Friday 27 February 2015

సినిమా చూపిస్త మామా!

సినిమా తీయడం ఒక యజ్ఞంలాంటిది.

అది చిన్నదయినా పెద్దదయినా ప్రాసెస్ ఒకటే.

బడ్జెట్ 50 లక్షలయినా, 50 కోట్లయినా లక్ష్యం ఒక్కటే.

సినిమా రూపొందుతున్న సమయంలో మేం కలెక్టివ్‌గా తీసుకొనే ప్రతి చిన్న నిర్ణయానికీ, ప్రతిదశలోనూ మేము చేసే ప్రతి చిన్న పనికీ ఎంతో ఆలోచిస్తాము. ఎంతో చర్చిస్తాము.

బయట నుంచి ఎన్నో చెప్పవచ్చు.

ఈ డిజైన్ బాగా లేదు .. ఇలా చేయాల్సింది .. ఈ యాడ్ బాగా లేదు .. ఇలా చేయాల్సింది .. అదలా చేశారు .. ఇదిలా చేశారు ... ఇలా ఎన్నయినా చెప్పడం చాలా ఈజీ.

కాని .. ఒక సినిమా తీయడం కోసం ప్రతి స్టేజ్‌లోనూ ఆ డైరెక్టర్, ప్రొడ్యూసర్, పూర్తి కమిట్‌మెంట్‌తో ఉన్న ఆ టీమ్ మొత్తం చేసే శ్రమ, పడే కష్టాలు వాళ్లకు మాత్రమే తెలుస్తాయి.

కట్ టూ "స్విమ్మింగ్‌పూల్" సినిమా - 

ముందు ప్రొడ్యూసర్ అరుణ్ కుమార్‌కు టీమ్ మొత్తం హాట్స్ ఆఫ్ చెప్పాలి.

నిజంగా ఆయన కమిట్‌మెంట్ అలాంటిది. "కట్టె కొట్టె తెచ్చె" .. అంతే. అనవసరమయిన సాగదీయడం ఉండదు. ఏదయినా నచ్చలేదు, లేదా ఎక్కడయినా క్లారిటీ లేదు అనిపిస్తే ఆ ముక్క వెంటనే చెప్పేస్తారు. డిస్కషన్ జరుగుతుంది. ఒక మ్యూచువల్, అర్థవంతమయిన నిర్ణయానికి వచ్చేస్తాం. ఇంక మళ్ళీ దృష్టంతా జరగాల్సిన పని పైనే. పెట్టుకున్న లక్ష్యం పైనే.

అదీ పని చేసేవాళ్ల స్టయిల్. ఆ స్టయిల్‌కు ఒక ఖచ్చితమయిన అర్థం అనేది ఉంటుంది. వాల్యూ ఉంటుంది.  

దీనికి పూర్తి వ్యతిరేకంగా కొందరుంటారు. వీళ్లంతా అలా గట్టున ఉండి కామెంట్స్ చేసేవాళ్లన్నమాట. ప్రతి విషయంలోనూ వీళ్ల అమూల్యమయిన సలహాలు, కామెంట్స్ వదుల్తుంటారు. ఎన్నేళ్లయినా స్వతంత్రంగా ఏదీ చేయలేరు. చేసి నిరూపించుకోలేరు. ఇదంతా వ్యర్థం. దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు.

చూస్తుండగానే మా "స్విమ్మింగ్‌పూల్" సినిమా పోస్ట్ ప్రొడక్షన్ చివరిదశకు చేరుకొంది. కొద్దిరోజుల్లోనే కాపీ చేతికి రానుంది. తర్వాత సెన్సార్, బిజినెస్, రిలీజ్.

మా హీరో అఖిల్ కార్తీక్ .. హీరోయిన్ ప్రియ వశిష్ట  నుంచి, మా లైట్‌బాయ్ శివమణి వరకు - శ్రీశ్రీ మూవీస్ టీమ్‌లోని ప్రతి ఆర్టిస్టు, ప్రతి టెక్నీషియన్ లక్ష్యం ఒక్కటే.

ఆ లక్ష్యం కోసమే కష్టపడుతున్నాం. ఆ లక్ష్యాన్ని చేరుకుంటాం.

ఆ నమ్మకం మాకుంది.          

Wednesday 25 February 2015

క్రౌడ్ ఫండింగ్ ఫర్ ఫిలిమ్‌మేకింగ్!

సినిమాలమీద, సినిమా బిజినెస్ మీద, సినిమాల్లో ఇన్వెస్ట్ చేయడం మీద ఆసక్తి ఉన్నవారికి ఒక మంచి మార్గం, ఒక మంచి అవకాశం "క్రౌడ్ ఫండింగ్" సిస్టమ్.

కిక్‌స్టార్టర్, ఇండీగోగో వంటి భారీ సైట్స్‌తో అంతర్జాతీయంగా ఈమధ్యే బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన ఈ సిస్టమ్ ఇంకా మన దగ్గర చాలా మందికి తెలియదు.

నాకు తెలిసినంతవరకు, మన దేశంలో ఈ పధ్ధతిని అనుసరించి ఇప్పటికి ఏ ఒకటో రెండో సినిమాలు తయారయ్యాయి. అంతే. కిక్‌స్టార్టర్ లాంటి సైట్స్ మన దేశంలోనూ కొన్ని వచ్చినా అవి అంతగా ప్రాచుర్యం పొందలేదు. కారణం .. మన రిజర్వ్ బ్యాంక్ పెట్టిన కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్.

కట్ టూ మన టాపిక్ -  

ఒక ప్రాజెక్ట్ కోసం ఒక్కరే మొత్తం పెట్టుబడి పెట్టకుండా - తక్కువ మొత్తంలో పెట్టుబడి పెడుతూ ఎక్కువమంది షేర్‌హోల్డర్స్ కావొచ్చు.

ఉదాహరణకి -

అంతా కొత్తవారితో ఒక పూర్తి స్థాయి ఫీచర్ ఫిలిం తీసి, రిలీజ్ చేయడానికి ఒక 50 లక్షల బడ్జెట్ కావాలనుకొంటే .. ఆ మొత్తం ఒక్కరే పెట్టాల్సిన పనిలేదు.

50 మంది ఒక లక్ష చొప్పునగాని; 25 మంది 2 లక్షల చొప్పునగాని; లేదా ఓ 10 మంది 5 లక్షల చొప్పునగాని పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పధ్ధతిలో ఎవ్వరికీ పెద్ద రిస్క్ ఉండదు.

త్వరలో నేను ప్రారంభించబోతున్న నా తర్వాతి సినిమాలకు, నా ఫిలిం ఫ్యాక్టరీకి, ఈ సిస్టమ్‌లో ఇన్వెస్ట్ చేయడానికి సిధ్ధంగా ఉన్నవారికి ఇదే నా ఆహ్వానం.

నిజంగా మీలో అంత ఆసక్తి ఉండా?
చిన్నస్థాయిలో వెంటనే పెట్టుబడి పెట్టగలరా?

అయితే .. పూర్తి వివరాలకోసం వెంటనే మీ మొబైల్ నంబర్‌తో నా ఫేస్‌బుక్‌కు గానీ, ట్విట్టర్‌కు గానీ మెసేజ్ పెట్టండి. నేనే మీకు కాల్ చేస్తాను.

పి ఎస్:
మీకు తెలిసి ఈ వైపు ఆసక్తి ఉన్నవాళ్లు ఎవరయినా ఉంటే, వారికి ఈ ఇన్‌ఫర్మేషన్ లింక్ పంపించండి.
థాంక్స్ ఇన్ అడ్వాన్స్!

Tuesday 24 February 2015

ఇంకో రెండు వారాల్లో కాపీ!

40 రోజులు చేయాల్సిన షూటింగ్‌ని, డే అండ్ నైట్ కష్టపడి కేవలం 13 రోజుల్లో పూర్తిచేయగలిగాం. అయితే, ఊహించని కారణాలతో పోస్ట్ ప్రొడక్షన్‌లోనే కొంత ఆలస్యం అవుతోంది.

అవే టీలు, టిఫిన్‌లు, లంచ్‌లు, ఈవెనింగ్ స్నాక్స్, ప్రతి బ్రేక్‌లోనూ గవర్నమెంట్ ఆఫీసులాగా టైం పాస్ చెయ్యడాలూ .. ఓహ్..

ఇంకా మనవాళ్లు పాత చింతకాయపచ్చడి 'నెగెటివ్ ఫిలిమ్ మేకింగ్' జమానాలోనే ఉన్నారంటే ఆశ్చర్యంగా ఉంది.

ఇంక వీళ్లింతే.

ఈ పనికిరాని పధ్ధతి ఇంకా రాజ్యమేలుతోందని ముందే నేను ఏ కొంచెం స్టడీ చేసినా, పోస్ట్ ప్రొడక్షన్‌కి నా ప్లాన్ మరోలా ఉండేది.

రెండంటే రెండు మ్యాక్ కంప్యూటర్లు చాలు. పదిరోజుల్లో, లేదంటే ఎక్కువలో ఎక్కువ రెండు వారాల్లో కాపీ రెడీ చేయొచ్చు. క్వాలిటీలో ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా!

మరోసారి కోట్ చెయ్యక తప్పదు. రామ్‌గోపాల్‌వర్మ ఇదంతా చూళ్లేకే "న్యూ తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీ" అన్నాడు. ఈ చెత్తంతా నాకే వెగటుగా ఉంది. వర్మకి ఇంకా పిచ్చెక్కి ఉంటుంది.

మళ్లీ అనక తప్పట్లేదు. వీళ్లింతే.

కట్ టూ మన స్విమ్మింగ్‌పూల్ -

ఎడిటింగ్, డబ్బింగ్, సౌండ్ ఎఫెక్ట్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వర్క్ అయిపోయింది.

మిగిలింది టైటిల్స్, కొంచెం గ్రాఫిక్ వర్క్, డీ ఐ, ఫైనల్ మిక్సింగ్.

ఇదంతా ఇంకో రెండు వారాల్లో పూర్తవుతుంది. కాపీ వచ్చేస్తుంది. తర్వాత సెన్సార్. ఆడియో రిలీజ్, బిజినెస్, ఫిలిం రిలీజ్.

కట్ చేస్తే కొత్త సినిమా.

ఈసారి మాత్రం పోస్ట్ ప్రొడక్షన్ ఖచ్చితంగా ఇలాగ ఉండదు. ఉండదు. ఉండదు.       

Friday 20 February 2015

"హారర్ షార్ట్" కాన్‌టెస్ట్ !

> ఈ కాంటెస్ట్‌లో ఎవరయినా పాల్గొనవచ్చు.
> సినీ ఫీల్డులోకి ప్రవేశించాలనుకొనే ఔత్సాహికులయిన కొత్త టాలెంట్‌కు ప్రాధాన్యం ఉంటుంది.
> షార్ట్ ఫిలిమ్ టాపిక్: "హారర్".
> అది కామెడీ హారర్ కావొచ్చు. రొమాంటిక్ హారర్ కూడా కావొచ్చు.
> ఫిలిమ్ నిడివి: 1 నుంచి 3 నిమిషాలు.
> ఎంట్రీలు పంపాల్సిన చివరి తేదీ: 9 మార్చి 2015, సోమవారం.
***

> చివరి తేదీలోపు మాకు అందిన ఎంట్రీల్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్‌లకు 3 ఉత్తమ షార్ట్ ఫిలింస్‌ని మా టీమ్ ఎన్నిక చేస్తుంది:

ఫస్ట్ ప్రైజ్‌కు నగదు బహుమతి: రూ. 10,000
సెకండ్ ప్రైజ్‌కు నగదు బహుమతి: రూ. 5,000
థర్డ్ ప్రైజ్‌కు నగదు బహుమతి: రూ. 3,000

> ఈ బహుమతులను మార్చిలో జరగబోయే మా "స్విమ్మింగ్‌పూల్" ఆడియో ఫంక్షన్ స్టేజిపైన, మా కార్యక్రమ విశిష్ట అతిథులుగా విచ్చేసిన సినీ ప్రముఖుల చేతులమీదుగా ఇస్తాము.

> ఈ 3 ప్రైజ్‌లను గెల్చుకొన్న అభ్యర్థులు ముగ్గురికీ, అతి త్వరలో ప్రారంభం కానున్న మా తర్వాతి చిత్రంలో దర్శకత్వ శాఖలో "అసిస్టెంట్ డైరెక్టర్" చాన్స్ ఇస్తాము. 

> ప్రైజ్‌లు గెల్చుకొన్న ముగ్గురు విజేతలతోపాటు, వీరి తర్వాతి టాప్ 10 అభ్యర్థులకు మా "స్విమ్మింగ్‌పూల్" సినిమా ప్రివ్యూ షో కు ప్రత్యేక ఆహ్వానం ఉంటుంది.

> కాంటెస్ట్‌లో పాల్గొన్న అభ్యర్థులంతా కూడా మార్చిలో జరగనున్న మా ఆడియో ఫంక్షన్‌కు ప్రత్యేక ఆహ్వానితులే.

> కాంటెస్ట్‌కు మీ ఎంట్రీలను ఈమెయిల్ ద్వారా పంపాల్సి ఉంటుంది.
ఈమెయిల్ అడ్రెస్: manutimemedia@gmail.com


> చివరి తేది: 9 మార్చి 2015, సోమవారం.

***  

ముఖ్య గమనిక:

> ఈ కాంటెస్ట్‌కు వచ్చే ప్రతి హారర్ షార్ట్ ఎంట్రీపైన సర్వ హక్కులు ఈ కాంటెస్ట్ నిర్వాహకులకే ఉంటాయి. కాంటెస్ట్‌కు ఎంట్రీలు పంపే అభ్యర్థులందరూ ఈ షరతుకు ఒప్పుకొన్నట్టుగానే మేము భావిస్తాము.

> విజేతల షార్ట్ ఫిలింస్‌తోపాటు, మాకు చేరిన ప్రతి "హారర్ షార్ట్" ఫిల్మ్ ఎంట్రీని కూడా తర్వాత మేము మా "స్విమ్మింగ్‌పూల్" రొమాంటిక్ హారర్ సినిమా ప్రమోషన్ కోసం ఉపయోగించుకొంటాము. దీనివల్ల అభ్యర్థులకు కూడా మంచి ఎక్స్‌పోజర్ ఉంటుంది.

> మీ వెరీ ప్రిసైజ్ సందేహాలకు, వెరీ క్విక్ సమాధానాన్ని ఈ నంబర్‌లో పొందవచ్చు: +91 7386156073
ఈ-మెయిల్:   manutimemedia@gmail.com

> ఈ కాంటెస్ట్‌లో పాల్గొనడానికి ఎలాంటి ఎంట్రీ ఫీజ్ లేదు.ఇంకెందుకు ఆలస్యం? లేవండి.
"లైట్స్ .. కెమెరా .. యాక్షన్!" 

తోపుడు బండి

చందమామ, బాలమిత్ర, విజయ, విజయచిత్ర.. చిన్నతనంలో వీటితో నా పుస్తకపఠనం హాబీ ప్రారంభం.

తర్వాత సోవియట్ లాండ్, స్పుత్నిక్, గోర్కీ, టాల్‌స్టాయ్, పవుస్తోవ్‌స్కీ, రష్యన్ అనువాద కథలు, నవలలు ..

ఆ తర్వాత విశ్వనాథ వేయిపడగలు, దంతపుదువ్వెన, దిండుకింద పోకచెక్క లతో ప్రారంభమై .. చలం, పాలగుమ్మి, ఉన్నవ, దాశరథి రంగాచార్య, వట్టికోట ఆళ్వారుస్వామి, వడ్డెర చండీదాస్, లత, రంగనాయకమ్మ, యధ్ధనపూడి, మాదిరెడ్డి, యండమూరి, మల్లాది ..

వీటన్నిటితోపాటు అటు క్రమం తప్పకుండా 'అరుణతార', 'సృజన'లూ, స్పార్టకస్‌లూ చదివాను.

మరోవైపు, ఇవి చదువుతూండగానే .. ఇంగ్లిష్‌లో అగాథా క్రిస్టీ, హెరాల్డ్ రాబిన్స్, జెఫ్‌రీ ఆర్చర్, రాబిన్ కుక్, ఫ్రెడరిక్ ఫోర్సిత్, టామ్ క్లాన్సీ, డాన్ బ్రౌన్ ..

అయితే వీటన్నిటితో సమాంతరంగా నేను పోయెట్రీ కూడా చదివాను. చాలా లిమిటెడ్‌గా. కీట్స్, షెల్లీ, కృష్ణ శాస్త్రి, తిలక్, శ్రీశ్రీ, కాళోజీ ..

అదంతా ఒక యుగం. స్వర్ణ యుగం.

ఆ రోజులతో పోలిస్తే ఇప్పుడు చదవటం పూర్తిగా తగ్గిపోయింది. అలాగని  చదవటం పూర్తిగా మానలేదు. చదువుతున్నాను, అప్పుడప్పుడూ: ది ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి, భగవద్గీత, ది పవర్ ఆఫ్ నౌ, ది ఆల్కెమిస్ట్, డాన్ పెనా, టిమ్ ఫెర్రిస్, లిసా రాన్‌కిన్ ..

కట్ టూ నా తొలి ప్రేయసి - 

పుస్తకమే నా మొట్టమొదటి లవర్. మర్చిపోవటం అంత ఈజీ కాదు. అసాధ్యం.

ఆమధ్య డిజిటల్ ఈ-బుక్స్ వచ్చాయి. తర్వాత అమెజాన్ కిండిల్ బుక్స్ వచ్చాయి. అయినా - నా తొలి ప్రేయసిని స్పర్శించిన ఆనందం వీటిలో లేదు. ఉండదు.

అలాంటి పుస్తకాల్ని సృష్టించే రచయితలు, కవులకు దురదృష్టవశాత్తూ మన దేశంలో పబ్లిషర్స్ నుంచి సరయిన ప్రోత్సాహం లేదు. తెలుగులో అయితే అసలు లేదు.

ఇప్పటివరకూ ఎవ్వరూ ఊహించని ఒక విలక్షణమైన కాన్‌సెప్ట్‌తో, దీన్ని బ్రేక్ చేయడానికి పూనుకున్నాడో సాహితీ ప్రియుడు, జర్నలిస్టు, బిజినెస్‌మాన్.

అతనే సాదిక్ అలీ. నా యూనివర్సిటీ మిత్రుడు.

అతని కాన్‌సెప్టే ఈ "తోపుడు బండి".

రేపు ఆదివారం నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా నుండి కదులుతున్న ఈ తోపుడు బండి తప్పకుండా ఓ పాజిటివ్ బ్రేకింగ్ న్యూస్ అవుతుంది. అయితే ఇది అక్కడితోనే ఆగిపోకుండా, జిల్లాకో తోపుడు బండి వచ్చేలా చేస్తుందని నేను విశ్వసిస్తున్నాను.

అక్కడితోకూడా ఆగిపోకుండా - మరో బార్న్స్ అండ్ నోబెల్, అమెజాన్ స్థాయి పుస్తక ప్రచురణ కేంద్రంగా ఎదగాలని ఆశిస్తున్నాను.

జయహో సాహిత్యం! జయహో పుస్తకం!! 

Tuesday 17 February 2015

ట్రెండీ ఇంటర్‌నెట్ హీరో!

ఇంటర్‌నెట్ సెర్చ్ఇంజైన్స్‌లో "గూగుల్" రారాజు అన్న విషయం అందరికీ తెలిసిందే.

ఈ గూగుల్ అనేది జనంలో ఎంత పాపులర్ అయిపోయిందంటే - ఏ విషయం గురించి తెలుసుకోవాలన్నా, ఏ వ్యక్తి గురించిన సమాచారాన్ని వెదకాలన్నా, "అరె .. గూగుల్‌ల కొట్రాబై!" అని చిన్న గ్రామాల్లో కూడా చాలా సింపుల్‌గా చెప్తున్నారిప్పుడు.

అదీ గూగుల్ వాల్యూ.

అలాంటి గూగుల్‌లో .. ఎవరిగురించి, లేదా ఏ టాపిక్ గురించి .. ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారన్న విషయంలో ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించే విభాగం - గూగుల్ ట్రెండ్స్.

2014 లో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక నెటిజెన్‌లు గూగుల్‌లో మన కె సి ఆర్ గురించిన సమాచారం కోసం అన్వేషించారని ఈ మధ్యే గూగుల్ ట్రెండ్స్ తెలిపింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నెట్‌లో ఈ "కె సి ఆర్ సెర్చ్" మరింత శిఖరాగ్ర స్థాయిని చేరిందని కూడా గూగుల్ ట్రెండ్స్ తెలిపింది.

కట్ టూ కొన్ని 'హైటెక్' నిజాలు -

ఐటి, ఇంటర్‌నెట్, టెలికాన్‌ఫరెన్స్ వంటి పదాల్ని ఆ మధ్య చంద్రబాబు నాయుడు నోటివెంట వినీ వినీ జనాలకి బోర్ కొట్టింది. ఇక, తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో అయితే, 'అసలు హైదరాబాద్‌ను హైటెక్ సిటీగా మార్చింది కూడా నేనే' నంటూ ఒకటే నస. మరోవైపు సీమాంధ్ర పక్షపాత పత్రికలు, టీవీ మీడియా కూడా 'ఐటీ అంటేనే బాబు .. హైటెక్ అంటేనే బాబు' అన్నట్టుగా తెగ ఊదరగొడుతుంటాయి నేటికీ!  

దీనికితోడు, 'ట్విట్టర్ స్పెషలిస్ట్', చంద్రబాబు నాయుడు కొడుకు లోకేశ్ కూడా మంచి 'హైటెక్' అని చెబుతారు.

ట్విట్టర్ అనేది ఒక ఎలైట్ సోషల్ మీడియా. దీన్లో, తను రాస్తున్నదానిమీద కనీస అవగాహనకూడా లేకుండా నానా చెత్త పోస్ట్ చేసే ప్రతివాడినీ హైటెక్ అని ఎలా అంటారో వాళ్లకే తెలియాలి. అదలా వదిలేద్దాం.  

ఈ మధ్య "ఇండియన్ ఆఫ్ ది ఇయర్" అనే ఓ కాంటెస్ట్‌లో 24 గంటల్లో వోటింగ్ రేట్‌ని 20 శాతం కె సీఅర్ కి వ్యతిరేకంగా జరిగేలా చేసిన ఘనత కూడా లోకేశ్‌దేనని ఫేస్‌బుక్కూ, నెట్అంతా చదివాను.

మరి ఈకోణంలో చూస్తే - నెట్ సావీ కొడుకు లోకేశ్ పవర్ కూడా తోడైన చంద్రబాబుకే బాగా ప్రాచుర్యం ఉండాలి. ఇంటర్‌నెట్‌లో ఆయన కోసం సెర్చ్‌లు లక్షల్లో, కోట్లలో రికార్డ్ కావాలి.

కాని, వాస్తవం మరోలా ఉంది!  

విచిత్రంగా ఇప్పుడే హైటెక్‌బాబు గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోవడంలేదన్నది గూగుల్ ట్రెండ్స్ సాక్షిగా మనకు చాలా స్పష్టంగా తెలుస్తోంది.

చంద్రబాబు నాయుడు కోసం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల అవతల ఎక్కడో అమెరికాలోని సెర్చ్ ఇంజైన్లలో సెర్చ్ ఎక్కువగా ఉంది. కొంత హైద్రాబాద్‌లో ఉంది. అంటే, అది హైద్రాబాద్‌లో ఉన్న సీమాంధ్రుల సెర్చ్ అన్నది సుస్పష్టం.

మరోవైపు, కె సి ఆర్ గురించి మాత్రం కేవలం తెలంగాణ, అమెరికాల్లో మాత్రమే కాకుండా - విజయవాడ, గుంటూరు, వైజాగ్, తిరుపతి తదితర సీమాంధ్ర ప్రాంతాల్లోనూ గూగుల్ సెర్చ్ బాగా జరుగుతుండటం విశేషం.

కట్ టూ 'ది రియల్ ఇంటర్‌నెట్ హీరో' -  

"నేనే హైటెక్ సిటీని కట్టాను", "నేనే బిల్ గేట్స్ ని హైద్రాబాద్‌కు రప్పించాను" వంటి డైలాగ్స్‌తో ఒకనాడు మీడియాలో భారీ ప్రచారం చేసుకొన్న చంద్రబాబు నాయుడు, ప్రస్తుతం ఇంటర్‌నెట్ ప్రాచుర్యంలో కూడా తన పూర్వవైభవాన్ని, ప్రాభవాన్ని పూర్తిగా కోల్పోయాడు.

ఈ విషయంలో కె సి ఆర్, చంద్రబాబుని బీట్ చేశాడు.

మొన్నటి ఎలక్షన్లలో ఫేస్‌బుక్ ద్వారా నెటిజెన్‌లు అన్‌కండిషనల్‌గా కె సి ఆర్ కి అందించిన మద్దతు నభూతో నభవిష్యతి! అదే స్థాయి మద్దతు కె సీఅర్ కు ఇంటర్‌నెట్‌లో ఇంకా కొనసాగుతుండటం, అది రోజురోజుకీ ఇంకా ఇంకా పెరుగుతుండటం మరింత గొప్ప విశేషం.

బహుశా ఫేస్‌బుక్ క్రియేటర్ జకెర్‌బర్గ్ కూడా ఇలాంటి పరిణామం ఊహించి ఉండడు. ఒక ఉద్యమ నాయకుడిగా, ఒక రాజకీయవేత్తగా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా కె సి ఆర్ సాధించుకొన్న క్రిడిబిలిటీ అది.

గూగుల్ ఒక్కటే కాదు. అటు ఫేస్‌బుక్, ట్విట్టర్‌లతోనూ నెట్‌లో కబడ్డీ ఆడేశాడు కె సి ఆర్.

ఒక తీయటి నిజం ఏంటంటే - అసలు "ఇండియన్ ఆఫ్ ది ఇయర్" కాంటెస్ట్ నామినీల లిస్ట్ లోనే చంద్రబాబు పేరు లేకపోవడం!

అక్కడే కె సి ఆర్ గెలిచాడు.

ఈ నిజం జీర్ణించుకోలేక, ఇండియన్ ఆఫ్ ది ఇయర్ లో కె సి ఆర్ మాత్రం గెలవవద్దని ఎన్నో టక్కు టమారం విద్యలు ప్రదర్శించారు. వాటికి లొంగిపోయిన ఆ చానెల్ క్రిడిబిలిటీ పాతాళంలోకి కుంగిపోయింది. అది వేరే విషయం.

వెరీ పిటీ ఎబౌట్ దెమ్! నేను జాలిపడుతున్నాను ..

తెలంగాణ వచ్చినపుడే కె సి ఆర్ గెలిచాడు. అది చరిత్రలో చెరగిపోని గెలుపు. ఆ గెలుపు ముందు
ఈ సి ఎన్ ఎన్ - ఐ బి ఎన్ కాంటెస్ట్ ఎంత?
                                                                                                  (ఈ రోజు కె సి ఆర్ జన్మదినం సందర్భంగా) 

Friday 13 February 2015

ఆమె ఎవరు?

రెండ్రోజుల్లో "స్విమ్మింగ్‌పూల్" ప్రమోషనల్ సాంగ్ రెడీ అవుతోంది.

రికార్డింగ్ అయిపోయాక, దాన్ని వీడియో అవుట్‌పుత్‌తో ఎడిట్ చేసి, ఆన్‌లైన్‌లో రిలీజ్ చేయడానికి మరో నాలుగయిదు రోజులు పడుతుంది.

ఈ ప్రమోషనల్ సాంగ్ కోసం అవసరమయిన కొన్ని షాట్స్‌లో ఒక కొత్త హీరోయిన్‌ను గానీ, ఆ స్థాయిలో ఉన్న ఓ మంచి మోడల్‌ను గానీ చూపించాలన్నది నా తాజా ఆలోచన.

కట్ టూ స్టార్ హంట్ - 

విచిత్రంగా, షూటింగ్ తర్వాత చేస్తున్న ఈ స్టార్ హంట్ కోసం ఫేస్‌బుక్ లో నేనిచ్చిన చిన్న యాడ్‌కి కొన్ని అప్లికేషన్లు వచ్చాయిగాని అవి నేను ఊహించిన రేంజ్‌లో లేవు. నేను అనుకున్న విధంగా షూట్ చేయడానికి వారు సరిపోరు.

కొన్ని క్లోజప్ షాట్స్‌తోపాటు - మిడ్, ఫుల్ షాట్స్ లో కొన్ని వాకింగ్ షాట్స్ ఉంటాయి. అన్నీ కలిపి ఓ పది షాట్స్. కేవలం ఓ రెండు గంటల షూటింగ్.

ఈ అదృష్టం ఎవరిని వరిస్తుందో తెలియదుగాని, ఓవర్‌నైట్‌లో బాగా పాపులర్ అయ్యే అవకాశం ఉంటుంది.

యు ఎస్, రుమేనియా, రష్యా, కెనడా, న్యూజీలాండ్, మారిషస్ లలో నాకు తెలిసిన యాక్టర్స్, మోడల్స్ కొందరున్నారు. అడిగితే - ఫ్రీగా అక్కడినుంచే షూట్ చేసి పంపిస్తారు. అవుట్‌పుట్ కూడా సూపర్ రిచ్‌గా వస్తుంది. కాని, మరింత ఆలస్యం అవుతుంది.

నిజానికి ముందు ఈ షాట్స్‌ని హీరోయిన్ ప్రియ వశిష్ట తోనే తీయాలనుకున్నాను. అది కుదిరేపనిలా అనిపించడంలేదిప్పుడు. ఆ ఆలోచన మానుకున్నాను కూడా.

మరెలా?

ఇంకో రెండు మూడు రోజుల్లో తేలిపోతుంది. అప్పటిదాకా నాక్కొంచెం టెన్షన్. మీకు సస్పెన్స్.

అంతే. 

Thursday 12 February 2015

ఎవరు దయ్యం?

దయ్యం 1: 
ఈ దయ్యానికి ఎప్పుడూ డేట్స్ ప్రాబ్లం, ట్రాన్స్‌పోర్ట్ ప్రాబ్లం, ఆ ప్రాబ్లం, ఈ ప్రాబ్లం.

వచ్చేవరకూ వస్తుందా రాదా అని మా టెన్షన్. వచ్చాక తొందరగా ఎప్పుడు బయటపడిపోదామా అని తనవైపు టెన్షన్. మొత్తం తను నటించిన నాలుగయిదు రోజుల్లో - లాస్ట్ డే, లాస్ట్ షాట్ వరకూ పెద్ద టెన్షన్ మాకు.

కానీ బాగా నటించింది. ఆ ఒక్క యాంగిల్ చాలు. ఇది మంచి దయ్యం అని చెప్పడానికి.

నాకు కావల్సింది కూడా తెరమీద తను బాగా నటించడమే కాబట్టి, ఈ దయ్యం నిజంగా మంచి దయ్యమే.

దయ్యం 2:
హబ్బో.. ఈ దయ్యం ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది. మంచి ఎట్రాక్టివ్ స్మయిల్. ఆ చిరునవ్వు ఎంత అమాయకంగా ఉంటుందంటే - తను ఎంత లేట్‌గా వచ్చినా, దానివల్ల మాకు ఎంత టెన్షన్ అయినా .. అంతా ఇట్టే మర్చిపోతాం.

స్మయిల్ తర్వాత, ఈ దయ్యం విషయంలో చెప్పుకోవాల్సింది యాక్టింగ్.

సింగిల్ టేక్ ఆర్టిస్ట్!

పక్కవాళ్ల యాక్టింగ్‌లోనే ఏదయినా తేడారావాలి తప్ప తన విషయంలో రాదు. అంత మంచి నటి తనలో ఉంది. మా ప్రొఫెసర్ "ఆమె కళ్లల్లోనే ఉంది అంతా" అంటారు. మొన్న డబ్బింగ్ రోజు కూడా ఇద్దరూ కలిశారు. అప్పుడు కూడా ప్రొఫెసర్ ఇదే మాట!

సో, ఈ దయ్యం కూడా మంచి దయ్యమే అన్నమాట.

దయ్యం 3:
ఈ దయ్యం గురించి చెప్పాలంటే చాలా ఉంది. బండ దయ్యం. పైకి అలా కనిపిస్తుంది కానీ, పెద్ద డేర్‌డెవిల్.
ఈ దయ్యంతో మాట్లాడాలంటే ముందు శాటిలైట్‌కు కనెక్ట్ కావాలి. అదన్నమాట విషయం.

యాక్టింగ్ అంటే ప్రాణం. బుద్ధిగా డైలాగులూ అవీ బట్టీ పడుతుంది. ఎలా చెయ్యమంటే అలా చేస్తుంది. ఇంకా బాగా చేస్తుంది. కొన్ని క్యాజువల్ డైలాగుల విషయంలో అప్పుడప్పుడూ "ఇది ఇలా కూడా అనొచ్చుకద సర్?" అని అడుగుతుంది. తను చెప్పిన ఆ చిన్న ఇంప్రొవైజేషన్ బాగున్న ప్రతిసారీ ఓకే చెప్పాన్నేను.

ఒకటి రెండు సార్లు కంటిన్యుటీ విషయంలో తెలియక కేర్‌లెస్‌గా పప్పులో కాలేసింది. తర్వాత కంటిన్యుటీ ఏమిటో, ఎందుకో అర్థమయ్యాక అలాంటి పొరపాటు మళ్లీ చెయ్యలేదు.

సో, ఈ దయ్యం కూడా చాలా మంచి దయ్యమే.

కట్ టూ అసలు దయ్యం - 

నాకున్న చనువుతో ముగ్గురినీ "దయ్యం" అని అలా సరదాకి అన్నాను గానీ, నిజానికి "స్విమ్మింగ్‌పూల్"లో
ఈ ముగ్గురిలో ఒక్కరే నిజంగా దయ్యం.

ఆ ఒక్కరు ఎవరన్నది మీకే తెలుస్తుంది. తెరమీద చూశాక.

అలాగే .. వీరిలో దయ్యం 1 ఎవరో, 2 ఎవరో, 3 ఎవరో కూడా మీరు అప్పుడే ఈజీగా గెస్ చేయగలుగుతారు. నవ్వుకుంటారు. ఎంజాయ్ చేస్తారు.

అప్పుడేం భయమనిపించలేదు గానీ, ఈ మూడు దయ్యాల్ని తలచుకుంటే ఇప్పుడు మాత్రం చాలా భయమేస్తోంది. మూడు దయ్యాల్నీ మధ్యలో పెట్టుకొని అంత కూల్‌గా షూటింగ్ ఎలా చేశానా అని! 

Wednesday 11 February 2015

ఇద్దరు

స్విమ్మింగ్‌పూల్ సినిమాకు సంబంధించి ఇకనుంచీ చాలా విషయాలు, విశేషాలు ఈ బ్లాగ్ ద్వారా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను.

కనీసం రోజుకి ఒక్కటయినా నా బ్లాగ్ పోస్ట్ ఉంటుంది. ఎంత బిజీలో ఉన్నా. ఎంత వర్క్ లోడ్ లో ఉన్నా.

ఇది నాకు నేనే పెట్టుకొన్న ఒక డిసిప్లిన్. ఒక లక్ష్యం కోసం. ఒకే ఒక్క లక్ష్యం కోసం.

అది .. ఈ సినిమాను నేను, అరుణ్ కుమార్ ముందే ప్లాన్ చేసుకున్నట్టుగా రిలీజ్ చేయడం. అది మా రెండో సక్సెస్.

కట్ టూ మొదటి సక్సెస్ -

ఈ సినిమా షూటింగ్ ని నేను 12 రోజుల్లో పూర్తి చేయడానికి ప్లాన్ చేశాను. షూటింగ్ డే అండ్ నైట్ ఉంటుంది. కాల్ షీట్లూ, తొక్కా తోలూ ఏవీ ఉండవు. ఇదసలు ట్రెడిషనల్ ఫిలిం మేకింగ్ కానే కాదు. అందరూ ప్రాజెక్ట్ కోసం పనిచేయాలి. ఎలాంటి ఈగోలు లేకుండా.

అదీ కాన్సెప్ట్. అదే ఒప్పందం.

ఇదే ప్రతి ఒక్క టెక్నీషియన్ కూ, ఆర్టిస్టుకూ నేను ముందే చెప్పాను. అలా ఒప్పుకున్న లైక్ మైండెడ్ ఫ్రెండ్స్‌తోనే సినిమా ప్రారంభించాను.

ఒకటీ అరా చిల్లర చికాకులు తప్పిస్తే, అంతా నేను ప్లాన్ చేసినట్టుగానే షూటింగ్ పూర్తయ్యింది.

షూటింగ్ 13 రోజుల్లో పూర్తయ్యింది. పాటలతో సహా. ఆ ఒక్క రోజుకూడా కేవలం కొన్ని టెక్నికల్ కారణాలవల్ల పెరిగింది తప్ప మరోవిధంగా కాదు.

షూటింగ్ అనుకున్నది అనుకున్నట్టుగా జరగడానికి దాదాపు అందరూ బాగా కోపరేట్ చేశారు. టెన్షన్లు లేకుండా చాలా కూల్ గా పూర్తయింది షూటింగ్.

అయితే -

అందరి సహకారం, కోపరేషన్ వేరు. హీరో కార్తీక్, డి ఓ పి వీరేద్రలలిత్ ఇచ్చిన సపోర్ట్ వేరు. వీరిద్దరి అన్‌కండిషనల్ సపోర్ట్ లేకుండా షూటింగ్ అంత ఫాస్జ్ట్‌గా, అంత కూల్‌గా, అంత క్వాలిటీతో పూర్తయ్యేది కాదు. అందులో డౌట్ లేదు.

ఎదురయిన ప్రతి సమస్యనూ అప్పటికప్పుడు "ప్లాన్ బి" లోకి మార్చుకొని ప్రొసీడ్ అయిపోయాం. అనుకున్నట్టుగా షూటింగ్ పూర్తిచేశాం.

ఇదే మా మొదటి సక్సెస్.    

ఈ సినిమాకు సంబంధించి ఈ ఇద్దరిలో నాకు బాగా నచ్చిందీ, బాగా ప్లస్ అయ్యిందీ ఒక్కటే. ఒక్క క్షణం కూడా వీళ్లు ట్రెడిషనల్ ఫిల్మ్ మేకింగ్ పద్ధతిలో ఆలోచించలేదు. వీరినుంచి నేను ఆశించింది కూడా అదే.

త్రీ ఛీర్స్ టూ మై డియర్ కార్తీక్ అండ్ వీరేన్!