Wednesday 29 April 2015

అఖిల్ కార్తీక్ 2 సినిమాలు!

నా అంచనా ప్రకారం హీరో అఖిల్ కార్తీక్ రెండు సినిమాలు .. క్రిమినల్స్, స్విమ్మింగ్‌పూల్ ఈ మే నెలలోనే రిలీజ్ కావొచ్చు. అలా జరగడానికే ఎక్కువ అవకాశం ఉంది.

ఓషో తులసీరాం క్రిమినల్స్ లో అఖిల్ కార్తీక్‌తో పాటు నిషా కొఠారి కూడా ఉంది. నిషాకు ఒక్క తెలుగులోనే కాకుండా - హిందీలోనూ, ఇతర దక్షిణాది భాషల్లోనూ ఒక బ్రాండ్ ఉంది. ఇక తులసీరాం "మంత్ర" డైరెక్టర్‌గా ఆల్రెడీ ఒక గుర్తింపుని పొంది ఉన్నారు.

ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే - దాదాపు రెండున్నర కోట్ల బడ్జెట్ పెట్టిన క్రిమినల్స్ బిజినెస్, రిలీజ్ చాలా సులభంగా జరిగిపోతాయి అని చెప్పడానికి.

కట్ టూ మన స్విమ్మింగ్‌పూల్ -

టైటిల్ తోనే అందరి దృష్టిలో పడిందీ సినిమా. పైగా మా ఆన్‌లైన్ ప్రమోషన్, సినిమా నిర్మించిన పధ్ధతి మా టీమ్‌కో ప్రత్యేకమైన గుర్తింపునిస్తున్నాయి. బిజినెస్ కూడా మంచి ప్రోత్సాహకరంగా ఉంది.

యు ఎస్, యు కె, జర్మనీ, జోహన్నెస్‌బర్గ్, మరికొన్ని ఎబ్రాడ్ సెంటర్‌లలో రిలీజ్ ఏర్పాట్లు దాదాపు ముందే అయిపోయాయి.

ఆడియో రిలీజ్ ఫార్మాలిటీ ఒక్కటీ అయ్యిందంటే చాలు. ఇక ఈ సినిమా రిలీజ్‌ను మేమే ఆపలేము. ఎందుకంటే - ముందు రిలీజ్ డేట్ అనుకున్నాకే, ఆడియో లాంచ్‌ను ప్లాన్ చేస్తాం కాబట్టి!

నాకున్న సమాచారం ప్రకారం .. క్రిమినల్స్ మే 15 లోపు రిలీజవుతుంది. తర్వాత రెండు వారాల్లోనే స్విమ్మింగ్‌పూల్ రిలీజ్ ఉంటుంది.

ఊహించని విధంగా ఏవయినా పెద్ద సినిమాలు అడ్డొస్తేనోనో, మరింకేదయినా కారణం వల్లో - కార్తీక్ రెండు సినిమాలనూ ఒకే రోజు రిలీజ్ చేయాల్సిన పరిస్థితి కూడా రావొచ్చు. మొన్న నాని విషయంలో జరిగినట్టు.    

బెస్ట్ విషెస్ టూ అఖిల్ కార్తీక్ ..   

Sunday 26 April 2015

క్రియేటివిటీ వర్సెస్ ఫ్రీడమ్

తను అనుకున్న జీవనశైలిని సృష్టించుకోడాన్ని మించిన ఆనందం ఇంకొకటి ఉండదు. అది బిచ్చగాడయినా ఒకటే. బిలియనేర్ అయినా ఒకటే.

ఎవడి పిచ్చి వాడికానందం.

రాజకీయాలు, సినిమాలు, క్రికెట్ .. ఈ మూడింటికీ మన దేశంలో ఉన్నంత ఇంట్రెస్టు బహుశా వేరే దేశంలో ఉండకపోవచ్చు. ఈ మూడూ మన దేశంలో కోట్లాదిమంది జీవితాల్ని డైరెక్టుగానో, ఇన్‌డైరెక్టుగానో చాలా ప్రభావితం చేస్తున్నాయి.

పాజిటివ్‌గానా, నెగెటివ్‌గానా అన్న విషయం ఇప్పటికి పక్కనపెడదాం.అదింకో చర్చ అవుతుంది.

కట్ టూ క్రియేటివిటీ - 

మూడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేసి వదిలేశాక, నా జీవితంలో అనేక ఎత్తుపల్లాలు చూశాను. సుఖాల శిఖరాగ్రాలు, కష్టాల అగాధపు అంచులు. అన్నీ చూశాను.

చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు .. నా జీవితంలో ఎంతో విలువైన సమయం పరమ రొటీన్‌గా వృధా చేశాక .. ఇప్పుడిప్పుడే నేను కోరుకుంటున్న స్వతంత్ర జీవనశైలివైపు అడుగులేస్తున్నాను.  నిజానికి - అలా వృధా కాకపోతే, బహుశా ఇలాంటి ఆలోచన కూడా నాకు వచ్చేది కాదేమో!

క్రియేటివిటీ, స్పిరిచువాలిటీ. ఈ రెండూ నా జీవనశైలి.

ఈ రెంటినీ ఎప్పుడూ నేను వేరుగా చూడలేను.

కమర్షియల్ సినిమానా, కేన్స్ కు వెళ్లే సినిమానా .. ఇది కాదు ప్రశ్న. నీకెంత ఫ్రీడమ్ ఉంది? నువ్వేం చేయగలుగుతున్నావు అన్నదే అసలు ప్రశ్న.  

మరోవిధంగా చెప్పాలంటే - అది సినిమానా, పుస్తకాలా, పెయింటింగా, ఇంకొకటా అన్నది కూడా కాదు ప్రశ్న. నువ్వు చేస్తున్నపనిలో నీకెంత ఆనందం ఉంది అన్నదే అసలు ప్రశ్న.

ఆ ఆనందమే స్వేఛ్చ. ఆ స్వేఛ్చకోసమే అన్వేషణ.

అది నేనయినా, ఎవరయినా.     

Thursday 23 April 2015

బిజినెస్ ఆఫర్ .. సినీ ప్రేమికులకు మాత్రమే!

> సినిమా అంటే మీకు ప్యాషనా?
> ఆర్టిస్టుగానో, టెక్నీషియన్‌గానో ఫీల్డులోకి వెంటనే ప్రవేశించాలనుకుంటున్నారా?
> అసలు సినిమా ప్రొడక్షన్/బిజినెస్ ఏంటో తెల్సుకోవాలనుకుంటున్నారా?

పై మూడింటిలో ఏ ఒక్కదానికి మీరు "ఓకే" చెప్పినా, కేవలం ఓ 10 నిమిషాలపాటు క్రింది మ్యాటర్ చదవండి.

చెప్పలేం. ఈ 10 నిమిషాలే మీ జీవితాన్ని ఓ కొత్త మలుపు తిప్పొచ్చు. మీరు కలగంటున్న రంగుల సామ్రాజ్యంలో మీ ప్రవేశానికి రెడ్ కార్పెట్ వేయొచ్చు!

మీకు తెలుసా ?

కేవలం మన హైదరాబాద్‌లోనే బాగా పేరున్న కొన్ని ఫిలిం ఇన్స్‌టిట్యూట్‌లలో శిక్షణకోసం తీసుకొంటున్న ఫీజు
4 నుంచి 10 లక్షలవరకు ఉంది. అది యాక్టింగ్/డైరెక్షన్/స్క్రిప్ట్ రైటింగ్/మేకింగ్ .. ఏదయినా కావొచ్చు. అంత ఫీజు చెల్లించి
, ఒక రియలిస్టిక్ పాయింటాఫ్ వ్యూలో మీరు పొందే ఫలితం .. జస్ట్ ఒక సర్టిఫికేట్!

ఆ సర్టిఫికేట్ చూసి ఎవరయినా ఎక్కడయినా మీకు ఛాన్స్ ఇస్తారా

శిక్షణ వేరు. ఇండస్ట్రీ వేరు.

ఈ రెండింటి మధ్య ఉన్న గ్యాప్‌ను నిర్మూలించే ఉద్దేశ్యంతో పుట్టిన ఆలోచనే .. నా ఈ మైక్రో బడ్జెట్ సినిమాలు.

కొత్త/అప్‌కమింగ్ టెక్నీషియన్స్‌కు మాత్రమే ఛాన్స్ ఇస్తూ - ఫిలిం మేకింగ్‌లో లేటెస్ట్ డిజిటల్ టెక్నాలజీ అందిస్తున్న సౌలభ్యాలను ఉపయోగించుకుంటూ - తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ సినిమాలను తీయాలన్నదే
ఈ ఆలోచన వెనుక నా ప్రధానోద్దేశ్యం.

ఈ ఉద్దేశ్యంతో క్రియేట్ చేస్తున్నదే నా సరికొత్త ఫిలిం ఫాక్టరీ. మనుటైమ్ మీడియా. 

నా ఫిలిం ఫాక్టరీ

ఈరోజుల్లో, ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, 3జి లవ్, ప్రేమకథాచిత్రమ్ వంటి అతి తక్కువ బడ్జెట్‌లో తీసిన కొన్ని సినిమాలు కోట్లు కొల్లగొట్టిన విషయం మీకు తెలిసిందే!

సబ్జెక్ట్/జోనర్/ప్రజెంటేషన్ పరంగా వేరు కావొచ్చుగానీ - నా ఫాక్టరీ నుంచి నేను తీయబోయే సినిమాలు కూడా పక్కా ట్రెండీ కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలు మాత్రమే!     

ఈ ఫాక్టరీ కోసం, కేవలం ఒక చిన్న మొత్తాన్ని నేను బేసిక్ ఫండ్‌గా సేకరించడానికి నిర్ణయించాను. అది కూడా కేవలం ఒకే ఒక్క నిర్మాత నుంచి కాదు.

కొంతమంది లైక్‌మైండెడ్, సినీప్రేమికులయిన కొత్త/ఔత్సాహిక "అసోసియేట్ ప్రొడ్యూసర్స్" నుంచి. అది కూడా ఎవరికీ పెద్దగా భారం అనిపించని ఒక అతి చిన్న మొత్తం రూపంలో.

నా ఫాక్టరీలో మీరు పెట్టుబడిగా పెట్టాల్సింది కేవలం ఒక లక్ష రూపాయలు మాత్రమే!

ఈ లక్ష రూపాయల పెట్టుబడికి 12 నెలల లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. ఈ 12 నెలల పీరియడ్‌లో నేను ఎన్ని సినిమాలు తీస్తే అన్ని సినిమాల్లో మీ పెట్టుబడికి ప్రపోర్షనేట్ షేర్ వస్తుంది, 12నెలల తర్వాత.

ఒకవేళ నష్టం వచ్చినా మీకు సంబంధం లేదు. మీ బేసిక్ లక్షరూపాయల ఇన్వెస్ట్‌మెంట్, 12 నెలల లాక్-ఇన్ పీరియడ్ తర్వాత, సేఫ్‌గా మీకు తిరిగి ఇవ్వటం జరుగుతుంది.

అసలు హూ యామ్ ఐ ? 
నా చదువు, ఉద్యోగాలు, నేనిప్పటివరకు తీసిన సినిమాల వివరాలు, వాటి పోస్టర్‌లు, వర్కింగ్ స్టిల్స్, నా అవార్డులు, గోల్డ్ మెడల్స్, సన్మానాలు వగైరా అన్నీ .. నా ఫేస్‌బుక్ పేజ్ లో ఉన్నాయి. అవి చూడండి. అలాగే
నా బ్లాగ్
 కూడా చూడండి.

మీ మనసు "యస్" చెబితేనే, ఒక నిర్ణయం తీసుకొని పాజిటివ్ థింకింగ్‌తో ముందుకు రండి.

ఈ ప్రపోజల్ మీకు ఏ మాత్రం నచ్చకపోయినా, ఏ కొంచెం రిస్క్ అనిపించినా, దయచేసి దీన్ని ఇక్కడితో మర్చిఫోండి.

మరి మాకేంటి ?

> నా లెటర్ హెడ్ మీద మీ లక్షరూపాయల ఇన్‌వెస్ట్‌మెంట్‌కు 12 నెలల లాక్-ఇన్ పీరియడ్‌తో అఫీషియల్ రిసీట్.

> 12 నెలల కాలంలో నేను తీసే మైక్రో బడ్జెట్ మెయిన్‌స్ట్రీమ్ కమర్షియల్ సినిమాలన్నింటిలోనూ వచ్చిన లాభంలో ప్రపోర్షనేట్ షేర్.

> "అసోసియేట్ ప్రొడ్యూసర్"గా వెండితెరపై టైటిల్ కార్డ్స్‌లో మీ పేరు.

> ఒక క్లోజ్‌డ్ ఫేస్‌బుక్ గ్రూప్ ద్వారా, అసోసియేట్ ప్రొడ్యూసర్లందరికీ ఎప్పటికప్పుడు నేను చేస్తున్న ప్రాజెక్టుల అప్‌డేట్స్, ఇతర కమ్యూనికేషన్.

> కేవలం ఒకే ఒక్క లక్ష రిస్క్ లేని పెట్టుబడితో - సినీ ఫీల్డునీ, సినిమా ప్రొడక్షన్/బిజినెస్‌నీ ప్రత్యక్షంగా అధ్యయనం చేసే అద్భుత అవకాశం.

> షూటింగ్‌కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఒక ప్లాన్‌డ్ షెడ్యూల్ ప్రకారం, ముందేనిర్ణయించిన కొంత సమయం పాటు అసోసియేట్ ప్రొడ్యూసర్స్ అంతా షూటింగ్ లొకేషన్‌కు వచ్చి ప్రత్యక్షంగా షూటింగ్‌ని చూడొచ్చు.

> బ్లాగ్, ట్విట్టర్, ఫేస్‌బుక్ వంటి నా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌స్ అన్నిట్లోనూ ప్రతి ఒక్క అసోసియేట్ ప్రొడ్యూసర్ గురించీ పరిచయం. 

> పెట్టుబడి పెడుతున్న అసోసియేట్ ప్రొడ్యూసర్స్ లో నిజంగా టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లకు
నా ఫాక్టరీ సినిమాలన్నిటి ఆడిషన్స్‌లో ప్రత్యేక ప్రాధాన్యం. సెలక్టు కానివారికి అవసరమయిన సలహాలు
/సహాయం/సపోర్ట్‌ని ప్రాక్టికల్ పాయింటాఫ్ వ్యూలో స్వయంగా నేనే అందిస్తాను.  లక్షలు పోసి ఇన్స్‌టిట్యూట్‌లలో మీరు తీసుకొనే సర్టిఫికేట్ కంటే ఇది వంద రెట్లు విలువైంది. 

ముందే కోట్లు పెట్టి నిర్మాతగా దిగి చేతులు కాల్చుకోకుండాకొత్తగా ప్రొడ్యూసర్‌గా ఫీల్డులోకి దిగాలనుకొనేవారికి ఇది చాలా మంచి అవకాశం. కేవలం ఒకే ఒక్క లక్ష రిస్క్-ఫ్రీ పెట్టుబడితో సినిమా ప్రొడక్షన్/బిజినెస్‌ని ప్రత్యక్షంగా తెల్సుకోవచ్చు.  

> క్రియేటివిటీ, బిజినెస్, అడ్మినిష్ట్రేషన్ మొదలయిన ప్రతివిషయంలోనూ అన్ని అధికారాలూ నాకే ఉంటాయి. ఏది ఎలా ఉన్నా - మీ బేసిక్ ఇన్వెస్ట్‌మెంట్ మీకు తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత నాదే కాబట్టి, మీకు బాగా లాభాలు వచ్చేలా చూడాల్సింది కూడా నేనే కాబట్టి .. ఈ ఫ్రీడమ్ నాకు అవసరం.

10 రోజుల ఆఫర్

ఈ ప్రత్యేకమైన ఆఫర్ రేపు 24 ఏప్రిల్ 2015 నుంచి, 3 మే 2015 వరకు .. కేవలం 10 రోజులు మాత్రమే! అంతేకాదు. నేను అనుకున్న చిన్న టార్గెట్ రీచ్ అయితే చాలు. ఆఫర్‌ను వెంటనే ఏ క్షణమైనా ఆపేస్తాను.

సో, జాగ్రత్తగా అంతా మరొక్కసారి చదవండి. మీరు పూర్తిగా సంతృప్తి పొంది, పాజిటివ్ నిర్ణయం తీసుకున్న తర్వాతనే దయచేసి ఈ నంబర్‌కు కాల్ చేయండి. ఈ వైపు ఆసక్తి ఉన్న సినీ ప్రేమికులయిన మీ మిత్రులకు, తెలిసినవారికి కూడా ఈ లింక్‌ను షేర్ చేయండి.

10 రోజుల్లో అగ్రిమెంట్ కోసం ఒక రోజు డేట్ చెప్తూ, పాజిటివ్‌గా మీరు చేసే కాల్ కోసం ఎదురుచూస్తుంటాను. 
అంతేగానీ ..
 మీ అమూల్యమైన సమయాన్నీ, నా సమయాన్నీ వృధా చేసే కాల్స్ మాత్రం చేయొద్దని సవినయ మనవి. 
కలిసి పని చేద్దాం. కలిసి ఎదుగుదాం.
బెస్ట్ విషెస్ టూ యూ ..

***

మీ మొబైల్ నంబర్ ఈమెయిల్ చేయండి:
manutimemedia@gmail.com  

***

Wednesday 22 April 2015

క్రౌడ్ ఫండింగ్ Vs మైక్రోబడ్జెట్ ఫిలిం ఫండింగ్

అమెరికాలో, ఇతర పాశ్చాత్య దేశాల్లో - క్రౌడ్‌ఫండింగ్ సైట్స్ లో ఒక ప్రాజెక్ట్ కోసం ఇచ్చిన డబ్బు వెనక్కిరాదు. ఉదాహరణకు ఇండీగోగో, కిక్‌స్టార్టర్ వంటి సైట్స్ చూడండి. మీకే అర్థమయిపోతుంది.

కంట్రిబ్యూట్ చేసినవాళ్లకు డివిడిలు, టీషర్ట్స్, క్యాప్స్, ఆటోగ్రాఫ్ చేసిన వస్తువులు, ప్రీమియర్‌కు ఉచిత ఆహ్వానం, టీమ్‌తో ఒకపూట డిన్నర్!

అక్కడ ఇవే .. ఎంత ఇన్వెస్ట్ చేసినవాళ్లకయినా తిరిగి వచ్చేవి.

టాప్ రేంజ్‌లో కంట్రిబ్యూట్ చేసినవాళ్లకు మాత్రం టైటిల్ కార్డ్స్‌లో పేరు వేస్తారు. అంతే. అంతకు మించి ఏదీ ఉండదు.

ఇదంతా అక్కడ అమెరికాలో, ఇతర పాశ్చాత్యదేశాల్లో అలవాటు. ఇదే అక్కడి పధ్ధతి.

అదిక్కడ మన దేశంలో ఎంతమాత్రం కుదరని పని. ముఖ్యంగా మన సెటప్‌లో.

కట్ టూ మన సెటప్, మన ఫండింగ్ - 

ఈ క్యాప్‌లు, టీషర్ట్స్, డివిడిలు, డిన్నర్లు పక్కనపెడితే - కేవలం ఒకే ఒక చిన్న బాధ్యతాయుతమయిన ట్విస్ట్ ఇవ్వటం ద్వారా అక్కడి ఈ క్రౌడ్ ఫండింగ్ సిస్టమ్‌ను ఇక్కడ కూడా సక్సెస్ చేయొచ్చని నా ఉద్దేశ్యం.

ఆ ట్విస్ట్ మరేదో కాదు.

మీరు పెట్టిన డబ్బు మీకు ఖచ్చితంగా వెనక్కి ఇవ్వబడుతుంది. ఏదిఏమయినా! లాభాల్లో ప్రపోర్షనేట్ షేర్ అదనం. నష్టంతో మీకు సంబంధం లేదు.

మీరు ఫండింగ్ చేసేది కూడా ఒక అతి చిన్న మొత్తం. ఎవ్వరయినా సరే ఇన్‌వెస్ట్ చెయ్యాల్సింది ఆ చిన్న మొత్తాన్నే. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ కానేకాదు.

ఆచిన్న మొత్తానికి కనీసం 4 నుంచి 10 రెట్లు కేవలం ఫీజుగానే ఫిలిం ఇన్స్టిట్యూట్స్‌లో కడుతున్నారు మీరు! ఎలాంటి రియలిస్టిక్ ప్రయోజనం లేకుండా ..

ఆ మొత్తంతో పొలిస్తే ఇక్కడ మీరు ఫండింగ్ చేసేది చాలా తక్కువ. ప్రయోజనాలు మాత్రం చాలా ఎక్కువ.

ఇదంతా - కేవలం ఫిలింస్, ఫిల్మ్ యాక్టింగ్, ఫిల్మ్ డైరెక్షన్, ఫిల్మ్ ప్రొడక్షన్, ఫిల్మ్ ఇన్వెస్ట్‌మెంట్‌ల పట్ల ఆసక్తి, ప్యాషన్ ఉన్న లైక్‌మైండెడ్ మిత్రుల కోసం మాత్రమే.

ఇంతకీ మీరు ఫండింగ్ చేయాల్సిన ఆ ఫిగర్ ఎంత? ఏంటి లాభాలు??

MBFF (మైక్రోబడ్జెట్ ఫిలిం ఫండింగ్) పూర్తి  సమాచారం ఇక్కడే. ఇదే బ్లాగ్‌లో. రేపు రాత్రికి ..

24 ఏప్రిల్ నుంచి 3 మే వరకు మాత్రమే ఈ ఆఫర్‌. కేవలం 10 రోజుల టైమ్‌తో!  

Tuesday 21 April 2015

మైక్రోబడ్జెట్ ఫిలిం ఫండింగ్!

ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రాచుర్యం పొందిన కిక్‌స్టార్టర్, ఇండీగోగో వంటి యు ఎస్ బేస్‌డ్ "క్రౌడ్ ఫండింగ్" వెబ్‌సైట్‌ల గురించి ఇంతకు ముందు రెండు మూడు సార్లు నేను ఇదే బ్లాగ్‌లో చెప్పాను. 

కిక్‌స్టార్టర్, ఇండీగోగో వంటి సైట్స్ మన దేశంలోనూ ఒకటి రెండు వచ్చినా అవి ఎందుకని సఫలం కాలేదో కూడా కొంత చెప్పాను.

ఈ క్రౌడ్ ఫండింగ్ పధ్ధతినే, ఒక చిన్న బాధ్యతాయుతమయిన ట్విస్ట్‌తో, మన దగ్గర కూడా సక్సెస్ చేయవచ్చునేమోనని నాకనిపించింది. అలా అనిపించిన నా అలోచననలనే ఒక ఆకర్షణీయమైన ఆఫర్‌గా ఇప్పుడు మీ ముందుకు తీసుకురాబోతున్నాను.

అదే -

మైక్రో బడ్జెట్ ఫిలిం ఫండింగ్! సింపుల్‌గా MBFF.

కట్ టూ మన టాపిక్ - 

ముందే చెప్పినట్టు - ఇదొక ఆలోచన. ఒక ఐడియా.

సినీ ఫీల్డు పట్ల ప్యాషన్, చిన్న స్థాయిలోనయినా సినిమాల్లో ఇన్వెస్ట్ చేయాలన్న కోరిక ఉన్నవారికి .. "నో" చెప్పే అవకాశం లేని ఒక ఆఫర్.

మొత్తంగా - మన తెలుగు ఇండస్ట్రీలో సినిమా బిజినెస్‌ను ప్రత్యక్షంగా స్టడీ చేయడానికి ఇదొక మంచి అవకాశం కూడా.

ఈ ఆఫర్‌కు కాల పరిమితి ఉంది. ఈ ఏప్రిల్ 24 నుంచి - మే 3 వరకు .. కేవలం 10 రోజులు మాత్రమే! ఆ తర్వాత ఇంక మళ్ళీ ఈ ఆలోచన గానీ, ఈ ఆఫర్ గానీ ఎప్పుడూ ఉండవు. అసలింక ఈ టాపిక్ రాదు.

దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన సమాచారం మాత్రం ఈ 23 వ తేదీ సాయంత్రం పోస్ట్ చేస్తాను. "అసలేంటి, ఎలా" అన్న మరిన్ని వివరాలు ఈ రాత్రికి, ఇక్కడే, ఇదే బ్లాగ్‌లో .. 

Friday 17 April 2015

నా అసలైన గురువులకు వందనం!

న్యూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ (NTFI) పధ్ధతిలో, ఎవరికీ ముందు రెమ్యూనరేషన్ ఇవ్వకుండా, అతి తక్కువ రోజుల్లో ఒక రొమాంటిక్ హారర్ చిత్రం చేస్తున్నామంటేనే ఎవరికయినా విషయం ఈజీగా అర్థమయిపోతుంది.

ప్రతి విషయంలోనూ మాకు చాలా చాలా పరిమితులుంటాయి.

ఇండస్ట్రీలో పదేళ్లనుంచీ ఉండీ - అన్నీ చూస్తూ, గమనిస్తూ కూడా - ప్రతిదానికీ వెనకనుంచో, ఇండైరెక్టుగానో వంకలు పెట్టేవాళ్లన్నా, అర్థం పర్థం లేకుండా విమర్శించేవాళ్లన్నా, కొత్తగా ఎవరి మధ్యనయినా గ్యాప్ క్రియేట్ చేయాలని చూసేవాళ్లన్నా నాకు చాలా చికాకు. అసహ్యం కూడా.

ఇలాంటివాళ్లు టీమ్ బయటివాళ్లయినా, లోపలివాళ్లయినా ఒకటే. వారి అజ్ఞానానికి నిజంగా జాలిపడతాను.

వీరి పట్ల నాకు కోపం రాదు.

చెప్పాలంటే - వాళ్లను నా గురువులుగా భావిస్తాను.

ఎందుకంటే - నా తర్వాతి చిత్రంలో, ప్రతి ఒక్క విషయంలోనూ నేను మరిన్ని జాగ్రత్తలు పాటించి మరీ నిర్ణయాలు తీసుకొంటాను. ఈ జ్ఞానోదయం నాలో కలగటానికి కారణమైన వీళ్లంతా నాకు నిజంగా గురువులే!

కట్ టూ కొన్ని నిజాలు - 

జూదంతో పోల్చ్జినప్పుడు, దాదాపు ఏ రకంగానూ దానికి తక్కువకాని ఒక సినిమా ప్రాజెక్టు కోసం, ఓ ప్రొడ్యూసర్‌ను క్రియేట్ చేసుకోవడం అనేది అంత ఈజీకాదు. అలా సంపాదించుకొన్న ప్రొడ్యూసర్‌ను సినిమా పూర్తయ్యేవరకూ జాగ్రత్తగా కాపాడుకొంటూ, పైసా వృధా కాకుండా అన్నీ చూసుకోవాల్సి ఉంటుంది.

ఇది .. ఇక్కడ ఈ బ్లాగ్‌లో నేను చెప్పినంత సులభం కాదు.

ఈ నిజం తెలిసీ.. బాధ్యతారహితంగా, ఎంతో కేర్‌లెస్‌గా ఎలా కామెంట్స్ వొదుల్తారో నాకిప్పటికీ అర్థంకాదు.

సినిమా లోకం తెలియనివాళ్లంటే వేరు. వారికి తెలియదు లోపలి విషయాలు, లోపలి తలనొప్పులు.

కానీ, సినిమాల్లో ఉండీ .. "మనం మాట్లాడే ప్రతి చిన్నమాటకూ ఎంత విలువ ఉంటుంది, అవతలివారు ఎంత హర్ట్ అవుతారు" వంటి బేసిక్ ఆలోచన లేకుండా ఎలా అంత ఈజీగా స్టేట్‌మెంట్స్, కామెంట్స్ వొదుల్తారో నాకిప్పటికీ నిజంగా అర్థం కాని ఒక పెద్ద ఎనిగ్మా!

ఏమయినా, ప్రియాతిప్రియమయిన ఈ నా గురువులందరికీ ఇవే నా వందనాలు.

వీళ్లంతా చాలా తొందరగా టాప్ స్టార్స్ కావాలనీ, టాప్ రేంజ్ డైరెక్టర్స్ కావాలనీ, స్టార్ ప్రొడ్యూసర్స్ కావాలనీ హృదయపూర్వకంగా అభిలషిస్తున్నాను.

అప్పుడు మాత్రమే వీళ్లకు ఇలాంటి చీప్ పనులు చేయడానికి అస్సలు టైమ్ ఉండదని నా అభిప్రాయం.     

Wednesday 15 April 2015

స్విమ్మింగ్‌పూల్ లోతెంత?

మేం షూట్ చేసిన ఫామ్‌హౌజ్ లొకేషన్‌లోని అందమైన స్విమ్మింగ్‌పూల్ ఫస్ట్‌ఫ్లోర్‌లో ఉంది.

సిటీకి సుమారు 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఫామ్‌హౌజ్ - షూటింగ్‌లకోసం అద్దెకిచ్చేది కాదు. పూర్తిగా ప్రైవసీకోసం నిర్మించుకున్న ఒక అద్భుతమైన ఏకాంతవాసం.

ఎంతో టేస్ట్ ఉంటే తప్ప అంతబాగా కట్టుకోవడం అస్సలు కుదరదు. సింపుల్ అండ్ వెరీ ఎట్రాక్టివ్!

ఈ లొకేషన్ యజమానికి అతి దగ్గరి ఫ్రెండ్ ఒకరు, నా ఆత్మీయ మిత్రుడొకరికి కూడా క్లోజ్ ఫ్రెండ్ కావడం ఒక ప్లస్ అయింది. అంతకు ముందు కొన్నాళ్లక్రితం .. మేమందరం కల్సి ఓ "వి వి ఐ పి" స్థాయి మిత్రులతో గండిపేట దగ్గరున్న మరో ఫామ్‌హౌజ్‌లో పార్టీలో పాల్గొన్నప్పుడు ఈ లొకేషన్ యజమాని అక్కడ నాకు పరిచయమయ్యారు.

బై మిస్టేక్ .. ఆ పార్టీలోనే నాతో ఆయనో మాటన్నారు. "నాకో మంచి ఫామ్‌హౌజ్ ఉంది. ఎప్పుడయినా రండి. మీకు షూటింగ్‌కు బాగా పనికొస్తుంది" అని!

"నేను దాన్ని ఎవ్వరికీ షూటింగ్‌లకు ఇవ్వను. మీకే ఈ ఆఫర్!" అని కూడా అప్పుడే మరోమాట కూడా అన్నారాయన. ఆ సందర్భంగానే, తనకు ఇండస్ట్రీలో ఉన్న కొందరు వి ఐ పి మిత్రులు, ఇంకొందరు నటీనటులతో తనకున్న స్నేహం గురించి కూడా చెప్పారాయన.

కట్ చేస్తే -  

ఎప్పుడయితే ప్రొడ్యూసర్ అరుణ్ కుమార్ గారు "మనం హారర్ సినిమా చేద్దామండి" అన్నారో .. వెంటనే నా మైండ్‌లో ఫ్లాష్ అయింది ఈ ఫామ్‌హౌజే. ఈ స్విమ్మింగ్‌పూలే.

కట్ టూ స్విమ్మింగ్‌పూల్ లోతు - 

మామూలుగా ఓ పది ఫీట్ల లోతు ఉండొచ్చు మేము షూట్ చేసిన స్విమ్మింగ్‌పూల్. కానీ, ఇక్కడ నేను చర్చిస్తున్న లోతు అది కాదు.

స్విమ్మింగ్‌పూల్ సినిమా కోసం ఎందరో ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లు నాకు చాలా బాగా సహకరించారు. ఎంతో ఉత్సహంగా పనిచేశారు. రెడ్ ఎమెక్స్ కెమెరాతో, దాదాపు ప్రతిరోజూ స్టెడీకామ్ ఉపయోగించి, రాత్రింబగళ్లు నిర్విరామంగా పనిచేస్తూ కేవలం 13 రోజుల్లో షూటింగ్ పూర్తిచేశాము. కనీసం ప్యాచ్‌వర్క్ కు కూడా ఎలాంటి ఆస్కారం లేకుండా!    

ఇప్పుడు స్విమ్మింగ్‌పూల్ కాపీ వచ్చింది. సెన్సార్ వ్యవహారాల కార్యక్రమం కూడా ప్రారంభమయింది. ఇంకో పది రోజుల్లో ఆ ఒక్కటీ అయిపోతుంది.

ఇప్పుడు - నాతోపాటు, మా టేమ్ అందరి క్యూరియాసిటీ ఒక్కటే.

స్విమ్మింగ్‌పూల్ కు U/A వస్తుందా .. లేదంటే, ఏకంగా A సర్టిఫికేటే వస్తుందా?

U/A వస్తే మీకు అన్నివిధాలా బాగుంటుందని రొటీన్‌గా కొందరంటున్నారు. "కాదు .. A వస్తే మీరు పండగ చేసుకోవచ్చు" అని మా బిజినెస్ కోఅర్డినేటర్స్ అంటున్నారు!

ఏది వచ్చినా మాకెలాంటి బాధలేదు.

మేం అనుకున్న విధంగా, అనుకున్న రేంజ్‌లో స్విమ్మింగ్‌పూల్ సినిమాను ప్రమోట్ చేసి, బిజినెస్ చేసి రిలీజ్ చేయడమే ఇప్పుడు మాముందున్న ఏకైక లక్ష్యం.

ఆ లక్ష్యానికి ఇప్పుడు మేం జస్ట్ కొన్ని వారాల దూరంలో ఉన్నాం.   

Thursday 9 April 2015

మిస్టర్ సూపర్ కూల్!

నా సినిమాటోగ్రాఫర్ మిత్రుడు వీరేంద్రలలిత్‌కు, నాకూ మాత్రమే తెలిసిన కొన్ని కోడ్ వర్డ్స్ ఉన్నాయి.

సెట్స్ పైన, బయటా .. సందర్భం వచ్చినప్పుడు మా కోడ్ భాషలో మేము తరచూ ఉపయోగించే పదం - కాంప్లెక్సిటీ!

జీవితంలో కాంప్లెక్సిటీ అంటే మా ఇద్దరికీ చాలా ఇష్టం. కాంప్లెక్సిటీ లేని లైఫ్ అసలు లైఫే కాదు అన్నది మా ఫిలాసఫీ.

అయితే - ఇది అందరూ మామూలుగా అనుకొనే కాంప్లెక్సిటీ కాదు. మా కోడ్ భాషలో దీనర్థం వేరే!

వన్ ఫైన్ డే - ఈ కాంప్లెక్సిటీ గురించి కూడా తప్పకుండా ఓ బ్లాగ్ రాస్తాను.

నా రెండో చిత్రం "అలా" తో పరిచయమయ్యాడు వీరేంద్రలలిత్. అప్పటినుంచీ దాదాపు ప్రొఫెషనల్‌గా తొమ్మిదేళ్ల పరిచయం మాది. వ్యక్తిగతంగా తొమ్మిదేళ్ల స్నేహం మాది.

బయట అందరికీ తెలిసింది ఒక్కటే. వీరేన్‌కు సినిమా అన్నా, ఫోటోగ్రఫీ అన్నా పిచ్చి ప్యాషన్ అని. కానీ, దీన్ని మించి ఆయన గురించి నేను చెప్పాల్సింది చాలా ఉంది.

డిల్లీ యూనివర్సిటీలో ఫిలాసఫీలో ఎం ఫిల్ చేశాడు వీరేన్. పెద్ద ఒరేషియస్ రీడర్. ఎప్పుడు నిద్రపోతాడో తెలియదు. మన చరిత్ర, మన సంస్కృతి, మనం మర్చిపోయిన మన సంస్కృత భాష, మన వేదాలు, మన వైద్యం, మన ఫిలాసఫీల గురించి ఎంతయినా మాట్లాడగలడు.

అయితే - ఇదంతా ఏదో ఉపన్యాసంలా చెప్పడు. చాలా సింపుల్‌గా చెప్తాడు. జీవితంలో మనం మళ్లీ మర్చిపోకుండా!

సినిమాటోగ్రఫీకి సంబంధించి తనకు నచ్చిన ప్రతి పనీ చేస్తాడు. ఒక్క సినిమాలకే కాదు .. డాక్యుమెంటరీలకు, మ్యూజిక్ వీడియోలకు, యాడ్‌లకు కూడా పనిచేసే ఈ అంతర్జాతీయ స్థాయి కెమెరామన్ పాస్‌పోర్ట్ బుక్కులు బుక్కులుగా అయిపోతుంటుంది.

మన భూమ్మీద ఉన్న దాదాపు 195 దేశాల్లో దాదాపు సగానికి పైగా విజిట్ చేశాడు వీరేన్. నాకు తెలిసి, ఇంకో అయిదారేళ్లలో మిగిలిన ఆ సగం కూడా కవర్ చేసి "లోకం చుట్టిన వీరుడు" అవుతాడు.

వీరేన్ స్థాయి రెమ్యూనరేషన్‌ను స్విమ్మింగ్‌పూల్ సినిమా బడ్జెట్ భరించలేదు. అయినా, మరో ప్రాజెక్టును పక్కనపెట్టి మరీ స్విమ్మింగ్‌పూల్ కు పని చేశాడు. నాకోసం.

కట్ టూ సూపర్ కూల్ -

ఇండస్ట్రీలో కొంతమంది కెమెరామన్‌లు సెట్స్ పైన ఎంత గొడవ గొడవగా అరుస్తారో అందరికీ తెలిసిందే. వీరేన్ నోటి నుంచి ఎప్పుడూ అరుపులూ కేకలు రావు. లైట్‌మెన్‌నీ, అసిస్టెంట్‌లనీ బూతులు తిట్టడు. లైట్ బాయ్‌లు చెయ్యాల్సిన ఎన్నో పనుల్ని తనే స్వయంగా చేసుకుంటాడు.

ఈగో లేదు. కోపం రాదు. చిరునవ్వు చెరగదు.

వీరేన్ గురించి ఇలా రాయడానికి బోలెడంత ఉంది. అందులో కొంతయినా, కొన్నిసార్లయినా తప్పక రాస్తాను. మీతో షేర్ చేసుకుంటాను.

వీరేన్ లేకుండా కూడా నేను స్విమ్మింగ్‌పూల్ షూటింగ్‌ని మరో కెమెరామన్‌తో ఇదే 12 రోజుల్లో పూర్తి చేయగలను. కానీ, ప్రతిరోజూ 101 కొత్త టెన్షన్‌లను ఎదుర్కొంటూ ఇంత కూల్‌గా మాత్రం చేసేవాన్ని కాదు.

థాంక్ యూ వీరేన్!

***

ఆఫ్ ద ట్రాక్ - 

ఈ స్వఛ్ఛమయిన ఆణిముత్యంలాంటి ఉత్తరభారత మిత్రున్ని నాకు పరిచయం చేసిన వ్యక్తి గురించి ఇక్కడ చెప్పక తప్పదు.
ఆ వ్యక్తి అత్యంత అనిర్వచనీయమయిన మనిషి .. నెగెటివ్ సెన్స్‌లో. ఆ వ్యక్తి గురించి ఇంతకంటె చెత్తగా రాయలేను. ఆ వ్యక్తి వల్ల వ్యక్తిగతంగా నేను చాలా నష్టపోయాను. అయినా అతనిపట్ల నాకు ఎలాంటి ద్వేషం గానీ, కోపం గానీ లేవు. అతన్నిప్పటికీ ఒక స్నేహితునిగానే భావిస్తాను. కారణం ఒక్కటే. 

వీరేంద్రలలిత్‌ను నాకు పరిచయం చేశాడు .. 

Sunday 5 April 2015

నాలుగే సినిమాలు .. 4 మిలియన్‌ల ఫాలోయర్స్!

2012లో "స్టుడెంట్ ఆఫ్ ది ఇయర్" సినిమాతో బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ 22 ఏళ్ల క్యూట్ గాళ్ ఇప్పటివరకు చేసిన సినిమాలు నాలుగే.

హిందీలో ఎన్నో అన్‌ట్రెడిషనల్ సంచలనాత్మక సినిమాల దర్శకుడు మహేశ్ భట్ ముద్దుల కూతురు.

ఈతరం ట్రెండీ అమ్మాయిల ఐకాన్.

అన్నీ కలిపి ఒక ఫేసినేటింగ్ ప్యాకేజ్.

అలియా భట్.

కట్ టూ జీకే జోక్స్ - 

జీవితంలోని చిన్న చిన్న ఆనందాల్ని ఎంజాయ్ చెయ్యడమే అలియా భట్  జీవన శైలి. ఈ మధ్యే 'క్యాడ్‌బరీ పెర్క్' కి బ్రాండ్ అంబాసిడర్ కూడా అయిన ఈ 'హైవే' గాళ్ కు అసలు బుర్రే లేదంటూ మీడియా అంతా ఎన్నో జోకులు.

అన్నీ లైట్ తీసుకుంటుంది అలియా భట్.

తనేంటో తనకు తెలుసు. తనకు కావల్సిందేంటో తనకు తెలుసు. ఈ క్లారిటీ ముందు సోకాల్డ్ డిగ్రీలు, జనరల్ నాలెడ్జ్ ఎందుకూ పనికిరావని నిరూపించిందీ నటి. బాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ఒకరిగా నాలుగే నాలుగు సినిమాలతో ఒక స్థానం సంపాదించుకుంది.

మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌లో ఇప్పుడామెకు 40 లక్షలమంది ఫాలోయర్స్!

మరి జీకే ఎవరికి లేనట్టు?

దానిపొడవెంత, దీని ఎత్తెంత .. అని జీకేను కాచి వడపోసి డిగ్రీలు, గోల్డ్ మెడల్స్ సాధించడం కష్టం కాదు. ఒక క్లారిటీతో, జీవితానికి అవసరమైన జీకేను చదువుకొని అనుకున్న గమ్యం చేరుకోవడమే కష్టం.

కట్ చేస్తే - 

నా ఫాక్టరీ నుంచి వచ్చే మొదటి చిత్రం పిచ్చి ట్రెండీగా ఉంటుంది. ఆ చిత్రంలో అలియా భట్ లాంటి ఒక ట్రెండీ గాళ్ కూడా ఉండే అవకాశముంది. అయితే, తను హైద్రాబాద్ నుంచో ముంబై నుంచో కాదు. ఢిల్లీ నుంచి.  

సినిమా సీన్ మారిందని ఇంకా ఎప్పుడు తెల్సుకుంటారు?

కనీసం ఓ 40 రోజులయినా పట్టే ఒక మెయిన్‌స్ట్రీమ్ కమర్షియల్ సినిమా షూటింగ్‌ను నేను, నా టీమ్ కేవలం 13 రోజుల్లో పూర్తిచేయగలిగాం.

థాంక్స్ టూ మై ప్రొడ్యూసర్ అరుణ్ కుమార్! తనవైపు నుంచి ఎలాంటి ఇబ్బంది రాకుండా అన్నీ పక్కాగా, పకడ్బందీగా చూసుకున్నందుకు ..

13 రోజుల రెనెగేడ్ ఫిల్మ్ మేకింగ్ ప్రాక్టికల్‌గా చేసి నిరూపించుకున్నాం. మాకు మేమే.

ట్రాక్, ట్రాలీ, క్రేన్‌లు గట్రా ఏమీ లేకుండా .. వెరీ మినిమమ్ లైటింగ్, ఇక్విప్‌మెంట్‌తో!

ఆ 13 రోజుల షూటింగ్‌లో కేవలం ఓ నాలుగయిదు రోజులు మాత్రం స్టడీకామ్‌ను ఉపయోగించాం. అలాగని ఇదేదో ఆదరాబాదరా క్వాలిటీ లేకుండా చుట్టేసిన షూటింగ్ కాదు.

సూపర్ క్వాలిటీ. రిచ్ లుక్.

అంతా 'రెడ్ ఎమెక్స్' కెమెరాతో.

నా డి ఓ పి మిత్రుడు వీరేంద్ర లలిత్‌కు, హీరో అఖిల్ కార్తీక్‌కు, నా ప్యాషనేట్ టీమ్‌కు కూడా ఈ సందర్భంగా అభినందనలు చెప్పాలి.

కట్ టూ పోస్ట్ ప్రొడక్షన్ -

కెమెరా, కెమెరామన్, ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, లొకేషన్లు మా కంట్రోల్‌లో ఉన్నాయి కాబట్టి అనుకున్నది అనుకున్నట్టుగా ఒక ప్లాన్ ప్రకారం డే అండ్ నైట్ పనిచేస్తూ షూటింగ్ పూర్తిచేయగలిగాం.

కాని ..

పోస్ట్ ప్రొడక్షన్‌లో .. ఎడిటింగ్ నుంచి, ఫైనల్ మిక్సింగ్ దాకా పరిస్థితి మరోలా ఉంది. ఏదీ మన కంట్రోల్‌లో ఉండదు. ఏం జరుగుతుందో తెలియదు. అంతా ఒక గందరగోళం.  

ఫిల్మ్ మేకింగ్‌కు సంబంధించినంతవరకూ - ఇంకా మనవాళ్లు చాలామంది పాతరాతియుగంలోనే ఉన్నారని చెప్పడానికి చాలా ఇబ్బందికరంగా ఫీలవుతున్నాను.

ఒకవైపు హాలీవుడ్‌లో ఇండిపెండెంట్ ఫిలిం మేకర్స్ చిన్న చిన్న బ్లాక్‌మ్యాజిక్, గోప్రో లాంటి కెమెరాలతో సినిమా మొత్తం షూట్ చేసి .. ఒకే ఒక్క మ్యాక్ కంప్యూటర్‌తో పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం కూడా పూర్తిచేస్తూ అద్భుతమైన సినిమాలు తీస్తున్నారు. సంచలనాలు క్రియేట్ చేస్తున్నారు.

మరోవైపు, మనం మాత్రం ఇంకా టీబ్రేక్‌లు, లంచ్ బ్రేక్‌లు, కాల్‌షీట్ టైమింగ్స్, కాకరకాయలు, వంకాయలు అంటూ .. లెక్కలూ తూకాలూ వేసుకుంటూ, ఇంకా వెనక్కి వెనక్కి వెళ్తున్నాం.

కట్ చేస్తే - 

నా తర్వాతి సినిమా పోస్ట్ ప్రొడక్షన్ ఖచ్చితంగా ఇలా మాత్రం ఉండదు!

ఫాక్టరీకి పునాదులు పడుతున్నాయి ..  

Friday 3 April 2015

ఎవరు?

"Your posters are looking extremely good Sir.  Best wishes for a grand success!"

ఈ మాటల్ని నేనిక్కడ కోట్ చేస్తూ బ్లాగ్ రాస్తున్నానంటే ఒక కారణముంది. ఫేస్‌బుక్‌లో ఏదో రొటీన్‌గా, నాకు వ్యక్తిగతంగా తెలియని ఎవరో పెట్టిన కామెంట్ కాదది.

మొహమాటానికి పెట్టినా, ఎంకరేజ్ చేస్తూ బెస్ట్ విషెస్ చెప్పినా .. ఇలాంటి కామెంట్స్‌కి నేను పెద్దగా ఇదయిపోను. ఉబ్బిపోను. అనుకున్న టార్గెట్ రీచ్ అయినప్పుడే ఉంటుంది అసలు కిక్. మిగిందంతా ఉట్టిదే అని నా ఉద్దేశ్యం.

అయితే - ఈ కామెంట్ పూర్తిగా వేరు. ఈ బెస్ట్ విషెస్ పూర్తిగా వేరు.

కట్ టూ ఎవరీ 'ఎవరు'?

నా ఫేస్‌బుక్ ఇన్‌బాక్స్ లోకి ఈ కామెంట్‌ను షూట్ చేసిన ఈ వ్యక్తి సామాన్యుడు కాదు. కాకూడదని నా కోరిక. అలాగని, ఇక్కడ నేను అతన్ని పొగడ్డంలేదు. అతని గురించి నాకు బాగా తెలుసు కాబట్టి - అందులో కొంతయినా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను.

నో హిపోక్రసీ. నో ఇన్‌హిబిషన్స్.

ఇతని ఆలోచనా విధానం పూర్తిగా వేరు. చెప్పాలనుకున్నది సూటిగా చెప్తాడు. చెప్పలేకపోతే సైలెంట్‌గా ఉంటాడు. తను చేయాలనుకున్నదే చేస్తాడు. అతనిలో నాకిష్టమైంది అదే. చాలావరకు నా రిప్లికా అతను.

అమెరికా వెళ్లి అక్కడ చదువుకొని, ఉద్యోగాలు చేసి, మళ్లీ తను పుట్టిన ఊరికే తిరిగొచ్చేశాడు.

ఏదో చేయాలని.

ఏం చేస్తాడో తర్వాత విషయం. కాని, అతనిలోని ఈ ఆలోచనా విధానం నాకిష్టం.

ఇంగ్లిష్‌లో అతను రాసిన తొలి ఫిక్షన్ అతి త్వరలో ప్రపంచమంతా విడుదల కాబోతోంది. కనీసం ఒకానొక సెగ్మెంట్ వ్యక్తుల ఆలోచనల్లో ఒక చిన్న ఝలక్ ఇవ్వబోతోంది.

ఆ పుస్తకం ఒక "బెస్ట్ సెల్లర్" కాబోతోంది.

ఆ బెస్ట్ సెల్లర్ నవలను, దాని మాన్యుస్క్రిప్ట్ దశలోనే చదవగలిగినందుకు నాకు ఆనందంగా ఉంది. గర్వంగా కూడా ఉంది.

ఆ ఆనందం, ఆ గర్వం ఎందుకో మళ్ళీ ఇదే బ్లాగ్‌లో చెప్తాను. మరోసారి. మరిన్ని వివరాలతో.