Tuesday 24 February 2015

ఇంకో రెండు వారాల్లో కాపీ!

40 రోజులు చేయాల్సిన షూటింగ్‌ని, డే అండ్ నైట్ కష్టపడి కేవలం 13 రోజుల్లో పూర్తిచేయగలిగాం. అయితే, ఊహించని కారణాలతో పోస్ట్ ప్రొడక్షన్‌లోనే కొంత ఆలస్యం అవుతోంది.

అవే టీలు, టిఫిన్‌లు, లంచ్‌లు, ఈవెనింగ్ స్నాక్స్, ప్రతి బ్రేక్‌లోనూ గవర్నమెంట్ ఆఫీసులాగా టైం పాస్ చెయ్యడాలూ .. ఓహ్..

ఇంకా మనవాళ్లు పాత చింతకాయపచ్చడి 'నెగెటివ్ ఫిలిమ్ మేకింగ్' జమానాలోనే ఉన్నారంటే ఆశ్చర్యంగా ఉంది.

ఇంక వీళ్లింతే.

ఈ పనికిరాని పధ్ధతి ఇంకా రాజ్యమేలుతోందని ముందే నేను ఏ కొంచెం స్టడీ చేసినా, పోస్ట్ ప్రొడక్షన్‌కి నా ప్లాన్ మరోలా ఉండేది.

రెండంటే రెండు మ్యాక్ కంప్యూటర్లు చాలు. పదిరోజుల్లో, లేదంటే ఎక్కువలో ఎక్కువ రెండు వారాల్లో కాపీ రెడీ చేయొచ్చు. క్వాలిటీలో ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా!

మరోసారి కోట్ చెయ్యక తప్పదు. రామ్‌గోపాల్‌వర్మ ఇదంతా చూళ్లేకే "న్యూ తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీ" అన్నాడు. ఈ చెత్తంతా నాకే వెగటుగా ఉంది. వర్మకి ఇంకా పిచ్చెక్కి ఉంటుంది.

మళ్లీ అనక తప్పట్లేదు. వీళ్లింతే.

కట్ టూ మన స్విమ్మింగ్‌పూల్ -

ఎడిటింగ్, డబ్బింగ్, సౌండ్ ఎఫెక్ట్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వర్క్ అయిపోయింది.

మిగిలింది టైటిల్స్, కొంచెం గ్రాఫిక్ వర్క్, డీ ఐ, ఫైనల్ మిక్సింగ్.

ఇదంతా ఇంకో రెండు వారాల్లో పూర్తవుతుంది. కాపీ వచ్చేస్తుంది. తర్వాత సెన్సార్. ఆడియో రిలీజ్, బిజినెస్, ఫిలిం రిలీజ్.

కట్ చేస్తే కొత్త సినిమా.

ఈసారి మాత్రం పోస్ట్ ప్రొడక్షన్ ఖచ్చితంగా ఇలాగ ఉండదు. ఉండదు. ఉండదు.       

1 comment:

  1. శుభాకాంక్షలు.
    మీరైనా కొత్త పుంతలు త్రొక్కండి మరి.
    వారసత్వపు వెగటు నటులనుండి తెలుగుతెరకు విముక్తి ప్రసాదించటానికి కృషి చేయండి

    ReplyDelete