Tuesday 17 February 2015

ట్రెండీ ఇంటర్‌నెట్ హీరో!

ఇంటర్‌నెట్ సెర్చ్ఇంజైన్స్‌లో "గూగుల్" రారాజు అన్న విషయం అందరికీ తెలిసిందే.

ఈ గూగుల్ అనేది జనంలో ఎంత పాపులర్ అయిపోయిందంటే - ఏ విషయం గురించి తెలుసుకోవాలన్నా, ఏ వ్యక్తి గురించిన సమాచారాన్ని వెదకాలన్నా, "అరె .. గూగుల్‌ల కొట్రాబై!" అని చిన్న గ్రామాల్లో కూడా చాలా సింపుల్‌గా చెప్తున్నారిప్పుడు.

అదీ గూగుల్ వాల్యూ.

అలాంటి గూగుల్‌లో .. ఎవరిగురించి, లేదా ఏ టాపిక్ గురించి .. ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారన్న విషయంలో ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించే విభాగం - గూగుల్ ట్రెండ్స్.

2014 లో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక నెటిజెన్‌లు గూగుల్‌లో మన కె సి ఆర్ గురించిన సమాచారం కోసం అన్వేషించారని ఈ మధ్యే గూగుల్ ట్రెండ్స్ తెలిపింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నెట్‌లో ఈ "కె సి ఆర్ సెర్చ్" మరింత శిఖరాగ్ర స్థాయిని చేరిందని కూడా గూగుల్ ట్రెండ్స్ తెలిపింది.

కట్ టూ కొన్ని 'హైటెక్' నిజాలు -

ఐటి, ఇంటర్‌నెట్, టెలికాన్‌ఫరెన్స్ వంటి పదాల్ని ఆ మధ్య చంద్రబాబు నాయుడు నోటివెంట వినీ వినీ జనాలకి బోర్ కొట్టింది. ఇక, తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో అయితే, 'అసలు హైదరాబాద్‌ను హైటెక్ సిటీగా మార్చింది కూడా నేనే' నంటూ ఒకటే నస. మరోవైపు సీమాంధ్ర పక్షపాత పత్రికలు, టీవీ మీడియా కూడా 'ఐటీ అంటేనే బాబు .. హైటెక్ అంటేనే బాబు' అన్నట్టుగా తెగ ఊదరగొడుతుంటాయి నేటికీ!  

దీనికితోడు, 'ట్విట్టర్ స్పెషలిస్ట్', చంద్రబాబు నాయుడు కొడుకు లోకేశ్ కూడా మంచి 'హైటెక్' అని చెబుతారు.

ట్విట్టర్ అనేది ఒక ఎలైట్ సోషల్ మీడియా. దీన్లో, తను రాస్తున్నదానిమీద కనీస అవగాహనకూడా లేకుండా నానా చెత్త పోస్ట్ చేసే ప్రతివాడినీ హైటెక్ అని ఎలా అంటారో వాళ్లకే తెలియాలి. అదలా వదిలేద్దాం.  

ఈ మధ్య "ఇండియన్ ఆఫ్ ది ఇయర్" అనే ఓ కాంటెస్ట్‌లో 24 గంటల్లో వోటింగ్ రేట్‌ని 20 శాతం కె సీఅర్ కి వ్యతిరేకంగా జరిగేలా చేసిన ఘనత కూడా లోకేశ్‌దేనని ఫేస్‌బుక్కూ, నెట్అంతా చదివాను.

మరి ఈకోణంలో చూస్తే - నెట్ సావీ కొడుకు లోకేశ్ పవర్ కూడా తోడైన చంద్రబాబుకే బాగా ప్రాచుర్యం ఉండాలి. ఇంటర్‌నెట్‌లో ఆయన కోసం సెర్చ్‌లు లక్షల్లో, కోట్లలో రికార్డ్ కావాలి.

కాని, వాస్తవం మరోలా ఉంది!  

విచిత్రంగా ఇప్పుడే హైటెక్‌బాబు గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోవడంలేదన్నది గూగుల్ ట్రెండ్స్ సాక్షిగా మనకు చాలా స్పష్టంగా తెలుస్తోంది.

చంద్రబాబు నాయుడు కోసం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల అవతల ఎక్కడో అమెరికాలోని సెర్చ్ ఇంజైన్లలో సెర్చ్ ఎక్కువగా ఉంది. కొంత హైద్రాబాద్‌లో ఉంది. అంటే, అది హైద్రాబాద్‌లో ఉన్న సీమాంధ్రుల సెర్చ్ అన్నది సుస్పష్టం.

మరోవైపు, కె సి ఆర్ గురించి మాత్రం కేవలం తెలంగాణ, అమెరికాల్లో మాత్రమే కాకుండా - విజయవాడ, గుంటూరు, వైజాగ్, తిరుపతి తదితర సీమాంధ్ర ప్రాంతాల్లోనూ గూగుల్ సెర్చ్ బాగా జరుగుతుండటం విశేషం.

కట్ టూ 'ది రియల్ ఇంటర్‌నెట్ హీరో' -  

"నేనే హైటెక్ సిటీని కట్టాను", "నేనే బిల్ గేట్స్ ని హైద్రాబాద్‌కు రప్పించాను" వంటి డైలాగ్స్‌తో ఒకనాడు మీడియాలో భారీ ప్రచారం చేసుకొన్న చంద్రబాబు నాయుడు, ప్రస్తుతం ఇంటర్‌నెట్ ప్రాచుర్యంలో కూడా తన పూర్వవైభవాన్ని, ప్రాభవాన్ని పూర్తిగా కోల్పోయాడు.

ఈ విషయంలో కె సి ఆర్, చంద్రబాబుని బీట్ చేశాడు.

మొన్నటి ఎలక్షన్లలో ఫేస్‌బుక్ ద్వారా నెటిజెన్‌లు అన్‌కండిషనల్‌గా కె సి ఆర్ కి అందించిన మద్దతు నభూతో నభవిష్యతి! అదే స్థాయి మద్దతు కె సీఅర్ కు ఇంటర్‌నెట్‌లో ఇంకా కొనసాగుతుండటం, అది రోజురోజుకీ ఇంకా ఇంకా పెరుగుతుండటం మరింత గొప్ప విశేషం.

బహుశా ఫేస్‌బుక్ క్రియేటర్ జకెర్‌బర్గ్ కూడా ఇలాంటి పరిణామం ఊహించి ఉండడు. ఒక ఉద్యమ నాయకుడిగా, ఒక రాజకీయవేత్తగా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా కె సి ఆర్ సాధించుకొన్న క్రిడిబిలిటీ అది.

గూగుల్ ఒక్కటే కాదు. అటు ఫేస్‌బుక్, ట్విట్టర్‌లతోనూ నెట్‌లో కబడ్డీ ఆడేశాడు కె సి ఆర్.

ఒక తీయటి నిజం ఏంటంటే - అసలు "ఇండియన్ ఆఫ్ ది ఇయర్" కాంటెస్ట్ నామినీల లిస్ట్ లోనే చంద్రబాబు పేరు లేకపోవడం!

అక్కడే కె సి ఆర్ గెలిచాడు.

ఈ నిజం జీర్ణించుకోలేక, ఇండియన్ ఆఫ్ ది ఇయర్ లో కె సి ఆర్ మాత్రం గెలవవద్దని ఎన్నో టక్కు టమారం విద్యలు ప్రదర్శించారు. వాటికి లొంగిపోయిన ఆ చానెల్ క్రిడిబిలిటీ పాతాళంలోకి కుంగిపోయింది. అది వేరే విషయం.

వెరీ పిటీ ఎబౌట్ దెమ్! నేను జాలిపడుతున్నాను ..

తెలంగాణ వచ్చినపుడే కె సి ఆర్ గెలిచాడు. అది చరిత్రలో చెరగిపోని గెలుపు. ఆ గెలుపు ముందు
ఈ సి ఎన్ ఎన్ - ఐ బి ఎన్ కాంటెస్ట్ ఎంత?
                                                                                                  (ఈ రోజు కె సి ఆర్ జన్మదినం సందర్భంగా) 

No comments:

Post a Comment