Thursday 28 May 2020

ఇండస్ట్రీ ఎప్పుడూ మంచిదే!

హాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా... నిజంగా ఇండస్ట్రీ ఎప్పుడూ మంచిదే.

సత్తా ఉన్నవాడికి అది ఎప్పుడూ స్వాగతం చెప్తుంది. కొంచెం ముందూ వెనకా అంతే.

చిన్నవో పెద్దవో... నాలాంటి కొంతమందిని వెతుక్కొంటూ అవకాశాలొస్తాయి. కాని, అసలు  చిక్కంతా ఆ తర్వాతే.

కట్ చేస్తే - 

ఇండస్ట్రీలో కొంతమంది సీనియర్లు నాకు మంచి మిత్రులు. వారు నాకు పరిచయమైన 'డే వన్' నుంచి ఇప్పటివరకూ, వారిలో ప్రతి ఒక్కరిపట్ల నాకు అదే గౌరవం. వారు కూడా నన్ను అంతే అభిమానంగా చూస్తారు.

ప్రతి ప్రొఫెషన్‌లో, ప్రతి బిజినెస్‌లో కొన్ని ప్రాథమిక వ్యవహార సూత్రాలుంటాయి. ఏది మారినా అవి మారవు. కొత్తగా వచ్చే వ్యక్తులతో, సాంకేతిక అభివృధ్ధితో వీటికి సంబంధం లేదు. ఇవి మారవు గాక మారవు. సో, ఆయా వృత్తివ్యాపారాల్లోకి ఎంటరైనవాడు విధిగా ఆ బేసిక్స్ పాటించాల్సిందే.

సినిమా ఇండస్ట్రీ కూడా అంతే. ఇక్కడ పాటించాల్సిన కొన్ని ప్రాథమిక సూత్రాలు విధిగా పాటించాల్సిందే...

రోమ్‌కు వెళ్ళినపుడు అక్కడ రోమన్‌లా ఉండాలి తప్ప నేను టిబెటన్‌లా ఉంటానంటే కుదరదు. ఇంకా మాస్‌గా చెప్పాలంటే - తాడిచెట్టుకిందకెళ్ళినప్పుడు అక్కడ కల్లే తాగాలి తప్ప నేను కాఫీ త్రాగుతా అంటే కుదరదు.

నీ ఉద్దేశ్యంలో ఎలాంటి తప్పు లేకపోవచ్చు. నువ్వు గుడ్డిగా ఫాలో కావల్సిన ఆ ప్రాథమిక సూత్రాల్లో ఎలాంటి లాజిక్ నీకు కనిపించకపోవచ్చు. అయినా సరే, విధిగా నువ్వు ఆ సూత్రాల్నే ఫాలో అయితీరాలి.

వాటిని నువ్వు లైట్ తీసుకుంటే, ఇండస్ట్రీ నిన్ను యమ లైట్ తీసుకుంటుంది.

జస్ట్ అలా దూది పింజలా ఎగిరిపోతావ్...

మొగిలిరేకులు సీరియల్ లాగా, ఈ విషయాన్ని ఇండస్ట్రీలోని నా సీనియర్ మిత్రులు నాకు  1001 సార్లు చిలక్కి చెప్పినట్టు చెప్పారు.   

కట్ చేస్తే - 

మన ఫెయిల్యూర్‌కి కారణం ఎప్పుడూ ఇండస్ట్రీ కాదు...

మన నిర్ణయాలు, మనం కావాలని ఎంచుకొన్న వ్యక్తులు. మనం వారి మాటల మీద పెట్టుకొన్న నమ్మకం, ఆ నమ్మకానికి వారిచ్చిన విలువ. చివరికి మనల్నే తప్పుబట్టి వేలెత్తిచూపగలిగే వారి వాక్చాతుర్యం, వారి అసలు టాలెంటు... అది ముందే ఏమాత్రం గుర్తించలేని మన అజ్ఞానం...

ఇది ఇండస్ట్రీ ప్రాథమికసూత్రాలను పాటించకుండా చేసిన తప్పు. కాబట్టి, అనుభవించక తప్పదు.

ఇండస్ట్రీ ప్రాథమిక సూత్రాల్ని పాటించినప్పుడు మనం ఎన్నుకొనే వ్యక్తులు పూర్తిగా వేరేగా ఉంటారు...

వీళ్లు పెద్దగా చదువుకోకపోవచ్చు. నాకు ఇంత తెలుసు, అంత తెలుసు అని కోతలు కొయ్యకపోవచ్చు. కాని, వీళ్లంతా ఇండస్ట్రీలో "ఒక్క ఛాన్స్" విలువ తెలిసినవాళ్లు. అది ఎంత కష్టమో అనుభవం ద్వారా తెలుసుకున్నవాళ్లు. ఛాన్స్ వచ్చినతర్వాత కూడా, ఇండస్ట్రీలో నిలదొక్కుకోడానికి ఎంత కష్టపడాలో తెలిసినవాళ్ళు. అంతకు పదిరెట్ల కష్టం పడటానికి అనుక్షణం సిధ్ధంగా ఉండేవాళ్లు.

వీటన్నిటికితోడు... తమ నోటినుంచి వచ్చినమాటకు ఉండే విలువేంటో తెలిసినవాళ్ళు. ప్రాణంపోయినా సరే ఆ మాటకు కట్టుబడి ఉండేవాళ్ళు.

మనం అతితెలివితో ఎన్నుకొన్న వ్యక్తులకు ఇండస్ట్రీ ద్వారా వచ్చే పేరు, గ్లామర్ వగైరా అన్నీ కావాలి. కష్టం మాత్రం వద్దు. మాటకు కట్టుబడటం వద్దు.

అయితే ఇలాంటి వ్యక్తులవల్ల నష్టపోయేది వారొక్కరేకాదు. మనం, మన మీద ఆధారపడిన ఇంకెందరివో జీవితాలు. ఇది వీరికి అర్థం కాదు, అర్థం చేసుకొనే స్థాయి కూడా కాదు. బట్... అప్పటికే మన చేతులు కాలిపోయుంటాయి.

ఇండస్ట్రీ ప్రాథమిక సూత్రాలను పాటించినప్పుడు ఇలాంటి తప్పులు జరగవు. ఇలాంటి నిర్ణయాలను మనం తీసుకోము. ఇలాంటి వ్యక్తులను ఎన్నుకోము. ఇంత సమయం వృధా కాదు. ఇంత క్షోభ అనుభవించము.

సో, తప్పు ఎప్పుడూ అవతలివారిది కాదు. మనది. మనం తీసుకొన్న నిర్ణయాలది.

అందుకే "పెద్దలమాట సద్దిమూట" అన్నారు. సీనియర్స్ వారి అనుభవంతో ఏదైనా చెప్పినప్పుడు బాగా ఆలోచించాలి. లాజిక్స్ ఒక్కటే కాదు, రియాలిటీ కూడా చూడాలి.
^^^^^

(ఇవ్వాళ ఫేస్‌బుక్‌లో  సీనియర్ హిట్ డైరెక్టర్ వి ఎన్ ఆదిత్య గారు అత్యంత బాధతో పెట్టిన ఒక పోస్టు చూశాక వెంటనే ఇది రాయాలనిపించింది.)  

Saturday 23 May 2020

జ్ఞానోదయం నూట ఒకటో సారి!

ఎప్పటికప్పుడు ఏదో ఒక వ్యక్తినో, పరిస్థితినో ఎదుర్కొన్నాక "అబ్బ... ఈ దెబ్బతో జ్ఞానోదయం అయ్యింది" అనుకొంటాము.

కాని అది అబద్దం.

ఆకాలంలో బుధ్ధుడికి బోధివృక్షం కింద కూర్చున్నప్పుడు జ్ఞానోదయం అయిందని చదివాను. మాహానుభావుడు... ఒక్కసారికే సర్వం ఒక అవగాహనకొచ్చింది ఆయనకు. కాని, ఇప్పుడున్న పరిస్థితుల్లో అలా అస్సలు కుదరదు.

"ఇంక ఇంతకు మించి మనం నేర్చుకొనేది ఏముంటుంది" అనుకుంటాం. కాని, దాని జేజమ్మలాంటి సిచువేషన్ కూడా వెంటనే వస్తుంది.

"ఈ వ్యక్తిని మించి మనల్ని బాధపెట్టేవాడు ఇంక లైఫ్‌లో రాడు... వచ్చే పరిస్థితికి మనం ఇంక చోటిచ్చే  ప్రసక్తే లేదు" అనుకొంటాం. అతని తాతలకు తాతలాంటోడొస్తాడు.

ఇవన్నీ అనుభవం మీదే తెలుస్తాయి.

కొంతమందికి మాత్రం ఈ జ్ఞానోదయం బై డిఫాల్ట్ అయి ఉంటుందనుకొంటాను. అదృష్టవంతులు. వీరి దరిదాపుల్లోకి ఏ నాన్సెన్స్ వ్యక్తులూ, పరిస్థితులూ రాలేవు. అన్నిటికంటే ముఖ్యంగా వీళ్ళు అంత గుడ్డిగా దేన్నీ నమ్మరు. క్షణాల్లో విషయాన్ని తేల్చేస్తారు. ఇలాంటివాళ్లంటే నాకు చాలా గౌరవం.

కొంచెం లిబరల్‌గా, మాస్‌గా చెప్పాలంటే - ఇదే లోకజ్ఞానం.

కరోనావైరస్ పుణ్యమా అని, గత 60+ రోజుల లాక్‌డౌన్ నేపథ్యంలో చాలా విషయాల్లో ఆత్మపరిశీలన చేసుకొని, బాగా ఆలోచించుకొనే అవకాశం అందరికీ దొరికింది.

లాక్‌డౌన్‌ను మించిన బోధివృక్షం లేదు. ఈసారిమాత్రం ఏదో బూడిదలోంచి లేచి దులుపుకొన్నట్టు కాకుండా... మస్తిష్కాలు నిజంగానే ఒక మాదిరి కుదుపుకు లోనయ్యాయి.

అది మార్పే కావచ్చు, మహాజ్ఞానోదయమే కావొచ్చు.

ఖచ్చితంగా ఇంతకుముందులా మాత్రం మనం ఉండము, ఉండలేము.

వ్యక్తిగతంగా నేను నాలో కోరుకొంటున్న మార్పు అదే.

అయామ్ పాజిటివ్... 

Wednesday 20 May 2020

థియేటర్స్, హౌజ్‌ఫుల్స్ ఇంక ఒడిశిన కథేనా?

100% అంతే...

ఇది నేను చెప్తున్న జోస్యం కాదు...

ప్రపంచవ్యాప్తంగా, గత కొన్నేళ్ళుగా సినీ ఇండస్ట్రీలో వచ్చిన ఎన్నో విప్లవాత్మక మార్పులను అలా తొక్కిపెడుతూ వచ్చారు. లేదా హిపోక్రసీకి పెద్దగా పట్టించుకోనట్టు నటించారు.

అంతకు ముందు కూడా అంతే...

"ఫిల్మ్ మేకింగ్‌లో 'ఫిలిం' పని అయిపోయింది... ఇక ఇప్పుడంతా డిజిటల్ టెక్నాలజీదే కాలం" అంటే ఎవ్వరూ వినలేదు. పట్టించుకోలేదు.

డిజిటల్ కెమెరాలతో షూట్ చేసేవాళ్లను ఎగతాళి చేశారు. డిజిటల్ కెమెరాలతో షూట్ చేసిన సినిమాలకు అసలు శాటిలైట్ రైట్స్ ఇవ్వొద్దు అన్నారు. థియేటర్స్‌లో ప్రదర్శనకు పనికిరావన్నారు.

అలాంటి మహామహోపాధ్యాయులంతా ఇప్పుడు తోకముడుచుకొని వారి సోకాల్డ్ భారీ సినిమాలను రెడ్, అలెక్సా ఎక్స్‌టీ వంటి డిజిటల్ కెమెరాల్లోనే షూట్ చేస్తున్నారు!

కట్ చేస్తే -

దశాబ్దాలుగా ఏ ప్రభుత్వాలు, ఏ యూనియన్ లీడర్స్ పరిష్కరించలేకపోయిన థియేటర్స్ సమస్యను ఇప్పుడు కరోనావైరస్ చాలా సింపుల్‌గా తీర్చేసింది.

చిన్న సినిమాలకోసం 'అయిదో షో' జీవో వస్తోందని నా చిన్నప్పటినుంచి వింటున్నాను...

అది రాదు, రానీయరు. ఇప్పుడు ఆ జీవో వచ్చినా కూడా ఎవడూ దాని మొహం చూడడు.

చిన్న సినిమాల నిర్మాత "మాకు రెంటు కట్టినా థియేటర్స్ ఇవ్వట్లేదు" అని ఎక్కడా మొత్తుకోడు.

మాకు క్యాంటీన్ మెయింటెనెన్స్, కరెంట్ బిల్లు ఖర్చులు కూడా రావు అని చిన్న సినిమాలను ఎగతాళిచేసిన థియేటర్స్ అతి త్వరలో వాటి షేపులు మార్చుకొని... ఏ గోడౌన్సో, ఫంక్షన్ హాల్స్‌గానో మారిపోయేరోజులు చాలా దగ్గరలో ఉన్నాయి.

టెక్నాలజికల్ డెవలప్‌మెంట్‌ను ఎవ్వరూ ఎక్కువకాలం తొక్కిపెట్టలేరు, ఆపలేరు... అని మరోసారి రుజువయ్యింది.

ఇకనుంచీ భారీ సినిమానా, చిన్న సినిమానా అన్నది పాయింట్ కాదు. థియేటర్స్‌లో, మల్టీప్లెక్సుల్లో రిలీజయ్యిందా లేదా అన్నది కూడా పాయింట్ కాదు.

ఓటీటీలో రిలీజ్ అయ్యిందా లేదా అన్నదే మెయిన్ పాయింట్ కాబోతోంది... చేతిలో ఉండే మొబైల్ యాప్‌లో రిలీజయ్యిందా లేదా అన్నదే మెయిన్ పాయింట్ కాబోతోంది... 

కరోనా తర్వాత... మనిషి జీవనశైలిలో ఊహకందని మార్పులు ఎన్నో అత్యంత వేగంగా జరగబోతున్నాయి. మనిషి ఆలోచనావిధానమే పూర్తిగా మారబోతోంది.

కంటెంట్ బాగుంటే చాలు. ఓటీటీలకు, యాప్‌లకు కొరతలేదు. సినిమాల రిలీజ్ అనేది ఇకమీదట అసలు సమస్యే కాదు.

సో, కంగ్రాట్స్ టూ స్మాల్ బడ్జెట్ ఫిల్మ్‌మేకర్స్!... కంటెంట్ మీద ఫోకస్ చెయ్యండి. మీ ఓపిక... ఎన్ని సినిమాలైనా తీయొచ్చు. ఎన్నైనా రిలీజ్ చేసుకోవచ్చు.

ది గ్రేట్ అమితాబ్ బచ్చన్ సినిమానే డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అవుతోంది. ఆర్జీవీ "క్లైమాక్స్" యాప్‌లో రిలీజ్ కాబోతోంది. ఇంక వర్రీ ఎందుకు?  

Saturday 16 May 2020

Manohar Chimmani Film Coaching Online | Eng

Wanna become an Actor on Silver Screen? 
Or wanna become an Assistant Director or Script Writer?
Even you wanna become a Film Director directly? 

YES, this is POSSIBLE!  

> No prior experience is required. 
> You can enter Film Industry and create miracles... even as a FRESHER!

Anyone can learn anything and everything ONLINE in this Digital Age.   


Join my passionate premium ONLINE COACHING in ACTING, DIRECTION & SCRIPT WRITING and Enter Film Industry Easy! 

This is not a free service. THERE WILL BE FEE. 

You need not reinvent the wheel and waste a decade waiting for chances in films. Learn from the experience of yours truly Manohar Chimmani, state Nandi Award winning Writer and Film Director, and jump-start your career in Film Industry in almost no time.  


Inside this Online Coaching you will learn:

🎥 How to UNLEARN routine film institute stuff
👍 How to KNOW and LEARN what exactly industry wants from you 
💯 How to CRAFT your perfect PORTFOLIO as an Artist/Technician  
❤️ How to basically CONNECT to Industry even before you enter Industry
🚀 How to ENTER FILM INDUSTRY during or immediately after the coaching


So, If you want a NEW, EASIER, BETTER, RELIABLE and FASTER approach to enter Film Industry and jump-start your career in the Tinsel World... Then WELCOME HOME, this Online Crash Coaching is for YOU! 

I have to spend so much of my time for this one-on-one Personal Coaching Online... and There Will Be FEE.   

If you're really very serious about your career in Film Industry, and can afford Fee... plz feel free to WhatsApp me for more details.

I’m excited to have you in my Online Coaching...

Welcome to Film Industry!

Cheers,
Manohar Chimmani
Nandi Award Winning Writer and Film Director
Life Member, Telugu Film Chamber of Commerce
Life Member, Telugu Film Directors’ Association

My Profile in Brief | My Short AV  | Facebook | Twitter | Instagram

For application & fee details: 
WhatsApp: +91 9989578125
^^^^^

Read the same in Telugu

Saturday 9 May 2020

పాలపిట్ట 2020 లిటరరీ అవార్డులు... ఎప్పుడు? ఎక్కడ?


ఉస్మానియా యూనివర్సిటీ ఐకానిక్ ఆర్ట్స్ కాలేజ్ బిల్డింగ్...

1986 జనవరిలో ఒక సోమవారం, ఉదయం 8:00.

ఆర్ట్స్ కాలేజ్ బయట, ముఖ ద్వారం పక్కనే, గోడకు ఆనించి పెట్టిన నిలువెత్తు బ్లాక్ బోర్డు పైన ఒక ఎమ్మే కుర్రాడు కలర్ చాక్‌పీస్‌లతో  ఏదో రాస్తున్నాడు. ఇంకో  ఎమ్మే కుర్రాడు పక్కనే నిలబడి డిక్టేట్ చేస్తూ రాయిస్తున్నాడు.

అది "ఓయూ రైటర్ సర్కిల్" బ్లాక్ బోర్డ్ మ్యాగజైన్. దానిమీద రాస్తున్నది "ఈ వారం కవిత".

చేతిలో ఉన్న నోట్‌బుక్‌లోకి చూసి చెబుతూ ఆ కవిత డిక్టేట్ చేస్తున్నదీ... "నీ హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది, నువ్వు రాయి" అని ఉబ్బించి, యువర్స్ ట్రూలీ మనోహర్ చిమ్మనితో ఆ బ్లాక్‌బోర్డ్ పైన రాయిస్తున్నదీ మరెవరో కాదు... గుడిపాటి వెంకట్.

ఓయూలో మా మిత్రబృందమంతా అతన్ని "గుడిపాటి" అని పిల్చేవాళ్లం. అదే అలవాటయిపోయింది అందరికీ.

మూడు దశాబ్దాలు దాటిన స్నేహం మాది. ఓయూలో ఎమ్మే చదివినప్పుడు ఇద్దరం 'ఏ' హాస్టల్లో ఉండేవాళ్లం. నాది రూం నంబర్ 55, గుడిపాటిది రూం నంబర్ 24. 

ప్రముఖ జర్నలిస్టు, శాసనమండలి సభ్యుడు, ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా అప్పుడు అదే రూం నంబర్ 24 లో ఉండేవాడు.

ఓయూ రైటర్స్ సర్కిల్ అప్పటిదాకా మా సీనియర్, ప్రస్తుతం "ఆసియానెట్ న్యూస్" ఎడిటర్, కాసుల ప్రతాప్‌రెడ్డి సారధ్యంలో ఉండేది. ప్రొఫెసర్ చేకూరి రామారావు గారు గౌరవ సలహాదారుగా ఉండేవారు.

గుడిపాటి సారథ్యం తీసుకున్నాక, ఓయూ రైటర్స్ సర్కిల్ ఆధ్వర్యంలో చాలా సాహితీ కార్యక్రమాలు నిర్వహించేవాడు. ప్రముఖ సీనియర్ జర్నలిస్టు, నా క్లాస్‌మేట్ రామ్‌దాస్, నేను కూడా రైటర్స్ సర్కిల్లో అప్పుడు యాక్టివ్ మెంబర్స్‌గా ఉండేవాళ్లం. 

కట్ చేస్తే - 

ఓయూ ఆర్ట్స్ కాలెజ్‌లో "రూం నంబర్ 57" ఒక అద్భుత జ్ఞాపకం. అదొక మీటింగ్ హాల్. 1918 లో ఉస్మానియా యూనివర్సిటీ ప్రారంభమైనప్పటినుంచి, నిన్న మొన్నటి తెలంగాణ ఉద్యమం వరకు... ఆ మీటింగ్ హాల్లో జరిగిన చారిత్రక సమావేశాలెన్నో!

పీవీ నరసింహారావు నుంచి, కాలోజీ, సినారే, శ్యామ్ బెనెగల్, కేసీఆర్ వంటి ఎందరో ప్రముఖ వ్యక్తులు,  పార్లమెంటేరియన్లు, లెజిస్లేచర్లు, మంత్రులు, సైంటిస్టులు, డాక్టర్లు, కవులు, రచయితలు, ఫిల్మ్ డైరెక్టర్లు, పొలిటీషియన్లు, స్పోర్ట్స్‌మెన్... ఇంకెందరో ఓయూ విద్యార్థులు ఆ హాల్లో ఎన్నో సమావేశాల్లో పాల్గొన్నవాళ్లే... తిరగాడినవాళ్లే.

1986 లోనే అనుకుంటాను... సాల్మన్ రష్దీ రచించిన "సాతానిక్ వర్సెస్" నవలను ప్రభుత్వం బ్యాన్ చేసింది. ఆ అంశం మీద కూడా రూం నంబర్ 57 లో, ఓయూ రైటర్ సర్కిల్ తరపున గుడిపాటి నిర్వహించిన సభ అప్పట్లో ఒక పెద్ద సెన్సేషన్ సృష్టించింది. ఆ మర్నాడు అన్ని దినపత్రికల మొదటిపేజీలు ఆ వార్తను బాగా కవర్ చేయటం నాకింకా గుర్తు. 

కట్ బ్యాక్ టూ మ్యాగజైన్ - 

సూర్యాపేటలో చదువుకునేరోజుల్లో "చైతన్యవాణి", "ప్రజావాణి" లిఖితపత్రికల నిర్వహణ, డిగ్రీలో ఉండగా "స్రవంతి" సైక్లోస్టైల్డ్ పత్రిక, ఓయూలో పీజీ తర్వాత "ఉజ్వల" అనే మినీ మ్యాగజైన్ నిర్వహణలో కీలక భాగస్వామి గుడిపాటి. అప్పట్లో గుడిపాటి ప్రచురించిన ఉజ్వల బులెటిన్లో నేను తెలుగులోకి అనువదించిన ఒక రష్యన్ కథానిక అచ్చయింది నాకింకా జ్ఞాపకం.   


ఈ నేపథ్యంతోపాటు... ఓయూ ఆర్ట్స్‌కాలేజ్ ముందు, అప్పట్లో రైటర్స్ సర్కిల్ బ్లాక్‌బోర్డ్ మ్యాగజైన్‌తో 1986 నుంచీ గుడిపాటిలో కొనసాగిన ఆ వ్యామోహం, 2010 ఫిబ్రవరిలో ఒక పూర్తిస్థాయి సాహితీ మాసపత్రిక వెలువరించేదాకా చల్లారలేదు.

ఆ పత్రిక పేరు "పాలపిట్ట".

ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలనుంచి నిరాఘాటంగా ప్రచురితమవుతున్న ఏకైక సాహితీ మాసపత్రిక.

సూర్యాపేటలో పుట్టి, అక్కడే డిగ్రీ వరకు చదుకొన్న గుడిపాటి... ఓయూలో ఎమ్మే పొలిటికల్ సైన్స్‌తోపాటు బిసిజె, బి ఎడ్ కూడా చదివాడు. ఎమ్మేలో స్వామి రామానంద తీర్థ గోల్డ్ మెడల్ సాధించాడు.

గుడిపాటికి వృత్తిపరంగా రెండేరెండు ఇష్టాలుండేవి. అయితే లెక్చరర్‌గా పనిచేయాలని, లేదంటే జర్నలిస్టు కావాలని.

లెక్చరర్‌గా అప్పట్లో కొన్నాళ్లు ఏదో కోపరేటివ్ కాలెజీలో పనిచేశాడు గుడిపాటి. నచ్చలేదు. తన ఇష్టం, తన మార్గం, తన గమ్యం అది కాదని అర్థమైంది. లెక్చరర్ ఉద్యోగం వదిలేశాడు. 

కట్ చేస్తే - 

యూనివర్సిటీలో చదువుతున్నప్పుడే "ఆంధ్రజ్యోతి" హైద్రాబాద్ ఎడిషన్‌కు స్ట్రింగర్‌గా పనిచేసేవాడు గుడిపాటి. అప్పుడు ఏబీకే ప్రసాద్ హైద్రాబాద్ ఎడిషన్‌కు ఇంచార్జిగా ఉన్నారు. తర్వాత కొంతకాలం "సాయంకాలం" పత్రికకు పనిచేశాడు. "నలుపు" పక్షపత్రిక ప్రారంభ సంచికలకు కూడా పనిచేశాడు. తర్వాత "వార్త"లో చేరాడు. ఇక ఆతర్వాతంతా చరిత్రే. ఇప్పుడున్న జర్నలిజం, లిటరరీ సర్కిల్స్‌లో చాలామందికి తెలిసిందే.


బయట రిపోర్టింగ్‌కు అవకాశం ఉన్నా, సాహిత్యం పట్ల తనకున్న ఇష్టంతో వివిధ డెస్క్‌ల్లో సబ్ ఎడిటర్‌గానే పనిచేయడానికి ఇష్టపడ్డాడు గుడిపాటి.

వార్తలో కొన్నాళ్ళు "బుక్ రివ్యూ" పేజీని చూసేవాడు గుడిపాటి. తర్వాత వార్త ఇంటర్నెట్ ఎడిషన్లో కూడా ముఖ్య బాధ్యతలు నిర్వహించాడు. ఇలా వివిధ విభాగాల్లో పనిచేసినప్పటికీ, "వార్త ఆదివారం" ఎడిటర్‌గానే ఎక్కువకాలం పనిచేశాడు గుడిపాటి.

వార్త ఆదివారం మ్యాగజైన్‌లో గుడిపాటి ప్రవేశపెట్టిన కొత్త అంశాలన్నీ, తర్వాత ఈనాడుతో సహా మిగిలిన దినపత్రికలన్నీ అనుసరించక తప్పలేదు. అంతకుముందువరకూ ఈనాడు ఆదివారం పుస్తకంలో ఇంగ్లిష్ పత్రికల కంటెంట్ అనువాదమే ఎక్కువగా ఉండేది. ఈనాడును అప్పటినుంచీ చదువుతున్నవారికి ఈ విషయం బాగా గుర్తుంటుంది. 

కట్ టూ అడవిలో అన్నతో -

వార్త ఆదివారం ఎడిషన్‌కు ఎడిటర్‌గా పనిచేస్తున్నప్పుడే... 1999 లో, ఒకరోజు ఆ పత్రిక ఎడిటర్ గిరీష్ సంఘీ గుడిపాటిని పిలిచి ఓ రిపోర్టింగ్ అసైన్‌మెంటును అప్పగించాడు.

అది పూర్తిగా గుడిపాటి చేస్తున్న పనితో సంబధంలేని రిపోర్టింగ్ పని. చాలా రిస్క్‌తో కూడుకొన్న బాధ్యతకూడా.

ఎక్కడో నల్లమల అడవుల్లోకి వెళ్లి, పీపుల్స్ వార్ సెక్రటరీ సంతోష్ రెడ్ది ఇంటర్వ్యూ తీసుకొనివచ్చే అసైన్‌మెంట్ అది!


"నా లెఫ్టిస్టు భావజాలపు నేపథ్యం సంఘీకి తెలుసు. అందుకే నాకా పని అప్పగించి ఉంటాడు" అని నాతో అప్పట్లో చెప్పాడు గుడిపాటి. అప్పుడు నేను ఆలిండియా రేడియో, కర్నూల్లో పనిచేస్తున్నాను. కాని, నాకు తెలిసి, వార్త రిపోర్టర్‌లలో కనీసం ఒక 60% మంది అదే లెఫ్టిస్ట్ భావజాలం నేపథ్యంతో ఉన్నవాళ్లున్నారు. కాని, గిరీష్ సంఘీ గుడిపాటినే పిలిచి ఈ అసైన్‌మెంట్ అప్పగించాడంటే కారణం గుడిపాటిలోని నిబధ్ధతే అని నా ఉద్దేశ్యం.

యూనివర్సిటీరోజుల నుంచి, ఇప్పటివరకూ గుడిపాటిలో నేను చూస్తున్నది అదే. తను చేస్తున్న పనిపట్ల సిన్సియారిటీ, సీరియస్‌నెస్, అంకితభావం... ఇవన్నీ గుడిపాటిలో ఏ కొంచెం కూడా తగ్గలేదు. 

కట్ చేస్తే - 

వార్త ఆదివారం మ్యాగజైన్ ఎడిటర్‌షిప్ ఇచ్చిన కిక్ నుంచి బయటపడి, తన డ్రీమ్ మ్యాగజైన్‌ను వెలువరించడానికి గుడిపాటికి సుమారు దశాబ్దం పట్టింది.

2010 ఫిబ్రవరిలో, ఒక పూర్తిస్థాయి తెలుగు సాహిత్య మాసపత్రికగా "పాలపిట్ట"ను స్వీయ సంపాదకత్వంలో ప్రారంభించాడు గుడిపాటి.


ఏకవ్యక్తి సైన్యంగా, అన్నీ తానే అయి, గత పదేళ్లుగా ఈ పత్రికను వెలువరిస్తున్న గుడిపాటి కృషి నిజంగా అభినందనీయం. 

మధ్యలో కొన్ని సంచికలు మిస్ అయినా, తర్వాత వెంటనే నిలదొక్కుకొని, క్రమం తప్పకుండా పాలపిట్ట మాసపత్రికను పబ్లిష్ చేస్తున్నాడు గుడిపాటి. అప్పట్లో "రచన", "ఆహ్వానం" వంటి సాహిత్య పత్రికలు కొన్నాళ్లు వచ్చి కనుమరుగైపోయినా, గుడిపాటి పాలపిట్ట మాత్రం నిరాఘాటంగా వస్తూనే ఉంది. ఒక మ్యాగజన్‌ను క్రమం తప్పకుండా నడపడం ఎంత కష్టతరమైన పనో మనకు తెలియంది కాదు.

బాలమురళీకృష్ణ, సామల సదాశివ, గోరటి వెంకన్న, ఓల్గా వంటి ఎందరో ప్రముఖులమీద పాలపిట్ట ప్రత్యేక సంచికలు వచ్చాయి. తెలుగు సాహిత్యం మీద, కాళోజీమీద, తెలంగాణ సాహిత్యం మీద కూడా పాలపిట్ట విశేష సంచికలు వచ్చాయి.

"పాలపిట్ట బుక్స్" పేరుతో ఇప్పటివరకు సుమారు 250 పుస్తకాలను కూడా ఎడిట్ చేసి ప్రచురించాడు గుడిపాటి. వీటిలో సుమారు 70 కవితా సంకలనాలు!

ఒక రచయితగా, విమర్శకుడిగా గుడిపాటి ఇప్పటివరకు 12 పుస్తకాలను రాసి ప్రచురించాడు. వీటిలో 2 బయోగ్రఫీలున్నాయి.

ఏదో న్యూస్‌ప్రింట్‌తో అచ్చేసి, పత్రిక తీశామా అంటే తీశాం అన్నట్టు కాకుండా... పాలపిట్ట తొలి సంచిక నుంచి ఇప్పటి తాజా సంచిక వరకూ... మంచి క్వాలిటీ పేపర్‌తో, ప్రామాణికమైన కవర్‌పేజీతో ఈ మాసపత్రికను వెలువరిస్తుండటం అంత మామూలు విషయం కాదు.

రెండు తెలుగురాష్ట్రాల్లో కలిపి, ఇప్పుడు తెలుగులో వస్తున్న ఏకైక సాహిత్య మాసపత్రిక పాలపిట్ట ఒక్కటే.


చదివే అలవాటు క్రమంగా తగ్గిపోతున్న ఈరోజుల్లో... తనలోని సాహితీ పిపాసే పెట్టుబడిగా, గత దశాబ్దంగా పాలపిట్ట మాసపత్రికను ప్రచురిస్తూ సాహితీ వ్యవసాయం చేస్తున్న గుడిపాటి వంటి వారికి సాహిత్యాభిమానుల చేయూత ఉంటే ఈ దిశలో తను ఇంకెంతో సాధిస్తాడనడంలో సందేహం లేదు.

ఇన్ని సాధించినా, తనగురించి ఏమాత్రం చెప్పుకోడానికి ఇష్టపడని గుడిపాటి త్వరలోనే మరొక సంచలనానికి తెరతీయబోతున్నాడు.

అది... పాలపిట్ట లిటరరీ అవార్డ్స్.

అత్యంత ప్రతిష్టాత్మకంగా, ప్రామాణికంగా గుడిపాటి ప్రారంభించబోతున్న ఈ వార్షిక సాహిత్య అవార్డులు ఆధునిక తెలుగు సాహితీరంగంలో ఒక కొత్త వరవడికి నాందిపలుకుతాయనుకోవచ్చు.
^^^^^

(పాలపిట్ట మాసపత్రిక, పాలపిట్ట బుక్స్ కోసం: Palapitta Books, Block-6, MIG-2, APHB, Baghlingampally, Opp. Sundaraiah Park Gate Lane, Hyderabad - 500044. Phone: 040-27678430. email: palapittabooks@gmail.com, WhatsApp: +91 9490099327)  

Wednesday 6 May 2020

ప్లేబాయ్‌ని కూడా వదలని కరోనా!

66 సంవత్సరాలుగా నాన్‌స్టాప్‌గా వస్తున్న అమెరికన్ లైఫ్‌స్టైల్ & ఎంటర్‌టైన్‌మెంట్ మ్యాగజైన్ 'ప్లేబాయ్' కరోనా దెబ్బకు టోటల్‌గా తన రూపమే మార్చుకొంది!

ప్రస్తుతమున్న కరోనా విపత్తు నేపథ్యంలో... సమయానికి మ్యాగజైన్‌ను ప్రింట్ చేయలేక, మొత్తంగా ప్రింట్‌కే గుడ్‌బై చెప్పారు ప్లేబాయ్ పబ్లిషర్స్.

ఇకనుంచీ ప్లేబాయ్ డిగిటల్ మ్యాగజైన్.

ఈ మ్యాగజైన్ ఇప్పుడు నేరుగా తమ చందాదారులకు ఆన్‌లైన్ ద్వారా అందుతుంది.

1953లో షికాగోలో ఈ మ్యాగజైన్ ప్రారంభించడానికి, దీని ఎడిటర్-పబ్లిషర్ హ్యూ హెఫ్‌నర్ తన తల్లి దగ్గర తీసుకున్న అప్పు 1000 డాలర్లు. ఇప్పుడు మొత్తంగా ప్లేబాయ్ మ్యాగజైన్ ఎంటర్‌ప్రైజెస్ సామ్రాజ్యం విలువ 3 బిలియన్ల డాలర్లు!

విస్తరించే ఉద్దేశ్యం, సామర్థ్యం ఉండాలేగాని... ఒక సక్సెస్‌ఫుల్ మ్యాగజైన్ పవర్ అలా ఉంటుంది.

ఇంగ్లిష్‌లో ప్రారంభమై, పలు ముఖ్యమైన ప్రపంచ భాషల్లో వస్తూ, ఈమధ్యే ఇజ్రాయల్ పాఠకుల కోసం హిబ్రూలో కూడా వస్తోంది ప్లేబాయ్. ప్లేబాయ్ పేరుతో ఇంకెన్నొ లైఫ్‌స్తైల్ ప్రొడక్టులకు లైసెన్సింగ్ ఇవ్వడం ద్వారా కూడా ప్లేబాయ్ గ్రూప్‌కు ఎంతో ఆదాయం వస్తోంది.

ప్లేబాయ్ ఏదో చీప్ మ్యాగజైన్ కాదు. పైన కవర్ పేజీ, లోపల ఓ నాలుగయిదు పేజీల్లో కొంత న్యూడిటీ తప్పిస్తే... ఇదొక మంచి 'ఎలైట్' లైఫ్‌స్టైల్ మ్యాగజైన్. దీని పాఠకులంతా కూడా బాగా చదువుకున్న ప్రొఫెషనల్స్, సమాజంలో అత్యున్నత హోదాల్లో ఉన్నవారే కావడం గమనించాలి.

ప్లేబాయ్ ప్రతి ఇష్యూలో వివిధరంగాలపైన, జీవనశైలిపైన అత్యుత్తమస్థాయి ఆర్టికిల్స్ ఉంటాయి. ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్స్, ఆర్టిస్టులు, బిజినెస్‌మెన్, నాటక రచయితలు, పొలిటీషియన్స్, అథ్లెట్స్ మొదలైనవారిలో ఎవరిదో ఒకరి ఇంటర్వ్యూ చాలా ఇన్స్‌పైరింగ్‌గా ఉంటుంది.

ప్లేబాయ్‌లో ఆర్థర్ సి క్లార్క్, అయాన్ ఫ్లెమింగ్, పి జి వోడ్‌హౌజ్, హరుకి మురకామి వంటి ప్రపంచస్థాయి రచయితల షార్ట్ స్టోరీలు కూడా అచ్చయ్యాయంటే ఈ మ్యాగజైన్ స్థాయిని ఊహించవచ్చు.

కట్ చేస్తే - 

2016 లో ప్లేబాయ్‌లో న్యూడిటీని ప్రయోగాత్మకంగా ఒక సంవత్సరం దూరం పెట్టిచూశారు. పాఠకులు ససేమిరా ఒప్పుకోలేదు. మళ్లీ ఏప్రిల్ 2017 నుంచి ప్లేబాయ్ మార్కు న్యూడిటీని మ్యాగజైన్‌లో రీ-ఇంట్రొడ్యూస్ చెయ్యక తప్పలేదు.

కరోనా పుణ్యమా అని ఇకనుంచీ ప్లేబాయ్ మార్క్ న్యూడిటీకి పేపర్ స్పర్శ ఉండదు. అంతా డిజిటల్ టచ్...   

Tuesday 5 May 2020

Manohar Chimmani Film Coaching Online


యాక్టింగ్, డైరెక్షన్, స్క్రిప్ట్‌రైటింగ్ లలో ఔత్సాహికులకు "వన్-టూ-వన్" పర్సనల్ కోచింగ్... ఆన్‌లైన్‌లో!

సినీఫిల్డుకు సంబంధించి నా మరొక ప్యాషన్ ఇది.

లక్షలు కుమ్మరించి .. ఏదో ఒక ఇన్స్‌టిట్యూట్‌లో చేరామా, ఏదో ఒకటి రొటీన్‌గా నేర్చుకొన్నామా, చివరికి ఏదో ఓ సర్టిఫికేట్ తీసుకొని బయటకొచ్చామా అని కాదు.

పైగా… ఈమాత్రం దానికి, ఒక స్థాయి ఫిలిం ఇన్స్‌టిట్యూట్‌లవాళ్లు తీసుకొంటున్న ఫీజు హైద్రాబాద్‌లోనే సుమారు 5 నుంచి 7 లక్షలవరకు ఉంటోంది! ఉపయోగం ఏంటి?... ఈ సర్టిఫికేట్ చూసి ఎవరైనా సినిమాలో చాన్స్ ఇస్తారా?

సినిమా ఇండస్ట్రీకి ఎలా అయితే అవసరమో,
పూర్తిగా ఆ పాయింటాఫ్ వ్యూ లోనే
నా పర్సనల్ 'ఆన్‌లైన్‌ కోచింగ్' ఉంటుంది. 


ఈ వన్-టూ-వన్ ఆన్‌లైన్‌ కోచింగ్ కోసం, నేనెంతో సమయం కెటాయించాల్సి ఉంటుంది. అందుకే ఇది ఫ్రీ కోచింగ్ కాదు.

ఫీజు ఉంటుంది.

అప్లై చేసిన ప్రతి ఒక్కరికి కూడా అడ్మిషన్ ఇవ్వడం సాధ్యం కాదు.

ఈ ప్రొఫెషన్ పట్ల కనీసం ఒక స్థాయి ప్యాషన్, తగిన ఆర్థిక స్థోమత, సీరియస్‌నెస్ ఉన్న అతి కొద్దిమందిని మాత్రమే తీసుకుంటాను. ఈ సెలెక్షన్ ప్రక్రియ... మీ అప్లికేషన్స్ పరిశీలించి, మీతో ఆన్‌లైన్ ఇంటర్వ్యూ చేయడం ద్వారా జరుగుతుంది.


మీకు తెలుసా… ఈ డిజిటల్ యుగంలో, ఫిలిం మేకింగ్‌కు సంబంధించిన చాలా పనులు ఆన్‌లైన్‌లోనే ఎక్కువగా జరుగుతున్నాయని?!

ఫిల్మ్ కోచింగ్ రంగంలోనే మొట్టమొదటిసారిగా, నేను రూపొందించిన ఈ పర్సనల్ 'ఆన్‌లైన్‌ కోచింగ్' రొటీన్ ఫిలిం ఇన్స్‌టిట్యూట్స్ ట్రైనింగ్‌కు పూర్తి భిన్నంగా ఉంటుంది.

ఉదాహరణకు:

> రొటీన్ క్లాస్ రూం టీచింగ్ అస్సలు ఉండదు.

> నంది అవార్డ్ రచయిత-డైరెక్టర్‌, యువర్స్ ట్రూలీ, మనోహర్ చిమ్మనితో… ఈమెయిల్స్, జూమ్/వెబెక్స్/స్కైప్/మెసెంజర్/వాట్సాప్ కాల్స్, ఫోన్ కాల్స్, ఆన్‌లైన్ కంటెంట్ షేరింగ్ మొదలైనవాటితో ఈ "వన్ టూ వన్" శిక్షణ పూర్తిగా ఆన్‌లైన్‌లో, పూర్తిగా అన్‌ట్రెడిషనల్‌గా ఉంటుంది.


> వారానికి 2 కోచింగ్ క్లాసులు మినిమమ్ ఉంటాయి.

> కోర్సు కాల వ్యవధి: మీరు కెటాయించగలిగే సమయాన్నిబట్టి  3-6 నెలలు. మీ టాలీవుడ్ ఎంట్రీకి ఈమాత్రం శిక్షణాకాలం చాలు. ఫీల్డులోకి ఎంటర్ అవడానికి అవసరమైన అన్నీ నేర్చుకుంటారు.

> మీ చదువుల్నీ, ఉద్యోగాలను
ఈ కోచింగ్ అస్సలు డిస్టర్బ్ చేయదు.
మీ మీ పనులు చేసుకొంటూనే
ఈ కోచింగ్ మీరు తీసుకోవచ్చు.


> సో... ఈ స్పెషల్ ఆన్‌లైన్ ఫిల్మ్ కోచింగ్‌లో చేరండి... మీలో ఉన్న టాలెంట్‌ను, సినీరంగం పట్ల మీకున్న ప్యాషన్‌ను నిరూపించుకోండి. ఫీల్డులో ప్రవేశించండి.

> మీ సినీ కెరీర్ మొత్తంలో, ఎప్పుడు మీకు నానుంచి ఎలాంటి గైడెన్స్, సలహాలు అవసరం వచ్చినా నన్ను వెంటనే సంప్రదించవచ్చు. ఈ విషయంలో మీకు నా నుంచి 100% "లైఫ్‌టైమ్ సపోర్ట్" ఉంటుంది.


> ఇంకెందుకు ఆలస్యం… మీకు నా ఈ కాన్సెప్ట్ నచ్చి... మీలో నిజంగా ఆ స్థాయి ఆసక్తి, ఆర్థిక స్థోమత, ప్యాషన్ ఉండి… నాతో ఈ వన్-టూ-వన్ ఆన్‌లైన్ కోచింగ్ తీసుకోవాలని నిర్ణయించుకొన్నట్టయితే... మీ పూర్తి పేరు, చదువు, అడ్రసు, మొబైల్ నంబర్ తెలుపుతూ... ఫీజు వివరాల కోసం నాకు వెంటనే వాట్సాప్ చేయండి.

> 24 గంటల్లో మీ ఇంటర్వ్యూ ఆన్‌లైన్‌లో ఉంటుంది. సెలెక్ట్ అయిన అభ్యర్థులు వెంటనే ఫీజు చెల్లించి కోచింగ్‌లో చేరిపోవాల్సి ఉంటుంది.

కట్ టూ ఫినిషింగ్ టచ్ -

> కోచింగ్ సమయంలోనే పరోక్షంగా మీరు ఇండస్ట్రీకి కనెక్ట్ అవుతారు.
కోచింగ్ పూర్తయ్యాక, మీ సినీరంగప్రవేశానికి ఇక మీదే ఆలస్యం.
అంతా మీచేతుల్లోనే ఉంటుంది. అకాశమే మీకు హద్దు. 


Welcome to Film Industry…
^^^

Manohar Chimmani,
Nandi Award Winning Writer and Film Director
Life Member, Telugu Film Chamber of Commerce
Life Member, Telugu Film Directors’ Association

My Profile in Brief | My Short AVFacebook | Twitter | Instagram


For application & fee details: 
WhatsApp: +91 9989578125
^^^^^

Read this in English

Monday 4 May 2020

వందనం .. అభివందనం...

నటునిగా వచ్చిన ఒక అతి చిన్న అవకాశం కోసం, చేస్తున్న చిన్న ఉద్యోగం కూడా వదులుకొని, 1960ల్లో చిత్రరంగంలోకి ప్రవేశించారు గురువు గారు దాసరి నారాయణరావు.

తర్వాత ఊహలు, అంచనాలు తల్లకిందులై .. రచనారంగంలోకి, దర్శకత్వశాఖలోకి సహాయకుడిగా ప్రవేశించారు.

సుమారు 25 చిత్రాలకు "ఘోస్ట్"గా పనిచేశాకగానీ రచయితగా ఆయనకు రావాల్సిన గుర్తింపు రాలేదు.

ఇక, ఆ తర్వాతంతా చరిత్రే!

మొత్తం 151 చిత్రాలకు కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం, 1000 కి పైగా పాటల రచన, 60 చిత్రాల్లో నటన. ప్రొడ్యూసర్‌గా 30 సినిమాలు, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, ఉదయం డెయిలీ, శివరంజని సినీవీక్లీల పత్రికాధిపత్యం, ఎడిటర్, ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్‌లోనూ, ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లోనూ బాధ్యతాయుతమైన పోస్టులు, రాజకీయాలు, కేంద్ర మంత్రి, గిన్నిస్ రికార్డ్, అవార్డులు, రివార్డులు .. ఇంకా ఎన్నో, ఎన్నెన్నో.

నా "సినిమా స్క్రిప్టు రచనాశిల్పం" పుస్తకం ముగింపు పేజీలో ఒక 'సక్సెస్ స్టోరీ'గా గురువుగారి గురించి నేను రాసిన కొన్ని వాక్యాలివి.

కట్ టూ ది లెజెండరీ డైరెక్టర్ -

గురువు గారి గురించి నేనొక పెద్ద పుస్తకమే రాయగలను. అలాంటిది, ఒక చిన్న బ్లాగ్‌పోస్ట్‌లో అసలేం రాయగలను?

అసాధ్యం.

కానీ, ఆయనకు సంబంధించి నాకు తెలిసిన కొన్ని గొప్ప విషయాల్ని, నేను మర్చిపోలేని కొన్ని జ్ఞాపకాల్ని, నా ఫీలింగ్స్‌నీ .. కేవలం బుల్లెట్ పాయింట్స్ రూపంలో, సాధ్యమైనంత క్లుప్తంగా రాసే ప్రయత్నం చేస్తున్నాను:

> ఒకే ఒక్క సంవత్సరంలో 15 సినిమాలు డైరెక్ట్ చేసి రిలీజ్ చేయగలరా?
అవును. చేయొచ్చు అని 1980 లోనే నిరూపించారు దర్శకరత్న దాసరి నారాయణరావు గారు. అంటే నెలకి ఒక సినిమా కంటే ఎక్కువే! అలాగని ఏదో చుట్టచుట్టి అవతల పడేసిన సినిమాలు కావవి. వాటిల్లో కనీసం 70% సినిమాలు హిట్లు, సూపర్ హిట్లు, సిల్వర్ జుబ్లీలు! స్వప్న, శ్రీవారి ముచ్చట్లు, సర్కస్ రాముడు, సర్దార్ పాపారాయుడు, సీతారాములు మొదలైనవి ఆ లిస్ట్ లోనివే.

> ఒకే రోజు 4 చోట్ల 4 సినిమాల షూటింగ్ జరుగుతుంటుంది. దర్శకుడు మాత్రం ఒక్కరే. దాసరి గారు! ఎక్కడికక్కడ షాట్స్ ఎలా తీయాలో తన అసిస్టెంట్స్‌కి చెబుతూ, 4 లొకేషన్లకు తిరుగుతూ, తీసిన షాట్స్ చూసుకొంటూ, అన్నీ మళ్లీ రివ్యూ చేసుకోవడం, అవసరమైతే కరెక్షన్స్ చేసుకోవడం. అద్భుతం ఏంటంటే, అలా తీసిన 4 సినిమాలూ హిట్ సినిమాలే కావడం!

> ఇలా తన పనిలో ఎక్కువభాగం చూసుకొన్న అప్పటి తన అసోసియేట్ డైరెక్టర్స్‌కు  గురువుగారు "కో-డైరెక్టర్" అన్న టైటిల్ కార్డ్ కొత్తగా క్రియేట్ చేసి మరీ ఇచ్చారు. అదీ తన అసిస్టెంట్స్‌కు దాసరిగారిచ్చిన గౌరవం. ఈ 'కో-డైరెక్టర్' కార్డ్ నేపథ్యం ఇప్పటి కోడైరెక్టర్లలో ఎంతమందికి తెలుసంటారు?

> ఇండస్ట్రీ చరిత్రలో మొట్టమొదటిసారిగా "డైరెక్టర్" పొజిషన్‌కు ఒక స్థాయి, ఒక విలువ, ఒక గౌరవం, ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ తీసుకొచ్చిన ఘనత గురువుగారిదే. అప్పట్లో ఆయన చెన్నై నుంచి ఫ్లైట్‌లో హైద్రాబాద్ వచ్చారంటే చాలు. ఇక్కడ బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌లో కనీసం ఒక 30 కార్లలో డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్, టెక్నీషియన్స్, ఆర్టిస్టులు, అభిమానుల కాన్వాయ్ ఎప్పుడూ రెడీగా ఉండేదంటే విషయం అర్థం చేసుకోవచ్చు. దటీజ్ డైరెక్టర్ దాసరి!     

> ఒకవైపు తండ్రీకొడుకులు, మరోవైపు తళ్లీ కూతుళ్ళు. కూతురు తండ్రిని ప్రేమిస్తుంది. కొడుకు తల్లిని ప్రేమిస్తాడు. ఇంత అడ్వాన్స్‌డ్ సబ్జెక్టుతో 42 ఏళ్ల క్రితం, 1976 లోనే ఒక సినిమా తీసి సిల్వర్ జుబ్లీ చేశారు గురువుగారు. అదే 'తూర్పు పడమర'. అప్పట్లో బాలు గారు పాడిన .. ది వెరీ సెన్సేషనల్ సాంగ్ 'శివరంజనీ, నవరాగిణీ!'  ఆ సినిమాలోని పాటే. ఇది 1975 లో తమిళంలో కె బాలచందర్ గారు తీసిన "అపూర్వ రాగంగళ్" కు రీమేక్ అయినప్పటికీ, తెలుగు వెర్షన్‌లో గురువుగారి ముద్ర అద్భుతం.

> ఇక "శివరంజని" సినిమాలో  జయంతి, షావుకారు జానకి, సావిత్రి, ఫటాఫట్ జయలక్ష్మి, ప్రభ  వంటి హీరోయిన్స్ మధ్య జయసుధను స్టేజి మీద కూర్చోబెట్టి .. అలా కెమెరా ప్యాన్ చేస్తూ .. జయసుధ అభిమానిగా హీరో హరిప్రసాద్‌తో "అభినవ తారవో" అని పాటపాడించటం .. పాట వింటూ హరిప్రసాద్‌ను చూస్తున్న జయసుధ క్లోజ్ కట్స్ కొన్ని .. రియల్లీ .. హాట్సాఫ్ టూ దట్ వన్ వెరీ సింపుల్  ఓపెనింగ్  సీక్వెన్స్ ఆఫ్ ది సాంగ్!

> 1979 లో బ్లాక్ అండ్ వైట్‌లో గురువుగారు తీసిన "నీడ" సినిమా ఒక సంచలనం. పర్వర్టెడ్ కుర్రాడిగా హీరో కృష్ణ కొడుకు రమేష్ అందులో హీరో. ఆ షూటింగ్ సమయంలో సెట్స్‌కు వచ్చిన మహేశ్‌బాబు వయస్సు నాలుగేళ్ళు! ఆ సినిమాలోనే, ఇంటర్వల్‌కు ముందు కొన్ని నిమిషాలపాటు, తన ఆర్టిస్టుల ఆడిషన్ కూడా చూపించారు గురువుగారు. ఆ ఆడిషన్ ద్వారా సెలెక్ట్ అయి పరిచయమైనవాడే ఇప్పటి ది గ్రేట్ ఆర్ నారాయణమూర్తి!

> 1980లో అక్కినేని జన్మదినం సెప్టెంబర్ 20 నాడు షూటింగ్ ప్రారంభించి, 5 నెలలు కూడా పూర్తవకముందే సినిమా పూర్తిచేసి, 1981 ఫిబ్రవరి 18  అక్కినేని పెళ్లిరోజున గురువుగారు రిలీజ్ చేసిన సంచలన చిత్రం "ప్రేమాభిషేకం". రిలీజైన ప్రతి సెంటర్‌లోనూ 100 రోజులు, 200 రోజులు, 250, 300, 365... చివరికి రికార్డ్ స్థాయిలో 75 వారాల 'డైమండ్ జుబ్లీ' కూడా ఆడిందీ చిత్రం! ఇదంతా పక్కనపెడితే, బెంగుళూరులోని 'మూవీల్యాండ్' థియేటర్లో ఇదే ప్రేమాభిషేకం ఏకంగా 90 వారాలు ఆడటం ఇప్పటికీ బీట్ చేయని రికార్డ్!!

>  1982 లో గురువుగారు తీసిన ఒక క్లాసిక్ కళాఖండం "మేఘసందేశం". రమేష్‌నాయుడు అద్భుత సంగీతంలో 11 పాటల మ్యూజికల్! మొత్తం 151 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాలో, 57 నిమిషాల సౌండ్‌ట్రాక్! అదీ "మ్యూజికల్" అంటే!! ఇందులో కృష్ణశాస్త్రి కవిత్వం ఉంది. జయదేవుని అష్టపదులున్నాయి. పాలగుమ్మి పద్మరాజు పద్యాలున్నాయి. వేటూరి పాటలున్నాయి. ఆశ్చర్యంగా, ఈ సినిమాలో గురువుగారు ఒక్క పాట కూడా రాయలేదు! కారణం మనం ఊహించవచ్చు. ఆయన మొత్తం ఫోకస్ అంతా సినిమాను ఎంత క్లాసిక్ గా తీద్దామన్నదే. అక్కినేని 200వ చిత్రంగా, ఆయనకు గురువుగారిచ్చిన అద్భుత బహుమతి "మేఘసందేశం.   

> నా ఉద్దేశ్యంలో జయసుధలోని సహజనటిని వెలికితీసింది దాసరిగారే. ఒక శివరంజని, ఒక మేఘసందేశం. జయసుధను మర్చిపోకుండా ఉండటానికి ఈ రెండు సినిమాలు చాలు.

> మేఘసందేశం సినిమాకు డి ఓ పి సెల్వరాజ్ అయినప్పటికీ, ఆపరేటివ్ కెమెరామన్‌గా దాదాపు ఆ సినిమాలో చాలా భాగం షూట్ చేసింది మాత్రం గురువుగారే అంటే ఎవరూ నమ్మరు. ఆ సినిమాలోని ప్రతి ఫ్రేమ్ మీద ఆయనకు అంత మమకారం! ఆ సినిమాకు 4 నేషనల్ అవార్డులు, 3 నంది అవార్డులు, 1 ఫిలిమ్‌ఫేర్ అవార్డ్ వచ్చాయంటే ఆశ్చర్యం లేదు.

> గురువుగారి సినిమాలకు "కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, పాటలు, దర్శకత్వం" అన్న టైటిల్ కార్డు చూసి కొంతమంది "అంతా ఉట్టిదే. ఎవరెవరో ఘోస్టులు పని చేస్తే ఆయన టైటిల్ కార్డ్ వేసుకుంటారు" అని కొందరు అంటుంటారు. ఇలా అనే వాళ్లకు నిజం తెలియదని నా ఉద్దేశ్యం. కనీసం పాతిక చిత్రాలకు ఘోస్టుగా పనిచేసిన గురువుగారికి ఒక రైటర్, ఒక టెక్నీషియన్ విలువేంటో అందరికంటే బాగా తెలుసు. ఇది నేను నా వ్యక్తిగతమైన అనుభవంతో, ఆయనతో ఉన్న పరిచయంతో చెప్తున్న నిజం.

> గురువుగారి హాండ్‌రైటింగ్‌తో ఆయనే స్వయంగా రాసుకొన్న స్క్రిప్టులే కనీసం ఒక 500 ఉన్నాయంటే నమ్మగలరా? మామూలుగా అయితే నేనూ నమ్మలేను. కానీ, ఆ స్క్రిప్ట్ ఫైల్స్ అన్నింటినీ బంజారాహిల్స్‌లోని ఆయన ఆఫీస్‌లో రెండ్రోజులపాటు కూర్చొని, ఒక ఆర్డర్‌లో పెట్టి సర్దింది నేనే! ఇవి కాకుండా, ఆయన క్లుప్తంగా రాసుకొన్న స్టోరీలైన్స్, ట్రీట్‌మెంట్స్ కనీసం ఇంకో 500 ఈజీగా ఉంటాయి. ఇందులో 1% కూడా అతిశయోక్తిలేదు. ఈ స్క్రిప్టుల్లో "ఒకరికోసం ఒకరు" అనే స్క్రిప్టు అంటే గురువుగారికి చాలా ఇష్టం. దాన్ని వాళ్ల అబ్బాయి అరుణ్‌కుమార్ హీరోగా తీయాలని అనుకున్నారు. కారణం తెలీదు, ఆ సినిమా గురువుగారు తీయలేకపోయారు.

> కథా చర్చలప్పుడు పరుచూరి బ్రదర్స్, సత్యానంద్, కొమ్మనాపల్లి, ఎమ్మెస్ కోటారెడ్డి, రేలంగి నరసిం హారావు, దుర్గా నాగేశ్వరరావు వంటి ఉద్దండులంతా ఉండేవాళ్లు. కొందరితో వెర్షన్స్ కూడా రాయించుకొనేవాళ్లు. కానీ, చివరికి సెట్స్‌పైకి వచ్చాక సెకన్స్‌లో అప్పటికప్పుడు ప్రతి సీన్ కొత్తగా చెప్పేవారు. అది రికార్డ్ చేసుకొని, రాసుకొని వచ్చేలోపు అక్కడ షాట్ రెడీ! అదీ ఆయన స్టయిల్. కథాచర్చల్లో పాల్గొన్న ప్రతి రచయిత పేరు కూడా టైటిల్ కార్డ్స్‌లో ఉండేది. ఆయనలోనే ఓ గొప్ప క్రియేటివ్ రైటర్ ఉన్నప్పుడు, ఇంక ఘోస్ట్‌ల అవసరం ఏముంది?

> పాటలు కూడా అంతే. అలా ట్యూన్ వింటూ, ఇలా లిరిక్స్ చెప్తుంటారు! అసిస్టెంట్స్ రికార్డ్ చేస్తుంటారు. ఎవరో రాసిన పాటను తన పాటగా వేసుకోవల్సిన అవసరం ఆ స్థాయి దర్శకునికి అవసరమా?

> ఒకరోజు .. తెల్లారితే పాట షూటింగ్ ఉంది. పాట ఇంకా రికార్డ్ అవలేదు. ఆఫీస్‌లోనే రాత్రి 11 అయింది. నన్ను తనతో ఇంటికి రమ్మన్నారు గురువుగారు. కొత్త సొనాటా కార్లో ముందు డ్రయివర్ పక్కన ఆయన కూర్చుంటే, వెనక ఇద్దరు గన్‌మెన్స్ మధ్య టెన్షన్‌తో నేను కూర్చున్నాను.

> ఇంటికెళ్లాక ఆ రాత్రి మేడమ్ పద్మ గారితో చెప్పి నాకు భోజనం పెట్టించారు. అయ్యప్ప దీక్షలో ఉన్న తను స్నానం చేసి, ఆ అర్థరాత్రి అయ్యప్ప పూజ చేశారు. వచ్చి టేబుల్ దగ్గర కూర్చొని ట్యూన్ వినిపించమన్నారు. ఆ ట్యూన్ వింటూ ఒక పావుగంటలో పాట చెప్పారు. రికార్డ్ చేసి నేను రాసిచ్చాను. అప్పటికప్పుడు ఫోన్ చేసి, నన్ను వందేమాతరం శ్రీనివాస్ స్టూడియోకు పంపారు. అక్కడ శ్రీలేఖతో సహా అందరూ వెయిటింగ్. మరో గంటలో పాట రికార్డింగ్ అయిపోయింది. గురువుగారికి ఫోన్లో చెప్పాను. మర్నాడు ఉదయం పాట షూటింగ్ అనుకున్న టైమ్‌కు  ప్రారంభమయింది!

> నిజంగా ఘోస్ట్‌లను పెట్టుకొనేవారే అయితే ఆరోజు రాత్రి ఒంటిగంటవరకు ఒక పాట కోసం అంత కష్టపడాల్సిన అవసరం గురువుగారికుందా?

> దాదాపు 50 ఏళ్ల తన సినీజీవితంలో వందలాదిమంది కొత్త ఆర్టిస్టులను, టెక్నీషియన్లను పరిచయం చేసి, వారిని ఇండస్ట్రీలో నిలబెట్టిన క్రెడిట్ ఒక్క గురువుగారికే ఉంది. మోహన్‌బాబు, మురళీమోహన్ హీరోలుగా పాపులర్ అయ్యారంటే ప్రారంభంలో అంతా గురువుగారి ఆశీర్వాదమే. ప్రోత్సాహమే.

 > మరోవైపు .. ఎందరో కొత్త ఆర్టిస్టులతోపాటు .. ఎన్ టి ఆర్, ఏ ఎన్ ఆర్, కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణం రాజు, జయసుధ, జయప్రద, శ్రీదేవి వంటి స్టార్స్‌కు కూడా అప్పట్లో సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చిన క్రెడిట్ కూడా గురువుగారికే ఉంది.

> 1972లో, తన తొలి చిత్రం "తాతా మనవడు" లో కమెడియన్ రాజబాబుని హీరోగా, విజయనిర్మల గారిని హీరోయిన్‌గా పెట్టి, ఎస్వీ రంగారావు ప్రధానపాత్రలో 25 వారాల సూపర్ డూపర్ హిట్ ఇవ్వడం ఒక్కటి చాలు దర్శకుడిగా ఆయనేంటో తెల్సుకోడానికి.

> "అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం .. ఆత్మ తృప్తికై మనుషులు ఆడుకొనే నాటకం" అని సినారె గారితో పాట రాయించి, అదే తన తొలిచిత్రంలో పెట్టడం ఒక్క గురువుగారికి మాత్రమే చెల్లింది. అప్పటికే తన సినీజీవితం, జీవితం .. గురువుగారికి చాలానే నేర్పించి ఉంటాయని నేననుకొంటున్నాను.

కట్ టూ గురువుగారితో నేను -

> ఇలాంటి 'లెజెండ్' దగ్గర ఒకే ఒక్క సినిమాకు నేను అబ్జర్వర్/అసిస్టెంట్ డైరెక్తర్‌గా పనిచేయగలగడం నా అదృష్టం. ఆ 4 నెలల సమయంలో ఆయన నాపట్ల చూపిన ప్రేమ, అభిమానం నేను ఎన్నటికీ మర్చిపోలేను.

> ఆయన చెప్పిన జోకులు, తెలుగులో ఒక్క అక్షరం స్పెల్లింగ్ కావాలని తప్పుగా రాసినా ఆయన పట్టుకొనే విధానం, తాజ్ బంజారాలో మరో కొత్త సినిమా కథా చర్చలు, మధ్యలో ఒక కథకు అమితాబ్ బచ్చన్ గారిని ఒక క్యారెక్టర్‌ కోసం అనుకొని, అప్పటికప్పుడు ఆయనకు కాల్ చేయడం, టైమ్ కాని టైముల్లో, ఆయన సొనాటా కారులో వెనక ఇద్దరు గన్‌మెన్స్ మధ్య టెన్షన్‌తో కూర్చుని ఆయనతోపాటు నేను తిరిగిన ట్రిప్పులు, ఆర్టిస్టులకు, టెక్నీషియన్స్‌కు ఆయనిచ్చే గౌరవం, అవసరమయినప్పుడు చూపించే ఆ క్షణపు కోపం .. ఇంకా ఎన్నో, ఎన్నెన్నో .. గురువుగారికి సంబంధించి నేను మర్చిపోలేని మంచి  జ్ఞాపకాలు.

> జూబ్లీహిల్స్‌లోని మణిశర్మ 'మహతి' రికార్డింగ్ థియేటర్లో, రికార్డింగ్‌తో ప్రారంభించిన నా తొలి చిత్రం "కల" కోసం నేను ఆహ్వానించగానే గురువుగారు ఎంతో సంతోషంగా వచ్చి, బయట కేవలం పూజదగ్గరే గంటసేపుకి పైగా నిల్చుని, తనే స్వయంగా అన్ని పూజా కార్యక్రమాలు దగ్గరుండి నా చేత చేయించటం, తర్వాత థియేటర్ లోపల రికార్డింగ్ ప్రారంభించడం, ట్యూన్‌లు, ట్రాక్‌లు అన్నీ చాలా ఓపిగ్గా వినడం .. నాకు బెస్ట్ విషెస్ చెప్పడం కూడా .. నేనెన్నటికీ మర్చిపోలేని మరో మధురసృతి.

థాంక్యూ ఫర్ ఎవ్రీథింగ్ సర్! ... మీరు లేరని నేననుకోవడంలేదు. అనుకోలేను.

So, wherever you are... Happy Birthday Sir!
And... Happy Directors' Day to All the Lovely Directors Out There!!