Sunday 31 March 2019

ఏపీ రాజధాని జిల్లా ఎటువైపు?

గుంటూరుజిల్లాతో నాకు చాలా మంచి జ్ఞాపకాలున్నాయి.

ఉస్మానియా యూనివర్సిటీలో నా రెండో పీజీ చదువుతుండగానే నాకిక్కడి నవోదయ విద్యాలయ, మద్దిరాలలో కేంద్రప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. ఇక్కడ రెండేళ్లు పనిచేశాక, ఇంకో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నాకు ఆలిండియా రేడియోలో వచ్చింది. అప్పుడు అతి కష్టమ్మీద ఇక్కడి జాబ్‌కు రిజైన్ చేసి ఆలిండియా రేడియోకి వెళ్లాను.

గుంటూరు జిల్లాతో అప్పటి నా జ్ఞాపకాలు ఇంకా ఫ్రెష్‌గానే ఉన్నాయి ...

వృత్తిగతంగా ఒక అతిముఖ్యమైన పనిమీద నాలుగురోజులక్రితం గుంటూరొచ్చాను. పని టెన్షన్ ఒకవైపు వెంటాడుతున్నా, ఇంకో రెండు మూడు రోజుల్లో ఎలాగైనా ఆ పని పూర్తిచేసుకొని వెళ్లగలనన్న నమ్మకంతో ఉన్నాను. పూర్తిచేసుకొనే వెళ్తాను.

కట్ టూ గుంటూరు పాలిటిక్స్ - 

ఇక్కడ నేను రోజూ ఏదోవిధంగా టచ్‌లో వుండే మిత్రులు, వ్యక్తులు రాజకీయాల్లో ఒక స్థాయిలో ఉన్నవాళ్లు.

నాటుగా చెప్పాలంటే .. తోపులు.

రాబోయే 9 రోజుల్లో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో, ఇక్కడి రాజకీయాలను నేను ప్రత్యక్షంగా గమనించే అవకాశం నాకు అనుకోకుండా ఏర్పడింది. 

ఈ నేపథ్యంలో -

నా వ్యక్తిగత అధ్యయనం కావొచ్చు, నా దగ్గరున్న సమాచారం కావొచ్చు .. గుంటూరు జిల్లా ఎన్నికల ఫలితాలు ఇలా ఉండబోతున్నాయి: 

జిల్లాలోని మొత్తం 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 12 నుంచి 13 స్థానాలను వైసీపీ గెలవబోతోంది.

సిటీలోని గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్ .. ఈ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీనే గెలవబోతోంది.

జిల్లాలోని ప్రతిష్టాత్మకమైన మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ఆర్కే-ఉరఫ్-ఆళ్ల రామకృష్ణారెడ్డి గెలవబోతున్నారు.   

గుంటూరు, నర్సారావుపేట, బాపట్ల .. గుంటూరుజిల్లాలోని ఈ మూడు పార్లమెంటరీ స్థానాలను వైసీపీనే స్వీప్ చేయబోతోంది.

ఒక్క గుంటూరులో మాత్రం గల్లా జయదేవ్ టఫ్ ఫైట్ ఇవ్వొచ్చు.

ఏపీ అంతటా ఉన్నట్టే, జగన్ వేవ్ ఇక్కడ కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది.

రాజకీయాల్లో మునిగితేలే ఇక్కడి నా మిత్రుల అంచనా ప్రకారం ఏపీలోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో 110 నుంచి 120 స్థానాలను వైసీపీ స్వీప్ చేయబోతోంది.

రాష్ట్రంలోని మొత్తం 25 పార్లమెంట్ స్థానాల్లో 20 నుంచి 22 స్థానాలను వైసీపీ గెల్చుకోబోతున్నది.

శ్రీకాకుళం, విజయనగరం, విజయవాడ పార్లమెంట్ స్థానాల్లో టీడీపీ ఎడ్జ్ కొంచెం బాగానే కనిపిస్తోంది.

ఏదేమైనా, మే 23 నాడు ఏపీ రాజకీయాల్లో ఒక సరికొత్త అధ్యాయానికి తెరలేవనుంది. దానికి కర్త, కర్మ, క్రియ అయిన వైసీపీ అధినేత వైయెస్ జగన్‌కు ముందస్తు శుభాకాంక్షలు.  

Tuesday 26 March 2019

రిటర్న్ గిఫ్ట్‌కు ఇంత పవరుంటుందా?!

మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ను ఓడించడం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు 101 ప్రయత్నాలు చేశాడు.

తెలంగాణలో బిస్కట్లకు ఆశపడే ప్రతి చిన్నా పెద్దా రాజకీయపార్టీలు, నాయకులతో కలిపి ఒక మహాకూటమి ఏర్పాటు చేశాడు.

ఏపీ నుంచి వెయ్యి కోట్ల ఫండ్స్ కూడా హైదరాబాద్‌కు తరలించాడని న్యూస్‌పేపర్లు, టీవీ ఛానెల్స్‌తోపాటు, సోషల్ మీడియా అంతా బ్రేకింగ్ న్యూస్ ఇచ్చాయి.

చివరికి అన్నీ విఫల ప్రయత్నాలయ్యాయి.

తెరాస స్వీప్ చేసింది.

బాబు, అతని గ్యాంగ్ బ్యాక్ టూ పెవిలియన్.

కట్ చేస్తే - 

ఇప్పుడు ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎలక్షన్లు జరుగుతున్నాయి.

అక్కడ తెరాస పోటీ చేయడంలేదు. తెరాసకు లోక్‌సభ ఎన్నికలున్నాయి.

ఏపీలో ఫలానా వారికే వోటెయ్యండి తెరాస అని చెప్పటంలేదు.

ఏపీకి వెళ్లి బాబును ఓడించడానికి, బాబులాగా ఏదో ఒక చెత్తకూటమిని అక్కడేదీ ప్లాన్ చేయలేదు.

ఎవ్వరూ తెరాస నుంచి అక్కడికి ప్రచారానికి వెళ్లలేదు.

కానీ అక్కడ జరుగుతున్నది వేరే ...

అదేదో కేసీఆర్ డైరెక్టుగా ఏపీ రాజకీయాల్లోకి వెళ్ళి .. అక్కడ ఏపీ మొత్తాన్ని అల్లకల్లోలం చేస్తున్న ఫీలింగ్‌ని చంద్రబాబు, పవన్ కళ్యాన్ అండ్ కో ఇస్తూ .. 24 గంటలూ కేసీఆర్ జపం చేస్తుండటం నిజంగా ఆశ్చర్యకరం!

కేసీఆర్ అక్కడ పోటీనే చేస్తలేడు. "కేసీఆర్, రా చూస్కుందాం. దమ్ముందా?" అంటున్నారు.

కేసీఆర్ ఒకే ఒక్కసారి ఒక ప్రెస్‌మీట్‌లో (చంద్రబాబుకు) "రిటర్న్ గిఫ్ట్ ఇస్తా" అన్నాడు.

ఆ ఒక్క మాటను ఏపీ ఎన్నికల్లో బాబుతోసహా, మరో వంద మంది గల్లీ పొలిటీషియన్లు లక్షసార్లు పలవరిస్తున్నారు.

ఇంతకు కేసీఆర్ ఇచ్చే ఆ రిటర్న్ గిఫ్ట్ ఏంటి?

దానికంత పవరుందా?!

సీన్ చూస్తుంటే ఉందనే అనిపిస్తోంది.  

Thursday 21 March 2019

గుంటూరు వెస్ట్ నుంచి "నచ్చావులే" మాధవీలత!

"చాలా మంది సినీ ఫీల్డులో - తాము అనుకున్న గోల్ రీచ్ కావడానికి ఎంతటి మూల్యాన్నయినా చెల్లిస్తారు. దేన్నయినా వొదులుకుంటారు. స్నేహాలు, ప్రేమలు, బంధాలు, అనుబంధాలు.. ఏవయినా కావొచ్చు. తమ కెరీర్ కోసం వాటిని తృణప్రాయంగా వొదిలేస్తారు. అది నేను చేయలేను. బహుశా అదే నా బలహీనత. అదే నా బలం కూడా. నా తొలి సినిమా మంచి హిట్టయినా నేను దాన్ని క్యాష్ చేసుకోలేకపోడానికి ఇది కూడా ఒక కారణం"

సుమారు ఓ అయిదేళ్లక్రితం నాతో ఈ మాటలన్నదెవరో కాదు .. నాకు మంచి మిత్రురాలు, కవయిత్రి, యూత్ హృదయాల్ని కొల్లగొట్టిన హిట్ సినిమా "నచ్చావులే" హీరోయిన్ మాధవీలత.

కట్ టూ ఎమ్మెల్లే అభ్యర్థి మాధవీలత - 

"సార్, మీ మాధవీలత గుంటూరు వెస్ట్ నుంచి ఎమ్మెల్లేగా పోటీచేస్తోంది .. తెలుసా?"

నాలుగురోజులక్రితం మా ప్రదీప్‌చంద్ర చెప్తే తెలిసిందీ న్యూస్ నాకు.

మాధవీలత వ్యక్తిత్వానికీ సినిమాలకే సింకవ్వలేదు. ఇంక పాలిటిక్స్‌లో ఏం చేస్తుందబ్బా అనుకున్నాను.

వెంటనే కాల్ చేశాను.

గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో ప్రచారం, సమావేశాలతో ఫుల్ బిజీగా ఉంది!

పది నిమిషాల్లో కొంచెం ఫ్రీ చేసుకొని కాల్ చేసింది మాధవీలత.

సుమారు ఓ అరగంట మాట్లాడుకొన్నాం.

అదే స్వఛ్చమైన  భాష, భావుకత్వం, వ్యక్తీకరణ, స్వీయ విశ్లేషణ.

ఏం మారలేదు!

డైరెక్ట్‌గా పాయింట్‌కొచ్చాను.

"అసలు మాధవీలతేంటి, ఈ పాలిటిక్స్ ఏంటి?" అడిగాను.

"కొన్ని కొన్ని అలా జరుగుతుంటాయి. మీరు రైటర్, డైరెక్టర్ .. మీకు చెప్పాలా?" నవ్వింది మాధవీలత.

నిజమే.

జీవితంలోని ఏ మజిలీలో ఎలాంటి ట్విస్టులొస్తాయో, ఎలాంటి నిర్ణయాలు తీసుకొంటామో, అప్పటివరకూ అనుకోని ఏ దిశలో ప్రయాణం కొనసాగిస్తామో ఎవ్వరం చెప్పలేము.

మాధవీలత స్వస్థలం ప్రకాశం జిల్లాలో ఓ చిన్న గ్రామం. నాన్న రైల్వే ఉద్యోగి. అమ్మ గృహిణి. ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు. ఒక్క చిన్నన్నయ్య మాత్రం ఉద్యోగరీత్యా 'ఆర్మీ'లో ప్రస్తుతం సౌత్ ఆఫ్రికాలో ఉంటున్నారు.

ఎమ్మే సోషియాలజీ (మైసూర్ యూనివర్సిటీ), ఎమ్మెస్సీ ఫ్యాషన్ టెక్నాలజీ (UK) చేసిన మాధవీలత పుట్టింది హుబ్లీలో. అక్టొబర్ 2 ఆమె పుట్టిన రోజు కావడం మరొక విశేషం.

సోషల్ సర్వీస్‌లో చిన్నతనం నుంచి చాలా ఆసక్తివున్న మాధవీలత రాజకీయ రంగప్రవేశం అనుకోకుండా జరిగింది. ఇప్పుడు గుంటూరు వెస్ట్ నుంచి బీజేపీ తరపున ఎమ్మెల్లే అభ్యర్థిగా బరిలో ఉంది.

ఒక జాతీయపార్టీగా బీజేపీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వం, ఆయన పనితీరు అంటే మాధవీలతకు చాలా ఇష్టం.   

గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో కాంపిటీషన్ ఇప్పుడు నాలుగుస్థంబాలాటలాగుంది. అధికార తెలుగుదేశం, వైసీపీ, జనసేన, బీజేపీ రంగంలో ఉన్నాయి.

గెలుపు అంత సులభం కాదు. చాలా చాలా కష్టపడాల్సివుంటుంది. 

ఈ వాస్తవం మాధవీలతకు బాగా తెలుసు.

అందుకే, ఒక్క క్షణం వృధాచేయకుండా, నామినేషన్ వెయ్యడానికి ముందే నియోజకవర్గం మొత్తం తిరుగుతూ ప్రజల సమస్యలు అన్నీ తెలుసుకోవడంలో యమ బిజీగా ఉంది మాధవీలత. ఈ విషయంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మినారాయణ, రాష్ట్ర కార్యదర్శి వల్లూరి జయప్రకాశ్ నారాయణ్ వంటి సీనియర్ల సలహాలు తీసుకొంటూ పూర్తిస్థాయిలో తన పనిలో తను ముందుకు దూసుకుపోతోంది.

అంతకుముందు ఎన్నో పార్టీలనుంచి ఎంతోమంది ఎమ్మెల్లేలు, ఎంపీలుగా గెలిచినా ఇప్పటివరకు గుంటూరు వెస్ట్‌లో ఉన్న అతి ప్రాధమికమైన డ్రైనేజ్, గార్బేజ్ సమస్యలను పరిష్కరించకపోవడం నిజంగా ఆశ్చర్యకరం అంటుంది మాధవీలత.

"నియోజకవర్గంలోని రైతులతో సహా అంతా బాగా చదువుకున్నవారే. వారందరితో కలిసి మాట్లాడటం ద్వారా కూడా ఇక్కడి అనేక సమస్యలను గురించి తెలుసుకున్నాను. నన్ను గెలిపించండి. హైదరాబాద్ నుంచి నా మకాం పూర్తిగా గుంటూరుకే మార్చేసి, అందరినీ కలుపుకుపోతూ, ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తాను" అంటుంది మాధవీలత.

ఎన్నో విషయాలను, ఎంతో అలవోకగా నాతో మాట్లాడిన మాధవీలతలో కొన్ని(పాజిటివ్) బలహీనతల్ని కూడా నేను మాటల మధ్యలో గుర్తించాను. అయితే, ఆ బలహీనతలే ఒక రకంగా తన బలం అంటుందామె.

"నేను బయటికి ఎంతో గర్విష్టిలా కనిపిస్తాను చాలా మందికి. కానీ - నా అంత ఎక్స్‌ట్రీమ్‌లీ ఎమోషనల్, నా అంత ఎక్స్‌ట్రీమ్‌లీ సెంటిమెంటల్ బహుశా ఎవరూ ఉండరు. అలాగే, నేను ఎంత సున్నితమైనదాన్నో అంత గట్టిదాన్ని కూడా" అంటుంది మాధవీలత.

"ఇప్పుడు రాజకీయాలంటే పాతపద్ధతిలోనే ఉండాల్సిన పనిలేదు. దేవేంద్ర ఫడ్నవీస్, కేటీఆర్, కవిత, సచిన్ పైలట్ లాంటి ఎందరో యువ రాజకీయనాయకులు పనిచేస్తున్నవిధానాన్ని కూడా మనం గమనించాలి. రాజకీయాలంటే ముందు మనల్ని నమ్మి మనకు వోటేసిన ప్రజలకు శక్తివంచనలేకుండా సేవచేయడం, వారి జీవన ప్రమాణాలను పెంచడం. ఆ తర్వాతే ఇంకేదైనా" అంటుంది మాధవీలత.

పాలిటిక్స్‌లోకి వచ్చేముందు తన మైండ్‌ను స్ట్రాంగ్‌గా ఫిక్స్ చేసుకొని వచ్చిన మాధవీలత ఫోకస్ అంతా ఇప్పుడు తనముందున్న ఈ ఏకైక లక్ష్యం మీదే ఉంది.

ఇతర పార్టీల అభ్యర్థులను, మాధవీలతను చక్కగా బేరీజు వేసుకొని గుంటూరు వెస్ట్ నియోజకవర్గం వోటర్లు సరైన నిర్ణయం తీసుకుంటారనీ, మాధవీలత విజయం సాధిస్తుందనీ నా నమ్మకం.

ఆల్ ది బెస్ట్ టూ మాధవీలత! 

Wednesday 20 March 2019

ఇక్కడ ఎవరు లైమ్‌లైట్‌లో ఉంటే వాళ్లే తోపులు!

నా మొదటి సినిమాలో ఒక మంచి విలన్‌ను ఫుల్ లెంగ్త్ రోల్‌లో పరిచయం చేశాను.

అతను నిజంగా చాలా మంచి యాక్టర్. నిజంగా చాలా బాగా యాక్ట్ చేశాడు.

నేననుకున్న కథ ప్రకారం, సినిమా చివర్లో కూడా, హీరోకంటే ఎక్కువ వెయిటేజ్ ఆ విలన్ కేరెక్టర్‌కే ఇచ్చాను.

ఇలా చేయడం వల్ల నేను ఆ విలన్ దగ్గర బాగా డబ్బులు తీసుకున్నానని అప్పట్లో ఆ చిత్రంలోని హీరో అనుకోవడం, టీమ్‌లో కొందరిదగ్గర అనటం కూడా జరిగింది.

హీరో నేనూ గుడ్ ఫ్రెండ్స్. అది వేరే విషయం.

కట్ చేస్తే -

ఇప్పుడా విలన్ మంచి పొజిషన్‌లో ఉన్నాడు.

నేను ఇండస్ట్రీకి పరిచయం చేసిన నటుడు కాబట్టి నాకు నిజంగానే సంతోషంగా ఉంటుంది.

ఆ నటునిపట్ల, అతని నటనపట్ల నా అలోచన మారదు. ఒక మనిషిగా అతని పట్ల నా ప్రవర్తన, నా యాటిట్యూడ్ మారవు. ఈరోజుకీ మారలేదు.

ఇంతకు మించి నేను ఆలోచించను. వేరే ఇంకేదీ ఆశించను.

మొన్నొక మిత్రుడు చెప్పాడు ... ఆ నటుని ఇంటర్వ్యూ ఒక దినపత్రిక ఆదివారం ఎడిషన్లో వచ్చింది. ఎవరెవరి గురించో చెప్పాడు కానీ, తొలి అవకాశం ఇచ్చి, ఇండస్ట్రీకి పరిచయం చేసి, అంత పూర్తిస్థాయి విలన్ రోల్ ఇచ్చిన నీ పేరు చెప్పలేదు ఆ నటుడు అని.

నేను నవ్వాను.

ఇదంతా ఉట్టి ట్రాష్. అసలు పట్టించుకోకూడదు.

ఇక్కడ ఎవరు లైమ్‌లైట్‌లో ఉంటే వాళ్లే తోపులు.

'అసలు సినిమా' ఇలాగే ఉంటుంది.

అసలు సినిమా అంటేనే ఇది!   

Monday 18 March 2019

వొక ఆధ్యాత్మిక క్షణమ్

"ఇక్కడ ఎవరూ శాశ్వతం కాదు.
ఏవో కొన్ని జ్ఞాపకాలను వదిలి..
ఎలాగు పోయేవాళ్ళమే ..
కాస్త.... వెనుక ముందూ..
ఈ లోగానే
విద్వేషాలు..విషం చిమ్ముకోవడాలు అవసరమా?"

ఆమధ్య, అనుకోకుండా ఒకసారి, సీనియర్ జర్నలిస్టు కె ఎన్ మూర్తి గారి ఫేస్‌బుక్ టైమ్‌లైన్ మీద ఇది చదివాక చాలా ఆలోచించాను.

బాగా డిస్టర్బ్ అయ్యాను.

మొన్నీమధ్యే నా చిన్న తమ్మున్ని కోల్పోయాను. అంతకు రెండేళ్లక్రితం మా అమ్మ మాకు దూరమైపోయింది.

చావు, పుట్టుకలు మనచేతిలో ఉండకపోవచ్చు. మనం అస్సలు ఊహించనివిధంగా జరగొచ్చు. కానీ, ఇవి జరిగిన సమయంలో నేను నేనుగా లేను. అది నన్ను ఇంకా ఇంకా బాధిస్తుంది.

ఏవేవో గుర్తుకొస్తున్న ఈ క్షణం,  అంతా ఒక మాయలా అనిపిస్తుంది. నమ్మశక్యం కాకుండా ఉంటుంది. అసలిలా జరిగిందా అనిపిస్తుంది.

కానీ, అన్నీ జరిగాయి.

అదే జీవితం.

జీవితంలో ఎవ్వరు ఎంత ఎదిగినా, ఎగిరెగిరిపడ్దా, ఎన్ని లాజిక్కులు మాట్లాడినా, ఎంత ఈగోతో చెలరేగినా .. అందరూ చివరికి ఏదో ఒక శక్తికి సరెండర్ అవ్వాల్సిందే.

ఆ శక్తికి మనం పెట్టుకొనే పేరు ఏదైనా కావొచ్చు. కానీ, సరెండర్ అవ్వక మాత్రం తప్పదు.

అదే జీవితం. అదే ఆధ్యాత్మికమ్.

ఆధ్యాత్మికంలో ఉండే ఆ నిరాడంబరత వేరు. ఆ ఆనందం వేరు.

ఆ నిశ్చలత్వం .. ఆ నిశ్శబ్దం .. అసలా కిక్కే వేరు.

అందుకే, 1920 ల్లోనే మహా అగ్రెసివ్ రచయిత అయిన చలం లాంటివాడు కూడా చివరికి రమణమహర్షి ఆశ్రమం చేరక తప్పలేదు.

అలాగని ఆధ్యాత్మికం అంటే అన్నీ వదిలేయటం కూడా కాదు.

కాకూడదు.

Sunday 17 March 2019

రాక్షస రాజకీయం!

తెలంగాణలో వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు 'పొలిటికల్ సీజన్' మంచి వూపులో ఉన్నప్పుడు నాలుగు మాటలనుకుంటారు. నాలుగు ఆరోపణలు చేసుకుంటారు.

అది సహజం.

మళ్లీ ఎక్కడయినా ఎదురైనప్పుడో, లేదా .. ఏదో పనిమీదో, ఫంక్షన్‌లోనో కలిసినప్పుడు "ఆన్నా, బాగున్నావే" అని మర్యాదగా, ప్రేమగా పలకరించుకుంటారు.

రాజకీయాలు వేరే. స్నేహాలు, బంధుత్వాలు వేరే.

అన్నిటికంటే ముందు మానవత్వం ఇక్కడ పరిమళిస్తుంది.

కట్ చేస్తే - 

ఈ మధ్య నేను ఎక్కువగా ఆంధ్రలో నా వ్యక్తిగత, వృత్తిగత పనులమీద ఎక్కువగా తిరుగుతున్నాను.

నా వృత్తిగత పనులు కొన్ని డైరెక్టుగా రాజకీయాలతోనే ముడిపడి ఉన్నందువల్ల .. చాలా దగ్గరినుంచి ఆంధ్ర రాజకీయాలను, రాజకీయనాయకులను, బేసిగ్గా అక్కడి రాజకీయరంగాన్ని బాగా స్టడీ చేసే అవకాశమొచ్చింది.

తప్పయితే క్షమించండి, కానీ, వ్యక్తిగతంగా నాకయితే నచ్చలేదు.

చెప్పే మాట వేరు. చేసేది పూర్తిగా దానికి ఉల్టా ఉంటుంది. లేదా అసలేం జరగదు. ఇంచ్ కదలదు.

ప్రామిస్‌లకు విలువ అస్సలు లేదు.

ఒక అభ్యర్థిని ఒక ఎమ్మెల్లేనో, పార్లమెంటు స్థానానికో ఎన్నిక చేసినట్టు చెబుతారు. అన్ని పేపర్లు, వివరాలు తీసుకుంటారు. నామినేషన్స్ కూడా వాళ్లే ఫిలప్ చేసి, సంతకాలు తీసుకొని రెడీగా పెడతారు. తెల్లారితే "జాబితా ప్రకటన .. ఇంకేం మార్పుల్లేవ్ .. ఉండవ్" అనుకుంటాము. వాళ్లూ అదే చెబుతారు.

తెల్లారుతుంది. జాబితాలో పేరుండదు!

2019 లో, ప్రపంచం అంతా ఒక మంచి "న్యూ ఏజ్" పాజిటివ్ మార్పుకోసం తపిస్తోంటే, ఇక్కడ మాత్రం 65 దాటిన, మృదుస్వభావి అయిన, ఒక పొలిటికల్ లీడర్‌ను అతి కిరాతకంగా నరికేస్తారు.

శరీరంపైన కత్తి గాట్లు, గొడ్డలివేట్లున్నా - దాన్ని ముందు "కార్డియాక్ అరెస్ట్" అంటారు. తర్వాత హత్య అంటారు.

రోజంతా పొలిటికల్ డ్రామా నడుస్తుంది.

తెల్లారి రెండు పార్టీలవారు ఎవరి ఎన్నికల ప్రచారానికి వారు హెలికాప్టరేసుకొని ఎగిరిపోతారు.

వారి మాటలను నమ్మి లక్షలు, కోట్లు ఖర్చు చేసి అన్ని కోల్పోయినవారు వీధినపడతారు. అప్పటిదాకా 'ఆహా ఓహో' అన్నవారు అసలు పట్టించుకోరు. అలా సర్వం కోల్పోయినవాడు పైస పైసకు వెతుక్కుంటూ చావలేక బ్రతుకుతుంటాడు.

ఇదే ఉదాహరణ తెలంగాణలో అయితే - ఏకంగా కేసీఆర్ మీదే పోటీచేసి సర్వం కోల్పోయిన లీడర్‌ను అతని పార్టీ పట్టించుకోలేని పరిస్థితిలో, టీఆరెస్సే ఆహ్వానించి అక్కునచేర్చుకొంది. ఆదుకొంది.

కట్ టూ ఇంకో చిన్న ఉదాహరణ -

నామినేషన్ వేయకముందే అధికారపార్టీ బెదిరింపులు, కాల్స్ మొదలౌతాయి. ఇంటికి పోలీసులొస్తారు. యస్పీ స్వయంగా ఆ అభ్యర్థికి కాల్ చేస్తాడు. ఇంకొకడు కాల్ చేసి "చావాలనుందా" అని టెర్రరైజ్ చేస్తాడు.

ఇన్నీ ఎదుర్కొని, నానా కష్టాలు పడ్ద తర్వాత - ఆ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం టిక్కెటుండదు!

తెలంగాణలో రాజకీయాల్లేవని కాదు. కానీ, ఇంత ఘోరంగా మాత్రం లేవు.

నరుక్కొవడాలు, చంపుకోవడాలు అస్సల్లేవ్.

అంతెందుకు .. ఉద్యమసమయంలో విద్యార్థులను వెంబడించి కొట్టినవారిని, కేసీఆర్‌ను, టీఆరెస్‌ను తిట్టినతిట్టు తిట్టకుండా తిట్టినవారిని కూడా .. రాష్ట్రం ఏర్పడ్ద తర్వాత గతమంతా మర్చిపోయి, పార్టీలోకి తీసుకొన్నారు. మంత్రి పదవులు కూడా ఇచ్చారు.

ఏం చేసినా తెలంగాణ దీర్ఘకాలిక ప్రయోజనం కోసమే.

అలాగే - పార్టీలు మారినా, ఏం చేసినా రక్తపాత రహితంగా.

అన్ని కోట్లమందితో, అంత సెన్సిటివ్ తెలంగాణ ఉద్యమాన్ని సహితం నడిపి సాధించింది కూడా రక్తపాత రహితంగానే.

హాట్సాఫ్ టూ కేసీఆర్!

రాజకీయాలు ప్రజలకు సేవచేయడానికే తప్ప ఇట్లా నిలువెత్తు  రాక్షసత్వం చూపడానికి మాత్రం కాదు. 

Wednesday 13 March 2019

మరొక్కసారి వార్ వన్‌సైడే!

నిజామాబాద్ లోక్‌సభ స్థానానికి ఎన్నికల్లో పోటీచేయడానికి కాంగ్రెస్ పార్తీ దరఖాస్తులు ఆహ్వానిస్తే, ఒక్కరంటే ఒక్కరు ముందుకు రాలేదు.

అసెంబ్లీ ఎన్నికలప్పుడు కేసీఆర్, టీఆరెస్‌ల మీద ఎగిరెగిరిపడి అరచిన నోళ్లు ఇప్పుడు పూర్తిగా మూతబడ్డాయి. మొన్నటిదాకా కాంగ్రెస్‌లో అతిరథమహారథులనుకొన్నవారంతా ఇప్పుడు ఒక్క సీటులో పోటీచేయడానికి ముందుకురాలేకపోవడం అనేది ఆ పార్టీ ఇప్పుడున్న అత్యంత దయనీయ పరిస్థితిని తెలుపుతోంది. 

'రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తాం' అని గప్పాలు కొట్టిన బీజేపీకి పోటీ చేయడానికి అసలు క్యాండిడేట్స్ లేరు.

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏం లేకపోయినా అంతో ఇంతో కామెడీగా శబ్దం చేసిన కోదండరాం పార్టీ అసలు పత్తా లేదు.

ఇక తెలుగుదేశం అనేది తెలంగాణలో ఒక ఒడిశిన కథ.

ఇదీ తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పరిస్థితి.

దేశంలోని ప్రతి సర్వే ఇదే చెబుతోంది.

మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కుట్రపూరితంగా ఒక చెత్త సర్వే ఇచ్చి అత్యంత దారుణంగా ఎగతాళి కాబడ్ద లగటపాటి, ఇక్కడి లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన తన విలువైన సర్వే ఇంకా విడుదల చెయ్యలేదు.       

కట్ చేస్తే - 

మిత్రపక్షమైన ఎం ఐ ఎం ఒక స్థానం పోగా, మిగిలిన 16 లోక్‌సభ స్థానాల్లో టీఆరెస్‌కు అసలు పోటీలేదు.

ఎంత మెజారిటీ ఎక్కువ సాధించాలి అన్నదే ఇప్పుడు టీఆరెస్ ముందున్న లక్ష్యం.

మరొక గమ్మత్తైన విషయం ఏంటంటే - టీఆరెస్ రేపు సునాయాసంగా గెలవబోతున్న ఈ 16 స్థానాల్లో ప్రతి ఒక్కరు, తాము ఎంత ఎక్కువ మెజారిటీతో గెలుస్తామా, దానికోసం ఏం చెయ్యాలా అన్నదానిమీదే ఫోకస్ చేసి, ఆ దిశలో కృషి చేస్తుండటం!

బహుశా ఇలాంటి వన్‌సైడ్ వార్ ఇంతకు ముందెప్పుడూ దేశంలో జరిగి ఉండదు.

క్రెడిట్ గోస్ టూ కేసీఆర్.

కేటీఆర్ ఇప్పుడు సర్వసైన్యాధిపతి. ఎన్నికల సన్నాహక సభలలో, ఇతర దిశానిర్దేశ సమావేశాల్లో కార్యకర్తలకు ఉత్సాహం ఇస్తూ, వైరి పక్షాలను ఒక ఆట ఆడుకుంటున్నారు.

మన పని 11 ఏప్రిల్‌నాడు వోటు వేయడం, ముందే తెలిసిన ఫలితాలను 23 మేనాడు మీడియాద్వారా తెలుసుకోవడం.

దాదాపు ప్రతిపక్షం అనేది లేకుండా పోయి, ఈ వార్ ఇంత చప్పగా, నల్లేరుమీద నడకలా ఉండటం కూడా కేసీఆర్ వ్యూహరచనంలో ఒక భాగం అని నా ఉద్దేశ్యం.    

Monday 11 March 2019

Addicted to KCR

ఈరోజు నుంచీ, 11 ఏప్రిల్ నాడు తెలంగాణలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలు అయిపోయి, టీఆరెస్ పోటీచేసే 16 లోక్‌సభ స్థానాలను గెల్చుకొన్న ఫలితాలు వచ్చేవరకూ  .. నా ట్విట్టర్‌లో, బ్లాగులో,  .. నేను ఎప్పుడూ పోస్ట్ చేసే నా రెగ్యులర్ పోస్టులతోపాటు .. నా అభిమాన కేసీఆర్, టీఆరెస్ లకు అనుకూలమైన పోస్టులు కూడా కొల్లలుగా ఉంటాయి.

చెప్పాలంటే, 23 మే నాడు ఫలితాలు వచ్చేవరకూ, కేసీఆర్/టీఆరెస్/పొలిటికల్ పోస్టులే ఎక్కువగా ఉంటాయి.

కేసీఆర్ 'హార్డ్ కోర్ ఫ్యాన్' గా, ఇది పూర్తిగా నాకు నేను వాలంటరీగా చేస్తున్న పని.

ఒక తెలంగాణ బిడ్డగా ఇది నా బాధ్యతగా భావించి, ఉడతా భక్తిగా నేనీ పని చేస్తున్నాను.

రాజకీయాలు వేరు, స్నేహం వేరు అనుకోగలిగిన నా మిత్రులు ఏపార్టీవారైనా నా బ్లాగ్ పోస్టులను, ట్వీట్‌లను హాయిగా ఎంజాయ్ చెయ్యొచ్చు.

సింపుల్ గా ఇగ్నోర్ కూడా చెయ్యొచ్చు.

అది మీ ఇష్టం.

ఇది అస్సలు నచ్చని మిత్రులు ఎవ్వరైనా ఉంటే, నన్ను వెంటనే 'అన్ ఫాలో' కావొచ్చు. నిర్మొహమాటంగా బ్లాక్ చెయ్యొచ్చు.

అర్థంలేని, నిర్మాణాత్మకంగా లేని కామెంట్స్ కు మాత్రం నా ట్విట్టర్‌లో, బ్లాగ్‌లో స్థానం లేదని సవినయ మనవి.            

Sunday 10 March 2019

ఔర్ ఏక్ ధక్కా .. 16 పక్కా!

"When Politics Decides Your Future, Decide What Your Politics Should Be!"

ఎవరి కొటేషనో తెలియదు. కాని, దీన్ని ఆమధ్య ఇప్పటి మన టీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫేస్‌బుక్ పేజీ మీద కూడా చూశాను.  


సవాలక్ష పనికిరాని రొటీన్ కొటేషన్లలో ఇదొకటి కాదు. తప్పనిసరిగా అందరూ పట్టించుకోవల్సిన కొటేషన్. బాగా ఆలోచించాల్సిన కొటేషన్.

ముఖ్యంగా, బాగా చదువుకున్నవాళ్లు మరింతగా అలోచించాల్సిన కొటేషన్ ఇది.

ఎందుకంటే - స్టాటిస్టిక్స్ ప్రకారం, రాజకీయాలపట్ల పూర్తి నిరాసక్తంగా ఉండే ఒకే ఒక్క అత్యంత బాధ్యతారాహిత్యమైన సెగ్మెంట్ ఈ బాగా చదువుకున్నవాళ్లే!

రాజకీయాల్ని అసలు పట్టించుకోరు. వోటింగ్ రోజు పోలింగ్ బూత్‌కు వెళ్లరు.

అంత నిరాసక్తత.

ఈ ఒక్క సెగ్మెంట్ నిరాసక్తతే ఈ రోజు మన దేశాన్ని ఎందుకూ పనికిరానివాళ్లు దశాబ్దాలుగా పాలించడానికి కారణమైంది. దేశం ఎన్నోరకాలుగా వెనకబడటానికి కారణమైంది. స్వతంత్రం వచ్చి 70 ఏళ్లు దాటినా - ఇంత జనాభా, మానవ వనరులు, సహజ వనరులు ఉండి కూడా, ఈ దేశం ఇంకా ఒక 'అభివృధ్ధిచెందుతున్న దేశం' గానే ఉండటానికి కారణమైంది.

సోషల్ మీడియా పుంజుకున్న తర్వాత ఈ విషయంలో కొంతయినా మార్పు వచ్చిందనే అనిపిస్తోంది. అయితే ఈ మార్పు కేవలం సోషల్ మీడియాకే పరిమితం కాకూడదు. రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయిలో రావాలి.

దానికి ఇదే సరైన సమయం. 

కట్ టూ మన 16 పార్లమెంట్ స్థానాలు - 

మొట్టమొదటిసారిగా ఒక పూర్తిస్థాయి విభిన్న రాజకీయనాయకున్ని కేసీఆర్‌లో చూస్తున్నాము. 

ఒక దార్శనికుడుగా, ఒక మానవీయమూర్తిగా ఆయన ప్రవేశపెట్టిన/చేసి చూపించిన అనేక ప్రజాసంక్షేమ పథకాలు, అభివృధ్ధి పనులు ఇప్పుడు దేశంలోని చాలా రాష్ట్రాలు అనుసరిస్తున్నాయి.

కేంద్రప్రభుత్వం కూడా!

ఉద్యమకాలంలో కేసీఆర్‌ విశ్వరూపం ఒక ఎత్తు కాగా, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా వివిధ కోణాల్లో అనితరసాధ్యమైన ఆయన సామర్థ్యం మరొక ఎత్తు.

కేసీఆర్‌లోని ఈ విభిన్నత, ఈ వైవిధ్యమే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి కూడా టీఆరెస్ అద్భుత విజయం సాధించడానికి కారణమైంది.

ఇదే స్థాయి విజయాన్ని, రెట్టించిన ఉత్సాహంతో, రేపు లోక్‌సభ ఎన్నికల్లో కూడా సాధించాలి. అప్పుడే టీఆరెస్ విజయం సంపూర్ణమౌతుంది.

లోక్‌సభ స్థానాలకు సంబంధించి, తెలంగాణలో టీఆరెస్‌కు గట్టి పోటీ ఇచ్చే పార్టీలు అసలు లేవు.

ఇక్కడ పోటీ టీఆరేస్‌కు టీఆరెస్‌తోనే.

రేపు టీఆరేస్‌ పోటీచేయబోయే 16 స్థానాల్లో, ఏ స్థానంలో ఎవరెక్కువ మెజారిటీ సాధిస్తారన్నదే అసలు పోటీ.

ఏప్రిల్ 11 పోలింగ్, మే 23 ఫలితాలు.

మస్త్ మజా ఆయేగా ...  

Wednesday 6 March 2019

నిరంతరం తెలంగాణం!

ఏ పనీపాటా లేనివాడైనా సరే, సొషల్‌మీడియాలో రోజుకు ఒక పది పోస్టులు/ట్వీట్‌లు పెట్టొచ్చు. అతికష్టం మీద ఓ నాలుగైదు కామెంట్‌లు చెయ్యొచ్చు.

అంతకు మించి చెయ్యటం అనేది చాలా బోరింగ్. చాలా కష్టం.

కానీ, మొన్న తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ సమయంలో, ఉన్నట్టుండి ఒక పేరుతో పోస్టులు/ట్వీట్‌లు రోజుకి వందల్లో కనిపించాయి నాకు.

నిజంగా వందల్లోనే!

బాగా ఆశ్చర్యపోయాను.

అదే పని చెయ్యమని ఓ లక్షరూపాయల జీతమిచ్చి పెట్టుకున్నా .. అంత సిన్సియర్‌గా, అంత వేగంగా, అంత అర్థవంతంగా, అన్ని వందల పోస్టులు/ట్వీట్‌లు పెట్టేపని ఎవ్వరూ చెయ్యరు, చెయ్యలేరు.

అసలెవరితను అని ప్రొఫైల్ చూశాను.

ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. లండన్ టెక్‌మహీంద్రలో ప్రాజెక్ట్ మేనేజర్.

మరింత క్యూరియాసిటీ పెంచాడతను ...

ఇతనికి కేసీఆర్ గాని, కేటీఆర్ గాని, కవిత గాని, ఇంకెవరైనాగాని .. లేదా టీఆరెస్ పార్టీగాని డబ్బేమీ ఇవ్వటంలేదు. మంచి జాబ్‌లో లండన్‌లో ఉన్నాడు. అసలెందుకింత కష్టపడుతున్నాడు? ఇంత భారీ సంఖ్యలో సోషల్‌మీడియాలో పోస్టులు/ట్వీట్‌లు ఎలా పెడుతున్నాడు? పైగా వాటిల్లో కనీసం ఓ 10 శాతం పోస్టులు/ట్వీట్‌లకు ఫోటోలు, కాప్షన్స్ వగైరాలతో ఫోటోషాప్ డిజైన్స్ కూడా!

కట్ చేస్తే - 

తర్వాత కొన్నిరోజులకు .. ఒకసారి అనుకోకుండా ట్విట్టర్ ఇన్‌బాక్స్‌లో పలకరించుకొన్నాం. ఇంకో రెండుసార్లు ట్విట్టర్‌లో రెండుమూడు నిమిషాలకు మించని చాట్ చేశాం.

మొత్తం పిక్చర్ నాకప్పుడు తెలిసింది ...

ఆమధ్య నేనొక బ్లాగ్ రాశాను, "సోషల్‌మీడియా సైన్యం .. కేసీఆర్ కోసం" అని.

అలాంటి సైనికుడితను. 

సూర్యాపేటకు దగ్గర్లో ఉన్న అడివెంల గ్రామంలో, వాళ్ల అమ్మమ్మ గారింట్లో పుట్టాడు. ఖమ్మం జిల్లా పాల్వంచలో డీఏవీ, నవభారత్ స్కూళ్లలో చదువుకున్నాడు. పాల్వంచలోనే యాడమ్స్ ఇంజినీరింగ్ కాలేజిలో బీటెక్ చేశాడు.

తండ్రి తిరుపతయ్య 'స్పాంజ్ ఐరన్ ఇండియా లిమిటెడ్ ఎన్ ఎమ్ డి సి' పాల్వంచలో రిటైరయ్యారు. తల్లి లింగమ్మ గృహిణి.

క్రమశిక్షణ, పొదుపు, అందరితో బాగుండటం అనేది తల్లిదండ్రుల నుంచే వచ్చింది. ఒక మనిషి ఉన్నంతలో సుఖంగా బ్రతకాలంటే ఈ మూడే ముఖ్యం. వీటిల్లో ఏ ఒక్కటి బాగాలేకపోయినా మిగిలిన రెండు సరిగ్గా ఉండవు.

ఎక్కడికెళ్లినా, ఎంత ఎత్తుకెదిగినా మన మూలాలు మర్చిపోకూడదు. అలా ఉన్నప్పుడే సాటిమనిషిపట్ల ప్రేమ, మానవత్వం అనేవి కూడా అతి సహజంగా మనలో ఎప్పుడూ బ్రతికే ఉంటాయి.

అలాంటి నేలమీదుండే మనిషితను. 

భార్య ప్రవల్లిక లండన్‌లోనే డెంటల్ కేర్ ప్రొఫెషనల్‌గా పనిచేస్తోంది.

వాళ్ళిద్దరికీ ఒక పాప - వైష్ణవి.

ఆల్ హాపీస్ ...

ఇప్పుడు చేస్తున్న ఐటి ఉద్యోగంతోపాటు, NRI TRS UK లండన్ ఇంచార్జిగా కూడా పనిచేస్తున్నాడితను. 

ఒక స్థాయిలో స్థిరపడ్డ తర్వాత రాజకీయాల్లోకి రావాలని ఉంది కానీ, ప్రత్యక్ష రాజకీయాలు మాత్రం కాదు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, రెండోసారి ఎన్నికల్లో టీఆరెస్ అద్భుత విజయం ..
ఈ రెండూ అతనెన్నడూ మర్చిపోలేని అద్భుత జ్ఞాపకాలు.

ఎక్కువగా లండన్‌లోనే ఉండటంవల్ల కేసీఆర్ గారిని ఎప్పుడూ వ్యక్తిగతంగా కలిసే అవకాశం రాలేదు. కానీ .. ఏదో ఒకరోజు, ఆరోజు కూడా వస్తుందని అతని నమ్మకం. 

ఇంట్లో రాజకీయ నేపథ్యం అసలు లేకపోయినా, చిన్నప్పటినుంచే రాజకీయాలపట్ల, రాజకీయాలకు సంబంధించిన పుస్తకాలు చదవడంపట్ల ఏర్పడిన ఆసక్తి ఇప్పటికీ ఇతనిలో కొనసాగుతోంది.

ముఖ్యంగా 1969 తెలంగాణ ఉద్యమ చరిత్ర, 2001 లో కేసీఆర్ TRS స్థాపన, కేసీఆర్ ఉపన్యాసాలు ఇతన్ని బాగా ఇన్‌స్పైర్ చేశాయి.

వరంగల్, నల్గొండ జిల్లాల్లోని కొన్ని గ్రామాలకెళ్లినపుడు .. అక్కడ ఎప్పుడూ కనిపించే కూలిపోయిన గోడలు, ఎండిపోయిన చెరువులు, అక్కడి పేదరికం, వెనుకబాటుతనం కూడా ఇతన్ని బాగా కదిలించేవి.

వీటన్నిటి ఇన్స్‌స్పిరేషనే .. అనుక్షణం .. తను పుట్టిన తెలంగాణ కోసం తనకు చేతనయింది ఏదయినా చేయాలనిపించేలా చేస్తోంది.

ఆ నిరంతర తపనే అతనిచేత సోషల్‌మీడియాలో రోజూ ఇన్ని వందల పోస్టులు/ట్వీట్‌లు పెట్టేలా చేస్తోంది.

ఎవరో చెప్పారనో, ఏదో పేరు కోసమో కాదు .. అచ్చంగా తెలంగాణకోసం, ఆ తెలంగాణను సాధించిన కేసీఆర్ కోసం, స్వచ్చందంగా పోరాడే సైనికుడితను.

ఇతని పేరు భువనగిరి నవీన్.

ఇతని నిరంతర గానం .. తెలంగాణం.  

Monday 4 March 2019

టీ ఆర్ పీ మీడియా

ఇది అభినందన్ ఇంకా పాక్ కస్టడీలోనే ఉన్నప్పటి విషయం ...

అక్కడ పాకిస్తాన్‌లో ఆర్మీ కస్టడీలో ఉన్న వింగ్ కమాండర్ అభినందన్‌ను "ఇండియాలో నీదే ప్రాంతం?" అని ప్రశ్నించారు.

"నేనది చెప్పకూడదు" అని ఎలాంటి భయంలేకుండా జవాబును దాటవేశాడు అభినందన్.

శతృదేశం చెరలో, అంత భయంకరమైన సిచువేషన్లో ఉండి కూడా!

కట్ చేస్తే - 

"ప్రస్తుతం మేము ఎక్కడున్నామో మీకు తెలుసా? చెన్నైలో, మన వింగ్ కమాండర్ అభినందన్ ఇంటి గేటు దగ్గరున్నాం. ఇదే పాకిస్తాన్ చెరలో ఉన్న మన అభినందన్ ఇల్లు. ఈ ఇంట్లో వాళ్ల అమ్మ, నాన్న ఉంటారు. అభినందన్ భార్య, కొడుకు ఢిల్లీలో ఉంటారు. అతని భార్య ..."

ఇదీ కామన్‌సెన్స్ లేని మన మీడియా జోష్!

ఒక బాధ్యతగల జవాన్‌గా అభినందన్ దాచిపెట్టిన విషయాన్ని, మన దేశపు 101 న్యూస్ టీవీ చానళ్లు చాలా సింపుల్‌గా, బాహాటంగా, బహిరంగపరిచాయి.

పాకిస్తాన్‌కు ఇంకేం కావాలి?

అందుకే .. మీడియా అయినా సరే, దేశభద్రత వంటి కొన్ని విషయాల్లో నియంతృత్వం అనేది చాలా అవసరం.

ఇదే సోషల్ మీడియాకు కూడా వర్తిస్తుంది.