Sunday 31 March 2019

ఏపీ రాజధాని జిల్లా ఎటువైపు?

గుంటూరుజిల్లాతో నాకు చాలా మంచి జ్ఞాపకాలున్నాయి.

ఉస్మానియా యూనివర్సిటీలో నా రెండో పీజీ చదువుతుండగానే నాకిక్కడి నవోదయ విద్యాలయ, మద్దిరాలలో కేంద్రప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. ఇక్కడ రెండేళ్లు పనిచేశాక, ఇంకో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నాకు ఆలిండియా రేడియోలో వచ్చింది. అప్పుడు అతి కష్టమ్మీద ఇక్కడి జాబ్‌కు రిజైన్ చేసి ఆలిండియా రేడియోకి వెళ్లాను.

గుంటూరు జిల్లాతో అప్పటి నా జ్ఞాపకాలు ఇంకా ఫ్రెష్‌గానే ఉన్నాయి ...

వృత్తిగతంగా ఒక అతిముఖ్యమైన పనిమీద నాలుగురోజులక్రితం గుంటూరొచ్చాను. పని టెన్షన్ ఒకవైపు వెంటాడుతున్నా, ఇంకో రెండు మూడు రోజుల్లో ఎలాగైనా ఆ పని పూర్తిచేసుకొని వెళ్లగలనన్న నమ్మకంతో ఉన్నాను. పూర్తిచేసుకొనే వెళ్తాను.

కట్ టూ గుంటూరు పాలిటిక్స్ - 

ఇక్కడ నేను రోజూ ఏదోవిధంగా టచ్‌లో వుండే మిత్రులు, వ్యక్తులు రాజకీయాల్లో ఒక స్థాయిలో ఉన్నవాళ్లు.

నాటుగా చెప్పాలంటే .. తోపులు.

రాబోయే 9 రోజుల్లో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో, ఇక్కడి రాజకీయాలను నేను ప్రత్యక్షంగా గమనించే అవకాశం నాకు అనుకోకుండా ఏర్పడింది. 

ఈ నేపథ్యంలో -

నా వ్యక్తిగత అధ్యయనం కావొచ్చు, నా దగ్గరున్న సమాచారం కావొచ్చు .. గుంటూరు జిల్లా ఎన్నికల ఫలితాలు ఇలా ఉండబోతున్నాయి: 

జిల్లాలోని మొత్తం 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 12 నుంచి 13 స్థానాలను వైసీపీ గెలవబోతోంది.

సిటీలోని గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్ .. ఈ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీనే గెలవబోతోంది.

జిల్లాలోని ప్రతిష్టాత్మకమైన మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ఆర్కే-ఉరఫ్-ఆళ్ల రామకృష్ణారెడ్డి గెలవబోతున్నారు.   

గుంటూరు, నర్సారావుపేట, బాపట్ల .. గుంటూరుజిల్లాలోని ఈ మూడు పార్లమెంటరీ స్థానాలను వైసీపీనే స్వీప్ చేయబోతోంది.

ఒక్క గుంటూరులో మాత్రం గల్లా జయదేవ్ టఫ్ ఫైట్ ఇవ్వొచ్చు.

ఏపీ అంతటా ఉన్నట్టే, జగన్ వేవ్ ఇక్కడ కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది.

రాజకీయాల్లో మునిగితేలే ఇక్కడి నా మిత్రుల అంచనా ప్రకారం ఏపీలోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో 110 నుంచి 120 స్థానాలను వైసీపీ స్వీప్ చేయబోతోంది.

రాష్ట్రంలోని మొత్తం 25 పార్లమెంట్ స్థానాల్లో 20 నుంచి 22 స్థానాలను వైసీపీ గెల్చుకోబోతున్నది.

శ్రీకాకుళం, విజయనగరం, విజయవాడ పార్లమెంట్ స్థానాల్లో టీడీపీ ఎడ్జ్ కొంచెం బాగానే కనిపిస్తోంది.

ఏదేమైనా, మే 23 నాడు ఏపీ రాజకీయాల్లో ఒక సరికొత్త అధ్యాయానికి తెరలేవనుంది. దానికి కర్త, కర్మ, క్రియ అయిన వైసీపీ అధినేత వైయెస్ జగన్‌కు ముందస్తు శుభాకాంక్షలు.  

4 comments:

  1. అంతా కేసీయారు గారి చలవ

    ReplyDelete
  2. నా అంచనా ప్రకారం గుంటూరు జిల్లాలో టీడీపీ ఖచ్చితంగా గెలిచే సీట్లు రెండే: పొన్నూరు & పెదకూరపాడు. ఇంకో రెండు మూడు సీట్లలో టఫ్ ఫైటు ఉండవచ్చు. తత్తిమ్మా 12 సీట్లలో వైకాపా సునాయాసంగా గెలుస్తుంది.

    ReplyDelete
    Replies
    1. వినుకొండ, చిలుకలూరి పేట, తెనాలి పోటా పోటీ అనుకుంటా

      Delete
  3. తెలంగాణ ఎన్నికల సమయంలో లగడపాటితో ఫేక్ సర్వే చేయించి పరువు పోగొట్టుకున్న పచ్చ బాచీ తాజాగా ఇంకో ఫేక్ సర్వే విడుదల చేసింది. సీబీఎన్ చంద్రజ్యోతి ఊదరగొడుతున్న సమాచారం ఇది:

    https://www.andhrajyothy.com/artical?SID=754283

    లోక్‌నీతి-సీఎ్‌సడీఎస్‌ అనే స్వతంత్ర సంస్థ సదరు సర్వే చేసినట్టు వేమూరి చెప్తున్నాడు. ఆ సంస్థ వారు మాత్రం తాము ఎటువంటి సర్వే చేయలేదని ప్రకటించారు.

    "Lokniti-CSDS has NOT done any survey in the State of Andhra Pradesh. What is being shared on social media is FAKE and complete rubbish!"

    https://twitter.com/lokniticsds?lang=en
    https://twitter.com/LoknitiCSDS/status/1112577889877323781

    ఇంతటి బరివాత దిగజారుడు ఎల్లో మీడియాకే చెల్లింది.

    ReplyDelete