఫీ" అన్న ట్యాగ్‌లైన్ వీరిద్దరి విషయంలో నిజమైంది. ఉదయం 11 నుంచి, సాయంత్రం 7 వరకు... అదే కాఫీడేలో, అదే ఆర్కే బీచ్ చుట్టుపక్కలున్న రోడ్లలో ఏం మాట్లాడుకొన్నారో, ఎంత తిరిగారో... వారికే తెలీనంత వేగంగా సమయం గడిచిపోయింది. 

వాళ్లిద్దరూ ఇప్పుడిప్పుడే బీటెక్ పూర్తిచేసుకొని, ఏ సాఫ్ట్‌వేర్  ఉద్యోగాలో చేస్తూ యవ్వనం ఉరకలేస్తున్న యంగ్‌తరంగ్ ఇన్స్‌టాగ్రామర్లు కాదు. ఇల్లాజికల్ ఇన్‌ఫాచువేషన్ మోహాల్నీ, రోటీన్ ఆపోజిట్ సెక్స్ అట్రాక్షన్ కాంక్షల్నీ వాళ్లు దాటేసి కూడా చాలాకాలమయింది.

ఇద్దరూ జీవితంలో అన్నీ చూశారు. ఎవరి జీవితం వారికుంది.

కాని, అదే జీవితంలో ఇద్దరూ మిస్ అయిన ఒక ఆనందం ఏదో... ఆ ఉదయం, ఆర్కే బీచ్‌లో ఉన్న కాఫీడేలో, ఆ రూపంలో దొరుకుతుందని మాత్రం వాళ్లెప్పుడూ అనుకోలేదు.

వారం తర్వాత ఇద్దరూ పాండిచ్చేరిలోని ఆరోవిల్ టౌన్‌షిప్‌లో, ప్రకృతి మధ్యలో, నిశ్శబ్దం తప్ప వేరొకటి వినిపించని ఒక గెస్ట్ హౌజ్‌లో ఉన్నారు.

"అసలిన్నాళ్లు ఎక్కడున్నావ్ నువ్వు? "  చేత్తో మిస్టర్ ఎక్స్ జుట్టులాగుతూ  అడిగింది లాలస.

"నువ్వెక్కడున్నావా అని వెతుకుతున్నాను" లాలస బుగ్గలమీది గులాబిరంగులో తన శ్వాసను కలిపి ఆడుకొంటూ చెప్పాడు మిస్టర్ ఎక్స్.

నెమ్మదిగా ఆమె ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకొని, ఆమె పెదాలమీద తన పెదాలుంచాడు మిస్టర్ ఎక్స్. తర్వాత వాళ్లిద్దరి ప్రమేయం లేకుండానే ఆ నాలుగు పెదాలు తడితడిగా తనివితీరా తనువులంతా ఆడుకొని విడిపోయాయి. 

"దీనికోసమేనా?" గుసగుసగా అడిగింది లాలస.

తల అడ్డంగా ఊపుతూ ఆమెను మరింత దగ్గరగా తీసుకొని ఊపిరాడకుండా హత్తుకొన్నాడు మిస్టర్ ఎక్స్.

తర్వాత ఎవరు ఏం చేస్తున్నారో తెలియకుండా మంచం అంతా దొర్లుతూ ఒకరినొకరు అళ్ళుకుపోయి ఆడుకున్నారు. ఎలాంటి ఇన్‌హిబిషన్స్ లేకుండా, అణువణువు స్పర్శించుకొంటూ, అప్పటిదాకా ఎప్పుడూ చూడని కొత్త కోణాల్ని అన్వేషిస్తూ, అంతిమంగా వాళ్లిద్దరూ సృష్టించిన సునామీకి ఆ గదిలో ఉన్న ఏసీకి కూడా చమటలు పట్టాయి.

అలసి సొలసి ఆఛ్ఛాదన లేకుండా ఒక్కటిగానే సేదదీరుతున్న తడి తనువుల్ని తెల్లటి బెడ్‌షీట్‌తో కోన్ ఐస్‌క్రీమ్‌లా కప్పుకొని పడుకొన్నారిద్దరూ. 

"దీనికోసమేనా?" అతని చెంపమీద తన చెంప పెట్టి అలవోగ్గా రాస్తూ మళ్ళీ అడిగింది లాలస.

"దీనితో కూడిన నీకోసం... నీతో వచ్చే ఆనందం కోసం" చెప్పాడు మిస్టర్ ఎక్స్.

"నాకు కొంచెం అర్థమయ్యేట్టు చెప్పు బుజ్జూ" తెల్లని బెడ్‌షీట్ కింద, అతనిమీదకి పాములా కదులుతూ అంది లాలస.   

"పాదాల నుంచి పెదాలదాకా నీ ఈ స్పర్శ చాలు నాకు. అర్థాలు కావాలంటే నువ్వే వెతుక్కో" 

తన పెదాలకు దగ్గరే ఉన్న ఆమె పెదాలను ఊపిరాడనివ్వని ముద్దుతోనే మొత్తంగా మూసేస్తూ, లాలసను మరింక మాట్లాడనీయలేదు మిస్టర్ ఎక్స్.

పెదాల పరిధులు దాటి, నాలుకలతో మెళికలు వేసుకొంటూ, శ్వాసలకు కూడా ఊపిరాడనివ్వని స్థాయిలో ఒక ధ్యానంలా ముద్దుల్లో మునిగితేలారిద్దరూ. 

"ఇదంతా ప్రేమే?" అతని కళ్లల్లోకి చూస్తూ అడిగింది లాలస.

"కాదు ప్రాణం" రెప్పవేయకుండా ఆమె కళ్లల్లోకే చూస్తూ చిరునవ్వుతో చెప్పాడు మిస్టర్ ఎక్స్. 

ఏం మాట్లాడకుండా అలలా అతన్ని కప్పేస్తూ అళ్లుకుపోయింది లాలస. 

ఇంకోసారి వాళ్లిద్దరూ హైద్రాబాద్‌లో కలుసుకున్నప్పుడు... కొత్తగా పెళ్లయిన జంటలా చేయీ చేయీ కలిపి ఊపుకొంటూ, ఓయూ క్యాంపస్ రోడ్లన్నీ బాగా తిరిగారు. 

పాతికేళ్లక్రితం అదే క్యాంపస్‌లో ఉన్నప్పుడు వాళ్లిద్దరిమధ్య ముఖపరిచయం తప్ప మరింకేంలేదు. లాలస క్యాంపస్‌లో ఉన్న ఆ రెండేళ్లలో బహుశా ఒక నాలుగుసార్లు "హాయ్" చెప్పుకుని ఉంటారు. అంతే. 

ఇద్దరిమధ్యా అప్పుడు మెరవని చెకుముకి ఇప్పుడు రగిలింది. 

ఇద్దరికీ అదే ఆశ్చర్యం ఇప్పటికీ.  

ఆర్ట్స్ కాలేజి లోపలికివెళ్లి అంతకుముందు రష్యన్ డిపార్ట్‌మెంట్ ఉన్నచోట ఆగారిద్దరూ. 

"నీ ఫేవరేట్ ప్లేస్ కదా బుజ్జూ?" మిస్టర్ ఎక్స్ చేయి పట్టుకొని గట్టిగా నొక్కుతూ అంది లాలస. 

"అవును. ఆర్ట్స్‌కాలేజ్‌లో నేను చదివిన రెండు పీజీలకంటే రష్యన్ డిప్లొమానే నాకు బాగా కిక్ ఇచ్చింది" ఉత్సాహంగా చెప్పాడతను.

"కిక్ ఇచ్చింది డిప్లొమానా... అమ్మాయిలా?" కన్నుగీటుతూ అడిగింది లాలస. 

నవ్వుకొంటూ ఇద్దరూ పై ఫ్లోర్ ఎక్కి, ఎదురుగా ఉన్న మెట్లమీద కూర్చున్నారు. 

ఆర్ట్స్‌కాలేజి బిల్డింగ్ లోపల అంతకుముందెప్పుడో పాతికేళ్లక్రితం కూర్చున్న ప్లేస్‌లో కూర్చుని,  చుట్టూరా అలా చూస్తుంటే, ఇద్దరిలోనూ ఒక్కసారిగా పాతికేళ్లు వెనక్కి వెళ్ళిన ఫీలింగ్.   

తనకి దగ్గరగా ఆనుకొని కూర్చున్న లాలసవైపు చూశాడు మిస్టర్ ఎక్స్. లాలస అతనివైపే చూస్తోంది. 

"బుజ్జీ... నీకేం భయంలేదా?" అడిగాడతను. 

"భయమా... ఎందుకు?" ఏమీ అర్థంకానట్టు అడిగింది లాలస. 

"మనిద్దరం ఇంత బాహాటంగా... ఇలా కలిసి తిరుగుతున్నాం..." 

"మనకిష్టమైన పని చేస్తున్నాం. దానికి భయమెందుకు?"  

"ఎవరైనా చూస్తే?" 

"ఇదుగో ఇక్కడ మన ఎదురుగా ఇంతమంది మనల్ని చూస్తున్నారు. ఇంకెవరు చూడాలి? ఇంకెందుకు భయం?" ఏమీ తెలియనట్టు అడిగింది లాలస. 

"చూడకూడనివాళ్లు చూస్తే!?" లాలస కళ్ళల్లోకి నేరుగా చూస్తూ అడిగాడు మిస్టర్ ఎక్స్.

"ఏమవుతుంది... ‘ఐన్ రాండ్ ఎపిసోడ్ 2' రీప్లే అవుతుంది! మా 'ఫ్రాంకో కానర్' ‌కి నేనే చెప్తాను. ఇతను నా ప్రియుడు.... మేం వీలున్నప్పుడల్లా కలుసుకొంటున్నాం. ఇతనితో గడిపే ప్రతిక్షణం నాకిష్టం. ఇందులో మార్పుండదు. ఇది తప్ప ఇంకో విషయం ఏదైనా ఉంటే మాట్లాడమంటాను"   

ఎలాంటి తొణుకూ బెణుకూ లేకుండా మాట్లాడుతున్న లాలస గులాబిరంగు పెదాలవైపే చూస్తున్నాడు మిస్టర్ ఎక్స్. ఆమె చెప్పేదేంటో అతనికి బాగా అర్థమైంది. 

"ఈజ్ దట్ ఓకే... ఇంకేమైనా చెప్పాలా?" లేచి నిలబడుతూ అడిగింది లాలస. 

అటూ ఇటూ ఒకసారి చూసి, లేచి నిల్చుని, లాలసని అక్కడే గట్టిగా హగ్ చేసుకొని వదిలిపెట్టాడు మిస్టర్ ఎక్స్. 

"ఏయ్... ఏంచేస్తున్నావ్" అని లాలస అడిగేలోపే అంతా అయిపోయింది.

"ఓయూ ఆర్ట్స్ కాలేజ్‌లో నాకిష్టమైన ఎవరైనా ఒక  అమ్మాయిని ఇలా గట్టిగా హగ్ చేసుకోవాలన్న నా ఫాంటసీ ఇన్నాళ్లకి తీరింది.... థాంక్స్ బుజ్జీ!" రిలాక్స్‌డ్‌గా ఒకసారి చుట్టూ చూస్తూ, లాలసవైపు తిరిగి చెప్పాడు మిస్టర్ ఎక్స్.      

ఏదో సాధించిన సంతోషం మిస్టర్ ఎక్స్ ముఖంలో మెరుస్తుండగా, అతనివైపే కళ్ళు రెపరెపలాడిస్తూ చూసి బిగ్గరగా నవ్వింది లాలస. 

ఇద్దరూ నెమ్మదిగా అక్కడినుంచి ముందుకి కదిలారు. 

"లైబ్రరీ రాక్స్ మధ్యనో, ల్యాండ్‌స్కేప్ గార్డెన్లోనో, టాగోర్ ఆడిటోరియం వెళ్లేదారిలోనో... ఇంకెక్కడైనా, ఇంకేవైనా ఫాంటసీలు మిగిలుంటే చెప్పు… అన్నీ కవర్ చేసేద్దాం. ఓ పనైపోతుంది" తన చేతివేళ్ల మధ్య ఉన్న మిస్టర్ ఎక్స్ చేతివేళ్లను గట్టిగా నొక్కుతూ అంది లాలస. 

" ఫాంటసీలు చాలా ఉన్నాయి. కాని, అవన్నీ ఇక్కడ చెప్పేవి కాదు" చెప్పాడు మిస్టర్ ఎక్స్. 

"నాటీ రాస్కెల్" బ్లష్ అవుతున్న బుగ్గలను దాచుకోలేకపోయింది లాలస.     

 "బుజ్జీ... ఇంక నావల్లకాదు!" చిన్న గ్యాప్ తర్వాత, ఉన్నట్టుండి అన్నాడు మిస్టర్ ఎక్స్. 

"ఏం కాదు?"

"నువ్వెక్కడెక్కడో వైజాగ్‌లో... నేనేమో ఇక్కడ హైద్రాబాద్‌లో! ఇలా అప్పుడప్పుడు మాత్రమే కలవడం నావల్లకాదు" 

"అనుకుంటూనే ఉన్నా... ఇంకా ఈమాట అన్లేదేంటా అని" 

"నీకలా లేదా?"

మిస్టర్ ఎక్స్ ప్రశ్నకు నడుస్తున్న లాలస ఆగింది.

"అసలీ క్షణం నుంచి ఇంక ఇక్కడే నీతో ఉండిపోవాలనుంది. ఉండిపోనా?" అడిగింది లాలస. 

"అయామ్ ఓకే" క్షణం కూడా ఆలోచించకుండా అన్నాడు మిస్టర్ ఎక్స్. 

"నువ్విప్పుడే అలా అనకు బుజ్జూ... నేనింక అసలు వైజాగ్ వెళ్లలేను!" అతని కళ్ళల్లోకే చూస్తూ గుసగుసగా అంది లాలస.  

సౌందర్యస్పృహ, జీవితం పట్ల మమకారం ఉన్న ఆడవాళ్లు ఎప్పుడూ యవ్వనంగానే ఉంటారని లాలసని చూశాకే అర్థమైంది మిస్టర్ ఎక్స్‌కి. 

చీర కట్టినా, చుడీదార్ వేసుకున్నా, ఆఖరికి నైట్ డ్రెస్‌గా పైజామా-టీషర్ట్ వేసుకున్నా... లాలసలో ప్రతి కదలికా, ప్రతి అణువూ అందంగానే కనిపిస్తుంది. యూనివర్సిటీరోజుల్లో ఎలా ఉందో ఇప్పుడూ అలాగే ఉంది లాలస. ఏం మార్పులేదు.

"ఎలా మెయింటేన్ చేస్తున్నావు బుజ్జీ?" ఒకసారి అడిగాడు మిస్టర్ ఎక్స్. 

నవ్వింది లాలస. 

లాలసలో మిస్టర్ ఎక్స్‌కు నచ్చని అంశంలేదు… అసోసియేట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం చేస్తోంది. పుస్తకాలు బాగా చదువుతుంది. మ్యూజిక్ వింటుంది. ఇంటిని చాలా నీట్‌గా, అందంగా అలంకరించుకుంటుంది. ఇలా చెప్పుకొంటూపోతే లాలస ఇష్టాలు, అలవాట్లు ఒక పెద్ద లిస్టే అవుతుంది. ప్రతి చిన్న అంశంలోనూ తన ముద్ర ఉంటుంది. మొత్తంగా ఆమెదొక అందమైన జీవనశైలి.       

లాలస, మిస్టర్ ఎక్స్ దూరంగా ఉన్నప్పుడు ఇద్దరూ కాల్స్, చాటింగ్ ఎక్కువగా చేసుకొనేవారు. ఆ చాటింగ్‌ల్లో కొన్నింటి స్క్రీన్‌షాట్స్ కూడా అతనికి పంపింది లాలస.  

ఒక చాట్‌లో, "నాకెందుకో మనిద్దరం కలిసుంటాం అనిపిస్తోంది బుజ్జూ" అంది. 

ఇంకోసారి, "ఏదో ఒకటి చేసి నన్ను తీసుకెళ్లిపో" అంది. 

మళ్లీ ఇంకోసారి, "షూర్‌గా వచ్చేస్తున్నా నీదగ్గరికి. వైజాగ్ కట్!" అంది. 

వెనకనుంచి మిస్టర్ ఎక్స్ మెడచుట్టూ చేయివేసి, లాలస తీసిన సెల్ఫీలు నిజంగా ‘ఎపిక్’ అని ఫీలవుతుంటాడు మిస్టర్ ఎక్స్. 

వాళ్లిద్దరూ ముంబైలోని జూహూ ‘సన్ అండ్ శాండ్‌’లో రెండ్రోజులున్నప్పుడు, ఇద్దరిమధ్య నడిచిన ఒక విచిత్రమైన సంభాషణ గుర్తుకుతెచ్చుకోవడం మిస్టర్ ఎక్స్‌కు ఎప్పుడూ చాలా ఇష్టం. 

ఒక ప్రొలాంగ్‌డ్ రొమాన్స్ తర్వాత ఇద్దరూ కలిసి షవర్ కింద స్నానం చేసొచ్చారప్పుడే. 

షార్ట్స్ వేసుకొని సోఫాలో కూర్చున్న అతని వొళ్ళో అడ్దంగా పడుకొంది లాలస. తెల్లటి పైజామా, పింక్ స్లీవ్‌లెస్ టీషర్ట్‌లో ఫ్రెష్‌గా ఉందామె. 

తన కళ్లల్లోకే చూస్తున్న మిస్టర్ ఎక్స్‌నే చూస్తూ, " అంతా ఒకేగాని... సేఫ్టీ అక్కర్లేదా బుజ్జూ?" అడిగింది లాలస. 

"మనిద్దరం కలిసున్నప్పుడు నీకూ నాకూ మధ్య గాలి చొరపడటం కూడా నాకిష్టంలేదు. ఇంక ఆ బ్లడీ సింథటిక్ పొరకూడానా... నెవర్" అన్నాడు మిస్టర్ ఎక్స్. 

అల్లరిగా అతని నెత్తిమీద ఒక మొట్టికాయ వేసింది లాలస. 

"ప్రెగ్నెన్సీ వస్తే?!" 

" ఇప్పుడంత ప్రమాదం ఉందంటావా? నేనేం ఇప్పుడే కొత్తగా పెళ్లైన కుర్రాన్ని కాదు" 

"మనం కలిసినప్పటినుంచి ఇప్పటికి నువ్వో పదేళ్లు వయసు తగ్గావ్... నీకు తెలుసా?! ప్రమాదం చాలా ఉంది…" అతని భుజం మీద పిడిలితో గుద్దుతూ అంది లాలస. 

"ఏం చేద్దాం?" లాలసనే చూస్తూ అడిగాడు.

"ప్రెగ్నెన్సీ వస్తే… మనకో అమ్మాయిని కనేస్తాలే" అంది నవ్వుతూ. "ఓ ఏడాది ఎక్కడికైనా దూరంగా వెళ్లిపోదాం. నువ్వూ నేనూ... కొన్ని నెలలకు మన పాప!" కిలకిలా నవ్వింది లాలస. 

"ఫేసినేటింగ్ డ్రీమ్... ఇదేదో బాగుంది" లాలస ముక్కుని తన ముక్కుతో ఇటూ అటూ ఆడుకొంటూ అన్నాడు మిస్టర్ ఎక్స్. 

"డ్రీమ్ కాదు. నాకెందుకో ఇది నిజమౌతుందనిపిస్తోంది మిస్టర్ చాకోబార్!" అంటూ లేచి, అతని మెడచుట్టూ చేతులు వేసి, ముఖం నిండా ముద్దుల వర్షం కురిపించసాగింది లాలస. 

వారిద్దరి మధ్య అనుబంధం అంత బాగా కొనసాగుతున్న సమయంలోనే, ఉన్నట్టుండి మిస్టర్ ఎక్స్ జీవితంలో అతడు ఎన్నడూ కలలో కూడా ఊహించని విధంగా, జరక్కూడని సంఘటనలు ఒకదానివెంట ఒకటి ఒక్కసారిగా జరిగాయి. 

తనకంటే పదేళ్లు చిన్నవాడైన తనకెంతో ప్రియమైన తమ్ముడు చనిపోయాడు. వృత్తిపరంగా, ఆర్థికంగా కూడా ఒకేసారి చాలా దారుణంగా ఇబ్బందుల్లో పడిపోయాడు. అసలు తనేం చేస్తున్నాడో తనకే తెలియని ఒక అర్థంకాని స్థితిలోకి వెళ్లిపోయాడు. ఎవ్వరితో మాట్లాడకుండా, తనలో తనే కుంచించుకుపోయాడు. ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఫోన్ చేసి కనీసం ఒక పది నిమిషాలైనా మాట్లాడే లాలసకు కూడా ఫోన్ చేయడం మానేశాడు. చివరికి ఫోన్ పూర్తిగా స్విచ్చాఫ్‌చేసి పెట్టేశాడు. 

దాదాపు ఒక నెలపాటు లాలసకు మిస్టర్ ఎక్స్ ఏమైపోయాడో తెలియదు. తను అతనిదగ్గరికి వెళ్లలేదు. ఎవ్వరినీ అడగడానికిలేదు. మిస్టర్ ఎక్స్‌కు ఏమైందో అని ఎన్నిరకాలుగానో ఊహించి ఏడ్చింది. రోజూ నిద్రలేని రాత్రులు గడిపింది. 

కొద్దిగా తేరుకొన్నాక, లాలసకు ఫోన్ చేశాడు మిస్టర్ ఎక్స్. 

బాధపడింది. ఏడ్చింది. కాని మిస్టర్ ఎక్స్‌ను మాత్రం ఆ క్షణం ఏమీ అనలేదు లాలస. అంతా విని, చివరికి మౌనంగా ఫోన్ పెట్టేసింది. 

తను చేసిన పెద్ద పొరపాటు ఏంటో మిస్టర్ ఎక్స్‌కు అప్పుడు అర్థమయ్యింది. 

తను ఎదుర్కొన్న కష్టాలన్నీ ఆమెకెందుకు తెలియడం అనుకొన్నాడు, ఆమెనెందుకు తనతోపాటు బాధపెట్టడం అనుకొన్నాడు. తనచుట్టూ ఉన్న ఇంకెవ్వరితోకూడా మాట్లాడకుండా ఒక షెల్‌లోకి వెళ్లిపోయాడు.

అదే అతను చేసిన పెద్ద తప్పు. 

తన జీవితంలో ఎంత కష్టం వచ్చినా, ఎన్ని టెన్షన్స్ అనుభవించినా... అసలు తను ముందు షేర్ చేసుకోవాల్సింది లాలసతో కదా?

‘ఈమాత్రం నేనెందుకు ఆలోచించలేకపోయాను’ అని మిస్టర్ ఎక్స్ చాలా చాలా బాధపడ్డాడు. అనుక్షణం గిల్టీగా ఫీలవ్వసాగాడు. 

తను ఎప్పట్లా లాలసకు ఫోన్ చేస్తున్నా, అటువైపునుంచి ఎందుకో దూరం పెరుగుతోందని అతనికి అర్థమవుతోంది. 

రాకూడని ఆరోజు రానే వచ్చింది. ఉన్నట్టుండి "ఇంక చాలు" అని బ్రేకప్ చెప్పింది లాలస. 

షాకయిపోయాడు మిస్టర్ ఎక్స్. 

"ఇది ఉన్నట్టుండి ఏం కాదు. చాలా జరిగిన తర్వాతనే" అంది లాలస. అతనికేం అర్థంకాలేదు. చివరికి, "మా ఇంటికి రావద్దు" అని కూడా అంటూ బోరున ఏడ్చింది లాలస. 

పూర్తిగా బ్లాంక్ అయిపోయాడు మిస్టర్ ఎక్స్.  

అప్పుడు తను ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో, తను చేసిన ఆ ఒక్క తప్పుకి వందసార్లు సారీ చెప్పాడు మిస్టర్ ఎక్స్. తనవల్ల ఇంకేం తప్పు జరిగిందో చెప్పమన్నాడు. ఎన్నోసార్లు బ్రతిమాలాడు. 

లాలస కరగలేదు. 

జీవితంలో తనకు దొరికిన అద్భుతం అనుకొన్న లాలస ఇలా ఒక పాషాణంలా మారడానికి తనే ఎలా కారణమయ్యాడో ఆలోచించి తట్టుకోలేనంతగా బాధపడ్డాడు మిస్టర్ ఎక్స్. 

"నాక్కొంచెం టైమ్ కావాలి" అని ఒకసారి లాలస అనగానే, ఒక్కసారిగా పోయిన ప్రాణం లేచొచ్చింది అతనికి. కాని, తర్వాత ఆ మాటను వెనక్కి తీసుకొంది లాలస. 

అంతకుముందు కొద్దిరోజుల క్రితం కూడా, "ఇంక అదంతా వద్దు. మనం మామూలుగా మాట్లాడుకొందాం" అంది. కాని, ఆ మాటను కూడా వెనక్కు తీసుకొంది. 

క్రమంగా ఫోన్ ఎత్తటం కూడా మానేసింది లాలస. చివరికి అతని నంబర్ కూడా బ్లాక్ చేసేసింది. 

మిస్టర్ ఎక్స్ ఇప్పుడు బయటికి చూడ్డానికి మామూలుగానే ఉన్నాడు. కాని అతను మునుపటి మిస్టర్ ఎక్స్ కాదు. 

లాలసకు దూరమైపోయాక, జీవితంలో సీరియస్‌గా తీసుకోవాల్సిన ఎన్నెన్నో విషయాల్ని చాలా తేలిగ్గా వదిలేశాడు. ఇంకా ఇంకా నష్టపోయాడు. 

లాలసతో చివరి కాల్ మాట్లాడి దాదాపు ఒక సంవత్సరం కావస్తోంది. ఈలోగా కరోనావైరస్, లాక్‌డౌన్ వచ్చాయి.  

లాలసతో మాట్లాడ్డానికిలేదు. తనని కలవలేడు. తను ఎలా ఉందో తెల్సుకోలేడు. 

ఇలాంటి వ్యధనే కదా అప్పుడు లాలస కూడా అనుభవించింది? 

కుమిలిపోయాడు మిస్టర్ ఎక్స్. 

లాలస ఒక్క కాల్ ఇప్పుడతని జీవితంలో మళ్లీ ఇంద్రధనుస్సులు పూయిస్తుంది. కాని, ఎలా? 

తన మిత్రుడు గుర్తొచ్చాడు. లేచి, మొబైల్ చేతిలోకి తీసుకొన్నాడు మిస్టర్ ఎక్స్.

*****

చాలారోజుల తర్వాత అన్ని టెన్షన్లు పక్కనపెట్టి, నాకిష్టమైన పనిచేసినందుకు హాయిగా ఉంది. 

నేను కథ రాయడం, నా బ్లాగ్‌లో పోస్ట్ చేయడం కూడా అయిపోయింది.

జీవితంలో కొన్ని విచిత్రాలు జరుగుతుంటాయి. కరోనావైరస్ నేపథ్యంలో వచ్చిన లాక్‌డౌన్ అలాంటిదే. ముందు ముందు ఇంకెన్ని ఇలాంటి విపత్తులు వస్తాయో ఎవ్వరూ చెప్పలేరు. ఎవ్వరం ఎన్నాళ్లు బ్రతుకుతామో తెలియదు. బ్రతికినన్నాళ్లు మాత్రం సంతోషంగా జీవించాలి.

నిజంగా ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. నేను రాసి పోస్ట్ చేసిన ఈ కథ, మిస్టర్ ఎక్స్ అనుకున్నట్టుగా, ఏదోవిధంగా, ఎవరో ఒకరిద్వారా తప్పక లాలసకు చేరుతుందని నాకిప్పుడు చాలా నమ్మకంగా ఉంది.     

కరోనాకు ముగింపు ఉంటుందో లేదో నాకు తెలియదు. మిస్టర్ ఎక్స్ కథకు మాత్రం ముగింపు తప్పక ఉంటుంది. అది కూడా చాలా పాజిటివ్‌గా. చాలా రొమాంటిక్‌గా. 

ఇది జోస్యం కాదు. మిస్టర్ ఎక్స్ ప్రేమ మీద నాకంత ప్రేమ. 

కొన్ని గంటలో, కొన్నిరోజులో అంతే. నా మిత్రుడు లాలస మళ్ళీ మాట్లాడుకొంటారు, కలుస్తారు. బ్రతికున్నన్నాళ్లూ జీవితాన్ని ఇంకా ఇంకా సెలబ్రేట్ చేసుకుంటూనే ఉంటారు.
  
తను అడగ్గానే కథ రాసానని నా మిత్రుడు చాలా సంతోషంగా ఉన్నాడు. వాడు అడగ్గానే ఈ కథ రాయగలిగినందుకు నేను కూడా చెప్పలేనంత ఆనందంగా ఉన్నాను. ఎంత ఆనందంగా ఉన్నానంటే, ఈ ఆనందంలో అసలు నిజం చెప్పేయాలన్నంత ఆనందంగా.  

మిస్టర్ ఎక్స్ ఎవరో కాదు... నేనే.

^^^^^


"పాలపిట్ట" జూన్ 2020 సంచికలో ప్రచురితమైన ఈ కథ, వైజాగ్‌లో ఉన్న నా ఆత్మీయ మిత్రులు రాజుగారికి అంకితం.    

Prologue to Mr X

మిస్టర్ ఎక్స్...

చాలారోజుల తర్వాత నేను మళ్ళీ ఒక కథ రాశాను. ఒక మ్యాగజైన్ కోసం. 

'పాలపిట్ట' జూన్ సంచికలో వచ్చిన నా కథను, నా వ్రాతల్ని ఇష్టపడే కొందరికోసం నా బ్లాగ్‌లో, ఫేస్‌బుక్ పేజ్‌లో కూడా ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను.

తెలుగులో దాదాపు అన్ని వీక్లీలు, మంత్లీలు మూతపడ్డాయి. నాకు తెలిసి, కరోనాలో కూడా ఎలాంటి బ్రేక్ లేకుండా, ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో వస్తున్న ఏకైక సాహిత్య పత్రిక "పాలపిట్ట".

లాక్‌డౌన్ టైమ్‌లో లైఫ్ మరీ ఇంత డల్‌గా ఉండకూడదని చాలా పెద్ద గ్యాప్ తర్వాత ఒక షార్ట్ స్టోరీ రాశాను. 

నా ఫేవరేట్ రచయిత బుచ్చిబాబు గారి శైలిలో రాద్దామనుకొని ప్రారంభించి, నా ఇంకో అభిమాన రచయిత చలం గారిలా దూసుకెళ్ళానని భ్రమపడ్డాను. మధ్యలో ఎక్కడో నేను ఎంటరయ్యాను. ఇద్దర్నీ మర్చిపోయి, పూర్తిగా ఏం రాయాలనుకొన్నానో అదే రాశాను. ఫీల్‌లో కొట్టుకుపోయాను.  

కథ పూర్తయ్యాక చదివినప్పుడు... అటు నాకిష్టమైన బుచ్చిబాబు, చలం గార్లను గుర్తుచేసుకుంటూనే... చివరికి, రష్యన్ భాషలో నా అభిమాన కథా రచయిత పవుస్తోవ్‌స్కీ శైలిలో రాశానని నాకనిపించింది. 😋 

కథ చదువుతుంటే పాఠకులకు ఇది రచయిత సొంతకథేమో అనిపించవచ్చు, కాని కాదు. సొంత నేపథ్యం, ఫీలింగ్స్ మాత్రం ఉన్నాయి. కొన్ని సొంత అనుభవాల తాలూకు పరిమళం కూడా తొంగిచూడొచ్చు. ఏ రచయిత రచనల్లోనయినా ఇది అత్యంత సహజమని నేననుకుంటాను.      

This is simply a short story, penned in an uninterrupted stream, all in one sitting.

మనిషి జీవితం అనేది కొన్ని మధురానుభూతుల సమాహారం. మిగిలిన నిర్వచనాలు, నిర్బంధాలన్నీ జస్ట్ ట్రాష్ అండ్ రొటీన్ బుల్‌షిట్. మనం ఏదైతే రియాలిటీ అనుకొని నమ్ముతున్నామో అది కాదు రియాలిటీ. అసలు రియాలిటీ మనకు తెలియనట్టే ఉంటాము. ఆ భ్రమలోనే మన జీవితం కూడా ముగుస్తుంది. కాని, అలా జరక్కూడదు... 

- with ❤️
Manohar Chimmani 

Wednesday 24 June 2020

OTT వల్ల సినిమారంగంలో రాబోతున్న 10 భారీ మార్పులు

1. అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, ఆహా, శ్రేయాస్ ఈటీ... వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ వల్ల సినిమాల రిలీజ్‌లకు ఇకమీదట ఎలాంటి సమస్య ఉండదు. ఒకేరోజు ఎన్ని సినిమాలైనా రిలీజ్ చేసుకోవచ్చు.

2. చిన్న సినిమాల నిర్మాత "మాకు రెంటు కట్టినా థియేటర్స్ ఇవ్వట్లేదు" అని ఎక్కడా చెప్పుకొనే అవకాశం ఉండదు. ఎప్పుడంటే అప్పుడు ఓటీటీలో రిలీజ్ చేసుకోవచ్చు. సినిమాలో సత్తా ఉంటే డబ్బులొస్తాయి.

3. నెలలుగా కొనసాగుతున్న ఈ లాక్‌డౌన్ ఎఫెక్టు వల్ల ప్రపంచవ్యాప్తంగా మనిషి జీవనశైలిలో, ఆలోచనావిధానంలో ఎన్నోమార్పులు వస్తున్నాయి. ఇన్ని నెలలుగా థియేటర్‌కు వెళ్లకుండా ఓటీటీలకు అలవాటుపడిన ప్రేక్షకులు రేపు థియేటర్స్ ఓపెన్ అయినప్పుడు కూడా బయటకువెళ్లి థియేటర్లో సినిమా చూడటానికి ఆలోచిస్తారు. అదేదో భారీ ఆడియో విజువల్ వండర్ అయితే తప్ప, సినిమాను థియేటర్లోనే చూడాలన్న కరోనా ముందటి ఆలోచనావిధానానికి గుడ్‌బై చెప్తారు. 

4. పై భారీ మార్పు కారణంగా సినిమాల కలెక్షన్లు దారుణంగా పడిపోతాయి. ఫలితంగా, మేకింగ్ బడ్జెట్లు, ఆర్టిస్టులు, టెక్నీషియన్ల రెమ్యూనరేషన్స్ భారీగా తగ్గకతప్పదు. అయితే, ఈ భారీ సినిమాల విషయంలో, టికెట్ రేట్స్ భారీగా పెట్టడం ద్వారా మాత్రమే ఓటీటీలో కూడా భారీగా సంపాదించుకొనే అవకాశం ఉంటుంది.

5. అంతకు ముందు "మీ సినిమా ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో రిలీజయ్యిందా?" అని అడిగేవాళ్లు. ఇప్పుడు "మీ సినిమా ఓటీటీలో రిలీజయ్యిందా?" అని అడుగుతారు!

6. మొన్న ఆర్జీవీ "క్లైమాక్స్" రిలీజ్‌కి ఏకంగా ఒక కొత్త ఓటీటీ ప్లాట్‌ఫామ్ ప్రారంభమయింది. ఇప్పుడు ఇలాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు కొత్తగా ఒక డజన్ అయినా మార్కెట్లోకి వస్తాయి. 

7. చిన్న బడ్జెట్ సినిమా నిర్మాతలకు, దర్శకులకు ఇదొక గోల్డెన్ అపార్చునిటీ. కంటెంట్‌లో సత్త ఉండే సినిమాలను, ప్రేక్షకులను ఓటీటీ దగ్గరికి రప్పించే సినిమాలను తీయగలిగే దర్శకులకు చేతినిండా పని ఉంటుంది.   

8. లిటరల్లీ నెలకో సినిమా తీసి రిలీజ్ చేయగలిగే సత్తా ఉన్నవాళ్లకు ఓటీటీ నిజంగా ఒక గోల్డ్ మైన్.

9. తక్కువ బడ్జెట్‌లో క్వాలిటీతో ప్రేక్షకులను ఆకట్టుకొనే సినిమాలను తీయగలిగే దర్శకులకు మంచి గిరాకీ ఉంటుంది. 

10. ఇండస్ట్రీలో చిన్న బడ్జెట్ సినిమాల నిర్మాణం పెరుగుతుంది. దేశవ్యాప్తంగా కొత్తగా లక్షలాదిమందికి ఉపాధి లభిస్తుంది.

కట్ చేస్తే -

ఈ లాక్‌డౌన్ ఇంకాస్త ఫ్రీ అయినవెంటనే నా కొత్త సినిమా ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నాను. ఈవైపు ఆసక్తి ఉన్న లైక్‌మైండెడ్ చిన్న ఇన్వెస్టర్లు నన్ను కాంటాక్ట్ చేయవచ్చు: WhatsApp: +91 9989578125

పి ఎస్: ఓటీటీలో ఆర్జీవీ "క్లైమాక్స్" కేవలం 4 గంటల్లో 1.6 కోట్లు కలెక్ట్ చేసింది! 

Wednesday 17 June 2020

#TotalCinema !!

"ఒక ట్వీట్ పెట్టినా సరే ఏదైనా ప్రయోజనం ఉండాలి సర్!"

చాలా రోజుల క్రితం నేనూ, మా భరత్ కారులో ప్యారడైజ్ మీదుగా వెళ్తుండగా తను ఈ మాట అనటం నాకింకా గుర్తుంది.

ప్రాక్టికల్ పాయింటాఫ్ వ్యూలో అది ఎంతవరకు సాధ్యం అన్నది పక్కనపెడితే, భరత్ చెప్పినదాంట్లో నేను చాలా అర్థాలు తీసుకున్నాను.

ఒక ఫేస్‌బుక్ పోస్టు పెట్టినా, ఒక ట్వీట్ పెట్టినా, ఒక బ్లాగ్ పోస్టు రాసినా... ప్రత్యక్షంగానో, పరోక్షంగానో దానికో పరమార్థం ఖచ్చితంగా ఉండాలి. అది ఉట్టి ఐదు నిమిషాలు కావచ్చు, అరగంట కావచ్చు. మన జీవితంలో కొంత సమయాన్ని అక్కడ వెచ్చిస్తున్నాం. ఆ సమయానికి చాలా విలువుంది. 

మనం రాసేది ఒక వాక్యం కావచ్చు, ఒక పేరాగ్రాఫ్ కావచ్చు, ఒక పేజీ కంటెంట్ కావచ్చు. మన రైటింగ్‌కు కూడా ఒక విలువ ఉంటుందన్నది మనం గుర్తుంచుకోవాలి. 

ఇవన్నీ నిజంగా పాటించలేనప్పుడు అసలు సోషల్‌మీడియా వైపు వెళ్లకపోవడమే మంచిది. హాయిగా ఒక పుస్తకం ఏదైనా చదువుకోవచ్చు. ఇంకేదైనా ఇంటి పని చేసుకోవచ్చు. చాలాకాలంగా పలకరించని ఒక ఫ్రెండ్ ఎవరికైనా కాల్ చెయ్యొచ్చు. వీటన్నిటికంటే ముందు ఇంట్లో పిల్లలతో, జీవిత భాగస్వామితో మంచి క్వాలిటీ టైమ్ గడపొచ్చు.

ఇవన్నీ నువ్వు పాటిస్తున్నావా అంటే "యస్" అనే చెప్తాను.

ఫేస్‌బుక్‌ను దాదాపు పూర్తిగా పక్కన పెట్టేశాను. ఫేస్‌బుక్ పేజ్‌లో, ట్విట్టర్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రం ఇప్పుడు రోజూ నా వర్కింగ్ స్టిల్స్, ఇతర సినిమా స్టఫ్ ఏదో ఒకటి పోస్ట్ చేస్తున్నాను. ఇప్పటినుంచి ఒక రెండేళ్లపాటు, వేరే పనులేమీ లేకుండా, పూర్తిగా సినిమా పనులే పెట్టుకొన్నాను కాబట్టి ఇప్పుడీ సోషల్ మీడియా బజ్ నాకు చాలా అవసరం.

సోషల్‌మీడియాలో ఇప్పుడు నేను చేస్తున్నది జస్ట్ వామప్. నా కొత్త ప్రాజెక్ట్ ప్రారంభమైనతర్వాత ఈ బజ్ మరొకలెవెల్లో ఉంటుంది.

కొన్ని సంకెళ్లు తెంచుకోవాలంటే కొన్ని చేయక తప్పదు. అలా చేయాల్సింది సినిమాలే అయినప్పుడు ఆ మజానే వేరు.

కట్ చేస్తే -

ఈ పోస్టు ప్రారంభంలో నేను ప్రస్తావించిన భరత్ ఎవరోకాదు. నేను గుంటూరు నవోదయ విద్యాలయలో పనిచేసినప్పుడు నా విద్యార్థి భరత్‌కృష్ణ. ఇండియాలో, అమెరికాలో నానా జాబ్స్ చేసి "ఓస్ ఇంతేనా" అని ఇండియాకు తిరిగొచ్చాడు. ఇప్పుడేదో స్టార్టప్ సన్నాహాల్లో ఉన్నాడు.

Guy on the Sidewalk అతని తొలి బెస్ట్‌సెల్లర్ ఇంగ్లిష్ నవల. 

Monday 15 June 2020

శుద్ధ్ దేశీ రొమాన్స్!

సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ సూసైడ్‌కు ముందు కొద్దిరోజుల క్రితమే అతని మేనేజర్ ఎందుకు సూసైడ్ చేసుకుంది?

సుశాంత్ సూసైడ్‌కు కొద్దిరోజుల క్రితమే అతని ప్రేయసితో బ్రేకప్ ఎందుకు అయింది?

రెండ్రోజుల క్రితమే తన బ్యాంక్ అకౌంట్ నుంచి సుశాంత్ భారీమొత్తంలో డబ్బు ఎందుకు డ్రా చేశాడు?

సుశాంత్ సూసైడ్ వెనుక ఇంకేదో క్రైమ్ కోణం ఉందేమో అనిపిస్తుంది నాకు.

దిల్ బేచారా...

కట్ చేస్తే -   

పోయిన తర్వాత అందరూ షాక్ అవుతారు. అది మామూలుగా జరిగేదే.

ఇండస్ట్రీవాళ్లు, బయటవాళ్లు, ప్రెస్... సుశాంత్ ఇట్లా, సుశాంత్ అట్లా అని అంతా ఒక టెంప్లేట్ ప్రకారం అన్నీ చెబుతుంటారు.

ఆరైపీలకు, మిస్‌యూలకు లెక్కే ఉండదు. 

కాని, పాయింట్ అది కాదు.

ఈ ఆరైపీలు పెట్టినవాళ్లలో, మిస్‌యూలు రాసినవాళ్లలో ఎంతమంది తమచుట్టూ ఉన్న తమ దగ్గరివారిలో, మిత్రుల్లో ఈ డిప్రెషన్‌ను గుర్తించగలుగుతున్నారు? గుర్తించినా, ఎంతమంది వారు బ్రతికుండగానే వారికేదైనా భరోసా ఇవ్వగలుగుతున్నారు?

పోయిన తర్వాత ఆరైపీలు, మిస్‌యూలు కాదు... మనచుట్టూ ఉన్న మనవారిలో, మిత్రుల్లో, ఇరుగుపొరుగుల్లో కూడా ఎవరికైనా ఒక చిన్న మాట అవసరమేమో గమనించాలి. వారింకేదైనా చెప్పాలనుకుంటున్నారో కూడా తెలుసుకోవాలి. ఒక్క పది నిమిషాలు ధైర్యం చెప్పాల్సిన అవసరమున్నదేమో చూడాలి. ఆ పని చేసెయ్యాలి.

బ్రతుకు విలువ తెలియచెప్పాలి. 

బ్రతికున్నప్పుడే వారు మిస్ కాకుండా చూసుకోవాలి.

I hate R I P...

Friday 12 June 2020

ఓటీటీలో నెలకో సినిమా ఎలా సాధ్యం?

థియేటర్స్ ఒక్కటి తప్ప, దాదాపు ఫిల్మ్ ఇండస్ట్రీలో మొత్తం పనులు మళ్లీ ప్రారంభమైనట్టే లెక్క. ఇంకో రెండ్రోజుల్లో ప్రారంభమయ్యే షూటింగ్స్‌తో ఇండస్ట్రీలో "న్యూ నార్మల్" సంపూర్ణమవుతుంది.

థియేటర్స్ తెరవటం ఇప్పట్లో సాధ్యం కాదు.

అయితే సినిమాల రిలీజ్‌కు ఇది ఏమాత్రం ఆటంకం కాదు అని ఓటీటీలో వరుసగా రిలీజవుతున్న సినిమాలు, వాటి బిజినెస్సే చెబుతోంది.

మరోవైపు, లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తెయ్యడానికి ఇంకో 2 నెలలు పట్టొచ్చని వినిపిస్తోంది. పెరుగుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసుల గ్రాఫ్‌ను చూసి కొంతమంది "గవర్నమెంట్ మళ్లీ లాక్‌డౌన్ పెడుతుంది" అని కూడా అంటున్నారు.

మళ్లీ పూర్తిగా లాక్‌డౌన్ పెట్టడం అనేది బహుశా ఉట్టుట్టి పుకారే అవుతుంది తప్ప రియాలిటీలో అసాధ్యం.

ఏది ఎలా ఉన్నా... "డెయిలీ బేటా" కు పనిచేసే లక్షలాది కార్మికులు, ఆర్టిస్టులు, టెక్నీషియన్ల కోసం ఫిల్మ్ ఇండస్ట్రీ పనులు ఒక్కొక్కటిగా ప్రారంభించడానికి ప్రభుత్వాలు అనుమతినివ్వక తప్పలేదు.

ప్రభుత్వాలకు కూడా ఇప్పుడు ఆదాయం చాలా అవసరం. వచ్చే ఏ ఒక్క ఆదాయాన్ని కూడా అవి వదులుకొనే పరిస్థితిలోలేవు.

కట్ చేస్తే -

చిన్న బడ్జెట్ సినిమాలకు ఇప్పుడు నిజంగా ఇదొక గోల్డెన్ అపార్చునిటీ.

ఓటీటీలో రిలీజ్ చేసే సినిమాలకు సెన్సార్ కూడా అవసరం లేదని నిన్న ఒక ఇంటర్వ్యూలో విన్నాను. అదే నిజమైతే ఓటీటీలో రిలీజ్ చేయాలనుకొనే సినిమాలకు ఓ 2 నెలల టైమ్ కలిసొస్తుంది!

తగిన ఆర్థిక వనరులు, స్పీడ్‌గా సినిమా తీయగల ప్యాషన్, సత్తా ఉంటే నిజంగా నెలకో సినిమా తీసి రిలీజ్ చేయవచ్చు. కోట్లు కొల్లగొట్టుకోవచ్చు.

మొన్ననే ఆర్జీవీ Climax రిలీజ్ చేశాడు. కొద్దిరోజుల్లో ఆర్జీవీదే Corona Virus రిలీజ్ అవుతోంది. తర్వాత అతనిదే ఇంకో సినిమా Naked. ఆ తర్వాత, The Man Killed Gandhi...

ఒక్క ఆర్జీవీనే కాదు, ఇదే స్పీడ్‌లో ఇప్పుడు ఇంకెందరో డైరెక్టర్లు కూడా ఇదే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను మాత్రమే దృష్టిలో పెట్టుకొని చాలా సినిమాలు ప్రారంభిస్తారు. రిలీజ్ చేస్తారు.

వచ్చే ఒకటి రెండు నెలల్లోనే RGV World లాగా ఇంకో నాలుగయిదు వీడియో స్ట్రీమింగ్ యాప్స్ మార్కెట్లోకి వచ్చినా ఆశ్చర్యంలేదు. రావాలి కూడా. 

ఇవ్వాళే అమితాబ్ 'గులాబో సితాబో' సినిమా  కూడా ఓటీటీలోనే రిలీజైన వాస్తవాన్ని మనం గమనించాలి.

ఈ టెక్నాలాజికల్ అడ్వాన్స్‌మెంట్ మీద నమ్మకంలేని పాతచింతకాయ పచ్చడి ప్రేమికులను పక్కన పెట్టి... ఒక ముగ్గురో, నలుగురో సినిమా ప్యాషనున్న లైక్‌మైండెడ్ మిత్రులు కలిస్తే చాలు.

Small Films, Big Money! 

Wednesday 10 June 2020

వెల్‌కమ్, ఇన్వెస్ట్‌మెంట్ మీడియేటర్స్!

సినిమా ఇప్పుడొక కార్పొరేట్ బిజినెస్.

బిగ్ బిజినెస్.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఏటా బిలియన్లలో ఆదాయం సమకూర్చుతున్న ప్రధానరంగాల్లో సినిమా ఇండస్ట్రీ కూడా ఒకటి. 

కరోనా వైరస్ నేపథ్యంలో, సుదీర్ఘ లాక్‌డౌన్ తర్వాత ఇండస్ట్రీలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొన్ననే ప్రారంభమయ్యాయి. నాలుగయిదురోజుల్లో షూటింగ్స్ కూడా ప్రారంభం కాబోతున్నాయి. 

ఈ ఇండస్ట్రీ మీద ఆధారపడి బ్రతుకుతున్న లక్షలాదిమంది కార్మికులు, ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ కోసం... అన్ని బిజినెస్‌ల్లాగే దీన్ని కూడా ఓపెన్ చెయ్యకతప్పలేదు.   

కట్ చేస్తే -

నేనిప్పుడు చేస్తున్న రెండు మైక్రో బడ్జెట్ సినిమాల కోసం .. చిన్న స్థాయిలో వెంటనే ఇన్వెస్ట్ చేయగల సత్తా ఉండి... సినీ ఫీల్డుపట్ల ఆసక్తి ఉన్న కొత్త ఇన్వెస్టర్స్ / కో-ప్రొడ్యూసర్స్ వెంటనే అవసరముంది.

ఇక్కడ ఒక అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే - ఇలా ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వచ్చే కొత్తవాళ్లకు ప్రధానంగా ఫిలిం ప్రొడక్షన్ బిజినెస్ మీద ప్యాషన్, కొంతయినా ప్రాథమిక అవగాహన ఉండటం తప్పనిసరి. ఎందుకంటే, వాళ్లు మాత్రమే ఇతర బిజినెస్‌లకూ దీనికీ ఉన్న తేడాను గ్రహించగలుగుతారు. కోపరేట్ చేస్తారు, మోరల్ సపోర్ట్ కూడా ఇస్తారు.

అలాంటి ఔత్సాహిక ఇన్వెస్టర్లని / కో-ప్రొడ్యూసర్లని పరిచయం చేసి, వెంటనే డీల్ సక్సెస్ చేయించగల సత్తా ఉన్న నెగొషియేటర్లు / మీడియేటర్లకు ఇదే మా రెడ్ కార్పెట్ వెల్‌కమ్!

మీ శ్రమకి మార్కెట్ రేట్ ప్రకారం తగిన రాయాల్టీ ఉంటుంది. వెండితెరపై కూడా 'అక్నాలెడ్జ్‌మెంట్స్' ‌లో మీ పేరు వేసి కృతజ్ఞతలు చెప్పుకుంటాం.

అంతా కొత్తవారితో తీస్తున్న ఈ రెండు కమర్షియల్ సినిమాల మార్కెటింగ్, ప్రమోషన్, రిలీజ్‌కు ఎలాంటి ఇబ్బందులు లేవు, ఉండవు. 

డీల్‌ని 'ఆథరైజ్‌డ్ సిఏ' తో పేపర్ మీద రాయించి సంతకాలు చేయటం జరుగుతుంది. అంతా కార్పొరేట్ పధ్ధతిలో లీగల్‌గా జరుగుతుంది. పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్‌కు బిజినెస్‌లో ప్రపోర్షనేట్ షేర్ ఉంటుంది.

మీడియేటర్స్ / నెగొషియేటర్స్ ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే - మాకు కావలసింది కో-ప్రొడ్యూసర్లుగా ఇన్వెస్ట్ చేయగలవాళ్లు మాత్రమే తప్ప ఫైనాన్సియర్స్ కాదు.

ముందే చెప్పినట్టు - ఇండస్ట్రీ సంప్రదాయం ప్రకారం, డీల్ పూర్తికాగానే, తగిన రాయాల్టీని మీడియేటర్స్‌కి వెంటనే ఇవ్వటం జరుగుతుంది. స్క్రీన్ మీద మొట్టమొదటగా కనిపించే 'అక్నాలెడ్జ్‌మెంట్స్' లో మీ పేరు వేస్తాము.

సినిమాల్లో ఇన్వెస్ట్ చేయడానికి మీదగ్గర ఎవరైనా రెడీగా ఉన్నట్లయితే - మీ పేరు, వివరాలు, ఫోన్ నంబర్ తెలుపుతూ వాట్సాప్ చేయండి.

కలిసి పనిచేద్దాం. కలిసి ఎదుగుదాం.

బెస్ట్ విషెస్...

WhatsApp: +91 9989578125

సినిమా తీద్దాం రండి!

మీకు తెలుసా... ఇప్పుడింక సినిమాలు ఎవరయినా ఎలాంటి భయం లేకుండా తీయవచ్చు!

కొంత ఇన్వెస్ట్‌మెంట్, కొద్దిమంది లైక్‌మైండెడ్‌లతో కూడిన చిన్న క్రియేటివ్ టీమ్ చాలు.

ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అందరూ అదే టీమ్!

మంచి కమర్షియల్ సినిమా... అనుకున్న కాన్‌సెప్ట్‌తో, అనుకున్న విధంగా తీయవచ్చు.

"చిన్న సినిమాలకు థియేటర్స్ లేవు, ఇవ్వం" అనే సమస్య ఇప్పుడు లేదు. అసలు థియేటర్స్ ఉనికికే ఎసరొచ్చే టైమ్ వచ్చింది!

సో... ఇప్పుడు థియేటర్స్ రెంట్స్ వంటి రిలీజ్ ఖర్చులు కూడా లేకుండా, సినిమాలను ఎప్పుడంటే అప్పుడు, హాయిగా ఓటీటీలో రిలీజ్ చేసుకోవచ్చు.

నేను చెబుతున్నది వందలకోట్ల హైప్‌లు క్రియేట్‌చేసే భారీ సినిమాల గురించి కాదు. అదంతా పెద్ద గ్యాంబ్లింగ్. అది మన సబ్జెక్ట్ కాదు. దానికోసం అతిరథమహారథులు, హేమాహేమీలు చాలామంది ఉన్నారు.

మనకు అంత బడ్జెట్స్ వద్దు. అంత సమయం కూడా కెటాయించలేం. మహా బోర్...

నేను చెబుతున్నది కేవలం చిన్న బడ్జెట్ కమర్షియల్ సినిమాల గురించి... ఆ భారీ సినిమాలతో పోలిస్తే, దాదాపు పూర్తిగా రిస్క్-ఫ్రీ సినిమాల గురించి...

సబ్జక్ట్ ఏదైనా కావచ్చు. ప్రేక్షకున్ని ఆ 90 నిమిషాలో, 110 నిమిషాలో కట్టిపడేసే సత్తా మేకింగ్‌లో ఉండాలి. టీజర్‌తో టికెట్ బుక్ చేయించగలగాలి.

నిజంగా నెలకో సినిమాతో కోట్లు సంపాదించవచ్చు. ఇందులో ఎలాంటి అతిశయోక్తిలేదు. మొన్న కొన్ని గంటల్లోనే, ఓటీటీలో సుమారు 2 కోట్లు కొల్లగొట్టి చూపించాడు ఆర్జీవీ.

తాజాగా ఈ ప్రూఫ్ చాలు!

ఇకనుంచీ ఇదే రియాలిటీ.

కంటెంట్ క్రియేటర్‌కు లాభాలు తెచ్చే ఇంకెన్నో టెక్నాజికల్ డెవలప్‌మెంట్స్ కూడా ఈ బిజినెస్‌లో రాబోతున్నాయి.

కట్ చేస్తే -

ఈ లాక్‌డౌన్ నుంచి రిలీఫ్ తర్వాత  వరుసగా నా సీరీస్ ఆఫ్ సినిమాలు ప్రారంభం అవుతున్నాయి. నాన్ స్టాప్‌గా ఒక 365 రోజులు నా సమయం మొత్తం సినిమాలకే కెటాయిస్తున్నాను.

ప్రీప్రొడక్షన్, షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకోడానికి ఇప్పుడెలాంటి అడ్డంకులు లేవు. కరోనా వైరస్ విషయంలో తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకొంటూ, ఫిల్మ్ మేకింగ్‌కు సంబంధించిన అన్ని పనులూ హాయిగా చేసుకోవచ్చు.   

నిజంగా ఆసక్తి ఉండి, తక్కువస్థాయిలోనయినా సరే... వెంటనే ఇన్వెస్ట్ చేయగల లైక్‌మైండెడ్ ఇన్వెస్టర్లు, మైక్రో ఇన్వెస్టర్లు నన్ను కాంటాక్ట్ చేయవచ్చు.

హీరోగా/ఆర్టిస్టుగా తెరమీద పరిచయం కావాలనుకొనే ఇన్వెస్టర్-ఆర్టిస్టులు కూడా నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. మీ ఇన్వెస్ట్‌మెంట్‌కు బిజినెస్ లో షేర్ కూడా ఉంటుంది.

వెంటనే ఇన్వెస్ట్ చేయగల ఆసక్తి, స్థోమత, సీరియస్‌నెస్ ఉన్న ఇన్వెస్టర్లు మాత్రమే మీ పేరు, వివరాలు, ఫోన్ నంబర్ తెలుపుతూ వాట్సాప్ చేయండి.

కలిసి పనిచేద్దాం. కలిసి ఎదుగుదాం.

బెస్ట్ విషెస్...

WhatsApp: +91 9989578125 

సీన్ మారిన సినిమా!

ఒకవైపు ఇండస్ట్రీ మహామహులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సినిమాటోగ్రఫీ మంత్రులను, ముఖ్యమంత్రులను కలిసి విన్నపాలు పెట్టుకుంటున్నారు. వారు 'ఓకే' అంటున్నారు. వీరు మీడియా ద్వారా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు.

కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ఆగిపోయిన వీరి షూటింగ్స్ అన్నీ ఇప్పుడు ఒక్కోటి ప్రారంభం కానున్నాయి.

కట్ చేస్తే -

సినిమానే శ్వాసగా బ్రతికే ఆర్జీవీ గత మూడు వారాలుగా సంచలనాలమీద సంచలనాలు సృష్టిస్తున్నాడు.

ఈసారి సంచలనాలు ట్వీట్లతో కాదు, తన సినిమాలతో.

క్లైమాక్స్... కరోనా వైరస్... నేకెడ్.

గత మూడువారాల్లో ఆర్జీవీ తన 3 సినిమాల టీజర్స్ రిలీజ్ చేశాడు. "ఆర్జీవీ వరల్డ్" అనే తన సొంత వీడియో స్ట్రీమింగ్ యాప్‌ను ప్రారంభించి, అందులో ఒక సినిమా రిలీజ్ చేసి, 24 గంటల్లో సుమారు 2 కోట్లకుపైగా కలెక్టు చేశాడు.

తన క్లైమాక్స్ సినిమా ఇచ్చిన కిక్‌తో "ది మ్యాన్ హూ కిల్డ్ గాంధీ" అని ఇంకో కొత్త సినిమాను ఇవ్వాలే ప్రకటించాడు. ఇలాంటి సెన్సేషనల్ కంటెంట్ ఇంకెంతో ప్రేక్షకులకు అందించబోతున్నానని ప్రకటించాడు!

థాంక్స్ టూ కరోనా... నిన్నటిదాకా అస్సలు ఎవ్వరూ పట్టించుకోని OTT నే ఇవ్వాల సిసలైన హీరో అయ్యింది. టెక్నాలజికల్ డెవలప్‌మెంట్‌ను ఎవ్వరూ ఆపలేరని మరోసారి రుజువైంది. 

ఇప్పుడింక థియేటర్స్ దొరకట్లేదని సాకులు చెప్పడానికిలేదు. కంటెంట్‌లో సత్తా ఉంటే చాలు. లిటరల్లీ కోట్లు కొల్లగొట్టుకోవచ్చు.

Content is the king! 

Tuesday 9 June 2020

మినిమమ్ ఆగస్టు దాకా సినిమా హాల్స్ లేవ్!

ఆగస్టు తర్వాత కూడా పరిస్థితి ఏంటన్నదే మిలియన్ డాలర్ కొశ్చన్...

కరోనా వైరస్ గ్రాఫ్ అప్పటికి దాదాపు పూర్తిగా తగ్గుముఖం పడుతుంది. కాని, సినిమా హాల్స్‌కు వచ్చి ఎంతమంది సినిమా చూస్తారన్నది ఇప్పుడే చెప్పటం కష్టం.

పెద్ద నిర్మాతలు, హీరోలు కూడా అంత త్వరగా వారి సినిమాలను థియేటర్స్‌లో రిలీజ్ చేసే సాహసం చెయ్యకపోవచ్చు.

ఇప్పుడు ఏ సినిమాకైనా మొదటి 3 రోజుల్లో, మొదటివారంలో వచ్చే కలెక్షనే అసలు కలెక్షన్. తర్వాత ఏం వచ్చినా అది బోనస్. ఇలాంటి పరిస్థితుల్లో ప్రాణ భయంతో ప్రేక్షకులు అసలు హాల్స్‌కు రాకపోతే? హౌజ్ ఫుల్స్ కాకపోతే?

ఈ రిస్క్ ఫాక్టొర్‌ను దృష్టిలో పెట్టుకొనే ముందుగా చిన్న సినిమాలను రిలీజ్ చెయ్యాలన్న ప్లాన్ కూడా ఒకటి ఉందని వినిపిస్తోంది. విషయం అప్పుడు పూర్తిగా తెలుస్తుంది. దాన్ని బట్టి థియేటర్లా, ఓటీటీనా అన్నది డిసైడ్ అయిపోద్ది.

ఓటీటీ అన్నది ఇంక ఎవ్వరూ తప్పించుకోలేని ప్లాట్‌ఫామ్. కరోనా తర్వాత థియేటర్స్ సంగతే తేలాల్సి ఉంది.

ఈ విషయంలో ప్రయోగానికి కూడా కూడా చిన్న సినిమాలే ఉపయోగపడుతుండటం అనేది ఇక్కడ అసలు పాయింట్! 

Monday 8 June 2020

సినిమాలో చాన్స్ దొరకడం అంత ఈజీ కాదు!

సినిమాల్లో అవకాశం కోసం రోజూ వందలాదిమంది ఫిల్మ్ నగర్ చుట్టుపక్కల ఉండే ప్రొడక్షన్ ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటారు.

ఇలా ప్రయత్నించే ప్రతి ఒక్కరూ తమలో ఎంతో టాలెంట్ ఉంది కానీ, ఆ ఒక్క చాన్సే దొరకట్లేదు అనుకొంటుంటారు. వీరిలో చాలామందికి దశాబ్దం గడిచినా ఏ అవకాశమూ దొరక్కపోవచ్చు.

ఈ నిజం సినిమా అవకాశాలకోసం తిరిగినవాళ్లకు మాత్రమే బాగా తెలుస్తుంది.

ఒకే ఒక్క ఎక్సెప్షన్ ఏంటంటే... వాళ్లకున్న కాంటాక్ట్స్‌ను బట్టి కొందరికి వెంటనే ఈ అవకాశం దొరకొచ్చు. కాని, ఇలాంటి అవకాశాల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. అది వేరే విషయం.

కట్ చేస్తే -

నాకు తెలిసిన ఒక డైరెక్టర్ ఈ మధ్య తనకు తెలిసిన ఒక కొత్త లిరిక్ రైటర్‌కు పిలిచి అవకాశమిచ్చాడు. అలాగే ఒక కొత్త కథా రచయితకు కూడా.

వాళ్లిద్దరికీ ఫిల్మ్‌నగర్‌లో అవకాశాలకోసం ఏళ్లకి ఏళ్లు తిరిగిన అనుభవం బాగా ఉంది.

వారిద్దరి మీద అభిమానంతో పిలిచి అవకాశం ఇచ్చిన ఈ డైరెక్టర్ నిజంగా అంతకుముందు సినిమాలు తీసినవాడే, రిలీజ్ చేసినవాడే. ఏదో బ్లఫ్ మాస్టర్ కాదు.

అయితే ఆ డైరెక్టర్ వారికిచ్చిన రైటింగ్ అసైన్‌మెంట్‌ను వాళ్లిద్దరూ చాలా ఈజీగా తీసుకొన్నారు. 'ఈ కరోనా ఎప్పుడు పోవాలి, ఆయనెప్పుడు సినిమా తీయాలి' అనుకొన్నారేమో!?

"మనం అభిమానంతో పిలిచి అవకాశం ఇస్తాం. దాన్ని మన బలహీనత అనుకొంటేనే కష్టం!" అన్నాడు నా డైరెక్టర్ మిత్రుడు.

అతను అన్నదాంట్లో నాకు తప్పేం కనిపించలేదు.

"ఇండస్ట్రీలో ఉన్నప్పుడు కొన్ని బేసిక్స్ తప్పక పాటించాలి" అని సీనియర్స్ పదే పదే చెప్తుంటే విననప్పుడు ఇలాగే ఉంటుంది మరి...