Friday 9 June 2023

ఆదిపురుష్!


సినిమా ప్రధానంగా ఒక ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా. ప్రజల విశ్వాసాలకు, నమ్మకాలకు హాని కలిగించనంతవరకు సమస్య లేదు.

సినిమా మార్కెటింగ్ విషయంలో కూడా అంతే. ఇబ్బందిపెట్టని, బాధపెట్టని ఎలాంటి మార్కెటింగ్ గిమ్మిక్ అయినా ఓకే. 

అలాంటి ఒక ప్రయత్నమే లేటెస్టుగా ఆదిపురుష్ కోసం చేశారు. థియేటర్లో ఒక సీట్ హనుమంతుని కోసం ఖాళీ పెట్టాలని.  

అది వాళ్ళిష్టం. వాళ్ళ నమ్మకం. 

ఒక బజ్ అయితే బాగానే క్రియేట్ అయ్యింది. ఫ్రీ ప్రమోషన్ భారీగా జరుగుతోంది. 

వారి స్ట్రాటెజీ సక్సెస్ అయినట్టే. 

ఇక సక్సెస్ కావల్సింది సినిమా. 

కట్ చేస్తే -

ఓం రౌత్‌కి, టీసీరీస్‌కు రామాయణాన్ని 3D సినిమా రూపంలో అలా చెప్పాలనిపించింది. 

మరీ వరస్ట్ కండిషన్స్‌లో అదొక త్రీడీ కార్టూన్ మువీలా ఉండొచ్చు. తప్పేముంది? 

సంపూర్ణ రామాయణం చూసిన కాలంలోనే మనం ఆగిపోలేదు కదా? 

అప్పుడు గిర్రు గిర్రున డయల్ చేసే ఫోన్లుండేవి. ఇప్పుడే ఫోన్లు వాడుతున్నాం? 

సాంకేతికంగా వచ్చే మార్పులన్నీ మన జీవితంలోని ప్రతి పార్శ్వంలోనూ ప్రవేశిస్తాయి. సినిమా అందులో మొదటిది.

ప్రభాస్ కోసమో, కృతి సనన్ కోసమో ఈ సినిమా చూసే ఈ తరం ప్రేక్షకులు... కనీసం ఇలాగైనా రామాయణం అనేది ఒకటుంది, దాని కథ అది అని రామాయణం గురించి కొంతయినా తెలుసుకుంటారు. 

అసలు పుస్తకాలే చదవడం మర్చిపోతున్న ఈ తరానికి మన పురాణేతిహాసాలను ఇలాగైనా పరిచయం చేయడం మంచిదే అని పాజిటివ్‌గా ఎందుకు అనుకోకూడదు?

మరో వైపు... పూర్ గ్రాఫిక్స్, పాత్రల వేషధారణ, రావణున్ని పరోక్షంగా ఇంకో మత నేపథ్యంలో చూపించే ప్రయత్నం చేయడం వంటి విషయాల్లో ఆదిపురుష్ సినిమా పైన ఇప్పటికే ఆరోపణలున్నాయి. అవన్నీ ఈ సినిమాను ఎక్కడికి తీసుకెళ్తాయనే విషయం ఒక వారం తర్వాతే తెలుస్తుంది.     

ఇదంతా పక్కనపెడితే - 

అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా... సినిమా బాగుంటే చూస్తారు. బాగా లేకపోతే చూడరు.

Best wishes to Om Raut and his team.    

జై శ్రీరామ్!           

2 comments:

  1. శ్రీ రాముడు సూపర్ మేన్ అనుకుంటే పొరపాటే. రాముడు ఆదర్శ పురుషుడు, సకల గుణాభిరాముడు. ఒక యోధుడు గా చూపించినవసరం లేదు.

    ReplyDelete
  2. రామో విగ్రహవాన్ ధర్మః అన్నమాట ఉంది. ఆమాట అన్నది రాక్షసుడైన మారీచుడు! ఆ రాముడు అన్నారు ఆదర్శపురుషుడు యోధుడు కాడనేమాట రావణుడు అన్నది.

    మనం ఆధునికులం కాబట్టి పూర్వీకులకు మన ధోరణులను ఆపాదించరాదు కదా. ఆపాదించటాన్ని సమర్ధించడం మొదలుపెడితే ఆయనకు ఎవడోఒకడు మిలట్రీ డ్రస్సూ వేయవచ్చును తుపాకీ చేతిలోపెట్టవచ్చును.

    తప్పుడుధోరణులను కుంటిసాకులతో సమర్ధించకండి దయచేసి.

    ReplyDelete