Tuesday 26 March 2019

రిటర్న్ గిఫ్ట్‌కు ఇంత పవరుంటుందా?!

మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ను ఓడించడం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు 101 ప్రయత్నాలు చేశాడు.

తెలంగాణలో బిస్కట్లకు ఆశపడే ప్రతి చిన్నా పెద్దా రాజకీయపార్టీలు, నాయకులతో కలిపి ఒక మహాకూటమి ఏర్పాటు చేశాడు.

ఏపీ నుంచి వెయ్యి కోట్ల ఫండ్స్ కూడా హైదరాబాద్‌కు తరలించాడని న్యూస్‌పేపర్లు, టీవీ ఛానెల్స్‌తోపాటు, సోషల్ మీడియా అంతా బ్రేకింగ్ న్యూస్ ఇచ్చాయి.

చివరికి అన్నీ విఫల ప్రయత్నాలయ్యాయి.

తెరాస స్వీప్ చేసింది.

బాబు, అతని గ్యాంగ్ బ్యాక్ టూ పెవిలియన్.

కట్ చేస్తే - 

ఇప్పుడు ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎలక్షన్లు జరుగుతున్నాయి.

అక్కడ తెరాస పోటీ చేయడంలేదు. తెరాసకు లోక్‌సభ ఎన్నికలున్నాయి.

ఏపీలో ఫలానా వారికే వోటెయ్యండి తెరాస అని చెప్పటంలేదు.

ఏపీకి వెళ్లి బాబును ఓడించడానికి, బాబులాగా ఏదో ఒక చెత్తకూటమిని అక్కడేదీ ప్లాన్ చేయలేదు.

ఎవ్వరూ తెరాస నుంచి అక్కడికి ప్రచారానికి వెళ్లలేదు.

కానీ అక్కడ జరుగుతున్నది వేరే ...

అదేదో కేసీఆర్ డైరెక్టుగా ఏపీ రాజకీయాల్లోకి వెళ్ళి .. అక్కడ ఏపీ మొత్తాన్ని అల్లకల్లోలం చేస్తున్న ఫీలింగ్‌ని చంద్రబాబు, పవన్ కళ్యాన్ అండ్ కో ఇస్తూ .. 24 గంటలూ కేసీఆర్ జపం చేస్తుండటం నిజంగా ఆశ్చర్యకరం!

కేసీఆర్ అక్కడ పోటీనే చేస్తలేడు. "కేసీఆర్, రా చూస్కుందాం. దమ్ముందా?" అంటున్నారు.

కేసీఆర్ ఒకే ఒక్కసారి ఒక ప్రెస్‌మీట్‌లో (చంద్రబాబుకు) "రిటర్న్ గిఫ్ట్ ఇస్తా" అన్నాడు.

ఆ ఒక్క మాటను ఏపీ ఎన్నికల్లో బాబుతోసహా, మరో వంద మంది గల్లీ పొలిటీషియన్లు లక్షసార్లు పలవరిస్తున్నారు.

ఇంతకు కేసీఆర్ ఇచ్చే ఆ రిటర్న్ గిఫ్ట్ ఏంటి?

దానికంత పవరుందా?!

సీన్ చూస్తుంటే ఉందనే అనిపిస్తోంది.  

9 comments:

 1. తెరాస భావజాలపు గులాబీ రంగు కామెర్ల వ్యాధి లక్షణం బాగానే కనిపిస్తుంది మీ రాతల్లో - GREAT!

  ReplyDelete
  Replies
  1. నేను ఎన్నోసార్లు నా బ్లాగ్ పోస్టుల్లో స్పష్టంగా రాశాను .. "నేను కేసీఆర్‌కు హార్డ్‌కోర్ ఫాన్" అని! మీకు నచ్చకపోతే దయచేసి ఈ బ్లాగ్ వైపు రాకండి. పచ్చరంగు కామెర్ల వారికి గులాబిరంగులో కామెర్లు కనిపించడంలో ఆశ్చర్యం లేదు.

   విమర్శ అనేది ఎప్పుడూ రాసిన అంశంపైన ఉండాలి, నిర్మాణాత్మకంగా ఉండాలి.

   Delete
 2. నిజమే.. ఆయనది తెరాస భవజాలమే.. అది నాలుగున్నర ఏళ్ళలో జరిగిన అభివృద్ధి నుండి వచ్చిన భావజాలం. తెలంగాణ కె.సి.ఆర్ ను గుండెల్లో పెట్టుకున్నందుకు తెలంగాణ ప్రజలకు ఆయన ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ నుంచి పుట్టిన భావజాలం. సో ఫస్ట్ నుంచి కేసీఆర్ కి రిటర్న్ గిఫ్టులు ఇవ్వటం అలవాటు. ఎవరిది వారికి తిరిగి ఇచ్చేస్తూ ఉంటారు.

  అలాగే ఎం.యల్.ఏ కొనుగోలు దగ్గరనుంచి పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో వేసిన బాబుగారి జిత్తుల వరకూ అన్నీ చూసారు. మరి ఆయనది ఆయనకి ఇచ్చేయ్యొద్దు..? ఇప్పుడు అదే జరుగుతొంది.

  సెక్యులరిజం ముసుగు వేసుకుని మత చాందసవాదాన్ని రెచ్చగొట్టే పబ్బం గడుపుకునే సూడో వాదులకు పచ్చ కామెర్లు కనిపించవు కానీ అన్ని రంగుల కామెర్లు కనిపిస్తాయి. సరే.. ఏదేమైనా ఈసారి రిటర్న్ లో రంగు పడాల్సిందే...

  ReplyDelete
 3. ఇద్దరు చంద్రులు చాలా బాగా ఒకరికొకరు సహాయం చేసుకుంటున్నారు..అది మన బోటి సామాన్యులకు అర్థం కాదు.. మధ్యలో చాలా మంది బలవుతారు.. వారిద్దరూ సేఫ్...

  ReplyDelete
 4. మీరు కేసీఆర్ ని మాత్రమే పొగుడుకుంటే వాళ్ళని రావొద్దని చెప్పొచ్చు. మధ్యలో ఇతర నాయకులని విమర్శించారు. మరి వారి సమర్థకులు వాదించడానికి రారా ఏమిటి?

  ReplyDelete
  Replies
  1. బాజాప్త రావొచ్చు. రాసిన అంశంపైన డైరెక్ట్‌గా వాదించవచ్చు. నేను రాసింది తప్పు అని రుజువు చేయవచ్చు నిర్మాణాత్మకమైన వాదనల ద్వారా.

   చర్చించాల్సిన అంశంపైన వాదన చేతకాక, అహంకారపూరితమైన కామెంట్ చేసేవారిమీద జాలేస్తుంది.

   Delete
 5. >>>కేసీఆర్ కి రిటర్న్ గిఫ్టులు ఇవ్వటం అలవాటు. ఎవరిది వారికి తిరిగి ఇచ్చేస్తూ ఉంటారు.>>

  ఒక శుభకార్యానికి పిలిస్తే వచ్చినవాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు.పిలవకుండానే రిటర్న్ గిఫ్ట్ ఇస్తాననడం ఏమిటీ ?
  తెలంగాణా ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీకి మంచి గిఫ్ట్స్ ఇస్తున్నారుగా ?

  ReplyDelete
  Replies
  1. మీకంతా తెలిసిందే. రిటర్న్ గిఫ్ట్ దేనికీ, కేసీఆర్ ఏ సందర్భంలో అన్నాడు ఎట్సెట్రా. ఆవిధంగా కొందరు రిటర్న్ గిఫ్ట్‌కు అర్హులే.

   కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ గిఫ్టే. :)
   కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వలేదు. ఇవ్వాల్సివచ్చింది.

   Delete
  2. కాంగ్రెస్ నాయకులు "తెచ్చేది మేమే ఇచ్చేది మేమే" అంటూ చెప్పుకుంటున్న రోజులలోనే ఉదయభాను ఇచ్చిన మూతోడ్ జవాబు:

   వాడు తెస్తడని వీడు తెస్తడని
   అయ్య ఇస్తడని అవ్వ ఇస్తదని
   ఎవ్వడిచ్చేదేందిరా ఇది ఎవ్వనీ జాగీరురా

   Delete